
న్యూఢిల్లీ: సిడ్నీ విమానాశ్రయంలోని ఒక దుకాణంలో పర్సు దొంగిలించారన్న ఆరోపణపై రోహిత్ భాసిన్ అనే పైలట్‌ను సస్పెండ్ చేసినట్టు ఎయిర్ ఇండియా వెల్లడించింది. సిడ్నీ నుంచి న్యూఢిల్లీ వస్తున్న ఏఐ –301 విమానం పైలట్లలో రోహిత్ ఒకరు. ఆయన ఎయిర్ ఇండియా రీజనల్ డైరెక్టర్‌గా కూడా పని చేస్తున్నారు. ఈ నెల 22వ తేదీ ఉదయం విమానం సిడ్నీ నుంచి బయలు దేరే ముందు రోహిత్ ఈ దొంగతనం చేశారని అధికారులు తెలిపారు.
‘విమానాశ్రయంలో ఉన్న దుకాణం నుంచి ఆయన ఒక పర్సు దొంగిలించారని తెలిసింది. దాంతో ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించాం. నిజమని తేలడంతో రోహిత్‌ను సస్పెండ్ చేశాం. అనుమతిలేకుండా ఎయిర్ ఇండియా ప్రాంగణంలోకి ప్రవేశించరాదని కూడా ఆదేశించాం’అని తెలిపారు. విమానం ఢిల్లీలో దిగగానే విమానాశ్రయంలోనే రోహిత్‌కు సస్పెన్షన్ ఉత్తర్వులు అందజేశామని ఆయన చెప్పారు. గుర్తింపు కార్డుని అధికారులకు అప్పగించాలని, తమ లిఖిత పూర్వక అనుమతి లేకుండా రోహిత్ నివాస స్థలమైన కోల్‌కతాను విడిచి వెళ్లరాదని కూడా ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment