గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ | Jayam Movie Child Artist Yamini Swetha Present Pic And Details | Sakshi
Sakshi News home page

Guess The Actress: ఈమెని గుర్తుపట్టారా? ఇంతలా మారిపోయిందేంటి?

Published Mon, Jun 10 2024 7:25 PM | Last Updated on Mon, Jun 10 2024 8:06 PM

Jayam Movie Child Artist Yamini Swetha Presentt Pic And Details

తెలుగు సినిమాల్లో ఎప్పటికప్పుడు కొత్త యాక్టర్స్ వస్తూనే ఉంటారు. అప్పటికే ఫామ్‌లో నటీనటులు సైలెంట్‌గా సైడ్ అయిపోతుంటారు. కొన్నిసార్లు మాత్రం హిట్ మూవీస్ చేసి చాలా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఎందుకో ఇండస్ట్రీకి దూరమైపోతుంటారు. అలా దాదాపు 22 ఏళ్ల క్రితం తెలుగులో చైల్డ్ ఆర్టిస్టుగా ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఓ పాప ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. మరి ఈమె ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. అవి ఏంటంటే?)

పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు యామిని శ్వేత. డైరెక్టర్ తేజ తీసిన హిట్ సినిమా 'జయం'లో హీరోయిన్ సదా చెల్లెలిగా నటించిన పాప గుర్తుందా? ఆమెనే ఈమె. సీరియల్ నటి జయలక్ష‍్మి కూతురు కావడంతో సులువుగానే ఇండస్ట్రీలోకి వచ్చింది. సినిమాల రావడానిక ముందు 10 సీరియల్స్‌లో చేసింది. అలా నటిస్తున్న టైంలో 'జయం' ఆడిషన్స్ కోసం ప్రకటన రావడంతో ఈమె తండ్రి డైరెక్టర్ తేజకు ఫొటోలు పంపారు. అలా చైల్డ్ ఆర్టిస్టుగా ఎంపికైంది.

'జయం'త పాటు ఉత్సాహం, అనగనగా ఓ కుర్రాడు సినిమాల్లోనూ బాలనటిగా చేసింది. ఆ తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైపోయింది. చదువు, ఆ తర్వాత పెళ్లి చేసుకుని స్థిరపడిపోయింది. విదేశాల్లో మాస్టర్స్ పూర్తి చేసిన యామిని.. తెలుగబ్బాయిని పెళ్లి చేసుకుని ఫారెన్‌లో సెటిలైంది. తాజాగా ఈమెని చూసిన కొందరు.. 'జయం' నటి ఏంటి ఇంతలా మారిపోయిందని మట్లాడుకుంటున్నారు.

(ఇదీ చదవండి: అనుమానాస్పద రీతిలో నటి మృతి.. పట్టించుకోని కుటుంబ సభ్యులు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement