రవిరాజ్ రాథోడ్.. విక్రమార్కుడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా అదరగొట్టాడు. ఈ ఒక్కటే కాదు ఆంధ్రవాలా, ఖడ్గం, జెమిని, మాస్, బొమ్మరిల్లు, డాన్, హైదరాబాద్ నవాబు, శంకర్‌దాదా ఎంబీబీఎస్.. ఇలా దాదాపు యాభైకి పైగా సినిమాల్లో బాలనటుడిగా చేశాడు. ప్రస్తుతం కెమెరా ముందు కాకుండా సినిమా సెట్‌లో పనిచేస్తున్నాడు. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో తన బాధలను పంచుకున్నాడు.
నిప్పంటించుకుని..
రవిరాజ్ మాట్లాడుతూ.. నాది మిర్యాలగూడ. చిన్నప్పుడు నేను సంపాదించిన డబ్బుతోనే నాన్న ఇల్లు కట్టాడు. మా ఆయన బంగారం మూవీలో సౌందర్య ఎత్తుకునే చిన్న బాబును నేనే! చైల్డ్ ఆర్టిస్ట్‌గా నేను నటించిన చివరి సినిమా ఎస్‌ఎమ్‌ఎస్. అప్పుడే అమ్మానాన్న, బామ్మ ఒంటికి నిప్పంటించుకుని చనిపోయారు. నేను షూటింగ్‌కు వెళ్లొచ్చేసరికి అందరూ శవాలై ఉన్నారు. మా ఇంటిని పిన్నిబాబాయ్ వాళ్లకు ఇచ్చేసి బయటకు వచ్చేశాను.
లారెన్స్ దత్తత తీసుకున్నాడు
నన్ను రాఘవ లారెన్స్ దత్తత తీసుకున్నాడు. హాస్టల్ సౌకర్యం ఉన్న పెద్ద స్కూల్లో వేశాడు. నెలకు రూ.1 లక్ష ఫీజు కట్టాడు. వినాయక చవితి సెలవులు వచ్చినప్పుడు నేను ఫ్రెండ్స్ అంటూ ఇంటి దగ్గరే ఉండిపోయాను, తిరిగి వెళ్లలేదు. మొన్నామధ్య సెట్‌లో రాజమౌళి సర్ నన్ను చూసి వీపుపై రెండు దెబ్బలు వేశాడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా అన్ని సినిమాలు చేసి సెట్‌లో ఎందుకు పని చేస్తున్నావని తిట్టాడు. ఆరోజు షెడ్యూల్ అయ్యాక ఓసారి కలవమన్నారు కానీ నేనే వెళ్లలేదు.
అడుక్కోవడం ఎందుకని?
నటుడిగా కొనసాగకపోవడానికి కారణం.. అవకాశాల కోసం వెళ్తే రేపు రా, ఎల్లుండి రా.. అని తిప్పించుకున్నారు. ఇలా ఛాన్సుల కోసం అడుక్కోవడం ఎందుకని నటుడిగా ప్రయత్నించడం మానేశాను. అలాగే నేను మద్యానికి బానిసయ్యాను తాగకపోతే ఏవేవో జ్ఞాపకాలు గుర్తొస్తాయి. తాగకుండా ఒక్క రోజు ఉండలేను అని చెప్పుకొచ్చాడు.
చదవండి: ఏంటి సైఫ్? అర లక్ష ఏం సరిపోతుంది? కనీసం రూ.11 లక్షలైనా..: సింగర్
Comments
Please login to add a commentAdd a comment