Fears
-
బడికి పంపాలన్నా భయపడుతున్నారు
శాన్ఫ్రాన్సిస్కో: అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించిన వలసదారులపై ఉక్కుపాదం మోపుతానని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో అక్రమవలసదారుల్లో భయందోళనలు ఎక్కువయ్యాయి. తమ పిల్లలను బడికి పంపడానికి కూడా అక్రమ వలసదారుల కుటుంబాలు భయపడుతున్నాయి. పాఠశాలలు పిల్లలకు సురక్షితమైన ప్రదేశాలు అని అక్కడి విద్యావేత్తలు వలస తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. అయితే ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ అధికారులు పాఠశాలలు, చర్చిలు, ఆసుపత్రులనూ క్షుణ్ణంగా తనిఖీచేసి అక్రమవలసదారులుంటే అక్కడే అరెస్ట్ చేసే అధికారం ఇస్తామని ట్రంప్ ప్రభుత్వం మంగళవారం ప్రకటించిన నేపథ్యంలో వీరిలో ఆందోళనలు మరింత పెరిగాయి. సున్నితమైన ప్రదేశాల్లో ఎన్ఫోర్స్మెంట్ చర్యలు చేపట్టరాదన్న మార్గదర్శకాలను అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న చర్యలు తుడిచిపెట్టేశాయి. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు నేరగాళ్లు ఇకపై అమెరికాలోని పాఠశాలలు, చర్చిల్లో తలదాచుకోలేరని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఒక ప్రకటనలో తెలిపింది. తాజా విధానం ప్రకారం.. ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్, కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ఏజెన్సీలు పాఠశాలల్లోకి ప్రవేశించొచ్చు. మైగ్రేషన్ పాలసీ ఇన్స్టిట్యూట్ గణాంకాల ప్రకారం 7,33,000 మంది పాఠశాల వయస్సు పిల్లలు అమెరికాలో అక్రమంగా ఉన్నారు. ఇన్నాళ్లూ జన్మతః పౌరసత్వం నిబంధనతో వీరిలో చాలా మందికి అమెరికా పౌరసత్వం ఉన్నప్పటికీ వీళ్ల తల్లిదండ్రులకు పౌరసత్వం లేదు. తల్లిదండ్రులు చట్టవిరుద్ధంగా అమెరికాకు వచ్చి స్థిరపడ్డారు. ఇలాంటి లక్షలాది మందిని బహిష్కరిస్తామని ట్రంప్ ప్రకటించారు. అనేక వలస కుటుంబాలు బహిరంగంగా తిరిగేందుకు భయపడుతున్నాయి. పిల్లల్ని స్కూళ్లకు పంపించకపోవడంతో విద్యార్థుల హాజరుపై ప్రభావం చూపుతుందంటున్నారు విద్యావేత్తలు. తల్లిదండ్రులకు భరోసా కల్పిస్తున్న పాఠశాలలు కొన్ని రాష్ట్రాలు, జిల్లాల్లోని విద్యాశాఖాధికారులు అక్రమవలసదారుల పిల్లలకు అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. కాలిఫోర్నియాలో ఇమ్మిగ్రేషన్ చట్టాన్ని అమలు చేయడంలో పాఠశాలలు ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్కు సహాయం చేయవని చికాగో పబ్లిక్ స్కూల్స్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నవంబర్‌లో తీర్మానాన్ని ఆమోదించింది. క్రిమినల్ వారెంట్ లేకుండా అధికారులను పాఠశాలల్లోకి అడుగుపెట్టనివ్వమని స్పష్టం చేసింది. విద్యార్థి ఇమ్మిగ్రేషన్ స్థితిపై సమాచారం సేకరించకూడదనే విధానాలను గత నెలలో న్యూయార్క్ నగర ప్రధానోపాధ్యాయులకు గుర్తు చేసింది. అయితే కొన్ని చోట్లా కుటుంబాలకు ఇలాంటి భరోసా దక్కట్లేదు. ట్రంప్ చర్యతో విద్యార్థులు, కుటుంబాలు భయభ్రాంతులకు గురవుతున్నాయని జార్జియా రెఫ్యూజీస్ అకాడమీ చార్టర్ స్కూల్ అధ్యాపకులు చెప్పారు. చాలా మంది విద్యార్థులు పాఠశాలకు దూరమవుతారని భావించి, వారు ముఖ్యమైన పరీక్షలను కోల్పోకుండా ఉండటానికి పరీక్ష షెడ్యూల్‌ను ముందుకు జరిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటికి పరిమితం చేస్తున్నారని అమెరికా సెంటర్ ఫర్ ఇమ్మిగ్రెంట్ రైట్స్ అధికారి మైఖేల్ ల్యూకెన్స్ తెలిపారు. వలసదారులు తమంతట తాముగా అమెరికాను వీడేలా ప్రభుత్వం భయపెడుతోందని ఆయన ఆరోపించారు. కంటి మీద కునుకు లేదు‘‘ఇప్పుడు మా పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. 14 ఏళ్ల క్రితం గ్వాటెమాల నుంచి వచ్చి బోస్టన్‌లో ఉంటున్నాం. మా పిల్లలు బోస్టన్ స్కూళ్లలో చదువుతున్నారు. అక్రమవలసదారులని ముద్రవేసి ఇప్పుడు మమ్మల్ని పనిచేసుకోనివ్వకపోతే ఏం చేయాలి. న్యాయం కోసం కోర్టుకెళ్లలేను. లైసెన్స్ ఉన్నాసరే కారులో బయటకు కూడా వెళ్లలేని పరిస్థితి. తలచుకుంటే నిద్రకూడా పట్టట్లేదు. చట్టబద్ధత రుజువు కోసం స్కూళ్లో మా పిల్లలను అధికారులను నిలదీస్తే ఏం చేయాలో పాలుపోవట్లేదు’’అని ఐరిస్ గొంజాలెజ్ అని మహిళ వాపోయారు. ఇలా చేస్తారని ఊహించలేదు : కార్మెన్ ‘‘వాళ్లు ఇలా చేస్తారని నేను ఊహించలేదు’’అని మెక్సికో నుంచి వలస వచ్చిన కార్మెన్ అనే వృద్దురాలు ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘శాన్ఫ్రాన్సిస్కో బే పాఠశాలకు నా ఇద్దరు మనవరాళ్లను ఇప్పుడెలా తీసుకెళ్లాలి?. అండగా ఉంటామని పాఠశాల హామీ ఇచ్చింది. అయినా భయంగానే ఉంది. తరిమేస్తే సొంతదేశం అస్సలు వెళ్లలేం. డ్రగ్స్ ముఠాలు రాజ్యమేల మెక్సికోలోని మిచోకాన్ రాష్ట్రం నుంచి వచ్చాం. రెండేళ్ల క్రితం అక్కడ మా అల్లుడిని కిడ్నాప్‌చేశారు. బెదిరింపులు పెరగడంతో అమెరికాకు వలసవచ్చాం. శాన్ఫ్రాన్సిస్కోలో ఉండటానికి అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు ఇక్కడ ఉండలేం. ఎక్కడికీ వెళ్లలేం. దేవుడా మా ప్రాణాలి్న, మా పిల్లల్ని కాపాడు’’అని ఆమె ఏడుస్తూ చెప్పారు. ఇలా పేద అక్రమవలసదారుల వ్యథలు ఇప్పుడు అమెరికా వ్యాప్తంగా వినపడుతున్నాయి. -
పిల్లల్లో ఆ భయం పోగొట్టేలా..
డాక్టర్: నీ టెడ్డీబేర్‌కు ఏమైంది? చిన్నారి: కాలు నొప్పి డాక్టర్: ఎక్కడ? చిన్నారి: ఇక్కడ డాక్టర్: ఏం కాదు... తగ్గిపోతుంది... ఇలాంటి క్లినిక్‌లు ఇప్పుడు మంగళూరులోని స్కూళ్లలో నిర్వహిస్తున్నారు డాక్టర్లు. యు.కె.జి. నుంచి 2వ తరగతిలోపు పిల్లల్లో హాస్పిటల్ భయం పోవడానికి వారి ఆరోగ్య సమస్యలు బయటకు చెప్పడానికి ఈ క్లినిక్‌లు ఉపయోగపడుతున్నాయి. పేషెంట్లుగా సొంత టెడ్డీబేర్లను తెమ్మనడంతో పిల్లలు వాటిని తీసుకుని ధైర్యంగా వస్తున్నారు. దేశంలోని అన్ని పల్లెల్లో ‘బొమ్మల ఆస్పత్రి’ పేరుతో ఇలాంటి క్లినిక్‌లు నిర్వహించాల్సిన అవసరం ఉంది. మూడేళ్ల లోపు చంటిపిల్లలను హాస్పిటల్లో చూపించడం తల్లులకు కష్టం కాదు. కాని ఐదారేళ్లు వచ్చాక పిల్లలకు హాస్పిటల్ అంటే భయం వస్తుంది. డాక్టర్ని చూడటం, వ్యాక్సిన్ కోసం సూది వేయించుకోవడం, జ్వరాలకు సిరప్లు తాగాల్సి రావడం వారికి హాస్పిటల్ అంటే భయం వేసేలా చేస్తుంది. 5 ఏళ్ల నుంచి 8 ఏళ్ల లోపు పిల్లలు ఈ భయంతో ఏదైనా ఇబ్బంది ఉన్నా తల్లిదండ్రులకు చెప్పకపోవచ్చు– హాస్పిటల్‌కు వెళ్లాల్సి వస్తుందని. అంతేకాదు హాస్పిటల్‌కు తీసుకెళితే డాక్టర్‌కి చూపించి బయటకు వచ్చేంత వరకూ ఏడుస్తూనే మారాం చేస్తూనే ఉంటారు కొందరు పిల్లలు. దీని వల్ల తల్లిదండ్రులకే కాదు... క్లినిక్‌కు వచ్చిన ఇతర పిల్లలు, పెద్దలు కూడా ఇబ్బంది పడతారు. అందుకే వీరికి క్లినిక్లంటే భయం పోగొట్టాలి. దానికి ఏం చేయాలి? టెడ్డీ బేర్ క్లినిక్స్ యూకేలో ఇటీవల కాలంలో ‘టెడ్డీ బేర్’ క్లినిక్స్ నిర్వహిస్తున్నారు. 5 నుంచి 8 ఏళ్ల లోపు పిల్లలు తమ సొంత టెడ్డీ బేర్లను పేషెంట్లకు మల్లే తెచ్చి డాక్టర్లకు చూపించడం కాన్సెప్ట్. ఇందుకోసం నిజమైన డాక్టర్లు నిర్దేశిత స్కూల్‌కు టీమ్‌గా వస్తారు.. లేదా ఏదైనా చిల్డ్రన్స్ హాస్పిటల్లో దీనిని నిర్వహిస్తారు. క్లినిక్స్ అంటే భయం పోగొట్టడమే ముఖ్యోద్దేశం. క్లినిక్స్‌లో ఎంత చక్కగా టెడ్డీ బేర్లకు వైద్యం జరుగుతుందో చూశాక తమకు కూడా అంతే ఈజీగా వైద్యం చేస్తారు అనే భావన పిల్లల్లో కలుగుతుంది. మంగుళూరులో ట్రెండ్ గత సంవత్సరం జూలై నుంచి మంగుళూరులోని చాలా స్కూళ్లల్లో విడతల వారీగా టెడ్డీబేర్ క్లినిక్స్ నడుస్తున్నాయి. ఇందుకు స్కూళ్ల యాజమాన్యాలు సహకరిస్తున్నాయి. ప్రయివేట్ ఆస్పత్రులు తమ ప్రచారం కోసమే కావచ్చు... లేదా పిల్లల పట్ల బాధ్యతతోనే కావచ్చు... చాలా ప్రొఫెషనల్‌గా ఈ క్లినిక్స్‌ను నిర్వహిస్తున్నారు. క్లినిక్ స్కూల్లో నడిపే రోజున పిల్లలు తమ సొంత టెడ్డీ బేర్‌ను కాని లేదా మరేదైనా ఆటబొమ్మను (మనిషి, పెట్) తీసుకురావాలి. తమ పేషెంట్ పేరును అచ్చు హాస్పిటల్లో ఎలా రిజిస్టర్ చేయిస్తారో అలా చేయించాలి. ఆ తర్వాత ఓ.పీ.కి వెళ్లాలి. ఓ.పీ.లో డాక్టర్లు టెడ్డీబేర్‌కు ఏం ఇబ్బంది ఉందో అడుగుతారు. వైద్యం చేయాలంటే పొడవు, ఎత్తు చూడాలని చెప్పి చూస్తారు, పిల్లలు సాధారణంగా తమకున్న ఇబ్బందులే టెడ్డీబేర్‌కు ఉన్నట్టుగా చెబుతారు. టెడ్డీబేర్‌ను చూస్తున్నట్టుగా పిల్లల్ని కూడా వారి మూడ్‌ను బట్టి డాక్టర్లు చూస్తారు. పిల్లల హెల్త్ అసెస్మెంట్ను స్కూల్ సాయంతో పేరెంట్స్‌కు పంపుతారు. కంటి, పంటి పరీక్ష చిన్న పిల్లల్లో కంటి, పంటి పరీక్షలు ముఖ్యమైనవి. టెడ్డీబేర్ క్లినిక్స్ పేరుతో పిల్లలను ఉత్సాహపరిచి వారికి కంటి, పంటి పరీక్షలు కూడా డాక్టర్లు నిర్వహిస్తున్నారు. సాధారణ చెకప్‌ల ద్వారా వారిలో తగిన పోషక విలువలు ఉన్నాయా, వారు బలహీనంగా ఉన్నారా అనేవి కూడా చూస్తారు. ఏమైనా డాక్టర్ల పరిశీలన ఆ వయసు పిల్లలకు ప్రతి మూడు నెలలకు అవసరం. మంగుళూరు స్కూళ్లలో ఇదే జరుగుతూ ఉంది. మిగతా రాష్ట్రాల్లో కూడా పల్లెల్లో చిన్నారులకు ఈ ‘బొమ్మల ఆస్పత్రు’లు నడపడం చాలా బాగుంటుంది. పల్లె పిల్లలు డాక్టర్లకు చూపించుకునే వీలుండదు చాలాసార్లు. తల్లిదండ్రులు తీసుకెళ్లరు. ఆస్పత్రులంటే భయపడేవారు కూడా ఎక్కువ మందే ఉంటారు. అందుకోసమే బొమ్మల ఆస్పత్రుల ఐడియాను ప్రభుత్వాలు అందిపుచ్చుకుంటే చిన్నపిల్లల ఆరోగ్యస్థాయి, వారి సాధారణ అనారోగ్య సమస్యలు అంచనాకొస్తాయి. -
భయం ప్రకృతి వరం
అన్ని జీవులతో పాటు మనిషికి కూడా భయం పుట్టుకతోనే ఉంది. సహజమైన భయానికి తోడు మానవుడు కృత్రిమమైన భయాన్ని కల్పించుకో గలడు. మనిషి ఆ విధంగా కల్పించుకున్న భయాలు ఎన్నో! అన్నీ భయాలే. రేపటి సంగతి ఏమిటి? ఈ భయం కారణంగానే దాచుకోటాలు, దోచుకోటాలు మొదలైనవి. ఆహార నిద్రాభయమైథునాలు సర్వజీవులకు సామాన్యమే. ప్రకృతి సిద్ధం. ఆహారం ప్రాణం నిలబడటానికి. శరీరం అనే యంత్రం పని చేయటానికి తగిన శక్తి నిచ్చే ఇంధనం ఆహారం. రక్షణ కోసం ప్రకృతి చేత సమకూర్చ బడింది భయం. తెలియకపోవటం వల్ల భయం కలుగుతుంది. భయపడటం వల్ల రక్షణ జరుగుతుంది. భయం లేకపోతే చీకటిగా ఉన్న చోటుకి అయినా నిస్సందేహంగా వెళ్ళటం జరుగుతుంది. ఎత్తు పల్లాలు తెలియక దెబ్బలు తగలటమో, గోతిలో పడటమో, ముళ్ళో రాళ్ళో కాలికి గుచ్చుకుని గాయాలు కావటమో, ఏ తేలో పామో ఉండి ప్రాణం మీదికి రావటమో జరిగే అవకాశం ఉంది. తెలియని వారెవరైనా ఉండి మీద పడితే ప్రాణ హాని కూడా జరగ వచ్చు. భయం ఇంకా తెలియని పసిపిల్లలు చీమలని, పాములని కూడా పట్టుకునే ప్రయత్నం చేయటం గమనించ వచ్చు. వెలుగుతున్న దీపాన్ని పట్టుకోటానికి చూస్తారు. ఒకసారి వేడి తగిలితే మరొకసారి భయపడతారు. మానవులకు జంతువుల కన్న అధికంగా మెదడు, దానితో ఆలోచన, విచక్షణాజ్ఞానం కూడా ఇచ్చింది ప్రకృతి. దానిని ఉపయోగించుకుని మేలు పొందటానికి బదులు లేనిపోని భయాలు సృష్టించుకుని బాధ పడటం జరుగుతోంది. తన అభిప్రాయాలని ఇతరులు అంగీకరించరేమో! తన గురించి ఏమనుకుంటారో? అనుకున్నది జరగదేమో! అపజయాన్ని ఎదుర్కోవలసి వస్తుందేమో! ఇవన్నీ కల్పితాలే కాని, సహజసిద్ధం కావు కదా! ఈ భయాల వల్ల రక్షణ కలగక పోగా దుఃఖం కలుగుతుంది. జంతువులకి భయం ఉంది కాని, దుఃఖం లేదు. అవి భయాలని తాముగా కల్పించుకో లేదు కదా! వాటి భయం వాటికి రక్షణ నిస్తుంది. ఎదుటివారి భయాన్ని తమకు రక్షణగా చేసుకో గలిగిన తెలివితేటలు కూడా ఉన్నాయి మనిషికి. పొలాల్లో కాపలా ఉండేవారు కాని, అడవిలో సంచరించేవారు కాని, రాత్రిళ్ళు నెగళ్లు (మంటలు) వేసుకుంటారు. అడవి జంతువులు మంటలని చూసి భయపడి సమీపించవు అని. మృత్యుభయం అన్నింటి కన్న పెద్దభయం. బుద్ధిజీవులైన మానవులకి మృత్యువు తప్పదని తెలుసు. తెలియని జంతువులే నయం. ప్రాణాల మీద ఆశని సునాయాసంగా వదులుకోగలవు. శరీరం కష్టపడుతుంటే దానిని వెంటనే వదిలేస్తాయి అని పశువైద్యులు చెప్పిన మాట. మానవులు స్పృహ లేక పోయినా బతికి ఉండాలని ప్రయత్నం చేస్తారు, కష్టపడతారు. జంతువులు మరణభయాన్ని జయించి నట్టు చెప్పుకోవచ్చును. మనిషి స్వయంకృతంగా తెచ్చి పెట్టుకున్న దుఃఖహేతువయిన భయాలు శారీరక, మానసిక అనారోగ్యాలకి కారణాలు అవుతాయి. అటువంటి భయాలని వదలాలి. కొన్ని భయాలు ఉండాలి. ధర్మం తప్పుతానేమో, ఇతరులకి నా పనుల వల్ల బాధ కలుగుతుందేమో, కర్తవ్యనిర్వహణలో ఏమరుపాటు కలుగుతుందేమో .. వంటివి ఆరోగ్యకరమైన భయాలు. భయం అన్నది ప్రమాదాలని కొని తెచ్చుకోకుండా కాపాడటానికి ప్రకృతి సర్వజీవులకు ప్రసాదించిన వరం. జంతువులకు భయం వర్తమాన కాలానికి మాత్రమే పరిమితమై ఉంటుంది తరచుగా. కాని, మనిషి మాత్రం భూత భవిష్యత్ కాలాలలోకి కూడా భయాన్ని విస్తరింప చేయ గలడు. జరిగిపోయిన దానిని తలుచుకుని, మళ్ళీ అట్లా అవుతుందేమోనని భయం. జరిగింది మంచి అయితే మళ్ళీ అట్లా జరగదేమోనని భయం. వృద్ధాప్యంలో పిల్లలు చూడరేమోనని భయం. వాళ్ళ చిన్నతనంలో సరిగా చదవరేమో, అందరిలో అవమానం పాలు అవాలేమో, వాళ్ళకి తగిన ఉద్యోగం వస్తుందో రాదో, సరైన సంబంధాలు కుదురుతాయో లేదో... ఇలా సాగుతూ ఉంటాయి. వాటికోసం తగిన ప్రయత్నం చేయాలి కాని భయపడితే ఏం ప్రయోజనం? – డా. ఎన్. అనంత లక్ష్మి -
ఆ భయమే మీరాను ఆత్మహత్య చేసుకునేలా చేసిందా? ఏం జరిగింది?
కూతురి ఆత్మహత్యతో విజయ్ ఆంటోని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన కూతురు మీరా ఆంటోని చెన్నైలోని తన నివాసంలో మంగళవారం ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. 12వ తరగతి చదువుతున్న మీరా మీరా సూసైడ్ ఘటన కోలీవుడ్‌ను షాక్‌కి గురి చేస్తోంది. ఇంత చిన్న వయసులో ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటన్నదానిపై పలువురు చర్చిస్తున్నారు. అయితే ఆమె సూసైడ్ చేసుకోవడానికి ప్రధాన కారణం మానసిక ఒత్తిడి మాత్రమే అని తెలుస్తోంది. చదువుల కారణంగా మీరా గత కొంతకాలంగా మానసిక ఒత్తిడితో కుంగిపోతోందని, కొంతకాలంగా ట్రీట్మెంట్ కూడా తీసుకుంటుందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మీరా ఆత్మహత్యకు డిప్రెషన్ కారణమని కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ ఘటనపై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తూ విజయ్ ఆంటోనీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సినీ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుధ మాట్లాడుతూ.. మీరా మృతిపై కీలక విషయాలు వెల్లడించింది. ''మీరాకు చీకటి అంటే చాలా భయమని వాళ్ల నానమ్మ(విజయ్ అంటోని తల్లి) చెప్పింది. ఒంటరిగా ఎక్కడికైనా వెళ్లాలన్నా, చీకట్లో కాసేపు ఉండాలన్నా హడలిపోయేదని, అలాంటి అమ్మాయి ఇంతటి కఠిన నిర్ణయం ఎలా ధైర్యం చేసి తీసుకుందో అర్థం కావడం లేదు. పిల్లల్ని ఎంతగానో ప్రేమించే విజయ్‌కి ఇలా జరగడం చాలా దురదృష్టకరం'' అంటూ ఆమె వెల్లడించింది. ఈ క్రమంలో భయం, డిప్రెషన్ వంటి సున్నితమైన అంశాలపై సోషల్ మీడియా వేదికగా చర్చ నడుస్తుంది. భయం ఒక్కోక్కరికి ఒక్కో విధంగా ఉండొచ్చు. కొందరు ఇంట్లో ఇంటరిగా ఉండాలంటే భయపడతారు, మరికొందరు స్నానం చేయడానికి, చీకట్లో ఉండేందుకు విపరీతంగా భయపడుతుంటారు. నీళ్ళని చూసినా, మెట్లెక్కుతూ కిందకి చూసినా, సముద్రాన్ని చూసినా భయపడిపోతుంటారు. ఇదొక సాధారణ మానసిక సమస్య. దీనికి మందుల ద్వారా, సిస్టమాటిక్ డీ సెన్సిటైజేషన్ అనే కౌన్సిలింగ్ ద్వారా నయం చెయ్యొచ్చు. ఈ ఫోబియా నుంచి బయటపడాలంటే ఒకటే మార్గం.. దేన్నుంచి అయితే భయపడుతున్నారో ఆ పనుల్ని నిరంతరం చేస్తూ ఉండటం. ఉదాహరణకు మీకు డ్రైవింగ్ అంటే భయమనుకోండి. అదే పనిని జాగ్రత్తగా మళ్లీమళ్లీ చేయడానికి అలవాడుపడండి. కొందరికి ఫోబియా ఉంటుంది. ఉదాహరణకు.. బొద్దింక అంటే భయం ఉన్నప్పుడు ఒక గాజు గ్లాసు దాని మీద బోర్లించి ఓ నిమిషం దాన్ని చూస్తూ గడపడం. దీని వల్ల ఆ ఫోబియా నుంచి బయట పడవచ్చునంటారు మానసిక శాస్త్రవేత్తలు. ప్రతి సమస్యకు పరిష్కార మార్గాలు ఉన్నట్లే ప్రతీది సమస్యలా భావించొద్దు. శారీరక సౌష్టవం కోసం ఎంత శ్రద్ద పెడుతున్నామో మానసిక ఆరోగ్యానికి కూడా అంతే శ్రద్ధ వహించాలి. ఇందుకోసం మంచి ఆహరం తీసుకోవడం, వ్యాయామం చేయడం, ఇష్టమైన వాళ్లతో మాట్లాడటం, తమ సమస్యలను స్నేహితులతో పంచుకోవడం వంటివి చేయాలి. ప్రఖ్యాత రచయిత చేతన్ భగత్ అన్నట్లు.. మనిషికి శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. ఒత్తిడి, ఆందోళన, నిరుత్సాహం మనిషిని మానసిక రోగులుగా మార్చతాయి. దీనికి ఒక్కటే మార్గం. పాజిటివ్ థింకింగ్. భయాన్ని తక్కువ చేసి చూడటం.. ధైర్యంగా ముందుకెళ్లడం ఇవే నివారణ మార్గాలు’’. இது எல்லாமே ஒரு Teacher கவனிச்சா Students-க்கு Help பண்ணமுடியும் ! - Archana | Psychiatrist #MentalHealthAwareness #Mentalhealth #Psychiatrist #mentalwellness #VijayAntonyDaughter #VijayAntony #ssmusic pic.twitter.com/pFc2iTJ2Li — SS Music (@SSMusicTweet) September 21, 2023 இப்பவும் இவருக்கு இந்த இழப்புன்றத ஏத்துக்கவே முடியல 😭#VijayAntony pic.twitter.com/r4tg1TByzo — Monkey Cinema (@monkey_cinema) September 21, 2023 -
బొమ్మలు వేస్తూ ఆ ఫోబియాను పోగొట్టకుంది! ఏకంగా గొప్ప ఆర్టిస్ట్‌గా..
ప్రతి మనిషికి ఏదోఒక భయం ఉంటుంది. ఆ భయాన్ని జయించి ముందుకెళ్తుంటారు చాలామంది. మినీషా భరద్వాజ్ మాత్రం భయంతో ఇంట్లో గదికే పరిమితమైపోయింది. మినీషాకు ఉన్న ‘అఘోరా ఫోబియా’తో... కొత్త వ్యక్తుల్ని కలిసినా, తెలియని ప్రాంతాలకు వెళ్ళినా తెగ భయపడిపోయేది. గుంపుగా ఉన్న జనాలను చూసి ‘‘అమ్మో అంతా నా వైపు చూస్తున్నారు’’ అని వణికి పోయేది. చిన్నప్పటి నుంచి ఈ భయంతో పార్టీలు, ఫంక్షన్లకు ఎక్కడికీ వెళ్లనే లేదు. ఇక స్నేహితులు కూడా ఎవరు లేరు. జీవితాంతం ఇలానే ఉంటానేమో అనుకునే మినీషా..బొమ్మలు వేసే అలవాటు ద్వారా తన ఫోబియాను అధిగమించడమేగాక, ఆర్టిస్ట్‌గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. బొమ్మలు వేస్తూ తన భయాన్ని ఎలా పోగొట్టుకుందో తన మాటల్లోనే..... మాది గురుగావ్. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా నా బాల్యమంతా డెహ్రాడూన్‌లో గడిచింది. చిన్నప్పటి నుంచి తెల్లని పేపర్ మీద పెన్సిల్‌తో రకరకాల బొమ్మలు గీసేదాన్ని. ఏడో తరగతిలో ఉండగా ఒక మ్యాగజీన్లో ఉన్న తెల్లటి పేపర్‌పై నటి రేఖ చిత్రాన్ని గీసాను. అప్పుడు మా అమ్మానాన్నలు నా టాలెంట్‌ను చూసి ఆశ్చర్యపోయారు. పదోతరగతి వరకు పెయింటింగ్స్ వేస్తూనే ఉన్నాను. ప్రతి నోట్‌బుక్ చివరి పేజీలో నా పెయింటింగ్ ఒకటి కచ్చితంగా ఉండేది. కొన్నిసార్లు పరీక్షపేపర్లో జవాబు తెలియని ప్రశ్నకు బాధపడుతోన్న అమ్మాయి చిత్రాన్ని గీసేదాన్ని. పదో తరగతిలో అంతర జిల్లా పోటీలలో పాల్గొని డెహ్రాడూన్ మొత్తంలోనే మొదటి బహుమతి అందుకున్నాను. అలా ఎక్కువ సమయం బొమ్మలు గీస్తూ ఉంటే అఘోరా ఫోబియా కూడా గుర్తు వచ్చేది కాదు. ప్రత్యేకమైన కోర్సు చేయలేదు... నేను చార్టర్డ్ అకౌంటెంట్ కావాలని అమ్మావాళ్లు సీఏ చదివించారు. కానీ నా మనస్సంతా ఆర్ట్మీదే ఉండేది. చదువు పూర్తి అయినప్పటికీ కార్పోరేట్ ప్రపంచంలో కాలుపెట్టలేదు. 1995 లో పెళ్లి అయ్యింది. ఆయన ఉద్యోగం దుబాయ్‌లో కావడంతో అక్కడికి వెళ్లిపోయాను. అక్కడ ఓ పబ్లిషింగ్ హౌస్‌లో ఉద్యోగం చేసేదాన్ని. ఒకసారి ఖాళీ సమయం దొరకడంతో..పేపర్ మీద బొమ్మను గీసాను. బొమ్మ పూర్తయ్యే సమయానికి మా ఆయన, ఆయన స్నేహితుడు వచ్చారు. ఆ బొమ్మను చూసి.. ‘‘చాలా బావుంది. బొమ్మలు గీయడంలో మంచి ప్రతిభ ఉంది. ఎందుకు దాచుకుంటావు. బొమ్మలు గీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యచ్చు కదా...’’ అని ప్రోత్సహించారు. అప్పటి నుంచి నాకెంతో ఇష్టమైన ఆర్ట్‌కు ప్రాణం పోస్తున్నాను. చార్కోల్ పెన్సిల్స్‌తో.. ఆయన ప్రోత్సాహంతో స్కెచ్‌లు గీయడం మొదలు పెట్టాను. ఆయన ఒక ఆర్ట్గ్రూప్ను పరిచయం చేయడంతో అక్కడకు వెళ్లి స్కెచ్‌లు గీసేదాన్ని. కమ్యూనిటీకి వెళ్లిన రెండేళ్లలోనే ‘జి ఆర్ట్ కమ్యూనిటీ’ వాళ్లు నన్ను కలిసి ఆర్ట్‌ఎగ్జిబిషన్‌లో పాల్గొనమని ఆహ్వానించారు. ఆ ఎగ్జిబిషన్‌కు అంతర్జాతీయ ఆర్టిస్ట్‌లు వస్తున్నారు. మీరు ఇండియా తరపున ప్రాతినిధ్యం వహించండి’’అన్నారు. అది నాకు చాలా పెద్ద అవకాశం. కానీ ‘‘అందరూ రంగులతో స్కెచ్‌లు గీస్తున్నారు. నేను మాత్రం పెన్సిల్, చార్కోల్తో గీస్తాను. నేను నిలబడగలనా’’ అని నిర్వాహకులను అడిగాను. అందుకు వాళ్లు ... నువ్వుతప్ప ఎవరూ చార్ కోల్ వాడడం లేదు. అందరికంటే భిన్నంగా నీ స్కెచెస్ ఆకర్షిస్తాయి అని చెప్పి ‘డేర్ టు డ్రీమ్’ ఎగ్జిబిషన్‌కు ఎంపిక చేశారు. అలా మొదలైన నా ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. క్రమంగా వాటర్ కలర్స్ కూడా వేయడం ప్రారంభించాను. చార్కోల్ పెయింటింగ్స్‌కు అనేక అవార్డులు అందుకున్నాను. రోలెక్స్ టవర్‌పై నేను వేసిన పెయింటింగ్‌ను ఇప్పటికీప్రదర్శిస్తున్నారు. దీనికి గుర్తింపుగా ‘పీపుల్స్ ఛాయిస్ ఆవార్డు’ వచ్చింది. అబుదాబిలోని లువురే మ్యూజియంలో నా పెయింటింగ్స్ ఉన్నాయి. ఏడు వేలమంది ముందు... దుబాయ్ మాల్స్‌లో ఏడు వేలమంది ముందు చార్కోల్తో పెయింటింగ్ వేశాను. ఆ పెయింటింగ్ వెంటనే అమ్మడు పోయింది. ‘స్పెషల్ నీడ్ దుబాయ్ కేర్’ తో కలిసి చికిత్స పొందుతోన్న పిల్లలకోసం ‘లిటిల్ పికాసో’పేరిట పెయింటింగ్స్ వేసి వారికి సాయం చేశా. 2017లో గుర్గావ్ వచ్చేసి, ఇక్కడ పెయింటింగ్స్ నేర్పిస్తున్నాను. ఇండియా ఆర్ట్ కమ్యూనిటీ, ఇండియా స్పీకింగ్ ఆర్ట్ ఫౌండేషన్, వారి సాయంతో పెయింటింగ్ నేర్పిస్తున్నాను. దుబాయ్‌లో వేలమందికి నేర్పిన నేను, నా అనుభవాల ద్వారా నేర్చుకున్న ట్రిక్స్‌ను ఇక్కడి పిల్లలకు నేర్పిస్తున్నాను’’ అలా నా భయాన్ని అధిగమించడంతోపాటు నా విద్యను అందరికీ నేర్పించగలగడం నాకెంతో సంతృప్తి కలిగిస్తోంది అని చెప్పింది మినీషా. (చదవండి: లాయర్ని కాస్త విధి ట్రక్ డ్రైవర్‌గా మార్చింది! అదే ఆమెను..) -
మీకు తెలుసా! ఆ ఫోబియా వస్తే.. సంతోషంగా ఉండాటానికే భయపడతారట!
ఈ ప్రపంచంలో ఎన్నో ఆసక్తికర విషయాలు ఉంటాయి. శాస్త్రవేతలు లేదా మేధావుల కారణంగానో ఆ కొంగొత్త విషయాలు వెలుగులోకి వస్తే ఇలాంటివి కూడా ఉన్నాయా!.. అని నోరెళ్లబెడతాం. అలాంటి కొన్ని ఆసక్తికర విషయాలు గురించి తెలుసుకుందాం. మంచి ఆసక్తికర విషయాలు.. ఇంతవరకు ఆంగ్లవర్ణమాలలోని అన్ని అక్షరాలు కనిపించే వాక్యం గురించి ఆలోచించారా. అస్సలు అలాంటి వెరైటీ వాక్యం ఒకటి ఉంటుందన్న ఆలోచన వచ్చిందా. తెలుసుకోకపోయిన ఏం ఫర్వాలేదు ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకోండి. ఇంతకీ ఆ వాక్యం ఏంటంటే.. ‘ది క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్స్ వోవర్ ది లేజీ డాగ్’ అనే వాక్యాన్ని గమనిస్తే ఆంగ్ల వర్ణమాలలోని అన్ని అక్షరాలు కనిపిస్తాయట. నిశితంగా గమనిస్తే ఆ విషయం మీకే తెలుస్తుంది. అలానే ఎన్నో రకాల వింత వింత ఫోబియాలు గురించి వినుంటారు. సంతోషం అంటే భయపడే ఫోబియా గురించి విన్నారా. అస్సలు అలాంటిది ఒకటి ఉందని చాలామందికి తెలియకపోవచ్చు. ఔను మీరు వింటుంది నిజమే! . అలాంటి విచిత్రమైన ఫోబియా ఉందంట..దాన్ని చెరోఫోబియా అని పిలుస్తారట. సంతోషంగా ఉండటం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అయితే కొందరు మాత్రం సంతోషంగా ఉండేందుకు భయపడతారట. దీనికి కారణం సంతోషంగా కనిపిస్తే ఎక్కడ కీడు జరగుతుందోననే మూఢ నమ్మకంతో సంతోషంగా ఉండరట. ఇది రాను రాను సంతోషంగా ఉండాలంటేనే భయపడేంతగా మారుతుందట. అందుకే ఈ లక్షణాన్ని చెరోఫోబియా అంటారు. చాలామంది ఎందువల్ల తెలియదు కొన్ని దురలవాట్లు ఉంటాయి. దూరం చేసుకోవాలనుకున్న ఏదో బలహీనత మళ్లీ ఆ చెడ్డఅలవాటే దగ్గరికి వెళ్లేలా చేస్తుంది. ఈ అలవాట్ల నుంచి ఎలా బయటపడాల్రా బాబు అని తలపట్టుకుంటారు. అలాంటి వాళ్లు నిజంగా మారాలి అని గట్టిగా కోరుకుంటే మాత్రం ముందుగా ఆ దురలవాటు జోలికి వెళ్లకుండా ఓ 21 రోజులు ట్రై చేస్తే చాలట. ఇక వాళ్లకి తెలియకుండానే ఆ అలవాటు నుంచి బయటపడతారట. అధ్యయనంలో తేలిందని నిపుణులు చెబుతున్నారు. ఇక కొన్ని కొత్త పదాలు ఓ పట్టాన అర్థం కావు. ఆంగ్ల పదంలా ఉన్న వేరే భాష మాదిరిగా ఉంటాయి. ఎందకంటే ఆ పదం అర్థం కాక. అట్లాంటి పదమే ‘వోవర్ మారో’. ఐతే దీని అర్థం వింటే ఓస్ ఇంతేనా అనేస్తారు. దీని అర్థం ది డే ఆఫ్టర్ టుమారో అని అర్థమట అంటే ఎల్లుండి అని. (చదవండి: ఏకే ఫ్లవర్ కాదు ఫైర్ బోల్ట్! అతి పెద్ద స్మార్ట్ వాచ్ బ్రాండ్!) -
అయ్ బాబోయ్...ఏఐ! రేకెత్తిస్తున్న వేల భయాలు..!
అయ్ బాబోయ్...‘వేవ్ ఆఫ్ ది ప్యూచర్’గాచెబుతున్న ఏఐ సాంకేతికత యువతలోని ఒక వర్గంలో వేల భయాలను రేకెత్తిస్తోంది. భూతంలా భయపెడుతోంది. ఏఐ టెక్నాలజీ వల్ల ఉన్న ఉద్యోగాలు పోతాయనీ, ఉద్యోగావకాశాలు ఉండవనే ఆందోళనకు ‘ఏఐ యాంగ్జైటీ అని పేరు పెట్టారు.... ఈ భయం ఈనాటిది కాదు. ‘ఈ యంత్రాలు మన ఉపాధిని మింగేస్తాయి’ అనే భయం పారిశ్రామిక విప్లవం రోజుల నుంచి ఉన్నదే. చాట్ జీపీటీ విజయవంతం అయిన తరువాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) అనేది ఇప్పుడు యువతను భూతమై భయపెడుతోంది. ఒక సర్వే ప్రకారం పద్దెనిమిది నుంచి ఇరవైనాలుగు సంవత్సరాల మధ్య వయసు వాళ్లు తమ కెరీర్‌కు సంబంధించిన భయాలతో ఉన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అంచనా ప్రకారం 2025 కల్లా 85 మిలియన్ల ఉద్యోగాలు ఏఐ సాంకేతికతతో భర్తీ అవుతాయి. ఈ నేపథ్యంలో కంపెనీలలో ఉద్యోగుల భవిష్యత్ పనితీరు ఎలా ఉండబోతున్నది అనేది హాట్ టాపిక్‌గా మారింది. ఇది ఎంత పాపులర్ టాపిక్ అయిందంటే మూడు సంవత్సరాల వ్యవధిలో దీనిపై పదుల సంఖ్యలో పుస్తకాలు వచ్చాయి. ఆర్థికవేత్త రిచర్డ్బాల్డ్ విన్ తన పుస్తకం ‘ది గ్లోబటిక్స్ అప్హీవల్’లో ఏఐ ద్వారా ఏయే రంగాలు ఎలాంటి ప్రభావానికి గురవుతాయో విశ్లేషించారు. కొన్ని పుస్తకాలు మాత్రం ‘భయం అక్కర్లేదు’ అంటూ యువతను ఆశావహ మార్గం వైపు నడిపిస్తున్నాయి. యంత్రాలతో చెలిమి తప్పదు, తప్పు కాదు అంటున్నాయి. సాంకేతిక శక్తి ప్రభావితం చేయని, అంటే ఉద్యోగాలకు ప్రమాదం లేని కొన్ని రంగాలు ఉండేవి. ఉదా: ఎకౌంటింగ్, న్యాయశాస్త్రం...మొదలైనవి. అయితే తాజాగా వెల్–ఎడ్యుకేటెడ్ ప్రొఫెషన్స్‌కు సంబంధించిన వారిలో కూడా ఆందోళన మొదలైంది. లా ప్రాక్టీస్‌లో ఏఐ చాట్‌బాట్ కూడా భాగం కానుంది కెరీర్ అభద్రతకు సంబంధించిన ఆలోచనల నేపథ్యంలో ఒక మార్కెటింగ్ ఏజెన్సీ ద్వారా ‘ఏఐ యాంగై్జటీ’ అనే మాట ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇలాంటి పదాలు పుట్టడం కొత్త కాదు. సాంకేతిక పురోగతికి సంబంధించిన ప్రతి సందర్భంలో ఇలాంటి పదాలు ఎన్నో పుట్టాయి. 1980లలో ‘కంప్యూటర్ ఫోబియా’ ‘కంప్యూటర్ యాంగై్జటీ’ ‘టెక్నో స్ట్రెస్’లాంటివి పుట్టాయి. ఏఐకి సంబంధించి రెండు వర్గాలు కనిపిస్తాయి. మొదటి వర్గానికి చెందిన వారిలో ‘ఆటోమేషన్ ఆందోళన’ కనిపిస్తుంది. రెండో వర్గం వారిలో ఆశాభావం కనిపిస్తుంది. మనుషులు, యంత్రాలతో చేయికలిపితే మెరుగైన ఫలితాలు వస్తాయనేది రెండో వర్గం నమ్మకం. టామ్ క్రూజ్ ‘మైనార్టీ రిపోర్ట్’లాంటి సినిమాలలో, పర్సనల్ ఇంట్రెస్ట్లాంటి టీవీ షోలలో మనిషి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో జత కడితే జరిగే అద్భుతాలు కనిపిస్తాయి. వివిధ రంగాలపై ఏఐ ఎలాంటి మార్పును తీసుకురానుంది? ఆ మార్పు మనపై ప్రతికూల ప్రభావం చూపకుండా ఎలా జాగ్రత్త పడాలి? ఏం నేర్చుకోవాలి?... ఈ విషయాలు చెప్పడానికి ఆన్లైన్ కోర్సులు వచ్చాయి. ఏఐ సాంకేతికత రీప్లేస్ చేయలేని ఇంటర్‌పర్సనల్ స్కిల్స్ లేదా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి అవి నొక్కి చెబుతున్నాయి. డిజిటల్‌తో పాటు సాఫ్ట్‌స్కిల్స్‌ను కలగలిపి పాఠాలుగా చెబుతున్నాయి. ఈ కోర్సులపై యువత ఆసక్తి ప్రదర్శిస్తోంది. ‘ఉద్యోగాలపై ఏఐ టెక్నాలజీ ప్రభావం గురించి ఫ్రెండ్‌కు నాకు మధ్య చర్చ జరిగింది. ఏటీఎం మెషీన్లు వచ్చిన కొత్తలో బ్యాంకింగ్ రంగంలో ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోతారు, కొత్త ఉద్యోగాలు ఉండవు...ఇలా ఎన్నో మాటలు వినిపించేవి. కాని అది నిజం కాలేదు. ఉద్యోగుల పనితీరు మాత్రం మారింది. ఏఐ టెక్నాలజీ విషయంలోనూ జరిగేది ఇదే’ అంటుంది ముంబైకి చెందిన అక్షర. ఏఐ...అయితే ఏంటీ! యువతలో ఏఐ ఫోబియాను తొలగించడానికి ‘ఫోర్బ్స్ కోచెస్ కౌన్సిల్’ సభ్యులు కొన్ని సూచనలు చేశారు. వాటిలో కొన్ని... ఏఐ అంటే భయం కాదు, ఇష్టం పెంచుకోండి. ఏఐకు సంబంధించి ప్రతిదీ నేర్చుకోండి. నిపుణులతో మాట్లాడండి. ఉద్యోగ నైపుణ్యానికి ఏఐ ఎలా ఉపయోగపడగలదు అనే కోణంలో ఆలోచించండి. మనిషికి ఉండే సహజ నైపుణ్యాలను ఏఐ ఎప్పుడూ రీప్లేస్ చేయలేదు. మనిషికి ఉండే కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రేరణశక్తి, ఎత్తుగడలు, సమయస్ఫూర్తి...యంత్రం అనుకరించలేనివి. ‘ఈ ఉద్యోగం మాత్రమే చేస్తాను. ఇది మాత్రమే చేయగలను’ అని ఫిక్స్ కావద్దు. బీ ఫ్లెక్సిబుల్. ఏ ఉద్యోగమైనా చేసే నైపుణ్యాన్ని సొంతం చేసుకోండి. ఒకే దారిలో నడిచే వారికి ఆ దారి మాత్రమే తెలుస్తుంది. కొత్త దారుల్లో నడవడం నేర్చుకుంటే అది ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. ఒత్తిడి దరి చేరని, సమస్యలను పరిష్కరించే, సానుకూలతను శక్తిగా మార్చుకునే, ఇతరులతో మంచి స్నేహసంబంధాలతో ఉండగలిగే ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌ను మెరుగుపరుచుకోండి. ఏఐ ఎలాంటి పాత్ర అయినా పోషించగలదు...అని విశ్వసించే సందర్భంలో ఉన్నాం. ఇలాంటి సమయంలోనే ఏఐ కంటే భిన్నంగా, మెరుగ్గా పనిచేసే నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలి. (చదవండి: విచిత్రమైన వాహనం! రోడ్డుపై ఉంటే వ్యాను..నీటిలో ఉంటే బోటు!) -
Manipur violence: మొయితీల వలసబాట
గువాహటి/కోల్‌కతా: కల్లోల మణిపూర్‌లో తెగల మధ్య రాజుకున్న మంటలు ఆరడం లేదు. బాధితులు ప్రాణభయంతో రాష్ట్రం విడిచి వెళ్లిపోతున్నారు. సురక్షిత ప్రాంతాలను వెతుక్కుంటూ పొరుగు రాష్ట్రాలకు చేరుకుంటున్నారు. సొంత రాష్ట్రంలో పరిస్థితులు కుదుటపడేదాకా మరోచోట తలదాచుకోవడమే మేలని భావిస్తున్నారు. ఇద్దరు గిరిజన మహిళలను దిగంబరంగా ఊరేగించిన ఘటన బయటపడిన తర్వాత మొయితీ తెగ ప్రజల్లో భయాందోళన మరింత పెరిగిపోయింది. ఇప్పటికే మిజోరాంలో ఉంటున్న మణిపూర్ మొయితీల్లో ప్రాణ భయం మొదలైంది. మాజీ మిలిటెంట్ గ్రూప్ నుంచి బెదిరింపులు రావడమే ఇందుకు కారణం. 41 మంది మెయితీలు శనివారం రాత్రి మిజోరాం నుంచి అస్సాంలోని సిల్చార్కు చేరుకున్నారు. వారికి బిన్నాకండీ ఏరియాలోని లఖీపూర్ డెవలప్మెంట్ బ్లాక్ కార్యాలయ భవనంలో ఆశ్రయం కల్పించినట్లు పోలీసులు వెల్లడించారు. వీరంతా ఆర్థికంగా మెరుగైన స్థానంలో ఉన్నవారేనని, సొంత వాహనాల్లో అస్సాం దాకా వచ్చారని పేర్కొన్నారు. ఈ 41 మంది మొయితీల్లో కాలేజీ ప్రొఫెసర్లు, ప్రభుత్వ సీనియర్ అధికారులు కూడా ఉన్నారని తెలియజేశారు. మిజోరంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని వారు చెప్పారని వివరించారు. అయినప్పటికీ అక్కడ రిస్క్ తీసుకోవడం ఇష్టంలేక అస్సాంకు వచ్చామంటూ తమతో పేర్కొన్నారని వెల్లడించారు. బాధితులకు పూర్తి రక్షణ కలి్పస్తున్నట్లు అస్సాం పోలీసులు ఉద్ఘాటించారు. వదంతులు నమ్మొద్దు: మిజోరాం ప్రభుత్వం మణిపూర్‌లో మే 3వ తేదీ నుంచి ఘర్షణలు ఉధృతమయ్యాయి. ఇప్పటిదాకా వేలాది మంది మొయితీలతోపాటు గిరిజన తెగలైన కుకీలు, హమర్ ప్రజలు వలసబాట పట్టారు. వీరిలో చాలామంది అస్సాంలో ఆశ్రయం పొందుతున్నారు. ఇదిలా ఉండగా, వెంటనే రాష్ట్రం విడిచి వెళ్లిపోవాలంటూ మిజోరంలో తలదాచుకుంటున్న మణిపూర్ మొయితీలకు మాజీ తీవ్రవాద గ్రూపు నుంచి బెదిరింపులు వచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ మాజీ మిలిటెంట్ గ్రూప్‌నకు కుకీ అనుకూల వర్గంగా పేరుంది. తమ రాష్ట్రంలో ఉంటున్న బాధితులకు పూర్తిస్థాయిలో రక్షణ కలి్పస్తున్నామని, వదంతులు నమ్మొద్దని మిజోరం ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. బెదిరింపులు తట్టుకోలేక కొందరు మొయితీలు మిజోరం నుంచి సొంత రాష్ట్రం మణిపూర్‌కు వెళ్లిపోయినట్లు తెలిసింది. మణిపూర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన మే 4న చోటుచేసుకుంది. మే 15న ఇంఫాల్‌లో 18 ఏళ్ల బాలికలపై గ్యాంగ్ రేప్ జరిగిందంటూ తృణమూల్ కాంగ్రెస్ పారీ్ట ఆరోపించింది. -
పల్నాడులో దారితప్పి తిరుగుతున్న రెండు పెద్ద పులులు
-
వాలంటీర్లంటే వణుకెందుకు బాబూ ?
-
పొలిటికల్ కారిడార్ : చిత్తూరు జిల్లా టీడీపీలో వణుకు
-
ప్రపంచ జనాభా 800 కోట్లకు: తిండి, నీళ్లు దొరకవా? ఏం చేయాలి?
మానవాళి హాయిగా సుఖంగా ఉండాలి. మనుషుల మధ్య అసమానతలు తగ్గి అందరూ సంతోషంగా ఉండాలి. కొందరి దగ్గరే సంపద అంతా పోగు పడిపోతే.. మెజారిటీ ప్రజలు డొక్కలు మాడ్చుకుంటూ ఆకలి కేకలే వేస్తోంటే ఆ సమాజం ఎలా మనుగడ సాగించగలుగుతుంది? ఎలా ఆనందంగా ఉండగలుగుతుంది. అన్నింటికన్నా ప్రమాదకరమైనవి అసమానతలు, వివక్షలు. వాటిని రూపు మాపుకుంటూ మానవ సంబంధాలు పెంపొందించుకుంటూ ఉజ్వల భవిష్యత్ దిశగా అడుగులు వేసేలా దేశాల ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుని పకడ్బందీగా అమలు చేయాలి. అప్పుడే మానవాళి మనుగడ సాగించగలుగుతుందని మేథావులు సూచిస్తున్నారు. ప్రపంచ జనాభా 800 కోట్లు అయిపోయిందని చాలా మంది కంగారు పడిపోతున్నారు. అది పెద్ద సమస్య కాదు. సమస్యల్లా పెరిగిన జనాభా చక్కటి మానవ సంబంధాలతో లోటు లేకుండా మనుగడ సాగించడమే. మన వ్యవస్థల్లోని సవాలక్ష అసమానతలు.. లింగ వివక్షలు పెను సవాళ్లను విసురుతున్నాయి. 300కోట్ల మంది పౌష్ఠికాహారం తినే స్థోమత లేక కడుపులు మాడ్చుకుంటున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. దానికి కారణం ఏంటో మాత్రం ఎవరూ ఆలోచించడం లేదు. జనాభాలో కేవలం 10 శాతం మంది వద్దే 80 శాతం సంపద పోగుపడ్డమే సమస్య. పేదలకు ఆ సంపద పంపిణీ కాకపోవడం వల్లనే అసమానతలు పెరుగుతున్నాయి. అవే ఆకలి కేకలు పెంచుతున్నాయి. అవే జీవితాలను దుర్భరం చేస్తున్నాయి.అందుకే ప్రపంచమంతా మనిషి మనిషిగా బతికే వీలు కల్పించడంపైనే దృష్టి సారించాల్సి ఉందంటున్నారు మేథావులు. నిన్న కాక మొన్ననే. ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకుంది బాబోయ్ అంటూ తెలిసో తెలీకో చాలా మంది గగ్గోలు పెట్టేశారు.జనాభా ఇలా పెరుగుతూ పోతే అందరికీ ఆహారం ఎలాగ? అని చాలా సీరియస్‌గా ఆందోళన వ్యక్తం చేసేశారు కూడా. జనాభాని నియంత్రిస్తే ఎలాంటి సమస్యా ఉండదని కొందరైతే చాలా అమాయకంగా సలహాలు కూడా ఇచ్చేస్తున్నారు. ఇంకొందరైతే ఆహార ఉత్పత్తులు పెంచడంపై ప్రపంచం దృష్టి సారించాలని తోచిన సలహా ఇచ్చారు. ఉన్న ఆహారాన్ని వృధా చేయకుండా ఉంటే అదే పది వేలని కొందరు మేథావులు సూత్రీకరించేశారు. అసలు సమస్య ఎక్కడుంది? సమస్య ఏంటి? అన్నదానిపై ఎవరూ దృష్టి సారించడం లేదు. జనాభా పెరుగుతోంది. ఓకే. అది పెరుగుతుంది. అందులో ఆశ్చర్య పడాల్సింది కానీ ఆందోళన చెందాల్సింది కానీ ఏమీ లేదు కదా. ఒకప్పుడు సగటు జీవితకాలంతో పోలిస్తే ఇపుడు ప్రజల ఆయుష్షు బాగా పెరిగింది. దశాబ్ధాల క్రితం చాలా వ్యాధులకు, రుగ్మతలకు మందులే ఉండేవి కావు. ఏదన్నా సుస్తీ చేస్తేనే రోగనిరోధక శక్తి లేక చనిపోయే పరిస్థితులు ఉండేవి. ఇపుడు ప్రాణాధార ఔషథాలు అందుబాటులోకి వచ్చేశాయి. ఒకప్పుడు పేరు చెప్పడానికే భయపడే క్యాన్సర్ వ్యాధి ఇపుడు ఎవరినీ కంగారు పెట్టడం లేదు. క్యాన్సరా? సరేలే..ఆసుపత్రికెళ్తే తగ్గిపోతుందిలే అనే ఆలోచనలు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే వైద్య రంగంలో ఊహించని విప్లవాత్మక ఆవిష్కరణలు చోటు చేసుకున్నాయి కాబట్టి. అందు చేత జనాభా పెరుగుతూనే ఉంటుంది. ఇక పెరిగిన జనాభాకు అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తులను పెంచినంత మాత్రాన ఆకలి కేకలు మాయం అయిపోతాయా? ఛస్తే కావు. ఎందుకంటే ఆహార ఉత్పత్తులు పెంచినంత మాత్రాన అవి పేదల చేతుల్లోకి రావు. పేదలు వాటిని వినియోగించు కోగలగాలంటే వాటిని కొనుగోలు చేసే శక్తి వారికి ఉండాలి. అది జరగాలంటే ప్రభుత్వాలు పథకాలు రూపొందించాలి. చాలా దేశాల్లో విచిత్రమైన పరిస్థితి ఉంది. దేశాలు చాలా సంపన్న దేశాలుగా పేరు గడిస్తున్నాయి. కానీ ఆ దేశాల్లో మెజారిటీ ప్రజలు మాత్రం గర్భ దారిద్య్రంలో ఉన్నారు. ఎక్కడో ఎందుకు మన దేశాన్నే తీసుకుంటే.. మన దేశంలోని 80 శాతం సంపద కేవలం పది శాతం మంది కుబేరుల వద్దే ఉంది. మిగతా 90శాతం మందిలో 80 శాతం మంది నిరుపేదలే. వీరిలో మెజారిటీ ప్రజలు పౌష్ఠికాహారం కొనుగోలు చేయగల స్థోమత ఉన్నవారు కారు. ఐక్యరాజ్యసమితి ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ తాజాగా నిర్వహించిన అధ్యయనంలో ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్ల మంది ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకునే పరిస్థితిలో లేరని తేలింది.సహజంగానే ఇందులో ఎక్కువ మంది ఆఫ్రికా దేశాల్లోనే ఉంటారు. మన దేశంలో అయితే 97 కోట్ల మంది పౌష్ఠికాహారం కొనగల స్థితిలో లేరు. ఎందుకంటే ఆహార ఉత్పత్తుల ధరలు పెరిగిపోవడం జీవన ప్రమాణాలు పడిపోవడంతో మండే కడుపుకు కాలే బూడిదలా ఏదో ఒకటి తిని కడుపు నింపుకోవడమే గగనమైపోతోంది. ఇక పౌష్ఠికాహారాన్ని తీసుకోవాలంటే ఎక్కడి నుంచి కుదురుతుంది? ప్రతీ మనిషీ రోజూ కనీసం 400 గ్రాములు కూరగాయలు, పళ్లు తినాలట. ఇంటి మొత్తానికి అరకిలో కూరగాయలతో కాలక్షేపం చేసే దేశంలో ఒక్క మనిషిపై ఇంత పెట్టుబడి పెట్టగల స్థితిలో ప్రజలుంటారా? ఏటా ఆహార ఉత్పత్తుల ధరలు పెరుగుతుంటే.. ప్రజల ఆదాయాలు తగ్గుతున్నాయి. కోవిడ్ మహమ్మారి కారణంగా రెండేళ్ల పాటు ప్రపంచంలోని ఆర్ధిక వ్యవస్థలన్నీ కుప్పకూలడంతో జీవన ప్రమాణాలు మరీ అధ్వాన్నంగా దిగజారాయి. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? (ఇంకా వుంది) -సీఎన్ఎస్ యాజులు, కన్సల్టింగ్ ఎడిటర్, సాక్షి టీవీ -
పొలిటికల్ కారిడార్ : కాంగ్రెస్ లో పదవులిస్తామంటే పారిపోతున్నారు ..!
-
చీతాల రాకతో...భయాందోళనలతో బెంబేలెత్తుతున్న గ్రామస్తులు
మధ్యప్రదేశ్: నరేంద్రమోదీ పుట్టిన రోజు పురస్కరించుకుని చీతా(చిరుత పులుల్లో ఒక రకం) ప్రాజెక్టులో భాగంగా ఎనిమిది చీతాలను మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ నేషనల్ పార్క్ సమీపంలో గ్రామాల్లోని ప్రజలు ఈ చిరుతల రాకతో భయాందోళనకు గురవుతున్నారు. మరికొంతమంది ఈ చిరుత కారణంగా పర్యాటకుల తాకిడి ఎక్కువవుతుందని, అందువల్ల ఉపాధి దొరుకుతుందని భావిస్తున్నారు. కానీ చాలామంది గ్రామస్తులు తమ భూములను లాక్కుంటారేమోనని భయపడుతున్నారు. ఈ చిరుతుల రాక మధ్యప్రదేశ్‌లోని షియాపూర్ జిల్లా పరిసర ప్రాంతాల్లోని గ్రామస్తుల్లో లేని భయాలను రేకెత్తించింది. వారిలో ఈ భయాందోళనలకు కారణం...గతంలో సుమారు నాలుగు నుంచి ఐదు గ్రామాలను పార్కు కోసం మార్చడం, అలాగే సుమారు 25 గ్రామాల ప్రజలను తరలించడం వంటివి జరిగాయి. దీంతో వారు తమ భూములను, నివాసాలను కోల్పోయి..ఆర్థికంగా దెబ్బతిన్నారు. అంతేకాదు ఆ గ్రామానికి సమీపంలోని ఆనకట్ట ప్రాజెక్టు కారణంగా కూడా ప్రజలు తమ జీవనోపాధిని కోల్పోతారని రామ్‌కుమార్ గుర్జార్ అనే మరో రైతు చెబుతున్నాడు. మీ గ్రామానికి సమీపంలోని పార్కుల్లో చిరుతల రాక గురించి గ్రామస్తుల అభిప్రాయం గురించి ప్రశ్నించగా... జాతీయ ఉద్యానవనం కోసం గ్రామాలను లాక్కున్నారు. ఇప్పుడూ సమీపంలోని కునో నదిపై ఆనకట్ట ప్రాజెక్లు నిర్మించనున్నారు...ఇది మరో 50 గ్రామాలపై ప్రభావం చూపుతుంది. ఈ నేషనల్ పార్క్‌ల వల్ల పర్యాటకులు పెరిగినప్పటికీ....ధనవంతులే వ్యాపారాలు నిర్వహించుకుంటారని, తమకు ఉపాధి దొరకదని అంటున్నారు. అలాగే హోటళ్లు, రెస్టారెంట్ల కోసం తమ భూములను లాక్కుంటారని గ్రామస్తులు ఆవేదనగా చెబుతున్నారు. (చదవండి: కునో పార్కులో చీతాలను వదిలిన ప్రధాని మోదీ, స్వయంగా ఫోటోలు తీస్తూ..) -
అదే జరిగితే.. 500 కోట్లమంది బతుకులు ఖతం!
న్యూజెర్సీ: ప్రకృతికి బదులు.. సృష్టి వినాశనానికి ఇప్పుడు మనిషే కారణం అయ్యేలా కనిపిస్తున్నాడు. అందునా అణు యుద్ధం ప్రత్యక్షంగా కంటే.. పరోక్షంగానే వందల కోట్ల మందిని బలి తీసుకుటుందనే ఊహా.. భయాందోళనలను రేకెత్తిస్తోంది ఇప్పుడు. న్యూజెర్సీ రూట్గెర్స్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు.. అణు యుద్ధాలతో తలెత్తబోయే సంక్షోభాల మీద ఒక సుదీర్ఘ అధ్యయనం నిర్వహించారు. దీని ప్రకారం.. ఆధునిక అణుయుద్ధం వల్ల తాండవించే కరువు, ఆహారపంటల లేమి ద్వారానే ఎక్కువ మంది బలైపోతారని.. ఆ సంఖ్య సుమారు ఐదు బిలియన్లు(ఐదు వందల కోట్ల మందికిపైనే) ఉంటుందని పేర్కొన్నారు. అణ్వాయుధాల పేలుడుతో వాతావరణంలో సూర్యకాంతి నిరోధించే మసి ద్వారా ఆహార కొరత ఏర్పడుతుందని.. ప్రాణాంతకమైన పేలుళ్ల వల్ల కలిగే ప్రాణనష్టం కంటే ఇది చాలా ఎక్కువని ఆ బృందం అభిప్రాయపడింది. ఒకవేళ అమెరికా-రష్యా మధ్య గనుక అణు యుద్ధం జరిగితే.. సగం మానవ జనాభా అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఈ మేరకు యుద్ధ ప్రభావంతో ఏయే దేశంలో ఎంతమేర ఆహార పంటలపై ప్రభావం చూపుతుందనే విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ అట్మాస్పిరిక్ రీసెర్చ్ ద్వారా సేకరించింది శాస్త్రవేత్తల బృందం. అంతెందుకు భారత్-పాక్ మధ్య గనుక చిన్నపాటి యుద్ధం జరిగినా.. ఆ పరిణామం ప్రపంచ ఆహారోత్పత్తి మీద పెను ప్రభావం చూపుతుందని ఆ బృందం వెల్లడించింది. ఐదేళ్లలో ఇరు దేశాల్లో ఏడు శాతం పంట దిగుబడి తగ్గిపోతుందని.. అదే అమెరికా-రష్యాల మధ్య జరిగే యుద్ధం జరిగితేగనుక.. మూడు నుంచి నాలుగేళ్లలో 90 శాతం ఉత్పత్తి పడిపోతుందని తెలిపింది. ఈ ముప్పు నుంచి తప్పించుకునేందుకు తీసుకునే చర్యలు చేపట్టినా.. రాబోయే పెనుఉపద్రవం ముందు ఆ చర్యలు పెద్దగా ప్రభావం చూపెట్టకపోవచ్చనే అభిప్రాయపడింది న్యూజెర్సీ రూట్గెర్స్ యూనివర్సిటీ సైంటిస్టుల బృందం. ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలోనే.. ఈ బృందం ఈ తరహా అధ్యయనానికి చేపట్టింది. పైగా అణు యుద్ధం తలెత్తవచ్చంటూ గతంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ చేసిన కామెంట్లను సైతం పరిశీలనలోకి తీసుకుంది. ఈ అధ్యయానికి సంబంధించిన విషయాలు నేచర్ ఫుడ్ జర్నల్‌లో తాజాగా ప్రచురితం అయ్యాయి. ఇదీ చదవండి: భారత్ హెచ్చరికలు బేఖాతరు చేసిన చైనా -
దెయ్యం మెసేజ్‌లు పంపుతోంది!!
ఇదొక చిత్రమైన కేసు. కాలిఫోర్నియా స్టాక్టన్కు చెందిన ఓ వ్యక్తి.. దెయ్యం తన మొబైల్ నుంచి మెసేజ్‌లు పంపుతోందని, రిప్లయ్‌లు కూడా ఇస్తోందని వాదిస్తున్నాడు. నలభై ఏళ్ల ఆ వ్యక్తి తన ప్రియురాలితో ఇంగ్లండ్‌లోని యార్క్ నగరానికి టూర్‌కి వెళ్లాడు. అయితే అది హాంటెడ్ సిటీ అని, అక్కడ ఒక పబ్ దగ్గర ఫొటో తీస్తే.. దెయ్యం కనిపించిందని, అప్పటి నుంచి తనకు పారానార్మల్ యాక్టివిటీస్ (విచిత్రమైన అనుభవాలు) ఎదురవుతున్నాయని చెప్తున్నాడు. అంతేకాదు.. ఆనాటి నుంచి తన ఫోన్ నుంచి తనకు తెలియకుండానే ప్రియురాలికి సందేశాలు వెళ్తున్నాయని, ఇదంతా దెయ్యం పనే అని అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. ఈ మేరకు పోలీసులనూ ఆశ్రయించాడు. ప్రస్తుతం అతగాడిని మానసిక వైద్యుల పర్యవేక్షణలో విచారిస్తున్నారు పోలీసులు. అయితే పారానార్మల్ యాక్టివిస్ట్‌లు ఈ కేసును ఆసక్తికరంగా గమనిస్తున్నారు. మార్చి 21వ తేదీ నుంచి ఆ వ్యక్తికి ఇలాంటి అనుభవాలు మొదలయ్యాయని ‘టీసిడె లైవ్ రిపోర్ట్స్’ ఒక కథనం ప్రచురించింది. -
పరీక్షలకు పండుగలా సిద్ధం కావాలి
న్యూఢిల్లీ: పరీక్షలంటే భయం వద్దేవద్దని విద్యార్థులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్బోధించారు. పరీక్షలకు ఒక పండుగలా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పరీక్షలు రాయడం ఇదే మొదటిసారి కాదని, గతంలో ఎన్నో పరీక్షలను విజయవంతంగా ఎదుర్కొన్న అనుభవం విద్యార్థులకు ఉందని, ఒత్తిడికి లోను కావొద్దని సూచించారు. తాము నెరవేర్చుకోలేని కలలు, ఆకాంక్షలను పిల్లలపై బలవంతంగా రుద్దవద్దని తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తును నిర్ణయించుకొనే స్వేచ్ఛను పిల్లలకు ఇవ్వాలన్నారు. శుక్రవారం ఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో కేంద్ర విద్యా శాఖకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, లిటరసీ నిర్వహించిన ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో ముచ్చటించారు. నరేంద్ర మోదీ ఇంకా ఏం చెప్పారంటే.. ► వాట్సాప్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలతో సమస్య ఏమీ లేదు. సమస్య మన మనసుల్లోనే ఉంది. ఆన్లైన్ అయినా, ఆఫ్‌లైన్ అయినా సరే చదువుపై మనసు పూర్తిగా లగ్నం చేయాలి. అప్పుడు పరధ్యానానికి తావుండదు. ► చదువు నేర్చుకోవానికి అందుబాటులోకి వస్తున్న నూతన మార్గాలను ఒక అవకాశంగానే భావించాలి తప్ప సవాలు అనుకోకూడదు. ► విద్యార్థులు అప్పుడప్పుడు ఇన్లైన్లోకి (వారితో వారే గడపాలి) వెళ్లాలి. ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో గడపడానికి దూరంగా ఉండాలి. ► విద్యార్థులతో మాట్లాడుతున్నప్పుడు నా వయసు 50 ఏళ్లు తగ్గిపోయినట్లుగా అనిపిస్తోంది. ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమం నాకు ఎంతగానో తోడ్పడుతోంది. ► కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ విద్యా విధానాన్ని (ఎన్ఈపీ) దేశంలో అన్ని వర్గాలు మనస్ఫూర్తిగా స్వాగతిస్తుండడం సంతోషకరం. ► నచ్చిన సబ్జెక్టులను అభ్యసించే అవకాశం ఎన్ఈపీలో ఉంది. సరిగ్గా అమలు చేస్తే భవ్యమైన భవితకు కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. ► పోటీని చూసి బెంబేలెత్తిపోవాల్సిన పని లేదు. దాన్ని జీవితంలో అతిపెద్ద బహుమతిగా భావించాలి. పోటీని ఆహ్వానించాలి. అప్పుడే మనం పరీక్షకు గురవుతాం. సామర్థ్యం బయటపడుతుంది. యువతరం ఎదుట ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అందుకు గర్వపడాలి. ► ‘పీ3 (ప్రో ప్లానెట్ పీపుల్) ఉద్యమ’ అవసరం ఎంతైనా ఉంది. ‘యూజ్ అండ్ త్రో’ సంస్కృతిని వదిలించుకోవాలి. బాలికల ప్రతిభను గుర్తించకపోతే ప్రగతే లేదు కుమారులతోపాటు కుమార్తెలను సమానంగా చూడాలని ప్రధాని మోదీ చెప్పారు. ఇరువురి మధ్య భేదభావం చూపొద్దని కోరారు. ఇద్దరికీ సమాన అవకాశాలు కల్పించాలన్నారు. బాలికల ప్రతిభను గుర్తించని సమాజం ఎప్పటికీ ప్రగతి సాధించలేదని స్పష్టం చేశారు. పరీక్షా పే చర్చలో ఆయన మాట్లాడుతూ... గతంలో బాలబాలికల మధ్య వ్యత్యాసం చూపేవారని, ఇప్పుడు పరిస్థితి చాలావరకు మారిపోయిందని అన్నారు. కొత్తగా పాఠశాలల్లో చేరుతున్నవారిలో బాలల కంటే బాలికలే ఎక్కువ మంది ఉంటున్నారని హర్షం వ్యక్తం చేశారు. ప్రతి కుటుంబానికి బాలికలు పెద్ద ఆస్తిగా, బలంగా మారుతున్నారని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో బాలికలు రాణిస్తున్నారని ఉద్ఘాటించారు. తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవడానికి పెళ్లికి దూరంగా ఉన్న కుమార్తెలు ఎంతోమంది ఉన్నారని, అదే సమయంలో తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో చేర్చి, హాయిగా కాలం గడుపుతున్న కుమారులు కూడా ఉన్నారని మోదీ వ్యాఖ్యానించారు. -
మంచి మాట..భయం ఒక భ్రమణం
ఈనాడు సమస్త విశ్వాన్ని వేధిస్తున్న ప్రధాన సమస్య భయం. ఇది ఏదైనా సరే ఒకసారి పట్టుకుందంటే అది వ్యక్తిత్వాన్ని దుర్బలపరుస్తుంది. ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి ఆందోళనకు అభద్రతకు గురి చేస్తుంది. ఇదొక మానసిక వేదన. దీనివల్ల మొత్తం మనిషి జీవితం నిర్వీర్యమవుతుంది. ఇది సామాజిక వాతావరణం నుంచి ఉద్భవిస్తుంది తప్ప అంతర్గతంగా ఉండదు. బయట వాతావరణాన్ని బట్టి అంతర్గత లక్షణాలు ప్రకోపిస్తాయి. ఈ లక్షణాలే భయానికి ప్రధాన కారణమవుతున్నాయి. నిత్యజీవితంలో మనిషి రకరకాల భయాలతో కాలం వెళ్ళదీస్తుంటాడు. అవి ప్రాకృతికమైనా, సామాజికమైనా, సాంస్కృతికమైనా వాటిని అధిగమించడం ద్వారానే మనిషి మామూలు మనిషి కావడం సాధ్యపడుతుంది. అయితే ఈ భయాలను అధిగమించాలంటే మనిషనేవాడికి వ్యక్తిగత సాధన, విమర్శనాత్మక పరిశీలన ముఖ్యం. ప్రతిమనిషి నిత్యం ఆలోచనలతో జీవిస్తూ ఉంటాడు. వర్తమానాన్ని విడిచి పెట్టి, భవిష్యత్‌లో ఏం జరుగుతుందోనని తీవ్రంగా ఆలోచిస్తాడు. ఇలాంటి ఆలోచనలే భయాన్ని ప్రోదిచేస్తాయి. మనస్సంటే ఒక భాగం జ్ఞాపకాలు, మరో భాగం ఊహలతో నిండి ఉంటుంది. నిజానికి ఈ రెండు ఊహలే. మనిషి ఇలా ఊహల్లో మునిగిపోవడం వల్లనే భయం కలుగుతుంది. ఈ భయమే మన చుట్టూ హద్దులను గీస్తుంది. ఆ హద్దుల వల్ల మనకి మనం సురక్షితంగా ఉండొచ్చునేమో కానీ, అది జీవించడాన్నుంచి, జీవితం నుంచి కూడా దూరం చేస్తుంది. భయం వల్ల మనిషి తనకు తానే పరిమితులు నిర్దేశించుకుని తన ప్రపంచంలో తాను మునిగి తేలుతాడు. ఈ క్రమంలో అటు ఆనందానికి, ఇటు స్వేచ్ఛకు దూరమైపోతాడు. అంతేకాదు హాయిగా నవ్వలేడు.. హృదయంతో ఏడ్వలేడు... అసలు మనస్ఫూర్తిగా, ఇష్టంగా ఏ పనీ చేయలేడు. ఏ మనిషైనా భయపడేది భవిష్యత్ గురించే.. తాను చేస్తున్న పనిలో విజయం సాధించగలనా... తన కుటుంబానికి ఆస్తిపాస్తులివ్వగలనా.. తన పిల్లలు చక్కగా చదువుకోగలరా.. తనకు భవిష్యత్‌లో ఆరోగ్యం సహకరిస్తుందా.. ఇలా రకరకాలుగా, వాస్తవంలో లేని వాటి గురించి బాధపడుతూ భయాన్ని పెంచుకుంటూ ఉంటారు. భయం జీవితం నుంచి పుట్టింది కాదు. భ్రాంతులతో నిండిపోయిన మనస్సు నుంచి పుట్టింది. అస్తిత్వంలో లేని దాని గురించి బాధ పడడం వల్లనే భయం ఆవరిస్తుంది. నిత్యం భవిష్యత్‌లో బతకడం వల్లనే భయం కలుగుతోంది. ఈ భయం నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే ఎవరికి వారు సాధన చేయాలి.. ఆత్మ విమర్శ చేసుకోవాలి.. తామెందుకు భయపడుతున్నామని ప్రశ్నించుకోవాలి.. నిజానికి తాము భయపడాల్సిన అవసరం ఉందా అని ఆలోచించుకోవాలి. భయం కల్గించే భవిష్యత్ గురించి ఆలోచించడం మాని వాస్తవంలోకి రావాలి. లేని వాటి గురించి ఊహించుకోకుండా, భ్రమలు తొలగించుకుని ప్రస్తుత పరిస్థితులకనుగుణంగా జీవితాన్ని అదుపు చేసుకుంటే భయానికి తావే ఉండదు. ఒక్కసారి భ్రమలన్నీ తొలగిపోతే ఇక భయానికి ఆస్కారమే ఉండదు. భయపడాల్సిన అవసరమే రాదు. అందువల్ల ఊహల్లో మునిగి పోవడమే భయానికి మూలం. ఊహల నుంచి వాస్తవంలోకి వస్తే భయం సమస్యే ఉండదన్న వాస్తవాన్ని తెలుసుకోవాలి. అసలు భయం అంటే ఏమిటి? మనం ఎందుకు భయపడతాం? భయం ఎన్ని రకాలు? భయం లేని మనుషులు వుంటారా? అసలు భయం ఎప్పుడు ఎలా పుట్టింది? ఈ ప్రశ్నలన్నిటినీ నిర్భయంగా చర్చించుకుంటే తప్ప భయం నుంచి విముక్తులు కాలేం. ఈ క్రమంలో కారణాలు తెలిసిన భయాలు కొన్ని.. కారణాలు తెలియని భయాలు కొన్ని. తెలిసిన భయాలకు అర్థవంతమైన వివరణ ఇస్తే పరిష్కారం చూపిస్తే పోతుంది. కాని తెలియని భయాలు అలా కాదు. అవి ఫలానా కారణం వల్ల కలిగాయని ఎవ్వరూ చెప్పరు. అందువల్ల మన భయాలకు మూల కారణాలు తెలుసుకుని, భయాన్ని పోగొట్టుకోవాలి. తన చేతుల్లో లేని ప్రకృతికి దైవత్వం ఆపాదించిన ప్రాచీన మానవుడు దానిపట్ల భయమూ భక్తి పెంచుకున్నాడు. భక్తి పెంచుకోక పోతే నష్టం కలుగుతుందని భయపడ్డాడు. ఫలితంగా మూఢ నమ్మకాలకు లోనయ్యాడు. మూఢత్వం భయానికి మొదటి హేతువు. మూఢనమ్మకాల వల్ల కలిగే భయాలు ఎవరినీ వదలి పెట్టవు. పైగా తమ సంపద పోతుందేమోనన్న భయంతో పోకుండా కాపాడుకోవాలన్నది అదనపు భయంగా తయారవుతుంది. మనుషుల మీద నమ్మకాలు సడలిపోవడం వల్ల ఎవరినీ నమ్మలేని విశ్వాస రాహిత్యం వెన్నాడుతుంది. అలాగే, మంచివారు చెడు చేయరు గనక దుర్మరణం పాలైన వారే ప్రేతాలై హింసిస్తారన్న నమ్మకం ఈ భయం వల్లనే ఏర్పడుతుంది. ఇలా మూఢత్వం అనేక భయాలకు దారి తీసింది. ఇలా అనాదిగా తన పరిధిని పెంచుకున్న భయం నేడు విశ్వ వ్యాప్తమై మనిషిని నిర్జీవంగా తయారు చేస్తోంది. భయానికి సంబంధించి మన పురాణాలలో అనేక ఘట్టాలు ఉదాహరణలుగా కనిపిస్తాయి. పురాణాలలో ఆయా కథలలోని భయాలకు ఓ సముచితమైన కారణం, దిశానిర్దేశం ఉండడం వల్లనే వారంతా మహనీయులయ్యారు. అదే విధంగా మనిషి కూడా తాను నిత్యం వేధించే భయాలతో కృంగి కృశించి పోకుండా, తమ భయాలకు అసలు సిసలైన కారణాలు తెలుసుకుని, వాటి పరిష్కారాలకు ప్రయత్నించినపుడే భయం అనే మహమ్మారి నుంచి విముక్తులవుతారు. భయం కల్గించే భవిష్యత్ గురించి ఆలోచించడం మాని వాస్తవంలోకి రావాలి. లేని వాటి గురించి ఊహించుకోకుండా, భ్రమలు తొలగించుకుని ప్రస్తుత పరిస్థితులకనుగుణంగా జీవితాన్ని అదుపు చేసుకుంటే భయానికి తావే ఉండదు. ఒక్కసారి భ్రమలన్నీ తొలగిపోతే ఇక భయానికి ఆస్కారమే ఉండదు. భయపడాల్సిన అవసరమే రాదు. అందువల్ల ఊహల్లో మునిగిపోవడమే భయానికి మూలం. ఊహల నుంచి వాస్తవంలోకి వస్తే భయం సమస్యే ఉండదన్న వాస్తవాన్ని తెలుసుకోవాలి. -
విద్యార్థినుల హాస్టల్.. నీడలాగ ఒక ముఖం.. వింత శబ్దాలు..
సాక్షి, నాగిరెడ్డిపేట(నిజామాబాద్): కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల కేంద్రం గోపాల్పేట ఆదర్శ కళాశాల హాస్టల్ విద్యార్థినులు దయ్యం భయంతో వసతి గృహాన్ని ఖాళీ చేశారు. మంగళవారం రాత్రి స్టడీ అవర్స్‌లో భాగంగా చదువుకుంటున్న విద్యార్థినులకు గదిలో నీడలాగ ఒక ముఖం కనిపించిందని, వెనుకనుంచి తోసేసినట్టుగా అనిపించిందని, వింత శబ్దాలు వినిపించాయని చెప్పారు. దీంతో బెదిరిపోయిన విద్యార్థినులు బుధవారం ఉదయమే సొంత ఊర్లకు వెళ్లిపోయారు. కాగా, విద్యార్థినులు హోమ్‌సిక్ తోనే వెళ్లిపోయారని, తిరిగి రాగానే వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తామని మోడల్‌స్కూల్ ప్రిన్సిపల్ శ్రీలత పేర్కొన్నారు. -
Cynophobia: మీకు కుక్కలంటే చచ్చేంత భయమా? ఐతే మీ కోసమే..
పెళ్లిళ్లు, ఇల్లు, వాన.. చివరికి అందమైన స్రీలను చూసినా భయపడేవారు ఉన్నారీ ప్రపంచంలో. మనం నవ్వుకుంటాము కానీ దాన్ని అనుభవించేవాళ్లకి నరకం కనిపిస్తుంది. అటువంటి భయాల్లో సైనోఫోభియా ఒకటి. అంటే కుక్కలను చూస్తే చాలు ఆ చుట్టుపక్కల కనిపించరన్నమాట. కారణాలు అనేకం ఉండోచ్చు. అంటే చిన్నతనంలో కుక్క వెంటబడటంవల్ల కలిగినదికావొచ్చు. లేదా ఎవరినైనా రక్తం వచ్చేలా కరవడం చూసి భయపడటం కావచ్చు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో కుక్కల పట్ల భయం వీరిలో పేరుకుపోతుంది. ఐతే ఈ ఫోభియా నుంచి బయటపడే మార్గాలు న్యూయార్క్‌లోని నార్త్‌వెల్ హెల్త్ సౌత్ ఓక్స్ హాస్పిటల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లారీ విటగ్లియానో మాటల్లో మీకోసం.. అనేక ఇతర రుగ్మతల మాదిరిగానే ఇది కూడా ఒక ఫోబియానే. కుక్కల పట్ల భయం చాలా చిన్నవయసులోనే ప్రారంభమవుతుంది. ఈ ఫోబియా ఉన్నవారి చుట్టు పక్కల కుక్కలు కనిపిస్తే వారి గుండె వేగం పెరుగుతుంది. వణుకు, వికారం, చెమట్లు పట్టడం ఒక్కోసారి భయంతో కళ్లు తిరిగి పడిపోతారు కూడా. చికిత్స ఈ రుగ్మతతో బాధపడే వారికి కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (సీబీటీ)తో చికిత్స చేయవచ్చు. ప్రారంభంలో కుక్క ఇమేజ్ చూపించడం ద్వారా ఆ తర్వాత బొమ్మ కుక్క, ఆపైన నిజం కుక్కను చూపడం ద్వారా ఈ భయాన్ని దూరం చేయవచ్చు. భయాన్ని ఈ విధంగా అధిగమించవచ్చు కుక్కలను చూసి భయపడటం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో.. వీలైనంత త్వరగా వాటితో చనువుపెంచుకోవడానికి ప్రయత్నించాలి. లేదంటే దీర్ఘకాలిక ముద్ర మీ మనసుపై పడే అవకాశం ఉంది. గుడ్ బియేవియర్ కలిగిన కుక్కతో కొంత సమయం గడపగలగాలి. అంతేకాకుండా కుక్కల గురించిన వివిధ అధ్యనాలు చదవాలి. తద్వారా అవి కరిచే ప్రమాదం ఎంత అరుదుగా ఉంటుందో తెలుసుకోండి. థెరపిస్టులను కలిసి మీ ఫోబియాను అధిగమించే మార్గాలను తెలుసుకొని వాటిని ఆచరించడం ద్వారాసైనోఫోభియాను అధిగమించవచ్చని బిహేవియరల్ సైకోథెరపి నిపుణులు డాక్టర్ విటగ్లియానో సూచించారు. చదవండి: Stonehenge: ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే!! -
విషాదం: కరోనా వ్యాక్సిన్‌కు భయపడి యువకుడు..
సాక్షి, హైదరాబాద్: మహమ్మారి కరోనా వైరస్ నుంచి రక్షణ పొందేందుకు వేస్తున్న టీకాపై ఇంకా ప్రజల్లో భయాలు తొలగడం లేదు. తాజాగా ఓ యువకుడు వ్యాక్సిన్ భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యాక్సిన్ వేసుకోవాలని కుటుంబసభ్యులు ఒత్తిడి చేయడంతో ఆ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మణికొండ ప్రాంతంలో జరిగింది. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. మణికొండ ప్రాంతంలో కుటుంబీకులతో కలిసి శివప్రకాశ్ (21) నివసిస్తున్నాడు. కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని కొద్దిరోజులుగా శివప్రకాశ్కు కుటుంబసభ్యులు చెబుతున్నారు. అయితే వ్యాక్సిన్ తీసుకోవడానికి శివప్రకాశ్ జంకుతున్నాడు. ఈ క్రమంలోనే కుటుంబీకులు కొద్దిగా ఒత్తిడి చేశారు. వ్యాక్సిన్ తీసుకోవడం ఇష్టంలేని శివ ప్రకాశ్ జూన్ 12వ తేదీన విషం సేవించి బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు పోలీసులు అప్పగించారు. -
భయాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి
భయం ప్రాణికి సహజం. మనిషి లో కలిగే ఓ భావోద్వేగమే భయం. భయానికి హేతువు అవగాహనా లేమి. మనల్ని బాధ పెట్టే సమస్య కన్నా దాన్ని గురించి మనం చేసే అర్థరహితమైన ఆలోచన, గోరంతలు కొండంతలుగా చేసే మన దృష్టి మనల్ని మరింతగా భయపెడుతుంది. మన అవగాహన రాహిత్యానికి ఊహాశక్తిని జోడించి ఆ సమస్య మనల్ని భయ విహ్వలలుగా చేసేటంతగా ఓ విశ్వమంత ఆకారాన్నిస్తాం. ఆది శాసించిన విధంగా నడుచుకుంటాం. ఆలోచన, విచక్షణ , వివేచన శక్తులను పోగొట్టుకుంటాం. అన్నిటికి మించి, తార్కికశక్తికి దూరమవుతాం. అహేతుకంగా ప్రవర్తిస్తాం. చదువుల సారాన్ని విస్మరించి కోపాన్ని పెంచుకుంటాం. అతిగా ఆలోచించి, ఆందోళన చెందుతూ ఇతరులకు ఆందోళన కలిగిస్తాం. అపుడే సమాజం మనలను అస్థిరులుగా, ఆస్థిమితులుగా భావిస్తుంది. కుటుంబ సభ్యులకు, మిత్రులకు, తోటివారికి దూరమై ఒంటరవుతాం. శారీరక, మానసిక ఆరోగ్యం క్షీణిస్తుంది. మన క్తియుక్తులన్నీ బూడిద పాలవుతాయి. ఇంతటి దారుణమైన పరిస్థితికి కారణం మనల్ని బాధ పెట్టే విషయాన్ని గూర్చి పూర్తిగా, లోతుగా, సహేతుకంగా తెలుసుకోవటానికి ప్రయత్నించక పోవటమే. అలా చేయనంత వరకు భయం, ఆందోళన, వ్యాకులత అనే సునామి సుడిగుండం లోనే తిరుగుతూ, తిరుగుతూ జీవితాన్నే కోల్పోతాం. మరి తరుణోపాయం..? సాధారణంగా చెప్పాలంటే... ముందు మనం నిర్భయులం కావాలి. అంటే భయం లేనివారని కాదు. భయపెట్టే విషయాన్ని గూర్చి క్షుణ్ణంగా తెలుసుకోవడం. నదిలోతు లోతు తెలిసినట్టు, ఆందోళన లేదా బాధ పెట్టే విషయాన్ని పూర్తిగా తెలుసుకున్న వారికే, దానినెదుర్కొనే మానసిక సంసిద్ధత వస్తుంది. ఈ స్థితే నిర్భయత్వం. అది ఉన్నవాళ్లే నిర్భయులంటే. అప్పుడే మనలోని భయంతో పోరాడగలం. ఈ పోరాట పటిమనే పెద్దలు మనలో కావాలన్నది. ఆ శక్తిని మనలో పెంపొందించు కోవాలన్నది. అపుడే ఏ భయమూ మనల్ని భయపెట్టదు. ‘దేని గురించీ భయపడ నక్కర్లేదు. ఆందోళన కలిగించే సమస్యను అర్థం చేసుకోవాలి. బాగా అర్ధం చేసుకోగలిగినప్పుడే తక్కువగా భయపడతాం’ అంది మేరీ క్యూరీ. ఈ కరోనా కష్టకాలంలో మనకు కావాల్సింది అవగాహన, స్పష్టత. ఏ వాహికాశ్రయంగా అది మనలోకి ప్రవేశిస్తుందో ఇతమిత్థంగా తెలియదు కనుక అప్రమత్తంగా ఉండాలి. నిపుణుల, వైద్యుల సలహాలు, సూచనలు తు.చ.తప్పక పాటించాలి. నిర్లక్ష్యం కూడదు. తెంపరితనానికి తావే లేదు. భయం ఆరోగ్యకరమైనది. అనారోగ్యకరమైనది కూడ. మొదటిది మనల్ని మన అంతరాత్మకు బద్ధుల్ని చేస్తుంది. చెడు వైపు ప్రోత్సహించదు. హెచ్చరిస్తూ, హితవు చెపుతుంది. అప్రమత్తుల్ని చేసి మంచిమార్గంలో పయనింపచేస్తుంది. ఇక రెండవది. మనల్ని నాశనం చేసేది. నిర్వీర్యులుగా చేసేది. ఇది మన అతి ఆలోచన, ఊహ నుండి పుడుతుంది. మన శక్తిని హరిస్తుంది. చైతన్యరహితులుగా చేస్తుంది. ఏదేని సంక్షోభం ఎదురైనవేళ దానితో ప్రతిఘటించే స్థైర్యాన్ని ఇవ్వదు. దానిని చూసి అతిగా భీతిల్లేటట్లు చేస్తుంది. సమస్యలో కుంగి పోయేటట్లు చేస్తుంది. ప్రపంచంలో ఏదీ భయంలా భయపెట్టదు. ఈ రకమైన భయం మన శారీరక, మానసిక శక్తుల్ని మాయం చేస్తుంది. ఈ భయాన్ని మననుండి పారద్రోలాలి. ఈ రకమైన భయాన్ని మనమెలా స్వాధీనం పరచుకుని దాటగలుగుతామన్న దానిమీద మన జీవిత వికాసం ఉంటుంది. ఆదిమానవుణ్ణి కూడ భయం వెంటాడింది. ప్రకృతి సహజపరిణామాలు, రుతు మార్పులు, వాతావరణ మార్పులు అతణ్ణి వణికింపచేసి, అవి అతీంద్రియ శక్తులన్న భావనను కలుగచేసాయి. సూర్య చంద్రులు, పగళ్ళు, రాత్రుల మార్పులు, గొప్ప శక్తులుగా భావించి దేవుళ్ళ గా ఆరాధించడం ప్రారంభించాడు. ఉరుములు, మెరుపులను దేవతల ఆగ్రహంగా అనుకున్నాడు. అవి ఎలా సంభవిస్తున్నాయో తెలుసుకోగల జ్ఞానం అతనికి లేదు. తన చుట్టూ ఉన్న ప్రకృతి నుండి, జంతువుల నుండి జీవనకళను నేర్చుకుంటూ భాషను తయారు చేసుకుని, భావనా సంపత్తిని పెంచుకుంటూ అభివృద్ధి చెంది నాగరికత నేర్చుకుని విజ్ఞానపరుడయ్యడు. ఆది మానవుడ్ని భయపెట్టిన పరిణామాలకు కారణం తెలుసుకున్నాడు. అజ్ఞానమనే అంధకారం నుండి వెలుగు అనే జ్ఞానం వైపు నడిచాడు. ఒకరికున్న ధైర్యనిష్పత్తిలోనే వారి జీవితం విస్తరించడం, కుంచించుకొని పోవడం జరుగుతుంది. అంటే వ్యక్తి ధైర్యవంతుడైతేనే అతని ప్రజ్ఞా విశేషాలు వికసించడం, ఆ వ్యక్తి పురోగతి సాధించడం. ఆ ధైర్యలక్షణం కొరవడిన వారిలో వారి ప్రజ్ఞ వికసించని మొగ్గలా ఉంటుంది. యుగాల మానవ జీవితాన్ని తడిమిచూస్తే ఎన్నో యుగాలు భయాంధకారంలోనే తచ్చాడాయి. ఈ భయం వల్ల ఆలోచనారహితులై ప్రజ బానిసత్వంలోనే మగ్గింది. ధైర్యలేమి వల్ల ప్రశ్నించే ఎరుకనే కోల్పోయింది. ఆ ఎరుక కలిగి, వారిలో స్వేచ్ఛా ఊపిరులూది, స్వాతంత్య్ర కాంక్షను రగిలించగలిగే ఆత్మస్థైర్యం గల నాయకులు అవసరమయ్యారు. వారి జీవితాలలో వెలుగు నింపారు. చరిత్రను పరిశీలిస్తే ఎన్ని హృదయ విదారక దృశ్యాలు! భూకంపాలు, వరదలు, తుఫానులు డొక్కల కరువు, అణుబాంబు విస్పోటనాలు, జాత్యహంకార యుద్ధ కాండలు, మనుషుల ఊచకోతలు, నియంతల అమానుషత్వం, దమన కాండలు, మోగిన మరణ మృదంగాలు, మృత్యుహేల.... ఉదహరిస్తే ఈ కొన్నే. ఇంకా ఎన్నెన్నో చూసి తట్టుకుని నిబ్బరించుకున్న గుండె ఈ మానవాళిది. అది మనిషి ధీ శక్తి. అందుకే కదా షేక్స్పియర్ మనిషి ధీశక్తిని శ్లాఘిస్తూ అది అనంతమైనదన్నాడు అటువంటి మనిషికి కరోనా గడ్డుకాలాన్ని అప్రమత్తులై, వివేచనతో దాటడం అసాధ్యమా! వాస్తవాన్నే చూద్దాం. కరోనా మృత్యుకౌగిలి నుండి రక్షించుకుందాం భయాన్ని జయించి. – బొడ్డపాటి చంద్రశేఖర్ -
మాకు పిల్లలు కావాలి.. వ్యాక్సిన్ వద్దంటున్న అమెరికన్లు
వాషింగ్టన్: బైడెన్ ప్రభుత్వం తమ దేశప్రజలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేసి కోవిడ్ నుంచి ఉపశమనం పొందాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కానీ ఇటీవల టీకాకు సంబంధించిన ఓ వార్త కారణంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ మందగించేలా కన్పిస్తోంది. ఎందుకంటే అక్కడి 18 నుంచి 49 ఏళ్ల మధ్య ఉన్న అమెరికన్లలో ఇంకా సగం మంది టీకా తీసుకోలేదు. ఇటీవల సోషల్ మీడియాలో ఈ అంశంపై పలు రకాలుగా వార్తలు వ్యాప్తి చెందుతున్నాయి. టీకా ప్రభావం కారణంగా రానున్న రోజుల్లో సంతానప్రాప్తిని కోల్పోయే అవకాశం ఉందంటూ సోషల్ మీడియాలో పుకార్లు హల్ చల్ చేస్తున్నాయి. దీంతో అమెరికన్లు టీకా వేయించుకునేందుకు వెనుకాడుతున్నారు. ఇలాంటి ఫేక్ పోస్టులతో ప్రస్తుతం అమెరికా ప్రజలు సతమతమవుతున్నారు. దీంతో బిడైన్ ప్రభుత్వ లక్ష్యానికి ఇదో సమస్యగా మారింది. మాకు టీకా వద్దు బాబోయ్ టీకా వల్ల ప్రత్యుత్పత్తి వ్యవస్థ దెబ్బతింటుంది కాబట్టి.. మహిళలు టీకాలు తీసుకోవడం లేదని ఓ అమెరికా అధ్యయనం తేల్చింది. ఫెర్టిలిటీ వ్యవస్థపై వ్యాక్సిన్ నెగటివ్ ప్రభావం చూపిస్తుందని ప్రజలు భావిస్తున్నారు. అందుకే వ్యాక్సిన్ తీసుకోని వారు ఇదే ఉద్దేశాన్ని వ్యక్తం చేస్తున్నట్లు కైసర్ ఫామిలీ ఫౌండేషన్ డైరక్టర్ అష్లే కిర్జింగర్ తెలిపారు. ఈ నెల ప్రారంభంలో జరిపిన పరిశోధనలో మూడింట రెండు వంతుల మంది టీకాను వేసుకోలేమని కారణంగా, వారి సంతానోత్పత్తిపై ప్రభావం పడుతుందేమో అని ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో 18 నుంచి 49 సంవత్సరాల వయసు గల స్త్రీలలో 50 శాతం, పురుషులలో 47 శాతం మంది ఇలాంటి భయాలు మొదలయ్యాయి. కారణంగా ఇంతవరకు వారెవరూ టీకాలు వేయించుకోవడానికి ముందుకు రావడంలేదు. ఈ క్రమంలో కోవిడ్ వ్యాక్సిన్ ట్రయల్స్ నుంచి మొదట్లో గర్భిణీ స్త్రీలను మినహాయించడం కూడా ఈ వార్తలకు బలాన్ని చేకూర్చాయనే చెప్పాలి. కొందరి వాదనేమో ఇలా ఉంది.. వ్యాక్సిన్లు ప్రత్యుత్పత్తి వ్యవస్థను టార్గెట్ చేస్తాయంటే.. అది కొంత ఆడవారికి ఆందోళన కలిగించే అంశమే అని అంటున్నారు. అయితే వ్యాక్సిన్లు తీసుకుంటే వంధ్యత్వం వస్తుందన్న ఆధారాలు ఏమీ లేవని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ( చదవండి: వ్యాక్సినేషన్ పూర్తయితే మాస్కు అక్కర్లేదు ) -
కరోనా కాలం: పల్లెకు దూరమై.. చేనుకు చేరువై!
పలమనేరు: కోవిడ్ దెబ్బకు నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలు ఖాళీ అయ్యాయి. పలువురు రైతులు ఇళ్లను వదలి పొలంబాట పడుతున్నారు. ఇన్నాళ్లూ పట్టణాలకే పరిమితమైన వైరస్ ఇప్పుడు పల్లెల్లో విజృంభిస్తోంది. శుక్రవారం నియోజకవర్గ వ్యాప్తంగా 260 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. రోజురోజుకూ కేసులు పెరుగుతుండడంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. ఊర్లు వదలి ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నారు. వ్యవసాయమే జీవనాధారం నియోజకవర్గంలో 90 పంచాయతీలున్నాయి. సుమారు 70 శాతం మందికి వ్యవసాయమే జీవనాధారం. రైతుల్లో చాలామందికి పొలాల వద్ద మోటారు షెడ్లు, పశువుల షెడ్లు, గుడిసెలు, కొందరికి పక్కా ఇళ్లు కూడా ఉన్నాయి. నిత్యం గ్రామాల్లోకి రావడం, జనంతో మాట్లాడడంతో కోవిడ్ వస్తుందనే భయం వారిని వెంటాడుతోంది. దీనికితోడు గ్రామాల్లోనూ ఎక్కువగా మరణాలు సంభవిస్తుండడంతో ఒకింత భయాందోళనకు లోనవుతున్నారు. ఈ నేపథ్యంలో నెలకు సరిపడా నిత్యావసరాలు తీసుకొని కుటుంబ సమేతంగా పొలాల వద్ద తలదాచుకుంటున్నారు. రెండు రకాలుగా లాభం ఇంటిల్లిపాది పొలం వద్ద ఉండడంతో పొలం పనులు చక్కగా సాగుతున్నాయి. పగటిపూట వ్యవసాయపనులు, పశువులను సంరక్షిచండం చేస్తున్నారు. పాతకాలం నాటి పద్ధతులతో అరటి ఆకుల్లో రాగి ముద్ద, చారు వేసుకుని భోజనాలు చేస్తున్నారు. రాత్రి వేళల్లో అక్కడున్న సౌకర్యాలతోనే సర్దుకుపోతున్నారు. కొందరు పాకల్లో నిద్రిస్తుండగా.. మరికొందరు మోటారు షెడ్లలో సేదతీరుతున్నారు. రెండు,మూడు వారాలుగా గ్రామాల మొఖం చూడడం లేదు. ఖాళీగా కనిపిస్తున్న పల్లెలు రైతులు వారి పొలాల వద్దనే తాత్కాలికంగా కాపురాలు ఉండడంతో పల్లెలు బోసిపోయి కనిపిస్తున్నాయి. గ్రామంలో ఎవరిని అడిగినా వారు పొలం వద్దే ఉంటున్నారనే సమాధానం వస్తోంది. పొలాల వద్ద సైతం సామాజిక దూరాన్ని పాటించేలా ఒకరిపొలం నుంచి మరొకరి పొలం వద్దకు వెళ్లడం లేదు. ఏదేమైనా కోవిడ్ పల్లె జనానికి కొత్త పాఠాలు నేర్పుతూ పాతతరానికి తీసుకెళ్లిందని స్థానికులు చెబుతున్నారు. చదవండి: ‘వేవ్’లో కొట్టుకుపోతున్న ఉపాధి పేదల ఆరోగ్యం కోసం ఖర్చుకు వెనుకాడం -
దీదీకి ఓటమి భయం: నడ్డా
మెక్లీగంజ్/కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో బీజేపీ అనుకూల గాలి వీస్తోందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే బయటి వ్యక్తులు, లోపలి వ్యక్తులు అంటూ మతితప్పి మాట్లాడుతున్నారని చెప్పారు. బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 200కు పైగా సీట్లు గెలుచుకోవడం తథ్యమని ఉద్ఘాటించారు. తృణమూల్ కాంగ్రెస్ సర్కారు తీసుకొచ్చిన లంచాల(కట్‌మనీ) సంస్కృతికి ఈ ఎన్నికల్లో చరమగీతం పాడడం ఖాయమని స్పష్టం చేశారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ తుడిచి పెట్టుకుపోతుందని జోస్యం చెప్పారు. నడ్డా గురువారం దినహతా, అలీపూర్‌దువార్, మెక్లీగంజ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రోడ్ షోలలో పాల్గొన్నారు. బెంగాల్లో మార్పు రాబోతోందని వెల్లడించారు. కోల్‌కతాలో సినీ నటుడు, బీజేపీ నేత మిథున్ చక్రవర్తి గురువారం తలపెట్టిన రోడ్ షోకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో బీజేపీ కార్యకర్తలు బెహలా ఏరియాలోని పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించారు.