అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా శర్మని ట్రోల్ చేస్తూ ఓ వీడియ్ నెట్టింట్ హల్ చల్ చేస్తోంది. దీంతో ఆయన దానికి స్పందించి..హుందాగా బదులిచ్చారు. అసలేం జరిగిందంటే..అస్సాం ముఖ్యమంత్రి బిస్వా శర్మ ఒక రోజు ప్రభుత్వ స్కూల్‌ని సందర్శించారు. అక్కడ విజిటర్స్ బుక్‌లో రాయడానికి ఆయన.. వేరొక పుస్తకంలో చూసి రాస్తూ కనిపించారు. దీంతో రోషన్ శర్మ అనే వ్యక్తి అందుకు సంబంధించిన వీడియో తోపాటు.. కాపీ చేయకుండా విజటర్స్ బుక్‌లో ఒక్క పేరా కూడా రాయలేని అస్సాం సీఎం అనే క్యాప్షన్ జోడించి మరీ పోస్ట్ చేశారు.
ఈ విషయం నెట్టింట వైరల్ కావడంతో సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై గంటల వ్యవధిలోనే స్పందించిన ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా శర్మ తనకు ఇంగ్లీష్, హిందీ భాషలు సరిగా రావని, దాన్ని అంగీకరించేందుకు తనకు ఎలాంటి సంకోచం లేదన్నారు. పైగా తాను ఆ భాషాలను నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నానని ట్వీట్ చేశారు. దీనికి రాయ్ బదులిస్తూ..అస్సామీ ఒక అందమైన భాష, సందర్శకుల పుస్తకంలో అస్సామీ భాషలో రాసి ఉంటే మరింత మెరుగ్గా కనిపించేది.
ఇక్కడ భాష కాదు సమస్య . అతను వచనాన్ని కాపీ చేయడం గురించి మాత్రమే విమర్శించాను. అయినా విజిటర్స్ బుక్‌లో హిందీ లేదా ఇంగ్లీష్‌లోనే రాయాలని రూల్ లేదు . కాపీ చేయడం అనేది మీ స్థాయి నాయకుడికి తగదు. నాయకుడు తన విభిన్నమైన ఉన్నతాశయ ఆలోచనలతో అందరికీ ఆదర్శంగా ఉండేలా కానీ ఇలా కాపీ చేయకూడదూ అని సూచిస్తూ ట్వీట్ చేశాడు.
Presenting the CM of Assam who can't even write a paragraph in a visitor's book without copying 🤣🤣🤣 pic.twitter.com/MHvoRAGDH1
— Roshan Rai (@RoshanKrRaii) April 4, 2023
(చదవండి: ప్రధాని డిగ్రీని చూసే ప్రజలు ఓటేశారా? ఎన్సీపీ నేత ఫైర్)
Comments
Please login to add a commentAdd a comment