గురి తప్పదు తమ్ముడు | mood of thammudu introduces characters from nithiin movie | Sakshi
Sakshi News home page

గురి తప్పదు తమ్ముడు

May 13 2025 12:07 AM | Updated on May 13 2025 12:07 AM

mood of thammudu introduces characters from nithiin movie

నితిన్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’. శ్రీరామ్‌ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలకపాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మించిన ఈ చిత్రం జూలై 4న రిలీజ్‌ కానుంది. కాగా ఈ సినిమాలోని పాత్రల్ని పరిచయం చేస్తూ ‘మూడ్‌ ఆఫ్‌ తమ్ముడు’ అంటూ సోమవారం ఓ వీడియో విడుదల చేశారు మేకర్స్‌.

రత్న అనేపాత్రలో సప్తమి గౌడ, చిత్రగా వర్ష బొల్లమ్మ, ఝాన్సీ కిరణ్మయిగా లయ, గుత్తిపాత్రలో స్వసిక విజయన్, అగర్వాల్‌గా సౌరభ్‌ సచ్‌దేవ్‌ కనిపించబోతున్నారు. ‘మూడ్‌ ఆఫ్‌ తమ్ముడు’ వీడియో చివర్లో నితిన్‌ ఎంట్రీ, బాణం వదిలిన తీరు ఆసక్తిగా ఉంది. ‘‘నితిన్, ‘దిల్‌’ రాజు, శిరీష్‌ కాంబినేషన్‌లో ‘దిల్, శ్రీనివాస కళ్యాణం’ సినిమాలొచ్చాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో శ్రీరామ్‌ వేణు ‘ఎంసీఏ, వకీల్‌ సాబ్‌’ వంటి చిత్రాలు తీశారు. ఈ ముగ్గురి కాంబినేషన్‌లో వస్తున్న ‘తమ్ముడు’ సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది’’ అని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి కెమేరా: కేవీ గుహన్, సంగీతం: అజనీష్‌ లోకనాథ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement