jayam
-
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
తెలుగు సినిమాల్లో ఎప్పటికప్పుడు కొత్త యాక్టర్స్ వస్తూనే ఉంటారు. అప్పటికే ఫామ్‌లో నటీనటులు సైలెంట్‌గా సైడ్ అయిపోతుంటారు. కొన్నిసార్లు మాత్రం హిట్ మూవీస్ చేసి చాలా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఎందుకో ఇండస్ట్రీకి దూరమైపోతుంటారు. అలా దాదాపు 22 ఏళ్ల క్రితం తెలుగులో చైల్డ్ ఆర్టిస్టుగా ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఓ పాప ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. మరి ఈమె ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. అవి ఏంటంటే?)పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు యామిని శ్వేత. డైరెక్టర్ తేజ తీసిన హిట్ సినిమా 'జయం'లో హీరోయిన్ సదా చెల్లెలిగా నటించిన పాప గుర్తుందా? ఆమెనే ఈమె. సీరియల్ నటి జయలక్ష్మి కూతురు కావడంతో సులువుగానే ఇండస్ట్రీలోకి వచ్చింది. సినిమాల రావడానిక ముందు 10 సీరియల్స్‌లో చేసింది. అలా నటిస్తున్న టైంలో 'జయం' ఆడిషన్స్ కోసం ప్రకటన రావడంతో ఈమె తండ్రి డైరెక్టర్ తేజకు ఫొటోలు పంపారు. అలా చైల్డ్ ఆర్టిస్టుగా ఎంపికైంది.'జయం'త పాటు ఉత్సాహం, అనగనగా ఓ కుర్రాడు సినిమాల్లోనూ బాలనటిగా చేసింది. ఆ తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైపోయింది. చదువు, ఆ తర్వాత పెళ్లి చేసుకుని స్థిరపడిపోయింది. విదేశాల్లో మాస్టర్స్ పూర్తి చేసిన యామిని.. తెలుగబ్బాయిని పెళ్లి చేసుకుని ఫారెన్‌లో సెటిలైంది. తాజాగా ఈమెని చూసిన కొందరు.. 'జయం' నటి ఏంటి ఇంతలా మారిపోయిందని మట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: అనుమానాస్పద రీతిలో నటి మృతి.. పట్టించుకోని కుటుంబ సభ్యులు) -
జయం మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫోటోలు)
-
ఆ సీన్ చేసినందుకు ఇప్పటికీ బాధపడుతున్నా: సదా
హీరోయిన్ సదా పేరు చెప్పగానే 'వెళ్లవయ్యా వెళ్లు..' అనే డైలాగ్ గుర్తొస్తుంది. ఎందుకంటే ఆ డైలాగ్ పాపులారిటీ అలాంటిది మరి. అయితే హీరోయిన్ గా తెలుగులో పలు సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్న సదా.. ఆ తర్వాత సరైన ఛాన్సులు రాకపోవడంతో నటనని పక్కనబెట్టేసింది. ప్రస్తుతం రియాలిటీ షో జడ్జిగా పలు షోలు చేస్తోంది. అయితే గతంలో ఓ సినిమాలో ఓ సీన్ చేసినందుకు ఇప్పటికీ బాధపడుతోందట. (ఇదీ చదవండి: హీరోయిన్ త్రిషకు పెళ్లి? ఆ నిర్మాతతో ఏడడుగులు!) ఏ సీన్ గురించి..? నితిన్-తేజ కాంబోలో వచ్చిన 'జయం' మూవీ టాలీవుడ్లో ఓ ట్రెండ్ సెట్ చేసింది. ఇందులో హీరోహీరోయిన్లుగా చేసిన వాళ్లతో పాటు విలన్‌గా నటించిన గోపీచంద్‌కి కూడా అద్భుతమైన క్రేజ్ వచ్చింది. అయితే ఈ మూవీలో ఓ సీన్లో భాగంగా హీరోయిన్ సదా బుగ్గపై.. విలన్ గోపీచంద్ నాలుకతో నాకుతాడు. సదా ఈ సీన్ గురించే చెబుతూ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సదా ఏం చెప్పింది? 'జయం సినిమాలో ఓ సీన్లో ఎందుకు నటించా అని ఇప్పటికీ బాధపడుతుంటాను. ఆ సీన్ చేయనని దర్శకుడికి ముందే చెప్పాను. కానీ ఆయన నా మాట వినలేదు. మూవీకే ఆ సన్నివేశం హైలైట్‌గా నిలుస్తుందని చెప్పి ఒప్పించారు. అయితే ఆ సీన్ పూర్తయిన తర్వాత ఇంటికెళ్లి చాలాసేపు ఏడ్చాను. నా ముఖాన్ని పదేపదే కడుక్కున్నాను. ఇప్పటికీ టీవీలో ఆ విజువల్ వస్తే ఆ దరిదాపుల్లో ఉండను' అని సదా చెప్పినట్లు సదరు కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. (ఇదీ చదవండి: హిట్ ఇచ్చిన డైరెక్టర్‌నే అవమానించిన రజనీకాంత్!) -
Jayam Child Artist Yamini Latest Photos: ‘జయం’ ఫేమ్ యామిని శ్వేత (ఫోటోలు)
-
'జయం' చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడేం చేస్తుందో తెలుసా?
విలక్షణ దర్శకుడు తెరకెక్కించిన అద్భుతమైన ప్రేమకావ్యం జయం. ఇందులోని ప్రతి పాత్రను ఎంతో ప్రత్యేకంగా మలిచాడు డైరెక్టర్. ముఖ్యంగా అక్షరాలను తిప్పిరాసే హీరోయిన్ చెల్లెలి పాత్రను ప్రజలు ప్రేమించారు. తన నటనతో నంది అవార్డు గెలుచుకుంది. నేటికి జయం సినిమా వచ్చి 20 ఏళ్లయింది. ఈ సందర్భంగా ప్రస్తుతం యామిని ఎక్కడుంది? ఏం చేస్తుంది? అనేది చూద్దాం.. సీరియల్ ఆర్టిస్ట్ జయలక్ష్మి కూతురే జయం చైల్డ్ ఆర్టిస్ట్ యామిని శ్వేత. చైల్డ్ ఆర్టిస్ట్‌గా మాత్రమే శ్వేత స్క్రీన్‌పై కనిపించాలని ఆమె తల్లిదండ్రులు భావించారు. అందుకే చిన్నతనంలో పలు పాత్రలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ పెద్దయ్యాక మాత్రం హీరోయిన్ కాలేకపోయింది. జయం కంటే ముందే దాదాపు 10 సీరియల్స్ చేసింది. సీతామాలక్ష్మి సీరియల్ చేస్తున్న సమయంలో జయం ఆడిషన్స్ కోసం ప్రకటన వచ్చింది. అది చూసి ఆమె తండ్రి తన ఫొటోలు డైరెక్టర్‌కు పంపారు. అలా హీరోయిన్ చెల్లెలిగా నటించింది. ఉత్సాహం, అనగనగా ఓ కుర్రాడు వంటి సినిమాలు చేశాక చదువుపై దృష్టి పెట్టింది. విదేశాల్లో మాస్టర్స్ చేసి అక్కడే ఉద్యోగం చేసింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని లైఫ్‌లో స్థిరపడిపోయిన ఆమెకు ఓ కూతురు పుట్టింది. ఇకపోతే చదువుకునే సమయంలో బోలెడన్ని ఆఫర్లు వచ్చినా కూడా వాటిని సున్నితంగా తిరస్కరించింది. అందులో నచ్చావులే సినిమా కూడా ఒకటి. ఇక నంది అవార్డుకు వచ్చిన రెమ్యునరేషన్‌ను సైతం మానసిక వికలాంగుల ఆశ్రమానికి దానం చేసి గొప్ప మనసు చాటుకుంది. అయితే శ్వేత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తే బాగుంటుందంటున్నారు ఫ్యాన్స్. View this post on Instagram A post shared by Yamini Swetha (@yamini_swetha) View this post on Instagram A post shared by Yamini Swetha (@yamini_swetha) చదవండి: పెళ్లి చేసుకున్నాం, కానీ మా లైఫ్‌లో పెద్ద ఛేంజ్ ఏం లేదు తెలుగులో వస్తున్న ఏనుగు, ట్రైలర్ చూశారా? -
జయం సినిమాలో నా పారితోషికం ఎంతంటే?: గోపీచంద్
విలన్‌గా కెరీర్ మొదలు పెట్టి హీరోగా రాణిస్తున్నాడు గోపీచంద్. మధ్యలో సినిమా ఎంపికలో కొన్ని తప్పులు చేసి తడబడ్డ గోపీచంద్ సీటీమార్ మూవీతో హిట్ ట్రాక్ ఎక్కాడు. ప్రస్తుతం అతడు హీరోగా నటించిన పక్కా కమర్షియల్ సినిమా జూలై 1న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతడు జయం సినిమా గురించి ఆసక్తికర విషయాలను తెలియజేశాడు. 'నా సంపాదన జయంతోనే మొదలైంది. తేజగారి లక్కీ నంబర్ రూ.11 వేలు. అందుకని నాకు పారితోషికం కూడా అంతే ఇచ్చారు. దీని పక్కన ఓ సున్నా కూడా ఉండొచ్చు కదా అనిపించింది. అది నా మొదటి రెమ్యునరేషన్. ఆ డబ్బు తీసుకెళ్లి ఇంట్లో ఇచ్చాను. ఇక నా జీవితంలో చాలామందికి అప్పిచ్చాను. కానీ కొందరు తిరిగివ్వలేరు. సరే, వాళ్ల పరిస్థితి బాగోలేదేమోలే అని వదిలేస్తానే తప్ప కమర్షియల్‌గా వ్యవహరించి వాళ్ల దగ్గర నుంచి నా డబ్బులు రాబట్టుకోలేదు' అని గోపీచంద్ చెప్పుకొచ్చాడు. చదవండి: పెళ్లి చేసుకున్నాం, మా లైఫ్‌లో పెద్ద ఛేంజ్ ఏం లేదు లేడీ ఓరియంటెడ్ మూవీస్, ఒక్కరితో కాదు ఇద్దరు, ముగ్గురితో! -
కన్నడ రీమేక్‌లో నితిన్ హిట్ మూవీ, దర్శకుడు ఎవరో తెలుసా!
తేజా డైరెక్షన్లో నితిన్ హీరోగా పరిచమైన చిత్రం ‘జయం’. 2002లో వచ్చిన ఈ మూవీ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ఈ మూవీలో నటించిన హీరోహీరోయిన్తో పాటు మిగతా నటీనటులకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఇక గోపిచంద్ విలన్‌గా ఏ రేంజ్ నటించాడో అందరికి తెలిసిందే. ఇందులో నితిన్ సరసన కథానాయికగా సదా నటించిన విషయం తెలిసిందే. తెలుగులో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ మూవీ అదే పేరుతో తమిళంలో కూడా రీమేక్ అయ్యింది. ఇందులో హీరోగా రవి నటించగా.. అక్కడ కూడా సదానే హీరోయిన్గా నటించింది. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళంలోనూ సూపర్ హిట్ అయ్యింది. దీంతో హీరో రవి పేరు కాస్తా ‘జయం’ రవిగా మారిపోయింది. ఈ సినిమా వచ్చి నేటికి 18 ఏళ్లు. కాగా.. ఇన్నేళ్ల తర్వాత ‘జయం’ కన్నడలో రీమేక్‌కు సన్నాహాలు చేస్తున్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. ఇక ఈ రీమేక్‌కు ‘కేజీఎఫ్’ హీరో, కన్నడ రాక్‌స్టార్ యశ్‌ను హీరోగా పరిచయం చేసిన శశాంక్ దర్శకుడిగా వ్యవహరించనున్నాడట. కర్ణాటకకు చెందిన ప్రవీణ్ అనే డాక్టర్ ఈ సినిమాతో హీరో చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కన్నడలో ఓ సినిమా చేస్తున్న ప్రవీణ్ ఆ తర్వాత ఈ రీమేక్‌లో నటించనున్నట్లు సమాచారం. తెలుగు, తమిళంలో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిన ఈమూవీ కన్నడ ప్రేక్షకులను ఎంతటి స్థాయిలో ఆకట్టుకంటుందో వేచి చూడాల్సిందే. -
డై..లాగి కొడితే...
సినిమా : జయం రచన, దర్శకత్వం: తేజ వెంకటరమణ (నితిన్), సుజాత (సదా) ఒకే కాలేజీలో చేరతారు. కాళ్లకు పట్టీలు వేసుకొచ్చిందని సుజాతను ఏడిపిస్తాడు అలీబాబా (సుమన్ శెట్టి). ఆ కారణంతో మరుసటి రోజు రైల్వేస్టేషన్ వరకూ పట్టీలు వేసుకొచ్చిన సుజాత వాటిని తన చెల్లికి ఇచ్చి సాయంత్రం తీసుకురమ్మని కాలేజీకి వస్తుంది. అదేంటండి.. పట్టీలు తీసేశారని వెంకటరమణ అడుగుతాడు. అవును.. తీసేశాను. నీకెందుకు? పట్టీలు వేసుకుంటే ఎందుకు వేసుకున్నావని మీరే ఏడిపిస్తారు.. తీసేస్తే.. ఎందుకు తీసేశారని మళ్లీ మీరే అడుగుతారు. వేసుకుంటే వేసుకుంటా.. తీసేయాలనిపిస్తే తీసేస్తా.. అసలు నా సంగతి నీకెందుకయ్యా.. నీకూ, నాకూ ఏంటి సంబంధం? ‘వెళ్లవయ్యా.. వెళ్లు.. వెళ్లూ...’ అంటుంది సుజాత. ఈ డైలాగ్ ఎంత పాపులర్ అంటే.. ఇప్పటికీ ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటుంది. -
యాంగ్రీ హీరోతో క్రేజీ డైరెక్టర్
చాలా రోజులుగా హిట్ కోసం ఎదురు చూస్తున్న ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ కలిసి పనిచేయడానికి రెడీ అవుతున్నారు. హీరోగా ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు మాస్ ఆడియన్స్‌ను కూడా మెప్పించిన యాంగ్రీ హీరో రాజశేఖర్ కొంత కాలంగా సరైన హిట్ లేక ఇబ్బందుల్లో ఉన్నాడు. స్ట్రయిట్ సినిమాలతో పాటు రీమేక్‌లు కూడా సక్సెస్ ఇవ్వకపోవటంతో ఆలోచనలో పడ్డ రాజశేఖర్ ఓ ఆసక్తికరమైన కాంబినేషన్‌కు రెడీ అవుతున్నాడు. చిత్రం, జయం, నువ్వునేను లాంటి సినిమాలతో స్టార్ హీరోలకు పోటీగా క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు తేజ. ఒకప్పుడు స్టార్ డైరెక్టర్‌గా ఉన్న తేజ ఇటీవల కాలంలో మినిమమ్ కలెక్షన్లు సాదించే సినిమాలు కూడా అందించలేకపోతున్నాడు. తాజాగా తేజ దర్శకత్వంలో వచ్చిన 'హోరాహోరీ' కూడా ఆశించిన స్ధాయి విజయం సాధించలేకపోయింది. దీంతో మరోసారి ఆలోచనలో పడ్డ తేజ, రాజశేఖర్ లీడ్రోల్లో సినిమా తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ సినిమాను 'నిజం' తరహాలో సోషల్ ఎలిమెంట్‌తో కూడిన చిత్రంగా తెరకెక్కించనున్నాడు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లి, వీలైనంత త్వరగా రిలీజ్ కు రెడీ చేయాలని భావిస్తున్నారు. -
జయమ్ - భారతమ్ - మహాభారతమ్
మహాభారతం కురువంశ చరిత్ర. కురువంశానికి మూలం చంద్రవంశం. చంద్రవంశానికి ఆద్యుడు ‘చంద్రుడు’. ఈ వంశ పరంపరలో, చంద్రుడి తర్వాత వచ్చిన రాజుల్లో దుష్యంతుడి కొడుకు ‘భరతుడు’ వంశకర్త. భరతుడి పేరుమీద ‘చంద్రవంశం’, ‘భరతవంశం’ అయింది. మనదేశం ‘భారతదేశం’ అయింది. భరతుడికి అయిదు తరాల తర్వాత వచ్చిన రుక్షుడు అనే రాజుకు ‘సంవరణుడు’ అనే కొడుకు పుట్టాడు. ఈ సంవరణునికి, తపతికి పుట్టిన సంతానం ‘కురువు’. ఇతడు వంశకర్త. భరతవంశం ‘కురువంశం’గా వ్యవహారానికి వచ్చింది. ధృతరాష్ట్రుడి కుమారులు ధార్తరాష్ట్రులు. పాండురాజు కొడుకులు పాండవులు. ధార్తరాష్ట్రులు, పాండవులు - అందరూ కౌరవులే! ‘ధార్తరాష్ర్టులు’ పలకడంలో క్లిష్టత ఉంది. ఆ కారణంగా వారిని కౌరవులు అనడం మొదలైంది. అదే ‘కౌరవులు’ పదాన్ని పాండురాజు కొడుకులకు కూడా ఉపయోగిస్తే ఎవరు ఎవరని సందిగ్ధత ఏర్పడుతుంది. కాబట్టి, పాండురాజు కొడుకులు ‘పాండవులు’ అయ్యారు. దాయాదుల మధ్య వైరం ఇంత వినాశనానికి దారితీసిందే - ఈ చరిత్రకు కావ్యరూపం ఇస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది వ్యాసుడికి. మొదట వ్యాసుడు రాసిన కావ్యం ‘జయమ్’. మహాభారత యుద్ధం ప్రకటించబడిన మూడు సంవత్సరాల కాలంలో పూర్తిచేశాడు. యుద్ధంలో మరణించిన వీరులకు అంతిమ సంస్కారాలు చేసి, ధర్మరాజు హస్తినలో అడుగుపెట్టడంతో ‘జయమ్’ పూర్తవుతుంది. ఈ కావ్య నిడివి 8800 శ్లోకాలు మాత్రమే! ఈ శ్లోకాలు అన్నీ మహాభారతంలోని లక్ష శ్లోకాలలో కలసిపోయి ఉన్నాయి. సౌతి ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, ‘‘ఆ గ్రంథం ఎనిమిది వేల ఎనిమిది వందల శ్లోకాలు కలది. ఆ శ్లోకాలు నాకు తెలుసు. శుకుడికి తెలుసు. సంజయుడికి తెలుసో తెలియదో (అష్టౌ శ్లోక సహస్రాణి హ్యష్టౌ శ్లోక శతానిచ, అహంవేత్తి శుకోవేత్తి సంజయో వేత్తివానవా - అనుక్రమణికాధ్యాయం)’’ అన్నాడు. ఎక్కువమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం క్రీస్తుపూర్వం 1535లో మహాభారత యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో కురువంశం దాదాపు నశించి పాండవుల వారసుడిగా అభిమన్యుడి కొడుకు పరిక్షిత్తు మిగిలాడు. అతడికి 36 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు కృష్ణుడు మరణించాడు. పాండవులు కోరికలు చంపుకొని స్వర్గారోహణ కోసం దేవభూములున్న హిమాలయ పర్వతాలకు వెళ్లడానికి ముందు పరిక్షిత్తుకు పట్టాభిషేకం చేశారు. ధృతరాష్ట్రుడికి, ఒక వైశ్య కన్యకు పుట్టిన యుయుత్సుణ్ని సంరక్షకుడిగా ఉండమన్నారు. పరిక్షిత్తు 60 సంవత్సరాల పాటు రాజ్యంచేసి కొడుకు జనమేజయుడికి పట్టం కట్టాడు. ఆ జనమేజయుడు వయసు మీరుతున్న సమయంలో సర్పయాగం చేశాడు. జనమేజయుడు సర్పయాగం సంకల్పించినప్పుడు వైశంపాయనుడు కౌరవ పాండవుల చరిత్రను చెప్పాడు. వైశంపాయనుడు చెప్పింది వ్యాసమహర్షి చెప్పిన జయం కావ్యాన్నే. అయితే మధ్యమధ్యలో జనమేజయుడు ఎన్నో ప్రశ్నలు అడిగాడు. ఎన్నో సందేహాలు వెలిబుచ్చాడు. వాటన్నిటికీ వైశంపాయనుడు సమాధానాలు చెప్పాడు. వాటన్నిటినీ కలుపుకొని జయేతిహాసం నిడివి పెరిగింది. 24,000 శ్లోకాలతో వైశంపాయనుడు చెప్పిన జయం ‘భారతం’ అయింది. వైశంపాయనుడు భారతకథను చెప్పినప్పుడు ఎందరో సూతులు విని ఉంటారు. ఆ విన్నవారిలో ఉగ్రశ్రవసుడు ఒకడు. ఆ సూతుడు భారతాన్ని మననం చేసుకొని తన శిష్యులకు నేర్పి ఉంటాడు. ఉగ్రశ్రవసుడి ద్వారా భారతం నేర్చుకొన్న సౌతి నైమిశారణ్యంలో శౌనకాది మునులు ‘దీర్ఘసత్త్రం’ చేసినప్పుడు వారికి వినిపించాడు. వింటున్న మునులు మరింకెన్నో ప్రశ్నలు వేయడం, సౌతి ఉపాఖ్యానాలు చేర్చి మునులను తృప్తిపరచడంతో భారతం నిడివి మరింత పెరిగింది. సౌతి ఒక్కడే కాదు, ఆ తర్వాత వచ్చిన పౌరాణికులు సందర్భానికి తగినట్లు ఎన్నెన్నో కథలను, నీతులను చేర్చి ఉంటారు. రామాయణం, నలదమయంతుల కథలు కూడా భారతంలో చేరిపోయాయి. ఈ కోణంలో చూస్తే 8800 శ్లోకాలు లక్ష శ్లోకాలు కావడం వింత కలిగించే విషయం కాదు. వ్యాసుడు జయం రాసిననాటికి - సౌతి మునులకు చెప్పిన నాటికి నడుమ 150-170 సంవత్సరాల కాలం దొరలి ఉంటుంది. క్రీస్తుశకం 4వ శతాబ్దానికి చెందిన గుప్తశాసనం ద్వారా అప్పటికి భారతం, మహాభారతం రెండూ ప్రచారంలో ఉండేవని, మహాభారతం పరిమితి లక్ష శ్లోకాలని స్పష్టంగా తెలుస్తోంది. ఎవరు ఎంత చేర్చినా ఎంత మార్చినా కొన్ని వేల సంవత్సరాల పాటు భారతం నిలబడింది అంటే అది ఆ కథ గొప్పదనం. భారతం మూలకథలో కృష్ణుడు ఒక రాజనీతిజ్ఞుడు. క్రీస్తుపూర్వం 12వ శతాబ్దం శాకటాయనుడి కాలంలో అదే కృష్ణుడు ఒక యుద్ధవీరుడు. క్రీ.పూ.5వ శతాబ్దం వచ్చేటప్పటికి అదే కృష్ణుడు వైదిక మత ప్రవక్త అయ్యాడు. గౌతమబుద్ధుడి కాలం తర్వాత రామ, కృష్ణులు అవతార పురుషులు అయ్యారు. భగవద్గీత భారతంలో అంతర్భాగం అయింది. ఇదంతా బౌద్ధమతం వల్ల, మ్లేచ్ఛుల వల్ల ప్రతిష్ఠ కోల్పోవడం మొదలైన వైదికమత పునరుద్ధరణ కోసం! ప్రాచీన కాలంలో మతం అంటే యజ్ఞాది కర్మలు చేయడం, ప్రకృతిని ఆరాధించడం. ఆ కాలంలో దేవతలు ప్రకృతిలో భాగమైన అగ్ని, వరుణుడు, సూర్యుడు, మరుత్తులు లాంటివాళ్లు. దేవతలకు రాజు దేవేంద్రుడు. ఆరోగ్యాన్ని ప్రసాదించేది అశ్వినీ దేవతలు. అప్పట్లో మొత్తం దేవతల సంఖ్య ముప్ఫై మూడు మాత్రమే! దేవతలంతా జనకల్యాణం కోసం ఎత్తయిన ప్రదేశాల్లో నివసిస్తారని ప్రజలు నమ్మేవారు. హిమాలయాల్లో దేవలోకం ఉందని, స్వర్గలోకానికి పొలిమేరలాంటి గంధమాదన పర్వతం దాటితే దేవతలు కనిపిస్తారని అనుకొనేవారు. మహాభారతంలో అర్జునుడు శివుడి అనుగ్రహం సంపాదించడానికి, దేవేంద్రుడితో చెలిమి చెయ్యడానికి వెళ్లింది హిమాలయ పర్వతాలలోకే! చివరికి స్వర్గారోహణ పర్వంలో పాండవులు నడిచింది కూడా అటువైపుకే! అద్భుతాలు జరుగుతాయి అంటే నమ్మేకాలం మహాభారతకాలం. దేవతలు, మానవాతీత శక్తుల పట్ల అవధులు లేని విశ్వాసం ఉండేది. వాన, గాలి, గడ్డి, కడవ, అగ్ని, నది, సూర్యుడికి పిల్లలు పుట్టారు అంటే నిజమే కాబోలు అనుకొన్నారు. అటువంటి కాలంలో వ్యాసమహర్షి సృష్టించిన జయేతిహాసంలోకి నమ్మశక్యంకాని చిట్టడవుల్లాంటి చిన్న చిన్న కథలు వచ్చి చేరాయి. దేవుళ్లు, వేదాంతం, రకరకాల శాస్త్రాలు, లోకనీతులు, రాజనీతులకు సంబంధించి అసంఖ్యాకంగా అంతులేని వ్యాఖ్యానాలు చోటుచేసుకొన్నాయి. ఎన్నో ఊహకందని ఉపాఖ్యానాలు, నీతికథలు, ముగింపులేని యుద్ధాలు, మరణం లేని మహావీరులు, అవినీతిమంతులు, సహనం లేని మునులు, నేలవిడిచి సాముచేసే సాహసవీరులు - మహాభారత కథలోకి బలవంతంగా చొచ్చుకొచ్చారు. జయమ్ భారతంగా మారి, మహాభారతంగా స్థిరపడింది. (నాయుని కృష్ణమూర్తి,ఫోన్: 9440804040, వ్యాసకర్త నవలారూపంలో రాస్తున్న మహాభారతం మూలకథ ‘జయమ్’ అనుబంధం నుండి...) -
కమెడియన్‌కి మైనస్‌లే ప్లస్సులు!
సంభాషణం నవ్వడం తేలికే. కానీ నవ్వు పుట్టించడం అంత తేలిక కాదు. దానికి ప్రతిభ ఉండాలి. హాస్యం అనేది అణువణువునా నిండివుండాలి. అలాంటివారే అందరినీ నవ్వించగలరు అంటారు సుమన్‌శెట్టి. విభిన్నమైన లుక్‌తో, వైవిధ్యభరితమైన హావభావాలతో కడుపుబ్బ నవ్వించే ఈ కమెడియన్‌తో మాటా మంతీ.... ఈ మధ్య కాస్త తక్కువ కనిపిస్తున్నట్టున్నారు...? కెరీర్ కొంచెం డల్ అయిందిలెండి. ఎందుకలా? కొత్తవాళ్లు వస్తున్నారు. పోటీ పెరిగింది. అలా అని మరీ డల్లేమీ కాదు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో కూడా నటిస్తున్నాను కాబట్టి ఫర్వాలేదు. ఇక్కడ చాన్సుల్లేవని అక్కడికెళ్లారా? అలా ఏమీ లేదు. ‘జయం'లో చేసిన పాత్ర తమిళ వెర్షన్లో కూడా నేనే చేశాను. దాంతో అక్కడ కూడా మొదట్నుంచీ అవకాశాలు బాగానే వచ్చాయి. ఇప్పుడు కన్నడంలో కూడా వస్తున్నాయి. ఇప్పటికి ఎన్ని సినిమాలు చేశారు? తెలుగులో మూడొందల పైనే చేశాను. తమిళంలో అరవై వరకూ చేశాను. అన్నిట్లోకీ బెస్ట్ అనుకునే పాత్ర...? ఎప్పుడూ ఫస్ట్ చేసిందే బెస్ట్ అవుతుందని నా అభిప్రాయం. ఎన్ని రకాల పాత్రలు చేసినా... నన్ను నటుడిని చేసిన ‘జయం' సినిమాలో పాత్ర అంటే నాకు ప్రత్యేమైన ఇష్టం! అలాగే ‘7/జి బృందావన్ కాలనీ’లో చేసింది కూడా! ఇన్ని సినిమాలు చేశారు. రావలసినంత గుర్తింపు వచ్చిందంటారా? దర్శకులు పిలిచి అవకాశాలు ఇస్తున్నారంటే గుర్తింపు వచ్చినట్టే. కానీ తృప్తి కలిగించేటి రోల్స్ చేయలేదంటే ఇంకా గుర్తింపు రావలసి ఉన్నట్టే! ఇంత కాంపిటీషన్ మధ్య నిలబడటానికి మీకున్న ప్రత్యేకతలేంటి? నా మాడ్యులేషన్! కొండవలస గారిని తీసుకోండి... ఆయన మాట్లాడినట్టు వేరేవాళ్లు మాట్లాడలేరు. ప్రయత్నించినా రాదు. నాదీ అంతే. ఓ డిఫరెంట్ మాడ్యులేషన్. అదే నాకంటూ ఓ గుర్తింపునిచ్చింది. నన్నిక్కడ నిలబెట్టింది. మరి మైనస్ పాయింట్స్...? అవి నేను కాదు... నన్ను చూసేవాళ్లు చెప్పాలి. అయినా నెగిటివ్ పాయింట్స్ హీరోలకు మైనస్ అవుతాయి. అదే కమెడియన్‌కి అయితే మైనస్‌లే ప్లస్ అవుతాయి. (నవ్వుతూ) నన్ను చూడండి... నా రూపం చూస్తేనే నవ్వొస్తుందంటారు అందరూ. అంటే మైనస్ ప్లస్ అయినట్టేగా! మీ రోల్‌మోడల్ ఎవరు? పద్మనాభంగారంటే నాకు చాలా ఇష్టం. కమెడియన్‌గా ఎంత నవ్వించారో... హీరో దగ్గర్నుంచి నెగిటివ్ రోల్స్ వరకూ అన్ని రకాల పాత్రలూ చేసి అంతగానూ అలరించారాయన. అలాగే రేలంగిగారు, రాళ్లపళ్లిగారు అన్నా ఎంతో ఇష్టం. ఫలానా దర్శకుడితో చేయాలి అన్న కోరికేమైనా ఉందా? అలా ఏం లేదు. తేజ నన్ను పరిచయం చేశారు. ఇప్పటి వరకూ తన ప్రతి సినిమాలో చాన్స్ ఇస్తూనే ఉన్నారు. అలాగే మిగతా దర్శకులు కూడా నాకు సరిపోయే పాత్ర ఉంటే పిలిచి ఇస్తున్నారు. అలాంటప్పుడు ఒక్క దర్శకుడి పేరు ఎలా చెబుతాను! నాకు అందరూ ముఖ్యమే. ఎవరన్నా గౌరవమే. అందరూ నన్ను ప్రోత్సహించి నడిపిస్తున్నవారే కదా! మీ డ్రీమ్ రోల్...? ఎప్పుడూ నవ్విస్తూ ఉండే నాకు ఓ మంచి నెగిటివ్ రోల్ చేసి... నాలోనూ ఓ సీరియస్ నటుడున్నాడని చూపించాలని ఉంది. చాలామంది కమెడియన్లు హీరోలవుతున్నారు. మీకూ అలాంటి కోరికేదైనా...? అస్సలు లేదు. ఉన్నదాంతో తృప్తిపడే తత్వం నాది. మధ్యలో అవకాశాలు తగ్గి ఓ సంవత్సరం గ్యాప్ వచ్చినప్పుడు కూడా నిరాశపడలేదు. ఈసారి వచ్చే అవకాశాల్ని సద్వినియోగం చేసుకుని, మళ్లీ ఒక్కో మెట్టూ ఎదగాలనుకున్నాను. నేనేది చేయగలనో, నాకేది తగునో అవే చేస్తాను తప్ప ఎక్కువ ఆశలు పెట్టుకోను. - సమీర నేలపూడి