
డిస్పూర్ : ‘మా రాష్ట్రాన్నే అంటారా? మీకు ఎంత ధైర్యం?’ అంటూ అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (దీదీ)పై నిప్పులు చెరిగారు.
సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. మంగళవారం అభయ ఘటన నేపథ్యంలో దీదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ‘నబన్న అభిజన్’ ర్యాలీ పేరుతో పశ్చిమ్ బంగా ఛాత్ర సమాజ్ అనే విద్యార్థి సంఘం చేపట్టిన సచివాలయ ముట్టడి కార్యక్రమం హింసాత్మకంగా మారింది.
బంగ్లాదేశ్ తరహాలో పశ్చిమ బెంగాల్‌లో సైతం
ఈ ఘటన గురించి బుధవారం కోల్‌కతాలో జరిగిన తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో దీదీ ప్రస్తావించారు. ఆమె మాట్లాడుతూ..రాష్ట్ర సచివాలయానికి బంద్ (సమ్మె), నబన్న అభిజన్ నిరసన మార్చ్ సందర్భంగా జరిగిన హింస జరిగింది. ఆ హింసా ఘటనలు బీజేపీ నేతృత్వంలోనే జరిగాయి. దీనికి తోడు ఆర్‌జీ కార్ ఘటనపై వెల్లువెత్తుతున్న విమర్శలు.. వెరసీ బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం తరహాలో తమ ప్రభుత్వం పతనానికి అల్లర్లు జరుగుతున్నాయని అర్ధం వచ్చేలా పరోక్షంగా వ్యాఖ్యానించారు.
दीदी, आपकी हिम्मत कैसे हुई असम को धमकाने की? हमें लाल आंखें मत दिखाइए। आपकी असफलता की राजनीति से भारत को जलाने की कोशिश भी मत कीजिए। आपको विभाजनकारी भाषा बोलना शोभा नहीं देता।
দিদি, আপনার এতো সাহস কীভাবে হলো যে আপনি অসমকে ধমকি দিচ্ছেন? আমাদের রক্তচক্ষু দেখাবেন না। আপনার অসফলতার… pic.twitter.com/k194lajS8s— Himanta Biswa Sarma (@himantabiswa) August 28, 2024
‘ఇది (ఆందోళన) బంగ్లాదేశ్‌లోని నిరసనల మాదిరిగానే ఉందని కొందరు అనుకుంటున్నారు. నేను బంగ్లాదేశ్‌ను ప్రేమిస్తున్నాను. వారు మా (బెంగాలి) లాగా మాట్లాడతారు. మా సంస్కృతి కూడా ఒకటే. అయితే, బంగ్లాదేశ్ వేరే దేశం’అని బెనర్జీ అన్నారు.
మోదీ జీ.. మీరు మా రాష్ట్రాన్ని తగులబెడితే
అంతేకాదు ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ.. ‘మోదీ జీ, మీ ప్రజల ద్వారా మా రాష్ట్రంలో అశాంతి సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు మా రాష్ట్రాన్ని తగులబెడితే అస్సాం, ఈశాన్యం, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఢిల్లీ కూడా తగులబడతాయని గుర్తుంచుకోండి’ అని అన్నారు.
దీదీ.. మీకెంతా ధైర్యం
ఈ వ్యాఖ్యలపై అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘దీదీ అస్సాంను బెదిరించడానికి మీకు ఎంత ధైర్యం? మీ రక్తపు కళ్ళు మాకు చూపించవద్దు. మీ వైఫల్య రాజకీయాలతో భారతదేశానికి నిప్పు పెట్టడానికి ప్రయత్నించవద్దు. విభజన భాష మాట్లాడటం మీకు సరిపోదు’ అని విమర్శించారు. అదే సమయంలో దీదీ వ్యాఖ్యానించినట్లుగా అస్సాంలో అల్లర్లు జరగవు. అందుకు నేను హామీ’ అని ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.