
విశ్వ కరుణ్ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, రుక్సార్ థిల్లాన్ జంటగా నటించిన చిత్రం ‘దిల్ రూబా’. రవి, జోజో జోస్, రాకేశ్ రెడ్డి, సారెగమ నిర్మించిన ఈ చిత్రం మార్చి 14న విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే ఈ మూవీ.. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం కోసం ఏకంగా బైక్ గిఫ్ట్ ఇవ్వబోతున్నట్లు కిరణ్ అబ్బవరం ప్రకటించాడు. సినిమాలో కిరణ్ ఉపయోగించిన బైక్‌నే బహుమతిగా ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. 'దిల్ రుబా' కథని ఎవరైతే ఊహించి తమకు చెబుతారో వాళ్లకు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ బైక్ గిఫ్ట్ ఇవ్వడంతో పాటు రిలీజ్ నాడు వాళ్లతో కలిసి బైక్ పై థియేటర్ కి వెళ్లి సినిమా కూడా చూస్తానని కిరణ్ చెప్పాడు.
ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది. అంజలి, సిద్ధు ప్రేమ చుట్టూ సాగే కథతో ‘దిల్ రూబా’ రూపొందిందని ట్రైలర్‌తో తెలుస్తోంది. ప్రేమలో ఉన్నవాళ్లు కలిసి చూడాల్సిన చిత్రమిది అంటూ ట్రైలర్ ఈవెంట్‌లో కిరణ్ అబ్బవరం తెలిపాడు. ‘‘దిల్ రూబా’ ప్యూర్ లవ్ ఎమోషన్‌తో అద్భుతంగా ఉంటుంది’’ అని రుక్సార్ థిల్లాన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment