శాంభవి ఐపీఎస్ సీన్ ను కాపీ కొట్టలేదు: రాజమౌళి
శాంభవి ఐపీఎస్ చిత్రంలోని ఓ సీన్ ను విక్రమార్కుడు సినిమా కోసం కాపీ కొట్టలేదని సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి వివరణ ఇచ్చారు. తాజాగా శాంభవి ఐపీఎస్ చిత్రంలోని ఓ సీన్ ను రాజమౌళి కాపీ చేశారంటూ వీడియో ఓ ఇంటర్నెట్ లో ముఖ్యంగా సోషల్ మీడియాలో హాల్ చల్ చేసింది.
ఇంతకు ముందు నేను కొన్ని చిత్రాలు, నవల నుంచి కాపీ చేసాను. కాని శాంభవి ఐపీఎస్ చిత్రంలోని సీన్ ను కాపీ కొట్టలేదు. చాలా కాలం క్రితం మా నాన్న ఆ సీన్ ను రాశారు. శాంభవి ఐపీఎస్ చిత్రంలోకి ఆసీన్ ఎలా వచ్చిందో అర్ధం కావడం లేదు. ఆ వ్యవహారం గురించి శోధించడానికి నా వద్ద అంత సమయం లేదు. నా వివరణ కేవలం నన్నువిశ్వసించే వారికోసం మాత్రమే. ఓకవేళ నన్ను నమ్మకపోతే ..వారి ఇష్టం అంటూ రాజమౌళి తన వివరణను ఫేస్ బుక్, ట్విటర్ లో వివరణ ఇచ్చారు.
విక్రమార్కుడు చిత్రంలో పోలీసులను విలన్ ఎగతాలి చేస్తాడు. ఆ సమయంలో భవనంపై నుంచి పడటంతో మెడలోని బెల్ట్ ఉరిపడటంతో విలన్ చనిపోతాడు. శాంభవి ఐపీఎస్ లో కూడా అలాంటి సీన్.. అదే మాదిరిగా ఉంటుంది. అయితే ఆ సీన్ మొత్తం సేమ్ టూ సేమ్ విక్రమార్కుడు పోలి ఉండటం, విక్రమార్కుడు కంటే శాంభవి ఏపీఎస్ ముందు రావడంతో అనేక సందేహాలు రేకేత్తాయి.