
కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) హీరోగా నటించిన తాజా చిత్రం ‘దిల్ రుబా’(Dil Ruba). ఈ చిత్రంలో రుక్సార్ థిల్లాన్, నజియా డేవిసన్ హీరోయిన్లు. విశ్వ కరుణ్(Vishwa Karun) దర్శకత్వంలో రవి, జోజో జోస్, రాకేశ్ రెడ్డిలతో కలిసి సారెగమ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా విశ్వ కరుణ్ మాట్లాడుతూ– ‘‘దర్శకుడిగా నాకిది తొలి సినిమా. ‘దిల్ రుబా’ అనే ప్రేమకథను రెడీ చేసి, కిరణ్ అబ్బవరంగారికి వినిపించాను. ఆయన ఓకే అన్నారు.
ఈ చిత్రంలో ప్రేమకథను కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాం. ఓ రకంగా చెప్పాలంటే క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్ ఇది. ఊరికే ‘సారీ, థ్యాంక్స్’లు చెప్పటానికి హీరో ఇష్టపడడు. ఓ సందర్భంలో హీరో ‘సారీ’ చెప్పకపోవడం వల్ల అతని చుట్టూ ఉన్నవాళ్లు కూడా ఇబ్బందులపాలవుతారు. ఈ సమస్య నుంచి హీరో ఎలా బయటపడ్డాడు? అన్నదే కథ.
అలాగే ఊరికే కోపం రాకూడదు... కోపం వస్తే దాని వెనకాల సహేతుకమైన కారణం ఉండాలని హీరో భావిస్తాడు. ఈ అంశం కూడా సినిమాలో ఉంది. ‘క’ సినిమా విజయం సాధించడంతో, ‘దిల్ రుబా’పై మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. కొన్ని మార్పులు చేశాం. కానీ కథలోని ఆత్మ ఏ మాత్రం మారలేదు. నా తర్వాతి సినిమా గురించి త్వరలోనే చెబుతాను’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment