
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సంషర్‌గంజ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ రజాఉల్ హక్ కన్నుమూశారు.
సాక్షి, కోలకతా: కరోనా వైరస్ మహమ్మారి రెండవ దశలో పంజా విసురుతోంది. చిన్నా పెద్దా, తేకుండా పలువుర్ని కబళిస్తోంది. ఇప్పటికే పలువురు మాజీఎమ్మెల్యేలు, మాజీ కేంద్ర మంత్రులు,మంత్రులు కరోనా బారిన పడి అసువులు బాశారు. తాజాగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సంషర్‌గంజ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ రజాఉల్ హక్ కన్నుమూశారు. ఆయనకు ఇటీవల కరోనా నిర్ణారణ అయింది. కోల్‌కతాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. (కరోనా కలకలం: రికార్డు స్థాయిలో కేసులు)
కాగా ఎనిమిదో దశల పోలింగ్‌లో భాగంగా 45 సీట్లుకు గాను ఐదో దశ ఏప్రిల్ 17న జరగనుంది. దీనికి సంబంధించిన ప్రచారం బుధవారం ముగిసింది. మరోవైపు బెంగాల్‌లో నూతన సంవత్సర వేడుకను నేడు (ఏప్రిల్ 15) జరుపుకుంటున్నారు.