దినహతాలో ర్యాలీలో నడ్డా అభివాదం
మెక్లీగంజ్/కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అనుకూల గాలి వీస్తోందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే బయటి వ్యక్తులు, లోపలి వ్యక్తులు అంటూ మతితప్పి మాట్లాడుతున్నారని చెప్పారు. బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 200కు పైగా సీట్లు గెలుచుకోవడం తథ్యమని ఉద్ఘాటించారు.
తృణమూల్ కాంగ్రెస్ సర్కారు తీసుకొచ్చిన లంచాల(కట్‌మనీ) సంస్కృతికి ఈ ఎన్నికల్లో చరమగీతం పాడడం ఖాయమని స్పష్టం చేశారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ తుడిచి పెట్టుకుపోతుందని జోస్యం చెప్పారు. నడ్డా గురువారం దినహతా, అలీపూర్‌దువార్, మెక్లీగంజ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రోడ్ షోలలో పాల్గొన్నారు. బెంగాల్‌లో మార్పు రాబోతోందని వెల్లడించారు. కోల్‌కతాలో సినీ నటుడు, బీజేపీ నేత మిథున్ చక్రవర్తి గురువారం తలపెట్టిన రోడ్ షోకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో బీజేపీ కార్యకర్తలు బెహలా ఏరియాలోని పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించారు.
Comments
Please login to add a commentAdd a comment