escape .
-
పరారీలో ‘ప్రవళిక’ కేసు నిందితుడు
మహబూబ్‌నగర్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన ప్రవళిక ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న శివరాం రాథోడ్ స్వగ్రామం నారాయణపేట జిల్లా కోస్గి మండలం పీసీతండా ఒక్కసారిగా వార్తాల్లోకి రావడంతో గిరిజనులు ఉలిక్కి పడుతున్నారు. విచారణ నిమిత్తం కొత్త కొత్త వ్యక్తులు తండాకు వస్తుండటంతో భయంతో తండావాసులు ఉదయం వెళ్లి రాత్రికి తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. నిందితుడి కుటుంబం ఆర్థికంగా బాగా ఉండి పలుకుబడి కలిగినది కావడంతో వివరాలు చెప్పడానికి జనాలు ముందుకు రావడం లేదు. నిందితుడు శివరాం తల్లిదండ్రులు కిషన్ రాథోడ్, సుశీల మహారాష్ట్రలోని ముంబయిలో కాంట్రాక్టర్లుగా అక్కడే స్థిరపడ్డారు. కిషన్ రాథోడ్‌కు ఇద్దరు కుమారులు, ఓ కూతురు కాగా పెద్ద కుమారుడు శివరాం రాథోడ్ బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ కోచింగ్ సెంటర్లో సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్నాడు. రెండో కుమారుడు మణిరాం రాథోడ్ ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్ చదువుతుండగా యుద్ధం నేపథ్యంలో హైదరాబాద్‌కు వచ్చాడు. కూతురు అనురాధ మహబూబ్‌నగర్‌లో బీటెక్ చదువుతుంది. పీసీతండాలో తాత హేమ్లానాయక్, నానమ్మ మోనెమ్మ, మాణిక్యమ్మల దగ్గరకు పిల్లలు అప్పుడప్పుడు వచ్చి పోతుండేవారు. రాజకీయంగా దుమారం.. ప్రవళిక ఆత్మహత్య సంఘటన రాష్ట్రంలో సంచలనంగా మారడంతోపాటు రాజకీయంగా పెద్ద దుమారం రేపుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసులో నిందితుడిగా శివరాం రాథోడ్‌ను నిర్ధారించడంతో అతని కుటుంబం మొత్తం అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. నిందితుడి స్వగ్రామంలోని ఇంటికి సైతం తాళం వేసి కుటుంబ సభ్యులు ముఖం చాటేశారు. ఈ విషయమై తండావాసులు ఎవరూ నోరు మెదపకపోవడంతో నిశ్శబ్దం అలుముకుంది. ఏదేమైనా రాష్ట్రవ్యాప్త సంచలన కేసుకు కోస్గి మండలం మరోమారు వేదికై ంది. ప్రవళికతో ప్రేమాయణం.. మరో యువతితో పెళ్లి ఏర్పాట్లు ఆత్మహత్య చేసుకున్న ప్రవళికతో ప్రేమాయణం నడిపిన శివరాం రాథోడ్ వికారాబాద్ జిల్లా పరిగి సమీపంలోని ఓ తండాకు చెందిన యువతితో పెళ్లి చేయాలని కుటుంబసభ్యులు నిర్ణయించడంతో 15 రోజుల క్రితం పెళ్లిచూపుల తతంగాన్ని ఇరు కుటుంబాల వారు పూర్తి చేసుకున్నారు. దసరా తర్వాత ముహూర్తాలు వస్తాయని, అప్పుడే ఎంగేజ్మెంట్ చేయాలని నిర్ణయించుకున్నారు. తాను ప్రేమించిన యువకుడు వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధం కావడంతోనే ప్రవళిక ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. -
బస్సు చోరీ చేసి.. ప్రయాణికుల్ని ఎక్కించుకుని..
రాజన్నసిరిసిల్ల జిల్లా: సిద్దిపేటలో చోరీకి గురైన ఆర్టీసీ అద్దె బస్సు రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం సారంపల్లి శివారులో ప్రత్యక్షమైంది. పోలీసులు తెలిపిన వివరాలివి. సిద్దిపేట డిపోకు చెందిన అద్దె బస్సు (టీఎస్ 36 టీఏ 3336)ను ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి చోరీ చేశాడు. అంతటితో ఆగకుండా నేరుగా సిద్దిపేట బస్టాండ్‌కు వెళ్లి ప్రయాణికులను ఎక్కించుకొని వేములవాడకు వచ్చాడు. ఇక్కడి నుంచి హైదరాబాద్ బోర్డుతో ప్రయాణికులను ఎక్కించుకుని బయల్దేరాడు. ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేసి, టికెట్ మాత్రం ఇవ్వలేదు. దీంతో అనుమానం వచ్చిన ప్రయాణికులు.. తంగళ్లపల్లి మండలం సారంపల్లి శివారులోని ఎల్లమ్మ గుడి వద్దకు చేరుకోగానే డ్రైవర్‌ను నిలదీశారు. దీంతో సదరు వ్యక్తి బస్సును అక్కడే వదిలేసి పరారయ్యాడు. వెంటనే ప్రయాణికులు డయల్ 100కు కాల్చేసి పోలీసులకు సమాచారం అందించారు. ఇక్కడి పోలీసులు సిద్దిపేట పోలీసులకు సమాచారమిచ్చారు. సీసీ పుటేజీల ఆధారంగా నిందితుడిని గంభీరావుపేటకు చెందిన రాజుగా గుర్తించారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు. -
మిరాకిల్ ఘటన: ఘోర కారు ప్రమాదం..బతికే ఛాన్సే లేదు! కానీ..
ఎన్నో రకాల కారు ప్రమాదాల గురించి విని ఉంటాం. చాలా మటుకు ఆ ప్రమాదాల్లో ప్రాణాలు పోవడమే లేదా తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటనలే కోకొల్లలు. అలాంటిది కారు ఓ గోడకు క్రాష్ అయ్యి దారుణంగా స్పిన్నయ్యి బోల్తా పడింది. ఆ ఘటన చూస్తే కారులో ఉన్న వాళ్లంతా చనిపోయి ఉంటారనిపిస్తుంది. కానీ అద్భుతంగా నలుగురు కొద్ది పాటి గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..కోజికోడ్‌లోని కరుమలలో ఒక కారు ఘోర ప్రమాదానికి గురైంది. నలుగురు వ్యక్తులతో ప్రయాణిస్తున్న ఆ కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న గోడను ఢీ కొట్టి గిరిగిర చక్కెర్లు కొడుతూ బోల్తాపడింది. కారు స్పిన్నవ్వడంతో ఓ వ్యక్తి వెనుక సీటులోంచి జారిపడి విండో ఫ్రేమ్‌ని పట్టుకుని ఉన్నాడు. ఇంతలో అటుగా వస్తున్న కొందరూ వాహనదారులు ఆ కారులో ఉన్న వారికి సాయం అందించి బయటకు తీసే యత్నం చేశారు. ఐతే అదృష్టవశాత్తు ఆ కారులోని వారందరికి ఏమి కాలేదు. ఆ ప్రయాణికుల్లో ఒక మహిళకి చేతికి గాయం కావడంతో ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోంది. ఇలాంటి ఘటనలు అత్యంత అరుదుగా సంభవిస్తాయి. అంతేగాదు మిరాకిల్ అంటే ఇదేనేమో అన్నట్లు ఉంది ఆ కారు ప్రమాదం. అందుకు సంబంధించిన వీడియో నెట్టంట తెగ చక్కెర్లు కొడుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి. #Kerala, #India Passenger slips out of rear window during spinning and flipping car crash, holding onto window frame throughout. Only minor injuries reported pic.twitter.com/EqdOLZNYsS — Cláudio (@BigDeadSoul) February 23, 2023 (చదవండి: మిస్టరీగా 11 ఏళ్ల చిన్నారి హత్య..చిక్కుముడి విప్పిన మిస్డ్ కాల్) -
వైరల్ వీడియో : అదృష్టం అంటే ఇతనిదే..!
-
వైరల్ వీడియో: చెప్పు తీసుకొని పాము పరార్
-
విచిత్రమైన దొంగ: పర్సు కొట్టేసి... సముద్రంలో ఈత కొట్టి ఎస్కేప్! కానీ...
చైన్‌స్నాచర్లు, పిక్ పాకెటర్స్ చాలా తెలివిగా దొంగతనం చేసి తప్పించుకుంటారు. ఎంతో స్కెచ్ వేస్తే గానీ ఒకపట్టాన దొరకరు. ఔనా! ఐతే ఈ దొంగ మాత్రం పర్సు కొట్చేసి ఏకంగా సముద్రంలో ఈతకొట్టి తప్పించుకోవాలనుకున్నాడు. వివరాల్లోకెళ్తే... ఫ్లోరిడాలో ఒక దొంగ ఒక హోటల్ పార్కింగ్ వద్ద ఉన్న ఒక మహిళ పర్సును కొట్టేశాడు. ఆ తర్వాత ఆ దొంగ తప్పించుకునేందుకు టంపా బేలో ఉండే బీచ్‌లోకి వెళ్లిపోతాడు. ఆ బీచ్ వద్దే ఉన్న కొంతమంది ఆ దొంగ సముద్రంలోకి వెళ్లడం చూస్తారు. ఆ దొంగ ఏకంగా సముద్రంలో ఈతకొట్టి తప్పించుకోవాలనుకున్నాడు. ఐతే సమాచారం అందుకున్న పోలీసులు ఆ దొంగను వెతకడం కోసం హెలికాప్టర్‌తో రంగంలోకి దిగారు. అధికారులు హెలికాఫ్టర్‌తో ఆ వ్యక్తి కోసం సముద్రం అంతా జల్లెడపడతారు. పాపం ఆ దొంగ పోలీసలు తనను వదలేటట్లు లేరని డిసైడ్ అయ్యి తనను వెంబిడిస్తున్న హెలికాప్టర్ని చూసి లొంగిపోతున్నట్లు చేతులు పైకెత్తుతాడు. కానీ ఆ దొంగ తప్పించుకోవాలన్న ప్రయాసతో ఏకంగా 200 అడుగుల లోతు వరకు ఈత కొట్టేశాడు. పోలీసులు సదరు దొంగను డెవేన్ డీన్‌గా గుర్తించి, పలు కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత పొడవైన పిల్లిగా గిన్నిస్ రికార్డు) -
ఆస్ట్రిచ్ పక్షిలా దుస్తులు ధరించి... జూలో హల్చల్! ఎందుకలా చేశాడంటే...
థాయిలాండ్‌లో ఒక అపరిచిత వ్యక్తి ఆస్ట్రిచ్ పక్షిలా దుస్తులు ధరించి జూలో హల్చల్ చేశాడు. చివరికి ఒక పెద్ద ఫిషింగ్ నెట్ వలకి చిక్కుతాడు. అసలు ఇదంతా ఏంటి? ఎందుకిలా సంచరించాడనే కదా! వివరాల్లోకెళ్తే...ఆ వ్యక్తి యానిమల్ ఎస్కేప్ డ్రిల్‌లో భాగంగా ఇలా చేశాడు. ఆస్ట్రిచ్ పక్షులు చాలా వైల్డ్‌గా ఉంటుంది. పైగా అది ఎప్పుడైన అనుకోని పరిస్థితుల్లో జూ నుంచి తప్పించుకుంటే జూ సిబ్బంది అప్రమత్తమై పట్టుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో చాలా తెలివిగా వ్యవహరించి దాన్ని పట్టుకోవాలి లేదంటే అది ఎవరిపైన ఐనా దాడి చేస్తే ఇక అంతే సంగతులు. ఈ నేపథ్యంలోనే జూ అధికారులు వైల్డ్ యానిమల్ మేనేజ్మెంట్ ప్లాన్ అనే డ్రిల్‌ని నిర్వహించారు. అందులో భాగంగా ఆ వ్యక్తి ఆస్ట్రిచ్ పక్షిమాదిరిగా దుస్తులు ధరించి జూలో అటు నుంచి ఇటూ పరిగెడుతుంటాడు. మిగతా ముగ్గురు జూ సిబ్బంది అప్రమత్తమై ఒక పెద్ద వలతో సదరు ఆస్ట్రిచ్ వేషధారణలో ఉన్న వ్యక్తిని పట్టుకుంటారు. పక్షులలో అతిపెద్ద పక్షి అయిన ఆస్ట్రిచ్ని పట్టుకోవాలంటే జూ పరిసరాలను సిబ్బంది తమ నియంత్రణలోనికి తెచ్చుకుని మరీ పట్టుకునేందుకు యత్నించాలి. పైగా ఆ పక్షి గంటకు 70 కి.మీ వేగంతో పరిగెత్తుతుంది. ఆ విపత్కర సమయంలో ఏ మాత్రం భయపడినా చాలు మన పని అయ్యిపోతుంది. అది సింహం వంటి పెద్ద పెద్ద జంతువులనే దాడి చేసి హతమార్చగలదు. (చదవండి: ఆ జర్నలిస్ట్ వర్క్ డెడికేషన్ని చూసి... ఫిదా అవుతున్న నెటిజన్లు) -
అక్కడ లాక్డౌన్ అంటే చాలు జనాలు జంప్! వీడియో వైరల్
చైనా: ప్రంపంచ దేశాలన్నింటిని గత రెండేళ్లుగా పట్టిపీడించిన కరోనా మహమ్మారీ ఇప్పుడిప్పుడే నెమ్మదిగా తగ్గుముఖం పట్టింది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ విమాన సర్వీసులను పలు చోట్ల పునరుద్ధరించారు కూడా. చైనాలో మాత్రం కరోనా పగ సాధిస్తున్నట్లుగా కేసులు విజృంభిస్తూనే ఉన్నాయి. కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరగడంతో చైనా అధికారులు ప్రజలను వరుస లాక్డౌన్లతో నిర్బంధించి, కఠిన ఆంక్షలు విధించారు. జీరో కోవిడ్ వ్యూహం ప్రజల్లో తీవ్ర అసహనానని రేకిత్తించింది. అది ఎంతలా మారిందంటే వారు లాక్డౌన్ అని చెబితే చాలు పరుగులు తీసి బయటకు వచ్చేసేంతగా విసిగిపోయారు. ఈ మేరకు చైనాలో ఒక ఐకియా స్టోర్‌లో కరోనాకి కేసుల ట్రేసింగ్‌లో భాగంగా స్టోర్ లాక్డౌన్ చేస్తున్నామని అనౌన్స్మెంట్ ఇలా రాగానే ఒక్కసారిగా ప్రజలు బయటకు పరుగులు తీశారు. ఆఖరికి సెక్యూరిటీ సిబ్బంది డోర్లు మూసేందుకు యత్నించినా.. బాబాయ్ ఇక మా వల్ల కాదంటూ దూకాణంలో ఉన్న వాళ్లంతా ఒక్కసారిగా గుంపులుగా తోసుకుంటూ బయటకి పరుగులు తీశారు. ఇటీవలే టిబెట్‌లోని లాసా నుంచి షాంఘై వచ్చిన ఆరేళ్ల బాలుడి కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఈ స్టోర్‌ని మూసేయాలని అధికారులు నిర్ణయించారు. ఆ బాలుడికి కరోనా రావడానికి ముందు ఆ ఐకియా దుకాణంలోని సుమారు 400 మందితో టచ్‌లో ఉన్నట్లు అధికారులకు తెలిసింది. దీంతో ఐకియా స్టోర్‌ని లాక్డౌన్ చేయాని అధికారులు నిర్ణయించి ప్రజలకు అనౌన్సమెంట్ ఇచ్చారు. అంతే ఒక్కసారిగా ప్రజల్లోంచి అసహనం కట్టలు తెంచుకుని బయటకు వచ్చేసింది. అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డులు, అధికారులు వారిని బయటకు రాకుండా నియంత్రించ లేకపోయారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. Yesterday, an abnormal health code case was presented at an IKEA in Shanghai, & the entire mall was suddenly blocked🥶 Some ppl forced their way out for fear of being sent to concentration camps, but there is actually nowhere to escape under #AmazingChina’s digital surveillance pic.twitter.com/MWpbTOJ3kz — Donna Wong💛🖤 (@DonnaWongHK) August 14, 2022 (చదవండి: చైనా కక్ష పూరిత చర్య! తైవాన్ అధికారుల పై ఆంక్షల మోత) -
ప్రమాదం నుంచి బయటపడిన నేచురల్ స్టార్ నాని!
Natural Star Nani Escaped From Accident In Dasara Movie Shooting: తనదైన నటనా శైలితో ప్రేక్షకులు అతి దగ్గరయ్యాడు నేచురల్ స్టార్ నాని. ఓ పక్కింటి కుర్రాడిగా తెలుగు ప్రేక్షకుల్లో చెరగలేని ముద్ర వేసుకున్నాడు. ఇటీవల అంటే సుందరానికీ సినిమాతో ఆడియెన్స్‌ను పలకరించిన నాని వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'దసరా'. ఈ మధ్య కొంత విరామం తీసుకున్న నాని మళ్లీ దసరా షూటింగ్లో పాల్లొన్నాడు. అయితే తాజాగా ఈ సినిమా చిత్రీకరణలో స్వల్ప అపశృతి చోటుచేసుకున్నట్లు సమాచారం. దసరా సినిమా కథ బొగ్గు గనుల చుట్టూ తిరుగుతుందని పోస్టర్లు, టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమా చిత్రీకరణ గోదావరి ఖనిలో జరుగుతున్న విషయం తెలిసిందే. సినిమా షూటింగ్లో భాగంగా బొగ్గు ట్రక్కు కింద నాని ఉండగా సీన్ చిత్రీకరిస్తున్న సమయంలో బొగ్గంతా అతడిపై పడినట్లు తెలుస్తోంది. అయితే అదృష్టవశాత్తు నానికి ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. దీంతో చిత్రీకరణకు కొద్దిసేపు అంతరాయం కలిగింది. నాని తిరిగి కోలుకున్నాక చిత్రీకరణ మళ్లీ పునఃప్రారంభమైంది. కాగా కీర్తి సురేశ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా కోసం నాని సుమారు 7 కేజీల బరువు తగ్గినట్లు టాక్ వినిపిస్తోంది. -
రాజపక్స ఉపయోగించిన రహస్య బంకర్ ఇదే కావొచ్చు!
శ్రీలంక రాజధాని కొలంబోలో నిరసనకారులు అధ్యక్షుడు గోటబయ రాజపక్స అధికార నివాసాన్ని చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. పైగా రాజపక్స రాజీనామా చేయాలంటూ ఆందోళనకారులు ఆయన నివాసంలోకి చొరబడి ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో ఆయన నివాసంలో ఒక రహస్య బంకర్ బయటపడింది. ఈ రహస్య బంకర్‌ని ఉపయోగించే రాజపక్స పరారైనట్లు తెలుస్తోంది. ఇది భూగర్భ సోరంగంలా ఉంటుంది. లిఫ్ట్ ద్వారా మాత్రమే ఈ రహస్య బంకర్లోకి ప్రవేశించి తప్పించుకోగలరు. ఐతే శనివారం వేలాదిమంది నిరసనకారులు రాజపక్స నివాసంలోకి చొరబడి విలాసాలను ఆస్వాదిస్తూ...ఆయన వంటగదిలోకి ప్రవేశించి.. ఆహారాన్ని తింటూ కొందరూ, మరికొందరూ స్విమ్మింగ్ పూల్,జిమ్‌లలోకి ప్రవేశించి ఎంజాయ్ చేయడం వంటి పనులు చేశారు. ఈ మేరకు నిరసనకారులు ముట్టడించి హింసాత్మక నిరసనలు తెగబడటం, రాజీనామా చేయాలంటూ పెరిగిన డిమాండ్ల నడుమ రాజపక్స పారిపోవాల్సి వచ్చింది. ఐతే ఇంతవరకు గోటబయ రాజపక్స ఆచూకి తెలియరాలేదు. కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థను పునర్జీవింప చేయడానికి... తన దౌత్యం, రాజీకీయ చతురత, అనుభవంతో ఈ దుస్థితి నుంచి బయటపడేయగలడన్న ఆశతో గత నెలలో రణిల్ విక్రమ సింఘేను ప్రధానిగా నియమించాడు రాజపక్స. అయినప్పటికీ శ్రీలంకలో కనీస నిత్వావసర వస్తువుల ధరలు ఆకాశాన్నట్టడంతో.. ప్రజలు కొనుగోలు చేయలని దారుణ స్థితిలో ఉన్నారు. ఇంకోవైపు ఇంధన కొరతతోపాటు, విదేశీ మారక నిల్వలు తగ్గిపోవడం తదితర కారణాలతో కనీస ఆహారోత్పత్తులను సైతం దిగుమతి చేసుకోలేని దుస్థితిలో ఉంది శ్రీలంక. దీంతో ప్రజల్లో సహనం సన్నగిల్లిపోయి నిరసన జ్వాల కట్టలు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలోనే ఆందోళనకారులు "గోట గో హోం" అంటూ నినాదాలతో రాజపక్స కార్యాలయాన్ని, అధికార నివాసాన్ని ముట్టడించారు. దీంతో లంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స రహస్య బంకర్‌ను ఉపయోగించి పరారైనట్లు సమాచారం. (చదవండి: శ్రీలంక సంక్షోభం గురించి కీలక వ్యాఖ్యలు చేసిన అమెరికా!) అధ్యక్షుడి భవనంలో కరెన్సీ కట్టల గుట్టలు.. ఆశ్చర్యంలో లంకేయులు -
రోజూ చిల్లరకొట్టుకు వస్తూ.. నిర్వాహకుడి కూతురిని ట్రాప్ చేసి..
సాక్షి, అనంతపురం క్రైం: రోజూ చిల్లరకొట్టుకు వస్తూ సిగరెట్లు, తదితర వాటిని కొనుగోలు చేస్తూ ఓ కొట్టు నిర్వాహకుడి కూతురిని ట్రాప్ చేశాడు ఓ నయవంచకుడు. కొన్ని నెలలుగా బాలికకు మాయమాటలు చెప్పి.. చివరకు ఈ నెల 2న బాలికను తీసుకుని ఉడాయించాడు. అనంతపురం రూరల్ పోలీసులు బాలిక అదృశ్యం కింద కేసు నమోదు చేశారు. రూరల్ ఎస్ఐ కేవీ రమణ వివరాల మేరకు... వన్‌టౌన్ పరిధిలో ఉండే ఓ వ్యక్తి చిల్లరకొట్టు నిర్వహించేవాడు. ఇతనికి ఇద్దరు కుమార్తెలు. నవోదయ కాలనీకి చెందిన సాకే శేషు (వాచ్మెన్) చిన్న కుమారుడు సాకే వినేష్ చిల్లర కొట్టుకు వెళ్లేవాడు. ఇదే క్రమంలో కొట్టు నిర్వాహకుడి చిన్న కూతురితో పరిచయం పెంచుకున్నాడు. ఆ బాలికకు సెల్‌ఫోన్ లేకున్నా.. అప్పుడప్పుడూ తన తండ్రి సెల్‌ఫోన్‌తోనే వినేష్‌తో చాట్ చేసేది. సెల్ఫోన్లతో లక్ష్మీ అనే పేరుతోనే నంబర్ ఉండటంతో బాలిక తండ్రి కూడా పెద్దగా పట్టించుకోలేదు. చదవండి: (యువతితో ఐదేళ్లుగా ప్రేమ.. నమ్మించి మోసం.. పెళ్లి చేసుకోవాలని నిలదీయడంతో..) పెళ్లికి వెళ్లి... : ఈ నెల 2న బాలిక తన స్నేహితురాలి అక్క వివాహం రూరల్ పరిధిలోని సిండికేట్‌నగర్‌లో జరిగింది. ఆ వివాహ వేడుకకు తండ్రితో కలిసి బాలిక వెళ్లింది. భోజనం చేద్దామనుకున్న సమయంలో బాలిక కనిపించలేదు. అంతా వెతికినా ఫలితం లేకపోయింది. చేసేదిలేక అనంతపురం రూరల్ పీఎస్‌లో ఫిర్యాదు చేయగా అదృశ్యం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పదికి పైగా కేసులు: బాలికను తీసుకెళ్లిన నిందితుడు సాకే వినేష్‌పై వన్‌టౌన్, టూటౌన్ పరిధిలోని దొంగతనాలు, తదితర కేసులు పదికి పైగా ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. బాలికను ఏం చేస్తాడోనన్న భయంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. -
Viral Video : ఒక్క అడుగూ.. ఆ ఒక్క అడుగు తేడా వస్తే శాల్తీ ఔట్!
భూమిపై నూకలు బాకీ ఉంటే పెను ప్రమాదాల నుంచి సైతం ప్రాణాలతో బయటపడొచ్చు అంటారు. ఇక్కడ వీడియోలో రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడం చూస్తే నిజమే అనిపిస్తుంది. లేదంటే అంత భారీ వాహనం ఒక్కసారిగా ఎగిరిపడి.. ఆ వ్యక్తి వైపునకు దూసుకెళ్లడం.. అతని దగ్గరగా వెళ్లి ఢీకొని రాసుకుంటూ ముందుకుసాగడం.. అతను గోడ, ట్రక్కు మధ్యగా ఇరుక్కుపోయి బయటపడటం.. ఇవన్నీ భయంగొలిపే దృశ్యాలే! చదవండి👉 యువతి చేతిలో ఫోటో చూడగానే.. కారు ఆపిన ప్రధాని మోదీ! ఈ ఘటన బ్రెజిల్లో చోటుచేసుకుంది. వీడియో ప్రకారం.. రోడ్డు పక్కన చేతిలో హెల్మెట్, కొన్ని పత్రాలతో ఓ వ్యక్తి నిలుచున్నాడు. అటుగా వస్తున్న ఓ ట్రక్కు చెట్టు కొమ్మలకు బలంగా తాకడంతో ఒక్కసారిగా ఎగిరిపడింది. వేగంగా కుడివైపునకు దూసుకెళ్లింది. అమాంతం పైకిలేచి ఫుట్‌పాత్‌మీదుగా పరుగులు పెట్టింది. అక్కడే ఫుట్‌పాత్‌పై ఉన్న వ్యక్తి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. చచ్చాన్రా దేవుడో అనుకుంటూ కొద్దిగా వెనక్కి అడుగేశాడు. అప్పటికే అతన్ని సమీపించిన ట్రక్కు ముందుభాగం అతనికి టచ్ ఇచ్చింది. ఆ దెబ్బతో అతను గోడవైపునకు మరింత కదిలాడు. అతన్ని రాసుకుంటూ వెళ్లిన ట్రక్కు అడుగుల దూరంలో ఆగిపోయింది. ఊహించని ప్రమాదంతో అటు బాధితుడు, ఇటు ట్రక్కు డ్రైవర్ కంగారెత్తిపోయారు. అయితే, అదృష్టం కొద్దీ ప్రమాద తీవ్రత తక్కువగా ఉండటంతో ఇద్దరూ ఊపిరిపీల్చుకున్నారు. 56 సెకండ్లు ఉన్న ఈ వీడియో తాజాగా వైరల్‌గా మారింది. చదవండి👉🏾 Viral Video: అటు చూడు బే! -
యాసిడ్ దాడి: ప్రేమోన్మాది కాస్త సన్యాసి అవతారంలో..
బెంగళూరు: ప్రేమ పేరుతో ఓ యువతిని విపరీతంగా వేధించిన వ్యక్తి.. చివరకు ఆమెపై పక్కా ప్లాన్‌తో యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. మరి చేసిన నేరానికి పోలీసులు దొరకబడతారు కదా!. అందుకే.. చిక్కకుండా ఉండేందుకు భలే స్కెచ్ వేశాడు. సన్యాసి అవతారం ఎత్తి పొరుగు రాష్ట్రంలో ఓ ఆశ్రమంలో సేదతీరుతుండగా.. వెంటాడి మరీ పట్టేసుకున్నాయి ఖాకీలు. ఏప్రిల్ 28వ తేదీన బెంగళూరు హెగ్గానహళ్ళి, సంజీవిని నగర్‌కు చెందిన నగేష్ అనే వ్యక్తి.. మాగడి రోడ్లో తన ఆఫీస్ బయట నిల్చున్న బాధితురాలి(25)పై యాసిడ్ పోశాడు. బాధితురాలి బంధువుల ఇంట్లోనే నగేష్ అద్దెకు ఉంటున్నాడు. ఈ క్రమంలో వీళ్లిద్దరికీ ఏడేళ్ల పరిచయం ఉంది. అయితే గత కొంత కాలంగా తనను ప్రేమించాలంటూ నగేష్ బలవంతం చేయగా.. ఆమె అందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమెపై కోపం పెంచుకుని దారుణానికి తెగబడ్డాడు. దాడి అనంతరం అతను పారిపోగా.. బాధితురాలు, ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అప్పటి నుంచి పోలీసులు నగేష్ కోసం వెతుకుతూనే ఉన్నారు. పక్కా స్కెచ్.. నగేష్ యాసిడ్ దాడి ఏదో క్షణికావేశంలో జరిగిందనుకుంటే పొరపాటే. ఎందుకంటే.. దాడికి ముందు రోజు తన దగ్గరి బంధువులతో ‘నేను రేపు టీవీల్లో కనిపిస్తా’ అంటూ హింట్ కూడా ఇచ్చాడట. అంతేకాదు దాడికి ముందే తాను నడిపిస్తున్న బట్టల దుకాణాన్ని, అందులోని ఇతర సామాన్లను అమ్మేశాడు నగేష్. ఆ డబ్బుతో పాటే దాడి తర్వాత పారిపోయాడు. అయితే పారిపోయే క్రమంలో అతను చేసిన మరో పని.. సెల్‌ఫోన్‌ను ఉపయోగించకపోవడం. పోలీసులు ట్రేస్ చేస్తారనే ఉద్దేశంతో.. తన దగ్గరున్న రెండు ఫోన్లను, సిమ్ కార్డులను హోస్కోటే హైవేలో పడేసి వెళ్లిపోయాడు. పైగా ఆ ఫోన్లను ఫార్మట్ చేసి మరీ పడేశాడు. పది టీంలతో వెతుకులాట.. నగేష్ ఫొటోలను రిలీజ్ చేసిన పోలీసులు.. అతని కోసం పది బృందాలతో గాలింపు చేపట్టారు. కానీ, ప్రయోజనం లేకుండా పోయింది. ఈలోపు మహిళా సంఘాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో పొరుగు రాష్ట్రాలకు టీంలను పంపించారు. ఈలోపు తిరువణ్ణమలై దగ్గర ఓ ఆశ్రమంలో నగేష్ పోలికలతో ఓ వ్యక్తిని చూసినట్లు కొందరు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చిచూసేసరికి.. తనకిప్పుడు దేని మీద ఆశ లేదని, అన్ని బంధాలను తెంచుకుని ఇక్కడికి వచ్చి సన్యాసిగా బతుకుతున్నానంటూ స్టేట్మెంట్లు ఇచ్చాడు. కానీ, పోలీసులు ఊరుకుంటారా? పదహారు రోజుల తర్వాత మొత్తానికి సంకెళ్లు వేసి కటకటాల వెనక్కి నెట్టారు మొత్తానికి. చదవండి: విడిపోయిన భార్యభర్తలను కలిపిన క్రిమినల్!! -
హాస్టల్ గోడ దూకి.. 150 సీసీ కెమెరాల కళ్లుగప్పి..
చంద్రగిరి(తిరుపతి జిల్లా): అర్ధరాత్రి హాస్టల్ గోడ దూకి నలుగురు విద్యార్థినులు పారిపోయిన ఘటన చంద్రగిరిలో కలకలకం సృష్టించింది. వెస్ట్ డీఎస్పీ నరసప్ప కథనం మేరకు.. విజయనగరం, విజయవాడ, కడప, విశాఖపట్నం ప్రాంతాలకు చెందిన నలుగురు విద్యార్థినులు చంద్రగిరి మండలం తొండవాడ సమీపంలో కంచి కామకోటి పీఠం ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంప్రదాయ పాఠశాలలో ఉంటూ చంద్రగిరిలోని శ్రీనివాస డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నారు. చదవండి: వివాహేతర సంబంధం.. భర్తను అడ్డు తొలగిస్తే కలసి జీవించవచ్చని.. వీరిలో ఇద్దరు విద్యార్థినులు మైనర్లు. వీరు డిగ్రీ చదువుకుంటూ.. హాస్టల్లో వేదాలు, హిందూ సంప్రదాయాలు నేర్చుకుంటున్నారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఈ నలుగురు అమ్మాయిలు హాస్టల్ వెనుక వైపు నుంచి 8 అడుగుల ఎత్తయిన గోడదూకి పారిపోయారు. హాస్టల్ ఇన్చార్జి లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. విద్యార్థినుల ఆచూకీ గుర్తించేందుకు నాలుగు బృందాలను రంగంలోకి దింపినట్లు డీఎస్పీ తెలిపారు. కాగా, హాస్టల్ నుంచి వెళ్లే మూడు రోజులకు ముందు ఏమి జరిగిందనే కోణంలో పోలీసులు విచారిస్తున్నట్టు తెలిసింది. ఓ బయటి వ్యక్తి సెల్‌ఫోన్ నుంచి విద్యార్థినులు శుక్రవారం సాయంత్రం రెండు సార్లు ఎవరితోనో మాట్లాడినట్లు తెలుస్తోంది. సుమారు 350 మంది ఉన్న హాస్టల్లో 150కి పైగా సీసీ కెమెరాలు, 10 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. అయినా విద్యార్థినులు పారిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. -
ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు.. వైద్య విద్యార్థిని అలా చేస్తూ..
సాక్షి ప్రతినిధి, చెన్నై: పెరంబలూరుకు చెందిన ఇద్దరు బాలికలు చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు. విడదీయలేని స్నేహబంధాన్ని వివాహ బంధంగా మార్చుకునేందకు లింగమార్పిడికి సిద్ధపడ్డారు. ఇంటి నుంచి పారిపోయిన ఇద్దరిని పోలీసులు పట్టుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. పెరంబలూరు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలు (17) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. ఈనెల 5వ తేదీ కాలేజీకి వెళుతున్నట్లు చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లారు. అనంతరం ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. ఫలితం లేకపోవడంతో తల్లిదండ్రులు పెరంబలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిద్దరూ చెన్నైలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు పెరంబలూరుకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో వారిని విచారించగా విస్తుగొలిపే వాస్తవాలు వెలుగుచూశాయి. ఆరో తరగతి నుంచే ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉండేది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారు. వీరిలో నర్సింగ్ చదువుతున్న విద్యార్థినికి మగవారి చెప్పులు, దుస్తులు ధరించడం, క్రాఫ్ చేసుకోవడం వంటి లక్షణాలు అలవడ్డాయి. జీవితాంతం ఇద్దరం కలిసి ఉండాలంటే ఒకరు మగవారిగా మారి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ముందుగా చెన్నైలో వైద్య పరీక్షలు చేయించుకుని ముంబయికి వెళ్లి లింగమార్పిడి శస్త్రచికిత్సకు సిద్ధపడుతున్న తరుణంలో శుక్రవారం వీరు చెన్నై పోలీసులకు చిక్కారు. ఇద్దరు విద్యార్థినులను తల్లిదండ్రులకు అప్పగించి చైల్డ్‌లైన్ ద్వారా కౌన్సిలింగ్ ఇస్తున్నారు. -
మాయలేడి: ఇంట్లోకి వచ్చి ఎంత పని చేసిందంటే..!
కర్నూలు (టౌన్): కోవిడ్ వ్యాక్సిన్ పేరుతో ఓ మాయలేడి ఇంట్లోకి వచ్చి ఓ మహిళను క్షణాల్లో బురిడీ కొట్టించి బంగారు గొలుసుతో ఉడాయించింది. శుక్రవారం నగరంలోని స్టాంటన్‌పురంలో కళావతమ్మ అనే మహిళ ఇంటికి ఓ గుర్తు తెలియని మహిళ వచ్చి కోవిడ్ వ్యాక్సిన్ వేసేందుకు వచ్చానని నమ్మించింది. చదవండి: Anantapur: ఆగని టీడీపీ అరాచకం వ్యాక్సిన్ వేసే ముందుగా కళ్లలో రెండు చుక్కలు మందు వేసుకోవాలని చెప్పి బాధితురాలి కళ్లలో చుక్కలు వేయడంతో కళ్లు మూసుకుంది. ఇదే అదునుగా భావించి కళావతమ్మ మెడలోని 25 గ్రాముల బరువున్న బంగారు గొలుసును మాయలేడి తెంపుకుని ఉడాయించింది. బాధితురాలు గట్టిగా కేకలు వేసుకుంటూ బయటకు వచ్చి చూసినా గుర్తు తెలియని మహిళ కనిపించలేదు. దీంతో అర్బన్ తాలూకా పోలీసు స్టేషన్ చేరుకుని ఫిర్యాదు చేయడంతో, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
రెండు కుటుంబాలు మూడో కంటికి తెలియకుండా.. కిటికీలు తెరిచి చూస్తే...
కలికిరి(చిత్తూరు జిల్లా): అప్పుల మోత అధికమై రెండు కుటుంబాలు మూడో కంటికి తెలియకుండా ఇంటి సామాన్లను తీసుకుని పరారయ్యాయి. గురువారం రాత్రి కలికిరిలో ఇది వెలుగులోకి రావడంతో కలకలం రేపింది. బాధితుల కథనం...స్థానికంగా స్వీట్స్ దుకాణం నిర్వహిస్తున్న ఖాదర్ బాషా, ఏ వన్ సూపర్ మార్కెట్ నిర్వాహకులు కామున్నీషా, కరంతుల్లా పట్టణంలో పలువురి వద్ద అప్పులు చేశారు. గత శుక్రవారం నుంచి ఖాదర్ బాషా, దంపతులైన కామున్నీషా, కరంతుల్లా ఇళ్లకు తాళాలు వేసి ఉండటం, వారి మొబైల్ ఫోన్లు స్విచ్ఛాఫ్ అని వస్తుండడంతో రుణదాతలు అనుమానించారు. చదవండి: కట్నం వేధింపులకు నవ వధువు బలి గురువారం సాయంత్రం వారి ఇళ్ల కిటికీలు తెరచి చూశారు. ఇంట్లో వస్తువులేవీ పోవడంతో రెండు కుటుంబాల వారు పరారైనట్లు గుర్తించి కంగుతిన్నారు. పోలీస్ స్టేషన్‌కు పరుగులు తీసి లబోదిబోమన్నారు. ఎస్ఐ లోకేష్‌రెడ్డి దాదాపు 20 మంది బాధితుల నుంచి వివరాలు నమోదు చేసుకున్నారు. రాత్రి వరకు అందిన ఫిర్యాదుల మేరకు నిందితులకు రూ.1.6కోట్ల అప్పులు ఉన్నట్లు తేలిందని చెప్పారు. కలికిరితో పాటు చింతపర్తి ఇతర ప్రాంతాలకు సంబంధించిన వారి నుంచి సుమారు రూ.3కోట్లకు పైగా నిందితులు అప్పులు చేసినట్లు బాధితులు చెబుతున్నారు. ఇదలా ఉంచితే, కలికిరిలో ఇటీవల ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వరుసగా మోసాలు వెలుగు చూస్తుండటం చర్చనీయాంశంగా మారింది. -
అక్కడ తప్పించుకున్నాడు.. ఇక్కడ దొరికిపోయాడు
సాక్షి, బంజారాహిల్స్( హైదరాబాద్): చోరీ కేసులో తప్పించుకున్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. ఓ కేసులో నిందితుడు మహ్మద్ గౌస్‌ను ఎస్ఆర్నగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా చంచల్‌గూడ జైలులో విచారణ ఖైదీగా ఉన్నాడు. ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఇటీవల చంచల్‌గూడ జైలు నుంచి గౌస్‌ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే పోలీసుల బారి నుంచి తప్పించుకొని పరారు కాగా అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గౌస్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పీడీ యాక్ట్ కూడా నమోదై ఉండటం, బంజారాహిల్స్‌రోడ్ నెం. 10లోని జహిరానగర్‌లో నివాసం ఉండటంతో అఫ్జల్‌గంజ్ పోలీసుల సమాచారం మేరకు రంగంలోకి దిగిన బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ శివచంద్ర, హోంగార్డు కృష్ణానాయక్‌తో కలిసి అరగంటలోనే నిందితుడిని పట్టుకొని అఫ్జల్‌గంజ్ పోలీసులకు అప్పగించారు. గురువారం తెల్లవారుజామున 5 గంటలకు సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు పక్కా ప్రణాళికతో గౌస్ నివాసం ఉండే ప్రాంతంలో నిఘా పెట్టారు. సరిగ్గా 5.30 గంటలకు గౌస్ తన భార్యను కలిసి ఇంట్లో నుంచి కొద్ది దూరం వెళ్ళి ఆటో కోసం వేచి చూస్తున్న సమయంలో పోలీసులు మాటువేసి పట్టుకున్నారు. చదవండి: అయ్యో భగవంతుడా.. సాయం అందేలోపు.. ఆగిన శ్వాస -
అక్కా, చెల్లి, పిన్నీ అని నమ్మకం కలిగిస్తారు.. ఆపై
విజయనగరం క్రైమ్: చదువుకుంటామంటూ ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. పిన్నీ.. అక్కా.. చెల్లీ.. అంటూ బంధుత్వాలు కలిపారు. వారి నుంచి చిన్న మొత్తాల్లో డబ్బులు తీసుకునేవారు. తిరిగి వడ్డీతో ఇచ్చేవారు. ఆర్థికంగా నమ్మకం కలిగించారు. రూ.లక్షలు చేతికి చిక్కాక.. గుట్టుచప్పుడు గాకుండా ఉడాయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టూటౌన్ పోలీసులు శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. చదువుకుంటామంటూ కొన్ని నెలల కిందట నలుగురు యువకులు కొత్తపేట గొల్లవీధిలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. వారు ఎక్కడి నుంచి వచ్చారో తెలియకుండా జాగ్రత్తపడ్డారు. ఇరుగుపొరుగువారితో మాటామంతీ కలిపారు. అక్కా, చెల్లి, పిన్ని అంటూ వరుసులతో పిలిచేవారు. నమ్మకంగా వ్యవహరిస్తూ చిన్నపాటి మొత్తం తీసుకోవడం, రెండు రోజుల తర్వాత వడ్డీతో కలిపి ఇవ్వడం అలవాటు చేశారు. ఇలా వేల రూపాయల్లో తీసుకున్న మొత్తం కాస్తా రూ.లక్షల్లోకి వెళ్లింది. అదనంగా డబ్బులిస్తున్నారనే అత్యాశకు పోయినవారు సుమారు రూ.ఆరేడు లక్షల వరకూ అప్పులిచ్చినట్టు సమాచారం. రూ.లక్షలు చేతిలో పడగానే నలుగురు యువకులు మకాం ఎత్తేయడంతో బాధిత మహిళలు లబోదిబోమంటున్నారు. టూటౌన్ పోలీసులను ఆశ్రయించి గోడు వెల్లబోశారు. ఈ విషయంపై టూటౌన్ సీఐ సీహెచ్ లక్ష్మణరావు మాట్లాడుతూ మహిళలు సమస్య చెప్పుకునేందుకు వచ్చారే తప్ప ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదన్నారు. ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి నిందితులను పట్టుకుంటామన్నారు. చదవండి: గుట్టురట్టు: కవర్‌ను లాగితే నకిలీ తేలింది.. నువ్వు మగాడివైతే చిటికేసి చూడు -
క్యూబాకు పారిపోవాలనేది చోక్సి ప్లాన్
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం నిందితుడు, డొమినికాలో కోర్టు విచారణని ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. డొమినికా మీదుగా క్యూబాకు పారిపోవాలని చోక్సి పన్నాగం పన్నాడని ఆయన గర్ల్‌ఫ్రెండ్‌గా ఆరోపణలు ఎదుర్కొంటున్న బార్బరా జబారికా చెప్పారు. వచ్చేసారి క్యూబాలో కలుసుకుంటామని చోక్సి తనతో చెప్పినట్టుగా ఆమె ఏఎన్ఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘ అతను క్యూబాలో స్థిరపడాలని భావించాడు’అని బార్బరా చెప్పారు. చోక్సికి తాను గర్ల్‌ఫ్రెండ్‌ని కాదన్నారు. చోక్సి నేరస్తుడని తెలీదు చోక్సి పరారీలో ఉన్న నేరస్తుడని తనకు అసలు తెలీదని, అతని అసలు పేరు, బ్యాక్ గ్రౌండ్ ఏదీ తనకు తెలీదని బార్బరా చెప్పారు. ‘నేను యూరోపియన్‌ని. భారత ఆర్థిక నేరగాళ్ల జాబితా గురించీ తెలీదు. చోక్సి అసలు పేరేమిటో గత వారం వరకు నాకు తెలీదు. గత ఏడాది ఆగస్టులో మొదటిసారి చోక్సిని కలుసుకున్నాను. తన పేరు రాజ్ అని పరిచయం చేసుకున్నాడు. తరచు నాకు మెసేజ్‌లు పెడుతూ ఉండేవాడు. కానీ నెలకోసారి మాత్రం రిప్లయ్ ఇచ్చేదాన్ని’ అని చెప్పారు. మరోవైపు ఆంటిగ్వాలో కిడ్నాప్ చేసి తనను డొమినికాకు తీసుకువచ్చారని, ఆ కిడ్నాప్‌లో బార్బరా హస్తం కూడా ఉందంటూ చోక్సి చేసిన ఆరోపణల్ని ఆమె తిప్పికొట్టారు. మెహుల్ చోక్సి బెయిల్ పిటిషన్ విచారణని డొమినికా హైకోర్టు 11వ తేదీకి వాయిదా వేసినట్టుగా స్థానిక మీడియా వెల్లడించింది. కింద కోర్టు అతని బెయిల్ పిటిషన్ తిరస్కరించడంతో చోక్సి హైకోర్టుకెక్కారు. -
హైదరాబాద్: 88 మంది కోవిడ్ రోగుల మాయం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ కింగ్‌కోఠి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కోవిడ్ రోగులు పలువురు.. డాక్టర్లు, నర్సులు, సిబ్బందికి సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోతున్నారు. ఈ విధంగా ఇప్పటికి 88 మంది బాధితులు ఆస్పత్రి నుంచి మాయం అయినట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి మే 18వ తేదీ వరకు కింగ్‌కోఠి ఆసుపత్రిలో కోవిడ్ టెస్టుల కోసం వచ్చిన వారి సంఖ్య 14,664. వీరిలో 1,802 మంది అడ్మిట్ కాగా 782 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 261 మంది మృత్యువాత పడ్డారు. 671 మంది రోగుల్లో కొందరు ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, కొందరు గాంధీలో, మరికొందరు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మిగతా 88 మంది చికిత్స పూర్తికాకుండానే అంటే నెగెటివ్ రాకముందే కన్పించకుండా పోవడం విస్మయం కలిగిస్తోంది. వీరి విషయంలో ఆస్పత్రి అధికారుల వద్ద సరైన వివరాలు లేకపోవడం గమనార్హం. సరైన సెక్యూరిటీ, పర్యవేక్షణ లేని కారణంగానే ఎవరు పడితే వారు లోపలికి రావడం, రోగులు కాస్త కోలుకున్నాక ఎవరికీ చెప్పకుండానే వెళ్లిపోవడం జరుగుతోందనే విమర్శలున్నాయి. పేషెంట్లకు ట్యాగ్లు వేయడం, సహాయకులకు పాస్‌లు ఇవ్వడం వంటివి సరిగా అమలు కావడం లేదని తెలుస్తోంది. వాళ్లంతా చెప్పకుండా వెళ్లినట్టు కాదు ఆ 88 మంది చెప్పకుండా వెళ్లినట్టేం కాదు. కొంతమంది మాకు ఇక్కడ ట్రీట్మెంట్ ఇష్టం లేదని చెప్పి వెళుతున్నారు. కొందరు చెప్పకుండా వెళ్తున్నారు. అలా వెళ్లిన సంగతి తెలిసిన వెంటనే పోలీసులకు చెబుతున్నాం. రోగులు చెప్పకుండా వెళ్లడానికి వీల్లేకుండా సెక్యూరిటీని పెంచే దిశగా ఆలోచిస్తున్నాం. – డాక్టర్ రాజేంద్రనాథ్,సూపరింటెండెంట్ -
ఆస్పత్రిలో పక్కా ప్లాన్: సెంట్రీ బిర్యానీలో మత్తు మందు కలిపి
సాక్షి, సిటీబ్యూరో: ఒడిస్సాలోని కటక్ ఆసుపత్రి నుంచి తప్పించుకుని, నార్త్‌జోన్ టాస్‌్కఫోర్స్ పోలీసులకు జహీరాబాద్ రూరల్ పరిధిలోని హత్నూర్‌లో చిక్కిన ఘరానా గ్యాంగ్‌స్టర్ షేక్ హైదర్ విచారణలో ఆసక్తికర కీలకాంశాలు వెలుగులోకి వస్తున్నాయి. తాను తప్పించుకోవడానికి తన ప్రధాన అనుచరుడు యూకూబ్ సాయం చేసినట్లు అంగీకరించాడు. భువనేశ్వర్, కటక్, పూరీ జిల్లాల్లో నమోదైన అనేక హత్య, హత్యాయత్నం, బెదిరింపులు, దోపిడీ కేసుల్లో హైదర్ నిందితుడిగా ఉన్నాడు. సొంతంగా ఓ ముఠా ఏర్పాటు చేసుకున్న ఇతగాడు గ్యాంగ్‌స్టర్ అవతారం ఎత్తాడు. శిక్ష అనుభవిస్తుండగానే.. పలుమార్లు పోలీసులు అరెస్టు చేసినా తేలిగ్గా బెయిల్ పొంది బయటకు వచ్చాడు. ప్రత్యర్థి గ్యాంగ్‌స్టర్ షేక్ సులేమాన్ సోదరుడు షేక్ చాను హత్య కేసులోనూ ఇతడికి జీవితఖైదు పడింది. ఈ శిక్ష అనుభవిస్తుండగానే భువనేశ్వర్‌కు చెందిన మైన్స్ యజమాని రష్మీరాజన్ మొఘాప్తారా కిడ్నాప్, హత్య కేసులోనూ ఇదే తరహా శిక్షకు గురయ్యాడు. ఈ కేసుల్లో ఏకకాల శిక్ష అనుభవిస్తూ హైదర్ నాలుగేళ్ల క్రితం వరకు భువనేశ్వర్‌లోని ఝార్పాడ జైల్లో ఉన్నాడు. (చదవండి: కాంగ్రెస్ అభ్యర్థి మృతి.. పిప్పిలి ఉప ఎన్నిక వాయిదా!) కిడ్నీ సమస్య వచ్చిందంటూ.. ఝార్పాడ జైలు నుంచీ దందాలు చేస్తున్నాడని, తప్పించుకోవడానికి పథక రచన చేస్తున్నాడని ఒడిస్సా నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో 2018లో ఇతడిని అధికారులు సబల్‌పూర్ జైలుకు మార్చారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య అనునిత్యం పహారాలో ఉంచారు. తనకు కిడ్నీ సమస్య వచి్చనట్లు ఇటీవల అక్కడి జైలు అధికారులకు చెప్పిన హైదర్ చికిత్స కోసమంటూ మార్చి 23న కటక్‌లోని ఎస్సీబీ మెడికల్ కాలేజీ ఆసుప్రతిలో చేర్చేలా చేశాడు. అక్కడకు తరచుగా తన అనుచరులు, కుటుంబీకుల్ని విజిటర్స్‌గా పిలిపించుకునే వాడు. వీళ్ల తాకిడి ఎక్కువగా ఉన్నప్పటికీ సెంట్రీ విధుల్లో ఉండే అధికారులు పట్టించుకోలేదు. కేవలం ఒకే కానిస్టేబుల్‌ను సెంట్రీగా ఉంచారు. దీన్ని ఆసరాగా చేసుకున్న హైదర్ తన కుడిభుజం యాకూబ్‌తో కలిసి ఎస్కేప్‌కు స్కెచ్ వేశాడు. బిర్యానీలో మత్తుమందు కలిపి.. నాలుగు రోజుల పాటు క్రమం తప్పకుండా తనను కలవడానికి వస్తూ సెంట్రీ విధుల్లో ఉన్న వారిని మచి్చక చేసుకోవాలని సూచించాడు. అలా చేస్తూ వచి్చన యాకూబ్ తరచూ వారికి బిర్యానీ పొట్లాలు తీసుకువచ్చి అందించే వాడు. ఈ నెల 5న మత్తుమందు కలిపిన బిర్యానీని సెంట్రీకి అందించాడు. అతడు మత్తులోకి జారు కోగా.. హైదర్ అక్కడ నుంచి తప్పించుకున్నాడు. యాకూబ్ సమకూర్చిన స్విఫ్ట్ వాహనంలో(ఓడీ 02 ఏఎస్ 6770) ఒడిస్సా నుంచి ఈ గ్యాంగ్‌స్టర్ విశాఖపట్నం, విజయవాడ మీదుగా ప్రయాణించి హైదరాబాద్ చేరుకున్నాడు. ఇక్కడ ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా తన కారును గుర్తిస్తారని, దాన్ని పెద్ద అంబర్‌పేట వద్ద వదిలేసినట్లు హైదర్ బయటపెట్టాడు. ఇతడికి షెల్డర్ ఇచి్చన హైదరాబాద్‌లోని కింగ్ కోఠి, హత్నూర్‌లకు చెందిన ఇద్దరు ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాన్ని ఒడిస్సా పోలీసులు పరిశీలిస్తున్నారు. (చదవండి: ఆస్పత్రి నుంచి ఉడాయించిన గ్యాంగ్‌స్టర్ షేక్ హైదర్) -
పరారైన మోస్ట్ వాంటెడ్ హైదరాబాద్‌లో?
సాక్షి, సిటీబ్యూరో: ఒడిశాలోని కటక్ జైలు నుంచి తప్పించుకుని హైదరాబాద్‌కు వచ్చిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ షేర్ హైదర్ కోసం ముమ్మర గాలింపు కొనసాగుతోంది. సిటీలో ప్రవేశించి 48 గంటలు గడిచినా ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో టాస్క్‌ఫోర్స్ పోలీసుల సహకారంతో ఒడిశా నుంచి వచ్చిన ప్రత్యేక బృందం ముమ్మరంగా గాలిస్తోంది. మరోపక్క హైదర్ మహారాష్ట్రకు పారిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. భువనేశ్వర్‌కు చెందిన మైన్స్ యాజమాని రష్మీరాజన్ మొఘాప్తారా కిడ్నాప్, హత్యకేసులో హైదర్‌కు భువనేశ్వర్ కోర్టు 2015లో జీవిత ఖైదు విధించింది. అంతకు ముందు 2011లో మరో గ్యాంగ్‌స్టర్ షేక్ సులేమాన్ సోదరుడు షేక్ చాను హత్య కేసులోనూ ఇతడికి జీవితఖైదు పడింది. 2017 వరకు భువనేశ్వర్‌లోని ఝార్పాడ జైలులో ఉన్న హైదర్ భద్రత కారణాల నేపథ్యంలో సబల్‌పూర్ జైలుకు మార్చారు. ఆరోగ్యం బాగా లేదని.. నాలుగు రోజుల క్రితం కిడ్నీ సమస్యతో బాధపడుతున్నట్టు హైదర్ అక్కడి జైలు అధికారులకు చెప్పడంతో, కటక్‌లోని ఎస్సీబీ మెడికల్ కాలేజీ ఆసుప్రతికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం 4.30 గంటలకు తప్పించుకున్నాడు. ఈ విషయాన్ని కటక్ పోలీసులు మూడు గంటల ఆలస్యంగా గుర్తించి అప్రమత్తమయ్యారు. అప్పటికే హైదర్ మరో ఇద్దరితో కలిసి కారులో వెళ్లినట్లు తేలింది. ఒడిశా నుంచి ఈ గ్యాంగ్‌స్టర్ విశాఖపట్నం, విజయవాడ మీదుగా ప్రయాణించాడు. హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సేకరించిన ఆధారాలను బట్టి సదరు గ్యాంగ్‌స్టర్ హైదర్ ప్రయాణిస్తున్న స్విఫ్ట్ వాహనం (ఓడీ 02 ఏఎస్ 6770) ఆదివారం రాత్రి 8.42 గంటలకు పంతంగి టోల్ ప్లాజా దాటింది. ఆ తర్వాత నగరంలోని కొన్నిచోట్ల సంచరించినట్లు ఆనవాళ్లు ఉన్నా.. ఆపై ఆచూకీ లభించలేదు. హైదర్‌కు మహారాష్ట్రలోనూ కొన్ని షెల్టర్లు ఉన్నాయని ఒడిశా పోలీసులు చెబుతున్నారు. గతంలో కటక్ పోలీసులు హైదర్‌ను నాగ్‌పూర్‌లో పట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కూడా మహారాష్ట్రకు ఉడాయించి ఉంటాడని అనుమానిస్తున్నారు. మరోపక్క నగరంతో పాటు శివార్లలోనూ గాలింపును కొనసాగిస్తున్నారు. హైదర్ లేదా అతడి వాహనం ఆచూకీ తెలిస్తే 94906 16640 నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని సీటీ కొత్వాల్ అంజనీకుమార్ కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. గ్యాంగ్‌స్టర్ కోసం ఒడిశా పోలీసులు సైతం సిటీకి చేరుకుని గాలిస్తున్నారు. ( చదవండి: జూబ్లీహిల్స్‌లో దారుణం: కలిసి మద్యం తాగారు, మళ్లీ వచ్చి చూస్తే ) -
కూన తీరు మారదు.. పరుగు ఆగదు!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ మళ్లీ పరారయ్యారు. ఫ్రస్టేషన్‌తో దాడులకు దిగడం, ఆపై పారిపోవడంలో కూన రవికుమార్ హ్యాట్రిక్, డబుల్ హ్యాట్రిక్ సాధిస్తున్నారు. పోలీసు అధికారుల విధులకు ఆటంకం కలిగించిన అంశం, పెనుబర్తి వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థిపై దాడి చేసిన ఘటనలో అరెస్టు అవుతారన్న భయంతో మళ్లీ ముందస్తుగానే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయనపైన నమో దైన కేసుల మేరకు అరెస్టు చేసేందుకు శనివారం పోలీసులు ప్రయత్నించగా అప్పటికే ఎక్కడికో ఉడాయించేశారు. ఇప్పుడాయన కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఇప్పటికే పలు కేసుల్లో బెయిల్‌పై ఉన్న కూన రవికుమార్ వ్యవహార శైలిలో మార్పు రావడం లేదు. ఎప్పటిలాగే దురుసుగా వ్యవహరిస్తూ జిల్లాలో అశాంతికి కారణమవుతున్నారు. అటు వైఎస్సార్సీపీ నాయకులపైన, ఇటు అధికారులపైన దాడులకు ప్రోత్సహించడంతో ఆమదాలవలస నియోజకవర్గంలో శాంతిభద్రతల సమస్య నెలకొంటోంది. పరిషత్ ఎన్నికల పోలింగ్ రోజున పొందూరు మండలం పెనుబర్తి వైఎస్సార్సీపీ ఎంపీటీసీ, ఆ గ్రామ సర్పంచ్ భర్త తమ్మినేని మురళీకృష్ణపై కూన రవికుమార్ వర్గీయులు మారణాయుధాలతో దాడి చేశారు. ఆస్తులు కూడా ధ్వంసం చేశారు. ఇదంతా కూన రవికుమార్ అక్కడ ఉండగానే జరిగింది. అంతేకాకుండా ఇలా చూడు.. బైఎలక్షన్ వస్తుందని బెదిరింపులకు దిగారు. దీంతో కూన రవికుమార్ అండ్‌కోపై వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ మురళీకృష్ణ పొందూరు పోలీ సు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అలాగే దాడి జరిగిన రోజున శాంతి భద్రతలను కాపాడేందుకు ఇరువర్గాల వారిని అదుపులోకి తీసుకునేందుకు యత్నింస్తుండగా పోలీసు అధికారుల వి ధులకు కూడా కూన ఆటంకం కలిగించారు. ఈ రెండు విషయాల్లో తనను విచారించి, అరెస్టు చేస్తారన్న భయంతో కూన పరారీ అయిపోయారు. శనివారం శ్రీకాకుళం టౌన్ పోలీసులు కూన రవికుమార్ కోసం ఆయన ఇంటికి వెళ్లి గాలించారు. అప్పటికే కూన రవికుమార్ పరారీలో ఉండటంతో వెనక్కి వచ్చేశారు. ఆయన శుక్రవారమే ఉడాయించారని, ఎప్పటిలాగే ముందస్తు బెయిల్ కోసం ప్ర యతి్నస్తున్నారని ఆ పార్టీ కేడర్ చర్చించుకుంటోంది. అప్పట్లో కూడా.. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న గత ఏడాది అక్టోబర్‌లో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌పై ఫిర్యాదు చేయడానికి నరసన్నపేట పోలీసు స్టేషన్ లోపలికి మూకుమ్మడిగా వెళ్లేందుకు టీడీపీ నాయకులు యతి్నస్తుండగా పోలీసులు అడ్డుకున్న నేపథ్యంలో కూన రవికుమార్ తీవ్రస్థాయిలో నోరు పారేసుకున్నారు. ‘ఏయ్ జాగ్రత్త.. శంకరిగిరి మా న్యాల్లో ఉంటారు జాగ్రత్త.. ఎవడక్కడ.. మీ స్థాయి ఎంత ..మీరు ఎంత..’ అని నరసన్నపేట సీఐ, ఎస్‌లను ఉద్దేశించి తీవ్రంగా మాట్లాడారు. అంతకుముందు పొందూరులో టీడీపీ కార్యాలయంగా నడుస్తున్న తన భవనాన్ని ఖాళీ చేయాల ని కోరినందుకు ఆ ఇంటి యజమానికి ఫోన్లోనే వార్నింగ్ ఇచ్చారు. ‘నేను ఖాళీ చేయను, నువ్వు మర్యాదగా బీహేవ్ చేస్తే ఫరవాలేదు, నువ్వేగాని అక్కడేమైనా చేస్తే చాలా సీరియస్‌గా ఉంటుంది’ అని కూన రవికుమార్ బెదిరించారు. నువ్వు గనక బిల్డింగ్ దగ్గరకు వస్తే నీ సంగతి చూస్తా అంటూ బెదిరింపులకు దిగారు. అంతకుముందు పింఛన్ల విషయంలో తన మాట వినలేదని మండల కార్యాలయంలోనే సరుబుజ్జిలి ఎంపీడీఓ, ఈఓపీఆర్డీకి వార్నింగ్ ఇచ్చా రు. ‘ఆఫీసులోనే తలుపులు వేసి మరీ బాదేస్తాను. నన్ను ఎవరూ ఆపలేరు. చెట్టుకు కట్టి కాల్చేస్తాను. చెప్పింది చేయకపోతే నేనెంటో చూపిస్తానంటూ’ అంటూ బెదిరించారు. పనుల విషయంలో తాను చెప్పినట్టు వినకపోతే కురీ్చలో కూర్చున్నా లా క్కుని వచ్చి తంతాను నా కొడకల్లారా అని.. పంచాయతీ కార్యదర్శులను కూన రవికుమార్ భ యపెట్టారు. ఒక బిల్లు విషయంలో సరుబుజ్జిలి ఇన్చార్జి ఈఓపీఆర్‌డీపైనా విరుచుకుపడ్డారు. ‘నీకెంత ఒళ్లు బలిసిందిరా నా కొడకా.. నిన్ను గొయ్యి తీసి పాతకపోతే నా పేరు కూన రవికుమా రే కాదు. నీ బతుకెంతరా నా కొడకా...’ అంటూ మట్టి అక్రమ రవాణాను అడ్డుకున్న పొందూరు తహశీల్దార్‌ను పరుష పదజాలంతో బెదిరించారు. చదవండి: దేవినేని ఉమాపై సీఐడీ కేసు చంద్రబాబు, లోకేష్‌లపై కేసు నమోదు -
గాంధీ నుండి పరారైన ఖైదీల కేసులో పురోగతి
సాక్షి, హైదరాబాద్ : గత నెలలో గాంధీ హాస్పిటల్ నుంచి తప్పించుకున్న ఖైదీల కేసులో పురోగతి లభించింది. పరారైన నలుగురు నిందితుల్లో సోమా సుందర్ అనే వ్యక్తని నార్త్ జోన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతని నుంచి మిగతా నేరస్తుల సమాచారాన్ని పోలీసులు రాబడుతున్నారు. వివరాల ప్రకారం.. జావిద్, నరసింహా, సోమ సుందర్, ఆర్బాజ్ అఏ నలుగురు ఖైదీలను గత నెలలో చికిత్స నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కి తరలించారు. అయితే అదును చూసుకొని అక్కడినుంచి తప్పించుకొని గుల్భర్గాకి వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ సైతం బైక్ చోరీలు చేద్దామని దుండగులు ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కొద్ది రోజులు క్రితం కొట్టేసిన బైక్‌లతో సోమసుందర్ అనే నిందితుడు హైదరాబాద్‌కు చేరుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గుల్బర్గాలో మిగతా ఖైదీల కోసం ప్రత్యేక టీంలతో గాలిస్తున్నారు. (ఖమ్మంలో అమానుషం)