
‘‘దిల్ రూబా’ టీజర్, ట్రైలర్‌లో ఏ కంటెంట్ చూపించామో సినిమాలోనూ అదే ఉంటుంది. ఎక్కడా అనవసరపు కంటెంట్ ఉండదు. ఈ మూవీ చేసినందుకు చాలా గర్వంగా, సంతోషంగా ఉంది. ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంటుంది’’ అని కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) చెప్పారు. విశ్వ కరుణ్ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, రుక్సార్ థిల్లాన్ జంటగా నటించిన చిత్రం ‘దిల్ రూబా’. రవి, జోజో జోస్, రాకేశ్ రెడ్డి, సారెగమ నిర్మించిన ఈ చిత్రం మార్చి 14న విడుదల కానుంది.
సామ్ సీఎస్ సంగీతం అందించిన ఈ సినిమాలోని ‘హే జింగిలి..’ అంటూ సాగే సెకండ్ సాంగ్‌ని రిలీజ్ చేశారు. భాస్కరభట్ల సాహిత్యం అందించిన ఈ పాటని సామ్ సీఎస్ పాడారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ– ‘‘సారెగమ వాళ్లు ఫస్ట్ టైమ్ ఈ మూవీతో టాలీవుడ్‌లోకి వస్తున్నారు. రవిగారు, విశ్వ కరుణ్ మూడేళ్లుగా ఈప్రాజెక్ట్ కోసం కష్టపడ్డారు.
వాళ్ల కోసమైనా ‘దిల్ రూబా’ సక్సెస్ కావాలి’’ అన్నారు. ‘‘మా ‘దిల్ రూబా’ పాన్ ఇండియా మూవీ కాకపోయినా పాన్ ఇండియాప్రొడక్షన్ సారెగమతో కలిసి సినిమా చేశాం’’ అని రవి చెప్పారు. ‘‘హే జింగిలి... పాటకి మంచి పేరొస్తుంది’’ అన్నారు విశ్వ కరుణ్. ‘‘దిల్ రూబా’ ప్యూర్ లవ్ ఎమోషన్‌తో అద్భుతంగా ఉంటుంది’’ అని రుక్సార్ థిల్లాన్ పేర్కొన్నారు. లిరిక్ రైటర్ భాస్కరభట్ల, కొరియోగ్రాఫర్ ఈశ్వర్ పెంటి మాట్లాడారు.