
సినిమా సెలబ్రిటీలు పెద్దగా గొడవలు పడటానికి ఇష్టపడరు. కానీ కొన్నిసార్లు నోరుజారి లేదంటే పరిస్థితుల వల్ల ఇబ్బందులకు గురవుతుంటారు. గత కొన్నిరోజుల నుంచి హీరోయిన్ రుక్సార్ ధిల్లాన్ ఇలాంటి అనుభవాలే ఎదుర్కొంటోంది. తాజాగా 'దిల్ రుబా' ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ ఈ తరహా సంఘటనే జరిగింది.
(ఇదీ చదవండి: సినిమాలో ఫైట్స్ నచ్చకపోతే నన్ను చితక్కొట్టండి: 'దిల్ రుబా' నిర్మాత)
తెలుగులో కొన్ని సినిమాలు చేసిన రుక్సార్ లేటెస్ట్ మూవీ 'దిల్ రుబా'. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ చిత్రం.. మార్చిన 14న థియేటర్లలోకి రానుంది. కొన్నిరోజుల క్రితం ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఫొటోగ్రాఫర్లతో ఈమెకు చిన్నపాటి వివాదం జరిగింది. తనకు అసౌకర్యమని చెప్పినా సరే ఫొటోలు తీస్తున్నారని చెప్పింది. దీంతో అప్పటినుంచి మూవీ ఈవెంట్స్ కవర్ చేసే ఫొటోగ్రాఫర్స్ ఈమెని సైడ్ చేస్తున్నారు.
తాజాగా హైదరాబాద్ లో మంగళవారం రాత్రి 'దిల్ రుబా' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా.. చివర్లో టీమ్ అంతా ఫొటోలకు పోజులిచ్చారు. కానీ రుక్సార్ ని మాత్రం సైడ్ అయిపోమని ఫొటోగ్రాఫర్స్ చెప్పారు. దీంతో ఆమె పక్కకు తప్పుకొంది. మరి ఈ వివాదం ఎన్నిరోజులు నడుస్తుందో చూడాలి?
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)
Comments
Please login to add a commentAdd a comment