Copy
-
‘విజయ్ పార్టీది.. కాపీ, కాక్టెయిల్ భావజాలం’
చెన్నై: తమిళనాడు స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. ఇప్పటికే తమిళగ వెట్రి కళగం(టీవీకే) పేరుతో పార్టీని స్థాపించారు. ఆయన పార్టీ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవనుంది. ఈ సందర్భంగా ఆదివారం విల్లుపురంలో నిర్వహించిన సభలో.. టీవీకే పార్టీ సిద్ధాంతాలు, భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. ఈ భారీ బహిరంగ సభకు లక్షల సంఖ్యలో విజయ్ అభిమానులు హాజరైన విషయం తెలిసిందే.అయితే.. తాజాగా రాజకీయాల్లో విజయ్ చెప్పిన భావజాలాన్ని డీఎంకే పార్టీ కొట్టిపారేసింది. ఆయన పార్టీ సిద్ధాంతాలపై అధికార డీఎంకే పార్టీ నేత విమర్శలు గుప్పించారు. విజయ్ తన పార్టీ సిద్ధాంతాలు, భావజాలాన్ని ఇతర పార్టీల నుంచి కాపీ కొట్టారని డీఎంకే నేత టీకేఎస్ ఇలంగోవన్ అన్నారు. విజయ్ పార్టీ సిద్ధాంతాలు, భావజాలం.. ప్రధాన ప్రతిపక్షమైన ఏఐఏడీఎంకే, ఇతర పార్టీల ప్రస్తుత రాజకీయ దృక్కోణాల ‘కాక్టెయిల్’ అని ఎద్దేవా చేశారు. ‘‘అవన్నీ మా విధానాలు, కానీ విజయ వాటిని కాపీ చేశాడు. ఆయన ఏది చెప్పినా.. అది మేం ఇప్పటికే చెప్పాం, ఇప్పటికీ మేం వాటిని అనుసరిస్తున్నాం’’అని అన్నారు.ఇక.. నిన్న( ఆదివారం) విజయ్ తన తొలి బహిరంగ సభ ప్రసంగంలో అధికార డీఎంకే పార్టీ లక్ష్యంగా విమర్శలు చేశారు. ద్రవిడియన్ మోడల్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అదేవిధంగా ద్రవిడ, తమిళ జాతీయవాద సిద్ధాంతాలను తమ పార్టీ అనుసరిస్తామని తెలిపారు. తమిళనాడు గడ్డకు అవీ రెండు కళ్ల లాంటివన్నారు. లౌకిక, సామాజిక న్యాయ సిద్ధాంతాలే మా పార్టీ భావజాలమని ఆయన స్పష్టం చేశారు. పెరియార్ ఈవీ రామస్వామి, కె.కామరాజ్, బాబాసాహెబ్ అంబేడ్కర్, వేలు నాచియార్, అంజలి అమ్మాళ్ ఆశయాలతో పార్టీని ముందుకు తీసుకెళ్తామని విజయ్ వెల్లడించారు. నాకు రాజకీయ అనుభవం లేకపోయినా భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తొలి సభలోనే డీఎంకే, బీజేపీపై విమర్శలు గుప్పించారు. -
లపతా లేడీస్ అచ్చం నా సినిమాలా ఉంది: డైరెక్టర్ తీవ్ర ఆరోపణలు
అమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వంలో వచ్చిన చిత్రం లపతా లేడీస్. థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మంచి టాక్ రావడంతో ఓటీటీలో దుమ్ములేపుతోంది. ఇటీవలే యానిమల్ చిత్రాన్ని దాటేసి అత్యధిక వ్యూయర్షిప్ను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు అమిర్ ఖాన్ కూడా నిర్మాతగా ఉన్నారు. అయితే సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోన్న ఈ సినిమాపై ప్రముఖ డైరెక్టర్, జాతీయ అవార్డ్ గ్రహీత అనంత్ మహదేవన్ చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. ఈ సినిమాలో సీన్స్ అచ్చం గున్గట్ కే పట్ ఖోల్ లాగే ఉన్నాయని అన్నారు.తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనంత్ మహదేవన్ మాట్లాడుతూ.. 'లపతా లేడీస్ చూశా.. ప్రారంభం నుంచి సినిమాలో చాలా సీన్స్ ఓకేలా ఉన్నాయి. మా సినిమాలో సిటీకి చెందిన ఓ అబ్బాయి పెళ్లి చేసుకోవడానికి గ్రామానికి వెళ్తాడు. ఘున్‌ఘట్ రైల్వే స్టేషన్లో వధువును బెంచ్‌పై వేచి ఉండమని చెప్పి బయటికి వెళ్తాడు. ఆ తర్వాత తిరిగి వచ్చి మరో వధువుతో చేరతాడు. ఆ మహిళ ఘున్ఘట్లో ఉన్నందున పోలీసులు ఆమె ఫోటోను చూసే సన్నివేశం నా సినిమాలో ఉంది. ఇందులో పోలీసు పాత్రలో మరొకరు ఉన్నారు అంతే. మిగిలినదంతా సేమ్ టూ సే మ్. అంతే కాకుండా రైల్వే స్టేషన్లో వధువు ముసుగుతో కప్పి ఉన్న సీన్ అంతా మా సినిమాలాగే ఉంది.' అని అన్నారు. కొన్ని నెలల క్రితం వరకు యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్న ఘున్‌ఘట్ కే పట్ ఖోల్ చిత్రం ఇప్పుడు లేదన్నారు.స్పందించిన రైటర్లపతా లేడీస్ కథ రాసిన బిప్లబ్ గోస్వామి ఈ విషయంపై స్పందించారు. నేను దశాబ్దం క్రితమే ఈ కథ రాశానని తెలిపారు. నా కథ, స్క్రిప్ట్, డైలాగ్స్, క్యారెక్టరజేషన్, సీన్స్ అన్నీ వంద శాతం ఒరిజినల్‌గా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కథను ఎక్కడి నుంచి స్ఫూర్తి పొందలేదని అన్నారు. అంతేకాకుండా అనంత్ మహదేవన్ జీ సినిమాని చూడలేదని వెల్లడించారు. ఈ చిత్రాన్ని 2001లో జరిగిన లపాతా లేడీస్ రైలు ప్రయాణంలో విడిపోయే ఇద్దరు యువ వధువుల కథ ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, కిండ్లింగ్ పిక్చర్స్, జియో స్టూడియోస్ బ్యానర్‌పై అమీర్ ఖాన్, కిరణ్ రావు, జ్యోతి దేశ్ పాండే నిర్మించారు. ఈ చిత్రం మార్చి 1న థియేటర్లలో విడుదలైంది. ఆ తర్వాత నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ అవుతోంది. -
సందీప్ రెడ్డి యానిమల్.. ఆ సీన్ కూడా కాపీనేనా?
రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన చిత్రం ‘యానిమల్’. డిసెంబర్ 1న రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఘన విజయాన్ని అందుకుంది. ఈ మూవీపై మొదట చాలామంది విమర్శలొచ్చాయి. అయితే విమర్శలతో పాటు ప్రశంసలు కూడా అదేస్థాయిలో వచ్చాయి. అయితే ఈ చిత్రంలో ఫైట్ సీన్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. (ఇది చదవండి: 'యానిమల్' సినిమా చూసి నా కూతురు ఏడ్చేసింది.. కాంగ్రెస్ ఎంపీ ఫైర్) అయితే తాజాగా బాబీ డియోల్, రణ్‌బీర్ కపూర్ క్లైమాక్స్ ఫైట్ సీన్‌పై కాపీ విమర్శలు వైరలవుతున్నాయి. 2001లో వచ్చిన ఆషిక్ మూవీలోని సీన్‌ను కాపీ కొట్టారంటూ నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఆషిక్ మూవీ వీడియోను షేర్ చేసిన ఓ నెటిజన్ ఫన్నీ కామెంట్ చేశాడు. నేను పొరపాటున రాంగ్ యానిమల్ మూవీ సీన్ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. అయితే ఆషిక్ చిత్రంలో బాబీ డియోల్ హీరోగా నటించారు. అయితే గతంలోనూ యానిమల్‌పై కాపీ ఆరోపణలు వచ్చాయి. యానిమల్ ట్రైలర్‌ను విడుదలైన వెంటనే హువా మైన్ పాటలో రష్మిక, రణబీర్ ఫ్లైట్ సీన్‌ను 50 షేడ్స్ ఆఫ్ గ్రే చిత్రం కాపీ కొట్టారంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. అంతే కాకుండా మరో ఫైట్ సీక్వెన్స్ కొరియన్ చిత్రం నుండి కాపీ చేశారంటూ విమర్శించిన సంగతి తెలిసిందే. ఎన్ని విమర్శలు ఎదురైనా ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకు పైగా బాక్సాఫీస్ వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో అనిల్ కపూర్, త్రిప్తి డిమ్రీ, శక్తి కపూర్, సురేష్ ఒబెరాయ్, ప్రేమ్ చోప్రా బాలీవుడ్ తారలు నటించారు. #Animal#AnimalReview #AnimalMovie #RanbirKapoor𓃵 #SandeepReddyVanga Ranbir and Bobby Fight Scene Glimpse 🔥🔥🔥🔥 pic.twitter.com/ylMpVhIZov — ASHISH kushwaha (@ASHISHk18033956) December 2, 2023 -
కాపీ కొట్టింది.. కాంగ్రెస్, బీజేపీలే!
సిరిసిల్ల: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలే సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను కాపీ కొట్టాయని మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు చెప్పారు. కాంగ్రెస్ కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలనే కొనసాగింపుగా మేనిఫెస్టోలో పెట్టిందని, నఖల్ కొట్టేందుకు కూడా వాళ్లకు అఖల్ లేదన్నారు. బీఆర్ఎస్కు మేనిఫెస్టో అంటే.. ఖురాన్, బైబిల్, భగవద్గీత లాంటివన్నారు. హామీ ఇచ్చిన వాటిలో 90% పూర్తి చేసినట్లు స్పష్టం చేశారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ కార్యాలయ భవనాన్ని ఆయన పార్టీ సెక్రెటరీ జనరల్ కె.కేశవరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ మేనిఫెస్టో చూశాక కాంగ్రెస్, బీజేపీ నాయకులు దుప్పటి కప్పుకున్నారని ఎద్దేవా చేశారు. గతంలోనూ కాంగ్రెస్ రూ.2 లక్షల రుణమాఫీ ప్రకటించినా ప్రజలు నమ్మలేదని, సీఎం కేసీఆర్‌ను తిడితే ఓట్లు రావని పేర్కొన్నారు. ఆయ న కంటే ఎక్కువగా, మరింత చిత్తశుద్ధితో తెలంగాణను ప్రేమిస్తేనే ఓట్లు వస్తాయని హితవు పలికారు. సిలిండర్‌ను, ప్రధాని మోదీని తలచుకుని బీజేపీ అభ్యర్థుల డిపాజిట్ గల్లంతు చేయాలని కోరారు. బీమా పథకం ఎంతో తృప్తినిచ్చింది రాష్ట్రంలో రైతుల రుణమాఫీ త్వరలోనే పూర్తవుతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రూ.20 వేల కోట్లు రుణమాఫీకి అవసరం ఉండగా.. ఇప్పటికే రూ.13,300 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయని, మిగతా రూ.6,700 కోట్లు త్వరలోనే మాఫీ అవుతాయన్నారు. మహారాష్ట్ర నేతలు మన ఫలితాల కోసం ఆసక్తిగా చూస్తున్నారన్నారు. బీఆర్ఎస్కు భారీ మెజార్టీ వస్తే.. చాలామంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. మేనిఫెస్టోలో ప్రకటించిన కేసీఆర్ బీమా పథకం ఎంతో తృప్తినిచ్చిందని, తెల్లకార్డుదారులైన 93 లక్షల కుటుంబాలకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి ఎల్ఐసీ ద్వారా బీమా కల్పిస్తుందని తెలిపారు. భవిష్యత్‌లో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ బీఆర్ఎస్ కార్యాలయాలను నిర్మిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. మేనిఫెస్టోపై చర్చ జరగాలి: కేశవరావు మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, చర్చ జరిగేలా చూడాలని బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు చెప్పారు. సీఎం కేసీఆర్ అంకితభావంతో చిత్తశుద్ధితో పనిచేస్తారన్నారు. ఈ సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ ఎల్.రమణ, జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
పక్క పార్టీల పథకాలు కాపీ కొడుతున్న చంద్రబాబు..!
-
'కాపీ పేస్ట్ సీఎం' అంటూ సెటైర్లు..హుందాగా బదులిచ్చిన హిమంత శర్మ
అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా శర్మని ట్రోల్ చేస్తూ ఓ వీడియ్ నెట్టింట్ హల్ చల్ చేస్తోంది. దీంతో ఆయన దానికి స్పందించి..హుందాగా బదులిచ్చారు. అసలేం జరిగిందంటే..అస్సాం ముఖ్యమంత్రి బిస్వా శర్మ ఒక రోజు ప్రభుత్వ స్కూల్‌ని సందర్శించారు. అక్కడ విజిటర్స్ బుక్‌లో రాయడానికి ఆయన.. వేరొక పుస్తకంలో చూసి రాస్తూ కనిపించారు. దీంతో రోషన్ శర్మ అనే వ్యక్తి అందుకు సంబంధించిన వీడియో తోపాటు.. కాపీ చేయకుండా విజటర్స్ బుక్‌లో ఒక్క పేరా కూడా రాయలేని అస్సాం సీఎం అనే క్యాప్షన్ జోడించి మరీ పోస్ట్ చేశారు. ఈ విషయం నెట్టింట వైరల్ కావడంతో సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై గంటల వ్యవధిలోనే స్పందించిన ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా శర్మ తనకు ఇంగ్లీష్, హిందీ భాషలు సరిగా రావని, దాన్ని అంగీకరించేందుకు తనకు ఎలాంటి సంకోచం లేదన్నారు. పైగా తాను ఆ భాషాలను నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నానని ట్వీట్ చేశారు. దీనికి రాయ్ బదులిస్తూ..అస్సామీ ఒక అందమైన భాష, సందర్శకుల పుస్తకంలో అస్సామీ భాషలో రాసి ఉంటే మరింత మెరుగ్గా కనిపించేది. ఇక్కడ భాష కాదు సమస్య . అతను వచనాన్ని కాపీ చేయడం గురించి మాత్రమే విమర్శించాను. అయినా విజిటర్స్ బుక్‌లో హిందీ లేదా ఇంగ్లీష్‌లోనే రాయాలని రూల్ లేదు . కాపీ చేయడం అనేది మీ స్థాయి నాయకుడికి తగదు. నాయకుడు తన విభిన్నమైన ఉన్నతాశయ ఆలోచనలతో అందరికీ ఆదర్శంగా ఉండేలా కానీ ఇలా కాపీ చేయకూడదూ అని సూచిస్తూ ట్వీట్ చేశాడు. Presenting the CM of Assam who can't even write a paragraph in a visitor's book without copying 🤣🤣🤣 pic.twitter.com/MHvoRAGDH1 — Roshan Rai (@RoshanKrRaii) April 4, 2023 (చదవండి: ప్రధాని డిగ్రీని చూసే ప్రజలు ఓటేశారా? ఎన్సీపీ నేత ఫైర్) -
తెలంగాణ పథకాలను కాపీ కొడుతున్న కేంద్రం: హరీశ్
సాక్షి, సిద్దిపేట: ఎంతమంది ముఖ్య మంత్రులు, ప్రధాన మంత్రులు మారినా ప్రజల కనీస అవసరాలు తీర్చలేకపోయారని, కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయ కత్వంలోనే తెలంగాణా శరవేగంగా అభివృద్ధి చెందిందని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. కేవలం మూడున్నరేళ్లలో మిషన్‌భగీరథ పథకం కింద తెలంగాణలో ఇంటింటికీ తాగునీరు అందించారని ఇదే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ‘హర్ ఘర్ కో జల్‘, మిషన్‌కాకతీయ తరహాలో అమృత్ సరోవర్ పేరిట కాపీ కొట్టిందన్నారు. ఇదొక్కటే కాదనీ, ఇలా చాలా సంక్షేమ పథకాలను కేంద్రం కాపీ కొడుతోందన్నారు. సోమవారం సిద్దిపేటలో పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో 26 శాతం నిరుద్యోగత ఉందన్నారు. బీజేపీ ఏటా లక్ష ఉద్యోగాలు ఇస్తా మని చెప్పి భర్తీ చేయకపోవడంతో ఇప్పటికే 16 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని, పైగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ఇష్టారాజ్యంగా కేంద్రం ప్రైవేట్ పరం చేస్తోందన్నారు. రానున్న రోజుల్లో ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా రజకులకు పెద్ద ఎత్తున రుణాలు, స్వయం ఉపాధి యూనిట్లు మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు. సిద్దిపేట పట్టణంలోని వేములవాడ కమాన్‌వద్ద ఉన్న మైదానంలో నవంబర్ 19 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు శ్రీశ్రీశ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామి వారి పర్యవేక్షణలో ఆయుత చండీ అతిరుద్ర యాగం జరగనుంది. ఈ నేపథ్యంలో స్వరూపానంద స్వామి సిద్దిపేటకు వచ్చి మైదానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా స్వామి వారిని మంత్రి హరీశ్‌రావు కలిసి ఆశీస్సులు తీసుకు న్నారు. ఎగ్జిబిషన్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో శ్రీరంగనాయక స్వామి కాలేజ్ ఆప్ బీఫార్మసీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. చదవండి: నగరంపై ‘కారు’ మబ్బులు! -
బ్యాంక్ లావాదేవీల సాఫ్ట్ కాపీని ఈడీకి సమర్పించిన చికోటి ప్రవీణ్
-
నెట్టింట హాట్ టాపిక్‌గా అఖిల్ లుక్.. అక్కడి నుంచి కాపీ కొట్టారా ?
Akhil Agent Looks Have Copy Allegations: అఖిల్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 12న విడుదల కానుంది. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం కులు మనాలీలో జరుగుతోంది. హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్‌ను ఈ షెడ్యూల్లో చిత్రీకరిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు అఖిల్. మంచు పర్వతాల్లో మొహం నిండా గాయాలతో ఉన్న ఫొటోలు ఆసక్తికరంగా ఉన్నాయి. వాటిని చూస్తుంటే భారీ యాక్షన్ సీన్లు తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఈ లుక్ కాపీ కొట్టారని చర్చ నడుస్తోంది. బ్యాక్‌గ్రౌండ్‌లో పర్వతాలు, గిరజాల జుట్టు, పోనీటైల్‌తో స్టైలిష్‌గా ఉన్న అఖిల్ 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' టీవీ సిరీస్‌లోని హీరో జాన్ స్నో (కిట్ హరింగ్టన్)ను గుర్తు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ సిరీస్‌లో తరహాలోనే 'ఏజెంట్' మూవీలో అఖిల్ యాక్షన్ సీక్వెన్స్‌తో ఊల్ కోట్ ధరించి కనిపిస్తున్నాడు. చిన్నపాటి మార్పు తప్ప ఇద్దరి గెటప్పులో పెద్ద చేంజ్ లేదని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. అయితే 'ఏజెంట్' చిత్రం హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ సిరీస్ 'బోర్న్' ఆధారంగా తెరకెక్కనుంది. ఈ క్రమంలో మరో హాలీవుడ్ సిరీస్‌లోని హీరోను కాపీ కొట్టడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరీ ఇది కోఇన్స్డెంట్గా జరిగిందా, లేక కావాలని చేసిందా తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే కండలు పెంచిన అఖిల్‌కు కొంచెం కిట్ హరింగ్టన్ పోలికలు ఉన్నాయని ఇటీవల సోషల్ మీడియాలో టాక్ నడిచింది. చదవండి: ఇంటర్వ్యూలో యాంకర్ గొడవ.. ఏడ్చేసిన కృతి శెట్టి View this post on Instagram A post shared by Akhil Akkineni (@akkineniakhil) -
రెస్టారెంట్‌కు వెళ్లిన గీతకు షాకిచ్చిన వెయిటర్.. ఏకంగా..
How To Secure Digital Payment Transactions Safe Expert Suggestions: ఫ్రెండ్స్‌కి పార్టీ ఇవ్వడానికి గీత (పేరు మార్చడమైనది) తన స్నేహితులతో రెస్టారెంట్‌కి వెళ్లింది. ఆర్డర్ ఇచ్చినవన్నీ టేబుల్ మీద అందంగా అమర్చారు అక్కడి వెయిటర్లు. అందరూ కబుర్లు చెప్పుకుంటూ అక్కడి పదార్థాలను ఆస్వాదించారు. ఇక చివర్లో వెయిటర్ బిల్ తెచ్చి టేబుల్ మీద పెట్టాడు. అది చూసిన గీత తన బ్యాగ్‌లో నుంచి క్రెడిట్ కార్డు తీసి, బిల్ ఉన్న బుక్‌లో పెట్టి వెయిటర్ని పిలిచి, పిన్ నెంబర్ కూడా చెప్పి, స్వైప్ చేసి తీసుకురమ్మంది. వెయిటర్ బిల్ పే చేసి, ఆమె కార్డును ఆమెకు తిరిగి ఇచ్చేశాడు. పది రోజులు గడిచాయి. తన క్రెడిట్ కార్డు నుంచి అరవై వేల రూపాయలు డెబిట్ అయినట్టుగా మెసేజ్ వచ్చింది. షాక్ అయ్యింది గీత. తను ఎక్కడ ట్రాన్సాక్షన్స్ చేసిందో కూడా అర్థం కాలేదు. వేరే రాష్ట్రంలో తను షాపింగ్ చేసినట్టుగా మెసేజ్ వచ్చింది. బ్యాంక్ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేస్తే షాపింగ్ ఏ ప్రాంతంలో జరిగిందో చెప్పారు. మోసం జరిగిందనుకుంటే వెంటనే కార్డు బ్లాక్ చేసుకోమని, మరో కార్డుకు అప్లై చేయమని సూచించారు. క్రెడిట్ కార్డు తన వద్దే ఉంటే అసలు మోసం ఎలా జరిగిందో, ఎక్కడ జరిగిందో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు గీతకు. ∙∙ నగదును మన వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా డిజిటల్ మార్కెట్లోకి వచ్చేశాం. లావాదేవీలన్నీ చాలావరకు డిజిటల్ మార్గంలోనే జరుగుతున్నాయి. ఫలితంగా మోసగాళ్లు డిజిటల్ నుంచే పుట్టుకు వస్తున్నారు. ఏ విధంగా మన వద్ద ఉన్న మొత్తాన్ని రాబట్టాలో రకరకాల మార్గాల ద్వారా వ్యూహాలను పన్నుతున్నారు. గీతకు మోసం ఎక్కడ జరిగిందంటే.. రెస్టారెంట్ లో వెయిటర్‌కు బిల్ పే చేయమని కార్డు, పిన్ నెంబర్ ఇచ్చేసింది. దీంతో ఆ వెయిటర్ రెస్టారెంట్ స్వైప్ మిషన్ కన్నా ముందు అరచేతిలో పట్టేంత ఉన్న తన మరో మిషన్‌లో స్వైప్ చేశాడు. దీంతో కార్డులో ఉన్న చిప్ ద్వారా ఆ డేటా అతని మిషన్‌లోకి చేరింది. అటు తర్వాత రెస్టారెంట్ బిల్ పే చేసి, తిరిగి ఆ కార్డును ఆమెకు ఇచ్చేశాడు. ఆ వెయిటర్ అలా డేటా సేకరించడానికి మోసగాళ్లు అతనితో ముందుగానే ‘డీల్’ కుదుర్చుకున్నారు. దీంతో గీత కార్డు వివరాలన్నీ మోసగాళ్ల చేతిలోకి వెళ్లిపోయాయి. పది రోజుల తర్వాత గీత కార్డు బిల్ మొత్తం కట్టేశాక, క్రెడిట్ బ్యాలన్స్ ఎక్కువ మొత్తంలో ఉందని గ్రహించిన మోసగాళ్లు అంత మొత్తాన్ని ఆమె కార్డు ద్వారా దొంగిలించేశారు. ∙∙ కార్డ్ స్కిమ్, కాపీ, క్లోన్... డేటా ద్వారా కొత్త కార్డులను తయారు చేసే ముఠాలు తయారవుతున్నాయి. ఎక్కువగా రొమేనియన్స్ చేసే ఈ మోసాలు ఇప్పుడు ఇతరులూ చేస్తున్నారు. డార్క్ వెబ్‌లో స్కిమ్మర్, బ్లాక్ కార్డ్ మేకర్స్ కూడా లభించడం, అచ్చం క్రెడిట్/ డెబిట్ కార్డులను పోలి ఉన్నవి తయారుచే సుకోవడం కూడా మోసం చేయడానికి రాచమార్గం. కార్డుల ద్వారా జరిగే మోసాలను అరికట్టాలంటే... ► మీ కార్డుల వివరాలకు ఎట్టి పరిస్థితులో మీరే రక్షకులు. ► కార్డు ద్వారా లావాదేవీలు జరుపుతున్నప్పుడు మీ దృష్టి మరల్చకూడదు ► స్వైప్ మిషన్ ద్వారా మీ కార్డు నుంచి డెబిట్ చేశాక, ఎంత మొత్తం డెబిట్ చేశారో రిటైలర్ ను అడగండి. ► కొత్త కార్డులు వచ్చిన వెంటనే, ఆ కార్డుపైన సంతకం చేయాల్సిన చోట తప్పనిసరిగా సంతకం చేయండి. ► బిల్లు చెల్లించి, రశీదు తీసుకున్నాక ఒకసారి ఆన్లైన్ స్టేట్మెంట్లో సరిచూసుకోవాలి. ► కార్డు లావాదేవీల ద్వారా పొందిన రశీదులను, మీ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన సమాచారాన్ని జాగ్రత్తపరచుకోవడాన్ని విస్మరించకూడదు. ► మీ కార్డులను బహిరంగ ప్రదేశాల్లో ఉంచకూడదు. నగదు, మనీ పర్సుల్లానే జాగ్రత్త పరుచుకోవాలి. ► కార్డు మీద పిన్ నెంబర్ రాయకూడదు. అలాగే పిన్ నెంబర్ ఎవరికీ చెప్పకూడదు. ► ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరుపుతున్నప్పుడు మీరు ఉపయోగించే సిస్టమ్ యాంటీవైరస్ ఆపరేటింగ్ సాఫ్ట్వేర్ ఉన్నదేనా అనే విషయాన్ని నిర్ధారించుకోండి. ► ఇంటర్నెట్ ద్వారా నమ్మకమైన సైట్స్ ద్వారా మాత్రమే కొనుగోళ్లు మాత్రమే చేయండి. అందుకు భద్రతా నియమాలు పాటించండి. ► ఎక్స్పైరీ డేట్ అయిపోయాక వాటి స్థానంలోకి రీప్లేస్మెంట్ కార్డ్స్ వస్తాయి. ఇలాంటప్పుడు పాత కార్డులను అలాగే పడేయకుండా వాటిలో ఉన్న మాగ్నెటిక్ చిప్‌ను తొలగించాలి. అలాగే ఉపయోగంలో లేని కార్డులను బ్లాక్ చేయాలి. ► లావాదేవీలు జరిపిన తర్వాత పిన్నెంబర్ను మార్చుకోవడం మంచిది. రివార్డ్ పాయింట్స్ రిడెమ్షన్ గురించి అయినా, కార్డు సమాచారం గురించైనా వచ్చే ఫోన్‌కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. అవతలి వ్యక్తులకు సివివి/ఓటీపీ/క్యూ ఆర్ కోడ్ వంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదు. బ్యాంకుకు సంబంధించిన ఏ వ్యక్తులు కూడా ఈ గోప్యతా వివరాలను అడగరు. కాబట్టి, గోప్యతా వివరాల పట్ల జాగ్రత్త అవసరం. కార్డు ద్వారా చేసే పేమెంట్ (పిఒఎస్) కార్డు స్కిమ్మింగ్ (మీ వివరాలను కార్డు నుంచి రాబట్టే పరికరం) ఎక్కువగా రిటెయిల్ ఔట్లెట్స్, బార్లు, రెస్టారెంట్లు, పార్కింగ్ టికెట్ మెషిన్స్, పెట్రోల్ స్టేషన్లలో జరిగే అవకాశాలు ఎక్కువ. ► కార్డు ద్వారా నగదు బదిలీ చేసే సమయంలో మీ దృష్టి మరల్చకూడదు ► స్వైప్ చేసేటప్పుడు మీ కార్డు మీకు కనిపించాలనే విషయం స్పష్టంగా చెప్పండి. క్రెడిట్/డెబిట్ కార్డుల ద్వారా మోసాలు ఎలా జరుగుతాయంటే..? ► మోసగాళ్ల దగ్గర స్టోర్ కార్డ్ రీడర్ మిషన్, దొంగ కార్డు మిషన్ రెండూ ఉంటాయి. ∙మీరు కార్డు ఇవ్వగానే కార్డు స్కిమ్మర్ చేసి, డేటా దొంగిలిస్తారు ∙ఎటిఎమ్ మిషన్లలో అయితే.. కీ బోర్డ్ ప్లేస్‌లో మోసగాళ్లు మరో కీ బోర్డ్‌ను ఇన్స్టాల్ చేస్తారు. ∙స్వైపింగ్ మిషన్‌కు సూక్ష్మమైన కెమెరాను సెట్ చేస్తారు. ఎటిఎమ్‌లలో కార్డును ఉపయోగిస్తుంటే.. ► కార్డును ఉపయోగిస్తున్నప్పుడు మీ చుట్టుపక్కల ఉన్నవారి నుంచి జాగ్రత్త. ► మీ పిన్ నెంబర్ మీ నగదుకు కవచం అనే విషయం మర్చిపోవద్దు ► కార్డు పనిచేయనప్పుడు, మిషన్‌లో ఉండిపోయినప్పుడు వెంటనే బ్యాంక్‌కు తెలియజేయాలి ► ట్యాంపరింగ్ సంకేతాలు ఏమైనా కనిపిస్తే ఎటిఎమ్ కార్డును ఉపయోగించవద్దు. అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ చదవండి: Most Famous Afghanistan Refugee: అప్పుడూ ఇప్పుడూ.. ఆమే!.. పాపం మరోసారి -
ఆర్ఆర్ఆర్: రాజమౌళి కాపీ కొట్టారట!
సోషల్ మీడియా వచ్చాక సినిమా పబ్లిసిటీకి పెద్దగా కష్టపడాల్సిన పని లేకుండా పోయింది. కానీ సినిమా టైటిల్ నుంచి, పోస్టర్ లుక్ వరకు ఏమాత్రం తేడా వచ్చినా నెటిజన్లు దాన్ని ఇట్టే పసిగట్టి టాంటాం చేస్తుంటారు. తాజాగా దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్(రౌధ్రం రణం రుధిరం) సినిమా పోస్టర్ కూడా నెట్టింట తెగ రౌండ్లు కొడుతోంది. ఈ పోస్టర్లో హీరోలు రామ్‌చరణ్ గుర్రపు స్వారీ, జూనియర్ ఎన్టీఆర్ బైక్ రైడింగ్ అభిమానులను విశేషంగా ఆకర్షిస్తోంది. అదే సమయంలో ఈ పోస్టర్ ఎక్కడో చూసినట్టుందేనని కొందరు అభిమానులు తలలు గోక్కున్నారు. చివరకు దొరికేసిందోచ్ అంటూ 2007లో రిలీజైన ఘోస్ట్ రైడర్ పోస్టర్‌ను ఇప్పటి ఆర్ఆర్ఆర్ పోస్టర్‌తో పోలుస్తున్నారు. అందులో ఓ ఘోస్ట్ రైడర్ గుర్రం స్వారీ చేస్తుండగా మరొకరు బైక్ రైడింగ్ చేస్తున్నారు. ఇందులో మండుతున్న నిప్పు ప్రత్యేక ఆకర్షణ. అచ్చంగా అలాంటి కాన్సెప్టే ఆర్ఆర్ఆర్ పోస్టర్లో ఉండటంతో రాజమౌళి మళ్లీ కాపీ కొట్టారంటూ కొందరు నెటిజన్లు బాహాటంగానే విమర్శిస్తున్నారు. మరికొందరు మాత్రం కేవలం ఘోస్ట్ రైడర్ పోస్టర్‌ను స్ఫూర్తిగా తీసుకున్నారంటూ వెనకేసుకొస్తున్నారు. (చదవండి: తాండవ్ వివాదం.. నాలుక కోస్తే రూ. కోటి రివార్డు) it's Okay @ssrajamouli#GhostRider #RRR pic.twitter.com/ud9m6IpbUC — 𝙺𝚛𝚒𝚜𝚑𝚗𝚊 🇮🇳🚲✌| A -ve🩸 (@KP_Vasireddy) January 25, 2021 ఇక గతంలోనూ రామరాజు ఫర్ భీమ్ అంటూ జూనియర్ ఎన్టీఆర్ వీడియో రిలీజ్ చేయగా అందులో చాలా సన్నిశాలు నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ నుంచి తీసుకున్నారు. అగ్నిపర్వతం బద్ధలవ్వడం సహా ప్రకృతికి సంబంధించిన క్లిప్పింగులను ఆ ఛానల్ నుంచి సేకరించి ట్రిపుల్ ఆర్కు వాడుకున్నారు. ఆ సమయంలో కూడా కొందరు జక్కన్న ఐడియాను మెచ్చుకోగా అతి కొద్ది మంది మాత్రం కాపీ కొట్టారంటూ చురకలంటించారు. కాగా ఈ సినిమాలో గోండుల వీరుడు కొమురం భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ నటిస్తున్నారు. బాలీవుడ్ నుంచి అలియా భట్ హాలీవుడ్ నుంచి ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రియ, అజయ్ దేవగన్, అలిసన్ డూడీ, సముద్రఖని ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ చిత్రం దసరా ప్రత్యేకంగా అక్టోబర్ 13న థియేటర్లలో విడుదల కానుంది. (చదవండి: ఆర్ఆర్ఆర్: ఆ అగ్నిపర్వతం ఆ ఛానల్‌లోదే..) Just two close enough😉😉 No comments🤐 RRR🔥🌊 & Ghost rider☠️🔥#RRRMovie #Master #Valimai️ #Suriya40 #SarkaruVaariPaata pic.twitter.com/2FoAMTZPxw — Film Media (@FilmMedia10) January 26, 2021 #RRRMovie #RRR Original 💥 Copy 😬 pic.twitter.com/uZcUa0RVNU — Er.SaraVanaN 🍻 (@Svn__Er) January 26, 2021 -
మరో కాపీ వివాదంలో థమన్..?!
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో మంచి ఫామ్‌లో ఉన్నారు సంగీత దర్శకుడు థమన్. అల వైకుంఠపురం హిట్‌తో దూసుకుపోతున్న తమన్ స్పీడ్‌కి క్రాక్ సినిమా బ్రేకులు వేసేలా కనిపిస్తుంది. రవితేజ హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి బల్లేగా దొరికావే బంగారం పాట రిలీజ్ అయ్యింది. సూపర్.. ఫెంటాస్టిక్ అంటూ రవితేజ ఫ్యాన్స్, తమన్ ఫ్యాన్స్ ఫుల్లు ఖుషి అవుతున్నారు. కానీ వారి ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. తమన్ ఈ ట్యూన్‌ని లాటిన్ చిత్రం నుంచి కాపీ చేశారంటూ నెటిజనులు ట్రోల్ చేస్తున్నారు. ఒరిజనల్ ‘సెల్వా ఎల్ నియాన్’ ట్యూన్‌ని కూడా షేర్ చేస్తున్నారు. ( థమన్ కాపీ కొట్టలేదు: వి దర్శకుడు ) ఇక బల్లే దొరికిపోయావ్ తమన్ అంటూ మీమ్స్ షేర్ చేస్తున్నారు నెటిజనులు. ఒక యూజర్ అయితే ‘‘థ్యాంక్స్ అన్న రెండు నెలలుగా కేవలం 47 మాత్రమే ఉన్న వ్యూస్ నీ వల్ల రాత్రికి రాత్రే 17కే అయ్యాయ్’’ అని కామెంట్ చేయగా.. మరి కొందరు ‘‘సాంగ్ లాటిన్.. కామెంట్స్ తెలుగు.. క్రెడిట్స్ తమన్.. ఎవరు గుర్తు పట్టరు అనుకున్నారు... కానీ దొరికిపోయారు.. ఈ వీడియో తప్పకుండా వైరల్ అవుతుంది’’ అంటూ నెటిజనులు తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇక మరి కొందరు థమన్ పరిస్థితిని కింగ్ సినిమాలో నాగార్జున-బ్రహ్మానందం మధ్య వచ్చే కామేడీ సీన్‌తో పొలుస్తున్నారు. ఇక గతంలో ‘వి’ సినిమా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో కూడా థమన్ కాపీ కొట్టాడనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. -
పోస్టర్ల మహాసముద్రం
కాపీ కొట్టేవాళ్లని ‘కాపీక్యాట్’ అంటారు. చైల్డ్ వర్డ్ అది. పెద్దవాళ్లు కాపీ కొడితే అది చైల్డిష్ కాదు. షేమ్‌లెస్! లేటెస్ట్గా ఓ పిల్లి పోస్టర్‌పై వివాదం మొదలైంది. కంగనా నటించిన ‘జడ్జ్‌మెంటల్ ౖహె క్యా’ చిత్రం పోస్టర్‌ను తన ఆర్ట్‌వర్క్ చూసి కాపీ కొట్టారని ఓ హంగేరియన్ ఆర్టిస్ట్ ఆరోపిస్తున్నారు. మనం ఎప్పటిలా మానేస్తాం.. కాపీ క్యాట్‌లా మ్యావ్ అనడం! ఎవరూ చూడ్డం లేదని పాలు తాగేశాక ఇలాగే కదా.. పిల్లి మ్యావ్ అంటూ వెళ్లిపోయేది! హాల్ లోపల వెండితెర, హాల్ బయట ‘వాల్’తెర.. రెండూ రెండు ప్రాణాలు సినిమాకు. లోపలిది చలన చిత్రం. వెలుపలిది నిశ్చలన చిత్రం. ఎంత చలన చిత్రం అయినా, హాల్ లోపలికి ప్రేక్షకుల్ని నడిపించేది మాత్రం బయట వాల్‌పై కనిపించే నిశ్చలన చిత్రమే. టీజర్లొచ్చి, యూట్యూబ్ ట్రైలర్లు వచ్చినా మైదా రాసి గోడకు అంటించే పోస్టర్‌కు ఉండే స్మెల్ వేరే దేనికీ రాలేదు. పోస్టర్ మేకింగ్ ఇప్పటికీ సినిమా తీసినంత పని. గోడపైన హీరోనో, హీరోయిన్నో లేదా ఇంకేదైనా సీన్నో చూడగానే గుండెకో, మైండ్కో పట్టేసేటట్లు ఉండాలి. తేలికేం కాదు. సినిమాలొచ్చిన కొత్తలో పోస్టర్ల డిజైనింగ్ ఇంత కష్టంగా ఉండకపోయేదేమో. సినిమాలు ఎక్కువయ్యాక పోస్టర్లు క్రియేట్ చెయ్యడానికి కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌లా పెద్ద టీమ్ సిద్ధమౌతోంది. మెప్పించి, రప్పించాలి కదా ఆడియన్స్‌ని థియేటర్లకు. తొలి చిత్రాల పోస్టర్లు 1932లో వచ్చిన ‘భక్త ప్రహ్లాద’ తెలుగులో తొలి టాకీ చిత్రం. పోస్టర్లే లేని ఆ కాలంలో పోస్టర్ చెయ్యడం అన్నది చంద్రయాన్ ప్రయోగమే. అయినా చేశారు. చెయ్యకపోతే సినిమా గురించి తెలిసేదెలా? అయితే అది పెద్ద సైజు పాంప్లెట్‌లా ఉంది తప్ప పోస్టర్లా లేదు. పాంప్లెటే పోస్టర్ అనుకోండి. ఆ పోస్టర్లు కూడా ప్రొడక్షన్ హౌస్ నుంచి కాక, థియేటర్ల వాళ్లు కొట్టించుకున్నవి. ‘భారత మూవీటోన్ అనబడుతున్న శ్రీ కృష్ణా ఫిల్ము కంపెనీ వారిచే అధిక వ్యయ ప్రయాసలకోర్చి తయారు చేయబడిన ‘భక్త ప్రహ్లాద’ 100 శాతం సంపూర్ణ తెలుగు టాకీ అని బెజవాడలోని అప్పటి ‘శ్రీ దుర్గా కళామందిరము’ పోస్టర్ కొట్టించింది. చుట్టూ సినిమా వివరాలు, ఆ వివరాల మధ్యలో భక్తప్రహ్లాదుడి మూవీ స్టిల్. ఇదీ ఆ పోస్టర్. నిర్మాణ సంస్థ మూవీటోన్ నేరుగా కొట్టించిన పోస్టర్ కూడా ఉంది. అది ఇంగ్లిష్‌లో ఉంటుంది. సిమెట్రికల్గా సినిమాలోని ఓ ఏడు సన్నివేశాలతో భక్తప్రహ్లాద పోస్టర్‌ను డిజైన్ చేసి సినిమా విశేషాలను ఇచ్చారు. చూడ్డానికి ఇప్పుడా సినిమా లేదు. పుణె ఆర్కైవ్స్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో కాలిపోయిన వాటిలో భక్తప్రహ్లాద ఫిల్మ్ రీళ్లు కూడా ఉన్నాయి. ఏవో రెండు స్టిల్స్, ఓ సినిమా పోస్టర్ మాత్రమే ప్రస్తుత జ్ఞాపకాలు. తొలి తెలుగు సినిమా కంటే కాస్త ముందు తొలి హిందీ సినిమా ‘ఆలం ఆరా’ తయారైంది. నిర్మాణం ఇంపీరియల్ మూవీటోన్. 1931లో విడుదలైంది. భక్త ప్రహ్లాద పోస్టర్లా నలుపు తెలుపులో కాక, ఆ సినిమా పోస్టర్ సింగిల్ కలర్లోనే రెండు షేడ్లుగా వచ్చింది. పోస్టర్ మీద ఒక అందమైన బంజారా యువతి గుండెలపై చేతులు వేసుకుని నిలబడి ఉంటుంది. కింద ఒక ప్రణయ సన్నివేశం ఉంటుంది. పైన ఓ మూల.. గుంపు పన్నివేశం ఉంటుంది. ‘ఆలం ఆరా’ అనే టైటిల్ ఉంటుంది. టైటిల్ కింద.. ఆల్ డ్యాన్సింగ్, సింగింగ్ అండ్ డాన్సింగ్ అని ఉంటుంది. పోస్టర్ అడుగున స్ట్రిప్ ఉంటుంది ‘ఇంపీరియల్ మూవీ–టోన్, బాంబే’ అని. ఈ సినిమా ఫిల్ములు కూడా కాలిపోయాయి. పోస్టర్ ఒక్కటే ప్రాణంతో ఉంది. మట్టిగోడలపై లీడ్ రోల్స్ రఫ్‌గా ఓ వందేళ్లుగా టాకీలు ఆడుతున్నాయి. వాటి మూకీ వెర్షన్లుగా వాల్ పోస్టర్లూ వందేళ్లుగా ప్రేక్షకుల్ని రంజింపజేస్తున్నాయి. మట్టి గోడకు సినిమా పోస్టర్ అంటించి ఉన్న గుడిసెలోని సినిమాటోగ్రఫీ.. వంద అడుగుల ఎత్తు ఫ్లెక్లీ ఉన్న ఐమాక్స్ థియేటర్ ప్రాంగణంలో ఉంటుందా! అందుకే సినిమాలు కాలగతిలో కలిసిపోతున్నా కూడా సినిమా పోస్టర్లు మనసు గదులకు అంటుకునే ఉంటున్నాయి. పోస్టర్‌లోని మంత్రముగ్ధత అది. ఎంతగానంటే ఇప్పటికీ ఒకర్ని చూసి ఒకరు ఇన్స్పైర్ అయి పోస్టర్లను కాపీ కొట్టేసుకునేంత! ఎక్కువ కాపీయింగ్ హాలీవుడ్లోంచి మిగతా వుడ్లలోకే. కాపీ కొట్టడం తప్పా ఒప్పా అన్నది పక్కన పెడితే ఎవరిది వాళ్లు కాపీ కొట్టుకోవడం ఎవరి పర్సులోంచి వాళ్లు దొంగతనం చేసినట్లుగా ఉంటుంది. ఈ ట్రెండు హాలీవుడ్లో బాగా ఉంది. వాళ్లది వాళ్లే పిక్ పాకెటింగ్ చేసేస్తుంటారు! బ్యాక్ టు బ్యాక్ ఇద్దరు ఆనుకుని నిల్చునే పోస్టర్లు, హీరోయిన్ కాళ్ల మధ్య నుంచి సీన్‌ని చూపించే పోస్టర్లు, ఒంటికన్ను పోస్టర్లు, లీడ్ రోల్ వెనక్కు తిరిగి ఉండే పోస్టర్లు, జంతువుల పోస్టర్లు, నేచర్ బ్లూ పోస్టర్లు హాలీవుడ్లో రిపీట్ అవుతూనే ఉంటాయి. ఇవేకాదు, బెడ్‌మీద కపుల్ పోస్టర్లు, ‘బ్లూ రన్ అండ్ టిల్ట్’ పోస్టర్లు, (మహేశ్‌బాబు ఒక సైడ్‌కి వాలి పరుగు తీస్తుంటాడు కదా.. అలా), వెనుక సముద్రం ఉండే ఓషన్ సిల్హౌటీ పోస్టర్లు, ఎర్రటి ఎరుపు డ్రెస్ వేసుకుని తెల్లటి కాళ్లు బయటపెట్టే యంగ్ లేడీ పోస్టర్లు హాలీవుడ్లో ఒకర్ని చూసి ఒకరు డిజైన్ చేస్తున్నవే. సెర్బియన్ బ్లాగర్ క్రిస్టోఫ్ కోర్టిస్కి ఇదంతా ఫన్నీగా కనిపిస్తుంది. ‘కాపీ అనలేం, ఇన్స్పిరేషన్ అనాలి’ అంటారు కోర్టిస్. ఆయన బ్లాగ్‌లో పెద్ద కాపీ కలెక్షనే ఉంది. పోస్టర్ల మహాసముద్రం హాలీవుడ్ నుంచి హాలీవుడ్‌లోకి ఇంత ‘క్రియేటివ్’గా డంపింగ్ జరుగుతున్నప్పుడు హాలీవుడ్ నుంచి నుంచి ఇతర వుడ్లలోకి పోస్టర్లు డంప్ అవడం తప్పుగా ఏం అనిపించదు కానీ, తప్పే అని అంటున్నారు ఫ్లోరా బార్సీ అనే ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్. ఇరవై ఆరేళ్ల ఈ హంగేరియన్ యువతి విజువల్ ఆర్ట్‌లో, ఫొటోగ్రఫీలో, ఫొటోషాప్‌లో, ఫొటో మానిపులేషన్లో నిపుణురాలు. గతవారం రిలీజ్ అయిన కంగనా రనౌత్ సినిమా ‘జడ్జిమెంటల్ హై క్యా’ పోస్టర్లను తన ఆర్ట్‌వర్క్ చూసే కాపీ కొట్టారని, కనీసం తన అనుమతి కూడా తీసుకోలేదని ఫ్లోరా తన ఫేస్బుక్లో ఆరోపించారు. ఆరోపణ కాదు, నిజమే అనిపిస్తుంది.పోస్టర్లో కంగనా కన్ను ఒకదాన్ని కవర్ చేస్తూ పిల్లి కన్ను ఉంటుంది. ఫ్లోరా ఎప్పుడో తీసిన ఆర్ట్ ఫొటోలోని యువతి కన్నును కూడా ఒక పిల్లి కన్ను కవర్ చేస్తుంటుంది. ఆమె ఆరోపణకు జడ్జిమెంటల్ హైక్యా నిర్మాణ సంస్థ ‘బాలాజీ మోషన్ పిక్చర్స్’ ఇంతవరకు వివరణ ఇవ్వలేదు. ఇదంటే, ఆర్ట్‌వర్క్ నుంచి పోస్టర్ కాపీ. డైరెక్ట్‌గా పోస్టర్ టు పోస్టర్ కాపీలు కూడా బాలీవుడ్లో పుష్కలంగా ఉన్నాయి. వాటి సంగతేంటి? ఎవరూ అడగలేదు. ఎవరూ మాట్లాడలేదు. ‘పికె’లో ఆమిర్ ఖాన్ దిగంబరంగా రేడియో పట్టుకుని నిలబడి ఉండే పోస్టర్.. క్విమ్ బారీరోస్ అనే పోర్చుగీస్ గాయకుడి 1973 నాటి సాంగ్స్ ఆల్బమ్ కవర్‌కు కాపీ! పికె 2014లో రిలీజ్ అయింది. షారుక్‌ఖాన్ ‘దిల్వాలే’ పోస్టర్ ఆ ముందు ఏడాదే వచ్చిన హాలీవుడ్ మూవీ ‘ది బెస్ట్ ఆఫ్ మి’ పోస్టర్‌కి కాపీ. ఆకాశంలోని మబ్బుల్లో హీరో హీరోయిన్ ఉంటారు. ‘అతిథి తుమ్ కబ్ జావోగీ’ పోస్టర్ ‘లైసెన్స్ టు వెడ్’ పోస్టర్‌కి (బెడ్ మీద భార్యాభర్తల మీద అతిథి పడుకుని ఉంటాడు), ‘ఫూంక్2’ పోస్టర్ ‘ఛేజర్’ పోస్టర్‌కి (ముఖం మీద పెట్టుకున్న అరిచేయిలోంచి ఒక కన్ను కనిపిస్తుంటుంది), ‘మర్డర్2’ పోస్టర్ ‘యాంటీ క్రైస్ట్’ పోస్టర్‌కి (దేహవాంఛలు దెయ్యాల్లా చుట్టుముట్టి ఉంటాయి), ‘ఐత్రాజ్’ పోస్టర్ ‘ది గ్రాడ్యుయేట్’ పోస్టర్‌కి (యువతి అండర్వేర్ వేసుకుంటుంటే హీరో నిలబడి చూస్తుంటాడు), ‘అంజానా అంజానీ’ పోస్టర్ ‘యాన్ ఎడ్యుకేషన్’ పోస్టర్‌కి (వెల్లికిలా రివర్స్‌లో పడుకుని ఉన్న హీరో హీరోయిన్ చెంపలు తాకించుకుంటూ ఉంటారు), ‘జిందగీ న మిలేగీ దొబారా’ పోస్టర్ ‘లార్డ్స్ ఆఫ్ డాగ్టౌన్’ పోస్టర్‌కి (ఒంటిపైన షర్ట్ లేని వ్యక్తితో పాటు ముగ్గురు నడుచుకుంటూ వస్తుంటారు), ‘రా.వన్’ పోస్టర్ ‘బాట్స్మ్యా¯Œ బిగిన్స్’ పోస్టర్‌కి (హీరో రెండు చేతులతో హీరోయిన్ని మోసుకుంటూ వస్తుంటాడు).. ఇవన్నీ అచ్చు గుద్దినట్లుగా కాపీ. హాలీవుడ్ పోస్టర్లను చూసి ముచ్చటపడి తెలుగువుడ్ తయారు చేసుకున్న పోస్టర్లు కూడా ఉన్నాయి. సైమన్ బిర్చ్–బాహుబలి, యాన్ ఆఫీసర్ అండ్ జెంటిల్మన్–తుపాకీ, హ్యారీ పోట్టర్: ఇట్ ఆల్ ఎండ్స్–రోబో 2.ఓ, బ్లేడ్ రన్నర్–సాహు, టిక్‌టిక్: ది ఆస్వంగ్ క్రానికల్స్–కబాలి, మిషన్ ఇంపాజిబుల్: ఘోస్ట్ ప్రొటోకాల్–విశ్వరూపం, ది డ్రాగన్బాల్–అఖిల్, కొల్లాటరల్ బ్యూటీ–యు టర్న్.. ఇలా పోస్టర్లలో పోలికలు కనిపిస్తాయి.ఇవన్నీ కాపీలు కాదనీ, అనుకరణలు అనుసృజనలు మాత్రమేనని అనుకున్నా ఎక్కడ ఎవరి నుంచి ఇన్స్పైర్ అయ్యామో వారికి క్రెడిట్ ఇవ్వడం కనీస ధర్మం. ఈ ధర్మాన్ని పాటించనప్పుడే ధర్మయుద్ధాలు మొదలవుతాయి. అయినా మనది కాని దాన్ని మనది అని చెప్పుకోవడం ఏం బాగుంటుంది? ఎవరి గొప్పతనాన్ని వారికి ఇచ్చేయడం కూడా గొప్పతనమే. హాలీవుడ్ : ఎవరిది వాళ్లే కాపీ! (బ్యాక్ టు బ్యాక్ పోస్టర్లు వేసిన చిత్రాలు) మనసును మీటిన తొలి పోస్టర్ హాలీవుడ్లో ఫస్ట్ టాకీ మూవీ ‘ది జాజ్ సింగర్’. 1927లో వచ్చింది. వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్, విటాఫోన్ కార్పోరేషన్ కలిసి ఈ సినిమాను నిర్మించాయి. కలర్‌ఫుల్ మూవీ పోస్టర్ . పోస్టర్ మీద సినిమాలోని పాత్రలు యూజినీ బెసెరెర్, అల్ జోల్సన్ ఉంటారు. తల్లీ కొడుకులు. ‘వాసు’ సినిమాలో వెంకటేశ్ పెద్ద సింగర్ అవాలనుకుంటే వెంకటేశ్ తండ్రి అతడిని పెద్ద పోలీస్ ఆఫీసర్ అవమంటాడు. తండ్రీకొడుకులకు మధ్య ఘర్షణ మొదలౌతుంది. మాతృ హృదయం కొడుకులోని ‘కళా తపస్వి’ని అర్థం చేసుకుంటుంది. అలాంటి తల్లి మనసే ‘ది జాస్ సింగర్’ పోస్టర్ డిజైన్‌లో కనిపిస్తుంది. ‘చూశావా అమ్మా నేనెంత గొప్పగా ప్లే చేస్తున్నానో’ అన్నట్లు అల్ జోల్సన్.. జాస్ని ప్లే చేస్తూ తల్లి కళ్లలోకి చూస్తుంటే.. ‘‘నా బంగారు కొండ..’’ అన్నట్లు కొడుకును మురిపెంగా చూస్తుంటుంది యూజినీ బెసెరెర్. ఆ పోస్టర్ ప్రతి ఇంటినీ టచ్ చేసి, ఇంటిల్లపాదినీ థియేటర్లకు రప్పించింది. -
వాట్సాప్ కొత్త అప్డేట్...వారికి భారీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్ కొత్త అప్డేట్ను తీసుకొచ్చింది. ముఖ్యంగా ప్రొఫైల్ పిక్‌లు పెట్టుకోవడానికి సంకోచించే వాట్సాప్ యూజర్లకు ఊరట నిస్తూ సరికొత్త అప్డేట్ను తీసుకు రానుంది. యూజర్ల ప్రొఫైల్ చిత్రాలు సేవ్ అవకాశాన్ని తొలగించింది. యూజర్లు తమ కాంటాక్ట్ లిస్ట్‌లో వున్న వ్యక్తుల ప్రొఫైల్ పిక్ లేదా డిస్ప్లే పిక్‌లను చేసుకోనేందుకు అనుమతిని నిరాకరిస్తూ తాజా బేటా అప్డేట్ను ప్రవేశపెడుతోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ పరీక్ష దశలో ఉందని వాబేటా ఇన్ఫో ట్వీట్ చేసింది. ఈ ఫీచర్ అధికారికంగా త్వరోలనే పూర్తిగా అమల్లోకి రానుంది. -
కేసీఆర్ పథకాలను బాబు కాపీ కొడుతున్నారు
హైదరాబాద్: తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలను ఏపీ సీఎం చంద్రబాబు కాపీ కొడుతున్నారని టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శిం చారు. కేసీఆర్ చేసినవన్నీ తాను కూడా చేస్తే వచ్చే ఎన్నికల్లో గెలుస్తాననే భ్రమలో బాబు ఉన్నారని ఎద్దేవా చేశారు. బాబు చేసే పనుల్లో చిత్తశుద్ధి ఉండదన్నారు. ఏపీ ప్రజలు, అక్కడి జర్నలిస్టులు తెలివైనవారు, చైతన్యవంతులని చంద్రబాబు ఎన్ని కుయుక్తులు పన్నినా అక్కడి ప్రజలు నమ్మేస్థితిలో లేరని తెలిపారు. నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్‌లో బుధవారం తెలంగాణ యూని యన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ సంస్థ ఆధ్వర్యం లో జరిగిన ఆంథోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అభినందన సత్కార సభకు కేటీఆర్ ముఖ్య అతిథి గా హాజరై మాట్లాడారు. రాష్ట్రం విడిపోయి ఐదేళ్లు అవుతున్నా కొన్ని పత్రికలు, మీడియా సంస్థలు ఇంకా ఆ భావజాల ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయన్నారు. ఇలాంటి ధోరణి మానుకోవాలని సూచించారు. తాను ఢిల్లీకి పోయినప్పుడు అక్కడ కొన్ని పత్రికలు చూస్తే అందులో తెలంగాణ వార్తలు ఉండవని, తెలంగాణలో ఒక ప్రభుత్వం ఉన్నట్లుగానీ, ఒక ముఖ్యమంత్రి ఉన్నట్లుగానీ వార్తలు కనిపించవని అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తాను అక్కడున్న ఓ వ్యక్తిని అడిగితే.. అది ఆంధ్రా ఎడిషన్ అని చెప్పిండని, మరి ఆంధ్ర ఎడిషన్‌లో తెలంగాణ వార్తలు రాయనప్పుడు తెలంగాణ ఎడిషన్‌లో ఆంధ్రా వార్తలు ఎందుకని నిలదీశారు. జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు న్యాయపరమైన చిక్కులు, వివాదాలు రాకుండా రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని కేటీఆర్ తెలిపారు. అలాగే హెల్త్‌కార్డులను కూడా అందిస్తామన్నారు. జర్నలిస్టులను సంస్థాగతంగా గౌరవించిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా ఓ సంక్షేమ నిధిని కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల భవనానికి స్థలం కేటాయిం చేందుకు సీఎంతో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తామని అన్నారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ... జర్నలిస్టులు ఎవరూ అధైర్యపడవద్దని, దశలవారీగా సమస్యలను పరిష్కరించుకుందామని భరోసా ఇచ్చారు. మీడియా అకాడమీ భవనాన్ని అత్యాధునికంగా నిర్మిస్తున్నట్లు చెప్పారు. భవన నిర్మాణ భూమి పూజకు హాజరు కావాల్సిందిగా మంత్రి కేటీఆర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామలింగారెడ్డి, టీఎస్పీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణిలతో పాటుగా పలువురు సంపాదకులు, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ సంఘం నేతలు పాల్గొన్నారు. -
‘ప్రకటించని మేనిఫెస్టో కాపీ ఎలా సాధ్యం?’
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ మేనిఫెస్టో ఇంకా ప్రకటించలేదని, అలాంటప్పుడు కాపీ కొట్టడం ఎలా జరుగుతుందని కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ ప్రశ్నించా రు. రైతుబంధు, రైతు బీమా కొనసాగిస్తామని చెబుతున్న కాంగ్రెస్ నేతలు.. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కొనసాగిస్తామని చెబితే ఇంకా బాగుంటుందని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి తెలంగాణభవన్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ నేతలు ప్రజల మధ్య లేరు. అందుకే మేమే గెలుస్తామని చెబుతూ ఊహల్లో పయనిస్తున్నారు. అధికారం లేనప్పుడు ప్రజల్లో తిరిగే అలవాటు కాంగ్రెస్ నేతలకు లేదు. 2014 మేనిఫెస్టోలో చెప్పినవన్నీ చేశాం. చెప్పనివీ చేశాం. అందుకే కేసీఆర్‌ను జనం నమ్ముతున్నారు. రూ.200 ఉన్న పింఛను కూడా ఇవ్వని కాంగ్రెస్.. రూ.2వేలు ఎలా ఇస్తుందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్ నేతలవి బక్వాస్ మాటలు. ఎన్నికలు వద్దని డీకే అరుణ సుప్రీంకోర్టుకు వెళ్లారు. అంటే ఎన్నికలకు ఎవరు భయపడుతున్నారు? ప్రజాకోర్టులో తేల్చుకుందామని కేసీఆర్ సవాల్ విసిరితే సై అన్నారు. ఇప్పుడు ప్రజాకోర్టును చూసి భయపడి హైకోర్టు, సుప్రీంకోర్టుల చుట్టూ తిరుగుతున్నారు‘ అని అన్నారు. -
టీఆర్ఎస్.. కాపీ కొట్టింది: కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాం గ్రెస్ మేనిఫెస్టోలోని అం శాలనే టీఆర్ఎస్ తమ మేనిఫెస్టో అంటూ కాపీ కొట్టిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గత నాలుగేళ్లుగా నిలబెట్టుకోని కేసీఆర్‌ను ప్రజలు నమ్మరని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిరుద్యోగ భృతి సాధ్యం కాదన్న కేసీఆర్, కేటీఆర్‌లు ఇప్పు డు ఎలా ప్రకటించారని ప్రశ్నించారు. కేసీఆర్ ఓటమి భయంతోనే కాంగ్రెస్ మేనిఫెస్టోను కాపీ కొట్టారన్నారు. సీపీఎస్ రద్దుపై టీఆర్ఎస్ ఎందు కు స్పందించలేదని ప్రశ్నించారు. గత ఎన్ని కల్లో రూ.లక్ష రుణమాఫీని 4 దఫాలుగా చేయడంతో రైతులపై వడ్డీభారం పడిందని, మళ్లీ ఇప్పుడు రూ.లక్ష రుణమాఫీ చేస్తామం టే రైతు లు నమ్మరన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందని, తమ మేనిఫెస్టోనే ప్రజలు నమ్మి పట్టం కడతారన్నారు. -
ప్రశ్నపత్రమూ కాపీయే!?
పరీక్ష ఏదైనా.. ఈ కాలంలో కాపీలు, మాస్ కాపీలు, స్లిప్పులు సర్వసాధారణమయ్యాయి. అటువంటి ఉదంతాలు వెలుగు చూసినప్పుడు కేసులు.. విచారణలు.. తప్పదనుకుంటే పరీక్షలురద్దు చేయడమూ కొత్తేం కాదు..కానీ సమాధానాల సంగతటుంచితే.. ప్రశ్నపత్రాన్నే కాపీ కొట్టేయడం ఇప్పటివరకు ఎక్కడా వినుండం..అదేమిటి.. ప్రశ్నపత్రాన్ని ఎవరు కాపీ కొడతారు?.. అని ఆశ్చర్యపోతున్నారా.. దానివల్ల ఎవరికి ఉపయోగం అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయా??..ప్రశ్నపత్రాన్ని కాపీ కొట్టడం నిజం.. గత ఐదు రోజులుగాజరిపిన స్టీల్‌ప్లాంట్ జూనియర్ ట్రైనీ పరీక్షల్లో ఈ విడ్డూరంచోటు చేసుకుంది.ప్రశ్నపత్రాల తయారీని తలకెత్తుకున్న ఓ ప్రైవేట్ ఏజెన్సీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నలనే మక్కీకి మక్కీకి దించేసి ప్రశ్నపత్రాన్ని తయారు చేసేసింది.స్టీల్‌ప్లాంట్ రిక్రూట్మెంట్ అధికారులు దాన్నిపరిశీలించకుండానే.. ఆన్లైన్లో నిర్వహిస్తున్న జూనియర్ట్రైనీ పరీక్షలకు ఉపయోగించారు.ఈ పరిణామంతో పరీక్షలు రాసిన వేలాది అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు. ఉక్కునగరం(గాజువాక): విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు నియామకాల కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. మొదట్లో పేపర్ లీకేజీలు, ఆ తర్వాత కోర్టు కేసులు, ఇప్పుడు మక్కా మక్కీ ప్రశ్నలు దించేశారన్న ఆరోపణలు. ఇలా చోటుచేసుకుంటున్న వరుస పరిణామలు స్టీల్‌ప్లాంట్ ప్రతిష్టను మసకబారుస్తున్నాయి. ఉద్యోగార్థుల ఆశలు గల్లంతు చేస్తున్నాయి. 850 జూనియర్ ట్రైనీ పోస్టుల భర్తీకి స్టీల్‌ప్లాంట్ నియామక ప్రక్రియ చేపట్టింది. ఈ పోస్టులకు సుమారు 65 వేల మందిఅభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. వారందరికీ ఈనెల 9 నుంచి 14 వరకు రాష్ట్రంలోని వివిధ కేంద్రాల్లో ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించారు. అవే ప్రశ్నలు.. ఇక్కడా..! ఉద్యోగ నియామక పరీక్షలకు ప్రశ్నసత్రాల తయారీ, పరీక్షల నిర్వహణ బాధ్యతలను ప్లాంట్ యాజమాన్యం ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగిస్తుంటుంది. జూనియర్ ట్రైనీ పరీక్షల విషయంలోనూ అదే చేసింది. ప్రశ్నపత్రాల తయారీ బాధ్యతను తలకెత్తుకున్న ప్రైవేట్ సంస్థ దాని కోసం ఎందుకు శ్రమపడాలనుకుందో ఏమో గానీ.. 2016, 2017 సంవత్సరాల్లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) నిర్వహించిన జూనియర్ ఇంజినీర్ పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నలను చాలావరకు కాపీ కొట్టేసి స్టీల్‌ప్లాంట్ జూనియర్ ట్రైనీ ప్రశ్నపత్రాలు తయారు చేసింది. ఆఫ్‌లైన్‌లో నిర్వహించిన ఎస్ఎస్సీ ప్రశ్నపత్రాలు చూసిన చాలామంది జూనియర్ ట్రైనీ ప్రశ్నపత్రంలో కనిపించాయని ఆరోపిస్తున్నారు. అవేంటంటే.. ఎస్.ఎస్.సి. 2016లో నిర్వహించిన జేఈ మెకానికల్ పరీక్ష సెట్–4ను ఈ నెల 9న ఉదయం జరిగిన స్టీల్‌ప్లాంట్ జేటి పరీక్షలో, సెట్–2ను అదే రోజు మధ్యాహ్నం పరీక్షలో, సెట్–3ని మే 12 ఉదయం పరీక్షలో, సెట్–6ను ఆరోజు మధ్యాహ్నం పరీక్షలో దాదాపు మక్కీకి మక్కీగా ఇచ్చేశారు. అదే విధంగా 2017 మార్చి 3న నిర్వహించిన ఎస్ఎస్సి పరీక్ష పేపర్‌ను సోమవారం(ఈ నెల 14) మధ్యాహ్నం పరీక్షలో యథాతథంగా దించేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఐటీఐ అభ్యర్థులకు బీఈ ప్రశ్నలా.. ఐటిఐ అర్హతతో నిర్వహించిన జూనియర్ ట్రైనీ పరీక్షకు జూనియర్ ఇంజనీర్(బీఈ) స్థాయిలో ఇవ్వడమేంటని అభ్యర్థులు ఆందోళనతో ప్రశ్నిస్తున్నారు. దీనిపై స్టీల్ ప్లాంట్ సీఐటీయూ నాయకులు ప్లాంట్ నియామకాల విభాగం అధికారులకు ఫిర్యాదు చేశారు. పరీక్షలు పూర్తయిన వెంటనే ఎస్.ఎస్.సి ప్రశ్నపత్రాలు, స్టీల్‌ప్లాంట్ ప్రశ్న పత్రాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు. ఉత్పత్తికి తగ్గట్టు సిబ్బంది లేక ఇబ్బందులు పడుతున్న ప్లాంట్‌లో ఈ పరిణామాలు నియామకాల్లో మరింత జాప్యం జరిగి నష్టం వాటిల్లుతుందంటున్నారు. యాజమాన్యంఅసమర్థత వల్లే యాజమాన్యం అసమర్థత, అలక్ష్యం వల్ల నియామకాల ప్రక్రియలో వరుసగా తప్పులు జరుగుతున్నాయి. పరీక్షల నిర్వహణపై సరైన పర్యవేక్షణ లేకపోవడమే వీటన్నింటికీ కారణం. ఇలాగైతే ప్లాంట్ ఉత్పత్తికి మరిన్ని ఆటంకాలు ఎదురవుతాయి. వెంటనే యాజమాన్యం సరైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం – కె.ఎం. శ్రీనివాస్,స్టీల్ సీఐటీయూ నాయకుడు -
రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం మక్కీకి మక్కి
-
ఇంటి డిజైన్ కాపీ కొట్టినందుకు..
కాపీ కొట్టడం అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది పరీక్షలే. ఇక మనలో కొందరు వారికి నచ్చిన సినిమా హీరో, హీరోయిన్ డ్రెస్‌లు, హెయిర్ స్ట యిల్లను కూడా కాపీ కొడుతుంటారు. అసలు విషయాని కి వస్తే కెనడాలో ని టొరంటోలో ని ఫారెస్ట్ హిల్ ప్రాంతంలో నివసించే బార్బరా, ఎరిక్ క్రిషెన్బ్లాట్లు మూడేళ్ల క్రితం ఆర్కిటెక్ట్‌ను పిలిచి తమ పక్కింటి మాదిరిగా తమ ఇంటిని ఆధునీకరించాలని కోరారు. చెప్పిందే తడవుగా ఆర్కిటెక్ట్ అచ్చం పక్కింటి ఇంటిని పోలినట్లుగానే కిటికీలు, చిమ్నీలు, తలుపులు, డిజైన్లతో తన పని పూర్తి చేశాడు. అనంతరం బార్బరా, ఎరిక్‌లు ఆ ఇంటిని 3.5 మిలియన్లకు విక్రయించారు. ఇది ఆ ఇంటిని ఆధునీకరించక ముందు ఉన్న విలువ కంటే 2 మిలియన్ డాలర్లు ఎక్కువ. సరిగ్గా ఇక్కడే తమ ఇంటిని కాపీ కొట్టడమే కాక ఎక్కువ ధరకు అమ్ముతారా.. అని ఆగ్రహించిన పక్కింటి జాసన్, జోడీ చాప్నిక్లు వారిపై కోర్టులో కేసు వేశారు. తమ ఇంటిని అన్ని రకాలుగా కాపీ కొట్టినందుకుగాను 2.5 మిలియన్ డాలర్లు నష్టపరిహారంగా చెల్లించాలని పిటిషన్లో కోరారు. అయితే కొంతకాలం తర్వాత ఈ విషయాన్ని కోర్టు బయట పరిష్కరించుకుందామని ఇరు వర్గాలు అంగీకారానికి రావడంతో ఈ సమస్య కొలిక్కి వచ్చింది. -
తెలంగాణను కాపీ కొట్టిన ఏపీ మీసేవ
అమరావతి: టెక్నాలజీలో తనకు తానే సాటి అని చెబుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.... మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ మీసేవ వెబ్ పోర్టల్ ను మక్కీకి మక్కీగా కాపీ కొట్టి అభాసుపాలైంది. కనీసం వెబ్ సైట్ మాస్టర్ హెడ్‌ను కూడా మార్చకుండా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని ఉంచేయడం గమనార్హం. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వ లోగోను కూడా మార్చకుండా తెలంగాణ లోగోను కాపీ కొట్టేసింది. కేవలం ఐటీ శాఖ మంత్రి లోకేష్, ముఖ్యమంత్రి ఫోటోలు, ఇతర కొద్ది సమాచారం మినహా మిగిలినదంతా తెలంగాణ వెబ్‌సైట్‌ను దించేసింది. ఈ మార్పు ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ సోషల్ మీడియాలో దీనిపై సెటైర్లు వైరల్ అవడంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. అప్పటికప్పుడు తెలంగాణ లోగో తీసి ఏపీ లోగో పెట్టింది. గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అని పెట్టకుండా ఇంటిగ్రేటెడ్ సర్వీసె స్ డెలివరీ సిస్టమ్ అని ఉంచింది. -
జార్ఖండ్‌కు పాకిన మాస్ కాపీయింగ్
-
కాపీ చేశారు... పేస్ట్ చేయడంలో ఫెయిలయ్యారు!
ఆ సీన్ - ఈ సీన్ ఒక రకంగా చూస్తే కంప్యూటర్ను కనుక్కొన్నవాడి కన్నా కాపీ పేస్ట్‌ను కనుకున్నవాడు గొప్పవాడు. అయితే సరిగ్గా పేస్ట్ చేయడం తెలీనప్పుడు కాపీ చేస్తే మాత్రం చేసిన ప్రయత్నం వృథా అయిపోతుంది. ముఖ్యంగా క్లాసిక్స్ అనదగ్గ సినిమాలను కాపీ చేసేసి, వాటిని అతి సాదాసీదాగా పేస్ట్ చేస్తే... సినిమా అభిమానుల ఫీలింగ్స్ దారుణంగా హర్ట్ అవుతాయి. అలా హర్ట్ చేసిన ఓ సినిమా... ‘మా నాన్నకు చిరంజీవి’. సూపర్ హిట్ అయిన ‘ద పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్’కి అనుకరణగా రూపొందిన ఈ సినిమా ఘోరంగా విఫలమైంది. విల్ స్మిత్‌కు ఆస్కార్ అవార్డును, అంతకు మించిన అభిమానగణాన్ని సంపాదించి పెట్టిన సినిమా ‘ద పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్’. 2006లో వచ్చిన ఈ హాలీవుడ్ సినిమా ఒక వాస్తవ కథ. అతుకుల్లేని, అలంకారాల్లేని, పారదర్శకమైన కథ. స్మిత్ నులివెచ్చని భావవ్యక్తీకరణ సినిమాను కొత్త హైట్స్‌కు తీసుకెళ్లింది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న శ్రీమంతుల్లో ఒకరు క్రిస్ గార్డ్నర్. ఈ వ్యాపారవేత్త తన జీవితంలోని ఒక దశలో ఎదుర్కొన్న కష్టాలు, వాటిని ఆయన అధిగమించిన తీరును ఆటోబయోగ్రఫీగా రాశారు. దాన్నే ‘ద పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్’ సినిమాగా మలిచారు. తాను పొదుపు చేసుకున్న డబ్బుతో కొన్ని ఎక్స్‌రే మిషన్లను కొని, వాటి వ్యాపారంలో తేడాలొచ్చి కట్టుబట్టలతో మిగులుతాడు క్రిస్ గార్డ్నర్ (విల్ స్మిత్). దీంతో కుటుంబాన్ని పోషించడం కష్టమవుతుంది. కొడుకును తన దగ్గర వదిలిపెట్టి భార్య వెళ్లిపోతుంది. ఆరేళ్ల వయసున్న కొడుకుతో కలిసి ఆ సేల్స్‌మెన్ రోడ్డున పడ తాడు. తన పరిస్థితి తనయుడికి ఏ మాత్రం అర్థం తెలియ నీకుండా జాగ్రత్తపడతాడు. బాబుకి ఎలాంటి ఇబ్బందీ రాకుండా చూసుకోవ డానికి ఆ తండ్రి పడే తపన, మరోవైపు అడుగడుగునా దురదృష్టం ఎదురవుతున్నా ఎక్కడా ఆత్మవిశ్వాసాన్ని వదలక తన లక్ష్యం దిశగా ప్రయత్నాలను కొనసాగించే అతని ప్రయాణమే ఈ చిత్రం. ఎంతో స్ఫూర్తిదాయకంగా సాగుతుందీ సినిమా. ఈ కథా నేపథ్యాన్ని ‘మా నాన్న చిరంజీవి’ సినిమాకు అన్వయించే ప్రయత్నం చేశారు. హాలీవుడ్ వెర్షన్లో విల్ స్మిత్, ఆయన సొంత తనయుడు జేడెన్ స్మిత్‌లు నటించిన పాత్రల్లో తెలుగు వెర్షన్లో జగపతిబాబు, మాస్టర్ అతులిత్లు కనిపిస్తారు. భార్య మాట విని తనకు తెలియని వ్యాపారంలో డబ్బులన్నీ పెట్టి నష్టపోతాడు జగపతిబాబు. ఆయన ఆర్థికంగా నష్టపోవడానికి తనే కారణం అయినా... భార్య అతడిని వదలి వెళ్లిపోతుంది. దీంతో హీరో కొడుకును తీసుకుని హైదరాబాద్ వ స్తాడు. ఈ రకంగా నేపథ్యాన్ని మార్చినా... ఇక్కడి నుంచి ఇక హీరోకి ఎదురయ్యే అనుభవాలన్నీ హాలీవుడ్ సినిమాకు అనుకరణగా రాసుకున్నవే. కొడుకుతో కలిసి ఒక రాత్రి రైల్వేస్టేషన్ బాత్రూమ్లో తల దాచుకోవాల్సి వస్తుంది హీరోకి. ఈ సీన్లో విల్‌స్మిత్ నటన కన్నీటిని తెప్పిస్తుంది. ఈ సన్నివేశాన్ని తెలుగు సినిమాలో కూడా యథాతథంగా వాడుకున్నారు. హాలీవుడ్ వెర్షన్లో హీరో తన దగ్గరే మిగిలిపోయిన ఎక్స్‌రే మిషన్‌ను అమ్మడానికి హీరో ప్రయత్నం చేస్తుంటాడు. తెలుగులో హీరో చేతిలో డిక్షనరీలు పెట్టారు. ఇలాంటి చిన్న చిన్న మార్పులు, అనుకరణలు ఎన్నో ఉన్నా... ఏ దశలోనూ తెలుగు సినిమా హాలీవుడ్ డ్రామాను రీచ్ కాలేదు. అమెరికా నేపథ్యంలో సాగే కథను లోకలైజ్ చేయబోయి... గొప్ప కాన్సెప్ట్‌ను సాధారణ స్థాయికి తీసుకొచ్చేశారు రూపకర్తలు. అందుకే ఈ సినిమా ఎప్పుడొచ్చి వెళ్లిందో కూడా చాలామందికి తెలియదు! వాస్తవానికి విల్‌స్మిత్ సినిమాలో ఉన్న గొప్పదనం... నాటకీయమైన కథలోనిది కాదు. ఆ చిత్రంలోని అందమంతా దాని నిజాయితీలో ఉంది. ప్రతి సన్నివేశం ఎంతో వాస్తవికంగా, మనసును తడిమేలా ఉంటడమే దాని సక్సెస్ సీక్రెట్. అలాంటి ఫీల్ తెలుగు సినిమాలో మిస్ అయ్యింది! అందుకే... పరాజయాల లిస్టులో చేరిపోయింది! - బి.జీవన్‌రెడ్డి -
మనీ... కాపీయే కానీ...
ఆ సీన్ - ఈ సీన్ తను రూపొందించే సినిమాల వెనుక ఉన్న అసలు సినిమాల గురించి, తను కాపీ కొట్టిన విధానం గురించి చాలా ఉత్సాహవంతంగా వివరిస్తాడు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. ఫలానా సినిమాలోని ఫలానా సీన్లో ఫలానా ఫ్రేమ్‌ను ఫలానా హాలీవుడ్ సినిమా నుంచో, ఇంకో విదేశీ సినిమా నుంచినో కాపీ కొట్టాను అని ఆయన సగర్వంగా చెబుతూ ఉంటారు. కేవలం వర్మ దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లోనే కాదు... ఆయన ప్రొడక్షన్లో వచ్చిన సినిమాల్లో కూడా కావాల్సినంత కాపీ కళ ఉంటుంది. అలా ఆర్జీవీ కంపెనీలో తొలితొలిగా ఉత్పత్తి అయిన సినిమా ‘మనీ’. శివనాగేశ్వరరావు దర్శకత్వంలో జేడీ చక్రవర్తి, చిన్నా, జయసుధ, రేణుకా సహానీ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమాకి ‘రూత్‌లెస్ పీపుల్’ సినిమా ఆధారం. 1986లో వచ్చిన ఈ హాలీవుడ్ సినిమా మాదిరిలోనే 1992లో ‘మనీ’ సినిమాని రూపొందించారు. అతి తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం రకరకాల ప్రయత్నాలు చేసే నిరుద్యోగ యువకులు జేడీ, చిన్నా... తమ పొరుగింటిలో ఉండే ధనికురాలు జయసుధను కిడ్నాప్ చేసి డబ్బు డిమాండ్ చేసేందుకు వ్యూహం పన్నుతారు. ఎలాగో ఆమెను అపహరిస్తారు. తీరా డబ్బు కోసం ఆమె భర్త సుబ్బారావు (పరేష్ రావల్) కు ఫోన్ చేస్తే, ఆమెను చంపేస్తే డబ్బులిస్తాను అంటూ బేరం పెడతాడు. తర్వాత వాళ్లు ఏం చేశారనేది మిగతా కథ. అయితే ఒరిజినల్ వెర్షన్లో హీరోలు ఇద్దరు కాదు... ఒక్కడే. నిరుద్యోగం కామన్ ప్రాబ్లెమ్. తను గతంలో పనిచేసిన కంపెనీ యజమానురాలిని కిడ్నాప్ చేసి డబ్బు సంపాదించుకోవాలనుకుంటాడు. ఈ పనిలో అతడికి భార్య సహాయంగా నిలుస్తుంది. కిడ్నాప్ తతంగం పూర్తైఓనర్ భర్తకు ఫోన్ చేస్తే.. అతడేమో వీరికి ట్విస్ట్ ఇస్తాడు. మనీ సినిమాలో పరేష్ రావల్ పోషించిన సుబ్బారావు పాత్ర తీరు అంతా హాలీవుడ్ సినిమాలో పాత్ర తీరులో కనిపించేదే. భార్య కిడ్నాప్ కావడం అతడికి సంబరంగా మారుతుంది. ఈ ఆనందంలో ఎంత తాగుతున్నాడో తెలీనంతగా తాగేస్తూ డ్యాన్సులు కూడా చేసేస్తూ ఉంటాడు. అయితే కిడ్నాప్ కేసు గురించి విచారణ జరపడానికి వచ్చిన పోలీసుల ముందు మాత్రం వినయం నటిస్తూ ఉంటాడు. వారి ముందుకు వచ్చేటప్పుడు కళ్లకు సబ్బు పట్టించుకుని ఏడుస్తున్నట్టుగా నటించడం, ఇతర వినయాలు అన్నీ హాలీవుడ్ వెర్షన్లో ఈ పాత్రను పోషించిన నటుడు ఎంత అద్భుతంగా చూపించాడో... పరేష్ రావల్ కూడా అంతే స్థాయిలో జీవించేశారు. క్లయిమాక్స్‌లో సుబ్బారావు అసలు స్వరూపం మేడమ్‌కు వివరిస్తారు కిడ్నాపర్లు. మొదట్లో ఆమె నమ్మదు. తర్వాత అర్థమయ్యేలా చేస్తారు. మరోవైపు ఈ కిడ్నాపింగ్ ముఠాను వెంటాడే పోలీసులు, వారిని తప్పించుకోవడానికి వీళ్లు పడే పాట్లు... ఈ ఎపిసోడ్లు అన్నీ రెండు సినిమాల్లోనూ కామన్. ఈ రెండు సినిమాల మధ్య మరిన్ని పోలికలు ఏమిటంటే... రెండూ కామెడీ ఎంటర్టైనర్లు. సూపర్ హిట్లు. మూల కథను హాలీవుడ్ నుంచి తీసుకున్న ఆర్జీవీ కంపెనీ దాన్ని తెలుగులో తీర్చిదిద్దిన విధానం మాత్రం అమోఘంగా ఉంటుంది. కథ ఎంత కాపీ అయినా కథనంలో మాత్రం ‘మనీ’ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్ అయ్యింది. క్లైమాక్స్ ఎపిసోడ్‌ను, హాలీవుడ్ వెర్షన్‌తో ఏమాత్రం సంబంధం లేని‘ఖాన్ దాదా’ పాత్రను సూపర్‌బగా చూపించారు ‘మనీ’ మేకర్లు. ఆ పాత్రలో బ్రహ్మానందం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. తర్వాత ఈ సినిమాకు ‘మనీ మనీ’ రూపంలో సీక్వెల్ కూడా వచ్చింది. అంటే హాలీవుడ్ వాళ్లు ఆగిపోయిన చోట నుంచి ఆర్జీవీ కంపెనీ మొదలు పెట్టిందన్నమాట! - బి.జీవన్‌రెడ్డి -
కాపీ కొట్టమంటే సినిమానే వదులుకుంటా!
‘‘నాకు నచ్చిన దర్శకుల్లో సుకుమార్ ఒకరు. ఆయన నిర్మాతగా చేసిన ‘కుమారి 21 ఎఫ్’ ఘనవిజయం సాధించాలని కోరుకున్నా. ఈ సినిమా క్లైమాక్స్ ప్రేక్షకులకు నచ్చుతుందా అని టెన్షన్ ఉండేది. సుకుమార్ మాత్రం బలంగా నమ్మారు. రీ-రికార్డింగ్ కూడా పూర్తి చేశాక, ‘బ్లాక్ బస్టర్ ఖాయం’ అని సుకుమార్‌తో అన్నాను. మా నమ్మకం హిట్టయ్యింది’’ అని సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ అన్నారు. రాజ్‌తరుణ్‌తో సూర్యప్రతాప్ దర్శకత్వంలో రూపొందిన ‘కుమారి 21 ఎఫ్’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం విజయానందంతో దేవిశ్రీ ప్రసాద్ మీడియాతో ముచ్చటించారు.. * నాకు చిన్నా, పెద్దా తేడా లేదు. ఏ సినిమా అయినా ఒకటే. మంచి పాటలివ్వడానికి సబ్జెక్ట్‌లో స్కోప్ ఉండాలి. నా కెరీర్ స్టార్టింగ్‌లో ‘అభి’ వంటి చిత్రాలు చేశాను. ఆ సినిమాలో ‘వంగ తోట మలుపు కాడ...’ పాట నాకు బాగా నచ్చుతుందని ఇప్పటికీ అల్లు అరవింద్‌గారు అంటుంటారు. పాటల కంపోజింగ్‌కి నేను విదేశాలకు వెళ్లను. నా రికార్డింగ్ స్టూడియోలోనే నాకు సౌకర్యవంతంగా ఉంటుంది. కానీ, దర్శక-నిర్మాతల ఇష్టం మేరకు ‘అత్తారింటికి దారేది’కి బార్సిలోనా వెళ్లాను. మూడు రోజుల్లో మూడు పాటలు పూర్తి చేశాను. తాజాగా ‘నాన్నకు ప్రేమతో’ కోసం విదేశాలకు వెళ్లాను. నాలుగు రోజుల్లో మూడు పాటలు చేసేశాను. * ఏ ట్యూన్ చేసినా అది స్వయంగా నేనే చేయాలనుకుంటాను. కాపీ ట్యూన్స్ జోలికి వెళ్లను. నా కెరీర్ కొత్తలో ఓ దర్శకుడు ఓ హాలీవుడ్ సాంగ్ చూపించి, అలా చేయమన్నాడు. అప్పుడు నేను ‘సారీ సార్.. మనం భవిష్యత్తులో కలిసి పని చేద్దాం. ఇప్పుడు నా వల్ల కాదు’ అన్నాను. ‘మరీ ఇంత యాటిట్యూడా? పైకి రావు’ అన్నారు. నవ్వుకున్నాను. మొన్నా మధ్య ఫలానా సంగీతదర్శకుడు చేసిన పాట ఫలానా పాటకు కాపీ అంటూ ఎవరో సర్వే నిర్వహించారు. అందులో నా పేరు లేదు. ‘నవ్వు దొరకవా?’ అన్నారు. ఎవరైనా దర్శకులు నా దగ్గర మరో ట్యూన్‌ని కాపీ కొట్టమంటే, సినిమానే వదులుకుంటాను తప్ప ఎప్పటికీ కాపీ చేయను. మనకున్నవి ఏడే స్వరాలు. ఆ స్వరాల చుట్టూ పాట తిరిగే క్రమంలో ఏదో చిన్న సౌండ్ మరేదో పాటలో విన్నట్లు అనిపించవచ్చు. దాన్నేం చేయలేం. * పవన్ కల్యాణ్ హీరోగా రూపొందుతున్న ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ కోసం ఓ సాంగ్ చేశాను. ఒక మంచి మాస్ బీట్ విని, ‘నీ ట్యూన్‌తో నాకు చాలా కిక్ ఇచ్చావ్. నువ్వు చేసినదానికన్నా డబుల్ డ్యాన్స్ చేస్తాను’ అని పవన్ కల్యాణ్ ఫోన్ చేసి, అన్నారు. * అల్లు అరవింద్, అశ్వనీదత్ వంటివాళ్లు నన్ను హీరోగా పెట్టి, సినిమాలు చేస్తామంటున్నారు. తమిళం నుంచి ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. ‘100% లవ్’ చిత్రంలో నన్ను హీరోగా నటించమని అడిగారు. అప్పుడు చెయ్యలేదు. సంగీతదర్శకుణ్ణి కాబట్టి, మ్యూజిక్ బేస్డ్ సినిమా చేశామా? అన్నట్లు కాకుండా కథాబలం ఉన్న చిత్రాలైతే చేస్తా. ఇప్పుడు మనకు చాలామంది హీరోలున్నారు. అందుకని అత్యవసరంగా నేను హీరోగా రంగంలోకి దిగాల్సిన పని లేదు.