Florida Man Steals Womans Wallet And Escaped By Swimming Into The Sea, Goes Viral - Sakshi
Sakshi News home page

విచిత్రమైన దొంగ: పర్సు కొట్టేసి... సముద్రంలో ఈత కొట్టి ఎస్కేప్‌! కానీ...

Published Mon, Oct 3 2022 5:25 PM | Last Updated on Mon, Oct 3 2022 7:34 PM

Florida Man Stealing Womans Wallet After Escape Swim Away Into Sea - Sakshi

చైన్‌స్నాచర్లు, పిక్‌ పాకెటర్స్‌ చాలా తెలివిగా దొంగతనం చేసి తప్పించుకుంటారు. ఎంతో స్కెచ్‌ వేస్తే గానీ ఒకపట్టాన దొరకరు. ఔనా! ఐతే ఈ దొంగ మాత్రం పర్సు కొట్చేసి ఏకంగా సముద్రంలో ఈతకొట్టి తప్పించుకోవాలనుకున్నాడు.

వివరాల్లోకెళ్తే... ఫ్లోరిడాలో ఒక దొంగ ఒక హోటల్‌ పార్కింగ్‌ వద్ద ఉన్న ఒక మహిళ పర్సును కొట్టేశాడు. ఆ తర్వాత ఆ దొంగ తప్పించుకునేందుకు టంపా బేలో ఉండే బీచ్‌లోకి వెళ్లిపోతాడు. ఆ బీచ్‌ వద్దే ఉన్న కొంతమంది ఆ దొంగ సముద్రంలోకి వెళ్లడం చూస్తారు. ఆ దొంగ ఏకంగా సముద్రంలో ఈతకొట్టి తప్పించుకోవాలనుకున్నాడు.

ఐతే సమాచారం అందుకున్న పోలీసులు ఆ దొంగను వెతకడం కోసం హెలికాప్టర్‌తో రంగంలోకి దిగారు. అధికారులు హెలికాఫ్టర్‌తో ఆ వ్యక్తి కోసం సముద్రం అంతా జల్లెడపడతారు. పాపం ఆ దొంగ పోలీసలు తనను వదలేటట్లు లేరని డిసైడ్‌ అయ్యి తనను వెంబిడిస్తున్న హెలికాప్టర్‌ని చూసి లొంగిపోతున్నట్లు చేతులు పైకెత్తుతాడు. కానీ ఆ దొంగ తప్పించుకోవాలన్న ప్రయాసతో ఏకంగా 200 అడుగుల లోతు వరకు ఈత కొట్టేశాడు. పోలీసులు సదరు దొంగను డెవేన్‌ డీన్‌గా గుర్తించి, పలు కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. 

(చదవండి: ప్రపంచంలోనే అత్యంత పొడవైన పిల్లిగా గిన్నిస్‌ రికార్డు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement