Vikramarkudu
-
రీరిలీజ్.. టాలీవుడ్లో ఇప్పుడిదే ట్రెండ్!
రీరిలీజ్ అనేది ఇప్పుడు టాలీవుడ్లో ట్రెండింగ్‌గా మారింది. స్టార్ హీరోల బ్లాక్ బస్టర్ మూవీస్ వరుసగా మళ్లీ థియేటర్స్‌లో సందడి చేస్తున్నాయి. అభిమానుల డిమాండ్ మేరకు నచ్చిన సినిమాలను మళ్లీ రిలీజ్ చేస్తూ నిర్మాతలు సొమ్ము చేసుకుంటున్నారు. టెక్నాలజీ వాడుకొని అత్యంత నాణ్యమైన 4కేలో సినిమాను రిలీజ్ చేస్తుండడంతో అభిమానులతో పాటు సినీ ప్రియులు కూడా ఆయా చిత్రాలను మళ్లీ థియేటర్స్‌లో చూసేందుకు ఆసక్తి కనబర్చుతున్నారు.ఇప్పటికే టాలీవుడ్లో స్టార్ హీరోల బ్లాక్ బస్టర్ సినిమాలు కొన్ని రీరిలీజ్ అయి మంచి వసూళ్లను సాధించాయి. ఇక ఇప్పుడు వరుసగా నాలుగు సూపర్ హిట్ చిత్రాలు మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు థియేటర్స్‌లోకి రాబోతున్నాయి. అవేంటో చూసేయండి.దర్శకధీరుడు రాజమౌళి, మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ ‘విక్రమార్కుడు’. 2006లో రిలీజ్ అయిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలించింది. దాదాపు 18 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ మూవీ థియేటర్స్‌లో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. జులై 27న ఈ మూవీని రీరిలీజ్ చేస్తున్నామని మేకర్స్ ప్రకటించారు.మహేశ్‌బాబు హీరోగా, కృష్ణవంశీ తెరకెక్కించిన చిత్రం ‘మురారి’. 2001లో విడుదలైన ఈ ఫ్యామిలీ డ్రామా.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. మణిశర్మ అందించిన సంగీతం, పాటలు సినిమా విజయంలో కీలక పాత్ర వహించింది. మహేశ్‌ని ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గరకు చేసిన చిత్రమిది. దాదాపు 24 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ చిత్రం రిలీజ్ కానుంది. మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్ట్ 9న ఈ చిత్రాన్ని 4కే వెర్షన్లో రిలీజ్ చేయనున్నారు.ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘శివ’ కూడా రీరిలీజ్‌కు రెడీ అవుతోంది. నాగార్జున హీరోగా నటించిన ఈ సినిమా ... అక్టోబర్ 5, 1989లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాదు టాలీవుడ్ గతినే మార్చేసింది. ఈ తరం అక్కినేని అభిమానుల కోసం ఈ చిత్రం మరోసారి థియేటర్లో సందడి చేయనుంది. నాగార్జున బర్త్‌డే సందర్భంగా ఆగస్ట్ 29న ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా అమల, శుభలేఖ సుధాకర్, రఘువరన్, తనికెళ్లభరణి తదితరులు నటించారు.ప్రేమ కథలకు పెట్టింది పేరు గౌతమ్ మీనన్. ఆయన తెరకెక్కించిన క్యూట్ లవ్ స్టోరీ 'ఎటో వెళ్లిపోయింది మనసు'. నాని-సమంత జంటగా నటించిన ఈ ప్రేమకథా చిత్రం 2012 డిసెంబర్ 14 విడుదలైన మంచి విజయాన్ని సాధించింది. దాదాపు 12 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మూవీని ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఆగస్ట్ 2న ఈ చిత్రాన్ని లక్ష్మీ నరసింహా మూవీస్ బ్యానర్ మీద సుప్రియ, శ్రీనివాస్ రీ రిలీజ్ చేస్తున్నారు. -
నాకు విక్రమార్కుడు సినిమా అంటే ఇష్టం
-
రాజమౌళి ఆల్ టైమ్ ఫేవరేట్ మూవీ ఏంటో తెలుసా..?
-
టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో యశస్వి జైస్వాల్..!
టీమిండియా యువ సంచలనం ఆరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరితో అదరగొట్టాడు. ఐపీఎల్లో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన యువకెరటం ఏకంగా టీమిండియా తలుపుతట్టాడు. వెస్టిండీస్ పర్యటనకు ఒపెనర్‌గా ఎంపికయ్యాడు. ఇంకేముంది అందివచ్చిన అవకాశాన్ని రెండు చేతులతో ఒడిసి పట్టుకున్నాడు. డెబ్యూ మ్యాచ్‌లోనే సెంచరీతో అదరగొట్టి ఔరా అనిపించాడు. అతనే టీమిండియా యువకెరటం యశస్వి జైశ్వాల్. అయితే తాజాగా యశస్వి జైస్వాల్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ యంగ్ ఒపెనర్ టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో నటించారంటూ మీమ్స్ పెద్దఎత్తున వైరలవుతున్నాయి. (ఇది చదవండి: స్టార్ హీరోపై విడాకుల రూమర్స్.. విదేశాల్లో ఉందంటూ!) మాస్ మహారాజా రవితేజ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ విక్రమార్కుడు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్‌లోని చంబల్ ప్రాంతంలో జరిగిన కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ చిత్రంలో ఓ సీన్లో అచ్చం యశస్వి జైస్వాల్ లాగే ఓ చైల్డ్ ఆర్టిస్ట్ కనిపించాడు. అది కూడా క్రికెట్ ఆడుతున్న సీన్ కావడంతో అందరూ చిన్నప్పుడు ఆ సీన్లో ఉన్నది యశస్వి జైస్వాల్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. విక్రమార్కుడు చిత్రంలోని చైల్డ్ ఆర్టిస్ట్‌కు, అతనికి పోలికలు ఉండటంతో నెటిజన్స్ మీమ్స్ చేస్తున్నారు. 'ఏ సత్తి బాల్ లోపలికి వచ్చిందా?' అనే డైలాగ్ చెప్పిన పిల్లాడు ఇప్పుడు టీమిండియా ఒపెనర్కు దగ్గర పోలికలు ఉండడంతోనే అలా పోలుస్తున్నారు. అంతేకానీ ఉత్తరప్రదేశ్‌కు చెందిన యశస్వి జైస్వాల్ టాలీవుడ్లోనే ఏ సినిమాలోనూ నటించలేదు. ప్రస్తుతం అతను టీమిండియాలో చోటు దక్కించుకోవడంతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. (ఇది చదవండి: మీరు ఇంత దారుణంగా ఉన్నారేంట్రా?.. అనసూయ ట్వీట్ వైరల్) Vikramarkudu lo vunnadhi @ybj_19 e antara #IPL2023 #IPL pic.twitter.com/nqJ8OiCHD4 — Prasad (@PrasadAGVR) May 13, 2023 -
విక్రమార్కుడులో మెప్పించిన చిన్నారి.. ఇప్పుడెలా ఉందో తెలుసా?
సినీ ఇండస్ట్రీలో చాలామంది చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన వారు ఉన్నారు. వారిలో కొందరు స్టార్స్‌గా మారితే.. మరికొందరేమో కొన్ని సినిమాలతోనే సరి పెట్టుకున్నారు. కొద్ది మంది ఒక్క సినిమాలో కనిపించి కనుమరుగైన పోయిన వారు కూడా ఉన్నారు. కానీ ఓ సూపర్ హిట్ చిత్రంలో మెప్పించిన ఓ చిన్నారి ఇప్పుడెలా ఉందో ఓ లుక్కేద్దాం. రవితేజ డబుల్ రోల్లో నటించిన బ్లాక్ బస్టర్ హిట్ 'విక్రమార్కుడు'. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. మధ్యప్రదేశ్‌లోని చంబల్ ప్రాంతంలో జరిగిన కథను సినిమాగా తెరకెక్కించారు. ఈ సినిమాలో రవితేజ కూతురిగా నటించిన చిన్నారి మీకు గుర్తుందా? 'అమ్మ పాట వింటే నిద్ర వచ్చేస్తుంది నాన్న' అంటూ అమాయకంగా పలికిన ఆ చిన్నారి ఇప్పుడేం చేస్తోందో తెలుసా? ఆ వివరాలేంటో ఓసారి తెలుసుకుందాం. విక్రమార్కడులో చైల్డ్ ఆర్టిస్ట్ నేహా చాలా సినిమాల్లో నటించింది. విక్రమార్కుడు సినిమాలో రవితేజ కూతురిగా.. అమాయకమైన పాత్రలో అద్భుతమైన నటనతో మెప్పించింది. ఈ సినిమాలో నటనకు ఆ చిన్నారిని మెచ్చుకున్నారు. అనసూయ, రాముడు, ఆది విష్ణు, రక్ష, సర్కార్ చిత్రాల్లో కూడా కనిపించింది. కాగా.. అమెరికాలోని ఫ్లోరిడాలో నేహా జన్మించింది. అయితే చిన్నప్పుడే ఆ పాప తల్లిదండ్రులు హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డారు. ఆమె తల్లిదండ్రులు ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందినవారు. నేహా దాదాపు పదేళ్లకు పైగా సినిమాల్లో నటించడం లేదు. అయితే ఆమె ప్రస్తుతం సినిమాల కంటే కెరీర్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇటీవలే ఎంబీఏ కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. -
చంద్రముఖి టు విక్రమార్కుడు.. ‘సీక్వెల్’పై కన్నేసిన దర్శకనిర్మాతలు
బాక్సాఫీస్ పై కాసుల వర్షాన్ని కురిపించిన సినిమాలకు ఎంతటి క్రేజ్ ఉంటుందో చెప్పుకోనక్కర్లేదు. అందుకే ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు ప్రస్తుతం సీక్వెల్ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే చంద్రముఖి సీక్వెల్ కు స్టార్ కాస్ట్ ఫైనల్ అవుతోంది. లారెన్స్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. 25 ఏళ్ల క్రితం దక్షిణాదిన సంచలన విజయం సాధించింది ప్రేమదేశం. ఇప్పుడు ఈ క్లాసిక్ లవ్ స్టోరీకి సీక్వెల్ తెరకెక్కించబోతున్నారు. ప్రస్తుతం మొదటి భాగాన్ని తెరకెక్కించిన దర్శకుడు కదీర్ రెండో భాగానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుపుతున్నాడు. అంతా నూతన నటీనటులతో సీక్వెల్ ను తెరకెక్కించాలనుకుంటున్నాడు. రాజమౌళి తెరకెక్కించిన చిత్రాలన్ని ఆల్ మోస్ట్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరినవే. బాహుబలికి మాత్రమే రెండో భాగం తీసాడు జక్కన్న. నిజానికి తన చిత్రాల్లో ఈగకు సీక్వెల్ తీయాలన్నది రాజమౌళి కోరిక. అయితే ఇప్పటికిప్పుడు ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లేలా లేదు. మరోవైపు విక్రమార్కుడు సీక్వెల్ స్టోరీని రెడీ చేసేసారు కథారచయిత విజయేంద్రప్రసాద్. విక్రమార్కుడు చిత్రం తెలుగులోనే కాదు.. తమిళ, కన్నడ, హిందీ,బెంగాలీ బాషల్లోకి రీమేక్ అయింది. అన్ని చోట్ల మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పటికిప్పుడు ఈ మూవీ సీక్వెల్ ను రాజమౌళి డైరెక్టే చేసే అవకాశాలు తక్కువ. ఆర్ఆర్ఆర్ తర్వాత మహేష్ బాబుతో మూవీతో జక్కన్న బిజీగా ఉన్నాడు. మరి విక్రమార్కుడు సీక్వెల్ బాధ్యతలను ఎవరికి అప్పగిస్తాడు అనేది ఆశక్తికరంగా మారింది. -
విక్రమార్కుడు పాప ఇప్పుడు ఎలా ఉందో చూశారా?
సినీ పరిశ్రమలోకి చైల్డ్ ఆర్టిస్టులు వస్తుంటారు పోతుంటారు. కానీ కొందరు మాత్రమే తమదైన నటనతో మెప్పించి ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోతారు. చేసింది ఒకట్రెండు సినిమాలైనా వారి ముద్దుముద్దుమాటలు, చేష్టలతో ఆ పాత్రలకు ప్రాణం పోస్తారు. అలాంటి అతి కొద్ది మంది చైల్డ్ ఆర్టిస్ట్‌లలో నేహా తోట ఒక్కరు. నేహా తోట అంటే గుర్తుపట్టకపోవచ్చ కానీ, విక్రమార్కుడులో నటించిన చిన్నారి అనగానే ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఆ సినిమాలో అమాయకమైన చూపులతో అందరిని ఆకట్టుకుంది. తల్లిలేని పిల్లగా అద్భుతమైన నటన ప్రదర్శించింది. అలాగే రామ్‌గోపాల్ వర్మ ‘రక్ష’ సినిమాలో దెయ్యం పట్టిన పాత్రలో నటించి అందరిని భయపెట్టింది. ఆ సినిమాలో నేహ పాత్ర అమోఘమనే చెప్పాలి. తన నటనతో ఆర్జీవీనే మెప్పించింది. ఆ తర్వాత అనసూయ, రాముడు వంటి చిత్రాల్లో కూడా చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది. ఆ తర్వాత మళ్లీ తెరపైన కనపడలేదు. సినిమా చాన్సులు వచ్చినా కాదనుకుని చదువుపై శ్రద్ధ పెట్టింది. ప్రస్తుతం ఈ అమ్మడు బిజినెస్ మేనేజ్మెంట్లో ఎంబీఏ చేస్తుంది. ఇప్పుడు అయితే అసలు గుర్తుపట్టనంతగా మారిపోయింది నేహ. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నేహా తన ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుల మతి పోగొడుతోంది. హీరోయిన్లా ఉన్నావ్.. సినిమాలు ఎందుకు చేయట్లేదని నెటిజన్లు ప్రశ్నిస్తే.. ..స్టడీస్ కంప్లీట్ అయ్యాక సినిమా అవకాశాలు వస్తే నటిస్తానని,దానికి ఇంకా టైం ఉందని చెప్తోంది నేహ. నటన అంటే తనకు ఇష్టమని భవిష్యత్తులో తప్పకుండా సినిమాలు చేస్తానని చెబుతోంది. -
‘జింతాత జిత జిత జింతాత తా..’ గుర్తుందా!
‘పోలీసోడు ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్‌కే వెళతాడు పోస్టాఫీస్‌కు కాదు’, ‘చావు అంటే బయపడటానికి అల్లాటప్పాగా గల్లీలో తిరిగే గుండా నా కొడుకు అనుకున్నావారా రాథోడ్ విక్రమ్ రాథోడ్’, ‘జింతాత జిత జిత జింతాత తా...’ అంటూ ‘విక్రమార్కుడు’ సినిమాలో పవర్ఫుల్ డైలాగ్‌లతో థియేటర్లలో అభిమానులతో విజిల్స్ వేయించారు మాస్ మహారాజ్ రవితేజ. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో అనుష్క హీరోయిన్గా నటించారు. ఎంఎం కీరవాణి సంగీతమందించిన ఈ చిత్రం విడుదలై నేటికి 14 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ‘విక్రమార్కుడు’ విశేషాలు మీకోసం.. అత్తిలి సత్తిబాబు (రవితేజ), దువ్వ అబ్బులు (బ్రహ్మానందం)తో వచ్చే కామెడీ సీన్స్, ఆ తర్వాత నీరజా గోస్వామి (అనుష్క)తో అత్తిలి లవ్ అండ్ రొమాన్స్ సీన్స్, మధ్యలో కీరవాణి అందించిన పాటలు ఇలా ఫస్టాఫ్‌లో వచ్చే ప్రతీ విషయం కొత్తగా, ఎంటర్టైన్గా ఉంటాయి. ఆ తర్వాత బావూజీ (వినీత్ కుమార్), టిట్లా(అజయ్)లతో విలనిజం, ఆ తర్వాత ఓ రేంజ్లో పోలీసాఫీసర్ విక్రమ్ రాథోడ్ ఎంట్రీ, ఫ్యామిలీ డ్రామా, గుర్తుండిపోయే ముగింపు ఇలా అన్నీ కలగలపి ‘విక్రమార్కుడు’ని అద్భుతంగా తీర్చిదిద్దారు జక్కన్న. ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా కామెడీ, ఎమోషన్, డైలాగ్‌లతో థియేటర్ ఆడియన్స్‌కు మంచి ఎంటర్టైన్మెంట్ విందును అందించాడు. (సీఎం జగన్‌కు ధన్యవాదాలు: రాజమౌళి) ఇక ఈ సినిమా అనేక భాషల్లో స్ఠార్ హీరోలతో రీమేక్ అయినప్పటికీ తెలుగులో ఈ సినిమాకు వచ్చిన క్రేజ్‌తో పోలీస్తే కాస్త తక్కువే అని చెప్పాలి. ప్రేక్షకుల నాడీ తెలిసిన జక్కన్న రవితేజతో కలిసిన అద్భుత మ్యాజిక్ చేసిన ఈ చిత్రం ఇప్పటికీ టీవీల్లో వస్తే అందరూ టీవీల ముందు వాలిపోతారనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఇక ఈ సినిమాకు సీక్వెల్ వస్తుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నప్పటికీ కార్యరూపం దాల్చలేదు. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ రావాలని అటు రవితేజ అభిమానులతో పాటు ‘విక్రమార్కుడు’ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి ఈ చిత్రానికి సీక్వెల్ వస్తుందో లేదో జక్కన్నకే తెలియాలి. (జగన్నాథమ్ వచ్చి మూడేళ్లయింది) ‘విక్రమార్కుడు’లో అందరికీ నచ్చే డైలాగ్ ‘‘నాకు భయం లేదని ఎందుకనుకుంటున్నారు సర్. ఎప్పుడో ఒక్కసారి కాదు రోజులో ప్రతి క్షణం, ప్రతి నిమిషం భయపడుతూనే ఉంటా సర్. నాలుగేళ్ల క్రితం డ్యూటీలో చేరినప్పుడు విధి నిర్వహణలో నా ప్రాణమైనా అర్పిస్తానని ప్రమాణం చేశాను సర్. మీకు చెప్పిన తలుపు చప్పుళ్లు, ఫోన్ రింగులు రావొచ్చు, రాకపోవచ్చు. కానీ ఏదో ఒక రోజు మాత్రం నా చావు కచ్చితంగా వచ్చి తీరుతుంది సర్. ఆ రోజు దాన్ని కళ్లలోకి చూసిన ఆ క్షణం ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఎక్కడ తలదించుకోవాల్సి వస్తుందోనని అనుక్షణం భయపడుతూనే ఉంటాను సర్. తప్పు చేసిన వాడి భయం ఒంట్లో ప్రతి నరంలో ఉంటుంది. నా భయం నా యూనిఫామ్‌లో ఉంటుంది సర్. దానికి ఒకటే కోరిక సర్.. చావు నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్లలో బెరుకు ఉండకూడదు. నా మూతి మీద చిరునవ్వు ఉండాలి, నా చెయ్యి నా మీసం ఉండాలి సర్’’ (భవిష్యత్తుని చూపెట్టే టెనెట్) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_991257758.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
దోదో!
‘‘భేతాళా! ఏమీ మాట్లాడకుండా అలా వడదెబ్బ తగిలినట్టు ఫేసు పెట్టావేమిటీ? క్వశ్చన్ అడుగు’’ అన్నాడు విక్రమార్కుడు. ‘‘ఈ ఎండల్లో కొచ్చెన్ ఏం అడుగుతానుగానీ...నువ్వు విన్నవి కన్నవి చల్లని రెండు జోక్‌లు చెప్పు చాలు’’ అన్నాడు నీరసంగా భేతాళుడు. ‘‘ఓకే’’ అంటూ చెప్పడం ప్రారంభించాడు విక్రమార్కుడు: అనగనగా ఒక మగదోమ, ఒక ఆడదోమ. మగదోమ రెండు వారాల పాటు ఏదో పని మీద బిహార్ వెళ్లి వచ్చింది. ‘‘ఎలా ఉన్నావు డియర్!’’ అడిగింది ఆడదోమ. ‘‘నేను ఎలా ఉన్నాను అనేది పక్కన పెట్టు....నీకోసం ఏమైనా చేస్తాను. సింహాన్ని వేటాడి తెస్తాను’’ అన్నది మగదోమ. ‘‘సరేలే’’ అన్నది తేలికగా ఆడదోమ. ‘‘సరేలే కాదు. నిన్ను నా భుజాల రెక్కలపై కూర్చోబెట్టుకొని ప్రపంచమంతా తిప్పుతాను’’ అన్నది మగదోమ. ‘‘ఏడ్చినట్టే ఉంది’’ అన్నది ఆడదోమ. ‘‘ఏడ్చినట్లే ఉండడం కాదు...ప్రియా! స్వర్గాన్ని నీ కోసం ఆన్లైన్లో తెప్పిస్తాను’’ ‘‘సరేలేగానీ....కాస్త రెస్ట్ తీసుకోండి...ప్రయాణ బడలికతో వచ్చారు’’ అన్నది ఆడదోమ. ‘‘రెస్ట్ సంగతి సరే...ఆ ఎవరెస్ట్‌ను నీ పాదాల దగ్గర తెల్లకుక్క పిల్లలా కూర్చోబెడతాను’’ అన్నది మగదోమ. ‘‘ఏమైంది మీకు? ఎందుకు ఇలా కోతలు కోస్తున్నారు?!’’ అని ఆశ్చర్యంగా అడిగింది ఆడదోమ. ‘‘కోతలు కాదు ప్రియా! తాజ్‌మహల్ దగ్గరకు ఎవరైనా వెళతారు. కాని ఆ తాజ్‌మహల్‌నే నీ దగ్గరకు తెస్తాను’’ అన్నది మగదోమ. ‘‘ఇవన్నీ కాదుగానీ నా కోసం ఒకచోటుకి రావాలి’’ గోముగా అడిగింది ఆడదోమ. ‘‘సరే దానిదేముంది!’’ అంటూ ఆడదోమతో పాటు వెళ్లింది మగదోమ. ‘దోమల మానసిక చికిత్స కేంద్రం’ అని బోర్డ్‌పై రాసి ఉన్న హాస్పిటల్లోకి రెండు దోమలు వెళ్లాయి. ‘‘ఇంతకీ ఏమిటి మీ సమస్య?’’ డాక్టర్ దోమ ఆడదోమను అడిగింది. ‘‘సమస్య నాకు కాదు...మా ఆయనకు’’ అన్నది ఆడదోమ. ‘‘చూస్తే దుక్కలా ఉన్నాడు. ఏమిటి సమస్య!’’ అని గోడ కూలినట్లు నవ్వింది డాక్టర్ దోమ. ‘‘మా ఆయన రెండు వారాల పాటు టూరు వెళ్లారండీ. అప్పటి నుంచి చాలా తేడాగా మాట్లాడుతున్నారు. అవసరం ఉన్నా లేకపోయిన తొడకొడుతున్నారు. మీసం మెలేస్తున్నారు. ఒక దగ్గర రెండు దోమలు కనబడితే చాలు ఉపన్యాసమిస్తున్నాడు. ఏవేవో వాగ్దానాలు చేస్తున్నాడు....’’ చెప్పుకుంటూ పోయింది ఆడదోమ. డాక్టర్ దోమకు ఏమీ అర్థం కాలేదు. కాసేపు స్కెతస్కోప్తో తలకొట్టుకొని ఆలోచించింది. ఏమీ స్ఫురించలేదు. లైబ్రరీకి వెళ్లి సీరియస్‌గా బుక్స్ తిరిగేసి నోట్స్ రాసుకొని వచ్చింది. ‘‘అయ్యా! హాస్పిటల్‌కు వచ్చి అరగంటవుతోంది. ఇంతవరకు సమస్య ఏమిటో చెప్పలేదు’’ అసహనంగా అన్నది ఆడదోమ. ‘‘దాని గురించే ఆలోచిస్తున్నాను’’ అని పెన్నును నుదుటి మీద చిన్నగా కొట్టుకుంటూ ఆలోచించసాగింది డాక్టర్ దోమ. ‘‘అయ్యా కేసు నన్ను టేకప్ చేయమంటారా?’’ ఆతృతతో అడిగింది కంపౌండర్ దోమ. ‘‘చేసి చావు...’’ అని నిద్రలోకి జారింది డాక్టర్ దోమ. ‘‘ఏమయ్యా ఇలా వచ్చి కూర్చో’’ అని ఆర్డరేసింది కంపౌడర్ దోమ. ‘‘అలాగే’’ అంటూ బుద్ధిగా కూర్చుంది మగదోమ, ‘‘ఏమయ్యా...నీ పేరేమిటి?’’ అడిగింది కంపౌండర్ దోమ. ‘‘దోసకొండ దోమప్ప... అందరూ ముద్దుగా దోదో అని పిలుస్తారు’’ అని చెప్పింది మగదోమ. ‘‘చూడు దోదో...ఇప్పుడు నేను నిన్ను ట్రాన్స్‌లోకి తీసుకువెళతాను. ఓకేనా!’’ అడిగింది కంపౌండర్ దోమ. ‘‘ఓకే’’ అన్నది దోదో. ‘‘ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా కళ్లు మూసుకుంటున్నావు. నీకు చెవులు ఉన్నాయి... కానీ నేను మాట్లాడింది తప్ప ఏ సౌండూ నీకు వినబడడం లేదు. నీకు మైండ్ ఉంది. కానీ నేను చెప్పిందాన్ని గురించి తప్ప దేని గురించి...అది ఆలోచించడం లేదు. వెళుతున్నావు.... లోలోనికి వెళుతున్నావు. నీదైన ప్రపంచంలోకి... ఇప్పుడు చెప్పు...అసలు ఏమైంది? ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు?’’ అడిగింది కంపౌడర్ దోమ. ‘‘పని మీద బిహార్‌కు వెళ్లానండి. అక్కడ ఎలక్షన్ హడావిడి కనిపించింది. ఒకరోజు బిహార్‌లో ఒకచోట బాగా ఆకలైంది. ఎటుచూసినా చెట్టుచేమలే తప్ప మనుషుల జాడ కనిపించలేదు. దూరంగా ఏదో చప్పుడు వినిపిస్తే వేగంగా అటు వెళ్లాను. అక్కడ ఎన్నికల సభ జరుగుతోంది. నాయకుడు మాంచి జోరుమీద ఉన్నాడు. ‘‘మీ కోసం నా ప్రాణం ఇస్తాను’’ అంటున్నాడు. ‘‘ప్రాణం ఎందుకుగానీ...రక్తం ఇవ్వు చాలు’’ అని వెళ్లి కుట్టాను. దీంతో నా మైండ్ దెబ్బతింది. నేనేమి మాట్లాడుతున్నానో....నాకే తెలియడం లేదు.’’ అని అసలు విషయం చెప్పింది దోదో!! 2 సుబ్బారావు అప్పారావుకు లక్షరూపాయలు అప్పు ఇచ్చాడు. కాని అప్పారావు ‘ఇదిగో అదిగో’ అంటున్నాడే తప్ప అప్పు తీర్చడం లేదు. విసుగెత్తిన సుబ్బారావు ఒక లాయర్ దగ్గరకు వెళ్లి తన గోడు చెప్పుకున్నాడు. ‘‘అప్పారావుకు లక్ష రూపాయాలు అప్పు ఇచ్చినట్లు నీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా?’’ అడిగాడు లాయర్. ‘‘లేదు’’ అని భోరుమన్నాడు సుబ్బారావు. ‘‘అయితే ఇలా చెయ్’’ అని సుబ్బారావు చెవిలో ఏదో చెప్పాడు లాయర్. పావుగంటలోనే సుబ్బారావుకు గట్టి సాక్ష్యం దొరికింది. ‘‘భేతాళా! ఈరోజు నేను నిన్ను కొచ్చెన్ అడుగుతాను. ఇంతకీ లాయర్ అతడి చెవిలో ఏం ఊదాడు?’’ అడిగాడు విక్రమార్కుడు. భేతాళుడు చెప్పిన జవాబు: సుబ్బారావు అప్పారావుకు ఫోన్ చేసి...‘‘నీకు అప్పుగా ఇచ్చిన అయిదు లక్షలు నాకు అర్జంటుగా కావాలి’’ అన్నాడు. ‘‘అయిదు లక్షలా...ఏం మాట్లాడుతున్నావు సుబ్బారావు. మతిగానీ పోయిందా’’ మండిపడ్డాడు అప్పారావు. ‘‘నువ్వు ఇలా మరిచిపోతే ఎలా అప్పారావు! అక్షరాల అయిదు లక్షలు ఇచ్చా’’ అన్నాడు సుబ్బారావు. ‘‘నువ్వు నాకు లక్ష రూపాయలు మాత్రమే ఇచ్చావు. ఇంతకంటే నువ్వు ఒక్క పైసా నాకు ఇచ్చినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం’’అన్నాడు అప్పారావు. ‘‘అంటే నువ్వు తీసుకుంది లక్షరూపాయలేనంటావు’’ ‘‘కచ్చితంగా లక్షరూపాయలే’’ ‘ఓకే’అంటూ ఫోన్ పెట్టేశాడు సుబ్బారావు. అప్పారావు వాయిస్ రికార్డయింది. ఇంతకు మించిన సాక్ష్యం ఏముంటుంది! – యాకుబ్ పాషా -
శ్రీ కొత్త అల్లుడుగారు
చెట్టు మీద ఉన్న శవాన్ని ఎప్పటిలాగే భుజాన వేసుకున్నాడు విక్రమార్కుడు.‘‘రాజా! ఏదో చెప్పబోవుచున్నావు?’’ ఆసక్తిగా అడిగాడు భేతాళుడు.‘‘చెప్పడమా పాడా.... నములుచున్నాను. సంక్రాంతి పిండి వంటలు భలే పసందుగా ఉన్నవి’’ నములుతూనే చెప్పాడు విక్రమార్కుడు.‘‘నీకు శ్రమ తెలియకుండా ఉండటానికి ఒక ప్రశ్న అడుగుతాను. ఓకేనా?’’ అడిగాడు భేతాళుడు.‘‘ఓకే’’ అన్నాడు మురుకులు నములుతూ విక్రమార్కుడు.‘‘విక్రమార్కా! పండక్కి అత్తారింటికి వెళ్లని అల్లుడు ఎవరైనా ఈ భూప్రపంచం మీద ఉన్నాడంటావా?’’ అడిగాడు భేతాళుడు.‘‘ఎందుకులేడు, ఒకే ఒక్కడున్నాడు’’ అన్నాడు విక్రమార్కుడు అర్ష ముక్క నోట్లో వేసుకుంటూ.‘‘యూ మీన్ అర్జున్?’’ అన్నాడు భేతాళుడు.‘‘కాదెహే... నేను చెప్పేది చె.చె. గురించి’’ అన్నాడు విక్రమార్కుడు.‘‘చె.చె? అదేం పేరు!’’ ఆశ్చర్యపడ్డాడు భేతాళుడు.‘‘చెంబూరు చెంగయ్య. షార్ట్కర్ట్లో చె.చె. అని పిలుస్తుంటారు’’ వివరించాడు విక్రమార్కుడు.‘‘ఈ చెంగయ్య పండక్కి అత్తారింటికి ఎందుకు వెళ్లడు? ఆ కథాకమామిషు ఏమిటి?’’ ఆసక్తిగా అడిగాడు భేతాళుడు.అప్పుడు విక్రమార్కుడు ఇలా చెప్పడం మొదలెట్టాడు:అనగనగా ఒక చెంగయ్య. అతనికి కొత్తగా పెళ్లయింది. పెళ్లయిన కొన్నిరోజులకు పెద్ద పండగ వచ్చింది.‘‘మీరు పండక్కి తప్పనిసరిగా రావాలి అల్లుడు’’ అని గోముగా అడిగాడు మామ.‘‘అలాగే మామయ్య... తప్పకుండా వస్తాను’’ అంటే లెవల్ పడిపోతుందని...‘‘అబ్బే! కుదరదు మామయ్య.... బోలెడంత పని ఉంది’’ అబద్ధమాడాడు చెంగయ్య.‘‘ఓకే అల్లుడూ...పని ముఖ్యం. పని పట్ల నీ శ్రద్ధ నాకు బాగా నచ్చింది. పనికొచ్చే లక్షణం’’ అని నాన్‌స్టాప్‌గా పొగడటం మొదలుపెట్టాడు మామయ్య.ఆయన పొగడ్తల్లో ‘పొగడ్త’ కంటే... ఖర్చు తప్పిందనే సంతోషమే ఎక్కువగా ధ్వనించింది.‘కలికాలం. ఏదో మాట వరసకు పని ఉందంటే, ఖండించాల్సింది పోయి, ఏది ఏమైనా మీరు తప్పకుండా రావాలి అని బతిమిలాడాల్సింది పోయి.... తాపీగా ఓకే అంటాడా’ తనలో తాను కుమిలిపోయాడు చెంగయ్య. అది పండగరోజు.పెద్ద బ్యాగుతో ఊడిపడ్డ అల్లుడిని చూసి ఆటంబాంబును చూసినట్లు అదిరిపడ్డాడు చెంగయ్య.అయినప్పటికీ ఆ అదురు పాటును ముఖంలో కనిపించకుండా...‘‘చాలా సంతోషంగా ఉంది అల్లుడు’’ అంటూ మందులో సోడా కలిపినట్లు నవ్వులో ఏడ్పును కలిపాడు మామయ్య.అల్లుడుగారికి అత్తారింటి మర్యాదలు మొదలయ్యాయి.‘ఆపరేషన్ పిండివంటలు’ కార్యక్రమం నిరాఘాటంగా సాగుతుంది.‘‘నేను పిండివంటలు పెద్దగా తిననండి’’ అంటున్నాడు అల్లుడు. అయినా తింటూనే ఉన్నాడు!‘‘అయ్యో! కడుపు నిండింది’’ అంటున్నాడు.అయినా తింటూనే ఉన్నాడు.‘‘ఇక చాలు’’ అంటున్నాడు.అయినా తింటూనే ఉన్నాడు.‘చాలు బాబోయ్’’ అంటున్నాడు.అయినా తింటూనే ఉన్నాడు.కొద్దిసేపటి తరువాత...అతడి కడుపులో సునామీమొదలైంది.ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. అవి ‘స్వచ్ఛ్భారత్’ ‘ప్రతి ఇంటికి తప్పనిసరిగా మరుగుదొడ్డి’ లేని రోజులు. ఎంతటి మొనగాడైనా చెంబట్టుకొని ఊరవతలికి పోవాల్సిందే.కడుపులో ఏదో కీడు శంకించడంతో తినడం ఆపేశాడు చెంగయ్య.వింటి నుంచి దూసుకొచ్చిన బాణంలా ఇంటి వెనక్కి దూసుకొచ్చి చెంబు పట్టుకొని అదే వేగంతో వీధిలోకి పరుగులు తీశాడు.ఇప్పుడు మనం పీపారాయుడి గురించి కొంచెం చెప్పుకుందాం. ఈ రాయుడి ఇంటి ముందు ప్రతి సంక్రాంతికి గొబ్బెమ్మ పెడతారు. ఇందులో విశేషం ఏముంది అందరి ఇండ్ల ముందు గొబ్బెమ్మలు పెడతారనే కదా మీ డౌటు! కానీ ఊళ్లో ఉన్న గొబ్బెమ్మల కంటే ఈ గొబ్బెమ్మ పెద్దది. ఎత్తయినదీనూ!‘గొబ్బెమ్మ అయినా సరే మన తాహతకు తగినట్లు ఉండాలి’ అంటాడు పీపారాయుడు.మరి అలాంటి గొబ్బెమ్మకు ఏమైంది?ఏమీ కాలేదు... కానీ చెంగయ్యకి అయ్యింది.చెంబుతో పరుగెత్తుకుంటూ వస్తున్న చెంగయ్య పీపారాయుడి గొబ్బెమ్మను తాకి బొక్కబోర్లా పడ్డాడు. పడితే పడ్డాడు... కానీ అతని చేతిలోని చెంబు వెళ్లి పీపారాయుడి బట్టతల మీద పడింది.పడితే పడింది కాని చెంబుదెబ్బకు పీపారాయుడి మతి చలించింది.అతని నోటి నుంచి వింతవింత మాటలు వినిపిస్తున్నాయి.వెంటనే డాక్టర్‌ను పిలిపించారు.‘‘ఈ ప్రపంచంలో అసాధ్యమైన పని ఏదీ లేదు డాక్టర్!’’ అన్నాడు పీపారాయుడు.‘‘ఎవరయ్యా రాయుడిగారికి మతిచలించింది అని చెప్పింది.... శుభ్రంగా మాట్లాడుతుంటేనూ.... ఆయన మాటల్లో పిచ్చి ఎక్కడిది? ఈ ప్రపంచంలో అసాధ్యమైనది ఏదీ లేదు అంటున్నాడు. అంతేగా!’’ భరోసాగా అన్నాడు డాక్టర్.‘‘నేను చెప్పినదానితో ఏకీభవిస్తారా డాక్టర్?’’ అడిగాడు పీపారాయుడు.‘‘ఈ ప్రపంచంలో అసాధ్యమైనది ఏదీ లేదు. ఎంత గొప్పగా చెప్పారండీ’’ తన్మయంగా వంకర్లు తిరిగాడు డాక్టరు. ‘‘మీ సూది ఇలా ఇస్తారా డాక్టరు’’ అడిగాడు పీపారాయుడు.‘‘ఎందుకు?’’ భయంగా అడిగాడు డాక్టర్.‘‘ఆ సూదిబెజ్జంలో దూరుతాను... ఈ ప్రపంచంలో అసాధ్యమైంది లేదు...’’ అంటున్నాడు రాయుడు.‘‘ఓరి నాయనో...’’ అంటూ అక్కడి నుంచి పరుగులు తీశాడు డాక్టరు.‘‘మా రాయుడిని విత్ ఇన్ టెన్మినిట్స్లో పిచ్చెక్కిస్తావా? నీకు ఎన్ని గుండెలు?’’ అంటూ చెంగయ్యను చావబాదడమే కాకుండా, ‘‘ఇక ముందు ఎప్పుడూ మా ఊళ్లోకి అడుగుపెట్టవద్దు’’ అని శాసనం చేశారు ఊరి ప్రజలు. ఇక అప్పటి నుంచి అత్తింటివారి ఊరి పేరు వింటే చాలు గజగజా వణికిపోతాడు చెంగయ్య! – యాకుబ్ పాషా -
మళ్లీ...జింతాత జిత జిత?
‘‘పోలీసోడికి ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్‌కే వెళ్తాడు.. పోస్టాఫీసుకి కాదు’’ అంటూ పదేళ్ల కిందట వచ్చిన ‘విక్రమార్కుడు’ చిత్రంలో రవితేజ చెప్పిన డైలాగ్ ఇది. అదే సినిమాలో ‘జింతాత జిత జిత జింతాత తా...’ డైలాగ్ కూడా చాలా పాపులర్ అయింది. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం ఎంత హిట్ అయిందో తెలిసిందే. రవితేజ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రాల్లో ఇదొకటి. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకు? అనేగా మీ డౌట్. ‘విక్రమార్కుడు’ చిత్రానికి సీక్వెల్ తీయనున్నారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్లో వినిపిస్తోంది. రచయిత విజయేంద్రప్రసాద్ కథ సిద్ధం చేసే పనిలో ఉన్నారని సమాచారం. గత ఏడాది వచ్చిన ‘బెంగాల్ టైగర్’ చిత్రం తర్వాత రవితేజ ఇప్పటి వరకూ ఏ చిత్రం కమిట్ కాలేదు. మధ్యలో పలువురి దర్శకుల పేర్లు వినిపించినా ఏదీ పట్టాలెక్కలేదు. రవితేజతో పూరీ జగన్నాథ్ ‘ఇడియట్’కు సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నారనే వార్తలు వినిపించినా అదీ ఫైనల్ కాలేదు. లేట్ అయినా లేటెస్ట్గా ఓ మంచి పవర్ఫుల్ కథతో రావాలనే ఆలోచనలో రవితేజ ఉన్నట్లు సమాచారం. అది ‘విక్రమార్కుడు’ సీక్వెల్ అవుతుందనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ సీక్వెల్‌కి రాజమౌళి దగ్గర చేస్తున్న సహాయ దర్శకుల్లో ఎవరో ఒకరు దర్శకత్వం వహిస్తారట. -
మరోసారి పోలీస్ గెటప్‌లో మాస్ మహరాజ్
మాస్ మహరాజ్ రవితేజ మేకప్ వేసుకొని నెలలు గడిపోతుంది. బెంగాళ్ టైగర్ సినిమాతో మంచి విజయం సాధించినా.. తరువాత సినిమా ఎంపికలో మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు ఈ మాస్ హీరో. మూడు ప్రాజెక్ట్‌లు ప్రారంభమైనట్టే అనిపించినా... అవి వెనక్కి వెళ్లిపోయాయి. తాజాగా మరో సినిమాను రవితేజ కన్ఫామ్ చేశాడన్న వార్త వినిపిస్తోంది. రేసుగుర్రం లాంటి సూపర్ హిట్ సినిమాకు స్క్రీన్‌ప్లే అందించిన విక్రమ్ సిరి దర్శకత్వంలో ఓ కమర్షియల్ ఎంటర్టైనర్ చేయనున్నాడు రవితేజ. ఈ సినిమాలో తనకు బాగా కలిసొచ్చిన పోలీస్ పాత్రలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే విక్రమార్కుడు, పవర్ సినిమాల్లో పోలీస్ గెటప్‌లో అదరగొట్టిన రవితేజ, ఈ సినిమాలో డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ తో అలరించనున్నాడట. -
శాంభవి ఐపీఎస్ సీన్ ను కాపీ కొట్టలేదు: రాజమౌళి
శాంభవి ఐపీఎస్ చిత్రంలోని ఓ సీన్ ను విక్రమార్కుడు సినిమా కోసం కాపీ కొట్టలేదని సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి వివరణ ఇచ్చారు. తాజాగా శాంభవి ఐపీఎస్ చిత్రంలోని ఓ సీన్ ను రాజమౌళి కాపీ చేశారంటూ వీడియో ఓ ఇంటర్నెట్ లో ముఖ్యంగా సోషల్ మీడియాలో హాల్ చల్ చేసింది. ఇంతకు ముందు నేను కొన్ని చిత్రాలు, నవల నుంచి కాపీ చేసాను. కాని శాంభవి ఐపీఎస్ చిత్రంలోని సీన్ ను కాపీ కొట్టలేదు. చాలా కాలం క్రితం మా నాన్న ఆ సీన్ ను రాశారు. శాంభవి ఐపీఎస్ చిత్రంలోకి ఆసీన్ ఎలా వచ్చిందో అర్ధం కావడం లేదు. ఆ వ్యవహారం గురించి శోధించడానికి నా వద్ద అంత సమయం లేదు. నా వివరణ కేవలం నన్నువిశ్వసించే వారికోసం మాత్రమే. ఓకవేళ నన్ను నమ్మకపోతే ..వారి ఇష్టం అంటూ రాజమౌళి తన వివరణను ఫేస్ బుక్, ట్విటర్ లో వివరణ ఇచ్చారు. విక్రమార్కుడు చిత్రంలో పోలీసులను విలన్ ఎగతాలి చేస్తాడు. ఆ సమయంలో భవనంపై నుంచి పడటంతో మెడలోని బెల్ట్ ఉరిపడటంతో విలన్ చనిపోతాడు. శాంభవి ఐపీఎస్ లో కూడా అలాంటి సీన్.. అదే మాదిరిగా ఉంటుంది. అయితే ఆ సీన్ మొత్తం సేమ్ టూ సేమ్ విక్రమార్కుడు పోలి ఉండటం, విక్రమార్కుడు కంటే శాంభవి ఏపీఎస్ ముందు రావడంతో అనేక సందేహాలు రేకేత్తాయి. (1)I’ve copied from other films/novels before, but not the bullets scene frm Vikramarkudu. That was written by my father long back. I don't know how that made its way into Sambhavi IPS. I neither have time nor interest to dig into it. This is for people who believe me. Those who like to believe otherwise, please feel free to do so.. — rajamouli ss (@ssrajamouli) August 28, 2014