West Bengal Assembly Election 2021
-
భవానీపూర్‌లో 53.32 శాతం ఓటింగ్
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ బరిలోకి దిగిన భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓ మోస్తరు ఓటింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల సమయానికి 53.32 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల కమిషన్ అధికారులు వెల్లడించారు. సాయంత్రం ఆరు గంటల వరకు ఓటింగ్ అనుమతించనున్నట్లు తెలిపారు. మొత్తం ఓటింగ్ శాతాన్ని శుక్రవారం వెల్లడిస్తామని స్పష్టం చేశారు. భవానీపూర్‌లో టీఎంసీ తరఫున సీఎం మమత, బీజేపీ తరఫున ప్రియాంక తిబ్రేవాల్, సీపీఎం తరఫున శ్రిజిబ్ బిశ్వాస్‌లు బరిలోకి దిగారు. ముర్షిదాబాద్‌లోని సంసేర్ గంజ్‌లో 78.60 శాతం, జంగిపూర్లో 76.12శాతం ఓటింగ్ నమోదైనట్లు తెలిపింది. ఓటర్లను ప్రభావితం చేస్తున్నారంటూ టీఎంసీ, బీజేపీలు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఈ ఉప ఎన్నికలకు సంబంధించి ఈసీ వద్దకు 97 ఫిర్యాదులు రాగా, వాటిలో 91 ఫిర్యాదులను అధికారులు కొట్టేశారు. 97 ఫిర్యాదుల్లో 85 ఫిర్యాదులు సీఎం పోటీ చేస్తున్న భవానీపూర్‌లోనే రావడం గమనార్హం. మేలో సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన మమతా బెనర్జీ తన పదవిని నిలబెట్టుకొనేందుకు ఆరు నెలల్లోగా అసెంబ్లీకి ఎన్నికవ్వాల్సి ఉంది. ఒడిశా ఉప ఎన్నికలో 68.40 శాతం ఓటింగ్.. పిపిలి: ఒడిశాలోని పిపిలి అసెంబ్లీ నియోజకవర్గంలో గురువారం జరిగిన ఉప ఎన్నికలో సాయంత్రం 5 గంటల సమయానికి 68.40శాతం ఓటింగ్ నమోదైనట్లు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎస్కే లోహని తెలిపారు. ఓటింగ్ ప్రశాంతంగా జరిగిందని పేర్కొన్నారు. కోవిడ్ 19 నియమావళి ప్రకారం ఓటింగ్ జరిగిందని, భద్రతబలగాలు అందుకు సాయపడ్డాయని చెప్పారు. అక్టోబర్ 3న ఓట్లను లెక్కించనున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద మమత -
నేడే భవానీపూర్ ఉప ఎన్నిక
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బరిలో ఉన్న భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలు గురువారం జరగనున్నాయి. ఎన్నికల సంఘం ఈ ఉప ఎన్నిక కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 15 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించింది. పోలింగ్ బూత్‌ల నుంచి 200 మీటర్ల వరకు సెక్షన్ 144 నిషేధాజ్ఞలను అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. దక్షిణ కోల్‌కతాలోని భవానీపూర్ నియోజకవర్గంలో తృణమూల్ కాంగ్రెస్ తరఫున మమతా బెనర్జీ బరిలో ఉంటే, బీజేపీ ప్రియాంక టైబ్రెవాల్‌ను బరిలో దింపింది. ఇక సీపీఐ(ఎం) తరపున స్రిజిబ్ బిశ్వాస్ పోటీ చేస్తున్నారు. నియోజకవర్గంలోని 97 పోలింగ్ కేంద్రాల్లోని 287 బూత్‌ల లోపల సెంట్రల్ పారా మిలటరీకి చెందిన ముగ్గురేసి జవాన్లను మోహరించారు. ఇక పోలింగ్ బూత్ వెలుపల భద్రత కోసం కోల్‌కతాకు చెందిన పోలీసు అధికారులు పహారా కాస్తారు. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల పరిధిలో అయిదుగురికి మించి గుమిగూడడాన్ని నిషేధించారు. -
నామినేషన్ దాఖలు చేసిన మమత
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ భవానీపూర్ నుంచి టీఎంసీ తరఫున అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. బెంగాల్‌లోని పలు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల కమిషన్ ఉపఎన్ని కలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది వేసవిలో జరిగిన ఎన్నికల్లో మమతా బెనర్జీ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అయితే పార్టీకి మెజారిటీ రావడంతో సీఎం పదవి చేపట్టారు. ఆరు నెలల తర్వాత కూడా సీఎంగా కొనసాగాలంటే ఏదో ఓ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో జరగనున్న ఈ ఉప ఎన్నికల్లో ఆమె గెలిస్తేనే సీఎంగా కొనసాగుతారు. నామినేషన్ వేసే సమయంలో మమతతో పాటు రాష్ట్ర కేబినెట్ మంత్రి భార్య ఫిర్హాద్ హకిమ్‌తో కలసి వెళ్లారు. అనంతరం పిర్హాద్ మాట్లాడుతూ.. నంది గ్రామ్‌లో మమతపై కుట్రపన్ని ఓడించారని, ఇప్పు డు భవానీపూర్ ప్రజలు మమతను రికార్డు మెజా రిటీతో గెలిపించి చరిత్రను తిరగరాస్తారని వ్యాఖ్యా నించారు. భవానీపూర్ నుంచి 2011, 2016 ఎన్ని కల్లో మమత పోటీ చేసి విజయం సాధించారు. బీజేపీ తరఫున ప్రియాంక తిబ్రేవాల్.. భవానీపూర్‌లో మమతకు పోటీగా బీజేపీ నేత ప్రియాంక తిబ్రేవాల్ పోటీ చేయనున్నారు. ఈ మేరకు బీజేపీ ఆమె పేరును నామినేట్ చేసింది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం చెలరేగిన హింసపై కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తే ఈ ప్రియాంక తిబ్రేవాల్. వృత్తిరీత్యా ఆమె న్యాయవాది. ఆమెతో పాటు సంసేర్గంజ్‌కు మిలాన్ ఘోష్, జంగీపూర్‌కు సుజిత్ దాస్‌లను అభ్యర్థులుగా బీజేపీ ప్రకటించింది. -
బెంగాల్ అల్లర్లపై 9 సీబీఐ కేసులు
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఫలితాల వెల్లడి తర్వాత రాష్ట్రంలో చెలరేగిన హింస, అల్లర్లకు సంబంధించి దర్యాప్తు ప్రారంభించిన కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) తొమ్మిది కేసులను నమోదుచేసింది. హింసాత్మక ఘటనలపై దర్యాప్తు నిమిత్తం నాలుగు ప్రత్యేక బృందాలను సీబీఐ ఆయా చోట్లకు పంపినట్లు గురువారం విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. బెంగాల్ ప్రభుత్వం తమకు అప్పజెప్పిన కేసులతోపాటు మరికొన్ని కేసుల నమోదు ప్రక్రియను సీబీఐ కొనసాగిస్తోంది. పలు హత్యలు, అత్యాచారాలు జరిగాయన్న ఆరోపణలపై ఐదుగురు జడ్జిల కలకత్తా హైకోర్టు ధర్మాసనం ఆదేశాల మేరకు కేసుల విచారణ బాధ్యతలను సీబీఐ తీసుకుంది. మే 2న ఎన్నికల ఫలితాలొచ్చాక జరిగిన హింసపై జాతీయ మానవ హక్కుల కమిషన్ నివేదికను ఆధారంగా చేసుకుని హైకోర్టు గతంలో ఈ ఆదేశాలిచ్చింది. ఆ ఎన్నికల్లో బీజేపీపై అధికార తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించింది. పలు వినతుల నేపథ్యంలో కేసుల దర్యాప్తునకు బెంగాల్ పోలీసుల నేతృత్వంలో సిట్ ఏర్పాటుకు హైకోర్టు గతంలో ఆదేశించింది. సీబీఐ, సిట్ వేర్వేరుగా 6 వారాల్లోగా దర్యాప్తు నివేదికలను సమర్పించాలని హైకోర్టు సూచించింది. కేసులు ఉపసంహరించుకోండంటూ బెదిరించారని, చాలా హత్యలను సహజ మరణాలుగా చిత్రీకరించి కనీసం ఎఫ్ఐఆర్లు నమోదు చేయించలేదని హైకోర్టుకు బాధితులు గతంలో విన్నవించుకున్నారు. ఈ ఆరోపణలపై ప్రభుత్వం స్పందించనందునే స్వతంత్ర దర్యాప్తు అవసరమనే నిర్ణయానికొచ్చామని కోర్టు వ్యాఖ్యానించింది. -
ఎన్నికల హింసపై వివరాలన్నీ కావాలి
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం చెలరేగిన హింసకు సంబంధించిన వివరాలు సమర్పించాలని ఆ రాష్ట్ర డీజీపీని సీబీఐ అడిగింది. అందులో హత్యలు, హత్యాయత్నాలు, అత్యాచారాలకు సంబంధించి నమోదైన కేసుల వివరాలన్నింటి ఇవ్వాలంటూ ఒక లేఖ రాసింది. ఎన్నికల అనంతరం చెలరేగిన హింసపై దర్యాప్తును కోల్‌కతా హైకోర్టు సీబీఐకి అప్పగించిన నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణకు సన్నద్ధమైంది. ఇందు కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేసింది. జాయింట్ డైరెక్టర్లు రమణీష్, అనురాగ్, వినీత్ వినాయక్, సంపత్ మీనా ఆధ్వర్యంలోని బృందాలు దీనిపై విచారణ చేపట్టనున్నారు. ఒక్కో బృందంలో ఏడుగురు సభ్యులు ఉన్నారు. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి అధికారుల్ని తెచ్చి ఈ బృందాల్లో నియమించింది. సీబీఐ అదనపు డైరెక్టర్ అజయ్ భట్నాగర్ ఈ విచారణను పర్యవేక్షిస్తారు. -
బెంగాల్ హింసపై సీబీఐ దర్యాప్తు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో శాసనసభ ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాకాండపై కలకత్తా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అత్యాచారం, హత్య వంటి దారుణాలు చోటుచేసుకోవడం దారుణమని పేర్కొంది. కొన్ని సంఘటనల్లో బాధితుల ఫిర్యాదులను అధికారులు నమోదు చేయలేదని తప్పుపట్టింది. బెంగాల్లో ఎన్నికల అనంతరం జరిగిన హింసపై జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్హెచ్ఆర్సీ) చేసిన సిఫార్సులను హైకోర్టు ఆమోదించింది. హింసాకాండపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజేష్ బిందాల్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవ తీర్పును వెలువరించింది. ఎన్నికల తర్వాత హింసకు సంబంధించిన ఇతర అన్ని కేసులపై దర్యాప్తు చేపట్టడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేయాలని ఆదేశించింది. బెంగాల్ దురాగతాలపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ కలకత్తా హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. ఎన్హెచ్ఆర్సీ కమిటీ నివేదిక ప్రకారం హత్య, అత్యాచారం, అత్యాచార యత్నానికి సంబంధించిన అన్ని కేసులను తదుపరి దర్యాప్తు నిమిత్తం సీబీఐకి తక్షణమే బదిలీ చేయాలని, సంబంధిత రికార్డులను అప్పగించాలని బెంగాల్ ప్రభుత్వానికి సూచించింది. సీబీఐ, సిట్ దర్యాప్తును తాము పర్యవేక్షిస్తామని తెలిపింది. ఆరు వారాల్లోగా స్టేటస్ రిపోర్టు తమకు సమర్పించాలని సీబీఐ, సిట్‌కు ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో గురువారమే రంగంలోకి దిగిన సీబీఐ దర్యాప్తునకు నాలుగు బృందాలను ఏర్పాటు చేసింది. హింస జరిగినా కేసులు నమోదు చేయరా? ఎన్నికల తర్వాత ఎన్నో దారుణాలు చోటుచేసుకున్నాయని, హత్యలు జరిగినా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ధర్మాసనం పేర్కొంది. దీన్నిబట్టి దర్యాప్తు నుంచి తప్పించుకోవాలన్న దుర్బుద్ధిని ప్రదర్శించినట్లు అర్థమవుతోందని వ్యాఖ్యానించింది. ఇలాంటి పరిస్థితుల్లో స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపిస్తే బాధితుల్లో నమ్మకం పెరుగుతుందని తెలియజేసింది. ఎన్నికలు, ఫలితాల అనంతరం హింస కేవలం ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాలేదని వివరించింది. హత్యలు, అత్యాచారాలకు పాల్పడడంతోపాటు అధికార పార్టీకి మద్దతు ఇవ్వని వారి ఇళ్లను కూల్చివేశారని, వారి ఆస్తులను ధ్వంసం చేశారని న్యాయస్థానం ఉద్ఘాటించింది. కేసులు వెనక్కి తీసుకోవాలంటూ బాధితులను బెదిరించారని తెలిపింది. కొన్ని హత్యలను సహజ మరణాలుగా చిత్రీకరిస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. పెద్ద ఎత్తున హింస జరిగినా కేసులు పెట్టకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకు చేటు కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ విధానాల ప్రకారం బాధితులకు నష్ట పరిహారం చెల్లించాలని పశ్చిమ బెంగాల్ సర్కార్నుఆదేశించింది. హింసపై కలకత్తా హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడాన్ని బీజేపీ స్వాగతించింది. ఈ తీర్పు రాజ్యాంగ విజయమని అభివర్ణించింది. ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థ అత్యున్నతమైనదన్న విషయంలో మరోసారి నిరూపితమైందని బీజేపీ నేత సువేందు అధికారి చెప్పారు. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేస్తామన్న సంకేతాలను తృణమూల్ కాంగ్రెస్ ఇచ్చింది. -
West Bengal: మళ్లీ టీఎంసీలోకి వస్తాం.. వినతుల వెల్లువ!
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు తృణమూల్ కాంగ్రెస్‌ను వీడిన నాయకుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఎన్నికల్లో తృణమూల్ ఓటమి, బీజేపీ గెలుపు ఖాయమని నమ్మి కాషాయ కండువాలు కప్పుకున్న నాయకులంతా ఇప్పుడు ‘బ్యాక్ టు హోం’ ప్రయత్నాల్లో ఉన్నారు. కొందరు నాయకులు మళ్లీ మమత కరుణ కోసం అంతర్గత ప్రయత్నాలు చేస్తుంటే, మరికొందరైతే బహిరంగంగానే ‘తప్పనిసరై’ బీజేపీలోకి వెళ్లామని ప్రకటనలు చేస్తున్నారు. ‘కరోనా సంక్షోభ సమయంలో రాజకీయాలు సరికాదని రాష్ట్ర ప్రజలు సరైన, స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు’ అని ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే బీజేపీ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయిన టీఎంసీ మాజీ మంత్రి రాజీవ్ బెనర్జీ వ్యాఖ్యానించారు. మళ్లీ తనను టీఎంసీలోకి తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే సొనాలి గుహ కోరారు. ‘ఒకవైపు, రాష్ట్రం కరోనాతో అల్లకల్లోలమవుతుంటే, బీజేపీ నేతృత్వంలోని కేంద్రం రాజకీయ కక్ష సాధింపు చేపట్టింది. నారద కేసులో టీఎంసీ నేతలను అరెస్ట్ చేసింది. అదే రోజు నేను బీజేపీని వదిలేశాను’ అని ఫుట్‌బాల్ మాజీ ఆటగాడు, బషిర్హట్ దక్షిణ్ ఎమ్మెల్యే దీపేందు బిశ్వాస్ మమతకు రాసిన ఒక లేఖలో పేర్కొన్నారు. టీఎంసీలోకి మళ్లీ వస్తామని బహిరంగంగా ఆకాంక్ష వ్యక్తం చేసిన నాయకుల్లో సరళ ముర్ము కూడా ఉన్నారు. మరోవైపు, ఒకప్పుడు టీఎంసీలో నెంబర్ 2 స్థాయి నేత, ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్ మౌనం అందరినీ ఆకర్షిస్తోంది. ఎన్నికల ఫలితాల్లో టీఎంసీ విజయం ఖాయమైనప్పటి నుంచీ.. ఆయన నుంచి రాజకీయ ప్రకటనలేవీ రాలేదు. అయితే, బీజేపీలోనే కొనసాగుతానని ఒక ట్వీట్ మాత్రం చేశారు. ముకుల్ రాయ్ మళ్లీ టీఎంసీలోకి రాబోతున్నారనే వార్తలు ఇటీవల ఒక్కసారిగా గుప్పుమన్నాయి. మమత బెనర్జీ మేనల్లుడు అభిషేక్ కోవిడ్‌తో బాధపడుతున్న ముకుల్ రాయ్ భార్య కృష్ణను ఇటీవల కోల్‌కతాలోని ఒక ఆసుపత్రిలో పరామర్శించారు. ఆ తరువాత, రాష్ట్ర బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ ఆసుపత్రికి వెళ్లడం, ఆ మర్నాడే ప్రధాని మోదీ ముకుల్ రాయ్‌కు ఫోన్ చేసి పరామర్శించడం వెంటవెంటనే జరిగాయి. కోవిడ్ పాజిటివ్ రావడంతో ప్రస్తుతం ముకుల్ రాయ్ హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. -
బెంగాల్లో హింస: కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చెలరేగిన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్రం సీరియస్ అయింది. బెంగాల్లో హింసకు సంబంధించి నివేదిక సమర్పించాల్సిందిగా కేంద్ర హోం శాఖ బెంగాల్ గవర్నర్‌ను ఆదేశించింది. ఇప్పటికే కేంద్రం నలుగురు సభ్యులతో కమిటీ వేసిన సంగతి తెలిసిందే. కాగా ఎన్నికల ఫలితాల అనంతరం బెంగాల్లో చెలరేగిన హింస దృష్ట్యా కేంద్ర హోంశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలకు కేంద్ర బలగాలతో భద్రతను ఏర్పాటుచేయనుంది. 77 మంది బీజేపీ ఎమ్మెల్యేలకు భద్రత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలో ప్రతిపక్షనేతగా ఎన్నికైన సువేందు అధికారికి జెడ్ కేటగిరీ భద్రతను కొనసాగించే అవకాశం ఉంది. చదవండి: Tamil Nadu: పెత్తనం.. పళనిదే! -
బెంగాల్లో కేంద్రమంత్రి మురళీధరన్ కారుపై దాడి
-
బెంగాల్లో హింస.. కేంద్ర హోం శాఖ సీరియస్
కోల్కత్త: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చెలరేగిన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్రం సీరియస్ అయ్యింది. ఇందుకు సంబంధించి నివేదిక సమర్పించాల్సిందిగా కేంద్ర హోం శాఖ బెంగాల్ గర్నర్‌ను ఆదేశించింది. ఇప్పటికే కేంద్రం నలుగురు సభ్యులతో కమిటీ వేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఫలితాల తర్వాత బెంగాల్లో హింసాత్మక ఘటనలు చెలరేగాయి. బెంగాల్లో కేంద్రమంత్రి మురళీధరన్ కారుపై దాడి జరిగింది. దుండగలు మంత్రి వాహనంపై రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో తన వ్యక్తిగత సిబ్బంది గాయపడినట్టు మురళీధరన్ వెల్లడించారు. టీఎంసీ కార్యకర్తలే దాడి చేశారని ఆరోపించడమే కాక.. మురళీధరన్ పర్యటన రద్దు చేసుకుని వెనక్కి వెళ్లిపోయారు. ఇక బెంగాల్లో చెలరేగిన హింసకు ఎన్నికల కమిషనే కారణమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఇక మీదట రాష్ట్రంలో శాంతి భద్రతలు తానే పర్యవేక్షిస్తానన్న మమతా.. డీజీపీ నీరజ్ నయాన్‌పై బదిలీ వేటు వేయడమే కాక.. పాత డీజీపీ వీరేంద్రకు తిరిగి బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. చదవండి: బెంగాల్ హింస ఆగేదెన్నడు? -
2024 ఎన్నికల్లో ప్రధాని రేసులో దీదీ?
ఇండోర్: ‘పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇప్పుడు జాతీయ నేత. మమత ఇప్పుడు మూడోసారి ముఖ్యమంత్రిగా ఎన్నిక య్యారు. ఆమె కేవలం ప్రధానిని మాత్రమే గాక మోదీ మంత్రివర్గాన్ని, కేంద్ర సంస్థలైన సీబీఐ, ఈడీలనూ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిం చారు’ అని కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ బుధవారం వ్యాఖ్యానించారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు మమతను ప్రధాని అభ్యర్థిగా యూపీఏ నిలబెడుతుందా? అన్న ప్రశ్నకు సమాధానంగా.. ఆ విషయం ఇప్పుడే తెలియ దని, యూపీఏ సరైన సమయంలోనే తమ అభ్యర్థిని ప్రకటిస్తుందని వెల్లడించారు. పశ్చిమ బెంగాల్లో చెలరేగిన రాజకీయ హింస గురించి తాను మమతతో మాట్లాడి నట్లు తెలిపారు. హింసను ఎంచుకోవడం తప్పని, హింస నుంచి దూరంగా ఉండేలా అందరిని కోరాల్సిందిగా మమతకు సూచించి నట్లు చెప్పారు. మధ్యప్రదేశ్‌ను సందర్శిం చాల్సిందిగా ఆమెను కోరినట్లు తెలిపారు. -
బెంగాల్ హింస ఆగేదెన్నడు?
ఒకప్పుడు ఎన్నికలొస్తున్నాయంటే జరగబోయే హింసను తలుచుకుని సాధారణ పౌరులు వణికి పోయేవారు. ప్రచార సమయంలోనేకాక, ఎన్నికలు పూర్తయ్యాక కూడా అవి నిరంతరాయంగా కొనసాగేవి. ముఖ్యంగా బిహార్, ఉత్తరప్రదేశ్ వంటివి ప్రచార సమయంలోనేకాక పోలింగ్ రోజునా, అనంతరకాలంలో కూడా హింసాత్మక ఘటనలు జరిగేవి. యథేచ్ఛగా రిగ్గింగ్ కొనసాగేది. అయితే టీఎన్ శేషన్ ప్రధాన ఎన్నికల కమిషనర్ అయిన తర్వాత అటువంటి హింసను గణనీయంగా తగ్గించగలిగారు. ఆ రాష్ట్రాల్లో పరిస్థితులు ఎంతో కొంత మెరుగుపడ్డాయి. అయితే అప్పటికీ, ఇప్ప టికీ మారనిది పశ్చిమ బెంగాల్. రాష్ట్రంలో ఎవరు అధికారంలోవున్నా అక్కడ ఈ హింస యథా తథంగా సాగుతోంది. కొంత హెచ్చుతగ్గులే తప్ప పరస్పర దాడులు, విధ్వంసం వగైరాలు అదే బాణీలో కొనసాగుతున్నాయి. గత మూడు రోజులుగా దక్షిణ బెంగాల్ ప్రాంతంలోని బీర్భూమ్, హౌరా, బసీర్హత్, సోనార్పూర్, బర్థమాన్... ఉత్తర ప్రాంతంలోని దిన్హతా, సీతల్‌కుచిల్లో విచ్చల విడిగా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. హత్యలు చేయడం, తలలు పగులకొట్టడం, ఇళ్లపై దాడులు అక్కడ నిత్యకృత్యమయ్యాయి. బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్‌లు మూడూ ఈ విషయంలో తృణ మూల్ కాంగ్రెస్‌ను నిందిస్తున్నాయి. ఫలితాలు వెలువడినప్పటినుంచి మంగళవారం వరకూ 17 మంది హింసాకాండకు బలయ్యారు. తమ పార్టీకి చెందిన తొమ్మిదిమంది చనిపోయారని బీజేపీ అంటున్నది. కానీ తమ శ్రేణులనే లక్ష్యం చేసుకుని వేరే పార్టీలవారు దాడులు చేస్తున్నారన్నది తృణమూల్ ప్రత్యారోపణ. మృతుల్లో ఆ పార్టీకి చెందినవారు ఆరుగురు చనిపోయిన మాట వాస్త వమే. మరో ఇద్దరు కాంగ్రెస్–సీపీఎంల సంయుక్త మోర్చాకి చెందినవారు. బెంగాల్లో అధికారమే లక్ష్యంగా మొన్నటి ఎన్నికల్లో హోరాహోరీ పోరాడిన బీజేపీ హింసాకాండను తీవ్రంగానే తీసుకుంది. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన, గాయపడిన కార్యకర్తల కుటుం బాలను పరామర్శించటం, ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర గవర్నర్‌కు ఫోన్ చేసి హింసను ఆపడానికి చర్యలు తీసుకునేలా చూడాలని కోరారు. అటు కాంగ్రెస్ నేతలు, ఇటు సీపీఎం నేతలు సైతం మమతపై ఆగ్రహిస్తున్నారు. కేంద్ర బలగాలను శాంతిభద్రతల పరిరక్షణకు వినియోగించాలని, జరుగుతున్న ఘటనలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని సుప్రీంకోర్టులో రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు కూడా దాఖలయ్యాయి. తృణమూల్ కాంగ్రెస్ సాధించిన విజయం సామాన్యమైనది కాదు. ఎన్నో అవాంతరాలమధ్య ఆ పార్టీ మెజారిటీ ప్రజల ఆమోదం పొందగలిగిందనడంలో సందేహం లేదు. అయితే నెగ్గిన పక్షం ఆ విజయాన్ని వినమ్రంగా స్వీకరించాలి. లేనట్టయితే ఓటేసినవారు సైతం ఎందుకు వేశామా అని చింతించే పరిస్థితి వస్తుంది. అవతలి పార్టీవారు రెచ్చగొట్టి దాడులు చేయడం వల్ల తమ శ్రేణులు ప్రతిదాడులు చేస్తున్నాయన్న తర్కం చెల్లదు. తమ శ్రేణుల్ని చెప్పుచేతల్లో పెట్టుకోవాల్సిన బాధ్యత నాయకులకు వుంటుంది. ఎందుకంటే హింస ఎటువైపు మొదలైనా, దాన్ని మొగ్గలోనే తుంచకపోతే చెడ్డపేరు వచ్చేది అధికార పక్షానికే. గెలుపు దానికదే అంతిమ కర్తవ్యం కాదు. గెలిచాక ఎంత మెరు గైన పాలన అందిస్తున్నామన్నది, సాధారణ పౌరుల జీవనం సజావుగా, ప్రశాంతంగా సాగేందుకు ఏం చేస్తున్నామన్నది ప్రధానం. ఎన్నికలై అధికారంలోకొచ్చిన ప్రభుత్వంపైనా, అధికార పార్టీపైనా తొలినాళ్లలో ప్రత్యేక దృష్టి వుంటుంది. వారి అడుగులు ఎటు పడుతున్నాయో, ఎలాంటి విధానాలు, కార్యక్రమాలు అమలు చేయబోతున్నారో అందరూ చూస్తుంటారు. మమత వరసగా మూడోసారి బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. సాంకేతికంగా మంగళవారం వరకూ శాంతి భద్రతలతోసహా ప్రభుత్వ వ్యవహారాలన్నీ ఎన్నికల సంఘం పర్యవేక్షణలోనే కొనసాగాయి. అయితే తమ పార్టీవారిని నిరోధించడానికి అదేమీ అడ్డంకి కాదు. ఫలితాలు వెలువడిన వెంటనే తమిళ నాడులో డీఎంకే కార్యకర్తలు రోడ్లపైకొచ్చి అమ్మ క్యాంటీన్లు రద్దు చేయాలంటూ వీరంగం వేస్తే పార్టీ అధ్యక్షుడు, కాబోయే ముఖ్యమంత్రి స్టాలిన్ అందుకు కారకులైనవారిని పార్టీనుంచి సస్పెండ్ చేస్తు న్నట్టు ప్రకటించారు. ఆ పనే మమత కూడా చేయొచ్చు. ప్రశాంతంగా వుండాలని ఆమె కోరిన మాట వాస్తవమే అయినా పార్టీ పరంగా ఏం చర్యలు తీసుకున్నారన్నది కూడా ముఖ్యం. అటు బీజేపీ సైతం దీన్ని తన ప్రయోజనాల కోసం వాడుకోవడానికి ప్రయత్నిస్తోంది. రాష్ట్రపతి పాలన విధించడానికి ఇదంతా చేస్తున్నారన్న తృణమూల్ ఆరోపణల్లో నిజానిజాల మాటలావుంచి, బాధితుల గురించి మతప్రాతిపదికన ప్రస్తావించటం బీజేపీకి తగదు. మృతుల్లో, గాయపడినవారిలో అన్ని మతాలవారూ వున్నారు. బాధ్యతాయుత నేతలు నోరు జారితే అవి శాశ్వత విద్వేషాలకు బీజాలవుతాయి. ఇంతవరకూ బెంగాల్లో పార్టీల మధ్య కొట్లాటలున్నాయి, హత్యలు జరిగాయి. అయితే అదృష్టవశాత్తూ ఏవీ మతం రంగు పులుముకోలేదు. ఎప్పుడో దేశ విభజన సమయంలో దేశంలోని ఇతర ప్రాంతాలతోపాటు బెంగాల్ కూడా ఎన్నో విషాదాలను చవిచూసింది. అవి మళ్లీ తలెత్తకూడదు. అసెంబ్లీ ఎన్నికల పర్వంలో అందరూ కలిసి రాజేసిన విద్వేషాలు చాలు. వాటినుంచి బయటపడటానికి చాలా సమయం పడుతుంది. ఇప్పుడు బెంగాల్‌కు కావలసింది ఉపశ మనం. జరుగుతున్న హింసపై నిష్పాక్షికంగా విచారణ జరిపించి కారకులెవరైనా కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలి. -
మూడోసారి బెంగాల్ పీఠంపై దీదీ
కోల్‌కతా: హోరాహోరీ అసెంబ్లీ ఎన్నికల పోరులో విజయఢంకా మోగించిన తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ వరసగా మూడోసారి బెంగాల్ సీఎంగా ప్రమాణం చేశారు. బుధవారం కోల్‌కతాలోని రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధన్కర్ ఆమెతో సీఎంగా ప్రమాణంచేయించారు. మమత కేబినెట్లో కొత్త మంత్రులంతా 9వ తేదీన ప్రమాణం చేయను న్నారు. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల తర్వాత హింస చెలరేగడానికి కారకులైన వారిని వదిలిపెట్టేదిలేదని ఈ సందర్భంగా ఆమె ప్రతిజ్ఞ చేశారు. బెంగాల్లో కోవిడ్ కట్టడే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని మమత స్పష్టంచేశారు. కాగా, సీఎంగా ప్రమాణంచేసిన మమత దీదీకి అభినందనలు అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. దేశంలోని పౌరులందరికీ ఉచితంగా టీకా ఇవ్వాలని విజ్ఞప్తిచేస్తూ ప్రధాని మోదీకి మమత ఓ లేఖ రాశారు. అల్లర్లను చెల్లెలు మమత అదుపుచేయగలదు: గవర్నర్ ధన్కర్ ‘మూడోసారి సీఎం అయిన మమతకు ధన్య వాదాలు. అయితే, ప్రస్తుతం అల్లర్లు, హింసతో బెంగాల్ తీవ్ర సంక్షోభంలో ఉంది. ఈ హింసా త్మక ఘటనలకు నా సోదర సమానురాలైన మమతా బెనర్జీ అడ్డుకట్ట వేయగలదనే నమ్ముతున్నా. హింసకు గురౌతున్న మహిళలు, చిన్నారులను రక్షించి తక్షణమే శాంతిభద్రతలను ఆమె అదుపులోకి తెస్తారని భావిస్తున్నా’అని గవర్నర్ ధన్కర్ వ్యాఖ్యానించారు. -
మమత ఇప్పుడు జాతీయ నేత: కమల్‌నాథ్
ఇండోర్: ‘పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇప్పుడు జాతీయ నేత. మమత ఇప్పుడు మూడోసారి ముఖ్యమంత్రిగా ఎన్నిక య్యారు. ఆమె కేవలం ప్రధానిని మాత్రమే గాక మోదీ మంత్రివర్గాన్ని, కేంద్ర సంస్థలైన సీబీఐ, ఈడీలనూ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిం చారు’ అని కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ బుధవారం వ్యాఖ్యానించారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు మమతను ప్రధాని అభ్యర్థిగా యూపీఏ నిలబెడుతుందా? అన్న ప్రశ్నకు సమాధానంగా.. ఆ విషయం ఇప్పుడే తెలియదని, యూపీఏ సరైన సమయంలోనే తమ అభ్యర్థిని ప్రకటిస్తుందని వెల్లడించారు. పశ్చిమ బెంగాల్లో చెలరేగిన రాజకీయ హింస గురించి తాను మమతతో మాట్లాడి నట్లు తెలిపారు. హింసను ఎంచుకోవడం తప్పని, హింస నుంచి దూరంగా ఉండేలా అందరిని కోరాల్సిందిగా మమతకు సూచించి నట్లు చెప్పారు. మధ్యప్రదేశ్‌ను సందర్శిం చాల్సిందిగా ఆమెను కోరినట్లు తెలిపారు. చదవండి: (జాతీయ స్థాయి లాక్‌డౌన్‌కు ప్రధాని మోదీపై ఒత్తిడి) -
Assam: కొడుకు బెయిల్ కోసం ఎన్నికల్లో గెలిపించిన తల్లి
అఖిల్ గొగొయి జైల్లో ఉన్నారు. ఆయన తరఫున 85 ఏళ్ల ఆయన తల్లి ప్రియాద ఎన్నికల ప్రచారం చేశారు. అస్సాంలోని శివసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అఖిల్ సుమారు 12 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక 30 ఏళ్ల చందనా బారి ఒక పూరి గుడిసెలో ఉంటారు. భర్త రోజువారీ కూలీ. పశ్చిమ బెంగాల్‌లోని సల్తోరా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నాలుగు వేల ఓట్లు మెజారిటీతో గెలిచారు. డబ్బు, రాజకీయ అనుభవం లేకున్నా చందన గెలిస్తే.. తన బిడ్డను ఎలాగైనా జైలు నుంచి విడిపించుకునే ప్రయత్నంలో భాగంగా ప్రియాద అతడిని గెలిపించుకున్నారు. వీరివి అసాధారణ విజయాలు మాత్రమే కాదు.. వీరు అసాధారణ విజేతలు కూడా! ప్రియాద అఖిల్ సామాజిక కార్యకర్త. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా అస్సాంలో ప్రదర్శనలు నిర్వహించి 2019 డిసెంబరులో అరెస్ట్ అయ్యారు. ఎన్నికల్లో తన సొంత పార్టీ ‘రైజోర్ దళ్’ అభ్యర్థిగా శివసాగర్ నియోజకవర్గం నుంచి పోటీకి నిలబడ్డారు. కానీ బయటికి వచ్చి ప్రచారం చేయడానికి లేదు. ఆ బాధ్యతను వృద్ధురాలైన అతడి తల్లి ప్రియాద తన భుజంపై వేసుకున్నారు. ఆమె ఆశ ఒక్కటే. తన కొడుకు గెలిస్తే, అప్పుడైనా అతడిని విడుదల చేస్తారని. అందుకే అతడిని గెలిపించడం కోసం ఆమె శివసాగర్‌లో ఇంటింటికి తిరిగారు. వేసవి గాలుల్ని, తన హృద్రోగాన్ని, సహకరించని కంటి చూపును కూడా ఆమె లక్ష్య పెట్టలేదు. ఆ మాతృమూర్తి పట్టుదలకు చలించిపోయిన ప్రముఖ సామాజిక కార్యకర్తలు మేధా పాట్కర్, సందీప్ పాండే ఆమెకు తోడుగా ప్రచారానికి వచ్చారు. ఆ తల్లి శ్రమ ఫలించింది. అఖిల్ గెలిచాడు. ఇక అతడికి బెయిలు రావడమే మిగిలింది. చందన పశ్చిమ బెంగాల్‌లోని సల్తోరా నియోజకవర్గం నుంచి గెలిచిన చందనా బారి బీజేపీ నిలబెట్టిన అభ్యర్థి. ఆ రాష్ట్రంలో ఆ పార్టీ తరఫున ఆశ్చర్యకరమైన రీతిలో గెలిచిన వారిలో చందన ఒకరు. నిరుపేద కుటుంబం. భర్త రోజువారీ కూలి. అధికార తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిపై ఆమె ఘన విజయం సాధించగానే ట్విట్టర్లో చందన పేరు మార్మోగిపోయింది. ఆమె గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ ఆమె ఓట్లు అడిగిన విధానం, ఏ బలమూ లేని నిదానం.. ఓటర్లను ఆకట్టుకుంది. ‘‘ఆమెను చూడండి. రాజకీయాలు తెలియవు. డబ్బు లేదు. ఉండటానికి సరైన ఇల్లు కూడా లేదు. అయినప్పటికీ ఆత్మవిశ్వాసంతో ప్రజలకు సేవ చేసేందుకు ముందుకొచ్చింది’’ అని ట్విట్టర్ యూజర్లు వందల సంఖ్యలో చందనకు నేటికింకా అభినందనలు తెలియజేస్తూనే ఉన్నారు. చదవండి: West Bengal: మూడోసారి సీఎంగా మమత ప్రమాణ స్వీకారం -
Mamata Banerjee: బీజేపీకి రాజకీయ ప్రాణవాయువు అవసరం
కోల్‌కతా: బీజేపీ అజేయశక్తి కాదని, ఆ పార్టీని ఓడించవచ్చని బెంగాల్ ఎన్నికలు నిరూపించాయని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. దేశంలో ఆక్సిజన్ కొరతను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతూ... ప్రజలకు ఆక్సిజన్ అందివ్వడం లేదు. కానీ ఇప్పుడు బీజేపీకే రాజకీయ ప్రాణవాయువు అవసరం’ అని ఆమె వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో 213 సీట్లను నెగ్గి ఘనవిజయం సాధించిన మమత బుధవారం వరుసగా మూడోసారి బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె మంగళవారం ఓ టీవీ చానల్‌తో మాట్లాడారు. ఫలితాల అనంతరం బెంగాల్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలకు బీజేపీయే కారణమని ఆరోపించారు. అవమానకరమైన ఓటమి నుంచి దృష్టి మరల్చడానికి... మతఘర్షణలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. బీజేపీ మతతత్వపార్టీ అన్నారు. ‘బీజేపీని ఓడించొచ్చు. మనది ప్రజాస్వామ్యదేశం. ప్రజల అభీష్టమే అంతిమం. బెంగాలీలు మార్గాన్ని చూయించారు. ప్రజాస్వామ్యంలో లెక్కలేనితనం, అహం పనికిరాదు. ఎన్నికల సంఘం రాజధర్మాన్ని పాటించి.. ఒక్క బీజేపీకే కాకుండా అన్ని పార్టీలకు అండగా నిలవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను’ అని మమత అన్నారు. ఏజెన్సీ రాజకీయాలకు తెరపడాలి దర్యాప్తు సంస్థలను, అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ సమాఖ్య వ్యవస్థను రూపుమాపాలని చూస్తున్నారని ఆరోపించారు. ‘ఏజెన్సీ రాజకీయాల (సీబీఐ, ఈడీలను ప్రత్యర్థులపై వాడటం)కు తెరపడాలి. అప్పుడే నరేంద్ర మోదీ– అమిత్ షా రాజకీయశకం ముగుస్తుంది. ఈ తరహా రాజకీయాలు దేశానికి అవసరం లేదు. మోదీ, షాల కంటే సమర్థులైన అభ్యర్థులు ఎందరో ఉన్నారు’ అని దీదీ అన్నారు. 2024లో పత్రిపక్షాల ప్రధాని అభ్యర్థిగా తెరపైకి వస్తారా? అని ప్రశ్నించినపుడు మమత ఆచితూచి స్పందించారు. ‘ఇప్పటికిప్పుడు అన్నీ నిర్ణయించలేం. కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ అంటూ ఒకటి ఉండాలి. ఇది కోవిడ్‌పై పోరాడాల్సిన సమయం. పరిస్థితులు చక్కబడ్డాక దానిపై దృష్టి పెడతాం. ఒక నిపుణుల బృందాన్ని నియమిస్తాం. వాళ్లు మాకు మార్గనిర్దేశం చేస్తారు. ఏదో ఒకటి దానంతటదే జరుగుతుంది. ఎందుకంటే దేశం ఈ విపత్తును ఎదుర్కొనలేదు. బీజేపీ అంటేనే ఓ విపత్తు’ అని మమత వ్యాఖ్యానించారు. -
గెలిచిన వాళ్లే దాడి చేస్తున్నారా? వర్మ సెటైర్లు
సాక్షి, ముంబై: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం బెంగాల్ హింసాకాండ ఘటనపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. సాధారణంగా ఓడిపోయిన వారు హింసకు పాల్పడతారు. కానీ చరిత్రలో మొదటిసారి విజేతలు ఓడిపోయిన వారిపై దాడిచేస్తున్నారని వింటున్నాను.. పాత కక్షల ప్రభావం అనుకుంటా అంటూ తనదైన శైలిలో ట్విటర్లో సెటైర్లు వేశారు. ఈ విధ్వంసానికి టీఎంసీ నాయకత్వం మద్దతు ఇస్తుందంటే నమ్మశక్యంగా లేదు. ఇంత ఘన విజయం సాధించిన తరువాత హింసకు పాల్పడాల్సిన అవసరం ఏముందబ్బా... అయినా ఉన్మాదంతో చెలరేగిపోతూ తోడేళ్లుగా వ్యవహరిస్తున్న వారికి మనం ఎంత చెప్పినా అర్థంకాదు అంటూ ట్వీట్ చేశారు. కాగా ఫలితాల తరువాత టీఎంసీ కార్యకర్తలు రెచ్చిపోయారని, తీవ్ర హింసకు తెగబడ్డారని బీజేపీ ఆరోపిచింది. ఈ దాడిలో బీజేపీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారని వేలాదిమంది కార్యకర్తల ఇళ్లను ధ్వంసం చేశారని మండిపడింది. మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మంగళవారం హుటాహుటిన కోల్‌కతా చేరుకున్నారు. బాధిత కుటుంబాను పరామర్శించారు. టీఎంసీ గూండాలు బీజేపీ కార్యకర్త హరన్ అధికారి ఇంటిని ధ్వంసం చేశారు, అతడిని తీవ్రంగా కొట్టడంతో మరణించారని మండిపడ్డారు. మహిళలు, పిల్లలపై కూడా దాడి చేశారంటూ టీఎంసీపై ఆరోపణలు గుప్పించారు. మరోవైపు బీజేపీ ఆరోపణలను టీఎంసీ ఇప్పటికే తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. I find it hard to believe the W B violence is backed by TMC leadership because after such a resounding victory why would they need to do this ? Hooligans indulging in mind less violence are nearest to mad wolves and hence can never be really made to understand — Ram Gopal Varma (@RGVzoomin) May 4, 2021 Always in history,sore losers indulge in violence ..First time I am hearing winners going after losers ..Have a feeling there could be PURANI DUSHMANI — Ram Gopal Varma (@RGVzoomin) May 4, 2021 చదవండి: బెంగాల్లో హింస, సుప్రీంకోర్టుకు బీజేపీ -
బెంగాల్లో హింస, సుప్రీంకోర్టుకు బీజేపీ
కోల్‌కత: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రాష్ట్రంలో చెలరేగిన హింస చర్చకు దారి తీసింది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెంగాల్ ప్రభుత్వం నుంచి నివేదిక కోరారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న ఘటనలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన మోదీ గవర్నర్ జగ్దీప్ ధన్కర్కు మంగళవారం ఫోన్ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆరా తీశారు. గవర్నర్ ధన్కర్ మంగళవారం ట్విటర్ ద్వారా వివరాలందించారు. ప్రధాని మోదీ తనకు ఫోన్ చేశారని, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారని గవర్నర్ తెలిపారు. రాష్ట్రంలో హింస, విధ్వంసం, దోపిడీలు, హత్యలు కొనసాగుతున్నాయని ప్రధానమంత్రికి తాను తెలిపానని పేర్కొన్నారు. శాంతిభద్రతలను పునరుద్ధరించేందుకు సంబంధితులు తక్షణం చర్యలు ప్రారంభించాలన్నారు. ఈ హింసలో కనీసం 12 మంది మరణించారని ఇది గత నెల రోజుల ఎన్నికలలో మరణించిన వారి సంఖ్య కంటే ఎక్కువగా ఉండవచ్చంటూ దీనిపై నివేదికను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కోరిందని ఆయన తెలిపారు. హుటిహుటిన కోల్‌కతాకు నడ్డా మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మంగళవారం హుటాహుటిన కోల్‌కతా చేరుకున్నారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు గతంలో ఎన్నడూ జరగలేదని నడ్డా వ్యాఖ్యానించారు. దేశ విభజన సమయంలోనే ఇంత తీవ్ర హింస జరిగిందనీ, తాజా ఘటనలు తమను దిగ్భ్రాంతికి, ఆందోళనకు గురి చేశాయన్నారు. ఇంతస్థాయిలో అసహనాన్ని స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎన్నడూ చూడలేదనిన్నారు. దక్షిణ 24 పరగణాల (ఎఎన్ఐ) ప్రతాప్‌నగర్‌లో బాధిత పార్టీ కార్యకర్తలను నడ్డా పరామర్శించారు. ఖండించిన టీఎంసీ ఈ ఆరోపణలు టీఎంసీ పూర్తిగా తోసిపుచ్చింది. రాష్ట్రంలో వరుసగా మూడోసారి గెలిచిన ముఖ్యమంత్రి తమ నేత మమతా బెనర్జీ అని, బెంగాల్ శాంతి ప్రియమైన ప్రదేశమని పేర్కొంది. అసలు బీజేపీనే తీవ్ర హింసకు పాల్పడిందిన, సీఏపీఎఫ్ ప్రయోగించిందని మమతా బెనర్జీ ఆరోపించారు. అయితే ప్రజలందరూ ప్రశాంతంగా ఉండాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కాగా అసెంబ్లీ ఎన్నికల తరువాత ఆదివారం బెంగాల్లో హింసాకాండ ప్రారంభమైందని బీజేపీ ప్రదాన ఆరోపణ. టీఎంసీ కార్యకర్తలు తమ పార్టీ కార్యకర్తలను హత్య చేశారని, 4వేలకు పైగా ఇళ్లను ధ్వంసం చేశారని మండిపడింది. ఈ హింసాకాండకు బాధ్యత అధికార పార్టీదేనని పేర్కొంది. మమతా సర్కార్ ఫాసిస్టు ప్రభుత్వమని, టీఎంసీని నాజీలంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది. మరోవైపు ఈ హింసాకాండపై చర్యలు తీసుకోవాలని సీబీఐ దర్యాప్తు చేయించాలని కోరుతూ బీజేపీ నేత గౌరవ్ భాటియా సుప్రీంకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. PM called and expressed his serious anguish and concern at alarmingly worrisome law & order situation @MamataOfficial I share grave concerns @PMOIndia given that violence vandalism, arson. loot and killings continue unabated. Concerned must act in overdrive to restore order. — Governor West Bengal Jagdeep Dhankhar (@jdhankhar1) May 4, 2021 -
మే 5న మమత ప్రమాణ స్వీకారం
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా ఈ నెల 5వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవలి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మమత వరుసగా మూడో విడత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. సోమవారం ఆమె రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ జగ్దీప్ ధన్‌కర్‌నుకు తన రాజీనామా లేఖను సమర్పించారు. తదుపరి ప్రభుత్వం ఏర్పాటుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఆమె రాజీనామాను ఆమోదించినట్లు గవర్నర్ ట్విట్టర్లో తెలిపారు. ప్రమాణ స్వీకారం చేసే వరకు ఆమె ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారన్నారు. మమతా బెనర్జీ మే 5వ తేదీన ఉదయం 10.45 గంటలకు రాజ్‌భవన్‌లో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని గవర్నర్ పేర్కొన్నారు. కోవిడ్ ప్రొటోకాల్‌ను అనుసరించి ఈ కార్యక్రమానికి పరిమిత సంఖ్యలో అతిథులు హాజరవుతారని ఆయన ట్విట్టర్లో తెలిపారు. ఈ నెల 6వ తేదీన కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారని టీఎంసీ సెక్రటరీ జనరల్ పార్థ చటర్జీ మీడియాకు తెలిపారు.అంతకుముందు జరిగిన సమావేశంలో కొత్తగా ఎన్నికైన టీఎంసీ ఎమ్మెల్యేలు మమతా బెనర్జీని శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ..2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఉమ్మడిగా ఎదుర్కొంటామని తెలిపారు. దీనిపై అందరూ కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ప్రస్తుతానికైతే కోవిడ్ సంక్షోభంపై పోరాటమే ప్రథమ లక్ష్యమని పేర్కొన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన తనకు సంప్రదాయం ప్రకారం ప్రధాని మోదీ నుంచి ఫోన్ కాల్ రాలేదన్నారు. ‘ఇలాంటి సందర్భాల్లో ప్రధానమంత్రి ఫోన్ చేయకపోవడం ఇదే మొదటిసారి. అయినా సరే, ఆయన బిజీగా ఉండి ఉండవచ్చు. ఈ విషయాన్ని నేను పట్టించుకోను’అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర శాసనసభలోని 294 స్థానాలకు గాను 292 సీట్లకు ఎన్నికలు జరగ్గా ఇందులో టీఎంసీ 213 స్థానాలు, బీజేపీ 77 సీట్లు గెలుచుకున్నాయి. ప్రాణభయంతోనే రిటర్నింగ్ ఆఫీసర్ రీకౌంటింగ్ పెట్టలేదు నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గ ఫలితాలు వచ్చాక రీకౌంటింగ్ జరపాల్సిందేనని డిమాండ్లు వచ్చినప్పటికీ అక్కడి రిటర్నింగ్ అధికారి అందుకు ఒప్పుకోకపోవడానికి గల కారణాలు ఇవేనంటూ మమత కొన్ని విషయాలు చెప్పారు. ‘‘రీకౌంటింగ్ జరపండి అంటూ ఒకవేళ తాను ఆదేశిస్తే తీవ్రమైన పరిణామాలను తాను ఎదుర్కోవాల్సి రావచ్చు. తీవ్ర ‘ఒత్తిడి’కారణంగా ఒకవేళ ఆత్మహత్య చేసుకుని తనువు చాలిస్తానేమో’’అని రిటర్నింగ్ అధికారి తీవ్ర ఆందోళనకు గురైనట్లు మమత మీడియా సమావేశంలో చెప్పారు. అందుకు సాక్ష్యంగా మమత ఒక ఎస్ఎంఎస్ను మీడియాకు చూపించారు. రిటర్నింగ్ అధికారి ఆ ఎస్ఎంఎస్ను చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌కు పంపారని మమత చెప్పారు. ‘ముందుగా వెల్లడైన ఫలితాల ప్రకటన కేంద్ర ఎన్నికల సంఘం ఎలా మారుస్తుంది? ఈ అంశంలో మేం కోర్టుకు వెళ్తాం. నాలుగుగంటలపాటు సర్వర్ డౌన్ ఎందుకైంది? ప్రజాతీర్పును మేం గౌరవిస్తాం. కానీ ఒక అసెంబ్లీ స్థానంలోనే అవకతవకలు జరిగాయి. వాస్తవాలు మాకు తెలియాలి. రాష్ట్రంలో పలుచోట్ల హింసాత్మక ఘటనలు జరిగినట్లు వార్తలొచ్చాయి. టీఎంసీ కార్యకర్తలంతా ప్రశాంతంగా ఉండాలి’ అని మమత మీడియా సమావేశంలో అన్నారు. -
ప్రమాణస్వీకారోత్సవానికి ముహూర్తం ఫిక్స్ చేసిన దీదీ
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ నందిగ్రామ్‌లో ఓడిపోయినప్పటికి తానే ముఖ్యమంత్రినని ప్రకటించారు. ప్రమాణస్వీకారోత్సవానికి ముహుర్తం కూడా ఫిక్స్ చేశారు. ఈ నెల 5న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు దీదీ ప్రకటించారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఏడు గంటలకు గవర్నర్‌ను కలవనున్నారు. పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 292 నియోజక వర్గాలకు ఎన్నికలు నిర్వహించగా.. ఏకంగా 213 సీట్లను కైవసం చేసుకుంది. 77 సీట్లతో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. చదవండి: నందిగ్రామ్ ఫలితంపై కోర్టును ఆశ్రయిస్తాను: దీదీ -
నందిగ్రామ్ ఫలితంపై కోర్టును ఆశ్రయిస్తా: దీదీ
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ఎన్నికల ఫలితాల అనంతరం మమతా బెనర్జీ తొలిసారి మీడియా సమావేశం నిర్వహించారు. విజయం అనంతరం దీదీ హింసాత్మక చర్యలకు దిగారంటూ.. బీజేపీ చేస్తోన్న ఆరోపణలని ఆమె ఖండించారు. కాషాయపార్టీ ప్రచారం చేస్తోన్న ఫోటోలు పాతవన్నారు. నందిగ్రామ్ ఫలితంపై దీదీ స్పందించారు. కౌంటింగ్‌లో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించిన దీదీ.. దీనిపై కోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు. జర్నలిస్ట్‌లను కోవిడ్ వారియర్స్‌గా ప్రకటించారు దీదీ. ఈ సందర్భంగా దీదీ మాట్లాడుతూ.. ‘‘మనం విజయం సాధించాం. ఇది బెంగాల్ ప్రజల విజయం. అయితే జనాలకు నాదొక విన్నపం. మనం శాంతియుతంగా ఉందాం. ఎన్నికల వేళ బీజేపీ, కేంద్ర బలగాలు మనలను చాలా ఇబ్బందులకు గురి చేశాయి. కానీ ఇప్పటికి కూడా మనం హింసకు పాల్పడవద్దు. మీరు ప్రశాంతంగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు ఏమైనా ఫిర్యాదులు ఉంటే, పోలీసులకు నివేదించండి. వారిలో కొందరు బీజేపీ కోసం పనిచేసి ఉండవచ్చు. దాని గురించి తర్వాత ఆలోచిస్తాను. ఈ రోజు రాత్రి 7 గంటలకు గవర్నర్‌ను కలవనున్నాను’’ అన్నారు దీదీ. నందిగ్రామ్ ఓట్ల లెక్కింపుపై దీదీ సందేహాలు వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ.. ‘‘4 గంటలపాటు సర్వర్‌లో సమస్య ఉందని ఈసీ చెప్పింది. నేను గెలిచినట్లు తెలిసి గవర్నర్ అభినందనలు కూడా తెలిపారు.రీకౌంటింగ్‌కు అనుమతి ఇవ్వొద్దని ఆర్వోను బెదిరించారు. రీ కౌంటింగ్ నిర్వహిస్తే ప్రాణాపాయం ఉందని ఆర్వో అన్నట్లు తెలిసింది.ఆర్వో రాసిన లేఖ విషయం ఒకరు నాకు ఎస్ఎంఎస్ పంపారు. అండతోనే సువేంద్ గెలిచారు’’ అని మమత ఆరోపించారు. చదవండి: గెలవలేదుకానీ.. గణనీయంగా పుంజుకున్న బీజేపీ -
ఎగ్జిట్ పోల్స్‌కు భిన్నంగా ఎన్నికల ఫలితాలు
-
ముచ్చటగా మూడోసారి: గవర్నరుతో భేటీ కానున్న మమత
కోల్‌కత: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నూతన ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ మేరకు పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ శరవేగంగా కదులుతున్నారు. కోల్‌కతాలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ నాయకులతో ఆమె కీలక సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం సీఎం మమతా బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌ఖర్‌తో రాత్రి 7 గంటలకు భేటీ కానున్నారు. ఒకప్పుడు బెంగాల్లో కమ్యూనిస్ట్ కంచు కోటను బద్దలుకొట్టిన మమత మోదీ-షా ద్వయాన్ని కూడాఅంతే ధీటుగా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ‘దీదీ ఓ దీదీ నీతో పాటు నీ పార్టీని కూడా బెంగాల్ ప్రజలు సాగనంపుతారం’ టూ ఎద్దేవా చేసిన ప్రధాని మోదీని తిరుగులేని దెబ్బ కొట్టారు. 2016 కంటే కూడా ఎక్కువ స్థానాలను సొంతం చేసుకున్నారు. 2021 ఎన్నికల్లో మమతా నేతృత్వంలోని టీఎంసీ పార్టీ రాష్ట్రంలో పూర్తి మెజారిటీ దక్కించుకున్న సంగతి తెలిసిందే. సస్పెన్స్ థ్రిల్లర్‌గా సాగిన నందిగ్రామ్ ఓటమిని లైట్ తీసుకున్న ఆమె ముచ్చటగా మూడోసారి అధికార పీఠం ఎక్క బోతున్నారు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 164(4)ప్రకారం ఆమె సీఎం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరోవైపు నందీగ్రామ్‌లో ప్రత్యర్థి సువేందు అధికారి విజయాన్ని మమతా కోర్టులో సవాల్ చేయనున్నట్టు తెలుస్తోంది. కాగా టీఎంసీ అద్భుత విజయంతొ రియల్ ఫైటర్ మమతా బెనర్జీపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఒంటికాలితో విజయాన్ని అందుకున్న బెంగాల్ బెబ్బులి, కలకత్తా కాళి, అంటూ నెటిజన్లు ఆమెను సూపర్ స్టార్‌ను చేశారు. ఈ సందర్భంగా 1980 నాటి మమత ఫొటో ఒకటి తెగ వైరల్ అవుతోంది. చదవండి: మోదీకి షాకిచ్చిన దీదీ: వైరలవుతున్న మీమ్స్ Mamata Banerjee In 1980s pic.twitter.com/tM36UhIrwG — indianhistorypics (@IndiaHistorypic) May 2, 2021 -
Bengal Results: కాంగ్రెస్‌కు ఘోర పరాభవం
కోల్‌కతా: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలతో కలిసి కూటమిగా పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీకి ఊహించని పరాభవం ఎదురయ్యింది. తృణమూల్ ప్రభంజనంలో కాంగ్రెస్ కొట్టుకుపోయింది. ఒక్క స్థానం కూడా దక్కించుకోలేకపోయింది. బెంగాల్లో 2016 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో 44 సీట్లు గెలుచుకొని, ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిన కాంగ్రెస్ నేడు సున్నాకు పరిమితం కావడాన్ని ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. స్వాతంత్య్రం వచ్చాక దాదాపు 3 దశాబ్దాలు బెంగాల్‌ను ఏలిన కాంగ్రెస్ క్రమంగా తన పట్టును కోల్పోయింది. 1970వ దశకంలో కమ్యూనిస్టుల రంగ ప్రవేశంతో ఓట్లు, సీట్లు తగ్గడంతో ప్రతిపక్షంగానే మిగిలిపోవాల్సి వచ్చింది. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 42 స్థానాలు గెలుచుకుంది. 9.09 శాతం ఓట్లు సాధించింది. 2016లో తన బలాన్ని కొంత మెరుగుపర్చుకుంది. 44 సీట్లతో 12.25 శాతం ఓట్లు సొంతం చేసుకుంది. ఇప్పుడు దారుణ పరాజయం మూటగట్టుకుంది. కేవలం 3.02 శాతం ఓట్లే కాంగ్రెస్‌కు పడ్డాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 4 సీట్లు, 9.58% ఓట్లతో ఆశలు పెరిగినా.. 2019లో 2 ఎంపీ సీట్లే లభించాయి. కాంగ్రెస్ ఓట్లు 5.67 శాతానికి పడిపోయాయి. చదవండి: Bengal Results: మరీ దారుణం.. ఒక్కచోటా గెలవని కమ్యూనిస్టులు -
మమతకు జై కొట్టిన ‘కాంగ్రెస్’ జిల్లాలు
కోల్‌కతా: కాంగ్రెస్ కుంచుకోటలుగా ఉన్న ముస్లిం ఆధిక్య జిల్లాలైన మాల్దా, ముర్షీదాబాద్‌లు ఈసారి తృణమూల్‌కు జై కొట్టాయి. ఫలితంగా మమతా బెనర్జీ అద్వితీయ విజయం సాధ్యమైంది. ఈ రెండు జిల్లాల్లో టీఎంసీకి పెద్దగా పట్టులేదు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో మాల్దా జిలాల్లోని 12 సీట్లలో టీఎంసీ ఒక్క సీటూ గెలువలేదు. ముర్షీదాబాద్‌లోని 22 స్థానాల్లో కేవలం నాలుగు మాత్రమే గెలిచింది. ఈ రెండు జిల్లాల్లోని 34 స్థానాల్లో కాంగ్రెస్ ఏకంగా 21 స్థానాల్లో (మాల్దాలో 7, ముర్షీదాబాద్‌లో– 14) నెగ్గింది. 2011 ఎన్నికల్లోనూ ఈ ప్రాంతంలో కాంగ్రెసే విజయ ఢంకా మోగించింది. 2021 ఎన్నికల నాటికి పరిస్థితి తారుమారైంది. ఈ ప్రాంతంలో అనూహ్యంగా తృణమూల్ పుంజుకుంది. రెండు జిల్లాల్లోని 32 స్థానాల్లో 24 సీట్లలో టీఎంసీ విజయం సాధించింది. పోటీలో ఉన్న వారిలో ఇద్దరు అభ్యర్థులు మరణించడంతో శంషేర్‌గంజ్, జంగీపూర్ స్థానాల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. 8 సీట్లలో విజయం సాధించి బీజేపీ కూడా ఈ ప్రాంతంలో గణనీయ స్థాయిలో బలపడింది. ముస్లిం జనాభా మెజారిటీగా ఉన్న ఈ ప్రాంతంలో కాంగ్రెస్, లెఫ్ట్, ఐఎస్ఎఫ్ కూటమి ఈ ఎన్నికల్లో కనీసం ఒక్క స్థానంలోనూ విజయం సాధించకపోవడం గమనార్హం. మార్పునకు కారణమేంటి? ఈ రెండు ముస్లిం ఆధిపత్య జిల్లాలు. మాల్దాలో 51% జనాభా, ముర్షీదాబాద్‌లో 66% జనాభా ముస్లింలే. చాన్నాళ్లుగా వీరు కాంగ్రెస్‌కు గట్టి మద్దతుదారులుగా ఉన్నారు. కానీ, ఈ ఎన్నికల్లో, మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ముస్లింలు అత్యంత వ్యూహాత్మకంగా ఓట్లు వేసినట్లు స్పష్టమవుతోంది. తృణమూల్, బీజేపీ, కాంగ్రెస్ కూటమిల త్రిముఖ పోరులో, బీజేపీ వ్యతిరేక పార్టీల మధ్య తమ ఓట్లు చీలితే, అది అంతిమంగా బీజేపీకి లాభిస్తుందని వారు గుర్తించారు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ నార్త్ మాల్దా స్థానంలో చోటు చేసుకున్న త్రిముఖ పోరు వల్ల బీజేపీ లాభపడిన విషయాన్ని వారు మర్చిపోలేదు. దాంతో, కీలకమైన ఈ ఎన్నికల్లో ఆ తప్పు చేయవద్దని, తృణమూల్, కాంగ్రెస్‌ల మధ్య తమ ఓట్లు చీలకూడదని నిర్ణయించుకున్నారు. మూకుమ్మడిగా తృణమూల్‌కు మద్దతిచ్చారు. మరోవైపు, కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదిత, వివాదాస్పద ఎన్నార్సీ, సీఏఏలను మమత గట్టిగా వ్యతిరేకించడం ముస్లింలకు ఆమెపై విశ్వాసం పెరగడానికి కారణమైంది. బీజేపీ గెలిస్తే సీఏఏ, ఎన్నార్సీలను అమలు చేస్తారన్న భయం కూడా ముస్లింలను మమతకు దగ్గర చేసింది. బీజేపీ గెలుపును అడ్డుకునేలా, ఈ రెండు జిల్లాల్లో ముస్లింల వ్యూహాత్మక ఓటింగ్ సరళి తృణమూల్ ఘనవిజయానికి బాటలు వేసింది. -
Nandigram: నందిగ్రామ్.. హై టెన్షన్
కోల్‌కతా: తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీ తొలిసారి బరిలో నిలిచిన పశ్చి మ బెంగాల్‌లోని నందిగ్రామ్ నియోజకవర్గ ఫలితాలు నరాలు తెగే ఉత్కంఠత రేపాయి. కౌంటింగ్ కొనసాగుతున్న కొద్దీ మమతా బెనర్జీ, బీజేపీ నేత సువేంధు అధికారి మధ్య క్షణ క్షణం మారిపోతున్న ఓట్ల మెజారిటీ... మొత్తం రాష్ట్ర ఎన్నికల ఘట్టంలోనే అత్యంత ప్రధానమైనదిగా నిలిచింది. ఇద్దరు ప్రధాన పార్టీల ప్రత్యర్థుల మధ్య అటూ ఇటూ దోబూచులాడిన మెజారిటీ.. చివరకు సువేంధు అధికారిని వరించింది. మమతా బెనర్జీపై స్వల్ప ఆధిక్యంతో గెలిచినట్లు ఎన్నికల సంఘం ఎట్టకేలకు ప్రకటించింది. అయితే, నందిగ్రామ్ ఫలితాలపై తాను కోర్టుకు వెళ్తానని మమతా ప్రకటించారు. అంతకుముందు ఆదివారం ఉదయం కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమవగా కొద్దిసేపటికే సువేంధు మమత కంటే ఆధిక్యంలోకి వచ్చారు.ఆ తర్వాత సువేంధు మెజారిటీ ఏకంగా ఎనిమిది వేల దాకా వెళ్లింది. మధ్యాహ్నందాకా సువేంధుదే పైచేయి. మధ్యాహ్నం నుంచి నెమ్మదిగా పుంజుకుని మమత ఆధిక్యంలోకి వచ్చారు. ఆ తర్వాత మళ్లీ ఆధిక్యత మరొకరి చెంతకు చేరింది. ఒకానొక దశలో సువేంధు కేవలం ఆరు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఓట్ల లెక్కింపులో ప్రతీ రౌండ్లో మెజారిటీ సువేంధు, మమత మధ్య మారుతూ వచ్చింది. సువేంధు 1,200 ఓట్ల మెజారిటీలో గెలిచారని వార్తలు రాగా, ఓట్ల లెక్కింపు కొనసాగుతోందని ఎన్నికల సంఘం తెలిపింది. ఆ తర్వాత కొద్దిసేపటికే 1,956 ఓట్ల ఆధిక్యంతో సువేంధు అధికారి గెలిచారని ఎన్నికల సంఘం ప్రకటించింది. త్యాగాలు తప్పవు.. ఈసీ ప్రకటనపై మమతా బెనర్జీ వెంటనే స్పందించారు. ‘‘నందిగ్రామ్‌లో ఓటమిని అంగీకరిస్తున్నాను. మరేం ఫరవాలేదు. అయితే, నందిగ్రామ్‌లో అక్రమాలు జరిగాయని విన్నాను. దీనిపై కోర్టుకు వెళతాను. మనం మొత్తం రాష్ట్రాన్నే గెలిచాం. ఇంతటి ఘన విజయం సాధించినపుడు ‘నందిగ్రామ్’లో ఓటమిలాంటి త్యాగాలు తప్పవు’’ అని ఫలితాల అనంతరం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. నందిగ్రామ్‌లో రీకౌంటింగ్ జరపాలని ఈసీని టీఎంసీ కోరగా అందుకు ఈసీ నిరాకరించింది. -
West Bengal Election Result 2021: దీదీ హ్యాట్రిక్!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 292 నియోజక వర్గాలకు ఎన్నికలు నిర్వహించగా.. ఏకంగా 213 సీట్లను కైవసం చేసుకుంది. 77 సీట్లతో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోటీ హోరాహోరీగా ఉంటుందని భావించినా.. ఫలితాలు ఏకపక్షంగానే వెలువడ్డాయి. వామపక్ష కూటమి, కాంగ్రెస్ అయితే అత్యంత దారుణంగా ఒక్క సీటూ సాధించలేకపోయాయి. రాష్ట్రీయ సెక్యులర్ మజ్లిస్ పార్టీ ఒక సీటు గెలుచుకోగా.. ఒక స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. మొత్తంగా 294 నియోజకవర్గాలు ఉన్న పశ్చిమ బెంగాల్లో 292 సీట్లకు ఎన్నికలు జరిగాయి. మిగతా రెండు చోట్ల పోటీలో ఉన్న అభ్యర్థులు కరోనాతో మరణించడంతో ఎన్నికలు నిర్వహించలేదు. ఈ లెక్కన మెజారిటీ కోసం 147 సీట్లు అవసరం కాగా.. తృణమూల్ 213 సీట్లను గెలుచుకుంది. ‘ఈ విజయం బెంగాలీ ప్రజల కోసం.. ఇది బెంగాలీల విజయం’ అని మమతా బెనర్జీ ప్రకటించారు. టీఎంసీ ఘన విజయం సాధించినా.. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి విజయోత్సవాలు నిర్వహించొద్దని పార్టీ శ్రేణులను ఆదేశించారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా.. 2019 సాధారణ ఎలక్షన్లలో బీజేపీ గెలుచుకున్న 18 ఎంపీ సీట్ల పరిధిలో 120 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈసారి అంతకు మించిన ఫలితం సాధించాలని, బెంగాల్లో అధికారం దక్కించుకోవాలని బీజేపీ భావించింది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విస్తృతంగా ప్రచారం చేశారు. 200 సీట్లు సాధించి తీరుతామన్నారు. కానీ బీజేపీ 77 అసెంబ్లీ సీట్లకే పరిమితమైంది. చదవండి: (తొలి నుంచీ దూకుడే.. వెనకడుగు తెలియని బెబ్బులి మమత) ఏది లాభం.. దేనితో నష్టం? బెంగాల్ ఎన్నికల ప్రచారం వాడీవేడిగా కొనసాగింది. బీజేపీ మోడీ, అమిత్‌షా సహా చాలా మంది కేంద్ర మంత్రులు, పెద్ద సంఖ్యలో సీనియర్ నేతలను రంగంలోకి దింపింది. తృణమూల్ సర్కారు అవినీతిని గట్టిగా జనంలోకి తీసుకెళ్లారు. మరోవైపు తృణమూల్ నుంచి కీలక నేతలు వెళ్లిపోవడంతో మమతా బెనర్జీ అంతా తానై ప్రచారం నిర్వహించారు. బెంగాలీల సంస్కృతి, సెంటిమెంట్‌పై ప్రధానంగా ఆధారపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రజల ముంగిటికి తెస్తానని హామీ ఇచ్చారు. ►బయటివారు బెంగాలీలపై ఆధిపత్యం చెలాయించడానికి వస్తున్నారని, అది సాగనివ్వొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇది ఓటర్లపై బాగా ప్రభావం చూపించింది. బీజేపీ తరఫున ప్రచారం చేసినవారిలో చాలా వరకు హిందీ రాష్ట్రాల వారే ఉండటం, హిందీలో ప్రసంగించడంతో వారంతా బయటి వారన్న మమత నినాదం జనంలోకి వెళ్లింది. ►బెంగాల్ సంస్కృతిలో మహిళలకు సామాజిక పరంగా, ఆర్థిక పరంగా ప్రాధాన్యత ఉంటుంది. కానీ ప్రధాని మోదీ తన ఎన్నికల ప్రసంగాల్లో వ్యంగ్యంగా మమతా బెనర్జీని ఉద్దేశించి ‘దీదీ.. ఓ.. దీదీ’ అంటూ మాట్లాడటం వ్యతిరేక ప్రభావం చూపిందని విశ్లేషకులు అంటున్నారు. ►ఎన్నికల చివరి మూడు దశల సమయంలో దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతూ వచ్చాయి. ఇదంతా ప్రధాని మోదీ వైఫల్యమేనంటూ మమత విరుచుకుపడ్డారు. బెంగాల్లో కరోనా కేసులు పెరగడానికి బీజేపీ బయటి రాష్ట్రాల నుంచి తరలించినవారే కారణమని ఆరోపించారు. దీంతో బీజేపీ శ్రేణులన్నీ ఒక్కసారిగా డిఫెన్స్‌లో పడిపోయాయి. అది తృణమూల్‌కు కలిసి వచ్చింది. చదవండి: (గెలవలేదుకానీ.. గణనీయంగా పుంజుకున్న బీజేపీ) బాబుల్ సుప్రియో, లాకెట్ చటర్జీ ఓటమి కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో(50) పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో లోటీగంజ్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీకి దిగారు. తృణమూల్ అభ్యర్థి అరూప్ బిశ్వాస్ చేతిలో ఓడిపోయారు. అలాగే బెంగాలీ సినీ నటి, బీజేపీ ఎంపీ లాకెట్ చటర్జీ(46) అసెంబ్లీ ఎన్నికల్లో చిన్సురా స్థానం నుంచి పోటీ చేసి, ఓటమి చవిచూశారు. ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి అసిత్ మజుందార్ (తపన్) విజయం సాధించారు. -
తొలి నుంచీ దూకుడే.. వెనకడుగు తెలియని బెబ్బులి మమత
ఆమె దీదీ.. అందరికీ అక్క.. పోరాటాల నుంచే ఎదిగి, పోరాటమే ఊపిరిగా బతికి, ఇప్పుడూ పోరాడి గెలిచి నిలిచిన బెంగాల్ బెబ్బులి మమతా బెనర్జీ. బెంగాల్‌ను అప్రతిహతంగా ఏలిన కమ్యూనిస్టులను మట్టికరిపించినా.. ఇప్పుడు బీజేపీ అన్ని రకాల అస్త్రాలతో విరుచుకుపడినా, నమ్మకస్తులంతా వదిలేసి వెళ్లిపోయినా.. ఒంటరిగా పోరాడిన ధీర వనిత ఆమె. ఇప్పుడు కూడా ఎదురుదెబ్బలన్నింటినీ ఓర్చుకుంటూ పశ్చిమ బెంగాల్‌పై మళ్లీ తన పట్టును నిలుపుకొని హ్యాట్రిక్ కొట్టారు. పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 294 సీట్లకుగాను 213 సీట్లతో ఘన విజయం సాధించారు. కోల్‌కతా: ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినా అన్నింటికన్నా ఎక్కువ ఆసక్తి నెలకొన్నది పశ్చిమ బెంగాల్‌పైనే.. అందరూ ఎదురుచూసింది కూడా ఆ రాష్ట్రంలో ఫలితాలు ఎలా ఉంటాయన్నదానిపైనే.. ఎలాగైనా బెంగాల్లో పాగా వేయాలన్న లక్ష్యంతో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాల విస్తృత ప్రచారం, ఫిరాయింపులు, కేసులు సహా అన్ని అస్త్రాలతో రంగంలోకి దిగిన బీజేపీ ఒకవైపు.. ఒంటరిగా నిలబడిన మమతా బెనర్జీ మరోవైపు హోరాహోరీ పోరాడటమే ఈ ఆసక్తికి కారణం. బీజేపీ బలగం మొత్తాన్నీ దింపినా..: ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సహా పలువురు కేంద్ర మంత్రులు, ఎన్నికల వ్యూహకర్తలు, సోషల్ మీడియా వింగ్ సహా బీజేపీ తమ వద్ద ఉన్న అన్ని అస్త్రాలను పశ్చిమ బెంగాల్లో మోహరించింది. టీఎంసీ నుంచి 40 మందికిపైగా ఎమ్మెల్యేలు, ఎంపీలను పార్టీలో చేర్చుకుంది. ప్రధాని మోదీ అయితే ఇంతకుముందు ఏ రాష్ట్రంలోనూ లేనట్టుగా ఏకంగా 20 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. అమిత్‌షా 50 సభల్లో, పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా 40 సభల్లో పాల్గొన్నారు. యోగి ఆదిత్యనాథ్, స్మృతి ఇరానీ, పీయూష్ గోయల్ వంటి సీనియర్లందరూ విస్తృతంగా ప్రచారం చేశారు. ‘జైశ్రీరాం అంటే మమతా బెనర్జీకి అలర్జీ..’అంటూ హిందూ ఓట్లను సమీకరించే ప్రయత్నం చేశారు. కానీ మమతా బెనర్జీ దీటుగా ఎదుర్కొన్నారు. ‘బెంగాలీల ఆత్మగౌర వాన్ని దెబ్బతీసేందుకు బయటివారు (మోదీ, అమిత్‌షా, యోగి.. వంటి నేతలు) ప్రయత్నిస్తున్నారు. బెంగాల్ కీ బేటీ కావాలా, బయటివారు కావాలా?’ అంటూ బెంగాలీల్లో సెంటిమెంట్ రగిల్చారు. బీజేపీ వాళ్లు జైశ్రీరాం అంటే.. ఆమె బెంగాలీల ఇష్టదైవం ‘జై కాళీమాత’అని నినదించారు. ఎలక్షన్ల సమయంలోనే మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీ, టీఎంసీ సీనియర్ నేత మదన్ మిత్రా తదితరులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఐటీ, ఈడీ దాడులు జరిగాయి. ఇది టీఎంసీ కేడర్‌లో నిరుత్సాహం నింపుతుందని బీజేపీ భావించినా.. మమత ఈ దాడులను తమకు అనుకూలంగా మార్చుకోగలిగారు. చదవండి: (గెలవలేదుకానీ.. గణనీయంగా పుంజుకున్న బీజేపీ) రిస్క్ అని తెలిసీ ఎన్నికల ముందే మమతను దెబ్బకొట్టడానికి బీజేపీ అన్నిరకాల ప్రయత్నాలూ చేసింది. మమతకు కుడిభుజం అయిన సువేందు అధికారి సహా చాలా మంది బీజేపీలో చేరారు. వారంతా కూడా ఈసారి తృణమూల్ ఓడిపోవడం ఖాయమని వ్యాఖ్యలు చేశారు. సువేందు అధికారి అయితే.. ‘దమ్ముంటే మమతా బెనర్జీ నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలి. ఆమెను 50 వేల ఓట్ల తేడాతో ఓడించకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా’అని సవాల్ చేశాడు. ఫిరాయింపులు ఓవైపు, బీజేపీ దూకుడు మరోవైపు టీఎంసీ శ్రేణుల్లో ఆందోళన రేపితే.. పార్టీ కేడర్‌లో ఉత్తేజం కలిగించేందుకు మమత రిస్క్ తీసుకుని మరీ నందిగ్రామ్ నుంచి పోటీకి సై అన్నారు. వాస్తవానికి ఆ నియోజకవర్గంలో తొలి నుంచీ సువేందు అధికారి కుటుంబానిదే ఆధిపత్యం, దానికితోడు బీజేపీ బలం, మోదీ, అమిత్‌షాల అండదండలు అన్నీ కలిసివచ్చాయి. హోరాహోరీ పోటీలో మమత వెనుకబడ్డారు. మమతా బెనర్జీ సొంత నియోజకవర్గం కోల్‌కతా నగరంలోని భవానీపూర్ సీటు తృణమూల్‌కు కంచుకోట. అక్కడ మమతకు బదులుగా రంగంలోకి దిగిన పార్టీ అభ్యర్థి 22 వేల ఓట్లకుపైగా మెజార్టీతో గెలిచారు. అలా అత్యంత సులువుగా గెలవగలిగే చోటును వదిలి మమత ధైర్యంగా నందిగ్రామ్‌లో పోటీకి దిగారు. వరుసగా మూడోసారి.. పశ్చిమ బెంగాల్లో సీపీఎం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణకు వ్యతిరేకంగా పోరాడి మమతా బెనర్జీ ప్రజల్లో పట్టు సాధించారు. ‘మా.. మాటీ, మానుష్’నినాదంతో జనంలోకి వెళ్లారు. బెంగాల్లో 34 ఏళ్లు అప్రతిహతంగా సాగిన సీపీఎం పాలనకు చెక్ పెడుతూ.. 2011లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 294 స్థానాలకుగాను 184 సీట్ల (39% ఓట్లు) తో ఘన విజయం సాధించారు. 2016 ఎలక్షన్ల నాటికి పార్టీని బలోపేతం చేసి, ప్రజల్లో మరింత పట్టు సాధించారు. ఆ ఎన్నికల్లో ఏకంగా 44.9 శాతం ఓట్లతో 211 సీట్లు గెలుచుకున్నారు. ఈ రెండు అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమి గెలుచుకున్నది 3 సీట్ల చొప్పున మాత్రమే. ఆ తర్వాత బెంగాల్లో వామపక్షాలు, కాంగ్రెస్ బాగా బలహీనపడి.. వాటి స్థానాన్ని బీజేపీ ఆక్రమించుకుంది. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో బీజేపీ కూటమి 40 శాతం ఓట్లతో 18 లోక్‌సభ సీట్లు గెలుచుకుంది. దీనిని అసెంబ్లీ సీట్ల లెక్కన చూస్తే.. సుమారు 120 స్థానాల్లో బీజేపీ పాగా వేసినట్టు. ఆ ఫలితాలతో ఆశలు పెంచుకున్న బీజేపీ బెంగాల్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కానీ ఆ ఆశలపై మమతా బెనర్జీ నీళ్లు చల్లారు. బీజేపీ ఎంతగా ప్రయత్నించినా గతంలోకంటే మరిన్ని సీట్లు పెంచుకుని.. 213 చోట్లలో తృణమూల్ కాంగ్రెస్‌ను గెలిపించుకున్నారు. తొలి నుంచీ దూకుడే.. 1955 జనవరి 5న జన్మించిన మమతా బెనర్జీ తొలి నుంచీ దూకుడుగానే వ్యవహరిస్తుంటారు. 1975 సమయంలో కాంగ్రెస్‌లో చేరిన ఆమె పార్టీలో వేగంగా ఎదిగారు. 1984లో బెంగాల్‌లోని జాదవ్‌పూర్ లోక్‌సభ స్థానంలో తొలిసారి పోటీచేసి.. సీనియర్ కమ్యూనిస్ట్ నాయకుడు సోమనాథ్ చటర్జీపై విజయంతో సంచలనం సృష్టించారు. 1989లో ఓడిపోయినా.. 1991 మధ్యంతర ఎన్నికల్లో గెలిచి పీవీ నరసింహారావు కేబినెట్లో కేంద్ర మానవ వనరులు, యూత్, క్రీడా శాఖల సహాయ మంత్రిగా పనిచేశారు. 1996 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఎంపీగా గెలిచారు. అయితే కాంగ్రెస్ రాష్ట్ర నేతలతో విభేదాలు రావడంతో.. 1997లో ముకుల్ రాయ్‌తో కలిసి తృణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. మమతా బెనర్జీ 1998 డిసెంబర్లో మహిళా బిల్లుకు వ్యతిరేకంగా లోక్‌సభలో వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన చేస్తున్న సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ దుర్గా ప్రసాద్‌ను కాలర్ పట్టి వెనక్కి లాగేయడం సంచలనంగా నిలిచింది. తర్వాత మమత వరుసగా 1998, 1999, 2004, 2009 సాధారణ ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. 2000లో ఎన్డీయే ప్రభుత్వంలో రైల్వే శాఖకు తొలి మహిళా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2004లో యూపీఏ సర్కారులో బొగ్గు, గనుల శాఖ మంత్రిగా పనిచేశారు. 2005 నుంచి బెంగాల్లో ప్రభుత్వ భూసేకరణకు వ్యతిరేకంగా రైతుల తరఫున ఉద్యమం ప్రారంభించారు. సింగూరు, నందిగ్రామ్ పోరాటాలను ముందుండి నడిపారు. 2011లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసి.. బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2016లో, తాజాగా మరోసారి తృణమూల్‌ను గెలిపించుకుని హ్యాట్రిక్ కొట్టారు. -
గెలవలేదుకానీ.. గణనీయంగా పుంజుకున్న బీజేపీ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో బీజేపీకి ఆశించిన ఫలితం దక్కలేదు. రాష్ట్రంలో పాగా వేసేందుకు సర్వ శక్తులు ఒడ్డినప్పటికీ అధికార పీఠం లభించలేదు. 2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంతో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించాలన్న కాషాయ దళం ఆశలు నెరవేరలేదు. అయితే, రాష్ట్రంలో రాజకీయంగా పెద్దగా ఉనికే లేని స్థాయి నుంచి ప్రధాన ప్రతిపక్ష స్థాయికి చేరుకోవడాన్ని బీజేపీ విజయ ప్రస్థానంగానే చూడాల్సి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన స్థానాల సంఖ్య 3 మాత్రమే. ఆ పార్టీ సాధించిన ఓట్ల శాతం 10.16 మాత్రమే. 2019 లోక్‌సభ ఎన్నికల సమయానికి అసాధారణ స్థాయిలో కాషాయ దళం పుంజుకుంది. మోదీ హవా బెంగాల్లోనూ ప్రభావం చూపింది. ఆ ఎన్నికల్లో మొత్తం 42 లోక్‌సభ స్థానాలకు గానూ 18 సీట్లను బీజేపీ గెలుచుకుంది. 2016లో 3 అసెంబ్లీ సీట్లకే పరిమితమైన పార్టీ.. మూడేళ్లు తిరిగేనాటికి రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం చూపి లోక్‌సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలను సాధించగలిగింది. 40.7 శాతం ఓట్లతో 18 స్థానాల్లో గెలవగలిగింది. మోదీ హవాతో పాటు, బీజేపీ, ఆరెస్సెస్‌ల సోషల్ ఇంజినీరింగ్, క్షేత్రస్థాయి ప్రణాళిక, బూత్ స్థాయిలో కార్యకర్తల ఏర్పాటు, ఎన్నికల సంసిద్ధతలతో పాటు బీజేపీ వ్యతిరేక ఓటులో చీలిక కూడా అందుకు కారణాలుగా భావిస్తున్నారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో, అధికారంలోకి రావడానికి అవసరమైన సీట్లను గెల్చుకోలేనప్పటికీ.. మెరుగైన ఫలితాలనే బీజేపీ సాధించింది. సుమారు 37.11% ఓట్లతో 77 సీట్లను గెల్చుకుంది. రాష్ట్రంలో దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న లెఫ్ట్, కాంగ్రెస్‌లను పక్కకు నెట్టి ప్రధాన ప్రతిపక్ష హోదా సాధించింది. తృణమూల్ కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా నిలిచింది. -
ఓటర్లు చెబుతున్న గుణపాఠం
స్వోత్కర్షలు, భావోద్వేగాలు, ప్రచారపటాటోపాలు ఏ పార్టీనీ గద్దెనెక్కించలేవు సరిగదా... ప్రత్యర్థి పక్షం మెజారిటీని తగ్గించడం కూడా సాధ్యపడదని నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం నిరూపించాయి. తృణమూల్ కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు సాగిన పశ్చిమ బెంగాల్ గురించి ప్రత్యేకించి ప్రస్తావించుకోవాలి. ‘దీదీ...ఓ దీదీ’ అంటూ ప్రధాని నరేంద్రమోదీ వ్యంగ్యంగా సంబోధించిన తీరు జనం మెచ్చలేదని ఫలితాలు చెబుతున్నాయి. 294 స్థానాలున్న ఆ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోనూ గతంతో పోలిస్తే తృణమూల్ పరిస్థితి మెరుగైంది. అధికారంలోకి రావడం లాంఛనమే అన్నట్టు ప్రవర్తించిన బీజేపీ రెండంకెల సంఖ్యను దాటలేక చతికిలబడింది. తృణమూల్‌నుంచి ఆఖరి నిమిషంలో లంఘించి కాషాయ తీర్థం పుచ్చుకున్నవారిలో అత్యధికులను ఓటర్లు గంపగుత్తగా తిరస్కరించటం విశేషం. అవకాశవాదులను ఎక్కడైనా జనం మెచ్చరని మరోసారి నిరూపణ అయింది. బెంగాల్ వైఫల్యంతో దిగాలుగా వున్న బీజేపీకి నందిగ్రామ్‌లో మమత ఓడిపోవటం... గతంలో మూడు సీట్లున్న రాష్ట్రంలో ఇప్పుడు 75 సాధించటం కొంతలో కొంత ఊరట. కానీ 2019నాటి లోక్‌సభ ఎన్నికల్లో గెల్చుకున్న 18 స్థానాలను అసెంబ్లీ స్థానాలకు వర్తింపజేసి లెక్కేస్తే ఇప్పుడు సీట్లు తగ్గినట్టే భావించాలి. పాలకపక్షానికే తిరిగి పగ్గాలు అప్పగించినచోట ఆ పక్షానికి సారథిగా వున్నవారు పరాజయంపాలు కావటం ఊహించని పరిణామం. దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. నందిగ్రామ్ విజయం బీజేపీకి అంత సులభంగా దక్కలేదు. ట్వంటీ ట్వంటీ క్రికెట్ ఆటను తలదన్నేలా చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగింది. ఒక దశలో విజేత ఎవరన్న అయోమయం సాగింది. ఎట్టకేలకు 1,736 ఓట్ల మెజారిటీతో సువేందుకే నందిగ్రామ్ దక్కింది. వామపక్షాలది దయనీయమైన స్థితి. 2016లో గెల్చుకున్న 76 స్థానాల్లో లెఫ్ట్ ఫ్రంట్ కూటమికి ఇప్పుడు దక్కింది ఒక్కటే. ఇక నాలుగు దశాబ్దాలుగా పాటిస్తున్న సంప్రదాయాన్ని కాదని కేరళ ప్రజలు వరసగా రెండోసారి కూడా వామపక్ష ప్రజాతంత్ర ఫ్రంట్(ఎల్డీఎఫ్)కు అధికారాన్ని అప్పగించారు. అంతేకాదు...మునుపటితో పోలిస్తే మరో తొమ్మిది స్థానాలు అదనంగా ఇచ్చారు. కరోనాను ఎదుర్కొనడంలో, సంక్షేమ పథకాలు అమలు చేయడంలో అందరి ప్రశంసలూ పొందిన ముఖ్యమంత్రి పినరయి విజయన్‌దే ఈ విజయం. సెంటిమెంటు ప్రకారం ఎటూ తమదే అధికారమని భావించిన యూడీఎఫ్‌కు ఇది ఊహించని షాక్. అధికారం రాకున్నా బీజేపీకి మెరుగైన సంఖ్యలో సీట్లు లభించవచ్చని చాలామంది అంచనా వేశారు. తీరా గతంలో గెల్చుకున్న 8 స్థానాలూ కూడా బీజేపీ చేజార్చుకుంది. మెట్రో మ్యాన్ శ్రీధరన్‌ను సీఎం అభ్యర్థిగా ప్రచారం చేసినా ఏమాత్రం ఫలితం లేకపోగా ఆయనే ఓడిపోయారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్ పోటీచేసిన రెండుచోట్లా ఓడిపోయారు. శబరిమల వివాదంలో బీజేపీ మాదిరే జనం మనోభావాలను ఓట్ల రూపంలో మలుచుకోవడానికి కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. సిద్ధాంతాలకు నీళ్లొదిలి గెలవడానికి ఏం చేయడానికైనా సిద్ధపడితే జరిగేది ఇదే. నిరసనలతో అట్టుడికిన అస్సాంలో తిరిగి అధికారంలోకి రావడం, చిన్నదైనా పుదుచ్చేరిలో తన కూటమికి అధికారం దక్కడం బీజేపీకి పెద్ద ఊరట. అస్సాంలో తిరిగి బీజేపీకే అధికారం వస్తుందని సర్వేలు చెప్పినా, హంగ్ అసెంబ్లీ తప్పకపోవచ్చని పలువురు అనుకున్నారు. కాంగ్రెస్–ఏఐడీయూఎఫ్–బీపీఎఫ్ కూటమి పోలైన ఓట్లలో 42 శాతం తెచ్చుకుని ఎన్డీఏ కూటమికి దీటుగా నిలిచినా ఆమేరకు సీట్ల సంఖ్య పెరగలేదు. పెద్ద దిక్కులేని తమిళనాట సర్వేలు చెప్పినట్టు డీఎంకేకు అధికారం వచ్చినా అన్నాడీఎంకే కూటమి సైతం ఊహించని రీతిలో మెరుగైన పనితీరు చూపింది. అక్కడ సినీ గ్లామర్ కనుమరుగుకావడం గమనార్హం. కమల్‌హాసన్, కుష్బూ, శరత్‌కుమార్‌లు ఓటమిపాలయ్యారు. డీఎంకే రాజకీయాల్లో తండ్రిచాటు బిడ్డగా ‘వెయిటింగ్’లో వున్న స్టాలిన్ అయిదు దశాబ్దాల అనంతరం సీఎం కాబోతున్నారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో గతంలోకన్నా పోలింగ్ శాతం తగ్గినా వైఎస్సార్ కాంగ్రెస్ అధిక ఓట్లు గెల్చుకుని ప్రత్యర్థి పక్షాలను ఖంగుతినిపించింది. దేశం నలుమూలలా కరోనా మహమ్మారి స్వైరవిహారం చేస్తున్న దశలో ఈ ఎన్నికలు జరిగాయి. వీటికి రిఫరీగా వుండాల్సిన ఎన్నికల కమిషన్(ఈసీ) మొదలుకొని దాదాపు నేతలంతా ఆ సంగతిని గుర్తించనట్టే ప్రవర్తించారు. భారీ ర్యాలీలతో, బహిరంగసభలతో హోరెత్తించారు. వాటిని చానెళ్లలో చూస్తున్న వేరే రాష్ట్రాలవారు కూడా కరోనా గురించి నిపుణులు వ్యక్తం చేస్తున్నవి అనవసర భయాందోళనలేనని భావించడానికి వీరి బాధ్యతారహిత ప్రవర్తన దోహదపడింది. ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేనాటికి కరోనా తీవ్రత దేశంలో అంతగా లేకపోయివుండొచ్చు. అయితే చూడదల్చుకున్నవారికి ప్రపంచం నలుమూలలా ఏమవుతున్నదో కనబడుతూనే వుంది. ఆ పరిస్థితి ఇక్కడ కూడా తలెత్తవచ్చునేమోనన్న అనుమానం ఈసీ పెద్దలకు కలిగివుంటే నెలన్నర ఎన్నికల షెడ్యూల్ రూపొందించేవారు కాదు. షెడ్యూల్ ఇంకా సగం పూర్తికాకుండానే మన దేశంపై కరోనా పంజా విసిరింది. అప్పుడైనా మిగిలిన దశలను సవరిస్తే బాగుండేది. దాని సంగతలావుంచి కరోనా నేపథ్యంలో భిన్నమైన ప్రచార వేదికలను ప్రతిపాదించివుంటే ఈసీ ప్రతిష్ట పెరిగేది. ఏదేమైనా జనం సమస్యలనూ, వారి సంక్షేమాన్ని గాలికొదిలి మతాన్ని, ఇతర భావోద్వేగాలనూ రెచ్చగొడితే ఓట్లు రాలవని ఈ ఎన్నికల్లో ఓటర్లు నిరూపించారు. -
నందిగ్రాం ఫలితం రాలేదు: టీఎంసీ అధికారిక ట్వీట్
-
సూపర్ ఓవర్‌ని తలపిస్తున్న నందిగ్రామ్ కౌంటింగ్
కోల్‌కతా: నందిగ్రామ్ కౌంటింగ్ టీ20 సూపర్ ఓవర్‌ను తలపిస్తోంది. తొలుత మమత గెలిచారంటూ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ ప్రకటించింది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఇంకా కౌంటింగ్ కొనసాగుతుంది అంటూ వార్తలు వెలువడ్డాయి. 1,950 ఓట్లతో సువేందు గెలిచాడని జాతీయ మీడియా వెల్లడిచంచింది. దాంతో ప్రజల తీర్పు గౌరవిస్తానంటూ మమతా బెనర్జీ ప్రకటించారు. తాజాగా నందిగ్రామ్ ఫలితంపై ఈసీ మరోసారి స్పష్టత ఇచ్చింది. లెక్కించాల్సిన ఓట్లు ఇంకా ఉన్నాయి అని ఈసీ వర్గాలు ప్రకటించాయి. ఇంకా నందిగ్రాం ఫలితం ప్రకటించలేదు అని తెలిపాయి. నందిగ్రాం ఫలితం రాలేదు అని టీఎంసీ ట్వీట్ చేసింది. ఫలితం ప్రకటించవద్దంటూ టీఎంసీ, ఈసీని కోరింది. The counting process for Nandigram has not been completed. Please do not speculate. — All India Trinamool Congress (@AITCofficial) May 2, 2021 ఇక నందిగ్రామ్ ఫలితంపై ప్రారంభం నుంచి గందరగోళం నెలకొనే ఉంది. ఒకానొక దశలో సువేందు, దీదీ కంటే కేవలం ఆరు ఓట్లు వెనకబడినట్లు ఫలితాలు వచ్చాయి. ఆ తర్వాత కాసేపటికే 17వ రౌండ్ కౌంటింగ్‌లో మమత 1,200 ఓట్ల మెజారిటీతో విజయం సాధించినట్లు ఏఎన్‌పై ప్రకటించింది. కాసేపటి తర్వాత జాతీయ మీడియా దీదీ ఓడిపోయారంటూ వెల్లడించాయి. సువేందు 1,622 ఓట్ల మెజారిటీతో విజయం సాధించినట్లు ప్రకటించాయి. ఫలితం వెలువడిన వెంటనే దీదీ సైతం ఓటమిని అంగీకరిస్తున్నాను అన్నారు. ఓడిపోయినా తానే ముఖ్యమంత్రి అని ప్రకటించారు. ఆ తర్వాత కేవలం నిమిషాల వ్యవధిలోనే ఈసీ కౌంటింగ్ ఇంకా కొనసాగుతుందని ప్రకటించడం గమనార్హం. -
టీఎంసీని గెలిపించిన అంశాలు ఇవే..
కోల్‌కతా: ఎన్నికల కమిషన్ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ప్రకటించిన నాటి నుంచి దేశ వ్యాప్తంగా పశ్చిమ బెంగాల్‌పై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఎన్నడు లేని విధంగా ఈసారి రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు 8 దశల్లో నిర్వహించారు. ఇక బెంగాల్లో విజయం సాధించడం కోసం బీజేపీ అన్ని రకాలుగా కృషి చేసింది. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. బెంగాల్ ప్రజలు మరోసారి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కే పట్టం కట్టారు. కౌంటింగ్ కొనసాగుతున్నప్పటికి వరకు వచ్చిన ఫలితాల ఆధారంగా టీఎంసీ పశ్చిమ బెంగాల్లో హ్యాట్రిక్ విజయం దిశగా దూసుకుపోతుంది. మొత్తం 292 అసెంబ్లీ స్థానాల్లో 215 సీట్లలో టీఎంసీ ఆధిక్యంలో కొనసాగుతున్నట్లు ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాలు తెలుపుతున్నాయి. ఇక బీజేపీ 79 స్థానాల్లో ముందంజలో ఉంది. నందిగ్రామ్ రిజల్ట్‌పై ఉత్కంఠత కొనసాగుతుంది. బెంగాల్ టీఎంసీ విజయానికి దోహదం చేసిన అంశాలు ఇవే.. తక్కువ ఓటింగ్.. గతంతో పోల్చుకుంటే ఈ సారి బెంగాల్లో తక్కువ పోలింగ్ నమోదయ్యింది. కరోనాకు జడిసి చాలా మంది ఓటు వేయడానికి వెళ్లలేదు. తక్కువ పోలింగ్ నమోదైతే అధికార పార్టీకే లాభం జరుగుతుంది. బెంగాల్లో కూడా అదే జరిగింది. బీజేపీకి సీఎం అభ్యర్థి లేకపోవడం.. బెంగాల్లో బీజేపీ ఓటమి పాలవ్వడానికి ప్రధాన కారణం.. ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకపోవడమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో టీఎంసీ నేతలు భారీగా అవినీతికి పాల్పడినట్లు విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ, ముఖ్యమంత్రి అభ్యర్థిగా దీదీని బెంగాల్ ప్రజలు ఆమోదించారు. ఇక బీజేపీ ప్రచార తీరును పరిశీలిస్తే.. స్థానిక నేతల కన్నా ఎక్కువగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రచార బాధ్యతలు నిర్వహించారు. స్థానికులతో బలమైన సంబంధాలు కలిగి ఉండటంలో వీరు విఫలమయ్యారు. కలిసి వచ్చిన బయటి వ్యక్తి నినాదం.. ఎన్నికల ప్రచరాంలో ప్రధానంగా దీదీ ‘‘బయటి వ్యక్తులు’’ అనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగారు. మోదీ-అమిత్ షాల ద్వయాన్ని ‘బయటి వ్యక్తులు’ అంటూ ఆమె చేసిన ప్రచారం ఫలించింది. బెంగాలీ జాతీయవాదం, రాష్ట్ర సంస్కృతి ‘బయటివారికి’ అర్థం కాదని ప్రజలకు స్పష్టంగా చెప్పడంలో దీదీ విజయం సాధించారు. సంక్షేమ పథకాలు... ఎన్నికల వేళ దీదీ ఇచ్చిన హామీలు కూడా ఆమెకు బాగా కలసి వచ్చాయి. ముఖ్యంగా నగదు పథకాలు జనాలను ప్రబలంగా ఆకర్షించాయి. వీటిలో ప్రధానమైనవి మహిళల కోసం ప్రకటించిన- కన్యాశ్రీ, రూపశ్రీ పథకాలు వారిపై బాగా ప్రభావం చూపాయి. ఇవే టీఎంసీ గెలుపును సుగమం చేశాయి. కన్యాశ్రీ పథకం కింద, ఒక ఆడపిల్ల 8వ తరగతికి చేరుకున్న తర్వాత రూ .25 వేలు.. రూపాశ్రీ పథకం ద్వారా 18 ఏళ్లు నిండినప్పుడు అమ్మాయి కుటుంబానికి రూ .25 వేలు ఇస్తామని దీదీ హామీ ఇచ్చారు. ఇవే కాక ఉచిత బియ్యం, ఉచిత రేషన్ వంటి పథకాలు కూడా టీఎంసీ గెలుపులో ప్రధాన పాత్ర పోషించాయి. గ్రామీణ ప్రాంతాల్లో టీఎంసీ ‘కట్-మనీ’, దోపిడీపై తీవ్ర ఆగ్రహం ఎదుర్కొంటున్నప్పటికి ఈ హామీలు టీఎంసీ విజయానికి దోహదం చేశాయి. మమతకు మద్దతుగా సీపీఎం-కాంగ్రెస్ ఓటు బ్యాంకు.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 18 సీట్లు, 40 శాతం ఓట్లను దక్కించుకోవడంలో కీలక పాత్ర పోషించిన సీపీఎం-కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బెనర్జీ పక్షాన ఉన్నట్లు ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల సరళి తెలుపుతోంది. లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే.. ఈ సారి మమత బెనర్జీకి ఓటు షేర్ 6 శాతం పెరిగి 43 నుంచి 49 శాతానికి చేరింది. ఇక బీజేపీ విషయానికి వస్తే 40 శాతం నుంచి 37 శాతానికి పడిపోయింది. ఇంతకుముందు సీపీఎం-కాంగ్రెస్ కలయికపై విశ్వాసం ఉంచిన ముస్లింలు ఇప్పుడు దీదీకి తమ పూర్తి మద్దతు తెలిపారు. దీనికి ప్రధాన కారణం పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా ఆమె దూకుడుగా ప్రచారం చేయడమే అంటున్నారు విశ్లేషకులు. ఈ సారి దీదీ ముస్లిం ఓట్లను గణనీయంగా రాబట్టుకోగలిగారు. యాంటీ హిందూ రాజకీయాలు.. యాంటీ రాజకీయాలు బీజేపీకి కొంత లాభాలను తెచ్చినప్పటికి.. టీఎంసీకే అధికంగా మేలు చేశాయి. ఈ నినాదం బీజేపీ కొన్ని హిందూ ఓట్లను పొందడానికి సహాయపడింది. ముఖ్యంగా దక్షిణ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలలో దీని ప్రభావం బాగా ఉంది. అయతే ఇది బీజేపీ కంటే ఎక్కువగా మమతకే మేలు చేసింది. ముస్లింలు అందరూ టీఎంసీకే సామూహికంగా ఓటు వేయడానికి ఇది దారి తీసింది. -
నా తదుపరి పోరు దాని మీదనే: దీదీ
కోల్‌కతా: రసవత్తరంగా సాగిన నందిగ్రామ్ కౌంటింగ్‌లో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ విజయం సాధించారు. బీజేపీ నాయకుడు సువేందు అధికారిపై 1200 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు దీదీ. నందిగ్రామ్ ఫలితం అనంతరం మమత మీడియాతో మాట్లాడారు. ఇది బెంగాల్ ప్రజల విజయం అన్నారు. తనను గెలిపించిన బెంగాల్ ప్రజలకు దీదీ కృతజ్ఞతలు తెలిపారు. విజయం ముఖ్యం కాదు.. కరోనాను ఎదుర్కొవడమే ప్రధానం అన్నారు. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని సూచించారు. తన తదుపరి పోరాటం కోవిడ్ మీదనే అన్నారు దీదీ. ఇక నందిగ్రామ్ బరిలో మమత కేవలం 1,200 స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. ఇక పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ దూసుకుపోతుంది. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల ప్రకారం టీఎంసీ 215 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. బీజేపీ 74 చోట్ల ఆధిక్యంలో ఉంది. చదవండి: మమతా మ్యాజిక్: బీజేపీ ప్రధాన కార్యదర్శి స్పందన -
నందిగ్రామ్‌లో మమత బెనర్జీ గెలుపు
-
మమతా మ్యాజిక్: బీజేపీ ప్రధాన కార్యదర్శి స్పందన
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయం దిశగా దూసుకుపోతున్న నేపథ్యంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గియా స్పందించారు. ఈ విజయం పూర్తిగా మమతా బెనర్జీ వల్లే సాధ్యమైందని అన్నారు. దీనిపై తాము ఆత్మ పరిశీలన చేసుకుంటామని పేర్కొన్నారు. ప్రజలు దీదీకే పట్టం కట్టారంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఆమెనే సీఎం కావాలని కోరుకున్నారన్నారు. బెంగాల్ ఎన్నికల్లోతమ పార్టీ వైఖరి, వైఫ్యల్యం నేపథ్యంలో తప్పు ఎక్కడ జరిగిందో సమీక్షించుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఫలితాల తీరుపై ఆరా తీసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుంచి తనకు పిలుపు వచ్చిందని కైలాష్ తెలిపారు. అలాగే బీజీపీ ఎంపీలు బాబుల్ సుప్రియో, లాకెట్ ఛటర్జీ వెనుకంజలో ఉండటం చూసి తాను షాక్ అయ్యానని పేర్కొన్నారు. సంస్థాగత సమస్యలా, లేక ఇన్సైడర్, ఔట్‌సైడర్ చర్చ వల్లా అన్నది చూడాలి. కాగా రాష్ట్రంలోని 292 నియోజకవర్గాలలో 201 స్థానాల్లో అధిక్యాన్ని ప్రదర్శిస్తూ బెంగాల్లో మరోసారి పగ్గాలు చేపట్టేందుకు సన్నద్ధమవుతోంది. అటు బీజేపీ 82 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. మరోవైపు తీవ్ర ఉత్కంఠను రాజేసీన నందీగ్రామ్‌లో చివరికి మమత 1200 ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం విశేషం. చదవండి : మోదీకి షాకిచ్చిన దీదీ: వైరలవుతున్న మీమ్స్ వ్యూహకర్తగా తప్పుకుంటున్నా, విశ్రాంతి కావాలి: ప్రశాంత్ కిశోర్ -
మోదీజీ.. దీదీ గెలిస్తే.. మీరు ఓడినట్లే: సంజయ్ రౌత్
ముంబై: మే 2 తర్వాత మహరాష్ట్రలో రాజకీయ పరిణామాలు మారతాయని వాదించిన వాళ్లు పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత ఢిల్లీలో ప్రకంపనలు వస్తాయని గుర్తుంచుకోవాలంటూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్లో 292 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాని మోదీ, హోమంత్రి అమిత్ షాలు ప్రచారం నిర్వహించారు. ఆ ఇద్దరు ఉద్దండుల ప్రచారంతో బెంగాల్ రాజకీయ ముఖ చిత్రం మారిపోనుందని రాజకీయ నిపుణులు భావించారు. ఇప్పటి వరకు దేశంలో జరిగిన అన్ని ఎన్నికల్లో బీజేపీ ఎలా అయితే విజయం సాధించిందో.. బెంగాల్లో సైతం అదే తరహాలో దీదీని మట్టికరిపిస్తూ బీజేపీ విజయ దుందుభి మోగిస్తోందని సొంత పార్టీల నేతలు, అభ్యర్ధులు ఊహించారు. కానీ నేటి ఓట్ల లెక్కిపు ప్రక్రియలో బీజేపీ నాయకుల అంచనాలన్నీ తల్లకిందులయ్యాయి. ఎన్నికల ప్రచారంలో గాయ పడ్డ మమత ఒంటికాలితో ప్రచారం నిర్వహించి విజయం సాధిస్తానని ప్రత్యర్ధులకు విసిరిన సవాల్ నిజమయ్యింది. ఈ క్రమంలో సంజయ్ రౌత్ శివసేన అధికార మీడియా 'సామ్నా' వేదికగా కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మే 2 తర్వాత మహారాష్ట్రలో రాజకీయ మార్పులు జరుగుతాయని ప్రచారం చేసిన వారు.. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు ఢిల్లీలో కూడా ప్రకంపనల సృష్టిస్తాయని గుర్తించుకోవాలన్నారు. ఓ వైపు దేశంలో కోవిడ్ విజృంభణ కొనసాగుతుంది. వ్యాక్సిన్లు, బెడ్ల కొరత, ఆక్సిజన్ లేకపోవడం వల్ల 5 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రజలు చనిపోతున్నా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రాజకీయం చేయడం ఎంతవరకు సమంజసం అని సంజయ్ రౌత్ ప్రశ్నించారు. ఒక్క రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో గెలిచేందుకు దేశ ప్రజల్ని ప్రమాదంలోకి నెట్టేశారు. సుప్రీంకోర్టు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందని, ఈసీ తీరుపై మద్రాస్ హైకోర్టు మండిపడిందని సంజయ్ రౌత్ గుర్తు చేశారు. అంతేకాదు వెస్ట్ బెంగాల్లో దీదీ గెలిస్తే అక్కడ ప్రచారం చేసిన మోదీ, అమిత్ షాలు సైతం ఓడినట్లేనని సంజయ్ రౌత్ సామ్నాలో పేర్కొన్నారు. -
మమతా బెనర్జీ ఇంటిముందు టీఎంసీ కార్యకర్తల సంబరాలు
-
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఫలితాల విశ్లేషణ
-
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు: సువేందు అధికారి గెలుపు
లైవ్ అప్డేట్స్: ♦ఉత్కంఠభరితంగా సాగిన నందిగ్రామ్ కౌంటింగ్‌లో చివరకు సువేందు అధికారి విజయం సాధించినట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. టీఎంసీ అభ్యంతరంతో రీకౌంటింగ్ చేశామని.. సువేందు 1736 ఓట్ల తేడాతో దీదీపై గెలిచారని ఈసీ ప్రకటించింది. ♦ నందిగ్రామ్ ఎన్నికల కౌంటింగ్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది. కొద్ది సేపటి క్రితం మమతా బెనర్జీ ఓడిపోయిందంటూ వార్తా కథనాలు వెలువడ్డాయి. అయితే దీనిపై ఈసీ స్పష్టత ఇచ్చింది. ఇంకా లెక్కించాల్సిన ఓట్లున్నాయని, నందిగ్రాం ఫలితం ప్రకటించలేదని తేల్చి చెప్పింది. ♦16వ రౌండ్ కౌంటింగ్ ముగిసే సరికి సువేందు, దీదీపై 6 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు ♦నంనదిగ్రామ్లో దీదీ మళ్లీ ముందంజలో కొనసాగుతున్నారు. సువేందుపై 2 వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు దీదీ. ♦ టీఎంసీ 209 స్థానాల్లో ఆధ్యికంలో కొనసాగుతూ.. హ్యాట్రిక్ దిశగా దూసుకుపోతుంది. బీజేపీ 80 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగతుంది. ♦ జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ బెంగాల్ ప్రజలకు అభినందనలు తెలిపారు. విచ్చినకర,విభజించే శక్తులను ప్రజలుతిప్పికొట్టారన్నారు. ♦ టీఎంసీకి అభినందనలు తెలిపిన శివసేన, ఎన్సీపీ ♦ క్రికెటర్ టర్న్డ్ పొలిటీసియన్ మనోజ్ తివారీ బీజేపీకి చెందిన రతిన్ చక్రవర్తిపై ఆధిక్యం ♦ స్పష్టమైన ఆధిక్యంతో పార్టీ దూసుకుపోతున్న నేపథ్యంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇంటిముందు టీఎంసీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ♦ బెంగాల్లో ఒక్క స్థానానికే కాంగ్రెస్, లెఫ్ట్ పరిమితం (మోదీకి షాకిచ్చిన దీదీ: వైరలవుతున్న మీమ్స్) ♦ బెంగాల్లో కమ్యూనిస్టులకు భారీ గండి ♦ నందిగ్రామ్‌లో దూసుకొచ్చిన మమత. సువేదు అధికారిపై ఇప్పటిదాకా దాదాపు 8వేలకుపైగా ఓట్ల వెనుకంజలో ఉన్న మమత 6వ రౌండ్లో 1427ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ♦ లీడింగ్లోడబుల్ సెంచరీ మార్క్‌ను దాటేసిన టీఎంసీ. 201 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యంతో టీఎంసీ జోరు ♦ ఐదో రౌండ్లో పుంజుకున్న మమత 8,201 నుంచి 3వేలకు పడిపోయిన సువేందు ఆధిక్యం ♦ ఒకవైపు టీఎంసీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుండగా,వరుసగా నాలుగో రౌండ్లోనూ సీఎం మమతకు భంగపాటు తప్పడం లేదు. సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి సువేందుకంటే 8106 ఓట్లు వెనుకబడి ఉన్నారు ♦లీడ్‌లో టీఎంసీ ప్రముఖులు: దమ్ దమ్ నార్త్‌లో చంద్రీమా భట్టాచార్య, మదన్ మిత్రా కమర్హతిలో బ్రాత్యా బసు దమ్ దమ్‌లో, సింగూర్‌లో బెచరం మన్నా, హబ్రాలో జ్యోతిప్రియో ముల్లిక్ లీడింగ్ ♦ ఉత్కంఠ భరితంగా సాగుతున్న పోరులో లీడింగ్‌లో టీఎంసీ మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసి తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ప్రస్తుత లెక్కల ప్రకారం 159 సీట్లలో ఆధిక్యంలో ఉండగా, 90 సీట్లలో బీజేపీ లీడ్‌లో ఉంది ♦ మూడో రౌండ్లోనూ మమత వెనుకబడి ఉన్నారు. సుమారు 7287 ఓట్లతో సువేందు అధికారి లీడింగ్ ♦ రెండో రౌండ్లోనూ మమత వెనుకబాటులో ఉన్నారు. సుమారు 4500 ఓట్లతో సువేందు అధికారి లీడింగ్ ♦ బెంగాల్ మంత్రి, టీఎంసీ నేత మొలాయ్ ఘటక్ అసన్సోల్లో ఆధిక్యం. ♦ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు తర్వాత తారకేశ్వర్ నియోజకవర్గంలోబీజీపీ స్వాపన్ దాస్‌గుప్తా ముందంజ. ♦ కృష్ణానగర్ బీజేపీ ముకుల్ రాయ్ లీడింగ్‌లో ఉన్నారు. ♦ టోలీగంజ్‌లో బీజేపీకి చెందిన బాబుల్ సుప్రియో లీడింగ్‌లో ఉన్నారు. ♦ పోస్టల్ బ్యాలెట్లో దీదీ ముందంజలోఉన్నారు. ♦ నందిగ్రామ్‌లో సీఎం మమతా బెనర్జీ వెనుకంజ : టీఎంసీకి రాజీనామాచేసి బీజేపీ తీర్థం పుచ్చుకుని, బీజేపీ తరపున బరిలోఉన్న సువేందు అధికారి ఇక్కడ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ♦ కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు ♦ ఈ హోరాహోరీపోరులో టీఎంసీ 55, బీజేపీ 51 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. ♦ మొదటగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌లో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. ♦ ప్రారంభమైన ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు దేశవ్యాప్తంగా పశ్చిమ బెంగాల్‌లోఅధికార పీఠం ఎవరికి దక్కనుందనే ఉత్కంఠకు ఈ రోజు తెరపడనుంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. బెంగాల్లో మొత్తం 292 సీట్లకు గాను పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. బెంగాల్లో అధికారం దక్కించుకోవాలంటే 148 సీట్లు (మ్యాజిక్ ఫిగర్) సాధించాల్సి ఉంటుంది. (చదవండి: దీదీనా? మోదీనా?) కౌంటింగ్‌లో భాగంగా అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో 1,113 కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేశారు. ఇక మళ్లీ అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ ఎన్నికల్లో సర్వశక్తులూ ఒడ్డారు. ప్రతిపక్ష బీజేపీ సైతం గట్టి పోటీ ఇచ్చింది. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్-బీజేపీ మధ్య హోరాహోరీ పోరు తప్పదని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడించాయి. కీలకమైన పశ్చిమ బెంగాల్లో మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 దాకా 8 దశల్లో 294 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 108 కేంద్రాల్లో మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. 256 కంపెనీల కేంద్ర బలగాలను రంగంలోకి దించారు. ఓట్ల లెక్కింపునకు ముందే ఈవీఎంలు, వీవీప్యాట్లను శానిటైజ్ చేయనున్నారు. మాస్కు ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తామన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద జనం గుంపులుగా చేరడానికి వీల్లేదన్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుందని, రాత్రి పొద్దుపోయే దాకా కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. మొత్తం ప్రక్రియను పర్యవేక్షించడానికి 1,100 మంది పరిశీలకులను నియమించామని పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, రాజకీయ పార్టీల ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రాల్లోకి అడుగు పెట్టాలంటే కరోనా నెగటివ్ రిపోర్టు లేదా డబుల్ డోస్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ సమర్పించాలని తేల్చిచెప్పారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎవరైనా కరోనా ప్రోటోకాల్స్‌ను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల సంఘం హెచ్చరించింది. -
సర్వేల ముక్తకంఠం
ఆఖరి దశ పోలింగ్ పూర్తయ్యాక యధావిధిగా వెలువడే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు గురువారం వచ్చాయి. పశ్చిమ బెంగాల్లో ఎనిమిదో దశ పోలింగ్‌తో అక్కడి సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియ ముగియ డంతో చానెళ్లన్నీ సర్వే ఫలితాలను హోరెత్తించాయి. కరోనా మహమ్మారి దేశమంతా స్వైరవిహారం చేస్తూ, పౌరుల ప్రాణాలు తోడేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో మునుపటిలా వీటిపై జనంలో ఉత్కంఠ వుంటుందా అన్నది ప్రశ్నార్థకమే. అయినా మీడియా తన పని తాను చేసుకుపోయింది. ఎప్పటిలాగే సర్వేలు చేయడంలో నైపుణ్యం వున్న సంస్థలను రంగంలోకి దించి జనం నాడి తెలుసుకునే ప్రయత్నం చేసింది. మొదటినుంచీ అందరూ అనుకుంటున్నదే దాదాపుగా ఈ సర్వేలు కూడా చెప్పాయి. పశ్చిమ బెంగాల్లో హోరాహోరీ పోరుంటుందని, తమిళనాట డీఎంకే, అస్సాంలో బీజేపీ, కేరళలో వరసగా రెండోసారి వామపక్ష ప్రజాతంత్ర కూటమి(ఎల్డీఎఫ్) విజయం సాధించవచ్చని జోస్యం చెప్పాయి. పుదుచ్చేరిలో తొలిసారి ఎన్డీఏకు అధికారం దక్కబోతున్నదని అంచనా వేశాయి. అంకెల్లోనే కాస్త వ్యత్యాసాలున్నాయి. బెంగాల్ విషయంలో ఒక్క రిపబ్లిక్ టీవీ–సీఎన్ఎక్స్ సర్వే మాత్రమే బీజేపీకి అధిక స్థానాలిచ్చింది. ఎన్నికల ప్రచారం ప్రారంభదశలో బెంగాల్‌ను అందరూ తృణమూల్ కాంగ్రెస్ ఖాతాలోనే వేసినా, ఆ తర్వాత సంశయంలో పడ్డారు. అది బీజేపీ సృష్టించిన ప్రచారహోరు పర్యవసానమా లేక తృణమూల్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన వర్గాల్లో వచ్చినట్టు కనబడుతున్న మార్పా అన్నది ఎవరూ స్పష్టంగా చెప్పలేకపోయారు. అయితే చివరి రెండు దశల పోలింగ్‌నాటికి దేశం నలుమూలలా కరోనా పర్యవసానంగా నెలకొన్న విషాదకర పరిస్థితులు బెంగాల్‌ను ఏమేరకు ప్రభావితం చేసివుంటాయన్నది వేచిచూడాలి. నెలన్నరపాటు దఫదఫాలుగా జరిగిన ఈ అసెంబ్లీ ఎన్నికలపై జనంలో గతంతో పోలిస్తే ఆసక్తి తగ్గింది. బెంగాల్లో ఈసారి ఎలాగైనా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌ను గద్దె దించాలన్న కృతనిశ్చయంతో వున్న బీజేపీ అందుకు తగినట్టు భారీ స్థాయిలో ప్రచార యుద్ధం సాగించింది. ఆ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వంటి హేమాహేమీలు సభలు, ర్యాలీల్లో పాల్గొన్నారు. అన్నిచోట్లా భారీయెత్తున జనం హాజరయ్యారు. కరోనా వైరస్ విజృంభణను పట్టించుకోకుండా, దాన్ని నియంత్రించడానికి అవసరమైన వ్యూహాలు రూపొందించకుండా బెంగాల్‌పైనే మోదీ దృష్టి సారించారన్న విమర్శలు కూడా వచ్చాయి. మమత సైతం బీజేపీకి దీటుగా ముందుకురికారు. ఇంత సుదీర్ఘమైన పోలింగ్ షెడ్యూల్ ప్రకటించినందుకు ఎన్నికల సంఘాన్ని కూడా అనేకులు తప్పుబట్టారు. చివరి మూడు దశలనూ ఒకే దశగా మార్చి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ వచ్చినా సంఘం పెద్దగా స్పందించలేదు. తమిళనాడులో నేతలు పాల్గొన్న సభల్లో భౌతిక దూరం పాటించడం, మాస్క్‌లు ధరించడంవంటివి లేకున్నా అది పట్టించుకోలేదని, ఫలితంగా కరోనా కేసులు పెరిగాయని దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా మద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై మాత్రం సంఘం నొచ్చుకుంది. ఈసీ అధికారులపై హత్య కేసు ఎందుకు పెట్టరాదంటూ న్యాయమూర్తులు కటువుగా వ్యాఖ్యానించారు. ఇందుకు ఎన్నికల సంఘం బాధపడటంలో అనౌచిత్యమేమీ లేదు. కానీ పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ వగైరాల్లో నాయ కులు తన లక్ష్మణ రేఖను దాటుతున్నప్పుడు కూడా అదిలాగే స్పందిస్తే... పార్టీలతో నిమిత్తం లేకుండా, నేతలు అధిరోహించిన పదవులతో సంబంధం లేకుండా తగిన చర్యలకు ఉపక్రమిస్తే మరింత బాగుండేది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతి ఉప ఎన్నిక బహిరంగసభను కరోనా విజృంభణ కారణంగా రద్దు చేసుకున్నప్పుడే ఈసీ కూడా ఆ దిశగా ఆలో చించి ప్రచారపర్వాన్ని ఇక కట్టిపెట్టాలని పార్టీలకు ఆదేశాలివ్వాల్సింది. ఎగ్జిట్ పోల్స్ శాస్త్రీయతపై ఆదినుంచీ సంశయాలున్నాయి. మన దేశంలో మాత్రమే కాదు... విదేశాల్లోనూ అదే పరిస్థితి. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ నెగ్గుతారని ఏ సర్వే కూడా చెప్పలేకపోయింది. దాదాపు అందరూ హిల్లరీ క్లింటన్‌వైపే మొగ్గారు. తీరా బ్యాలెట్ బాక్సులు తెరిచేసరికి ట్రంప్ ప్రత్యక్షమయ్యారు. మన దేశంలో 2004లో యూపీఏ నెగ్గుతుందనిగానీ, 2009లో అది వరసగా రెండోసారి కూడా విజయం సాధిస్తుందనిగానీ మెజారిటీ సర్వేలు చెప్పలేకపోయాయి. జనం నాడి తెలుసుకోవడం అంత సులభం కాదు. ప్రజలెప్పుడూ కూడబలుక్కున్నట్టు ఒకే మాదిరి ఓటేస్తారు. కానీ వ్యక్తులుగా ఎవరికి వారు విజేతల గురించి అయోమయంలో వుంటారు. ఫలితాలు వెలువడినప్పుడు ఆశ్చర్యపోతారు. పోలింగ్ రోజున సర్వే చేసేవారిని ముప్పుతిప్పలు పెడతారు. ఓటేసింది ఒకరికైతే మరొకరి పేరు చెబుతారు. వారిని మాటల్లోపెట్టి ఎటువైపు మొగ్గుందో తెలుసు కోవడం అంత సులభమేమీ కాదు. ఎన్నో అనుభవాలు నేర్పిన గుణపాఠాలతో తగిన ప్రమాణాలు రూపొందించుకుని, జనం నాడి పట్టేందుకు నిజాయితీగా ప్రయత్నించే సంస్థలు కూడా లేకపోలేదు. వాస్తవ ఫలితాలు వెలువడినప్పుడు తమకు విశ్వసనీయత ఏర్పడాలని ఆశించే ఇలాంటి సంస్థలు న్నట్టే... చవకబారు రాజకీయ ప్రయోజనాలు ఆశించో, బెట్టింగులద్వారా కోట్లు గడించాలన్న వెంప ర్లాటతోనో దొంగ జోస్యాలు చెప్పేవారూ తయారయ్యారు. తినబోతూ రుచెందుకన్నట్టు ఆదివారం ఎటూ వాస్తవ ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ ప్రతిష్టను పెంచుతాయా, తగ్గిస్తాయా అన్నది తేలాల్సివుంది. -
ముగిసిన బెంగాల్ పోలింగ్
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ తుది దశ పోలింగ్‌లోనూ భారీగా పోలింగ్ నమోదైంది. గురువారం 35 స్థానాలకు జరిగిన ఎనిమిదో విడత పోలింగ్‌లో 76.07శాతం పోలింగ్ నమోదైనట్టు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. కరోనా భయాలను కూడా ఖాతరు చేయకుండా పెద్ద సంఖ్యలో ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఈ దశలోనూ పలు చోట్ల ఉద్రిక్తతలు నెలకొన్నాయి. బీర్భమ్ జిల్లా ఇలామ్‌బజార్ ప్రాంతంలో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య ఘర్షణలు జరిగాయి. బీజేపీ అ«భ్యర్థి అనిర్బన్ గంగూలీపై దాడి జరిగినట్టుగా ఎన్నికల అధికారులు వెల్లడించారు. కర్రలు, బ్యాట్లు తీసుకొని ఆయనపై దాడి చేయడానికి వచ్చినçప్పుడు ఏర్పడిన ఘర్షణలో ఇద్దరు గాయపడ్డారు. ఈ దాడి వెనుక టీఎంసీ మద్దతుదారులు ఉన్నారని గంగూలీ చెప్పారు. తన కారుని పూర్తిగా ధ్వంసం చేశారని అన్నారు. వాళ్లు రాక ముందు వరకు పోలింగ్ ప్రశాంతంగా సాగిందని తెలిపారు. జొరసాంకో నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి మీనాదేవి పురోహిత్ తాను నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉంటే ప్రత్యర్థి పార్టీ వ్యక్తులు తన కారుపై బాంబులు విసిరారని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్లో 294 స్థానాలు ఉండగా ఎనిమిది దశల్లో పోలింగ్ నిర్వహించారు. మార్చి 27 న మొదలైన పోలింగ్ ఏప్రిల్ 29తో ముగిసింది. -
బెంగాల్: ముగిసిన తుది విడత పోలింగ్
► బెంగాల్ లో నేడు జరుగుతున్న తుది విడత ఎన్నికల పోలింగ్ ముగిసినట్లు అధికారులు తెలిపారు. ఈ రోజు సాయంత్రం 6.30 గంటల వరకు 76.07 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. బీభం: 81.82 శాతం కోల్‌కతా నార్త్: 57.85 శాతం మాల్డా: 79.98 శాతం ముర్షిదాబాద్: 78.09 శాతం ► బెంగాల్ తుది విడత పోలింగ్ లో భాగంగా నేడు జరుగుతున్న ఎన్నికల్లో సా.5.30 గంటల వరకు 76.07 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ► బెంగాల్ తుది విడత పోలింగ్ లో భాగంగా నేడు జరుగుతున్న ఎన్నికల్లో మధ్యాహ్నం 3గంటల వరకు 68.66 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మాల్డా: 70.85% ముర్షిదాబాద్: 70.91% కోల్‌కతా: 51.40% బీభం: 73.92% ► బెంగాల్లో చివరి విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 వరకు 37.80 శాతం పోలింగ్ నమోదైంది.ఓటర్లు ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలి వస్తున్నారు. ► ఉదయం 9:30 వరకు 16.04 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. ► పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల చివరి విడత పోలింగ్ కొనసాగుతోంది. నటుడు మిథున్ చక్రవర్తి ఉత్తర కోల్‌కతాలోని కాశిపూర్-బెల్గాచియా పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుక్నురు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తాను ఇంత ప్రశాంతంగా గతంలో ఎప్పుడూ ఓటు వేయలేదని తెలిపారు. పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసిన పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల చివరి విడత పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి తరలి వస్తున్నారు. 35 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చివరి విడత పోలింగ్ జరుగుతోంది. మొత్తం 11,680 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక కేంద్రాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆఖరి విడత ఎన్నికల బరిలో 283 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కోవిడ్ నేపథ్యంలో ఎన్నికల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మాస్క్‌లు, సానిటైజర్లు పోలింగ్ కేంద్రాల ముందు ఏర్పాటు చేశారు. బెంగాల్ ఎన్నికల ఫలితాలు మే 2న వెలువడనున్నాయి. చదవండి: లాక్డౌన్ ఉంది ఎలా బతకాలి?.. 'ఆకలితో చస్తే.. చావు' -
Mamata Banerjee: ఎన్నికల సంఘం బీజేపీ గూటి చిలక
కోల్కత్తా: ఏడో దశ ఎన్నికలు పశ్చిమ బెంగాల్లో సోమవారం ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఓటేసిన అనంతరం ఆన్లైన్లో నిర్వహించిన ఓ ప్రచార సభలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మాట్లాడారు. ఈ సందర్భంగా మద్రాస్ హైకోర్టు ఎన్నికల సంఘంపై చేసిన వ్యాఖ్యలను సమర్ధిస్తూ స్వాగతించారు. ఎన్నికల సంఘం తీరుపై మమత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం బీజేపీ గూటికి చెందిన చిలకగా అభివర్ణించారు. ‘మద్రాస్ హైకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నా. కరోనా వ్యాప్తికి ఎన్నికల సంఘం కారణమని కోర్టు స్పష్టంగా చెప్పింది. ఎన్నికల సంఘం బీజేపీ గూటికి చెందిన చిలక. కరోనా కేసులు పెరగడానికి కారణం అదే’ అని మమత బెనర్జీ స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తికి ఎన్నికల సంఘం, ప్రధానమంత్రి నరేంద్రమోదీ బాధ్యులని పేర్కొన్నారు. ఎన్నికలు త్వరగా ముగించాలని తాము ఎన్నికల సంఘానికి చెప్పినా వినిపించుకోలేదని మమత గుర్తుచేశారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తికి ఎన్నికల సంఘం కారణమని పునరుద్ఘాటించారు. చదవండి: కేంద్రం ఇవ్వకున్నా మేమిస్తాం: 23 రాష్ట్రాలు మాస్క్ లేదని చితక్కొట్టిన ఆర్టీసీ బస్ డ్రైవర్ -
బెంగాల్ ఏడో దశ ఎన్నికల్లో భారీగా పోలింగ్
కోల్‌కతా: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఏడో దశ పోలింగ్ శాతం భారీగా నమోదైంది. 34 అసెంబ్లీ స్థానాలకు 75.6 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికలు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 259 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. ఈనెల 29న 35 స్థానాలకు చివరి విడత ఎన్నికలు జరగనున్నాయి. ► పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ఏడో దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. సాయంత్రం 5:30 గంటల వరకు 75.06 శాతం పోలింగ్ నమోదైంది. నేడు ఐదు జిల్లాల్లో 34 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ► బెంగాల్లో ఏడో దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి భారీగా తరలి వస్తున్నారు. ఉదయం 11 గంటల వరకు 36.02 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. బెంగాల్‌లోని 5 జిల్లాల్లో 34 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ► పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఏడో దశ పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడానికి తరలి వస్తున్నారు. భోవానిపూర్ నియోజకవర్గ టీఎంసీ అభ్యర్థి శోభండేబ్ చటోపాధ్యాయ్ మన్మతానాథ్ నందన్ పాఠశాలలోని పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. గత ఎన్నికల్లో ప్రస్తుత సీఎం మమతా బెనర్జీ ఈ నియోజకవర్గంలో గెలుపొందిన విషయం తెలిసిందే. కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ఏడో దశ పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఏడో దశ ఎన్నికల పోటీలో 284 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ దశలో పోలింగ్‌లో 86 లక్షలమంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 12,068 పోలింగ్ బూత్‌ల ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో హింసాత్మక సంఘటనల దృష్ట్యా.. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. చదవండి: సెకండ్ వేవ్ దేశాన్ని కుదిపేస్తోంది -
బెంగాల్లో మేం గెలిస్తే ఫ్రీగా వ్యాక్సిన్: బీజేపీ
కోల్‌కతా: దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కరోనా కట్టడి కోసం మే 1నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరు వ్యాక్సిన్ తీసుకొవచ్చిన ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అసోం, ఛత్తీస్‌గఢ్, యూపీ, ఎంపీ రాష్ట్ర ప్రభుత్వాలు టీకా ఖర్చు తామే భరిస్తామని.. అందరికి ఉచితంగా వ్యాక్సిన్ వేస్తామని ప్రకటించాయి. ఇదిలా ఉండగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న పశ్చిమబెంగాల్లో బీజేపీ చేసిన ఓ ప్రకటన తాజాగా రాజకీయ దుమారం రేపింది. రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమను గెలిపిస్తే.. ప్రజలందరికి ఉచితంగా వ్యాక్సిన్ వేస్తామని బెంగాల్ బీజేపీ ప్రకటించింది. ఈ మేరకు బెంగాల్ బీజేపీ శుక్రవారం ఓ ట్వీట్ చేసింది. ‘‘పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలందరికి కోవిడ్ -19 వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వబడుతుంది’’ అంటూ ట్వీట్ చేసింది. ఈ ప్రకటనపై రాజకీయ దుమారం రాజుకుంది. అంటే ఎన్నికలు లేకపోతే ప్రజలతో మీకు అవసరం లేదా.. ఓట్ల కోసం ఏమైనా చేస్తారా అంటూ మండిపడుతున్నారు జనాలు. As soon as BJP government comes to power in West Bengal, COVID-19 vaccine will be provided free of cost to everyone. pic.twitter.com/gzxCOUMjpr — BJP Bengal (@BJP4Bengal) April 23, 2021 ఇక దేశప్రజలందరికి కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా వ్యాక్సిన్ వేయించాలని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. మార్కెట్ల ప్రయోజనాల గురించి కాకుండా.. దేశ ప్రజల గురించి ఆలోచించాలని సూచించారు. మోదీ రాసిన మరో లేఖలో దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుంది.. ఇలాంటి సమయంలో వ్యాక్సిన్ ఉత్పత్తిదారులు లాభాలు గురించి కాకుండా జనాల గురించి ఆలోచించాలని దీదీ లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే సీరం ఇన్‌స్టిస్ట్యూట్ కోవిషీల్డ్ ధరలను ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రప్రభుత్వాలకు అయితే ఒక్కో డోసు ధరను 400 రూపాయలుగా ప్రకటించగా.. ప్రైవేట్ ఆస్పత్రులకు 600 రూపాలయ ధరను నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే కేంద్రానికి సప్లై చేసినప్పుడు ఒక్కో డోసు ధర కేవలం 150 రూపాయలు మాత్రమే ఉండటంతో తాజా ధరలపై రాష్ట్ర ప్రభుత్వాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒకే దేశం.. ఒకే ధర ఉండాలని డిమాండ్ చేస్తున్నాయి. చదవండి: ఈ విపత్తు మోదీ వైఫల్యమే: మమత -
బెంగాల్ 6వ విడతలో 79% పోలింగ్
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి గురువారం 6వ విడత పోలింగ్ పూర్తయింది. 43 నియోజకవర్గాల్లో జరుగుతున్న ఈ పోలింగ్‌లో సాయంత్రం 5 గంటలకు 79.09% పోలింగ్ నమోదైందని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్(సీఈవో) ఆరిజ్ అఫ్తాబ్ తెలిపారు. కొన్ని హింసాత్మక ఘటనలు మినహా మొత్తమ్మీద పోలింగ్ ప్రశాంతంగా జరిగిందన్నారు. ఈవీఎంలు, వీవీప్యాట్లు మొరాయించిన ఘటనలు ఐదు దశలతో పోలిస్తే స్వల్పంగానే నమోదయ్యాయని చెప్పారు. ఆరో దశలో శాంతి భద్రతల కోసం ఈసీ 1,071 కంపెనీల కేంద్ర బలగాలను వినియోగించింది. ఈ నెల 26, 29వ తేదీల్లో మరో రెండు విడతల్లో రాష్ట్రంలో పోలింగ్ జరగనుంది. మే 2వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. పోలీసులు భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 1071 కంపెనీల కేంద్ర బలగాలను రంగంలోకి దించారు. పోలింగ్ కేంద్రాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ విడతలో నాలుగు జిల్లాల్లోని మొత్తం 43 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాల్లో 306 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. చదవండి: ఈ విపత్తు మోదీ వైఫల్యమే: మమత -
ఈ విపత్తు మోదీ వైఫల్యమే: మమత
బలూర్ఘాట్: దేశంలో కోవిడ్–19 సెకండ్ వేవ్‌కు ప్రధాని మోదీ నిర్వహణాలోపమే కారణమని పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ దుయ్యబట్టారు. దక్షిణ దినాజ్‌పూర్ జిల్లా బలూర్‌ఘాట్‌లో బుధవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడారు. ‘దేశంలో కరోనా సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉంది. ఇది మోదీ కారణంగా వచ్చిన విపత్తు. ఇంజెక్షన్లు, ఆక్సిజన్ లేదు. దేశంలో కొరత ఉన్నప్పటికీ టీకాలు, మందులు విదేశాలకు ఎగుమతి చేశారు’ అని కేంద్ర ప్రభుత్వాన్ని ఆమె విమర్శించారు. ఆక్సిజన్, టీకాలు ఇవ్వలేని పక్షంలో పదవి నుంచి తప్పుకోవాలని ప్రధానికి సలహా ఇచ్చారు. రాష్ట్రంలో బెంగాల్ ఇంజిన్ ప్రభుత్వమే వస్తుంది తప్ప, మోదీ చెబుతున్న డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రాదని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని చేజిక్కించుకునేందుకు, ఢిల్లీ నుంచి పాలించేందుకు గుజరాతీకి అవకాశం ఇవ్వరాదని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల పోరాటం బెంగాల్‌ను రక్షించడానికి, బెంగాలీ మాత గౌరవాన్ని కాపాడటానికేనని పేర్కొన్నారు. వామపక్ష– కాంగ్రెస్ కూటమికి ఓటేయరాదని, అలాచేస్తే బీజేపీకి ఊతమిచ్చినట్లే అవుతుందని తెలిపారు. -
కరోనా సెకండ్ వేవ్ మోదీ మేడ్ డిజాస్టర్: దీదీ ఫైర్
సాక్షి, కోల్‌కతా: దేశంలో కరోనా వైరస్ రెండో దశలో తీవ్రంగా వ్యాప్తిస్తున్న తరుణంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాన మంత్రి నరేంద్రమోదీపై మరోసారి ధ్వజమెత్తారు. దేశంలో కరోనా మహమ్మారి ఇంతలా విజృంభించడానికి మోదీనే కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సెకండ్ వేవ్‌ను మోదీ సృష్టించిన విపత్తుగా మమతా బెనర్జీ ఆరోపించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా దక్షిణ దినాజ్‌పూర్ జిల్లాలోని బాలూర్ఘాట్లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడిన ఆమె ప్రధానిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒకవైపు దేశంలో కరోనా సెకండ్ వేవ్ చాలా ఉధృతంగా ఉంది. మరోవైపు ఆస్పత్రుల్లో సరిపడా మందులు లేవు, ఆక్సిజన్‌కూ కొరత వేధిస్తోందన్నారు. దేశంలో ఇన్ని విపత్కర పరిస్థితులు ఉన్నా కరోనా టీకాలను, ఔషధాలను మాత్రం విదేశాలకు తరలించారంటూ ఆమె విమర్శించారు. అంతేకాదు బెంగాల్లో "బెంగాల్ ఇంజిన్ ప్రభుత్వం" మాత్రమే ఏర్పాటవుతుంది తప్ప "మోదీ డబుల్ ఇంజిన్" ద్వారా కాదని మమతా పేర్కొన్నారు. ఈ ఎన్నికలు పశ్చిమ బెంగాల్, బెంగాల్ మాత గౌరవాన్ని కాపాడటానికి చేసే పోరాటంగా ఆమె అభివర్ణించారు. రాష్ట్రానికి తాను కాపలాదారుడిగా వ్యవహరిస్తానంటూ ప్రజలకు భరోసా ఇచ్చారు. దక్షిణ పినాజ్‌పూర్ జిల్లాలో గత పదేళ్లలో టీఎంసీ ప్రభుత్వం రోడ్లు, ఆస్పత్రులు, వంతెనలు, స్టేడియాలతోపాటు పారిశ్రామిక కేంద్రాన్ని నిర్మించిందని ఈ సందర్భంగా బెనర్జీ చెప్పారు. కాగా 294 మంది సభ్యుల రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకు ఎనిమిది దశల్లో జరుగుతున్నాయి. మే 2 న ఫలితాలు వెలువడనున్నాయి. -
మమతవి శవ రాజకీయాలు
అసన్సోల్/గంగారాంపూర్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నాలుగు దశలు ముగిసేనాటికే తృణమూల్ పార్టీ దాదాపు ముక్కలు చెక్కలు అయిందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఇక ఎనిమిది దశల పోలింగ్ ప్రక్రియ ముగిసేనాటికి తృణమూల్ కథ ముగిసిపోతుందని, సీఎం మమత బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్ ఓటమి ఖాయమవుతుందని మోదీ జోస్యం చెప్పారు. బెంగాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం మోదీ రాష్ట్రంలో అసన్సోల్లో ప్రచార ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. సీతల్‌కూచీ ఘటనను మమత తనకు అనుకూలంగా మలుచుకున్నారని మోదీ ఆరోపించారు. ఆ ఐదుగురి మరణాలతో మమత శవ రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. ఆ తర్వాత మోదీ గంగారాంపూర్‌లో జరిగిన ర్యాలీలో ప్రసంగించారు. మమత సర్కార్‌లో అక్రమ బొగ్గు తవ్వకం జరిగిందంటూ నిప్పులుచెరిగారు. Üున్నిత అంశమైన కూచ్ బెహార్లో కాల్పుల ఘటనపై మమత వ్యవహార శైలి ఎలాంటిదో ఆడియో క్లిప్‌ను వింటే అర్ధమైపోతుందని మోదీ ఆరోపించారు. కాల్పులు చనిపోయిన వారి మృతదేహాలతో భారీ ర్యాలీ చేపట్టాలని టీఎంసీ జిల్లా అధ్యక్షుడు, సీతల్‌కూచీ నుంచి పార్టీ అభ్యర్థి పార్థ ప్రతీమ్ రాయ్‌కు మమత ఫోన్ ఆదేశించినట్లుగా చెబుతున్న ఆడియో వివాదమవడం తెల్సిందే. ‘తన రాజకీయ స్వలాభం కోసం మమత ఎలాంటి శవ రాజకీయాలు చేస్తుందో.. ఆ ఆడియో టేప్ వింటే తెలుస్తుంది. ఆమెకు గతంలోనూ ఇలా శవ రాజకీయాలు చేశారు’ అని మోదీ ఆరోపించారు. ‘కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు, బెంగాల్ ప్రజలకు మధ్య మమత అడ్డుగోడలా నిలిచారు. పీఎం–కిసాన్, ఆయుష్మాన్ భారత్ పథకాల ప్రతిఫలాలను బెంగాల్ ప్రజలకు దక్కకుండా మమత అడ్డుకున్నారు. నన్ను నిందించకుండా మమతది ఏ రోజూ గడవలేదు’ అని మోదీ అన్నారు. -
‘నా ఫోన్‌ను ట్యాప్ చేశారు’: ముఖ్యమంత్రి
గల్సీ (పశ్చిమ బెంగాల్): పోలింగ్ బూత్ వద్ద భద్రతా బలగాల కాల్పుల తర్వాత ఆ మృతదేహాలతో ర్యాలీ చేపట్టాలని తాను ఆదేశించానని చెబుతున్న ఆడియో టేప్ వివాదంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఘాటుగా స్పందించారు. ‘నా ఫోన్‌ను ట్యాప్ చేశారు. ఈ మొత్తం వివాదంపై నిజానిజాలు రాబట్టేందుకు సీఐడీ విచారణకు ఆదేశిస్తాను’ అని మమత ప్రకటించారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గల్సీలో జరిగిన సభలో మమత ప్రసంగించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాల విషయంలో పోల్చుకుంటే తృణమూల్ కాంగ్రెస్‌తో ఏ పార్టీ సాటిరాలేదని మమత వ్యాఖ్యానించారు. ‘వంట చేస్తున్నామా.. ఇంటి పని చేస్తున్నామా అనేది సహా మా దినచర్య మొత్తం మీద బీజేపీ నిఘా పెట్టింది అని ఆరోపించారు. అయితే ఈ కుట్రలో మా పాత్ర లేదు అని బీజేపీ చెబుతోంది. మరోవైపు ఈ ఆడియో టేప్ వివాదంపై తృణమూల్ కాంగ్రెస్ స్పందించింది. ‘ఆ ఆడియో టేప్ నకిలీది. అలాంటి సంభాషణ జరగనే లేదు. అయినా, కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోన్ ట్యాప్ చేయడం ఆశ్చర్యంగా ఉంది’ అని టీఎంసీ వ్యాఖ్యానించింది. -
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు : లైవ్ అప్డేట్స్
లైవ్ అప్డేట్స్ : పశ్చిమబెంగాల్ 5వ విడత పోలింగ్ 78.36 శాతం పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఐదో విడత పోలింగ్ ముగిసింది. చెదురు మదురు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నా ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు. 78.36 శాతం పోలింగ్ నమోదైంది. జల్పాయ్గురి, కలింపాంగ్, డార్జిలింగ్, నడియాలో ఒక సెగ్మెంట్, నార్త్ 24 పరగణాలు, పూర్బ బర్దమాన్ జిల్లాల్లోని 45 నియోజక వర్గాల్లో శనివారం పోలింగ్ జరిగింది. 319 మందికి పైగా అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఐదో విడతలో పోలింగ్ జరిగిన 45 నియోజకవర్గాల్లో మయినాగురిలో అత్యధికంగా 85.65 శాతం పోలింగ్ నమోదైంది. మటిగర-నక్సల్బరి నియోజకవర్గంలో 81.65 శాతం, బరసత్‌లో 77.71 శాంత, బిధాన్ నగర్లో 61.10 శాతం, సిలిగురిలో 74.83 శాతం పోలింగ్ నమోదైంది. కాగా, ఆరో విడత పోలింగ్ 43 నియోజకవర్గాల్లో ఈ నెల 22న జరుగనుంది. కేంద్ర దళాలు కాల్పులు పశ్చిమ బెంగాల్‌లోని దేగానా అసెంబ్లీలోని కురుల్‌గచా ప్రాంతంలోని స్థానిక ప్రజలు కేంద్ర బలగాలు వైమానిక కాల్పులు జరిపారని ఆరోపించారు. వార్తా సంస్థ ఏఎన్ఐ ప్రకారం, స్థానిక వ్యక్తి మాట్లాడుతూ ” అక్కడ ఓటింగ్ యథావిధిగా జరుగుతోంది” అప్పుడే కేంద్ర దళానికి చెందిన 8-9 మంది సైనికులు వచ్చి కాల్పులు జరిపారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. West Bengal: Locals in Kurulgacha area of Deganga assembly constituency allege that Central Forces opened fire. "Peaceful voting underway here. Suddenly 8-9 personnel of Central Forces stormed here and opened fire. One round was fired, nobody has been injured," says a local pic.twitter.com/rJea0rhcBs — ANI (@ANI) April 17, 2021 సాయంత్రం 5:45 వరకు 78.36 శాతం పోలింగ్ పశ్చిమ బెంగాల్ ఎన్నికల పోలింగ్ సాయంత్రం 5:45 వరకు 78.36 శాతం నమోదైంది. బెంగాల్లో ఐదవ దశ ఎన్నికలకు సంబందించి 45 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది, బరిలో 319 మంది అభ్యర్థులు ఉన్నారు. మధ్యాహ్నం 3.30 గంటల వరకు 69.40 శాతం ఓటింగ్ ఐదవ దశ పోలింగ్ సందర్భంగా పశ్చిబెంగాల్లోని ఆరు జిల్లాల్లోని 45 నియోజకవర్గాల్లో మధ్యాహ్నం 3.30 గంటల వరకు 69.40 శాతం ఓటింగ్ నమోదైంది. జల్పాయిగురి జిల్లాలోని రాజ్‌గంజ్ అసెంబ్లీ నియోజకవర్గంలో మధ్యాహ్నం 3.30 గంటల వరకు 80.32 శాతం అత్యధిక ఓటింగ్ నమోదైంది. కుర్సోంగ్ అసెంబ్లీ నియోజకవర్గంలో 53.24 శాతంతో అతి తక్కువ ఓటింగ్ జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం తగిన ఏర్పాట్లు చేసింది. ఎన్నికల సందర్బంగా 853 కంపెనీలకు చెందిన కేంద్ర దళాలను మోహరించింది. అధికారిక లెక్క ప్రకారం 5వ పోలింగ్‌లో మధ్యాహ్నం 1:34 వరకు 54.67శాతం ఓటింగ్ నమోదైంది. తాజా సమాచారం ప్రకారం ఉదయం 11 గంటల వరకు 21.26శాతంగా ఉన్న ఓటింగ్ శాతం బ ఉదయం 11:37కు 36.02 శాతంగా ఉంది. 5వ, అతిపెద్ద దశ పోలింగ్ సందర్భంగా పశ్చిబెంగాల్లోని బిధాన్నగర్లో ఉద్రిక్తతచోటు చేసుకుంది. టీఎంసీ- బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చెలరేగింది. ఇరువర్గాల కార్యకర్తలు రాళ్లు రువ్వుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది. బిధానగర్ శాంతినగర్ వద్ద చోటు చేసుకున్న ఘర్షణలో పలువురు మహిళలు గాయపడ్డారు. బీజేపీ అభ్యర్థి సబ్యసాచి దత్తా సంఘటన స్థలానికి చేరుకున్నారు. బీజేపీ దాడిలో తమ కార్యకర్తలు ఇద్దరు గాయపడ్డారని దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని టీఎంసీ అభ్యర్థి సుజిత్ బోస్ తెలిపారు. మరోవైపు ఉత్తర 24 పరగణాల్లోని కమర్హతి అసెంబ్లీ నియోజకవర్గంలోని వివిధ పోలింగ్ బూత్‌లను కమిషనర్ అజోయ్ నందా సందర్శించారు. పోలింగ్ శాంతియుతంగా జరుగుతోందని తెలిపారు. Urging all those voting in today’s fifth phase of the West Bengal elections to vote in large numbers. First time voters in particular should exercise their franchise. — Narendra Modi (@narendramodi) April 17, 2021 5వ దశ పోలింగ్‌లో పెద్ద సంఖ్యలో ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. ముఖ్యంగా మొదటిసారి ఓటర్లు తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ ప్రధాని ట్వీట్ చేశారు. కమర్హతిలోని పోలింగ్ బూత్‌లో టీఎంసీ నాయకుడు మదన్ మిత్రా ఓటు వేశారు. కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల 5వ దశ పోలింగ్ శనివారం ప్రారంభమైంది. కోల్‌కతాలోని దక్షిణేశ్వర్లో హిరాలాల్ మజుందర్ మెమోరియల్ కాలేజ్ ఫర్ ఉమెన్ పోలింగ్ బూత్ ఇద్ద ఇప్పటికే ఓటర్లు క్యూ లైన్లలో బారులు తీరారు. 4వ దశ పోలింగ్ ఘర్షణల నేపథ్యంలో పోలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చర్యల మధ్య పోలింగ్‌కు ఏర్పాట్లు చేశారు. పశ్చిమబెంగాల్లో నేడు ఐదో దశ పోలింగ్‌లో భాగంగా రాష్ట్రంలోని 45 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని సుమారు కోటి మంది ఓటర్లు 342 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. కరోనా తీవ్రత దృష్ట్యా ఈ నెల 22, 26, 29వ తేదీల్లో బెంగాల్లో జరగాల్సిన పోలింగ్‌కు ప్రచార సమయాన్ని రాత్రి 10 గంటలకు బదులుగా 7 గంటలకు ఈసీ కుదించింది. రాజకీయ పార్టీలు సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 10 గంటల మధ్యలో సభలు, సమావేశాలు ర్యాలీల వంటి ఎలాంటి ప్రచార కార్యక్రమాలు చేపట్టరాదని తెలిపింది. ఏప్రిల్ 16వ తేదీ సాయంత్రం 7 గంటల నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని తెలిపింది. అదేవిధంగా ఈ మూడు దశలకుగాను ప్రచారానికి, పోలింగ్‌కు మధ్య విరామ సమయాన్ని 48 గంటల నుంచి 72 గంటలకు పెంచుతున్నట్లు పేర్కొన్న సంగతి తెలిసిందే. -
కరోనా విలయం: కాంగ్రెస్ అభ్యర్థి కన్నుమూత
సాక్షి, కోలకతా: కరోనా వైరస్ మహమ్మారి రెండవ దశలో పంజా విసురుతోంది. చిన్నా పెద్దా, తేకుండా పలువుర్ని కబళిస్తోంది. ఇప్పటికే పలువురు మాజీఎమ్మెల్యేలు, మాజీ కేంద్ర మంత్రులు,మంత్రులు కరోనా బారిన పడి అసువులు బాశారు. తాజాగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సంషర్‌గంజ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ రజాఉల్ హక్ కన్నుమూశారు. ఆయనకు ఇటీవల కరోనా నిర్ణారణ అయింది. కోల్‌కతాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. (కరోనా కలకలం: రికార్డు స్థాయిలో కేసులు) కాగా ఎనిమిదో దశల పోలింగ్‌లో భాగంగా 45 సీట్లుకు గాను ఐదో దశ ఏప్రిల్ 17న జరగనుంది. దీనికి సంబంధించిన ప్రచారం బుధవారం ముగిసింది. మరోవైపు బెంగాల్లో నూతన సంవత్సర వేడుకను నేడు (ఏప్రిల్ 15) జరుపుకుంటున్నారు. -
బీజేపీతో కరోనా పెరుగుతోంది: మమత
కోల్‌కతా: ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్రంలోకి బీజేపీ పెద్ద ఎత్తున బయటి వ్యక్తులను తీసుకువ చ్చిందని, అందువల్ల రాష్ట్రంలో కరోనా కేసులు పె రుగుతున్నాయని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఆరోపించారు. జల్‌పయిగురిలో ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్‌కు కూడా కేంద్రం సహకరించడం లేదన్నారు. మత ప్రాతిపదికన ఓట్లు అభ్యర్థించడంపై తనకు 24 గంటల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నిషేధం విధించడంపై స్పందిస్తూ.. ‘హిందువులు, ముస్లింలు, అందరూ ఓటేయాలని కోరడం తప్పా? ప్రతీ సభలో నన్ను అవమానిస్తున్న ప్రధాని మోదీని ప్రచారం నుంచి ఎందుకు బహిష్కరించడంలేదు?’ అని ప్రశ్నిం చారు. మమత బెనర్జీకి వీడ్కోలు పలికేందుకు సమయం ఆసన్నమైందని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. కూచ్‌బెహార్ జిల్లాలో కాల్పుల్లో మరణించిన ఓ బాధితుడి కుటుంబాన్ని ఓదార్చి, వారి బిడ్డను లాలిస్తున్న మమతా బెనర్జీ -
బెంగాల్లో ‘దళిత రాజకీయం’!
సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఎన్నికల సమయంలో రసవత్తరంగా మారాయి. ఇప్పటికే నాలుగు విడతల ఎన్నికలు పూర్తవగా, మిగతా నాలుగు దశల్లో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించుకొనేందుకు అధికార టీఎంసీతో పాటు కమలదళం ఉవ్విళూరుతున్నాయి. బెంగాల్ గడ్డపై కాషాయ జెండా ఎగురవేసేందుకు భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఎటాక్ మోడ్‌లోనే పనిచేస్తోంది.రాష్ట్రంలో కీలకంగా, నిర్ణయాత్మకంగా ఉన్న దళితులను మచ్చిక చేసుకొనేందుకు చిన్న అవకాశాన్ని టీఎంసీ, బీజేపీలు వదులుకోవట్లేదు. రాష్ట్రంలోని 294 అసెంబీ నియోజకవర్గాల్లో షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) కు 68, షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ)\కు 16 స్థానాలు ఉన్నాయి. అయితే రాష్ట్ర ఓటర్లలో 23.5 శాతం, జనాభాలో 25-30 శాతం మంది ఉన్న దళితులు రాష్ట్రంలోని కనీసం 100-110 సీట్ల ఫలితాలను ప్రభావితం చేయగలరు. ఈనెల 17 నుంచి 29వ తేదీ మధ్య జరుగబోయే చివరి నాలుగు దశల్లోని ఎక్కువ స్థానాల్లో వీరి ప్రభావం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తు న్నారు. తృణమూల్ కాంగ్రెస్‌కు దూరంగా ఉన్న మాతువా, ఆదివాసి, రాజవంశీ, బౌరి,బాగ్డి వంటి కులాలను తాయిలాలు ప్రకటించడం ద్వారా తమవైపు తిప్పుకొనేందుకు మమతా బెనర్జీ ఒకవైపు ప్రయత్నిస్తుంటే, మరోవైపు ఈ వర్గాలను ఆకర్షిం చేందుకు బీజేపి నాయకులు సైతం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఉత్తర బెంగాల్‌లోని కూచ్ బెహార్, ఇతర సరిహద్దు జిల్లాల్లో నివసిస్తున్న రాజ్‌వంశీలు, తూర్పు పాకిస్తాన్ నుంచి వచ్చిన శరణార్థులు మతువాలు. దళితుల్లోని ఈ రెండు బలమైన సామాజిక వర్గాలు దక్షిణ బెంగాల్‌లోని 30-40 సీట్లలో తమ ప్రభావాన్ని చూపిస్తారు. ఆ సామాజిక వర్గమే కీలకం మతువాలకు సంబంధించి అనేక అంశాల్లో కీలక ప్రకటనలు చేయడంతో పాటు, 2019 సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్ని అమలు చేసే ప్రక్రియపై కమలనాథులు ప్రణాళికలు అమలు చేస్తున్నారు.మతువా సామాజిక వర్గానికి పౌరసత్వం ఇచ్చేందుకు సవరించిన పౌరసత్వ చట్టం (సీఏఏ)ను అమలు చేయడంపై వారికి బీజేపీ నాయకులు హామీ ఇచ్చారు. అంతేగాక ఇతర రాష్ట్రాల్లో తమ విజయానికి కారణమైన ఎంతో నమ్మకమున్న పాత ఫార్ములాను పూర్తిస్థాయిలో కమలదళం అమలుచేస్తోంది. గిరిజనులు, దళితులు, రైతుల ఇళ్ళలో భోజనం చేయడం, స్థానిక దేవాలయాల్లో పూజలు చేయడం వంటి పాత ఫార్ములాను అనుసరించడంతో పాటు బెంగాల్లో కొత్త ప్రయోగాలను అమలు చేస్తోంది. అందులోభాగంగా ఇంటింటికి వెళ్ళి పిడికిలి బియ్యం తీసుకోవడం, సహపంక్తి భోజనాలు చేయడం వంటి కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో తమ పట్టును పెంచుకొనే ప్రయత్నాలు గత ఏడాదిగా ముమ్మరం చేశారు. బీజేపీ దశ మార్చిన సార్వత్రిక ఎన్నికలు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 79 మంది దళిత అభ్యర్థులను తృణమూల్ కాంగ్రెస్ నిలబెట్టగా, ఒక టీఎంసీ అభ్యర్థి దళితులను బిచ్చగాళ్లతో పోల్చినట్లు ఆరోపణలు రావడం రాష్ట్రంలో పెద్ద ఎత్తున వివాదాస్పదంగా మారింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కమలదళం రాష్ట్రంలోని రిజర్వ్ సీట్లలో ఎక్కువ భాగం గెలుచుకుంది. ఆ తర్వాత మమతాబెనర్జీ దిద్దుబాటు చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగా సీఎఎ అమలు ఆలస్యంతో పాటు అన్ని శరణార్థుల కాలనీలను క్రమబద్ధీకరించడానికి, వారికి భూమి హక్కులు ఇవ్వడం అంశాలపై దీదీ దృష్టిపెట్టింది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో రిజర్వు చేసిన 50 స్థానాల్లో తృణమూల్ విజయం సాధించగా, 2019 లోక్‌సభ ఎన్నికల్లో కమలదళం ఎస్సీ ఆధిప త్య ప్రాంతాల్లో తమదైన ముద్ర వేసుకొని 46 స్థానా ల్లో ఆధిక్యం సాధించింది. దీంతో ఇప్పుడు అధికార పీఠంపై కూర్చొనేందుకు నిర్ణయాత్మకంగా ఉన్న దళి తుల విషయంలో ఇరు పార్టీలు అత్యధిక శ్రద్ధ చూపిస్తున్నారు. అందులో భాగంగా అధికారంలోకి వచ్చిన వెంటనే మండల కమిషన్ సిఫారసుల ప్రకారం మహిష్య, తేలి, తముల్, సాహా వంటి సామాజిక వర్గాలను ఓబిసి జాబితాలో చేర్చుతామని బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్‌లు హామీ ఇచ్చాయి. దళితుల అంశంలో ఇరు పార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధాలు ప్రచారం ప్రారంభమైనప్పటి నుంచి కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు విభజన రాజకీయాల ద్వారా పశ్చిమ బెంగాల్ రాజకీయాల స్థాయిని బీజేపీ, టీఎంసీలు తగ్గిస్తున్నాయని సీపీఐ (ఎం) నిందించింది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు ఎప్పుడూ సైద్ధాంతిక మార్గాల్లోనే పోరాడుతున్నాయి. ఎప్పుడూ మతం, కుల ఆధారిత రాజకీయాలు వెనకబడే ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీదీ బాటలో బీజేపీ మతపరమైన మైనారిటీలతో పాటు దళితుల ఓట్లను టీఎంసీకి అనుకూలంగా ఏకీకృతం చేయాలని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ మొదట్లో భావించారు. 2011 ఎన్నికలలో టీఎంసీ అభ్యర్థులుగా మతువాల అధికార స్థానమైన మాతువా ఠాకుర్బారి సభ్యులను దీదీ నామినేట్ చేసింది. ఈ కారణంగా మమతా బెనర్జీ విజయానికి మార్గం సుగమం అయ్యింది. అనంతరం టీఎంసీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వివిధ సామాజిక వర్గాల అభివృద్ధి బోర్డులను ఏర్పాటు చేశారు. దీంతో 2014 లోక్‌సభ, 2016 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీకి కలిసి వచ్చింది. సీఏఏను అమలు చేస్తామని బిజెపి ఇచ్చిన వాగ్దానం, దళితుల్లో అత్యల్ప వర్గాలైన బౌరిస్, బాగ్డిస్ల మధ్య ఆర్ఎస్ఎస్ పని చేయడం, మాతువా ఠాకూర్బారి సభ్యులను నామినేట్ చేయాలన్న వ్యూహం కమలదళానికి అనుకూలంగా మారింది. అంతేగాక తృణమూల్ కాంగ్రెస్ మైనార్టీలను సంతృప్తిపరచడమే కాకుండా కాకుండా, బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలసదారులకు అనుకూలంగా ఉందని బీజేపీ ఆరోపిస్తోంది. -
బీజేపీ హంతకుల పార్టీ: మమత
తృణమూల్ కాంగ్రెస్‌పై నేరం మోపాలనే ఉద్దేశంతో బీజేపీ నేతలు సొంత కార్యకర్తలనే చంపేస్తున్నారని, సొంత వాహనాలను ధ్వంసం చేసుకుంటున్నారని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఒక బీజేపీ ఎంపీ అభ్యర్థి స్వయంగా సొంత కారును ధ్వంసం చేసుకుని, టీఎంసీపై ఆరోపణలు చేసిందన్నారు. కూచ్‌బిహార్ హింసాకాండను సమర్ధిస్తూ మాట్లాడుతున్న నాయకులపై రాజకీయాల్లో పాల్గొనకుండా నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. కూచ్‌బిహార్ జిల్లాలోని సీతల్‌కుచిలో శనివారం సీఐఎస్ఎఫ్ కాల్పుల్లో నలుగురు మరణించిన విషయం తెలిసిందే. దీనిపై మమత సోమవారం ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ.. అలాంటి వ్యాఖ్యలు చేసే వారు మనుషులే కారని మండిపడ్డారు. ‘సీతల్‌కుచి తరహా కాల్పులు మరిన్ని జరుగుతాయని కొందరు నాయకులు అంటున్నారు. సీతల్‌కుచిలో జరిగిన కాల్పుల్లో చనిపోయినవారి సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటే బావుండేదని మరి కొందరు నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
మమత ప్రచారంపై ఈసీ నిషేధం
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఎన్నికల ప్రచారంలో మత ప్రాతిపదికన ఓట్లు అభ్యర్థించడం, కేంద్ర బలగాలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై సోమవారం ఎన్నికల సంఘం స్పందించింది. 24 గంటల పాటు ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని నిషేధం విధించింది. ఏప్రిల్ 12 రాత్రి 8 గంటల నుంచి ఏప్రిల్ 13 రాత్రి 8 గంటల వరకు ఈ నిషేధం ఉంటుందని స్పష్టం చేసింది. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న సమయంలో ఇలాంటి బహిరంగ వ్యాఖ్యలు చేయవద్దని ఆదేశించింది. షోకాజ్ నోటీసుకు ఇచ్చిన సమాధానంలో కీలక అంశాలను ఆమె కావాలనే దాటవేశారని వ్యాఖ్యానించింది. ఈసీ నిర్ణయంపై మమత తీవ్రంగా స్పందించారు. ఈ నిషేధం రాజ్యాంగవిరుద్ధమని, దీనిపై కోల్‌కతాలో నేడు(మంగళవారం) ధర్నా చేస్తానని ప్రకటించారు. ఈసీ నిష్పక్షపాక్షితపై తమకు మొదట్నుంచీ అనుమానాలున్నాయని టీఎంసీ ఉపాధ్యక్షుడు యశ్వంత్ సిన్హా వ్యాఖ్యానించారు. మమతపై విధించిన తాజా నిషేధంతో ఈసీ వేసుకున్న ముసుగు పూర్తిగా తొలగిపోయిందని, ఎలక్షన్ కమిషన్ పూర్తిగా మోదీ, షాల ఆదేశాల మేరకు పనిచేస్తోందని స్పష్టమవుతోందని పేర్కొన్నారు. -
సర్కారు ఎవరిదో నిర్ణయించేది ఆ రెండు జిల్లాలే!
కోల్‌కతా: నార్త్ 24 పరగణ, సౌత్ 24 పరగణ.. పశ్చిమబెంగాల్లో ఈ రెండు జిల్లాలు తృణమూల్ కాంగ్రెస్‌కు కంచుకోటలు. ఈ కోటలను బద్దలు కొట్టి టీఎంసీ ఓటమికి బాటలు వేయాలనేది బీజేపీ ప్రణాళిక. ఈ రెండు జిల్లాల్లో మరోసారి అత్యధిక స్థానాలు గెలుపొందడం ద్వారా మరోసారి అధికారంలోకి రావాలన్నది టీఎంసీ ఆలోచన. మొత్తం 294 స్థానాల అసెంబ్లీలో ఈ రెండు జిల్లాలకు కలిపి 64 సీట్లు ఉన్నాయి. నార్త్ 24 పరగణలో 33, సౌత్ 24 పరగణలో 31 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. సౌత్ 24 పరగణలో మైనారిటీల ప్రాబల్యం ఎక్కువ. ఈ రెండు జిల్లాలకు బంగ్లాదేశ్‌తో సరిహద్దులున్నాయి. శరణార్థుల జనాభా కూడా ఇక్కడ ఎక్కువ. 1980లో 24 పరగణ జిల్లాను అప్పటి లెఫ్ట్ ప్రభుత్వం రెండు జిల్లాలుగా విభజించింది. మొదట్లో ఈ ప్రాంతంలో వామపక్షాలకు గట్టి పట్టు ఉన్నప్పటికీ క్రమంగా టీఎంసీ పుంజుకుని, లెఫ్ట్ బలాన్ని తగ్గించేసింది. నందిగ్రామ్, సింగూర్ ఉద్యమాలు ఈ ప్రాంతంలో టీంఎసీని మరింత బలోపేతం చేశాయి. 2011, 2016 ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల్లో దాదాపు అన్ని స్థానాలను టీఎంసీ గెల్చుకుంది. 2016లో నార్త్ పరగణలో 27, సౌత్ పరగణలో 29 స్థానాలను టీఎంసీ గెల్చుకుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల్లో నార్త్ పరగణలో బీజేపీ కొంతవరకు ప్రభావం చూపగలిగింది. ‘బెదిరింపులతో, ప్రలోభాలతో 2019 ఎన్నికల్లో బీజేపీ కొంత ప్రభావం చూపింది. కానీ ఆ తరువాత మేం జాగ్రత్తపడ్డాం. పార్టీ బలోపేతానికి తగిన చర్యలు తీసుకున్నాం’ అని నార్త్ 24 పరగణ జిల్లా టీఎంసీ అధ్యక్షుడు జ్యోతిప్రియొ తెలిపారు. పార్టీలో పెరుగుతున్న అంతర్గత విబేధాలు, మత ఘర్షణల కారణంగా రెండు జిల్లాల్లోనూ టీఎంసీ బలం కొంత తగ్గింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని ప్రచారాస్త్రంగా చేపట్టి, శరణార్ధులను ఆకర్షించి 2019 లోక్‌సభ ఎన్నికల్లో నార్త్ 24 పరగణ జిల్లాలో ఉన్న ఐదు స్థానాల్లో రెండింటిని బీజేపీ గెల్చుకోగలిగింది. అలాగే, అక్కడ ప్రబలంగా ఉన్న మథువా వర్గంలో పట్టు సాధించింది. నార్త్ 24 పరగణలోని 14 అసెంబ్లీ స్థానాల్లో మథువాలు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఈ రెండు జిల్లాల నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు సహా పెద్ద ఎత్తున పార్టీ నేతలు బీజేపీలో చేరడం టీఎంసీకి ఆందోళనకరంగా మారింది. కొత్తగా వచ్చిన ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్(ఐఎస్ఎఫ్) సౌత్ 24 పరగణ జిల్లాలో టీఎంసీకి చెందిన మైనారిటీ ఓట్లను చీల్చే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఐఎస్ఎఫ్ కాంగ్రెస్, లెఫ్ట్‌లతో కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల ప్రచారం సాయంతో నార్త్ 24 పరగణలో 60% సీట్లను సాధిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ధీమాగా ఉన్నారు. -
దీదీ నందిగ్రామ్‌లో క్లీన్‌బౌల్డ్: మోదీ
బర్ధమాన్: పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇన్నింగ్స్ ముగిసిందని బీజేపీ అగ్రనేత, ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో సోమవారం ఆయన క్రికెట్ పరిభాషలో కాసేపు మాట్లాడారు. గడచిన నాలుగు విడతల ఎన్నికల్లో బెంగాల్ ప్రజలు ఫోర్లు, సిక్సులు కొట్టారని, బీజేపీ సెంచరీ కొట్టేసిందని వ్యాఖ్యానించారు. సగం మ్యాచ్‌లోనే టీఎంసీని ప్రజలు ఊడ్చేశారన్నారు. ‘ఓటర్లు దీదీని నందిగ్రామ్‌లో క్లీన్‌బౌల్డ్ చేశారు. బెంగాల్లో ఆమె ఇన్నింగ్స్ ముగిసింది. ఆమె మొత్తం టీమ్‌ను కూడా గ్రౌండ్ నుంచి వెళ్లిపోవాలని ప్రజలు తేల్చేశారు’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. ఒక టీఎంసీ నాయకురాలు దళితులను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలతో బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆత్మ క్షోభిస్తుందన్నారు. రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాల వారిని భిక్షగాళ్లు అని ఇటీవల టీఎంసీ మహిళానేత, ఆ పార్టీ తరఫున అభ్యర్థిగా ఉన్న సుజాత మోండల్ వ్యాఖ్యానించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ‘దీదీ తనను తాను రాయల్ బెంగాల్ టైగర్ అని చెప్పుకుంటారు. ఆలాంటి టైగర్ అనుమతి లేకుండా పార్టీ నేత ఆ వ్యాఖ్యలు చేయగలరా? అలాంటి మాటలతో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆత్మ క్షోభిస్తుంది. మమత బెనర్జీ కనీసం ఆ వ్యాఖ్యలను ఖండించలేదు. క్షమాపణ చెప్పలేదు’ అన్నారు. దళితులను అవమానించి మమత పెద్ద తప్పు చేశారన్నారు. బంగ్లాదేశ్‌లో తాను మథువా సామాజిక వర్గానికి చెందిన సంస్కర్త హరిచంద్ ఠాకూర్ జన్మస్థలాన్ని సందర్శించడాన్ని మమత తప్పుబట్టారని మథువా వర్గం బలంగా ఉన్న కల్యానిలో జరిగిన సభలో ప్రధాని పేర్కొన్నారు. ఒక్కసారి అధికారం కోల్పోతే తిరిగి రాలేనన్న విషయం మమతకు అర్థమైందని వ్యాఖ్యానించారు. -
బెంగాల్ ప్రజలు ఆదేశిస్తే రాజీనామాకు సై: అమిత్ షా
బసీర్హట్/శాంతిపూర్: పశ్చిమ బెంగాల్ ప్రజలు ఆదేశిస్తే తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఖాయమని, మే 2న సీఎం మమతా బెనర్జీ గద్దె దిగడం తథ్యమని పునరుద్ఘాటించారు. కూచ్‌బెహార్ జిల్లాలో సీఐఎస్ఎఫ్ కాల్పులకు బాధ్యత వహిస్తూ అమిత్ షా రాజీనామా చేయాలని మమతా బెనర్జీ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అమిత్ షా ప్రతిస్పందించారు. ఆయన ఆదివారం ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బసీర్‌హట్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ‘‘నేను రాజీనామా చేయాలని దీదీ అన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రజలు ఆదేశిస్తే రాజీనామా పత్రాలు వెంటనే సమర్పిస్తా. శిరస్సు వంచి పదవి నుంచి తప్పుకుంటా. మే 2న మమతా బెనర్జీ కచ్చితంగా గద్దె దిగాల్సి ఉంటుంది’’ అని పేర్కొన్నారు. బెంగాల్లోకి అక్రమంగా వలస వచ్చిన వారిని బుజ్జగించేందుకు దీదీ ప్రయత్నిస్తున్నారని, అందుకే పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. అక్రమ వలసదారులు ఒకవైపు ప్రభుత్వ పథకాలతో ప్రయోజనం పొందుతూ మరోవైపు సమాజంలో అలజడి సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ వలసదారులకు వత్తాసు పలుకుతున్నవారికి రాష్ట్రాన్ని పాలించే హక్కు లేదన్నారు. బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రాగానే అక్రమ వలసలను అరికడతామన్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ బెంగాల్ అసెంబ్లీలో గతంలో చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకుంటామన్నారు. ‘ముఖ్యమంత్రి కాందీశీకుల సంక్షేమ నిధి’ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కాందీశీకులకు ఒక్కొక్కరికి ప్రతిఏటా రూ.10 వేల చొప్పున ఇస్తామని ప్రకటించారు. మమత రెచ్చగొట్టడం వల్లే కాల్పులు కేంద్ర భద్రతా బలగాలపై తిరగబడాలని మమతా బెనర్జీ ప్రజలను రెచ్చగొట్టారని, అందుకే కూచ్‌బెహార్ జిల్లాలో కాల్పులు జరిగాయని అమిత్ షా ఆరోపించారు. మరణాల విషయంలోనూ ఆమె బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఆయన ఆదివారం నాడియా జిల్లాలోని శాంతిపూర్‌లో రోడ్ షోలో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. మమతా బెనర్జీ రెచ్చగొట్టడం వల్ల ప్రజలు సీఐఎస్ఎఫ్ జవాన్లపై దాడికి దిగారని, ఆత్మరక్షణ కోసం జవాన్లు కాల్పులు జరపాల్సి వచ్చిందని చెప్పారు. కూచ్‌బెహార్ జిల్లాలో అధికార తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో ఆనంద బర్మన్ అనే బీజేపీ కార్యకర్త చనిపోయాడని అన్నారు. అతడి మృతి పట్ల మమత సంతాపం తెలపడం లేదని తప్పుపట్టారు. అతడు తృణమూల్ కాంగ్రెస్‌ను వ్యతిరేకించే రాజ్బోంగ్శీ వర్గానికి చెందినవాడు కావడమే ఇందుకు కారణమని అమిత్ షా పేర్కొన్నారు. చదవండి: దీదీ ఆటలు సాగవు.. గద్దె దిగక తప్పదు -
మారణహోమం.. బీజేపీ కుట్ర
రాజ్‌గంజ్/నాగ్రాకోట/చాల్సా: ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే అధికారంలోకి రావాలని కుట్రలు పన్నుతున్న బీజేపీకి ఓటు వేయొద్దని ప్రజలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. బీజేపీ కుతంత్రం కారణంగానే కూచ్‌బెహార్ జిల్లాలో ఎన్నికల కేంద్రం వద్ద కాల్పులు జరిగాయని, అమాయకులు బలయ్యారని ఆరోపించారు. ఆమె ఆదివారం జల్పాయ్గురి జిల్లాలో మూడు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. కాల్పులు జరిపిన సీఐఎస్ఎఫ్ జవాన్లను సమర్థిస్తూ బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇవే కాల్పుల్లో బీజేపీ నాయకుల కుటుంబ సభ్యులు చనిపోతే ఇలాగే మాట్లాడేవారా? అని నిలదీశారు. ఎన్నికల కేంద్రం వద్ద ఎవరైనా అలజడి సృష్టిస్తే లాఠీలకు పని చెప్పాల్సింది పోయి తుపాకులు ఎక్కుపెట్టడం దారుణమని మండిపడ్డారు. కూచ్‌బెహార్ ఘటనను ప్రజాస్వామ్యం హత్యకు గురైన ఘటనగా మమతా బెనర్జీ అభివర్ణించారు. బీజేపీ కుట్ర కారణంగా కూచ్‌బెహార్ జిల్లాను సందర్శించేందుకు ఎన్నికల సంఘం తనకు అనుమతి ఇవ్వలేదని ఆరోపించారు. అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా తాను ప్రజల పక్షానే ఉంటానని స్పష్టం చేశారు. హామీలను మర్చిపోవడం బీజేపీకి అలవాటే ప్రతి బుల్లెట్‌కు ఓట్లతోనే సమాధానం చెప్పాలని బెంగాల్ ఓటర్లకు మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య హక్కును తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని, అరాచక శక్తిగా మారిన బీజేపీని ఓడించాలని కోరారు. హామీలు ఇవ్వడం, మర్చిపోవడం బీజేపీకి అలవాటుగా మారిందన్నారు. కూచ్‌బెహార్ జిల్లాలో కాల్పుల ఘటనకు నిరసనగా మమతా బెనర్జీ నల్లరంగు స్కార్ప్ ధరించారు. ఈ కాల్పుల్లో మరణించిన వారిని స్మరించుకుంటూ నాగ్రాకోటలో తాత్కాలికంగా నిర్మించిన స్థూపం వద్ద నివాళులర్పించారు. సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారు కూచ్‌బెహార్ జిల్లాలోని సితాల్‌కుచీలో కాల్పుల ఘటనలో సాక్ష్యాధారాలను తారుమారు చేసేందుకు ఎన్నికల సంఘం ప్రయత్నిస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు. ఈ సంఘటన ఒక మారణహోమం అని చెప్పారు. ఆమె ఆదివారం సిలిగురిలో మీడియాతో మాట్లాడారు. సాక్ష్యాధారాలను చెరిపేసే ప్రయత్నంలో భాగంగానే 72 గంటల పాటు రాజకీయ నాయకుల సందర్శనపై ఆంక్షలు విధించారని అన్నారు. దేశంలో అసమర్థ కేంద్ర ప్రభుత్వం, అసమర్థ కేంద్ర హోంమంత్రి ఉన్నారని ధ్వజమెత్తారు.ఎన్నికల సంఘం కేవలం ఒక రాజకీయ పార్టీ ప్రయోజనాల కోసమే పని చేస్తోందని దుయ్యబట్టారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్(ఎంసీసీ)ను మోదీ కోడ్ ఆఫ్ కాండక్ట్‌గా మార్చుకోవాలని ఎన్నికల సంఘానికి మమతా బెనర్జీ హితవు పలికారు. ఈ మేరకు ఆమె ఆదివారం ట్వీట్ చేశారు. ప్రజలకు అండగా నిలవడానికి, వారి బాధను పంచుకోవడానికి ప్రపంచంలోని ఏ శక్తి కూడా తనను ఆపలేదని స్పష్టం చేశారు. -
మమతా బెనర్జీ డిమాండ్
-
అమిత్ షా రాజీనామా చేయాలి
బదూరియా/హింగల్గంజ్: కూచ్‌బెహార్ జిల్లాలో కేంద్ర బలగాల కాల్పులు జరపడాన్ని పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ ఖండించారు. ఈ ఘటనకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని, వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఆమె శనివారం బదూరియాలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. ప్రజలపై కాల్పులు జరపడం హేయమైన చర్య అని అన్నారు. ఓట్లు వేసేందుకు వరుసలో నిల్చున్నవారిపై అన్యాయంగా తుపాకులు ఎక్కుపెట్టారని చెప్పారు. కూచ్‌బెహార్ ఘటనకు నిరసనగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా తమ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు నల్లబ్యాడ్జీలు ధరించి, శాంతియుతంగా నిరసన తెలపాలని తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అమిత్ షా పన్నిన కుట్రలో భాగంగానే కేంద్ర బలగాలు కాల్పులు జరిపాయని మమత ఆరోపించారు. కూచ్‌బెహార్ జిల్లాలో కాల్పుల ఘటన వెనుక ఉన్న అసలు నిజాలను బయటపెట్టేందుకు సీఐడీ విచారణ జరిపిస్తామని అన్నారు. కేంద్ర భద్రతా బలగాలపై చేసిన వ్యాఖ్యలను మమత సమర్థించుకున్నారు. కేంద్ర బలగాలపై తనకు ఎంతో గౌరవం ఉందని చెప్పారు. ఏప్రిల్ 6న ఎన్నికల సంఘం జారీ చేసిన నోటీసుపై ఆమె శనివారం స్పందించారు. బెంగాల్లో విధుల్లో ఉన్న కేంద్ర బలగాల వ్యవహార శైలిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చాయని గుర్తుచేశారు. నోటీసును ఉపసంహరించుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. ఏప్రిల్ 6న తెల్లవారుజామున రామ్‌నగర్‌లో తారకేశ్వర్ పోలీసు స్టేషన్ పరిధిలో సీఆర్పీఎఫ్ సిబ్బంది ఓ బాలికను వేధించినట్లు కేసులు నమోదయ్యిందని తెలిపారు. ఇప్పటివరకు బాధ్యులపై చర్యలు తీసుకోలేదని ఆక్షేపించారు. కూచ్‌బెహార్ ఘటన వెనుక ముందస్తు ప్రణాళిక ఉందని తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. కాల్పుల వీడియో ఫుటేజీని బయట పెట్టాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. మృతుల కుటుంబాలను మమత పరామర్శిస్తారని చెప్పారు. -
దీదీ ఆటలు సాగవు.. గద్దె దిగక తప్పదు
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ బెంగాల్‌ను హింసాత్మకంగా మారుస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కూచ్‌బెహార్ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. ఆయన శనివారం బెంగాల్ రాష్ట్రం నాడియా జిల్లాలోని సిలిగురి, కృష్ణానగర్‌లో ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రజలను రెచ్చగొట్టి కేంద్ర బలగాలపైకి ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో నెగ్గడానికి రక్తపాతం సృష్టించి, రిగ్గింగ్ చేసుకోవాలన్న తృణమూల్ కాంగ్రెస్ కుట్రలతోనే సమస్యలు వస్తున్నాయని చెప్పారు. కూచ్‌బెహార్ ఘటన దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. కాల్పుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రధాని మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. బెంగాల్లో బీజేపీకి ప్రజాదరణ పెరగడం చూసి మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ గూండాలు భరించలేకపోతున్నారని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. ఆక్రోశం పట్టలేకపోతున్నారని, అందుకే భద్రతా సిబ్బందిపై దాడి చేయాలంటూ జనానికి నూరిపోస్తున్నారని విమర్శించారు. మళ్లీ కుర్చీ దక్కకుండా పోతోందన్న భయంతో నీచ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. రిగ్గింగ్‌కు అడ్డుగా ఉన్నాయన్న కారణంతోనే కేంద్ర బలగాలపై తృణమూల్ కాంగ్రెస్ గూండాలు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. దీదీ ఆటలు ఇక సాగవని హెచ్చరించారు. ఆమె గద్దె దిగక తప్పదని తేల్చిచెప్పారు. బెంగాల్లో తాము అధికారంలోకి రాగానే లంచాల సంస్కృతికి చరమ గీతం పాడుతామన్నారు. మూడు టీలకు(టీ, టూరిజం, టింబర్) మాఫియా చెర విముక్తి కల్పిస్తామని హామీ ఇచ్చారు. మే 2వ తేదీ నుంచి బెంగాల్లో ప్రభుత్వ నిర్ణయాలను ప్రభుత్వమే తీసుకుంటుందని, దోపిడీదార్లు కాదని మోదీ స్పష్టం చేశారు. -
బెంగాల్ ఎన్నికలు రక్తసిక్తం
సితాల్‌కుచీ/సిలిగురి/కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికలు రక్తసిక్తమయ్యాయి. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక అతిపెద్ద హింసాకాండ శనివారం చోటుచేసుకుంది. కూచ్‌బెహార్ జిల్లాలో రెండు ఘటనల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. నాలుగో దశ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూచ్‌బెహార్ జిల్లా సితాల్‌కుచీ నియోజకవర్గం పరిధిలోని మాతాభంగా పోలింగ్ కేంద్రం వద్ద శనివారం ఉదయం 9.40 గంటలకు కాల్పులు జరిగాయి. ఎన్నికల విధుల్లో ఉన్న కేంద్ర బలగాల నుంచి తుపాకులు లాక్కొనేందుకు స్థానికులు ప్రయత్నించారని, దాడికి దిగారని పోలీసు అధికారులు చెప్పారు. ఆత్మరక్షణ కోసం కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్ఎఫ్) సిబ్బంది జరిపిన కాల్పుల్లో నలుగురు చనిపోయినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని వెల్లడించారు. మృతులు తమ పార్టీ మద్దతుదారులని అధికార తృణమూల్ కాంగ్రెస్ పేర్కొంది. క్యూఆర్టీ వాహనం ధ్వంసం ఓట్లు వేయడానికి వచ్చినవారిపై తొలుత కొందరు రాళ్లు రువ్వారని, విధుల్లో ఉన్న భద్రతా సిబ్బందితో ఘర్షణకు దిగారని తెలిపారు. కేంద్ర బలగాలకు చెందిన క్విక్ రియాక్షన్ టీమ్(క్యూఆర్టీ) వాహనాన్ని ధ్వంసం చేశారని పేర్కొన్నారు. వారిని చెదరగొట్టేందుకు గాల్లోకి కాల్పులు జరిపినా వెనక్కి తగ్గలేదని, భద్రతా సిబ్బందిపైకి దూసుకొచ్చారని, తుపాకులు లాక్కొనేందుకు ప్రయత్నించారని వివరించారు. ఆత్మరక్షణతోపాటు పోలింగ్ బూత్‌ను, ఎన్నికల సిబ్బందిని రక్షించడానికి అల్లరి మూకపై భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారన్నారు. నలుగురు మరణించగా, మరో నలుగురికి బుల్లెట్ గాయాలు అయ్యాయని వెల్లడించారు. ఈ మొత్తం ఘటనపై నివేదిక సమర్పించాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. 4 మృతదేహాలను అధికారులు సమీప ఆసుపత్రికి తరలించారు. మరో ఘటనలో ఓటర్ కాల్చివేత కూచ్‌బెహార్ జిల్లాలో సితాల్‌కుచీ నియోజకవర్గం పరిధిలో శనివారం ఉదయం మరో దారుణం చోటుచేసుకుంది. మొదటిసారి ఓటు వేసేందుకు వచ్చిన ఆనంద బర్మన్(18)ను పఠాన్‌తులీలో 85వ నంబర్ పోలింగ్ బూత్ బయట గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో బర్మన్ మరణించాడు. 126/5 బూత్‌లో పోలింగ్ నిలిపివేత సితాల్‌కుచీ నియోజకవర్గంలోని 126/5 పోలింగ్ బూత్ వద్ద కాల్పులు జరగడం, నలుగురు మరణించడంతో ఎన్నికల సంఘం అధికారులు అప్రమత్తమయ్యారు. అక్కడ వెంటనే పోలింగ్‌ను నిలిపివేశారు. రీపోలింగ్ నిర్వహిస్తామని ప్రకటించారు. కేంద్ర బలగాలు ఒక వ్యక్తిని కాల్చి చంపాయన్న పుకారు కార్చిచ్చులా వ్యాపించడంతో దా దాపు 400 మంది వెంటనే 126/5 పోలింగ్ బూత్ వద్దకు చేరుకున్నారని, కేంద్ర జవాన్లను ఘెరావ్ చేశారని కూచ్‌బెహార్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. నిజానికి పోలింగ్ బూత్ వద్ద ఒక వ్యక్తి అపస్మారక స్థితిలో పడిపోతే భద్రతా సిబ్బంది సపర్యలు చేశారని అన్నారు. కానీ, అతడిని కాల్చి చంపారని తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు. టీఎంసీ, బీజేపీ మధ్య ఘర్షణలు ఎన్నికల సందర్భంగా బెంగాల్లో పలు చోట్ల టీఎంసీ, బీజేపీ మధ్య ఘర్షణలు జరిగాయి. దిన్హతా నియోజకవర్గంలో టీఎంసీ అభ్యర్థి ఉదయన్ గుహపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. దీంతో ఆయన గాయాలపాలయ్యారు. బెహలా పూర్బా స్థానంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సినీ నటి పాయల్ సర్కారు కారుపై అల్లరి మూక దాడికి పాల్పడింది. వారి బారి నుంచి ఆమె క్షేమంగా తప్పించుకున్నారు. బీజేపీ ఎంపీ లాకెట్ చటర్జీపైనా టీఎంసీ మద్దతుదారులు దాడికి దిగారు. హుగ్లీ జిల్లాలోని చుచురాలో ఆమె కారును ధ్వంసం చేశారు. హౌరా జిల్లాలోని బాల్లీలో బీజేపీ అభ్యర్థి బైశాలీ దాల్మియా కాన్వాయ్‌పై టీఎంసీ కార్యకర్తలు విరుచుకుపడ్డారు. ఒక వాహనాన్ని ధ్వంసం చేశారు. కోల్‌కతాలో బీజేపీ అభ్యర్థి ఇంద్రనీల్ ఖాన్‌ను టీఎంసీ శ్రేణులు ఘెరావ్ చేశాయి. జాదవ్‌పూర్‌లో సీపీఎం ఏజెంట్‌పై కొందరు దుండగులు కారం పొడి చల్లి దాడి చేశారు. బంగోర్ నియోజకవర్గంలో ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్, టీఎంసీ మద్దతుదారుల మధ్య ఘర్షణ జరిగింది. ఇప్పటిదాకా 8 మంది అరెస్టు కూచ్‌బెహార్ జిల్లాలో రెండు హింసాత్మక ఘటనలకు సంబంధించి ఇప్పటివరకు 8 మందిని అరెస్టు చేసినట్లు పశ్చిమ బెంగాల్ చీఫ్ ఎలక్టోరల్ అధికారి అరీఫ్ అఫ్తాబ్ చెప్పారు. రెండు ఘటనలపై కూచ్‌బెహార్ జిల్లా కలెక్టర్, ఎస్పీ నుంచి నివేదికను కోరినట్లు తెలిపారు. సితాల్‌కుచీ అసెంబ్లీ స్థానం పరిధిలో జోర్పాట్కీ పోలింగ్ బూత్ వద్ద రెండు వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొందన్న సమాచారంతో భద్రతా బలగాలు అక్కడికి చేరుకున్నాయని వివరించారు. ఈ నేపథ్యంలోనే కాల్పులు జరిగాయన్నారు. పఠాన్‌తులీలో యువకుడిని కాల్చి చంపిన ఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. నాలుగో దశలో 76.16 శాతం ఓటింగ్ పశ్చిమ బెంగాల్లో నాలుగో దశలో 44 అసెంబ్లీ స్థానాలకు శనివారం ఎన్నికలు జరిగాయి. సాయంత్రం 5 గంటల వరకు 76.16 శాతం పోలింగ్ నమోదయినట్లు ఎన్నికల సంఘం(ఈసీ) ప్రకటించింది. 15,940 పోలింగ్ కేంద్రాల్లో జనం ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్ర బలగాలను, పోలీసు శాఖను దుర్వినియోగం చేస్తున్నారన్న తృణమూల్ కాంగ్రెస్ ఆరోపణలపై ఈసీ స్పందించింది. ప్రిసైడింగ్ అధికారి సూచిస్తే తప్ప పోలింగ్ బూత్‌ల్లోకి వెళ్లొద్దని కేంద్ర బలగాలకు, పోలీసులకు ఆదేశాలు జారీ చేశామని పేర్కొంది. కూచ్‌బెహార్ జిల్లాలో అశాంతి తలెత్తకుండా రాజకీయ నాయకుల ప్రవేశంపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. రాబోయే 72 గంటల వరకూ ఎవరూ జిల్లాలో అడుగుపెట్టొద్దని స్పష్టం చేసింది. ఐదో దశ ఎన్నికల్లో ‘సైలెన్స్ íపీరియడ్’ను 48 గంటల నుంచి 72 గంటలకు పెంచింది. ఈ ఆంక్షలు వెంటనే అమల్లోకి వస్తాయని తెలిపింది. అదనంగా 71 కంపెనీల కేంద్ర బలగాలు బెంగాల్లో మరో నాలుగు దశల అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. శనివారం కూచ్‌బెహార్ జిల్లాలో మూడో దశ ఎన్నికల సందర్భంగా హింస చోటుచేసుకోవడం, నలుగురు మరణించడంతో కేంద్ర ఎన్నికల సంఘం అప్రమత్తమయ్యింది. ఈ పరిస్థితి పునరావృతం కాకుండా చూసేందుకు బెంగాల్‌కు అదనంగా 71 కంపెనీల కేంద్ర బలగాలను వెంటనే తరలించాలని కేంద్ర హోంశాఖకు శనివారం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం 1,000 కంపెనీల కేంద్ర బలగాలు బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విధులు నిర్వర్తిస్తున్నాయి. -
గ్రేట్ ఇండియన్ ‘దేజా వూ’
పరిణామాలు కొన్ని వింతగొలుపుతున్నవి. చరిత్ర పునరావృత మవుతున్నట్టుగా తోస్తున్నది. ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ గతంలోనే చూసినట్టు తోచే మానసిక స్థితిని దేజా వూ అంటారు. ఇప్పుడు మస్తిష్కం నిండా దేజా వూ! అమెరికా సప్తమ నౌకా దళానికి (సెవెంత్ ఫ్లీట్) చెందిన యుద్ధనౌక ఒకటి శుక్రవారం నాడు భారత పొలిమేరల్లోకి వచ్చింది. అది కూడా స్నేహపూర్వ కంగా కాదు. ఆ నౌకాదళం విడుదల చేసిన ప్రకటన చూస్తుంటే దాని ధోరణి భారత సార్వభౌమాధికారాన్ని సవాల్ చేస్తున్నట్టు గానే ఉన్నది. ఏ దేశానికైనా తీరం నుంచి రెండొందల నాటికల్ మైళ్ల దూరం వరకు ప్రత్యేక వాణిజ్య హక్కులుంటాయి. ఆ పరిధి దాటి లోపలికి రావాలంటే అనుమతి అవసరం. ఇది 1976 నాటి మారిటైమ్ చట్టం ప్రకారం దేశాలకు దఖలుపడ్డ ప్రత్యేక హక్కు. ఇప్పుడా హక్కును అమెరికా సెవెంత్ ఫ్లీట్ ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించింది. మార్కెట్లో వ్యాపారుల దగ్గర మామూళ్లకోసం ముందుగా ఓ ఆకు రౌడీ వస్తాడు. మాట వినకపోతే ఆ వెనుక చాకురౌడీ వస్తాడు. గడిచిన ఏడున్నర దశాబ్దాలుగా సెవెంత్ ఫ్లీట్ ఈ చాకు రౌడీ పాత్రను పోషిస్తున్నది. ఫిలిప్పీన్స్, కొరియా, వియత్నాంల నుంచి పడమట పర్షియన్ గల్ఫ్ వరకు పలుచోట్ల సప్తమ నౌకాదళం యుద్ధనౌకలు గతంలో లంగరేశాయి. ఎక్కడ లంగరు వేసినా సరే, అక్కడ ఆకాశంలో ఏదో మర్డర్ జరిగినట్టుగా ఎర్ర బారుతుంది. సూర్యుడు నెత్తురు కక్కుతున్నట్టుగా కనిపిస్తాడు. ఒక్క మాటలో సెవెంత్ ఫ్లీట్ వృత్తాంతం మొత్తం ఇదే. భారత్‌పై సెవెంత్ ఫ్లీట్ తాజా కవ్వింపు యాభయ్యేళ్ల కిందటి సంగతిని గుర్తు చేస్తున్నది. భారత్–పాక్‌ల మధ్య బంగ్లా యుద్ధంలో జరుగుతున్న రోజుల్లో కూడా సెవెంత్ ఫ్లీట్ బంగాళాఖాతంలోకి ప్రవేశించి, బెదిరించే ప్రయత్నం చేసింది. కానీ, అప్పటికే భారత్–రష్యాల మధ్య సైనిక సహకార ఒప్పందం ఉన్న కారణంగా అమెరికా ప్రయత్నం ఫలించలేదు. అప్పుడు పాకిస్తాన్లో అంతర్భాగంగా ఉన్న తూర్పు బెంగాల్ (ప్రస్తుత బంగ్లాదేశ్) ప్రజలను పాక్ సైనిక పాలకులు రెండోశ్రేణి పౌరులుగా చులకన చూసేవారు. బెంగాలీ సంస్కృతిని చిన్న చూపు చూసేవారు. ఈ వైఖరిపై బెంగాలీ ప్రజల నిరసన జాతీ యోద్యమం రూపుదాల్చింది. ఉద్యమంపై పాక్ పాలకులు ఉక్కుపాదం మోపారు. లక్షల సంఖ్యలో తూర్పు బెంగాలీలు పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లోకి ప్రవేశించారు. అంది వచ్చిన అవకాశాన్ని నాటి ప్రధాని ఇందిరాగాంధీ చాకచక్యంగా ఉపయోగించుకున్నారు. పాకిస్తాన్‌ను చావుదెబ్బ కొట్టి బంగ్లాదేశ్ ఆవిర్భావానికి కారకులయ్యారు. అప్పటినుంచి ఆమె ప్రభ మధ్యందిన మార్తాండ తేజంతో వెలిగిపోయింది. నాటి జన సంఘ్ నాయకుడు వాజ్‌పేయి సైతం ఆమెను అపర కాళికా దేవిగా కొనియాడారు. కాంగ్రెస్ అధ్యక్షుడు దేవకాంత బారువా ఒకడుగు ముందుకువేసి ఇందిర ఈజ్ ఇండియా–ఇండియా ఈజ్ ఇందిర’ అనే నినాదాన్ని ప్రచారంలో పెట్టాడు. బంగ్లా యుద్ధం భారత రాజకీయాలను మలుపు తిప్పింది. ఏకధ్రువ రాజకీయ వ్యవస్థకు తోడుగా, ఏకవ్యక్తి నియంతృత్వ పాలన కాంక్ష కూడా ఇందిరలో ప్రబలింది. ఇది ఎమర్జెన్సీకి దారి తీసింది. చివరకు ఇందిరమ్మ సర్కార్ ఎన్నికల్లో కుప్పకూలింది. ఇప్పుడు జరుగుతున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్ని కలకూ భారత పొలిమేరల్లోకి వచ్చిన అమెరికా సెవెంత్ ఫ్లీట్ యుద్ధ నౌకకూ ఎటువంటి సంబంధం లేదు. ఆ నౌక బంగాళా ఖాతంలోకి కూడా రాలేదు. అరేబియా సముద్రంలో లక్షద్వీప సముదాయానికి చేరువగా వచ్చింది. కాకపోతే బెంగాల్ ఎన్నికల ఫలితాలకు మాత్రం భారత రాజకీయాలను మలుపుతిప్పే సామర్థ్యం ఉన్నది. ఒకవేళ నరేంద్రమోదీ నాయకత్వంలోని బీజేపీ బెంగాల్లో గెలిస్తే అశోకుడు కళింగ యుద్ధం గెలిచినట్టే. ఆర్యావర్తమంతటా కాషాయ ధ్వజారోహణం జరిగినట్టే. మిగిలి పోయే కొన్ని దక్షిణాది రాష్ట్రాలను ప్రాంతీయ పార్టీల పొత్తులతో నెట్టుకురావల్సిందేనన్న అవగాహన ఆ పార్టీకి ఉన్నది. యుద్ధాల అవసరం పూర్తయిన తర్వాత అశోకుడు శేషజీవితాన్ని ధర్మ ప్రచారానికి వెచ్చించాడు. బెంగాల్ సవాల్‌ను బీజేపీ విజయ వంతంగా అధిగమించగలిగితే ఇక దేశంలో ఏకధ్రువ రాజకీ యాలు పునరావృతమవుతాయి. ఆరెస్సెస్ భావజాల వ్యాప్తికి మార్గం సుగమమవుతుంది. 1952 నుంచి 89 వరకు కాంగ్రెస్ నాయకత్వంలో ఏకధ్రువ రాజకీయ వ్యవస్థ కొనసాగింది. 1967లో తొమ్మిది రాష్ట్రాల్లో, 1977లో కేంద్ర స్థాయిలో కంగు తిన్నప్పటికీ 89 వరకు ఈ వ్యవస్థ నిలబడగలిగింది. అప్పటి నుంచీ పదేళ్లపాటు దేశ రాజకీయాలది ప్రయోగశీల దశ. 1999 నుంచి 2019 వరకు రెండు కూటముల ద్వయీ ధ్రువ రాజకీయాలు నడిచాయి. బెంగాల్లో గెలిస్తే మరోసారి ఏకధ్రువ వ్యవస్థకు పునాది పడుతుంది. ఈ పరిస్థితి మరోసారి నియంతృత్వ పోకడలకు దారితీసే అవకాశాలు లేకపోలేదు. ఇందిరాగాంధీలో పొడసూపిన నియంతృత్వ పోక డలు ఆమె వ్యక్తిగత స్థాయికే పరిమితం. కానీ ఇప్పుడు నడిచేది నరేంద్రమోదీ అయినా, నడిపించేది భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీని నియంత్రించేది సుసంఘటితమైన ఆర్ఎస్ఎస్. ఎదురు లేని అధికారం ఒకవేళ ఇప్పుడు నియంతృత్వ పోకడలకు బాటలు వేస్తే ఆ నియంతృత్వం వ్యవస్థీకృతంగా ఉంటుంది తప్ప వ్యక్తిగతం కాబోదు. సిద్ధాంతాలు, విధానాలు, ఆలోచనలు, ఆశయాలు, రాజకీ యాలన్నింటిలోనూ కాంగ్రెస్‌కు బీజేపీ భిన్నమైన పార్టీ. కానీ అధికారంలో ఉన్నప్పుడు రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయ వలసిన అవసరం ఉంటుంది కనుక సంఘ్ భావజాలాన్ని పూర్తిస్థాయిలో అమలుచేసే అవకాశం బీజేపీ ప్రభుత్వానికి కుదరడం లేదు. ఏకధ్రువ రాజకీయ వ్యవస్థ కుదురుకుంటే రాజ్యాంగంలో అవసరమైన సవరణలకు బీజేపీ వెనుకాడక పోవచ్చు. బలమైన కేంద్రం దిశగా ఆ పార్టీ అడుగులు వేస్తుంది. అందుకోసం రాష్ట్రాల అధికారాలను కత్తిరించే ప్రయత్నం చేస్తుంది. జాతీయ స్థాయిలో ప్రతిపక్షం నిర్వీర్యమైన నేపథ్యంలో పార్టీకి ముప్పు ముంచుకొచ్చే అవకాశం ప్రాంతీయ పార్టీల నుంచే గనక బలమైన రాష్ట్రాల ఉనికి రాజకీయంగా కూడా బీజేపీకి సమ్మతం కాదు. బెంగాల్ ఎన్నికల్లో గెలిస్తే ఈ దిశలో బీజేపీ ప్రయాణం వేగం పుంజుకుంటుంది. ఓడితే వేగం తగ్గుతుంది. మమతా బెనర్జీకి మాత్రం బెంగాల్ ఎన్నికలు జీవన్మరణ సమస్య. గెలిస్తే ఆమెకు జాతీయస్థాయిలో ప్రముఖ పాత్ర లభిస్తుంది. ఓడిపోతే పార్టీ మనుగడే కష్టం. ప్రభుత్వం, పోలీ సుల తోడ్పాటుతో చెలరేగడం తప్ప సంస్థాగతంగా తృణమూల్ కాంగ్రెస్‌కు అంత బలమైన పునాదులేమీ లేవు. పైగా ప్రతి పక్షాలపై విరుచుకుపడటం, దాడులు, దౌర్జన్యాలు చేయడం పశ్చిమ బెంగాల్ రాజకీయ సంస్కృతిలో భాగంగా మారాయి. నిర్మాణపరంగా బలమైన సీపీఎం, కాంగ్రెస్ పార్టీలే హింసా రాజకీయాల ధాటికి అల్లాడుతున్నాయి. బీజేపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొని ప్రతిపక్షంగా నిలదొక్కుకోవడం మమతకు శక్తికి మించిన కార్యంగా మారుతుంది. ఇప్పుడు గెలవడమే ఆమె పార్టీ మనుగడకు ఏకైక మార్గం. బెంగాల్లో ఏ ప్రాంతానికి వెళ్లినా ‘పరివర్తన్’ (మార్పు) అనే మాట బాగా వినపడుతున్నదని రాష్ట్రంలో పర్యటిస్తున్న వారు చెబుతున్నారు. పదేళ్ల కిందటి ఎన్నికలప్పుడు మొదటిసారిగా మమతా బెనర్జీయే ఈ మాటను ఉపయోగిం చారు. అప్పుడు జనంలో ఈ మాట మంత్రంలా మార్మోగింది. ఎన్నికల్లో నిజంగానే పరివర్తన జరిగింది. 34 ఏళ్లపాటు ఏకధాటిగా పాలించిన సీపీఎం కూటమి సర్కార్ కుప్పకూలింది. ఈసారి ఈ మాటను మోదీ ఉపయోగిస్తున్నారు. అసలు పరివ ర్తన్ (నిజమైన మార్పు) కావాలని ఆయన జనానికి చెబుతు న్నారు. జనంలోకి ఈసారి కూడా ఈ మాట బాగానే వెళ్లినట్టు కనిపిస్తున్నది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మమతా బెనర్జీ చుట్టూ ఉన్న కోటరీలో అవినీతి ప్రబలిందనీ, వారు చేసే అరాచకాలు పెచ్చరిల్లాయని జనంలో ఒక అభి ప్రాయం ఏర్పడింది. దీనికితోడు బీజేపీ అమలుచేసిన సోషల్ ఇంజనీరింగ్ కూడా ఆ పార్టీకి కలిసివచ్చే అవకాశం ఉంది. సుదీర్ఘకాలంపాటు బెంగాల్ రాజకీయాలపై ఆధిపత్యం చలాయించిన కమ్యూనిస్టులు కులం సమస్యను గుర్తించలేదు. వెనుకబడిన కులాల అస్తిత్వ సమస్యలను, వాటి ఆకాంక్షలను అంచనావేయలేకపోయారు. మండల్ ఆందోళన దేశాన్ని కుది పేస్తున్న రోజుల్లో కొందరు జాతీయ మీడియా ప్రతినిధులు అప్పటి బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతిబసును ఈ అంశంపై ప్రశ్నించారు. అందుకాయన బదులిస్తూ ‘మా రాష్ట్రంలో రెండే కులాలున్నాయి. ఒకటి పేదల కులం, రెండు ధనికుల కులం’ అన్నారు. అదీ, కుల సమస్యపై కమ్యూనిస్టుల అవగాహన. సమాజంలో క్రీమీలేయర్‌గా చలామణి అయ్యే చదువుకున్న వారు, ఉన్నత–మధ్యతరగతి వర్గం ప్రజలను బెంగాల్లో భద్ర లోక్ అంటారు. కమ్యూనిస్టుల నాయకత్వ శ్రేణుల్లో కూడా ఈ భద్రలోక్ బృందమే ఎక్కువగా ఉండేది. వాళ్లలో అత్యధికులు సహజంగానే ఉన్నత కులాలకు చెందినవాళ్లే ఉండేవారు. రైతులు, వ్యవసాయ – పారిశ్రామిక కార్మికులుగా ఉండే తక్కువ కులాలవారు భద్రలోక్ నాయకత్వంలో కమ్యూనిస్టు అనుబంధ సంఘాల్లో సంఘటితమై ఉండేవారు. కానీ, నాయకత్వ శ్రేణు ల్లోకి పెద్దసంఖ్యలో చేరుకోలేకపోయేవారు. జ్యోతిబసు ముఖ్య మంత్రిగా 1978లో ప్రారంభించిన ఆపరేషన్ బర్గా (భూసంస్క రణలు) దేశంలో ఎక్కడా లేనంత పటిష్టంగా అమలైన కార ణంగా పదిహేను లక్షలమందికి కొత్తగా సేద్యపు భూమి దక్కింది. ఈ రైతులందరూ వారి జీవితకాలం పాటు ఎర్రజెండా నీడలోనే ఉండిపోయారు. కానీ తరువాతి తరం ఆకాంక్షలను గుర్తించడంలో కమ్యూనిస్టులు విఫలమయ్యారు. అలాగే పారిశ్రా మిక కార్మికులందరూ వామపక్ష కార్మిక సంఘాల్లో సభ్యులుగా ఉండేవాళ్లు. కనుక బెంగాల్ రాజకీయాల్లో కులం అనేది నిన్నమొన్నటివరకు ఒక సమస్యగా ముందుకు రాలేదు. కమ్యూ నిస్టుల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ కూడా ఈ రాజకీయ– సామాజిక పొందికపై పెద్దగా దృష్టిపెట్టలేదు. గడిచిన రెండు మూడేళ్లుగా భారతీయ జనతా పార్టీ బెంగాల్ సామాజిక సమీకరణాలపై బాగా దృష్టిపెట్టింది. వెనుకబడిన శూద్ర కులాల్లో, దళితుల్లో గిరిజనుల్లో ఉండే అస్తిత్వ ఆరాటాన్ని పసిగట్టి వాళ్లను నాయకత్వ శ్రేణుల్లోకి తీసుకొచ్చింది. మరోపక్క భద్రలోక్ వర్గాన్ని కూడా జాతీయవాద భావ జాలంతో ఆకర్షించగలిగింది. బీజేపీ చాపకింద నీరులా చేపట్టిన ఈ సోషల్ ఇంజనీరింగ్‌ను తృణమూల్ కాంగ్రెస్ ఆలస్యంగా గుర్తించింది. దాంతో బెంగాల్ సంస్కృతిని హుటాహుటిన రంగంలోకి దించారు. బెంగాల్ సంస్కృతిపై మోదీ యుద్ధం చేస్తున్నారని మమత ప్రచారాన్ని ఎత్తుకున్నారు. అయితే బెంగాల్ సంస్కృతిగా మనం పరిగణించేది ప్రధానంగా అక్కడి భద్రలోక్ సంస్కృతి. ఈ సంస్కృతి వలయానికి ఆవల వున్న విశాల శ్రామిక ప్రజానీకం ఎంతమేరకు మమత పిలుపునకు స్పందిస్తారో వేచి చూడాలి. ప్రీపోల్ సర్వేలన్నీ మమతా బెనర్జీ విజయాన్ని ఘోషిస్తున్నాయి. గాలి చూస్తే ‘పరివర్తన్’ కోరు తున్నది. మమతా బెనర్జీని బెంగాలీలు దీదీ అని పిలుచుకుంటారని తెలిసిందే. బీజేపీ వాళ్లు మాత్రం ప్రచారంలో వెటకారం చేస్తున్నారు. అరవయ్యారేళ్ల వయసులో దీదీ ఏమిటి? ‘పీషీ’ (అత్త) అనాలంటూ ప్రచారం చేస్తున్నారు. వయసు పెరిగితే మాత్రం వరస మారుతుందా? కాకపోతే బడా దీదీ (పెద్దక్క) అనొచ్చు. బడా దీదీ అనే మాట కూడా చాలా పాపులర్. సుప్ర సిద్ధ బెంగాలీ రచయిత శరత్ చంద్ర ఛటర్జీ నవలల్లో బడా దీదీ కూడా ఒకటి. శరత్ సాహిత్యం తెలుగులో ఎంత ప్రాచుర్యం పొందిందో చెప్పనక్కరలేదు. బడాదీదీ తెలుగు నవలతోపాటు ‘బాటసారి’ పేరుతో సినిమాగా కూడా వచ్చింది. అక్కినేని నాగేశ్వరరావు అద్భుతంగా నటించిన సినిమాల్లో ఒకటి. ఇందులో హీరో అందుబాటులోనే ఉన్నంత కాలం భానుమతి (సినిమాలో బడా దీదీ) ఏదో చెప్పాలను కుంటూనే చెప్పలేకపోతుంది. అతడు దూరమైన తర్వాత దుఃఖిస్తూ ‘ఓ బాటసారీ... ననూ మరవకోయీ’ అని పాడు కుంటుంది. ఇప్పుడు మన బెంగాల్ బడా దీదీ ఇప్పటికే ఆ పరిస్థి తికి చేరుకున్నదా... ఆమెకు ఇంకా సమయం మిగిలే ఉన్నదా అనేది ఫలితాలతోనే తేలాల్సి ఉంది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
పోలింగ్ వేళ ఉద్రిక్తత.. నలుగురు మృతి
-
బెంగాల్లో దీదీ గూండాగిరి ఇక చెల్లదు: పీఎం మోదీ
-
పోలింగ్ వేళ ఉద్రిక్తత.. నలుగురు మృతి
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నాలుగో విడత పోలింగ్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పోలీంగ్ కేంద్రం బయట భద్రతాదళాలు కాల్పులకు దిగడంతో నలుగురు మృతి చెందారు. కూచ్‌బెహార్ జిల్లాలో టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య తలెత్తిన ఘర్షణ ఈ కాల్పులకు దారితీసింది. కూచ్‌బెహార్‌లోని సీతల్‌కుచిలో గల ఓ పోలింగ్ కేంద్రం ఎదుట గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఆనంద్ బుర్మాన్ అనే ఓ యువ ఓటరుపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆ ఓటరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కాగా.. ఈ హత్యపై బీజేపీ, టీఎంసీ నాయకలు ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఘటన వెనుక కాషాయ పార్టీ హస్తం ఉందని టీఎంసీ ఆరోపించింది. అయితే మృతుడు తమ పోలింగ్ ఏజెంట్ అని, అధికార పార్టీయే అతడిపై కాల్పులు జరిపిందని బీజేపీ మండి పడింది. కాల్పుల నేపథ్యంలో బీజేపీ, టీఎంసీ కార్యకర్తలు పోలింగ్ కేంద్రం వద్ద దాడులకు దిగారు. పరస్పరం బాంబులు విసురుకున్నారు. దీంతో కేంద్ర బలగాలు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆందోళనకారులపై లాఠీఛార్జ్ చేశాయి. అయినప్పటికీ ఉద్రిక్తతలు సద్దుమణకపోవడంతో కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ ఘటనలో నలుగురు చనిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో పోలీసులు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది భారీగా మోహరించారు. ఘర్షణల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ సీతల్‌కుచి ప్రాంతంలో పోలింగ్ నిలిపివేసింది. ఘర్షణలకు సంబంధించి శనివారం సాయంత్ర ఐదు గంటల వరకు పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. ఈ సంఘటని ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. మమతా బెనర్జీపై విమర్శల వర్షం కురిపించారు. కుచ్‌బిహార్‌లో జరిగిన సంఘటన ఏదైతే ఉంది అది చాలా బాధకరం. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నాను. జనాలు బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారనే భయంతోనే మమత దీదీ, ఆమె గుండాలు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు అంటూ మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేత కారుపై దాడి మరోవైపు హుగ్లీ ప్రాంతంలో బీజేపీ అభ్యర్థి లాకెట్ ఛటర్జీ కారుపై స్థానికులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. మీడియా ప్రతినిధులపై, వాహనాలపైనా దాడి చేశారు. ఈ ఘటనపై లాకెట్ ఛటర్జీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ‘‘నా కారుపై దాడి చేసి నన్ను గాయపర్చారు. ఈ ప్రాంతంలో రిగ్గింగ్ జరుగుతోంది. కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు. ఎన్నికల అధికారులు వచ్చేంతవరకు నేను ఇక్కడి నుంచి కదిలేది లేదు’’ అని అమె చెప్పారు. చదవండి: దమ్ముంటే మొత్తం ఆడియో బయట పెట్టండి: పీకే -
బెంగాల్లో దీదీ గూండాగిరి ఇక చెల్లదు: పీఎం మోదీ
కోలకతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు నాలుగోదశ పోలింగ్ హింసకు దారి తీసింది. బీజేపీ, టీఎంసీ కార్యకర్తల ఘర్షణలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. కూచ్ బెహార్, సీతాల్కుచిలో నియోజక వర్గంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. శనివారం కూచ్ బెహార్లో రెండు వేర్వేరు సంఘటనలలో ఐదుగురు మరణించినట్లు సమాచారం. మరో నలుగురు గాయపడ్డారు. ఈ హింసాకాండపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మమతా బెనర్జీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఓటరును కాల్చి చంపి ఘటన చాలా దురదృష్టకరమంటూ విచారం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ సిలిగురిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ దీదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీదీ, టీఎంసీ ఉగ్రవాద వ్యూహాలు బెంగాల్లో చెల్లవని హెచ్చరించారు. రాష్ట్రంలో బీజేపీకి పెరుగుతున్న మద్దతు చూసి దీదీ ఆమె గూండాలకు వణికి పోతున్నారని వ్యాఖ్యానించారు. సిలిగురిలో ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ ప్రస్తుత ఎన్నికల్లో మమతా బెనర్జీని, ఆమె గుండా ముఠాను తిప్పి కొడతారంటూ మండిపడ్డారు. కేంద్ర బలగాలకు వ్యతిరేకంగా ప్రజలను ప్రేరేపించడం, పోల్ ప్రక్రియలో అడ్డంకులు సృష్టించడం టీఎంసీని కాపాడలేవంటూ దీదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కూచ్ బెహార్ ఘటనకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఈసీని కోరారు. బెంగాల్లో కొత్త ఏడాదిలో బీజేపీ నేతృత్వంలో బీజేపీ సర్కార్ కొలువు దీరనుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు. బెంగాల్లో నూతన సంవత్సరం ప్రారంభం కానుంది. మంచి చెడుపై విజయం సాధించబోతోందనీ, గత మూడు దశల పోలింగ్‌లో బీజేపీకి ప్రజలు భారీ మద్దతును అందించారని మోదీ పేర్కొన్నారు. (పీకే క్లబ్‌హౌస్ చాట్ కలకలం: దీదీకి ఓటమి తప్పదా?) నాలుగో విడత పోలింగ్ సందర్భంగా సీతాల్కుచిలో ఈ ఉదయం 18ఏళ్ల బీజేపీ కార్యకర్తను దుండగులు కాల్చి చంపిన ఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. మరోవైపు కూచ్ బెహార్లో సీఆర్పీఎఫ్ బలగాలపై స్థానికులు దాడులు చేసేందుకు ప్రయత్నించగా కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ కాల్పుల ఘటనపై ఈసీ అధికారులను వివరణ కోరింది. హుగ్లీలో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వచ్చిన బీజేపీ మహిళా ఎంపీ లాకెట్ చటర్జీ వాహనంపై తృణమూల్ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. దీంతో ఆమె కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. అయితే ఆమె వ్యక్తిగత సిబ్బంది ఆమెను అక్కడినుంచి తప్పించారు. ఈ సందర్భంగా పలు మీడియా వాహనాలు ధ్వంసమయ్యాయి. కాగా మొత్తం 44 నియోజక వర్గాలకు నాలుగో దశపోలింగ్‌కు భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. -
దమ్ముంటే మొత్తం ఆడియో బయట పెట్టండి: పీకే
కోలకతా : పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశ పోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో ప్రశాంత్ కిశోర్‌కు సంబంధించిన ‘క్లబ్‌హౌస్ చాట్’ ఆడియో టేప్ ప్రకంపనలు రేపుతోంది. సోషల్ మీడియాలో టీఎంసీ ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందని, ఇదే మమత ఓటమికి కారణం కావొచ్చంటూ పీకే ఆడియోలో వెల్లడించినట్లుగా ఉందనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీనిపై బెంగాల్ ఎన్నికలకు మమతా బెనర్జీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పందించారు. అది అసలు తన ఆడియో కాదంటూ ట్విటర్ ద్వారా ఖండించారు. తమ పార్టీ నాయకుల మాటలకంటే, తన మాటలను బీజేపీ సీరియస్‌గా తీసుకోవడం ఆనందంగా ఉందంటూ ఎద్దేవా చేశారు. తమకనుకూలమైన క్లిప్పింగులకు బదులుగా, ధైర్యం ఉంటే మొత్తం చాట్‌ను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అంతేకాదు బీజేపీ100 సీట్ల మార్క్‌ను దాటబోదు అంటూ ప్రశాంత్ కిశోర్ మరోసారి స్పష్టం చేశారు. బెంగాల్లో బీజేపీ ఓటమి తప్పదని గతంలో సవాల్ చేసిన ప్రశాంత్ కిషోర్ తాజాగా బీజేపీ గెలుస్తుందని ఆయన చెప్పినట్లుగా ఉన్న ఈ ఆడియోను పశ్చిమ బెంగాల్ బీజేపీ విడుదల చేయడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. బీజేపీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జి అమిత్ మాల్వియా పోస్ట్ చేసిన ఒక క్లిప్ ప్రకారం గత సాయంత్రం జర్నలిస్టులతో జరిగిన చాట్‌లో మమతాపై వ్యతిరేకత, దళితుల ఓట్లు బీజేపీకి కలసి రానున్నాయని, ప్రధాని మోదీకి పాపులారీటీ బాగాపెరిగిందనీ, దీంతో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రశాంత్ కిశోర్ అభిప్రాయపడ్డారు. దీంతో బీజేపీ నేతలు తృణమూల్ గేమ్ ఓవర్ అంటూ సంబరాలు చేసు కుంటున్నారు. మరోవైపు ఇదంతా బీజేపీ ఆడుతున్న డ్రామా అని టీఎంసీ మండిపడింది. తాజా ఎన్నికల్లో బెంగాల్లో ఎలాగైనా టీఎంసీకి చెక్ పెట్టాలని బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మరోవైపు అధికారాన్ని నిలబెట్టుకునేందుకు అధికార టీఎంసీ పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీకి వందకు పైగా సీట్లు వస్తే..తాను ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయనని, ఏ రాజకీయ పార్టీకి సలహాలు, సూచనలు ఇవ్వనని టీఎంసీ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ గతంలో ప్రకటించారు. కాగా బెంగాల్ ఎన్నికలు మొత్తం 8 దశల్లో భాగంగా ప్రస్తుతం నాలుగో దశకు చేరుకున్నాయి. ఈ నెల 29వ తేదీతో ముగియనున్నాయి. ఫలితాలు మే 2న రానున్న సంగతి తెలిసిందే. I am glad BJP is taking my chat more seriously than words of their own leaders!😊 They should show courage & share the full chat instead of getting excited with selective use of parts of it. I have said this before & repeating again - BJP will not to CROSS 100 in WB. Period. — Prashant Kishor (@PrashantKishor) April 10, 2021 Is it open? That moment when Mamata Banerjee’s strategiest realised that the Club House room was open and his admissions were being heard by the public at large and not just a handful of Lutyens journalist. Deafening silence followed... TMC’s election was just thrown away! pic.twitter.com/2XJ4RWbv3K — Amit Malviya (@amitmalviya) April 10, 2021 -
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ కొనసాగుతోంది
-
పశ్చిమ బెంగాల్: ముగిసిన నాలుగో దశ పోలింగ్
► పశ్చిమ బెంగాల్లో శనివారం నాలుగో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మూడు దశల పోలింగ్ ప్రశాంతంగా జరగ్గా ఈ నాలుగో దశ కొంత హింసాత్మకంగా మారింది. కుచ్‌బిహర్‌లో కాల్పులు జరిగి మొత్తం ఐదుగురు మృతి చెందారు. పలుచోట్ల చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. 44 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ► బెంగాల్లో నాలుగో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ సరళి ఇలా ఉంది. మధ్యాహ్నం 1:30 గంటల వరకు 52.89 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్. ► దీదీ, టీఎంసీ గూండాల ఆరాచకాలను బెంగాల్లో అనుమతించమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కూచ్ బెహార్లో జరిగిన సంఘటనకు సంబంధించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని నేను కోరుతున్నట్లు తెలిపారు. ► పశ్చిమ బెంగాల్లో నాలుగో దశ పోలింగ్ కొనసాగుతోంది. కూచ్ బెహార్లో చోటుచేసుకున్న ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మరణించిన వారికి సంతాపం తెలియజేశారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు. బీజేపీకి బెంగాల్ ప్రజలు ఇచ్చే మద్దతు చూసి మమతా బెనర్జీ, ఆమె పార్టీ గూండాలు కలత చెందుతున్నారు. దీదీ తన కుర్చీ జారిపోతుందన్న భయంతో ఈ స్థాయికి దిగజారిందన్నారు. ► పశ్చిమ బెంగల్ ఎన్నికల నాలుగో విడత పోలింగ్ కొనసాగుతోంది. దక్షిణ 24 పరగణాల జిల్లాలో ఓ పోలింగ్ కేంద్ర వద్ద ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ నేత, భంగర్ నియోజకవర్గ అభ్యర్థి నౌషాద్ సిద్దిఖీ, అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి సౌమి హతి ఒకరినొకరు పలకరించుకున్నారు. ► పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో నాలుగో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. ఉదయం 11 గంటల వరకు 16.65 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ► నాలుగో విడత పోలింగ్‌లో మరో హింసాత్మక ఘటన చోటు చేసుకుంది. కూచ్‌బెహార్ జిల్లాలో దుండగుల కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. ► బెంగాల్లో నాలుగో విడత పోలింగ్ కొనసాగుతోంది. హుగ్లీలో టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. బీజేపీ నేత లాకెట్ ఛటర్జీ కారును టీఎంసీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. హూగ్లీలోని పోలింగ్ బూత్ నెంబర్ 66లో తనపై స్థానికులు, టీఎంసీ కార్యకర్తలు దాడి చేశారని బీజేపీ నాయకురాలు లాకెట్ ఛటర్జీ అన్నారు. ఈ దాడి విషయాన్ని ఫోన్ ద్వారా ఎన్నికల కమిషన్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అదే విధంగా జర్నలిస్టులపై కూడా దాడి జరిగిందని, అదనపు బలగాలను పోలింగ్ బూత్ వద్దకు పంపాలని ఆమె డిమాండ్ చేశారు. ► బెంగాల్లో నాలుగో విడత ఎన్నికల పోలింగ్‌లో హింసాత్మక వాతావరణం నెలకొంది. కూచ్ బెహార్‌లోని సితాల్‌కుచిలో ఘర్షణ చోటు చేసుకుంది. బీజేపీ కార్యకర్తపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో బీజేపీ కార్యకర్త మృతి చెందాడు. ► పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్‌లో పాల్గొంటున్నారు. ఓటు వేయడానికి క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఉదయం 9:30 గంటల వరకు 15.85 శాతం పోలింగ్ నమోదైనట్ల ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. ► బెంగాల్లో నాలుగో విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. కూచ్ బెహార్‌లోని నటాబరి నియోజకవర్గానికి చెందిన టీఎంసీ అభ్యర్థి రవీంద్ర నాథ్ ఘోష్ ఓ పోలీంగ్ కేంద్రానిక వినూత్నంగా వచ్చారు. ఆయన హెల్మెట్ ధరించి కనిపించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటానికి తాను హెల్మెట్ ధరించినట్లు పేర్కొన్నారు. ► బెంగాల్లో నాలుగో విడత పోలింగ్ కొనసాగుతోంది. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని భంగర్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ అభ్యర్థి సౌమి హతి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటర్లు ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. ► కోల్‌కతాలోని గాంధీ కాలనీ భారతి బాలికా విద్యాలయంలో బీజేపీ పోలింగ్ ఏజెంట్‌ను ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి అనుమతించలేదు. దీంతో బీజేపీ ఎంపీ బాబుల్ సుప్రియో అక్కడకు చేరుకొని.. పోలింగ్ ఏజెంట్‌కు ఐడీ కార్డు ఉందని, అతనికి సంబంధించిన వివరాలు ఎన్నికల వెబ్సైట్లో ఉన్నాయని తెలిపారు. అప్పుడు ప్రిసైడింగ్ అధికారి బీజేపీ పోలింగ్ ఏజెంట్‌ను అనుమతించారు. కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో నాలుగో విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. 44 అసెంబ్లీ స్థానాలకు శనివారం పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటల ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6:30 గంటల వరకు కొనసాగుతుంది. 15,940 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. ఈ విడత పోలింగ్‌లో 1.15 కోట్ల మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. చదవండి: మమతకు ఈసీ మరో నోటీసు -
మమతకు ఈసీ మరో నోటీసు
న్యూఢిల్లీ/కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల విధుల్లో ఉన్న కేంద్ర బలగాలపై రెచ్చగొట్టేలా, అసత్యపూరిత వ్యాఖ్యలు చేశారని ఎన్నికల సంఘం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీకి గురువారం రాత్రి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కేంద్ర బలగాలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా భారతీయ శిక్షాస్మృతిని, ఎన్నికల కోడ్‌ను మమతా బెనర్జీ ఉల్లంఘించినట్లు ప్రాథమిక ఆధారాలున్నాయని ఈసీ ఆ నోటీసుల్లో పేర్కొంది. శనివారం ఉదయం 11 గంటల్లోగా ఈ నోటీసులకు సమాధానం ఇవ్వాలని మమతను ఆదేశించింది. ‘ఎన్నికల విధుల్లో ఉన్న కేంద్ర బలగాలను తన వ్యాఖ్యల ద్వారా అసత్యపూరితమైన వ్యాఖ్యలతో, రెచ్చగొట్టేలా, విచక్షణ రహితంగా మమత దూషించారనేందుకు, అవమానించారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయి. ఇలాంటి వ్యాఖ్యలతో వారిలో నైతికస్థైర్యం దెబ్బతింటుంది’ అని ఈసీ పేర్కొంది. 1980ల నుంచి ఎన్నికల్లో కేంద్ర బలగాలు విలువైన సేవ చేస్తున్నాయని గుర్తు చేసింది. ఈసీ నోటీసుపై మమతా బెనర్జీ ఘాటుగా స్పందించారు. ఈసీ నోటీసులను పట్టించుకోబోనన్నారు. సీఆర్పీఎఫ్పై తన ఆరోపణలను మరోసారి పునరుద్ఘాటించారు. ‘బీజేపీ కోసం పనిచేయడం ఆపి వేయనంత వరకు సీఆర్పీఎఫ్ తప్పులపై మాట్లాడుతూనే ఉంటాను. వారు ఆ పని ఆపేస్తే వారికి సెల్యూట్ చేస్తాను’ అని స్పష్టం చేశారు. ‘మీ షోకాజ్ నోటీసులను నేను పట్టించుకోను. మీరు బీజేపీ కోసం పనిచేస్తున్నారు. ఎన్నికల రోజున ప్రధాన మంత్రి ప్రచారం చేస్తే మీ దృష్టిలో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినట్లు కాదా?’ అని ఈసీని ప్రశ్నించారు. జమల్పూర్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో శుక్రవారం మమత పాల్గొన్నారు. దాదాపు వారం వ్యవధిలో మమతకు ఈసీ నోటీసులు జారీ చేయడం ఇది రెండో సారి. ముస్లింలను మతపరంగా ఓట్లను అభ్యర్థిస్తున్నారన్న బీజేపీ ఫిర్యాదుపై ఇప్పటికే ఆమెకు ఈసీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. కేంద్ర బలగాలు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని, బీజేపీకే ఓటేయాలని ఓటర్లను, ముఖ్యంగా మహిళలను బెదిరిస్తున్నాయని గత కొన్ని రోజులుగా మమత ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. బెంగాల్లో హింసకు అమిత్ షా కుట్ర రాష్ట్రంలో హింసను రాజేసేందుకు కేంద్ర హోం మంత్రి, బీజేపీ నేత అమిత్ షా కుట్ర చేస్తున్నారని మమతా బెనర్జీ ఆరోపించారు. అనైతిక చర్యలకు పాల్పడేలా పోలీసులను ప్రోత్సహిస్తున్నారన్నారు. షాను నియంత్రించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ‘ఇలాంటి గూండా హోం మంత్రిని నా జీవితంలో చూడలేదు. ఆయన పులి కన్నా ప్రమాదకరం. ఆయనతో మాట్లాడాలంటేనే ప్రజలు భయపడ్తున్నారు. షాను నియంత్రించాలని ప్రధానిని కోరుతున్నా. ఆయన వల్ల బెంగాల్లో అల్లర్లు, హింస చెలరేగే ప్రమాదముంది’ అని మమత ఒక ఎన్నికల సభలో వ్యాఖ్యానించారు. బెంగాల్ మరో గుజరాత్‌లా మారకుండా చూడాలని, బీజేపీకి ఓటు వేయవద్దని ఓటర్లను అభ్యర్ధించారు. -
ఇలాంటి సీఎంను జీవితంలో చూడలేదు
-
సెల్ఫీ కోసం ఆరాటం.. అభిమానిని తోసేసిన సీనియర్ నటి
కోల్‌కతా: బాలీవుడ్ సీనియర్ నటి, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ ముక్కిసూటి మనిషి. ఆమె మాటలు, చేష్టలు స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటాయి. చూసేవారు ఏం అనుకుంటారో అని ఆలోచించరు. ఇలాంటి ప్రవర్తనతో తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు జయా బచ్చన్. తన అనుమతి లేకుండా సెల్ఫీ తీయడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తి పట్ల జయా బచ్చన్ కఠినంగా ప్రవరించారు. ఆ వ్యక్తిని పక్కకు తోసేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజనులు ఆమె పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత పొగరుగా ప్రవర్తించడం సరికాదు అంటున్నారు. ఆ వివరాలు.. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో జయా బచ్చన్ టీఎంసీకి మద్దతిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం జయా బచ్చన్ టీఎంసీ అధినేత్రి మమతకు మద్దతుగా కోల్‌కతాలో రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనాలు భారీ ఎత్తున హాజరయ్యారు. వారందరికి చేతులు ఊపుతూ అభివాదం చేశారు జయా బచ్చన్. ఈ క్రమంలో ఓ యువకుడు ఆమె సమీపంలోకి వెళ్లి సెల్ఫీ తీసేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించిన జయా బచ్చన్.. అతడిని పక్కకు తోసి ర్యాలీని కొనసాగించారు. తన అనుమతి లేకుండా ఫోటోలు తీయడానికి ప్రయత్నిస్తుండటంతో ఆగ్రహానికి గురైన జయా అతడిని నెట్టేశారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. మరీ ఇంత కోపంగా, కఠినంగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు. ఫోటోలు తీయోద్దు అని చెప్తే సరిపోయేది కదా అంటున్నారు నెటిజనులు. చదవండి: జయ బచ్చన్ వల్లే బాలీవుడ్లో ఎన్నో మార్పులు, చరిత్ర చేర్పులు -
ఇలాంటి సీఎంను జీవితంలో చూడలేదు : అమిత్‌షా
సాక్షి న్యూఢిల్లీ : కేంద్ర బలగాలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యలపై హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. కోల్‌కతాలో శుక్రవారం మీడియాను ఉద్దేశించి షా మాట్లాడుతూ, ఓటమి భయం టీఎంసీని పీడిస్తోందని, ఈ ఫ్రస్ట్రేషన్లో వారి చర్యలు,వ్యాఖ్యలే దీనికి నిదర్శమని వ్యాఖ్యానించారు. పోల్ డ్యూటీలో సీఆర్పీఎఫ్ హోం మంత్రిత్వ శాఖ పరిధిలోకి రాదని, ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తుందనీ ఆయన పేర్కొన్నారు. ప్రజలను అరాచకం వైపు నెట్టివేస్తున్నారా అంటూ ఎద్దేవా చేశారు. అసలు ఇలాంటి సీఎంను తన జీవితంలో చూడలేదంటూ హోంమంత్రి ఘాటుగా విమర్శించారు. (అది బీజేపీ సీఆర్పీఎఫ్) అటు మమత వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి నోటీసులు జారీ చేసింది. కేంద్ర బలగాలపై ఆమె చేసిన వ్యాఖ్యలకు గాను వివరణ ఇవ్వాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా మార్చి 28, ఏప్రిల్ 7న కేంద్ర భద్రతా దళాలను "ఘెరావ్" చేయమని ప్రజలకు చెబుతూ మమత అత్యంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై శనివారం ఉదయం 11 గంటల్లోగా స్పందించాలని పేర్కొంది. మమత వ్యాఖ్యలు, ఎన్నికల కోడ్‌తోపాటు చట్టాన్ని ఉల్లంఘించినట్టేనని ఈసీ తెలిపింది. అయితే గత రెండు రోజుల్లో మమతకు ఈసీనుంచి నోటీసులు రావడం ఇది రెండవసారి. మరోవైపు ఈసీ పది నోటీసులిచ్చినా తన వైఖరి మారదని సీఎం మమతా తేల్చి చెప్పారు. మతాల ప్రాతిపదికన ఓటర్లను విడగొట్టే ప్రయత్నాలకు వ్యతిరేకంగా తాను మాట్లాడుతూనే ఉంటానని దీదీ గురువారం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కాగా ఎనిమిది దశల ఎన్నికలలో భాగంగా నాలుగో రౌండ్లో శనివారం పోలింగ్ జరగనుంది. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి. -
బెంగాల్లో ముగిసిన నాలుగో దశ ప్రచారం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ 4వ దశ ఎన్నికల ప్రచారం గురువారం ముగిసింది. రేపు 44 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. హౌరా, హూగ్లీ, దక్షిణ 24పరగణ, అలిపురదౌర్, కూచ్‌బిహార్ జిల్లాల్లో ఈ స్థానాలు ఉన్నాయి. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది. కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో(బీజేపీ), బెంగాల్ మాజీ రంజీ కెప్టెన్ మనోజ్ తివారీ(టీఎంసీ), నటి పాయల్ సర్కార్(బీజేపీ), ఎంపీ లాకెట్ చటర్జీ(బీజేపీ), సుజన్ చక్రవర్తి(సీపీఎం) తదితర ప్రముఖులు ఈ నాలుగో దశ బరిలో ఉన్నారు. ఈ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.789 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు. ఇందులో 187 కంపెనీలను కూచ్‌బిహార్ జిల్లాకే కేటాయించారు. -
దీదీకి ఓటమి భయం: నడ్డా
మెక్లీగంజ్/కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో బీజేపీ అనుకూల గాలి వీస్తోందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే బయటి వ్యక్తులు, లోపలి వ్యక్తులు అంటూ మతితప్పి మాట్లాడుతున్నారని చెప్పారు. బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 200కు పైగా సీట్లు గెలుచుకోవడం తథ్యమని ఉద్ఘాటించారు. తృణమూల్ కాంగ్రెస్ సర్కారు తీసుకొచ్చిన లంచాల(కట్‌మనీ) సంస్కృతికి ఈ ఎన్నికల్లో చరమగీతం పాడడం ఖాయమని స్పష్టం చేశారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ తుడిచి పెట్టుకుపోతుందని జోస్యం చెప్పారు. నడ్డా గురువారం దినహతా, అలీపూర్‌దువార్, మెక్లీగంజ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రోడ్ షోలలో పాల్గొన్నారు. బెంగాల్లో మార్పు రాబోతోందని వెల్లడించారు. కోల్‌కతాలో సినీ నటుడు, బీజేపీ నేత మిథున్ చక్రవర్తి గురువారం తలపెట్టిన రోడ్ షోకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో బీజేపీ కార్యకర్తలు బెహలా ఏరియాలోని పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించారు. -
కేంద్ర బలగాలతో జాగ్రత్త: మమత
బాలాగర్/డోంజూర్: ఎన్నికల బందోబస్తుకు వచ్చిన కేంద్ర బలగాల్లోని కొందరు గ్రామాల్లోకి ప్రవేశించి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు వార్తలు వస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. హుగ్లీ జిల్లాలో గురువారం జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడుతూ.. హోం మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు కేంద్ర బలగాలు పనిచేస్తున్నట్లు ఆమె ఆరోపించారు. పోలింగ్ రోజుకు ముందు వారు గ్రామాల్లోకి ప్రవేశించి ప్రజలను భయకంపితులను చేస్తున్నారు. మహిళలను సైతం వేధిస్తున్నారు. బీజేపీకే ఓటేయాలని ఓటర్లను అడుగుతున్నారు. ఇలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలి. మీరు భయపడవద్దు’అని మమత ప్రజలను కోరారు. ‘కేంద్ర బలగాలు అతిగా ప్రవర్తిస్తే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి. ఎఫ్ఐఆర్ నమోదుకు పోలీసులు నిరాకరిస్తే నాకు సమాచారం ఇవ్వండి’అని కోరారు. సెక్షన్ 144 విధిస్తామని బెదిరిస్తూ ఓటర్లను పోలింగ్ బూత్‌లకు వెళ్లకుండా బీజేపీ భయపెడుతోందని ఆరోపించారు. మరో గుజరాత్‌లా బెంగాల్ మారకూడదంటే బీజేపీకి ఓటేయవద్దని కోరారు. హిందు, ముస్లిం ఓటు బ్యాంకు గురించి మాట్లాడిన ప్రధాని మోదీపై ఎందుకు కేసు నమోదు చేయలేదని ఎన్నికల సంఘం (ఈసీ)ని ఆమె ప్రశ్నించారు.