Assembly Elections 2021
-
‘ఎన్నికల’ పిటిషన్ల దాఖలుకు టైమ్‌లైన్ విధించండి
న్యూఢిల్లీ: అస్సాం, కేరళ, ఢిల్లీ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పిటిషన్లు దాఖలు చేయడానికి నిర్ధిష్టమైన గడువు(టైమ్‌లైన్) విధించాలని కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఆయా రాష్ట్రాల ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలు, వీవీప్యాట్లు ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్నాయని పేర్కొంది. ఆయా రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి పిటిషన్లు దాఖలు చేయడానికి కోవిడ్–19 సెకండ్ వేవ్ కారణంగా గడువును పెంచుతూ న్యాయస్థానం ఉత్తర్వులిచ్చిందని, ఫలితంగా 6 రాష్ట్రాల ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలు, వీవీప్యాట్లను తాము ఇంకా భద్రపర్చాల్చి వస్తోందని పేర్కొంది. త్వరలో జరగబోయే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ తదితర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు పెద్దసంఖ్యలో ఈవీఎంలు, వీవీప్యాట్లు అవసరమని తెలియజేసింది. ఈ మేరకు బుధవారం సుప్రీంకోర్టులో ఒక వ్యాజ్యం దాఖలు చేసింది. దీనిపై తక్షణమే విచారణ చేపట్టాలని కోరింది. ఎన్నికల సంఘం వ్యాజ్యంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం స్పందించింది. దీనిపై వచ్చేవారం విచారణ చేపడతామని స్పష్టం చేసింది. 6 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే ప్రజా ప్రాతినిధ్య చట్టం–1951 కింద పిటిషన్లు దాఖలు చేయడానికి గడువును పెంచుతూ సుప్రీంకోర్టు ఈ ఏడాది ఏప్రిల్ 27న ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ గడువును పెంచుతున్నట్లు కోర్టు ప్రకటించింది. ఎన్నికైన అభ్యర్థులపై, ఎన్నికల ప్రక్రియపై అభ్యంతరాలుంటే ఎవరైనా సరే కోర్టును ఆశ్రయించవచ్చు. కోర్టులో విచారణ ముగిసి, తీర్పు వచ్చేదాకా సదరు ఈవీఎంలు, వీవీప్యాట్లను భద్రపర్చాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే. కోర్టులు వాటిని సాక్ష్యంగా పరిగణిస్తాయి. సాధారణ పరిస్థితుల్లో ఫలితాలు ప్రకటించిన 45 రోజుల్లోగా పిటిషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఏప్రిల్ 27న సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వు వల్ల భారీ సంఖ్యలో ఈవీఎంలు, వీవీప్యాట్లు ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్నాయి. త్వరలో జరగబోయే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం వాటిని విడుదల చేయాలని ఎన్నికల సంఘం కోరుతోంది. -
వాళ్లు రెచ్చగొడతారేమో.. మీరు రెచ్చిపోకండి
కోల్‌కతా/న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్లో ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. అధికార టీఎంసీ దాడుల్లో తమ పార్టీ కార్యకర్తలు పలువురు మృతి చెందడం, గాయపడటం జరిగిందని బీజేపీ ఆరోపించింది. ప్రతిపక్ష కార్యకర్తలపై దాడుల ఘటనలపై నివేదిక అందించాలని కేంద్ర హోం శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచిన ప్రాంతాల్లో బీజేపీ సహా పలు రాజకీ య పార్టీల కార్యకర్తలే లక్ష్యంగా దాడులు జరిగాయనీ, దీనిపై నివేదిక అడిగినట్లు హోం శాఖ ప్రతినిధి ఒకరు ట్విట్టర్లో తెలిపారు. బుర్ద్వాన్‌లో టీఎంసీ, బీజేపీ మద్దతుదారుల నడుమ ఆది, సోమవారాల్లో జరిగిన ఘర్షణల్లో నలుగురు మృతి చెందారని అధికారులు తెలిపారు. వీరిలో ముగ్గురు తమ కార్యకర్తలేనంటూ టీఎంసీ ప్రకటించింది. కాగా, ప్రత్యర్థుల దాడిలో నందిగ్రామ్‌లోని బీజేపీ పార్టీ కార్యాలయం తగులబడి పోతుండగా, ప్రజలు పరుగులు తీస్తున్నట్లున్న వీడియోను ఆ పార్టీ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. దాడుల్లో చనిపోయిన పార్టీ కార్యకర్తలు నలుగురితోపాటు దుస్తుల దుకాణాన్ని లూటీ చేస్తున్న దృశ్యాలు కూడా అందులో ఉన్నాయి. తృణమూల్ శ్రేణుల దాడుల్లో తమ పార్టీ మద్దతుదారులు ఆరుగురు చనిపోగా, వారిలో ఒక మహిళ కూడా ఉన్నారని బీజేపీ ఆరోపించింది.అయితే మహిళ మరణంపై ఆయన కుమారుడు, స్థానిక బీజేపీ నాయకుడు ఆశిష్ క్షేత్రపాల్ మాట్లాడుతూ..ఉదయం 11 గంటల సమయంలో టీఎంసీ కార్యకర్తలు ఖేలాహోబ్ (ఆట మొదలైంది) నినాదాలు చేస్తూ దాడులకు తెగబడ్డారు. మేం ప్రతిఘటించడంతో టీఎంసీ మద్దతుదారులు పారిపోయి దొడ్డిదారిన నా ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లో ఉన్న నా కుటుంబసభ్యులపై దాడి చేశారు. ఈ దాడిలో నా తల్లి మరణించిందని ఆవేదన వ్యక్తం చేశారు. దాడి అనంతరం మా ప్రాంతానికి చెందిన 17-18 ఇళ్లను ధ్వంసం చేసి దోచుకున్నారని చెప్పారు. కాగా, హింసాత్మక ఘటనలపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధన్కర్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ నేపథ్యంలో, తమ పార్టీ కార్యకర్తలను ప్రశాంతంగా ఉండాలంటూ సీఎం మమతా బెనర్జీ కోరారు. రెచ్చగొట్టినా సంయమనం పాటించాలని వారికి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక కూడా బీజేపీ కార్యకర్తలు టీఎంసీ మద్దతుదారులపై దాడులకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. పశ్చిమబెంగాల్లో రెండు రోజులపాటు మకాం వేసేందుకు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మంగళవారం రానున్నారు. చదవండి: పెళ్లి 3 గంటల్లో పూర్తవ్వాలి, 31 మందికే చాన్స్, లేదంటే.. -
ఎగ్జిట్ పోల్స్‌కు భిన్నంగా ఎన్నికల ఫలితాలు
-
ఇప్పుడు కదా అసలైన మజా.. మీమ్స్ హల్చల్
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆదివారం సోషల్ మీడియా హోరెత్తిపోయింది. పార్టీలు, నేతల గెలుపోటములపై నెటిజన్లు ‘మీమ్స్’తో హల్చల్ చేశారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించిన పశ్చిమ బెంగాల్ ఫలితాలపై కార్టూన్లు, సెటైర్లతో మీమర్స్ చెలరేగిపోయారు. తమిళనాడు, కేరళ అసెంబ్లీ ఫలితాలపైనా మీమ్స్ సందడి చేశాయి. మీరూ ఓ లుక్కేయండి.. Khela Hobe... The game is on pic.twitter.com/sE3VRE5sLJ — Ravi Nair (@t_d_h_nair) May 2, 2021 #ElectionResults2021 #Nandigram #ElectionResults Congress watching the fight between BJP and TMC in Bengal... pic.twitter.com/TQUVqUvk5z — Divyanshu 3am (@divyanshu3am) May 2, 2021 BJP in every election....#Elections2021 #ElectionResult pic.twitter.com/Y3825knW3V — || 𝕹𝖎𝖙𝖊𝖘𝖍 𝕾𝖎𝖓𝖌𝖍|| (MI💙)🇮🇳 (@niteshsingh____) May 2, 2021 #KhelaHobe People of bengal to modi-: pic.twitter.com/ql7gpLB3WG — गुरुजी (@GURUJI_123) May 2, 2021 After the results of Bengal, the condition of the devotees 👇👇 😂🤣#KhelaHobe Didi#नरेंद्र_मोदी_ग्लोबल_पप्पू#MamataBanerjee pic.twitter.com/rUsmubF4si — Alka Rawat (@AlkaRawat_) May 2, 2021 #MamataBanerjee today#KhelaHobe Bengal Didi पश्चिम बंगाल EVMs "But bjp" Congress Tagore#नरेंद्र_मोदी_ग्लोबल_पप्पू pic.twitter.com/WPgnI2493H — Jobanprince Singh Bhullar (@JobanprinceB) May 2, 2021 -
గాలిపటం ఆశలు ఆవిరి: అసదుద్దీన్‌కు నిరాశ
సాక్షి, హైదరాబాద్: తపరమైన పార్టీగా ముద్ర పడిన ఆల్ ఇండియా మజ్లిస్-ఈ-ఇతెహదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ తాజా ఎన్నికల్లో ఘోర ఫలితాల పొందింది. 30 శాతం ముస్లిం ఓటర్లు ఉండే పశ్చిమ బెంగాల్లో ఎంఐఎం పార్టీ ప్రధాన దృష్టి సారించింది. అయితే ఎంఐఎం పోటీపై పశ్చిమ బెంగాల్లో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎంఐఎం తీరుపై విరుచుకుపడింది. బీజేపీ ఇచ్చే మూటల కోసం ఎంఐఎం పార్టీ పోటీ చేస్తోందని.. హైదరాబాద్ పార్టీకి బెంగాల్లో ఏం పని పశ్నిస్తూ ఇరుకున పెట్టింది. మత రాజకీయాలకు బెంగాల్లో చోటు లేదని మమతా స్పష్టం చేసింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినా ఎన్నార్సీ, సీఏఏ వంటి వాటిపై మమతా బెనర్జీ మొదటి నుంచి పోరాటం చేస్తోంది. ఈ సందర్భంగా ఆ ఓట్లన్నింటిని మమతా సొంతం చేసుకుంది. దీంతో ఎంఐఎం పార్టీకి ఘోర ఫలితాలు వచ్చాయి. దాదాపు పది లోపు స్థానాలు సొంతం చేసుకుంటామని ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆశలు అడియాశలయ్యాయి. గాలిపటం ఎక్కడా ఎగరలేదు. బీజేపీతో ఎంఐఎం లోపాయికారి ఒప్పందం చేసుకుందనే ప్రచారం బలంగా వీచింది. ఆ వాదన బెంగాల్లో బలపడడంతో ముస్లింలంతా ఎంఐఎం పార్టీకి ఓట్లు వేయలేదు. తమ ఓట్లన్నీ మమతా పార్టీకి వేసినట్లు తెలుస్తోంది. ఈ విధంగా ఎన్నో ఆశలు పెట్టి బెంగాల్లో పోటీ చేసిన ఎంఐఎం పార్టీని బెంగాల్ ప్రజలు తిరస్కరించారు. హైదరాబాద్ పార్టీగా ముద్రపడిన ఎంఐఎంను ఆదరించలేదు. కేవలం 0.02 శాతం ఓట్లు మాత్రమే ఆ పార్టీకి పడ్డాయి. అయితే ఎంఐఎం ఒక్క బెంగాల్ మినహా కేరళ, అసోం, తమిళనాడులో పోటీపై అంతగా ఆసక్తి కనబర్చలేదు. ఆ రాష్ట్రాల్లో పోటీ కూడా చేయలేదు. చదవండి: కాంగ్రెస్‌కు చావుదెబ్బ: హస్త'గతమేనా..?' చదవండి: 3 రాష్ట్రాల్లో బీజేపీకి ఘోర పరాభవం -
ఊహించని షాక్: 3 రాష్ట్రాల్లో బీజేపీకి ఘోర పరాభవం
సాక్షి, హైదరాబాద్: ఈశాన్య రాష్ట్రం అసోం, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి మినహా బీజేపీకి ఆశించిన ఫలితాలు పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడులో రాలేదు. ఈ మినీ సమరంపైన ఏడాదికాలంగా ప్రత్యేక దృష్టి సారించిన బీజేపీకి ఈ ఫలితాలు చేదు అనుభవాన్నే మిగిల్చాయి. పశ్చిమబెంగాల్, కేరళ, తమిళనాడులో సత్తా చాటుతానని ప్రకటించిన బీజేపీ చేసిన ప్రకటనలకు భిన్నంగా ఫలితాలు వచ్చాయి. కేరళలో ఉన్న ఒక్క స్థానం కూడా కోల్పోవడం ఆ పార్టీకి దక్షిణాన చోటు లేదని కేరళ ఓటర్లు నిరూపించారు. దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్నా ఎన్నికలకు ముందుకు వెళ్లి బీజేపీ తీవ్ర విమర్శలపాలైంది. ఎన్నికలు వాయిదా వేయాలని స్థానిక కోర్టులతోపాటు సుప్రీంకోర్టు కూడా చెప్పినా వినిపించుకోలేదు. ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల మూలంగానే దేశంలో కరోనా కల్లోలం సృష్టించింది. దీనికి బాధ్యత వహించాలని ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మొండిగా ఎన్నికలు నిర్వహించారు.. ఫలితాలు వచ్చాయి. తత్ఫలితమే ఈ ఫలితాలు అని విశ్లేషకులు అని పేర్కొంటున్నారు. పశ్చిమబెంగాల్లో వాస్తవంగా బీజేపీ బలం పెరిగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మూడు స్థానాలకు పరిమితమైన బీజేపీ దాదాపు 80 స్థానాలకు పెరగడం మామూలు విషయమేమి కాదు. కానీ బీజేపీ అధికారమే లక్ష్యంగా వెళ్లడంతో దానికి తగ్గట్టు ఫలితం రాలేదు. ఇక దక్షిణాన కీలక ప్రాంతాలైన తమిళనాడు, కేరళలలో బోణి కొట్టేందుకు తీవ్రంగా శ్రమించింది. తమిళనాడులో పదిలోపు కూడా వచ్చే అవకాశాలు లేవు. ఇక కేరళలో ఒక్క స్థానానికి పరిమితమైన బీజేపీ ఇప్పుడు ఆ స్థానాన్ని కూడా నిలబెట్టుకోలేదు. చదవండి: కాంగ్రెస్‌కు చావుదెబ్బ: హస్త'గతమేనా..?' చదవండి: గెలుపు సంబరం.. పొంచి ఉన్న కరోనా విస్ఫోటనం -
కాంగ్రెస్‌కు చావుదెబ్బ: హస్త'గతమేనా..?'
సాక్షి, హైదరాబాద్: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి ఘోర పరాభవం మూటగట్టుకుంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ప్రతిపక్ష స్థానంలో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు నామరూపాల్లేకుండాపోయింది. ఆ స్థానాన్ని బీజేపీ భర్తీ చేసింది. ఇక కేరళలో కమ్యూనిస్టులతో కలిసి యూడీఎఫ్‌గా ఉన్న కాంగ్రెస్ మరోసారి ఓటమిని చవిచూసింది. ఒక్క తమిళనాడులో తన మిత్రపక్షం డీఎంకే విజయం పొందడం కొంత సానుకూల పరిణామం. పుదుచ్చేరిలో చేదు ఫలితాలు పొందింది. ఈశాన్య రాష్ట్రం అసోంలో కూడా అదే ఫలితాలను చవిచూసింది. దీంతో కాంగ్రెస్ పార్టీ మరింత క్షీణించి ఒక ప్రాంతీయ పార్టీ కన్నా తక్కువ స్థాయిలో ఓట్ల శాతం పొందింది. 150 ఏళ్ల చరిత్ర ఉన్న జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం అవసాన దశకు చేరుకుంది. అత్యంత గడ్డు పరిస్థితులు ఆ పార్టీ ఎదుర్కొంటోంది. ఉత్తర, దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఎదురవుతోంది. స్వాతంత్ర్య భారతదేశాన్ని 60 ఏళ్లకు పైగా పాలించిన కాంగ్రెస్ ఇప్పుడు గడ్డు రోజులు ఎదుర్కొంటోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పంజాబ్, రాజస్థాన్, ఛత్తీస్గడ్ రాష్ట్రాల్లో అధికారంలో ఉండగా.. మహారాష్ట్రలో ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. దక్షిణ భారతదేశంలో ఒక్క కేరళ మినహా ఎక్కడా కూడా కాంగ్రెస్ అధికారంలో లేదు. తెలుగు రాష్ట్రాల్లో హస్తం పార్టీ క్షీణ దశకు చేరుకుంది. రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌లో నామరూపాల్లేకుండా పోగా.. తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మూడో పార్టీగా నిలిచింది. నాగార్జున సాగర్‌లో రెండో స్థానం పొందగా, తిరుపతిలో అసలు కనీసం ఆ పార్టీ ఉన్నట్టు కూడా జనాలకు తెలియదు. ఈ విధంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేదు ఫలితాలను పొందుతోంది. ఇక హస్తం పార్టీ హస్త'గతమేనా..?' అంటూ విశ్లేషకులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితికి ప్రధాన కారణం.. పార్టీకి నాయకత్వ లోపం. పార్టీకి జవసత్వాలు కల్పించే నాయకుడు లేకపోవడం.. ఆ పార్టీకి ప్రధాన నెగటివ్. చదవండి: ఈ విజయం కేసీఆర్‌కు అంకితం..నోముల భగత్ చదవండి: గెలుపు సంబరం.. పొంచి ఉన్న కరోనా విస్ఫోటనం -
గెలుపు సంబరం.. పొంచి ఉన్న కరోనా విస్ఫోటనం
సాక్షి, హైదరాబాద్: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, అన్నాడీఎంకే, యూడీఎఫ్ కూటమితో పాటు బీజేపీ నాయకులు గెలుపు సంబరాలు చేసుకున్నారు. ఆయా రాష్ట్రాల్లో విజయం సాధించడంతో ఆయా పార్టీల శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఈ సంబరాల మాటున కరోనా ఉందనే విషయాన్ని విస్మరించారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి, తెలుగు రాష్ట్రాల్లో నాగార్జునసాగర్, తిరుపతి ఉప ఎన్నికతో పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. ఆయా స్థానాల్లో గెలుపొందిన పార్టీలకు చెందిన శ్రేణులు విజయోత్సవాలు చేసుకున్నారు. ఫలితాల అనంతరం గెలుపు సంబరాలు చేసుకోవద్దని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడంతో విజయోత్సవాలపై ఈసీ నిషేధం విధించింది. అయితే గెలుపు ఆనందంలో పార్టీ శ్రేణులు ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఆనందం వస్తే ఆపుకోలేమంటూ గుంపుగా తీన్మార్ డ్యాన్స్‌లు చేస్తూ.. రంగులు చల్లుకుంటూ బ్యాండ్‌భాజా మధ్య సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు గుమికూడి కరోనా నిబంధనలు ఉల్లంఘించారు. ఆధిక్యం భారీగా ఉండడంతో ఉదయం నుంచే పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో మునిగారు. పార్టీ కార్యాలయాల ఎదుట, ప్రధాన చౌరస్తాల్లో పటాసులు పేలుస్తూ.. మిఠాయిలు పంచుకుంటూ.. డ్యాన్స్‌లు చేస్తూ.. నినాదాలు చేస్తూ ఆనందోత్సాహాల మధ్య గడిపారు. అయితే ఈ సమయంలో మాస్క్‌లు ధరించడం.. భౌతిక దూరం పాటించడం.. శానిటైజర్ వినియోగం వంటివి మరిచారు. ఆనందోత్సాహాల మధ్య నిబంధనలు ఉల్లంఘించారు. దీన్ని గమనించిన ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే వారిపై కేసులు నమోదు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసింది. మరి చూడాలి ఈ సంబరాలపై ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది. అయితే ప్రస్తుతం వీరు చేసిన చర్యలతో కొన్ని రోజుల్లో ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కరోనా కేసులు పెరిగే అవకాశం ఉంది. కరోనా విస్ఫోటనం చెందే అవకాశాలు ఉన్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సంఘం చేసిన విజ్ఞప్తిని దృష్టిలో పెట్టుకుని పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీ సంబరాలకు దూరంగా ఉన్నారు. 'ఇది ప్రజల విజయం. సంబరాలు చేసుకునే సమయం కాదు. అందరూ మాస్క్‌లు ధరించండి' అంటూ రెండు ముక్కలు చెప్పి మమతా వెళ్లిపోయారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి ఉప ఎన్నికలో విజయంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా సంబరాలకు దూరంగా ఉంది. చదవండి: బీజేపీ కథేంటో మూడు ముక్కల్లో చెప్పిన శేఖర్ గుప్తా చదవండి: ఈ విజయం కేసీఆర్‌కు అంకితం..నోముల భగత్ -
గెలుపు సంబరాలపై కీలక ఆదేశాలు జారీచేసిన ఈసీ
న్యూఢిల్లీ : ఎన్నికల ఫలితాల అనంతం జరిపే విజయోత్సవాలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. కరోనా ఉధృతి నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఐదు రాష్ట్రాల సీఎస్‌లకు భారత ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. కాగా నేడు (మే 2) నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో కొన్ని రాష్ట్రాల్లోని ప్రాంతాల్లో గెలిచిన అభ్యర్థుల మద్దతుదారులు విజయోత్సవ ర్యాలీలు, రోడ్‌షోలు జరుపుకుంటున్నారు. కౌంటింగ్‌లో డీఎంకే, టీఎంసీ పార్టీ ముందజలో కొనసాగుతుండటంతో ఆ పార్టీ మద్దతుదారులు కోల్కత్తా, చెన్నైలలో వేడుకలు జరుపుకుంటున్నారు. ఈనేపథ్యంలో కోవిడ్ నిబంధనలు పక్కాగా అమలయ్యేలా చూడాలని, అతిక్రమించినవారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. పనిలో అలసత్వం వహించిన సంబంధిత ఎస్‌హోచ్‌ఓను సస్పెండ్ చేయాలనే ఆదేశించింది. ప్రతి ఎఫ్ఐఆర్పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఐదు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు ట్విటర్లో పేర్కొంది. చదవండి: మే 2న ఎన్నికల కౌంటింగ్‌పై ఈసీ కీలక నిర్ణయం తమిళనాడు అసెంబ్లీ ఫలితాలు: సంబరాల్లో డీఎంకే కార్యకర్తలు -
పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు: 10 స్థానాల్లో ఎన్ఆర్ కాంగ్రెస్ కూటమి విజయం
► పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్(ఎన్డీఏ) కూటమి 12 సీట్లు గెలుచుకుంది. మరో 3 అసెంబ్లీ విభాగాలలో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్-డీఎంకె నేతృత్వంలోని కూటమి 5 స్థానాల్లో గెలిచి, రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ► కామరాజునగర్‌లో బీజేపీ అభ్యర్థి జాన్‌కుమార్ గెలుపు ►కదిర్‌గమమ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి సెల్వనాథనె గెలుపు ►మహెలో కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ విజయం ►మన్నాడిపేట బీజేపీ అభ్యర్థి ఎ.నమఃశివాయం గెలుపు ►యానాంలో తొమ్మిది రౌండ్లు పూర్తయ్యే సరికి స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాస్ అశోక్ 3,877 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు. ►పుదుచ్చేరిలో 10 స్థానాల్లో ఎన్ఆర్ కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. రెండు చోట్ల కాంగ్రెస్, ఒక చోట డీఎంకే విజయం కైవసం చేసుకుంది. ►యానాంలో మాజీ సీఎం రంగస్వామి వెనుకంజలో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థి 674 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ►పుదుచ్చేరిలో ఎన్డీయే కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. ఏఐఎన్ఆర్సీ 6, బీజేపీ 3 చోట్ల ఆధిక్యంలో ఉంది. డీఎంకే, కాంగ్రెస్ కూటమి 2 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. యానాంలో ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ ఆధిక్యంలో ఉన్నారు. ►పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రభుత్వం ఏర్పాటు దిశగా ఎన్డీయే పయనిస్తోంది. ►పుదుచ్చేరిలో ఎన్డీయే ముందంజలో ఉంది. యానాంలో బీజేపీ అభ్యర్థి రంగస్వామి ఆధిక్యంలో ఉన్నారు. పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. కౌంటింగ్‌లో భాగంగా పుదుచ్చేరిలో 31 హాళ్లను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలను కనీసం 15 సార్లు శానిటైజేషన్ చేయనున్నట్లు అధికారులు చెప్పారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ సీట్లు ఉండగా.. ఏప్రిల్ 6న ఒకే దశలో ఎన్నికలు జరిగాయి. పుదుచ్చేరిలో కాంగ్రెస్‌కు పరాభవం తప్పదని అంటున్నారు. ఇక్కడ బీజేపీ-ఏఐఏడీఎంకే-ఏఐఎన్ఆర్సీ కూటమి విజయం సాధిస్తుందని చెబుతున్నారు. మాస్కు ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తామన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద జనం గుంపులుగా చేరడానికి వీల్లేదన్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుందని, రాత్రి పొద్దుపోయే దాకా కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. మొత్తం ప్రక్రియను పర్యవేక్షించడానికి 1,100 మంది పరిశీలకులను నియమించామని పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, రాజకీయ పార్టీల ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రాల్లోకి అడుగు పెట్టాలంటే కరోనా నెగటివ్ రిపోర్టు లేదా డబుల్ డోస్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ సమర్పించాలని తేల్చిచెప్పారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎవరైనా కరోనా ప్రోటోకాల్స్‌ను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల సంఘం హెచ్చరించింది. -
ఎగ్జిట్ పోల్స్: బీజేపీకి షాకిచ్చిన దీదీ
న్యూఢిల్లీ: దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల మినీ సంగ్రామానికి నేటితో తెరపడింది. గురువారంతో.. అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇప్పటికే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తవ్వగా.. పశ్చిమ బెంగాల్లో చివరి విడత ఎన్నికల పోలింగ్ ఈ రోజుతో ముగిసింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఆయా సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో అత్యధికంగా ప్రజలు అధికార పార్టీలకే పట్టం కట్టారు. ఒక్క తమిళనాడులో మాత్రం డీఎంకే అధికారంలోకి రానున్నట్లు ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించాయి. ఇక బెంగాల్లో బీజేపీ, టీఎంసీల మధ్య రసవత్తర పోరు సాగిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో పశ్చిమబెంగాల్లో బీజేపీ తక్కువ స్థానాలకే పరిమితం అయినప్పటికి ఈ సారి మాత్రం టీఎంసీకి గట్టి పోటీనే ఇచ్చినట్లు పలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి. ఇక ఆయా సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రాష్ట్రాల వారిగా ఇలా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ (294 సీట్లు)... సీఓటర్ సర్వే: టీఎంసీదే విజయం సీఓటర్: టీఎంసీ 158, బీజేపీ 115, కాంగ్రెస్ ప్లస్ - 19 బెంగాల్ పీమార్క్ : బీజేపీ 120, టీఎంసీ 158, లెఫ్ట్+ 14 బెంగాల్ ఈటీజీ : బీజేపీ 110, టీఎంసీ 169, లెఫ్ట్+ 12 రిపబ్లిక్-సీఎన్ఎక్స్ : బెంగాల్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ రిపబ్లిక్-సీఎన్ఎక్స్: టీఎంసీ 128-138, బీజేపీ138-148, కాంగ్రెస్: 11-21 సీఎన్ఎన్: టీఎంసీ 128-132, బీజేపీ: 138-148, ఇతరులు - 20 అస్సోం(126 అసెంబ్లీ స్థానాలు)... ఇండియా టుడే ఎగ్జిట్ పోల్: అసోంలో బీజేపీదే విజయం. బీజేపీ: 75-85, కాంగ్రెస్: 40-50 రిపబ్లిక్ ఎగ్జిట్‌పోల్: బీజేపీ 74-84, కాంగ్రెస్: 40-50 కేరళ (140 అసెంబ్లీ స్థానాలు)... రిపబ్లిక్ ఎగ్జిట్ పోల్: లెఫ్ట్‌ఫ్రంట్ 70-80, కాంగ్రెస్ 40-50 తమిళనాడు (234 అసెంబ్లీ స్థానాలు).. రిపబ్లిక్ ఎగ్జిట్ పోల్: డీఎంకే 160 -170, అన్నాడీఎంకే 58-68 పుదుచ్చేరి (30 అసెంబ్లీ స్థానాలు) ఇక్కడ బీజేపీకి విజయవకాశాలున్నట్టు తెలుస్తోంది. -
కౌంటింగ్ కేంద్రాల వద్ద జనసమూహానికి అనుమతి లేదు
-
కౌంటింగ్ ప్రక్రియ.. ఈసీ కఠిన నిబంధనలు
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ విజృంభిస్తోంది. ప్రతి రోజు మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇక కరోనా విజృంభణకు తాజాగా దేశవ్యాప్తంగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలే కారణమని జనాలు బలంగా విశ్వస్తున్నారు. ఈ క్రమంలో మద్రాస్ హైకోర్టు ఎన్నికల కమిషన్ మీద ఘాటు వ్యాఖ్యలు చేసింది. కోవిడ్ వ్యాప్తికి ఈసీనే కారణమని.. హత్యా కేసు పెట్టాలని సూచించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మే 2న జరగబోయే కౌంటింగ్‌కు సంబంధించి ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారు, కోవిడ్ నెగిటివ్ రిపోర్టు ఉన్న వారిని మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతిస్తామని తెలిపింది. ఈ మేరకు ఈసీ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈసీ ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల్లో ఈసీ కౌంటింగ్ కేంద్రాల వద్ద జనసమూహానికి అనుమతి లేదని తెలిపింది. కౌంటింగ్ కేంద్రాల వద్దకు వెళ్లాలనుకునే వారు ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్టు, టీకా రెండు డోసులు తీసుకున్నట్లు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌ను కౌంటింగ్‌కు 48 గంటల ముందే సంబంధిత అధికారులకు అందజేయాలని సూచించింది. అభ్యర్థులు కౌంటింగ్ రోజున హాజరయ్యే ఏజెంట్లకు సంబంధించిన లిస్ట్‌ను మూడు రోజుల ముందుగానే అందించాలని తెలిపింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. గురువారం బెంగాల్లో చివరి దశ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీలు పెద్ద ఎత్తున జనాలతో భారీ ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించాయి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. అందుకే కోవిడ్ విజృంభిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. చదవండి: ఎన్నికల సంఘంపై మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు -
మే 2న ఎన్నికల కౌంటింగ్‌పై ఈసీ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: మే 2న విడుదలయ్యే అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల సమయంలో గెలిచిన అభ్యర్థుల విజయోత్సవ ర్యాలీలపై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆంక్షలు విధించింది. కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి నేపథ్యంలో ఫలితాలు వచ్చేటప్పుడు గానీ.. ఆ తర్వాత గానీ.. విజేతలైన అభ్యర్థులు సంబరాలు చేసుకోడానికి వీల్లేదని స్పష్టం చేసింది. విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు, పార్టీ సంబరాలేవీ నిర్వహించకూడదని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఫలితాల అనంతరం గెలిచినవారు ఈసీ నుంచి ధ్రువీకరణ పత్రాలు తీసుకునే సమయంలోనూ అభ్యర్థి వెంట ఇద్దరు మించి ఉండకూడదని ఈసీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అన్ని రాజకీయ పార్టీలు, నేతలు ఈ నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించింది. కాగా ఇటీవల తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాంతోపాలు పుదుచ్చేరిలో ఎనిమిది దశల్లో శాసనసభ ఎన్నికల షెడ్యూల్ జరుగుతుండగా.. ఏప్రిల్ 29 ఈ ఎన్నికలు ముగుస్తాయి. వీటి కౌంటింగ్ 2న చేపట్టనున్నారు. మరోవైపు దేశంలో కొన్ని రోజులుగా నిత్యం 3 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. 2 వేలకు మించి కరోనా రోగులు మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండియాలో కోవిడ్ కేసులు పెరిగి పోవడానికి ఎన్నికల కమిషన్‌యే కారణమని మద్రాస్ హైకోర్టు సోమవారం ఈసీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల సంఘం అధికారులపై హత్యా నేరం కింద కేసులు పెట్టాలని మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సంజిబ్ బెనర్జీ వ్యాఖ్యానించారు. ఎన్నికల ఫలితాల రోజు కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో ఈ నెల 30 లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. లేదంటే కౌంటింగ్‌ను నిలిపివేస్తామని హెచ్చరించింది. మద్రాస్ హైకోర్టు హెచ్చరించిన మరుసటి రోజే ఈసీ ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అదే విధంగా గత వారమే పశ్చిమ బెంగాల్లో అన్ని రోడ్‌షోలు, పాదయాత్రలు, ర్యాలీలను కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిషేధిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ పేర్కొంది. చదవండి: ఎన్నికల సంఘంపై మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు -
మే 2 తర్వాత విజయోత్సవ ర్యాలీలు నిషేదం: ఈసీ
-
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు : లైవ్ అప్డేట్స్
లైవ్ అప్డేట్స్ : పశ్చిమబెంగాల్ 5వ విడత పోలింగ్ 78.36 శాతం పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఐదో విడత పోలింగ్ ముగిసింది. చెదురు మదురు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నా ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు. 78.36 శాతం పోలింగ్ నమోదైంది. జల్పాయ్గురి, కలింపాంగ్, డార్జిలింగ్, నడియాలో ఒక సెగ్మెంట్, నార్త్ 24 పరగణాలు, పూర్బ బర్దమాన్ జిల్లాల్లోని 45 నియోజక వర్గాల్లో శనివారం పోలింగ్ జరిగింది. 319 మందికి పైగా అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఐదో విడతలో పోలింగ్ జరిగిన 45 నియోజకవర్గాల్లో మయినాగురిలో అత్యధికంగా 85.65 శాతం పోలింగ్ నమోదైంది. మటిగర-నక్సల్బరి నియోజకవర్గంలో 81.65 శాతం, బరసత్‌లో 77.71 శాంత, బిధాన్ నగర్లో 61.10 శాతం, సిలిగురిలో 74.83 శాతం పోలింగ్ నమోదైంది. కాగా, ఆరో విడత పోలింగ్ 43 నియోజకవర్గాల్లో ఈ నెల 22న జరుగనుంది. కేంద్ర దళాలు కాల్పులు పశ్చిమ బెంగాల్‌లోని దేగానా అసెంబ్లీలోని కురుల్‌గచా ప్రాంతంలోని స్థానిక ప్రజలు కేంద్ర బలగాలు వైమానిక కాల్పులు జరిపారని ఆరోపించారు. వార్తా సంస్థ ఏఎన్ఐ ప్రకారం, స్థానిక వ్యక్తి మాట్లాడుతూ ” అక్కడ ఓటింగ్ యథావిధిగా జరుగుతోంది” అప్పుడే కేంద్ర దళానికి చెందిన 8-9 మంది సైనికులు వచ్చి కాల్పులు జరిపారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. West Bengal: Locals in Kurulgacha area of Deganga assembly constituency allege that Central Forces opened fire. "Peaceful voting underway here. Suddenly 8-9 personnel of Central Forces stormed here and opened fire. One round was fired, nobody has been injured," says a local pic.twitter.com/rJea0rhcBs — ANI (@ANI) April 17, 2021 సాయంత్రం 5:45 వరకు 78.36 శాతం పోలింగ్ పశ్చిమ బెంగాల్ ఎన్నికల పోలింగ్ సాయంత్రం 5:45 వరకు 78.36 శాతం నమోదైంది. బెంగాల్లో ఐదవ దశ ఎన్నికలకు సంబందించి 45 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది, బరిలో 319 మంది అభ్యర్థులు ఉన్నారు. మధ్యాహ్నం 3.30 గంటల వరకు 69.40 శాతం ఓటింగ్ ఐదవ దశ పోలింగ్ సందర్భంగా పశ్చిబెంగాల్లోని ఆరు జిల్లాల్లోని 45 నియోజకవర్గాల్లో మధ్యాహ్నం 3.30 గంటల వరకు 69.40 శాతం ఓటింగ్ నమోదైంది. జల్పాయిగురి జిల్లాలోని రాజ్‌గంజ్ అసెంబ్లీ నియోజకవర్గంలో మధ్యాహ్నం 3.30 గంటల వరకు 80.32 శాతం అత్యధిక ఓటింగ్ నమోదైంది. కుర్సోంగ్ అసెంబ్లీ నియోజకవర్గంలో 53.24 శాతంతో అతి తక్కువ ఓటింగ్ జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం తగిన ఏర్పాట్లు చేసింది. ఎన్నికల సందర్బంగా 853 కంపెనీలకు చెందిన కేంద్ర దళాలను మోహరించింది. అధికారిక లెక్క ప్రకారం 5వ పోలింగ్‌లో మధ్యాహ్నం 1:34 వరకు 54.67శాతం ఓటింగ్ నమోదైంది. తాజా సమాచారం ప్రకారం ఉదయం 11 గంటల వరకు 21.26శాతంగా ఉన్న ఓటింగ్ శాతం బ ఉదయం 11:37కు 36.02 శాతంగా ఉంది. 5వ, అతిపెద్ద దశ పోలింగ్ సందర్భంగా పశ్చిబెంగాల్లోని బిధాన్నగర్లో ఉద్రిక్తతచోటు చేసుకుంది. టీఎంసీ- బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చెలరేగింది. ఇరువర్గాల కార్యకర్తలు రాళ్లు రువ్వుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది. బిధానగర్ శాంతినగర్ వద్ద చోటు చేసుకున్న ఘర్షణలో పలువురు మహిళలు గాయపడ్డారు. బీజేపీ అభ్యర్థి సబ్యసాచి దత్తా సంఘటన స్థలానికి చేరుకున్నారు. బీజేపీ దాడిలో తమ కార్యకర్తలు ఇద్దరు గాయపడ్డారని దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని టీఎంసీ అభ్యర్థి సుజిత్ బోస్ తెలిపారు. మరోవైపు ఉత్తర 24 పరగణాల్లోని కమర్హతి అసెంబ్లీ నియోజకవర్గంలోని వివిధ పోలింగ్ బూత్‌లను కమిషనర్ అజోయ్ నందా సందర్శించారు. పోలింగ్ శాంతియుతంగా జరుగుతోందని తెలిపారు. Urging all those voting in today’s fifth phase of the West Bengal elections to vote in large numbers. First time voters in particular should exercise their franchise. — Narendra Modi (@narendramodi) April 17, 2021 5వ దశ పోలింగ్‌లో పెద్ద సంఖ్యలో ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. ముఖ్యంగా మొదటిసారి ఓటర్లు తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ ప్రధాని ట్వీట్ చేశారు. కమర్హతిలోని పోలింగ్ బూత్‌లో టీఎంసీ నాయకుడు మదన్ మిత్రా ఓటు వేశారు. కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల 5వ దశ పోలింగ్ శనివారం ప్రారంభమైంది. కోల్‌కతాలోని దక్షిణేశ్వర్లో హిరాలాల్ మజుందర్ మెమోరియల్ కాలేజ్ ఫర్ ఉమెన్ పోలింగ్ బూత్ ఇద్ద ఇప్పటికే ఓటర్లు క్యూ లైన్లలో బారులు తీరారు. 4వ దశ పోలింగ్ ఘర్షణల నేపథ్యంలో పోలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చర్యల మధ్య పోలింగ్‌కు ఏర్పాట్లు చేశారు. పశ్చిమబెంగాల్లో నేడు ఐదో దశ పోలింగ్‌లో భాగంగా రాష్ట్రంలోని 45 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని సుమారు కోటి మంది ఓటర్లు 342 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. కరోనా తీవ్రత దృష్ట్యా ఈ నెల 22, 26, 29వ తేదీల్లో బెంగాల్లో జరగాల్సిన పోలింగ్‌కు ప్రచార సమయాన్ని రాత్రి 10 గంటలకు బదులుగా 7 గంటలకు ఈసీ కుదించింది. రాజకీయ పార్టీలు సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 10 గంటల మధ్యలో సభలు, సమావేశాలు ర్యాలీల వంటి ఎలాంటి ప్రచార కార్యక్రమాలు చేపట్టరాదని తెలిపింది. ఏప్రిల్ 16వ తేదీ సాయంత్రం 7 గంటల నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని తెలిపింది. అదేవిధంగా ఈ మూడు దశలకుగాను ప్రచారానికి, పోలింగ్‌కు మధ్య విరామ సమయాన్ని 48 గంటల నుంచి 72 గంటలకు పెంచుతున్నట్లు పేర్కొన్న సంగతి తెలిసిందే. -
కరోనా విలయం: కాంగ్రెస్ అభ్యర్థి కన్నుమూత
సాక్షి, కోలకతా: కరోనా వైరస్ మహమ్మారి రెండవ దశలో పంజా విసురుతోంది. చిన్నా పెద్దా, తేకుండా పలువుర్ని కబళిస్తోంది. ఇప్పటికే పలువురు మాజీఎమ్మెల్యేలు, మాజీ కేంద్ర మంత్రులు,మంత్రులు కరోనా బారిన పడి అసువులు బాశారు. తాజాగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సంషర్‌గంజ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ రజాఉల్ హక్ కన్నుమూశారు. ఆయనకు ఇటీవల కరోనా నిర్ణారణ అయింది. కోల్‌కతాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. (కరోనా కలకలం: రికార్డు స్థాయిలో కేసులు) కాగా ఎనిమిదో దశల పోలింగ్‌లో భాగంగా 45 సీట్లుకు గాను ఐదో దశ ఏప్రిల్ 17న జరగనుంది. దీనికి సంబంధించిన ప్రచారం బుధవారం ముగిసింది. మరోవైపు బెంగాల్లో నూతన సంవత్సర వేడుకను నేడు (ఏప్రిల్ 15) జరుపుకుంటున్నారు. -
అమ్మ ఆత్మ క్షమించదు: ఎమ్మెల్యే శాపనార్థాలు
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే నుంచి తమను సాగనంపడంలో కీలకపాత్ర పోషించారని పరిశ్రమలశాఖ మంత్రి సంపత్‌పై మహిళా ఎమ్మెల్యే సత్య విరుచుకుపడ్డారు. శాపనార్థాలు పెడుతూ, అమ్మ జయలలిత ఆత్మ సంపత్‌ను క్షమించదని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు సిట్టింగ్‌లకు మళ్లీ సీటు దక్కలేదన్న విషయం తెలిసిందే. ఇందులో కొందరు అయితే, అన్నాడీఎంకే అధిష్టానాన్ని ఢీకొట్టే రీతిలో రెబల్స్‌గా పోటీ చేయగా, మరి కొందరు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం తరఫున తమ సిట్టింగ్ స్థానాల్లో పోటీ చేశారు. ఇంకొందరు అధిష్టానం ఆదేశాలకు కట్టుబడి పార్టీ అభ్యర్థుల కోసం శ్రమించారు. రెబల్స్‌గా పోటీచేసిన వారిని, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం తరఫున పోటీ చేసిన వారిని ఇప్పటికే పార్టీ నుంచి అన్నాడీఎంకే తొలగించింది. ఈ పరిస్థితుల్లో ఎన్నికల అనంతరం జిల్లాలు, నియోజకవర్గాల వారీగా గెలుపు అవకాశాలపై అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరుసెల్వం, కో కన్వీనర్ పళని స్వామి సుదీర్ఘంగా సమీక్షల్లో ఉన్నారు. పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేసిన నేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు ఈ సమీక్షల్లో హోరెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పరిశ్రమల మంత్రి ఎంసీ సంపత్ ఇచ్చిన ఫిర్యాదుతో శనివారం రాత్రి కడలూరు జిల్లా బన్రూట్టి ఎమ్మెల్యే సత్య, ఆమె భర్త, పార్టీ నేత పన్నీరుసెల్వంతో పాటు ఆరుగుర్ని అన్నాడీఎంకే నుంచి శాశ్వతంగా సాగనంపుతూ ప్రకటన వెలువడింది. అలాగే, మరికొన్ని జిల్లాల నేతలకు నోటీసులు జారీ అయ్యాయి. ఇందులో ఈరోడ్ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు కూడా ఉండడం గమనార్హం. ఈరోడ్ జిల్లాల్లో ఇదివరకు సెంగోట్టయన్, కరుప్పన్నన్, తోపు వెంకటాచలం కీలక నేతలుగా ఉండే వారు. వీరి ఆధిపత్యంతో ఈ సారి వెంకటాచలంకు సీటు ఇవ్వలేదు. దీంతో రెబల్‌గా రంగంలోకి దిగిన ఆయన గెలుపు ధీమాతో ఉన్నారు. ఆ జిల్లాలోని మరికొన్ని నియోజకవర్గాల్లో తోపు వెంకటాచలం రాజకీయం సాగడంతో అన్నాడీఎంకే అభ్యర్థులు తీవ్ర కలవరంలో ఉన్నారు. దీంతో ఆ జిల్లాలో పరిస్థితిపై మంత్రులు సెంగోట్టయన్, కరుప్పన్నన్‌లకు అధిష్టానం నోటీసులు ఇవ్వడం గమనార్హం. సంపత్‌కు శాపనార్థాలు.. అకారణంగా తమను పార్టీ నుంచి తొలగించడంలో కీలక పాత్ర పోషించారంటూ మంత్రి సంపత్‌కు ఎమెల్యే సత్య, ఆమె భర్త పన్నీరు సెల్వం శాపనర్థాలు పెట్టే పనిలో పడ్డారు. ఆదివారం మీడియాతో ఎమ్మెల్యే సత్య మాట్లాడుతూ తనకు సీటు నిరాకరించడంతో రాజకీయ, ప్రజాసేవ నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించడం జరిగిందన్నారు. ఆ తర్వాత తాను నియోజకవర్గంలోనే లేదని, మనశ్శాంతి కోసం ఆలయ దర్శనాలు, ఆధ్యాత్మిక పర్యటనల్లో నిమగ్నమయ్యానని వివరించారు. భర్త, తాను, మద్దతు నేతలు నియోజకవర్గంలోనే లేనప్పుడు, ఎలా పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా, ప్రత్యర్థులకు మద్దతుగా ఎన్నికల్లో పనిచేసి ఉంటామని ప్రశ్నించారు. తమను ఎలాగైనా అన్నాడీఎంకే నుంచి సాగనంపాలన్న లక్ష్యంతో సంపత్ కుట్ర చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన్ను అమ్మ జయలలిత ఆత్మకూడా క్షమించదంటూ శాపనార్థలు పెట్టే పనిలో పడ్డారు. హోం శాఖను, ఇంటెలిజెన్స్‌ను తన గుప్పెట్లో పెట్టుకున్న సీఎం పళనిస్వామి, వారి ద్వారా విచారించి నిర్ణయం తీసుకుని ఉంటే బాగుంటుందని, తనకు జరిగినట్టుగా అన్యాయం మరెందరికో జరిగిన పక్షంలో పార్టీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. చదవండి: ఫలితాలకు ముందే ఆగిన శ్వాస తమిళనాడు ఎన్నికలు: గెలుపెవరిదో తేల్చేది వాళ్లే! -
బెంగాల్లో దీదీ గూండాగిరి ఇక చెల్లదు: పీఎం మోదీ
-
బెంగాల్లో దీదీ గూండాగిరి ఇక చెల్లదు: పీఎం మోదీ
కోలకతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు నాలుగోదశ పోలింగ్ హింసకు దారి తీసింది. బీజేపీ, టీఎంసీ కార్యకర్తల ఘర్షణలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. కూచ్ బెహార్, సీతాల్కుచిలో నియోజక వర్గంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. శనివారం కూచ్ బెహార్లో రెండు వేర్వేరు సంఘటనలలో ఐదుగురు మరణించినట్లు సమాచారం. మరో నలుగురు గాయపడ్డారు. ఈ హింసాకాండపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మమతా బెనర్జీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఓటరును కాల్చి చంపి ఘటన చాలా దురదృష్టకరమంటూ విచారం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ సిలిగురిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ దీదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీదీ, టీఎంసీ ఉగ్రవాద వ్యూహాలు బెంగాల్లో చెల్లవని హెచ్చరించారు. రాష్ట్రంలో బీజేపీకి పెరుగుతున్న మద్దతు చూసి దీదీ ఆమె గూండాలకు వణికి పోతున్నారని వ్యాఖ్యానించారు. సిలిగురిలో ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ ప్రస్తుత ఎన్నికల్లో మమతా బెనర్జీని, ఆమె గుండా ముఠాను తిప్పి కొడతారంటూ మండిపడ్డారు. కేంద్ర బలగాలకు వ్యతిరేకంగా ప్రజలను ప్రేరేపించడం, పోల్ ప్రక్రియలో అడ్డంకులు సృష్టించడం టీఎంసీని కాపాడలేవంటూ దీదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కూచ్ బెహార్ ఘటనకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఈసీని కోరారు. బెంగాల్లో కొత్త ఏడాదిలో బీజేపీ నేతృత్వంలో బీజేపీ సర్కార్ కొలువు దీరనుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు. బెంగాల్లో నూతన సంవత్సరం ప్రారంభం కానుంది. మంచి చెడుపై విజయం సాధించబోతోందనీ, గత మూడు దశల పోలింగ్‌లో బీజేపీకి ప్రజలు భారీ మద్దతును అందించారని మోదీ పేర్కొన్నారు. (పీకే క్లబ్‌హౌస్ చాట్ కలకలం: దీదీకి ఓటమి తప్పదా?) నాలుగో విడత పోలింగ్ సందర్భంగా సీతాల్కుచిలో ఈ ఉదయం 18ఏళ్ల బీజేపీ కార్యకర్తను దుండగులు కాల్చి చంపిన ఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. మరోవైపు కూచ్ బెహార్లో సీఆర్పీఎఫ్ బలగాలపై స్థానికులు దాడులు చేసేందుకు ప్రయత్నించగా కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ కాల్పుల ఘటనపై ఈసీ అధికారులను వివరణ కోరింది. హుగ్లీలో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వచ్చిన బీజేపీ మహిళా ఎంపీ లాకెట్ చటర్జీ వాహనంపై తృణమూల్ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. దీంతో ఆమె కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. అయితే ఆమె వ్యక్తిగత సిబ్బంది ఆమెను అక్కడినుంచి తప్పించారు. ఈ సందర్భంగా పలు మీడియా వాహనాలు ధ్వంసమయ్యాయి. కాగా మొత్తం 44 నియోజక వర్గాలకు నాలుగో దశపోలింగ్‌కు భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. -
దమ్ముంటే మొత్తం ఆడియో బయట పెట్టండి: పీకే
కోలకతా : పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశ పోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో ప్రశాంత్ కిశోర్‌కు సంబంధించిన ‘క్లబ్‌హౌస్ చాట్’ ఆడియో టేప్ ప్రకంపనలు రేపుతోంది. సోషల్ మీడియాలో టీఎంసీ ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందని, ఇదే మమత ఓటమికి కారణం కావొచ్చంటూ పీకే ఆడియోలో వెల్లడించినట్లుగా ఉందనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీనిపై బెంగాల్ ఎన్నికలకు మమతా బెనర్జీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పందించారు. అది అసలు తన ఆడియో కాదంటూ ట్విటర్ ద్వారా ఖండించారు. తమ పార్టీ నాయకుల మాటలకంటే, తన మాటలను బీజేపీ సీరియస్‌గా తీసుకోవడం ఆనందంగా ఉందంటూ ఎద్దేవా చేశారు. తమకనుకూలమైన క్లిప్పింగులకు బదులుగా, ధైర్యం ఉంటే మొత్తం చాట్‌ను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అంతేకాదు బీజేపీ100 సీట్ల మార్క్‌ను దాటబోదు అంటూ ప్రశాంత్ కిశోర్ మరోసారి స్పష్టం చేశారు. బెంగాల్లో బీజేపీ ఓటమి తప్పదని గతంలో సవాల్ చేసిన ప్రశాంత్ కిషోర్ తాజాగా బీజేపీ గెలుస్తుందని ఆయన చెప్పినట్లుగా ఉన్న ఈ ఆడియోను పశ్చిమ బెంగాల్ బీజేపీ విడుదల చేయడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. బీజేపీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జి అమిత్ మాల్వియా పోస్ట్ చేసిన ఒక క్లిప్ ప్రకారం గత సాయంత్రం జర్నలిస్టులతో జరిగిన చాట్‌లో మమతాపై వ్యతిరేకత, దళితుల ఓట్లు బీజేపీకి కలసి రానున్నాయని, ప్రధాని మోదీకి పాపులారీటీ బాగాపెరిగిందనీ, దీంతో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రశాంత్ కిశోర్ అభిప్రాయపడ్డారు. దీంతో బీజేపీ నేతలు తృణమూల్ గేమ్ ఓవర్ అంటూ సంబరాలు చేసు కుంటున్నారు. మరోవైపు ఇదంతా బీజేపీ ఆడుతున్న డ్రామా అని టీఎంసీ మండిపడింది. తాజా ఎన్నికల్లో బెంగాల్లో ఎలాగైనా టీఎంసీకి చెక్ పెట్టాలని బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మరోవైపు అధికారాన్ని నిలబెట్టుకునేందుకు అధికార టీఎంసీ పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీకి వందకు పైగా సీట్లు వస్తే..తాను ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయనని, ఏ రాజకీయ పార్టీకి సలహాలు, సూచనలు ఇవ్వనని టీఎంసీ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ గతంలో ప్రకటించారు. కాగా బెంగాల్ ఎన్నికలు మొత్తం 8 దశల్లో భాగంగా ప్రస్తుతం నాలుగో దశకు చేరుకున్నాయి. ఈ నెల 29వ తేదీతో ముగియనున్నాయి. ఫలితాలు మే 2న రానున్న సంగతి తెలిసిందే. I am glad BJP is taking my chat more seriously than words of their own leaders!😊 They should show courage & share the full chat instead of getting excited with selective use of parts of it. I have said this before & repeating again - BJP will not to CROSS 100 in WB. Period. — Prashant Kishor (@PrashantKishor) April 10, 2021 Is it open? That moment when Mamata Banerjee’s strategiest realised that the Club House room was open and his admissions were being heard by the public at large and not just a handful of Lutyens journalist. Deafening silence followed... TMC’s election was just thrown away! pic.twitter.com/2XJ4RWbv3K — Amit Malviya (@amitmalviya) April 10, 2021 -
ఇలాంటి సీఎంను జీవితంలో చూడలేదు
-
ఇలాంటి సీఎంను జీవితంలో చూడలేదు : అమిత్‌షా
సాక్షి న్యూఢిల్లీ : కేంద్ర బలగాలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యలపై హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. కోల్‌కతాలో శుక్రవారం మీడియాను ఉద్దేశించి షా మాట్లాడుతూ, ఓటమి భయం టీఎంసీని పీడిస్తోందని, ఈ ఫ్రస్ట్రేషన్లో వారి చర్యలు,వ్యాఖ్యలే దీనికి నిదర్శమని వ్యాఖ్యానించారు. పోల్ డ్యూటీలో సీఆర్పీఎఫ్ హోం మంత్రిత్వ శాఖ పరిధిలోకి రాదని, ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తుందనీ ఆయన పేర్కొన్నారు. ప్రజలను అరాచకం వైపు నెట్టివేస్తున్నారా అంటూ ఎద్దేవా చేశారు. అసలు ఇలాంటి సీఎంను తన జీవితంలో చూడలేదంటూ హోంమంత్రి ఘాటుగా విమర్శించారు. (అది బీజేపీ సీఆర్పీఎఫ్) అటు మమత వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి నోటీసులు జారీ చేసింది. కేంద్ర బలగాలపై ఆమె చేసిన వ్యాఖ్యలకు గాను వివరణ ఇవ్వాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా మార్చి 28, ఏప్రిల్ 7న కేంద్ర భద్రతా దళాలను "ఘెరావ్" చేయమని ప్రజలకు చెబుతూ మమత అత్యంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై శనివారం ఉదయం 11 గంటల్లోగా స్పందించాలని పేర్కొంది. మమత వ్యాఖ్యలు, ఎన్నికల కోడ్‌తోపాటు చట్టాన్ని ఉల్లంఘించినట్టేనని ఈసీ తెలిపింది. అయితే గత రెండు రోజుల్లో మమతకు ఈసీనుంచి నోటీసులు రావడం ఇది రెండవసారి. మరోవైపు ఈసీ పది నోటీసులిచ్చినా తన వైఖరి మారదని సీఎం మమతా తేల్చి చెప్పారు. మతాల ప్రాతిపదికన ఓటర్లను విడగొట్టే ప్రయత్నాలకు వ్యతిరేకంగా తాను మాట్లాడుతూనే ఉంటానని దీదీ గురువారం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కాగా ఎనిమిది దశల ఎన్నికలలో భాగంగా నాలుగో రౌండ్లో శనివారం పోలింగ్ జరగనుంది. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి. -
ముఖ్యమంత్రికి హెలికాప్టర్ కష్టాలు
యశవంతపుర/కర్ణాటక: పలు రాష్ట్రాలలో శాసనసభలకు జరుగుతున్న ఎన్నికల కారణంగా హెలికాప్టర్లకు డిమాండ్ పెరిగింది. బెంగళూరులోని ప్రైవేటు హెలికాప్టర్లు ఆయా రాష్ట్రాల బడా నేతలు బాడుగకు తెప్పించుకున్నారు. సీఎం యడియూరప్ప రాష్ట్రంలో దూరప్రాంతాలకు హెలికాప్టర్లో వెళ్తుంటారు. కానీ గిరాకీ వల్ల హెలికాప్టర్ దొరక్కపోవడంతో కారులోనే వెళ్లారు. గత ఆదివారం 9:30 గంటలకు దావణగెరె జిల్లా హరిహరకు వెళ్లారు. అక్కడ వివిధ మఠాల కార్యక్రమాలలో పాల్గొన్నారు. తిరిగి మధ్యాహ్నం 1:30 గంటలకు బెంగళూరుకు రోడ్డుమార్గంలో సాయంత్రం 4 గంటలకు చేరుకున్నారు. ఎండలో ఆరు వందల కిలోమీటర్లు కారులో తిరిగిన సీఎం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఎంపీ హెగ్డేకి బెదిరింపు కాల్ యశవంతపుర: ఎంపీ అనంతకుమార్ హెగ్డేకి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌కాల్ చేసి బెదిరించాడు. ఘటనపై శిరసి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల ఐదోతేదీ రాత్రి రెండు గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. ‘గతంలో ఫోన్ చేసినప్పుడు ఆ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశావు.ఈ సారి ఎలాగైనా ప్రాణం తీస్తా’ అంటూ ఆవ్యక్తి ఉర్దూ భాషలో మాట్లాడుతూ బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. చదవండి: కోర్టు వద్దని చెప్పినా సభకు హాజరైన మాజీ సీఎం -
ట్రంప్ కన్నా ఘోరం: మమత
కల్చిని: బీజేపీకే ఓటేయాలంటూ కేంద్ర బలగాలు ఓటర్లను బెదిరిస్తున్నాయని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. మూడో దశ ఎన్నికల సందర్భంగా ‘బీజేపీ కో ఓట్ దో’ అంటూ ఓటర్లపై దాడి చేస్తున్నాయన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ బలగాల అకృత్యాలను ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదన్నారు. బీజేపీ వారు పోలింగ్ బూత్‌లను ఆక్రమించుకుని, అక్రమంగా ఓట్లు వేసుకుంటున్నారన్నారు. మమత మంగళవారం పలు ఎన్నికల సభల్లో పాల్గొన్నారు. కేంద్ర బలగాలు, బీజేపీ కార్యకర్తల దాడుల గురించి ఉదయం నుంచి తనకు 100కు పైగా ఫిర్యాదులు వచ్చాయన్నారు. బీజేపీ అగ్రనేతల సభలకు ప్రజలు రాకపోవడంతో వారు ఢిల్లీలో కూర్చుని ఈ కుట్రకు తెరతీశారని విమర్శించారు. బీజేపీకి మద్దతుగా నిలవాలని కేంద్ర బలగాలను ఆదేశించారన్నారు. ‘తుపాకులతో ఈ ఎన్నికలను వారు నియంత్రించాలని అనుకుంటున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో నాటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా మోదీ అంత దారుణంగా వ్యవహరించలేదు’ అని వ్యాఖ్యానించారు. కేంద్ర బలగాలు వేధిస్తే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని మహిళలకు సూచించారు. ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడుతోందని ఆరోపించారు. ‘పెద్ద హోటళ్లలో అన్ని రూమ్స్‌ను బుక్ చేసుకున్నారు. ఓటర్లకు డబ్బులు పంచిపెడ్తున్నారు. ఈ డబ్బంతా వారికి ఎక్కడ్నుంచి వచ్చింది? పీఎం కేర్స్ ఫండ్ నుంచా? నోట్ల రద్దు నుంచా? ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం నుంచా?’ అని ప్రశ్నించారు. మతం పేరుతో ఊచకోతకు పాల్పడిన వారు ఉన్న పార్టీ బీజేపీ అని ఆరోపించారు. ‘గుజరాత్, ఢిల్లీ, అస్సాం, యూపీలో మతం పేరుతో హత్యలు చేశారు. ఇప్పుడు బెంగాల్‌కు వచ్చారు’ అని మమత మండిపడ్డారు. -
సలక్షణంగా ఎలక్షన్ డ్యూటీ
మొత్తం ఎనిమిది విడతల పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మూడో విడతగా మంగళవారం మూడు జిల్లాల్లోని 31 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ప్రశాంతంగా జరిగింది! ఎక్కువ శాతం జరిగింది. ఆ మూడు జిల్లాలు.. దక్షిణ 24 పరగణాలు, హౌరా, హూగ్లీ. ఆ మూడు జిల్లాలకు ఎన్నికల అధికారులుగా విధులు నిర్వహించిన ముగ్గురూ యాదృచ్ఛికమే అయినా.. మహిళలు కావడమే ఆ ప్రశాంతతకు, ఎక్కువ శాతం ఓటింగ్‌కు కారణం అని వారిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. అంతర, ముక్త, ప్రియ.. అనే ఆ ముగ్గురు అధికారులు ఆయా జిల్లాల మేజిస్ట్రేట్లు. మూడు జిల్లాలు. ముప్పై ఒక్క అసెంబ్లీ స్థానాలు. సుమారు డెబ్బై తొమ్మిది లక్షల మంది ఓటర్లు. ఒకే రోజు పోలింగ్. జిల్లా యంత్రాంగం మొత్తం పకడ్బందీగా పని చేస్తుంది కనుక పోలింగ్ నిర్వహణ పెద్ద పనిగా అనిపించకపోవచ్చు. అయితే పశ్చిమబెంగాల్ లో ఇప్పుడు ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. గెలిచి తీరాలని దేశాన్ని పాలిస్తున్న పార్టీ, ఆ పార్టీనీ ఓడించాలని పశ్చిమ బెంగాల్ ని పాలిస్తున్న పార్టీ పోటా పోటీగా ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన అధికారుల్లో ఉంది. ‘వెళ్లి ఏం వేస్తాంలే..’ అనే ఉదాసీనత ఓటర్లలో ఉండినా ఉండొచ్చు. అయితే ఆ మూడు జిల్లాల డీఎం (డిస్ట్రిక్ట్ మేజిస్టేట్)లు అంతర ఆచార్య, ముక్తా ఆర్య, దీపప్ ప్రియ గట్టి ముందస్తు ఏర్పాట్లు చేసి, కట్టు దిట్టమైన ముందు జాగ్రత్తలు తీసుకుని ప్రతి దశలోనూ అప్రమత్తంగా ఉండి సజావుగా ఎన్నికలు జరిపించారు. అంతర.. దక్షిణ 24 పరగణాలు జిల్లా మేజిస్ట్రేట్. ముక్త.. హౌరా జిల్లా మేజిస్ట్రేట్, దీపప్ ప్రియ.. హూగ్లీ జిల్లా మేజిస్ట్రేట్. మహిళా ఓటర్లంతా ఉత్సాహంగా ముందుకు వచ్చి, ఓటింగ్ అనే ఈ ప్రజాస్వామ్య ఉత్సవాన్ని తమ చేతుల మీదుగా జరిపించాలని ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల అధికారులు పిలుపునిస్తున్న విషయం తెలిసిందే. మహిళలు ఓటేస్తేనే సరైన అభ్యర్థులు విజేతలు అవుతారని, మహిళా సంక్షేమానికి తగినంత కృషి జరుగుతుందని కూడా ఎన్నికల సంఘం ప్రచారం చేయించింది. పరిస్థితిల్లో పశ్చిమ బెంగాల్‌లోని అత్యంత కీలకమైన ఈ మూడు జిల్లాలకు ముగ్గురూ మహిళా డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్లే ఉండటం అన్నది ఎన్నికల సంఘం సంకల్పానికి బలం చేకూర్చింది. ఈ ముగ్గురు మహిళా డీఎంలు ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనేలా అన్ని వసతులూ కల్పించారు. తమ పరిధిలోని 16 నియోజకవర్గాలలో అంతర, 18 జిల్లాలలో దీపప్, 7 జిల్లాలలో ముక్త నిరంతర పర్యవేక్షణ బృందాలతో పోలింగ్‌ను విజయవంతం చేశారు. జిల్లా పౌరుల మన్ననలు పొందారు. అంతర ఆచార్య ముగ్గురిలో సీనియర్. 2006లో యు.పి.ఎస్.సి. రాశారు. ఈ ఐ.ఎస్.ఎస్. అధికారి మొదటి పోస్టింగ్ సబ్ డివిజినల్ ఆఫీసర్‌గా శ్రీరాంపూర్‌లో. ఈ ఏడాది ఫిబ్రవరిలో దక్షిణ 24 పరగణాలు జిల్లాకు మేజిస్ట్రేట్‌గా రాకముందు రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలలో వేర్వేరు హోదాలలో పని చేశారు. దుర్గాపూర్, అసన్సోల్ అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్‌గా; అసన్సోల్–దుర్గాపూర్ అభివృద్ధి మండలి సీఈవోగా; ఈస్ట్ మిడ్నాపూర్ డీఎంగా విధులు నిర్వహించారు. కొంతకాలం కోల్‌కతా మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అధారిటీ ఈసీవో గా కూడా ఉన్నారు. ముక్తా ఆర్య ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిన 2008 ఐ.ఎ.ఎస్. బ్యాచ్ ఆఫీసర్. లోక్‌సభ ఎన్నికలకు ముందు బంకుర జిల్లా డీఎంగా నియమితులయ్యారు. గత ఏడాది నవంబరులో హౌరాకు జిల్లా మేజిస్టేట్‌గా బాధ్యతలు స్వీకరించారు. దీపప్ ప్రియ ముగ్గురిలో జూనియర్. 2011 బ్యాచ్ ఐ.ఎ.ఎస్. ఆఫీసర్. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉత్తర 24 పరగణాలు జిల్లా అడిషనల్ డీఎంగా ఉన్నారు. దక్షిణ దినాజ్‌పుర్, డార్జిలింగ్ జిల్లాల డీఎంగా పని చేశారు. ఈ ఫిబ్రవరిలో హూగ్లీ జిల్లా మేజిస్ట్రేట్‌గా వచ్చారు. చదవండి: టైమిస్తారా ఇవాళైనా? -
ఇది ప్రభుత్వంపై స్టార్ హీరోల నిరసన గళమా?
చెన్నె: ఎంతో ఉత్కంఠ రేపిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు మంగళవారం ముగిశాయి. ఓటేసేందుకు అగ్ర తారలు తరలివచ్చినప్పటికీ సాధారణ ఓటర్లు అంతగా ఆసక్తి కనబర్చలేదని పోలింగ్ శాతం చూస్తే అర్ధమవుతోంది. అయితే పోలింగ్ రోజు పలు ఆసక్తికర సంఘటనలు తమిళనాడులో చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా సినీ నటులు వినూత్నంగా ఓటేయడానికి ముందుకువచ్చారు. పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే సూపర్‌స్టార్ రజనీకాంత్ ఓటేయడానికి వచ్చారు. తదనంతరం నటీనటులు, సినీ పరిశ్రమకు చెందిన వారంతా ఓటేసేందుకు తరలివచ్చారు. ఈ క్రమంలో అగ్రనటులు అజిత్, విజయ్, విక్రమ్, శింబు తదితరులు కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. జయం రవి ముఖ్యంగా వారు వేసుకున్న మాస్క్‌లతో పరోక్షంగా డీఎంకే పార్టీకి మద్దతు తెలిపినట్లు సమాచారం. అజిత్, విజయ్, విక్రమ్, శింబు తదితరులు నలుపు రంగు మాస్క్ ధరించి ఓటేసేందుకు వచ్చారు. డీఎంకే పార్టీ జెండాలో నలుపు ఉంటుంది. అందుకే ఆ పార్టీకి ఓటేయాలని పరోక్షంగా పిలుపునిచ్చినట్లుగా తమిళనాడులో చర్చ నడుస్తోంది. దీంతోపాటు విజయ్ సైకిల్ మీద రావడం తమిళనాడే కాక తెలుగు రాష్ట్రాల్లోనూ ఆసక్తికర చర్చ సాగింది. అయితే విజయ్ పెట్రోల్, డీజిల్ ధరలు నిరంతరం పెరుగుతుండడానికి నిరసనగా సైకిల్‌పై వచ్చినట్లు తెలుస్తోంది. పోలింగ్ రోజున అభిమానులు, ఓటర్లకు ఆ విషయం గుర్తు చేసేందుకు విజయ్ సైకిల్ ఎంచుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక నటుడు విక్రమ్ కూడా పోలింగ్ కేంద్రానికి నడుచుకుంటూ వచ్చాడు. ఆయన కూడా ఇదే విషయం ప్రస్తావించేందుకు నడుచుకుంటూ వచ్చాడని సమాచారం. శింబు ఈ చర్యలతో పరోక్షంగా అధికారంలో ఉన్న అన్నాడీఎంకే, బీజేపీ కూటమికి వ్యతిరేకంగా ప్రచారం చేసినట్లు అందరూ భావిస్తున్నారు. దీనిపై తమిళనాడులో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ పరిణామం అధికార పార్టీకి ప్రతికూల ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. ఇక అగ్రనటుడు రజనీకాంత్, సూర్య, కార్తీ తెల్లటి మాస్క్ ధరించి వచ్చారు. ఓటేసే సమయంలో నటుడు అజిత్ ఓ అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓటేయడానికి వచ్చే సమయంలో ఓ అభిమాని సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించగా అతడి ఫోన్‌ను లాగేసుకున్నాడు. మరికొద్దిసేపటి తర్వాత వార్నింగ్ ఇచ్చేసి ఫోన్ తిరిగిచ్చేశాడు. చదవండి: బెంగాల్ మినహా పూర్తయిన ఎన్నికలు.. పోలింగ్ శాతం ఇలా.. -
బెంగాల్ మినహా పూర్తయిన ఎన్నికలు.. పోలింగ్ శాతం ఇలా..
సాక్షి, హైదరాబాద్: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో మంగళవారం జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం నుంచి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. ఈ క్రమంలో అత్యధికంగా ఈశాన్య రాష్ట్రం అసోంలో పోలింగ్ నమోదవగా, అత్యల్పంగా తమిళనాడులో పోలింగ్ జరిగింది. తమిళనాడులో 234, కేరళలో 140, పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో పోలింగ్ ముగిసింది. అసోంలో 40 స్థానాలకు మూడు దశల్లో పోలింగ్ జరగ్గా మంగళవారంతో పూర్తయ్యింది. పశ్చిమబెంగాల్లో మూడో దశ పోలింగ్ జరిగింది. అసోంలో చివరి దశ పోలింగ్‌లో భారీగా ఓటింగ్ నమోదైంది. నేటితో మూడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు ముగియగా ఒక్క పశ్చిమబెంగాల్లో మాత్రం ఎన్నికలు కొనసాగనున్నాయి. పశ్చిమ బెంగాల్లో మొత్తం 8 దశల్లో పోలింగ్ జరుగుతుండగా మంగళవారంతో మూడు దశలు పూర్తయ్యింది. ఇక ఏప్రిల్ 10, 17, 22, 26, 29 తేదీల్లో మలి విడతల్లో పోలింగ్ జరగనుంది. చివరి సమాచారం అందే వరకు నమోదైన పోలింగ్ శాతం పశ్చిమ బెంగాల్: 77.68 తమిళనాడు : 65.15 కేరళ : 70.16 అసోం : 82.28 పుదుచ్చేరి : 78.24 5 గంటల వరకు నమోదైన పోలింగ్ పశ్చిమ బెంగాల్: 76.84 శాతం తమిళనాడు : 61.34 శాతం కేరళ : 69.24 శాతం అసోం : 78.32 శాతం పుదుచ్చేరి : 76.46 శాతం 4 గంటల వరకు పోలింగ్ శాతం పశ్చిమ బెంగాల్: 67.27 తమిళనాడు : 53.35 కేరళ : 59.91 అసోం : 68.31 పుదుచ్చేరి : 66.36 3 గంటల వరకు పోలింగ్ పశ్చిమ బెంగాల్: 54.43శాతం తమిళనాడు : 43.40శాతం కేరళ : 51.4శాతం అసోం : 54.73 పుదుచ్చేరి : 54.27శాతం రెండు గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం పశ్చిమ బెంగాల్: 54.43 తమిళనాడు : 40.94 కేరళ : 51.4 అసోం : 53.23 పుదుచ్చేరి : 54.21 ఒంటి గంట వరకు నమోదైన పోలింగ్ శాతం పశ్చిమ బెంగాల్: 53.89 తమిళనాడు : 39.61 కేరళ : 43.3 అసోం : 53.23 పుదుచ్చేరి : 53.35 -
5 రాష్ట్రాల ఎన్నికలు: నేడే కీలక పోలింగ్
సాక్షి, చెన్నై/కోల్‌కతా/తిరువనంతపురం: పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమయ్యింది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో మంగళవారం ఒకే విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. పశ్చిమ బెంగాల్, అస్సాంలో మూడో విడత ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఓటింగ్ నిర్వహిస్తారు. చివరి గంటలో ఓటు వేసేందుకు కరోనా బాధితులను అనుమతిస్తారు. వీరి కోసం ఆయా పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పశ్చిమ బెంగాల్లో మూడో దశలో 31 స్థానాల్లో ఎన్నికలు జరుగుతాయి. 78.5 లక్షల మంది ఓటు వేయనున్నారు. 31 స్థానాల్లో 205 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ జరుగనుండడంతో అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కేరళలో 140 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2.74 కోట్ల మంది అర్హులైన ఓటర్లు ఉన్నారు. 957 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 1980వ దశకం నుంచి కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ఒకదాని తర్వాత ఒకటి అధికారంలోకి వస్తున్నాయి. ఈసారి ఎల్డీఎఫ్ మళ్లీ గెలిస్తే అది కొత్త చరిత్ర సృష్టించినట్లే అవుతుంది. అస్సాంలో మూడో దశలో(చివరి దశ) 40 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. 337 మంది అభ్యర్థుల జాతకాన్ని ఓటర్లు నిర్దేశించబోతున్నారు. చివరి దశ ఎన్నికల్లో 25 మంది మహిళా అభ్యర్థులు సైతం పోటీ పడుతున్నారు. 11,401 పోలింగ్ కేంద్రాల్లో 79.19 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. 30 అసెంబ్లీ స్థానాలున్న పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తమిళనాడులో సర్వం సిద్ధం తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 88,936 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. రాష్ట్రంలో డీఎంకే–కాంగ్రెస్ కూటమి, అన్నాడీఎంకే– బీజేపీ, మక్కల్ నీదిమయ్యం–ఐజేకే, ఎస్ఎంకే, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం–డీఎండీకే, ఎస్డీపీఐ పార్టీలు కూటమిగా ఎన్నికలను ఎదుర్కొంటున్నాయి. ఇక నామ్ తమిళర్ కట్చి ఒంటరిగా పోటీ చేస్తోంది. 3,998 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పోలింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 1.58 లక్షల మంది పోలీసులు, పారా మిలటరీ సిబ్బందితో భద్రత కల్పించారు. ఐదు చోట్ల ఎన్నికల రద్దుకు పట్టు డీఎంకే పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ పోటీ చేస్తున్న కొళత్తూరు, ఆయన తనయుడు బరిలోకి దిగిన చేపాక్కం–ట్రిప్లికేన్, పార్టీ ప్రధాన కార్యదర్శి దురై మురుగన్ పోటీ చేస్తున్న కాట్పాడి, డీఎంకే పార్టీ సీనియర్ నేతలు ఏవీ వేలు(తిరువణ్ణామలై), కేఎన్ నెహ్రు (తిరుచ్చి పశ్చిమం) నియోజకవర్గాల్లో నగదు పంపిణీ జరిగిందని అధికార అన్నాడీఎంకే ఆరోపించింది. ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికలను రద్దు చేయాలని డిమాండ్ చేసింది. అన్నాడీఎంకే నేత, మంత్రి జయకుమార్ నేతృత్వంలోని బృందం ఎన్నికల కమిషనర్ సత్యప్రద సాహును కలిసి ఫిర్యాదు చేసింది. చిన్నమ్మ ఓటు గల్లంతు దివంగత సీఎం జయలలిత సన్నిహితురాలు శశికళకు ఓటు హక్కు లేకుండా పోయింది. 2017లో ఆమె అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. జయలలితతో పాటు శశికళ, ఆమె వదిన ఇలవరసిలతో సహా 12 మంది పోయెస్ గార్డెన్‌లోని వేద నిలయంలోనే ఉండేవారు. ప్రసుత్తం అందరి పేర్లు ఓటర్ల జాబితాలో గల్లంతయ్యాయి. ఈ నిలయాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని స్మారక మందిరంగా మార్చేయడంతోనే ఆ చిరునామాలో ఉన్న పేర్లన్నింటినీ ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. శశికళకు ఓటు హక్కు కల్పించాలని కోరుతూ ఆమె తరఫు న్యాయవాది రాజచెందూర్ పాండియన్ ఈసీకి విజ్ఞప్తి చేసినా ఫలితం శూన్యం. -
తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ప్రచార పర్వానికి తెర
చెన్నై/తిరువనంతపురం/గువాహటి/కోల్‌కతా: తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో శాసనసభ ఎన్నికల ప్రచారానికి ఆదివారం సాయంత్రం 7 గంటలకు తెరపడింది. పశ్చిమ బెంగాల్, అస్సాంలో మూడో దశ ఎన్నికలకు ప్రచార పర్వం ముగిసింది. ఇన్నాళ్లూ అవిశ్రాంతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాజకీయ పార్టీల నేతలు ఇక ఓట్ల లెక్కల్లో మునిగిపోయారు. ఈ నెల 6న(మంగళవారం) జరిగే ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు దాదాపు పూర్తి చేశారు. కీలకమైన తమిళనాడుపై అందరి దృష్టి నెలకొంది. తమిళనాట 3,998 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ముఖ్యమంత్రి కె.పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం, డీఎంకే నేత ఎం.కె.స్టాలిన్, సినీ నటుడు కమల్ హాసన్ తదితర ప్రముఖులు ఎన్నికల బరిలోకి దిగారు. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలుండగా, 6.28 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. కేరళలో చివరి రోజు ప్రచారాన్ని నేతలు హోరెత్తించారు. భారీ రోడ్డు షోలు, ర్యాలీలు నిర్వహించారు. ఓటర్లను ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో జన సమూహాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించినప్పటికీ ఎవరూ పెద్దగా లెక్కచేయలేదు. రాష్ట్రంలోని 140 నియోజకవర్గాల్లో ఆదివారం భారీ సభలు జరిగాయి. కాంగ్రెస్ నేత రాహుల్ ఉత్తర కోజికోడ్, తిరువనంతపురం జిల్లాల్లో, సీఎం విజయన్ కన్నూరులో రోడ్డు షోల్లో పాల్గొన్నారు. ఆఖరి రోజు కనిపించని హడావుడి పుదుచ్చేరిలో పలు నియోజకవర్గాల్లో ఆఖరి రోజు ఎన్నికల ప్రచారంలో హడావుడి కనిపించలేదు. రాష్ట్రంలో 30 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ నేతృత్వంలోని సెక్యులర్ డెమొక్రటిక్ అలయెన్స్, ఎన్డీయే నేతృత్వంలోని ఏఐఎన్ఆర్సీ మధ్యే ప్రధానమైన పోటీ సాగుతోంది. అస్సాంలో మూడో దశ ఎన్నికలు మంగళవారం జరుగనున్నాయి. రాష్ట్రంలో ఇవే చివరి దశ ఎన్నికలు. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమికి, అధికార బీజేపీ నేతృత్వంలోని కూటమికి మధ్య హోరాహోరి పోరు సాగుతోంది. మరోసారి అధికారం దక్కించుకోవాలని బీజేపీ ఉవ్విళ్లూరుతుండగా, నెగ్గాలని కాంగ్రెస్ కూటమి ఆరాట పడుతోంది. పశ్చిమ బెంగాల్లో మూడో దశ ఎన్నికలకు సర్వం సిద్ధమయ్యింది. దక్షిణ 24 పరగణాల జిల్లా, హుగ్లీ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 31 స్థానాల్లో ప్రచారం ముగిసింది. మూడో దశలో 205 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ జరుగనుండడంతో అధికారులు భారీ భద్రతా ఏర్పాటు చేశారు. -
'నన్ను పావుగా వాడుకోడానికే ఆహ్వానించారు'
మీరు ఇటీవలే ఈమె ఫొటోను మన ‘ఫ్యామిలీ’లో చూసి ఉంటారు. ఈమె కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న తొలి ట్రాన్స్ ఉమన్ అని, ఎమ్మెల్యేగా గెలిస్తే మహిళలు, ట్రాన్స్జెండర్ల సంక్షేమం కోసం కృషి చేస్తానని ఈమె అనినట్లు చదివిన జ్ఞాపకం కూడా మీకు ఉండి ఉంటుంది. ఈమె పేరు అనన్యా అలెక్స్. వెంగర్ నియోజకవర్గం నుంచి ‘డెమోక్రాటిక్ సోషల్ జస్టిస్ పార్టీ’ అభ్యర్థిగా మార్చి 19 న నామినేషన్ వేశారు. నామినేషన్ ఉపసంహరణ గడువు మార్చి 22 కూడా దాటì పోయింది. ఏప్రిల్ 6న పోలింగ్‌కి అన్ని పార్టీల అభ్యర్థులూ ముగింపు ప్రచార కార్యక్రమాల్లో ఉండగా అనన్య అకస్మాత్తుగా.. తను పోటీ నుంచి తప్పుకుంటున్నానని ఏప్రిల్ 3 న ప్రకటించారు!! ఎందుకలా ఈమె అర్ధంతరంగా తన ప్రచార వేదికను, రాజకీయ రంగాన్ని దిగి వెళ్లిపోయారు?! అనన్యా అలెక్స్ ఆఖరి నిముషంలో మనసు మార్చుకోడానికి కారణం ఆ మనసు పడిన ఆవేదన! రాజకీయాల్లోకి వచ్చాక ఈ వేదనలు, ఆవేదనలు ఉంటాయా అనే ప్రశ్న వేసే ముందు ఆమేం చెబుతున్నారో వినవలసిన బాధ్యత ఉంటుంది ఎవరికైనా. అనన్య ఏదో అయిపోదామని పాలిటిక్స్‌లోకి రాలేదు. ఏదో చేద్దామని వచ్చారు. ఆమె ఏ పార్టీ అభ్యర్థిగా అయితే పోటీ చేస్తున్నారో ఆ ‘డెమోక్రాటిక్ సోషల్ జస్టిస్ పార్టీ’ (డి.ఎస్.జె.పి.) కూడా నిన్నమొన్నటి పార్టీనే. రాజకీయాల్ని ప్రక్షాళన చేయబోతున్నాం అంటూ 2019లో ఆవిర్భవించిన ఆ పార్టీ ఇప్పుడు తనని తనే ప్రక్షాళన చేసుకోవలసిన అవసరాన్ని తెచ్చుకున్నట్లు అనన్య మాటల వల్ల స్పష్టం అవుతోంది. ‘‘నన్ను ఒక పావుగా వాడుకోడానికి మాత్రమే రాజకీయాల్లోకి ఆహ్వానించారు’’ అంటున్నారు అనన్య. సొంత పార్టీవాళ్లే ఆమెను మానసికంగా వేధిస్తూ, అసభ్యంగా దూషిస్తూ ప్రత్యర్థులపై వ్యక్తిగత దుష్ప్రచారం చెయ్యాలని ఆమెను బలవంత పెడుతున్నారట! ఇప్పుడిక హత్యచేస్తామన్న బెదరింపులు కూడా వస్తున్నాయని ఆమె చెబుతున్నారు. ఎందుకంటే.. చెప్పినట్లు వినడం లేదని! వాళ్లేం చెబుతున్నారంటే.. అనన్యను ఎన్నికల ప్రచారంలో బురఖా వేసుకొమ్మని బలవంతం చేస్తున్నారు. వెంగర్ నియోజకవర్గంలో ముస్లిం మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండటమే అందుకు కారణం. ‘నేనలా చేయలేను’ అన్నారు అనన్య. ఆమె ప్రత్యర్థి, ముస్లిం లీగ్ పార్టీ సీనియర్ నాయకుడు పీకె కున్హలికుట్టి చెడ్డవాడని; మరొక ప్రత్యర్థి, లెఫ్ట్ డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి పి.జీజీ ఒక తెలివి లేని మనిషి అని ప్రచారం చెయ్యమని ఒత్తిడి తెస్తున్నారు. ‘‘నేనలా చేయలేను’’ అన్నారు అనన్య. అంతే.. ట్రాన్స్ ఉమెన్‌గా ఆమెపై వేధింపులు, లైంగిక హింస మొదలయ్యాయి. పార్టీలోని పైవాళ్లకు ఫిర్యాదు చేస్తే వాళ్లు కూడా అనన్యతో అదే విధంగా, గౌరవం లేకుండా ప్రవర్తించారు! దాంతో మనస్తాపం చెంది, తన ఆత్మగౌరవాన్ని నిలుపుకునే ప్రయత్నంలో భాగంగా ఆఖరి నిముషంలో ప్రచారం నుంచి తప్పుకున్నారు అనన్య. ‘‘నా వ్యక్తిత్వాన్ని చంపేసే ఏ పనినీ నేను చేయలేను’’ అని ఆమె అంటున్నారు. మంచి చేద్దామని రాజకీయాల్లోకి వచ్చేందుకు ఉత్సాహం కనబరిచిన అనన్యకు... అభివృద్ధి పనుల గురించి చెప్పకుండా తన ప్రత్యర్థుల వ్యక్తిగత బలహీనతల గురించి మాట్లాడమని పార్టీ ఆదేశించడం ఆగ్రహం తెప్పించింది. కేరళ తొలి ట్రాన్స్ ఉమన్ రేడియో జాకీ అయిన అనన్య.. జీవితంలోని మంచి చెడుల గురించి రోజూ రేడియో శ్రోతలకు తనదైన ఆకట్టుకునే శైలిలో వినిపిస్తూ ఉంటారు. ‘‘ఇప్పుడు కనుక పార్టీ చెప్పినట్లు చేస్తే ఇప్పటì వరకు నువ్వు సంపాదించుకున్న మంచి పేరుతో పాటు రేడియో జాకీ ఉద్యోగం కూడా పోతుంది’’ అని సన్నిహితులు చేసిన హెచ్చరికలకు కూడా విలువ ఇచ్చి ఆమె బరి నుంచి బయటికి నడిచారు. అనన్య రేడియో జాకీ మాత్రమే కాదు. ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్, న్యూస్ యాంకర్ కూడా. శుక్రవారం నాడు అర్థంతరంగా ప్రచారాన్ని వదిలేసి వచ్చాక కూడా తన వెంటపడి ఎంత హీనంగా తనను ఎన్ని మాటలు అన్నారో అవన్నీ రాసి తన పార్టీ పెద్దలపై పోలీస్ కంప్లయింట్ ఇచ్చారు అనన్య. అంతేకాదు.. మహిళలు, ట్రాన్స్జెండర్లంటే మర్యాద లేని డి.ఎస్.జె.పి.కి ఓటు వేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిర్ణీత వేళలంటూ లేకుండా ఆమె చేత ప్రచారం చేయించడంతో అనన్య ఆరోగ్యం క్షీణించింది. కొల్లం జిల్లా పెరుమన్ గ్రామంలో పుట్టి తనకంటూ కేరళ వ్యాప్తంగా ఒక గుర్తింపు తెచ్చుకున్న అనన్య పాఠశాల విద్యతోనే చదువు మానేశారు. ఇక ఏ రాజకీయ గొడవలూ లేకుండా, చేస్తున్న ఉద్యోగాలలోనే కొనసాగుతూ ఉన్నత విద్యను పూర్తి చేయాలని ఇప్పుడు ఆశిస్తున్నారు. జెండర్‌కు అతీతంగా చదువు గౌరవాన్ని ఇస్తుందని ఆమె నమ్ముతున్నారు. -
అసెంబ్లీ ఎన్నికల వేళ అభ్యర్థి మిస్సింగ్..!
సాక్షి, యానాం: పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ బహిష్కృత నేత అదృశ్యం కలకలం రేపుతోంది. యానాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్ధిగా పోటీచేస్తున్న పెమ్మాడి దుర్గాప్రసాద్ అదృశ్యమయ్యారు. తన భర్త గురువారం ఉదయం నుంచి కనిపించట్లేదని ఆయన భార్య పెమ్మాడి శాంతి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఉదయం ఎన్నికల ప్రచారం కోసం వెళ్లి, తిరిగి ఇంటికి రాలేదని అంతేకాకుండా మొబైల్ ఫోన్ స్విచాఫ్‌లో ఉన్నట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, గాలింపు చర్యలు చేపట్టారు. మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా ఆయన ఎక్కడున్నారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా, యానాం కొత్తపేటకు చెందిన పెమ్మాడి దుర్గా ప్రసాద్.. మత్స్య వ్యాపారి. ఆయనకు సొంతంగా ఫిషింగ్ బోట్లు ఉన్నాయి. యానాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయనకు ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తును కేటాయించింది. తన సామాజిక వర్గంలో మంచి పట్టు ఉండడంతో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. ఈనెల 6న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దుర్గా ప్రసాద్ అదృశ్యం సంచలనం రేకిత్తిస్తుంది. చదవండి: అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల్లో 18% నేరచరితులే -
‘కాలు నొప్పి ఏమైంది దీదీ.. ఈ డ్యాన్స్ ఏంటి’
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఎలాగైనా సరే రాష్ట్రంలో పాగా వేయాలని బీజేపీ చూస్తుంటే.. కాషాయ పార్టీని బెంగాల్ దరిదాపుల్లోకి కూడా రానివ్వకూడదనే కృత నిశ్చయంతో ఉన్నారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ‘‘బీజేపీ మీద తిరుగలేని పోరాటం చేసే ఏకైక వ్యక్తి దీదీ. అలాంటి మమతా కూడా ఈ సారి భయపడ్డారు.. అందుకే ఆమెకు అలవాటు లేని పనులు చేస్తున్నారు’’ అనే మాటలు వినిపిస్తున్నాయి. నందిగ్రామ్‌లో నామినేషన్ వేసి తిరిగి వస్తుండగా మమతకు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. తనపై దాడి జరిగిందని దీదీ ఆరోపిస్తుండగా.. జనం పెద్ద ఎత్తున రావడంతోనే ఆమెకు ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్పారు. ఇక నాటి నుంచి మమత వీల్ చైర్లోనే కనిపిస్తున్నారు. ఈ విషయం ఆమెను అభిమానించే వారికి నచ్చడం లేదు. కాళికలా ఉండే మమతా ఇలా సానుభూతి కోసం ప్రయత్నించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఇలా చర్చ జరుగుతుండగానే తాజాగా మమతా బెనర్జీకి సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ట్విట్టర్లో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఇంతకు ఈ వీడియోలో ఏం ఉందంటే.. మమతా రెండు కాళ్లను వెనకకు, ముందుకు ఆడిస్తూ రిలాక్స్ అవుతున్నారు. ప్రమాదంలో కట్టుకట్టిన కాలును కూడా చాలా సింపుల్‌గా కదిలిస్తున్నారు. ఈ సంఘటన ఎక్కడ చోటు చేసుకుందనే దాని గురించి ఎలాంటి సమాచారం లేదు. కానీ ఈ వీడియో చూసిన తర్వాత బీజేపీ నాయకులు దీదీని ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు బీజేపీ నాయకులు. ‘‘కాలుకి దెబ్బ తగిలింది.. కుట్రపూరితంగానే నాపై దాడి చేశారని ఆరోపించావ్.. మరి ఇదేంటి దీదీ’’ అని ప్రశ్నిస్తున్నారు. ‘‘డ్రామాలు ఆపేయ్.. జనాలకు నీ గురించి తెలిసిపోయింది... సింపతీ కోసం ఎంత ప్రయత్నించినా వృథా’’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. టీఎంసీ చెత్త రాజకీయాలకు నిదర్శనం ఈ వీడియో అంటూ విమర్శిస్తున్నారు బీజేపీ నాయకులు. చదవండి: నేను పులి: ‘నందిగ్రామ్’లో మమతా బెనర్జీ గర్జన -
‘ఐటీ దాడులా...ఎంకే స్టాలిన్ ఇక్కడ’!
సాక్షి,చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు నాలుగు రోజుల ముందు ఎన్నికల వేడి మరింత రాజుకుంది. ముఖ్యంగా డీఎంకే నేతల ఇళ్లపై ఐటీ దాడులు ప్రకంపనలు రేపుతున్నాయి. ఆదాయపన్ను శాఖ సోదాలపై డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ మండిపడ్డారు. తన కుమార్తె, అల్లుడు ఇంటిపై శుక్రవారం నాటి ఐటీ దాడులపై ఘాటుగా స్పందించారు. అలాగే తమిళనాడులోని కల్లకూరిచిలో డీఎంకె వ్యవస్థాపకుడు అన్నాదురై విగ్రహానికి నిప్పంటించిన ఘటననుకూడా స్టాలిన్ తీవ్రంగా ఖండించారు. (ఎన్నికల వేళ, డీఎంకేకు ఐటీ వరుస షాక్స్) పెరంబలూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. ఎన్ని ఐటీ దాడులు చేసిన తమ పార్టీకి భయపడేది లేదని తెగేసి చెప్పారు. అంతేకాదు తాము ఏఐఎడిఎంకె నాయకులు కాదని ప్రధాని మోదీ తెలుసుకోవాలన్నారు. ఓటమి భయంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఏఐఎడిఎంకె ప్రభుత్వాన్ని మోదీ సర్కార్ కాపాడుతోంది. కానీ తాను కలైంగర్ (దివంగత డీఎంకె నేత ఎం కరుణానిధి) కొడుకుననే విషయాన్ని మర్చిపోవద్దని ప్రధానిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తాను మిసాను, ఎమర్జెన్సీని చూశాను..ఇలాంటి వాటికి భయపడను.. బీజేపీ తప్పుడు విధానాలకు ప్రజలు ఏప్రిల్ 6 న స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారని స్టాలిన్ స్పష్టం చేశారు. అలాగే డీఎంకే వ్యవస్తాపకుడు అన్నాదురై విగ్రహాలపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండించారు. మరోవైపు ఐటీ దాడులపై డీఎంకే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. కాగా డీఎంకేనేతలు, సంబంధిత వ్యక్తుల నివాసాలపై వరుస ఐటీ దాడులు తమిళనాట కాక పుట్టించాయి. స్టాలిన్ అల్లుడు శబరీశన్ నివాసంలో ఆదాయ పన్ను శాఖ శుక్రవారం దాడులు చేపట్టింది. చెన్నై నగరానికి సమీపంలోని నీలాంగరాయ్‌లోని శబరీశన్ నివాసం, ఆయనకు చెందిన మరో నాలుగు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో డీఎంకే నేత సెంథిల్ బాలాజీ నివాసంలో ఆదాయపు పన్ను శాఖ దాడి నిర్వహించింది. -
బీజేపీ నేత వాహనంలో ఈవీఎం.. ఈసీ సంచలన నిర్ణయం
గువాహటి: అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో ప్రైవేట్ వాహనంలో ఈవీఎంను తరలించడం కలకలం సృష్టించింది. పోలింగ్ ముగిసిన తర్వాత స్ట్రాంగ్ రూమ్‌కు తరలించాల్సిన ఈవీఎంను ఓ బీజేపీ నాయకుడి వాహనంలో తీసుకు రావడం వివాదాస్పదంగా మారింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ఈసీ ఆ కేంద్రంలో రీపోలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. బీజేపీ నాయకుడి వాహనంలో ఈవీఎం తరలిస్తున్న దృశ్యాలకు సంబంధించని వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కరీంగంజ్ జిల్లాలోని రాతాబరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రతాబరి పరిధిలోని ఇందిరా ఎంవీ స్కూల్లో 149వ పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ పూర్తయిన తర్వాత సిబ్బంది బయలుదేరుతుండగా.. ఈసీ కేటాయించిన వాహనం చెడిపోయింది. అప్పటికే రాత్రి 9 గంటల కావడంతో సెక్టార్ ఆఫీసర్‌కు ప్రిసైడింగ్ అధికారి సమాచారం ఇచ్చారు. కొద్దిసేపటి తర్వాత ఓ ప్రయివేట్ వాహనంలో ఈవీఎంను స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు. దాని యజమాని ఎవరు అనేది పరిశీలించకుండా వాహనంలో ఎక్కారు. చివరకు ఆ వాహనాన్ని బీజేపీ అభ్యర్థి కృష్ణేందు పాల్ భార్య మధుమితా పాల్ భార్యదిగా ధ్రువీకరించారు. స్ట్రాంగ్ రూమ్ వద్దకు ఈవీఎంను చేర్చిన వాహానాన్ని బీజేపీ నేత భార్యదిగా గుర్తించిన ప్రతిపక్ష కార్యకర్తలు వాహనంపై దాడిచేశారు. రాళ్లు విసరడంతో వారి నుంచి తప్పించుకోడానికి పోలీసులు పరుగులు పెట్టారు. ఈ క్రమంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. ఆందోళనకారులను చెదరగొట్టడానికి భారీగా బలగాలను రప్పించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. వాహనంలోని సిబ్బందిని పోలీసులు సురక్షితంగా తరలించారు ఈ విషయాన్ని ఈసీ సీరియస్‌గా తీసుకుంది. ఆ కేంద్రంలో రీపోలింగ్ నిర్వహిస్తామని ప్రకటించింది. అంతేకాక ఈ ఘటనకు బాధ్యులైన నలుగురు అధికారులను సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై ప్రతిపక్షాలు మండి పడుతున్నాయి. బీజేపీ విజయం సాధించడం కోసం ఎంతకైనా దిగజారుతుంది అంటూ విమర్శిస్తున్నాయి. చదవండి: మట్టిలో పరుగులు తీసిన ప్రియాంక గాంధీ -
బీజేపీ నేత వాహనంలో ఈవీఎం..
-
అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళునాట ఐటి దాడుల కలకలం
-
ఎన్నికల వేళ, డీఎంకేకు ఐటీ వరుస షాక్స్
సాక్షి చెన్నై: తమిళనాడులోరానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డీఎంకే నాయకులపై వరుస ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. తాజాగా డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ అల్లుడి నివాసం ఇవాళ ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. స్టాలిన్ అల్లుడి శబరీశన్‌కు చెందిన నాలుగు ప్రదేశాల్లో శుక్రవారనం ఉదయం నుంచి సోదాలు జరుగుతున్నాయి. నీలంగరైలో ఉన్న ఇంట్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. స్టాలిన్ కూతురు సెంతమారై తన భర్త శబరీశన్‌తో పాటు అక్కడే నివసిస్తున్నారు. కాగా ఏప్రిల్ 6 న జరిగనున్న ఎన్నికలకు ముందు డీఎంకే నేతలు, పార్టీతో సంబంధం ఉన్న వారిపై జరిపిన దాడుల్లో ఇది రెండోసారి. ఇళ్లపై ఐటీ దాడులు జరగడం ఇది రెండవసారి.గత నెలలో డీఎంకే నేత ఈ వేలూ నివాసంతోపాటు 10 కి పైగా చోట్ల ఐటీశాఖ సోదాలు చేసిన విషయం తెలిసిందే. ప్రతిపక్షాలను బెదిరించేందుకు బీజేపీతో జతకలిసిన కూటమి పన్నిన పన్నాగమని, ఇది రాజకీయ కుట్ర అంటూ డీఎంకే నేతలు ఖండించారు. -
అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల్లో 18% నేరచరితులే
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం అసెంబ్లీలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతానికి జరుగుతున్న ఎన్నికల్లో పోటీకి దిగిన అభ్యర్థుల్లో 18శాతం మంది నేరచరిత్ర ఉన్నవారేనని ఎన్నికల హక్కుల సంస్థ అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తెలిపింది. బెంగాల్లో మూడో విడత ఎన్నికలు, మిగిలిన రాష్ట్రాల ఎన్నికల్లో ఇప్పటివరకు 6,792 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిస్తే వారిలో 6,318 మంది దాఖలు చేసిన అఫిడవిట్లను ఏడీఆర్ అధ్యయనం చేసింది. వారిలో 1,157 మంది (18%) నేర చరిత్ర ఉన్నట్టు నామినేషన్ సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్లలో పేర్కొన్నారు. 632 మందిపై తీవ్రమైన నేరాలకు పాల్పడినట్టుగా అభియోగా లున్నాయి. బెంగాల్లో మూడో విడత వరకు దాఖలైన నామినేషన్ల పరిశీలనలో 25% మంది నేరచరితులుంటే, 21% మందిపై తీవ్రమైన నేరారోపణలున్నాయి. తమిళనాడు లో 13%, కేరళలో 38%, అస్సాంలో 15%, పుదుచ్చేరిలో 17% మంది నేరచరితులు ఉన్నారు. -
ఓట్లు అమ్ముకుంటే మంచి నాయకులు ఎలా వస్తారు?
సాక్షి, చెన్నై: ఓటును నోటు, బిర్యానీకి, బాటిల్‌కు అమ్ముకుంటే..ఎలా మంచి నాయకుల్ని ఎదురు చూడగలమని మదురై ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. ఉచితా పథకాలతో సోమరితనం పెరిగినట్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఎన్నికల కమిషన్ ముందు 20 ప్రశ్నల్ని ఉంచి, సమాధానాలు ఇవ్వాల్సిందేనని న్యాయమూర్తి హుకుం జారీ చేశారు. మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనంలో కడయనల్లూరుకు చెందిన చంద్రమోహన్ వాసుదేవనల్లూరు నియోజకవర్గాన్ని జనరల్ కేటగిరి పరిధిలోకి తీసుకొచ్చే రీతిలో ఈసీని ఆదేశించాలని కోరుతూ గతంలో ఓ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ బుధవారం న్యాయమూర్తులు కృపాకరణ్, పుహలేంది బెంచ్ ముందుకు వచ్చింది. ఈసందర్భంగా ఇటు ప్రజ లకు, అటు రాజకీయపక్షాలకు, ఎన్నికల యంత్రాంగానికి చురకలు అంటించే రీతిలో, అక్షింతలు వేస్తూ న్యాయమూర్తులు తీవ్రంగా స్పందించారు. అమ్మేసుకుంటే ఎలా.. నోటుకు, కానుకలకు, బిర్యానీ, మందు బాటిళ్లకు ఓట్లను అమ్మేసుకుంటే, ఎలా మంచి నాయకులు సేవల్ని అందించేందుకు వస్తారని ప్రజల్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. సామాజిక సంక్షేమం, పేదరిక నిర్మూలన అంటూ ప్రకటించే ఉచిత పథకాలు ప్రజల్ని సోమరి పోతులుగా మార్చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత పథకాల వాగ్ధానాలు ఇచ్చే పార్టీలను నిషేధించ వచ్చుగా అని ఎన్నికల కమిషన్‌ను ప్రశ్నించారు. ప్రస్తుతం ఎన్నికల సమయం కావడంతో అనేక పార్టీలు ఇస్తున్న వాగ్దానాలు చూస్తుంటే, కళ్లు బైర్లు కమ్మేసుకున్నట్టుందని పేర్కొన్నారు. గృహిణిలకు నెలకు ఒకరు రూ. వెయ్యి ఇస్తామంటే, తాము రూ.1500 ఇస్తామంటూ పోటా పోటీగా హామీలను రాజకీయ పక్షాలు ఇచ్చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ చేసే వాళ్లకే తమ ఓటు అంటూ తమను తాము అవినీతి పరులుగా ప్రజలు చూపించుకుంటుండడం విచారకరంగా పేర్కొన్నారు. ఈసీకి 20 ప్రశ్నలు.. అనేక పార్టీలు ఇస్తున్న వాగ్దానాలు, చేస్తున్న ప్రకటనలు ఆచరణలో అమలు చేయలేని రీతిలో ఉన్నా యని న్యాయమూర్తులు అసహనం వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు స్థానిక సమస్యలు, స్థానిక ప్రగతి, అభివృద్ధి, విద్య, వైద్య, మౌలిక సదుపాయలపై దృష్టి పెడితే చాలు అని హితవు పలికారు. ఇటీవల తమిళనాడులో చిన్న చిన్న దుకాణాల్లోనూ ఉత్తరాది వాసులే అధికంగా పనుల్లో కనిపిస్తున్నారని పేర్కొంటూ, మున్ముందు వలసలు వచ్చిన వాళ్లు యజమానులుగా, ఇక్కడి వారు కూలీలుగా మారే పరిస్థితులు తప్పవేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. 20 ఏళ్లుగా ఉచితాలకే ప్రధాన్యత ఉంటూ వస్తున్నదని పేర్కొంటూ, ఎన్నికల కమిషన్ ముందు 20 ప్రశ్నల్ని న్యాయమూర్తులు ఉంచారు. 2013లో సుబ్రమణ్య బాలాజీ కేసులో ఇచ్చిన తీర్పు మేరకు ఉచిత వాగ్దానాలు, ఆచరణలో అమలు చేయలేని వాగ్దానాల క్రమబద్ధీకరణకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుందో స్పష్టం చేయాలని ప్రశ్నించారు. ఈ తీర్పును ఎన్నికల్లో ఏ మేరకు అమలు చేశారో, వాగ్దానాలు ఎన్నింటిని తిరస్కరించారా, పార్టీలు ఎలాంటి వాగ్దానాలు ఇచ్చాయో, అందులో ఏ మేరకు అమలయ్యేయో అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఉచితాల పేరిట ప్రజల్ని సోమరిపోతులుగా మార్చేస్తున్న పార్టీలకు నిషేధం విధించవచ్చుగా, గెలిచిన అభ్యర్థి అధికారంలోకి వచ్చాక, ఎన్ని వాగ్దానాల్ని సక్రమంగా నెరవేర్చాడో అనే ప్రశ్నల్ని అడుగుతూ వీటన్నింటికి వివరణ ఇవ్వాలని ఈసీని ఆదేశించారు. తర్వాత విచారణను ఏప్రిల్ 26వ తేదీకి వాయిదా వేశారు. -
చిదంబరం కోడలి వీడియోతో బీజేపీ ప్రచారం
సాక్షి, చెన్నై: కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం కోడలు, ఎంపీ కార్తీ చిదంబరం సతీమణి శ్రీనిధి భరత నాట్యం బీజేపీ ఎన్నికల ప్రచార అస్త్రంగా మారింది. బీజేపీ ప్రచార ట్విట్లో తన వీడియో కనిపించడంతో శ్రీనిధి తీవ్రంగా ఖండించారు. తమిళనాట ఎన్నికల ప్రచారం వేడెక్కి ఉన్న విషయం తెలిసిందే. సామాజిక మాధ్యమాల్లోనూ ప్రచారం సాగుతోంది. ఆ దిశగా బీజేపీ విడుదల చేసిన ప్రచార వీడియోలో ఓ మహిళ భరత నాట్యం చేస్తున్నట్టుగా సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైంది. అయితే, ఆ నాట్యం చేస్తున్న మహిళ కాంగ్రెస్ సీనియర్, మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం కోడలు శ్రీనిధి కావడంతో వివాదానికి దారి తీసింది. తన వీడియోను ఉపయోగించి బీజేపీ ప్రచారం చేయడాన్ని పరిశీలించిన ఆమె ఇది ఖండించ దగ్గ విషయంగా పేర్కొన్నారు. ఎన్ని ప్రయత్నాలు, కుస్తీలు పట్టినా, కమలంకు తమిళనాట చోటు లేదని, పాదం మోపడం కష్టతరమేని అదే ప్రచార ట్వీట్లో శ్రీనిధి కామెంట్లు పెట్టారు. అయితే, కొన్నేళ్ల క్రితం డీఎంకే అధికారంలో ఉన్న సమయయంలో జరిగిన సెమ్మోళి మహానాడులో చిత్రీకరించిన వీడియోగా ఆ నాట్య ప్రదర్శనను గుర్తించారు. దీనిని పరిశీలించకుండానే బీజేపీ వర్గాలు తమ ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకోవడం గమనార్హం. చదవండి: 66 ఏళ్ల ఆంటీ.. నోరు అదుపులో పెట్టుకో! -
నా మాటల్ని వక్రీకరించారు: రాజా
సాక్షి, చెన్నై: తన వ్యాఖ్యలను వక్రీకరించి బయటకు విడుదల చేశారని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్లకు డీఎంకే ఎంపీ రాజా వివరణ ఇచ్చారు. ఈ వ్యవహారంపై సమగ్ర, న్యాయబద్ధంగా విచారణ జరగాలని కోరారు. పెరంబలూరు ఎన్నికల ప్రచారంలో డీఎంకే ఎంపీ రాజా చేసిన వ్యాఖ్యలు దుమారానికి దారి తీసిన విషయం తెలిసిందే. సీఎం పళనిస్వామి, ఆయన తల్లిని కించపరిచే రీతిలో రాజా వ్యాఖ్యలు చేశారంటూ అన్నాడీఎంకే వర్గాలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. ఆయనపై చర్యకు పట్టుబడుతూ అన్నాడీఎంకే నేతృత్వంలో నిరసనలు సైతం సాగాయి. సీఎం పళనిస్వామి సైతం ఆయన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఎన్నికల ప్రచారంలో ఉద్వేగానికి లోనయ్యారు. సీఎం ఉద్వేగానికి గురికావడంతో మనసు నొప్పించి ఉంటే మన్నించండి అంటూ రాజా క్షమాపణలు కూడా చెప్పుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ వ్యవహారాన్ని తీవ్రంగానే పరిగణించిన ఎన్నికల కమిషన్ వివరణ కోరుతూ రాజాకు నోటీసులు జారీ చేసింది. న్యాయవాదితో వివరణ రాజా స్వయంగా వచ్చి ఈసీ సాహుకు వివరణ ఇస్తారన్న సంకేతాలు వెలువడ్డాయి. అయితే తన న్యాయవాది పచ్చయప్పన్ ద్వారా రాజా వివరణ లేఖను కేంద్ర, రాష్ట్ర కమిషన్లకు పంపించారు. అందులో తాను ఎన్నికల ఆదాయం కోసం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, ఎన్నికల నిబంధనల్ని ఉల్లంఘించ లేదని వివరించారు. తానేదో వ్యాఖ్యలు చేసినట్టుగా అన్నాడీఎంకే, బీజేపీలు తీవ్రంగా దుమారం రేపుతున్నాయని, వాస్తవానికి తన వ్యాఖ్యల్ని కత్తిరించి, వక్రీకరించి బయటకు వీడియోల రూపంలో విడుదల చేశారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర, న్యాయబద్ధంగా విచారణ జరిగితే, తాను ఏ తప్పు చేయలేదన్నది, వ్యాఖ్యలు చేయలేదనేది స్పష్టం అవుతోందన్నారు. సీఎం ఉద్వేగానికి గురయ్యారన్న సమాచారంతో ఒక వేళ తానేమైనా తప్పు చేశానా.. అని భావించి మనసు నొప్పించి ఉంటే మన్నించాలని క్షమాపణ కూడా కోరినట్టు గుర్తు చేశారు. అన్నాడీఎంకే వర్గాలు తనపై మోపిన ఆరోపణలకు సంబంధించిన ఫిర్యాదు నకలు అందించాలని, ఆ మేరకు పూర్తి వివరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు. -
నందిగ్రామ్‌లో దీదీ ఓటమి తథ్యం: సర్వే
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు మొదటి దశ పూర్తైన సంగతి తెలిసిందే. రెండో దశ ఎన్నికలు ఏప్రిల్ 1న జరగనున్నాయి. ఈ ఎన్నిక పట్ల బెంగాల్ వాసులతో పాటు దేశప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే రెండో దశ పోలింగ్‌లో మమతా బెనర్జీ పోటీ చేస్తున్న నందిగ్రామ్‌లో కూడా ఓటింగ్ జరగనుంది. పార్టీ నుంచి బయటకు వెళ్లి బీజేపీలో చేరిన సువేందు అధికారి నందిగ్రామ్‌లో మమతతో తలపడనున్నారు. దాంతో దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఆ సంగతి పక్కకు పెడితే గత రెండు మూడు రోజులుగా నందిగ్రామ్ ఫలితాలకు సంబంధించి రెండు, మూడు సర్వేలు బెంగాల్ సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. వీటి సారాంశం ఏంటంటే మమతా బెనర్జీ నందిగ్రామ్‌లో ఘోర పరాజయం చవి చూడబోతున్నారు. సువేందు దీదీని దారుణంగా ఓడించబోతున్నాడని సర్వేలు తెలిపాయి. ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏంటంటే ఈ సర్వేలన్నింటిని పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ సంస్థ ఐ పాక్ నిర్వహించిందనే వార్తలు జనాలను మరింత ఆశ్చర్యచకితులను చేశాయి. ఈ క్రమంలో ఐ పాక్ సంచలన ప్రకటన చేసింది. తమ సంస్థ నిర్వహించినట్లు చెప్పుకుంటున్న సదరు సర్వే ఫేక్ అని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఐపాక్ ‘‘గత కొద్ది రోజులుగా నందిగ్రామ్ ఓటింగ్‌కు సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న సర్వే ఫేక్. బీజేపీ నాయకులు, వారి హామీల్లానే ఈ సర్వే కూడా అవాస్తవం. ఇలాంటి ఫేక్ రిపోర్ట్స్‌ను ప్రచారం చేసి జనాలను ప్రభావితం చేయాలని భావిస్తున్నారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించవు. అసలు ఐ పాక్ డెస్క్ టాప్‌లను వినియోగించదు.. మరింత స్మార్ట్‌గా ఆలోచించండి’’ అంటూ ట్వీట్ చేసింది. Facing imminent defeat, @BJP4Bengal has now gone down to the level of using FAKE surveys in the name of I-PAC to keep the morale of their workers up!! P.S: In I-PAC, no one uses desktops so at-least be smart in your effort to create fake survey / reports! 😉🤣 pic.twitter.com/lFaOo0DshU — I-PAC (@IndianPAC) March 31, 2021 చదవండి: నేను పులి: ‘నందిగ్రామ్’లో మమతా బెనర్జీ గర్జన -
రాజాకీయాలు అంటే మురికిగుంట : కమల్ హాసన్
సాక్షి, చెన్నై: తనతో పాటు మక్కల్ నీది మయ్యంలోని ప్రతి ఒక్కరం పారిశుధ్య కార్మికులం అని, రాజకీయాల్లోని మురికిని కడిగేందుకే రంగంలోకి దిగినట్టు పార్టీ నేత కమలహాసన్ తెలిపారు. మంగళవారం చెన్నై వేళచ్చేరిలో పోటీ చేస్తున్న మక్కల్ నీది మయ్యం అభ్యర్థి, ఐఏఎస్ సంతోష్‌బాబుకు మద్దతుగా రోడ్‌షోను కమల్ నిర్వహించారు. వేళచ్చేరి పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఎంపిక చేసిన ప్రదేశాల్లో ఓటర్లతో మాట్లాడారు. రాజకీయాల్లో మురికిని కడిగేందుకే వచ్చా రాజకీయాలు అంటే మురికిగుంట అని పెద్దలు చెప్పే వారని గుర్తుచేశారు. అందుకే అనేక మంది చదువుకున్న పెద్దలు ఈ మురికిగుంటలో దిగేందుకు వెనక్కి తగ్గారని పేర్కొన్నారు. రాజకీయాలను అసహ్యించుకున్నారని తెలిపారు. ఈ మురికి అలాగే వదలివేయడంతో మరింత దుర్వాసన భరితంగా రాజకీయాలు మారినట్టు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ గుంటను ఎవరో ఒకరు శుభ్రం చేయాల్సిన అవసరం ఉందని గ్రహించే తాను రంగంలోకి దిగినట్టు తెలిపారు. రాజకీయం అనే మురికిగుంటను శుభ్రం చేయడానికి తనతో పాటు మక్కల్ నీది మయ్యం వర్గాలు అందరూ పారిశుధ్యకార్మికులుగా మారామని అన్నారు. రాజకీయం అనే మురికిని ఇకనైనా శుభ్రం చేయకుంటే, భావితరాలు ఈ తరం వారిని దుమ్మెత్తిపోస్తాయని పేర్కొన్నారు. జనం హితాన్ని కాంక్షించేందుకు వచ్చిన ఈ పారిశుధ్యకార్మికుల్ని ఆదరించాలని విన్నవించారు. తమను చూసి ఇతర పార్టీలు భయపడుతున్నాయని, అందుకే ఇరకాటంలో పెట్టే పరిస్థితుల్ని కల్పిస్తున్నా యని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తే లేదని, తమకు ప్రజల మద్దతు ఉందని ధీమా వ్యక్తం చేశారు. కమల్ పోటీచేస్తున్న కోయంబత్తూరు దక్షిణం నియోజకవర్గంలో మంగళవారం నటి సుహాసిని సుడిగాలి ప్రచారం చేశారు. అవినీతిశక్తులకు వ్యతిరేకంగా కమల్ ఉద్యమిస్తున్నారని, ఆ శక్తుల్ని అంతం చేయడానికి మక్కల్ నీది మయ్యంకు అండగా, మద్దతుగా ఓట్లు వేద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. చదవండి: రైల్వేశాఖ కీలక నిర్ణయం: రైళ్లలో సెల్ ఛార్జింగ్ బంద్ -
West Bengal Election 2021: ‘నందిగ్రామ్’ పోరు రసవత్తరం
సాక్షి, న్యూఢిల్లీ: దశాబ్దాల వామపక్ష పాలనకు చరమగీతం పాడుతూ, మమతా బెనర్జీని అధికార పీఠంపై కూర్చోపెట్టడంలో కీలకంగా మారిన నందిగ్రామ్.. 14 ఏళ్ల తర్వాత మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో కేంద్ర బిందువైంది. పశ్చిమ బెంగాల్లో మొదటి దశ పోలింగ్ తరువాత ఇప్పుడు అందరి దృష్టి నందిగ్రామ్‌పైనే ఉంది. ఎందుకంటే ఏప్రిల్ 1న రాష్ట్రంలో జరిగే రెండో దశ ఎన్నికలలో బంకురా, పశ్చిమ మేదినీపూర్, తూర్పు మేదినీపూర్, దక్షిణ 24 పరగణాల పరిధిలోని నాలుగు జిల్లాలలో కలిపి 30 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలింగ్ జరుగనుంది. ఈ దశలో హాట్ టాపిక్‌గా మారిన నందిగ్రామ్ నుంచి బీజేపీ అభ్యర్థి సువేందు అధికారిపై సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్నారు. నందిగ్రామ్‌లోనే మకాం వేసిన సువేందును ఢీకొట్టేందుకు టీఎంసీ అభ్యర్థి, సీఎం మమతా బెనర్జీ సోమ, మంగళవారాల్లో రెండు రోజుల వ్యవధిలో 6 ర్యాలీల్లో పాల్గొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనే పట్టుదలతో ఉన్న బెనర్జీ నందిగ్రామ్‌లో ఒక ఇంటిని కూడా అద్దెకు తీసుకొని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. మరోవైపు సువేందు అధికారి తరఫున కమలదళం తరపున హోం మంత్రి అమిత్ షా మంగళవారం భారీ రోడ్‌షో నిర్వహించారు. పరస్పరం తీవ్ర ఆరోపణలు ఏప్రిల్ 1వ తేదీన పోలింగ్ జరుగబోయే నందిగ్రామ్‌లో ప్రచారపర్వం మంగళవారం సాయంత్రంతో ముగిసింది. నందిగ్రామ్‌లో పోటీ చేస్తున్న మమతా బెనర్జీని కనీసం 50 వేల ఓట్ల తేడాతో ఓడిస్తానని, లేనిపక్షంలో రాజకీయాలను విడిచి పెడతానని సువేందు అధికారి ప్రతిజ్ఞ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఒక ర్యాలీలో సువేందు, అతని తండ్రి శిశిర్, సోదరుడు సౌమేందులు విషసర్పాలుగా మారుతారనే విషయం తనకు అర్థం కాలేదని దీదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కీలకంగా ఆ ముగ్గురు నేతలు నందిగ్రామ్‌లో సువేందు హిందుత్వ ఎజెండాతో హిందూ ఓట్ల ఏకీకరణే లక్ష్యంగా దూసుకెళ్తుండగా, మమతా బెనర్జీ తన అభివృద్ధి పనులతో పాటు, అధికారి కుటుంబాన్ని టార్గెట్‌గా చేసుకొని ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ జనాభాలో 30 శాతం ఉన్న ముస్లిం ఓట్లు తమకే పడతాయని దీదీ నమ్మకంతో ఉన్నారు. 2016లో టీఎంసీ టికెట్‌తో 68 వేల ఓట్లతో సువేందు గెలిచారు. అయితే పోలింగ్‌కు ఇంకా కొద్ది రోజులు మాత్రమే సమయం ఉండడంతో బీజేపీ, టీఎంసీలు స్థానికంగా పేరున్న నాయకులు సుఫియాన్ షేక్, అబూ తాహెర్, మేఘనాథ్ పాల్‌లకు సంబంధించిన సమస్యలపై పోరాడుతున్నాయి. ఒక సమయంలో ఈ ముగ్గురు నాయకులు సువేందుకు చాలా దగ్గరగా ఉండేవారు. మారిన పరిణామాల నేపథ్యంలో అబూ తాహెర్, సుఫియాన్ షేక్ మమతా బెనర్జీకి అండగా నిలబడగా, మేఘనాథ్ పాల్ సువేందుతో కొనసాగుతున్నారు. అయితే సువేందుకు వీరిద్దరు దూరమైన తర్వాత తాహెర్, షేక్‌లపై కొనసాగుతున్న కేసులపై దర్యాప్తు జరపాలంటూ ఇటీవల కోర్టులో పిటిషన్ దాఖలైంది. మరోవైపు మేఘనాథ్ పాల్ ఇంట్లో సువేందు గుండాలు దాక్కున్నారని ఆరోపిస్తూ టీఎంసీ ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ ముగ్గురు స్థానిక నాయకులు నందిగ్రామ్‌లో ఎవరు గెలవాలన్న అంశంపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తారు. ఉద్ధండులు వర్సెస్ ఫైర్‌బ్రాండ్ మరోవైపు ఇద్దరు ఉద్ధండులను ధీటుగా ఎదుర్కొనేందుకు వామపక్షాలు ఫైర్ బ్రాండ్‌గా పేరున్న డివైఎఫ్ నాయకురాలు మీనాక్షి ముఖర్జీని బరిలోకి దింపాయి. ఆమె ఒకప్పుడు వామపక్షాల కంచుకోట అయిన నందిగ్రామ్‌లో తిరిగి ఎర్రజెండా రెపరెపలాడించేందుకు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రచారాన్ని చేస్తున్నారు. ఇటీవల సౌతఖాలీ, గార్చక్రబేరియా, కాళిచరణ్, సోనాచురా బజార్, తఖాలీ వంటి ప్రాంతాల్లో మీనాక్షి ప్రచార ర్యాలీలు చేపట్టారు. అంతేగాక 2011లో వామపక్ష కూటమి ప్రభుత్వం పడిపోవడానికి కారణమైన నందిగ్రామ్ భూసేకరణ అంశాన్ని అప్పుడు వ్యతిరేకించిన భూమి ఉచ్చేద్ ప్రతిరోధ్ కమిటీలోని ప్రముఖులు మీనాక్షికి మద్దతు ఇస్తున్నారు. బెంగాల్, అస్సాంలలో ముగిసిన ప్రచారం కోల్‌కతా/గువాహటి: పశ్చిమబెంగాల్, అస్సాంలలో ఏప్రిల్ ఒకటో తేదీన జరగనున్న రెండో దశ పోలింగ్‌కు మంగళవారం సాయంత్రంతో ప్రచారం ముగిసింది. అస్సాం అసెంబ్లీలోని 126 సీట్లకుగాను 39 స్థానాలకు, బెంగాల్‌లోని 284 నియోజకవర్గాలకు గాను 30 చోట్ల ఏప్రిల్ ఒకటో తేదీన పోలింగ్ జరగనుంది. అస్సాంలో రెండోదశలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్న 345 మంది అభ్యర్థుల్లో 174 మంది స్వతంత్రులున్నారు. మొత్తం 345 మందిలో 37 మందికి నేర చరిత్ర ఉండగా అందులో 30 మందిపై తీవ్ర నేరారోపణలున్నాయి. నేర చరితుల్లో బీజేపీకి చెందిన 11 మంది, కాంగ్రెస్, ఏఐయూడీఎఫ్‌కు చెందిన ఐదుగురు చొప్పున ఉండటం గమనార్హం. అదేవిధంగా, బెంగాల్‌లోని నాలుగు జిల్లాల్లో రెండోదశ పోలింగ్ జరిగే 30 నియోజకవర్గాల్లో 171 మంది బరిలో నిలిచారు. పోలింగ్ బందోబస్తు కోసం 651 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసులను రంగంలోకిదించారు. -
మేనిఫెస్టో.. ఫింఛన్ రూ. 5 వేలు
సాక్షి, చెన్నై: అధికారంలోకి వస్తే గృహిణులకు ప్రతినెలా రూ. వెయ్యి ఆర్థిక సాయం అందించనున్నట్టు పుదుచ్చేరి కాంగ్రెస్ ప్రకటించింది. అలాగే, 10,12 తరగతుల విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందించనున్నారు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కాంగ్రెస్, డీఎంకే, వీసీకే, సీపీఐలు కూటమిగా ఎన్నికల్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. 30 స్థానాల్లో కాంగ్రెస్ 15 చోట్ల, డీఎంకే 13, మిగిలిన రెండు పార్టీలు తలా ఓ చోట అభ్యర్థులను నిలబెట్టాయి. ఈ పరిస్థితుల్లో తాము అధికారంలోకి వస్తే చేపట్టనున్న పథకాలను వివరిస్తూ సిద్ధం చేసిన మేనిఫెస్టోను మాజీ సీఎం నారాయణస్వామి, కాంగ్రెస్ సీనియర్ వీరప్పమొయిలీ ఆదివారం పుదుచ్చేరిలో విడుదల చేశారు. ఇందులోని ఉచిత పథకాలు అనేకం ప్రకటించారు. ఫింఛన్ రూ.5వేలు.. కుటుంబకార్డు కల్గిన గృహిణులకు నెలకు రూ. వెయ్యి నగదు సాయం అందించనున్నట్టు ప్రకటించారు. వృద్ధులు, వితంతువులు, ఆదరణ లేని వారికి, దివ్యాంగులకు అందిస్తున్న పింఛన్ దశల వారీగా రూ.5వేల వరకు పెంచనున్నారు. 10, 12వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లను పంపిణీ చేయనున్నారు. ప్రతినెలా రేషన్ దుకాణాల ద్వారా బియ్యం, చక్కెర, పప్పు దినుసుల్ని సక్రమంగా అందించనున్నారు. పుదుచ్చేరిలో మూతపడి ఉన్న మిల్లులను మళ్లీ పునరుద్ధరిస్తామని ప్రకటించారు. పుదుచ్చేరికి రాష్ట్ర హోదా లక్ష్యంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని, నీతి ఆయోగ్‌లో పుదుచ్చేరికి చోటు దక్కే రీతిలో చర్యలు తీసుకుంటామని వివరించారు. విద్య నిమిత్తం ప్రత్యేక బోర్డు ఏర్పాటు, విద్యార్థులకు రోజుకు 2జీబీ చొప్పున నెలకు 60 జీబీల డేటా ఉచితంగా అందించనున్నామని ప్రకటించారు. ఇలా మరికొన్ని ఉచిత పథకాలను సైతం ఇందులో పొందు పరిచారు. 74 మంది కోటీశ్వర్లు.. పుదుచ్చేరిలో వివిధ పార్టీలకు చెందిన 74 మంది కోటీశ్వరులు ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. పుదుచ్చేరిలోని 30 అసెంబ్లీ స్థానాలకు వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు అంటూ 324 మంది పోటీలో ఉన్నారు. ఇందులో ఓ స్వతంత్ర అభ్యర్థి అఫిడవిట్ సరిగ్గా లేదు. మిగిలిన 323 మంది అభ్యర్థులు సమర్పించిన ప్రమాణ పత్రాల మేరకు 74 మంది కోటీశ్వర్లు పోటీలో ఉన్నారు. 2016 ఎన్నికల్లో 96 మంది కోటీశ్వర్లు పోటీ చేయగా, ప్రస్తుతం ఆ సంఖ్య తగ్గింది. ఇక, పోటీలో ఉన్న 84 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు అనేకం విచారణంలో ఉండడం గమనార్హం. -
నా కుమారుడి ప్రసంగాలు చూసి నేనే ఆశ్చర్యపోయా!
సాక్షి, చెన్నై: తన కుమారుడు ఉదయనిధి ఏ రంగంలోనైనా రాణించగలడని దుర్గా స్టాలిన్ వ్యాఖ్యానించారు. చేపాక్కం – ట్రిప్లికేన్ నియోజకవర్గంలో ఉదయనిధి పోటీ చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా తల్లి దుర్గా స్టాలిన్ ప్రచారానికి సిద్ధం అయ్యారు. స్టాలిన్ పోటీ చేస్తున్న కొళత్తూరులో ఆమె పర్యటిస్తున్నారు. కొందరు మహిళతో కలిసి ఇంటింటా వెళ్లి కరపత్రాలు అందిస్తూ స్టాలిన్‌ను ఆదరించాలని, గెలిపించాలని విన్నవిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆదివారం ఆమెను మీడియా చుట్టుముట్టి ప్రశ్నల్ని అడగ్గా, సమాధానాలు ఇచ్చారు. అది పార్టీ నిర్ణయం.. ఉదయ నిధి రాజకీయాల్లోకి రావడమే కాదు, చేస్తున్న ప్రసంగాలను చూసి తానే ఆశ్చర్యానికి లోనయ్యానని పేర్కొన్నారు. తన కుమారుడికి సీటు ఇవ్వాలని స్టాలిన్‌ను తాను కోరలేదని, అది పార్టీ తీసుకున్న నిర్ణయం అని తెలిపారు. తన బిడ్డ రాజకీయాల్లో రాణిస్తాడని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అధికారంలోకి వస్తే ఉదయనిధికి మంత్రి పదవి గ్యారంటీ అన్నట్టుందే అని ప్రశ్నించగా, అది పార్టీ తీసుకునే నిర్ణయం మేరకు ఉంటుందన్నారు. స్టాలిన్ గెలుపు కోసమే కాదు, డీఎంకే కూటమిలోని అందరు అభ్యర్థుల గెలుపు కోసం తాను పూజలు చేస్తున్నానని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. చదవండి: ‘ఇటుక’ చుట్టూ తమిళ రాజకీయం.. ఉదయనిధిపై ఫిర్యాదు -
మమత ఆడియో కలకలం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆమె మాట్లాడినట్లుగా చెబుతున్న ఓ ఆడియో క్లిప్‌ను ప్రతిపక్ష బీజేపీ శనివారం విడుదల చేసింది. నందిగ్రామ్‌కు చెందిన బీజేపీ నేత ప్రళయ్ పాల్‌తో ఆమె మాట్లాడినట్లు, మళ్లీ తృణమూల్ కాంగ్రెస్‌లో చేరాలని, తన గెలుపునకు సహకరించాలని అభ్యర్థిస్తున్నట్లుగా ఈ ఆడియోలో ఉండడం కలకలం రేపుతోంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నందిగ్రామ్ స్థానం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక్కడ ఆమెపై బీజేపీ అభ్యర్థిగా సువేందు అధికారి బరిలోకి దిగుతున్నారు. ఇద్దరూ బలమైన అభ్యర్థులే కావడంతో నందిగ్రామ్‌పై అందరి దృష్టి పడింది. ప్రళయ్ పాల్ గతంలో తృణమూల్ కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా పనిచేశాడు. సువేందు అధికారితో కలిసి బీజేపీలో చేరాడు. ప్రళయ్ పాల్‌తో మమతా బెనర్జీ వ్యక్తిగతంగా మాట్లాడినట్లు బీజేపీ చెబుతోంది. ఆడియో క్లిప్‌లో ఏముందంటే.. ‘నందిగ్రామ్‌లో నేను నెగ్గడానికి సహకరించు. నీకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని నాకు తెలుసు. ఇకపై నీకు ఏం కావాలన్నా నేను చూసుకుంటా’’ అని మమత హామీ ఇవ్వగా, ప్రళయ్ పాల్ స్పందిస్తూ.. ‘‘దీదీ (అక్కా).. మీరు నాకు ఫోన్ చేశారు. అది చాలు. సువేందు అధికారికి ద్రోహం చేయలేను’ అని పేర్కొన్నాడు. ఈ ఆడియో విషయంలో ప్రళయ్ పాల్ మీడియాతో మాట్లాడాడు. ప్రస్తుతం బీజేపీ కోసం పనిచేస్తున్నానని, ఆ పార్టీని మోసం చేయలేనని అన్నాడు. ఎలక్టోరల్ అధికారికి బీజేపీ ఫిర్యాదు మమతా బెనర్జీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, తమ పార్టీ నేతలను ప్రలోభాలకు గురి చేస్తున్నారని బీజేపీ ఆరోపించింది. బీజేపీ ప్రధాన కార్యదర్శి ౖMðలాశ్ విజయ్ వర్గీయా నేతృత్వంలో ఓ బృందం బెంగాల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌ను కలిసింది. ఆడియో క్లిప్‌ను అందజేసింది. ఈ ఆడియో క్లిప్ వాస్తవికతపై తృణమూల్ కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేసింది. ప్రళయ్ పాల్ గతంలో తమ పార్టీ నాయకుడేనని, అతడితో మాట్లాడి, సాయం కోరితే తప్పేముందని ఆ పార్టీ నేత కునాల్ ప్రశ్నించారు. రాజకీయాల్లో ఇదంతా సహజమేనని తేల్చిచెప్పారు. -
అసెంబ్లీ ఎన్నికలు: చరిత్ర పునరావృతమే!
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఎన్నికల్లో గెలవడమే లక్ష్యం. అది అసాధ్యమని తేలితే కనీసం ప్రత్యర్థి గెలుపు అవకాశాలు దెబ్బతీయాలని అభ్యర్థులు ఆశించడం రాజకీయాల్లో సహజం. ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే, డీఎంకే కూటముల విజయావకాశాలను దెబ్బతీయడం కోసమే అన్నట్లుగా కొన్ని పార్టీలు రంగంలో ఉన్నాయి. ఈ పార్టీలు ఏ కూటమికి కంటకంగా మారాయి, ఏ అభ్యర్థి గెలుపును ఎంత వరకు దెబ్బతీస్తాయని విశ్లేషించుకోక తప్పదు. అప్పుడు కాంగ్రెస్ హవా ఉమ్మడి మద్రాసు రాష్ట్రం (తమిళనాడు)లో 1952, 1957, 1962 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ వరుసగా మూడుసార్లు గెలుపొంది హ్యాట్రిక్ సాధించినా ఆ దూకుడుకు డీఎంకే అడ్డుకట్టవేసింది. 1967లో జరిగిన ఎన్నికల్లో తొలిసారిగా కాంగ్రెస్‌ను ఓడించి డీఎంకే అధికారంలోకి వచ్చింది. ఇక ఆ తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ ఒంటరిగా తల ఎత్తుకు తిరిగే పరిస్థితినే కోల్పోయేలా చేసిన ఘనత డీఎంకేకు మాత్రమే దక్కుతుంది. 1967 నాటి డీఎంకే చారిత్రాత్మక గెలుపుతో అన్నాదురై ముఖ్యమంత్రి అయ్యారు. కరుణానిధి- ఎంజీ రామచంద్రన్ మధ్య విభేదాలు అన్నాదురై మరణం తరువాత 1971లో వచ్చిన ఎన్నికల్లో సైతం డీఎంకే ఘనవిజయం సాధించగా ఆపార్టీ అధ్యక్షులు కరుణానిధి సీఎం పీఠం అధిరోహించారు. కరుణానిధితో అభిప్రాయబేధాలు వచ్చి పార్టీ నుంచి బయటకు వచ్చిన ఎంజీ రామచంద్రన్ 1972 అక్టోబర్ 17న అన్నాడీఎంకేను స్థాపించారు. 1977లో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో పార్టీని అధికారంలోకి తెచ్చారు. ఎంజీఆర్ విజయపరంపర 1980, 1984 ఎన్నికల్లో సైతం కొనసాగింది. తన 70 ఏళ్ల వయసులో 1987 డిసెంబర్ 24వ తేదీన ఎంజీఆర్ కన్నుమూసిన తరువాత పార్టీ చీలిపోగా, 1989 ఎన్నికల్లో డీఎంకే మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఎంజీఆర్ కన్నుమూసిన తరువాత జయలలిత పార్టీ పగ్గాలు చేపట్టి కరుణానిధిని గట్టిగా ఢీకొట్టడం ప్రారంభించారు. 1991- 2016 వరకు వారిద్దరే 1991లో జయలలిత, 1996లో కరుణానిధి, 2001లో జయలలిత, 2006లో కరుణానిధి, 2011లో జయలలిత ఒకరు సీఎం అవుతూ వచ్చారు. అయితే 2016లో వచ్చిన ఎన్నికల్లో జయలలిత వరుసగా రెండోసారి గెలుపొంది అనాధిగా వస్తున్న ఆనవాయితీకి అడ్డుకట్ట వేశారు. ఎంజీఆర్ జీవించి ఉన్నత వరకు అధికారానికి దూరంగా ఉండక తప్పనిపరిస్థితిని ఎదుర్కొన్న డీఎంకే ఆ తర్వాత మాత్రమే గెలుపు బాటలోకి ప్రయాణించడం ప్రారంభించింది. ఎంజీఆర్‌తో సమానంగా జయలలిత కూడా కరుణకు పోటీగా నిలిచారు. ఇక రాజకీయాల్లో బలశాలులైన జయ, కరుణ ఇద్దరూ కన్నుమూసిన తర్వాత ఆ రెండు పార్టీలు తొలి అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటున్నాయి. తమిళనాడులో 1952 నుంచి ఇప్పటి వరకు 15 అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలన్నీ అనేక ప్రత్యేక ప్రాతిపధికలతో పోటీకి దిగి విజయం సాధించాయి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మూడో పార్టీకి అవకాశం లేకుండా పోయింది. ఎంజీఆర్ మరణం తర్వాత 1989లో జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే జయలలిత వర్గం, జానకి వర్గంగా విడిపోయింది. ఈ సమయంలో తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఉండిన జీకే మూపనార్ మూడో కూటమిని ఏర్పాటు చేశారు. అయినా, ఆనాటి ఎన్నికల్లో డీఎంకేనే విజయం సాధించింది. 1996లో డీఎంకే నుంచి విడిపోయిన వైగో ఎండీఎంకేను స్థాపించి మూడో అతిపెద్ద పార్టీగా మార్చే ప్రయత్నం చేశారు. అదే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి విడిపోయిన జీకే మూపనార్ తమిళ మానిల కాంగ్రెస్ పార్టీని ప్రారంభించి డీఎంకేతో కూటమిగా ఏర్పడ్డారు. రజనీకాంత్ పరోక్ష మద్దతుతో ఈ కూటమి అప్పటి ఎన్నికల్లో విజయం సాధించింది. మూడో అతిపెద్ద పార్టీగా ఏర్పడాలనే లక్ష్యంతో అన్నాడీఎంకే, డీఎంకే తరువాత మూడో అతిపెద్ద పార్టీగా ఏర్పడాలనే లక్ష్యంతో నటుడు విజయకాంత్ డీఎండీకేను స్థాపించి తొలి ఎన్నికల్లో తాను మాత్రమే గెలుపొందారు. 2011 ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తుపెట్టుకుని పెద్ద సంఖ్యలో సీట్లు గెలుచుకున్నారు. అయితే ఆ తరువాత అమ్మతో విభేదించగా, 2016 ఎన్నికల్లో విజయ్‌కాంత్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెట్టి వైగో నాయకత్వంలో ఏర్పడిన ప్రజాసంక్షేమ కూటమి ఘోర ఓటమి చవిచూసింది. ఇలా రాష్ట్ర రాజకీయల చరిత్రలో అన్నాడీఎంకే, డీఎంకే ఢీకొనే ఏ కూటమి మనుగడ సాగించలేదు. అధికారంలో ఆ రెండింటిలో ఒకటే.. ఇదిలా ఉండగా, 1967 నుంచి 2016 వరకు వచ్చిన అన్ని అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకే మధ్యనే ప్రధాన పోటీ ఉంటోంది. తాజా ఎన్నికలోల్ సైతం అదే పరిస్థితి కొనసాగుతోంది. అన్నాడీఎంకే, డీఎంకే రెండు కూటములకు పోటీగా మరో మూడు కూటములు ఏర్పడ్డాయి. ఐజేకే నేతృత్వంలో ఏర్పడ్డ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా కమల్ హాసన్, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ సైతం ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఇక నామ్ తమిళర్ కట్చి అధ్యక్షుడు సీమాన్ మరో కూటమి ఏర్పాటు చేసుకున్నారు. కాగా, కమల్ కూటమి ఒంటరిగా ఎదుర్కొంటున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవి. సీమాన్‌కు రెండో అనుభవం. ఈ మూడు కూటములు అన్నాడీఎంకే, డీఎంకే కూటముల ఓట్లను చీల్చడం ద్వారానే గెలుపు బాటలో ప్రయాణిస్తామని విశ్వసిస్తున్నాయి. అన్నాడీఎంకే ఓటు బ్యాంకుపై దినకరన్ గురిపెట్టారు. అన్నాడీఎంకే, డీఎంకేకు ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూసే ఓటర్లను కమల్, సీమాన్ నమ్ముకున్నారు. కొత్తగా బరిలో ఉన్న కూటముల అభ్యర్థుల గెలుపు సంగతి అటుంచితే ప్రత్యర్థుల ఓట్లను చీల్చి మెజార్టీ లేదా గెలుపు అవకాశాలకు గండికొట్టడం ఖాయమని భావించవచ్చు. చదవండి: సీఎంని స్టాలిన్ చెప్పుతో పోల్చిన నాయకుడు -
ఆడాళ్లు డ్రమ్ముల్లా మారుతున్నారు: డీఎంకే నేత
సాక్షి, చెన్నై: మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు కొంతమంది ప్రబుద్ధులు. సామాన్యుల సంగతి పక్కన పెడితే.. ప్రజాప్రతినిధులు సైతం ఇందుకు అతీతులు కారు. సభల్లో, పార్లమెంట్, అసెంబ్లీ వేదికగా స్త్రీల వస్త్రధారణ గురించి ఇష్టారీతిన మాట్లాడి వివాదానికి కారణమైన వారు చాలా మందే ఉన్నారు. తాజాగా వీరి జాబితాలోకి డీఎంకే నాయకుడు ఒకరు చేరారు. విదేశీ ఆవు పాలు తాగుతూ మన ఆడవాళ్లు డ్రమ్ముల్లా మారుతున్నారంటూ మహిళల శరీరాకృతి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై ఇతర పార్టీల నాయకులు, మహిళా సంఘాల నేతలు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఆ వివరాలు.. డీఎంకే పార్టీ నాయకుడు దిండిగుల్ లియోని అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం లియోని, కార్తికేయ శివసేనాపతి అనే అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తూ.. మహిళల శరీరాకృతి గురించి అసభ్యకరంగా మాట్లాడారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇందులో.. ‘‘ప్రస్తుతం చాలా రకాలు ఆవులున్నాయి. ఫామ్‌లలో మీరు విదేశీ ఆవులను చూసే ఉంటారు. వీటి పాలను పితకడానికి మెషిన్లను వాడతారు. ఒక్కసారి స్విచ్ వేస్తే.. మెషిన్ గంటలో 40 లీటర్ల పాలు పితుకుంది. ఈ రోజుల్లో మహిళలు ఎక్కువగా ఈ విదేశీ ఆవుల పాలు తాగుతున్నారు. అందుకే వారి శరీరాకృతి మారి.. డ్రమ్ముల్లా తయారవుతున్నారు. గతంలో మహిళలు ‘8’ ఆకారంలో ఉండేవారు. పిల్లల్ని అలవోకగా ఎత్తుకునే వారు. కానీ ఇప్పుడు ఎవరూ అలా కనిపించడం లేదు. లావుగా అయ్యి పిల్లలను ఎత్తుకోలేకపోతున్నారు. దానికి కారణం విదేశీ ఆవు పాలు తాగడమే’’ అంటూ ఇష్టారీతిన ప్రసంగిస్తూ పోయాడు. What a shame.. what milk does he drink? Does he know what happens to women’s body post pregnancy or during hormonal changes? @KanimozhiDMK what do you like to say to this kind of male chauvinist? Is this the respect your party people have on women. https://t.co/7yMf5esqX0 — Gayathri Raguramm (@BJP_Gayathri_R) March 24, 2021 లియోని పక్కనే ఉన్నవారు అతడిని ఆపేందుకు ప్రయత్నించారు. విషయాన్ని పక్కదోవ పట్టించడం కోసం రేషన్ సరఫరాపై మాట్లాడాల్సిందిగా లియోనికి సూచించారు. అతడు కాసేపు దాని మీద ప్రసంగించి మళ్లీ టాపిక్‌ను ఆడవారి వద్దకే తెచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్ల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు సైతం తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి. కాగా గతంలోనూ లియోని అనేక సార్లు మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
సీఎంని స్టాలిన్ చెప్పుతో పోల్చిన నాయకుడు
చెన్నై: మరో రెండు వారాల్లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో పార్టీలన్ని ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నాయి. తాజాగా, ముఖ్యమంత్రి పళనిస్వామిపై కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే నేత రాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘సీఎం పళనిస్వామి.. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ కాలికి వేసుకున్న చెప్పు పాటి విలువ కూడా చేయరు’ అంటూ రాజా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతున్నాయి. ‘ఒకప్పుడు బెల్లం మార్కెట్లో కూలీగా పనిచేసి పళనిస్వామికి స్టాలిన్‌తో పోటీయా.. పళని కంటే స్టాలిన్ వేసుకునే చెప్పుకు విలువ ఎక్కువ.. అలాంటిది తనకు స్టాలిన్నే సవాల్ చేసే ధైర్యం ఉందా. నెహ్రూ, ఇందిరా గాంధీ, మోదీ సైతం చేయలేని సాహసం పళనిస్వామి చేస్తున్నాడంటే అందుకు కారణం డబ్బు. రాష్ట్రాన్ని లూటీ చేసిన తనను పార్టీని రక్షిస్తుందని భావిస్తున్నాడు. అటువంటి వ్యక్తి స్టాలిన్‌ను అడ్డుకుంటాను అంటున్నాడు. అదే జరిగితే సీఎం వాహనం తన నివాసం నుంచి కార్యాలయానికి వెళ్లదని నేను సవినయంగా మనవిజేస్తున్నాను’ అన్నాడు రాజా. డీఎంకే నేత రాజా చేసిన వ్యాఖ్యలను తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నారు పళనిస్వామి. తాను ఒక రైతునని, పేద కుటుంబం నుంచి వచ్చానని, అందువల్ల వినయంగా ఉంటానంటూ ప్రజల్లో తన మీద సానుభూతి పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే క్రమంలో 2జీ స్పెక్ట్రం కుంభకోణాన్ని ప్రస్తావించిన సీఎం.. కంటికి కనిపించని గాలితో కూడా కుంభకోణాలు చేసిన ఏకైక పార్టీ డీఎంకే అని ధ్వజమెత్తారు. ఈ క్రమంలో మదురై జిల్లా మెలూర్‌లోని ఎన్నికల ప్రచారంలో పళనిస్వామి మాట్లాడుతూ..‘నేను కష్టపడి ముఖ్యమంత్రి స్థాయికి వచ్చాను. కానీ స్టాలిన్ తండ్రి సీఎంగా ఉన్నందున ఆయన సిల్వర్ స్పూన్‌తో పుట్టారు. రాజా మాట్లాడిన భాష ఎలా ఉందో చూడండి.. నా విలువ స్టాలిన్ ధరించే చెప్పు కన్నా తక్కువని.. పొగరుగా మాట్లాడుతున్నారు. ఒక ముఖ్యమంత్రిని చెప్పుతో పోల్చి వారు ఎంతటి సంస్కారహీనులో నిరూపించుకున్నారు. నేను ఒక రైతును, మా పేదలు అలానే ఉంటారు.. మేము కష్టపడి పనిచేస్తాం.. మేం కొనుక్కోగలిగింది మాత్రమే కొనుగోలు చేస్తాం... కానీ వారు రూ. 1.76 లక్షల కోట్ల అవినీతి కుంభకోణం వెనుక ఉన్నారు. కాబట్టి కోరుకున్నది కొనుక్కుంటారు’ అంటూ పళనిస్వామి రాజాకు కౌంటర్ ఇచ్చారు. చదవండి: కింది స్థాయి నుంచి వచ్చా..: సీఎం -
గడ్డాలు పెంచడం, పేర్లు మార్చడమే తెలుసు: సీఎం ఫైర్!
కోల్‌కతా: అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ సమీపించిన వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శల వర్షం కురిపించారు. గడ్డాలు పెంచడం, స్టేడియాల పేర్లు మార్చడమే తప్ప పారిశ్రామిక అభివృద్ధి చేతకాదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై కూడా విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ మేరకు శుక్రవారం నాటి ప్రచారంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ‘‘వారికి రెండు సిండికేట్లు ఉన్నాయి. ఒకరు.. ఢిల్లీ, గుజరాత్, యూపీలో అల్లర్లు చెలరేగేందుకు ప్రోత్సహిస్తారు.. ఇక మరొకరు పారిశ్రామిక అభివృద్ధిని కుంటుపడేలా చేసి గడ్డం పెంచుతూ ఉంటారు. ఒక్కోసారి.. గాంధీజీ, రవీంద్రనాథ్ ఠాగోర్ కంటే తానే గొప్ప వాడినని భావిస్తారు. మరోసారి తనను తాను స్వామి వివేకానంద అని చెప్పుకొంటారు. మైదానాలకు తన పేరు పెట్టుకుంటారు. ఏదో ఒకరోజు దేశానికే తన పేరు పెట్టుకుని, అమ్మేసినా అమ్మేస్తారు. నాకెందుకో వారి మెదడులోనే ఏదో సమస్య ఉందని అనిపిస్తుంది. బహుశా స్క్రూ లూజ్ అయి ఉంటుంది’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా గతంలోనూ మమత ఇదే తరహాలో ప్రధాని మోదీని విమర్శించారు. ‘‘గుజరాత్‌లోని స్టేడియానికి ప్రధాన మంత్రి తన పేరు పెట్టుకున్నారు. కోవిడ్-19 వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై తన ఫొటోలు వేయించుకుంటున్నారు. అంతేకాదు తన ఛాయాచిత్రాన్ని అంతరిక్షంలోకి పంపేందుకు ఇస్రోతో మాట్లాడారు. ఇలాగే చూస్తూ ఉంటే, దేశానికి తన పేరు పెట్టుకుంటారు’’ అని మండిపడ్డారు. ఇక పశ్చిమ బెంగాల్లో 8 విడతలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. మార్చి 27న తొలి విడత పోలింగ్ జరుగనుంది. పోలింగ్ తేదీలు: ►తొలి విడత: మార్చి 27 ►రెండో విడత: ఏప్రిల్ 1 ►మూడో విడత: ఏప్రిల్ 6 ►నాలుగో విడత: ఏప్రిల్ 10 ►ఐదో విడత: ఏప్రిల్ 17 ►ఆరో విడత: ఏప్రిల్ 22 ►ఏడో విడత: ఏప్రిల్ 26 ►ఎనిమిదో విడత: ఏప్రిల్ 29 చదవండి: దొంగల రాజ్యానికి రాజులు -
గెలుపుపై అనుమానం.. చిన్నమ్మకు ఆహ్వానం
సాక్షి ప్రతినిధి, చెన్నై: రాజకీయంగా అస్త్రసన్యాసం చేసిన చిన్నమ్మ శశికళను అన్నాడీఎంకేలోకి రావమ్మా అని పార్టీ సమన్వయకర్త, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం ఆహ్వానించడం తీవ్రస్థాయిలో చర్చనీయాంశమైంది. మాటమాత్రమైనా తనతో చెప్పకుండా పన్నీర్ చేసిన ప్రకటనపై సహ సమన్వయ కర్త, సీఎం ఎడపాడి పళనిస్వామి అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల శిక్ష ముగించుకుని జైలు నుంచి విడుదలైన శశికళ తమిళనాడు రాజకీయాలను కుదిపేస్తారని అందరూ అనుకున్నారు. బెంగళూరు నుంచి చెన్నైలోని ఇంటికి చేరుకున్న తరువాత కొన్నాళ్లు అదే తరహాలో వ్యవహరించినా రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు అకస్మాత్తుగా ప్రకటించారు. అంతేగాక ప్రస్తుతం ఆలయాల చుట్టూ తిరుగుతూ ఆధ్యాత్మిక పర్యటనలతో గడుపుతున్నారు. ఇదిలా ఉండగా, అన్నాడీఎంకేలో చేర్చుకునేందుకు సిద్దమని ఆ పార్టీ సమన్వయకర్త, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం ఇటీవల సంచలన ప్రకటన చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అధ్యక్ష విధానం ఎంజీఆర్‌తో, ప్రధాన కార్యదర్శి హోదా జయలలితతో ముగిసింది. సమన్వయకర్త, సహ సమన్వయకర్త హోదాల్లో పన్నీర్, ఎడపాడి పార్టీకి సారథ్యం వహిస్తున్నారు. ఇదే తరహా కొనసాగేందుకు శశికళ సమ్మతిస్తే పార్టీలోకి ఆహ్వానిస్తామని ఒకసారి, పరిశీలిస్తామని మరోసారి పన్నీర్ అన్నారు. శశికళతో తనకు విబేధాలు, మనస్తాపాలు లేవు, అమ్మ మరణించినపుడు కొన్ని సందేహాలు ఉండేవని పన్నీర్ చెప్పారు. పన్నీర్ చేసిన ప్రకటన అన్నాడీఎంకేలో తీవ్ర చర్చనీయాంశమైంది. పన్నీర్ చేసిన వ్యాఖ్యలకు ఓటర్లు ఏ విధంగా ప్రభావితం అవుతారోనని ఎడపాడికి బెంగపట్టుకున్నట్లు తెలుస్తోంది. ఎడపాడికి గెలుపు కోసం ఈనెల 24వ తేదీ నుంచి పన్నీర్‌సెల్వం ప్రచారం చేస్తున్నారు. అంతకు ముందు వీరిద్దరూ శశికళ అంశంపై రహస్యంగా మంతనాలు చేసినట్లు సమాచారం. అన్నాడీఎంకే గెలుపు అవకాశాలు, టీటీవీ దినకరన్ పార్టీ అభ్యర్థుల వల్ల ఓట్ల చీలిక, ఉత్తర, దక్షిణ తమిళనాడులో అన్నాడీఎంకే పరపతి, కొంగుమండలంలోని అన్నా డీఎంకే ఓట్ బ్యాంకు అంశాలపై కూడా ఇరువురు సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. శశికళను అన్నాడీఎంకేలో ఆహ్వానించడంపై ఎడపాడి, పన్నీర్ మధ్య విబేధాలు చోటు చేసుకున్నాయనే ప్రచారం కూడా జరిగింది. అదేమీ లేదని ప్రజలకు, పార్టీ నేతలకు సంకేతాలు ఇవ్వడమే ఎడపాడి, పన్నీర్ ఏకాంత చర్చల వెనుక అసలు ఉద్దేశమని వాదిస్తున్నారు. చదవండి: తమిళనాడులో హీట్ పెంచిన ట్వీట్ -
‘‘బీపీ, షుగర్ ఉన్నాయి.. ప్లీజ్ నన్ను గెలిపించండి’’
సాక్షి, చెన్నై: ఆరోగ్యశాఖను తన భుజస్కంధాలపై మోస్తున్న మంత్రే తనకు ఉన్న బీపీ, షుగర్ వంటి అనారోగ్య సమస్యలను గుర్తు చేస్తూ ప్రచారంలో పడడం సర్వత్రా విస్మయంలోకి నెట్టింది. పుదుకోట్టై జిల్లా నుంచి విరాళిమలై నుంచి విజయభాస్కర్ ఇప్పటికే రెండు సార్లు గెలిచారు. ఆరోగ్య మంత్రిగా అత్యధిక సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి విజయభాస్కర్. కరోనా కాలంలో ఆయన సేవలు ప్రశంస నీయం. తాజాగా అదే విరాళిమలై నుంచి మళ్లీ పోటీలో విజయభాస్కర్ ఉన్నారు. అయితే, సెంటిమెంట్‌తో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంలో ఆయన తన ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలు చర్చకు విస్మయానికి దారి తీసింది. తనకు బీపీ, షుగర్ వంటి సమస్యలు ఉన్నాయని, తనను ఆదరించాలన్నట్టు ఆయన ఎన్నికల ప్రచారంలో ముందుకెళ్లడం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీనిపై వ్యంగ్యాస్త్రాలు, సెటైర్లు వేసే వాళ్లు పెరిగారు. దీంతో గురువారం విజయభాస్కర్ ఓ మీడియాతో మాట్లాడుతూ, వివరణ ఇచ్చుకున్నారు. తానేమీ సెంటిమెంట్‌తో ఓట్ల కోసం పాకులాడడం లేదన్నారు. వాస్తవిక జీవితంలో తనకు ఉన్న సమస్యలను గుర్తు చేయడంలో తప్పులేదన్నారు. ఈ నియోజకవర్గంలో తాను అడగాల్సిన అవసరం లేదని, తన ముఖం కనిపిస్తే చాలు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్లు ఎక్కువేనని పేర్కొన్నారు. తాను ఏ మేరకు సేవల్ని అందించానో వివరిస్తూ ఓ చోట చేసిన ప్రసంగాన్ని వక్రీకరించినట్టు పేర్కొన్నారు. వాస్తవిక జీవితంలో వి శ్రాంతి లేకుండా సేవల్ని అందించానని, అదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ చోట బీపీ, షుగర్ గురించి మాట్లాడనే గానీ, ఇందులో తప్పేమీ లేదని సమర్థించుకున్నారు. ఈ ప్రచారం పుణ్యమా అని ఆరోగ్యమంత్రి అనారోగ్య మంత్రయ్యాడంటూ వ్యంగ్యాస్త్రాలు హోరెత్తడం గమనార్హం. చదవండి: ఓటుకు నోటు ఇవ్వలేను.. మీరే నాకివ్వండి -
మమత కోసం రంగంలోకి శరద్ పవార్
ముంబై: శత్రువుకు శత్రువు మిత్రుడన్న నానుడిని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ మరోసారి రుజువు చేస్తున్నారు. ప్రధాన ప్రత్యర్థి బీజేపీ మీద ఎప్పుడూ విమర్శలు ఎక్కుపెట్టే శరద్ పవార్ ఇప్పుడు ఏకంగా మమతా బెనర్జీకి సపోర్ట్ చేసేందుకు రంగంలోకి దిగుతున్నారు. వచ్చేవారం పశ్చిమ బెంగాల్లో పర్యటించనున్న ఆయన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సమావేశమవడంతో పాటు భారీ ర్యాలీకి సైతం ప్లాన్ చేస్తున్నారు. పవార్ బెంగాల్ టూర్ కోసం మూడు రోజుల పర్యాటన ఖరారైనట్లు ఎన్సీపీ అధికార ప్రతినిధి మహేశ్ తపసే వెల్లడించారు. ఏప్రిల్ 1 నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నట్లు స్పష్టం చేశారు. కాగా త్వరలో నాలుగు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం అస్సాంలోనే బీజేపీ అధికారంలోకి వస్తుందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఇదివరకే జోస్యం చెప్పిన విషయం తెలిసిందే. మరోవైపు ఎలాగైనా మమతను గద్దె దింపి రాష్ట్రంలో పార్టీ జెండా ఎగరేయాలని బీజేపీ తహతహలాడుతోంది. ఇందుకోసం కేంద్ర మంత్రులను, ఇతర రాష్ట్రాల సీఎంలతో ప్రచారం చేయించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. మిథున్ చక్రవర్తి, గౌతమ్ గంభీర్‌తో రోడ్‌షో కూడా చేయించనుంది. చదవండి: అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామా చేయరు: శరద్ పవార్ వాళ్లే ‘పరాయి శక్తులు’! -
మామకు నేను ఇచ్చే టీ ఎంతో నచ్చుతుంది: కుష్బూ
టీ.నగర్: నటి కుష్బూ పట్ల అభిమానం పెంచుకున్న ప్రజలు ఆమెకు ఏకంగా ఆలయం నిర్మించిన విషయం తెలిసిందే. ఆమె పేరుతో విక్రయానికి వచ్చిన ఇడ్లీలు ప్రాచుర్యం పొందాయి. ఇంతటి కీర్తి సాధించిన కుష్బూ తన ఇంట్లో సామాన్య మహిళలా వంటలు చేస్తారా అనే సందేహం ఉంటుంది. దీన్ని నివృత్తి చేస్తూ ఎన్నికల ప్రచారంలో స్వయంగా ఆమె టీ చేసి చూపించారామె. చెన్నై గులాం అబ్బాస్ ఆలీఖాన్ వీధుల్లో ముస్లిం మహిళల మధ్య ఓట్లు అభ్యర్థించారు. ఆ సమయంలో మహిళలు ఆమెకు ఉత్సాహంగా స్వాగతం పలికారు. ఆటోడ్రైవర్ అయిన ముస్తాఫా ఇంట్లో ఉన్న మహిళలు కుష్బూను చూడగానే అక్కా, మా ఇంట్లో ఏమైనా తాగుతారా? అని ప్రశ్నించారు. అందుకు కుష్బూ ‘‘ఏం ఎందుకు తాగను.. ఇవ్వండి’’ అని బదులిచ్చారు. అంతేకాకుండా తానే టీ తయారు చేసి ఇస్తాను రండంటూ వంటగదికి దారితీసింది. అది చిన్న వంటగది కావడంతో మహిళ కాస్త ఇబ్బందిపడింది. అయినా కుష్బూ ఏమాత్రం సంకోచించకుండా వంటగదిలోకి వెళ్లి టీ తయారు చేసింది. వేడివేడిగా టీ తయారు చేసి ఆమె వెంట వెళ్లిన పార్టీ కార్యకర్తలు, విలేకరులు పది మందికి అందించింది. అంతేకాకుండా అక్కడున్న మహిళలు అక్కా టీ సూపర్ అంటూ ప్రశంసించారు. ఇంట్లో ప్రతిరోజు మామ (భర్త)కు తానే టీ తయారుచేసి ఇస్తానని, ఆయనకు ఎంతో నచ్చుతుందని కుష్బూ తెలిపారు. చదవండి: బాధతోనే అలా అన్నా.. క్షమించండి -
ప్రేమలతకు కరోనా.. రంగంలోకి దిగిన కెప్టెన్
సాక్షి, చెన్నై : డీఎండీకే నేత విజయకాంత్ ఎట్టకేలకు ప్రజల్లోకి వచ్చారు. బుధవారం గుమ్మిడి పూండిలో రోడ్ షోతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఇక ప్రచారంలో ఉన్న ప్రేమలత విజయకాంత్‌కు అధికారులు షాక్ ఇచ్చారు. అమ్మ మక్కల్ కూటమితో కలిసి డీఎండీకే ఎన్నికల్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసింది. డీఎండీకే అభ్యర్థులు 60 స్థానాల్లో పోటీచేస్తున్నారు. అయితే, ఈ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో దూసుకెళ్లే డీఎండీకే నేతలు కరువయ్యారు. విజయకాంత్ సతీమణి ప్రేమలత విరుదాచలంలో పోటీచేస్తుండటంతో, ఆమె ఆ నియోజకవర్గానికే పరిమితం అయ్యారు. ఇతర అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించలేని పరిస్థితి ఉంది. ఇక, విజయకాంత్ బావ మరిది, పార్టీ సంయుక్త ప్రధాన కార్యదర్శి సుదీష్ కరోనా బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో డీఎండీకే అభ్యర్థులకు మద్దతుగా కదిలే నేతలు ఆ పార్టీలో కరువయ్యారు. ఈ పరిస్థితుల్లో అనారోగ్యంతో ఇంటికీ, లేదా కార్యాలయానికి పరిమితమైన విజయకాంత్, తన అభ్యర్థుల కోసం అడుగుబయట పెట్టకతప్పలేదు. బు«ధవారం సాయంత్రం హఠాత్తుగా ఆయన ప్రచార పర్వంలోకి అడుగు పెట్టారు. ఐదు రోజుల పర్యటన... విజయకాంత్ ఎన్నికల ప్రచారంలో విరుదాచలంతోపాటుగా మరో నియోజకవర్గంలో ఓటర్లను కలిసేందుకు తొలుత నిర్ణయించారు. అయితే, తమకు మద్దతుగా ప్రచారం చేసే వాళ్లు లేరంటూ నియోజకవర్గాల నుంచి అభ్యర్థులు పెడుతున్న కేకల్ని విన్న విజయకాంత్ తానొస్తున్నానని అడుగు తీసి ముందుకు వేశారు. ఐదు రోజుల పాటుగా ఆయన ప్రచారం సాగనుంది. బుధవారం సాయంత్రం గుమ్మిడి పూండిలో సుడిగాలి పర్యటనతో ముందుకు సాగారు. అయితే, ఎక్కడా ప్రసంగాలకు తావివ్వలేదు. కేవలం పార్టీ వర్గాలను వాహనం నుంచి పలకరిస్తూ విజయకాంత్ ప్రచారం చేశారు. గురువారం తిరుత్తణిలో, శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు చెన్నైలో తమ అభ్యర్థులు పోటీలో ఉన్న నియోజకవర్గాల్లో ప్రచారానికి ఆయన నిర్ణయించారు. పరీక్ష చేసుకోవాల్సిందే తన సోదరుడు సుదీష్, ఆయన భార్య పూర్ణిమ ఇద్దరు కరోనా బారిన పడటంతో ప్రేమలత విజయకాంత్‌కు సంకటం తప్పలేదు. ఆమె విరుదాచలంలో సుడిగాలి పర్యటనతో ఓట్ల వేటలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో బుధవారం ఆమెకు అధికారులు షాక్ ఇచ్చారు. తప్పనిసరిగా కరోనా పరీక్ష చేసుకోవాల్సిందేనని, తదుపరే ప్రచారంలోకి వెళ్లాలని ఆరోగ్య శాఖ వర్గాలు హెచ్చరించాయి. దీంతో కరోనా టెస్ట్ చేసుకోక తప్పలేదు. ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. -
ఇక ఇప్పుడు జాతీయ నేతల వంతు..!
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి జాతీయ నేతలు సిద్ధమయ్యారు. బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఈనెల 27వ తేదీ నుంచి ఒకరి తర్వాత మరొకరు పర్యటించనున్నారు. అన్నాడీఎంకే కూటమిలో బీజేపీ 20 స్థానాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసింది. ఆయా అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో ఉరకలు తీస్తున్నారు. అలాగే కన్యాకుమారి లోక్‌సభ ఉప ఎన్నికల్లో కేంద్ర మాజీ మంత్రి పొన్ రాధాకృష్ణన్ పోటీలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో తమ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారానికి బీజేపీ నేతలు ప్రణాళికలు సిద్ధం చేశారు. తొలుత కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆ తర్వాత రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ చెన్నై హార్బర్ నియోజకవర్గంలో పోటీలో ఉన్న యువజన నేత వినోజ్ బి సెల్వంకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. అలాగే కేంద్రమంత్రి స్మృతి ఇరాని ధౌజండ్ లైట్స్ అభ్యర్థి కుష్భుకు మద్దతుగా ప్రచారానికి సిద్ధం అయ్యారు. 28న ఒకే వేదిక మీదకు... ఇప్పటికే పలుమార్లు ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈనెల 28న మలి విడత ప్రచారానికి సిద్ధం అయ్యారు. చెన్నై వేళచ్చేరిలో పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థి హసన్‌కు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు సేలంలో భారీ ర్యాలీతో ఓటర్ల వద్దకు వెళ్లనున్నారు. అదే రోజు సాయంత్రం సేలం సీలనాయకన్ పట్టిలో జరిగే బహిరంగ సభకు హాజరుకానున్నారు. ఇంత వరకు డీఎంకే కూటమి నేతలు ఒకే వేదిక మీదకు రాలేదు. ఈ బహిరంగ సభ వేదికగా రాహుల్, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, ఎండీఎంకే నేత వైగో, వీసీకే నేత తిరుమావళవన్, మైనారీటీ పార్టీల నేతలు ఖాదర్ మొహిద్దీన్, జవహరుల్లా, తమీమున్ అన్సారీ, వామపక్ష నేతలు బాలకృష్ణన్, ముత్తరసన్లతో పాటుగా డీఎంకే మిత్రపక్షాల నేతలు అందరూ ఒకే చోట కలవనున్నారు. ఉచిత పథకాలతో పేదరికం పోదు: కమల్ వ్యాఖ్య సాక్షి, చెన్నై: ఉచిత పథకాలు అమలు చేసినంతమాత్రాన పేదరికం తొలగే ప్రసక్తి లేదని మక్కల్ నీదిమయ్యం అధినేత కమల్‌హాసన్ అన్నారు. బుధవారం కోయంబత్తూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్లను ఉద్దేశించి కమల్ మాట్లాడుతూ.. ఉచితాలు ఇచ్చేస్తున్నారు కదా..? అని ఓట్లు వేస్తే మరో ఐదేళ్లు తీవ్రసంకటం ఎదుర్కోవడం తథ్యమని హెచ్చరించారు. ఉచిత పథకాల రూపంలో ప్రతి ఒక్కరి నేత్తిన అప్పులభారం పెరగబోతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి నెత్తిన రూ. 65 వేల అప్పు ఉందన్నారు. భవిష్యత్తులో రూ. 2లక్షలకు పెరిగినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. ఓటు వేసే ముందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. తిరుచ్చిలో సాగిన ప్రచారంలో కమల్‌పై ఓ మహిళ భారతీయార్చిత్ర పటాన్ని విసరడం కలకలం రేపింది. ఇక కమల్‌కు మద్దతుగా గురువారం కోయంబత్తూరు దక్షిణం నియోజకవర్గంలో ఎస్ఎంకే నేత శరత్‌కుమార్ ప్రచారం చేయనున్నారు. -
ఎన్నికల చిహ్నంపై స్టే కుదరదు: హైకోర్టు
సాక్షి ప్రతినిధి, చెన్నై: గుర్తింపు పొందిన పార్టీల చిహ్నాలను కూటమి పార్టీల అభ్యర్థులకు కేటాయింపుపై నిషేధం విధించేందుకు వీలులేదని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించి ఎన్నికలు ముగిసిన తరువాత ఈసీ బదులివ్వాలని బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి నుంచి 14 మంది మిత్రపక్ష పార్టీల అభ్యర్థులు ఉదయసూర్యుని గుర్తుపై పోటీచేస్తున్నారు. అలాగే అన్నాడీఎంకే కూటమిలోని 12 మంది మిత్రపక్ష అభ్యర్థులు రెండాకుల చిహ్నంపై బరిలోకి దిగుతున్నట్లు ఈసీ ప్రకటించింది. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఆయా పార్టీల సభ్యులు మాత్రమే ఆ చిహ్నంపై పోటీచేయాలని, ఇతరులు పోటీ చేసేందుకు వీలులేకున్నా ఎన్నికల అధికారులు వారి నామినేషన్లను అంగీకరించారని ఆరోపిస్తూ ప్రజా ప్రయోజనవాజ్యం దాఖలైంది. గుర్తింపు పొందిన పార్టీలు మిత్రపక్షపార్టీలకు తమ పార్టీ చిహ్నం కేటాయించకుండా ఎన్నికల కమిషన్‌కు నిషేధ ఉత్తర్వులు జారీచేయాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ బెనర్జీ, న్యాయమూర్తి సెంథిల్‌కుమార్ రామమూర్తిలతో కూడిన డివిజన్ బెంచ్‌కు బుధవారం విచారణకు వచ్చింది. ఎన్నికల చిహ్నం కేటాయింపులు పూర్తయినందున పిటిషనర్ వాదనపై ప్రస్తుత ఎన్నికల్లో నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదని న్యాయమూర్తులు అన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ పిటిషన్‌పై బదులి పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా ఈసీని కోర్టు ఆదేశిస్తూ విచారణను జూన్ 3వ వారానికి వాయిదావేసింది. జిల్లా కలెక్టర్, ఎస్పీలపై వేటు అధికార అన్నాడీఎంకేకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలపై కోయంబత్తూరు జిల్లా కలెక్టర్ రాజామణి, పోలీస్ కమిషనర్ సుమిత్ శరణ్‌లను ఎన్నికల విధుల నుంచి ఈసీ తప్పించింది. చెన్నై వేలాచ్చేరిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఘర్షణకు దిగిన అన్నాడీఎంకే, కాంగ్రెస్ అభ్యర్థులపై తిరువాన్మియూరు పోలీసులు మూడు సెక్షన్లపై కేసులు పెట్టారు. ఐజేకే కూటమి సారధి, మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్ పోటీచేస్తున్న కోయంబత్తూరు దక్షిణంలో మిత్రపక్ష సమక అధ్యక్షులు శరత్‌కుమార్ గురువారం ప్రచారం చేయనున్నారు. చెన్నైలో 7,300 మంది వృద్ధుల నుంచి పోస్టల్ ఓట్ల కోసం ఈసీ 70 బృందాలను నియమించింది. ఇంటింటికీ వెళ్లి పోస్టల్ ఓట్ల సేకరణకు శిక్షణ బుధవారం ప్రారంభమైంది. సొంతూళ్లకు వెళ్లి ఓటు వేసేందుకు వీలుగా 14,215 ప్రత్యేక బస్సులను నడుపనున్నారు. ఏప్రిల్ 1 నుంచి 5వ తేదీ వరకు నడిపే ఈ ప్రత్యేక బస్సుల కోసం బుధవారం రిజర్వేషన్ ప్రారంభమైంది. పోలింగ్ నేపథ్యంలో ఈనెల 4,5,6 తేదీల్లో టాస్మాక్ దుకాణాలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. -
తమిళ ఎన్నికలు: సర్వేలన్ని ఆ పార్టీకే అనుకూలం
డీఎంకే అధికారంలోకి రావడం ఖాయమని సర్వేలన్నీ స్పష్టం చేస్తుండడంతో అన్నాడీఎంకే పార్టీ అంతర్మధనంలో పడింది. తమ ఎన్నికల వ్యూహాన్ని మార్చేందుకు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి, పన్నీరుసెల్వం సిద్ధమయ్యారు. బుధవారం సేలంలోని ఓ ప్రైవేట్ హోటల్లో అర్ధగంట పాటు భేటీ అయ్యారు. సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించాలని అన్నాడీఎంకే పార్టీ ఉవ్విల్లూరుతోంది. ఈ మేరకు ఎన్నికల వ్యూహాలకు పదును పెట్టింది. ఉచిత పథకాలతో ప్రజాకర్షక మేనిఫెస్టోను ప్రకటించింది. అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కో–కన్వీనర్, సీఎం పళనిస్వామి కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో దూసుకెళుతున్నారు. ప్రచార సభలకు అనూహ్య స్పందన వస్తున్నా, ఉచిత పథకాల హామీలు ప్రజల్లో ఆసక్తిని కలిగించినా సర్వేలు మాత్రం భిన్నంగా వస్తుండడం ఆ పార్టీని కలవరంలో పడేసింది. వ్యూహాలకు పదును.. ఇప్పటి వరకు వెలువడిన నాలుగైదు సర్వేలు డీఎంకే అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశాయి. దీంతో ఆ పార్టీ పెద్దలు వ్యూహాలకు పదునుపెట్టారు. పార్టీ నాయకులు గ్రామస్థాయి నుంచి ప్రజల్లోకి వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు. మేనిఫెస్టోను విస్తృతంగా ప్రచారం చేయడానికి సిద్ధమవుతున్నారు. అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరుసెల్వం, కో–కన్వీనర్ ఎడపాడి పళనిస్వామి బుధవరం సేలంలో భేటీ అయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన ప్రణాళికలపై అరగంట పాటు చర్చించారు. కూటమి పార్టీలను కలుపుకుని సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని జిల్లా, నియోజకవర్గ నాయకులకు దిశానిద్దేశం చేశారు. నిర్లక్ష్యం ప్రదర్శిస్తే అధికారానికి దూరం అవుతామని హెచ్చరికలు పంపారు. అలాగే ప్రచారంలో డీఎంకే హయాంలో చోటుచేసుకున్న అవినీతి, కుటుంబ పాలన, తమిళులకు చేసిన ద్రోహాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. దివంగత సీఎం జయలలిత విజన్‌ను ప్రజలకు వివరించే విధంగా ప్రచార కార్యక్రమాలకు సిద్ధమయ్యారని ఓ నేత పేర్కొన్నారు. పన్నీరు ప్రచారం సీఎం పళనిస్వామి సేలం జిల్లా ఎడపాడిలో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆయనకు మద్దతుగా పన్నీరుసెల్వం నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. పళనికి మద్దతు పలకాలని, అమ్మ పాలన కొనసాగాలంటే అన్నాడీఎంకే పార్టీకి మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. కరూర్‌లో పళని కరూర్‌లో పోటీ చేస్తున్న ఎంఆర్ విజయ భాస్కర్, అరవకురిచ్చి నుంచి బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థి అన్నామలైలకు మద్దతుగా పళనిస్వామి ప్రచారం చేశారు. ఓపెన్ టాప్ వాహనంలో విస్తృతంగా పర్యటించారు. డీఎంకే హయాంలో సాగిన కబ్జాలను ప్రస్తావించారు. తాము అధికారంలోకి వస్తే ఆ స్థలాలను స్వాధీనం చేసుకుని లబ్ధిదారులు, బాధితులకు అందిస్తామని హామీ ఇచ్చారు. కరూర్ డీఎంకే అభ్యర్థి సెంథిల్ బాలాజీ అన్నాడీఎంకే ద్రోహి అని విమర్శించారు. అమ్మ ప్రభుత్వాన్ని కూల్చేందు విశ్వప్రయత్నాలు చేశారని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం ఉండడం వల్లే రాష్ట్రానికి రూ. లక్ష కోట్ల మేరకు నిధులు వచ్చినట్లు వివరించారు. చదవండి: నోరు జారిన పన్నీర్‌సెల్వం.. అందరూ నవ్వడంతో.. -
కరెన్సీ కట్టలు: రోడ్డుపై రూ.కోటి.. రూ.264 కోట్లు స్వాధీనం
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఎన్నికలు ఏవైనా ధనవర్షం కురవాల్సిందే. ప్రచారం కోసం నోట్లు కుమ్మరించందే ఓట్లు రాలవనే భావన అన్ని పార్టీల్లో పెరిగిపోయింది. వీటికి అడ్డుకట్ట వేసేందుకు ఎన్నికల కమిషన్ అభ్యర్థుల కదలికలపై నిఘా పెడుతుంటుంది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ధర ప్రవాహం పారుతోంది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో బుధవారం వరకు రూ.264 కోట్ల నగదు పట్టుబడింది. కమల్ సన్నిహితుడి ఇంట్లో సోదాలు మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్‌కు సన్నిహితుడు, తిరుచ్చిరాపల్లి తూర్పు నియోజకవర్గం అభ్యర్థి లేరోన్ మొరాయ్సి (45) ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపు పన్నుశాఖ (ఐటీ) అధికారులు దాడులు చేశారు. ఈ నెల 22, 23 తేదీల్లో జరిపిన తనిఖీల్లో రూ.10 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కమల్ పార్టీ ప్రముఖుల నుంచి రూ.22.5 కోట్లను స్వాధీనం చేసుకుని, రూ.80 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడిన విషయాన్ని ఇటీవల ఐటీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. పేరు చెప్పేందుకు ఇష్టపడని ఐటీ అధికారి మీడియాతో మాట్లాడుతూ.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే లేరోన్ మెరాయ్సి భారీ ఎత్తున పన్ను ఎగవేసినట్లు అందిన సమాచారంతో ఐటీ దాడుల చేపట్టామని తెలిపారు. ఎంఎన్ఎం కోశాధికారి చంద్రశేఖర్ ఇళ్లు, పరిశ్రమలపై ఈనెల 17,18 తేదీల్లో దాడులు నిర్వహించి రూ.11.50 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. రూ.80 కోట్ల పన్ను ఎగవేతను గుర్తించారు. ఇదిలా ఉండగా చెన్నై పల్లవరం వద్ద వాహనాల తనిఖీలు చేసున్న ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులకు ఒక కారులో తరలిస్తున్న రూ.4 కోట్ల విలువైన బంగారు, వెండి నగలు పట్టుబడ్డాయి. అలాగే ఈరోడ్‌లో జరిపిన తనిఖీలో రూ. 4.5 కిలోల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. అన్నాడీఎంకే నేత కారులో రూ.కోటి తిరుచ్చిరాపల్లి జిల్లాలో రోడ్డుపక్కన పడి ఉన్న రూ. కోటి కరెన్సీ కలకలం రేపింది. తిరుచ్చిరాపల్లి–కరూర్ జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి రెండు కార్లు, వాటికి సమీపంలో కొందరు వ్యక్తులు వాదులాటలో ఉండగా ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు వచ్చారు. అధికారులను చూడగానే ఒక కారులోని వ్యక్తులు పారిపోగా రెండో కారును, నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఇంతలో కారుకు సమీపంలో రోడ్డు పక్కన పడి ఉన్న బియ్యం బస్తాలను పరిశీలించగా రూ.500 నోట్లతో రూ. కోటి విలుౖవైన కరెన్సీని గుర్తించారు. అన్నాడీఎంకే పతాకంతో కూడిన కారును స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున నగదు, నగలు పట్టుబడడంతో ఎన్నికల కమిషన్ 936 ఫ్లయింగ్ స్క్వాడ్లతో 24 గంటల నిఘాను తీవ్రతరం చేసింది. ఈసీకి జ్యువెలర్స్ సంఘం విజ్ఞప్తి ఎన్నికల సమయంలో ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలతో బంగారు నగల వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలపై సానుకూలంగా స్పందించాలని కోరుతూ చెన్నై జ్యువెలర్స్ అసోసియేషన్ బుధవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సత్యబ్రత సాహూను కలిసి వినతిపత్రం సమర్పించింది. ఈసీని కలిసిన వారిలో సంఘం అధ్యక్షుడు ఉమ్మిడి ఉదయకుమార్, ఉపాధ్యక్షుడు ఉమ్మిడి రాజేష్, కార్యదర్శి నారాయణన్ సురేష్, కార్యవర్గ సభ్యుడు అళగు చిదంబరం ఉన్నారు. చదవండి: TN Assembly Polls: చంద్రమండలంపైకి తీసుకువెళ్తా! -
రేపటి నుంచి పనిలోకి రానమ్మా...
పనిమనిషి ‘కలితా మాఝీ’ తను పని చేసే ఇళ్లల్లో ఒక నెల సెలవు తీసుకుంది. ‘రేపటి నుంచి పనికి రానమ్మా... నెల తర్వాతే మళ్లీ’ అని ఎన్నికల బరిలో దిగింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్లలో పుర్బ బుర్ద్వాన్ జిల్లాలోని ఆస్గ్రామ్ నియోజకవర్గం నుంచి ఆమె బిజెపి అభ్యర్థిగా రంగంలో దిగింది. ‘ఊరి సమస్యలు పనిమనిషికి కాకపోతే ఇంకెవరికి తెలుస్తాయి’ అంటోంది. ఆమె ఓడితే సరే.. గెలిస్తే ఏం చేయాలా అని ఇప్పటి నుంచి వేరే పనిమనుషుల గురించి ఒక కన్నేసి పెడుతున్నారు ఆమె పని చేసే ఇళ్లవాళ్లు. ప్రజాస్వామ్యపు ఈ సదవకాశ కథ వినదగ్గది. వారం క్రితం కలితా మాఝీ ఇల్లు చేరుకునేసరికి ఆమె గుడిసె ముందు ఒకటే కోలాహలం. బిజెపి జెండాలు. పార్టీ నాయకులు. కార్యకర్తలు. ఏమైందో ఆమెకు అర్థం కాలేదు. ఎవరో వచ్చి మిఠాయి తినిపించి ‘నిన్ను ఆస్గ్రామ్ నియోజకవర్గం నుంచి బి.జె.పి అభ్యర్థిగా నిలబెట్టారు’ అని చెప్పారు. కలితా తబ్బిబ్బయ్యింది. ఎందుకంటే ఇది ఆమె ఎప్పటికీ ఊహించనిది. ఆమె నాలుగిళ్లల్లో పాచి పని చేసుకుని బతికే పనిమనిషి. నేడు– కేంద్రంలో అధికారంలో ఉన్న అతి పెద్ద బి.జె.పి పార్టీ అభ్యర్థి. ఈ వార్త తెలిసి ఆమెకు సంతోషం కలిగింది. అయితే చేసే పని కొన్నాళ్లు మానేస్తున్నానని ఇళ్ల యజమానులకు ఎలా చెప్పాలా అని బెంగ కూడా కలిగింది. నాలుగిళ్ల మనిషి ఆస్గ్రామ్ అనేది దాదాపు 5 వేల మంది ఉండే చిన్న గ్రామం. అదే గ్రామ కేంద్రంగా ఆస్గ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. ఇది పుర్బ బుర్వాన్ జిల్లాలో ఉంది. ఈ జిల్లాలో 74 శాతం మంది లోపలి పల్లెల్లోనే జీవిస్తుంటారు. నగర ఛాయలు తక్కువ. పట్టణ ఛాయలూ తక్కువే. బాగా వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతంలో అనాదిగా సిపిఎం ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ గెలుస్తూ వచ్చాయి. ఇప్పుడు బి.జె.పి అక్కడ తన జెండా ఎగురవేయ దలిచి కలితా మాఝీని రంగంలో దించింది. అయితే డబ్బు దస్కం పలుకుబడి ఉన్న ఇందరు ఉండగా కలితాను ఎందుకు దించింది? ఎందుకంటే ఆస్గ్రామ్ నియోజక వర్గం ఎస్.సి రిజర్వ్డ్ కనుక కూడా. ఆరు చీరల అభ్యర్థి కలితా మాఝీకి మొత్తం ఎంచితే ఆరు చీరలు ఉన్నాయి. అవే ఆమె ఆస్తి. 32 ఏళ్ల కలితాకు 8వ తరగతి చదివే కొడుకు ఉన్నాడు. భర్త çపంబ్లర్. ఒక నీటి కుంట పక్కన వీరి గుడిసె ఉంటుంది. ‘నేను నాలుగైదు ఇళ్లల్లో పని చేస్తాను. గిన్నెలు కడిగి, ఇంటి పని చేస్తే దాదాపు రెండున్నర వేలు వస్తాయి. ఇరవై ఏళ్ల నుంచి పని మనిషిగానే నా బతుకు నేను బతుకుతున్నాను’ అంటుంది కలితా. అయితే అయిదేళ్ల క్రితం ఆమె ‘అవసరం’ పార్టీలకు పడింది. పంచాయతీ ఎలక్షన్లలో ఆ స్థానం కూడా రిజర్వ్డ్ కాబట్టి ఆమెను నిలబెట్టారు. అయితే ఆమె ఓడిపోయింది. ఇప్పుడు ఏకంగా ఎం.ఎల్.ఏగానే బి.జె.పి టికెట్ ఇచ్చింది. ‘కలితా ఐదేళ్లుగా పార్టీకి పని చేసింది. కష్టపడి పని చేసేవారిని మా పార్టీ గుర్తిస్తుంది’ అని బి.జె.పి జాతీయ ప్రధాన కార్యదర్శి బి.ఎల్.సంతోష్ అన్నారు. హాస్పిటల్ తెస్తాను కలితా అభ్యర్థిత్వం జాతీయ స్థాయిలో చాలామందిని ఆకర్షించింది. ఆమె వార్తల్లోకి వచ్చింది. అయితే అవన్నీ పట్టని కలితా తాను పని చేసే ఇళ్ల యజమానుల దగ్గర నెల రోజుల సెలవు అడిగింది. ‘రేపటి నుంచి పనిలోకి రానమ్మా అని చెప్పేశాను’ అంది. ఆ మేరకు ఆమెకు ఈ నెల ఆదాయం పోయినట్టే. అయితే ఏమిటి? ఉత్సాహంగా తాను గెలవడానికి ప్రచారం మొదలెట్టింది. ‘నేను కష్టం తెలిసినదాన్ని. నాలుగిళ్లు తిరిగి కష్టం గమనించేదాన్ని. సమస్యలు నాకు కాక ఇంకెవరికి తెలుస్తాయి’ అంటూ కలితా ప్రచారం చేస్తోంది. ఆస్‌గ్రామ్‌లో ఎవరికైనా సీరియస్ అయితే గంటన్నర ప్రయాణం చేసి బుర్వాన్ టౌన్‌కు వెళ్లాలి. ‘ఈ బాధలు ఎంతకాలం. నేను గెలిస్తే మంచి ఆస్పత్రి మా ఊరికి తీసుకు వస్తాను’ అని కలితా అంటున్న మాటలు ఆ ప్రాంతం వారికి నచ్చుతున్నాయి. కలితా భర్త పార్థ మాఝీ, అత్తగారు సందా మాఝీ ఆమెకు పూర్తిస్థాయి మద్దతు తెలిపారు. ‘ఆమె గెలవాలి. అందుకు చేయగలిగిందల్లా చెయ్ అని చెప్పాను’ అన్నాడు భర్త. ‘నా కోడలు గెలిస్తేనా చూడండి ఎన్ని అద్భుతాలు చేస్తుందో’ అని అత్త అంటోంది. నిజానికి అన్ని వర్గాల ప్రజలు ఎన్నికలలో పాల్గొనడానికి మన ఎన్నికల వ్యవస్థలో చోటు ఉంది. అన్ని వర్గాల ప్రజలు పాల్గొని గెలవాలి. గెలిచిన సందర్భాలు ఉన్నాయి. అయితే ‘తప్పనిసరి’ సందర్భాలలో మాత్రమే కొందరికి అవకాశాలు దక్కడాన్ని విమర్శించాలా ఈ తప్పనిసరి వల్లనైనా అవకాశం దక్కింది అని సంతోష పడాలా తెలియదు. గతంలో తెలుగులో ‘ముద్దమందారం’ అనే సినిమాలో రిజర్వ్డ్ స్థానానికి సినిమా టాకీసులో పని చేసుకు బతికే రాజేంద్రప్రసాద్‌ను నిలబెడతారు. కలితాది అలాంటి కథ కారాదని ఆమె గెలవాలని, ఎంఎల్ఏగా బాగా పని చేసి పేరు తెచ్చుకోవాలని కోరుకునే శ్రేయోభిలాషులు ఉంటారు. అయితే తృణమూల్‌కు, బిజెపికి హోరాహోరీగా పోరాటం జరుగుతున్న బెంగాల్లో చీపిరి వదిలి తడి చేతులు తుడుచుకుని అందరికీ నమస్కారం పెడుతూ ఓట్లు అభ్యర్థించే కలితా గెలుపు అవకాశాలు ఎన్ని అనేదే ఇప్పుడు ఉత్కంఠ. వేచి చూద్దాం. ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రచారం నిర్వహిస్తున్న కలితా మాఝీ – సాక్షి ఫ్యామిలీ -
TN Assembly Polls: చంద్రమండలంపైకి తీసుకువెళ్తా!
చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో ఓటర్లను ఆకర్షించేందుకు స్వతంత్ర అభ్యర్థి శరవణన్ చిత్ర విచిత్ర హామీలు ఇస్తున్నారు. దక్షిణ మధురై నుంచి ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగిన ఆయన, నియోజకవర్గంలో రాకెట్ ప్రయోగ కేంద్రం ఏర్పాటు చేస్తామని, ప్రజల్ని చంద్రమండలం పైకి తీసుకెళ్తానని వ్యాఖ్యానించారు. అదే విధంగా, ఇళ్లలో ఆడవాళ్ల పనికి సాయంగా ఇంటింటికీ రోబో పంపిణీ చేస్తానన్నారు. అంతేగాకుండా, ట్రాఫిక్ రద్దీ తగ్గించడానికి కాల్వలు తవ్వించి ఇంటికో బోటు పంపిణీ చేస్తానంటూ ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తారు. కాగా అన్ని రాజకీయ పార్టీలు టిక్కెట్ నిరాకరించడంతో శరవణన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి సిద్ధమయ్యారు. శరవణన్ ఇచ్చిన మరిన్ని హామీలు ఎండ వేడి నుంచి కాపాడేందుకు 300 అడుగుల ఎత్తున కృత్రిమ మంచుకొండ నిర్మాణం ప్రజలు ఎంజాయ్ చేయడానికి కృత్రిమ సముద్రం నిర్మాణం నియోజకవర్గ ప్రజలందరికీ ఐఫోన్ చదవండి: తమిళనాడు పోల్స్: దుస్తులు ఉతికి, గిన్నెలు తోమి -
నాగర్‌కోవిల్‌లో ముగ్గురు గాంధీలు..
సాక్షి ప్రతినిధి, చెన్నై : తమిళనాడు అసెంబ్లీలో ఎలాగైనా కాలుమోపాలని పట్టుదలతో ఉన్న బీజేపీ ఈ ఎన్నికల్లో ప్రజా బలం, ఓటర్ల బలగాన్ని పెంచుకునే పనిలో పడింది. గెలుపు గుర్రం ఎక్కేందుకు ఏ చిన్న అవకాశాన్ని చేజార్చుకోకూడదని నిర్ణయించుకుంది. ఇందుకోసం ప్రధాని మోదీ సహా అగ్రనేతలు తమిళనాడుకు తరలివస్తున్నారు. బీజేపీ–అన్నాడీఎంకే కూటమి అభ్యర్థుల గెలుపుకోసం ఈనెల 26న బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రచారం చేయనున్నారు. ఇప్పటికే ఒక విడత ప్రచారం ముగించిన ప్రధాని మోదీ రెండో విడతలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్ మురుగన్ పోటీచేస్తున్న తిరుప్పూరు జిల్లా తారాపురంలో 30వ తేదీన ప్రసంగించనున్నారు. ప్రధాని వచ్చి వెళ్లిన తరువాత కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, నిర్మలాసీతారామన్ ప్రచారం చేయనున్నారు. మూడో విడతగా ఏప్రిల్ 2న కన్యాకుమారి, మదురైలలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం చేయనుండగా సీఎం ఎడపాడి కూడా పాల్గొంటున్నారు. అన్బుమణి రాందాస్‌కు పీటీ వారెంట్ ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగించారనే ఆరోపణలపై పీఎంకే యువజన విభాగం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు అన్బుమణి రాందాస్‌కు విల్లుపురం న్యాయస్థానం పీటీ వారెంట్ జారీకి ఆదేశించింది. విల్లుపురం జిల్లా బ్రహ్మదేశం పోలీస్‌స్టేషన్ సమీపంలో 2013లో జరిగిన ఒక కార్యక్రమంలో అన్బుమణి హింసను ప్రేరేపించే విధంగా ప్రసంగించారనే అభియోగంపై అప్పటి సీఐ సుధాకర్ కేసు నమోదు చేశారు. ఆనాటి నుంచి ఈ కేసు కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈనెల 22న మరోసారి విచారణకు రాగా న్యాయమూర్తి పీటీ వారెంట్ జారీ చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించారు. నాగర్‌కోవిల్‌లో ముగ్గురు గాందీలు.. నాగర్‌కోవిల్ నియోజకవర్గంలో ముగ్గురు గాందీలు పోటీ చేయడం విశేషంగా మారింది. బీజేపీ అభ్యర్థి ఎంఆర్ గాందీపై స్వతంత్ర అభ్యర్థులుగా ఎల్ గాంధీ, గాంధీ కనకరాజ్ పోటీకి దిగారు. రేపటి నుంచి విజయకాంత్ ప్రచారం.. డీఎండీకే అధ్యక్షులు విజయకాంత్ ఈనెల 25నుంచి ప్రచాచం చేయనున్నారు. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం కూటమిలో ఉన్న డీఎండీకే పలువురు అభ్యర్థులను పోటీకి దించింది. అనారోగ్యకారణాలతో పోటీ చేయని విజయకాంత్ కూటమి అభ్యర్థులకు మద్దతుగా తిరుత్తణి నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు. 12 గంటల పోలింగ్: ఈసీ ఏప్రిల్ 6న ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సత్యబ్రత సాహూ తెలిపారు. జనవరి 20న విడుదల చేసిన జాబితా ప్రకారం రాష్ట్రంలో 6 కోట్ల 26 లక్షలా74 వేలా 446 మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఆ తరువాత వచ్చిన వినతులను పరిశీలించి చేర్పులతో ఓటర్ల సంఖ్య 6 కోట్ల 29 లక్షలా 43 వేలా 512 మందికి పెరిగింది. అంటే గత రెండు నెలల్లో 2,69,66 మంది కొత్తగా ఓటర్ల జాబితాలో చేరారు. ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరగడంతో పోలింగ్ వేళలను ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు నిర్ణయించామన్నారు. ఎన్నికల బందోబస్తు నిమిత్తం 235 పారామిలటరీ దళాలు వస్తున్నాయి. బీజేపీ అభ్యరి్థపై చార్జిషీటు.. 2019 నాటి ఉప ఎన్నికల్లో ప్రమాణ పత్రంలో ఆస్తికి సంబంధించి వాస్తవాలను దాచిపెట్టిన అభియోగంపై పుదుచ్చేరి కామరాజర్ నియోజకవర్గ అభ్యర్థి జాన్‌కుమార్‌పై చార్జిïÙటు దాఖలైంది. పుదువై పోరాళిగల్ సంఘం ప్రధాన కార్యదర్శి సెల్వముత్తురామన్ దాఖలు చేసిన పిటిషన్‌ను స్వీకరించిన న్యాయమూర్తి ఈ మేరకు పోలీసులకు ఆదేశాలిచ్చారు. చదవండి: Tamil Nadu Assembly Election 2021: అధికారం ఎవరిదో? -
అసోం పోల్స్: అఖిల్ గొగోయ్ సంచలన ఆరోపణలు
సాక్షి,గౌహతి: జైల్లో తనను మానసికంగా, శారీరకంగా హింసించారని యాంటీ సీఏఏ యాక్టివిస్టు అఖిల్ గొగోయ్ ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ లేదా బీజేపీలో చేరితే తనకు వెంటనే బెయిల్ ఇస్తామని ఎన్ఐఏ ఆశచూపిందంటూ అఖిల్ లేఖ రాశారని ఆయనకు చెందిన రైజోర్ దళ్ వెల్లడించింది. కోర్టు అనుమతిలేకుండా అఖిల్‌ను 2019 డిసెంబర్లో ఢిల్లీకి తీసుకుపోయారని తెలిపింది. అక్కడ ఎన్ఐఏ హెడ్‌క్వార్టర్స్‌లో తనను బంధించారని, గాఢమైన చలిలో నేలపై పడుకోవాల్సివచ్చిందని అఖిల్ లేఖలో తెలిపారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లో చేరితే బెయిల్ పొందవచ్చన్న ఆఫర్‌ను తిరస్కరించగా కావాలంటే అసెంబ్లీకి పోటీ చేసి మంత్రికావచ్చని ఆశ చూపారన్నారు. అంతేకాకుండా కేఎంఎస్ఎస్(కృషిక్ ముక్తి సంగ్రామ్ సమితి)ని వీడి ఒక ఎన్జీఓ ఆరంభించి, అసోంలో క్రిస్టియన్ మతమార్పిడులకు వ్యతిరేకంగా పనిచేస్తే రూ.20 కోట్లు ఇస్తామని ప్రలోభపెట్టారన్నారు. ఇవేవీ తాను అంగీకరించకపోవడంతో అసోం సీఎం మరియు ఒక ప్రభావవంతమైన మంత్రితో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారని, దీన్ని కూడా తాను వ్యతిరేకించానని తెలిపారు. దీంతో తనపై ఎన్ఐఏ తీవ్రమైన ఆరోపణలతో కూడిన కేసులు పెట్టిందన్నారు. తనను చంపేస్తానంటూ బెదిరింపులు కూడా వచ్చాయని, పదేళ్లు జైలు జీవితం గడపాలని భయపెట్టారని తెలిపారు. కోవిడ్ కారణంగా అఖిల్‌ను గౌహతి మెడికల్ కాలేజీలో చేర్చారు. యాంటీ సీఏఏ ఆందోళనల్లో పాల్గొన్నాడంటూ అఖిల్‌ను ఎన్ఐఏ 2019లో అరెస్టు చేసింది. అయితే అఖిల్ ఆరోపణలను బీజేపీ కొట్టిపారేసింది. ఇవన్నీ చౌకబారు రాజకీయాలని బీజేపీ ప్రతినిధి రూపమ్ గోస్వామి ఆరోపించారు. అసోం ఎన్నికలకు ముందు ఈ లేఖ విడుదల కావడమే ఇందుకు నిదర్శనమన్నారు. అఖిల్‌కు ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కదన్నారు. కాగా రేజర్ పార్టీ అసెంబ్లీ జనతా పరిషత్ (ఏజేపీ) తో కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. గౌహతి మెడికల్ కాలేజీ హాస్పిటల్ నుండి పోటీ చేస్తున్న గొగోయ్ శివసాగర్ సీటు నుండి పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. -
Tamil Nadu Assembly Election 2021: అధికారం ఎవరిదో?
సాక్షి, చెన్నై: ఎన్నికలంటేనే అధికార పార్టీకి, ప్రతిపక్ష పార్టీకి మధ్య అధికారం దక్కించుకునేది ఎవరనే పోటీ ఉంటుంది. అయితే కొన్ని సమయాల్లో ఎదో ఒక పార్టీకి అనుకూల పవనాలు బలంగా వీచడం, ఆ పార్టీకి మహత్తర విజయాన్ని కల్పించడం సాధారణ విషయం. 1952 నుంచి శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి. 1952 కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా కమ్యూనిస్టు ఆధ్వర్యంలోని ప్రతిపక్ష పార్టీలు ఒకే కూటమిగా ఎన్నికలను ఎదుర్కొన్నాయి. అప్పట్లో తమిళనాట తీవ్ర ఆహార కొరత ఏర్పడడంతో అధికార పార్టీకి వ్యతిరేక పవనాలు వీచాయి. దీంతో కాంగ్రెస్ వెనుకంజ వేయకతప్పలేదు. 1967లోను అప్పటి అనుకూల పవనాలు డీఎంకేను గెలుపొందేలా చేశాయి. ఆ తర్వాత ఎంజీఆర్ డీఎంకే నుంచి వైదొలగి అన్నాడీఎంకే పార్టీని ఏర్పరిచారు. దీంతో 1972లో ఆ పార్టీ ఆవిర్భవించింది. అప్పట్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో అన్నాడీఎంకే భారీ విజయం సాధించింది. కాంగ్రెస్‌కు మళ్లీ ఘోర పరాభవం తప్పలేదు. 1984 ఎన్నికలలో ఎంజీఆర్ అనారోగ్యానికి గురై అమెరికా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. ఆ సమయంలో ఎన్నికలు జరగడంతో కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకుని ఎన్నికలను ఎదుర్కొన్నారు. అయితే అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హత్యకు గురయ్యారు. దీంతో ఏర్పడిన సానుభూతి పవనాల కారణంగా అన్నాడీఎంకే, కాంగ్రెస్ కూటమి భారీ విజయం సాధించింది. 1989లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో నాటి ప్రధాని రాజీవ్గాందీపై బోఫోర్స్ అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఇది కాంగ్రెస్‌కు వ్యతిరేకత తీసుకొచ్చింది. అప్పట్లో ఎంజీఆర్ మృతితో అన్నాడీఎంకే జయలలిత వర్గం, జానకి వర్గంగా విడిపోయి ఎన్నికలను ఎదుర్కొన్నాయి. ఈ కారణంగా డీఎంకే విజయం సాధించి అధికారం చేపట్టింది. 1991లో అన్నాడీఎంకే, కాంగ్రెస్ కూటమి పోటీ చేశాయి. ఆ సమయంలో శ్రీపెరంబుదూరు ప్రచారానికి వచ్చిన రాజీవ్‌గాంధీ హత్యకు గురికావడంతో సానుభూతి పవనాలు అన్నాడీఎంకే, కాంగ్రెస్ కూటమిని గెలిపించాయి. 1995 అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ఉన్న జయలలితపై అవినీతి ఆరోపణలు రావడంతో వ్యతిరేకత ఏర్పడింది. దీంతో డీఎంకే, తమిళ మానిల కాంగ్రెస్ కూటమి గెలుపొందింది. 2001లో అన్నాడీఎంకే, 2006లో డీఎంకే అధికారంలోకి వచ్చాయి. 2011 ఎన్నికలు 2జీ స్పెక్ట్రం అవినీతి కారణంగా డీఎంకే పరాజయంపాలై అన్నాడీఎంకే అధికారం చేజిక్కించుకుంది. 2016లో ఎటువంటి పవనాలు వీచలేదు. ఇరుపార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొనగా అన్నాడీఎంకే అధికారం చేపట్టింది. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లోను ఎటువంటి పవనాలు వీచడం లేదు. ఇరు పార్టీలకు ఉన్న పలుకుబడిని బట్టే గెలుపు, ఓటములు ఉంటాయి. -
రెండున్నరేళ్లలో బోడో ఒప్పందం అమలు
ఉడల్గురి: తాము అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో బోడో ఒప్పందంలోని అన్ని క్లాజులను సంపూర్ణంగా అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అసోం ప్రజలకు హామీ ఇచ్చారు. బోడోలాండ్ టెరిటోరియల్ రీజియన్(బీటీఆర్)లో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. గతేడాది ప్రధాని బోడో ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత కాల్పుల విరమణ, ఈప్రాంత సర్వతోముఖాభివృద్ధి ఆరంభమయ్యాయన్నారు. బోడో ప్రాంతాల్లో శాంతి తమ ఉద్దేశమని, తిరిగి అధికారంలోకి వస్తే ఒప్పందం సంపూర్ణంగా అమలు చేస్తామని చెప్పారు. బోడో యువత తుపాకుల బదులు కంప్యూటర్ను ఎంచుకోవచ్చని, దేశాభివృద్ధికి దోహదపడవచ్చని చెప్పారు. ప్రధాని చొరవతోనే ఈ ఒప్పందం కుదిరిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయంలో బోడో ఘర్షణల్లో దాదాపు 5వేల మంది మరణించారని, కానీ కాంగ్రెస్ నేతలు స్వీయప్రయోజనాలు చూసుకుంటూ పబ్బం గడిపారని విమర్శించారు. కాంగ్రెస్ తాజాగా ఏర్పరిచిన మహాకూటమి ఈ ప్రాంతంలో శాంతిని తీసుకురాలేదన్నారు. ఇప్పటికే బోడోల కోసం 65 పథకాలను ప్రకటించామన్నారు. రాహుల్ పిక్నిక్కు వచ్చారు ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్ జరిపిన అసోం పర్యటనపై అమిత్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆయన రాష్ట్రానికి పిక్నిక్కు వచ్చినట్లు వచ్చిపోయారన్నారు. నాలుగు తరాలుగా కాంగ్రెస్ టీ వర్కర్లకు చేసిందేమీలేదని, రాహుల్ మాత్రం ఫొటోలుదిగిపోయారని ఎద్దేవా చేశారు. టీ వర్కర్లకు బీజేపీ చేసిన మేలును ఆయన వివరించారు. బీజేపీ మాత్రమే అసోంను కాపాడగలదని చెప్పారు. ఏఐయూడీఎఫ్‌ను చెంత చేర్చుకొని అసోంలో కాంగ్రెస్ ఎలా శాంతిని తెస్తుందని ప్రశ్నించారు. బద్రుద్దీన్ పార్టీ అధికారంలోకి వస్తే అసోంలోకి మరింత మంది వలసదారులు వస్తారన్నారు. తమ ప్రభుత్వం అసోంలో అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరించిందన్నారు. -
తమిళనాడు పోల్స్: దుస్తులు ఉతికి, గిన్నెలు తోమి
సాక్షి,చెన్నై: తమిళనాట అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలని పార్టీలు, అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు పలు వాగ్దానాలు గుప్పించడం, చిత్ర విచిత్ర శైలిలో ప్రచారం చేయడం సర్వ సాధారణం. తమిళనాట హోరాహోరీగా సాగుతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సరికొత్త పంథాను ఫాలో అయిపోతున్నారు. తాజాగా నాగపట్నం అసెంబ్లీ నియోజకవర్గం ఏఐఏడిఎంకె అభ్యర్థి తంగా కతిరావన్ వార్తల్లో నిలిచారు. బహిరంగంగా బట్టలు ఉతికి సంచలనం సృష్టించారు. ఈ ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తే తన నియోజక వర్గంలో ‘అమ్మప్రభుత్వం’ ప్రతీ ఇంటికి ఒక వాషింగ్ మెషీన్‌ను ఇస్తుందని హామీ ఇచ్చారు. చురుకైన స్థానిక నేతగా పేరొందిన కతివారన్ తొలిసారి మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచారు. సోమవారం ప్రచార సమయంలో నాగపట్టణంలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. ప్రచారాని వెళ్లిన సమయంలో ఒక మహిళ బట్టలు ఉతుకుతూ కనిపించింది. అంతే రంగంలోకి దిగిన కతిరావన్ బట్టలు తాను ఉతుకుతానని ఆమెను కోరారు.మొదటలో మొహమాటంతో కాస్త సంశయించిన ఆ మహిళ చివరికి ఆయన చేతికి దుస్తులు ఇవ్వక తప్పలేదు. దీంతో కాసేపు బట్టలు వాష్ చేసిన ఆయన, పనిలో పనిగా పక్కనే ఉన్న గిన్నెలను కూడా తోమేశారు. ఈ పరిణామంతో ఔరా అంటూ ఆశ్చర్యపోవడం అక్కడున్నవారి వంతైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించడానికి అభ్యర్థులు కొత్త మార్గాలను అనుసరిస్తున్నారు. కొందరు రోబోతో ప్రచారం చేస్తున్నారు, మరికొందరు పార్టీ ఎన్నికల చిహ్నాన్ని తమ తలపై వేసుకుంటున్నారు. కాగా ఇంటింటికి వాషింగ్ మెషీన్లు, సోలార్ స్టవ్‌లు, కేబుల్ టీవీ కనెక్షన్లను ఫ్రీగా ఇస్తామని అన్నా డీఎంకే తాజా ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సంగతి తెలిసిందే. Tamil Nadu: AIADMK candidate Thanga Kathiravan from Nagapattinam washed clothes and promised to give washing machine after winning elections during campaigning yesterday. pic.twitter.com/orDGoRFUhn — ANI (@ANI) March 23, 2021 — ANI (@ANI) March 23, 2021 -
నామినేషన్‌ను ఉపసంహరించుకుని బీజేపీలోకి..
కాసరగోడ్: కేరళలోని కాసరగోడ్ జిల్లా మంజేశ్వరం నియోజకవర్గం నుంచి బీఎస్పీ తరఫున పోటీకి దిగిన కె. సుందర తన నామినేషన్‌ను ఉపసంహరించుకుని బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నియోజకవర్గంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్ పోటీ చేస్తున్నారు. సోమవారం సుందర మీడియాతో మాట్లాడుతూ.. తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నాననీ, ఇకపై బీజేపీ అభ్యర్థి సురేంద్రన్ విజయం కోసం అలుపెరగకుండా పని చేస్తానని ప్రకటించారు. అయితే, సుందరను బీజేపీ బెదిరించి నామినేషన్ ఉపసంహరించుకునేలా చేసిందంటూ ఊహానాలు వెలువడ్డాయి. కె.సుందర, కె. సురేంద్రన్ పేర్లు ఒకేలా ఉండటంతో 2016 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న సుందరకు 467 ఓట్లు పడ్డాయి. ఆ ఎన్నికల్లో ఐయూఎంఎల్ అభ్యర్థి అబ్దుల్ రజాక్ చేతిలో కె.సురేంద్రన్ కేవలం 89 ఓట్లతో ఓటమి చవిచూశారు. అబ్దుల్ రజాక్‌కు బోగస్ ఓట్లు పడ్డాయంటూ సురేంద్రన్ కోర్టుకు కూడా వెళ్లారు. అయితే, రజాక్ 2018లో చనిపోవడంతో ఆయన ఆ కేసును ఉపసంహరిం చుకున్నారు. బీజేపీ కేరళ రాష్ట్ర అధ్యక్షుడు కె. సురేంద్రన్ -
అర కోటి ఉద్యోగాలు.. ఫ్రీగా ట్యాబ్లెట్లు.. లైసెన్స్
చెన్నె: ఓటర్లను ఆకర్షించడానికి పెద్ద ఎత్తున హామీలు ఇవ్వడంలో తమిళనాడు రాజకీయ నాయకులకు అలవాటే. ఇప్పటికే అక్కడి ప్రధాన పార్టీలు అన్నాడీఎంకే, డీఎంకే మేనిఫెస్టోలు విడుదల చేశాయి. దాదాపు 500కు పైగా హామీలు ప్రజలకు ఇచ్చాయి. ఇప్పుడు తాజాగా బీజేపీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. పెద్ద ఎత్తున హామీలు కురిపిస్తూ మేనిఫెస్టోను ప్రకటించింది. చెన్నైలో సోమవారం కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, వీకే సింగ్ మేనిఫెస్టోను విడుదల చేశారు. వ్యవసాయానికి పెద్ద పీట వేస్తామని, ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ తీసుకొస్తామని బీజేపీ ప్రకటించింది. 50 లక్షల ఉద్యోగాల కల్పన, మత్య్సకారులకు రూ.6 వేల ఆర్థిక సహాయం, 8, 9 తరగతి విద్యార్థులకు ఉచితంగా టాబ్లెట్లు, ఇంటింటికీ రేషన్ సరుకుల సరఫరా తదితర హామీలు ఇచ్చింది. అమ్మాయిలకు (18-23 ఏళ్ల వయసు) ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్, ప్రతి జిల్లాకు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి, ప్రజలందరికీ ఉచిత తాగునీరు, చెన్నె కార్పొరేషన్ విస్తరణ, దళితులకు 12 లక్షల ఎకరాల భూమి పంపిణీ తదితర హామీలు బీజేపీ మేనిఫెస్టోలో పేర్కొంది. తమిళనాడు ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. 20 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తోంది. 234 స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీకి ఒకే దశలో ఏప్రిల్ 6వ తేదీన జరగనున్నాయి. మే 2వ తేదీన ఫలితాలు వెల్లడవుతాయి. చదవండి: టపాసులతో హత్యాయత్నం.. ఏడ్చేసిన మంత్రి ప్రధాని ‘ఇంటి ప్రకటన’పై రాజకీయ దుమారం -
బెంగాల్ రాజకీయాల్లో కీలక అంశం ఇదే!
సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల సమయంలో బెంగాల్‌ను కుల రాజకీయాలు, సమీకరణాలే శాసిస్తున్నాయి. అభివృద్ధి మంత్రం జపించాల్సిన స్థానంలో రాజకీయపార్టీలు కుల సమీకరణాలే లక్ష్యంగా ప్రజలను మచ్చికచేసుకొనే పనిలో బిజీగా ఉన్నాయి. ఇన్నేళ్లుగా కుల రాజకీయాలకు దూరంగా ఉన్న బెంగాల్లో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కులమే రాజకీయ పార్టీలకు ప్రధానాస్త్రంగా మారింది. అధికార పీఠాన్ని వదులుకోవడానికి ఏమాత్రం అవకాశం ఇవ్వరాదనే ఉద్దేశంతో వ్యూహాలు రచిస్తున్న టీఎంసీ ఒకవైపు, ఎట్టి పరిస్థితుల్లోనూ బెంగాల్ కోటలో కమలాన్ని వికసింపచేయాలని ఉవ్విళ్లూరుతున్న కమలదళం మరోవైపు కుల సమీకరణాలపై ప్రధానంగా దృష్టి పెట్టాయి. మేనిఫెస్టోల్లో ఓబీసీ అంశం బెంగాల్ అసెంబ్లీలో 50కి పైగా స్థానాల్లో కీలకంగా ఉన్న ఇతర వెనుకబడిన తరగతుల(ఓబీసీ)ను తమకు అనుకూలంగా మార్చుకొని ఎన్నికల్లో లబ్ధిపొందాలని బీజేపీ, టీఎంసీ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గత బుధవారం విడుదల చేసిన పార్టీ మేనిఫెస్టోలో మహిషి–తేలి, సాహా వంటి కులాలకు ఓబీసీ రిజర్వేషన్లు మంజూరు చేయాలనే నిర్ణయం ఆయా వర్గాలను తమ వైపు తిప్పుకొనేందుకు చేసిన ఒక కీలక పరిణామంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయ చదరంగంలో తృణమూల్ ఆడిన ఈ పందెంతో కమలదళం సైతం పావులు కదిపింది. మూడు, నాలుగు రోజుల క్రితం బెంగాల్లో పర్యటించిన బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా దీదీని విమర్శించారు. కొన్నేళ్లుగా ఓబీసీ కేటగిరీలో చేర్చేందుకు టీఎంసీ అడ్డుకుంటున్న కొన్ని కులాలను బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చేరుస్తామని నడ్డా హామీ ఇచ్చారు. తాజాగా విడుదల చేసిన బీజేపీ మేనిఫెస్టోలో మండల్ కమిషన్ ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకొని మహిష్య, తిల్లి, ఇతర హిందూ ఓబీసీ కులాలను ఓబీపీ రిజర్వేషన్లో చేరుస్తామని ప్రకటించింది. టీఎంసీ కంచుకోటగా పరిగణించే ఉత్తర 24 పరగణాలు, నాడియా జిల్లాలతో సహా దక్షిణ బెంగాల్‌లోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ జనాభా ఉన్న జంగల్‌మహల్ జిల్లాల్లో 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో కమలదళం క్షేత్రస్థాయిలో తమ వ్యూహాలను అమలు చేసి విజయం సాధించింది. అయితే బీజేపీకి 2019 సార్వత్రిక ఎన్నికలు కలిసిరావడానికి ప్రధాన కారణం ఓబీసీ ఓట్ల బదిలీ. వాస్తవానికి తూర్పు– పశ్చిమ మేదినీపూర్, హుగ్లీ, హౌరా జిల్లాల్లో బీజేపీ పట్టుపెంచుకుంది. దీంతో ఈ జిల్లాల్లోని ఎమ్మెల్సీ నియోజకవర్గాలు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తమ బల నిరూపణకు కలసివస్తాయని బీజేపీ పెద్దలు ఉవ్విళూరుతున్నారు. అదే సమయం లో తాయిలాలను ప్రకటించి తిరిగి అధాకారంలోకి రావాలని తృణమూల్ కాంగ్రెస్ భావిస్తోంది. ఇతర వర్గాలపై కన్ను: చాలాకాలంగా తృణమూల్ కాంగ్రెస్‌కు దూరంగా ఉన్న మతువా, ఆదివాసీ, రాజవంశీ, బౌరి, బాగ్డి వంటి కులాల ప్రజలకు తాయిలాలు ప్రకటించడం ద్వారా మచ్చిక చేసుకొనేందుకు మమతా బెనర్జీ ఒకవైపు ప్రయత్నిస్తుంటే, మరోవైపు బీజేపీ నాయకులు కూడా ఈ వర్గాలను ఆకర్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా రాజవంశీలు, మతువాలపై కమలదళం ప్రత్యేక దృష్టిపెట్టింది. మతువాలకు సంబంధించి అనేక అంశాల్లో కీలక ప్రకటనలు చేయడంతో పాటు, 2019 సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్ని అమలు చేసే ప్రక్రియపై కమలనాథులు ప్రణాళికలు అమలు చేస్తున్నారు. మతువా సామాజిక వర్గం తీర్థస్థలంగా భావించే ప్రాంతాన్ని మోడీ సందర్శించనున్నారు. బెంగాల్లో ఈ నెల 27న జరిగే తొలిదశ ఓటింగ్ ప్రక్రియతో మొత్తం ఎనిమిది దశల పోలిం గ్ ప్రక్రియ ప్రారంభమౌతుంది. అయితే తొలిదశ పోలింగ్‌కు ఒక్కరోజు ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 26న బంగ్లాదేశ్‌కు వెళుతున్నారు. ఆ మరుసటి రోజు 27వ తేదీన మతువా సామాజిక వర్గం దైవంగా కొలిచే హరిచంద్ ఠాకూర్ జన్మస్థలం, మతువాలకు తీర్థస్థలం అయిన గుడాకాం దీని సందర్శిస్తారు. ప్రధాని మోదీ ఈ పర్యటనపై కమలదళం పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే ఈ ప్రాంతాన్ని సందర్శించే తొలి భారత ప్రధానిగా నరేంద్ర మోదీ నిలువనున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 5 కోట్లకు పైగా మతువా వర్గ ప్రజల మనసుల్లో మోదీ చోటు సంపాదించుకున్నవారు అవుతారని బీజేపీ నాయకత్వం, మతువా మహాసంఘ్ నాయకులు భావిస్తున్నారు. 50 సీట్లపై ప్రభావం 2011లో తొలిసారి అధికారంలోకి వచ్చిన ఏడాదికి బెంగాల్ బ్యాక్వర్డ్ క్లాస్ బిల్లు–2012ను తీసుకొచ్చారు. ఈ జాబితాలో ముస్లింలలోని సయ్యద్, సిద్దిఖీ వర్గాలు మినహా మిగతా అందరినీ తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం చేర్చింది. హిందువుల్లో సూత్రధర్, స్వర్ణకర్, తేలి, కుంభకర, కుర్మి, మంజి, మోదక్, కన్సారీ, కహార్, మిడాస్, కపాలి, కర్మకర్లను కూడా ఓబీసీ కులాల్లోకి చేర్చారు. వాస్తవానికి రాష్ట్రంలోని 50 సీట్లపై మహిష, తోమర్, తేలి కులాలు తమదైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. రాష్ట్రంలో సుమారు 38 లక్షల మందికి బెంగాల్ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఓబీసీ ధృవీకరణ పత్రాలను జారీచేసిందని సమాచారం. ఇదేకాకుండా ఇటీవల ఒక ప్రభుత్వ పథకం కింద వేలాదిమందిని ఓబీసీలుగా గుర్తించేందుకు నమోదు ప్రక్రియను మమతా ప్రభుత్వం చేసిందని అనధికార వర్గాల సమాచారం. చదవండి: నేనో పెద్ద గాడిదనని.. అతడి అసలు రంగును గుర్తించలేకపోయా: మమత పరాజయాన్ని మమతా బెనర్జీ ముందే ఊహించారు: ప్రధాని మోదీ -
స్టాలిన్‌ది ఒబామా స్టైల్!
సాక్షి, చెన్నై : డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌పై ఎండీఎంకే నేత వైగో ప్రశంసలు కురిపించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాతో పోలుస్తూ కొనియాడారు. శుక్రవారం ఆయన స్టాలిన్ నియోజకవర్గమైన కొళత్తూరులో పర్యటించారు. వైగో మాట్లాడుతూ ఒబామా సెనేటర్‌గా ఉన్న సమయంలో తరచూ తాను ప్రాతినిథ్యం వహించే సెనేట్‌లో పర్యటించి ప్రజాసమస్యలు పరిష్కరించేవారన్నారు. అదే తరహాలో స్టాలిన్ సైతం ఎక్కడున్నా కొళత్తూరు ప్రజలతో మమేకమవుతుంటారని గుర్తుచేశారు. దీన్నిబట్టి ప్రజా సంక్షేమంపై వీరిద్దరి చిత్తశుద్ధి అర్థమవుతుందని వెల్లడించారు. అందుకే ఒబామా అమెరికా అధ్యక్షుడు అయ్యారని, ఇదే బాటలో స్టాలిన్ కూడా ముఖ్యమంత్రి కావడం తథ్యమని స్పష్టం చేశారు. చదవండి: సర్వేలన్నీ ఆ పార్టీ వైపే : 161 నుంచి 169 స్థానాలు! కమల్‌కు షాక్: రూ.11 కోట్లు సీజ్ -
234 స్థానాలకు 6,222 నామినేషన్లు దాఖలు
సాక్షి, చెన్నై: తమిళనాట అసెంబ్లీ ఎన్నికల్లో పంచముఖ సమరం నెలకొంది. ఇందులో ప్రధాన కూటములుగా డీఎంకే – కాంగ్రెస్, అన్నాడీఎంకే – బీజేపీల అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 234 స్థానాల కుగాను 6,222 నామినేషన్లు దాఖలయ్యాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే – 173, కాంగ్రెస్ –25, సీపీఐ, సీపీఎం, వీసీకే, ఎండీఎంకే లు తలా ఆరు స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఈ కూటమిలోని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్–3, మనిద నేయ మక్కల్ కట్చి 2, కొంగునాడు మక్కల్ కట్చి–3, తమిళగ వాల్వురిమై కట్చి, ఫార్వర్డ్‌బ్లాక్, ఆది తమిళర్ పేరవై, మక్కల్ విడు దలై కట్చిలు తలా ఓ స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఇందులో ఎండీఎంకే, మనిదనేయమక్కల్ కట్చి, కొంగునాడు మక్కల్ కట్చిలతో పాటు చిన్న పార్టీలు డీఎంకే ఉదయసూర్యుడి చిహ్నంపై పోటీ చేస్తున్నాయి. ఈ దృష్ట్యా, ఆపార్టీ చిహ్నంపై 188 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అన్నాడీఎంకే కూటమిలో ఆ పార్టీ –179, పీఎంఏకే –23, బీజేపీ–20, తమిళ మానిల కాంగ్రెస్–6, పెరుం తలైవర్ మక్కల్ కట్చి, తమిళగ మక్కల్ మున్నేట్ర కళగంతో పాటు మరికొన్ని చిన్న పార్టీలు తలా ఓ స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. చిన్న పార్టీలన్నీ అన్నాడీఎంకే రెండాకుల చిహ్నంపై పోటీ చేయనున్నాయి. కూటములు.. నటులు.. అన్నాడీఎంకేలో చీలికతో ఆవిర్భవించిన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం కూటమిలో డీఎండీకే, ఎస్‌డీపీఐలు ఉన్నాయి. ఇందులో డీఎండీకే 60, ఎస్డీపీఐ ఆరు స్థానాల్లో పోటీ చేస్తుండగా, మిగిలి న చోట్ల దినకరన్ నేతృత్వంలోని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం అభ్యర్థులు పోటీలో ఉన్నారు. విశ్వనటుడు కమలహాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యం, మరో నటుడు శరత్‌కుమార్ నేతృత్వంలోని ఎస్ఎంకే, రవిపచ్చముత్తు నేతృత్వం లోని ఐజేకేలు ఓ కూటమిగా, సినీ నటుడు, దర్శకుడు సీమాన్ నేతృత్వంలోని నామ్ తమిళర్ కట్చి ఒంటరిగా ఎన్నికల్ని ఎదుర్కొంటున్నాయి. ఐదు కూటములుగా పంచముఖ సమరం సాగుతున్నా, ప్రధాన పోటీ డీఎంకే, అన్నాడీఎంకేల మధ్య సాగనున్నాయి. ఈ రెండు పార్టీలు ఇప్పటికే ప్రజల్ని ఆకర్షించే దిశగా ఉచిత పథకాలతో, ప్రగతి నినాదంతో ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించాయి. అన్నాడీఎంకే కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఆ పార్టీ సమన్వయ కమిటీ కో కన్వీనర్ పళని స్వామి, డీఎంకే కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఎంకే స్టాలిన్ సుడిగాలి ప్రచార పర్యటనలో ఉన్నారు. ఈ ఇద్దరు పరస్పరం వ్యక్తిగత విమర్శలతో సైతం ప్రచారం ఎక్కుబెట్టే పనిలో పడ్డారు. అన్నాడీఎంకే కూటమికి మద్దతుగా ప్రధాని నరేంద్ర మోదీ, ఎనిమిది మంది కేంద్ర మంత్రుల ప్రచార సభలు ఈ నెల 23 తర్వాత సాగనున్నాయి. 6,222 నామినేషన్ల దాఖలు.. ఈ నెల 12వ తేదీ నుంచి నామినేషన్ల పర్వం సాగుతూ వచ్చింది. శుక్రవారం సాయంత్రంతో నామినేషన్లు ముగిశాయి. శుక్రవారం రాత్రి ఏడున్నర గంటలకు అందిన సమాచారం మేరకు 234 స్థానాల్లో పోటీ నిమిత్తం 6,222 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో పురుషులు 5,274, మహిళలు 945 మంది కాగా, ముగ్గురు ఇతరులు ఉన్నారు. ఈ నెల 22న నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల తుదిజాబితా అదే రోజున వెలువడనుంది. అన్నాడీఎంకే సిట్టింగ్ ఎమ్మెల్యేలు తోపు వెంకటాచలం, చంద్రశేఖర్ ఆ పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పెరుంతురై, సెంతామంగళం నియోజకవర్గాల్లో రెబల్స్‌గా పోటీలో ఉన్నారు. -
వీరప్పన్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌కు షాకిచ్చిన డిపార్ట్మెంట్
సాక్షి, చెన్నై: ఎన్నికల్లో భార్య పోటీ చేస్తుండడం ఓ పోలీసు అధికారిని ఇరకాటంలో పడేసింది. ఆయన్ను బదిలీ చేస్తూ, ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ పోలీసు బాసుల నిర్ణయం తీసుకున్నారు. తిరునల్వేలి జిల్లా అంబాసముద్రం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం అభ్యర్థిగా రాణిరంజితం పోటీ చేస్తున్నారు. ఆమె నామినేషన్ దాఖలు, ప్రచారంలో బిజీ అయ్యారు. ఈ పరిస్థితుల్లో అదే జిల్లాలో నగర అదనపు కమిషనర్‌గా ఆమె భర్త వెల్లదురై పనిచేస్తుండడంతో రచ్చకెక్కింది. చందనపు దొంగ వీరప్పన్ ఎన్కౌంటర్ టీంలో కీలక పాత్ర పోషించడమే కాదు, అనేక ఎన్కౌంటర్లతో ఎన్కౌంటర్ వెల్లదురైగా పేరు గడించిన ఈ అధికారికి భార్య రూపంలో విధి నిర్వహణలో చిక్కులు తప్పలేదు. దీంతో తిరునల్వేలి కమిషనర్ అన్బు ఆయన్ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, అధికార అన్నాడీఎంకే నుంచి చీలిన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంలో ఈ అధికారి సతీమణి పోటీ చేస్తుండడం కాబోలు, ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా చెన్నై డీజీపీ కార్యాలయంలో ఎన్నికల విధులకు దూరంగా ఓ మూలన కూర్చోబెట్టడం గమనార్హం. శ్రీరంగంలో చిన్నమ్మ పూజలు సాక్షి, చెన్నై: తిరుచ్చి శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయంలో శుక్రవారం చిన్నమ్మ శశికళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే, సమయపురం మారియమ్మన్ ఆలయాన్ని కూడా సందర్శించారు. పరప్పన అగ్రహార చెర నుంచి చెన్నైకు వచ్చిన 41 రోజుల తర్వాత ఇంటి నుంచి శశికళ అడుగు బయటపెట్టారు. గురువారం తంజావూరులోని కులదైవం ఆలయంలో పూజలు నిర్వహించారు. శుక్రవారం తిరుచ్చి శ్రీరంగం చేరుకుని రంగనాథస్వామి ఆలయాన్ని సందర్శించారు. అక్కడ పూజల అనంతరం మధ్యాహ్నం తిరుచ్చిలోని బంధువు కళియ పెరుమాల్ ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకున్నారు. సాయంత్రం సమయపురం మారియమ్మన్ ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. శనివారం చిన్నమ్మ భర్త నటరాజన్ మూడో వర్ధంతి. ఈసందర్భంన్ని పురస్కరించుకుని తంజావూరు ముల్లైవాయికాల్ స్తూపం ఎదురుగా ఉన్న నటరాజన్ సమాధి వద్ద చిన్నమ్మ నివాళులర్పించే అవకాశాలు ఉన్నాయి. చిన్నమ్మ తిరుచ్చి ఆలయ సందర్శన సమయంలో ఆమె వెన్నంటి అన్న కుమారుడు వెంకటేషన్ మాత్రమే ఉన్నారు. ఒకప్పుడు వీవీఐపీగా ఆలయ సందర్శనకు వచ్చిన శశికళ ఇప్పుడు సాదాసీదా వ్యక్తిగా వెళ్లి దర్శించుకుని వచ్చారు. -
కమల్‌కు షాక్: రూ.11 కోట్లు సీజ్
సాక్షి, చెన్నై: అవినీతికి వ్యతిరేక పోరాటం పేరుతో ముందుకు సాగుతున్న కమల్ సారథ్యంలోని మక్కల్ నీది మయ్యం పార్టీ ఇరకాటంలో పడింది. ఆ పార్టీ కార్యదర్శి చంద్రశేఖర్‌పై పలు అవినీతి ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. కరోనా కాలంలో ప్రభుత్వం మాస్క్‌లు, పీపీఈ కిట్లను చంద్రశేఖర్‌కు చెందిన అనితా టెక్స్కార్ట్ ఇండియా నుంచి సుమారు రూ.450 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సంస్థపై ఐటీ దాడులు చేయడంతో విషయం బట్టబయలైంది. అలాగే ఈ సంస్థలో రూ.11కోట్ల లెక్కలో లేని నగదు పట్టుబడడమే కాకుండా సుమారు రూ.80కోట్ల పన్నును ఎగవేసినట్లు వెల్లడైంది. చదవండి: ఐటీ దాడులపై స్పందించిన తాప్సీ -
కమల్ మేనిఫెస్టో: నిరుద్యోగులు, గృహిణిలపై వరాల జల్లులు
సాక్షి, చెన్నై: రాష్ట్ర ప్రగతి లక్ష్యంగా పదేళ్ల ప్రణాళికతో మక్కల్ నీది మయ్యం నేత కమల్ హాసన్ ఎన్నికల మేనిఫెస్టోను శుక్రవారం ప్రకటించారు. అధికారంలోకి వస్తే, నీట్ పరీక్షకు బదులుగా రాష్ట్ర స్థాయిలో స్టేట్ సిల బస్తో సీట్ నిర్వహిస్తామని ప్రకటించారు. గ్రామ ప్రగతికి స్మార్ట్ విలేజ్ పథకం, ఆర్మీ తరహాలో ప్రజా క్యాంటీన్ల ద్వారా అన్ని రకాల వస్తువుల్ని చౌక ధరకే అందించనున్నామని ప్రకటించారు. మక్కల్ నీది మయ్యం, ఎస్ఎంకే, ఐజేకేలు కలిసి అసెంబ్లీ ఎన్నికల్ని కూటమిగా ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కోయంబత్తూరు దక్షిణం నియోజకవర్గం నుంచి ఆ పార్టీ నేతల కమల్ పోటీలో ఉన్నారు. ఈ దృష్ట్యా, కోయంబత్తూరు వేదికగా శుక్రవారం ఎన్నికల మేనిఫెస్టోను సైతం కమల్ విడుదల చేశారు. ఇందులో తమిళనాడు సమగ్రాభివృద్ధి, అప్పు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడం, ఉద్యోగ, ఉపాధి అవకాశాల మెరుగు, విద్య, వైద్య పథకాలతో ప్రజాకర్షణ అంశాలను పొందుపరిచారు. పార్టీ ఉపాధ్యక్షులు మహేంద్రన్, పొన్రాజ్లతో కలిసి మేనిఫెస్టోను కమల్ ఆవిష్కరించారు. ప్రజల్ని బానిసలుగా, పేదలుగా మార్చేసి, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన పార్టీలకు విశ్రాంతి ఇద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. మేనిఫెస్టోలో కొన్ని.. ∙రాష్ట్ర ప్రగతిని కాంక్షిస్తూ పదేళ్ల ప్రణాళిక ∙రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ∙అన్ని రంగాల్లోనూ తమిళనాడు అగ్రస్థానంలో నిలబెట్టడమే లక్ష్యం. రాష్ట్ర ఆర్థిక ప్రగతి రానున్న పదేళ్లలో పది నుంచి 20 శాతం మేరకు వృద్ధి లక్ష్యంగా కార్యాచరణ ∙వ్యక్తి ఆదాయం సంవత్సరానికి 7 నుంచి పది లక్షల వరకు పెంపు ∙నదీ జలాల అనుసంధానం, జల అభివృద్ధి, వాటర్ మెనేజ్మెంట్బోర్డు, అందరికీ స్వచ్ఛమైన శుద్ధీకరించిన నీళ్లు ∙వ్యవసాయ రంగంలో హరిత విప్లవం లక్ష్యం. వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర, రైతుల హక్కుల పరిరక్షణ ∙జాలర్లకు జీవనాధారం, భద్రత లక్ష్యంగా చర్యలు ∙ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగు. నీట్‌కు బదులు రాష్ట్ర స్థాయిలో స్టేట్ సిలబస్‌తో సిట్ పరీక్ష. అందరికీ వైద్యం, విద్య, ఉన్నత విద్యకు చర్యలు ∙గ్రామాల సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తూ స్మార్ట్ విలేజ్ పథకం ∙ప్రభుత్వ ఉద్యోగాల్లో న్యాయం, అర్హులకు ఉద్యోగాలు, పారిశ్రామిక ప్రగతి, వృద్ధులకు భద్రత, అనాథలకు ఆపన్న హస్తం, రాజకీయ న్యాయం, సమష్టి నాయకత్వంఅభివృద్ధి చెందిన చిన్న దేశాలకు దీటుగా తమిళనాడును తీర్చిదిద్దడం లక్ష్యంగా పథకాలు అమలు. ∙గృహిణులకు జీతాలు (ఇది ఉచితం కాదు –వారికి వృత్తిపరంగా శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడం) ∙విద్యుత్, రవాణా సంస్థల బలోపేతం. ఈ సంస్థల్లో ఉద్యోగులకు వాటా. ∙ప్రజలు చౌక ధరకే అన్ని వస్తువుల్ని కొనుగొలు చేసుకునే రీతిలో ఆర్మీ క్యాంటీన్ల తరహాలో మక్కల్ క్యాంటీన్ల ఏర్పాటును మేనిఫెస్టోలో పొందుపరిచారు. సీపీఎం, టీఎంసీలు కూడా.. డీఎంకే కూటమిలోని సీపీఎం, అన్నాడీఎంకే కూటమిలోని తమాకా కూడా మేనిఫెస్టోలను శుక్రవారం ప్రకటించారు. సీపీఎం రాష్ట్రకార్యదర్శి బాలకృష్ణన్, సీనియర్ నేత టీకే రంగరాజన్ ఆవిష్కరించిన మేనిఫెస్టోలో సంపూర్ణ మద్యనిషేధం, ఖాళీగా ఉన్న 4.5 లక్షల ఉద్యోగాల భర్తీ, శరణార్థులుగా ఉన్న శ్రీలంక తమిళులకు భారత పౌరసత్వం అంశాలను ఇందులో పొందుపరిచారు. టీఎంసీ నేత జీకే వాసన్ విడుదల చేసిన మేనిఫెస్టోలో ప్రభుత్వ పాఠశాలల ప్రగతి, ఫీజుల తగ్గింపు, వైద్య, వ్యవసాయ రంగాల బలోపేతం, ఆలయాలన్నీ భక్తులకు అప్పగింత, -
దుర్యోధనుడు, దుశ్శాసనుడు మనకొద్దు
ఇగ్రా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భారతీయ జనతా పార్టీపై మరోసారి విరుచుకుపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దుర్యోధునుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దుశ్శాసనుడు అని నిప్పులు చెరిగారు. తన పార్టీ నుంచి ఫిరాయించి, బీజేపీలోకి చేరి, తనపైనే పోటీకి దిగిన సువేందు అధికారి ఒక ద్రోహి(మీర్ జాఫర్) అని మండిపడ్డారు. ఆమె శుక్రవారం ఇగ్రా, తూర్పు మిడ్నాపూర్‌లో ఎన్నికల ప్రచార సభల్లో చక్రాల కుర్చీలో కూర్చొని ప్రసంగించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వీడ్కోలు చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ పార్టీ తమకు అవసరం లేదన్నారు. నరేంద్ర మోదీ ముఖం చూడడం ఇష్టం లేదని తేల్చిచెప్పారు. అల్లర్లు, లూటీలు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, మీర్ జాఫర్ తమకు అక్కర్లేదని స్పష్టం చేశారు. మమత ఏం మాట్లాడారంటే.. ద్రోహులంతా వెళ్లిపోయారు ‘’మా పార్టీ నుంచి ఇతర పార్టీల్లోకి ఫిరాయించిన నేతలంతా ద్రోహులు. వారు వెళ్లిపోవడంతో మాకు మంచే జరిగింది. మా పార్టీ ప్రక్షాళన అయ్యింది. ఆ పార్టీ అల్లర్లు సృష్టిస్తోందని, లూటీలు చేస్తోంది, హత్యా రాజకీయాలకు పాల్పడుతోంది. పరివర్తన్(మార్పు) అంటూ నేను ఇచ్చిన నినాదాన్ని ప్రధాని మోదీ కాపీ కొట్టారు. సువేందు అధికారిని గుడ్డిగా నమ్మాను. అతడు మాత్రం నన్ను మోసం చేశాడు. మనిషి ఎదురుగా హరి హరి అని జపం చేసే బీజేపీ నేతలు వెనుక నుంచి వెన్నుపోటు పొడుస్తారు. ఇకపై ‘నో ఓటు టు బీజేపీ’ అనేది మన నినాదం. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) గోల్మాల్ చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోంది. ఎన్నికలు పూర్తయ్యాక ఈవీఎంలను భద్రపరిచే కేంద్రాల వద్ద నిఘా పెట్టాలి’’ అని కోరారు. బీజేపీ దోపిడీ సంగతేంటి? నేను కోల్‌కతాలో కాకుండా నందిగ్రామ్ నుంచి పోటీ చేయడానికి కారణం బలవంతపు భూసేకరణపై ప్రజా పోరాటం ఇక్కడే పురుడుపోసుకుంది. ఈ పోరాటం జరిగినప్పుడే ఇక్కడి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నా. బెంగాల్లో ప్రతి ప్రాంతం నా సొంత ప్రాంతమే. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళలకు రక్షణ లేదు. ఒక పేదవాడు రూ.500 దొంగతనం చేస్తే పట్టుకొని శిక్షిస్తున్నాం. మరి ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం ద్వారా, అవినీతి ద్వారా కోట్లాది రూపాయలు దోచుకుంటున్న బీజేపీ సంగతేంటి? బీజేపీ నేతలు సాగిస్తున్న ఈ దోపిడీ ప్రజలకు తెలియడం లేదు. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్‌ను మళ్లీ గెలిపిస్తే ఢిల్లీలో బీజేపీని గద్దె దింపడానికి మార్గం ఏర్పడుతుంది’’ అని మమతా బెనర్జీ సూచించారు. -
అధినాయకి వర్సెస్ అధికారి
సరిగ్గా పద్నాలుగేళ్ల క్రితం నందిగ్రామ్ పేరు తొలిసారిగా వార్తల్లోకెక్కింది. సెజ్‌ల ఏర్పాటు కోసం రైతుల నుంచి భూసేకరణకు నిరసనగా నందిగ్రామ్‌లో ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమ సెగలు దేశం నలుమూలలకీ పాకాయి. పోలీసు కాల్పుల్లో 14 మంది రైతులు మరణించడంతో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నదాతలకు అండగా నిలిచి ఉద్యమాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు. నందిగ్రామ్ వేదికగా నాలుగేళ్లు సుదీర్ఘ పోరాటమే చేసి కాలం మారింది కామ్రేడ్స్ అని గర్జిస్తూ 2011 అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టు కంచుకోటని బద్దలు కొట్టారు. మళ్లీ ఇన్నేళ్లకి మమత నందిగ్రామ్ అసెంబ్లీ బరిలో దిగడంతో దేశవ్యాప్తంగా మరోసారి నందిగ్రామ్ పేరు మారుమోగుతోంది. ఇన్నాళ్లూ తనకి కుడి భుజంగా ఉంటూ గత డిసెంబర్లోనే బీజేపీలో చేరిన సువేందు అధికారి సవాల్‌ని స్వీకరించి మరీ నందిగ్రామ్ బరిలో మమత దిగడంతో ఆ నియోజకవర్గంలో రాజకీయ సంగ్రామం వేడెక్కింది. వ్యూహ ప్రతివ్యూహాలు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నందిగ్రామ్‌లో నామినేషన్ వేసిన సమయంలో కాలికి అయిన గాయాన్ని తనకి అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వీల్‌చైర్ మీదే ఎన్నికల ర్యాలీల్లో పాల్గొంటూ సానుభూతి ఓట్లు దక్కేలా వ్యూహాలు రచిస్తున్నారు. బీజేపీ తనని నాలుగ్గోడల మధ్య పరిమితం చేయడానికే నందిగ్రామ్‌లో తనపై దాడికి దిగిందని ఆరోపిస్తున్నారు. తన గెలుపు కోసం పూర్ణేందు బసు అనే సీనియర్ మంత్రిని ప్రత్యేకంగా నియమించారు. పూర్ణేందు అధికారి సాక్షితో మాట్లాడుతూ మమతా బెనర్జీ చేపట్టిన సంక్షేమ పథకాలే ఆమెని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. మమతను వెన్ను పోటు పొడిచి పార్టీ వీడిన సువేందు అధికారి తప్పు చేశారని, ఆయన చేసిన తప్పులే దీదీకి ఓట్లను కురిపిస్తాయని అన్నారు. నందిగ్రామ్ ఎమ్మెల్యేగా ఉన్న సువేందు అధికారి చేసిన అవినీతి పనులే ఆయనని ఓటమి పాలు చేస్తాయని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ధోలాసేన్ జోస్యం చెప్పారు. నందిగ్రామ్‌లో మహిళలకి రాజకీయ చైతన్యం ఎక్కువ. తరచుగా ఉద్యమాల్లో పాల్గొంటారు. 49 శాతం ఓట్లు ఉన్న మహిళా ఓటర్లు మమతకే అండగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి వన్ మ్యాన్ ఆర్మీగా దూసుకుపోతున్నారు. 2016 ఎన్నికల్లో 67% ఓట్లు కొల్లగొట్టిన సువేందు అ«ధికారి కుటుంబానికి ఇక్కడ మంచి పలుకుబడి ఉంది. సువేందు అధికారి తండ్రి, సోదరుడు కూడా ఎంపీలుగా పని చేశారు. జూట్ మిల్లు కార్మిక కుటుంబాలతో వీరికి సన్నిహిత సంబంధాలున్నాయి. నందిగ్రామ్ నియోజకవర్గం ఉన్న మిడ్నాపూర్ ఉమ్మడి జిల్లాలో వీరి కుటుంబానికి ఎదురే లేదు. హిందూ ఓట్లను ఏకం చేయడంతో పాటుగా ముస్లిం ఓట్లను రాబడితే గెలుపు ఖాయమన్న ధీమాలో అధికారి ఉన్నారు. బీజేపీకి కేడర్ లేకపోవడం ఆయనకు మైనస్‌గా మారింది. సమఉజ్జీల మధ్య సమరంలో ముస్లింలు, కమ్యూనిస్టు ఓటు బ్యాంకుపైనే వారి గెలుపు ఆధారపడి ఉంది. ముస్లిం ఓటు బ్యాంకు ఎటు ? నందిగ్రామ్ నియోజకవర్గంలో 30% ఉన్న ముస్లింలు ఈ సారి ఎన్నికల్లో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నారు. ముస్లింలు మొదట్లో కమ్యూనిస్టులకు అండగా ఉండేవారు. 2007లో జరిగిన భూ సేకరణలో భూములు కోల్పోయిన వారు మమతకి మద్దతుగా నిలిచారు. మమతా బెనర్జీ ఈ ఎన్నికల్లో ముస్లిం ఓటు బ్యాంకుపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. సువేందు అధికారి తనకున్న వ్యక్తిగత పరిచయాలతో ముస్లిం ఓట్లను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక సీపీఎం, కాంగ్రెస్, ఐఎస్ఎఫ్ ఒక కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఐఎస్ఎఫ్ నాయకుడు అబ్బాస్ సిద్ధి్దఖికి నందిగ్రామ్‌లో గట్టి పట్టు ఉంది. ఆయన ప్రభావంతో ముస్లింలు తిరిగి కమ్యూనిస్టుల వైపు మళ్లితే మమతా బెనర్జీ గెలుపు అవకాశాలు ప్రమాదంలో పడిపోతాయి. హిందూత్వ కార్డు నందిగ్రామ్‌లో 70% హిందూ ఓట్లన్నీ గంపగుత్తలా తమకే పడేలా బీజేపీ వ్యూహరచన చేస్తోంది. బీజేపీ కరడుగట్టిన హిందూత్వ వాదాన్ని ఎదుర్కోవడానికి మమత కూడా హిందూత్వ బాట పట్టారు. గుళ్లు గోపురాలు తి రుగుతూ, ఎన్నికల ర్యాలీల్లో శ్లోకాలు వల్లె వేస్తున్నారు. తమదీ హిందూ కుటుంబమే అని చెబుతున్నారు. బ్రాహ్మణ్ సమ్మేళన్ నిర్వహించడానికి ప్రణాళికలు రచిస్తూ దుర్గా పూజ కమిటీలకు సాయం చేస్తున్నారు. హిందువుల్లో వైçష్ణవ ఓటర్లు చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్నారు. వీరు తులసిమాల ధరిస్తారు. విభూదిని బొట్టుగా పెట్టుకుంటారు. మమత గెలిస్తే విభూది పెట్టుకోవాలన్నా అనుమతి తీసుకోవాలంటూ సువేందు ప్రచారం చేస్తున్నారు. మత్స్యకారుల పాత్ర హుగ్లీ నది సముద్రంలో కలిసే ప్రాంతం నందిగ్రామ్‌లో ఉంది. దీంతో ఇక్కడ భారీ సంఖ్యలో మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. సముద్రపు నీటిని చట్టవిరుద్ధంగా కాలువల ద్వారా గ్రామాల్లోకి తీసుకువచ్చి వేలాది ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్నారు. రొయ్యల సాగుని అడ్డుకుంటామని మమత ప్రభుత్వం చెప్పినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. సువేందు అధికారి రొయ్యల వ్యాపారుల సిండికేట్‌తో కలిసి వ్యాపారం చేస్తున్నారు. ఈ మత్స్యకారుల్లో దళితులు, ముస్లింలు కూడా ఎక్కువే ఉన్నారు. వీరంతా అధికారి వైపే ఉంటారన్న అంచనాలున్నాయి. సీపీఎం ప్రభావం ? నందిగ్రామ్‌లో సీపీఎం ప్రభావం ఎన్నికల్లో కీలకం కానుంది. చాలా ఏళ్లు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టులకు కంచుకోట. 2007లో జరిగిన కాల్పుల ఘటనతో వారి ఇమేజ్ బాగా డ్యామేజ్ అయింది. కేడర్ పెద్ద సంఖ్యలో పార్టీని విడిచి వెళ్లిపోయారు. అయితే టీఎంసీ అధికారంలోకి వచ్చాక సీపీఎం నాయకులపైనా, కార్యకర్తలపైనా దాడులు జరగడంతో మమతపై వారంతా గుర్రుగా ఉన్నారు. వీరు 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేశారన్న విశ్లేషణలు ఉన్నాయి. సీపీఎం విద్యార్థి నాయకురాలైన మీనాక్షి ముఖర్జీ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీకి దిగింది. వాక్పటిమ కలిగిన మీనాక్షి ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. కమ్యూనిస్టులు తమ ఓటు బ్యాంకును తిరిగి కొల్లగొడితే సువేందు అధికారిపై వ్యతిరేక ప్రభావాన్ని చూపించే అవకాశాలున్నాయి. – నందిగ్రామ్ నుంచి సాక్షి ప్రతినిధి -
మిమ్మల్ని నమ్మి రాజకీయాల్లోకి వచ్చా!
తిరువళ్లూరు/చెన్నై: మిమ్మల్ని నమ్ముకునే రాజకీయాలోక్లి వచ్చానని రాష్ట్రాభివృద్ధి కోసం డీఎంకేను ఆదరించాలని డీఎంకే అధినేత స్టాలిన్ ప్రజలను కోరారు. గుమ్మిడిపూండిలో డీఎంకే అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీజే గోవిందరాజన్, పొన్నేరి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దురైచంద్రశేఖర్లకు మద్దతుగా డీఎంకే అధినేత స్టాలిన్ గురువారం ప్రచారం నిర్వహించారు. స్టాలిన్ మాట్లాడుతూ కరుణానిధి పాలనను మళ్లీ తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా డీఎంకే అధికారంలోకి వస్తే వ్యవసాయం, చేనేతకు ఉచిత విద్యుత్‌ను అందజేస్తామని హామీ ఇచ్చారు. డీఎంకే అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులను అన్ని విధాల ఆదుకుంటామన్నారు. వరికి క్వింటాల్‌కు రూ.2,500, టన్ను చెరుకుకు రూ.4వేల మద్దతు ధర ఇస్తామని తెలిపారు. డీఎంకే మేనిఫెస్టోను కాపీ చేసి అన్నాడీఎంకే మేనిఫెస్టోను రూపొందించారని ఆరోపించారు. నీట్ పరీక్షలను రాష్ట్రంలో అనుమతించొద్దని అన్నాడీఎంకేను కోరినా ఫలితం లేదని ఆరోపించారు. చదవండి: కోటీశ్వరుల్లో నంబర్–1 సుబ్బయ్య 20 సీట్లు.. 30 మంది స్టార్ క్యాంపెయినర్లు! -
ఇక్కడ గెలిచాక ఢిల్లీలో ‘పరివర్తన్’
కలైకుందా/గర్బేటా: పశ్చిమ బెంగాల్లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాక, ఢిల్లీలో పరివర్తన్ (మార్పు) తీసుకొస్తానని ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో గెలిచాక తాను కేంద్ర రాజకీయాల్లో అడుగుపెడతానని, ప్రత్యామ్నాయంగా మారుతానని బీజేపీ భయపడుతోందని, అందుకే ఆ పార్టీ పెద్దలంతా బెంగాల్‌ను లక్ష్యంగా చేసుకున్నారని చెప్పారు. పరివర్తన్ అంటూ తాను ఇచ్చిన నినాదాన్ని బీజేపీ దొంగిలించిందని, దాన్ని అసోల్ పరివర్తన్ (అసలైన మార్పు) అంటూ రీమోడలింగ్ చేసిందని విమర్శించారు. మమతా బెనర్జీ గురువారం పశ్చిమ మేదినీపూర్ జిల్లాలో ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలంతా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఆమె ఇంకా ఏం మాట్లాడారంటే.. బీజేపీతో కూటమి కుమ్మక్కు ‘‘పోలీసులపై నాకు గౌరవం ఉంది. వారు తప్పుడు పనులు చేయరు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో గోల్మాల్ చేయాలని బీజేపీ నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. ఒకప్పుడు మావోయిస్టులకు కంచుకోట అయిన జంగల్‌మహల్ సమగ్రాభివృద్ధికి మా ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. బెంగాల్లో సీపీఎం–కాంగ్రెస్ కూటమి మతతత్వ బీజేపీతో చేతులు కలిపింది. అందుకే మార్క్సిస్టు మిత్రులు కూడా ఆ కూటమి అభ్యర్థులకు ఓటేయవద్దు. గాంధీజీని హత్య చేసిన వారితో సంబంధాలున్న వారికి ఒక్క ఓటు కూడా వేయొద్దు. దుర్గాపూజకు రూ.50,000 ఇస్తాం తృణమూల్ కాంగ్రెస్‌ను మళ్లీ గెలిపిస్తే బెంగాల్లో ఓడరేవులు, పరిశ్రమలు స్థాపిస్తాం. భారతీయ రైల్వేను అమ్మేయడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. రైల్వే ఉద్యోగులు ఆ పార్టీని ఓడించాలి. మా పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే విద్యార్థులు ఉన్నత చదువులు చదవడానికి తక్కువ వడ్డీతో రూ.10 లక్షల రుణం మంజూరు చేస్తాం. దుర్గాపూజ చేసుకోవడానికి కమ్యూనిటీ క్లబ్‌లకు రూ.50 వేల చొప్పున ఇస్తాం. డబ్బు సంచులు తెస్తున్నారు బీజేపీ అబద్ధాల పార్టీ, ఇచ్చిన హామీలను ఆ పార్టీ ఎప్పుడూ నెరవేర్చదు. నరేంద్ర మోదీ హామీ ఇచ్చినట్లుగా రూ.15 లక్షలు ప్రజలకు అందాయా? ప్రధానమంత్రిగా కుర్చీ ఎక్కాక ఆయన తన çహామీని తుంగలో తొక్కారు. బెంగాల్లో కరోనా మహమ్మారిని సమర్థంగా నియంత్రిస్తున్నాం. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కరోనా మళ్లీ ఉధృతంగా వ్యాప్తి చెందుతోంది. రాష్ట్ర రాజధాని కోల్‌కతా నగర సంస్కృతిలో భాగమైన ‘కోల్‌కతా కాఫీ హౌస్’పై ఆధిపత్యం చెలాయించడానికి బీజేపీ గూండాలు కుట్ర పన్నుతున్నారు. దాని గొప్పదనం వారికి తెలియదు. నందిగ్రామ్‌లో బీజేపీ నేతలు నాపై దాడి చేశారు. ఇప్పుడు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు కోట్లాది రూపాయల అక్రమాలు సాగించింది. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకంతో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారుతోంది. ఆ డబ్బుకు లెక్కాపత్రం ఉండడం లేదు. బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున డబ్బు సంచులు హెలికాప్టర్లు, విమానాల్లో తీసుకొస్తున్నారు. బెంగాల్లో ఎలాగైనా నెగ్గాలని కుట్ర పన్నుతున్నారు’’ అని మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. -
మే 2 తర్వాత మమత ఆట ముగిసిపోతుంది: మోదీ
పురూలియా: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆట ముగిసిపోతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జోస్యం చెప్పారు. దీదీ సర్కార్‌కి రోజులు దగ్గర పడ్డాయని, అసలు సిసలు పరివర్తన ఇక మొదలు కానుందని అన్నారు. ‘‘దీదీ మీరు పదేళ్లు మీ ఆట ఆడారు. మే 2న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాగానే దీదీ ఖేలా శేష్ హోబె, వికాస్ ఆరంభ్ హోబె (ఆమె ఆట ముగిసిపోతుంది, మా అభివృద్ధి ప్రారంభమవుతుంది)’’అని ప్రధాని అన్నారు. ఈ నెల 27 నుంచి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలు కానున్న నేపథ్యంలో ఆదివాసీ ప్రాంతమైన జంగల్‌మహల్ ప్రాంతంలోని పురూలియాలో గురువారం ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ప్రధాని తృణమూల్ కాంగ్రెస్ ఖేలా హోబె (ఆట మొదలైంది) నినాదాన్ని ప్రస్తావిస్తూ మాటల తూటాలు విసిరారు. ‘మమత ఎన్నికల ర్యాలీలో తరచూ ఆట మొదలైంది అని అంటూ ఉంటారని ఆమెకు ఆట మొదలైందేమో కానీ బీజేపీ అధికారంలోకి వస్తే అభివృద్ధి, విద్య, మహిళా సాధికారత, ఉద్యోగాలు, పక్కా ఇళ్లు, సురక్షిత నీరు, ఇంటింటికీ కుళాయిలు అన్నీ మొదలవుతాయని ప్రధాని గట్టిగా చెప్పారు. కట్ మనీ ప్రభుత్వం మమతా బెనర్జీ ప్రభుత్వం అవినీతి బురదలో కూరుకుపోయిందని ప్రధాని ఆరోపించారు. కమీషన్లు లేనిదే ప్రభుత్వం పని చేయడం లేదని, అధికార పార్టీ చేస్తున్న ఈ దోపిడీ వల్ల దళితులు, ఆదివాసీలు, ఇతర వెనుకబడిన వర్గాలు అధికంగా నష్టపోతున్నారని అన్నారు. భారీగా హాజరైన జనసందోహాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడిన ప్రధాని మధ్య మధ్యలో బెంగాలీలో కొన్ని వాక్యాలు మాట్లాడుతూ ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ‘‘మీరు చాలా కాలంగా ప్రజల్ని అణచివేశారు. దుర్గమ్మ ఆశీస్సులతో మిమ్మల్ని ఓడిస్తాం’’అని సభికుల హర్షధ్వానాల మధ్య బెంగాలీలో చెప్పారు. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పదానికి ప్రధాని కొత్త అర్థాన్ని ఇచ్చారు. టీఎంసీ అంటే ట్రాన్స్ఫర్ మై కమిషన్ అని అభివర్ణించారు. కేంద్రం డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) విధానాన్ని అనుసరిస్తూ ఉంటే, తృణమూల్ కాంగ్రెస్ ట్రాన్స్ఫర్ మై కమిషన్ అంటోందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజా ధనాన్ని లూటీ చేసే మావోయిస్టులను మమత సర్కార్ పెంచి పోషిస్తోందని మోదీ ఆరోపించారు. కేంద్ర నిధులన్నీ స్వాహా వెనుకబడిన ప్రాంతాలకి, వర్గాలకి కేంద్రం అందించే నిధులేవీ మమత ప్రజలకు ఇవ్వడం లేదని ప్రధాని ఆరోపించారు. ‘కేంద్రం పక్కా గృహాల కోసం నిధులు ఇచ్చింది. టీఎంసీ సర్కార్ దానిని స్వాహా చేసింది. నిరుపేదలకు తక్కువ ధరకే బియ్యం పంపాం. టీఎంసీ దోపిడీదారులు దానిని మింగేశారు. లాక్డౌన్ సమయంలో ఉచిత బియ్యం ఇచ్చాం. దీదీ సర్కార్ వాటిని బొక్కేసింది. అంఫాన్ తుపాను సమయంలోనూ అదే తీరు. రైతన్నలు, సాంతాల్ గిరిజనులు సాయం కోసం ఆశగా ఎదురు చూశారు. వారిపై మమత కురిపించలేదు’’అనివిమర్శించారు. మమత తన ఆటలో తాను మునిగితేలిపోతున్నారని, దీంతో ఈ గిరిజన ప్రాంతానికి పరిశ్రమలు రావడం లేదని, నీళ్లు లేక వ్యవసాయం సంక్లిష్టంగా మారి ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ జనం వలస బాట పట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే వలసల్ని అడ్డుకుంటామని హామీ ఇచ్చారు. -
కోటీశ్వరుల్లో నంబర్–1 సుబ్బయ్య
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులందరిలో అత్యంత ధనవంతుడిగా అన్నాడీఎంకే అభ్యర్థి ఇసక్కి సుబ్బయ్య నిలిచారు. ఆయన ఆస్తి రూ. 246 కోట్లుగా ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికార, ప్రతిపక్షాలకు చెందిన అభ్యర్థులు నామినేషన్ల సమర్పణలో నిమగ్నమయ్యారు. ఇందులో మంత్రులు, మాజీలు, సిట్టింగ్‌లు అనేక మంది ఉన్నారు. వీరందరి ఆస్తులు కోట్లలోనే ఉన్నాయి. అయితే, మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమలహాసన్, ఉపాధ్యక్షుడు మహేంద్రన్ ఆస్తులు మూడు డిజిట్ కోట్లలో ఉన్నాయి. కమలహాసన్ ఆస్తి రూ.177 కోట్లుగా, మహేంద్రన్ ఆస్తి 160 కోట్లుగా ఉన్నాయి. వీరందర్నీ తలదన్నే రీతిలో కోటీశ్వరుల జాబితాలో అన్నాడీఎంకే మాజీ మంత్రి ఇసక్కి సుబ్బయ్య నంబర్‌వన్‌గా నిలిచారు. 2011లో ఆయన ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో ఆస్తి విలువ రూ.60 కోట్లు. ఆ తర్వాత న్యాయశాఖమంత్రిగా పనిచేసినా 2016 ఎన్నికల్లో సీటు దక్కలేదు. తాజాగా ఆయనకు తిరునల్వేలి జిల్లా అంబాసముద్రం నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం దక్కింది. దీంతో బుధవారం ఆ నియోజకవర్గంలో ఇసక్కి సుబ్బయ్య నామినేషన్ వేశారు. ఈ అఫిడవిట్లో తన ఆస్తి విలువ రూ. 246 కోట్లుగా ప్రకటించారు. తనతో పాటు భార్య మీనాక్షి పేరిట చర ఆస్తులు రూ. 6.86 కోట్లు అని, స్థిర ఆస్తులు రూ. 239 కోట్లు అని లెక్కచూపించారు. అప్పులు రూ. 5 కోట్లు ఉన్నట్టు పేర్కొన్నారు. పదేళ్ల కాలంలో ఇసక్కి సుబ్బయ్య ఆస్తి నాలుగు రెట్లు పెరగడం గమనార్హం. చెన్నై అన్నానగర్‌లో పోటీ చేస్తున్న డీఎంకే అభ్యర్థి ఎంకే మోహన్ రెండో స్థానంలో నిలిచారు. ఆయన ఆస్తి విలువ రూ.211 కోట్లుగా ప్రకటించారు. చదవండి: స్టాలిన్ మొత్తం ఆస్తుల విలువ ఇంతేనా పది చదవని హీరో కమల్‌హాసన్ ఆస్తులు ఎంతో తెలుసా..? -
చిన్నమ్మ మద్దతు మాకే!
సాక్షి, చెన్నై: చిన్నమ్మ శశికళ మానసిక ఆదరణ, మద్దతు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంకే అని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దినకరన్ ధీమా వ్యక్తం చేశారు. దుష్టశక్తి డీఎంకేను, ద్రోహశక్తి అన్నాడీఎంకే పాలకుల్ని అధికారంలోకి రానివ్వకుండా అడ్డుకుంటామన్నారు. దినకరన్ అమ్మమక్కల్ మున్నేట్ర కళగం, విజయకాంత్ డీఎండీకేతో పాటు ఎస్‌డీపీఐలు కూటమిగా ఎన్నికల్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కూటమి ఒప్పందాలు జరిగిన రోజున దినకరన్ చెన్నైలో లేరు. కోవిల్పట్టిలో నామినేషన్ దాఖలు చేసి చెన్నైకు వచ్చిన ఆయన మంగళవారం ఎన్నికల ప్రచారం శ్రీకారం చుట్టారు. ఈ పరిస్థితుల్లో బుధవారం కోయంబేడులోని డీఎండీకే కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఆ పార్టీ నేత విజయకాంత్‌తో భేటీ అయ్యారు. అనంతరం దినకరన్ మీడియాతో మాట్లాడుతూ తమది విజయకూటమి అని ప్రకటించారు. దుష్టశక్తుల్ని రానివ్వం.. ఈ ఎన్నికల్లో డీఎండీకే 60, ఎస్డీపీఐ ఆరుచోట్ల పోటీ చేస్తున్నాయని దినకరన్ తెలిపారు. డీఎండీకే కూటమిలోకి రాగానే, ముందుగా తాను ప్రకటించిన 42 మంది పార్టీ అభ్యర్థులు స్వచ్ఛందంగా పోటీ నుంచి తప్పుకున్నారని వివరించారు. ఆ మేరకు ఆర్మీ కట్టుబాట్లతో తమ కేడర్ ఉన్నారని పేర్కొన్నారు. విజయకాంత్‌ను మర్యాదపూర్వకంగా కలిశానని పేర్కొంటూ, తమ ఇద్దరి సిద్ధాంతం లక్ష్యం ఒక్కటే అన్నారు. డీఎంకే, అన్నాడీఎంకే అధికారంలోకి రానివ్వకుండా అడ్డుకోవడమేనని స్పష్టం చేశారు. చదవండి: ఎన్నికలకు దూరంగా రజనీకాంత్ స్నేహితుడు కమల్ సీఎం కావడం ఖాయం.. -
బెంగాల్ దంగల్: బీజేపీ చీఫ్ సంచలన నిర్ణయం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ రాష్ట్ర బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ సంచలన ప్రకటన చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని తెలిపారు. తాజాగా ప్రకటించిన బీజేపీ అభ్యర్థుల జాబితాలో కూడా ఆయన పేరు లేదు. దీనిపై భిన్న ఊహాగానాలు వెలువడుతుండటంతో దిలీప్ ఘోష్ ఈ అంశంపై స్పందించారు. బెంగాల్లో ఎన్నికల ప్రచారం మొత్తం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి అధ్వర్యంలో జరగాలని హై కమాండ్ నిర్ణయింది. అందువల్లే తాను పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలిపారు. ఈ సందర్భంగా దిలీప్ ఘోష్ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ‘‘ఎన్నికల్లో పోటీ చేయబోతున్న అభ్యర్థుల జాబితాలో నా పేరు లేదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండటం వల్ల నేను ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఎందుకంటే రాష్ట్రంలో నా అధ్వర్యంలో పార్టీ తరఫున ప్రచారం జరగాలని హై కమాండ్ నిర్ణయించింది’’ అన్నారు. My name won't be there in the list of candidates contesting polls. Being state chief, the party has decided that poll campaigns in the state will be done under my supervision: BJP West Bengal chief Dilip Ghosh in New Town Kolkata pic.twitter.com/2RX4MiuLuU — ANI (@ANI) March 18, 2021 బెంగాల్లో మూడో, నాల్గవ దశల ఎన్నికలకు సంబంధించి బీజేపీ 63 మంది అభ్యర్థుల పేర్లను ఆదివారం ప్రకటించింది. వీరిలో కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో, టీఎంసీ మాజీ నాయకుడు రాజిబ్ బెనర్జీ ఉన్నారు. బెంగాల్లో మొదటి రెండు దశల ఎన్నికలకు 58 మంది అభ్యర్థుల జాబితాను బీజేపీ గతంలోనే విడుదల చేసింది. 294 మంది సభ్యులున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు మొత్తం ఎనిమిది దశల్లో జరగనున్నాయి. వీటిలో షెడ్యూల్డ్ కులాలకు మొత్తం 68 సీట్లు, షెడ్యూల్డ్ తెగలకు 16 సీట్లు కేటాయించారు. ప్రస్తుత పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ పదవీకాలం మే 30 తో ముగియనుంది. 2021 పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో మొదటి దశ ఓటింగ్ మార్చి 27 న ప్రారంభం కాగా.. ఎనిమిదవ దశ ఓటింగ్ ఏప్రిల్ 27న జరుగుతుంది. చదవండి: దేశాన్ని రక్షించేందుకు బీజేపీని గెలిపించాలి సీఎం అభ్యర్థిపై ప్రకటన.. బీజేపీలో కలకలం -
మేనిఫెస్టో: విద్యార్థులకు 10 లక్షల లిమిట్ క్రెడిట్ కార్డు
కోల్‌కతా: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ బుధవారం తమ మేనిఫెస్టో విడుదల చేశారు. అధికారంలోకి వచ్చిన ఏడాది లోపు ఐదు లక్షల ఉద్యోగావకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా ఇంటింటికీ రేషన్ అందిస్తామని, ఎస్సీ, ఎస్టీలకు 25 లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు. ప్రతి ఏటా రైతులకు అందించే ఆర్థిక సాయాన్ని రూ. 6 వేల నుంచి 10 వేలకు పెంచుతామని వాగ్దానం చేశారు. ఇక ఉన్నత విద్యనభ్యసించాలనుకునే విద్యార్థుల కోసం 4 శాతం వడ్డీతో రూ. 10 లక్షల లిమిట్‌తో క్రెడిట్ కార్డు ఇస్తామని మమత పేర్కొన్నారు. అదే విధంగా, వెనుకబడిన, పేద వర్గాలకు రూ. 6 వేల నుంచి రూ. 12 వేల వరకు కనీస వార్షికాదాయం ఉండేలా చర్యలు చేపడతామని తెలిపారు. పటిష్టమైన పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికై మమత 10 వాగ్దానాలు ►ప్రతి ఏటా ఐదు లక్షల ఉద్యోగాల కల్పన ►అదనంగా 10 లక్షల ఏటా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా యూనిట్ల ఏర్పాటు ►రానున్న ఐదేళ్లలో 2 వేల పెద్ద పరిశ్రమల ఏర్పాటు ►1.6 కోట్ల ఇంటి మహిళా యజమానులకు నెలవారీగా రూ. 500(జనరల్ కేటగిరీ), రూ. 1000 (ఎస్సీ,ఎస్టీలకు) అందజేత ►వైద్య రంగానికి పెద్దపీట.. రాష్ట్ర జీడీపీలో 1.5 శాతం వైద్యారోగ్యానికి కేటాయింపు ►23 జిల్లా ప్రధాన కేంద్రాల్లో మెడికల్ కాలేజీ-కమ్- సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటు ►డాక్టర్, నర్సులు, పారామెడిక్స్ సీట్లు రెట్టింపు ►యువత స్వయం ఉపాధి పొందేలా అనేక పథకాలు.. 4 శాతం వడ్డీరేటుతో రూ. 10 లక్షల లిమిట్ క్రెడిట్ కార్డు ►విద్యారంగానికి రాష్ట్ర జీడీపీలో 4 శాతం కేటాయింపు ►నెలనెలా ఇంటి వద్దకే రేషన్.. 1.5 కోట్ల కుటుంబాలకు లబ్ది ►బెంగాల్ ఆవాస్ యోజన కింద తక్కువ రేట్లకే 25 లక్షల ఇళ్లు కట్టిస్తాం ►క్రిషక్ బంధు పథకం కింద 68 లక్షల మంది చిన్న,సన్నకారు రైతులకు ఎకరాకు రూ. 10 వేల చొప్పున సాయం ►తక్కువ రేట్లకే ఇండ్లకు నిరంతరాయ విద్యుత్ సరఫరా ►46 లక్షల కుటుంబాలకు తాగునీటి సరఫరా చదవండి: అసెంబ్లీ ఎన్నికల బరిలో బెంగాలీ తారలు I humbly present my 10 ‘Ongikars’ to build a stronger & more prosperous Bengal so that the wheels of development keep moving forward in the third term of our government. The aim is just one, to sustain Bengal as one of the leading states in the country. (1/4) pic.twitter.com/K0xNtrt7GB — Mamata Banerjee (@MamataOfficial) March 17, 2021 -
పాంచ్ పటాకా: రూ.331 కోట్ల సంపద సీజ్
న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాయిలాలుగా అందిస్తున్న డబ్బులు, ఆభరణాలు, సామగ్రి, పరికరాలు, బహుమతులు పెద్ద ఎత్తున పట్టుబడుతున్నాయి. ఈసారి ఎప్పుడు లేనంతగా ఏకంగా రూ.300 కోట్లకు పైగా సంపదను ఎన్నికల సంఘం స్వాధీనం చేసుకుంది. ఎన్నికలు జరుగుతున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అసోంతోపాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిల్లో విచ్చలవిడిగా డబ్బుతో పాటు ఇతర తాయిలాలు తరలిస్తున్నారు. ఎన్నికల సంఘం పటిష్ట చర్యలు చేపట్టి విస్తృతంగా తనిఖీలు చేస్తుండడంతో భారీగా సంపద లభిస్తోంది. 2016తో పోలిస్తే ఇప్పటివరకు పట్టుబడిన సంపద రెట్టింపులో ఉందని ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినప్పటి నుంచి ఇప్పటివరకు పట్టుబడ్డ సంపద విలువ అక్షరాల రూ.331.47 కోట్లు. అయితే గతంలో 2016లో జరిగిన ఎన్నికల సందర్భంగా పట్టుబడ్డ సంపద రూ.225.17 కోట్లు. ఎన్నికల ప్రారంభంలోనే ఇంత నగదు పట్టుబడగా ఎన్నికలు ముగిసే నాటికి ఎంత డబ్బు పట్టుబడుతుందోనని అధికార వర్గాలతో పాటు ప్రజలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. పట్టుబడ్డ సంపదను ఎన్నికల సంఘం రాష్ట్రాలవారీగా వర్గీకరించింది. తమిళనాడు రూ.127 కోట్లు పశ్చిమ బెంగాల్ రూ.112.59 కోట్లు అస్సాం రూ.63 కోట్లు కేరళ రూ.21.77 కోట్లు పుదుచ్చేరి రూ.5.72 కోట్లు ఈ పట్టుబడ్డ సంపదలో తమిళనాడు అగ్రస్థానంలో ఉండగా అసోం చివరి స్థానంలో ఉంది. ఈ ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం ప్రత్యేకంగా 295 మందిని వ్యయ పరిశీలకులను నియమించింది. ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని కట్టడి చేసేందుకు ఈ పరిశీలకులు పని చేయనున్నారు. ఓటర్లకు ఎరగా డబ్బు, ఆభరణాలు, బహుమతులు పంపిణీ చేయడం చట్టరీత్యా నేరం. అందుకోసం ఎన్నికల సంఘం తాయిలాల పంపకాన్ని అడ్డుకుంటోంది. చదవండి: అధికారంలోకి వస్తే ‘అమ్మ మృతి’ మిస్టరీ చేధిస్తాం చదవండి: తాజా మాజీ ముఖ్యమంత్రికి అధిష్టానం షాక్ Record Seizures worth Rs. 331 crores made in Expenditure Monitoring Process in ongoing Assembly Elections, 2021 in States of Assam, West Bengal, Tamil Nadu, Kerala and Union Territory of Puducherry. (1/n) Further details follow in press release — Sheyphali Sharan (@SpokespersonECI) March 17, 2021 -
సర్వేలన్నీ ఆ పార్టీ వైపే : 161 నుంచి 169 స్థానాలు!
సాక్షి, చెన్నై: సర్వేలన్నీ డీఎంకే అధికారం తథ్యమని స్పష్టం చేస్తున్నాయి. తాజాగా ఏబీపీ సర్వే కూడా డీఎంకేకు పట్టం కట్టేందుకు తమిళ ఓటర్లు సిద్ధమయ్యారని ప్రకటించింది. పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న డీఎంకే, ఈ సారి అధికారం చేజిక్కించుకోవడం లక్ష్యంగా పరుగులు తీస్తోంది. ఆపార్టీ అభ్యర్థులు 170కు పైగా స్థానాల్లో పోటీచేస్తున్నారు. మిత్రపక్షాలు కొన్ని డీఎంకే ఉదయ సూర్యుడి చిహ్నంపై పోటీ చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే వెలువడ్డ రెండు సర్వేలు రాష్ట్రంలో డీఎంకే అధికారం చేజిక్కించుకోవడం ఖాయమని ప్రకటించాయి. తాజాగా ఏబీపీ సీ ఓటర్స్ సర్వే సాగింది. మంగళవారం వెలువడ్డ ఈ సర్వే ఫలితాల మేరకు రాష్ట్రంలో డీఎంకే 161 నుంచి 169 స్థానాలు చేజిక్కించుకోవడం ఖాయం అని తేల్చింది. అన్నాడీఎంకేకు 53 నుంచి 61 స్థానాలు దక్కనున్నాయి. కమల్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యం ఖాతా తెరవబోతున్నది. రెండు నుంచి ఆరు మధ్య సీట్లను ఈ పార్టీ కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే దినకరన్ పార్టీకి 1 నుంచి 5 వరకు సీట్లు దక్కవచ్చని సర్వేలో తేలింది. సుడిగాలి ప్రచారంలో.. ‘ముఖ్య’ నేతలు పళనిస్వామి, స్టాలిన్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మంగళవారం డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ సేలం ఉత్తరం నియోజకవర్గం పరిధిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజలతో మమేకం అయ్యే రీతిలో రోడ్లపై నడుచుకుంటూ తమను ఆదరించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. సాయంత్రం జరిగిన ప్రచార సభలో అన్నాడీఎంకే అవినీతిని ఎండగట్టే రీతిలో ప్రసంగాన్ని సాగించారు. అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కో కన్వీనర్, సీఎం పళని స్వామి పుదుకోట్టై జిల్లా విలాతికులంలో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. 18 నుంచి 22వ తేదీ వరకు 46 నియోజకవర్గాల్ని కలుపుతూ పళని ప్రచార పర్యటన సాగబోతోంది. మక్కల్ నీది మయ్యం నేత కమల్ తాను పోటీ చేస్తున్న కోవై దక్షిణం నియోజకవర్గంలో ఓటర్లను ఆకర్షించేలా ప్రచారం సాగించారు. రోడ్‌షోను తలపించే రీతిలో కాసేపు, మరికాసేపు నడుచుకుంటూ, ప్రజలతో ముచ్చటిస్తూ తనను ఆదరించడమే కాదు, మార్పు నినాదంతో మక్కల్ నీది మయ్యం అభ్యర్థులందర్ని గెలిపించాలని కోరారు. రాజకీయాలు తనకు వృత్తి కాదని, బాధ్యత అని నినదిస్తూ ప్రచారం చేశారు. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ తిరువొత్తియూరులో మంగళవారం సాయంత్రం ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తొలిరోజు పొన్నేరి, మాధవరం, అంబత్తూరు, ఆవడి, పూందమల్లి, మధురవాయిల్ నియోజకవర్గాల్ని కలుపుతూ ఆయన పర్యటన సాగింది. -
ఆది నుంచి వివాదాలు, ట్విస్టులే..
సాక్షి, చెన్నై: పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల రాజకీయం విచిత్ర పరిస్థితులకు దారి తీస్తున్నాయి. అభ్యర్థుల ప్రకటనకు ముందే, ఆయా నేతలు తమకు పట్టున్న స్థానాలపై గురి పెట్టి నామినేషన్లు వేయడం చర్చకు దారి తీసింది. పుదుచ్చేరిలో ఎన్ఆర్ కాంగ్రెస్–బీజేపీ–అన్నాడీఎంకే కూటమి వ్యవహారం మొదటి నుంచి వివాదాలు, ట్విస్టుల నడుమ సాగిన విషయం తెలిసిందే. 30 స్థానాలతో కూడిన పుదుచ్చేరిలో ఎన్ఆర్ కాంగ్రెస్ 16 చోట్ల, బీజేపీ, అన్నాడీఎంకేలు 14 చోట్ల పోటీకి నిర్ణయించాయి. అన్నాడీఎంకే –బీజేపీల మధ్య సీట్ల పంపకాలు సాగలేదు. ఏఏ నియోజకవర్గాల్లో పోటీ చేయాలో కూటమిలో ఇంత వరకు తేలలేదు. అభ్యర్థుల ఎంపిక కసరత్తుల్లోనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఆ కూటమికి తానే సీఎం అభ్యర్థి అని ప్రకటించుకున్న ఎన్ఆర్ కాంగ్రెస్ నేత రంగస్వామి తట్టాన్ చావడి నుంచి పోటీకి నామినేషన్ దాఖలు చేశారు. ఆ పార్టీకి చెందిన మరో నలుగురు తమకు పట్టున్న నియోజకవర్గాల్లో నామినేషన్లు వేశారు. ఇదే అదనుగా బీజేపీకి చెందిన ముగ్గురు, అన్నాడీఎంకేకు చెందిన ఇద్దరు నేతలు తమకు పట్టున్న నియోజకవర్గాల్లో నామినేషన్లు వేయడంతో కూటమి వ్యవహారం విచిత్ర పరిస్థితుల్లోకి నెట్టినట్టు అయింది. తమకు పట్టున్న స్థానాల్లో ముందుగానే నామినేషన్లు వేసి రిజర్వు చేసుకునే పనిలో నేతలు ఉండడం గమనార్హం. కాంగ్రెస్‌లోనూ అదే పరిస్థితి.. కాంగ్రెస్–డీఎంకే కూటమిలోనూ అదే పరిస్థితి. డీఎంకే అయితే, అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్‌లో అభ్యర్థుల ఎంపిక కుస్తీలు సాగుతున్నాయి. మరో రెండు రోజులే నామినేషన్లకు గడువు ఉన్న నేపథ్యంలో తమకు పట్టున్న స్థానాలపై గురి పెట్టిన పలువురు కాంగ్రెస్ నేతలు ముందుగానే నామినేషన్లు దాఖలు చేయడం గమనార్హం. తాజా పరిస్థితుల నేపథ్యంలో మాజీ సీఎం నారాయణ స్వామి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండేందుకు నిర్ణయించినట్టు తెలిసింది. -
‘టికెట్ ఇచ్చినందుకు థ్యాంక్స్.. కానీ పోటీ చేయను’
తిరువనంతపురం: వచ్చే నెల కేరళలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో పార్టీలన్ని తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసున్నాయి. బీజేపీ ఆదివారం తన క్యాండెట్స్ లిస్ట్‌ని విడుదల చేసింది. అయితే ఆశ్చర్యంగా ఈ లిస్ట్‌లో ఓ సామన్యుడి పేరు ప్రకటించింది. వయనాడ్ జిల్లాలోని మనంతవాడి నియోజకవర్గం నుంచి ఎంబీఏ గ్రాడ్యుయేట్ మణికుట్టన్ బరిలో నిలుస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై సోషల్ మీడియాలో నిన్న అంతా ఒకటే చర్చ. ఎవరీ మణికుట్టన్.. బీజేపీ తన అభ్యర్థిగా అతడిని ఎందుకు ప్రకటించింది అనే దాని గురించి రకరకాల వార్తలు ప్రచారం అయ్యాయి. వీటిపై తాజాగా మణికుట్టన్ స్పందించారు. బీజేపీ అభ్యర్థుల జాబితాలో తన పేరు చూసి ఆశ్చర్యపోయానని.. రాజకీయాలకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నాడు. తన పేరు ఎందుకు ప్రకటించారో ఇంకా తనకు అర్థం కావడం లేదని.. కానీ తాను మాత్రం ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలిపారు. ఈ సందర్భంగా మణికుట్టన్ మాట్లాడుతూ.. ‘‘కేంద్ర బీజేపీ నాయకత్వం తమ అభ్యర్థిగా నా పేరు ప్రకటించింది. నేనొక సాధారణ పౌరుడిని. అలాంటిది టీవీలో బీజేపీ అభ్యర్థుల జాబితాలో నా పేరు రావడం చూసి ఆశ్చర్య పోయాను.. చాలా భయపడ్డాను కూడా. ఆ తర్వాత పనియా సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చినందకు చాలా సంతోషపడ్డాను. అయితే రాజకీయాల్లోకి రావాలని నాకు ఏమాత్రం ఆసక్తి లేదు. ఉద్యోగం, కుటుంబం ఇదే నా ప్రపంచం. అందుకే బీజేపీ ఇచ్చిన అవకాశాన్ని నేను వినమ్రంగా తిరస్కరిస్తున్నాను. ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. బీజేపీ నాయకులకు ఫోన్ చేసి ఈ విషయాన్ని తెలియజేశాను అన్నారు. గత ఎన్నికల్లో కేరళలో బీజేపీ కేవలం ఒక్క చోట మాత్రమే విజయం సాధించింది. ఈ సారి ఈ సంఖ్యను పెంచుకోవాలని ప్రయత్నిస్తుంది. దానిలో భాగంగానే తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా మెట్రో మ్యాన్ ఈ. శ్రీధరన్ పేరును ప్రకటించింది బీజేపీ. ఆయన క్లీన్ ఇమేజ్ తమకు కలిసి వస్తుందని ఆ పార్టీ అభిప్రాయపడుతోంది. ఏప్రిల్ 6న కేరళలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తారు. మే 2న లెక్కిస్తారు. చదవండి: అత్తింటి వేధింపులు: బీజేపీ ఎంపీ కోడలి ఆత్మహత్యాయత్నం కేరళ బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల -
దీదీకి షాకిచ్చిన నటి!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ దీదీ మమతా బెనర్జీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ రాని నేతలు పార్టీని వీడుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి ప్రముఖ సినీ నటి, రేడిఘి నియోజకవర్గ ఎమ్మెల్యే దేబశ్రీ రాయ్ చేరారు. టీఎంసీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఆమె పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి పంపారు. ‘నేటితో తృణమూల్‌తో నాకు ఉన్న అన్ని బంధాలు తెగిపోయాయి. పార్టీలో ఏ కీలక పదివి లేదు కనుకే రాజీనామా చేస్తున్నాను అనుకుంటున్నారు. కానీ అది వాస్తవం కాదు. పదేళ్లుగా రేడిఘి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా సేవలందించాను. ప్రస్తుతం అన్ని బాధ్యతల నుంచి వైదొలుగుతున్నాను. ఈ విషయాన్ని అధిష్టానానికి కూడా తెలియజేశాను. సుధీర్ఘ కాలం ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం కల్పించిన పార్టీకి కృతజ్ఞతలు’ అంటూ లేఖలో పేర్కొన్నారు దేబశ్రీ. రేడిఘి నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు దేబశ్రీ రాయ్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ప్రస్తుతం ఆమెకు పార్టీ టికెట్ నిరాకరించింది. ఇక భవిష్యత్ ప్రణాళికల గురించి ప్రశ్నించగా.. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అన్నారు దేబశ్రీ. అయితే నటి బీజేపీలో చేరుతారనే ప్రచారం బలంగా వినిపిస్తుంది. 2019లోనే ఆమె బీజేపీలో చేరాలని భావించారు. కానీ కోల్‌కతా మాజీ మేయర్ సోవన్ చటర్జీ ఆమెను బుజ్జగించి టీఎంసీలోనే కొనసాగేలా చేయగలిగారు. చదవండి: అసెంబ్లీ ఎన్నికల బరిలో బెంగాలీ తారలు -
శుభముహూర్తం కలిసొచ్చింది..!
సాక్షి, చెన్నై: శుభముహూర్తం కావడంతో సోమవారం పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు కానున్నాయి. సీఎం పళనిస్వామి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, మక్కల్ నీది మయ్యం నేత కమల్‌హాసన్, అమ్మ మక్కల్ మున్నేట్రకళగం నేత దినకరన్, నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు శుక్రవారం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. శని, ఆదివారాలు సెలవు కావడంతో నామినేషన్లు స్వీకరించలేదు. ఇక సోమవారం ముహూర్తం బాగుండడంతో నేతలందరూ నామినేషన్ల దాఖలకు సిద్ధమయ్యారు. ఇప్పటికే డీఎంకే, అన్నాడీఎంకే కూటముల్లో కొన్ని సీట్లు మినహా మెజారిటీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఎడపాడిలో పళనిస్వామి, కొళత్తూరులో స్టాలిన్, కోయంబత్తూరు దక్షిణంలో కమలహాసన్, కోవిల్ పట్టిలో దినకరన్, తిరువొత్తియూరులో సీమాన్ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. అనంతరం ప్రచారాన్ని మొదలు పెట్టనున్నారు. మంత్రులు, ముఖ్య నేతలంతా ఇదే రోజు నామినేషన్లు దాఖలు చేయనుండడంతో ఆయా కార్యాలయాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కరోనా నేపథ్యంలో అభ్యరి్థతో పాటుగా మరొకరిని మాత్రమే రిటరి్నంగ్ అధికారుల వద్దకు అనుమతించనున్నారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 3 గంటల వరకే నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇప్పటి వరకు రూ. 100 కోట్లు స్వాధీనం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి జరుగుతున్న తనిఖీల్లో శనివారం నాటికి రూ. 100 కోట్ల నగదు, నగలు, వస్తువులు పట్టుబడినట్లు ఎన్నికల యంత్రాంగం ప్రకటించింది. శని, ఆదివారాల్లోనూ పెద్దఎత్తున పట్టుబడిన నగదు, వస్తువుల వివరాలను సోమవారం ప్రకటించనున్నారు. ఆదివారం ఆవడిలో పాత సామాన్ల వ్యాపారి శరవణన్ ఇంట్లో ఐటీ అధికారులు జరిపిన సోదాల్లో రూ. 17 లక్షలు పట్టుబడింది. అలాగే తిరుప్పూర్‌లో మంత్రి ఉడములై రాధాకృష్ణన్ ముఖ చిత్రంతో వాచీలు, చీరలు, దోవతీలను స్వాధీనం చేసుకున్నారు. ఇక కోవిల్ పట్టిలో తనిఖీని అడ్డుకున్న మంత్రి కడంబూరు రాజుపై కేసు నమోదుకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. మరక్కాణం, చెంగల్పట్టు, వేలూరులో సాగిన సోదాల్లో రూ. 1.97 కోట్ల విలువ చేసే నగదు, నగలు, మద్యం బాటిళ్లు పట్టుబడ్డాయి. మన్నార్‌కుడిలో 64 కేజీల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. తిరుపతి నుంచి పట్టుచీరలు కొనేందుకు వచ్చిన ఓ బృందం వద్ద రూ. 2.5 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే కడలూరు జిల్లా కాట్టుమన్నార్ కోవిల్లో ఓ హెలికాఫ్టర్ దిగడంతో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు అందులో తనిఖీలు జరిపారు. అయితే ఆ హెలికాఫ్టర్‌లో కేరళకు చెందిన ప్రముఖ బంగారు వ్యాపారి కల్యాణ రామన్ తన కుటుంబంతో అంకాల పరమేశ్వరి ఆలయ దర్శనానికి వచ్చినట్టు విచారణలో తేలింది. చదవండి: ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ..: అన్నాడీఎంకే వరాల జల్లు! -
ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ..: అన్నాడీఎంకే వరాల జల్లు!
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. 163 హామీలతో కూడిన మేనిఫెస్టోను ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ఆదివారం ప్రకటించారు. రేషన్ కార్డుదారులకు అమ్మ వాషింగ్ మెషన్లు, ఇళ్లు లేని వారికి పక్కా గృహాలు, ఇంటి వద్దకే రేషన్, మహిళల కోసం ఇంటి దీపం పథకం, ఇంటింటా సౌరశక్తి గ్యాస్ స్టౌవ్‌లు, ఏడాదికి ఆరు సిలిండర్లు తదితర వాగ్ధానాలతో ప్రజల్లోకి వెళ్లనున్నారు. డీఎంకేకు పోటీగా.. డీఎంకే ఎన్నికల మేనిఫెస్టో శనివారం వెలువడ్డ విషయం తెలిసిందే. తమిళనాడు ప్రజలు ఉచితాలకు అలవాటు పడిన నేపథ్యంలో అందుకు భిన్నంగా ఈ మేనిఫెస్టో విడుదల చేశారు. 500 అంశాలతో కూడిన ఈ మేనిఫెస్టోలో ఆదివారం మరికొన్ని అంశాలు చేర్చారు. చెన్నై కాట్టుపల్లిలో అదాని హార్బర్ నిర్మాణం నిలుపుదల, ఈలం తమిళులకు భారత పౌరసత్వం, పౌర చట్టానికి వ్యతిరేకత, చెన్నై – సేలం గ్రీన్ వే పనుల నిలుపుదల వంటి అంశాలను అందులో చేర్చారు. ఈ పరిస్థితుల్లో అన్నాడీఎంకే మేనిఫెస్టో ఎలా ఉండబోతుందో అన్న చర్చ మొదలైంది. ఈ క్రమంలో ఉచిత పథకాలకు పెద్దపీట వేస్తూ 163 అంశాలతో కూడిన మేనిఫెస్టోను ఆ పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం, కో కన్వీనర్ పళనిస్వామి రాయపేటలోని అన్నాడీఎంకే కార్యాలయంలో విడుదల చేశారు. మేనిఫెస్టోలోని పలు హామీలు అందరికీ ఇళ్లు, మహిళల కోసం అమ్మ ఇంటి దీపం పథకం, మహిళలకు ప్రయాణ చార్జీల్లో రాయితీ, ఉచిత వాషింగ్ మెషన్, సౌర శక్తి స్టౌవ్‌లు, ఇంటి వద్దకే రేషన్ సరుకులు, 2023– అమ్మ విజన్ అమలు, ఏడాదికి ఆరు ఉచిత సిలిండర్లు, కేబుల్ ప్రసారాలు, అమ్మ వివాహ కానుక పెంపుతో పాటు నవ దంపతులకు అన్ని రకాల వస్తువులతో ప్రత్యేక సారె. రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ స్పెషాలిటీ సేవలతో అమ్మ క్లినిక్‌ల విస్తరణ, క్యాన్సర్ చికిత్సకు ప్రాధాన్యత. ప్రసూతి సెలవులను 12 నెలలకు పొడిగింపు, మహిళా శివు సంరక్షణ నిధి పెంపు, మహిళ భద్రతకు అన్ని నగారాల్లోనూ గస్తీ వాహనం, పోలీసు యాప్, మహిళా స్వయం సహాయక బృందాలకు రుణాలు, అమ్మ బ్యాంకింగ్ కార్డుల పంపిణీ, ఇంటింటా దోమ తెరలు. రుణాలు రద్దు, 2జీబీ ఉచిత డేటా, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణా కేంద్రాల ఏర్పాటు. ఇంటికో ఉద్యోగం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో తమిళులకు ప్రత్యేక ప్రా«ధాన్యతకు చర్యలు. పట్టణాలు, నగరాల్లో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలల ఏర్పాటు. వృద్ధాప్య ఫించన్లు రూ. 1000 నుంచి రూ. 2 వేలకు పెంపు. ప్రత్యేక ప్రతిభావంతులకు రూ. 1,500 నుంచి రూ. 2500 పెంపు. జాతీయ అధికార భాషగా తమిళం. మద్రాసు హైకోర్టును తమిళనాడు హైకోర్టుగా మార్చడం, తమిళంలోనే వాదనలకు అనుమతి. తమిళాభివృద్ధికి ప్రత్యేక నిధులు, ప్రవాస తమిళుల కోసం ప్రత్యేక విభాగం, ఈలం తమిళుల సంక్షేమం, జంట పౌరసత్వం, రాజీవ్ హంతుకుల విడుదల. వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర, కొనుగోలు, విక్రయ కేంద్రాలు, అరటి నారతో వస్త్రాల తయారీకి పెద్ద పీట, కొబ్బరి మొక్కల పంపిణీ, గిడ్డంగుల విస్తరణ, సౌర శక్తి మోటారు పంపు సెట్ల రాయితీ కొనసాగింపు. వ్యవసాయ కమిషన్ ఏర్పాటు, నమ్మల్వార్ పేరిట వ్యవసాయ పరిశోధన కేంద్రం, సీఎం – రైతు బంధు పథకం, దక్షిణ తమిళనాడులో అంతర్జాతీయ ప్రమాణాలతో బఫెల్లో పార్క్. పెట్రోల్ర, డీజిల్ ధర తగ్గింపునకు చర్యలు. 150 రోజులకు ఉపాధి పథకం పొడిగింపు. అమ్మగ్రీన్ హౌస్ నిర్మాణ సాయం రూ. 3.40 లక్షలకు పెంపు, సంక్రాంతి కానుక కొనసాగింపు. నెలసరి విద్యుత్‌చార్జీల వసూళ్లు, 9,10,11,12 తరగతి విద్యార్థులకు పౌష్టికాహార పథకం. అంగన్వాడీ పిల్లలకు పాలు, ఆటో డ్రైవర్లకు ఎంజీఆర్ గ్రీన్ ఆటో పథకం పేరిట రూ. 25 వేలు సాయం. దశల వారిగా మద్యం దుకాణాల మూత, సహకార రుణాలకు వడ్డీ రద్దు. ఆధ్యాతి్మక పర్యటనలకు ప్రభుత్వ సాయం పెంపు. శిథిలావస్థలో ఉన్న ఆలయాల పునరుద్ధరణ. చదవండి: ‘థౌజండ్ లైట్స్’ నుంచి ఖుష్బూ లీటర్ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.4 తగ్గిస్తాం -
వారసులకు టిక్కెట్లు ఇప్పించుకుంటున్న నేతలు!
సాక్షి, చెన్నై: తమిళనాడు కాంగ్రెస్‌లోకి వారసులొచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ వారసులను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దించారు. డీఎంకే కూటమిలో కాంగ్రెస్‌కు 25 సీట్లు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ స్థానాల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను తమిళనాడు కాంగ్రెస్ నేతలు సిద్ధం చేసి శుక్రవారం ఢిల్లీకి పంపించారు. గ్రూపు రాజకీయాలతో నిండిన తమిళనాడు కాంగ్రెస్‌లో ఈ జాబితా చిచ్చు పెట్టింది. అభ్యర్థుల ఎంపికలో అవకతవకలు జరిగాయని, పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వలేదని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద రెండు రోజులుగా పలు గ్రూపులు ఆందోళనలు చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో శనివారం అర్ధరాత్రి 21 స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. గ్రూపుల వివాదాలతో మిగిలిన నాలుగు స్థానాలను పెండింగ్‌లో పెట్టారు. సీట్ల కేటాయింపు 21 మంది జాబితాలో పలువురు కాంగ్రెస్ నేతలు తమ వారసులకు సీట్లు ఇప్పించుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఈవీకేఎస్ ఇళంగోవన్ తన కుమారుడు తిరుమగన్ ఈవేరాకు ఈరోడ్(ఈస్ట్) సీటు, మరో సీనియర్ ఎంపీ తిరునావుక్కరస్ తన వారసుడు రామచంద్రన్‌కు అరంతాంగి సీటు ఇప్పించుకున్నారు. అలాగే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత కేఆర్ రామస్వామి తన కుమారుడు ఆర్ఎం కరుమాణిక్యంకు తిరువాడనై సీటును ఇప్పించుకోగా, రంగరాజ కుమారమంగళం వారసుడు ఆర్ మోహన్కుమార మంగళంకు ఓమలూరు సీటును కేటాయించారు. ఇక విరుదునగర్ ఎంపీ మాణిక్ ఠాకూర్ తన మామ రవిచంద్రన్‌కు మేలూరు సీటు దక్కేలా చేసుకున్నారు. కాగా, హెచ్. వసంతకుమార్ మరణంతో ఖాళీగా ఉన్న కన్యాకుమారి లోక్ సభ సీటును ఆయన కుమారుడు విజయ్ కుమార్ అలియాస్ విజయ్ వసంత్‌కు కేటాయించారు. చదవండి: నా కొడుకు రాజకీయాల్లోకి రాడు: కనిమొళి -
ఎట్టకేలకు ఖుష్బూకు ఛాన్స్: థౌజండ్ లైట్స్ నుంచి..
సాక్షి, చెన్నై: గతంలో డీఎంకే, కాంగ్రెస్ పార్టీలో సీటు కోసం తీవ్రంగా ప్రయత్నించి భంగపడ్డ సినీ నటి ఖుష్బూకు ఈసారి బీజేపీ అవకాశం ఇచ్చింది. ఇటీవల బీజేపీలోకి చేరిన ఆమె చేపాక్కం–ట్రిప్లికేన్ నుంచి పోటీ చేయాలని భావించినా పొత్తులో భాగంగా ఆ స్థానం అన్నాడీఎంకేకు వెళ్లింది. దీంతో ఆ నియోజకవర్గానికి పక్కనే ఉన్న థౌజండ్ లైట్స్ సీటును బీజేపీ ఖుష్బూకు ఖరారు చేసింది. అలాగే ఆ పార్టీ తమిళనాడు అధ్యక్షుడు ఎల్మురుగన్ తారాపురంలో, మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వానతీ శ్రీనివాసన్ సినీ నటుడు కమల్ హాసన్ బరిలో ఉన్న కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఇక డీఎంకే నుంచి సీటు ఆశించి భంగపడ్డ మదురై జిల్లా తిరుప్పరగుండ్రం డీఎంకే సిట్టింగ్ ఎమ్మెల్యే శరవణన్ ఆదివారం బీజేపీలో చేరారు. ఆయనకు మదురై ఉత్తరం సీటును బీజేపీ కేటాయించింది. డీఎంకే నుంచి బీజేపీలో చేరిన రెండో ఎమ్మెల్యేగా శరవణన్ నిలిచారు. మిత్రపక్షం బీజేపీకి అన్నాడీఎంకే కన్యాకుమారి లోక్‌సభ స్థానంతో పాటు 20 అసెంబ్లీ స్థానాలను కేటాయించింది. చదవండి: నా కొడుకు రాజకీయాల్లోకి రాడు: కనిమొళి -
బీజేపీ వ్యూహం: ఎన్నికల బరిలో కేంద్ర మంత్రి.. ఎంపీలు..
న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేంద్ర మంత్రిని, ఎంపీలను కూడా అసెంబ్లీ బరిలోకి దింపింది. కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో సహా నలుగురు ఎంపీలను పశ్చిమబెంగాల్లో, ఇద్దరు ఎంపీలను, మెట్రోమ్యాన్ శ్రీధరన్‌ను కేరళలో, ప్రముఖ సినీ నటి, పార్టీ జాతీయ ఆఫీస్‌బేరర్ ఖుష్బూను తమిళనాడులో పోటీలో నిలిపింది. పార్టీ ప్రదాన కార్యదర్శి అరుణ్‌సింగ్, బాబుల్ సుప్రియో, మరో కేంద్ర మంత్రి దేబశ్రీ చౌధురి ఆదివారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పలువురు అభ్యర్థుల పేర్లను విడుదల చేశారు. పశ్చిమబెంగాల్‌కు సంబంధించి 63 మందితో, తమిళనాడు, అస్సాంల్లో 17 మంది చొప్పున, కేరళలో 112 మందితో కూడిన జాబితాను విడుదల చేశారు. కేరళలోని మొత్తం 140 స్థానాల్లో 115 సీట్లలో బీజేపీ పోటీ చేస్తోంది. మిగతా స్థానాల్లో మిత్ర పక్షాలు పోటీ చేస్తాయని అరుణ్ సింగ్ వెల్లడించారు. పశ్చిమబెంగాల్లో టాలీగుంగే నుంచి బాబుల్‌సుప్రియో, దిన్హట నుంచి ఎంపీ నిశిత్ ప్రామాణిక్, చుంచురా స్థానం నుంచి ఎంపీ లాకెట్ చటర్జీలను, తారకేశ్వర్ స్థానం నుంచి రాజ్యసభ ఎంపీ స్వపన్ దాస్ గుప్తాను బరిలో దింపారు. మాజీ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ అశోక్ లాహిరికి అలీపుర్దౌర్ స్థానం కేటాయించారు. లాహిరి 2017 నుంచి 2020 వరకు ఫైనాన్స్ కమిషన్ సభ్యుడిగా ఉన్నారు. టికెట్ నిరాకరించడంతో తృణమూల్ నుంచి బీజేపీలో చేరిన సీనియర్ నాయకుడు రవీంద్రనాథ్ భట్టాచార్యకు సింగూరు నుంచి అవకాశం కల్పించారు. సినీతారల్లో తనుశ్రీ చక్రవర్తి(శ్యాంపూర్), పాయల్ సర్కార్(బెహల పుర్బ), యశ్‌దాస్ గుప్తా(చండితల)లకు టికెట్లు ఇచ్చారు. అశోక్ లాహిరి, స్వపన్‌దాస్ గుప్తాలకు అవకాశం కల్పించడం ద్వారా 2019 లోక్‌సభ ఎన్నికల్లో తమకు దూరంగా ఉన్న రాష్ట్రంలోని మేధావి వర్గాన్ని ఆకర్షించేందుకు బీజేపీ ప్రయత్నించింది. కేరళలో ఇటీవలే బీజేపీలో చేరిన మెట్రోమ్యాన్ ఈ శ్రీధరన్‌ను పాలక్కాడ్ నుంచి, కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ కేజే ఆల్ఫోన్స్‌ను కంజీరప్పల్లి నుంచి, రాజ్యసభ ఎంపీ, నటుడు సురేశ్ గోపీని త్రిస్సూర్ నుంచి, మరో నటుడు కృష్ణ కుమార్‌ను తూర్పు తిరువనంతపురం నుంచి బీజేపీ పోటీలో నిలిపింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశానికి వ్యతిరేకంగా ఉద్యమించిన కే సురేంద్రన్ కొన్ని, మంజేశ్వర్ స్థానాల నుంచి పోటీ చేయనున్నారు. సీనియర్ నేత పద్మనాభన్‌కు ముఖ్యమంత్రి విజయన్ పోటీలో ఉన్న ధర్మడం స్థానాన్ని బీజేపీ కేటాయించింది. అస్సాంలో బాఘ్బర్ సీటు నుంచి హసీనారా ఖాతూన్, హాజో స్థానం నుంచి సుమన్ హరిప్రియ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. మార్చ్ 27 నుంచి 8 దశల్లో పశ్చిమబెంగాల్లో, మూడు దశల్లో అస్సాంలో, ఒకే దశలో ఏప్రిల్ 6న కేరళ, తమిళనాడుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. చదవండి: అక్కడ మాత్రమే బీజేపీ గెలుస్తుంది: శరద్ పవర్ -
అక్కడ మాత్రమే బీజేపీ గెలుస్తుంది: శరద్ పవార్
పుణే: త్వరలో నాలుగు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం అస్సాంలోనే బీజేపీ అధికారంలోకి వస్తుందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల ఫలితాలు దేశానికి కొత్త దిశను నిర్దేశించనున్నాయన్నారు. పుణే జిల్లా బారామతిలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ పశ్చిమబెంగాల్లో ఎన్నికల వేళ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల తరఫున పోరాడుతున్న మమతా బెనర్జీపై దాడికి బీజేపీ యత్నిస్తోందని విమర్శించారు. బెంగాల్ ఆత్మగౌరవానికి సంబంధించి ఈ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు యావత్తూ మమతా బెనర్జీ వెంట నడుస్తున్నారని, టీఎంసీకి అధికారం ఖాయమని చెప్పారు. తమిళనాడు, కేరళ, బెంగాల్, అస్సాంతోపాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో జరగనున్న ఈ ఎన్నికల ఫలితాలపై ముందే మాట్లాడటం తప్పంటూనే ఆయన.. కేరళలో వామపక్షాలతో కలిసి ఎన్సీపీ పోటీ చేస్తోందనీ, అక్కడ స్పష్టమైన మెజారిటీ తమకు దక్కుతుందన్నారు. తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. తమకు తెలిసిన సమాచారం ప్రకారం అస్సాంలో బీజేపీ పరిస్థితి మెరుగ్గా ఉందనీ, ఆ పార్టీ అధికారం నిలబెట్టుకుంటుందని అన్నారు. చదవండి: బెంగాల్ ముఖచిత్రాన్ని ‘సినీలోకం’ మార్చేనా? -
వీల్‌చైర్‌లోనే మమతా బెనర్జీ రోడ్‌షో
-
పిరికిపందలకు తలొగ్గేది లేదు: వీల్‌చైర్‌లోనే రోడ్‌షో
సాక్షి, కోలకతా: తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిమమతా బెనర్జీ (66) చెప్పినట్టుగానే వీల్ చెయిర్లో ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. ఎన్నికల ప్రచారాన్ని ఆపేది లేదనీ వీల్ చైర్లోనే ప్రజలను కలుస్తానని ప్రకటించిన మమత ఆదివారం కోల్‌కతాలో భారీ రోడ్‌షోకు హాజరయ్యారు.నందిగ్రామ్‌లో ప్రచారం సందర్భంగా గాయపడిన మమతా నాలుగు రోజుల తరువాత, తొలి బహిరంగ కార్యక్రమానికి హాజరయ్యి కార్యకర్తలు, అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా ధైర్యంగా పోరాటం కొనసాగిస్తామంటూ ఆమె ట్వీట్ చేశారు. ఇంకా చాలా పెయిన్ ఉంది. కానీ ప్రజల బాధలు ఇంకా ఎక్కువగా భావిస్తున్నారు. తన పవిత్ర భూమిని రక్షించుకునే ఈ పోరులో చాలా బాధలు పడ్డాం. ఇంకా పడతాం.. కానీ పిరికిపందలకు తలొగ్గేది లేదని దీదీ ప్రకటించారు. దాడి జరగలేదు : ఈసీ మరోవైపు సీఎం మమతా బెనర్జీపై దాడి జరిగిందన్న వాదనను ఈసీ తోసిపుచ్చింది. ఆమె సెక్యూరిటీ సిబ్బంది వైఫల్యంగా కారణంగానే ఆమె గాయపడ్డారని ఈసీ వర్గాలు తాజాగా వెల్లడించాయి. -
డీఎంకే అభ్యర్థులుగా తెలుగు ప్రముఖులు
చెన్నై: తిరువళ్లూరు జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇద్దరు తెలుగు ప్రముఖులు బరిలో దిగుతున్నారు. గుమ్మిడిపూండీ డీఎంకే అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీజే గోవిందరాజన్ తెలుగువారే. గుమ్మిడిపూండి సమీపంలోని దిగువముదలంబేడు గ్రామానికి చెందిన టీజేఎస్ విద్యాసంస్థల అధినేత టీజే గోవిందరాజన్. ప్రస్తుతం ఇతను డీఎంకే జిల్లా ఇన్చార్జ్గా కూడా పనిచేస్తున్నారు. తిరువళ్లూరు నియోజకవర్గంలో డీఎంకే అభ్యర్థిగా పోటీ చేస్తున్న వీజీ రాజేంద్రన్ కూడా తెలుగు మూలాలు వున్న వ్యక్తి కావడం గమనించదగ్గ విషయం. ఇతని భార్య ఇందిరా రాజేంద్రన్ టీటీడీ బోర్డు సభ్యురాలుగా వున్నారు. తిరువళ్లూరు నియోజకవర్గం నుంచి రెండోసారి డీఎంకే తరఫున పోటీచేస్తున్నారు. -
215వ సారి నామినేషన్; భార్య నగలు కుదువపెట్టైనా సరే
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం నామినేషన్ల పర్వం మొదలైంది. తొలి రోజున ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సహా పలువురు స్వత్రంత అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వీరిలో పద్మరాజన్(62) కూడా ఉన్నారు. ప్రత్యేకంగా ఈయన పేరే ఎందుకు ప్రస్తావిస్తున్నామంటే.. రాష్ట్రంలో ప్రతి ఎన్నికల్లో నామినేషన్ వేయడం ద్వారా ఆయన ‘తేర్దల్ మన్నన్ ’(ఎన్నికల రాజు)గా పేరుగాంచారు. ఇక ఏప్రిల్ 6న శాసన సభ ఎన్నికలు జరుగనున్న తరుణంలో మేట్టూరు నియోజకవర్గం నుంచి స్వతంత్రపద అభ్యర్దిగా నామినేషన్ వేశారు. కాగా 8వ తరగతి మాత్రమే చదువుకున్న పద్మరాజన్ సహకార సంఘాల ఎన్నికల నుంచి రాష్ట్రపతి ఎన్నికల వరకు నామినేషన్లు వేయడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. తన ఇంటికి టెలిఫోన్ సౌకర్యం కోసం 1988లో తొలిసారిగా మేట్టూరు అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేశారు. గిన్నీస్‌బుక్‌లో స్థానం కోసం ఆ తరువాత నుంచి అన్ని ఎన్నికల్లో నామినేషన్లు వేయడం కొనసాగించారు. ప్రధాని, ముఖ్యమంత్రి, అగ్రనేతలు పోటీచేసే స్థానాల్లో నామినేషన్లు వేయడం ద్వారా గుర్తింపు పొందారు. డిపాజిట్టుకు సొమ్ములేని పక్షంలో భార్య నగలు కుదువపెట్టి మరీ నామినేషన్లు వేస్తుంటారు. చదవండి: TN Assembly Polls: డీఎంకే మేనిఫెస్టో విడుదల -
లీటర్ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.4 తగ్గిస్తాం
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎంకే) శనివారం తమ మేనిఫెస్టో విడుదల చేసింది. సుమారు ఐదు వందలకు పైగా హామీలతో ప్రజల ముందుకు వచ్చింది. విద్య, ఉపాధి, ఆర్థికాభివృద్ధికి మేనిఫెస్టోలో ప్రాధాన్యం ఇచ్చినట్లు డీఎంకే అధినేత స్టాలిన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే, సామాన్యుడి నెత్తిన గుదిబండలా మారిన ఇంధన, వంటగ్యాస్ ధరలు తగ్గిస్తామని పేర్కొన్నారు. అదే విధంగా కార్మికులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని వాగ్దానం చేశారు. డీఎంకే మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు హిందూ ఆలయాల పునరుద్ధరణకు వెయ్యి కోట్లు మసీదులు, చర్చిల పునరుద్ధరణకు రూ.200 కోట్లు అన్నాడీఎంకే మంత్రుల అవినీతిపై విచారణకు ప్రత్యేక కోర్టు అధికారంలోకి రాగానే పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు లీటర్ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.4, పాలపై రూ.3 తగ్గిస్తాం పెంచిన ఆస్తిపన్నును రద్దు చేస్తాం వంటగ్యాస్‌పై సిలిండర్‌కు రూ.100 సబ్సిడీ జర్నలిస్టుల కోసం ప్రత్యేక కమిషన్ తమిళనాడులో నీట్ పరీక్షను రద్దు చేస్తాం కోయంబత్తూరు సహాఇతర ప్రధాన పట్టణాల్లో మెట్రోరైలు ప్రాజెక్టులకు శ్రీకారం ప్రముఖ యాత్రా స్థలాలకు వెళ్లాలనుకునే లక్ష మందికి రూ. 25 వేలు శ్రీలంక తమిళులకు పౌరసత్వం ఇచ్చే దిశగా ప్రయత్నాలు ప్రభుత్వ ఉద్యోగాల్లో 40శాతం మహిళలకు అవకాశం ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాది పాటు మెటర్నటీ లీవులు తమిళనాడు వ్యాప్తంగా కలైంజ్ఙర్ క్యాంటీన్లు ఏర్పాటు కరోనాతో నష్టపోయిన బియ్యం కార్డుదారులకు రూ.4వేల సాయం చదవండి: TN Assembly polls : స్టార్ హీరో అరంగేట్రం -
సీనియర్లకు షాకిచ్చిన కాంగ్రెస్..!
న్యూఢిల్లీ: అసమ్మతి నేతలకు కాంగ్రెస్ అధిష్టానం షాక్ ఇచ్చింది. స్టార్ క్యాంపెయినర్ జాబితాలో వారికి చోటివ్వలేదు. తొలి విడత పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్ పార్టీ శుక్రవారం స్టార్ క్యాంపెయినర్ జాబితా విడుదల చేసింది. దీనిలో అసమ్మతి నేతలుగా పేరుపొందిన జీ 23 నేతలు ఒక్కరు కూడా లేరు. కాంగ్రెస్ పార్టీ శుక్రవారం విడుదల చేసిన స్టార్ క్యాంపెయినర్ జాబితాలో సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సచిన్ పైలెట్, నవజోత్ సింగ్ సిధు, అభిజిత్ ముఖర్జీ, మహ్మద్ అజారుద్దిన్ తదితరులు ఉన్నారు. జీ23 గ్రూప్‌గా పేరు పొందిన అస్మమతి నేతలకు ఎవరికి ఈ జాబితాలో స్థానం దక్కలేదు. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ స్టార్ క్యాంపెయినర్లకు సంబంధించిన జాబితాను ఎన్నికల కమిషన్‌కు అందజేశారు. గతంలో సీనియర్ నేత వీరప్ప మొయిలీ ‘‘జీ 23 గ్రూప్ అంటూ ఏం లేదు. సోనియా గాంధీ నాయకత్వంలో పార్టీ ఐకమత్యంగా ఉంది’’ అని తెలిపారు. గత వారం సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున పార్టీ తరఫున ప్రచారం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. అయినప్పటికి స్టార్ క్యాంపెయినర్ జాబితాలో ఆయన పేరు లేకపోవడం గమనార్హం. -
ఆస్పత్రి నుంచి డిశ్చార్జైన దీదీ.. వీల్ చైర్లో ఇంటికి
కోల్‌కతా: రెండు రోజుల క్రితం నందిగ్రామ్ ర్యాలీలో భాగంగా టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ గాయాలపాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా ఎస్ఎస్కేఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దీదీ శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారు. వీల్‌చైర్ సాయంతో తన నివాసానికి చేరుకున్నారు. దాదాపు 48 గంటల పాటు దీదీని అబ్జర్వేషన్లో ఉంచారు వైద్యులు. ఈ క్రమంలో ఆమెని డిశ్చార్జ్ చేయాల్సిందిగా పార్టీ నాయకులు పదే పదే కోరడంతో ఆస్పత్రి వర్గాలు దీదీని డిశ్చార్జ్ చేశాయి. ప్రస్తుతం దీదీ ఆరోగ్యంగానే ఉన్నారని.. మరి కొన్ని రోజుల పాటు ఆమెకు విశ్రాంతి అవసరమని సూచించారు వైద్యులు. నందిగ్రామ్‌లో నామినేషన్ వేసి వస్తుండగా.. మమత ప్రమాదానికి గురయ్యారు. తనపై నలుగురైదురు వ్యక్తులు దాడి చేశారని.. కుట్ర ప్రకారమే ఇలా జరిగిందని మమత ఆరోపించగా.. ప్రత్యక్ష సాక్షులు మాత్రం దీదీని చూడ్డానికి జనాలు భారీ ఎత్తున రావడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. చదవండి: ఎన్నికల ప్రచారానికి వీల్ చెయిర్లో వస్తా..! -
కోయంబత్తూర్ సౌత్ నుంచి కమల్..
-
శబరిమల ఘటనలు నన్ను నొప్పించాయి
తిరువనంతపురం: కేరళ ఎన్నికల వేళ ఎల్డీఎఫ్ ప్రభుత్వం శబరిమలలో గెలుపుకోసం ఒకడుగు వెనక్కితగ్గినట్టు కనిపిస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో చావుదెబ్బతిన్న ఎల్డీఎఫ్ ప్రభుత్వం 2018లో శబరిమల వివాదంపై పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. కేరళ దేవాదాయ శాఖా మంత్రి కడకంపల్లి సురేంద్రన్, 2018లో శబరిమలలో మహిళల ప్రవేశానికి సంబంధించి జరిగిన ఘటనలపట్ల విచారం వ్యక్తం చేస్తూ, ఇది జరిగి ఉండాల్సింది కాదని వ్యాఖ్యానించారు. మంత్రిగారి వ్యాఖ్యలపై స్పందిం చిన కాంగ్రెస్, బీజేపీలు, ఎల్డీఎఫ్ ప్రభుత్వం బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. రాజకీయ పార్టీలు, భక్తులు, సామాన్య జనంతో చర్చించాకే సుప్రీంకోర్టు తుది తీర్పుని అమలు చేస్తామని సురేంద్రన్ హామీ ఇచ్చారు. ‘‘2018లో శబరిమలలో జరిగిన ఘటనలు మనందర్నీ నొప్పించాయి. నన్ను కూడా. అలా జరగకుండా ఉండాల్సింది’’అని ఏప్రిల్ 6న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తోన్న సీపీఐ(ఎం)నాయకుడు సురేంద్రన్ వ్యాఖ్యానించారు. దీనిపై సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రమేష్ చెన్నితాల, సురేంద్రన్ ప్రకటన మోసపూరితమని వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్ మాట్లాడుతూ మంత్రిగారిది మొసలి కన్నీరు అని ఎద్దేవా చేశారు. శబరిమలకు జరిగిన అన్యాయానికి, నష్టానికి వెయ్యిసార్లు గంగానదిలో మునిగినా క్షమించలేమని వ్యాఖ్యానించారు. వివక్షకి తావులేకుండా, అన్ని వయస్సుల మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించవచ్చంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన తరువాత, 2018లో, 10 నుంచి 50 ఏళ్ళ మధ్య వయస్సున్న 12 మంది మహిళలు శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించకుండా భక్తులు అడ్డుకోవడంతో మూడు నెలల పాటు హై డ్రామా జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడంలో కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం ప్రధానంగా సీపీఐ(ఎం) పై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తరువాత 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బతగిలింది. మొత్తం 20 స్థానాల్లో 19 స్థానాలను కోల్పోవాల్సి వచ్చింది. అయితే లోక్‌సభ ఎన్నికల్లో పట్టుకోల్పోయిన సీపీఐ(ఎం)తిరిగి ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బలంపుంజుకుంది. లోక్‌సభ ఎన్నికల అనంతరం సీపీఐ(ఎం) నిర్వహించిన ఇంటింటి సర్వేలో శబరిమల విషయంలో ఒక వర్గం ప్రజలు ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని తప్పుగా అర్థం చేసుకున్నట్టు గుర్తించింది. ‘శబరిమలలో మహిళల ప్రవేశానికి సంబంధించిన కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టు విస్త్రుత ధర్మాసనం ముందుంది. తుది తీర్పు ఏదైనప్పటికీ, ప్రజలతోనూ, భక్తులతోనూ, రాజకీయ పార్టీలతోనూ చర్చించాకే దాన్ని అమలు చేస్తాం’ అని మంత్రి వ్యాఖ్యానించారు. తీవ్రమైన క్రిమినల్ కేసులుకాని, శబరిమల పోరాటానికి సంబంధించిన అన్ని సాధారణ కేసులను, ఇటీవలే పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం వెనక్కి తీసుకుందని మంత్రి సురేంద్రన్ గుర్తుచేశారు. చదవండి: అసెంబ్లీ ఎన్నికల వేళ పార్టీ వీడిన సీనియర్ నేత ఆయన మాట వినకుండా తప్పు చేశానన్న ఇందిరాగాంధీ! -
కోయంబత్తూర్ సౌత్ నుంచి కమల్.. ప్రధాన కారణం అదేనట
చెన్నై: తమిళనాట రాజకీయ వాతావరణం క్రమంగా హీటెక్కుతోంది. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీలన్నీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసే పనిలో బిజీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నటుడు, మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం) పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ కోయంబత్తూర్ సౌత్ నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. తన పార్టీ రెండో విడత అభ్యర్థుల జాబితా విడుదల సందర్భంగా కమల్ ఈ విషయాన్ని ప్రకటించారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో తాను కోయంబత్తూర్ సౌత్ నుంచి పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. తొలుత కమల్ చెన్నై, అలందూర్ నుంచి పోటీ చేయాలని భావించినప్పటికి చివరకు కోయంబత్తూరు నుంచి బరిలో దిగేందకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా కమల్ మాట్లాడుతూ.. ‘‘మా నాన్న నన్ను ఐఏఎస్ అధికారిగా చూడాలనుకున్నారు. ఆ తర్వాత నేను రాజకీయాల్లోకి ప్రవేశించాలని ఆశపడ్డారు. కాకపోతే నేను ఆయన కలను నిజం చేయలేకపోయాను. అందుకే మా పార్టీలోకి ఎక్కువ మంది ఐఏఎస్ అధికారులను ఆహ్వానించాను. వారికే సీట్లు కేటాయించాను. ఇది నాకు ఎంతో గర్వకారణం’’ అన్నారు. ఇక కమల్ నేడు ప్రకటించిన రెండో జాబితాలో డాక్టర్ సుభా చార్లేస్ ‘కన్యాకుమారి), డాక్టర్ ఆర్ మహేంద్రన్ (సింగనల్లూర్), డాక్టర్ సంతోష్ బాబు (వెలాచేరి), మరియు పాజా కరుపయ్య (టి నగర్) నుంచి పోటీ చేయనున్నారు. అలందూర్ స్థానాన్ని శరద్ బాబుకు కేటాయించారు. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కోయంబత్తూరు సౌత్‌లో ఏఐడీఏంకే తరఫున అమ్మన్ కే అర్జున్ విజయం సాధించారు. తాజాగా పొత్తుల్లో భాగంగా ఏఐడీఎంకే పార్టీ ఈ స్థానాన్ని మిత్ర పక్షం బీజేపీకి కేటాయించింది. అయితే దీనిపై ఏఐడీఏంకే కార్యకర్తల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇక 2019 జనరల్ ఎలక్షన్లో ఎంఎన్ఎం కోయంబత్తూరు నియోజకవర్గంలో 11 శాతం ఓట్లు సాధించగలిగింది. ఇక్కడ పార్టీకి మద్దతురాలు ఎక్కువ ఉండటం.. ప్రస్తుత ఎన్నికల్లో ఏఐడీఎంకే కాకుండా బీజేపీ కోయంబత్తూరులో బరిలో నిలవడం వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే కమల్ ఇక్కడ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. చదవండి: మూడో కూటమి సీఎం అభ్యర్థిగా కమల్ ఖరారు -
TN Assembly polls : స్టార్ హీరో అరంగేట్రం
సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష ద్రావిడ మున్నేట కజగం(డీఎంకే) తన రేసుగుర్రాలను ప్రకటించింది. ఏప్రిల్ 6న జరగనున్న తమిళనాడు శాసనసభ ఎన్నికలు- 2021 కు మొత్తం 173 మంది అభ్యర్థుల జాబితాను శుక్రవారం విడుదల చేసింది. ఈ జాబితాలోని వివరాల ప్రకారం.. పార్టీ చీఫ్ ఎంకే స్టాలిన్ కోలాథూర్ నియోజకవర్గం నుంచి మళ్లీ బరిలో నిలవనున్నారు. అదే విధంగా స్టాలిన్ తనయుడు, నటుడు, నిర్మాత ఉదయనిధి స్టాలిన్ చెపాక్ స్థానంనుంచి అరంగేట్రం చేయనున్నారు. అంతేకాదు మాజీ మంత్రులు, సీనియర్లు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లను కేటాయించడం విశేషం. డిప్యూటీ సీఎం ఓ పన్నీర్‌సెల్వంపై తంగ తమిళసెల్వన్ పోటీ చేస్తారని, సీఎం ఇ పళనిస్వామితో టీ సంపత్‌కుమార్ తలపడ నున్నారని డీఏంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో విలేకరుల సమావేశంలో ప్రకటించారు. దురై మురుగన్, కె ఎన్ నెహ్రూ, కె పొన్ముడి, ఎంఆర్‌కె పన్నీర్ సెల్వం లాంటి సీనియర్లతోపాటు మాజీ మంత్రులు అలాడి అరుణ, సురేష్ రాజన్, కన్నప్పన్, మాజీ స్పీకర్ అవుడియ్యప్పన్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. అలాగే డీఎంకే ఐటీ వింగ్ చీఫ్ పీటీఆర్ తియాగరాజన్, టీఆర్ బాలు కుమార్ టీఆర్బీ రాజా పేర్లు సైతం జాబితాలో ఉన్నాయి. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని స్టాలిన్ ఈ సందర్భంగా కార్యకర్తలను కోరారు. కాగా 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో 61 సీట్లను ఇప్పటికే కూటమి కేటాయించగా, మిగిలిన 173 స్థానాల్లో డీఎంకే అభ్యర్థులను ప్రకటించింది. హీరోగా, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్‌తో చిత్ర నిర్మాతగా ఉదయనిధి స్టాలిన్ కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రముఖంగా ఉన్న సంగతి తెలిసిందే. -
అన్నాడీఎంకేకు షాక్: దినకరన్ వైపు ఆ ఎమ్మెల్యేల చూపు!
సాక్షి ప్రతినిధి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికలంటే అన్నిపార్టీ ల్లోని శ్రేణులకు ఆసక్తే. ఎన్నికల్లో పోటీచేయడం ద్వారా అదృష్టాన్ని పరీక్షించుకోవాలని తహతహ పడడం, అవకాశం దక్కకపోవడంతో అసంతృప్తికి లోనుకావడం సహజమే. అయితే తాజా అసెంబ్లీ ఎన్నికల్లో అ న్నిపార్టీల కంటే అన్నాడీఎంకేలో అసంతృప్తి, అసమ్మ తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. జయలలిత, కరుణానిధి కన్నుమూసిన తరువాత వచ్చిన తొలి అసెంబ్లీ ఎన్నికలు కావడంతో రెండుపార్టీలూ ప్రతిష్టాత్మకంగా పోరాడుతున్నాయి. ముఖ్యమంత్రి కావాలన్న జీవి త లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు డీఎంకే అధ్యక్షులు స్టాలిన్ అహర్నిశలూ పోరాడుతున్నారు. ఇక అన్నాడీఎంకే సైతం మూడోసారి గెలుపొందడం ద్వారా హ్యా ట్రిక్ కొట్టాలని పట్టుదలతో ఉంది. అదే జోరులో బుధవారం అభ్యర్థులను ప్రకటించిన వెంటనే ఆశావహులు అసంతృప్తితో రగలిపోవడం ప్రారంభమైంది. అలాగే సీట్లు ఖరారైన వారు కూడా అగ్రహంతో ఉన్నారు. తమను సంప్రదించకుండా మిత్రపక్ష పీఎంకేకు నియోజకవర్గాలను కూడా ఖరారు చేయడాన్ని అంగీకరించడం లేదు. ఇలా అనేక నియోజకవర్గాల్లో అసంతృప్తులు ఆగ్రహంతో ఊగిపోతూ గురువారం ఆందోళనకు దిగారు. కేటాయించిన నియోజకవర్గాన్ని మార్చాలని డిమాండ్ చేస్తూ పదిమంది అభ్యర్థుల అనుచరులు పలుప్రాంతాల్లో ఆందోళనకు దిగారు. ముగ్గురు మంత్రులు సహా 41 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి అవకాశం దక్కలేదు. సాత్తూరు నియోజకవర్గ అన్నాడీఎంకే ఎమ్మెల్యే రాజవర్మన్ మరో అడుగు ముందుకు వేసి ఎంఎంఎంకే ఆఫీసుకు వెళ్లి దినకరన్‌ను కలుసుకున్నారు. మరో ఆరుగురు ఎమ్మెల్యేలు సైతం దినకరన్ వైపునకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. సీటు దక్కని మంత్రి వలర్మతి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. 60 మంది కొత్తవారికి అవకాశం ఇవ్వగా వీరిలో కనీసం 53 మంది పాఠశాల విద్యను దాటనివారు కావడం గమనార్హం. ఎంఎంఎంకే, డీఎండీకే చర్చలు.. అన్నాడీఎంకే కూటమి నుంచి వైదొలిగిన డీఎండీకే, ఎంఎంఎంకే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌తో పొత్తు చర్చలు జరుపుతోంది. 50 నియోజకవర్గాలను కోరుతూ రహస్య చర్చలు కొనసాగిస్తోంది. తిరుచ్చిరాపల్లి జిల్లా జయంకొండం నుంచి సీటు దక్కకపోవడంతో వన్నియర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి వైద్యలింగం పార్టీని వీడారు. ఆరు సీట్లతో సర్దుకున్న టీఎంసీ.. కూటమి నుంచి చివరిక్షణంలో బైటికి వచ్చేపరిస్థితులు కల్పించడంతో అన్నాడీంకేపై అసంతృప్తితో ఉన్న తమాకా అధ్యక్షులు జీకే వాసన్ టీఎంసీ ముఖ్య నిర్వాహకులతో గురువారం సమాలోచనలు జరిపారు. తాము కోరినన్ని సీట్లు ఇచ్చేందుకు అన్నాడీఎంకే ముందుకు రావాలని గురవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ద్వారా వాసన్ కోరారు. గురువారం సాయంత్రానికి ఇరుపార్టీల మధ్య సామరస్యం కుదరడంతో ఆరు సీట్లతో టీఎంసీ సర్దుకుంది. డీఎంకేలో సైతం అసహనం.. డీఎంకేలో సైతం అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. పొన్నేరి, పల్లడం, అవినాశి మిత్రపక్షాలకు కేటాయించడంతో రాస్తారోకో చేసాయిు. ఈరోడ్ జిల్లాలో సెంగుంద ముదలియార్ సామాజిక వర్గానికి ఏపార్టీలోనూ సీటు దక్కక పోవడంతో 500 మంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీచేయాలని నిర్ణయించుకున్నారు. -
68 మందికి నేర చరిత్ర.. 157 మంది కోటీశ్వరులు
సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘పురుషులందు పుణ్య పురుషులు వేరయా’ అన్నట్లు రాజకీయనాయకుల్లో ఎమ్మెల్యేలు వేరు. ఈ ఎమ్మెల్యేల్లో సచ్చీలురులతోపాటు 68 మంది నేరగాళ్లు కూడా ఉన్నారనే సత్యాన్ని ఒక సర్వే బయటపెట్టింది. తమిళనాడు అసెంబ్లీలో 234 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జన నాయక సీర్తిరుత్త సంఘం, తమిళనాడు ఎన్నికల నిఘా సంయుక్తంగా చేపట్టిన సర్వేలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూసాయి. అన్నికంటే ముఖ్యంగా రాష్ట్రంలోని 68 మంది ఎమ్మెల్యేలకు నేరచరిత్ర ఉన్నట్లు తేలింది. 2016–21 మధ్య కాలం నాటి ఎమ్మెల్యేల నేర నేపథ్యం, విద్యార్హత, ఆస్తి, అంతస్తులపై సర్వే చేశారు. నాలుగు స్థానాలు ఖాళీ, 26 మంది ఎమ్మెల్యేల నామినేషన్ పత్రాలు గల్లంతు కావడంతో 204 ఎమ్మెల్యేల గురించి సర్వే నిర్వహించారు. వీరిలో 68 మంది నేరపూరిత కేసులను ఎదుర్కొంటునట్లు తేలింది. 8 మందిపై హత్య, హత్యాయత్నం, ఇద్దరిపై మహిళలకు వ్యతిరేకంగా వ్యవహరించిన నేరం కేసులున్నాయి. ఇక పార్టీ పరంగా పరిశీలిస్తే డీఎంకేలో 40, అన్నాడీఎంకేలో 23, కాంగ్రెస్‌లో 4, ఒక స్వతంత్య్ర ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులున్నాయి. 22 మంది డీఎంకే ఎమ్మెల్యేలు, 13 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు, ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఒక స్వతంత్య్ర ఎమ్మెల్యే తీవ్రమైన క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు. మిస్టర్ ‘కోటీశ్వర్’.. ఇక 204 ఎమ్మెల్యేల్లో కోటీశ్వరుల జాబితాను పరిశీలిస్తే 157 మంది మిస్టర్ ‘కోటీశ్వర్’గా ముద్రపడ్డారు. అన్నాడీఎంకేలో 76, డీఎంకేలో 74, కాంగ్రెస్‌లో 5, ఇండియన్ ముస్లింలీగ్ ఒకరు, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే కోటీశ్వరుల జాబితాలో ఉన్నారు. 89 మందికి పాఠశాల విద్యార్హత.. 89 మంది ఎమ్మెల్యేలు 5–12 తరగతులు చదివారు. 110 మంది పట్ట భద్రులు, ముగ్గురు డిప్లొమా చదివిన వారున్నారు. చదవడం, రాయడం మాత్రమే తెలిసిన ఒక ఎమ్మెల్యే విద్యార్హతను ప్రకటించలేదు. 25–50 మధ్య వయస్కులు 78 మంది, 51–70 మధ్య వయస్కులు 125 మంది ఉన్నారు. వీరుగాక 77 ఏళ్ల వయస్సుగల ఎమ్మెల్యే ఒక్కరున్నారు. -
మమతా బెనర్జీపై దాడి: ప్రత్యక్ష సాక్షి ఏమన్నారంటే..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై దాడి జరగడం కలకలం రేపుతోంది. నందిగ్రామ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తనపై పథకం ప్రకారం దాడి జరిగిందని, నలుగురు వ్యక్తులు తనపై దాడి చేశారని మమత ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఘటన గురించి టీఎంసీ నాయకులు బీజేపీపై అనుమానం వ్యక్తం చేస్తుండగా.. ఘటన జరిగినప్పుడు అక్కడే ఉన్న ప్రత్యక్ష సాక్షి ఒకరు దీనిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీదీపై ఎలాంటి దాడి జరగలేదని.. అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని తెలిపాడు. నిమై మైతి అనే వ్యక్తికి ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలోనే స్వీట్ షాప్ ఉంది. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ‘‘ఈ ఘటన నా షాప్ ఎదురుగానే జరిగింది. సాయంత్రం 6.15 గంటలకు మమతా బెనర్జీ ఒక ఆలయం నుంచి మరొక ఆలయానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో వచ్చిన ఒక యూటర్న్ దగ్గర సంఘటన జరిగింది. మమత వాహనంలో నుంచి కొద్దిగా బయటకు వచ్చి.. జనాలకు అభివాదం తెలుపుతున్నారు. ఈ క్రమంలో దీదీని చూడటానికి జనాలు ఒక్కసారిగా పరిగెత్తుకురావడంతో.. కారు డోరు ఆమె కాలికి తగిలి గాయం అయ్యింది. అంతే తప్ప.. ఆమె మీద ఎవరు దాడి చేయలేదు’’ అన్నారు. ఏఎన్ఐ కూడా ఇదే విషయాన్ని తెలిపింది. దీదీని ఎవరు నెట్టలేదని.. ఆమెపై ఎలాంటి దాడి జరగలేదని వెల్లడించింది. ఇద్దరు ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం ఏఎన్ఐ ఈ ప్రకటన చేసింది. అంతేకాక ఈ ఇద్దరు వ్యక్తులు తమకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని పేర్కొన్నారు. "సీఎంను చూడటానికి జనం గుమిగూడారు. ఈ గందరగోళంలో ఆమె కాళ్లకి కారు డోర్ తగిలి కింద పడ్డారు. దాంతో దీదీ మెడ, కాలికి గాయాలయ్యాయి. అంతే తప్ప ఆమెను ఎవరు నెట్టలేదు’’అని సుమన్ మైటీ అనే విద్యార్థి ఏఎన్ఐకి తెలిపాడు. మరో ప్రత్యక్ష సాక్షి చిత్రంజన్ దాస్ ఏఎన్ఐతో మాట్లాడుతూ "మమతా బెనర్జీ దేవాలయాల సందర్శన నుంచి తిరిగి వచ్చేటప్పడు కారు తలుపు తెరిచి కూర్చుని ఉన్నారు. దాంతో అది ఆమె కాలికి తగిలి గాయలయ్యాయి’’ అన్నారు. ఇక సీఎం ఆరోగ్య పరిస్థితిపై నేడు టీఎంసీ నాయకులు ఈసీని కలవనున్నారు. మమతా బెనర్జీపై దాడి ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఈసీ.. రేపటిలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని బెంగాల్ డీజీపీకి ఆదేశించారు. తనపై జరిగిన దాడిని మమత కుట్రగా వర్ణించారు. దాడి జరిగిన సమయంలో అక్కడ ఒక్క పోలీసు కూడా లేడని ఆమె ఆరోపించారు. చదవండి: మమతకు ఛాతినొప్పి.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు -
కేరళ కాంగ్రెస్‌కు భారీ షాక్!
తిరువనంతపురం: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ కేరళలో కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలింది. సీనియర్ నేత పీసీ చాకో బుధవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా చాకో కేరళ కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం లేదని, పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయిందని విమర్శించారు. దీని గురించి తాను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినా మౌనం వహించిందని అన్నారు. వర్గ విభేదాలతో విసిగిపోయి పార్టీ నుంచి బయటకు వస్తున్నట్టు మాజీ మంత్రి ప్రకటించారు. ఇక తాను బీజేపీలో చేరుతున్నానంటూ జరుగుతోన్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. కేరళ కాంగ్రెస్‌లో ఆత్మగౌరవం ఉన్న రాజకీయ నేత ఎవరూ మనుగడ సాగించలేరని చాకో దుయ్యబట్టారు. ‘‘నేను కాంగ్రెస్ పార్టీని వీడుతున్నాను.. రాజీనామా లేఖను తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపాను.. గత కొద్దికాలంగా ఈ నిర్ణయంపై నేను పలువురితో చర్చించాను.. అనేక రకాలుగా ఆలోచించాను. నేను కేరళ నుంచి వచ్చాను.. అక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు.. కాంగ్రెస్ (ఐ), కాంగ్రెస్ (ఏ)గా విడిపోయింది. ఇది కేరళ కాంగ్రెస్ యూనిట్‌గా పనిచేస్తున్న రెండు పార్టీల సమన్వయ కమిటీ’ అంటూ చాకో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఓ వర్గానికి మాజీ సీఎం ఊమెన్ చాందీ నాయకత్వం వహిస్తుంటే.. మరో వర్గానికి రాష్ట్ర పీసీపీ చీఫ్ రమేశ్ చెన్నితాల నాయకత్వం వహిస్తున్నారు.. చాలా ఏళ్లుగా ఈ రెండు వర్గాలు యాక్టివ్‌గా ఉన్నాయి’ అంటూ చాకో మండిపడ్డారు. ‘కేరళ కీలకమైన ఎన్నికలను ఎదుర్కొంటోంది.. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కానీ నాయకులు గ్రూప్‌లను ప్రోత్సహిస్తున్నారు. ఈ అంశంపై హైకమాండ్ ముందు మాట్లాడినా ప్రయోజనం లేకపోయింది’ అని తెలిపారు చాకో. పీసీ చాకో కాంగ్రెస్‌లో కీలక నేతగా ఉన్నారు. ఆ పార్టీ అధికార ప్రతినిధిగా, ఎంపీగా కీలక బాధ్యతలు చేపట్టారు. కేరళ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై కూడా చాకో ఆరోపణలు గుప్పించారు. పోటీచేసే అభ్యర్థుల జాబితా గురించి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీతో చర్చించలేదని దుయ్యబట్టారు. ‘కాంగ్రెస్‌వాదిగా చెబుతున్నాను. కేరళలో పార్టీ చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది.. మీరు కాంగ్రెస్‌లో ఏదో ఓ వర్గానికి చెందినవారైతే మాత్రమే మీకు మనుగడ ఉంటుంది... కాంగ్రెస్ నాయకత్వం అంత చురుకుగా లేదు’ అని ఆరోపించారు. చదవండి: అశ్లీలం.. గందరగోళం.. ఆయన మాట వినకుండా తప్పు చేశానన్న ఇందిరాగాంధీ! -
కేరళ అసెంబ్లీ ఎన్నికలు: తొలి లిస్ట్‌ను ప్రకటించిన సీపీఐ!
తిరువనంతపురం: కేరళలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీపీఐ తమ అభ్యర్థులను ప్రకటించింది. 25 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు నిర్ణయించిన అధిష్టానం, 21 మందితో కూడిన జాబితాను ప్రకటించినట్లు సీపీఐ రాష్ట్రకార్యదర్శి కనమ్ రాజేంద్రన్ తెలిపారు. ‘‘తొలుత 21 మంది అభ్యర్థుల పేర్లను వెల్లడించాం. మరో నాలుగు శాసన సభ స్థానాలకు త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తాం’’ అని తెలిపారు. ఎన్నిస్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టామనేది కాకుండా, ఎన్నిచోట్ల గెలిచామన్నదే ప్రధానమన్నారు. అయితే పునలూర్ నుంచి, జిఎస్ జయలాల్ చత్తనూర్ నుంచి పోటీపడనున్నారు. కాగా, ఇకే విజయన్ నాదపురం బరిలో దిగారు. కాగా ఆయా అభ్యర్థులు తమకు కేటాయించిన స్థానాల నుంచి తమ అదృష్టాన్ని పరీక్షించుకొనున్నారు. ఇక కేరళలో 140 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 6 ఎన్నికలు జరుగనున్నాయన్న విషయం తెలిసిందే. ఫలితాలు మే 2న వెలువడనున్నాయి. చదవండి: కొత్త సీఎంపై వీడిన ఉత్కంఠ -
234 స్థానాల్లో పోటీకి సిద్ధమైనా, 40 చాలు!
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం 40 స్థానాలపై గురి పెట్టింది. ఇందులో 30 స్థానాల్ని కైవసం చేసుకోవడం లక్ష్యంగా ఆపార్టీ నేత దినకరన్ వ్యూహాలకు పదును పెట్టారు. శశికళ రాజకీయాల నుంచి అస్త్ర సన్యాసం తీసుకోవడంతో ఆమె ప్రతినిధి దినకరన్ తన మార్క్ రాజకీయ వ్యూహాలకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో 234 నియోజకవర్గాల్లో పోటీకి సిద్ధమైనా, ప్రధానంగా 40 స్థానాలు చాలు అన్నట్టుగా నిర్ణయించినట్టు సమాచారం. ఇందులోనూ 30 సీట్లపై గురిపెట్టి చాపకింద నీరులా పనుల వేగాన్ని పెంచారు. ఏ,బీ,సీ అంటూ ఈ నియోజకవర్గాల్ని విభజించి లెక్కకు తగ్గ వ్యూహాన్ని ఆయన రచించి ఉండడం గమనార్హం. ఇందులో 10 మంది అనర్హత వేటు రూపంలో ఎమ్మెల్యే పదవి కోల్పోయిన నేతలు కావడంతో, ఈ స్థానాల్లో అవసరం అయితే, ఎంతైనా ఖర్చయినా పెట్టి, వారిని మళ్లీ అసెంబ్లీలోకి పంపించే రీతిలో వ్యూహాలు సాగిస్తున్నట్టు ఆపార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక తమిళనాడులో పాగా వేసేందుకు సిద్ధమైన మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతో కలిసి పనిచేసేందుకు దినకరన్ పార్టీ పొత్తు పెట్టుకుంటున్నట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. కాగా ఏప్రిల్ 6న రాష్ట్రంలో శాసన సభ ఎన్నికలకు నిర్వహణకై కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ క్రమంలో డీఎంకే కూటమిలో భాగంగా 234 స్థానాల్లో డీఎంకే –174, కాంగ్రెస్–25, సీపీఎం –6, సీపీఐ–6, వీసీకే –6, ఎండీఎంకే –6, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్‌కు –3, మనిదనేయ మక్క ల్ కట్చికి –2, కొంగు మక్కల్ దేశీయ కట్చికి –3 తమిళర్ వాల్వురిమై కట్చికి ఒకటి చొప్పున సీట్లు కేటాయించారు. అయితే అధికార అన్నాడీఎంకేలో మాత్రం ఇంకా సీట్ల పంచాయతి తేలలేదు. చదవండి: కాంగ్రెస్‌కు 25.. మరి బీజేపీకి ఎన్ని సీట్లు!? -
కాంగ్రెస్‌కు 25.. మరి బీజేపీకి ఎన్ని సీట్లు!?
సాక్షి, చెన్నై: సీట్ల సర్దుబాట ప్రక్రియను డీఎంకే ముగించింది. 174 స్థానాల్లో ఆ పార్టీ పోటీ చేయనుంది. అన్నాడీఎంకేలో సీట్ల సర్దుబాటు కసరత్తులు కొనసాగుతూనే ఉన్నాయి. లెక్కతేలినా, ఎవరైనా వస్తారన్న ఎదురుచూపుల్లో మూడో కూటమి ఉంది. అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లకు మరో రోజు మాత్రమే సమయం ఉంది. ఈనెల 12 నుంచి ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్న నేపథ్యంలో రాజకీయపక్షాలు పొత్తులు, సీట్ల సర్దుబాటు కసరత్తులు వేగవంతం చేశాయి. ఇందులో డీఎంకే ముందడుగు వేసింది. సీట్ల సర్దుబాటు ప్రక్రియను మంగళవారంతో ముగించింది. ఈ మేరకు రాష్ట్ర అసెంబ్లీలోని 234 స్థానాల్లో డీఎంకే –174, కాంగ్రెస్–25, సీపీఎం –6, సీపీఐ–6, వీసీకే –6, ఎండీఎంకే –6, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్‌కు –3, మనిదనేయ మక్క ల్ కట్చికి –2, కొంగు మక్కల్ దేశీయ కట్చికి –3 తమిళర్ వాల్వురిమై కట్చికి ఒకటి చొప్పున సీట్లు కేటాయించారు. మరో రెండు చిన్న పార్టీలకు తలా ఓ సీటు ఇచ్చారు. దీంతో కూటమిలోని ఆయా పార్టీ లు తమకు కావాల్సిన నియోజకవర్గాలు, అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టాయి. ఇక చెన్నైలో డీఎంకే 14 స్థానాల్లో పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం వెలువడింది. ఎండీఎంకేతో పాటు చిన్న పార్టీల అభ్యర్థులు డీఎంకే చిహ్నంతో ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. ఇక ఎవరైనా కలిసి వ చ్చినా వారు డీఎంకే చిహ్నంపై పోటీ చేయాల్సిందే. అన్నాడీఎంకేలో తేలని లెక్క.. అన్నాడీఎంకే కూటమిలో సీట్ల పంచాయితీ లెక్క తేలడం లేదు. పీఎంకేకు మాత్రం 23 సీట్లు కేటాయించారు. బీజేపీకి 20 ఇచ్చినా, అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆ కూటమిలోని డీఎండీకే, తమిళ మానిల కాంగ్రెస్‌తో సీట్ల పందేరం కొలిక్కి రాలేదు. తమతో అన్నాడీఎంకే వ్యవహరిస్తున్న తీరుతో విసిగి వేసారిన విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకే కూటమి నుంచి వైదొలగుతున్నట్టు మంగళవారం ప్రకటించింది. అయితే నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని విజయకాంత్‌కు అన్నాడీఎంకే, బీజేపీలు సూచించే పనిలోపడ్డాయి. అన్నాడీఎంకే కూటమికి మరికొన్ని చిన్న పార్టీలు మద్దతు ఇచ్చినా లెక్క తేలడానికి మరి కొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. విజయకాంత్ తరహాలో తమిళ మానిల కాంగ్రెస్ కూడా నిర్ణయం తీసుకోవచ్చన్న ప్రచారం నేపథ్యంలో ఈ కూటమి నామినేషన్లకు ముందే చెల్లా చెదురయ్యేనా అన్న చర్చ జోరందుకుంది. ఎదురుచూపుల్లో మూడో ఫ్రంట్.. నటుడు, మక్కల్ నీది మయ్యం నేత కమల్ నేతృత్వంలో మూడో కూటమి ఏర్పాటైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కూటమిలో ఐజేకే, ఎస్‌ఎంకేలు ఉన్నాయి. ఈ మూడు పార్టీలు సీట్ల పంపకాల్ని ముగించాయి. మక్కల్ నీది మయ్యం–154, ఐజేకే, ఎస్‌ఎంకేలు తలా 40 స్థానాల్లో పోటీ చేసేందుకు నిర్ణయించాయి. ఈ సమయంలో అన్నాడీఎంకే నుంచి బయటకు వచ్చిన డీఎండీకేకు మూడో కూటమి ఆహ్వానం పలికే పనిలో పడింది. అలాగే, తమతో మరెవరైనా కలిసి అడుగులు వేయవచ్చన్న ఎదురుచూపుల్లో మూడో ఫ్రంట్ వర్గాలు ఉన్నాయి. ఆ మేరకు కూటమికి ఓ మంచి పేరు పెట్టడమే కాకుండా, సీట్ల లెక్కల వివరాల్ని అధికారికంగా ప్రకటించేందుకు కమల్ నిర్ణయించారు. చదవండి: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో అర్జున్ భేటీ -
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో అర్జున్ భేటీ
సాక్షి, చెన్నై: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, తమిళనాడు బీజేపీ ఎన్నికల ఇన్చార్జ్ కిషన్‌రెడ్డితో నటుడు అర్జున్ భేటీ అయ్యారు. దీంతో ఆయన బీజేపీలో చేరబోతున్నట్టు ప్రచారం జోరందుకుంది. చెన్నైలో తిష్ట వేసి ఎన్నికల వ్యూహాలకు కిషన్‌రెడ్డి పదును పెట్టిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో బీజేపీ అధ్యక్షుడు ఎల్ మురుగన్, కిషన్‌రెడ్డిలను అర్జున్ మంగళవారం కలవడం రాజకీయంగా చర్చకు దారి తీసింది. కొంత సేపు వీరి మధ్య పలు అంశాలపై చర్చ సాగిన సమాచారంతో అర్జున్ బీజేపీలో చేరుతారన్న ప్రచారం జోరందుకుంది. అయితే ఈ పలకరింపు మర్యాద పూర్వకమేనని, కిషన్‌రెడ్డి తనకు సన్నిహితుడు కావడంతోనే ఆయన్ను కలిసినట్టుగా అర్జున్ పేర్కొన్నారు. చదవండి: అన్నాడీఎంకే- బీజేపీ కూటమి నుంచి మిత్రపక్షం అవుట్! -
టీటీవీ దినకరన్‌తో ఒవైసీ పొత్తు..
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మజ్లిస్ పార్టీ సిద్ధమైంది. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం(ఏఎమ్ఎమ్కే)తో జట్టుకట్టింది. కాగా ఏఎమ్ఎమ్కే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ రెండు స్థానాల నుంచి పోటీ చేయనున్నారు. అయితే స్థానాల పేర్లను మాత్రం వెల్లడించలేదు. ఇక ఓవైసీ నాయకత్వంలోని ఏఐఎంఐఎం, కూటమిలో చేరి కృష్ణగిరి, శంకరాపురం, వానియంబాడి నుంచి పోటీ చేస్తోంది. ఓవైసీ పార్టీకి సీట్ల కేటాయింపుపై హైదరాబాద్ నుంచి వచ్చిన ఐదుగురితో కూడిన బృందం సోమవారం చర్చలు చేపట్టింది. కమల్‌హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యం, ఐజేకే, సమక ఒక కూటమిగా ఏర్పడింది. చెన్నై ఆలందూరు సీటును కమల్‌హాసన్ దాదాపు ఖరారు చేసుకున్నారు. తన వాగ్దానాలను డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ కాపీ కొడుతున్నారని కమల్ ప్రచారాల్లో ఎద్దేవా చేస్తున్నారు. తమ కూటమి వివరాలను రెండు రోజుల్లో ప్రకటిస్తానని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ సోమవారం తెలిపారు. 178 స్థానాల్లో పోటీచేయనున్న డీఎంకే డీఎంకే కూటమిలో సీట్ల సర్దుబాటు దాదాపు పూర్తయింది. మొత్తం 234 స్థానాల్లో 178 నియోజకవర్గాల్లో డీఎంకే పోటీ చేయనుంది. మిగిలిన వాటిలో ఇండియన్ ముస్లిం లీగ్, మనిదనేయ మక్కల్ కట్చి– 2, సీపీఐ– 6, ఎండీంకే– 6, వీసీకే– 6 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. సుదీర్ఘ మంతనాల తర్వాత కాంగ్రెస్‌కు 25 సీట్లు కేటాయించారు. అలాగే కన్యాకుమారి లోక్‌సభ ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారు. మరోవైపు సీపీఐ నేతలతో స్టాలిన్ సోమవారం చర్చలు జరిపి ఆరు సీట్లను ఖరారు చేశారు. ఇందుకు సంబంధించిన అంగీకార పత్రాలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణన్‌కు అందజేశారు. అలాగే తమిళగ వాళ్వురిమై కట్చికి ఒక సీటు ఖరారు చేశారు. డీఎంకేకు మద్దతిస్తున్నట్లు కరుణాస్ నాయకత్వంలోని ముకుల్తోర్ పులిపడై, తమీమున్ అన్సారీ నేతృత్వంలోని జననాయక కట్చి, అదిత తమిళర్ పేరవై, ఇండియ తవ్హీద్ జమాత్ ప్రకటించాయి. చదవండి: అన్నాడీఎంకే- బీజేపీ కూటమి నుంచి మిత్రపక్షం అవుట్! -
డీఎండీకే డిమాండ్లకు నో.. కూటమి నుంచి అవుట్!
చెన్నై: ప్రముఖ తమిళ నటుడు, దేశీయ ముర్పొక్కు ద్రవిడ కళగం(డీఎండీకే) అధినేత విజయకాంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సీట్ల కేటాయింపు అంశంలో విభేదాలు తలెత్తడంతో అన్నాడీఎంకే- బీజేపీ కూటమి నుంచి వైదొలిగారు. ఈ మేరకు మంగళవారం జరిగిన సమావేశం అనంతరం.. ‘‘రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మూడు దశల్లో అన్నాడీంఎకేతో చర్చలు జరిగాయి. అయితే మేం కోరిన స్థానాల్లో, కోరినన్ని సీట్లు కేటాయించేందుకు అన్నాడీఎంకే నిరాకరించింది. మా చర్చలు సఫలం కాలేదు. వెంటనే డీఎండీకే జిల్లా సెక్రటరీలతో మాట్లాడాను. కూటమి నుంచి వైదొలిగాం. నేటి నుంచి ఇక డీఎండీకే, అన్నాడీఎంకేతో కలిసి ముందుకు సాగదు’’ అని విజయకాంత్ ప్రకటన విడుదల చేశారు. అయితే, తదుపరి కార్యాచరణ ఇంకా ఖరారు చేయలేదని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కాగా గత శాసన సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమితో జట్టుకట్టిన డీఎండీకే ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. అయిప్పటికీ, తాజా ఎన్నికల్లో తమకు 23 సీట్లు ఇవ్వాలని డీఎండీకే పట్టుబట్టినట్లు సమాచారం. కానీ, అన్నాడీఎంకే మాత్రం కేవలం 15 సీట్లు ఇచ్చేందుకే మొగ్గు చూపడం, అది కూడా వాళ్లు కోరిన స్థానాల్లో కాకుండా వేరే చోట్ల కేటాయిస్తామనడంతో విజయకాంత్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, డీఎండీకే బలం తగ్గినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో కొంత మేర అయినా ఓట్లు చీలే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉండగా.. అన్నాడీఎంకే కూటమిలో పీఎంకేకు 23 సీట్లు, బీజేపీకి 20 సీట్లను కేటాయించినట్టు సమాచారాలు వెలువడ్డా, అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. ఈ కూటమిలోని జీకే వాసన్ నేతృత్వంలోని తమిళ మానిల కాంగ్రెస్ పపదిహేను మేరకు సీట్లను వాసన్ ఆశిస్తుండగా, పీఎంకేతో సమానంగా సీట్లు కేటాయించాలని పట్టుబట్టిన డీఎండీకే వైదొలగడం గమనార్హం. చదవండి: మెట్టుదిగని డీఎండీకే.. అన్నాడీఎంకేకు తలనొప్పి! -
పొలిటీకల్ ఎంట్రీ: గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు
ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఈ ఏడాది జనవరిలో అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు రెండు ఆంజియోప్లాస్ట్ సర్జరీలు చేశారు వైద్యులు. ప్రస్తుతం గంగూలీ ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఇక దాదా భవిష్యత్ ప్రణాళికలు ఏంటనే దానిపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది. ఈ క్రమంలో గంగూలీ స్వరాష్ట్రం పశ్చిమ బెంగాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దాంతో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దాదా రాజకీయ రంగం ప్రవేశం గురించి చర్చ నడుస్తోంది. గంగూలీని తమతో కలుపుకునేందుకు అటు టీఎంసీ.. ఇటు బీజేపీ రెండు పోటీ పడుతున్నాయి. వీటికి బలం చేకూరుస్తూ.. కొద్ది రోజుల క్రితం ఇరు పార్టీల నాయకులు గంగూలీని కలిశారనే వార్తలు వచ్చాయి. కానీ దాదా వీటిని ఖండించారు. ఈ క్రమంలో ఓ ఆంగ్ల మీడియా గంగూలీ భవిష్యత్ ప్రణాళిక ఏంటని ప్రశ్నించింది. దీనిపై స్పందిస్తూ.. ‘‘జీవితం ఎటు పోతుందో.. ఏం జరుగుతుందో’’ చూడాలి అంటూ బదులిచ్చారు దాదా. దేశవ్యాప్తంగా తనకున్న పాపులారిటీపై స్పందిస్తూ గంగూలీ.. ‘‘అదృష్టం కొద్ది నాకు చాలా మంది ప్రేమాభిమానాలు లభించాయి. నేనిది ఊహించలేదు. నా పని నేను చేశాను. కోల్‌కతాలో నేను సాధారణ జీవితం గడిపాను. ప్రజలను కలవడం.. వారితో మాట్లాడటం.. వారితో సమయం గడపటం నా నైజం. నేనలాగే ఉంటాను’’ అన్నారు. అలానే ‘‘నేను చాలా స్నేహపూర్వకంగా ఉంటాను. కాకపోతే ఎవరితోనూ ఎక్కువ సేపు గడపలేను. నేను చాలా ఫేమస్ కాబట్టి.. జనాలు నన్ను కలవాలంటే కష్టం అనే మాటలను నేను నమ్మను. నా జీవితం నేను గడుపుతున్నాను.. అందువల్లే ప్రజలు నన్ను ఇష్టపడుతున్నారని భావిస్తాను’’ అన్నారు. చదవండి: దాదా భేటీపై రాజకీయ దుమారం -
మెట్టుదిగని డీఎండీకే.. అన్నాడీఎంకేకు తలనొప్పి!
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో సీట్ల పందేరం కొలిక్కి రావడం లేదు. ప్రధానంగా డీఎండీకే రూపంలో సమస్య తప్పడం లేదు. తమిళ మానిల కాంగ్రెస్‌కు సోమవారం సీట్ల కేటాయింపు సాగనుంది. చిన్న చిన్న పార్టీలు ఆదివారం అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరుసెల్వం, కో కన్వీనర్ పళనిస్వామిని కలిసి మద్దతు తెలపడమే కాకుండా, తమకు తలా ఓ సీటు కేటాయించాలన్న విజ్ఞప్తిని ఉంచాయి. అన్నాడీఎంకే కూటమిలో పీఎంకేకు 23 సీట్లు కేటాయించారు. బీజేపీకి 20 సీట్లను కేటాయించినట్టు సమాచారాలు వెలువడ్డా, అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ కూటమిలోని జీకే వాసన్ నేతృత్వంలోని తమిళ మానిల కాంగ్రెస్, విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకేకు సీట్ల కేటాయింపుల్లో సమస్యలు తప్పడం లేదు. పదిహేను మేరకు సీట్లను వాసన్ ఆశిస్తుండగా, పీఎంకేతో సమానంగా సీట్లకు డీఎండీకే పట్టుబడుతున్నట్టు సమాచారం. ఈ రెండు పార్టీలతో ఆదివారం కూడా చర్చలు సాగాయి. డీఎండీకేకు గతంలో ఉన్నంత బలం ప్రస్తుతం లేదని, పది నుంచి పదిహేనులోపు సీట్లతో సరి పెట్టేందుకు అన్నాడీఎంకే నిర్ణయించినట్టు తెలిసింది. అయితే, ఆ సీట్లను స్వీకరించేందుకు డీఎండీకే ముందుకు రావడం లేదు. మెట్టుదిగే ప్రసక్తే లేదని, తాము ఆశిస్తున్న సీట్లతో పాటు ఓ రాజ్యసభ ఇవ్వాల్సిందేనని డీఎండీకే పట్టుబడుతుండడంతో అన్నాడీఎంకేకు శిరోభారం తప్పడం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆదివారం విజయకాంత్ నేతృత్వంలో ఆ పార్టీ ఆశావహుల ఇంటర్వ్యూలు సాగడం గమనార్హం. 13 జిల్లాల నుంచి ఆశావహుల్ని విజయకాంత్ ఇంటర్వ్యూ చేశారు. అన్నాడీఎంకే పట్టువీడని పక్షంలో ఒంటరి సమరానికి సిద్ధమన్నట్టుగా డీఎండీకే అడుగులు ఉన్నట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. జీకే వాసన్ ఓ మెట్టుదిగినట్టు, సోమవారం సీట్ల కేటాయింపునకు సంతకాలు జరిగే అవకాశం ఉందని అన్నాడీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. మేనిఫెస్టో కసరత్తులు.. రాయపేటలోని కార్యాలయంలో పన్నీరు, పళని మేనిఫెస్టోకు తుది మెరుగుల కసరత్తుల్లో నిమగ్నమయ్యారు. పొన్నయ్యన్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా మేనిఫెస్టోపై చర్చించి మార్పులు చేర్పులపై దృష్టి పెట్టారు. అభ్యర్థుల జాబితా తుది కసరత్తులు పూర్తి చేసినట్టు సమాచారం. చదవండి: తమిళనాట ఎన్డీయేదే గెలుపు -
Mithun Chakraborty: బీజేపీలోకి మిథున్ చక్రవర్తి
కోల్‌కతా: బాలీవుడ్ ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆదివారం కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్‌వర్గీయా, పార్టీ బెంగాల్ శాఖ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం పని చేయాలని తాను కోరుకుంటున్నట్లు మిథున్ చక్రవర్తి చెప్పారు. తన ఆకాంక్షను నెరవేర్చుకునేందుకు బీజేపీ ఒక వేదికగా ఉపయోగపడుతుందని అన్నారు. బెంగాలీని అని చెప్పుకోవడం తనకెంతో గర్వకారణమని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అభిమానుల కోరిక మేరకు తాను నటించిన బెంగాలీ సినిమాలోని ఒక డైలాగ్ చెప్పి అలరించారు. అమీ జోల్దోరవో నోయి, బెలె బొరావో నోయి.. అమీ ఏక్తా కోబ్రా, ఏక్ చోబోల్–యి చోబి (నేను హాని చేయని పామును అనుకొని పొరపాటు పడొద్దు. నేను నాగుపామును. ఒక్క కాటుతో చంపేస్తా జాగ్రత్త) అనే డైలాగ్ చెప్పారు. తాను గతంలో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి తప్పు చేశానని మిథున్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా ప్రచారం చేస్తానని తెలిపారు. బీజేపీ గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరవుతారన్నది పార్టీ నాయకత్వమే నిర్ణయిస్తుందన్నారు. బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ సభలో ప్రధాని ప్రసంగిస్తూ.. ఈరోజు బంగ్లార్ చెలే(బెంగాలీ బిడ్డ) మిథున్ చక్రవర్తి మనతో ఉన్నారని చెప్పారు. ఆయన జీవితం, సాగించిన పోరాటం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మిథున్ చక్రవర్తికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో గతంలో సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఆయన 2014లో టీఎంసీ తరపున రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు. అనారోగ్య కారణాలతో 2016లో రాజీనామా చేశారు. శారదా కుంభకోణంలో మిథున్ పేరు వెలుగులోకి వచ్చింది. ఆయన అవకాశవాది అని టీఎంసీ, కమ్యూనిస్టు పార్టీలు విమర్శించాయి. -
లెఫ్ట్ భవిష్యత్ కాంగ్రెస్ చేతిలో
ఒక రాష్ట్రంలో కాంగ్రెస్‌తో కరచాలనం చేస్తూ మరో రాష్ట్రంలో అదే పార్టీపై కత్తులు దూస్తూ ఎన్నికల రణక్షేత్రంలోకి దిగిన లెఫ్ట్ పార్టీలకు అంతా అగమ్యగోచరంగా ఉంది. ఒక చోట నిలబెట్టుకోవాలి, మరో చోట పునర్వైభవం సాధించాలి వామపక్ష పార్టీలను తేల్చడమైనా, ముంచడమైనా ఇప్పుడు కాంగ్రెస్ చేతుల్లోనే ఉంది. కేరళలో అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే కాంగ్రెస్ పార్టీని కట్టడి చేయాలి, పశ్చిమ బెంగాల్లో తిరిగి పట్టు సాధించాలంటే కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయాలి. ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ వైచిత్రిని ఎదుర్కోవడమే ఇప్పుడు వామపక్ష పార్టీల ముందున్న అసలు సిసలు సవాల్‌గా మారింది. అసోం, తమిళనాడు, పాండిచ్చేరితో పాటు దేశవ్యాప్తంగా ఉత్కంఠను పెంచుతున్న పశ్చిమ బెంగాల్, కేరళలో ఎన్నికల వేడి రాజుకుంది. 2016లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విఫలప్రయోగంగా నిలిచినప్పటికీ ఈ సారి ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌తోనే కలిసి వామపక్షాలు ఎన్నికల బరిలో దిగాయి. బెంగాల్లో ఆదివారం జరిగిన కాంగ్రెస్–లెఫ్ట్ కూటమి నిర్వహించిన మెగా ర్యాలీకి జనం వెల్లువెత్తినప్పటికీ కాంగ్రెస్ అగ్రనేతలెవరూ హాజరుకాలేదు. కేరళలో యూడీఎఫ్ కూటమి విజయానికి తీవ్రంగా శ్రమిస్తున్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, బెంగాల్లో వామపక్ష నాయకులతో కలిసి ఒకే వేదికను పంచుకోవడానికి ఇష్టపడలేదు. దీంతో స్థానిక కాంగ్రెస్ నేతలే ర్యాలీకి హాజరయ్యారు. మరోవైపు కేరళలో వామపక్షాల నేతృత్వంలోని అధికారి ఎల్డీఎఫ్కు, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌కి మధ్య ముఖాముఖి పోరు నెలకొంది. కేరళలో వామపక్ష పార్టీలను ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ బీజేపీతో తెరవెనుక అవగాహనతో పని చేస్తోందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. బీజేపీ ఓటమి కోసం పని చేయాల్సిన కాంగ్రెస్ ఇలా చేయడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. లెఫ్ట్ దారి వివాదాస్పదం భారతీయ జనతా పార్టీని ఓడించడానికి కాషాయ వ్యతిరేక శక్తులన్నీ పిలుపునిస్తున్న వామపక్ష పార్టీలు ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్(ఐఎస్ఎఫ్)తో చేతులు కలపడానికి సిద్ధపడడం వివాదానికి దారి తీస్తోంది. 30 శాతం ముస్లిం జనాభా ఉన్న బెంగాల్లో 100–110 సీట్లలో వారి ప్రభావం ఉంటుంది. ముస్లిం ఓట్లను కొల్లగొట్టడానికి పరిషద్ అబ్బాస్ సిద్దికి నేతృత్వంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)లను తమ కూటమిలో చేర్చడానికి సన్నాహాలు చేస్తున్నారు. కోల్‌కతాలో జరిగిన మెగా ర్యాలీకి సిద్దికి హాజరై ప్రసంగించారు. ‘‘మేమే ప్రత్యామ్నాయం, మేమే లౌకికవాదులం, మేమే మీ భవిష్యత్’’ అన్న నినాదంతో బెంగాల్ బరిలోకి దిగిన వామపక్ష నాయకులు తమ వేదికపై ముస్లిం మత పెద్ద సిద్దికిని కూర్చోబెట్టడం పలు విమర్శలకు దారి తీస్తోంది. కరడుగట్టిన మతవాదితో కలుస్తూ లౌకిక రాగాలాపన ఎలా సాధ్యమంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు హోరెత్తిపోతున్నాయి. వామపక్షాలు వేసే అడుగులు బీజేపీకి లబ్ధి చేకూరుతాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పదేళ్లుగా మమతా దీదీ అణచివేత చర్యల్ని ఎదుర్కొంటూనే ప్రజా ఉద్యమాల ద్వారా తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నాలైతే వామపక్ష పార్టీలు చేస్తూనే ఉన్నాయి. – న్యూఢిల్లీ ఓటు బ్యాంకు 2016లో లెఫ్ట్, కాంగ్రెస్ కూటమికి 38% ఓట్లువచ్చాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు పోలయిన ఓట్ల కంటే ఇది కేవలం 7శాతం మాత్రమే తక్కువ. అందులో వామపక్ష పార్టీలే 26శాతం ఓటు బ్యాంకుని సాధిం చాయి. అయితే గత ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీల ఓటు బ్యాంకు ఏకంగా 7.52 శాతానికి తగ్గిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్‌తో మిత్రలాభం, మిత్రభేదాన్ని ఏకకాలంలోనే ఎదుర్కొంటూ వామపక్షాలు ఎలా ముందుకు సాగుతాయో చేచి చూడాల్సిందే. -
ఓట్లు కొనేందుకు బీజేపీ సిద్ధమైంది: మమతా బెనర్జీ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎల్పీజీ సిలిండర్ల ధరల పెరుగుదలను నిరసనగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆదివారం సిలిగురిలో పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో టీఎంసీ కార్యకర్తలు పెద్ద ఎత్తున గ్యాస్ బండ ప్లకార్డులు పట్టుకొని పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓట్లు కొనేందుకు బీజేపీ సిద్ధమైందని మండిపడ్డారు. బీజేపీ నుంచి డబ్బులు తీసుకుని ఓట్లు టీఎమ్‌సీకి వేయండని ఆమె చెప్పారు. మహిళలు బెంగాల్లో క్షేమంగా లేరని మోదీ అంటున్నారని, మరి బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లో మహిళలు సురక్షితంగా ఉన్నారా అని ప్రశ్నించారు. బెంగాల్లోనే మహిళలు అత్యంత సురక్షితంగా ఉన్నారని తెలిపారు. ఈ పాదయాత్రలో పార్టీ ఎంపీలు మిమి చక్రవర్తి, నుస్రత్ జహాన్‌లు పాల్గొన్నారు. మర్చి 27 నుంచి ప్రారంభమయ్యే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఎనిమిది దశల్లో జరగనున్నాయి. చదవండి: బెంగాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ నాశనమైంది -
‘బెంగాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ నాశనమైంది’
-
‘బెంగాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ నాశనమైంది’
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అభివృద్ధిని తృణముల్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఆదివారం పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ కోల్‌కతాలో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ పాల్గొని ప్రసంగించారు. వచ్చే 25 ఏళ్లు బెంగాల్ అభివృద్ధికి చాలా ముఖ్యమైనవని, రాబోయే ఐదేళ్లలో ఇక్కడ జరిగే అభివృద్ధి, బెంగాల్ అభివృద్ధికి పునాది వేస్తుందన్నారు. 2047లో భారత్ 100 ఏళ్ల స్వాతంత్ర్యాన్ని జరుపునేటప్పుడు బెంగాల్ మరోసారి దేశానికి నాయకత్వం వహిస్తుందని పేర్కొన్నారు. రైతులు, వ్యాపారులు, మహిళల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని, వారి కలల సాకారానికి ప్రతి క్షణం శ్రమిస్తున్నామని తెలిపారు.పెట్టుబడులు, పరిశ్రమలు పెంచడం ద్వారా బెంగాల్‌ను పునర్నిర్మాణం చేస్తామని అన్నారు. పశ్చిమబెంగాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ నాశనమైందని, బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తామన్నారు. ప్రభుత్వ వ్యవస్థలపై మళ్లీ ప్రజల్లో నమ్మకాన్ని తిరిగి తెస్తామని పేర్కొన్నారు. బెంగాల్ ప్రజల సోనార్ బంగ్లా కలను బీజేపీ సాకారం చేస్తుందన్నారు. బెంగాల్ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని తెలిపారు. బెంగాల్ సంస్కృతి, కళల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీ తెలిపారు. ఈ బహిరంగ సభకు వేదికైన బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ ఎంతో మంది గొప్ప నాయకులకు సాక్ష్యంగా నిలిచిందని తెలిపారు. మార్పు కోసం బెంగాల్ ప్రజలు తమ ఆశలను ఎప్పుడూ వదిలిపెట్టలేదని గుర్తుచేశారు. బెంగాల్‌లోని కాంగ్రెస్, తృణముల్ కాంగ్రెస్ పార్టీ, వామపక్షపార్టీలు రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో బెంగాల్ వ్యతిరేక విధానాలతో ప్రవర్తించనున్నాయని తెలిపారు. గత 75 ఏళ్లలో బెంగాల్ కోల్పోయిన వైభవాన్ని తిరిగి నిర్మిస్తామని ప్రధాని మోదీ తెలిపారు. ప్రధాని ప్రసంగానికి కంటే ముందు సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి బీజేపీలో చేరారు. మర్చి27న ప్రారంభమయ్యే అసెంబ్లీ ఎన్నికలు ఎనిమిది దశల్లో జరగనున్నాయి. చదవండి: డీఎంకే కూటమిలో కొలిక్కివచ్చిన సీట్ల కేటాయింపు -
దీదీ వర్సెస్ సువేందు
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బరిలో ఉన్న నందిగ్రామ్‌లో ఆమెకు పోటీగా బీజేపీ సువేందు అధికారిని అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. శనివారం 57 మంది అ«భ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. మాజీ క్రికెటర్ అశోక్ దిందా, మాజీ ఐపీఎస్ అధికారి భారతి ఘోష్‌లకు తొలి జాబితాలో చోటు దొరికింది. 57 మంది పేర్లతో కూడిన జాబితాను పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ విలేకరుల సమావేశంలో విడుదల చేశారు. ఒక్క స్థానాన్ని మిత్రపక్షం ఏజేఎస్‌యూకి కేటాయించారు. మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 మధ్య ఎనిమిది దశల్లో జరగనున్న బెంగాల్ ఎన్నికల్లో తొలి రెండు విడతల్లో జరిగే 60 స్థానాలకు గాను 57 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేస్తూ బీజేపీ జాబితా రూపొందించింది. 2011లో ఉవ్వెత్తున ఎగసిన నిరసన ప్రదర్శనలతో మమత అధికారంలోకి రావడానికి కారణమైన నందిగ్రామ్ ఈ సారి ఎన్నికల్లో మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. 2016లో తృణమూల్ కాంగ్రెస్ తరఫున నందిగ్రామ్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన సువేందు అధికారి ఇటీవల బీజేపీలో చేరడానికి ముందు తన పదవికి రాజీనామా చేశారు. -
అక్క రౌద్రం... చిన్నమ్మ శాంతం!
‘అక్క’ స్వభావం అంతే. ఏదైనా పోరాడి సాధించుకోవడమే. ఛాత్ర పరిషత్ (కాంగ్రెస్ విద్యార్ధి సంఘం) కార్యకర్తగా కల కత్తాలో వీధి పోరాటాలకు నాయకత్వం వహించేది. ఇరవై తొమ్మిదేళ్ల వయసులో లోక్‌సభకు ఎన్నికయ్యింది. అదీ మార్క్సిస్టు దిగ్గజం సోమనాథ్ ఛటర్జీని ఓడించి. ఫలితంగా ఎర్ర చొక్కాల ఆగ్రహానికి గురైంది. తర్వాతి ఎన్నికల్లో ఒక సాధారణ మహిళను నిలబెట్టి అక్క (దీదీ)ను ఓడించారు. ఓటమిని అంగీ కరించడం దీదీ స్వభావం కాదు. మరింత పట్టుదలగా పోరా డింది. మార్క్సిస్టు ప్రభుత్వాన్ని కూలదోయడమే లక్ష్యంగా పోరా డింది. తాను పోరాడుతున్నది కమ్యూనిస్టు భీష్మ–ద్రోణులైన జ్యోతిబసు–దాస్‌గుప్తాల కాంబినేషన్తోనని తెలుసు. కొండతో ఢీకొంటున్నాననీ తెలుసు. అయినా కొట్లాడింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పదేళ్లు కొట్లాడింది. కాంగ్రెస్ నాయకత్వంలో సమర శీలత కొరవడిందని ఆమె నిర్ధారణకు వచ్చింది. తృణమూల్ కాంగ్రెస్ పేరుతో సొంత పార్టీ స్థాపించింది. కమ్యూనిస్టు వృద్ధ నేతలు తప్పుకున్న తర్వాత బుద్ధదేవ్–బిమన్ బసుల కాంబినేషన్‌తోనూ పోరాడింది. మరో పదేళ్ల పోరాటం తర్వాత దీదీ సాధించింది. మమతా బెనర్జీ ఉరఫ్ దీదీ క్రీ.శ. 2011లో అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఆమె రౌద్రం ఇంకా తగ్గలేదు. తరుముకొస్తున్న బీజేపీతో తలపడేందుకు సర్వశక్తులూ కూడదీసుకుంటున్నది. బీజేపీ విసు రుతున్న బాణాలు తనువున విరుగుతున్నా తలొగ్గడం లేదు. దెబ్బతిన్న బెబ్బులిలా గాండ్రిస్తున్నది. బ్రిగేడ్ పరేడ్ మైదానం దద్దరిల్లేలా గాండ్రిస్తున్నది. వివేకానందన్ కృష్ణవేణి శశికళా నటరాజన్ స్వభావరీత్యా శాంతమూర్తి మాత్రం కాదు. మమతా బెనర్జీని మించిన ఫైర్ బ్రాండ్ నేత జయలలిత. మూడు దశాబ్దాలపాటు ఆమె వెన్నంటి నడిచిన నీడ శశికళ. ‘మనసున మనసై, బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యమూ, అదే స్వర్గమూ...’ అన్నారు. జయ పాలిటి ఆ భాగ్యం శశికళ. శశికళకు దొరికిన ఆ స్వర్గం జయలలిత. జయలలిత ఆవేశ కావేశాలను కంట్రోల్ చేసే రిమోట్‌గా శశికళ ఎదిగింది. ఫైర్ బ్రాండ్ అడుగులో అడుగేసి నడిచినందువల్ల ఆ ధిక్కార స్వభావమూ చిన్నమ్మకు అలవడింది. తన నెచ్చెలికి చిరకాల ప్రత్య ర్థిగా నిలబడిన కరుణానిధి చాణక్యాన్ని దగ్గరగా చూసినందు వల్ల సందర్భాన్ని బట్టి మసలుకునే లగువు బిగువుల లౌక్యమూ ఆమెకు అలవడింది. జయలలిత మరణానంతరం ముసురు కొస్తున్న ఒత్తిళ్లకు హెచ్చరిక అన్నట్టుగా జయ సమాధిపై ప్రతిజ్ఞ చేసి రెండుసార్లు గట్టిగా చరిచినప్పుడు శశికళ ఎక్కుపెట్టిన ఏకే– 47 తుపాకీలా కనిపించింది. నాలుగేళ్లు జైలు జీవితం గడిపి వచ్చినప్పుడు తనకు తమిళనాట వీరస్వాగతం లభించినప్పటికీ, తను రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ ప్రకటించి అంద రినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడామె గోడమీద వేలాడదీసిన తుపా కీలా కనబడుతున్నది. ఆ తుపాకీ ట్రిగ్గర్ మీద వేలు పడేంత వరకే శాంత ముద్ర. నాలుగు రాష్ట్రాలూ, ఒక కేంద్రపాలిత ప్రాంతం శాసన సభల ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ విజిల్ ఊదింది. కానీ, అంత కంటే చాలాకాలం ముందునుంచే ఆ రాష్ట్రాలు వేడెక్కాయి. ఇందులో పెద్ద రాష్ట్రాలైన బెంగాల్, తమిళనాడులను కలిపితే ఉత్తరప్రదేశ్ లోక్‌సభ సీట్లకంటే ఒకటెక్కువే. పుదుచ్చేరిలో ఒక్కటే లోక్‌సభ స్థానం. ఆ ఎన్నికల ప్రాధాన్యం కూడా అంతే. కేరళ అసెంబ్లీకి ఎన్నికలున్నాయి. ఒకసారి ఎల్డీఎఫ్, ఒకసారి యూడీఎఫ్. నాలుగు దశాబ్దాలుగా ఇదే కేరళ తీరు. కానీ ఈసారి అధికారంలో వున్న ఎల్డీఎఫ్ కూటమే మళ్లీ గెలుస్తుందని కొన్ని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇదే జరిగితే కేరళ ప్రజలు సంప్రదాయాన్ని ఉల్లంఘించినట్టే. కేరళ గోల్డ్ స్కామ్‌లో నిందితురాలైన యువతి ఈ పాపంలో ముఖ్య మంత్రికి కూడా భాగం ఉందని కస్టమ్స్ అధికారులకు చెప్పిం దట. అది కూడా అరెస్టయిన అనేక నెలల తర్వాత సరిగ్గా ఎన్నికల ముందే చెప్పిందట. ఈ కారణంగా కేరళ రాజకీయాలు తలకిందులై మూడో పక్షమైన బీజేపీ అవకాశాలు ఏమేరకు పెరుగుతాయో చూడాలి. బహుశా, ఇటువంటి అంచనా ఏదో బీజేపీ నాయకత్వానికి ఉన్నట్టుంది. అందుకే ఎనభై ఎనిమిదేళ్ల నవయువకుడైన మెట్రో శ్రీధరన్‌కు వీరకంకణం కట్టి నుదుట తిలకం దిద్ది సర్వసేనానిగా ప్రకటించి రంగంలోకి దింపారు. ఎన్నికల రణరంగంలో ఆయన ఏమేరకు వీరవిహారం చేస్తారో చూడాలి. అస్సాంలో ప్రస్తుతం అధికారంలో వున్న బీజేపీ కూటమే గెలుస్తుందని మెజారిటీ సర్వేలు చెబుతున్నాయి. కానీ, క్షేత్రస్థాయి పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తే కాంగ్రెస్ కూటమి నుంచి అధికార కూటమి గట్టి పోటీనే ఎదుర్కొంటున్నట్టు కనిపి స్తున్నది. ఫలితం తిరగబడే అవకాశం లేకపోలేదు. మిత్రపక్షా లతో కలిసి కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాలు రాబట్టగలిగే అవకాశాలున్న రాష్ట్రాలు కేరళ, అస్సాం మాత్రమే. అందుకే ఆ రాష్ట్రాల్లో రాహుల్, ప్రియాంకలు ప్రచారాన్ని కొత్తపుంతలు తొక్కి స్తున్నారు. కేరళ గజ ఈతగాళ్ల సమక్షంలో రాహుల్ సముద్రం లోకి దూకి కాస్సేపు క్రీడించారు. అస్సాం టీ ఎస్టేట్‌లో ప్రియాంక తేయాకు తెంపే కార్మికురాలి వేషంలో దర్శన మిచ్చింది. కాంగ్రెస్ ప్రచారాన్ని మెయిన్ ట్రాక్‌లో రాష్ట్రాల నేతలు నడిపిస్తుంటే సైడ్‌ట్రాక్‌లో రాహుల్, ప్రియాంకల చమత్కార షోలు నడుస్తున్నాయి. పెద్ద రాష్ట్రాలైన బెంగాల్, తమిళనాడు ఎన్నికలే ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తమ సాంస్కృతిక వారసత్వమే గొప్పదని బెంగాలీలు ఎంత గట్టిగా నమ్ముతారో అంతకంటే గట్టిగా తమిళులూ విశ్వసిస్తారు. వాళ్లు రవీంద్రనాథ్ టాగోర్‌ను చూపెడితే వీళ్లు సుబ్రమణ్య భారతిని చూపెడతారు. వాళ్లకు సత్యజిత్‌రే ఉంటే వీళ్లకు కె. బాలచందర్ ఉంటారు. వాళ్లకు మృణాల్‌సేన్ ఉంటే వీళ్లకు మణిరత్నం ఉన్నాడు. ఆర్డి బర్మన్ బెంగాలీ–ఏఆర్ రెహమాన్ తమిళ్. ఇలా చూసుకుంటూ పోతే అన్ని రంగాల్లోనూ ఎందరో ఉద్దండులు ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్నారు. సాంబార్ రసం, రసగుల్లాలతో కూడా జైత్ర యాత్ర చేసిన రాష్ట్రాలివి. ఎకనామిక్స్‌లో ఇద్దరు నోబెల్ గ్రహీ తలు బెంగాల్లో ఉంటే సైన్స్‌లో ముగ్గురు నోబెల్ గ్రహీతలు తమిళనాడువారు. కళా, సాహిత్య, విద్యా, వైజ్ఞానిక, సంగీత రంగాల్లో దేశంలోనే ముందంజలో ఉన్న రాష్ట్రాల్లో ఈ రెండూ ప్రధానమైనవి. పురోగామి ఆలోచనలున్న ప్రజలు విస్తారంగా ఉన్న రాష్ట్రాల్లో ప్రజాతీర్పు ఎలా ఉంటుందనే ఆసక్తి దేశ వ్యాప్తంగా ఉండడం సహజం. ఫైర్‌బ్రాండ్ నాయకులను ఇష్టపడే స్వభావం బెంగాలీలది. అందుకే గాంధీ నెహ్రూలకంటే ఎక్కువగా సుభాష్ చంద్ర బోస్‌ను ఆరాధిస్తారు. బెంగాలీ భగత్‌సింగ్‌గా భావించే చిట్ట గాంగ్ హీరో సూర్యసేన్‌ను ప్రేమిస్తారు. కమ్యూనిస్టులను ఆద రించారు. నక్సల్బరీని గుండెలకు హత్తుకున్నారు. జ్యోతిర్మయ బసు వంటి ఫైర్‌బ్రాండ్ పార్లమెంటేరియన్లను భారీ మెజా రిటీతో గెలిపించారు. ఆయన తర్వాత ఆ లక్షణాన్ని మమతా బెనర్జీలో బెంగాలీలు గుర్తించారు. ఆమె సుదీర్ఘకాలం పోరాడిన తర్వాతనే అధికారాన్ని అప్పగించారు. ఆ తెగువను మరోసారి ప్రదర్శిస్తూ నందిగ్రామ్ ఒక్కచోట నుంచే బరిలోకి దిగుతూ దీదీ బీజేపీకి చాలెంజ్ విసిరింది. ఈ నియోజకవర్గం తృణమూల్ నుంచి బీజేపీలో చేరిన సువేందు అధికారి కంచుకోట. ఈ సాహసం బెంగాలీలకు నచ్చే అవకాశం ఉంది. ఈస్టిండియా కంపెనీ సేనలు 1757లో జరిగిన ప్లాసీ యుద్ధంలో బెంగాల్ నవాబు సిరాజుద్దౌలాను ఓడించిన తర్వాతనే భారతదేశంలో బ్రిటిష్ పాలన విస్తరించడం సాధ్యమైంది. ఇప్పుడు బెంగాల్లో బీజేపీ గెలిస్తే దక్షిణభాగం మినహా భారతదేశంలో ఆ పార్టీ రాజకీయ విస్తరణ దాదాపుగా పూర్తయినట్టే. అందుకే తృణమూల్ శ్రేణులు బీజేపీని నాన్– బెంగాలీ పార్టీగా బ్రాండింగ్ చేసి ప్రచారం చేస్తున్నాయి. అయితే ఈ ప్రచారాన్ని బీజేపీ గట్టిగానే తిప్పికొట్టగలిగింది. బీజేపీకి జన్మ నిచ్చిన జనసంఘ్ వ్యవస్థాపకుడైన శ్యామాప్రసాద్ ముఖర్జీ బెంగాలీయేనన్న విషయాన్ని వారు ఓటర్లకు గుర్తుచేస్తున్నారు. 1952లో జరిగిన తొలి లోక్‌సభ ఎన్నికల్లోనే బెంగాల్లో ముగ్గురు అభ్యర్థులు జనసంఘ్ తరఫున గెలిచిన సంగతిని కూడా గుర్తుచేస్తున్నారు. సర్వేలన్నీ మమతా బెనర్జీ పార్టీ విజయాన్నే సూచిస్తున్నప్ప టికీ వాటిని పూర్తిగా విశ్వసించలేము. ఎందుకంటే 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ కంటే తృణమూల్ కాంగ్రెస్‌కు కేవలం 2.6 శాతం ఓట్లు మాత్రమే అధికంగా వచ్చాయి. దళితులు, గిరిజ నులు, వెనుకబడిన వర్గాల ప్రజల ఓట్లు అధికంగా బీజేపీకి పడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ వర్గాలు మనసు మార్చుకున్నా యనడానికి ఎటువంటి దాఖలాలు లేవు. దళితుల్లో తూర్పు బెంగాల్ (బంగ్లాదేశ్) నుంచి వచ్చి స్థిరపడ్డవారి సంఖ్య దక్షిణ ప్రాంతంలో (ముఖ్యంగా 24 పరగణాలు) బాగా ఎక్కువ. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ఫలితంగా ఈ వర్గానికి మేలు జరిగింది. కనుక ఇప్పుడు మరింత ఎక్కువ సంఖ్యలో బీజేపీకి ఈ ఓట్లు పడే అవకాశం ఉంది. ఈ చట్టం వల్ల నష్టపోయిన ముస్లిం వర్గం ఓట్లు 2019 ఎన్నికల్లోనే గంపగుత్తగా తృణమూల్‌కు పడ్డాయి. ఇప్పుడు కొత్తగా తృణమూల్‌కు కలిసివచ్చే దేమీ లేదు. పైగా ఇప్పుడు ముస్లిమ్ ఓట్లలో ఎంతోకొంతమేర చీలిక వచ్చే అవకాశం ఉంది. ఫర్ఫురా షరీఫ్‌కు చెందిన అబ్బాస్ సిద్దిఖీ నాయకత్వంలో ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ పేరుతో కొత్త పార్టీ ఊపిరిపోసుకుంది. బెంగాలీ మాట్లాడే ముస్లిములలో సిద్దిఖీకి బాగా పట్టుంది. ముఖ్యంగా యువతలో. ఇప్పుడు ఐఎస్ఎఫ్ లెఫ్ట్–కాంగ్రెస్ కూటమిలో చేరిపోయింది. ఇది ఏదో ఒకమేరకు తృణమూల్‌కు నష్టం కలిగించే అంశం. అయితే దీదీని వేటాడుతున్నట్టుగా బీజేపీ వ్యవహరిస్తున్న తీరు బూమెరాంగ్ అయ్యే అవకాశం లేకపోలేదనే వాదన వినిపిస్తున్నది. అదే జరిగితే బెంగాలీ జాతీయభావం నిద్రలేస్తే మాత్రం దీదీ గెలుపును ఎవరూ అడ్డుకోలేరు. స్వాతంత్య్రోద్యమ కాలంలో బెంగాల్ రెండు ప్రాంతాలు కలిసి వున్నప్పుడే జాతీయ భావంతో ప్రజలు ‘బంగ మాత’ను సృష్టించుకున్నారు. ఆ తర్వాతనే భారతమాత అనే భావన వెలుగులోకి వచ్చింది. బెంగాలీల జాతీయభావం ప్రగాఢమైనది. అందుకే మమత తనను తాను రాయల్ బెంగాల్ టైగర్‌గా అభివర్ణించుకొంటున్నది. కలకత్తా కాళీమాతను గుర్తు చేస్తున్నది. ఈ సున్నిత అంశంపై జాగ్రత్తగా లేకపోతే బీజేపీకి భంగపాటు తప్పకపోవచ్చు. ఫలితం ఎలా ఉన్నా బెంగాల్లో ప్రచారం మాత్రం కొత్తపుంతలు తొక్కుతున్నది. ‘దీదీమోనీ తొమియా చాయి’ (అక్కా నువ్వే రావాలి) అనే పాట మార్మో గుతున్నది. దానికి పోటీగా ప్రముఖ గాయకుడు, పార్లమెంట్ సభ్యుడైన బాబుల్ సుప్రియోతో బీజేపీ మరో పాట పాడిం చింది. ‘ఏయీ తృణమూల్ ఆర్ నా’ (ఈ తృణమూల్ మళ్లీనా... వద్దువద్దు) అనే పాట కూడా ఆదరణ పొందింది. తమిళనాడుకు సంబంధించినంతవరకూ సర్వే సంస్థలన్ని టిదీ ఒకటే మాట. ఈసారి డీఎంకే కూటమి గెలుస్తుందని చెబుతున్నారు. ఒకసారి డీఎంకే కూటమి గెలిస్తే మరోసారి అన్నాడీఎంకే గెలవడమనే సంప్రదాయం తమిళనాడులో కూడా ఉండేది. 2016లో దాన్ని బ్రేక్ చేసి జయలలిత విజయఢంకా మోగించింది. ఇప్పటికి రెండుసార్లు వరసగా అన్నాడీఎంకే అధి కారంలో ఉన్నందువల్ల, జయలలిత లేకపోవడంవల్ల ఓటర్లు డీఎంకేకు ఒక అవకాశం ఇవ్వచ్చునన్న అభిప్రాయం ఉంది. వరసగా పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ అన్నాడీఎంకే ప్రభు త్వంపై ఎటువంటి ప్రజావ్యతిరేకత లేకపోవడం ఒక విశేషం. ఏ దశలో చూసుకున్నా కూడా రాష్ట్రంలో డీఎంకే ఓటుబ్యాంకు కంటే అన్నాడీఎంకే ఓటుబ్యాంకు పెద్దది. అందుకు కారణం ఎంజీఆర్ కాలం నుంచి జయలలిత వరకు ఆ పార్టీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు. పళనిస్వామి కూడా అదే ఒరవడిని కొన సాగిం చారు. అయినప్పటికీ చిన్న పార్టీలతో ఏర్పాటుచేసుకునే అల యెన్స్లు గెలుపు ఓటములను ప్రభావితం చేస్తూ వస్తున్నాయి. కాంగ్రెస్, కమ్యూనిస్టులు, పీఎంకే డీఎంకేతో ఉండటం ఆ పార్టీకి కలిసివచ్చే అంశం. శశికళ ఈసారి అస్త్రసన్యాసం చేయడం వెనుక బీజేపీ పెద్దల దౌత్యం కూడా పనిచేసిందని సమాచారం. ఆమె రంగంలో ఉంటే అన్నాడీఎమ్‌కేలో చీలిక వస్తుంది. ఎటూ తప్పించుకోలేని ఓట మికి కారణం శశికళేననే ముద్ర పడుతుంది. భవిష్యత్తులో పార్టీ గంపగుత్తగా తన చేతికి వచ్చే అవకాశాన్ని కోల్పోవలసి వస్తుంది. పార్టీ వ్యతిరేక వైఖరి తీసుకోకుండా మౌనంగా ఉండిపోతే ఎన్నికల తర్వాత ఓటమి బాధ్యత ఈపీఎస్, ఓíపీఎస్‌ల మీద పడుతుంది. శశికళ నాయకత్వం కావాలన్న డిమాండ్ పెరుగు తుంది. కార్యకర్తలు ఆందోళన చేస్తారు. నిరాహారదీక్షలు చేస్తారు. పార్టీకోసం, కార్యకర్తల కోసం ఒట్టును తీసి గట్టున పెట్టి శశికళ రాజకీయ ప్రవేశం చేస్తారు. అన్నాడీఎంకే తిరుగులేని నాయ కురాలిగా అవతరిస్తారు. ఈవిధంగా ఆమెకు గురుమూర్తి రాజ కీయ ఉపదేశం చేశారని వినికిడి. ఈ వాదన చిన్నమ్మకు నచ్చింది. తుపాకీని గోడకు తగిలించింది. ఇది తాత్కాలిక యుద్ధవిరమణే. బెంగాల్ ఎన్నికల్లో ఒకవేళ మమత గెలిస్తే (సర్వేలు చెబుతున్న ప్రకారం) వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి మోదీ వ్యతిరేక కూటమికి నాయకురాలిగా మమత అవతరించవచ్చు. కాంగ్రెస్ పరిస్థితి రాజకుమారి పక్కనుండే ప్రధాన చెలికత్తె వేషం వేసే జూనియర్ ఆర్టిస్ట్ స్థాయికి దిగజారవచ్చు. ఒకవేళ దీదీ ఓడిపోతే పార్టీ నాయకత్వాన్ని ఆమె మేనల్లుడికి అప్పగించ వచ్చు. పోరాట చరిత్ర లేని ఆ మేనల్లుడు ఏం చేస్తాడన్నది వేచి చూడాల్సిందే. తమిళనాడులో డీఎంకే గెలిస్తే (సర్వే అంచనాల ప్రకారం) అన్నాడీఎంకే నాయకత్వం శశికళ చేతికి లభిస్తుంది. బీజేపీ కూటమిలో ఒక కీలక మద్దతుదారుగా అవతరిస్తుంది. ఏమో... గుర్రం ఎగరావచ్చు అన్న చందంగా అన్నాడీఎంకే గెలిస్తే శశికళ భవిష్యత్తుపై బీజేపీ నాయకత్వం పునరాలోచన చేయవలసి ఉంటుంది. రేపు మహిళా దినోత్సవం రోజున మమతక్క, శశి పిన్నీ పునరుత్తేజితులై రాబోయే యుద్ధాలకు సిద్ధపడతారని భావించవచ్చు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
దీదీపై సువేందు పోటీ.. 57మందితో బీజేపీ తొలి జాబితా
-
57 మందితో బీజేపీ తొలి జాబితా.. హాట్ టాపిక్‌గా నందిగ్రామ్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో బీజేపీ దూకుడు పెంచింది. మమత కంచుకోట బద్దలు కొట్టి బెంగాల్లో కాషాయ జెండా ఎగరవేయాలనే ప్లాన్‌తో దూసుకుపోతుంది. ఇందులో భాగంగా శనివారం తొలి జాబితాను ప్రకటించింది. 57 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ విడుదల చేశారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) ఒకేసారి 291 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో బీజేపీ తాజా జాబితా విడుదల చేసింది. మమతా పోటీ చేస్తున్న నందిగ్రామ్ స్థానానికి టీఎంసీపై తిరుగుబాటు బావుటా ఎగురవేసి బీజేపీలో చేరిన సువేందు అధికారిని పేరును ప్రకటించడంతో ఈ నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సువేందు అధికారితో పాటు మాజీ క్రికెటర్ అశోక్ దిండా, మాజీ ఐపీఎస్ అధికారి భారతీ ఘోష్ తొలి జాబితాలో చోటు దక్కించుకున్నారు. మొయినా నియోజకవర్గం నుంచి అశోక్ దిండా పోటీ చేయనున్నారు. కాగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు మార్చి 27, 1, 6, 10, 17, 22, 26, 29 తేదీలలో ఎనిమిది దశల్లో జరుగనున్నాయి. మే 2 న ఓట్లు లెక్కింపు ఉంటుంది. చదవండి: ఫిరాయింపుల జోరు : దీదీకి వరుస షాక్స్ -
ఫిరాయింపుల జోరు : దీదీకి వరుస షాక్స్
-
మోదీ ఫోటోను తొలగించండి: కేంద్ర ఎన్నికల సంఘం
సాక్షి, న్యూఢిల్లీ: మరికొన్ని రోజుల్లో నాలుగు రాష్ట్రాలతోపాటు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు జగరనున్నాయి. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా కరోనా వైరస్ టీకా వేసుకున్న తర్వాత వైద్యులు అందించే సర్టిఫికేట్‌పై ముద్రించిన ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోను తొలగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ప్రధాని మోదీ ఫోటోతో కూడిన సర్టిఫికేట్ల వల్ల ఓటర్లు ప్రభావితం కావడానికి అవకాశం ఉండటంతో ఎన్నికల సంఘం తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమ రాష్ట్రంలోని ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రధాని నరేంద్రమోదీ దుర్వినియోగం చేసున్నారని ఆరోపించిన విషయం తెలిసిందే. అది ఎన్నికల కోడ్‌కు వ్యతిరేకమని ఆమె విమర్శించారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం వ్యాక్సినేషన్ పూర్తైన అనంతరం వైద్యులు అందించే సర్టిఫికేట్‌పై నరేంద్ర మోదీ ఫోటో తొలగించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖను కోరింది. ఇక సోమవారం అరవై ఏళ్లు పైబడినవారికి రెండో దశ కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైన విషయం తెలిందే. అదే విధంగా ఈ వ్యాక్సినేషన్లో పలువురు ప్రముఖులు కూడా కరోనా టీకా వేయించుకున్నారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసొం, పుదుచ్చేరిలో మరి కొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. చదవండి: ఫిరాయింపుల జోరు : దీదీకి వరుస షాక్స్ -
ఫిరాయింపుల జోరు : దీదీకి వరుస షాక్స్
సాక్షి, కోలక్‌తా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగిన తరుణంలో బెంగాల్లో టీఎంసీకి వరుస ఎదురు దెబ్బలు తగులున్నాయి. బీజేపీలోకి జంప్ అవుతున్న నాయకులు సంఖ్య వేగం పుంజుకుంటోంది. తాజాగా మాజీ ఎంపీ దినేష్ త్రివేది, ఎమ్మెల్యే సోనాలీ గుహ బీజేపీలో చేరారు. దీంతో రాజకీయ సెగ రగులుకుంది. సీఎం మమతా బెనర్జీ తనపార్టీ అభ్యర్థులను ప్రకటించిన తరువాత ఈ పరిమాణాలు ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు గత 20 ఏళ్లుగా పార్టీలో ఉంటున్నా పాతవారికి ప్రాధాన్యత లేదంటూ అసంతృప్తి జ్వాలలు రగులుకున్నాయి. (సమరానికి సై : దీదీ సంచలనం) మాజీఎంపీ దినేష్ త్రివేదీ, ఎమ్మెల్యే సోనాలీ గుహ గుడ్‌బై ఇప్పటికే టీఎంసీ ఎంపీ పదవికి రాజీనామా చేసిన దినేష్ త్రివేది తాజాగా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. శనివారం న్యూఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి పియూష్ గోయల్ సమక్షంలో త్రివేది కాషాయ కండువా కప్పుకున్నారు. త్రివేది చేరికను స్వాగతించిన నడ్డా, ఆయన ఇప్పుడు సరైన పార్టీలో ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. అటు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న బంగారు క్షణాలివే అంటూ త్రివేది పేర్కొన్నారు. తాను బరిలో ఉన్నా లేకున్నాఎన్నికల ప్రక్రియలో చురుకుగా ఉంటాను. బెంగాల్ ప్రజలు పురోగతిని కోరకుంటారు. అవినీతిని, హింసనుకూడా టీఎంసీనీ తిరస్కరించనున్నారంటూ ఘాటుగా స్పందించారు. టీఎంసీలో ఉండేది లేదు :అసంతృప్తనేత దినేష్ బజాజ్ దీనికి తోడు మరో నేత దినేష్ బజాజ్ కూడా దీదీపై అసంతృప్తితో రగలిపోతున్నారు. ఈనేపథ్యంలోనే తాను టీఎంసీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. దీదీతో 20 ఏళ్లుగా ఉన్నాను. కొత్తవారికి ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటే వారు పాతవారిని విస్మరించకూడదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు బీజేపీ అగ్రనాయకత్వంతో చర్చిస్తున్నానని వెల్లడించారు. బీజేపీ టికెట్ వస్తుందా లేదా అన్నది తనకు పట్టింపు లేదనీ, కానీ ఇకపై పార్టీలో ఉండకూడదని నిర్ణయించుకున్నానంటూ పేర్కొన్నారు కాగా ఫిబ్రవరి 12 న, మాజీ కేంద్ర రైల్వే మంత్రి బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మాట్లాడుతూ టీఎంసీ పార్టీనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో రోజురోజుకు క్షీణిస్తున్న శాంతిభద్రతల పరిస్థితులు తననుఉక్కిరాడకుండా చేస్తున్నాయంటూ విమర్శలు గుప్పించారు. ఇప్పటికే టీఎంసీనేత సువేందు అధికారి, అటవీ శాఖా మంత్రి రాజీబ్ బెనర్జీ వంటి పలువురు కీలకనేతలు మమతా బెనర్జీకి షాక్ ఇస్తూ బీజేపీలో చేరారు. నందిగ్రామ్ నుంచే పోటీచేస్తానన్న మమతా బెనర్జీ , బయటివారికి చోటు లేదన్న వ్యాఖ్యలపై సువేందు అధికారి స్పందించారు. నందిగ్రామ్ బరిలో విజేత ఎవరో మే 2 న తేలుతుందంటూ సవాల్ విసిరారు. -
మోదీ ఫోటోను తొలగించండి: కేంద్ర ఎన్నికల సంఘం
-
అసెంబ్లీ ఎన్నికల వేళ కేరళ సీఎంపై సంచలన ఆరోపణలు
తిరువనంతపురం: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు భారీ షాక్ తగిలింది. కేరళలో సంచలనం సృష్టించిన గోల్డ్ స్మగ్లింగ్ కేసుతో పినిరయి విజయన్‌కు చాలా సన్నిహిత సంబంధం ఉందనే ఆరోపణలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ కలకలం రేపుతున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన స్పప్న సురేష్ కస్టమ్స్ అధికారుల విచారణలో సంచలన విషయాలు వెల్లడించినట్లు తెలిసింది. గోల్డ్, డాలర్ స్మగ్లింగ్ కేసులో ముఖ్యమంత్రి పినరయి విజయన్ పాత్ర ఎంతో ఉందని.. ఆయన స్వయంగా కాన్సులేట్ జనరల్‌తో మాట్లాడారని ఆమె కస్టమ్స్ అధికారులకు తెలిపారు. విజయన్‌తో పాటు మరో ముగ్గురు కేబినెట్ మంత్రులపై ఆమె ఆరోపణలు చేశారు. ఈ విషయాలను కస్టమ్స్ డిపార్ట్మెంట్ అధికారులు కేరళ హై కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా ఓ అధికారి మాట్లాడుతూ.. ‘‘విజయన్‌కు అరబిక్ భాష రాదు. అందువల్ల స్వప్న సురేష్ ముఖ్యమంత్రికి, కాన్సులేట్ జనరల్‌కి మధ్య మధ్యవర్తిగా వ్యవహించారు. ఈ డీల్‌లో సీఎం, మిగతా ముగ్గురు మంత్రులు కోట్ల రూపాయలను కమిషన్‌గా పొందినట్లు స్వప్న సురేష్ తెలిపారు’’ అన్నారు. ఈ సందర్భంగా కేరళ ప్రతిపక్ష నాయుకుడు రమేశ్ చెన్నితాలా మాట్లాడుతూ.. ‘‘గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మొదటి నుంచి మేం ఏం ఊహించామో అదే జరిగింది. ఈ కేసులో ముఖ్యమంత్రికి సంబంధం ఉందని మేం ముందే గుర్తించాం. దీనికి ముఖ్యమంత్రి ఏం సమాధానం చెప్తారు’’ అన్నారు. చదవండి: గోల్డ్ స్మగ్లింగ్ కేసు: సీఎం రాజీనామా చేయాలి -
సమరానికి సై : దీదీ సంచలనం
-
సమరానికి సై : దీదీ సంచలనం
సాక్షి, కోల్‌కతా: రానున్న అసెంబ్లీ ఎన్నికల పోరు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ తనదైన తనదైన శైలిలో దూసుకు పోతున్నారు. ముఖ్యంగా మమత కంచుకోటలో ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ ప్లాన్ చేస్తున్న తరుణంలో దీదీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నందీగ్రామ్ నుంచే బరిలోకి దిగుతున్నట్టు తేల్చి చెప్పారు. తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని నందిగ్రామ్ నుంచి మాత్రమే తాను పోటీ చేస్తానని, భవానిపూర్ నుంచి కాదని ఆమె ధృవీకరించారు. ఇక్కడనుంచి నుంచి శోభన్‌దేవ్ చటోపాధ్యాయ పోటీ చేయనున్నట్లు తెలిపారు.మార్చి 10 నామినేషన్ వేస్తానన్నారు. అంతేకాదు రాష్ట్ర ఎన్నికల అభ్యర్థులను ముందుగానే ప్రకటించి బీజేపీకి గట్టి సవాల్ విసిరారు. రాష్ట్రంలోని మొత్తం 294 స్థానాలకుగాను 291 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించడంతో పాటు మహిళలకు 50 టికెట్లు ఇవ్వడం విశేషం. శుక్రవారం ప్రకటించిన రేసుగుర్రాల జాబితాలో 50 మంది మహిళలు, 42 మంది ముస్లిం, 79 మంది ఎస్సీ, 17 మంది ఎస్టీ అభ్యర్థులకు టికెట్లు ఇచ్చినట్టు ఆమె ఈ రోజు విలేకరుల సమావేశంలో ప్రకటించారు. మూడు నియోజక వర్గాల్లో పోటీచేయడం లేదన్నారు. ఇటీవల టీఎంసీలో చేరిన మనోజ్ తివారీకి టికెట్ ఇచ్చిన మమతా 28 మంది సిట్టింగ్‌లకు షాక్ ఇచ్చారు. టీఎంసీకి గుడ్ బై చెప్పిన నందిగ్రామ్ ఎమ్మెల్యే సువేందుఅధికారి బీజేపీ తీర్థం పుచ్చున్నారు. దీదీకి పోటీగా అధికారినే బరిలోకి దింపాలని బీజేపీ యోచిస్తోంది. కాగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు మార్చి 27, 1, 6, 10, 17, 22, 26, 29 తేదీలలో ఎనిమిది దశల్లో జరుగనున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు ఇవే లాంగెస్ట్ ఎన్నికలు. మే 2 న ఓట్లు లెక్కింపు ఉంటుంది. టీఎంసీ అభ్యర్థుల జాబితాలో కొన్ని మమతా బెనర్జీ- నందిగ్రామ్ మనోజ్ తివారీ - షిబ్పూర్ దెబాసిస్ కుమార్ - రాష్ బిహారీ మదన్ మిత్రా- కమర్హతి అదితి మున్షి- రాజర్హాట్ పార్థా ఛటర్జీ- బెహాలా రత్న ఛటర్జీ - బెహాలా పూర్బా -
తప్పు చేశాను క్షమించండంటూ స్టేజీ మీదే..
-
తప్పు చేశాను క్షమించండంటూ స్టేజీ మీదే..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో మరి కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో పాగా వేయాలని బీజేపీ.. మరో సారి అధికారంలోకి రావాలని టీఎంసీ సీరియస్‌గా ప్రచారం చేస్తున్నాయి. రాష్ట్రంలో పాగా వేయడం కోసం బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ పేరిట టీఎంసీ నాయకులను లాక్కుంటుంది. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ నాయుకుడు ఒకరు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన ఇన్నాళ్లు టీఎంసీలో ఉండి తప్పు చేశాను.. ఇందుకు తనను క్షమించాల్సిందిగా కోరుతూ.. వేదిక మీద గుంజీళ్లు తీశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. సుశాంత్ పాల్ అనే నాయకుడు కొద్ది రోజుల క్రితం టీఎంసీ నుంచి బయటకు వచ్చాడు. నేడు ఆయన బీజేపీలో చేరారు. టీఎంసీ మాజీ మినిస్టర్ సువేందు అధికారి, రాష్ట్ర బీజేపీ నాయకుల సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా పాల్ మాట్లాడుతూ.. ‘‘మొదట నేను బీజేపీలోనే ఉన్నాను. కానీ లెఫ్ట్ ప్రభుత్వాన్ని ఓడించడం కోసం 2005లో టీఎంసీలో చేరాను. అప్పటి నుంచి ఆ పార్టీలో ఉండి తప్పు చేశాను. టీఎంసీ కార్యకర్తగా నాకు అంటుకున్న పాపాల ప్రక్షాళన కోసం నాకు నేనే ఓ చిన్న శిక్ష వేసుకుంటున్నాను’’ అంటూ మూడు సార్లు గుంజీళ్లు తీశారు. పక్కన ఉన్న వారు ఆయనను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కానీ పాల్ మాత్రం ఆగలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. చదవండి: టీఎంసీ కంచుకోటలో పాగాకు బీజేపీ వ్యూహాలు బీజేపీ, టీఎంసీలను ఓడించాలి -
బీజేపీ సీఎం అభ్యర్థిగా ‘మెట్రోమ్యాన్’!
తిరువనంతపురం: దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని భావిస్తోన్న బీజేపీ అందుకు తగ్గట్లుగా పావులు కదుపుతోంది. మరి కొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. వీటిలో దక్షిణాది రాష్ట్రాలు కేరళ, తమిళనాడు కూడా ఉన్నాయి. తమిళ ప్రజలు బీజేపీ పట్ల అంత విశ్వాసం చూపరు. ఈ క్రమంలో కాషాయ పార్టీ కేరళలో పాగా వేసేందుకు సీరియస్‌గా ట్రై చేస్తోంది. దానిలో భాగంగా మెట్రో మ్యాన్ ఈ. శ్రీధరన్‌ని తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. ఈ మేరకు గురువారం కేరళ బీజేపీ రాష్ట్ర ప్రెసిడెంట్ కే సురేంద్రన్ ప్రకటన విడుదల చేశారు. కేరళ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా మెట్రోమ్యాన్ శ్రీధరన్ పేరును ప్రకటించారు. మిగతా వారి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. శ్రీధరన్ గత వారం బీజేపీలో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన కేరళలో బీజేపీ అధికారంలోకి వస్తే తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధం అని తెలిపారు. తాజాగా బీజేపీ ఆయననే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. శ్రీధరన్‌కున్న క్లీన్ ఇమేజ్ తమకు కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది. ఈ సందర్భంగా శ్రీధరన్ మాట్లాడుతూ.. ‘‘ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే దాని గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎక్కడ నుంచి పోటీ చేసినా నేను గెలుస్తాననే నమ్మకం ఉంది. ఈ సారి బీజేపీ అధికారంలోకి వస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. అయితే, నేను ఇప్పుడు నివసిస్తున్న మలప్పురంలోని పొన్నానికి సమీపంగా ఉండే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్నాను”అని తెలిపారు. కొచ్చి మెట్రో ప్రాజెక్టుకు గురువుగా ఉన్న శ్రీధరన్ తాను ఇంటింటికి వెళ్లి ఓట్లు అడిగే సంప్రదాయాన్ని పాటించనని తెలిపారు. ‘‘నేను ఇళ్లకు, దుకాణాలకు, ఊర్లకు వెళ్లను. కానీ నా సందేశం ఓటర్లందరికి చేరుతుంది’’ అన్నారు. వృద్ధులను పక్కకు పెడుతున్న బీజేపీ తాజాగా 88 ఏళ్ల శ్రీధరన్‌ను తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం పట్ల విమర్శలు వస్తున్నాయి. చదవండి: మెట్రోమ్యాన్ లక్ష్యం నెరవేరేనా? లవ్ జిహాద్‌పై శ్రీధరన్ సంచలన వ్యాఖ్యలు! -
బెంగాల్లో సివంగిదే గెలుపు.. మేము పోటీ చెయ్యం
ముంబై: పశ్చిమ బెంగాల్లో మరికొన్ని రోజుల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి దేశవాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుండగా, టీఎంసీ మళ్లీ గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయాలనుకుంటుంది. ఈ నేపథ్యంలో బెంగాల్ ఎన్నికల్లో పోటీచేసే విషయంపై శివసేవ పార్టీ స్పష్టతనిచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘దేశ వ్యాప్తంగా బెంగాల్లో శివసేన పోటీచేస్తుందా?లేదా? ఆసక్తి నెలకొంది. ఈ రోజు పార్టీ అధ్యక్షుడు, సీఎం ఉద్దవ్ ఠాక్రేతో చర్చలు జరిపాం. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయవద్దని నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో ‘దీదీ వర్సెస్ అన్ని పార్టీలు’ అన్న రీతీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో తాము మమతాబెనర్జీకి మద్దతుగా నిలబడటం కోసం బెంగాల్ ఎన్నికల్లో పోటీ చేయడంలేదు. మమతా బెనర్జీ ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుందని నమ్ముతున్నాం. ఎందుకంటే ఆమె నిజమైన బెంగాల్ సివంగి అని సంజయ్ రౌత్ ట్విటర్లో పేర్కొన్నారు. బెంగాల్లో మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకు ఎనిమిది దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయ. ఎన్నికల ఫలితాలు మే 2న వెలువడనున్నాయి. pic.twitter.com/enjd4sfiwx — Sanjay Raut (@rautsanjay61) March 4, 2021 చదవండి: ‘భారత్ మాతాకి జై’ అనే హక్కు మీకు లేదు -
గెలిపిస్తే రూ.60కే లీటర్ పెట్రోల్: బీజేపీ
తిరువనంతపురం: ఇంధన ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. పెట్రో, డీజిల్ ధరల పెంపుతో పాటు వంట గ్యాస్ ధరను కూడా భారీగా పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఇటు వాహనాలు బయటకు తీయాలన్న.. అటు గ్యాస్ వెలిగించాలన్నా జంకుతున్నారు సామాన్యులు. ఈ క్రమంలో మరకొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కేరళలో బీజేపీ సంచలన ప్రకటన చేసింది. రాష్ట్రంలో తమను గెలిపిస్తే.. లీటర్ పెట్రోల్ 60 రూపాయలకే అందిస్తామని కేరళ బీజేపీ లీడర్ కుమ్మనం రాజశేఖరన్ ప్రచారం చేస్తున్నారు. అందులోనే జీఎస్టీ లాంటి ట్యాక్సులన్నీ లోబడే ఉంటాయని అంటున్నారు. పెట్రోల్, డీజిల్‌ను కూడా జీఎస్టీలోకి చేరుస్తామని హామీ ఇచ్చేశారు. ఎన్నికల సందర్భంగా కొచ్చిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజశేఖరన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఎల్డీఎఫ్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌ని జీఎస్టీ ఫ్రేమ్‌లో ఎందుకు చేర్చలేదని రాజశేఖరన్ ప్రశ్నించారు. ఇది జాతీయ అంశం. దీన్ని లీడ్ చేయడానికి కొన్ని కారణమవుతున్నాయని ఆయన తెలిపారు. వివిధ కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరల్లో వ్యత్యాసం కనిపిస్తుంది అన్నారు. దీనిని ఎందుకు జీఎస్టీ కిందకు తీసుకురావడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ క్రమంలో కేరళలో ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే.. లీటర్ పెట్రోల్ 60 రూపాయలకే అందిస్తామని తెలిపారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని లెక్కించిన తర్వాత తనకు ఇది అర్థమైందని ఆయన చెప్పుకొచ్చారు. రాజస్తాన్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రల్లో అత్యధిక వ్యాట్ కారణంగా ఇప్పటికే లీటర్ పెట్రోల్ ధర 100 రూపాయల మార్కును దాటేసింది. ఇంధన ధరలు ఇంత భారీగా పెంచడం పట్ల ప్రతిపక్షాలు.. నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉన్నాయి. చదవండి: మోదీకి చురక: పెట్రోల్ ధరలపై బావమరుదుల భగ్గు ఇంధన ధరలను కూడా అన్‌లాక్ చేశారేమో! -
కమల్ ఎన్నికల ఎజెండా.. మహిళా సంక్షేమానికి పెద్దపీట
చెన్నై: అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలవటంతో తమిళనాడులో రాజకీయం వేడెక్కుతోంది. అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్ఎం) పార్టీ అధినేత, అగ్ర నటుడు కమల్ హాసన్ బుధవారం తన పార్టీ ఎన్నికల ఎజెండాను వెల్లడించారు. మహిళల సంక్షేమానికి తమ పార్టీ పెద్దపీట వేస్తుందని తెలిపారు. మహిళ రక్షణ కోసం 181 హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. అందరికీ అందుబాటులో ఉండే గ్రామీణ బ్యాంక్‌లను మహిళా పథకాల ఆధ్వర్యంలో నిర్వహించేలా కొత్త ప్రతిపాదనలు తీసుకువస్తాని ఎంఎన్ఎం పార్టీ ఎన్నికల హామీలను ప్రకటించింది. ఆయన బుధవారం రాత్రి ఓ బహిరంగ సభలో పాల్గొని ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. కమల్ హాసన్ ఇటీవల తనకు మద్దతు పలకాలని పలువురు సినీ ప్రముఖులను కలిసిన విషయం తెలిసిందే. ఆలిండియా సముత్వ మక్కల్ కట్చీ పార్టీ అధినేత, నటుడు శరత్‌కుమార్‌తో పాటు ఇందిరా జననయాగ కట్చీ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో కలిసి తాను మూడో కూటమిని తయారు చేస్తున్నట్లు కమల్ హాసన్ ప్రకటించారు. అదే విధంగా ఆ కూటమి సీఎం అభ్యర్థిని తనే అని వెల్లడించారు. ఇక 234 అసెంబ్లీ స్థానాలు ఉన్న తమిళనాడులో ఏప్రిల్ 7వ తేదీన ఒకేదశలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. చదవండి: చిన్నమ్మ కొత్త వ్యూహం.. మూడో కూటమిలోకి నో ఎంట్రీ! -
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఏఏ నిలిపేస్తాం
డిస్పూర్: అసోం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను నిలిపివేస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా అన్నారు. ఆమె మంగళవారం అసోం ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండో రోజు తేజ్‌పూర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట ప్రజలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి గృహిణికి నెలకు రూ.2వేలు ఆర్థికసాయం అందిస్తామని తెలిపారు. గత ఐదేళ్లుగా తేయాకు మహిళా కార్మికుల దినసరి వేతనం పెరగటం లేదని మండిపడ్దారు. అయితే తాము అధికారంలోకి వస్తే తేయాకు మహిళా కార్మికులకు దినసరి వేతనం రూ.365 చేస్తామని ప్రియాంక తెలిపారు. అసోంలో 5లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొన్నారు. అసోం మహిళల భవిష్యత్తుకు ఈ ఎన్నికలు కీలకమని తెలిపారు. మహిళలపై అసోంలో చాలా దాడులు జరుగుతున్నాయని, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మహిళల రక్షణకు ఎటువంటి చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు. 126 నియోజవర్గాలు ఉన్న అసోం అసెంబ్లీకి మూడు దశల్లో ఎన్నికల జరగనున్నాయి. చదవండి: దీదీ నీకు వాళ్ల గతే పడుతుంది: యోగి ఆదిత్యనాథ్ -
దీదీ నీకు వాళ్ల గతే పడుతుంది: యోగి ఆదిత్యనాథ్
-
అక్కడ ప్రజా రక్షణ లేదు కానీ ఇక్కడకొచ్చి మాట్లాడతారా?
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ విడుదలవ్వడంతో అధికార తృణముల్ కాంగ్రెస్, బీజేపీ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం బెంగాల్‌లోని మల్దాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మమతా బెనర్జీపై ప్రభుత్వ విధానాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. బెంగాల్లో గోవధ, లవ్ జిహాద్‌లను దీదీ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని మండిపడ్డారు. బెంగాల్లో దుర్గా పూజను నిషేధించారని, ఈద్ సందర్భంగా గోవుల వధ జరుగుతుందని విమర్శించారు. రాష్ట్రంలో జైశ్రీరామ్ నినాదాన్ని అనుమతించడం లేదన్న సీఎం యోగి.. ప్రజల మనోభావాలతో మమతా ప్రభుత్వం ఆడుకుంటుందని దుయ్యబట్టారు. మరోవైపు సీఎం యోగి ఆదిత్యానాథ్ పర్యటనపై తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంట్ ఎంపీ నుస్రత్ జహాన్ ఘాటుగా స్పందించారు. తమ సొంత రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను అరికట్టలేని వ్యక్తి పక్క రాష్ట్రాల గురించి మాట్లాడటం విడ్డురంగా ఉందన్నారు. ఈ మేరకు ట్విటర్లో ‘బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘోర ఘటనను మాటల్లో వర్ణించలేకపోతున్నాను. హత్రాస్ ఘటనలోని బాధిత కుటుంబ సభ్యులకు ఆ ప్రభుత్వం రక్షణ ఇవ్వలేకపోయింది. ఆ కుటుంబ ప్రాధాన్యత కంటే బీజేపీకి బెంగాల్ ఎన్నికలు ముఖ్యమా.’ అంటూ కౌంటర్ ఇచ్చారు. చదవండి: దీదీ నీకు వాళ్ల గతే పడుతుంది: యోగి ఆదిత్యనాథ్ SHOCKING! Cannot find the words to describe the horror that @BJP4India ruled Uttar Pradesh has turned into! WHY couldn't @myogiadityanath prioritize the safety & security of this family? Is Bengal elections more important to BJP?#BJPHataoBetiBachaohttps://t.co/WPvi5GHzP4 — Nusrat Jahan Ruhi (@nusratchirps) March 2, 2021 కాగా ఉత్తరప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన హత్రాస్ అత్యాచార ఘటనలో బాధితురాలి తండ్రిని నిందితుడు, అతని స్నేహితుడు కాల్చి చంపిన విషయం తెలిసిందే. రెండేళ్ల కిందట యువతిని అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో నిందితుడు గౌరవ్ శర్మని పోలీసులు అరెస్ట్ చేశారు. 2018లో జైలుకెళ్లిన నిందితుడు ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యాడు. బెయిల్‌పై విడుదలైన నిందితుడు తనపై ఫిర్యాదు చేసారన్న కక్షతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అయితే తండ్రి కోసం విలపించిన బాధితురాలు తనకు న్యాయం జరగాలని, తనపట్ల కిరాతకంగా ప్రవర్తించిన వ్యక్తికి కఠిన శిక్ష పడాలని కోరింది. -
దీదీ నీకు వాళ్ల గతే పడుతుంది: యోగి ఆదిత్యనాథ్
కోల్‌కతా: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పశ్చిమ బెంగాల్లో రాజకీయం వేడెక్కుతోంది. బీజేపీ-తృణముల్ కాంగ్రెస్ మధ్య విమర్శలు తారస్థాయికి చేరుతున్నాయి. బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి సీఎం మమతా బెనర్జీ సర్కార్‌పై విమర్శలు గుప్పిస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం బెంగాల్‌లోని మల్దాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మమతా బెనర్జీ ప్రభుత్వ విధానాలపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. మమతా బెనర్జీ బెంగాల్లో ఆవుల అక్రమ రవాణా, లవ్ జిహాద్‌లకు అనుమతి ఇస్తున్నారని మండిపడ్డారు. కేవలం ఓట్ల కోసమే అక్రమ వలసదారులను ప్రోత్సహింస్తున్నారని విమర్శించారు. జై శ్రీరాం అనే నినాదాన్ని బెంగాల్లో అనుమంతిచడం లేదని, మతపరమైన సెంటిమెట్‌ను రాజకీయల కోసం ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. యూపీలో రామ మందిర నిర్మాణానికి అడ్డుపడినవారికి పట్టిన గతి మమతకు బెంగాల్లో ఎదురవుతుందని హెచ్చరించారు. భారతదేశంలో రామునికి వ్యతిరేకంగా ఉండేవాళ్లు రామ ద్రోహులుగా మిగిలిపోతారని అన్నారు. బెంగాల్లో టీఎంసీ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయి, బీజేపీ అధికారంలోకి వస్తుందని సీఎం యోగి ధీమా వ్యక్తం చేశారు. 294 నియోజకవార్గాలు ఉ్న పశ్చిమబెంగాల్లో 8 విడతలుగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ప్రకటించిన విషషయం తెలిసిందే. చదవండి: దీదీని కలిసిన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ -
దీదీని కలిసిన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్
కోల్‌కతా: సెక్యులర్ పార్టీల మధ్య ఐక్యతకోసం ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిశారు. అధికార తృణమూల్ కాంగ్రెస్‌కి ఓటు వేయాలని, పశ్చిమబెంగాల్లోని బీహార్ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర సెక్రటేరియట్లో దీదీని కలిసిన తరువాత, బెంగాల్లో బీజేపీని అడ్డుకోవ డమే తమ పార్టీ ప్రథమ ప్రాధాన్యత అని ప్రకటిం చారు. రాబోయే ఎన్నికలు ‘‘ఆదర్శాలు, విలువ లను కాపాడుకునేందుకే’’నని తేజస్వి చెప్పారు. ‘‘మా పార్టీ మమతా బెనర్జీకి సంపూర్ణ మద్దతు తెలుపుతోంది’’ అని ఆయన స్పష్టం చేశారు. ఏఐసీసీ పరిశీలకులు.. పశ్చిమ బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) 28 మంది పరిశీలకులను నియమించినట్టు ఓ సీనియర్ నాయకులు తెలిపారు. 8 విడతలను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టుకి.. పశ్చిమబెంగాల్లో 8 విడతలుగా ఎన్నికలు నిర్వహించనున్నట్టు ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ, న్యాయవాది ఎంఎల్.శర్మ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. పశ్చిమ బెంగాల్లో 8 విడతలుగా ఎన్నికలు జరపడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, ఆర్టికల్ 21కి వ్యతిరేకమని, 8 దఫాల ఎన్నికల నిర్వహణను నిలిపేవేయాని కోరారు. -
విద్యార్థులతో రాహుల్ గాంధీ స్టెప్పులు : వైరల్
సాక్షి, చెన్నై: తమిళనాడులో ఎన్నికల నగారా మోగడంతో ఎన్నికల హడావిడి జోరందుకుంది. ముఖ్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన వేగాన్ని పెంచారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తమిళనాడులో మూడురోజుల పాటు పర్యటించనున్నారు. ఈ సందర్బంగా ర్యాలీలు, సభలతో సందడి చేస్తున్నారు. ఇందులో భాగంగా రాహుల్ గాంధీ విద్యార్థులతో ఆడిపాడారు. తమిళనాడులోని ములగుమూదుబ్న్ సెయింట్ జోసెఫ్స్ మెట్రిక్యులేషన్ విద్యార్థులతో కలిసి డ్యాన్స్ చేసారు. పుష్-అప్స్, 'ఐకిడో' తో అక్కడి విద్యార్థులతో హుషారుగా గడిపారు. ప్రస్తుతం ఈ వీడియో కాంగ్రెస్ శ్రేణుల్లో, అభిమానుల్లో వైరల్‌గా మారింది. తమిళనాడులో జోరుగా పర్యటిస్తున్న రాహుల్‌కు అక్కడి ప్రజలు ఘన స్వాగతం పలికారు. తన పర్యటనలో భాగంగా నాగర్‌కోయిల్ వెళ్లేటప్పుడు ఆచంగులం గ్రామ రహదారి వద్ద తాటి ముంజెలను ఆస్వాదిస్తూ అక్కడి ప్రజలతో కలిసిపోయారు. సోమవారం కన్యాకుమారిలో ప్రచారం చేస్తున్న రాహుల్ తమిళ ప్రజలు తప్ప మరెవరూ తమిళనాడును నడపలేరు అనేది చరిత్ర చెబుతోంది. ఈ ఎన్నికల్లో కూడా ఇదే రుజువు కానుంది. తమిళనాడు ప్రజలకు నిజంగా ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి మాత్రమే ముఖ్యమంత్రి అవుతారంటూ ఆయన జోస్యం చెప్పారు. కన్యాకుమారిలో రోడ్‌షోలో పాల్గొన్న రాహుల్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. తమిళనాడు సంస్కృతిని కేంద్రం గౌరవించదు. ముఖ్యమంత్రి ఈకే పళనిస్వామి మోదీకి ప్రతినిధి ఉంటూ ఆయన ఏం చెబితే అది చేస్తారు. మోదీదాసోహం అనేవారు తమిళనాడుకు ప్రాతినిధ్యం వహించలేరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే తమిళ సంస్కృతిని ఆర్ఎస్ఎస్ అవమానించే అవకాశాన్ని ముఖ్యమంత్రి ఇవ్వకూడదు. ఒకే దేశం, ఒకే సంస్కృతి, ఒకే చరిత్ర అని మోదీ చెబుతూ ఉంటారు. మరి తమిళం భారతీయ భాష కాదా? తమిళ చరిత్ర భారత చరిత్ర కాదా? అని రాహుల్ ప్రశ్నించారు. ఒక భారతీయుడిగా తమిళ సంస్కృతిని కాపాడడం తన విధి అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కాగా తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు ఏప్రిల్ 6న ఒకే దశలో జరగనుండగా, మే 2న ఓట్లు లెక్కింపు ఉంటుంది. ఈ సారి బరిలో ప్రధానంగా కాంగ్రెస్-డీఏంకే, బీజేపీ-ఏఐఏడీఎంకె కూటమి హోరీ హోరీగా పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. -
తమిళనాడు: 21 సీట్లిస్తాం.. వాటితోనే సర్దుకోండి
సాక్షి, చెన్నై: తమిళనాడులో అన్నాడీఎంకే కూటమిలో అసెంబ్లీ సీట్ల పంపకం ఇంకా ఒక కొలిక్కి రావడం లేదు. తమకు 60 స్థానాలు కేటాయించాలని బీజేపీ పట్టుబడుతుండగా, 21 సీట్లే ఇస్తామని, వాటితోనే సర్దుకోవాలని అన్నాడీఎంకే చెబుతోంది. బీజేపీ మెట్టు దిగడం లేదు. దీంతో సీట్ల పంచాయితీ ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా వద్దకు వెళ్లింది. తమకు కేవలం 10 సీట్లే కేటాయిస్తామని అన్నాడీఎంకే చెప్పడంతో విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకే సందిగ్ధంలో పడింది. అన్నాడీఎంకే, బీజేపీ, రాందాసు నేతృత్వంలో పీఎంకే, విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకే, జీకే వాసన్ నేతృత్వంలోని తమిళ మానిల కాంగ్రెస్ పార్టీలు తమిళనాడులో గత లోక్‌సభ ఎన్నికల్లో ఒక కూటమిగా కలిసి ప్రయాణించాయి. ఇదే కూటమి తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగనుంది. అయితే, సీట్ల పందేరం కూటమిలో వివాదాలు సృష్టిస్తోంది. మిత్రపక్షాలు అధిక సీట్లు డిమాండ్ చేస్తుండడంతో అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరుసెల్వం, కో–కన్వీనర్ పళనిస్వామి డైలమాలో పడ్డారు. ఇప్పటికే పీఎంకేకు 23 సీట్లు కేటాయించారు. తమిళ మానిల కాంగ్రెస్‌కు సింగిల్ డిజిట్ ఖరారు చేశారు. సీట్ల కోసం పార్టీల పట్టు రాష్ట్రంలో 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా, కనీసం 170 స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దించాలని స్టాలిన్ నేతృత్వంలో ప్రతిపక్ష డీఎంకే నిర్ణయించినట్లు సమాచారం. ఇందుకు తగ్గట్టుగానే తమ అభ్యర్థులను సైతం బరిలోకి దించాలని అధికార అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కసరత్తు చేస్తోంది. కానీ, కూటమిలో సీట్ల సర్దుబాటే ఎటూ తేలడం లేదు. ప్రధానంగా బీజేపీ 60 సీట్లను ఆశిస్తుండడంతో సమన్వయ కమిటీ ఇరకాటంలో పడింది. ఆ పార్టీకి 21 సీట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా, బీజేపీ రాష్ట్ర నేతలు ఒప్పుకోవడం లేదు. పుదుచ్చేరి, విల్లుపురంలో ఎన్నికల ప్రచారం కోసం చెన్నైకు వచ్చిన అమిత్ షాతో ఆదివారం బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు మురుగన్ బృందం గంటన్నరకు పైగా భేటీ కావడం గమనార్హం. ఎంపిక చేసిన 60 స్థానాలకు సంబంధించిన సమగ్ర వివరాలను వారు అమిత్ షా ముందు ఉంచినట్టు తెలిసింది. ఇందులో సగానికి పైగా సీట్లను అన్నాడీఎంకే నుంచి రాబట్టుకునే దిశగా ఆ పార్టీ సమన్వయ కమిటీతో అమిత్ షా మాట్లాడినట్టు సమాచారం. సీట్ల పంపకం లెక్కలు సోమవారం లేదా మంగళవారం నాటికి తేలవచ్చని కమలనాథులు పేర్కొంటున్నారు. మరోవైపు తమకు కేవలం 10 సీట్లు ఇస్తామనడం డీఎండీకేకు రుచించడం లేదు. తాము ఒంటరిగా పోటీ చేసినా పది శాతానికి పైగా ఓట్లను చీల్చగలమని డీఎండీకే కోశాధికారి ప్రేమలత విజయకాంత్ చెబుతున్నారు. దీంతో కూటమిలో ఆ పార్టీ కొనసాగేనా అన్న చర్చ మొదలైంది. చదవండి: (తమిళనాట మూడో కూటమి.. సూత్రధారి చిన్నమ్మ..!) (నరేంద్ర మోదీని నాగపూర్‌కు తరిమేద్దాం) -
ఒపినీయన్ పోల్: వచ్చే ఎన్నికల్లో వారిదే గెలుపు
న్యూఢిల్లీ: పంచతంత్రంగా పేర్కొన్నే ఐదు అసెంబ్లీల ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే అంశం దేశవ్యాప్తంగా ఉత్కంఠగా మారింది. ఈ ఉత్కంఠ నేపథ్యంలో ఓ సర్వే చెబుతున్న ఫలితాలు రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తోంది. మళ్లీ పశ్చిమబెంగాల్లో మమత, కేరళలో వామపక్షాలే, అస్సోలో బీజేపీ ప్రభుత్వాలే ఏర్పాటు చేస్తాయని.. ఇక తమిళనాడులో పదేళ్ల తర్వాత డీఎంకే కూటమి, ఇక పుదుచ్చేరిలో బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని సర్వే చెప్పింది. ఈ అసెంబ్లీ ఎన్నికలు జాతీయ రాజకీయాలను తీవ్రంగా ప్రభావం చూపేవి కావడంతో దేశవ్యాప్తంగా దీనిపై చర్చ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందనే అంశంపై ఏబీపీ-సీ ఓటర్ సంస్థ సర్వే చేసింది. అంటే ఒపీనియన్ పోల్ నిర్వహించింది. దీంతో ఆయా ప్రాంతాల్లో చేసిన సర్వే ప్రకారం పై ఫలితాలు వెల్లడయ్యాయి. ఏ పార్టీ గెలుస్తుందనే దానితో పాటు ఏ పార్టీకి ఎన్ని శాతం ఓట్లు.. ఎన్నేసి సీట్లు వస్తాయో ఓ అంచనా రూపొందించింది. ఆ ఒపినీయన్ పోల్ ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఈ సర్వే ఒక అంచనా మాత్రమే. ఏది ఏమున్నా ప్రజల తీర్పు ఎలా ఉంటుందో ఏప్రిల్ 2వ తేదీన తెలియనుంది. పశ్చిమ బెంగాల్ పదేళ్లుగా అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీకే మళ్లీ పట్టం కట్టే అవకాశం ఉంది. మళ్లీ మమత బెనర్జీ ముఖ్యమంత్రి పీఠం అధిరోహిస్తారని అభిప్రాయాలు వచ్చాయి. తృణమూల్ కాంగ్రెస్: 148-164 సీట్లు (43 శాతం ఓట్లు) బీజేపీ: 92-108 సీట్లు (38 శాతం ఓట్లు) కాంగ్రెస్ + మిత్రపక్షాలు: 31-39 సీట్లు (13 శాతం ఓట్లు) కేరళ దేవభూమిగా ఉన్న కేరళలో మళ్లీ వామపక్ష కూటమికే అధికారం దక్కే అవకాశాలు ఉన్నాయి. ఎల్డీఎఫ్: 83-91 సీట్లు యూడీఎఫ్: 47-55 సీట్లు బీజేపీ: 0-2 సీట్లు, ఇతరులు 0-2 సీట్లు తమిళనాడు ఈసారి తమిళనాడులో ప్రభుత్వం మారే అవకాశం ఉంది. పదేళ్లుగా అధికారంలో కొనసాగుతున్న అన్నాడీఎంకేకు పరాభవం తప్పేటట్టు లేదు. మిత్రపక్షాలతో కలిసి డీఎంకే అధికారం చేపట్టేలా పరిస్థితులు ఉన్నాయి. డీఎంకే + మిత్రపక్షాలు: 154-162 సీట్లు అన్నాడీఎంకే: 58-66 సీట్లు ఇతరులు: 8-20 సీట్లు అసోం ఈశాన్య ప్రాంతం రాష్ట్రంగా ఉన్న అసోంలో మళ్లీ కమలం విరబూయనుంది. బీజేపీకి రెండోసారి అధికారం దక్కే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ+ మిత్రపక్షాలు: 68-76 సీట్లు కాంగ్రెస్ + మిత్రపక్షాలు: 43-51 సీట్లు ఇతరులు: 5-10 సీట్లు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న పుదుచ్చేరిలో ఇటీవల పరిణామాలు అనూహ్యంగా మారిపోయాయి. అయితే ఆ పరిణామాలు బీజేపీకి ప్లస్ అయ్యాయని తెలుస్తోంది. ఎందుకంటే జరగబోయే ఎన్నికల్లో బీజేపీ లబ్ధి పొందనుందని ఈ సర్వే తెలిపింది. అధికారంలో బీజేపీకి దక్కేలా ఉంది. బీజేపీ+ మిత్రపక్షాలు: 17-21 సీట్లు కాంగ్రెస్+ మిత్రపక్షాలు: 8-12 సీట్లు ఇతరులు: 1-3 సీట్లు చదవండి: అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇదే.. చదవండి: మూడో కూటమి.. నేనే ముఖ్యమంత్రి అభ్యర్థి -
ప్రజాస్వామం చచ్చిపోయింది.. చైనాకు తాకట్టు
తూత్తుకూడి: దేశ ప్రయోజనాలను చైనాకు తాకట్టు పెట్టడంతో దేశంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చైనాకు సాగిలపడ్డాడని ఆరోపించారు. భారతదేశాన్ని చైనాకు అప్పగించారని మండిపడ్డారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం తూత్తుకూడిలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడారు. సుదీర్ఘ రాజ్యాంగం ఉన్న భారతదేశంలో ప్రజాస్వామ్యం బతికిలేదు.. ఆరేళ్లుగా ఒక ప్రణాళికపరంగా ప్రభుత్వ సంస్థలన్నింటిని ప్రభుత్వం వదిలేసుకుంటుందని రాహుల్ చెప్పారు. దేశంలో పార్లమెంట్, న్యాయ వ్యవస్థ, జర్నలిజం బలహీన పడుతుండడంతో దేశంలో ప్రజాస్వామ్యం ఇంకెక్కడిది అని ప్రశ్నించారు. విధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ వ్యవస్థలను సమానంగా ఆరెస్సెస్ వాదులు నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవస్థల నిర్వీర్యంతో రాష్ట్రాల పాత్రను కూడా తగ్గించేస్తున్నారని.. అదే మనం ప్రస్తుతం ఎదుర్కొంటున్నామని రాహుల్ తెలిపారు. డబ్బు, అంగబలం ఎమ్మెల్యేలను నడిపిస్తోందని.. వాటితో ఎమ్మెల్యేలను బీజేపీ వేటాడుతోందని రాహుల్ పుదుచ్చేరి పరిణామాలను పరోక్షంగా ప్రస్తావించారు.