బస్సు చోరీ చేసి.. ప్రయాణికుల్ని ఎక్కించుకుని.. | Thief Stolen RTC Bus And Escaped Along With Passengers From Siddipet Bustand - Sakshi
Sakshi News home page

Thief Escaped With RTC Bus: బస్సు చోరీ చేసి.. ప్రయాణికుల్ని ఎక్కించుకుని..

Published Thu, Sep 14 2023 1:02 PM | Last Updated on Thu, Sep 14 2023 1:30 PM

Thief escaped with RTC bus At Rajanna Siricilla - Sakshi

రాజన్నసిరిసిల్ల జిల్లా: సిద్దిపేటలో చోరీకి గురైన ఆర్టీసీ అద్దె బస్సు రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం సారంపల్లి శివా­రులో ప్రత్యక్షమైంది. పోలీసులు తెలి­పిన వివరాలివి. సిద్దిపేట డిపోకు చెందిన అద్దె బస్సు (టీఎస్‌ 36 టీఏ 3336)ను ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి చోరీ చేశాడు. అంతటి­తో ఆగకుండా నేరుగా సిద్దిపేట బస్టాండ్‌కు వెళ్లి ప్రయాణికులను ఎక్కించుకొని వేములవాడకు వచ్చాడు.

ఇక్కడి నుంచి హైదరాబాద్‌ బోర్డుతో ప్రయా­ణికులను ఎక్కించుకుని బయల్దేరాడు. ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేసి, టికెట్‌ మాత్రం ఇవ్వలేదు. దీంతో అనుమానం వచ్చిన ప్రయా­ణికులు.. తంగళ్లపల్లి మండలం సారంపల్లి శివారులోని ఎల్లమ్మ గుడి వద్దకు చేరుకోగానే డ్రైవర్‌ను నిలదీశారు. దీంతో సదరు వ్యక్తి బస్సును అక్కడే వదిలేసి పరార­య్యాడు.

వెంటనే ప్రయాణికులు డయల్‌ 100కు కాల్‌చేసి పోలీసులకు సమా­చారం అందించారు. ఇక్కడి పోలీసులు సిద్దిపేట పోలీసులకు సమాచా­రమిచ్చారు. సీసీ పుటేజీల ఆధారంగా నిందితుడిని గంభీరావుపేటకు చెందిన రాజుగా గుర్తించారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement