
యంగ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకడు. గతేడాది 'క' మూవీతో అద్బుతమైన హిట్ కొట్టాడు. అదే ఊపులో ఈసారి 'దిల్ రుబా' అనే ప్రేమకథ మార్చి 14న థియేటర్లలోకి రాబోతున్నాడు. ఈ మూవీ.. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం కోసం ఏకంగా బైక్ గిఫ్ట్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించాడు.
(ఇదీ చదవండి: 'స్పిరిట్' టార్గెట్ రూ.2000 కోట్లు.. సందీప్ సమాధానమిదే)
సినిమాలో కిరణ్ ఉపయోగించిన బైక్ నే బహుమతిగా ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పటివరకు ప్రమోషన్లలో కథ గురించి తాము పలు హింట్స్ ఇచ్చామని, వాటి ఆధారంగా 'దిల్ రుబా' కథని ఎవరైతే ఊహించి తమకు చెబుతారో వాళ్లకు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ బైక్ గిఫ్ట్ ఇవ్వడంతో పాటు రిలీజ్ నాడు వాళ్లతో కలిసి బైక్ పై థియేటర్ కి వెళ్లి సినిమా కూడా చూస్తానని కిరణ్ చెప్పాడు. ఈ వీడియోని ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు.
ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు ఇప్పటితరం హీరోల్లో ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తుంటారు. అలా ఇప్పుడు కిరణ్.. బైక్ ని బహుమతిగా ఇస్తానని చెప్పుకొచ్చాడు. కిరణ్ అబ్బవరం, రుక్సార్ థిల్లన్ హీరోహీరోయిన్లుగా నటించారు. విశ్వకరుణ్ దర్శకుడు. మార్చి 14న ఈ మూవీతో పాటు నాని నిర్మించిన 'కోర్ట్' రిలీజ్ కానుంది.
(ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవిపై ఫేక్ న్యూస్.. ఏమైంది?)