మెగా కోడలిగా తొలి సినిమా.. లేటేస్ట్ అప్‌డేట్ వచ్చేసింది! | Tollywood actress lavanya Tripathi latest Movie sathi Leelavathi update | Sakshi
Sakshi News home page

Lavanya Tripathi: పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి తొలి సినిమా.. లేటేస్ట్ అప్‌డేట్ ఇదే!

May 12 2025 9:25 PM | Updated on May 12 2025 9:26 PM

Tollywood actress lavanya Tripathi latest Movie sathi Leelavathi update

లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం సతీ లీలావతి. ఈ సినిమాకు భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్‌.ఎం.ఎస్‌(శివ మ‌న‌సులో శృతి) ఫేమ్ తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని  దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నాగ‌మోహ‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా సతీ లీలావతి డబ్బింగ్ కార్య‌క్ర‌మాలు ప్రారంభమయ్యాయి.  వరుణ్‌తేజ్‌తో పెళ్లి తర్వాత మెగా కోడలిగా లావణ్య త్రిపాఠి నటిస్తోన్న మొదటి చిత్రం కావడం విశేషం.

(ఇది చదవండి: 'కొణిదెల లావణ్య త్రిపాఠి'గా మొదటి సినిమా ప్రకటన)

భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య ప్రేమానుబంధాలను తెలియ‌జేస్తూ ఎమోష‌న‌ల్ అంశాల‌తో స‌తీ లీలావ‌తి సినిమాను రూపొందిస్తున్నారు. సినిమా చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. మ‌రోవైపు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అందులో భాగంగా డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు ప్రారంభమయ్యాయి. అనుకున్న ప్లానింగ్ ప్ర‌కారం మేక‌ర్స్ సినిమాను శ‌ర‌వేగంగా పూర్తి చేస్తున్నారు. వీలైనంత త్వర‌గా షూటింగ్ చేసి సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని  ప్లాన్ చేస్తున్నారు. ఫీల్ గుడ్ మూవీగా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించేలా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.  ఈ మూవీకి  మిక్కీ జే మేయర్ సంగీతమందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement