Mamatha Benarjee
-
ఫలించిన ‘దీదీ’ సెంటిమెంట్.. మమత ఇంటికి డాక్టర్లు
కోల్‌కతా: బెంగాల్లో సీఎం మమతా బెనర్జీ, జూనియర్ డాక్టర్ల చర్చల విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లు ఎట్టకేలకు సీఎం మమతా బెనర్జీతో చర్చలకు అంగీకరించారు. ఈ క్రమంలో జూడాల బృందంలో మమతతో చర్చించేందుకు కాసేపటి క్రితమే ఆమె ఇంటికి వెళ్లారు.కాగా, సీఎం మమతా శనివారం అనూహ్యంగా డాక్టర్లు నిరసన తెలుపుతున్న ప్రదేశానికి వెళ్లారు. ఈ సందర్బంగా వారితో మాట్లాడారు. తమకు న్యాయం కావాలి అనే నినాదాల మధ్య వైద్యులను ఉద్దేశించి మమతా బెనర్జీ ప్రసంగించారు. ఈ క్రమంలో దీదీ..‘నేను ముక్కమంత్రిగా కాకుండా మీ సోదరిగా ఇక్కడికి వచ్చాను. నా పదవి పెద్దది కాదు, ప్రజలు పెద్దవారు. నిన్న మీరింతా ఈ భారీ వర్షంలో నిరసన వ్యక్తం చేసినందుకు, నేను కూడా నిద్రపోలేదు. దయచేసి మీ డిమాండ్లను నెరవేరస్తానని నేను మీకు హామీ ఇస్తున్నాను అని అన్నారు. ఇదే సమయంలో వైద్యులతో మాట్లాడుతూ.. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల రోగుల సంక్షేమ కమిటీలను తక్షణమే రద్దు చేసినట్లు బెనర్జీ ప్రకటించారు. సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఇది నా చివరి ప్రయత్నం అని అన్నారు. #WATCH | Kolkata, West Bengal: A delegation of junior doctors protesting over the RG Kar Medical College and Hospital rape-murder case, arrive at the Chief Minister's residence to attend a meeting with CM Mamata Banerjee regarding their demands. pic.twitter.com/GMXiKWu1Zs— ANI (@ANI) September 14, 2024 అనంతరం, కొద్ది గంటల వ్యవధిలోనే సీఎం మమతా బెనర్జీతో చర్చలకు సిద్ధమేనని వైద్యులు ప్రభుత్వానికి మెయిల్ పంపించారు. వైద్యుల మెయిల్‌కు ముఖ్యమంత్రి కార్యాలయ ప్రతినిధి డాక్టర్ మనోజ్ పండిట్ స్పందించారు. అనంతరం, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసంలో సాయంత్రం ఆరు గంటలకు ఏర్పాటు చేస్తున్న సమావేశానికి హాజరు కావాలని జూనియర్ డాక్టర్లను ఆహ్వానించారు. దీంతో, మమతతో చర్చించేందుకు వైద్యులు ఆమె నివాసానికి చేరుకున్నారు. ఈనేపథ్యంలో వీరి సమావేశంలో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. డాక్టర్ల డిమాండ్లను దీదీ ఒప్పుకుంటారా? లేదా? అనే సస్పెన్స్ నెలకొంది. #WATCH | Kolkata, West Bengal: A delegation of junior doctors protesting over the RG Kar Medical College and Hospital rape-murder case, arrive at the Chief Minister's residence to attend a meeting with CM Mamata Banerjee regarding their demands. pic.twitter.com/XpD7KWrntt— ANI (@ANI) September 14, 2024ఇది కూడా చదవండి: భరతమాత బిడ్డకు విదేశీగడ్డపై అవమానం: ప్రధాని మోదీ -
పశ్చిమ బెంగాల్ ప్రజల కోసం రాజీనామాకైనా సిద్ధమే... పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టీకరణ.. ఇంకా ఇతర అప్డేట్స్
-
కోల్‌కతా కేసులో మోదీకి లేఖ.. సీఎం మమతకి కేంద్రం కౌంటర్
ఢిల్లీ: కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లేఖపై కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణా దేవి స్పందిస్తూ దీదీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బెంగాల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉన్నప్పటికీ.. పనితీరు బాగా లేదని విమర్శించారు. మహిళలకు భద్రత కల్పించడంలో బెంగాల్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం ఘటనలో ప్రధాని మోదీ నేరుగా స్పందించాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోరారు. ఈ క్రమంలో 22వ తేదీన ఈ ఘటనపై తాను లేఖ రాసినా ఎలాంటి సమాధానం రాలేదని శుక్రవారం రాసిన మరో లేఖలో ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా మమత లేఖపై కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ మంత్రి అన్నపూర్ణా దేవీ స్పందించారు.महिलाओं को सशक्त बनाना और उन्हें सुरक्षित वातावरण प्रदान करना भारत सरकार की सर्वोच्च प्राथमिकता है। सरकार महिला सुरक्षा के प्रति पूर्णतः समर्पित है और इसे अपनी प्रमुख जिम्मेदारी मानती है। (1/2) ...@narendramodi | @MamataOfficial pic.twitter.com/zKNa1AzNyN— Annapurna Devi (@Annapurna4BJP) August 30, 2024ట్విట్టర్ వేదికగా అన్నపూర్ణా దేవీ.. దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, నేరాలకు సంబంధించి కఠినమైన చట్టాలు, శిక్షలు ఇప్పటికే అమలులో ఉన్నాయి. కానీ, బెంగాల్లో ఫాస్ట్ కోర్టుల పనితీరు బాగాలేదు. పశ్చిమ బెంగాల్లో 48,600 అత్యాచార, పోక్సో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అత్యాచారం, పోక్సో కేసులను ప్రత్యేకంగా పరిష్కరించేందుకు బెంగాల్ ప్రభుత్వం అదనంగా 11 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ, అమలు చేయలేదు. ఇవి ప్రత్యేకమైన పోక్సో కోర్టులు లేదా రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా అత్యాచారం, పోక్సో కేసులు రెండింటినీ విచారిస్తాయి అని చెప్పుకొచ్చారు. ముందుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని హితవు పలికారు. -
మమ్మల్నే బెదిరిస్తారా.. మీకు ఎంత ధైర్యం? దీదీపై హిమంత శర్మ ఫైర్
డిస్పూర్ : ‘మా రాష్ట్రాన్నే అంటారా? మీకు ఎంత ధైర్యం?’ అంటూ అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (దీదీ)పై నిప్పులు చెరిగారు.సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. మంగళవారం అభయ ఘటన నేపథ్యంలో దీదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ‘నబన్న అభిజన్’ ర్యాలీ పేరుతో పశ్చిమ్ బంగా ఛాత్ర సమాజ్ అనే విద్యార్థి సంఘం చేపట్టిన సచివాలయ ముట్టడి కార్యక్రమం హింసాత్మకంగా మారింది.బంగ్లాదేశ్ తరహాలో పశ్చిమ బెంగాల్లో సైతంఈ ఘటన గురించి బుధవారం కోల్‌కతాలో జరిగిన తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో దీదీ ప్రస్తావించారు. ఆమె మాట్లాడుతూ..రాష్ట్ర సచివాలయానికి బంద్ (సమ్మె), నబన్న అభిజన్ నిరసన మార్చ్ సందర్భంగా జరిగిన హింస జరిగింది. ఆ హింసా ఘటనలు బీజేపీ నేతృత్వంలోనే జరిగాయి. దీనికి తోడు ఆర్జీ కార్ ఘటనపై వెల్లువెత్తుతున్న విమర్శలు.. వెరసీ బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం తరహాలో తమ ప్రభుత్వం పతనానికి అల్లర్లు జరుగుతున్నాయని అర్ధం వచ్చేలా పరోక్షంగా వ్యాఖ్యానించారు. दीदी, आपकी हिम्मत कैसे हुई असम को धमकाने की? हमें लाल आंखें मत दिखाइए। आपकी असफलता की राजनीति से भारत को जलाने की कोशिश भी मत कीजिए। आपको विभाजनकारी भाषा बोलना शोभा नहीं देता।দিদি, আপনার এতো সাহস কীভাবে হলো যে আপনি অসমকে ধমকি দিচ্ছেন? আমাদের রক্তচক্ষু দেখাবেন না। আপনার অসফলতার… pic.twitter.com/k194lajS8s— Himanta Biswa Sarma (@himantabiswa) August 28, 2024‘ఇది (ఆందోళన) బంగ్లాదేశ్‌లోని నిరసనల మాదిరిగానే ఉందని కొందరు అనుకుంటున్నారు. నేను బంగ్లాదేశ్‌ను ప్రేమిస్తున్నాను. వారు మా (బెంగాలి) లాగా మాట్లాడతారు. మా సంస్కృతి కూడా ఒకటే. అయితే, బంగ్లాదేశ్ వేరే దేశం’అని బెనర్జీ అన్నారు. మోదీ జీ.. మీరు మా రాష్ట్రాన్ని తగులబెడితేఅంతేకాదు ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ.. ‘మోదీ జీ, మీ ప్రజల ద్వారా మా రాష్ట్రంలో అశాంతి సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు మా రాష్ట్రాన్ని తగులబెడితే అస్సాం, ఈశాన్యం, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఢిల్లీ కూడా తగులబడతాయని గుర్తుంచుకోండి’ అని అన్నారు.దీదీ.. మీకెంతా ధైర్యంఈ వ్యాఖ్యలపై అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘దీదీ అస్సాంను బెదిరించడానికి మీకు ఎంత ధైర్యం? మీ రక్తపు కళ్ళు మాకు చూపించవద్దు. మీ వైఫల్య రాజకీయాలతో భారతదేశానికి నిప్పు పెట్టడానికి ప్రయత్నించవద్దు. విభజన భాష మాట్లాడటం మీకు సరిపోదు’ అని విమర్శించారు. అదే సమయంలో దీదీ వ్యాఖ్యానించినట్లుగా అస్సాంలో అల్లర్లు జరగవు. అందుకు నేను హామీ’ అని ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు. -
బీజేపీ, సీపీఎం నేతలా నన్ను ప్రశ్నించేది: సీఎం మమత ఫైర్
బెంగాల్లో టీఎంసీలు నిరసనలు అప్డేట్స్.. 👉బెంగాల్లో సీపీఎం, బీజేపీ పార్టీలపై సీఎం మమత సంచలన ఆరోపణలు చేశారు. ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో సీపీఎం, బీజేపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారని మమతా బెనర్జీ ఆరోపించారు.👉హత్యాచార ఘటనకు మమతా బెనర్జీ నిరసన తెలిపారు. ఈ సందర్బంగా మమత మాట్లాడుతూ..‘సీపీఎం, బీజేపీ కార్యకర్తలు అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఆస్పత్రిలోకి ప్రవేశించి అరాచకం సృష్టించారు. ఈ విషయం నాకు తెలుసు. సీపీఎం కార్యకర్తలు డీవైఎఫ్ఐ జెండాలతో, బీజేపీ కార్యకర్తలు జాతీయ పతాకాలు చేతిలో పట్టుకుని అరాచకానికి తెగబడ్డారు. ఇదంతా అక్కడున్న సీసీ టీవీ ఫుటేజీలో కనిపిస్తోంది. జాతీయ పతాకాన్ని దుర్వినియోగం చేసిన వీరిపై చర్యలు చేపట్టాలని కోరారు.#WATCH | Kolkata: West Bengal CM Mamata Banerjee says, "I know that CPM and BJP vandalised RG Kar Medical College and Hospital...They went there at 12-1 am in the night, the video shows that CPM took the DYFI flag and BJP took the national flag. They have misused the national… pic.twitter.com/WzEPz1Q0CT— ANI (@ANI) August 16, 2024👉మణిపూర్ భగ్గుమన్నప్పుడు బీజేపీ, సీపీఎంలు ఎన్ని బృందాలను అక్కడికి పంపాయని ఆమె ప్రశ్నించారు. హథ్రాస్, ఉన్నావ్‌కు ఎన్ని బృందాలను ఈ పార్టీలు పంపాయని మమత నిలదీశారు. మణిపూర్, యూపీల్లో అరాచకాలు జరిగినప్పుడు వీరంతా ఎక్కడ ఉన్నారని ఆమె ప్రశ్నించారు. సీపీఎం, బీజేపీ తనను బెదిరించలేవని, ఎన్నికల్లో ప్రజల మద్దతుతోనే తాము ఇక్కడ వరకూ వచ్చామని పేర్కొన్నారు. 👉పశ్చిమ బెంగాల్‌లోని ఆర్జీ కార్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ క్రమంలో నిందితులను శిక్షించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. మరోవైపు.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఈ ఘటనకు కారణమైన వారిని ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు.👉కాగా, హత్యాచారం ఘటనను ఖండిస్తూ కోల్‌కతాలో సీఎం మమతా, టీఎంసీ నేతలు శుక్రవారం ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం జరగాలని నినాదాలు చేశారు. #WATCH | West Bengal CM Mamata Banerjee holds a protest against the incident of rape and murder of a woman doctor at RG Kar Medical College and Hospital, in Kolkata She is demanding justice for the victim and capital punishment for the accused. pic.twitter.com/3wkc3V1aza— ANI (@ANI) August 16, 2024 #WATCH | West Bengal CM Mamata Banerjee takes out a rally against the incident of rape and murder of a woman doctor at RG Kar Medical College and Hospital, in KolkataShe is demanding justice for the victim and capital punishment for the accused. pic.twitter.com/z8rBxRuqGn— ANI (@ANI) August 16, 2024 -
సాక్షి కార్టూన్ : 16-08-2024
-
దర్యాప్తు కూడా నామీదే చేయండీ అని అనకండి మేడం!
-
ముగ్గురు కీలక నేతలతో సీఎం మమత భేటీ.. ఏం చర్చించనున్నారు?
కోల్కత్తా: దేశ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. రేపు(శుక్రవారం) ఉద్దవ్ థాక్రే, శరద్ పవార్‌ను ముంబై కలవనున్నట్టు ఆమె చెప్పారు. వీలైతే అఖిలేష్ యాదవ్‌ను కూడా కలిసే ఛాన్స్ ఉందన్నారు.కాగా, సీఎం మమతా బెనర్జీ గురువారం మాట్లాడుతూ.. వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుమారుడు వివాహం కోసం నేను ముంబై వెళ్తున్నాను. ఇదే సమయంలో రేపు(శుక్రవారం) శివసేన నేత ఉద్దవ్ థాక్రే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌తో సమావేశం కాబోతున్నాను. ఈ సందర్భంగా దేశ రాజకీయాలపై చర్చించబోతున్నాము. లోక్‌సభ ఎన్నికల తర్వాత మొదటిసారిగా మేము భేటీ అవుతున్నాము. రేపటి భేటీకి అఖిలేష్ యాదవ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పుకొచ్చారు. Kolkata | West Bengal CM Mamata Banerjee says, "I am going to Mumbai for the wedding of Mukesh Ambani's son. Tomorrow I have an appointment with Uddhav Thackeray. I will also meet Sharad Pawar there. There will be political discussion as we will meet after (Lok Sabha) elections.… pic.twitter.com/vpCd4I0Wkd— ANI (@ANI) July 11, 2024ఇదిలా ఉండగా.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇండియా కూటమిలో ఉన్న పార్టీ నేతలతో భేటీ కావడం నేపథ్యంలో ప్రాధాన్యత చోటుచేసుకుంది. వీరి సమావేశంలో ఏం చర్చిస్తారనేది ఆసక్తికరంగా మారింది. -
రైలు ప్రమాదంపై మమతా బెనర్జీ ట్వీట్
-
200 లోక్‌సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
2024 లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ జోస్యం చెప్పారు. అదే సమయంలో ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 200 మార్కును కూడా దాటలేదని అన్నారు.లోక్‌సభ ఎన్నికల తరుణంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కాంగ్రెస్, సీపీఐ(ఎం)లు రాష్ట్రంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నాయని ఆరోపించారు. అయితే బీజేపీకి లబ్ధి చేకూర్చే టీఎంసీయేతర పార్టీలకు ఓటు వేయొద్దని మమతా బెనర్జీ ఓటర్లను కోరారు. ఆరంబాగ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని గోఘాట్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి బెనర్జీ మాట్లాడుతూ.. ఇండియా కూటమి పేరు పెట్టింది నేనే. బీజేపీని ఓడించేందుకు ఇండియా కూటమి నేతలు పనిచేస్తున్నారు. అదే ఇండియా కూటమిని అధికారంలోకి తెచ్చేందుకు టీఎంసీ తన వంతు ప్రయత్నాలు చేస్తోందన్నారు. మోదీ 400 పై చీలూకు లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతున్నారు. అవన్నీ సాధ్యమయ్యేవి కావు. 200 సీట్లు దాటడం గగనమేనని మమతా బెనర్జీ ఎద్దేవా చేశారు. -
ఇండియా కూటమితో విభేదాలు.. వెనక్కి తగ్గిన దీదీ
కోల్‌కతా: సీట్ల పంపకం విషయంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కాంగ్రెస్‌తో విభేదించారు. దీంతో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి సభ్యత్వం తీసుకోవడాన్ని తాత్కాలికంగా నిలిపి వేశారు. అయితే ఈ విషయంలో ఆమె కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రతిపక్ష కూటమి అధికారంలోకి వస్తే దానికి బయటి మద్దతు ఇస్తానని మమతా బెనర్జీ హామీ ఇచ్చారు. ఇండియా కూటమిలో పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్, సీపీఐ(ఎం)లను కలపవద్దు. ఎందుకంటే ఆ రెండు పార్టీలు మాతో లేరు. బీజేపీతో ఉన్నారని మండిపడ్డారు. -
‘సంతోషం’.. కేజ్రీవాల్‌కు మద్యంతర బెయిల్‌పై దీదీ
కోల్‌కతా : మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు మద్యంతర బెయిల్ ఇచ్చింది. సుప్రీం కోర్టు కేజ్రీవాల్‌కు అనుకూలంగా తీర్పు ఇవ్వడంపై ఇండియా కూటమి నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముందు సుప్రీం బెయిల్ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నారు.కేజ్రీవాల్‌కు జూన్ 1 వరకు మద్యంతర బెయిల్ ఇస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు అనంతరం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎక్స్ వేదికగా స్పందించారు.ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల సమయంలో కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు మద్యంతర బెయిల్ ఇవ్వడం తమకు ఉపకరిస్తుందని దీదీ అన్నారు. అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ లభించినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ప్రస్తుత ఎన్నికల సందర్భంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని ఆమె ఎక్స్‌లో పోస్ట్‌లో పేర్కొన్నారు.మద్యం పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు శుక్రవారం సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 1 వరకు ఆయనకు బెయిల్ వర్తించనుంది. అప్పటి వరకు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనవచ్చు. అయితే సీఎం హోదాలో ఎలాంటి ఫైళ్లపై అధికార సంతకాలు చేయకూడదని సుప్రీంకోర్టు తెలిపింది. -
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
కోల్‌కతా : బీజేపీ డబ్బులతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తోందంటూ పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఆరంబాగ్‌లో పార్టీ అభ్యర్ధి మితాలీ బాగ్‌కు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ.. రూ.5,000, రూ.10,000, రూ.15,000 వరకు డబ్బులు చెల్లించి బీజేపీ ఓట్లను కొనుగోలు చేస్తోందని అన్నారు.తమపై తప్పుడు ప్రచారం చేసేలా మహిళలకు బీజేపీ డబ్బులిచ్చి ఉసిగొల్పిందని, సందేశ్‌ఖాలీలోని మహిళల పరువును ఎలా తీసిందో మీరో చూడండి అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని 26 వేల మంది టీచర్ల ఉద్యోగాలను బీజేపీ లాక్కుందని, సుప్రీం కోర్టు తీర్పుతో నిజం గెలిచిందని సంతోషం వ్యక్తం చేశారు. 100 రోజుల పనికి సంబంధించిన డబ్బును మా పార్టీ దొంగిలించిందని మోదీ అంటున్నారు. అవన్ని అవాస్తవాలే. రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల పని కింద రూ. 24 కోట్లు ఆదా చేసిందని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. -
25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో 25 వేల మందికి పైగా ఉపాధ్యాయుల నియామకాల్ని రద్దు చేస్తూ ఇచ్చిన కోలకత్తా హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. సీబీఐ ఈ అంశాన్ని పరిశీలిస్తుందని, అయితే అభ్యర్థులపై లేదా అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు సూచించింది.25 వేలకుపైగా ఉపాధ్యాయుల2016లో మమతాబెనర్జి ప్రభుత్వం ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 25 వేలకుపైగా ఉపాధ్యాయులను నియమించింది. స్టేట్ లెవల్ సెలెక్షన్ టెస్ట్ ద్వారా ఈ నియామకాలు చేపట్టింది. అయితే ఈ నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడంతో కేసు కోర్టుకు వెళ్లింది. ఈ క్రమంలో ఇవాళ కోల్‌కతా హైకోర్టు ఆ నియామకాలు చెల్లవని తీర్పు చెప్పింది. ఆ రిక్రూట్మెంట్ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులు వారు అందుకున్న వేతనాలను 12 శాతం వడ్డీతో తిరిగి చెల్లించాలని ఆదేశించింది.ప్రజల విశ్వాసం కోల్పోతేకోల్కతా హైకోర్టు తీర్పుపై వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేసింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ విచారణ సందర్భంగా.. ఉపాధ్యాయుల నియామకాల్లో అవకతవకలు జరిగితే.. వ్యవస్థలో ఇంకేం మిగులుతుందని ప్రశ్నించింది. ప్రజల విశ్వాసం కోల్పోతే ఇంకేమీ మిగలదని వ్యాఖ్యానించింది. రాష్ట్ర అధికారులను నిలదీసిన కోర్టుమొత్తం రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రశ్నార్థకంగా ఉన్నప్పుడు కొత్త పోస్టులను ఎలా విడుదల చేస్తారు. వెయిట్‌లిస్ట్‌లో ఉన్న అభ్యర్థులను ఎలా నియమిస్తారంటూ రాష్ట్ర అధికారులను కోర్టు నిలదీసింది. సరైన రికార్డులు, డేటా సెక్యూరిటీ ప్రోటోకాల్‌లు లేకపోవడంపై సుప్రీం కోర్టు సంబంధిత అధికారులను మందలించింది. -
టీఎంసీ ఎంపీల ఆందోళన.. ఈడ్చుకెళ్లిన పోలీసులు
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని ఈడ్చుకెళ్తూ పోలీసు వాహనంలోకి ఎక్కించుకుని వెళ్తున్న దుశ్యాలు వైరల్‌గా మారాయి. ఢిల్లీలోని ఎన్నికల ప్రధాన కార్యాలయంలో టీఎంసీ ఎంపీలు హల్చల్ చేశారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేస్తుందంటూ, వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఎన్నికల ముందు దర్యాప్తు సంస్థలకు నేతృత్వం వహించే చీఫ్‌లను ఎన్నికల సంఘం తొలగించాలని నినాదాలు చేశారు. ఎంపీల ఆందోళనతో సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. మాట వినకపోవడంతో వారిని నెట్టడం, లాగడం, ఎత్తుకెళ్లి పోలీస్ వాహనం ఎక్కించారు. అయితే, ఎన్నికల కమీషనర్లను కలిసిన తర్వాత వెళ్లిపోవాలని అధికారులు పలుమార్లు చెప్పినప్పటికి వినకపోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. వారిని బలవంతంగా పోలీస్ వాహనంలోకి తరలించాల్సి వచ్చిందని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. ప్రధాని మోదీ హెచ్చరిక పశ్చిమబెంగాల్లోని జల్పాయ్గురిలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచార సభలో అధికార పార్టీ టీఎంసీపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఎన్నికల ఫలితాలు వెలువడనున్న జూన్ 4 తర్వాత అవినీతిపై చర్యలు వేగవంతం అవుతాయని హెచ్చరించారు. అవినీతిని అంతం చేయకూడదా? అవినీతిపరులను జైలుకు పంపకూడదా? టీఎంసీ అవినీతిని వదిలించుకోకూడదా? ఇది మోదీ హామీ అని ఆయన అన్నారు. ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేసిన అనంతరం టీఎంసీ ఎంపీలు ఎన్నికల ప్రధాన కార్యాలయంలో ఆందోళన చేపట్టడం గమనార్హం. ఆందోళన చేపట్టిన టీఎంసీ అంతకుముందు తమ పార్టీకి భయం లేదని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. కానీ బీజేపీ మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం ఏజెన్సీలను వాడుకుంటోందని ఆమె ఆరోపించారు. మోడీ కా గ్యారెంటీ అంటున్నారు.. మోడీ గ్యారెంటీ ఏమిటి.. జూన్ 4 తర్వాత అందరినీ జైల్లో పెడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఎన్ఐఏ అధికారులపై దాడి.. గవర్నర్ ఆగ్రహం
కోల్‌కతా : యాంటీ టెర్రర్ ఏజెన్సీ ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) అధికారులపై జరిగిన దాడిని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ ఖండించారు. ఎన్ఐఏ లాంటి దర్యాప్తు సంస్థలను బెదిరించే ఇటువంటి ప్రయత్నాలు ఆమోదయోగ్యం కాదని, వాటిని పరిష్కరించాలని బోస్ పేర్కొన్నారు. పరిస్థితులను ఎదుర్కోవడంలో వేగంగా, నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ‘ఇది చాలా తీవ్రమైన పరిస్థితి. ఈ రకమైన ‘గూండాయిజం’ సరైంది కాదని పీటీఐకి ఇంటర్వ్యూ ఇచ్చారు. 2022లో బాంబు పేలుడు ఘటనలో ముగ్గురు మరణించడంపై ఎన్ఐఏ అధికారులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు విచారణలో భాగంగా బాంబు పేలుడు ఘటనకు సంబంధం ఉన్న మిడ్నాపూర్ జిల్లా భూపతినగర్ గ్రామానికి చెందిన ప్రధాన నిందితుడు మోనోబ్రోటో జానా, అతని సహచరులను అదుపులోకి తీసుకున్నారు. తిరిగి వస్తున్న ఎన్ఐఏ అధికారులపై స్థానికులు దాడి చేశారు.అధికారుల వినియోగించిన కారును ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఒక అధికారి గాయపడ్డారు. Another example of lawlessness in West Bengal under Mamata Banerjee government A team of NIA officers, which went to Bhupatinagar in East Medinipur District of West Bengal, to arrest two TMC leaders, were targeted More than 100 villagers, not only stopped the NIA team from… pic.twitter.com/aJWWSEOsh2 — Organiser Weekly (@eOrganiser) April 6, 2024 -
విమాన టికెట్ కంటే ఎక్కువా?
కోల్‌కతా: రైళ్లలో డైనమిక్ ప్రైసింగ్‌ను తక్షణం ఉపసంహరించాలని పశి్చమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆదివారం డిమాండ్ చేశారు. పండుగలు తదితర రద్దీ సందర్భంగా గత వారం దేశవ్యాప్తంగా పలు రూట్లలో రైలు టికెట్ల ధరలు విమాన టికెట్లను కూడా మించిపోతున్నాయని విమర్శించారు. ఇలాగైతే అత్యవసర పరిస్థితిలో రైల్లో ప్రయాణించాల్సిన వారి గతి ఏమిటని ఆమె ప్రశ్నించారు. డైనమిక్ ప్రైసింగ్‌ను తక్షణం రద్దు చేయడంతో పాటు ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలని సూచించారు. మమత గతంలో రైల్వే మంత్రిగా కూడా చేయడం తెలిసిందే. రైలు టికెట్లకు డైనమిక్ ప్రైసింగ్‌ను 2016లో రైల్వే శాఖ ప్రవేశపెట్టింది. ఛత్ పూజ తదితరాల నేపథ్యంలో బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని పలు ముఖ్య నగరాలకు రైలు టికెట్ల ధరలు విమాన టికెట్లను కూడా మించినట్టు వార్తలొచ్చాయి. -
ప్రధాని మోదీకి కేసీఆర్ సహా విపక్ష నేతల లేఖ.. ఏమన్నారంటే?
గత కొన్ని నెలలుగా దేశంలో ప్రతిపక్ష నేతలే టార్గెట్‌గా ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్), సీబీఐ, ఐటీ దాడులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో, ప్రతిపక్ష నేతలు కేంద్ర ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీకి తాజాగా విపక్షాలు లేఖ రాశాయి. సీఎం కేసీఆర్ సహా 9 మంది విపక్ష నేతలు ప్రధానికి లేఖ రాశారు. ఇక, లేఖలో భాగంగా మనీష్ సిసోడియా అరెస్ట్‌ను ఖండించారు విపక్ష నేతలు. అలాగే, కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నదని ఆరోపించారు. 2014 నుంచి దేశంలో ఇదే పరిస్థితి ఉందన్నారు. ఇక, గవర్నర్ వ్యవస్థను రాజకీయాల కోసం వాడుకుంటున్నారని విమర్శించారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని పేర్కొన్నారు. ప్రజా తీర్పును గౌరవించాలని కోరారు. భారత్ ఇంకా ప్రజాస్వామ్య దేశమే అని నమ్ముతున్నామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. విపక్ష సభ్యులపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నారని అన్నారు. ఈడీ, సీబీఐ కేసుల్లో ఉన్న వాళ్లు బీజేపీలో చేరితే క్లీన్చిట్ ఇస్తున్నారని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్బంగా ప్రస్తుత అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మపై శారదా చిట్‌ఫండ్‌పై 2014, 2015లో సీబీఐ, ఈడీ విచారణ జరిపాయి. ఆయన బీజేపీలో చేరిన తర్వాత కేసు పురోగతి లేదన్నారు. అలాగే, బీజేపీలో చేరిన సువేందు అధికారి, ముకుల్ రాయ్, నారాయణ్ రాణే వంటి మరికొందరిపై కూడా కేసులు నమోదు చేసినప్పటికీ విచారణలో జాప్యం జరుగుతోందని ఆరోపించారు. ఇదే క్రమంలో సిసోడియా అరెస్ట్ వెనుక రాజకీయ కుట్ర ఉంది. దేశంలోనే విద్యావ్యవస్థలో మంచి సంస్కరణలు తీసుకువచ్చారన్న మంచి పేరుంది. ఎటువంటి ఆధారాలు లేకుండా సిసోడియాను అరెస్ట్ చేశారు. సిసోడియాపై ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి అని లేఖలో పేర్కొన్నారు. ఇక లేఖ రాసిన వారిలో సీఎం కేసీఆర్, మమతా బెనర్జీ, స్టాలిన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, శరద్ పవార్, ఫరుఖ్ అబ్దుల్లా, తేజస్వీ యాదవ్, ఉద్ధవ్ థాక్రే, అఖిలేష్ యాదవ్ ఉన్నారు. -
ప్రశాంత్ కిషోర్ వల్లే కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పా..
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఎన్నికల్లో ఓటముల పరంపర కొనసాగుతుండటంతో ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్‌ను వీడిన సంగతి తెలిసిందే. కాగా, కాంగ్రెస్ పార్టీని వీడటంపై తృణముల్ కాంగ్రెస్ నేత శత్రుఘ్న సిన్హా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. తాను తృణముల్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రాజకీయ వ్యుహకర్త ప్రశాంత్ కిషోర్, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాల కీలక పాత్ర ఉందని అన్నారు. ఈ సందర్భంగానే టీఎంసీ పార్టీలో చేరడం మర్యాదగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం తన ఫోకస్ అంతా టీఎంసీపైనే ఉందన్నారు. అసన్సోల్ లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికలో తాను పోటీ చేస్తున్నట్టు వెల్లడించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ, ప్రస్తుతం కాంగ్రెస్ సంక్షోభం ముంగిట్లో ఉందన్నారు. ఇలాంటి సమయంలో ఆ పార్టీపై విమర్శలు చేయడం ఇష్టం లేదన్నారు. అలాగే, కాంగ్రెస్‌లో తప్పులు ఎక్కడ జరిగాయో.. తాను ఎందుకు బయటకు వచ్చానో త్వరలో చెబుతానని అన్నారు. మరోవైపు.. బెంగాల్‌లోని అసన్సోల్ లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ టీఎంసీ అభ్యర్థిగా శత్రుఘ్న సిన్హాను బరిలోకి దింపుతున్నామని ప్రకటించారు. మరో ఉప ఎన్నిక బాలిగంజ్ అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా జరుగుతుండటంతో కేంద్ర మాజీ మంత్రి, సింగర్ బబుల్ సుప్రియోను బాలిగంజ్ నుంచి రంగంలోకి దింపుతున్నట్టు మమతా బెనర్జీ ట్విట్టర్లో పేర్కొన్న విషయం తెలిసిందే. -
Mamata Banerjee: మోదీని గద్దె దించేద్దాం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అధికార బీజేపీ, ప్రధాని∙మోదీపై సమరభేరి మోగించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తన లక్ష్యమని ప్రకటించారు. రాకేష్ తికాయత్, యుధ్వీర్ సింగ్ (భారతీయ యూనియన్) నేతృత్వంలో బుధవారం తనను కలుసుకున్న రైతు నాయకులతో మమత చర్చలు జరిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం, కనీస మద్దతు ధరని కొనసాగించాలనే డికిసాన్మాండ్లతో గత కొన్ని నెలలుగా ఆందోళనలు చేస్తున్న రైతన్నలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. భేటీ తర్వాత తికాయత్ మీడియాతో మాట్లాడారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీకి ఓటు వేయొద్దని విస్తృతంగా ప్రచారం నిర్వహించిన భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ తికాయత్, ఇతర రైతు నాయకులు వచ్చే ఏడాది యూపీ సహా అయిదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లోనూ ఇదే ప్రచారాన్ని నిర్వహించాలని భావిస్తున్నారు. ‘మేము ప్రకృతి విపత్తులతో పాటు రాజకీయ విపత్తుల్ని ఎదుర్కొంటున్నాం’’ అని మమత అన్నారు. రైతన్నలకు మద్దతుగా బీజేపీయేతర రాష్ట్రాలన్నీ ఏకం కావాలంటూ ఆమె విపక్షాలకు పిలుపునిచ్చారు. చర్చలకు సిద్ధం: తోమర్ రైతులతో చర్చల్ని పునరుద్ధరించడానికి తాము సిద్ధంగా ఉన్నామనివ్యవసాయ మంత్రి తోమర్ చెప్పారు. అయితే వ్యవసాయ చట్టాల్లో ఉన్న అభ్యంతరకర అంశాలను సహేతుకంగా చెప్పాలని రైతులకు సూచించారు. -
బెంగాల్లో శాంతి భద్రతల పరిస్థితి... తీవ్ర ఆందోళనకరం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో రాజకీయ వేడి మరింతగా రాజుకుంది. గవర్నర్ నేరుగా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం శాంతిభద్రతలు పూర్తిగా దిగజారాయని, పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా మారిపోయిందని గవర్నర్ జగదీప్ ధన్కర్ అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. ఎన్నో హత్యలు, అత్యాచారాలు చోటుచేసుకున్నాయని చెప్పారు. ఎన్నికల తర్వాత ప్రతీకారంలో భాగంగా కొనసాగుతున్న హింసను అరికట్టేందుకు అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పాలని, ఈ నెల 7న (సోమవారం) తన ఎదుట స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని బెంగాల్ చీఫ్ సెక్రటరీ హెచ్‌కే ద్వివేదీని గవర్నర్ ఆదేశించారు. బెంగాల్లో రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధించేందుకు పోలీసు యంత్రాంగాన్ని సైతం వాడుకుంటున్నారని ఆక్షేపించారు. రాష్ట్రంలో హింసాకాండ వల్ల లక్షలాది మంది నిరాశ్రయులయ్యారని, కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసినవారు బాధితులుగా మారుతున్నారని అన్నారు. అరాచక శక్తులు అమాయక ప్రజలపై దాడులకు పాల్పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తృ బెంగాల్లో ప్రజాస్వామ్య విలువలను పట్టపగలే కాలరాస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజల ధన, మాన, ప్రాణాలను కాపాడాల్సిన పోలీసులు అధికార పార్టీ నాయకులకు ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. -
‘మండలి’ చరిత్రలో ఎన్నో మలుపులు
భవిష్యత్తులో సీఎంగాని, సీఎం అభ్యర్థిగాని అసెంబ్లీకి పోటీచేస్తే, సొంత స్థానంపై దృష్టి పెట్టి ఐదారు రోజులు అక్కడే తిష్ట వేయాల్సిన అవసరం ఉంటుందని పశ్చిమబెంగాల్లో మొన్నటి నందిగ్రామ్ పోరు నిరూపించింది. పార్టీకి మెజారిటీ వచ్చి ఇతర కారణాల వల్ల సొంత సీట్లో ఓడితే సీఎం పదవి చేపట్టడానికి ఇబ్బంది లేకున్నా కొంత చికాకు తప్పదు. ఇలాంటి పరిస్థితిని నివారించడానికి బెంగాల్‌కు మండలి అవసరమని మమత గుర్తించిన కారణంగానే అధికారం చేపట్టిన నెలలోపే అందుకు అవసరమైన ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. మమత మాదిరిగా 25–30 ఏళ్లుగా ఎన్నికల రాజకీయాల్లో కొనసాగుతున్న బడా నేతలు ఇక ముందు ప్రతిసారీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసి జనాదరణ ఉందని నిరూపించుకోవాల్సిన అవసరం లేదని తేలిపోయింది. ఎప్పుడో 52 సంవత్సరాల క్రితం రద్దయిన పశ్చిమ బెంగాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ పునరుద్ధ రణకు మమతా బెన ర్జీ కేబినెట్ మే 17న నిర్ణయించింది. కౌన్సిల్ ఏర్పాటుకు రాష్ట్ర అసెంబ్లీ మూడింట రెండు వంతుల మెజారిటీతో తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపడం ఇక లాంఛనమే. కేంద్ర ప్రభుత్వం చొరవతో బెంగాల్లో కౌన్సిల్ ఏర్పాటుకు పార్లమెంటు ఉభయసభల్లో తీర్మానించాకే రాష్ట్ర అసెంబ్లీ కోరిక నెరవేరుతుంది. సాధారణంగా ఒక రాష్ట్రంలో ఉన్న కౌన్సిల్ రద్దుకు లేదా మండలి పునరుద్ధరణకు అసెంబ్లీ ప్రత్యేక మెజారిటీతో ఆమోదించిన తీర్మానాలపై కేంద్ర ప్రభుత్వాలు సకాలంలో స్పందిం చవు. రాష్ట్రంలో, కేంద్రంలో ఒకే పార్టీ ప్రభుత్వాలు ఉన్నా విపరీత జాప్యం సర్వసాధారణం. ఒక్కోసారి ఒక రాష్ట్రంలో మండలి పునరుద్ధ రణకు తీర్మానం చేసి కేంద్రానికి పంపితే, పాతిక ముప్పయి ఏళ్లయినా ఆ పని జరగదు. తమిళనాడులో శాసనమండలి పునరుద్ధరణకు 1989లో అసెంబ్లీ తీర్మానం చేసి పంపితే ఇంత వరకూ అతీగతీ లేదు. అయినా, రాష్ట్రాలను పరిపాలించే పార్టీలు తమ ఎన్నికల వాగ్దానాల్లో భాగంగానో, ఆచరణలో కౌన్సిల్ వల్ల అవరోధాల వల్లనో విధాన పరిషత్ రద్దుకు తీర్మానాలు ఆమోదించి పంపడం గత 30 ఏళ్లుగా జరుగున్న పనే. కేంద్రంలో తమకు అనుకూల ప్రభుత్వం ఉందా? వ్యతిరేక ప్రభుత్వం ఉందా? కేంద్రం పట్టించుకోకపోతే తమ తీర్మానం వృ«థా ప్రయాసేనా? అని ప్రజాతంత్ర రాజకీయ పార్టీలు ఆలోచిం చవు. ఈ నేపథ్యంలోనే కేంద్రంలో తనను బద్ధ శత్రువుగా భావించే బీజేపీ అధికారంలో ఉన్నా తాను ముందే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా, తన తక్షణ అవసరాలకు అనుగుణంగా పశ్చిమ బెంగాల్లో కౌన్సిల్ పునరుద్ధరణకు తీర్మానం పంపాలనే కృత నిశ్చయంతో తృణమూల్ ప్రభుత్వం ఉంది. కౌన్సిల్ అవసరం ఏమొచ్చింది? తృణమూల్ కాంగ్రెస్ తొలిసారి అధికారంలోకి వచ్చిన 2011 లోనే కౌన్సిల్ మళ్లీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ప్రకటిం చింది. అప్పటికి 34 ఏళ్లుగా అధికారంలో ఉన్న వామపక్ష ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిన సింగూరు, నందిగ్రామ్ భూపోరాటాల్లో మమతకు బాసటగా నిలిచిన మేధావులు, విశిష్ట వ్యక్తులకు చట్టసభలో స్థానం కల్పించడానికి కౌన్సిల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దానిపై మంత్రివర్గ నిర్ణయం తీసుకోవడానికి పదేళ్లు పట్టింది. మండలి మళ్లీ ఏర్పాటు ఆలోచన ఇన్నాళ్లకు కొద్దిగానైనా ముందుకు సాగడానికి ఈ అంశాన్ని నిన్నటి బెంగాల్ అసెంబ్లీ ఎన్ని కల సందర్భంగా విడుదల చేసిన తృణమూల్ ఎన్నికల ప్రణాళికలో చేర్చడం ఒక్కటే కారణం కాదు. సీఎం మమత, ఆర్థిక మంత్రి మదన్ మిత్రా ఇప్పుడు ఎమ్మెల్యేలు కాదు. నందిగ్రామ్‌లో ఓడిన మమత తన పాత స్థానం భబానీపూర్ నుంచి ఉప ఎన్నికలో పోటీకి సిద్ధమౌతున్న మాట వాస్తవమే. ఆమెకైతే సీఎంగా కొనసాగడానికి తక్షణమే కౌన్సిల్ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో సీఎంగాని, సీఎం అభ్యర్థిగాని అసెంబ్లీకి పోటీచేస్తే, సొంత స్థానంపై దృష్టి పెట్టి ఐదారు రోజులు అక్కడే తిష్ట వేయాల్సిన అవసరం ఉంటుందని మొన్నటి నందిగ్రామ్ పోరు నిరూపించింది. పార్టీకి మెజారిటీ వచ్చి ఇతర కారణాల వల్ల సొంత సీట్లో ఓడితే సీఎం పదవి చేపట్టడానికి ఇబ్బంది లేకున్నా కొంత చీకాకు తప్పదు. మొత్తం 294 సీట్లలో మమత తన పూర్వ అనుచరుడు సువేందు అధికారిపై పోటీచేసిన నందిగ్రామ్‌పై దేశ ప్రజలందరి దృష్టి నిలిచింది. ఇలాంటి పరిస్థితిని నివారించడానికి బెంగాల్‌కు మండలి అవసరమని మమత గుర్తించిన కారణంగానే అధికారం చేపట్టిన నెలలోపే అందుకు అవసరమైన ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. మమత మాదిరిగా 25–30 ఏళ్లుగా ఎన్నికల రాజకీ యాల్లో కొనసాగుతున్న బడా నేతలు ఇక ముందు ప్రతిసారీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసి జనాదరణ ఉందని నిరూపించుకోవాల్సిన అవ సరం లేదని తేలిపోయింది. అందుకే, మహారాష్ట్ర, యూపీ, బిహార్ వంటి పెద్ద రాష్ట్రాల్లోని నేటి ముఖ్యమంత్రులు కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయలేదు. 2019 నవంబర్‌లో అనూహ్య పరిస్థితుల్లో మహారాష్ట్ర సీఎం అయిన శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే తర్వాత శాసన మండలికి ఎన్నికయ్యారు. బిహార్‌లో సీఎం పదవి చేపట్టిన నేతల్లో లాలూ, రబ్రీ, నితీశ్! బిహార్‌లో ఇప్పటికి 23 మంది ముఖ్యమంత్రి పదవి చేపట్టగా వారిలో ఏడుగురు ఎమ్మెల్సీలే. ప్రస్తుత సీఎం నితీశ్‌కుమార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన కూటమి(జేడీయూ–బీజేపీ) మెజారిటీ సాధించడంతో 2005లో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశాక ఎమ్మెల్సీగా ఎన్నిక య్యారు. అప్పటి నుంచీ ఆయన కౌన్సిల్ సభ్యునిగానే సీఎం పదవిలో కొనసాగుతున్నారు. 1990లో లోక్‌సభ ఎంపీగా ఉన్న లాలూ ప్రసాద్ తొలిసారి సీఎం పదవి చేపట్టాక రాష్ట్ర శాసన మండలికి ఎన్నికై ఐదేళ్లూ సీఎంగా ఉన్నారు.1995 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి గెలిచి రెండేళ్లు సీఎం పదవిలో కొనసాగి రాజీనామా చేశారు. 1997లో ఆయన భార్య రబ్రీదేవి తన భర్త ఖాళీచేసిన పదవిని చేపట్టాక ఎమ్మెల్సీగా ఎన్నికై 2000 ఎన్నికల్లో మాత్రమే అసెంబ్లీకి ఎన్నికయ్యారు. బిహార్‌లో యాదవవర్గం నుంచి తొలి సీఎం అయిన బిందేశ్వరీ ప్రసాద్ మండల్ ఎమ్మెల్సీగా ముఖ్యమంత్రి అయిన తొలి నేత. ఆయన పదవిలో ఉన్నది 51 రోజులేగాని రెండో బీసీ కమిషన్ (మండల్ కమిషన్) చైర్మన్‌గా దేశ ప్రజలందరికీ పరిచయమయ్యారు. సీఎం పదవి దక్కాక కౌన్సిల్‌కు ఎన్నికవడం కొత్త ఆనవాయితీ! గత 14 సంవత్సరాలకు పైగా ఎమ్మెల్సీలే ముఖ్యమంత్రి పదవులో కొనసాగుతున్న ఉత్తర్‌ప్రదేశ్‌లో మాత్రం 1952 నుంచి 1999 వరకూ సీఎం పదవిలో ఎమ్మెల్యేలే ఉన్నారు. 1999 నవంబర్ 2000 అక్టోబర్ మధ్య సీఎం పీఠంపై ఉన్న రామ్‌ప్రకాశ్ గుప్తా(బీజేపీ) యూపీలో సీఎం అయిన తొలి ఎమ్మెల్సీ. బీఎస్పీ అధినేత్రి మాయా వతి 2007 ఎన్నికల్లో తన పార్టీ తొలిసారి మెజారిటీ సాధించాక ముఖ్యమంత్రి పదవి చేపట్టి మండలికి ఎన్నికై పదవిలో కొనసాగారు. 2002 అసెంబ్లీ ఎన్నికల తర్వాత వరుసగా జరిగిన మూడు ఎన్నిక ల్లోనూ అసెంబ్లీకి ఆమె పోటీ చేయలేదు. ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్ 2012 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయలేదు. ఎస్పీకి అప్పుడు మెజారిటీ రావడంతో ఆయన సీఎం అయ్యాక కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు. తర్వాత 2017 ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించాక ఆదిత్యనాథ్ సీఎం అయ్యారు. తర్వాత కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు. మొదట సీఎం అయ్యాక కౌన్సిల్ సభ్యుడైన తొలి నేత రాజాజీ 1952 మద్రాసు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మెజారిటీ రాలేదు. దాంతో సీఎం పదవి చేపట్టాలని సి.రాజగోపాలాచారిని నెహ్రూ ఒప్పించారు. రాజాజీని గవర్నర్ శ్రీప్రకాశ కౌన్సిల్‌కు నామి నేట్ చేశాక సీఎంగా ప్రమాణం చేయించారు. దేశంలో సీఎం అయిన తొలి ఎమ్మెల్సీ రాజాజీయే. మళ్లీ బెంగాల్ విషయానికొస్తే, 1967 ఎన్నికల్లో కమ్యూనిస్టుల భాగస్వామ్యంతో అజయ్‌ముఖర్జీ నాయక త్వాన తొలి కాంగ్రెసేతర (యునైటెడ్ ఫ్రంట్) సర్కారు ఏర్పడింది. జ్యోతిబసు డిప్యూటీ సీఎంగా ఉన్న ఈ ప్రభుత్వాన్ని 8 నెలలకే గవర్నర్ ధర్మవీర బర్తరఫ్ చేశారు. వెంటనే కాంగ్రెస్ మద్దతున్న పీసీ ఘోష్‌తో సీఎంగా ప్రమాణం చేయించారు. గవర్నర్ చర్య రాజ్యాంగ విరుద్ధమని అసెంబ్లీ స్పీకర్ ఖండించారు. కాంగ్రెస్‌కు మెజారిటీ ఉన్న కౌన్సిల్లో ఘోష్ సర్కారుపై విశ్వాసం ప్రకటిస్తూ తీర్మానం ఆమోదించారు. 1969 మధ్యంతర ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చిన యునైటెడ్ ఫ్రంట్ వెంటనే కౌన్సిల్ రద్దుకు అసెంబ్లీలో తీర్మానించి పంపగా, ప్రధాని ఇందిరాగాంధీ పార్లమెంటులో దానికి ఆమోద ముద్ర వేయించారు. ఇందిర చొరవతో రద్దయిన మండలి మమత పట్టుదలతో ఎప్పుడు ప్రాణం పోసుకుంటుందో కాలమే నిర్ణయిస్తుంది. వ్యాసకర్త : నాంచారయ్య మెరుగుమాల సీనియర్ జర్నలిస్ట్ -
Nandigram: నందిగ్రామ్.. హై టెన్షన్
కోల్‌కతా: తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీ తొలిసారి బరిలో నిలిచిన పశ్చి మ బెంగాల్‌లోని నందిగ్రామ్ నియోజకవర్గ ఫలితాలు నరాలు తెగే ఉత్కంఠత రేపాయి. కౌంటింగ్ కొనసాగుతున్న కొద్దీ మమతా బెనర్జీ, బీజేపీ నేత సువేంధు అధికారి మధ్య క్షణ క్షణం మారిపోతున్న ఓట్ల మెజారిటీ... మొత్తం రాష్ట్ర ఎన్నికల ఘట్టంలోనే అత్యంత ప్రధానమైనదిగా నిలిచింది. ఇద్దరు ప్రధాన పార్టీల ప్రత్యర్థుల మధ్య అటూ ఇటూ దోబూచులాడిన మెజారిటీ.. చివరకు సువేంధు అధికారిని వరించింది. మమతా బెనర్జీపై స్వల్ప ఆధిక్యంతో గెలిచినట్లు ఎన్నికల సంఘం ఎట్టకేలకు ప్రకటించింది. అయితే, నందిగ్రామ్ ఫలితాలపై తాను కోర్టుకు వెళ్తానని మమతా ప్రకటించారు. అంతకుముందు ఆదివారం ఉదయం కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమవగా కొద్దిసేపటికే సువేంధు మమత కంటే ఆధిక్యంలోకి వచ్చారు.ఆ తర్వాత సువేంధు మెజారిటీ ఏకంగా ఎనిమిది వేల దాకా వెళ్లింది. మధ్యాహ్నందాకా సువేంధుదే పైచేయి. మధ్యాహ్నం నుంచి నెమ్మదిగా పుంజుకుని మమత ఆధిక్యంలోకి వచ్చారు. ఆ తర్వాత మళ్లీ ఆధిక్యత మరొకరి చెంతకు చేరింది. ఒకానొక దశలో సువేంధు కేవలం ఆరు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఓట్ల లెక్కింపులో ప్రతీ రౌండ్లో మెజారిటీ సువేంధు, మమత మధ్య మారుతూ వచ్చింది. సువేంధు 1,200 ఓట్ల మెజారిటీలో గెలిచారని వార్తలు రాగా, ఓట్ల లెక్కింపు కొనసాగుతోందని ఎన్నికల సంఘం తెలిపింది. ఆ తర్వాత కొద్దిసేపటికే 1,956 ఓట్ల ఆధిక్యంతో సువేంధు అధికారి గెలిచారని ఎన్నికల సంఘం ప్రకటించింది. త్యాగాలు తప్పవు.. ఈసీ ప్రకటనపై మమతా బెనర్జీ వెంటనే స్పందించారు. ‘‘నందిగ్రామ్‌లో ఓటమిని అంగీకరిస్తున్నాను. మరేం ఫరవాలేదు. అయితే, నందిగ్రామ్‌లో అక్రమాలు జరిగాయని విన్నాను. దీనిపై కోర్టుకు వెళతాను. మనం మొత్తం రాష్ట్రాన్నే గెలిచాం. ఇంతటి ఘన విజయం సాధించినపుడు ‘నందిగ్రామ్’లో ఓటమిలాంటి త్యాగాలు తప్పవు’’ అని ఫలితాల అనంతరం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. నందిగ్రామ్‌లో రీకౌంటింగ్ జరపాలని ఈసీని టీఎంసీ కోరగా అందుకు ఈసీ నిరాకరించింది. -
బెంగాల్ రాజకీయాల్లో సమూలమార్పు
బెంగాల్లో రాజకీయ నేతలు, కేడర్లు పాత తరహా ఎన్నికల నిర్వహణవైపు మళ్లడం ఇక అసాధ్యం. భారత రాజకీయాల్లో అనేక ధోరణులకు బెంగాల్ మినహాయింపుగా ఉండేది. ఇక్కడ పార్టీల మధ్య స్పర్థ విశిష్టంగా ఉండేది. రాజకీయ కేడర్ సిద్ధాంతపరమైన భాషలో ప్రచారం సాగించేవారు. కులం, కమ్యూనిటీ, డబ్బు ప్రసక్తి లేకుండా ఎన్నికలు జరిగేవి. ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉన్న బెంగాల్‌కి ఈ ఎన్నికలు ముగింపు పలకవచ్చు. బెంగాల్ ఒకవైపు, దేశమంతా మరోవైపు అన్నట్లుగా ఉన్న పరిస్థితిని అమెరికన్ శైలి రాజకీయ నిర్వహణగా ఈ ఎన్నికలు మార్చివేయవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే బెంగాల్ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. గతంతో పోలిస్తే మరింత ఘోరంగా తయారయ్యాయి. పశ్చిమబెంగాల్లో ఎనిమిది దశల్లో సుదీ ర్ఘంగా సాగుతున్న శాసనసభ ఎన్నికల ముగింపు సందర్భంగా ఒక విషయం మాత్రం తేటతెల్లమైంది. అదేమిటంటే బెంగాల్ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. గతంతో పోలిస్తే మరింత ఘోరంగా తయారయ్యాయి.. నేను ఇక్కడ ఎన్నికల ఫలితం గురించి జోస్యం చెప్పబోవడం లేదు. త్వరలోనే ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా రానున్నాయి. అప్పుడు బెంగాల్ రాజకీయ రణరంగంలో జరిగిన సంకుల సమరం ఎలా ముగుస్తుందో మనకు స్పష్టత కలగవచ్చు. నా అభిప్రాయం ప్రకారం ఈ ఎన్నికలు టీఎంసీ, బీజేపీ మధ్య ప్రత్యక్ష పోటీగానే జరిగాయి. కాంగ్రెస్ పార్టీతో, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్‌తో కూటమి గట్టిన వామపక్ష కూటమి బెంగాల్ రాజకీయ రంగస్థలంపై మరోసారి ప్రభావం చూపవచ్చన్న అంచనా తేలిపోయినట్లే చెప్పవచ్చు. బెంగాల్ మూడో శక్తిగా చెబుతున్న ఈ కూటమి 10 శాతం పాపులర్ ఓట్లతో అధికారానికి ఆమడదూరంలోనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అన్నది ఓట్లు ప్రతిఫలించనప్పటికీ బెంగా>ల్లో అత్యంత తీవ్రమైన ఎన్నికల పోటీ ఈసారి మాత్రమే చోటు చేసుకుందని నా అంచనా. టీఎంసీ, బీజేపీలు మొత్తం ఓట్లలో 80 శాతం వరకు కైవసం చేసుకోనున్నాయి. ఈ రెండు పార్టీలకు చెరొక 40:40 నిష్పత్తిలో ఓట్లు వచ్చినట్లయితే బెంగాల్ రాజకీయాలు రసవత్తరంగా మారతాయి. మమతకు అనుకూలంగా 42:38 నిష్పత్తిలో ఓట్లు వస్తే ఆమె నాయకత్వం గురించి, ప్రశాంత్ కిషోర్ మైక్రో మేనేజ్మెంట్ ఘనత గురించి మీడియా విజయగీతాలు మొదలెడతాయి. దీనికి భిన్నంగా బీజేపీకి అనుకూలంగా ఇదే నిష్పత్తిలో ఓట్లు వస్తే మోదీ– అమిత్ షా ద్వయం సృష్టించిన మహా కాషాయ దళ ప్రభంజనం గురించి టీవీ స్టూడియోలు చెక్కభజన మొదలెడతాయి. నూతన రాజకీయ కూటములకు నాంది మే 2న ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతాయి అనేదానితో నిమిత్తం లేకుండానే, పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతం మౌలికంగానే రాజకీయ పునరేకీకరణ చోటు చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్లో బీజేపీ సాధించిన అసాధారణ విజయం ఈ విషయాన్ని తేటతెల్లం చేసింది. 2011 ఎన్నికల్లో కూడా బీజేపీకి బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో 4.1 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. 2016లో 10.2 శాతం ఓట్లు సాధించినప్పటికీ బీజేపీకి అదనంగా 3 అసెంబ్లీ స్థానాలు మాత్రమే దక్కడం గమనార్హం. అంటే ఇటీవలి కాలం వరకు బెంగాల్లో బీజీపీ ఉనికి కనీసమాత్రంగానే కనిపించేది. కానీ 2019 సార్వత్రిక ఎన్నికల నాటికి పరిస్థితి నాటకీయంగా మారిపోయింది. బెంగాల్‌లోని 42 ఎంపీ స్థానాలకుగాను 18 సీట్లతో, 40.2 శాతం ఓట్లు కొల్లగొట్టిన బీజేపీ.. ప్రధాని నరేంద్రమోదీ ప్రజాదరణ కారణంగా అధికార తృణమూల్ కాంగ్రెస్‌కి ప్రధాన పోటీదారుగా సవాల్ చేసే స్థాయికి ఎగబాకింది. స్పష్టంగానే టీఎమ్సీ, బీజేపీల మధ్య రాజకీయ స్పర్థ కొంత కాలంపాటు కొనసాగనుంది. కొన్నేళ్ల క్రితం వరకు ఇలాంటిది బెంగాల్లో సంభవిస్తుందని ఊహామాత్రంగా కూడా భావించేవారు కాదు. కొత్త సామాజిక ఏకీకరణ ఈ పరిస్థితి బెంగాల్లో సామాజిక శక్తుల పునరేకీకరణకు చోటు కల్పించింది. ప్రధానంగా వెనుకబడిన ప్రాంతాలు, సామాజిక బృందాలను తన వైపునకు తిప్పుకోవడం ద్వారా బీజేపీ బెంగాల్ రాజకీయాల్లోకి ప్రవేశించింది. ఉత్తర బెంగాల్, పశ్చిమ బెంగాల్‌లోని జంగిల్ మహల్ లోని వెనుకబడిన ప్రాంతాలలో బీజేపీ ప్రారంభ విజయాలను సాధించింది. దళితులు, ఆదివాసీలు, బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన హిందువులు, పట్టణ ప్రాంతాల్లోని హిందీ మాట్లాడే వారిని ఆకర్షిం చడం ద్వారా బీజేపీ బెంగాల్లో తనదైన పునాదిని సృష్టించుకుంది. 2019 నుంచి ఈ సెక్షన్లను దాటి బీజేపీ తన పరిధిని విస్తరించుకుంది. ఈసారి అది గ్రామీణ దక్షిణ బెంగాల్ కేంద్ర స్థానంలోకి చొచ్చుకుపోయింది. పైగా బెంగాల్ మధ్యతరగతి భద్రలోక్ ప్రజల్లో కాస్త చోటు సంపాదించుకుంది. చాలాకాలంగా పశ్చిమబెంగాల్లో అణ చిపెట్టిన కుల రాజకీయాలను ప్రేరేపించడం ద్వారా బీజేపీ ఈసారి కొత్త తరహా అస్తిత్వ రాజకీయాలను సృష్టించవచ్చు. ఈ తరహా రాజకీయాలకు ఆధారం హిందూ సమీకరణే కావచ్చు. పాపులర్ ఓటు ఎక్కడైనా సరే 40 శాతానికి దగ్గరగా వచ్చిందంటే దానర్థం.. రాష్ట్రంలో 70 శాతంగా ఉన్న హిందూ ఓటర్లలో మూడింట రెండు వంతుల మందిని తనవైపునకు తిప్పుకోవడంలో బీజేపీ విజయం సాధించిందనే. 30 శాతం మేరకు ముస్లిం ఓటర్లు ఉన్న రాష్ట్రంలో హిందువులను తారస్థాయిలో సంఘటితం పర్చుకోవలసిన అవసరం బీజేపీకి ఉంది. 1940లలో హిందూ–ముస్లిం హింసకు కేంద్రబిందువుగా ఉన్న మతపరమైన గతంలోకి బెంగాల్ మరో సారి వెళ్లిపోనుందని దీనర్థం. మనీ, మెషిన్ సరికొత్త పాత్ర బెంగాల్ రాజకీయాల్లో పార్టీల భుజబల ప్రదర్శనకు ఈసారి డబ్బు, ఎన్నికల యంత్రాంగం తోడై నిలిచాయి. భుజబల ప్రదర్శన బెంగాల్ రాజకీయాలకు కొత్త కాదు. 1960లలో కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్య ఘర్షణలు, ఆ తర్వాత కమ్యూనిస్టుల మధ్య అంతర్గత ఘర్షణలలో దీని పునాదులు మనకు కనిపిస్తాయి. తన రాజకీయ ప్రత్యర్థులపై వామపక్ష కూటమి పాలన సాగించిన హింసా ప్రయోగం బహిరంగ రహస్యమే. ఈ వారసత్వాన్ని మమతా బెనర్జీ కొనసాగించడమే కాకుండా మరింత వేగవంతం చేసింది. 2018 పంచాయితీ ఎన్నికల్లో టీఎంసీ నాయకులు సాగించిన మితిమీరిన హింసాకాండ పాలకపార్టీపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి కారణమైంది. ఇప్పుడు వామపక్ష సానుభూతిపరుల్లో బలమైన వర్గం తమ విధేయతను బీజేపీవైపు మళ్లించడంతో బీజేపీ ఇప్పుడు అదే హింసను కొనసాగిస్తోంది. ఇకపోతే, రాష్ట్ర చరిత్రలో ఇంత అత్యధికంగా డబ్బు వెదజల్లిన ఎన్నిక ఇదేనని స్పష్టమవుతోంది. బెంగాల్ మునుపెన్నడూ ఎరుగని స్థాయిలో డబ్బు వెదజల్లుతున్నారు. ఒకసారి ఈ ధోరణి మొదలైందంటే ఇక వెనక్కు పోవడం ఉండదు. పైగా బెంగాల్ చరిత్రలో ఎన్నడూ లేనంత పక్షపాత దృష్టిని ఎన్నికల కమిషన్ ప్రదర్శించడం గమనార్హం. కేంద్రంలోని అధికార పార్టీకి సహాయపడటంతో ఎన్నికల కమిషన్ హద్దులు మీరిపోయింది. చివరగా ఎన్నికల విషయంలో ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ అనేది రాష్ట్ర చరిత్రలో కొత్త మలుపుగా మారింది. 2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో షాక్ తిన్న మమత ప్రశాంత్ కిషోర్ టీమ్‌ని ఆహ్వానిం చింది. పీకే టీఎంసీ పార్టీలో సమాంతర వ్యవస్థను సృష్టించారు. కొత్త, పాపులర్ విధానాల రూపకల్పనతో పార్టీకి సరికొత్త ఇమేజీ తేవడంలో పీకే టీమ్ తోడ్పడింది. ఇది మమతను మూడో సారి కూడా అధికార పీఠంపై నిలబెడుతుందా అనేది చెప్పలేం కానీ, బెంగాల్లో రాజకీయ నేతలు, కేడర్లు పాత తరహా ఎన్నికల నిర్వహణవైపు మళ్లడం ఇక అసాధ్యం. భారత రాజకీయాల్లో అనేక ధోరణులకు బెంగాల్ మినహాయింపుగా ఉండేది. ఇక్కడ పార్టీల మధ్య స్పర్థ విశిష్టంగా ఉండేది. రాజకీయ కేడర్ సిద్ధాంతపరమైన భాషలో ప్రచారం సాగించేవారు. కులం, కమ్యూనిటీ, డబ్బు ప్రసక్తి లేకుండా ఎన్నికలు జరిగేవి. ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉన్న బెంగాల్‌కి ఈ ఎన్నికలు ముగింపు పలకవచ్చు. బెంగాల్ ఒకవైపు, దేశమంతా మరోవైపు అన్నట్లుగా ఉన్న పరిస్థితిని అమెరికన్ శైలి రాజకీయ నిర్వహణగా ఈ ఎన్నికలు మార్చివేయవచ్చు. వ్యాసకర్త: యోగేంద్ర యాదవ్ స్వరాజ్ ఇండియా సంస్థాపకులు -
బెంగాల్ 6వ విడతలో 79% పోలింగ్
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి గురువారం 6వ విడత పోలింగ్ పూర్తయింది. 43 నియోజకవర్గాల్లో జరుగుతున్న ఈ పోలింగ్‌లో సాయంత్రం 5 గంటలకు 79.09% పోలింగ్ నమోదైందని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్(సీఈవో) ఆరిజ్ అఫ్తాబ్ తెలిపారు. కొన్ని హింసాత్మక ఘటనలు మినహా మొత్తమ్మీద పోలింగ్ ప్రశాంతంగా జరిగిందన్నారు. ఈవీఎంలు, వీవీప్యాట్లు మొరాయించిన ఘటనలు ఐదు దశలతో పోలిస్తే స్వల్పంగానే నమోదయ్యాయని చెప్పారు. ఆరో దశలో శాంతి భద్రతల కోసం ఈసీ 1,071 కంపెనీల కేంద్ర బలగాలను వినియోగించింది. ఈ నెల 26, 29వ తేదీల్లో మరో రెండు విడతల్లో రాష్ట్రంలో పోలింగ్ జరగనుంది. మే 2వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. పోలీసులు భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 1071 కంపెనీల కేంద్ర బలగాలను రంగంలోకి దించారు. పోలింగ్ కేంద్రాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ విడతలో నాలుగు జిల్లాల్లోని మొత్తం 43 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాల్లో 306 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. చదవండి: ఈ విపత్తు మోదీ వైఫల్యమే: మమత -
ఈ విపత్తు మోదీ వైఫల్యమే: మమత
బలూర్ఘాట్: దేశంలో కోవిడ్–19 సెకండ్ వేవ్‌కు ప్రధాని మోదీ నిర్వహణాలోపమే కారణమని పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ దుయ్యబట్టారు. దక్షిణ దినాజ్‌పూర్ జిల్లా బలూర్‌ఘాట్‌లో బుధవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడారు. ‘దేశంలో కరోనా సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉంది. ఇది మోదీ కారణంగా వచ్చిన విపత్తు. ఇంజెక్షన్లు, ఆక్సిజన్ లేదు. దేశంలో కొరత ఉన్నప్పటికీ టీకాలు, మందులు విదేశాలకు ఎగుమతి చేశారు’ అని కేంద్ర ప్రభుత్వాన్ని ఆమె విమర్శించారు. ఆక్సిజన్, టీకాలు ఇవ్వలేని పక్షంలో పదవి నుంచి తప్పుకోవాలని ప్రధానికి సలహా ఇచ్చారు. రాష్ట్రంలో బెంగాల్ ఇంజిన్ ప్రభుత్వమే వస్తుంది తప్ప, మోదీ చెబుతున్న డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రాదని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని చేజిక్కించుకునేందుకు, ఢిల్లీ నుంచి పాలించేందుకు గుజరాతీకి అవకాశం ఇవ్వరాదని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల పోరాటం బెంగాల్‌ను రక్షించడానికి, బెంగాలీ మాత గౌరవాన్ని కాపాడటానికేనని పేర్కొన్నారు. వామపక్ష– కాంగ్రెస్ కూటమికి ఓటేయరాదని, అలాచేస్తే బీజేపీకి ఊతమిచ్చినట్లే అవుతుందని తెలిపారు. -
ప్రధాని రాజీనామా చేయాలి
బారక్‌పోర్/ కృష్ణానగర్: కరోనా సెకండ్ వేవ్ నియంత్రణలో పూర్తిగా వైఫల్యం చెందిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజీనామా చేయాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ శనివారం డిమాండ్ చేశారు. ఆరోగ్య అత్యయిక స్థితిని ఎదుర్కొనడానికి ముందస్తు ప్రణాళికలు రూపొందించడంలో ఆయన విఫలమయ్యారని ఆరోపించారు. గత ఏడాది సెప్టెంబరులో మొదటి వేవ్ సద్దుమణిగాక... ఎంతో సమయం లభించినా సెకండ్ వేవ్‌ను ఎదుర్కొనడానికి కేంద్రం ఏమాత్రం సంసిద్ధం కాలేదన్నారు. అవసరాలకు సరిపడా మెడికల్ ఆక్సిజన్, టీకాల సరఫరా లేక రాష్ట్రాలు అల్లాడుతున్నాయని... ఈ సమస్యను అధిగమించడానికి మోదీ చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. బారక్‌పోర్‌లో ఆమె శనివారం మాట్లాడుతూ... దేశంలో ఒకవైపు వ్యాక్సిన్లకు కొరత ఉంటే మరోవైపు మోదీ అంతర్జాతీయంగా తన ఇమేజ్ను పెంచుకోవడానికి విదేశాలకు టీకాలను ఎగుమతి చేశారన్నారు. ప్రస్తుత కోవిడ్ సంక్షోభానికి ఆయనే కారణమని, అందుకే ప్రధాని రాజీనామా చేయాలన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి బీజేపీ నేతలు, కార్యాకర్తలు వచ్చి బెంగాల్లో కోవిడ్‌ను వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు. -
మమతవి శవ రాజకీయాలు
అసన్సోల్/గంగారాంపూర్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నాలుగు దశలు ముగిసేనాటికే తృణమూల్ పార్టీ దాదాపు ముక్కలు చెక్కలు అయిందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఇక ఎనిమిది దశల పోలింగ్ ప్రక్రియ ముగిసేనాటికి తృణమూల్ కథ ముగిసిపోతుందని, సీఎం మమత బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్ ఓటమి ఖాయమవుతుందని మోదీ జోస్యం చెప్పారు. బెంగాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం మోదీ రాష్ట్రంలో అసన్సోల్లో ప్రచార ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. సీతల్‌కూచీ ఘటనను మమత తనకు అనుకూలంగా మలుచుకున్నారని మోదీ ఆరోపించారు. ఆ ఐదుగురి మరణాలతో మమత శవ రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. ఆ తర్వాత మోదీ గంగారాంపూర్‌లో జరిగిన ర్యాలీలో ప్రసంగించారు. మమత సర్కార్‌లో అక్రమ బొగ్గు తవ్వకం జరిగిందంటూ నిప్పులుచెరిగారు. Üున్నిత అంశమైన కూచ్ బెహార్లో కాల్పుల ఘటనపై మమత వ్యవహార శైలి ఎలాంటిదో ఆడియో క్లిప్‌ను వింటే అర్ధమైపోతుందని మోదీ ఆరోపించారు. కాల్పులు చనిపోయిన వారి మృతదేహాలతో భారీ ర్యాలీ చేపట్టాలని టీఎంసీ జిల్లా అధ్యక్షుడు, సీతల్‌కూచీ నుంచి పార్టీ అభ్యర్థి పార్థ ప్రతీమ్ రాయ్‌కు మమత ఫోన్ ఆదేశించినట్లుగా చెబుతున్న ఆడియో వివాదమవడం తెల్సిందే. ‘తన రాజకీయ స్వలాభం కోసం మమత ఎలాంటి శవ రాజకీయాలు చేస్తుందో.. ఆ ఆడియో టేప్ వింటే తెలుస్తుంది. ఆమెకు గతంలోనూ ఇలా శవ రాజకీయాలు చేశారు’ అని మోదీ ఆరోపించారు. ‘కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు, బెంగాల్ ప్రజలకు మధ్య మమత అడ్డుగోడలా నిలిచారు. పీఎం–కిసాన్, ఆయుష్మాన్ భారత్ పథకాల ప్రతిఫలాలను బెంగాల్ ప్రజలకు దక్కకుండా మమత అడ్డుకున్నారు. నన్ను నిందించకుండా మమతది ఏ రోజూ గడవలేదు’ అని మోదీ అన్నారు. -
మమతా బెనర్జీ డిమాండ్
-
అమిత్ షా రాజీనామా చేయాలి
బదూరియా/హింగల్గంజ్: కూచ్‌బెహార్ జిల్లాలో కేంద్ర బలగాల కాల్పులు జరపడాన్ని పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ ఖండించారు. ఈ ఘటనకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని, వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఆమె శనివారం బదూరియాలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. ప్రజలపై కాల్పులు జరపడం హేయమైన చర్య అని అన్నారు. ఓట్లు వేసేందుకు వరుసలో నిల్చున్నవారిపై అన్యాయంగా తుపాకులు ఎక్కుపెట్టారని చెప్పారు. కూచ్‌బెహార్ ఘటనకు నిరసనగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా తమ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు నల్లబ్యాడ్జీలు ధరించి, శాంతియుతంగా నిరసన తెలపాలని తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అమిత్ షా పన్నిన కుట్రలో భాగంగానే కేంద్ర బలగాలు కాల్పులు జరిపాయని మమత ఆరోపించారు. కూచ్‌బెహార్ జిల్లాలో కాల్పుల ఘటన వెనుక ఉన్న అసలు నిజాలను బయటపెట్టేందుకు సీఐడీ విచారణ జరిపిస్తామని అన్నారు. కేంద్ర భద్రతా బలగాలపై చేసిన వ్యాఖ్యలను మమత సమర్థించుకున్నారు. కేంద్ర బలగాలపై తనకు ఎంతో గౌరవం ఉందని చెప్పారు. ఏప్రిల్ 6న ఎన్నికల సంఘం జారీ చేసిన నోటీసుపై ఆమె శనివారం స్పందించారు. బెంగాల్లో విధుల్లో ఉన్న కేంద్ర బలగాల వ్యవహార శైలిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చాయని గుర్తుచేశారు. నోటీసును ఉపసంహరించుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. ఏప్రిల్ 6న తెల్లవారుజామున రామ్‌నగర్‌లో తారకేశ్వర్ పోలీసు స్టేషన్ పరిధిలో సీఆర్పీఎఫ్ సిబ్బంది ఓ బాలికను వేధించినట్లు కేసులు నమోదయ్యిందని తెలిపారు. ఇప్పటివరకు బాధ్యులపై చర్యలు తీసుకోలేదని ఆక్షేపించారు. కూచ్‌బెహార్ ఘటన వెనుక ముందస్తు ప్రణాళిక ఉందని తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. కాల్పుల వీడియో ఫుటేజీని బయట పెట్టాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. మృతుల కుటుంబాలను మమత పరామర్శిస్తారని చెప్పారు. -
దీదీ ఆటలు సాగవు.. గద్దె దిగక తప్పదు
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ బెంగాల్‌ను హింసాత్మకంగా మారుస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కూచ్‌బెహార్ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. ఆయన శనివారం బెంగాల్ రాష్ట్రం నాడియా జిల్లాలోని సిలిగురి, కృష్ణానగర్‌లో ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రజలను రెచ్చగొట్టి కేంద్ర బలగాలపైకి ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో నెగ్గడానికి రక్తపాతం సృష్టించి, రిగ్గింగ్ చేసుకోవాలన్న తృణమూల్ కాంగ్రెస్ కుట్రలతోనే సమస్యలు వస్తున్నాయని చెప్పారు. కూచ్‌బెహార్ ఘటన దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. కాల్పుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రధాని మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. బెంగాల్లో బీజేపీకి ప్రజాదరణ పెరగడం చూసి మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ గూండాలు భరించలేకపోతున్నారని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. ఆక్రోశం పట్టలేకపోతున్నారని, అందుకే భద్రతా సిబ్బందిపై దాడి చేయాలంటూ జనానికి నూరిపోస్తున్నారని విమర్శించారు. మళ్లీ కుర్చీ దక్కకుండా పోతోందన్న భయంతో నీచ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. రిగ్గింగ్‌కు అడ్డుగా ఉన్నాయన్న కారణంతోనే కేంద్ర బలగాలపై తృణమూల్ కాంగ్రెస్ గూండాలు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. దీదీ ఆటలు ఇక సాగవని హెచ్చరించారు. ఆమె గద్దె దిగక తప్పదని తేల్చిచెప్పారు. బెంగాల్లో తాము అధికారంలోకి రాగానే లంచాల సంస్కృతికి చరమ గీతం పాడుతామన్నారు. మూడు టీలకు(టీ, టూరిజం, టింబర్) మాఫియా చెర విముక్తి కల్పిస్తామని హామీ ఇచ్చారు. మే 2వ తేదీ నుంచి బెంగాల్లో ప్రభుత్వ నిర్ణయాలను ప్రభుత్వమే తీసుకుంటుందని, దోపిడీదార్లు కాదని మోదీ స్పష్టం చేశారు. -
మమతకు ఈసీ మరో నోటీసు
న్యూఢిల్లీ/కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల విధుల్లో ఉన్న కేంద్ర బలగాలపై రెచ్చగొట్టేలా, అసత్యపూరిత వ్యాఖ్యలు చేశారని ఎన్నికల సంఘం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీకి గురువారం రాత్రి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కేంద్ర బలగాలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా భారతీయ శిక్షాస్మృతిని, ఎన్నికల కోడ్‌ను మమతా బెనర్జీ ఉల్లంఘించినట్లు ప్రాథమిక ఆధారాలున్నాయని ఈసీ ఆ నోటీసుల్లో పేర్కొంది. శనివారం ఉదయం 11 గంటల్లోగా ఈ నోటీసులకు సమాధానం ఇవ్వాలని మమతను ఆదేశించింది. ‘ఎన్నికల విధుల్లో ఉన్న కేంద్ర బలగాలను తన వ్యాఖ్యల ద్వారా అసత్యపూరితమైన వ్యాఖ్యలతో, రెచ్చగొట్టేలా, విచక్షణ రహితంగా మమత దూషించారనేందుకు, అవమానించారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయి. ఇలాంటి వ్యాఖ్యలతో వారిలో నైతికస్థైర్యం దెబ్బతింటుంది’ అని ఈసీ పేర్కొంది. 1980ల నుంచి ఎన్నికల్లో కేంద్ర బలగాలు విలువైన సేవ చేస్తున్నాయని గుర్తు చేసింది. ఈసీ నోటీసుపై మమతా బెనర్జీ ఘాటుగా స్పందించారు. ఈసీ నోటీసులను పట్టించుకోబోనన్నారు. సీఆర్పీఎఫ్పై తన ఆరోపణలను మరోసారి పునరుద్ఘాటించారు. ‘బీజేపీ కోసం పనిచేయడం ఆపి వేయనంత వరకు సీఆర్పీఎఫ్ తప్పులపై మాట్లాడుతూనే ఉంటాను. వారు ఆ పని ఆపేస్తే వారికి సెల్యూట్ చేస్తాను’ అని స్పష్టం చేశారు. ‘మీ షోకాజ్ నోటీసులను నేను పట్టించుకోను. మీరు బీజేపీ కోసం పనిచేస్తున్నారు. ఎన్నికల రోజున ప్రధాన మంత్రి ప్రచారం చేస్తే మీ దృష్టిలో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినట్లు కాదా?’ అని ఈసీని ప్రశ్నించారు. జమల్పూర్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో శుక్రవారం మమత పాల్గొన్నారు. దాదాపు వారం వ్యవధిలో మమతకు ఈసీ నోటీసులు జారీ చేయడం ఇది రెండో సారి. ముస్లింలను మతపరంగా ఓట్లను అభ్యర్థిస్తున్నారన్న బీజేపీ ఫిర్యాదుపై ఇప్పటికే ఆమెకు ఈసీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. కేంద్ర బలగాలు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని, బీజేపీకే ఓటేయాలని ఓటర్లను, ముఖ్యంగా మహిళలను బెదిరిస్తున్నాయని గత కొన్ని రోజులుగా మమత ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. బెంగాల్లో హింసకు అమిత్ షా కుట్ర రాష్ట్రంలో హింసను రాజేసేందుకు కేంద్ర హోం మంత్రి, బీజేపీ నేత అమిత్ షా కుట్ర చేస్తున్నారని మమతా బెనర్జీ ఆరోపించారు. అనైతిక చర్యలకు పాల్పడేలా పోలీసులను ప్రోత్సహిస్తున్నారన్నారు. షాను నియంత్రించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ‘ఇలాంటి గూండా హోం మంత్రిని నా జీవితంలో చూడలేదు. ఆయన పులి కన్నా ప్రమాదకరం. ఆయనతో మాట్లాడాలంటేనే ప్రజలు భయపడ్తున్నారు. షాను నియంత్రించాలని ప్రధానిని కోరుతున్నా. ఆయన వల్ల బెంగాల్లో అల్లర్లు, హింస చెలరేగే ప్రమాదముంది’ అని మమత ఒక ఎన్నికల సభలో వ్యాఖ్యానించారు. బెంగాల్ మరో గుజరాత్‌లా మారకుండా చూడాలని, బీజేపీకి ఓటు వేయవద్దని ఓటర్లను అభ్యర్ధించారు. -
దీదీ కావాలా.. లాకెట్ కావాలా..!
బెంగాల్ ఎన్నికల్లో ఒక నినాదం బలంగా వినిపిస్తోంది. ‘మీకు దీదీ కావాలా లాకెట్ కావాలా’ అని. దీదీ అంటే మమతా బెనర్జీ. లాకెట్ అంటే లాకెట్ చటర్జీ. గత ఐదేళ్లుగా బిజెపిలో పని చేస్తూ ఎం.పిగా గెలిచి ఇప్పుడు కీలకమైన ఎన్నికలు అయినందున అసెంబ్లీ బరిలో దిగిన లాకెట్ చటర్జీ అన్నీ అనుకున్నట్టుగా అయితే బెంగాల్‌కు కాబోయే ముఖ్యమంత్రి అని కొందరు జోస్యం చెబుతున్నారు. బెంగాల్లో మహా శక్తి అయిన మమతా బెనర్జీని ఈ మాజీ నటి సమర్థంగా ఎదుర్కొంటూ వార్తల్లో నిలవడం విశేషమే. పాపులర్ విన్యాసాల ద్వారా జనాన్ని ఆకర్షిస్తున్న ఈ మహిళా నేత పరిచయం... కళాకారులకు జనాకర్షక పద్ధతులు బాగానే తెలుస్తాయి. ఎలక్షన్లలో దిగిన సినిమా తారలు తమ అయస్కాంత శక్తితో సగటు ఓటరును గట్టిగా లాగగలరనేదానికి లాకెట్ చటర్జీ కూడా ఒక ఉదాహరణే. పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు బి.జె.పి తరఫున ఎవరైనా గట్టి మహిళా నాయకురాలు ఉందంటే అది ఈ లాకెట్ చటర్జీనే. బెంగాల్‌కు మహిళా ముఖ్యమంత్రి పని చేసే ఆనవాయితీని కొనసాగించాలని బి.జె.పి అనుకుంటే ఈ అసెంబ్లీ ఎలక్షన్లలో ఆ పార్టీ గెలిస్తే లాకెట్ చటర్జీ రసగుల్లా విరిగి పాకంలో పడ్డట్టే. ఎందుకంటే ఆమెకు మాత్రమే ఆ పార్టీ తరఫున మహిళా సి.ఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎవరీ లాకెట్ చటర్జీ లాకెట్ చటర్జీది కోల్‌కతా ఉత్తర ప్రాంతంలో ఉండే దక్షిణేశ్వర్. ఇక్కడ కూడా ఒక కాళీ ఆలయం ఉంది. ఆమె తండ్రి అందులో పురోహితుడుగా పని చేసేవాడు. లాకెట్ చటర్జీకి చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఆసక్తి ఏర్పడింది. భరత నాట్యం, కథక్ నేర్చుకుని బెంగాల్ నటి మమతా శంకర్ ట్రూప్‌లో 13 ఏళ్ల వయసులోనే చేరి ప్రదర్శనలు మొదలెట్టింది. ఒక వైపు దక్షిణేశ్వర్లో చదువుకుంటూనే సినిమాల్లో ప్రవేశించింది. దాదాపు 35 సినిమాల్లో నటించింది. అయితే అవన్నీ ద్వితీయ శ్రేణి సినిమాలు అని చెప్పవచ్చు. పెద్ద పెద్ద తారాగణం ఉండే భారీ సినిమాలు ఆమెకు దక్కలేదు. ఆమె నటించిన ఒక సినిమా తెలుగు డబ్బింగ్‌తో యూ ట్యూబ్‌లో ఉంది. సినిమా రంగంలో తన ప్రస్తావనను ముగించి ఆమె 2015లో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరింది. అయితే కొద్దిరోజులకే అక్కడ ఇమడలేక బయటకు వచ్చి బి.జె.పిలో చేరింది. 2016లో ప్రత్యక్ష ఎన్నికలలో... 2016 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్లలో బి.జె.పి తరఫున మాయురేశ్వర్ నుంచి లాకెట్ చటర్జీ నిలబడింది. అయితే తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయింది. అయినప్పటికీ బి.జె.పి ఆమెను 2019 పార్లమెంట్ ఎలక్షన్లలో ‘హుగ్లీ’ నియోజకవర్గం నుంచి నిలబెడితే ఆశ్చర్యకరంగా 70 వేల ఓట్ల మెజారిటీతో గెలిచింది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి హుగ్లీ పార్లమెంట్ నియోజకవర్గం కీలకమైనది. ఇక్కడ 18 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాలన్నింటికి బి.జె.పి ఇప్పుడు లాకెట్‌ను ప్రచార కార్యదర్శి చేసింది. అంతే కాదు ‘చిన్సుర’ (చుచుర) నియోజకవర్గం నుంచి ఎం.ఎల్.ఏ అభ్యర్థి గా నిలబెట్టింది. పార్టీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి లాకెట్ రేయింబవళ్లు కష్టపడుతోంది. సైకిల్ ప్రచారం లాకెట్ చటర్జీ విభిన్న ప్రచార రీతులను పాటించడంలో సమర్థురాలు. తాను పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడినప్పుడు పూర్తి ప్రచారాన్ని సైకిల్ మీద, స్కూటర్ మీద నిర్వహించింది. ఇప్పుడు కూడా సైకిల్ మీద ఎక్కువగా తిరుగుతూ పార్టీ కోసం ప్రచారం చేస్తోంది. అవసరమైన చోట కార్యకర్తలతో కలిసి పోలీసుల మీద, ప్రత్యర్థుల మీద కలబడిన రికార్డు ఆమెకు ఉంది. ప్రస్తుతం హుగ్లీ నది మీద పడవలో తిరుగుతూ ఆమె పడుతున్న శ్రమ ఓటర్ల దృష్టిలోనే కాదు మీడియా దృష్టిలో కూడా పడుతోంది. సొంతగా చేతితో రాసిన పోస్టర్లను విడుదల చేసి తృణమూల్‌తో ఐసల్ ఫైసల్ తేల్చుకోవడానికి సిద్ధమవుతోంది. మమతాపై దాడి లాకెట్ చటర్జీని మమతాపై దాడికి పార్టీ ఎక్కువ ఉపయోగించుకుంటోంది. లాకెట్ కూడా సమర్థమైన వాదనే ఓటర్ల ముందు వినిపిస్తోంది. ‘స్త్రీలు తమకేదైనా మేలు జరుగుతుందని మహిళా సి.ఎంగా మమతా బెనర్జీని ఎన్నుకున్నారు. రెండుసార్లు పదవి ఇచ్చారు. కాని ఆమె వారి కోసం ఏమీ చేయలేదు. పశ్చిమ బెంగాల్లో ఉమెన్ ట్రాఫికింగ్ అత్యధికంగా ఉంది. గృహ హింస ఎక్కువ గా ఉంది. యాసిడ్ దాడులైతే దేశంలోనే బెంగాల్లో అత్యధికం. కిడ్నాప్ కేసులకు అతీగతీ లేదు. ఇవన్నీ మమతా బెనర్జీ వైఫల్యాలు. స్త్రీలు ఇవన్నీ గమనించారు. వారు ఈ.వి.ఎంల ద్వారా తమ ప్రతీకారం తీర్చుకుంటారు’ అని లాకెట్ తన ప్రచారంలో మాట్లాడుతూ ఉంది. అవతలి వైపు అయితే అవతలి వైపు నుంచి చూస్తే లాకెట్‌కు అన్నీ అనుకూలంగా ఉంటాయని చెప్పలేము. హుగ్లీ నదిపై ఆధునిక ఘాట్ కట్టి వారణాసిలోలాగా హారతి కార్యక్రమం చేస్తామని ఆమె చేస్తున్న హామీలు ఆకర్షిస్తున్నా మాకు ఉపాధి కావాలి అనే యువతే ఆమెకు ఎక్కువగా ఎదురు పడుతోంది. తృణమూల్ కాంగ్రెస్ అభివృద్ధి చేసిందో చేయలేదో బి.జె.పి వస్తే మొత్తం వాతావరణం దెబ్బ తింటుందని భయపడుతున్నాం అనేవారూ ముఖ్యంగా పై వయసు వారు ఆమె ప్రచార పరిధిలో కనిపిస్తున్నారు. అలాగే తృణమూల్ కాంగ్రెస్ కూడా తమ ప్రచారంలో జూన్ మలియా, కౌషాని ముఖర్జీ, లౌలీ మైత్ర వంటి ఈకాలపు తారలను రంగంలో దించి ఉంది. హోరాహోరీగా సాగుతున్న ఈ పోటీలో విజేతలెవరో అన్న ఉత్కంఠ తప్పక నెలకొని ఉంది. ఎవరు గెలిచినా బెంగాల్ మళ్లీ మహిళా సి.ఎంనే చూస్తుందని ఆశిద్దాం. – సాక్షి ఫ్యామిలీ -
దీదీ మరో చోట పోటీ చేస్తున్నారా?
జెయ్‌నగర్/ఉలుబేరియా: పశ్చిమ బెంగాల్ అంతటా బీజేపీ ప్రభంజనం కనిపిస్తోందని, అసెంబ్లీ ఎన్నికల్లో 294 సీట్లకు గాను 200కుపైగా సీట్లు సొంతం చేసుకోబోతున్నామని ప్రధాని∙మోదీ తేల్చిచెప్పారు. ఆయన గురువారం బెంగాల్‌లోని జెయ్‌నగర్, ఉలుబేరియాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మే 2వ తేదీన మమతా బెనర్జీ గద్దె దిగడం ఖాయమని మోదీ స్పష్టం చేశారు. ప్రజలు ఎన్నికల్లో పాల్గొనడం లేదని, రాష్ట్ర అభివృద్ధి కోసం బాటలు పరుస్తున్నారని చెప్పారు. ‘గోడలపై రాసిన రాతలు చదవండి. బెంగాల్ ప్రజలు మిమ్మల్ని శిక్షించబోతున్నారు’ అని మమతనుద్దేశించి వ్యాఖ్యానించారు. నందిగ్రామ్‌లో పరాజయం తప్పదని తేలడంతో చివరి దశ ఎన్నికలు జరిగే స్థానం నుంచి పోటీ చేయడానికి నామినేషన్ వేయాలని మమత నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయని, అవి నిజమో కాదో చెప్పాలన్నారు. ఎక్కడికి వెళ్లినా దీదీకిఓటమి తప్పదన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా ప్రజలు ఆమెకు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. బెంగాల్లో ఇటీవలే బీజేపీ కార్యకర్త తల్లిని దారుణంగా హత్య చేశారని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి ఘోరం జరిగిన తర్వాత ప్రజలు కూల్‌గా ఉండాలని మమత చెబుతున్నారని, టీఎంసీ నేతలు, కార్యకర్తలు శూల్‌గా(శూలం) మారి ప్రజలను బాధిస్తున్నారని ధ్వజమెత్తారు. ‘అక్రమంగా వలస వచ్చినవారు మీకు సొంత మనషులు. స్వదేశంలోని ప్రజలను బయటివాళ్లు, టూరిస్టులు అంటారా? సొంత ప్రజలపై వివక్ష చూపడం మానుకోండి’ అని హితవు పలికారు. చేసిన ప్రమాణం మరిచారా? బిహార్, ఉత్తరప్రదేశ్ ప్రజలకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ విమర్శలు చేయడం దారుణమని ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం చేసిన ప్రమాణం ఇలాంటి విమర్శలను అనుమతించదని గుర్తుచేశారు. భవానీపూర్ అసెంబ్లీ స్థానాన్ని విడిచిపెట్టి, నందిగ్రామ్‌ను ఎంచుకోవడం ద్వారా పెద్ద తప్పు చేశానన్న నిజాన్ని మమతా బెనర్జీ గ్రహించారని చెప్పారు. నందిగ్రామ్‌లో దీదీకి ఓటమి తప్పదన్నారు. ఆమెకు బెంగాల్ అనేది ఒక ఆట స్థలమని, బీజేపీకి అభివృద్ధి, విద్యా, పరిశ్రమల మైదానం కాబోతోందని వ్యాఖ్యానించారు. జైశ్రీరామ్‌ను సహించలేదు అవసరం కొద్దీ ప్రదర్శించే కాలానుగుణ విశ్వాసాలపై తనకు విశ్వాసం లేదని వ్యాఖ్యానించారు. ‘జైశ్రీరామ్ అని నినదిస్తే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహించలేదు. దుర్గా విగ్రహాల నిమజ్జనాలపై అసహనం వ్యక్తం చేశారు. ప్రజలు కాషాయం బట్టలు, నుదుటిపై తిలకం ధరించడం, పిలక పెంచుకోవడం పట్ల తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి అభ్యంతరాలున్నాయి. అలాంటి వారిని రాక్షసులుగా సంబోధిస్తోంది’’ అని విమర్శించారు. తాను ఇటీవల బంగ్లాదేశ్ పర్యటించడం, అక్కడి దేవాలయాలను సందర్శించడం ఎన్నికల ప్రవర్తనా నియామవళిని ఉల్లంఘించడమే అవుతుందంటూ తృణమూల్ కాంగ్రెస్ చేసిన ఆరోపణలను మోదీ తిప్పికొట్టారు. జిశోరేశ్వరి కాళీ మందిరాన్ని సందర్శించడం, శ్రీహరిచంద్ ఠాకూర్‌కు నివాళులర్పించడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. మన నమ్మకాలు, సంప్రదాయాలను తాము గర్వకారణంగా భావిస్తామని అన్నారు. మీనాక్షి ఆలయంలో మోదీ మోదీ గురువారం తమిళనాడులోని, మదురైలో ఉన్న ప్రఖ్యాత మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రధానికి ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సంప్రదాయ చొక్కా, ధోవతి, అంగవస్త్రం ధరించి ప్రధాని ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. నేడు మదురై, కన్యాకుమారిల్లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. తమిళనాడులో ఏప్రిల్ 6న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. కన్యాకుమారి లోక్‌సభ ఉప ఎన్నికలోనూ బీజేపీ పోటీ చేస్తోంది. గెలుపు మమతదే: తృణమూల్ సీఎం మమతా బెనర్జీ నందిగ్రామ్‌లో కచ్చితంగా ఓడిపోతారని, అందుకే మరో స్థానాన్ని వెతుక్కుంటున్నారని ప్రధాని మోదీ చేసిన విమర్శలపై తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు స్పందించాయి. నందిగ్రామ్‌లో దీదీ ఓడిపోయే ప్రసక్తే లేదని, మరో స్థానం నుంచి పోటీ చేసే ప్రశ్నే లేదని ప్రకటించాయి. -
66 ఏళ్ల ఆంటీ.. నోరు అదుపులో పెట్టుకో!
సాక్షి, కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై , బీజేపీ నేత నందీగ్రామ్‌లో ఆమె ప్రత్యర్థి సువేందు అధికారి నోరు పారేసుకున్నారు. మాజీ టీఎంసీ నేత అయిన సువేందు సీఎం మమతా 66 ఏళ్ల ఆంటీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై ఇటీవల మమతా విమర్శల నేపథ్యంలో సువేందు కౌంటర్ ఎటాక్ చేశారు. దీదీ ఈ వయస్సులో నోటిని అదుపులో పెట్టుకోవాలని, భాషను మార్చుకోవాలంటూ హితవు పలికారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెకు ఓటమి తప్పదని హెచ్చరించారు. అలాగే మే 2వ తేదీన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతాయని, ఆ తర్వాత కూడా కేంద్ర బలగాలు రాష్ట్రంలోనే ఉండాలని సువేందు వ్యాఖ్యానించారు. ఒక ముఖ్యమంత్రిగా ఆమె తన నోటిని అదుపులో పెట్టుకోవాలని, ప్రధాని మోదీపై ఆమె అభ్యంతరకర రీతిలో భాషను వాడుతున్నారని ఆరోపించారు.ఈ సందర్బంగా బెంగాల్ సీఎంను ఆంటీ అంటూ ఆయన సంబోధించారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా మమతా మీడియాతో మాట్లాడారని మండిపడ్డారు. కాగా రెండో దశ ఎన్నికల్లో భాగంగా నందిగ్రామ్ నియోజకవర్గంలో పోలింగ్ కొనసాగుతోంది. ఈ సందర్బంగా తన ఓటుహక్కును వినియోగించుకున్న సువేందు అధికారి, ప్రశాంతంగా ఓటింగ్ కొనసాగుతోందని, రీపోలింగ్ అనే ప్రశ్నే ఉత్పన్నం కాదని తెలిపారు. బెంగాల్ ప్రజలు అభివృద్ధికి ఓటేస్తారని భావిస్తున్నట్టు చెప్పారు. పెద్ద ఎత్తున ఓటర్లు తరలివచ్చి ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
మహిళలపై హింసను సహించం
నందిగ్రామ్: బీజేపీ కార్యకర్త అని చెబుతున్న వ్యక్తి తల్లి మృతి ఘటన పశ్చిమ బెంగాల్లో సంచలనాత్మకంగా మారింది. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత, సీఎం మమతా బెనర్జీ స్పందించారు. మహిళలపై హింసను తాను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోనని పేర్కొన్నారు. వృద్ధురాలి మరణానికి గల అసలు కారణం ఇంకా తెలియరాలేదని చెప్పారు. ఆమె సోమవారం నందిగ్రామ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బెంగాల్ గురించి మాట్లాడుతున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై జరుగుతున్న అరాచకాల విషయంలో ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. హథ్రాస్ ఘటనపై ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. బెంగాల్లో తన తల్లులు, సోదరీమణులపై హింసను సహించే ప్రసక్తే లేదన్నారు. బీజేపీ ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తోందని విమర్శించారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని, ఇటీవలే ముగ్గురు చనిపోయారని అన్నారు. బెంగాల్లో ప్రస్తుతం శాంతిభద్రతలు ఎన్నికల సంఘం పరిధిలో ఉన్నాయని, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉందని వెల్లడించారు. నందిగ్రామ్‌లో దీదీ భారీ రోడ్ షో అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్న నందిగ్రామ్ స్థానం నుంచి మంచి మెజార్టీలో విజయం సాధించాలని మమత సంకల్పించారు. ఇక్కడ తన బలాన్ని ప్రదర్శించుకొనేందుకు సోమవారం భారీ రోడ్ షో నిర్వహించారు. రేయపారా ఖుదీరామ్ మోరే నుంచి ఠాకూర్‌చౌక్ వరకూ 8 కిలోమీటర్ల మేర జరిగిన ర్యాలీలో దీదీ ఉత్సాహంగా పాలు పంచుకున్నారు. నందిగ్రామ్‌లో ఏప్రిల్ 1న ఎన్నికలు జరుగనున్నాయి. అప్పటిదాకా తాను ఇక్కడే ఉంటానని మమతా బెనర్జీ ప్రకటించారు. ఎన్నికల్లో రిగ్గింగ్ చేసేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని, ఆ పార్టీ ఆటలు సాగనివ్వబోమని హెచ్చరించారు. -
బెంగాల్లో వృద్ధురాలి మృతిపై రాజకీయ రగడ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్త తల్లి మరణం తీవ్ర రాజకీయ వివాదానికి దారితీసింది. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) మద్దతుదారులు దాడి చేయడంతో ఆమె గాయాలపాలై మృతి చెందిందని బీజేపీ ఆరోపిస్తుండగా, ఈ ఘటనతో తమకు సంబంధం లేదని తృణమూల్కాంగ్రెస్ పార్టీ తేల్చిచెప్పింది. వయసుతో వచ్చే అనారోగ్య సమస్యలే ఆమె మృతికి కారణమని తృణమూల్ వెల్లడించింది. వృద్ధురాలి మృతిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ట్విట్టర్లో స్పందిస్తూ టీఎంసీపై ఆరోపణలు గుప్పించడంతో ఈ వ్యవహారం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అసలేం జరిగింది? పశ్చిమబెంగాల్లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో నిమ్తా పోలీసు స్టేషన్ పరిధిలోని నార్త్ డమ్‌డమ్ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్త గోపాల్ మజుందార్ తన తల్లి శోభా మజుందార్‌తో (82) కలిసి నివసిస్తున్నాడు. ఫిబ్రవరి 27న కొందరు వ్యక్తులు ముఖాలు గుర్తుపట్టకుండా ముసుగులతో వచ్చి గోపాల్ ఇంటిపై దాడి చేశారు. గోపాల్‌తోపాటు వృద్ధురాలైన అతడి తల్లి తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై నిమ్తా పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ గూండాలే తమపై దాడి చేశారని శోభా మజుందార్ చెప్పారు. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మార్చి 27న కన్నుమూశారు. శోభా మజుందార్ చావుకు టీఎంసీ కార్యకర్తలే కారణమని, వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు, కార్యకర్తలు సోమవారం నిమ్తా పోలీసు స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. రోడ్లను దిగ్బంధించారు. దర్యాప్తు జరుగుతోందని పోలీసులు వారికి నచ్చజెప్పారు. హింస లేని రేపటి కోసం పోరాటం తమ పార్టీ కార్యకర్త తల్లి చనిపోవడం పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా విచారం వ్యక్తం చేశారు. టీఎంసీ గూండాలు కొట్టడం వల్లే శోభా మజుందార్ మరణించారని ధ్వజమెత్తారు. ‘బాధిత కుటుంబం అనుభవిస్తున్న బాధ, గాయాలు మమతను వెంటాడడం ఖాయం. హింస లేని రేపటి కోసం మన తల్లులు, చెల్లెళ్లకు రక్షణ ఉండే రాష్ట్రం కోసం బెంగాల్ పోరాడుతోంది’ అని షా ట్వీట్‌చేశారు. బెంగాల్లో హింస రాజ్యమేలుతోందని కేంద్ర మంత్రి దేబశ్రీ చౌదరి మండిపడ్డారు. 82 ఏళ్ల వృద్ధురాలిని కూడా వదలకుండా కొట్టి చంపడం దారుణమని దుయ్యబట్టారు. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ ఆరోపణలపై టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ స్పందించారు. వృద్ధురాలి మరణానికి రాజకీయాలతో సంబంధం లేదన్నారు. చావును కూడా బీజేపీ సొమ్ము చేసుకుంటోందని విమర్శించారు. వృద్ధాప్యం వల్ల తలెత్తే అనారోగ్యం కారణంగానే శోభా మజుందార్ మరణించినట్లు తమకు సమాచారం అందిందని తెలిపారు. దర్యాప్తు ప్రక్రియకు ఆటంకం కలిగించరాదని టీఎంసీ రాజ్యసభ సభ్యుడు డెరెక్ ఓ బ్రెయిన్ అమిత్ షాకు హితవు పలికారు. -
టీఎంసీతో కుంభకోణాలు!
భాగ్‌ముండి: సర్వతోముఖాభివృద్ధి కావాలంటే ఎన్నికల్లో మోదీకి మద్దతునివ్వాలని బెంగాల్‌లోని ఆదివాసీలకు హోంమంత్రి అమిత్‌షా విజ్ఞప్తి చేశారు. టీఎంసీ.. కుంభకోణాలు చేసిందన్నారు. బెంగాల్లో ఆదివాసీలు, కుర్మీ జాతి కోసం అభివృద్ది బోర్డును ఏర్పాటు చేస్తామని, ఉచిత విద్య కల్పించడంతో పాటు ఉపాధి కల్పన చేస్తామని హామీ ఇచ్చారు. టీఎంసీ ప్రభుత్వ హయంలో ఆదివాసీల హక్కులు, భూముల హరణ జరిగిందని, గిరిజనుల భూములను లాక్కొని చొరబాటుదారులకు కట్టబెట్టారన్నారు. ఒక ప్రత్యేక వర్గాన్ని సంతోష పరచడం కోసం బెంగాల్లో ఉర్దూను బోధనామాధ్యమంగా చేయాలని మమత కోరుకుంటోందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఉపాధి కల్పన ఘోరంగా దెబ్బతిన్నదని, ఆటోమొబైల్ పరిశ్రమ ఎదగకుండా మమత అడ్డుపడ్డారని విమర్శించారు. ప్రజాపయోగ పథకాలు కావాలంటే బీజేపీకి ఓటేయాలని కోరారు. అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో జరిగిన బీజేపీ కార్యకర్తల హత్యలకు కారకులైనవారంతా ఊచలు లెక్కించక తప్పదని హెచ్చరించారు. కుటుంబానికో ఉద్యోగం టీఎంసీ ప్రభుత్వం ఆదివాసీలు, కుర్మీలు, బీసీలకు ఏమీ చేయలేదని, తాము అధికారంలోకి వస్తే ఈ వర్గాల్లో ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని అమిత్‌షా హామీ ఇచ్చారు. జంగిల్‌మహల్ బోర్డు ఏర్పాటు చేసి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. జంగిల్‌మహల్ ప్రాంతంలో ఎయిమ్స్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. మమత రాజకీయాల కారణంగా మహిష్య, తెలి వంటి పలు వర్గాలు రిజర్వేషన్ కేటగిరీలోకి రాకుండా పోయాయన్నారు. ఇలా రిజర్వేషన్లు పొందలేని హిందూ బీసీ వర్గాలన్నింటినీ ఓబీసీల్లో చేరుస్తామన్నారు. తాము అధికారంలోకి వస్తే దుర్గాపూజ, సరస్వతి పూజను భయం లేకుండా జరుపుకునే అవకాశం కల్పిస్తామని చెప్పారు. తాము అధికారంలోకి రాగానే అక్రమ చొరబాట్లకు అడ్డుకట్టవేస్తామన్నారు. ఆదివాసీలకు స్థానిక భాషలోనే ఉచిత విద్య అందిస్తామని, ఉచిత స్థానిక రవాణా సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. గతంలో లెఫ్ట్, తర్వాత టీఎంసీలు ఆదివాసీలకు తీరని అన్యాయం చేశాయని దుయ్యబట్టారు. మోదీకి ఓటేస్తే అభివృద్ధి జరుగుతుందని, కుంభకోణాలు కావాలంటే టీఎంసీకి ఓటేయాలని చెప్పారు. జంగిల్‌మహల్ ప్రాంతంలో తాగునీటి సమస్యను ప్రస్తావిస్తూ అధికారంలోకి వచ్చాక రూ.10వేల కోట్లతో క్లీన్ వాటర్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామన్నారు. -
దొంగల రాజ్యానికి రాజులు
పథార్‌ప్రతిమ (పశ్చిమబెంగాల్): ఎన్నికల్లో ముస్లిం ఓట్లను చీల్చడానికి బీజేపీ మద్దతుతో కొత్త పార్టీ పుట్టుకొచ్చిందని, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్(ఐఎస్ఎఫ్)ను ఉద్దేశిస్తూ, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ విమర్శించారు. ఆ పార్టీ వ్యవస్థాపకుడికి బీజేపీ నుంచి నిధులు అందుతున్నాయని ఆరోపించారు. దక్షిణ 24 పరగణలో గురువారం ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రముఖ ముస్లిం మతపెద్ద అబ్బాస్ సిద్దిఖీ ఇటీవల ఐఎస్ఎఫ్ను స్థాపించిన విషయం, కాంగ్రెస్, వామపక్ష కూటమితో ఆ పార్టీ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. తృణమూల్ కాంగ్రెస్‌ను ఓడించేందుకు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కూడా బీజేపీతో ఒక అవగాహన కుదుర్చుకున్నాయని మమత ఆరోపించారు. రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)ల అమలును తృణమూల్ కాంగ్రెస్ అడ్డుకోగలదని, తమ పార్టీ అధికారంలో ఉంటేనే మత సామరస్యం సాధ్యమవుతుందని ఆమె స్పష్టం చేశారు. అవసరమైన ప్రతీసారి ప్రజల పక్షాన నిలిచినందువల్లనే తనను దొంగగా, హంతకురాలిగా ప్రచారం చేస్తున్నారని బీజేపీపై మండిపడ్డారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా ‘దోపిడీ దొంగల రాజు’లని అభివర్ణించారు. ‘కేంద్రం రాష్ట్రాన్ని దోచుకుంటోంది కానీ సాయం చేయడం లేదు’ అన్నారు. -
దీదీ ఓటమి ఖాయం
బంకురా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓడిపోవడం ఖాయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు. ఓటమిని ఆమె ముందే ఊహించారు కాబట్టే సాకు కోసం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం) పనితీరును ప్రశ్నిస్తున్నారని చెప్పారు. ఈవీఎంలతో జరిగిన ఎన్నికల్లోనే ఆమె పదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చారని గుర్తుచేశారు. ప్రధాని మోదీ ఆదివారం బెంగాల్‌లోని బంకురాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. బెంగాల్లో అసలైన మార్పు (అసోల్ పరివర్తన్) కచ్చితంగా వస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధితోపాటు యువత ఆకాంక్షలను నెరవేర్చడానికి మార్పు తప్పనిసరి అని అన్నారు. బెంగాల్లో అవినీతి ఆట ఇక సాగదని వ్యాఖ్యానించారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం కావాలి మమతా బెనర్జీ తన తలపై కాలితో తన్నుతున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ చిత్రీకరించిన వాల్ పోస్టర్లను నరేంద్ర మోదీ ప్రస్తావించారు. ‘‘130 కోట్ల మంది ప్రజల ఎదుట ఎల్లప్పుడూ శిరస్సు వంచుతూనే ఉంటా. నా తలపై మమతా బెనర్జీ కాలు పెట్టొచ్చు, నన్ను తన్నొచ్చు. కానీ, బెంగాల్ ప్రజల కలలను తన్ని పారేస్తానంటే మాత్రం అనుమతించే ప్రసక్తే లేదు’’ అని ఘాటుగా హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్, పీఎం కిసాన్ నిధి వంటి పథకాలను బెంగాల్లో దీదీ ప్రభుత్వం అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు. స్కీమ్‌లపై బీజేపీ నడుస్తుండగా, స్కామ్‌లపై తృణమూల్ కాంగ్రెస్ నడుస్తోందని ఆరోపించారు. మమతా బెనర్జీ పదేళ్లుగా బెంగాల్ ప్రజల జీవితాలతో అడుకుంటున్నారన్నారు. ఇక ఆమె ఆట ముగిసి, అభివృద్ధి మొదలవుతుందని పేర్కొన్నారు. బెంగాల్ ప్రగతి కోసం డబుల్ ఇంజన్ ప్రభుత్వం (కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ సర్కారు) కావాలన్నారు. ప్రజలకు అవినీతి రహిత సేవలు, అభివృద్ధి కోసం బీజేపీ అధికారంలోకి రావాలని చెప్పారు. -
బెంగాల్ దంగల్: మోదీ–దీదీ మాటల యుద్ధం
ఖరగ్‌పూర్/ హల్దియా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో ప్రచారం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మధ్య మాటల తూటాలు పేలాయి. మమత సర్కార్ దోపిడి విధానాలను మోదీ ఎత్తి చూపిస్తే, బీజేపీ ప్రపంచంలోనే అతి పెద్ద దోపిడి పార్టీ అంటూ దీదీ ఎదురు దాడి చేశారు. శనివారం ఖరగ్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీకి భారీగా తరలివచ్చిన జన సమూహాన్ని ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. మమత సర్కార్ దోపిడి విధానాల వల్ల రాష్ట్రంలో ఎన్నో పరిశ్రమలు మూతపడ్డాయని, కేవలం మాఫియా ఇండస్ట్రీ మాత్రమే పని చేస్తోందని ధ్వజమెత్తారు. మమత మేనల్లుడు, డైమండ్ హార్బర్ ఎంపీ అభిషేక్ బెనర్జీని సింగిల్ విండోగా అభివర్ణించారు. ఆయనతో మాట్లాడకపోతే ఒక్క పని జరగడం లేదని పారిశ్రామికవేత్తలందరూ హడలెత్తిపోతున్నారని అన్నారు. ‘‘పారిశ్రామికీకరణ కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సింగిల్ విండో విధానాన్ని ఏర్పాటు చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు దీనిని పాటిస్తూ అభివృద్ధి పథంలో నడుస్తున్నాయి. బెంగాల్లో కూడా సింగిల్ విండో ఉంది. మమత మేనల్లుడే ఇక్కడ సింగిల్ విండో. ఆ విండోని దాటకుండా ఒక్క పని కూడా జరగదు’’అని ఆరోపించారు. అన్నీ అమ్మేస్తున్నారు హల్దియా రేవు పట్టణంలో జరిగి ఎన్నికల సభకి వీల్ చైర్లోనే హాజరైన సీఎం మమతా బెనర్జీ మోదీ మాటల్ని తిప్పి కొట్టారు. ప్రపంచంలోనే బీజేపీ అతి పెద్ద దోపిడీ పార్టీ అని ఆరోపణలు గుప్పించారు. పీఎం కేర్స్ఫండ్ ద్వారా ఆ పార్టీ ఎంత డబ్బు సంపాదించిందో ఒక్క సారి చూడండని అన్నారు. మోదీని మించిన అమ్మకం దారుడు మరెవరూ లేరని ధ్వజమెత్తారు. ప్రధాని అన్నీ అమ్మేస్తూ భారత ఆర్థిక వ్యవస్థని సర్వనాశనం చేస్తున్నారని అన్నారు. ౖ‘‘రెల్వేలను ప్రైవేటు పరం చేశారు. బొగ్గు, బీఎన్ఎన్ఎల్, బీమా, బ్యాంకులు ఇలా అన్నీ అమ్మేస్తున్నారు’’అంటూ విమర్శించారు. ఏదో ఒక రోజు హల్దియా ఓడరేవుని కూడా అమ్మకానికి పెట్టేస్తారని హెచ్చరించారు.. బెంగాల్‌ని కాపాడుకోవాలంటే తృణమూల్ కాంగ్రెస్‌కే ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేసిన మమత అప్పుడే రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం వాటిల్లదని అన్నారు. -
ఇక్కడ గెలిచాక ఢిల్లీలో ‘పరివర్తన్’
కలైకుందా/గర్బేటా: పశ్చిమ బెంగాల్లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాక, ఢిల్లీలో పరివర్తన్ (మార్పు) తీసుకొస్తానని ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో గెలిచాక తాను కేంద్ర రాజకీయాల్లో అడుగుపెడతానని, ప్రత్యామ్నాయంగా మారుతానని బీజేపీ భయపడుతోందని, అందుకే ఆ పార్టీ పెద్దలంతా బెంగాల్‌ను లక్ష్యంగా చేసుకున్నారని చెప్పారు. పరివర్తన్ అంటూ తాను ఇచ్చిన నినాదాన్ని బీజేపీ దొంగిలించిందని, దాన్ని అసోల్ పరివర్తన్ (అసలైన మార్పు) అంటూ రీమోడలింగ్ చేసిందని విమర్శించారు. మమతా బెనర్జీ గురువారం పశ్చిమ మేదినీపూర్ జిల్లాలో ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలంతా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఆమె ఇంకా ఏం మాట్లాడారంటే.. బీజేపీతో కూటమి కుమ్మక్కు ‘‘పోలీసులపై నాకు గౌరవం ఉంది. వారు తప్పుడు పనులు చేయరు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో గోల్మాల్ చేయాలని బీజేపీ నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. ఒకప్పుడు మావోయిస్టులకు కంచుకోట అయిన జంగల్‌మహల్ సమగ్రాభివృద్ధికి మా ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. బెంగాల్లో సీపీఎం–కాంగ్రెస్ కూటమి మతతత్వ బీజేపీతో చేతులు కలిపింది. అందుకే మార్క్సిస్టు మిత్రులు కూడా ఆ కూటమి అభ్యర్థులకు ఓటేయవద్దు. గాంధీజీని హత్య చేసిన వారితో సంబంధాలున్న వారికి ఒక్క ఓటు కూడా వేయొద్దు. దుర్గాపూజకు రూ.50,000 ఇస్తాం తృణమూల్ కాంగ్రెస్‌ను మళ్లీ గెలిపిస్తే బెంగాల్లో ఓడరేవులు, పరిశ్రమలు స్థాపిస్తాం. భారతీయ రైల్వేను అమ్మేయడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. రైల్వే ఉద్యోగులు ఆ పార్టీని ఓడించాలి. మా పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే విద్యార్థులు ఉన్నత చదువులు చదవడానికి తక్కువ వడ్డీతో రూ.10 లక్షల రుణం మంజూరు చేస్తాం. దుర్గాపూజ చేసుకోవడానికి కమ్యూనిటీ క్లబ్‌లకు రూ.50 వేల చొప్పున ఇస్తాం. డబ్బు సంచులు తెస్తున్నారు బీజేపీ అబద్ధాల పార్టీ, ఇచ్చిన హామీలను ఆ పార్టీ ఎప్పుడూ నెరవేర్చదు. నరేంద్ర మోదీ హామీ ఇచ్చినట్లుగా రూ.15 లక్షలు ప్రజలకు అందాయా? ప్రధానమంత్రిగా కుర్చీ ఎక్కాక ఆయన తన çహామీని తుంగలో తొక్కారు. బెంగాల్లో కరోనా మహమ్మారిని సమర్థంగా నియంత్రిస్తున్నాం. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కరోనా మళ్లీ ఉధృతంగా వ్యాప్తి చెందుతోంది. రాష్ట్ర రాజధాని కోల్‌కతా నగర సంస్కృతిలో భాగమైన ‘కోల్‌కతా కాఫీ హౌస్’పై ఆధిపత్యం చెలాయించడానికి బీజేపీ గూండాలు కుట్ర పన్నుతున్నారు. దాని గొప్పదనం వారికి తెలియదు. నందిగ్రామ్‌లో బీజేపీ నేతలు నాపై దాడి చేశారు. ఇప్పుడు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు కోట్లాది రూపాయల అక్రమాలు సాగించింది. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకంతో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారుతోంది. ఆ డబ్బుకు లెక్కాపత్రం ఉండడం లేదు. బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున డబ్బు సంచులు హెలికాప్టర్లు, విమానాల్లో తీసుకొస్తున్నారు. బెంగాల్లో ఎలాగైనా నెగ్గాలని కుట్ర పన్నుతున్నారు’’ అని మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. -
సర్వే సంచలనం
-
సమరానికి సై : దీదీ సంచలనం
-
సమరానికి సై : దీదీ సంచలనం
సాక్షి, కోల్‌కతా: రానున్న అసెంబ్లీ ఎన్నికల పోరు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ తనదైన తనదైన శైలిలో దూసుకు పోతున్నారు. ముఖ్యంగా మమత కంచుకోటలో ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ ప్లాన్ చేస్తున్న తరుణంలో దీదీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నందీగ్రామ్ నుంచే బరిలోకి దిగుతున్నట్టు తేల్చి చెప్పారు. తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని నందిగ్రామ్ నుంచి మాత్రమే తాను పోటీ చేస్తానని, భవానిపూర్ నుంచి కాదని ఆమె ధృవీకరించారు. ఇక్కడనుంచి నుంచి శోభన్‌దేవ్ చటోపాధ్యాయ పోటీ చేయనున్నట్లు తెలిపారు.మార్చి 10 నామినేషన్ వేస్తానన్నారు. అంతేకాదు రాష్ట్ర ఎన్నికల అభ్యర్థులను ముందుగానే ప్రకటించి బీజేపీకి గట్టి సవాల్ విసిరారు. రాష్ట్రంలోని మొత్తం 294 స్థానాలకుగాను 291 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించడంతో పాటు మహిళలకు 50 టికెట్లు ఇవ్వడం విశేషం. శుక్రవారం ప్రకటించిన రేసుగుర్రాల జాబితాలో 50 మంది మహిళలు, 42 మంది ముస్లిం, 79 మంది ఎస్సీ, 17 మంది ఎస్టీ అభ్యర్థులకు టికెట్లు ఇచ్చినట్టు ఆమె ఈ రోజు విలేకరుల సమావేశంలో ప్రకటించారు. మూడు నియోజక వర్గాల్లో పోటీచేయడం లేదన్నారు. ఇటీవల టీఎంసీలో చేరిన మనోజ్ తివారీకి టికెట్ ఇచ్చిన మమతా 28 మంది సిట్టింగ్‌లకు షాక్ ఇచ్చారు. టీఎంసీకి గుడ్ బై చెప్పిన నందిగ్రామ్ ఎమ్మెల్యే సువేందుఅధికారి బీజేపీ తీర్థం పుచ్చున్నారు. దీదీకి పోటీగా అధికారినే బరిలోకి దింపాలని బీజేపీ యోచిస్తోంది. కాగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు మార్చి 27, 1, 6, 10, 17, 22, 26, 29 తేదీలలో ఎనిమిది దశల్లో జరుగనున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు ఇవే లాంగెస్ట్ ఎన్నికలు. మే 2 న ఓట్లు లెక్కింపు ఉంటుంది. టీఎంసీ అభ్యర్థుల జాబితాలో కొన్ని మమతా బెనర్జీ- నందిగ్రామ్ మనోజ్ తివారీ - షిబ్పూర్ దెబాసిస్ కుమార్ - రాష్ బిహారీ మదన్ మిత్రా- కమర్హతి అదితి మున్షి- రాజర్హాట్ పార్థా ఛటర్జీ- బెహాలా రత్న ఛటర్జీ - బెహాలా పూర్బా -
సాధారణ పౌరుల పరిస్థితి ఏంటి?
కోల్కత్తా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ.. బీజేపీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవదంటూ ఎప్పుడూ అంటుంటారని, కానీ, తాము గెలిచి చూపిస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. గురువారం తన కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగిన కొన్ని గంటల తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వెయ్యి సవాళ్లు ఎదురైనా వాటిని ఎదుర్కొంటాం. ప్రజాప్రతినిధులకే రక్షణ లేకపోతే, సాధారణ పౌరుల పరిస్థితి ఏంటి?. ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు. దాదాపు 130 మంది బీజేపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారు. బెంగాల్లో ప్రజా స్వామ్య వ్యవస్థే కుప్పకూలింది. రైతుల సంక్షేమం కోసం కేంద్రం పంపిన నిధులు 70 లక్షల మందికి అందలేదు. ఆయుస్మాన్ భారత్ పథకం ఫలాలు కూడా 4.67 కోట్ల మందికి అందలేద’’ని అన్నారు. కాగా, పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న నడ్డా, కైలాష్ విజయవర్గియా కాన్వాయ్‌లపై జరిగిన దాడిని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సీరియస్‌గా తీసుకున్నారు. దీనిపై దర్యాప్తుకు ఆదేశించారు. రాష్ట్రంలోని శాంతి,భద్రతలపై పూర్తి నివేదికను ఇవ్వాలని గవర్నర్‌ను కోరారు. -
రసవత్తరం కానున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) సీనియర్ నాయకుడు, తిరుగుబాటు నేత సువేందు అధికారి ఆ పార్టీకి తల నొప్పిగా మారనున్నారు. టీఎంసీ పార్టీ నాయకుడు సౌగతా రాయ్(49) అయిదుగు పార్టీ నాయకులతో రెండు రోజుల పాటు కీలక సమావేశం నిర్వహించారు. సువేందు నిర్ణయంలో ఏదైనా మార్పు ఉంటే మళ్లీ చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. (చదవండి: పశ్చిమ బెంగాల్లో విషాదం, 11 మంది మృతి) పార్టీలో మొదలైన ముసలం టీఎంసీ యూత్ వింగ్ చీఫ్, డైమండ్ హార్బర్ ఎంపీ అభిషేక్ బెనర్జీకి పార్టీలో ప్రాధాన్యత పెరగడంతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సన్నిహితుల మధ్య విభేదాలు మొదలయ్యాయి. దీంతో పార్టీ ఫిరాయించిన చాలా మంది బీజేపీలో చేరడంతో గత సంవత్సరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపింది. బెంగాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం రెండు సీట్లు మాత్రమే గెలుచుకుంటే.. లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం 40 స్థానాలకు గానూ 18 గెలుచుకుంది. మారనున్న సమీకరణాలు సువేందు పార్టీ మారకపోయినా.. పార్టీ నుంచి నిష్క్రమిస్తే మాల్డా, ముర్షిదాబాద్, పురులియా, బంకురా, పశ్చిమ మిడ్నాపూర్ ప్రాంతాల్లోని స్థానిక నాయకులపై ప్రభావం చూపనుంది. సువేందు పదవిని రద్దు చేసే వరకు ఈ ప్రాంతంలో ఆయన అధికారి పార్టీ ఇన్చార్జిగా ఉన్నారు. ఆయన తండ్రి, సోదరుడు ఇద్దరు కూడా టీఎంసీ పార్టీ ఎంపీలుగా కొనసాగుతున్నారు. ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో సువేందు మాట్లాడుతూ.. అభిషేక్ బెనర్జీకి పార్టీలో అగ్రస్థానం చేరుకోవడానిక దొడ్డి దారి ఎంచుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే దీనిపై బెనర్జీ స్పందిస్తూ... ‘‘నేను డైమండ్ హార్బర్ వంటి కఠినమైన నియోజకవర్గం నుంచి ఎంపీ కావడానికి పారాచూట్, నిచ్చెనను ఉపయోగించలేదు. డైమండ్ హార్బర్ నా సొంత నియోజకవర్గం. మా కుటుంబంలో వారు కూడా చాలా పదవులు కలిగి ఉన్నారు’ అని అన్నారు. మంగళవారం ఉత్తర కోల్‌కత్తాలో జరిగిన సమావేశంలో ఎన్నికల ప్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తోపాటు బెనర్జీ హాజరయ్యారు. -
క్లిష్ట సమయంలో మమతకు భారీ షాక్
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఎదురు దెబ్బ తగిలింది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ సీనియర్ నాయకుడు, రెబెల్ రవాణా శాఖ మంత్రి సువేందు అధికారి మంత్రి పదవికి రాజీనామా చేశారు. గత కొంత కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న ఆయన చివరకు ప్రభుత్వంనుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. దీంతో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీకి భారీ షాక్ తగిలినట్టయింది. గురువారం కీలక పదవికి రాజీనామా చేసిన ఆయన తాజాగా మంత్రి పదవికి గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు ఆయన సీఎంకు శుక్రవారం ఒక లేఖ రాశారు. తన రాజీనామాను వెంటనే అంగీకరించాలని కోరారు. రాష్ట్ర ప్రజలకు సేవ చేయడానికి తనకు అవకాశం ఇచ్చినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. నిబద్ధత, అంకితభావం, చిత్తశుద్ధితో పనిచేశానని లేఖలో పేర్కొన్నారు. కాగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి మరోమారు అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్న మమతా బెనర్జీకి అసమ్మతి సెగ భారీగానే తగులుతోంది. క్లిష్ట సమయంలో పెనుసవాళ్లు ఎదురవుతున్నాయి. అండగా ఉండాల్సిన నాయకులు, కార్యకర్తలు ఒక్కొక్కరుగా పార్టీకి దూరమవుతున్నారు. ముఖ్యంగా ఈ నెలలో జరిగిన కేబినెట్ సమావేశానికి ఐదుగురు మంత్రులు గైర్హాజరు కావడం టీఎంసీలో కలవరం రేపిన సంగతి తెలిసిందే. మరోవైపు గత కొన్ని వారాలుగా అధినాయకత్వాన్ని ప్రశ్నిస్తున్న అధికారి గురువారం హూగ్లీ రివర్ బ్రిడ్జ్ కమిషన్ చైర్మన్ పదవినుంచి తప్పుకున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ్ బెనర్జీని కొత్తగా నియమించింది. దీంతో తృణమూల్ కాంగ్రెస్‌లో తాజా తిరుగుబాటు చర్చనీయాంశంగా మారింది. -
ఏం మాటలివి!
చాక్లెటీ ఫేస్.. ప్రియాంక. పెద్ద బొట్టు.. స్మృతీ ఇరానీ. తళుకులు.. జయప్రద. కులుకులు.. హేమమాలిని. సోగ్గత్తె.. మాయావతి. ఇవా రాజకీయ విమర్శలు! ఇప్పుడొకాయన.. మమతకు కరోనా అంటిస్తానంటున్నాడు! ఎలాగంటే.. ఆవిణ్ణి హగ్ చేసుకుంటాడట! ఏం మాటలివి? ఇష్యూ మీద ఢీకొనాలి గానీ.. మనిషి మీదా వెళ్లి పడటం?! రాజకీయాల్లోకి మహిళలు రాలేకపోవడం ఉండదు. వాళ్లను రానివ్వకపోవడం, వచ్చాక నిలదొక్కుకోనీయక పోవడం ఉంటుంది. నానా మాటలు అంటారు. అయితే ఆ మాటలు ‘నువ్వు నీ హామీలు నెరవేర్చలేక పోయావు’ అనే ఆరోపణలతో ఆగేవి కావు. ‘నువ్వేంటో నాకు తెలుసు’ అనేంత వరకు వెళ్తాయి. బీజేపీ కొత్త జాతీయ కార్యదర్శి అనుపమ్ హజ్రా కూడా అంతవరకూ వెళ్లారు. ‘కూడా’అని అనడం దేనికంటే ఆయన బాగా చదువుకున్న వ్యక్తి. యూనివర్శిటీ ప్రొఫెసర్! కార్యదర్శిగా అనుపమ్ శనివారం పదవీ బాధ్యతలు చేపట్టగానే ఆదివారం దక్షిణ 24 పరగణాల జిల్లాలోని బరూయ్‌పూర్‌లో ప్రెస్ మీట్ పెట్టి.. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కరోనా బాధితుల విషయంలో అమానుషంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఆ సమయంలో ఆయన గానీ, అనుచరులు గానీ మాస్క్‌లతో లేరు. మీడియా ప్రతినిధులు ఆ విషయమే అడిగారు. ‘‘మా కార్యకర్తలకు కరోనా అంటే భయం లేదు. ఎందుకంటే.. అంతకంటే ప్రమాదకరమైన మమతా బెనర్జీతో తలపడుతున్నారు’’ అని అన్నారు అనుపమ్. అక్కడితో ఆగిపోలేదు. ‘‘నాకు గానీ కరోనా రావాలీ.. వెళ్లి మమతను హత్తుకుంటాను’’ అన్నారు! ఒక మహిళను అనకూడని మాట. వివేకం నశించినప్పుడు నాలుక కట్టడి తప్పుతుంది. ఇలా కట్టడి తప్పి, మహిళా రాజకీయనేతలను తప్పుగా మాట్లాడిన నాలుకల క్లబ్బులో అనుపమ్ తాజా సభ్యుడు. ఎన్నికల ప్రచారంలో, పార్లమెంటు సమావేశాలలో మహిళా నేతలతో మాటా మాటా వచ్చినప్పుడు వారిని ఎదుర్కోలేక, విమర్శల్ని వారి ఒంటి మీదకో, ఇంటి మీదకో మళ్లిస్తుంటారు పురుష నాయకులు. పురుషులపై పురుషులు, పార్టీలపై పార్టీలు చేసుకునే ఆరోపణలు, విమర్శల్లో కూడా వాళ్లు తిరగడం.. స్త్రీల చుట్టూనే! నాయకుల ఈ నోటి దుడుకుపై ఎన్నికల సంఘం, జాతీయ మహిళా కమిషన్, లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్ ఎంతగా అభిశంసించినా, పోలీస్ స్టేషన్లలో ఎన్ని కేసులు నమోదైనా, సోషల్ మీడియాలో వేల కామెంట్లుగా నిరసనలు వ్యక్తం అయినా.. అవేవీ హెచ్చరికలు కావడం లేదనడానికి తాజా నిదర్శనమే మమతా బెనర్జీపై అనుపమ్ హజ్రా చేసిన వ్యాఖ్యలు. ఆయన కన్నా ముందు అదుపు తప్పిన వారు ఎందరో ఉన్నారు. వారిలో ఎవరు ఎవర్ని ఏమన్నారో ఒకసారి గతంలోకి వెళ్దాం. ‘‘రాంపూర్ ప్రజలారా.. ఉత్తర ప్రదేశ్ ప్రజలారా.. భారతదేశ ప్రజలారా.. ఆ మనిషి ఏమిటో తెలుసుకోడానికి మీకు 17 ఏళ్లు పట్టింది. నేను పదిహేడు రోజుల్లో కనిపెట్టేశాను. ఆమె లోదుస్తులు ఖాకీ రంగువి.’’ (జయప్రద గురించి ఆజమ్‌ఖాన్, సమాజ్‌వాది పార్టీ) ‘‘ఆమె తన తళుకుబెళుకుల వస్త్రాలతో, ఆటపాటలతో రాంపూర్ సాయంత్రాలను రంగులమయం చేయడానికి వచ్చారు.’’ (జయప్రద గురించి ఫిరోజ్‌ఖాన్, సమాజ్‌వాది పార్టీ) ‘‘ఊర్మిళను పార్టీలో చేర్చుకున్నారు. ఆమెకేం తెలుసు పాపం. అమాకురాలు. భోలీ భాలీ లడికీ. పాలిటిక్స్‌లో జీరో నాలెడ్జ్. ఆ కళ్లు బాగుంటాయని కాంగ్రెస్ తెచ్చుకుంది.’’ (గోపాల్‌శెట్టి, బీజేపీ) ‘‘స్మృతీ ఇరానీ గడ్కారి పక్కన కూర్చొని రాజ్యాంగాన్ని మార్చే విషయం మాట్లాడుతోంది. ఆమె గురించి ఓ విషయం చెబుతా వినండి. ఆమె తన నుదుటిపై పెద్ద బొట్టు పెట్టుకుంటుంది. నాకొకరు చెప్పిందేమిటంటే అంత పెద్దబొట్టు పెట్టుకుని కనిపించేవారు తరచు భర్తలను మార్చేవారు అయుంటారని! మారే భర్తల సంఖ్య పెరిగే కొద్దీ బొట్టూ పెద్దది అవుతుందట.’’ (జయదీప్ కవాడే, పీపుల్స్ రిపబ్లికన్ పార్టీ) ‘‘ఆమె ప్రతిరోజూ ఫేషియల్ చేయించుకుంటుంది. మన నాయకుణ్ణి సోగ్గాడు అంటోంది. ఆయన కాదు సోగ్గాడు. ఆరవై ఏళ్ల వయసులో తలకు రంగు వేసుకునే ఆమే సోగ్గత్తె. జుట్టంతా ముగ్గు బుట్ట అయ్యాక కూడా రంగు వేసుకుంటోంది.’’ (మాయావతి గురించి సురేంద్ర నారాయణ సింగ్). ‘‘రాహుల్ గాంధీ మీద నమ్మకం లేదు కాబట్టే, చాక్లెటీ ఫేస్‌లను తెచ్చుకుంటున్నారు.’’ (ప్రియాంక గురించి కైలాశ్ విజయ్‌వర్గియా, బీజేపీ). ‘‘స్కర్ట్లు వేసుకునే పిల్ల చీర కట్టి గుళ్లు తిరుగుతోంది. గంగాజలం అంటే గిట్టని అమ్మాయి గంగానదిని పూజిస్తోంది.’’ (ప్రియాంక గురించి జయకరణ్ గుప్తా, బీజేపీ) ‘‘ఈ సంగతి అందరికీ తెలుసు. ప్రియాంక ఢిల్లీలో ఉన్నప్పుడు జీన్స్, టాప్ వేసుకుంటుంది. నియోజకవర్గాల్లో పర్యటించేటప్పుడు చీర కట్టుకుని బొట్టు పెట్టుకుంటుంది.’’ (హరీష్ ద్వివేదీ, బీజేపీ) ‘‘వ్హావ్.. 50 కోట్ల రూపాయల విలువైన గర్ల్ ఫ్రెండ్‌ని ఎక్కడైనా చూశారా!’’ (ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్ నేత శశిథరూర్‌ను విమర్శించేందుకు, అతడి భార్య సునంద పుష్కర్‌ను ఉద్దేశించి నరేంద్ర మోదీ). ‘‘బీజేపీలో అందమైన ముఖం ఒక్కటీ లేదు. వాళ్లకున్న ఒకే ఒక్క ఆకర్షణీయమైన ముఖం హేమమాలిని. వోట్ల కోసం ఆమె చేత డ్యాన్స్ చేయిస్తున్నారు. పాటలు పాడిస్తున్నారు. ఆమె కూడా పార్టీకి ఓట్లు రాబట్టడానికి ఆడి, పాడుతున్నారు.’’ (సజ్జన్ సింగ్ వర్మ, యు.పి.ఎ.). -
బెంగాల్‌కు తక్షణ సాయం వెయ్యి కోట్లు
బసీర్హాట్/కోల్‌కతా/భువనేశ్వర్: ఉంపన్ తుపాను ధాటికి తీవ్రంగా నష్టపోయిన పశ్చిమ బెంగాల్‌కు తక్షణ సాయం కింద రూ.1,000 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆయన శుక్రవారం బెంగాల్లో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్ఖర్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా మోదీ వెంట ఉన్నారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బసీర్హాట్లో గవర్నర్, ముఖ్యమంత్రి, పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులతో మోదీ సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఒక వీడియో సందేశం విడుదల చేశారు. తుపాను వల్ల మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని పేర్కొన్నారు. గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున అందజేస్తామన్నారు. ఒకవైపు కరోనా మహమ్మారిపై పోరాడుతూనే మరోవైపు తుపాను సహాయక చర్యలు చేపట్టడంలో సమర్థంగా వ్యవహరించారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ప్రధాని ప్రశంసించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వంతోపాటు దేశం మొత్తం బెంగాల్ ప్రజలకు అండగా ఉంటుందని మోదీ చెప్పారు. రూ.లక్ష కోట్ల నష్టం: మమతా బెనర్జీ ఉంపన్ తుపాను వల్ల పశ్చిమ బెంగాల్‌కు రూ.లక్ష కోట్లకుపైగా నష్టం వాటిల్లిందని సీఎం మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ కలిసి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. తుపాను వల్ల సంభవించిన నష్టాన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లానని పేర్కొన్నారు. మొత్తం నష్టాన్ని అంచనా వేయడానికి మరికొంత సమయం పడుతుందన్నారు. పలు పథకాల కింద కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.53 వేల కోట్లు రావాల్సి ఉందన్నారు. బెంగాల్లో 77కి చేరిన మరణాలు బెంగాల్లో ఇప్పటిదాకా అంపన్ తుపాను వల్ల మరణించిన వారి సంఖ్య 77కు చేరింది. రాజధాని కోల్‌కతా సహా దాదాపు సగం జిల్లాలు అంపన్ ధాటికి దారుణంగా దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా, మొబైల్ సేవలను పునరుద్ధరించారు. ఒడిశా సీఎంకు ప్రధాని ప్రశంస సైక్లోన్ వల్ల నష్టపోయిన ఒడిశాకు రూ.500 కోట్ల తక్షణ సాయాన్ని ప్రధాని మోదీ ప్రకటించారు. ఆయన శుక్రవారం ఒడిశాలో తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వేలో పాల్గొన్నారు. అనంతరం గవర్నర్ గణేశీలాల్, సీఎం నవీన్ పట్నాయక్, పలువురు కేంద్ర మంత్రులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తుపాను నష్టంపై నివేదిక వచ్చాక తదుపరి ఆర్థిక సాయం ప్రకటిస్తామన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడడంతో గొప్ప చొరవ చూపారని ఒడిశా ప్రభుత్వాన్ని ప్రధాని మోదీ కొనియాడారు. తుపాను కారణంగా తమ రాష్ట్రంలో 45 లక్షల మంది ప్రభావితులైనప్పటికీ, వేలాది ఇళ్లు దెబ్బతిన్నప్పటికీ ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం అందలేదని ఒడిశా ప్రభుత్వం తెలిపింది. జాతీయ విపత్తుగా ప్రకటించాలి: విపక్షాలు పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో అంపన్ తుపాను సృష్టించిన బీభత్సాన్ని వెంటనే జాతీయ విపత్తుగా ప్రకటించాలని 22 ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. ఆయా రాష్ట్రాలను సముచిత రీతిలో ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాయి. 22 పార్టీల నేతలు శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. తుపాను బీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలంటూ ఒక తీర్మానాన్ని ఆమోదించారు. పశ్చిమ బెంగాల్, ఒడిశా ప్రభుత్వాలకు, ప్రజలకు అండగా ఉంటామని తీర్మానంలో పేర్కొన్నారు. సహాయ, పునరావాస చర్యలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీ ఆధ్వర్యంలో జరిగిన ప్రతిపక్షాల సమావేశంలో తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, డీఎంకే, కమ్యూనిస్టు తదితర పార్టీల నాయకులు పాల్గొన్నారు. -
బెంగాల్ దంగల్
-
మమతా బెనర్జీ బెంగాలీతో పాటు చైనీస్, సంతాలీలో ప్రచారం
సంగీతానికి భాషా భేదాలుండవని అంటారు. తమ ప్రచారానికీ భాషా భేదాలు లేవని నిరూపిస్తున్నారు పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ. బెంగాలీ, హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్, తెలుగు భాషలతో పాటు చైనీస్, సంతాలీ వంటి భాషల్లోనూ తృణమూల్ పార్టీ తమ అభ్యర్థులకు ఓటేయాలంటూ ప్రచారం చేస్తోంది. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఏ భాష వారు ఎక్కువుంటే ఆ భాషలోనే అక్కడ గోడలపై ఎన్నికల నినాదాలు, అభ్యర్థనలు రాయిస్తోంది. ప్రచారం కూడా ఆయా భాషల్లోనే సాగుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకుని రాష్ట్రంలో పట్టు సాధించేందుకు బీజేపీ కృషి చేస్తున్న నేపథ్యంలో వారికి అడ్డుకట్ట వేసేందుకు మమతా బెనర్జీ ఓటర్లను ఆకట్టుకోవడానికి ఈ బహుభాషా ప్రచారం ప్రారంభించారు. ఖరగ్‌పూర్ ఓటర్లలో 50 శాతానికిపైగా తెలుగు వారున్నారు. ఇక్కడ బీజేపీకి పట్టుంది. తృణమూల్ తరఫున ఇక్కడ మానస్ బునియా పోటీ చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకోవడం కోసం తృణమూల్ ఇక్కడ తెలుగులోనే ప్రచారం చేస్తోంది. ఈ ప్రాంత వాసులైన ప్రశాంత్‌రావు, తారకేశ్వరరావు తెలుగు ప్రచారానికి సహకరిస్తున్నారు. తాంగ్రా, సెంట్రల్ కోల్‌కతాలోని తిరేతా బజార్ ప్రాంతాల్లో చైనీయులు వేల సంఖ్యలో ఉన్నారు. వారిలో సగం మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. దక్షిణ కోల్‌కతా నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతంలో తృణమూల్ అభ్యర్థి మాలారాయ్ తరఫున చైనా భాషలో ప్రచారం జరుగుతోంది. చైనా లిపిలో చిన్న చుక్క, గీతల్లో తేడాలొచ్చినా అర్థాలు తారుమారవుతాయి. ఆ పొరపాటు జరగకుండా నేను జాగ్రత్తలు తీసుకుంటున్నా’నని తాంగ్రాలో ఉంటున్న హో కింగ్ తైమ్ అనే చైనీయుడు చెబుతున్నారు. వెస్ట్ మిడ్నపూర్‌లో గిరిజన ఓటర్లు ఎక్కువ. వీరిలో 52 శాతం సంతాలీలే. దాంతో ఇక్కడ సంతాలీ భాషలో ప్రచారం సాగుతోంది. ఇలా ఏ ప్రాంతంలో ఏ భాషీయులు ఉంటే అక్కడ ఆ భాషలో ప్రచారం చేస్తూ తృణమూల్ ఎన్నికల ప్రచారానికి కొత్త హంగులు దిద్దుతోంది. -
‘రణ’మూల్
పశ్చిమబెంగాల్ యువజన కాంగ్రెస్ నేతగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన మమతా బెనర్జీ.. కాంగ్రెస్‌తో 26 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుని స్థాపించిన పార్టీయే ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ (ఏఐటీసీ/టీఎంసీ). బెంగాల్లో ప్రస్తుత పాలకపక్షంగా ఉన్న ఈ పార్టీ 1998 జనవరి 1న ఆవిర్భవించింది. దీదీ, అంతకు ముందు బెంగాల్ ‘అగ్నికన్య’గా పేరు సంపాదించిన మమత పోరాట పటిమ, 34 ఏళ్ల సీపీఎం పాలనకు ముగింపు పలకాలనే పట్టుదలతో స్థాపించిన 13 ఏళ్లకే (2011) తృణమూల్ అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లుగా తిరుగులేని మెజారిటీతో రాష్ట్రాన్ని పాలిస్తోంది. సీపీఎం మొదటి ముఖ్యమంత్రి జ్యోతిబసు హయాంలో కాంగ్రెస్ నేతగా మార్క్సిస్ట్ సర్కారుపై ఎడతెగని పోరాటం చేశారు. 2000 నవంబర్‌లో జ్యోతిబసు వారసునిగా వచ్చిన సీనియర్ సీపీఎం నేత బుద్ధదేవ్ భట్టాచార్య హయాంలో తృణమూల్ కాంగ్రెస్ పదిన్నరేళ్ల కాలం హింసాత్మక ఉద్యమాలతో సంచలనం సృష్టించింది. చివరికి 2011 మే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం హస్తగతం చేసుకుంది. మమత ‘నిరసన నృత్యం’ 1970ల చివర్లో జనతా పార్టీకి స్ఫూర్తిప్రదాత జయప్రకాశ్ నారాయణ్ కారు బానెట్‌పై యూత్ కాంగ్రెస్ నేతగా ఎదుగుతున్న మమత డాన్స్ చేసి మొదటిసారి అందరి దృష్టినీ ఆకర్షించారు. మధ్య తరగతి బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి కాంగ్రెస్‌లో అంచెలంచెలుగా ఎదిగారు. సీపీఎం సమరశీల కార్యకర్తల ధాటికి కాంగ్రెస్ కార్యకర్తలు భయపడి పారిపోయే రోజుల్లో ఆమె వారికి ఎదురొడ్డి నిలిచి దెబ్బలు తిన్నారు. జ్యోతిబసు హయాంలో 1991లో వామపక్ష కార్యకర్తల దాడిలో మమత తల పగిలి కుట్లుపడ్డాయి. తృణమూల్ పార్టీ ఆవిర్భావం 1996–98 మధ్య కేంద్రంలో పాలన సాగించిన యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలకు లోక్‌సభలో బయటి నుంచి కాంగ్రెస్, సీపీఎం మద్దతు ఇచ్చాయి. బీజేపీని అధికారానికి దూరంగా ఉంచాలనే లక్ష్యంతో చేసిన ఈ ప్రయోగం కారణంగా బెంగాల్లో సీపీఎంతో కాంగ్రెస్ రాజీపడుతోందని మమత గ్రహించారు. ఈ క్రమంలోనే 1998 జనవరి 1న పశ్చిమబెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ పేరుతో ప్రాంతీయ పార్టీ స్థాపించారు. కొన్ని నెలలకే జరిగిన లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపెట్టుకుని పోటీ చేశారు. తొలి ప్రయత్నంలోనే టీఎంసీకి 7 సీట్లు రాగా, మిత్రపక్షం బీజేపీకి ఒక స్థానం దక్కింది. 1999 లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీతో పొత్తుపెట్టుకుని పశ్చిమ బెంగాల్లో 8 సీట్లు తృణమూల్ కైవసం చేసుకుంది. వాజ్‌పేయి నాయకత్వంలో ఏర్పడిన మూడో ఎన్డీఏ ప్రభుత్వంలో మమతా బెనర్జీ రైల్వేమంత్రి అయ్యారు. 2001 వేసవిలో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకోవడానికి వీలుగా వాజ్‌పేయి ప్రభుత్వం నుంచి మమత సహా తృణమూల్ మంత్రులు రాజీనామా చేశారు. ఈ ఎన్నికల్లో మొత్తం 294 సీట్లకు 226 స్థానాలకు పోటీచేసి 60 స్థానాలు టీఎంసీ కైవసం చేసుకుని ప్రధాన ప్రతిపక్ష హోదా సంపాదించింది. మళ్లీ 2003 సెప్టెంబర్‌లో తృణమూల్ (మమతా) వాజ్‌పేయి ప్రభుత్వంలో చేరింది. 2004 ఎన్నికల్లోనూ బీజేపీతో పొత్తు 2004 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో తృణమూల్ పొత్తుపెట్టుకుంది. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీగా బీజేపీతో పాటే ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది. టీఎంసీకి ఒకే ఒక సీటు దక్కింది. 2006 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పరాజయం తప్పలేదు. తృణమూల్ బలం 60 నుంచి 30కి పడిపోయింది. సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ 235 సీట్లు సాధించింది. మమత, తృణమూల్ పని ఇక అయిపోయిందనుకున్న ఈ దశలో బుద్ధదేవ్ సర్కారుపై బ్రహ్మాండమైన పోరు సాగించడానికి తృణమూల్‌కు గొప్ప అవకాశం వచ్చింది. కోల్‌కతాకు 40 కిలోమీటర్ల దూరంలో సింగూరులో సారవంతమైన వేయి ఎకరాల భూమిని సీపీఎం సర్కారు టాటా మోటార్స్ నానో కారు ప్రాజెక్టు నిర్మాణానికి కేటాయించింది. భూసేకరణను రైతులు వ్యతిరేకించారు. రైతులకు మద్దతుగా మమత కోల్‌కతాలో 25 రోజులు నిరాహార దీక్ష చేశారు. తర్వాత మరో విదేశీ సంస్థకు నందిగ్రామ్‌లో కెమికల్ కాంప్లెక్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్ ఏర్పాటుకు ప్రభుత్వం వేలాది ఎకరాల భూమి కేటాయించడమేగాక 70 వేల మంది ప్రజలను ఖాళీ చేయించడానికి ప్రయత్నించింది. ఈ ఉద్యమంతోనూ తృణమూల్ లబ్ధిపొందింది. సింగూర్, నందిగ్రామ్‌తోపాటు భాంగోర్, సాల్బొనీ లాల్‌గఢ్, నయాచార్లో సీపీఎం కార్యకర్తలు, పోలీసుల హింస, అత్యాచారాల ఫలితంగా బుద్ధదేవ్ ప్రభుత్వం, కమ్యూనిస్టులు జనాదరణ కోల్పోయారు. పరిస్థితులు తృణమూల్‌కు అనుకూలంగా మారాయి. 2009 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుని టీఎంసీ 19 సీట్లు గెలుచుకుంది. అధికార పీఠంపై మమత 2011 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుని పోటీచేసిన తృణమూల్ సొంతంగానే మెజారిటీ సీట్లు సాధించింది. తృణమూల్ కూటమికి 227 సీట్ల భారీ మెజారిటీ లభించింది. ఒక్క తృణమూల్‌కే 184 స్థానాలు దక్కడంతో మంత్రివర్గంలో ఇతర పార్టీలకు స్థానం కల్పించలేదు. ముఖ్యమంత్రి కావాలనుకున్న మమత లక్ష్యం ఎట్టకేలకు నెరవేరింది. ఐదేళ్ల పాలనలో అనేక ప్రజాహిత కార్యక్రమాలతో తృణమూల్ పలుకుబడి విపరీతంగా పెరిగింది. సీపీఎం సహా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టీఎంసీలో చేరారు. టీఎంసీని రాజకీయంగా ఎదుర్కొనలేక సీపీఎం, ఇతర వామపక్షాలు చతికిలపడ్డాయి. ముస్లింలు కూడా పాలకపక్షానికి దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలో జరిగిన 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసిన తృణమూల్ కాంగ్రెస్ రాష్ట్రంలోని మొత్తం 42 సీట్లలో 34 కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. ప్రధాని నరేంద్రమోదీతో ఓ పక్క, కమ్యూనిస్టులతో మరోపక్క పోరాడుతూనే టీఎంసీ 2016 అసెంబ్లీ ఎన్నికల్లో 293 సీట్లకు పోటీచేసి 211 స్థానాలు కైవసం చేసుకుంది. ప్రస్తుత ఎన్నికల్లో ఒకవేళ బీజేపీ లేదా ఎన్డీఏకు 200 లేదా అంతకన్నా తక్కువ సీట్లు వస్తే ప్రధాని అయ్యే అవకాశం వస్తుందనే అంచనాతో మమతా బెనర్జీ ముందుకు సాగుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్ సీట్లు 1998 - 7 1999 - 8 2004 - 1 2009 - 19 2014 - 34 -
కోల్‌కతాలో యునైటెడ్ ఇండియా ర్యాలీ
-
పశ్చిమబెంగాల్లో బీజేపీ రథయాత్రకు మళ్లీ బ్రేక్
-
దీదీనే పీఎం అభ్యర్థి..
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీయేతర ఫ్రంట్‌కు పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రధాని అభ్యర్థిగా సారథ్యం వహిస్తారని జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్ధుల్లా సంకేతాలు పంపారు. అబ్దుల్లా శుక్రవారం కోల్‌కతాలో మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. మమతా బెనర్జీ బెంగాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను దేశవ్యాప్తంగా అందించేందుకు ఆమెను జాతీయ రాజకీయాల్లోకి తీసుకువెళతామని దీదీతో భేటీ అనంతరం ఆయన చెప్పారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలపై తాము చర్చించామని, మైనారిటీలు ఎదుర్కొంటున్న భయానక వాతావరణంపై భీతిల్లామన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్, తృణమూల్ వైఖరుల్లో ఎలాంటి వైరుధ్యం లేదని అన్నారు. బీజేపీని వ్యతిరేకించే వారంతా తమతో చేతులు కలపవచ్చని, ఆ పార్టీని మట్టికరిపించేందుకు తమతో కలిసిరావాలని పిలుపు ఇచ్చారు. మరోవైపు బీజేపీని వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీలన్నీ సమిష్టిగా ప్రజల పక్షాన పోరాడాలని మమతా బెనర్జీ పిలుపు ఇచ్చారు. బీజేపీ పాలన నియంత పోకడలను తలపిస్తోందని ఆరోపించారు. -
‘వారికి మతతత్వ భావం లేదు’
కోల్‌కతా: తమ రాష్ట్ర ప్రజల్లో మతతత్వ భావం లేదని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. ప్రపంచ సాంస్కృతిక వైవిధ్య దినోత్సవం సందర్భంగా సోమవారం మమత ట్వీట్ చేశారు. ‘ఈ రోజు ప్రపంచ సాంస్కృతిక వైవిధ్య దినోత్సవం. బెంగాల్ ప్రజలు ఎల్లప్పుడు ఐకమత్యాన్ని, వైవిధ్యాన్ని నమ్ముతారు. మతతత్వ భావం బెంగాల్ ప్రజల ఆలోచనలోగాని, హృదయాల్లోగాని లేదు’ అని ట్వీటర్లో పేర్కొన్నారు. గతకొంత కాలంగా బెంగాల్లో మతకల్లోలాలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. 2016 హౌరా అల్లర్లు, ఈ ఏడాది మార్చిలో అస్నాసోల్, రాణిగంజ్ ప్రాంతాల్లో రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇవి మతపరమైన ఘర్షణలు కావని, కేవలం చిన్న చిన్న స్థానిక ఘర్షణలు మాత్రమేనని మమత పేర్కొన్నారు. బెంగాల్లో మతపరమైన ఉద్రిక్తతలను ప్రేరేపించాలని బీజేపీ భావిస్తోందని మమత బెనర్జీ గతంలో అనేక సార్లు విమర్శించారు. కాగా ఇటీవల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్సారాజ్ గంగారం పార్లమెంట్‌కు సమర్పించిన ఓ నివేదికలో గత మూడేళ్ళుగా దేశంలో అత్యధికంగా మతకల్లోలాలు జరుగుతున్న రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో నిలివడం విశేషం. -
‘ఆమె శూర్పణక.. ఆ పార్టీ రావణుడు’
లక్నో : బీజేపీ నాయకులు ఆచితూచి మాట్లాడాలంటూ ఏకంగా ప్రధాని మోదీ హెచ్చరించినా వారి తీరు మారడం లేదు. ఇటీవలి కాలంలో పలువురు బీజేపీ నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లోకెక్కుతున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్‌తో చేతులు కలిపేందుకు సిద్ధమైన మమతా బెనర్జీని సూర్పణకతో పోల్చారు. రావణుని సోదరి అయిన శూర్పణకకు పట్టిన గతే ఆమెకు పడుతుందంటూ వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా మమత ముక్కు కోస్తారంటూ వివాదానికి తెరతీశారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీని రావణునితో పోలుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘బెంగాల్ మరో కాశ్మీర్ అయ్యేది’.. ఇటీవలి కాలంలో బెంగాల్లో చెలరేగిన అల్లర్ల నేపథ్యంలో సురేంద్ర ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. బెంగాల్లో హిందువులకు రక్షణ లేదన్నారు. ప్రజా సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కనీస బాధ్యత కూడా నిర్వర్తించడం లేదని విమర్శించారు. బంగ్లాదేశ్‌కు చెందిన ఉగ్రవాదులు బెంగాల్లో చొరబడి హిందువులను హింసిస్తున్నారన్నారు. మోదీ వంటి ప్రధాని ఉండడం మన అదృష్టం అని.. లేకుంటే ఈపాటికి బెంగాల్ మరో కాశ్మీర్ అయ్యేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలోనూ సురేందర్ సింగ్ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శల పాలయ్యారు. ఉన్నావ్ అత్యాచార కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కుల్దీప్ సింగార్‌ను సమర్థిస్తూ బాధితురాలి గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. -
మమత పొరపాటుకు టైసన్ నవ్వడమా!
-
మమత పొరపాటుకు టైసన్ నవ్వడమా!
సాక్షి, న్యూఢిల్లీ : పొరపాటు పడడం ఎవరికైనా సహజమే. సాధారణ పౌరులు పొరపాటు పడితే ఎవరూ పట్టించుకోరు. అదే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లాంటి వారు పొరపాటు పడితే ట్విట్టర్లో పెద్దది చేసి చూస్తారు. నవ్వుతారు, నవ్విస్తారు. ఆమె విషయంలో అదే జరిగింది. మమతా బెనర్జీ బుధవారం నాడు ఓ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించేందుకు వెళ్లారు. అక్కడ వేదికనెక్కారు. మాట్లాడుదామని పక్కనున్న ఓ వ్యక్తి చేతిలోని మైక్రోఫోన్‌ను లాక్కొని మూతివద్ద పెట్టుకున్నారు. ఒక్కసారిగా ముఖం మీద వెలుగు పడడంతో అది మైక్రోఫోన్ కాదని, టార్చిలైట్ అని గ్రహించారు. వెంటనే టార్చిలైట్‌ను వెనక్కి ఇచ్చేసి మైక్రోఫోన్ అందుకొని ఉపన్యాసాన్ని అందుకున్నారు. ర్యాలీలో ఎంత మంది ఈ విషయాన్ని గ్రహించారో, ఇంత మంది దీన్ని చూసి నవ్వుకున్నారో తెలియదు. ఇప్పుడు ఈ వీడియో క్లిప్పింగ్‌ను ట్విట్టర్లో పెట్టి నవ్విస్తున్నారు. 'మీకు 'మిడాస్ టచ్' ఉంది. ఆ శక్తితో టార్చిలైట్‌ను మైక్రోఫోన్‌గా మార్చేయండి' అంటూ ఒకరు.... ఏదో సందర్భంలో మైక్‌టైసన్ పగులబడి నవ్వుతున్న వీడియో ముక్కను తీసుకొని, మమతా పొరపాటును చూసి నవ్వుతున్నట్లుగా కామెంట్లు చేస్తున్నారు. మిడాస్ టచ్ అంటే దేన్నైనా బంగారంగా మార్చే మాయాజాలాన్ని మిడాస్ టచ్‌గా గ్రీక్‌లో పరిగణిస్తారు. -
కన్నీటి గానం.. తీస్తా!
ఆలోచనం మమతను లేదా బెంగాల్‌ని ఉద్దేశించి షేక్ హసీనా ’’మనం లాలన్ని, రవీంద్రుని, సుందర వనాలనీ అన్నిటినీ ప్రేమగా పంచుకున్నాం, ఇపుడు తీస్తా నదీజలాల వద్ద మాత్రం ఎందుకు ఘర్షణ పడాలి’’ అని అన్నారు. రైవల్ ప్రత్యర్థి అనే పదం ‘రైవస్’ ప్రవాహం అనే గ్రీకు పదం నుంచి పుట్టిందని చది వినపుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నీరు కేంద్ర బిందువుగా మనుష్యుల మధ్య జరిగే తగవులు నిజంగా అత్యంత పురాతనమైనవి, అత్యంత ఆధునికమైనవీ కూడా. మొన్నటికి మొన్న ‘గోదావరి అలల మీద కోటి కలల గానమా పోరు తెలంగాణమా, మా నీళ్లు మాకేనని కత్తుల కోలాటమా, కన్నీటి గానమా’ అని గద్దర్ గర్జించింది, తెలుగు రాష్ట్రం రెండు ముక్కలైందీ నదీ జలాల కోసం కూడా. సిద్ధార్థ గౌతముని శాక్య రాజ్యానికి, పక్కనే వున్న కొలియల రాజ్యానికి మధ్య రోహిణీ నది ప్రవహించేది. సిద్ధార్థుని 28వ ఏట శాక్య సేనాధిపతి రోహిణీ నదీ జలాల వివాదానికి యుద్ధం తప్ప మరో మార్గం లేదని ‘సంఘం’ ముందు ప్రతిపాదించినపుడు సిద్ధార్థుడు ‘యుద్ధం వలన సమస్య పరిష్కారం కాదు, అది మరో యుద్ధానికి కారణం అవుతుందని’ ఆ ఆలోచనను తీవ్రంగా ఖండిస్తాడు. సేనాధిపతి యుద్ధానికి అనుకూలంగా సంఘసభ్యులను కూడగట్టి తదనంతర పరిణామంగా సిద్ధార్థుడిని పరివ్రాజకత్వం స్వీకరించేట్లు చేస్తాడు. అలా సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడిగా మారడం వెనుక రోహిణీ నదీజలాల వివాదం ఉందని చరిత్ర చెప్తుంది. ఈ సందర్భంలోనే సంఘం ఎదుట సిద్ధార్థుడు ‘శత్రుత్వంతో శత్రుత్వం సమసి పోదు, దానిని ప్రేమతో మాత్రమే జయించగలం’ అని అన్నాడు. ఇప్పుడు ఈ 2017వ సంవత్సరంలో బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా, తీస్తా ఒప్పందం సందర్భంలో మెక్సికన్ కవి ‘ఆక్టేవియో పాస్’ వాక్యం ‘friendship is a river’ని ఉటంకిస్తూ ఇదే భావాన్ని వ్యక్తపరిచారు. బంగ్లాదేశ్ తన దేశంలో ప్రవహించే 57 నదులలో 54 నదులను ఇతర దేశాలతో పంచుకుంటూ వుంది. అందులో తీస్తా కూడా ఒకటి. తీస్తా జలాలపై 5,427గ్రామాలు, 7.3%ప్రజలు, 14% బంగ్లాదేశ్ భూభాగం ఆధారపడి వుంది. వేసవి సమయాలలో తీస్తా నది జలాలు సరిపడినంత అందక దాదాపు 5 జిల్లాల ప్రజలు తాగు, సాగు నీరు లేక కటకటలాడుతారు. తన దేశపు పేదరికాన్ని పారదోలేందుకు తీస్తా నీటిలో సగం పాలును కోరుకుంటున్నారు షేక్ హసీనా. విదేశీ దౌత్య రాజకీయాలలో భాగంగా బీజేపీ ప్రభుత్వం బంగ్లాదేశ్‌తో అనేకరకాలుగా బాంధవ్యాన్ని పెంచుకుంటూ వస్తుంది. అందులో భాగంగానే తీస్తా ట్రీటీకి కూడా సుముఖంగా ఉంది. అయితే తీస్తా ఎగువ ప్రాంతమైన బెంగాల్ సీఎం, ఈ ఒడంబడికకు మన్మోహన్ సింగ్ హయాంలోలాగానే నేడు కూడా సుముఖంగా లేరు. తీస్తానదీ జలాలను బంగ్లాదేశ్ ఆకాంక్షల మేరకు పంచుకోవాల్సి వస్తే ఉత్తర వంగదేశ రైతులు అన్యాయానికి గురవుతారని మమతా బెనర్జీ వాదిస్తూ ఉండగా, మమత మొండి పట్టుదల వెనుక jmbని బలపరిచే సలాఫీ ముస్లిములు ఉన్నారని, ముస్లిములు తన ప్రధాన ఓటు బ్యాంకు కనుక మమత వారి మాట జవదాటదని ఒక వర్గం, ఒడంబడికపై సంతకం చేసేలోపు ఆర్థికంగానూ, రాజకీయంగానూ కేంద్రంనుంచి వీలయినంత లాభాన్ని రాబట్టాలని మమత ప్రయత్నిస్తుందని మరొక వర్గం అభిప్రాయపడుతూంది. బంగ్లాదేశ్, బెంగాల్‌ది ఉమ్మడి చరిత్ర, ఉమ్మడి సంస్కృతి. ఇద్దరి భాషలు ఒక్కటే. భాషా ప్రాతిపదికన బంగ్లాదేశీయులు పాకిస్తాన్‌తో కొట్లాడినపుడు వారికి నైతిక మద్దతు కూడగట్టింది వంగదేశీయులే. ఇప్పటికీ ఇరువురు, తమది ఒకే జాతి అని బలంగా నమ్ముతారు. 2016లో గౌతమ్ ఘోష్ దర్శకత్వంలో వచ్చిన సినిమా శంఖాచిల్ (bound-less) ఒకే నది పేరు, నది నీవు ఎవరివి? హిందువుల దానివా, ముస్లిమువా అంటూ ఇరు ప్రజల ఆకాంక్షలను దృశ్యీకరించింది. అదే విషయాన్ని ఎంతో సౌహార్ద్రతతోనే అయినా సూటిగా తన ఉపన్యాసంలో మమతను లేదా బెంగాల్‌ని ఉద్దేశించి షేక్ హసీనా ‘‘మనం లాలన్ని, రవీంద్రుని, సుందర వనాలనీ అన్నిటినీ ప్రేమగా పంచుకున్నాం, ఇపుడు తీస్తా నదీజలాల వద్ద మాత్రం ఎందుకు ఘర్షణ పడాలి’’ అని అన్నారు. రానున్న రోజులు, మమత నిర్ణయాన్ని, అనేకమంది బంగ్లాదేశీయుల దాహార్తి భవి తను తేటతెల్లం చేయబోతున్నాయ్. ముగించేముందు ఒక చిన్న ముచ్చట, షేక్ హసీనా ఫోన్ రింగ్‌టోన్ ‘హ్రిద్ మాఝారే రాఖీబో చేరేదీబోనా’ నిను నా హృదయాంతరంలో దాచేసుకుం టాను, విడిచిపెట్టను అనే ‘బౌల్ జానపదపు’ పాటట. అత్యంత మధురమయిన ఈ పాటలోని ఒక వాక్యం ‘కొతొ లక్కో జనమ్ గురె గురే ఆర్ పేయెచ్చి ఏ మానవ జనమ్, ఏ జనమ్ చొలేగెలే ఆర్ పాబోన ఆర్ మిల్బేనా’ ‘ఎన్నో లక్షల జన్మలు చుట్టి వచ్చాక మహత్తరమైన ఈ మానవ జన్మ ఎత్తగలిగాను ఈ జన్మ ముగిసిపోతే మళ్లీ పొందలేను, మళ్ళీ దొరకదు’ అని. పురాణాలు కూడా అదే చెప్తాయి కదా. మరి, ఎన్నో లక్షల జన్మల తరువాత అపురూపమయిన ఈ మానవ జన్మ ఎత్తిన మనుషులందరం కులాలకు, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా అద్భుతమైనవారమే కదా. ఒకసారి ఆ విశ్వమానవ భావనలోకి వస్తే, అప్పుడు ఆ దేశం, ఈ దేశం అని కాదు, మనుషులుగా మనందరం ఒక్కటి, అన్నింటినీ కలిసి పంచుకుందాం అనే అంతిమ మతంలోకి బహుశా చేరుకుంటాం. అప్పుడిక నదీ జలాల గురించే కాదు దేని గురించీ వివాదాలు వుండవు. మానవీయత, సహృదయత అన్నింటికంటే గొప్ప మతాలు! కదా! సామాన్య కిరణ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి 91635 69966 -
రాష్ట్రాలకు ఎలాంటి లాభం లేదు: సీఎం
కోల్‌కతా: కేంద్రం పై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి నిప్పులు చెరిగారు. కేంద్రం చేస్తున్న మార్పులు సమస్యకు పరిష్కారం కాదని మండిపడ్డారు. కేంద్రం నిర్ణయంతో సమాజంలో చాలా వర్గాలు దారుణంగా దెబ్బతిన్నాయన్నారు. వ్యవసాయ దారులకు, సహకార రంగానికి, అసంఘటిత రంగానికి నోట్ల రద్దు వల్ల ఎలాంటి ఊరట లభించలేదన్నారు. పాత రూ. 500 నోటు వినియోగం కేంద్రానికే ఉపయోగకరమని సూచించారు. పెద్ద నోట్ల రద్దుతో రాష్ట్రాలకు ఎలాంటి లాభం లేదని మమతా తెలిపారు. -
ఎథిక్స్ కమిటీకి ‘స్టింగ్’ వ్యవహారం
- టీఎంసీ ఎంపీల 'లంచం' కేసు - లోక్‌సభ స్పీకర్ ప్రకటన - అభ్యంతరం చెప్పిన తృణమూల్ ఎంపీ న్యూఢిల్లీ: కొందరు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు లంచం తీసుకున్నట్టుగా వెలుగులోకి వచ్చిన స్టింగ్ ఆపరేషన్ వ్యవహారాన్ని బుధవారం లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఎథిక్స్ కమిటీ పరిశీలనకు నివేదించారు. ఈ వ్యవహారాన్ని పరిశీలించి దర్యాప్తు చేయాలని స్పీకర్, ఎల్.కె.అద్వానీ నాయకత్వంలోని ఎథిక్స్ కమిటీని కోరారు. ప్రశ్నోత్తరాల సమయం ముగియగానే ఆమె ఈ విషయాన్ని ప్రకటించారు. 2005లో కూడా ఎథిక్స్ కమిటీ లంచం వ్యవహారంలో 11 మంది ఎంపీల సభ్యత్వాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు సౌగత్‌రాయ్ స్పీకర్ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం తెలి పారు. ఇది ఏకపక్ష నిర్ణయమన్నారు. అద్వానీ నాయకత్వంలో దర్యాప్తు జరిగితే పూర్తి పా రదర్శకంగా ఉంటుందన్నారు. కాగా, సౌగత్ రాయ్ అభ్యంతరాలను స్పీకర్ తోసిపుచ్చారు. జేపీసీతో విచారణ జరిపించాలి: సీపీఎం స్టింగ్ ఆపరేషన్ వ్యవహారంలో తృణమూల్, కేంద్ర సర్కారు మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని సీపీఎం ఆరోపించింది. ఈ అంశంపై సీపీఎం సభ్యులు బుధవారం రాజ్యసభలో తీవ్ర స్థాయిలో నిరసన తెలిపారు. ఈ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని పట్టుబట్టారు. తృణమూల్ ఎంపీల వ్యవహారంపై రెండు నోటీసులు వచ్చాయని జీరో అవర్ ప్రారంభం కాగానే డిప్యూటీ చైర్మన్ కురియన్ తెలిపారు. అయితే వాటిని చైర్మన్ తిరస్కరించారని వెల్లడిం చారు. కానీ ఈ అంశంపై మాట్లాడేందుకు కురియన్, తృణమూల్ ఎంపీ డెరిక్, సీపీఎం సభ్యుడు సీతా రాం ఏచూరీని అనుమతించారు. తమ పార్టీ ఎంపీలపై వచ్చిన ఆరోపణలను డెరిక్ తోసిపుచ్చారు. స్టింగ్ ఆపరేషన్ నిర్వహించిన వ్యక్తి జర్నలిస్టో కాదో ముందు నిర్ధారించాల్సిన అవసరముందని ఆయన పేర్కొన్నారు. ఆ వీడియోలు విశ్వసించదగ్గవి కావని అన్నారు. కాగా, ఈ వీడియోలపై విచారణ జరిపించాల్సిన అవసరముందని సీతారాం ఏచూరీ డిమాండ్ చేశారు. అదే సమయంలో సీపీఎం సభ్యులు సభ వెల్‌లోకి దూసుకువచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని వారు నిలదీశారు. ప్రభుత్వానికి, తృణమూల్‌కు మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఏచూరి ఆరోపించారు. మాపై కుట్రచేస్తున్నారు..: మమత ప్రతిపక్ష పార్టీలు కుట్రతోనే తమ పార్టీపై నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. విపక్ష పార్టీలన్నీ దుష్టకూటమిగా ఏర్పడ్డాయని దుయ్యబట్టారు. కేవలం అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే విపక్షాలు స్టింగ్ వ్యవహారాన్ని ముందుకు తెచ్చాయని ఆరోపించారు. కాల్చీనీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆమె ప్రసంగిస్తూ, మీడియాలోని ఓవర్గం, విపక్ష పార్టీలు చేతులు కలిపి తమ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని అన్నారు. -
'ఆ ఒక్కటీ తప్ప మిగతా పరిశ్రమలు కుదేల్'
భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడిగా రెండోసారి ప్రమాణం చేసిన తర్వాతిరోజే తదుపరి కార్యక్షేత్రం పశ్చిమబెంగాల్ పై దృష్టి సారించారు అమిత్ షా. సోమవారం కోల్ కతాలో రాష్ట్ర బీజేపీ నిర్వహించిన సభలో పాల్గొన్న ఆయన అధికార తృణమూల్ కాంగ్రెస్ పై తీవ్రస్థాయి విమర్శలు గుప్పించారు. దేశ ద్రోహులు, అసాంఘిక శక్తులకు పశ్చిమబెంగాల్ అడ్డాగా మారిందని, మమత నేతృత్వంలోని టీఎంసీ ప్రభుత్వ వైఫల్యమే ఇందుకు కారణమని ఆరోపించారు. 'ఒక్క చిట్ ఫండ్ వ్యాపారం తప్ప రాష్ట్రంలోని మిగతా పరిశ్రమలన్నీ కుదేలయ్యాయి. చిట్ ఫండ్ వ్యాపారం మాత్రమే మూడుపువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నది' అంటూ శారద చిట్ ఫండ్ కుంభకోణాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ దీదీపై విమర్శలు గుప్పించారు. ఈ ఏడాది నవంబర్ లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్ననేపథ్యంలో ఆ రాష్ట్రంలో పాగావేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నది. ఎన్నికల ఏడాది మొదటినెలలోనే అమిత్ షా రాకతో అనధికారికంగా ప్రచార శంఖారావాన్ని పూరించినట్లేనని విశ్లేషకులు అంటున్నారు. -
‘తృణమూల్‌ను విమర్శిస్తే కళ్లు పీకేస్తా’
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీని విమర్శించిన వాళ్ల కళ్లు పీకేస్తానని, చేతులు నరికేస్తానని సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బహిరంగంగా బెదిరించడం వివాదాస్పదంగా మారింది. గత సోమవారం పశ్చిమబెంగాల్ లోని బసీర్హాట్లో జరిగిన ఓ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు ఈ వ్యాఖ్యలపై భగ్గుమన్నాయి. బీజేపీ జాతీయ కార్యదర్శి సిద్ధార్థ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ఇలాంటి వ్యాఖ్యలు తృణమూల్ తీరుకు అద్దం పడుతున్నాయని, ఆ పార్టీ డీఎన్ఏలోనే దౌర్జన్యాలకు పాల్పడడం ఉందన్నారు. సీపీఎం నేత సుజన్ చక్రవర్తి మాట్లాడుతూ తాను అభిషేక్ హింసాత్మక వ్యాఖ్యలతో ఆశ్చర్యపోలేదని, తృణమూల్ అనుసరించే విధానం అలాంటిదేనని అన్నారు. -
ముగ్గురమ్మలు...
జాతీయ స్థాయిలో చక్రం తిప్పేందుకు సిద్ధమవుతున్న మాయ, మమత, జయ మాయావతి, జయలలిత, మమత బెనర్జీ.. ఈ ముగ్గురు దేశ రాజకీయాల్లో మహిళాశక్తికి ప్రతీకలు. పురుషాధిక్య రాజకీయాలను తట్టుకుని, పోరాడి, గెలిచి, వాటిని శాసిస్తున్న ధీశాలులు. ముగ్గురివి వేర్వేరు నేపథ్యాలు.. వేర్వేరు మనస్తత్వాలు.. వేర్వేరు పంథాలు. కానీ రాజకీయాల్లో వారు వేసిన ముద్ర ఒకటే. ప్రజల మనసుల్లో వారు సంపాదించిన స్థానం ఒకటే. ప్రస్తుత ఎన్నికల అనంతరం కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడనుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. తమ రాష్ట్రాల్లో అత్యధిక స్థానాలు గెలుచుకుని ప్రభుత్వ ఏర్పాటులో, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ముగ్గురూ సిద్ధమవుతున్నారు. అవకాశం లభిస్తే ప్రధాని పదవికి కూడా తాము అర్హులమేనని స్పష్టం చేస్తున్నారు. - ఎలక్షన్ సెల్ బెహన్జీ.. మాయావతి! ఉత్తరప్రదేశ్‌లో అధికారంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) ప్రతిష్ట క్రమంగా మసకబారుతున్న పరిస్థితుల్లో బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) ఆ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉంది. బీఎస్పీ అధినేత్రి మాయావతి ఏడాది ముందే లోక్‌సభ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. పలు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశంతో వ్యూహాలు రూపొందించారు. తన 58వ పుట్టినరోజు నాడు లక్నోలో 10 లక్షల మందితో భారీ సభను నిర్వహించి సత్తా చాటారు. 2009లో యూపీలోని 80 స్థానాలకు గానూ బీఎస్పీ గెలుచుకున్నది 20 స్థానాలు (ఒక స్థానం మధ్యప్రదేశ్ నుంచి) కాగా, రానున్న ఎన్నికల్లో 25 నుంచి 30 సీట్లలో గెలుపొందాలని మాయావతి లక్ష్యంగా పెట్టుకున్నారు. ముజఫర్‌నగర్ అల్లర్లతో ఎస్పీ ముస్లింలకు దూరమైంది. ఆ ఓట్లు కూడా తమ ఖాతాలోకే అన్న నమ్మకంతో మాయావతి ఉన్నారు. కేంద్రంలో తమ పార్టీ మద్దతు లేకుండా ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితి ఉండాలని భావిస్తున్నారు. అవకాశం లభిస్తే మొదటి దళిత మహిళా ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. పార్టీ ప్రారంభం నుంచీ తమకు మద్దతుగా నిలిచిన దళిత, బహుజన, మైనారిటీలతో పాటు బ్రాహ్మణుల ఓట్లను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పురచ్చితలైవి.. జయలలిత! దేశప్రధాని కావాలన్న తన ఆశయాన్ని స్పష్టంగా, నిర్మొహమాటంగా వ్యక్తపరిచిన జయలలిత.. ఆ దిశగా తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. తమిళనాడులో అత్యధిక లోక్‌సభ స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. ‘అమ్మ’ మనసు తెలుసుకున్న పార్టీ నేతలు ఇప్పటికే ’ప్రధానమంత్రి పురచ్చితలైవి.. అమ్మ జయలలిత’ అంటూ బ్యానర్లు, హోర్డింగ్‌లతో హోరెత్తిస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా తన పనితీరుపై ఎలాంటి అసంతృప్తీ ప్రారంభం కాకపోవడం జయలలితకు కలిసొచ్చే అంశం. 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఆమె పార్టీ అన్నా డీఎంకే తొమ్మిది స్థానాలు మాత్రమే గెల్చుకుంది. అంతర్గత కుమ్ములాటలు, అవినీతి ఆరోపణలతో ఆమె ప్రత్యర్థి పార్టీ డీఎంకే డీలా పడడంతో ఈ ఎన్నికల్లో మొత్తం 39 లోక్‌సభ స్థానాల్లో కనీసం 36 సీట్లు గెలుపొందాలని జయలలిత లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకే ఏ పార్టీతోనూ పొత్తులకు వెళ్లడం లేదు. ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు వ్యూహాత్మకంగా బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీపై మాత్రం జయలలిత ఎలాంటి విమర్శలు చేయడం లేదు. దీదీ.. మమతా బెనర్జీ! ‘కేంద్రంలో వచ్చే ప్రభుత్వాన్ని మనమే నిర్ణయిద్దాం’ ఇదీ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తన కార్యకర్తలకు ఇస్తున్న సందేశం. దేశంలోని ప్రధాన రాష్ట్రాల్లో ఒకటైన పశ్చిమబెంగాల్‌ను పాలిస్తున్న దీదీ.. తన తదుపరి లక్ష్యం ఢిల్లీ పీఠమేనని అన్యాపదేశంగా చెబుతున్నారు. 2011లో అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్ఫ్రంట్పై ఘనవిజయం, పార్టీకి పెరిగిన ఓట్లశాతం విజయంపై ఆమె నమ్మకాన్ని బలపరుస్తున్నాయి. ప్రధాని పదవి సాధ్యంకాని పక్షంలో తదుపరి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించాలని భావిస్తున్నారు. పార్లమెంటులో మన సంఖ్య పెరిగితేనే బెంగాల్‌పై వివక్ష అంతమవుతుంది అంటూ బెంగాలీ ఓటర్లకు గాలమేస్తు న్నారు. పశ్చిమబెంగాల్లోని 42 స్థానాలు సహా మొత్తం 10 రాష్ట్రాల్లో అభ్యర్థులను నిలపాలనుకుంటున్నారు. కనీసం 35 స్థానాలతో లోక్‌సభలో అడుగుపెట్టాలన్న లక్ష్యంతో మమత పనిచేస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటులో అవసరమైతే బీజేపీతో కూడా కలిసి మమత పనిచేస్తారని పార్టీ ముఖ్యులు చెబుతున్నారు. అయితే అలా చేస్తే రాష్ట్రంలోని ఓటర్లలో 30 శాతం వరకు ఉన్న ముస్లిం ఓట్లను పణంగా పెట్టాల్సి రావచ్చు. 2009లో తృణమూల్ గెలుచుకున్నది 19 స్థానాలు. ఇప్పుడా సంఖ్యను 32 నుంచి 35 చేయాలన్న లక్ష్యంతో మమత కృషి చేస్తున్నారు.