సాక్షి, విజయవాడ: కరోనా భయంతో ఓ వ్యక్తి ఇంటి నుంచి పరారైన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. నగరానికి చెందిన శ్రీనివాసరావు జర్వం కారణంగా ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్యులు పట్టించుకోకపోవడంతో ఆయన కోవిడ్ ఆసుపత్రికి వెళ్లగా, ప్రభుత్వ వైద్యులు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్ వస్తుందనే భయంతో ఈ నెల 4న శ్రీనివాసరావు ఇంటి నుంచి పరారీ అయ్యారు. తన భర్త ఆచూకీ కనిపెట్టాలని పటమట పోలీసులకు భార్య ఫిర్యాదు చేసింది. పరారైన శ్రీనివాసరావుకు నెగిటివ్ రిపోర్ట్ రావడం గమనార్హం. ఏడు రోజులుగా పోలీసులు గాలిస్తున్న ఇప్పటివరకు ఆ వ్యక్తి ఆచూకీ దొరకకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment