సాక్షి, కోల్‌కతా: రానున్న అసెంబ్లీ ఎన్నికల పోరు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ తనదైన తనదైన శైలిలో దూసుకు పోతున్నారు. ముఖ‍్యంగా మమత కంచుకోటలో ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ ప్లాన్ చేస్తున్న తరుణంలో దీదీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నందీగ్రామ్ నుంచే బరిలోకి దిగుతున్నట్టు తేల్చి చెప్పారు. తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని నందిగ్రామ్ నుంచి మాత్రమే తాను పోటీ చేస్తానని, భవానిపూర్ నుంచి కాదని ఆమె ధృవీకరించారు. ఇక్కడనుంచి నుంచి శోభన్‌దేవ్ చటోపాధ్యాయ పోటీ చేయనున్నట్లు తెలిపారు.మార్చి 10 నామినేషన్ వేస్తానన్నారు. అంతేకాదు రాష్ట్ర ఎన్నికల అభ్యర్థులను ముందుగానే ప్రకటించి బీజేపీకి గట్టి సవాల్ విసిరారు.
రాష్ట్రంలోని మొత్తం 294 స్థానాలకుగాను 291 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించడంతో పాటు మహిళలకు 50 టికెట్లు ఇవ్వడం విశేషం. శుక్రవారం ప్రకటించిన రేసుగుర్రాల జాబితాలో 50 మంది మహిళలు, 42 మంది ముస్లిం, 79 మంది ఎస్సీ, 17 మంది ఎస్టీ అభ్యర్థులకు టికెట్లు ఇచ్చినట్టు ఆమె ఈ రోజు విలేకరుల సమావేశంలో ప్రకటించారు. మూడు నియోజక వర్గాల్లో పోటీచేయడం లేదన్నారు. ఇటీవల టీఎంసీలో చేరిన మనోజ్ తివారీకి టికెట్ ఇచ్చిన మమతా 28 మంది సిట్టింగ్‌లకు షాక్ ఇచ్చారు. టీఎంసీకి గుడ్ బై చెప్పిన నందిగ్రామ్ ఎమ్మెల్యే సువేందుఅధికారి బీజేపీ తీర్థం పుచ్చున్నారు. దీదీకి పోటీగా అధికారినే బరిలోకి దింపాలని బీజేపీ యోచిస్తోంది.
కాగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు మార్చి 27, 1, 6, 10, 17, 22, 26, 29 తేదీలలో ఎనిమిది దశల్లో జరుగనున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు ఇవే లాంగెస్ట్ ఎన్నికలు. మే 2 న ఓట్లు లెక్కింపు ఉంటుంది.
టీఎంసీ అభ్యర్థుల జాబితాలో కొన్ని
మమతా బెనర్జీ- నందిగ్రామ్
మనోజ్ తివారీ - షిబ్పూర్
దెబాసిస్ కుమార్ - రాష్ బిహారీ
మదన్ మిత్రా- కమర్హతి
అదితి మున్షి- రాజర్‌హాట్
పార్థా ఛటర్జీ- బెహాలా
రత్న ఛటర్జీ - బెహాలా పూర్బా
Comments
Please login to add a commentAdd a comment