Wallet theft
-
విచిత్రమైన దొంగ: పర్సు కొట్టేసి... సముద్రంలో ఈత కొట్టి ఎస్కేప్! కానీ...
చైన్‌స్నాచర్లు, పిక్ పాకెటర్స్ చాలా తెలివిగా దొంగతనం చేసి తప్పించుకుంటారు. ఎంతో స్కెచ్ వేస్తే గానీ ఒకపట్టాన దొరకరు. ఔనా! ఐతే ఈ దొంగ మాత్రం పర్సు కొట్చేసి ఏకంగా సముద్రంలో ఈతకొట్టి తప్పించుకోవాలనుకున్నాడు. వివరాల్లోకెళ్తే... ఫ్లోరిడాలో ఒక దొంగ ఒక హోటల్ పార్కింగ్ వద్ద ఉన్న ఒక మహిళ పర్సును కొట్టేశాడు. ఆ తర్వాత ఆ దొంగ తప్పించుకునేందుకు టంపా బేలో ఉండే బీచ్‌లోకి వెళ్లిపోతాడు. ఆ బీచ్ వద్దే ఉన్న కొంతమంది ఆ దొంగ సముద్రంలోకి వెళ్లడం చూస్తారు. ఆ దొంగ ఏకంగా సముద్రంలో ఈతకొట్టి తప్పించుకోవాలనుకున్నాడు. ఐతే సమాచారం అందుకున్న పోలీసులు ఆ దొంగను వెతకడం కోసం హెలికాప్టర్‌తో రంగంలోకి దిగారు. అధికారులు హెలికాఫ్టర్‌తో ఆ వ్యక్తి కోసం సముద్రం అంతా జల్లెడపడతారు. పాపం ఆ దొంగ పోలీసలు తనను వదలేటట్లు లేరని డిసైడ్ అయ్యి తనను వెంబిడిస్తున్న హెలికాప్టర్ని చూసి లొంగిపోతున్నట్లు చేతులు పైకెత్తుతాడు. కానీ ఆ దొంగ తప్పించుకోవాలన్న ప్రయాసతో ఏకంగా 200 అడుగుల లోతు వరకు ఈత కొట్టేశాడు. పోలీసులు సదరు దొంగను డెవేన్ డీన్‌గా గుర్తించి, పలు కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత పొడవైన పిల్లిగా గిన్నిస్ రికార్డు) -
సినిమాను తలపించే బిల్డప్.. సొమ్ము స్వాహా!
సాక్షి, ఒంగోలు : అద్దంకి మండలం చక్రాయపాలెం వద్ద ఓ ఆగంతకుడు పోలీస్ కానిస్టేబుల్‌నంటూ లారీ డ్రైవర్ని చితకొట్టాడు. స్టేషన్‌కు తీసుకెళ్తానంటూ బైక్ ఎక్కించుకుని పర్సు కొట్టేశాడు. వివరాలు.. నెల్లూరు నుంచి కోదాడ వెళ్తున్న ఓ లారీ.. అద్దంకి మండలం చక్రాయపాలెం వద్ద.. అద్దంకి నార్కెట్‌పల్లి రాష్ట్ర రహదారిపై ఆగింది. ఇంతలో ఓ వ్యక్తి బైక్‌పై వచ్చి ‘సీఐ వాహనంపైనే ఉమ్మేసి వస్తావా’ అంటూ చితకబాదాడు. స్టేషన్‌కి తీసుకెళ్తానంటూ బైక్‌పై ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లగానే.. అతనిపై దాడిచేసి పర్సు లాక్కెళ్లాడు. పర్సులో రూ.6 వేలు నగదు, ఏటీఎం కార్డు ఉందని డ్రైవర్ వాపోయాడు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్టు బాధితుడు వెల్లడించాడు. -
సినిమాను తలపించే బిల్డప్.. సొమ్ము స్వాహా!
-
పర్సు కొట్టేసిన ఎయిరిండియా పైలట్
న్యూఢిల్లీ: సిడ్నీ విమానాశ్రయంలోని ఒక దుకాణంలో పర్సు దొంగిలించారన్న ఆరోపణపై రోహిత్ భాసిన్ అనే పైలట్‌ను సస్పెండ్ చేసినట్టు ఎయిర్ ఇండియా వెల్లడించింది. సిడ్నీ నుంచి న్యూఢిల్లీ వస్తున్న ఏఐ –301 విమానం పైలట్లలో రోహిత్ ఒకరు. ఆయన ఎయిర్ ఇండియా రీజనల్ డైరెక్టర్‌గా కూడా పని చేస్తున్నారు. ఈ నెల 22వ తేదీ ఉదయం విమానం సిడ్నీ నుంచి బయలు దేరే ముందు రోహిత్ ఈ దొంగతనం చేశారని అధికారులు తెలిపారు. ‘విమానాశ్రయంలో ఉన్న దుకాణం నుంచి ఆయన ఒక పర్సు దొంగిలించారని తెలిసింది. దాంతో ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించాం. నిజమని తేలడంతో రోహిత్‌ను సస్పెండ్ చేశాం. అనుమతిలేకుండా ఎయిర్ ఇండియా ప్రాంగణంలోకి ప్రవేశించరాదని కూడా ఆదేశించాం’అని తెలిపారు. విమానం ఢిల్లీలో దిగగానే విమానాశ్రయంలోనే రోహిత్‌కు సస్పెన్షన్ ఉత్తర్వులు అందజేశామని ఆయన చెప్పారు. గుర్తింపు కార్డుని అధికారులకు అప్పగించాలని, తమ లిఖిత పూర్వక అనుమతి లేకుండా రోహిత్ నివాస స్థలమైన కోల్‌కతాను విడిచి వెళ్లరాదని కూడా ఆదేశించారు. -
ప్రియాంక రోడ్‌షోలో దొంగల చేతివాటం
లక్నో : ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, తూర్పు యూపీ ఇన్చార్జ్ ప్రియాంక గాంధీ సోమవారం లక్నోలో అట్టహాసంగా నిర్వహించిన రోడ్‌షోలో దొంగలు చేతివాటం చూపారు. సార్వత్రిక ఎన్నికలకు ప్రచార భేరీ మోగించేందుకు లక్నోలో తన సోదరుడు ,కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీతో కలిసి మెగా రోడ్‌షోలో పాల్గొన్నారు. పార్టీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలివచ్చిన రోడ్‌షోలో దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. ఎయిర్పోర్ట్ నుంచి పార్టీ కార్యాలయం వరకూ సాగిన ఈ ర్యాలీలో దొంగలు తమ చోరకళను ప్రదర్శించి దాదాపు 50 మందికి పైగా మొబైల్ ఫోన్లు, పర్సులను కొట్టేశారు. కాంగ్రెస్ ప్రతినిధి జీషన్ హైదర్ సహా పలువురు పార్టీ నేతల సెల్ ఫోన్లు మాయమయ్యాయి. ప్రియాంక ర్యాలీలో పర్సులు, సెల్ఫోన్ల అదృశ్యంపై బాధితుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టామని యూపీ పోలీసుల సైబర్ సెల్ నిపుణుడు వెల్లడించారు. మరోవైపు మొబైల్ చోరీలకు పాల్పడుతున్నాడనే అనుమానంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఓ వ్యక్తిని నిర్బంధంలోకి తీసుకుని పోలీసులకు అప్పగిస్తే వారు అతడి నుంచి ఒక ఫోన్ కూడా రికవరీ చేయకుండా విడిచిపెట్టారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. కాగా మొబైల్ ఫోన్లు, వ్యాలెట్ల మాయంపై కాంగ్రెస్ నేతలు చివరికి యూపీలోని సరోజిని నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
బస్సులో బంగారు నగల పర్సు చోరీ
పి.గన్నవరం :ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ వద్ద ఉన్న పర్సు చోరీకి గురైంది. ఆ పర్సులో రూ.రెండు లక్షల విలువైన నగలు ఉండటంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మైలా లక్ష్మీప్రసన్నాంబ మనవరాలు జాహ్నవితో కలిసి ఎల్.గన్నవరంలోని తన అల్లుడి ఇంటికి బస్సులో వస్తున్నారు. రావులపాలెం వరకు ఒక బస్సులో వచ్చి అక్కడ దిగి హోటల్లో భోజనం చేసి ఎల్.గన్నవరం బస్సు ఎక్కారు. ఆమె వద్ద ఉన్న బ్యాగ్‌లో పర్సు పెట్టుకున్నారు. ఆ పర్సులో నాలుగు కాసుల నల్లపూసల దండ, నాలుగు గాజులు, రెండు ఉంగరాలు, కొంత నగదు ఉన్నాయి. బస్సు ఎక్కిన తరువాత టికెట్టు తీసేందుకు బ్యాగ్‌లోని పర్సుకోసం వెతగ్గా కనిపించలేదు. అప్పటికే ఆ పర్సు చోరీకి గురైనట్టు గమనించారు. తోటి ప్రయాణికులు అక్కడ వెతికినా ప్రయోజనం లేకపోయింది. బస్సు పి.గన్నవరం రాగానే బస్సులోని ప్రయాణికులను పోలీసులు తనిఖీలు చేశారు. అయినా పర్సు కనిపించలేదు. రావులపాలెంలోని హోటల్‌కు వెళ్లినప్పుడు లేదా బస్సు ఎక్కినప్పుడు ఆగంతకులు పర్సు దొంగిలించారేమోనని అనుమానిస్తున్నారు. ఈ మేరకు పి.గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా చోరీ జరిగింది రావులపాలెంలో కనుక అక్కడ ఫిర్యాదు చేయాలని సూచించడంతో బాధితురాలు రావులపాలెం వెళ్లి ఫిర్యాదు చేశారు. మొత్తం బంగారు నగల విలువ రూ.2లక్షలు ఉంటుందని బాధితురాలు చెప్పారు.