
ఫస్ట్ సినిమాతోనే సూపర్ హిట్ కొట్టి అందరి దృష్టినీ ఆకర్షించాడు నితిన్ (Nithiin). ఇతడు హీరోగా నటించిన తొలి చిత్రం జయం (Jayam Movie). తేజ దర్శకత్వం వహించి నిర్మించిన ఈ మూవీలో గోపీచంద్ విలన్‌గా నటించాడు. సదా హీరోయిన్‌గా పరిచమైంది. అయితే ఈ సినిమాలో మొదట సదాని కథానాయికగా అనుకోలేదట!
రష్మీతోనే రిహార్సల్స్ చేశా..
హీరో నితిన్ తాజాగా ఈ విషయాన్ని వెల్లడించాడు. ఉగాది ఈవెంట్‌కు హాజరైన అతడు జయం సినిమా గురించి కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు. జయం సినిమాకు రష్మీ గౌతమ్ (Rashmi Gautam)తో కలిసి రిహార్సల్స్ చేసినట్లు తెలిపాడు. దాదాపు 90 శాతం సీన్లు రష్మీతో రిహార్సల్స్ చేశానని, చివర్లో ఏమైందో ఏమో కానీ హీరోయిన్‌ను మార్చేశారు అని పేర్కొన్నాడు.
బుల్లితెరపై సెటిలైన రష్మీ
ఒకవేళ రష్మీ గనక హీరోయిన్‌గా జయం సినిమా చేసుంటే అప్పట్లోనే స్టార్ అయిపోయేది. పేరుప్రఖ్యాతలతో పాటు మంచి అవకాశాలు వచ్చేవి. ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలో బోల్డ్ సినిమాల్లోనూ యాక్ట్ చేసింది. కానీ అవేవీ వర్కవుట్ కాకపోవడంతో బుల్లితెరపై సెటిల్ అయింది. గతంలో యువ సీరియల్‌లో నటించిన ఆమె ప్రస్తుతం కామెడీ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది.
సినిమా
నితిన్ హీరోగా నటించిన లేటెస్ట మూవీ రాబిన్‌హుడ్. శ్రీలీల కథానాయిక. వెన్నెల కిశోర్, రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్రలు పోషించారు. ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అతిథి పాత్రలో కనిపించాడు. మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.