ఓయ్‌.. బుజ్జి, బంగారం కాకుండా జింగిలేంటి?: హీరోయిన్‌ | Dilruba: Kiran Abbavaram, Rukshar Dhillon New Song Hey Jingili Promo Out | Sakshi
Sakshi News home page

Kiran Abbavaram: బుజ్జి, బంగారం కాకుండా జింగిలేంటి? ఇంకేం దొరకలేదా? కిరణ్‌ రిప్లై ఇదే!

Feb 17 2025 6:41 PM | Updated on Feb 17 2025 7:06 PM

Dilruba: Kiran Abbavaram, Rukshar Dhillon New Song Hey Jingili Promo Out

'క' మూవీతో భారీ హిట్‌ కొట్టిన హీరో కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) ప్రస్తుతం దిల్‌రూబా మూవీ చేస్తున్నాడు. ఇందులో రుక్సర్‌ ధిల్లాన్‌ (Rukshar Dhillon) కథానాయికగా నటిస్తోంది.  విశ్వ కరుణ్‌ దర్శకత్వం వహిస్తుండగా రవి, జోజో జోస్, రాకేశ్‌ రెడ్డి, సారెగమ నిర్మించారు. మొన్నటి వాలంటైన్స్‌ డేకు ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం మార్చి 14వ తేదీకి వాయిదా పడింది.

జింగిలి బాగుంటదిలే..
ఇకపోతే దిల్‌రూబా సినిమా (Dilruba Movie) నుంచి హే జింగిలి పాటను ఫిబ్రవరి 18న సాయంత్రం 5.01 గంటకు రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించారు. దీనిపై రుక్సర్‌ స్పందిస్తూ.. ఓయ్‌ కిరణ్‌ అబ్బవరం.. ఇంకేం దొరకనట్టు, బుజ్జి, బంగారం కాకుండా ఈ జింగిలి జింగిలి ఏంటి? అని ప్రశ్నించింది. అందుకు కిరణ్‌ అబ్బవరం.. ఈ మధ్య జనాలు పిల్చుకునే కూకీ, వైఫుల కన్నా జింగిలి చాలా బాగుంటది లే అన్నాడు. అదంతా కాదు, ఈ జింగిలి అంటే ఏంటి? ముందు అది చెప్పు అని హీరోయిన్‌ ప్రశ్నించింది. 

రేపటిదాకా ఆగాల్సిందే
అందుకు హీరో.. జింగిలి (Jingili) అంటే J అంటే జాన్‌, I అంటే ఇర్రెస్టిబుల్‌, N అంటే నెక్స్ట్‌ లెవల్‌, G అంటే గార్జియస్‌, I అంటే ఇర్రీప్లేసబుల్‌, L అంటే లైఫ్‌లైన్‌.. అంటూనే చివర్లో I అంటే ఇవ్వేవీ కాదన్నాడు. రేపు రిలీజయ్యే హేయ్‌ జింగిలి పాట వింటే నీకే తెలుస్తుందన్నాడు. అయితే మరీ అంతగా వెయిట్‌ చేయించకుండా హేయ్‌ జింగిలి ప్రోమోను రిలీజ్‌ చేశాడు. ప్రోమోలో అయితే పాట మరీ స్లోగా ఉంది. మరి ఫుల్‌ సాంగ్‌ వచ్చాక ఎలా ఉంటుందో చూడాలి.

 

 

చదవండి: తెలుగమ్మాయిలకు ఛాన్స్‌ ఇవ్వనన్న నిర్మాతపై ట్రోలింగ్‌.. ఆయన రిప్లై ఇదే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement