sydney
-
టైటిల్‌తో పునరాగమనం.. సిడ్నీ క్లాసిక్ ఓపెన్‌లో విజేతగా నిలిచిన భారత స్క్వాష్ స్టార్ సౌరవ్
న్యూఢిల్లీ: భారత స్క్వాష్ స్టార్ సౌరవ్ ఘోషాల్ తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. గత ఏడాది ఏప్రిల్‌లో ఆట నుంచి వీడ్కోలు తీసుకున్న 38 ఏళ్ల సౌరవ్ ఈ ఏడాది జనవరిలో మళ్లీ రాకెట్ పట్టాడు. ఆదివారం ఆ్రస్టేలియాలో ముగిసిన ఆక్టేన్ ఓపెన్ సిడ్నీ క్లాసిక్ స్క్వాష్ చాలెంజర్ టోర్నీలో సౌరవ్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో ప్రపంచ మాజీ పదో ర్యాంకర్ సౌరవ్ 11–2, 11–6, 11–2తో ఈజిప్ట్ దేశానికి చెందిన అబ్దుల్ రెహమాన్ నాసర్‌పై గెలుపొందాడు. ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్‌లలో కలిపి మొత్తం 12 పతకాలు సాధించిన సౌరవ్... ఈ టోర్నీలో తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ మాత్రమే కోల్పోవడం విశేషం. సెమీఫైనల్లో సౌరవ్ 11–9, 5–11, 11–1, 11–2తో రైస్ డౌలింగ్ (ఆస్ట్రేలియా)పై, క్వార్టర్ ఫైనల్లో 11–6, 11–6, 11–5తో మిన్వూ లీ (దక్షిణ కొరియా)పై, రెండో రౌండ్లో 11–8, 11–2, 11–8తో కిజాన్ (మాల్టా)పై గెలుపొందాడు. రెండో సీడ్‌గా బరిలోకి దిగిన సౌరవ్‌కు తొలి రౌండ్లో ‘బై’ లభించింది. 2003లో ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్ఏ) టూర్లో అరంగేట్రం చేసిన సౌరవ్ ఇప్పటి వరకు 11 పీఎస్ఏ సింగిల్స్ టైటిల్స్ సాధించాడు. 18 టోరీ్నలలో రన్నరప్‌గా నిలిచాడు. -
ఈ ఏడాది ప్రపంచ రూపురేఖలను మార్చే ఆర్కిటెక్చర్ ప్రాజెక్ట్‌లు!
ఎంతోమంది రాజులు రాజ్యాలేలారు.. కాలంతో పాటు కనుమరుగైపోయారు. అయితే వారు కట్టిన కట్టడాలు మాత్రం ఇప్పటికీ వారి ఉనికిని తెలియజేస్తూ ఉన్నాయి. కట్టడాలకు అంత చరిత్ర ఉంది. ఇప్పుడు కూడా కొంత మంది ఆర్కిటెక్చర్లు లేదా సంస్థలు కనీవినీ ఎరుగని కట్టడాలను నిర్మించి అక్కడి ప్రాంతాల రూపురేఖలనే మార్చేస్తున్నాయి. ఇప్పటికే ఇలాంటి నిర్మాణాలు భూమిపై అనేకం ఉన్నప్పటికీ.. ఈ ఏడాది (2025) 11 ఆర్కిటెక్చర్ ప్రాజెక్ట్‌లు సిద్ధమవుతున్నాయి. వాటి గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.న్యూ సిడ్నీ ఫిష్ మార్కెట్ (సిడ్నీ)ప్రపంచంలోని మూడో అతిపెద్ద చేపల మార్కెట్‌గా ప్రసిద్ధి చెందిన 'సిడ్నీ ఫిష్ మార్కెట్' (Sydney Fish Market) మరింత పెద్దదికానుంది. దీనికోసం 3XN ఆర్కిటెక్ట్‌లు, ఆస్ట్రేలియన్ సంస్థ BVN ముందడుగు వేసాయి. లాజిస్టిక్‌లు, ఇతర కార్యకలాపాలు గ్రౌండ్ ఫ్లోర్లో నిర్వహించనున్నారు. పై అంతస్తులలో సందర్శకుల కోసం మార్కెట్ హాల్, వేలం హాలు ఉంటాయి. ఇక్కడ రెస్టారెంట్లు, రిటైలర్లు పాంటూన్లు వంటివన్నీ చూడవచ్చు.గ్రాండ్ రింగ్, ఒసాకా (జపాన్)ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు.. జపాన్ రెండవ నగరమైన ఒసాకాలో నిర్వహించే ఎక్స్పో 2025 కార్యక్రమానికి 28 మిలియన్ల మంది సందర్శకులు హాజరయ్యే అవకాశం ఉంది. వేదిక మధ్య భాగంలో ఉంటుంది. గ్రాండ్ రింగ్ వృత్తాకార చెక్క నిర్మాణంతో పూర్తవుతుంది. 1970లో ఒసాకా మొదటిసారిగా ఎక్స్పోను నిర్వహించినప్పుడు, ఆ సమయంలో అత్యంత ప్రసిద్ధి చెందిన అవాంట్-గార్డ్ జపనీస్ వాస్తుశిల్పులు భారీ స్పేస్-ఫ్రేమ్ పైకప్పును నిర్మించారు. దాదాపు 6,46,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో, ఇది ప్రపంచంలోని అతిపెద్ద చెక్క భవనాలలో ఒకటిగా రికార్డ్ క్రియేట్ చేయనుంది.లైఫ్ అండ్ మైండ్ బిల్డింగ్, ఆక్స్ఫర్డ్ (యూకే)లైఫ్ అండ్ మైండ్ బిల్డింగ్ అనేది యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ చరిత్రలో అతిపెద్ద నిర్మాణ ప్రాజెక్ట్. ఈ నిర్మాణ డిజైన్ సూత్రాలు విద్యాసంబంధమైన వాటికి దగ్గరగా ఉన్నాయి. లోపల ఫ్లెక్సిబుల్ ల్యాబ్ స్పేస్‌లు వివిధ విభాగాల అవసరాలకు అనుగుణంగా ఉంటాయి. ఇది కూడా గొప్ప ఆర్కిటెక్చర్ నిర్మాణాలలో ఒకటిగా ఉంటుంది.కెనడియన్ స్కూల్, చోలులా (మెక్సికో)మెక్సికోలోని చోలులాలోని ఆర్కిటెక్చర్ సంస్థ సోర్‌డో మడలెనోస్ కెనడియన్ స్కూల్ ప్రాజెక్ట్ చేపట్టింది. ప్రకృతిలో మమేకమయ్యే ఈ ప్రాజెక్ట్ ఇతర ప్రాజెక్టులకంటే భిన్నంగా ఉంటుంది. అయితే ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. మెక్సికన్ ఆర్కిటెక్ట్ ఫెర్నాండో సోర్‌డో మడలెనో.. దీనిని పర్యావరణంతో మిళితం చేయడంతో పాటు భవనం కూడా ఆట స్థలంలో భాగమవుతుందని పేర్కొన్నాడు.టెక్కో అంతర్జాతీయ విమానాశ్రయం, నమ్ పెన్ (కంబోడియా)కంబోడియా దాని రాజధాని నమ్ పెన్.. అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత పెద్దది కానుంది. ఇది ఇప్పటి కంటే ఆరు రెట్లు ఎక్కువ మంది సందర్శకులను నిర్వహించగల సామర్థ్యం పొందనుంది. పర్యాటకుల సంఖ్యను పెంచడానికి మాత్రమే కాకుండా.. ప్రాంతీయ విమానయాన కేంద్రంగా మారడానికి దీనిని సిద్ధం చేస్తున్నారు. సిటీ సెంటర్‌కు దక్షిణంగా 12 మైళ్ల దూరంలో ఉన్న ఈ టెర్మినల్ భవనం ఆగ్నేయాసియాలో అతిపెద్దది.సౌత్ స్టేషన్ రీడెవలప్మెంట్, బోస్టన్ (ఇంగ్లాండ్)న్యూ ఇంగ్లాండ్‌లో అత్యంత రద్దీగా ఉండే గ్రౌండ్ ట్రాన్స్పోర్ట్ హబ్ అయిన బోస్టన్ సౌత్ స్టేషన్‌ను కూడా రీడెవలప్మెంట్ చేయనున్నారు. ఇది పూర్తయితే.. బస్సు, రైలు సామర్థ్యం వరుసగా 50 శాతం, 70 శాతం పెరుగుతుంది. 1899 నుంచి అలాగే ఉన్న ఈ నిర్మాణం కొత్త హంగులు సంతరించుకోనుంది.గోథే ఇన్స్టిట్యూట్, డాకర్ (సెనెగల్)"నోబెల్ ఆఫ్ ఆర్కిటెక్చర్"గా ప్రసిద్ధి చెందిన ప్రిట్జ్కర్ ప్రైజ్‌ని.. మొట్టమొదటి ఆఫ్రికన్ విజేత ఫ్రాన్సిస్ కేరే తన స్వదేశీ ఖండంలో నిర్మించిన వాతావరణాన్ని మార్చనున్నారు. 18,300 చదరపు అడుగుల భవనం వక్రతలు చుట్టుపక్కల ఉన్న పందిరి రూపురేఖలను ప్రతిబింబించేలా రూపొందించారు. దీనిని ప్రధానంగా స్థానికంగా లభించే ఇటుకలతో నిర్మించారు. కాగా ఇది ఈ ఏడాది మరింత సుందరంగా మారనుంది.అర్బన్ గ్లెన్, హాంగ్జౌ (చైనా)బీజింగ్‌లోని సీసీటీవీ హెడ్‌క్వార్టర్స్.. చైనాలోని అత్యంత ప్రసిద్ధి చెందిన సమకాలీన భవనంగా మారనుంది. తూర్పు నగరమైన హాంగ్జౌలో దాదాపు 9,00,000 చదరపు అడుగుల ఆఫీసు, హోటల్, విశ్రాంతి స్థలాన్ని కలిగి ఉన్న ఒక జత టవర్లు అర్బన్ గ్లెన్లో అత్యంత అద్భుతమైనవిగా రూపుదిద్దుకోనుంది.రియాద్ మెట్రో, రియాద్ (సౌదీ అరేబియా)2020లలో సౌదీ అరేబియాలో ఈ రియాద్ మెట్రో వెంచర్లను ప్రకటించారు. ఇది క్యూబ్ ఆకారంలో ప్రపంచంలోనే అతిపెద్ద నిర్మాణాలలో ఒకటిగా మారనుంది. ఇది ఆరు లైన్లతో ఉంటుంది. దీని రోజువారీ సామర్థ్యం రోజుకు 3.6 మిలియన్లు. ఈ ప్రాజెక్టు నవంబర్‌లో ప్రారంభమైంది.స్కైపార్క్ బిజినెస్ సెంటర్, లక్సెంబర్గ్ (ఫ్రాన్స్)యూరప్ దేశంలోని కొత్త పబ్లిక్ భవనాలు కనీసం 50 శాతం కలపను కలిగి ఉండాలని అనుకుంటున్నారు. ఇందులో భాగంగానే లక్సెంబర్గ్ రూపుదిద్దుకుంటోంది. ఇది ఖండంలోని అతిపెద్ద హైబ్రిడ్ చెక్క భవనాలలో ఒకటిగా మారనుంది. దీని విస్తీర్ణం 8,44,000 చదరపు అడుగులు. ఇందులో సుమారు 5,42,000 క్యూబిక్ అడుగులు కలపతో మిర్మించనున్నారు. ఈ భవనం, మొదటి దశ ఫిబ్రవరితో పూర్తవుతుంది.డాంజియాంగ్ బ్రిడ్జ్, తైపీ (తైవాన్)డాన్జియాంగ్ బ్రిడ్జ్ దాదాపు తొమ్మిదేళ్లుగా, దివంగత జహా హదీద్ సంస్థ తన వారసత్వాన్ని కొనసాగించింది. 3,018 అడుగుల పొడవైన నిర్మాణం తైవాన్ రాజధాని తైపీ గుండా ప్రవహించే తమ్సుయ్ నది ముఖద్వారం మీదుగా నాలుగు ప్రధాన రహదారులను కలుపుతుంది. మొత్తం నిర్మాణం కేవలం ఒకే కాంక్రీట్ మాస్ట్‌తో ఉంటుంది. ఇది పూర్తయిన తరువాత ప్రపంచంలోనే అతి పొడవైన సింగిల్-మాస్ట్ అసమాన కేబుల్-స్టేడ్ బ్రిడ్జ్ అవుతుంది. -
World Architecture Festival 2024: స్కూలు భవనం.. బహు బాగుంది
గది అంతటా సూర్యకాంతి ప్రసరించేలా రంపం పళ్లను ఆకారంలో రూఫ్.. ఎటు చూసినా పచ్చదనంతో కళకళలాడే ఆవరణలు.. పెద్ద బాస్కెట్‌బాల్ కోర్టు.. అందమైన కమ్యూనిటీ గార్డెన్.. ఓపెన్ ఎయిర్ టెర్రస్.. లోపలి వ్యక్తుల ప్రైవసీకి భంగం కలగకుండా చుట్టూ వంపులు తిరిగిన మెటల్ స్క్రీన్స్.. ఇంకా మరెన్నో ప్రత్యేకతలు. ఇదేదో రియల్ ఎస్టేట్ సంస్థ ప్రకటన కాదు! ఓ స్కూల్ భవన విశేషాలివి. దాంతో ఆకాశహర్మ్యాలను, మ్యూజియాలను, అందమైన విమానాశ్రయాలను కూడా తలదన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ భవనంగా ఎంపికైంది. సింగపూర్‌లో జరిగిన ప్రపంచ ఆర్కిటెక్చర్ ఫెస్టివల్ (డబ్ల్యూఏఎఫ్)లో ఈ ఘనత సాధించింది. దీని పేరు డార్లింగ్టన్ పబ్లిక్ స్కూల్. సిడ్నీలోని చిపండేల్లో ఉంది. సాంస్కృతిక పరిరక్షణ దక్షిణ సిడ్నీ ప్రాంతంలో ఉన్న ఈ స్కూలు నిజానికి ఆ్రస్టేలియా మూలవాసులతో బలమైన సంబంధాలున్న కమ్యూనిటీ పాఠశాల. 1970 నాటి పాత భవనం శిథిలావస్థకు చేరడంతో కొత్తది నిర్మించాలనుకున్నారు. ఎఫ్‌జెడ్‌సీ స్టూడియో ఆ బాధ్యతలు తీసుకుంది. మూలవాసులతో బంధాన్ని ప్రతిబింబించేలా పాఠశాల హాల్, ఎంట్రన్స్ రిసెప్షన్, తరగతి గదుల్లో స్వదేశీ కళను చిత్రీకరించి సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించారు. పాత పాఠశాల గోడలపై ఉన్న ఆదిమ కుడ్యచిత్రాలను కొత్త భవనంలో పుననర్న్మించారు. ఆ స్ఫూర్తితోపాటు కొత్త, సమకాలీన అభ్యాస వాతావరణాన్ని సృష్టించారు. ప్రీసూ్కల్, కిండర్ గార్టెన్, ప్రైమరీ స్కూల్‌తో 500 మందికి పైగా విద్యార్థుల సామర్థ్యం ఈ కొత్త క్యాంపస్ సొంతం.ఆరోగ్యం, ఆహ్లాదం ప్రాధమిక పాఠశాల భవనంలో కాంతికోసం ప్రత్యేకంగా విద్యుత్ అక్కరలేదు. ప్రత్యేకమైన టెర్రస్ ప్రతి గదికీ సూర్యకాంతిని ప్రసరింపజేస్తుంది. అది బాగా వేడిగా కూడా ఉండదు. మృదువైన కాంతి స్థానిక కాసురినా చెట్ల ఆకుల మధ్య నుంచి జాలువారుతున్నట్లుగా ఉంటుంది. ఈ సహజకాంతి విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పాఠశాల భవనానికి అనుసంధానించి ఉన్న కమ్యూనిటీ హాల్, లైబ్రరీ విద్యార్థులను సమాజంలో భాగం చేస్తున్నాయి.175 మంది మనసు గెలుచుకుని.. క్రీడలు, రవాణా, ఆరోగ్యం, గృహనిర్మాణం వంటి 18 కేటగిరీల్లో డబ్ల్యూఏఎఫ్ అవార్డులు ఇస్తుంది. 175 మంది ఫెస్టివల్ డెలిగేట్ల ప్యానెల్ అన్ని కేటగిరీలకు చెందిన విజేతల నుంచి ‘వరల్డ్ బిల్డింగ్ ఆఫ్ ది ఇయర్’ ను ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది నేషనల్ స్టార్ అబ్జర్వేటరీ ఆఫ్ సైప్రస్, పోలండ్‌లోని ప్రఖ్యాత బస్ స్టేషన్, టర్కీలోని సోలార్ పవర్ ప్లాంట్ వంటి 220 ప్రాజెక్టులు అవార్డు కోసం పోటీపడ్డాయి. వాటన్నింటినీ తలదన్ని ఒక చిన్న పాఠశాల నెగ్గుకురావడం అసాధారణమని ఎఫ్జేసీ స్టూడియో అసోసియేట్ అలెస్సాండ్రో రోసీ అన్నారు. భవనంలో సమయాన్ని గడిపే పిల్లలే నిజమైన విజేతలని అభిప్రాయపడ్డారు. గతేడాది కూడా చైనాలోని ఓ బోర్డింగ్ స్కూల్ ఈ టైటిల్‌ను గెలుచుకోవడం విశేషం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పొడవాటి రోడ్డు సొరంగంగా రికార్డు..!
ఇది ప్రపంచంలోనే పొడవాటి రోడ్డు సొరంగం. ఆస్ట్రేలియాలోన సిడ్నీ నగరంలో ఉన్న ఈ సొరంగం పొడవు ఏకంగా 26 కిలోమీటర్లు. ఈ సొరంగ రహదారి పేరు ‘వెస్ట్ కనెక్స్’ ఆస్ట్రేలియా ఫెడరల్ ప్రభుత్వం, న్యూసౌత్ వేల్స్ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడిగా ఈ సొరంగ నిర్మాణం చేపట్టి, గత ఏడాది నవంబరు 26 నాటికి దీనిని పూర్తి చేశాయి. ఉభయ ప్రభుత్వాలూ హోమ్‌బుష్–కింగ్స్గ్రోవ్ల మధ్య చేపట్టిన 33 కిలోమీటర్ల మోటారు రహదారిలో భాగంగా ఈ సొరంగాన్ని నిర్మించాయి. ఈ రహదారి నిర్మాణం పనులు 2016 డిసెంబర్ 20న ప్రారంభించగా, సొరంగం సహా మొత్తం నిర్మాణం పూర్తి కావడానికి దాదాపు ఏడేళ్లు పట్టింది. దీని నిర్మాణానికి 4500 కోట్ల ఆస్ట్రేలియన్ డాలర్ల ఖర్చు (రూ.2.60 లక్షల కోట్లు) జరిగింది. దీని నిర్మాణం పూర్తయిన తర్వాత ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పొడవాటి సొరంగ రహదారిగా రికార్డులకెక్కింది.(చదవండి: మనం ధరించే డ్రెస్‌కి ఇంత పవర్ ఉంటుందా..?) -
సిడ్నీలో ఘనంగా పుస్తక ఆవిష్కరణ..!
గురు పౌర్ణమి జూలై 21 వ తేదీ వినూత్నంగా సిడ్నీ మహానగరంలో తొలి పుస్తక ఆవిష్కరణ మహోత్సవం. ఒకటి కాదు, రెండు పుస్తకాలు. సిడ్నీ తెలుగింటి ఆడపడుచుగా ఆస్ట్రేలియా లోనే మొదటి రచయిత్రి కథా సంపుటి 'నీ జీవితం నీ చేతిలో' 21 కథల సమాహారం. పాఠకులకు సందేశాన్ని, వినోదాన్ని, కనువిప్పును, స్ఫూర్తి ని నింపే కథలు అనడంలో సందేహం లేదు. ప్రతి ఒక్కరూ చేతిలోకి తీసుకోవలసినదే 'నీ జీవితం నీ చేతిలో'.రెండో పుస్తకం 'రంగానందలహరి' శ్రీ పెయ్యేటి రంగారావు గారు అందిస్తున్న94 భక్తిగీతాలు, భావ గీతాలు ప్రతి ఇంటిలో ఉండవలసిన భాషా కుసుమాలు. లండన్ డర్రీ నైబర్ హుడ్ కమ్యూనిటీ సెంటర్ లో మధ్యాహ్నం 2.30 గంటలకు సకల కళా దర్శిని సిడ్నీ, ఆస్ట్రేలియా వారు నిర్వహించిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ పెయ్యేటి రంగారావు గారు రచించిన పాటలు, పద్యాలు, భావగీతాలు కళాకారులు శ్రీ వద్దిపర్తి శ్రీనివాస్ గారు, చిన్నారులు ఆశ్రిత గరగ, శ్రిత భాగవతుల ఆలపించారు. మయూర అకాడమీ గురువులు శ్రీ రమణ కరణం గారు కొరియోగ్రఫీ, డా. పద్మ మల్లెల సంగీతం సమకూర్చిన శ్రీ పెయ్యేటి రంగారావుగారి శ్రీ సీతా రాముల పరిణయ వేడుక గీతాన్ని అనిరుధ్ కరణం, లోహిత గొళ్లపల్లి కూచిపూడి నృత్యం చేసి అందరి ప్రశంసలు అందుకున్నారు.నృత్యాలయ డాన్స్ టెంపుల్ నుంచి విద్యార్థులు భరతనాట్యం ఫ్యూజన్ నృత్యం తో అందరినీ అలరించారు. లాలిత్య, సౌమ్య, సంతోషి గార్లు గణేశ, సరస్వతీ ప్రార్థన తో నృత్య అభినయంతో కార్యక్రమానికి శుభారంభం చేసారు. కార్యక్రమానికి సుశ్మిత విన్నకోట వ్యాఖ్యాత గా వ్యవహరించారు.సకల కళా దర్శిని అధ్యక్షురాలు శ్రీమతి విజయ గొల్లపూడి మాట్లాడుతూ, జూలై 2022 వ సంవత్సరంలో పూజ్య గురువులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి ఆశీస్సులతో సకల కళా దర్శిని, సిడ్నీ, ఆస్ట్రేలియా సకల కళలకు వేదికగా నెలకొల్పటం జరిగింది అన్నారు. ఇంకా ఈ సకల కళాదర్శిని వేదికపై గత ఫిబ్రవరిలో ప్రముఖ లలిత సంగీత గాయని శ్రీమతి వేదవతి ప్రభాకర్ గారి తో, పేరొందిన లలిత సంగీత కళాకారులతో గాన విభావరి నిర్వహించాము. ప్రస్తుతం మన సనాతన ధర్మ ప్రచారం లో భాగంగా భగవద్గీత పారాయణ నెల నెల ఒక అధ్యాయం చొప్పున ప్రపంచ వ్యాప్తంగా నెల నెల నిర్వహించటము జరుగుతోంది. ఇప్పటివరకు ఐదు అధ్యాయాలు జయప్రదంగా జరుపుకున్నాము.వచ్చే ఆదివారం ఆరవ అధ్యాయ పారాయణ జరుపుకోబోతున్నాము.ఈ సకల కళా దర్శిని నెల కొల్పటంలో ముఖ్య ఉద్దేశ్యం మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, సాహిత్యం ఎంతో అమూల్యమైనవి, తరగని విలువైన సంపద. ఇది తర తరాలకు అనంత వాహిని లా ప్రవహించేలా అందచేయటం బాధ్యతగా భావించాను. అమ్మ భాషతో అనుబంధం ఉండాలి. మన తెలుగునాట అద్భుతమైన కళాకారులు ఉన్నారు. వారి లోని కళా నైపుణ్యాన్ని గుర్తిస్తూ, ప్రపంచానికి తెలియచేయాలి. అలాగే స్థానికంగా ఉన్న చిన్నారులు, కళాకారులకు కూడా ఈ సకల కళా దర్శిని ఒక చక్కని వేదికగా నిలవాలి అనే అకాంక్ష. ముఖ్యంగా సాహిత్యం, మన తెలుగు భాషా, సంస్కృతులు పరిమళాలు ఎల్లెడలా వ్యాపించాలి. మన మాతృభూమికి దూరంగా ఉంటున్నాము అన్న వెలితి లేకుండా, ఎక్కడ ఉన్నా తెలుగు వారమే, ఖండ ఖండాతరాలలో మన తెలుగు ఉనికిని, ప్రతిభా పాటవాలను చాటుకుంటు, అటకెక్కకుండా అవకాశాలను ఏర్పరుచుకోవడమే ముఖ్య ఆశయం అని సకల కళా దర్శిని సంస్థ లక్ష్యాలను విశదీకరించారు.విజయ మాధవి గొల్లపూడి రచించిన కథల సంపుటి 21 కథలు, జూలై 21 వ తేదీన పవిత్ర గురు పౌర్ణమి రోజున ‘టేస్ట్ ఆఫ్ ఇండియా’ రెస్టారెంట్ గ్రూప్ అధినేత ‘రాజ్ వెంకట రమణ’ చేతులతో పుస్తక ఆవిష్కరణ చేసారు.‘నీ జీవితం నీ చేతిలో’ కథల సంపుటి కి ప్రముఖ చిత్ర కళాకారులు శ్రీ కూచి సాయి శంకర్ గారు ముఖ చిత్రాన్ని అందించారు.పుస్తకం లోని గురువచనం ముందుమాటగా ‘ప్రియమైననీకు’ లేఖారూప కథ తీపి జ్ఞాపకాల స్నేహబంధాన్ని వివరించిన తీరు మధురంగా ఉంది. ఇలా ఒక్కో కథలో ఒక్కోప్రత్యేకత, సున్నితమైన భావాలు, మానవీయత, విలువలు కలిగిన జీవితం లోని పరమార్థం…వంటి సార్వకాలీన, సార్వజనీన విషయాలను మృదువైన, శక్తివంతమైన శైలిలో, హృదయానికి హత్తుకునేలా రచించిన రచయిత్రి సంస్కారానికి, ప్రతిభకి అభినందనలు” అని బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి మాటలను చదివి వినిపించారు సుశ్మిత.శ్రీమతి చావలి విజయ ‘నీ జీవితం నీ చేతిలో’ 21 కథల సారాంసాన్ని, రచయిత్రి శైలిని వివరిస్తూ, చక్కని సమీక్ష ను అందచేసారు. రచయిత్రి విజయ గొల్లపూడి గారికి సీస, తేటగీతి పద్యమాలికలతో శ్రీమతి విజయ చావలి గారు అభినందన మందారమాలను అందచేశారు. గతంలో తెలుగు పలుకు పత్రికకు 15 ఏళ్ళు సంపాదకునిగా వ్యవహరించిన శ్రీ నారాయణ రెడ్డి గారు కూడా ‘నీ జీవితం నీ చేతిలో’ కథల సంపుటిపై పుస్తక సమీక్ష చేశారు.కవి, రచయిత శ్రీ పెయ్యేటి రంగారావు గారు రచించిన ‘రంగానందలహరి’ పుస్తకాన్ని ఎసెట్ పాయింట్ హోమ్స్ సంస్థ అధినేత రామ్ వేల్ గారు ఆవిష్కరించారు.రంగానందలహరి పుస్తకానికి ప్రణవి గొల్లపూడి ముఖచిత్రాన్ని అందించారు. రంగానందలహరి లోని కావ్య గీతికలను తెలుగు పండితులు శ్రీ తూములూరి శాస్త్రి గారు సమీక్ష చేసారు. తెలుగు భాషాభిమానులను ఈ పుస్తకం అందరినీ చదివింపచేస్తుంది. రాకేందు శేఖరా, ఏడుకొండల ఏలికా రంగానందలహరి లో రచయిత వాడిన పదప్రయోగాలపై శ్రీ పెయ్యేటి రంగారావు గారిని ప్రశంసించారు.శ్రీ తూములూరి శాస్త్రి గారు రంగారావుగారికి అభినందనలతో ప్రశంసా పత్రాన్ని అందించారు.గీ. తెలుగు పదముల సొగసులు తీయదనము వెలుగు జిలుగులు ఆనంద వీచికలతొ రంగరించిన కవితా తరంగ రంగ విహరి! ఈ రంగ యానంద లహరి లహరి! సీ. భక్తిభావము నించ పదకవితాపితా మహుడు కొండొకచోట మదిని నిల్చు సందేశములు పంచ సందోహమెంచగా గురజాడ జాడలే గుర్తు తెచ్చు మానవతావాద మహితోక్తు లందించ నాయని నండూరి నడకలెచ్చు భావకవిత్వంపు పరువాలు పండించ దేవులపల్లియే దీప్తినిచ్చుగీ. భక్తి ఆసక్తి సంసక్తి రక్తి యుక్తి నించి మించిన సాహితీ నియత శక్తి భావ విద్వత్ స్వభావ ప్రభావ మంత రంగరించిరి కవితల రంగరాయ!క. తియ్యని కవితా విరులతొ నెయ్యము సేయంగ మిగుల నేర్పరులౌగా పెయ్యేటి రంగరాయా! వెయ్యారుల వందనములు వినతులు సేతున్! వేద పండితులు శ్రీ నేతి రామకృష్ణ గారు రంగానందలహరి కావ్యగీతికలను సమీక్ష చేసారు. వేదికపై అలంకరించిన రచయితలకు, పండితులకు పుష్పగుచ్ఛం, శాలువాలతో సత్కరించారు.కార్యక్రమానికి విచ్చేసిన డా. చెన్నప్రగడ మూర్తి, డా. జ్యోతి, సిడ్నీ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ ఓలేటి మూర్తి గారు, శ్రీ పోతుకూచి మూర్తిగారు కళాకరులందరికీ ప్రశంసా పత్రాలను అందచేసారు. -
ఖరీదైన బాల్కనీ.. అద్దె ఎంత అని మాత్రం అడగకండి!
దేశం ఏదైనా, ప్రాంతం ఏదైనా అద్దె ఇంటి బాధలు అందరివీ ఒకటే. ఇక ఖరీదైన ఏరియాలో అద్దె ఇల్లు అంటే ఇక చెప్పాల్సిన పనే లేదు. ఈ కష్టాల కత వేరే ఉంటది. కానీ ఖరీదైన బాల్కనీ అద్దె గురించి ఎపుడైనా విన్నారా? ఆస్ట్రేలియాలోని సిడ్నీలో పట్టుమని పది అడుగులు కూడా ఉండని ఒక బాల్కనీ అద్దె వింటే షాకవ్వాల్సిందే. స్టోరీ ఏంటంటే..ఒక విచిత్రమైన ఫేస్బుక్ ప్రకటన ఇది. సిడ్నీలోని ఒక ఇంట్లో ఒక బాల్కనీ అద్దెకు ఉందని ఒక యజమాని ప్రకటించాడు. ఒక మనిషికి ఉండేందుకు అవకాశం. దీని అద్దె నెలకు 969 డాలర్లు (రూ. 81,003)అంటూ ఫేస్బుక్ మార్కెట్‌ప్లేస్ లిస్టింగ్‌లో వెల్లడించాడు. ఇందులో బెడ్, అద్దం కూడా ఉంటుంది. మంచి వెలుతురు, ఎటాచ్డ్గా ఉన్న గదిలోపల బాత్రూమ్ వాడుకోవచ్చని, ఇక కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు అదనమని చెప్పుకొచ్చాడు. దీంతో ఈ ప్రకటన తెగ వైరల్ అవుతోంది.దీంతో నెటిజన్లు విభిన్న రకాలుగా స్పందించారు. బాల్కనీకి ఇంత అద్దా? ఈ బాల్కనీని ఎంచుకునే వాళ్లుంటారా అని మరొకరు వ్యాఖ్యానించారు. కాగా ఇటీవలికాలంలో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో గృహాల అద్దె ధరలలో గణనీయమైన పెరుగుదల నమోద వుతోంది. తాజా లెక్కల ప్రకారం 2024 జూన్ త్రైమాసికంలో సిడ్నీ సగటు అద్దె వారానికి 750 డాలర్ల మేర రికార్డు స్థాయిలో ఉంది.అద్దె ఇళ్లకు పోటీ నేపత్యంలో ఆక్షన్ ద్వారా అద్దెను కేటయిస్తున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. -
ఆస్ట్రేలియాలో తెలుగు వ్యక్తి అనుమానాస్పద మృతి
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి అనుమానాస్పదం మరణం కలకలం రేపింది. షాద్ నగర్‌కి చెందిన అరటి అరవింద్ యాదవ్ అయిదు రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. మిస్సింగ్ కేసు కూడా నమోదైంది. ఈ క్రమంలో అరవింద్ సముద్రంలో శవమై తేలడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.ఇంటినుంచి వెళ్లిన అరవింద్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. సోమవారం అతని మృతదేహం సముద్రంలో కనిపించింది. సిడ్నీలోని సముద్ర తీరానికి కొద్ది దూరంలో అరవింద్ కారును కూడా గుర్తించిన పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. అతనిది హత్యా, ఆత్మహత్యా అనేకోణంలో ఆరాతీస్తున్నారు. కుటుంబ సమస్యల కారణంగానే అరవింద్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది. ఆస్ట్రేలియా పోలీసులు మృతుడి స్నేహితులు, సహా ఉద్యోగులను విచారిస్తున్నారు. అతని భార్య ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంది.కాగా ఉద్యోగం నిమిత్తం 12 ఏళ్లుగా సిడ్నీ లో స్థిరపడ్డాడు అరవింద్ 18నెలల క్రితం వివాహం చేసుకున్న అరవింద్ భార్య, తల్లితో కలిసి ఆస్ట్రేలియా వెళ్లాడు. ఆరు రోజుల క్రితమే తల్లి షాద్‌నగర్‌కు తిరిగి వచ్చింది. ఇంతలోనే అరవింద్ కన్నుమూయడంతో మృతుడి కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.2006 ఏప్రిల్ 7న ఏలూరులో జరిగిన లారీ ప్రమాదంలో బీజేపీ నాయకుడు, అరవింద్ తండ్రి ఆరటి కృష్ణ యాదవ్ మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. కృష్ణ భార్య, అరవింద్ తల్లి ఉషారాణి షాద్‌నగర్‌లో నివసిస్తున్నారు. భర్త మరణం తరువాత ఒక్కగానొక్కకొడుకును పెంచి పెద్ద చేసింది. పెళ్లి చేసి అంతా బావుంది అనుకుంటున్న సమయంలోనే ఇపుడు అరవింద్ కూడా దూరం కావడంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. -
Sydney Mall Attack మహిళలపై అంత పగ ఎందుకు? ఎవరీ జోయెల్?
సిడ్నీ వెస్ట్‌ఫీల్డ్ షాపింగ్ మాల్లో మారణహోం సృష్టించిన నిందితుడిని జోయెల్ కౌచీగా పోలీసులు గుర్తించారు. మహిళలే లక్ష్యంగా దాడికి పాల్పడ్డాడని పోలీసులు సోమవారం వెల్లడించారు. జోయెల్ మొత్తం ఆరుగురిని పొడిచి చంపగా అందులో ఐదుగురు మహిళలే ఉన్నారని చెప్పారు. అలాగే ఈ దుర్మార్గుడి దాడిలో గాయపడిన 12 మందిలో మహిళలే ఎక్కువ ఉండటం గమనార్హం. దీనిపైనే పోలీసులు ఇపుడు దృష్టి సారించారు. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న 40 ఏళ్ల వ్యక్తి మాల్లో పెద్ద కత్తితో తిరుగుతూ అరగంట పాటు హల్ చల్ చేశాడని, ఈ దాడిలో మహిళల్నే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నాడనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని ఆస్ట్రేలియా పోలీసులు సోమవారం తెలిపారు. బాధితులను చైనాకు చెందిన విద్యార్థిని యియువాన్ చెంగ్ గుర్తించారు. మిగిలిన వాళ్లలో ఒక డిజైనర్, ఒక స్వచ్ఛంద సేవకురాలు, ఒక పారిశ్రామికవేత్త కుమార్తె, 9 నెలల పసిబిడ్డ, ఆమె తల్లితోపాటు, పాకిస్థాన్‌కు చెందిన 30 ఏళ్ల సెక్యూరిటీ గార్డు ఫరాజ్ తాహిర్గా గుర్తించారు. Joel Cauchi’s father: “This crime should never have happened.” @6NewsAU pic.twitter.com/zNEoAveb4E — Roman Mackinnon (@RomanMackinnon6) April 15, 2024 కాబోయే భర్తతో మాట్లాడుతూ ఉండగా ఆరో బాధితురాలు, చైనా విద్యార్థిని తన కాబోయే భర్తతో ఫోన్లో మాట్లాడుతుండగా దుండగుడు కాల్పులు జరిపాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం విషాదం. Sydney is a city reeling, in mourning, and desperate for answers to explain Joel Cauchi's heinous knife attack at Bondi Junction. #9News LATEST: https://t.co/BaBiRjwTXk pic.twitter.com/Vd453KKrBU — 9News Sydney (@9NewsSyd) April 15, 2024 ఎవరీ జోయెల్ కౌచి? ♦ జోయెల్ కౌచి సోషల్ మీడియా ప్రొఫైల్ ప్రకారం, క్వీన్స్‌లాండ్‌లోని బ్రిస్బేన్ సమీపంలోని టూవూంబా నుండి వచ్చాడు. స్థానిక ఉన్నత పాఠశాల , విశ్వవిద్యాలయంలో చదివాడు. ♦ జోయెల్ కౌచి తన కుడి చేతిపై పలు రంగుల్లో డ్రాగన్ టాటూ ఉంది. ఇదే అతణ్ణి గుర్తించడంలో కీలకంగా మారింది. ♦ టీనేజ్‌నుంచి మానసిక ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నాడని కుటుంబం చెబుతోంది. ♦ అడపాదడపా మెసేజ్‌లద్వారా మాత్రమే టచ్ లో ఉండేవాడని అతని తల్లిదండ్రులు మీడియాకు చెప్పారు. ♦ దాడికి ఒక నెల ముందు, జోయెల్ కౌచి సిడ్నీకి వెళ్లి ఒక రూం అద్దెకు తీసుకున్నాడు. అక్కడ జోయెల్ వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
సిడ్నీ మాల్లో కత్తిపోట్లు.. అయిదుగురు మృతి
ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీలో గురువారం దారుణం చోటుచేసుకుంది. నగరంలోని బిజీగా ఉంటే ఓ షాపింగ్‌మాల్‌లో కాల్పులు, కత్తిపోట్ల దాడి జరిగింది. వెస్ట్‌ఫీల్డ్ బోండీ జంక్షన్‌లోని మాల్‌లోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తి కత్తితో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో అయిదుగురు పౌరులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన స్థానిక సమయం ప్రకారం శనివారం మధ్యాహ్నం 3. 40 గంటలకు(భారత కాలమాన ప్రకారం 12.30PM ) వెలుగు చూసింది. సమాచారం అందుకున్న పోలీసులు మాల్‌లోకి ప్రవేశించి నిందితుడిని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మహిళా పోలీసు జరిపిన కాల్పుల్లో నిందితుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. కత్తిపోట్లకు గురై మరో ఎనిమిది మంది గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషయంగా ఉన్నట్లు తెలుస్తోంది. కత్తిపోట్లు, కాల్పులతో దద్దరిల్లిన ఆ మాల్ నుంచి వందల సంఖ్యలో జనం పరుగులు తీసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. UPDATE: Sydney Terrorist Attack It was an 'ISLAMIC TERROR ATTACK' It's 100% confirm now. Terrorist was Pro - Palestine and Hezbollah. This Jihadi stabbed a 9 month old too. Inhuman cult !! pic.twitter.com/8Enj83dOch — Sunanda Roy 👑 (@SaffronSunanda) April 13, 2024 ప్రస్తుతం ఆ ప్రాంతంలో పరిస్థితి భయానకంగానే ఉంది. మాల్లో ఉన్న వారిని అధికారులు బయటకు పంపించారు. అటువైపు ఎవరూ రావొద్దని హెచ్చరించారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఈ వీడియోల్లో ఒక వ్యక్తి పెద్ద కత్తితో మాల్లో తిరగడం కనిపిస్తోంది. గాయపడిన వ్యక్తులు నేలపై పడిపోయారు. వారిలో తల్లీబిడ్డ ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వారి రక్తస్రావాన్ని ఆపేందుకు దుకాణంలోని దుస్తుల్ని ఉపయోగించినట్లు చెప్పారు. అయితే దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. Officer's heroic actions at Sydney mall saved lives. Deserves highest honor, like Cross of Valour, for bravery and selflessness. #Sydney #bondi #Australia pic.twitter.com/ycdiQlom4u — Rudra 🔱 (@invincible39) April 13, 2024 -
సిడ్నీలో ఘనంగా 2024 న్యూ ఇయర్ వేడుకలు (ఫొటోలు)
-
10 ఏళ్లకే కంపెనీ సీఈవో.. 12 ఏళ్లకే రిటైర్మెంట్.. నమ్మడం లేదా!
అసలు ఎవరైనా ఎన్నేళ్ల వయసులో రిటైర్ అవుతారు.. 58, 60, 65, 70.. మరి ఓ కంపెనీ సీఈవో 12 ఏళ్ల వయసులో రిటైర్ అయితేనో! అదీ తన బర్త్‌డే రోజునే ఆ పదవి నుంచి దిగిపోవాలని నిర్ణయించుకుంటేనో!! అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు కదూ.. హోంవర్కు చేయాల్సిన వయసులో ఆఫీసు వర్కు చేయడం ఏమిటి? అనేదేగా మీ డౌటు. విషయం తెలియా లంటే.. పదండి మరి ఆస్ట్రేలియాకు.. ఎందుకంటే.. పిక్సీ ఉండేది అక్కడే మరి.. పిక్సీ కర్టిస్.. చిన్నప్పటి నుంచే చురుకైన పిల్ల.. బుర్రలో బోలెడన్ని ప్లాన్లు. దీనికి ఆమె తల్లి రాక్సీ జెసెన్కో ప్రోత్సాహం తోడైంది. రాక్సీ సిడ్నీలోని ఓ పీఆర్ కంపెనీ డైరెక్టర్. పిక్సీ చిన్న వయసులోనే పలు కంపెనీల ఉత్పత్తులకు మోడల్‌గా పనిచేసింది. పిక్సిస్ బౌ పేరిట హెయిర్ బౌస్ను అమ్మింది కూడా. అయితే, కరోనా సమయంలో తన దశ తిరిగింది. 2021లో తల్లితో కలిసి పిక్సీస్ ఫిడ్జెట్స్ పేరిట ఆట బొమ్మల ఆన్లైన్ స్టోర్‌ను ప్రారంభించింది. అది సక్సెస్ కావడంతో ఆస్ట్రేలియాలో పిక్సీ యంగెస్ట్ ఆంట్రప్రెన్యూర్‌గా మారిపోయింది. ఆమె నెల సంపాదన రూ. కోటికి పైనే. తనకు సొంత బెంజ్ కారు కూడా ఉంది. ఇన్నాళ్లూ ఆఫీసు వర్కుతో బిజీబిజీగా గడిపిన పిక్సీ ఇప్పుడు స్కూల్ హోంవర్కు మీద దృష్టి పెట్టాలని నిర్ణయించుకుంది. తల్లి కూడా అదే చెప్పడంతో తన 12వ బర్త్‌డే రోజున రిటైర్ కానుంది. దీనికితోడు పిక్సీ కుటుంబం ఆమె తండ్రి కర్టిస్ పనిచేస్తున్న సింగపూర్‌కు షిఫ్ట్ అవ్వాలని నిర్ణయించుకోవడంతో గత శనివారం ప్రీ బర్త్‌డే కం రిటైర్మెంట్ పార్టీని కూడా ఇచ్చారు. సింగపూర్ థీమ్‌తో సాగిన ఈ పార్టీకి వచ్చినవాళ్లందరికీ రూ.4,112 విలువ చేసే స్కిన్‌కేర్ ఉత్పత్తులతో కూడిన బహుమతిని కూడా ఇచ్చారు. ఈ గిఫ్ట్‌ను ఆస్ట్రేలియా లగ్జరీ బ్యూటీ బ్రాండ్ ఎంకోబ్యూటీ స్పాన్సర్ చేసింది. అదండీ.. 12 ఏళ్లకే తన బర్త్‌డే రోజున రిటైర్ అవుతున్న ఓ సీఈవో సంగతి.. ఇంతకీ పిక్సీ బర్త్‌డే కం రిటైర్మెంట్ డేట్ చెప్పలేదు కదూ.. ఆగస్టు 16. -
పెళ్ళిలో అపశ్రుతి.. భర్తను కాకుండా మామను పెళ్లాడిన వధువు..
సిడ్నీ: ఆస్ట్రేలియాకు చెందిన పాపులర్ రేడియో షో ఫిట్జీ అండ్ విప్పా విత్ కేట్ రిచీలో ఒక మహిళ తన వివాహంలో జరిగిన పెద్ద పొరపాటు గురించి చెప్పుకొచ్చింది. పెళ్ళిలో తన భర్త సంతకం చెయ్యాల్సిన చోట మామగారు సంతకం పెట్టడంతో మామగారితోనే వివాహమైనట్టు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ వారు సర్టిఫికెట్ ఇచ్చారని, ప్రస్తుతం తనకు ఇద్దరు భర్తలని చెప్పుకొచ్చింది. ఆస్ట్రేలియా ప్రఖ్యాత బ్రేక్ ఫాస్ట్ రేడియో షో ఫిట్జీ అండ్ విప్పా విత్ కేట్ రిచీ కార్యక్రమంలో ఆరోజు ఫోన్ చేసిన వారందరినీ తమ జీవితంలో జరిగిన పేద పొరపాట్లగురించి చెప్పమని అడిగారు వ్యాఖ్యాత. దీంతో కిమ్ అనే ఒక మహిళ తాన్ పెళ్ళిలో జరిగిన విచిత్రమైన సంఘటన గురించి చెప్పుకొచ్చింది. నా పెళ్ళికి సాక్షులుగా సంతకం చేయడానికి మా మామగారు అత్తగారు తప్ప ఇంకెవ్వరూ లేరు. సరిగ్గా పెళ్లి సమయానికి మా అత్తగారు మామగారితో పాటు సాక్షి సంతకం చెయ్యమని నా భర్తను కోరారు. దీంతో వారిద్దరూ ఒకే లైన్ సంతకం చేశారు. తీరా సర్టిఫికెట్లో చూస్తే వధువు అని ఉన్న చోట నా సంతకం ఉంటే వరుడు అని ఉన్నచోట మాత్రం నా భర్తతో పాటు మా మామగారి పేరు కూడా ఉంది. ఆ సర్టిఫికెట్ ను ఇంకా మార్చకుండా అలాగే భద్రం చేసుకున్నానని తెలిపింది. ఇది కూడా చదవండి: కిమ్ జోంగ్ చెరలో అమెరికా సైనికుడు.. బయటపడేనా..? -
అతడు సముద్రాన్ని జయించాడు.. 60 రోజుల పాటు ఒక్కడే..
సిడ్నీ: ఆస్ట్రేలియాకు చెందిన ఓ నావికుడు రోజుల తరబడి సముద్రంలో ఒంటరిగా గడిపాడు. తన పడవ ప్రయాణం మధ్యలో చిక్కుకుపోవడంతో సముద్రంలో దిక్కుతోచని స్థితిలో గుండెధైర్యంతో కాలాన్ని నెట్టుకొచ్చాడు. పడవలో అతనికి తోడుగా అతని పెంపుడు కుక్క మాత్రమే ఉంది. రెండు నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మెక్సికో ఓడ ఒకటి అటుగా రావడంతో వారు అతనిని గుర్తించి రక్షించారు. ఆస్ట్రేలియా నావికుడు టిమ్ షాడోక్ తన పెంపుడు కుక్క బెల్లాతో కలిసి మెక్సికో తీరంలోని లా పాజ్ నగరం నుండి 6000 కిలోమీటర్లు ప్రయాణించి ఫ్రెంచ్ పాలినీషియా చేరుకునేందుకు ప్రయాణమయ్యాడు. కానీ దురదృష్టకర పరిస్థితుల్లో పడవలో సాంకేతిక లోపం తలెత్తి టిమ్ పసిఫిక్ మహాసముద్రం మధ్యలో చిక్కుకుపోయాడు. చుట్టూ నీరు, అలల హోరు తప్ప మరొకటి కానరాక రెండు నెలలపాటు సాగరం మధ్యలో అలమటించాడు. సముద్రం అలల తాకిడికి పడవలోని ఎలక్ట్రానిక్ సామాగ్రి బాగా దెబ్బతింది. సరైన ఆహారం లేక ఆకలికి పచ్చి చేపలను తింటూ, దాహానికి వర్షపు నీళ్లను తాగుతూ ఎలాగోలా తనతో పాటు తన కుక్క ప్రాణాలను కూడా నిలబెట్టుకున్నాడు. మెక్సికోకు చెందిన ఒక పెద్ద ఓడ వారిని గుర్తించి రక్షించింది. అప్పటికే టిమ్ షాడోక్ బాగా గడ్డం పెరిగి, బక్కచిక్కి గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు. సహాయక బృందాలు అతడిని రక్షించిన తర్వాత తన పెంపుడు కుక్కతో తిరిగి మెక్సికో చేరుకుని వైద్యపరీక్షలు చేయించుకుని సరైన ఆహారం తీసుకోవాలని అన్నాడు. ఇది కూడా చదవండి: లోదుస్తుల్లో పాములు.. ఎయిర్ పోర్టులో పట్టుబడిన మహిళ -
సిడ్నీలో భారీ అగ్నిప్రమాదం.. చూస్తుండగానే కుప్పకూలిన 7 అంతస్తుల భవనం!
సిడ్నీ: ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో గురువారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న 7 అంతస్తుల భవనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సుమారు 100 మందికిపైగా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు. వివరాల ప్రకారం.. సర్రీ హిల్స్ ప్రాంతంలో ఉన్న ఓ 7 అంతస్తుతల భవనంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మొదటగా 3 అంతస్తుల్లో మాత్రమే మంటలు మొదలైనప్పటికీ చూస్తుండగానే భవనమంతా వ్యాపించినట్లు స్థానికులు చెబుతున్నారు. మంటలు భారీ ఎత్తున ఎగిసిడటంతో చుట్టు పక్కల భవనాలు కూడా ఆ మంటలు వ్యాపించాయి. దీంతో ఆ పరిసరాలంతా దట్టమైన పొగ కమ్మేసింది. అగ్ని ప్రమాదం కారణంగా భవనం పూర్తిగా దెబ్బతిని చూస్తుండగానే కుప్పకూలింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. దాదాపు 100 అగ్నిమాపక సిబ్బంది 20 యంత్రాలతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సమీప భవనాల్లోని ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. అగ్నిమాపక కార్యకలాపాలు కొనసాగుతున్నందున ఈ ప్రాంతంలోకి ప్రజలు ఎవరూ రావొద్దని అధికారులు సూచించారు. Woah huge fire in the heart of Surry Hills right now in Sydney, sent by @annamccrea37 @abcnews @abcsydney. pic.twitter.com/HMQGwmvr2T — Evelyn Leckie (@Evelyn_Leckie) May 25, 2023 SURRY HILLS | Wall collapses as major fire engulfs seven-storey building. New video footage, released by FRNSW, shows the moment a wall from an engulfed building in Surry Hills came crashing down onto the street below. pic.twitter.com/mZeYGg1Kox — Fire and Rescue NSW (@FRNSW) May 25, 2023 చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద హైవే.. 14 దేశాలు దాటేయొచ్చు.. ఎక్కడుందో తెలుసా! -
ఆస్ట్రేలియాలో మోదీ ప్రసంగం.. కిక్కిరిసిన ఎరీనా (ఫొటోలు)
-
సిడ్నీలో పర్యటించడం చాలా సంతోషంగా ఉంది: ప్రధాని మోదీ
-
కామన్వెల్త్, కర్రీ, క్రికెట్.. మన రెండు దేశాలను కలుపుతున్నాయి: మోదీ
భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా చేయడమే తన కల అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడ ఆపద ఉన్నా భారత్ స్పందిస్తోందని.. సమస్య ఏదైనా పరిష్కారానికి భారత్ ముందుంటుందని తెలిపారు. అందుకే ప్రస్తుతం భారత్‌ను విశ్వగురు అంటున్నారని పేర్కొన్నారు. సిడ్నీలో మంగళవారం జరిగిన ప్రవాస భారతీయుల ఆత్మీయ సమ్మేళనంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ప్రవాస భారతీయులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా సాంస్కృతిక ప్రదర్శనలతో ఉత్సాహంగా కార్యక్రమం ప్రారంభమైంది. Immense enthusiasm in Sydney for the community programme, which begins soon… pic.twitter.com/K3193pYLEZ — PMO India (@PMOIndia) May 23, 2023 అనంతరం ప్రవాస భారతీయులను ఉద్ధేశించి మోదీ మాట్లాడారు. తనతోపాటు ఈ కార్యక్రమానికి వచ్చిన ఆస్ట్రేలియా ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. తాను మళ్లీ ఆస్ట్రేలియా వస్తానని 2014లోనే వాగ్దానం ఇచ్చానని, ఇచ్చిన మాట ప్రకారం మళ్లీ ఇక్కడకు వచ్చానని తెలిపారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య మంచి స్నేహం ఉందని ఆయన పేర్కొన్నారు. సిడ్నీలో పర్యటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. చదవండి: ఆస్ట్రేలియాలో మోదీ మ్యాజిక్.. ఓ రేంజ్లో భారతీయుల స్వాగతం! భారత్, ఆస్ట్రేలియా బంధాలను 3 సీలు ప్రభావితం చేస్తుంటాయన్నారు. కామన్వెల్త్, కర్రీ, క్రికెట్ మన రెండు దేశాలను కలుపుతున్నాయని తెలిపారు. ఎనర్జీ, ఎకానమీ, ఎడ్యుకేషన్ కూడా మన రెండు దేశాలను ఏకం చేస్తున్నాయని పేర్కొన్నారు. భారత్, ఆస్ట్రేలియాలను కలిపి ఉంచే మరో బంధం యోగా.. రెండు దేశాల మధ్య నమ్మకమే ప్రధాన వారధి అని అన్నారు. కరోనా సమయంలో ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రోగ్రాం భారతదేశంలో జరిగిందన్నారు. ఒక్క క్లిక్‌తో డీబీటీ సాధ్యమైందన్నారు. పర్యావరణ పరిరక్షణకు సౌర విద్యుత్‌ను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. రెండు దేశాలను కలిపే అంశాల్లో క్రికెట్ కూడా ఉందని ప్రధాని అన్నారు. Special connect between India and Australia... pic.twitter.com/JlMEhGv8sv — PMO India (@PMOIndia) May 23, 2023 ‘ప్రపంచంలో ఎక్కడ ఆపద ఉన్నా భారత్ స్పందిస్తోంది. సమస్య ఏదైనా పరిష్కారానికి భారత్ ముందుంటుంది. అందుకే ప్రస్తుతం భారత్‌ను విశ్వగురు అంటున్నారు. టర్కీలో భూకంపం వస్తే భారత్ అండగా నిలిచింది. భారత్, ఆస్ట్రేలియా మధ్య సంబంధాలు మరింత బలపడనున్నాయి. రెండు దేశాల మధ్య వలసల ఒప్పందం జరిగింది. ఇది రెండు దేశాల విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం. త్వరలోనే బ్రిస్బెన్లో భారత కాన్సులేట్ ఏర్పాటు చేయబోతున్నాం. రెండు దేశాల మధ్య మరిన్ని విమాన సర్వీసులు ఏర్పాటు చేస్తాం’ అని మోదీ తెలిపారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని అల్బనీస్ కూడా మోదీతోపాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంటోని మాట్లాడుతూ.. మోదీ ప్రజాదరణను ప్రముఖ రాక్‌స్టార్ బ్రూస్ స్ప్రింగ్స్టీన్తో పోల్చారు. ఆయన్ని అభిమానులు ప్రేమగా ‘ది బాస్’ అని కూడా పిలుస్తారు. ‘నేను ఈ వేదికపై చివరిసారిగా బ్రూస్ స్ప్రింగ్స్టీన్ను చూశాను. ప్రధాని మోదీకి లభించిన స్వాగతం అతనికి కూడా లభించలేదు. ‘ప్రధాని మోదీ ది బాస్’ అని ఆస్ట్రేలియా ప్రధాని కొనియాడారు. An absolute delight connecting with the Indian diaspora at the community programme in Sydney! https://t.co/OC4P3VWRhi — Narendra Modi (@narendramodi) May 23, 2023 -
గాల్లో ఉన్న విమానంలో భారీ కుదుపు.. ప్రయాణికులకు గాయాలు!
ఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. విమానం భారీ కుదుపు కారణంగా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రయాణంలో విమానంలో భారీ కుదుపు కారణంగా ప్రయాణికులు ఒక్కసారిగా వణికిపోయి ఆందోళనకు గురయ్యారు. వివరాల ప్రకారం.. ఎయిరిండియాకు చెందిన బీ787-800 విమానం ఢిల్లీ నుంచి ఆస్ట్రేలియాలోని సిడ్నీకి బయలుదేరింది. అయితే, టేకాఫ్ అయిన కొద్దిసేపటి తర్వాత విమానం గాల్లో ఉన్న సమయంలో ఒక్కసారిగా భారీ ఒడిదొడుకులకు లోనైంది. ఒక్కసారిగా విమానం భారీ కుదుపునకు లోనుకావడంతో విమానంలో ప్రయాణిస్తున్న వారంతా వణికిపోయారు. ఈ క్రమంలో కుదుపు కారణంగా విమానంలోని ప్రయాణికుల్లో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో వెంటనే స్పందించిన విమాన సిబ్బంది.. అందులో ప్రయాణిస్తున్న ఓ వైద్యుడు, నర్సు సహాయంతో వారికి ప్రథమ చికిత్స చేశారు. దీంతో, ప్రమాదం తప్పింది అని డీజీసీఏ ఓ ప్రకటనలో వెల్లడించింది. విమానం సిడ్నీ ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారని తెలిపింది. అందులో ముగ్గురు వైద్య సహాయం తీసుకున్నారని.. మరెవరికీ ఆసుపత్రిలో చేరిక అవసరం కాలేదని సిడ్నీలోని ఎయిరిండియా మేనేజర్ తెలిపారు. ఈ ఘటన ప్రమాణికులను చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఇది కూడా చదవండి: సీఎం ప్రసంగిస్తుండగా.. ఏడాది బాలుడిని స్టేజ్‌పైకి విసిరేసిన తండ్రి -
మత్తు మందు ఇచ్చి మృగవాంఛ తీర్చుకున్నాడు
NRI Crime News: మాయ మాటలు చెప్పి స్నేహం చేశాడు. అబద్దాలతో ఆకట్టుకున్నాడు. డ్రగ్స్ ఇచ్చి అచేతన స్థితిలోకి తీసుకెళ్లి.. మరీ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ మృగచేష్టలను తన ఫోన్లో బంధించి ఆనందం పొందాడు. ఒకరు కాదు.. ఐదుగురిపై అలా చేశాడు. రాజకీయ నేపథ్యం ఉన్న కారణంగా నేరాల నుంచి బయటపడొచ్చని భావించాడు. కానీ, ఆ కామాంధుడి పాపం పండింది. ఆస్ట్రేలియాలో భారత కమ్యూనిటీకి ప్రముఖుడు బాలేష్ ధన్కడ్ను.. సిడ్నీ డౌనింగ్ సెంటర్ కోర్టు సోమవారం అత్యాచార కేసుల్లో దోషిగా తేల్చింది. ఐదుగురు కొరియన్ యువతులను మభ్య పెట్టి, వాళ్లను మత్తుమందు ఇచ్చి మరీ అత్యాచారం చేశాడని నిర్ధారించింది. రాజకీయ బలం ఉన్న మానవ మృగంగా కోర్టు.. సిడ్నీ చరిత్రలోనే నీచమైన రేపిస్ట్‌గా అక్కడి మీడియా బాలేష్‌ను అభివర్ణించడం గమనార్హం. 👉బాలేష్ ధన్కడ్(43) ఓ డేటా ఎక్స్పర్ట్. అతనికి వ్యతిరేకంగా 39 అభియోగాలు నమోదు అయ్యాయి. యువతులతో స్నేహం నటించి.. వాళ్లకు ఇంటికి, హోటల్స్‌కు తీసుకెళ్లి డ్రగ్స్ ఇచ్చి ఆపై అకృత్యాలకు పాల్పడే వాడు. లైంగిక దాడుల్ని తన ఫోన్‌తో పాటు అలారం క్లాక్‌లో దాచిన సీక్రెట్ కెమెరాలోనూ బంధించినట్లు తెలుస్తోంది. 👉జడ్జి మైకేల్ కింగ్ బెయిల్‌కు నిరాకరించడంతో బాలేష్ కోర్టులోనే కన్నీటి పర్యంతం అయ్యాడు. అక్కడే అతని భార్య సైతం కన్నీళ్లు పెట్టుకుంది. బాలేష్ మళ్లీ మే నెలలో కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ ఏడాదిలోనే అతని శిక్షలు ఖరారు అవుతాయి కూడా. 👉ఇదిలా ఉంటే బాలేష్.. బీజేపీ మాజీ సభ్యుడు. ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ ది బీజేపీకి గతంలో చీఫ్‌గా పని చేశాడు. ప్రధాని మోదీని సైతం కలిసిన పలు ఫొటోలు వైరల్ అయ్యాయి కూడా. 👉తన వైవాహిక జీవితం అస్తవ్యస్తం కావడంతోనే తాను అబద్ధాలతో యువతులను ఆకట్టుకున్నానని బాలేష్ అంటున్నాడు. అంతేకాదు.. కోర్టు, లాయర్ ఫీజుల కోసం ఆస్తులను అమ్ముకున్నట్లు వెల్లడించాడు. 👉2018లోనే బాలేష్ ధన్కడ్ కీచక పర్వం వెలుగు చూసింది. ఇతర మహిళలతో సన్నిహితంగా ఉన్న డజనుకుపైగా వీడియోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతని మృగచేష్టలతో కూడిన ఆ వీడియోల్ని చూసి జ్యూరీ సైతం ఉలిక్కిపడింది. -
Sandy Reddy: ప్రతి పైసాకు లెక్క చెప్పాల్సిందే!
హైదరాబాద్: భాగ్యనగరానికి చెందిన ఆ యువతి ఆస్ట్రేలియాలోని స్ట్రాత్ ఫీల్డ్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్‌గా సేవలు అందిస్తున్నారు. ఖైరతాబాద్‌లోని ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్‌లో నివసించే పట్లోళ్ల శంకర్‌రెడ్డి, సరళారెడ్డి దంపతుల కూతురు శాండీరెడ్డి ప్రస్తుతం స్ట్రాత్ ఫీల్డ్ కార్పొరేషన్ కౌన్సిలర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అబిడ్స్‌లోని స్టాన్లీ స్కూల్లో 10వ తరగతి వరకు, మెహిదీపట్నం సెయింట్ ఆన్స్ కాలేజీలో డిగ్రీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ చేసిన శాండీరెడ్డి వివాహ అనంతరం సిడ్నీ వెళ్లారు. అక్కడి పౌరసత్వం తీసుకుని పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొన్నారు. స్టేట్ ఎమర్జెన్సీ సర్వీస్‌లో స్వచ్ఛంద సేవలు అందించారు. ఆమె సేవలకు ముగ్ధులైన ఆ ప్రాంతవాసులు గత ఏడాది జరిగిన స్ట్రాత్ ఫీల్డ్ కార్పొరేషన్ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా పోటీ చేయాలని ప్రోత్సహించారు. దీంతో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా బరిలో చేసి విజయం సాధించారు. ఇటీవల సంక్రాంతికి పండగ కోసం ఆమె నగరానికి వచ్చారు. అక్కడ కౌన్సిలర్‌గా విధులు, ప్రజలకు చేస్తున్న సేవలను వివరించారు. స్ట్రాత్ ఫీల్డ్ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం ఏడుగురు కౌన్సిలర్లు ఉంటారు. అందులో నేను ఒకదానిని. మాకు ప్రతి నెలా 8 షెడ్యూల్డ్ మీటింగ్స్ కౌన్సిల్లో ఉంటాయి. మాకు వచ్చే ఫిర్యాదులను ఈ సమావేశాల్లోనే కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్తుంటాం. అక్కడ ఎక్కువగా ఈ–మెయిల్ ద్వారానే ఫిర్యాదులు అందుతుంటాయి. ప్రతి ఫిర్యాదును స్వీకరించి కౌన్సిల్లో పెడతాం. ఆ సమస్యకు గల కారణం, ఎప్పుడు పరిష్కారం అవుతుంది? తదితర అంశాలను ఫిర్యాదు చేసిన వ్యక్తికి తిరిగి ఈ–మెయిల్లోనే పంపించడం జరుగుతుంది. మా కార్పొరేషన్లో ఖర్చు చేసే ప్రతి పైసాను స్థానికులు అడిగి తెలుసుకుంటారు. దేనికైనా డబ్బులు ఖర్చు పెడితే అనవసరమైన పక్షంలో ఆ డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టారని నిలదీస్తారు. మేం చెల్లించే పన్నుల ద్వారా జరిగే అభివృద్ధి పనులను మాకు తెలియకుండా చేయకూడదని, ఖర్చు కూడా పెట్టొద్దని అంటుంటారు. తమ ప్రాంతంలో ఏదైనా కొత్త పని కావాలన్నా మాకు ఈ–మెయిల్ చేస్తుంటారు. లైట్లు వెలగకున్నా ఫోన్ చేస్తుంటారు. వాటిని మేం సమావేశాల్లో పెడతాం. ప్రతి వారం చెత్త తీసుకెళ్తారు.. మా కార్పొరేషన పరిధిలో వారానికి ఒకసారి చెత్తను తీసుకెళ్తారు. ఈ వారం రోజుల పాటు ప్రజలు తమ ఇళ్లల్లోని చెత్తను రోడ్డు పక్కన పెద్ద పెద్ద డబ్బాల్లో వేస్తుంటారు. రోడ్డు మీద చెట్టు నుంచి రాలిపడ్డ ఆకు కూడా కనిపించదు. ఇక వారంలో రెండు సార్లు రీసైక్లింగ్ వ్యర్ధాలను, చెట్ల నుంచి రాలి పడ్డ ఆకులు, పెరిగే గడ్డి, విరిగిపడే చెట్ల కొమ్మలను తీసుకెళ్తుంటారు. ఎవరైనా తమ ఇంట్లో కుర్చీలు, టేబుళ్లు విరిగిపోయినా, పాత వస్తువులు పేరుకుపోయినా, పరుపులు, దిండ్లు, ఇతర వస్తువులు ఉంటే వాటిని తీసుకెళ్లాలని కౌన్సిల్‌కు సమాచారం ఇస్తారు. వారం రోజుల్లోనే కౌన్సిల్ సిబ్బంది ఆ ఇంటికి వెళ్లి ఆ మొత్తం వ్యర్థాలను తరలిస్తారు. అంతేగాని ఎక్కడంటే అక్కడ వాటిని వేయడం కుదరదు. నిబంధనలు ఉల్లంఘిస్తే సిడ్నీలో ప్రజలకు భారీగా జరిమానాలు విధిస్తారు. జరిమానాలకు భయపడి చాలా మంది తప్పులు చేయరు. హైదరాబాద్‌లో హెవీ ట్రాఫిక్.. హైదరాబాద్‌లో గత వారం రోజులుగా వివిధ ప్రాంతాలకు వెళుతున్నాను. విపరీతమైన ట్రాఫిక్ ఉంటోంది. కాలుష్యం కూడా బాగా పెరిగింది. పలు చోట్ల ట్రాఫిక్‌లో అంబులెన్స్‌లు ఇరుక్కుంటున్నాయి. ఈ దృశ్యాలు నా మనసును కలచివేశాయి. ప్రజల్లో బాగా చైతన్యం రావాల్సి ఉంది. సిడ్నీ, మెల్బోర్న్ నగరాల్లో అంబులెన్స్ వస్తుంటే వాహనాలు రెండు వైపులకు తప్పించి అంబులెన్స్‌ను ముందుకు పంపిస్తారు. ఇక్కడ ఆ అవగాహన కనిపించడం లేదు. ట్రాఫిక్, కాలుష్యం తగ్గాలంటే వాహనల సంఖ్య కూడా తగ్గి ప్రజా రవాణా వ్యవస్థ సిడ్నీ నగరంలా పెరగాలి. (క్లిక్ చేయండి: భారత సంతతి వైద్యుడికి యూఎస్ సీడీసీలో కీలక పదవి) -
హ్యాపీ న్యూ ఇయర్ 2023
-
బీచ్‌లో ఒకేసారి 2500 మంది ఫొటో షూట్.. ఎందుకో తెలుసా?
చర్మ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు కొంత మంది వినూత్న కార్యక్రమం చేపట్టారు. బీచ్‌లో ఏకంగా 2500 మంది నగ్న ఫోటోషూట్‌లో పాల్గొన్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా చర్మ క్యాన్సర్‌పై ఫోకస్ పెట్టాలని పిలుపునిచ్చారు. వివరాల ప్రకారం.. ఆస్ట్రేలియాలో చర్మ క్యాన్సర్ బాధితులు ఎక్కువగా ఉన్నారు. దీంతో, చర్మ క్యాన్సర్‌పై అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో సిడ్నీలో ఉన్న బాండీ బీచ్ వద్ద శనివారం ఉదయం సుమారు 2500 మంది ఒంటిపై దుస్తులు లేకుండా ఫోటోషూట్‌లో పాల్గొన్నారు. చర్మ క్యాన్సర్‌పై అవగాహన కోసమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు వారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కాగా, ఈ వినూత్న కార్యక్రమాన్ని అమెరికా ఫొటోగ్రాఫర్ స్పెన్సర్ టునిక్ ఈ ప్రాజెక్టును చేపట్టారు. అయితే అక్కడ ప్రజల్లో అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఈ ఈవెంట్ నిర్వహించారు. ఇదిలా ఉండగా.. బీచ్‌ల్లో నగ్నంగా తిరిగేందుకు ఇటీవలే ఆస్ట్రేలియా ప్రభుత్వం చట్టం చేసింది. దీంతో, వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. BREAKING: #BNNAustralia Reports. In an effort to raise awareness about skin cancer, over 2,500 people got nude on Saturday to pose for Spencer Tunick, U.S. photographic artist at Sydney's Bondi Beach, in Australia. #Australia #Sydney #Cancer #Health #Photoshoot pic.twitter.com/v2Uwdzse6a — Gurbaksh Singh Chahal (@gchahal) November 26, 2022 -
మృగంలా ప్రవర్తించిన శ్రీలంక క్రికెటర్, రక్షణ కూడా లేకుండా అమానుషంగా
టీ20 వరల్డ్‌కప్-2022 ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లి, అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీలంక క్రికెటర్ ధనుష్క గుణతిలక చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఇప్పటికే ఈ కేసులో అరెస్టై బెయిల్ కూడా దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్న గుణతిలకకు.. సిడ్నీ పోలీసులు కోర్టుకు అందించిన నివేదిక కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడే క్రమంలో గుణతిలక మృగంలా ప్రవర్తించాడని, పలు మార్లు రక్షణ కూడా లేకుండా బలవంతంగా ఆత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు నివేదికలో పేర్కొన్నారు. బాధితురాలు తిరగబడే సరికి సహనం కోల్పోయిన గుణతిలక.. గొంతు నులిమి, ఊపిరి ఆడనీయకుండా చేశాడని, అలాగే తలను గోడకేసి పలు మార్లు గట్టిగా బాదాడని కోర్టుకు వివరించారు. బాధితురాలు అందించిన సమాచారం మేరకే తాము నివేదికను తయారు చేసి కోర్టులో సమర్పించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో గుణతిలక దోషిగా తేలితే 14 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు భారీ జరిమానా కూడా పడే అవకాశముందని అన్నారు. ఇదిలా ఉంటే, 31 గుణతిలకపై శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) ఇదివరకే సస్పెన్షన్ వేటు వేసింది. ఏ రకమైన క్రికెట్ (స్థాయి, ఫార్మాట్, లీగ్) ఆడకుండా నిషేధం విధించింది. కాగా, టీ20 ప్రపంచకప్-2022లో శ్రీలంక సూపర్ 12 దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. -
ఆసీస్‌లో లంక క్రికెటర్ గుణతిలక అరెస్ట్
సిడ్నీ: టి20 ప్రపంచకప్ ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్లిన శ్రీలంక క్రికెటర్ దనుష్క గుణతిలక కటకటాల పాలయ్యాడు. ఈ నెల 2న ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలతో సిడ్నీ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. 31 ఏళ్ల గుణతిలకపై అత్యాచారం కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టినట్లు సిడ్నీ పోలీసులు వెల్లడించారు. దీంతో సూపర్–12లో నిష్క్రమించిన శ్రీలంక జట్టు గుణతిలక లేకుండానే ఆదివారం స్వదేశానికి పయనమైంది. ఆన్లైన్ డేటింగ్ ద్వారా పరిచయమైన 29 ఏళ్ల మహిళను రోజ్ బేలోని ఇంట్లో కలిసిన లంక క్రికెటర్ ఆమెపై అత్యాచారం చేసినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో పేర్కొన్నారు. క్వాలిఫయింగ్ తొలి రౌండ్ పోటీల్లో ఒక్క నమీబియాతో ఆడిన గుణతిలక గాయం కారణంగా ఇతర మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. ఇప్పటివరకు తన కెరీర్లో 8 టెస్టులు, 47 వన్డేలు, 46 టి20లు ఆడిన గుణతిలక వివాదాస్పద క్రికెటర్‌గా ముద్రపడ్డాడు. 2017లో అనుచిత ప్రవర్తన, ట్రెయినింగ్ సెషన్‌కు చెప్పాపెట్టకుండా గైర్హాజరు కావడంతో 6 వన్డేల సస్పెన్షన్ వేటు వేశారు. 2018లో కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమించడంతో ఆరు నెలలు నిషేధం విధించారు. గతేడాది ఇంగ్లండ్ పర్యటనలో బయో బబుల్ బయటకు రావడంతో ఏడాది పాటు సస్పెండ్ చేసి చివరకు ఆరు నెలలకు తగ్గించారు. -
భారత సంతతి విద్యార్థిపై దాడి...మోదీజీ సాయం చేయండి అంటూ వేడుకోలు
సిడ్నీ: భారత సంతతి విద్యార్థిపై ఒక దుండగుడు 11 సార్లు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు బాధితుడని శుభమ్ గార్గ్‌గా గుర్తించారు. అతను సిడ్నీలోని న్యూ సౌత్‌వేల్స్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేస్తున్నట్లు తెలిపారు. అతని తల్లిదండ్రులు ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఉంటారు. శుభమ్ ఐఐటీ మద్రాస్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియాకు వెళ్లాడు. గత నెల అక్టోబర్ 6న శుభమ్‌పై దాడి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులు తెలిపారు. అలాగే నిందితుడు 23 ఏళ్ల వ్యక్తి అని, అతను ఆ రోజు శుభమ్ వద్దకు వచ్చి డబ్బులు డిమాండ్ చేశాడని తెలిపారు. ఐతే శుభమ్ డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతో కత్తితో పలు చోట్ల దాడి చేసి పరారైనట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత శుభమ్ ఏదోరకంగా సమీపంలోని తన ఇంటికి వెళ్లి తదనంతరం ఆస్పత్రిలో చేరినట్లు తెలిపారు. పోలీసులు సదరు నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. భాదితుడి తండ్రి రమణివాస్ గార్గ్ తన కొడుకుకి పొత్తి కడుపులో సుమారు 11 గంటల ఆపరేషన్ జరిగినట్లు చెప్పారు. దయచేసి తన కొడుకు చికిత్సకు సాయం అందించమని, అలాగే తాము ఆస్ట్రేలియా వెళ్లేందుకు వీసా వచ్చేలా ఏర్పాటు చేయమని కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ మేరకు బాధితుడి చెల్లెలు కావ్య గార్గే ట్విట్టర్లో..."సిడ్నీలో ఉన్న తన సోదరుడు శుభమ్ గార్గ్‌పై చాలా దారుణమైన దాడి జరిగింది. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. అతన్ని చూసేందుకు మా కుటుంబానికి అత్యవసర వీసా ఏర్పాటు చేసి సాయం అందించండి" అని ప్రధాని నరేంద్ర మోదీని, విదేశాంగ మంత్రి జై శంకర్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ని అభ్యర్థిస్తూ ట్వీట్ చేశారు. అంతేగాదు తన సోదరుడికి త్వరితగతిన సర్జరీలు చేయకపోతే ఇన్ఫెక్షన్ శరీరమంతా వ్యాపిస్తుందని డాక్టర్లు చెప్పారని వాపోయింది. ఈ మేరకు సిడ్నీలోని భారత రాయబార కార్యాలయం బాధితునికి తగిన సాయం అందిస్తోంది. అంతేగాదు ఆస్ట్రేలియా హై కమిషన్ సదరు బాధిత కుటుంబ సభ్యునికి వీసా సౌకర్యం కల్పించనుందని హై కమిషన్ ప్రతినిధి తెలిపారు (చదవండి: మళ్లీ పేలిన తుపాకీ.. ఉత్తర కరొలినాలో కాల్పుల కలకలం) -
క్వీన్ ఎలిజబెత్-2 రహస్య లేఖ! తెరిచేది ఎప్పుడంటే..
సిడ్నీ: క్వీన్ ఎలిజబెత్-2 స్వదస్తూరితో రాసిన ఓ లేఖ గురించి ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఆ లేఖను ఇంతవరకు ఎవరూ చదివింది లేదు. అలాగే.. భద్రంగా ఓ చోట ఉండిపోయింది. మరి రాణి చనిపోయింది కదా!. అది అలాగే రహస్యంగా ఉండిపోవాల్సిందేనా?.. 1986 నంబర్లో సిడ్నీ(ఆస్ట్రేలియా) ప్రజలను ఉద్దేశించి.. క్వీన్ ఎలిజబెత్-2 ఓ లేఖ రాశారు. దానిని సిడ్నీలోని ఓ చారిత్రక భవనం వ్యాలెట్‌లో భద్రంగా దాచారు. అయితే.. అందులో ఏముందనే విషయం అది రాసిన రాణివారికి తప్పా ఎవరికీ తెలియదు. మరి ఇప్పుడు ఆమె మరణించడంతో ఆ లెటర్‌ను బయటకు తీయాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది. అయితే ఆ లెటర్‌ను తెరుస్తారట. అది ఇంకా 63 ఏళ్ల తర్వాత. అంటే.. 2085లో. సిడ్నీ లార్డ్ మేయర్‌ను ఉద్దేశిస్తూ.. ఎలిజబెత్ రాణి 2 ఆ లేఖను ‘‘2085వ సంవత్సరంలో ఓ మంచి ముహూర్తాన ఆ లేఖను తెరవండి అంటూ ఎలిజబెత్ రాణి సంతకం చేశారు. దీంతో ఆమె కోరిక మేరకు అప్పటివరకు గ్లాస్ బాక్స్‌లో ఉన్న ఆ లేఖను అలాగే ఉంచాలని సిడ్నీ అధికారులు నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో క్వీన్ ఎలిజబెత్-2కు ప్రత్యేక అనుబంధం ఉంది. పదహారుసార్లు ఆమె ఆ దేశాన్ని సందర్శించారు. 1901లో ఆస్ట్రేలియా స్వాతంత్రం ప్రకటించుకుంది. కానీ, పూర్తి స్థాయి గణతంత్ర రాజ్యంగా ప్రకటించుకోకపోవడంతో టెక్నికల్‌గా ఇంకా బ్రిటన్ రాజరికం కిందే ఉన్నట్లయ్యింది. ఆస్ట్రేలియాకు రాణిగా ఎలిజబెత్-2 కొనసాగారు. 1999లో ఆమెను ఆ దేశ అధినేతగా తొలగించాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది. కానీ, అది వీగిపోయింది. ఇదీ చదవండి: బ్రిటన్ రాజకుటుంబం ఆస్తుల విలువెంతంటే.. -
మగ్గం నేసి.. భళా అనేసి!
భూదాన్‌పోచంపల్లి: ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌వేల్ గవర్నర్ మార్గరేట్ బీజ్లీ ఏసీబీక్యూ చేనేత మగ్గంపై పోచంపల్లి ఇక్కత్ వస్త్రం నేసి అబ్బురపర్చారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఇండియన్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్, కేంద్ర జౌళి శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉన్న పవర్హౌస్మ్యూజియంలో ‘చరఖా అండ్ కర్గా’ పేరిట నిర్వహించిన చేనేత ఇక్కత్ కళా ప్రదర్శనలో పోచంపల్లికి చెందిన నేషనల్ హ్యాండ్లూమ్ మెరిట్ సర్టిఫికెట్ విన్నర్ తడక రమేశ్ ఇక్కత్ వస్త్రాల తయారీ ప్రత్యక్ష ప్రదర్శనను ఏర్పాటు చేశారు. సోమవారం భారతదేశ రాయబారి మనీష్ గుప్తా ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఆమె బీజ్లీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక్కత్ కళ ఎంతో నైపుణ్యంతో కూడుకొన్నదని కొనియాడారు. సిడ్నీలో మొదటిసారిగా ఇక్కత్ వస్త్ర తయారీ ప్రదర్శన ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం తడక రమేశ్, మాస్టర్‌వీవర్ పాలాది యాదగిరిని భారత రాయబారి శాలువా కప్పి సన్మానించారు. (క్లిక్: సిడ్నీలో పోచంపల్లి ఇక్కత్ నేత ప్రదర్శన) -
సిడ్నీలో పోచంపల్లి ఇక్కత్ నేత ప్రదర్శన
భూదాన్‌పోచంపల్లి: భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలను ఆస్ట్రేలియాలోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సిడ్నీలోని పవర్‌హౌస్ మ్యూజియంలో ‘చరఖా అండ్ కర్గా’ పేరిట చేనేత హస్తకళల ప్రదర్శన జరుగుతోంది. ఇండియన్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్, కేంద్ర జౌళి శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రదర్శనలో పోచంపల్లికి చెందిన నేషనల్ హ్యాండ్లూమ్ మెరిట్ సర్టిఫికెట్ విన్నర్ తడక రమేశ్‌కు అవకాశం వచ్చింది. తడక రమేశ్ మగ్గంపై ఇక్కత్ వస్త్రాల తయారీ, చిటీకి కట్టడం, రంగులద్దకం, ఆసుపోయడం వంటి నేత ప్రక్రియలను ప్రత్యక్షంగా ప్రదర్శిస్తున్నారు. ఇండియా నుంచి పోచంపల్లి ఇక్కత్‌తో పాటు బనారస్ వస్త్రాల తయారీ ప్రత్యక్ష ప్రదర్శనకు అవకాశ వచ్చిందని రమేష్ తెలిపారు. భారత రాయబారి మనీష్ గుప్తా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో ఆగస్టు 15న ఉదయం 10 గంటలకు సిడ్నీలో జాతీయ జెండావిష్కరణ ఉంటుందని, స్థానికంగా ఉన్న భారతీయులందరూ పాల్గొంటారని చెప్పారు. ఈ వేడుకల్లో తాను, మాస్టర్‌వీవర్ పాలాది యాదగిరి భాగస్వామికావడం గర్వంగా ఉందన్నారు. (క్లిక్: మిస్ ఇండియా యూఎస్–2022 రన్నరప్‌గా సంజన) -
ఆస్ట్రేలియాలో ఘనంగా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్బోర్న్ ,కాన్బెర్రా, బ్రిస్బేన్, అడిలైడ్ పట్టణాలలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. అస్ట్రేలియా రాజధాని కెన్బెర్రాలో రవి సాయల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రవి సాయల మాట్లాడుతూ.. తెలంగాణ పునర్నిర్మాణంలో, బంగారు తెలంగాణను సాధించే దిశగా టీఆర్ఎస్ ఆస్ట్రేలియా పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. గిఫ్ట్ ఏ స్మైల్ లో బాగంగా మెల్బోర్న్లో కల్వకుంట్ల సాయికృష్ణ ఆధ్వర్యంలో పలువురు రక్తదానం చేశారు. ఈ వేడుకలలో టీఆర్ఎస్ ఆస్ట్రేలియా కోర్ కమిటి నాయకులు ఝాన్సీ నోముల , గాయత్రి అరిగెల, రాకేష్ లక్కరసు , సిద్దు గొర్ల , రమేష్ కైల రుద్ర కొట్టు , వీరేందర్ తదితరులు పాల్గొన్నారు. -
వారసత్వ ఆస్తుల కోసం తండ్రి కొత్త షరతు.. కూతురి ఆవేదన
సాధారణంగా వారసత్వ ఆస్తులు దక్కాలంటే... పెళ్లి చేసుకోవాలనో, మరేదో నిబంధన పెడుతుంటారు తల్లిదండ్రులు. కానీ ఆస్ట్రేలియాకు చెందిన ఆ తండ్రి మాత్రం ఓ కొత్త నియమం పెట్టాడు. రూ.93 కోట్ల ఆస్తి తన కూతురు క్లేర్ బ్రౌన్కు చెందాలంటే ఆమె శాశ్వతమైన ఉద్యోగాన్ని సంపాదించాలని, అందులోంచి ఎంతో కొంత సమాజానికి కంట్రిబ్యూట్ చేయాలని వీలునామాలో పొందుపరిచాడు. ట్రస్టు నుంచి ఫండ్స్ రావడం ఒక్కసారిగా ఆగిపోవడంతో కోర్టును ఆశ్రయించింది. శాశ్వత ఉద్యోగం దొరికితే తప్ప ఆ ఆస్తులను పొందలేవని క్లేర్‌కు చెప్పేసింది కోర్టు. దాంతో ఇరకాటంలో పడింది. ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరక్కపోవడంతో తండ్రి ఆస్తులు కూడా దక్కడం లేదు. దీంతో చిన్నచిన్న అవసరాల కోసం కూడా తన జీవితభాగస్వామిపై ఆధారపడాల్సి వస్తోందని వాపోతోంది క్లేర్. ఉద్యోగమే దొరికితే ఆస్తులతో తనకేం పని అని ప్రశ్నిస్తోంది. ఏడీహెచ్‌డీతో బాధపడుతున్నందున తండ్రి పెట్టిన రెండు నిబంధనలనూ తాను అందుకోలేనని చెబుతోంది. ఆస్తులుండి... అనుభవించలేని ఆమె దీనస్థితికి ఆమె కుటుంబ సభ్యులు సైతం బాధపడుతున్నారు. చదవండి: అదృష్టమంటే అది.. కలలో వచ్చిన నెంబర్‌తో రెండు కోట్లు గెలుచుకున్నాడు.. -
వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ ఒమిక్రాన్ కాటుకు బలి! మొదటిసారిగా..
First Omicron Death In Australia: ఆస్ట్రేలియా న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలో సోమవారం మొదటి ఒమిక్రాన్ మరణం సంభవించింది. అంతేకాకుండా నిన్న ఒక్కరోజే 6 వేలకు పైగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యినట్టు ధృవీకరించింది. కాగా పశ్చిమ సిడ్నీలోని ఓ వృద్ధాప్య సంరక్షణ కేంద్రంలో ఒమిక్రాన్ సోకిన వ్యక్తి (80)గా గుర్తించారు. సదరు వ్యక్తి వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ ఆరోగ్య సమస్యలు ఉన్నాయని తెల్పింది. దేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రమైన న్యూ సౌత్ వేల్స్లో సోమవారం ఒక్కరోజులోనే 6,324 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇంటెన్సివ్ కేర్‌లో 55 మంది ఉండగా, మొత్తం 524 మంది అక్కడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దీంతో సోమవారం నుంచి న్యూ సౌత్ వేల్స్లో కొత్త ఆంక్షలు అమల్లోకొచ్చాయి. బార్లు, రెస్టారెంట్లలో వ్యక్తుల మధ్య 2 చదరపు మీటర్ల దూరం పాటించవల్సిందిగా పేర్కొంది. సిబ్బంది కొరత కారణంగా కోవిడ్ -19కి గురైన తర్వాత ఆరోగ్య కార్యకర్తలు సెల్ఫ్ క్వారంటైన్లో ఉండాలనే నిబంధనను ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఆరోగ్య మంత్రి బ్రాడ్ హజార్డ్ మీడియాకు తెలిపారు. ఇప్పటికే అమెరికా, యూకే, ఇజ్రాయెల్ దేశాల్లో ఒమిక్రాన్ మరణాలు సంభవించిన సంగతి తెలిసిందే! తాజాగా ఆస్ట్రేలియాలో కూడా మరో మరణం నమోదుకావడంతో ప్రపంచవ్యాప్తంగా మొత్తం నాలుగు దేశాల్లో ఒమిక్రాన్ మృతి కేసులు సంభవించినట్లు తెలస్తోంది. కాగా 108 దేశాల్లో కొత్త వేరియంట్ ఉధృతి కొనసాగుతోంది. చదవండి: మెదడుతో సహా శరీర అన్ని భాగాల్లో వైరస్ ఆనవాలు.. కారణం ఇదే! -
పదేళ్ల బాలిక సక్సెస్ఫుల్ బిజినెస్.. నెలకు కోటిపైనే ఆదాయం...
విజయానికి వయసు ఎప్పటికీ అడ్డంకి కాదు. సాధారణంగా 16, 17 యేళ్ల నుంచి అంతకంటే పెద్ద వయసున్నవారు బిజినెస్ లేదా జాబ్ చేయడం చూస్తుంటాం! కానీ 10 యేళ్ల వయసున్న పిల్లలెవరైనా నెలకు ఏకంగా కొట్ల రూపాయలను సంపాదించడం కనీవినీ ఎరుగునా? మీరు విన్నది అక్షరాల నిజం.. ఐతే ఇదంతా ఎలా సాధ్యపడిందబ్బా! అని ఆశ్చర్యంతో తలమునకలైపోతున్నారని తెలుస్తుందిలే.. వివరాల్లోకెళ్తే.. ఆస్ట్రేలియాకు చెందిన పిక్సిస్ కర్టిస్ అనే 10 యేళ్ల బాలిక తల్లి సహాయంతో బొమ్మల వ్యాపారం (టాయ్ బిజినెస్) చేస్తోంది. తద్వారా నెలకు రూ.1 కోటి 4 లక్షలకు పైనే సంపాదిస్తోంది. కలర్‌ఫుల్ బొమ్మలతోపాటు, ఆకర్షనీయమైన హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్ వంటి (హెయర్ యాక్ససరీస్) వాటిని నెముషాల్లో అమ్మి పెద్ద మొత్తంలో ఆర్జిస్తుంది. బాలిక తల్లి రాక్సి మీడియాతో మాట్లాడుతూ.. ‘చాలా చిన్న వయసులోనే నా కూతురు బిజినెస్‌లో విజయం సాధించి నా కలను నెరవేర్చింది. నాచిన్నతనంలో 14 యేళ్ల వయసులో మెక్‌డోనాల్డ్స్‌లో పనిచేశాను. కానీ నా కూతురు అంతకంటే ఎక్కువే సంపాదిస్తోంది. పిక్సిస్ సిడ్నీలో ప్రైమరీ స్కూల్లో చదువుతూ బిజినెస్ చేస్తోంది. తానుకోరుకుంటే 15 యేళ్లకే రిటైర్ అయ్యేలా కూడా ప్లాన్ చేశాం. అంతేకాదు కోటి 41 లక్షల రూపాయల విలువైన మెర్సిడెస్ కారు కూడా నా కూతురికి ఉంద’ని పేర్కొంది. చదవండి: ‘ఇప్పటికే ఇద్దరాడపిల్లల్ని కన్నాను’..! రోజుల పసికందును చంపిన తల్లి.. -
ఈ బుడతడు.. అడవిని జయించాడు..
కాన్బెర్రా: ఇంటి నుంచి తప్పిపోయిన మూడేళ్ల బాలుడు మూడు రోజుల తర్వాత పోలీసులకు దొరికిన ఘటన ఆస్ట్రేలియాలోని ఉత్తర సిడ్నీలో చోటు చేసుకుంది. బాలుడికి బుద్ధిమాంద్యం సమస్య ఉన్నప్పటికీ మూడు రోజుల పాటు అడవిలో జీవించడం పోలీసులను సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజన్లను ఆశ్చర్యపరచింది. బుద్ధిమాంద్యం సమస్యతో బాధపడుతున్న మూడేళ్ల బాలుడు ఆంతోనీ ఏజే ఎల్ఫలక్ మూడు రోజుల క్రితం తప్పిపోయాడు. తల్లిదండ్రులతో పాటు నివసిస్తున్న పుట్టీ అనే గ్రామం కారడవికి చాలా దగ్గర్లో ఉంటుంది. గ్రామంలోని ఇంటి నుంచి బాలుడు తప్పిపోయిన వెంటనే తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సహా వందలాది మంది అడవిలో అన్వేషణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం హెలికాప్టర్ ద్వారా పర్యవేక్షిస్తున్న పోలీసులకు బాలుడి జాడ కనిపించింది. చెట్ల మధ్యలో నీటి మడుగు వద్ద కూర్చొని నీరు తాగుతున్న బాలున్ని కెమెరాల ద్వారా గుర్తించారు. అనంతరం అతడిని ఆస్పత్రికి తరలించారు. బాలుడిని చీమలు కుట్టాయని, శరీరంపై గీక్కుపోయిన గాయాలున్నాయని వెల్లడించారు. తమ కుమారుడి ఆచూకీ తెలియడంతో బాలుడి తల్లిదండ్రుల భావోద్వేగం (ఫొటో కర్టెసీ: ఏపీ) ఇంటికి 470 మీటర్ల దూరంలో బాలుడు దొరికాడన్నారు. తల్లి గొంతు వినగానే బాలుడు కళ్లు తెరచి చూశాడని అనంతరం ప్రశాంతంగా నిద్రపోయాడని పేర్కొన్నారు. కేవలం ఓ టీ–షర్ట్, డైపర్‌తో తప్పిపోయిన బాలుడు మూడు రోజుల పాటు అడవిలో జీవించి ఉండటం ఆశ్చర్యం కలిగించిందని పోలీసులు అన్నారు. నీటిని గుర్తించగలిగే సామర్థ్యం కారణంగా డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండగలిగాడని చెప్పారు. రక్షించేందుకు వెళ్లిన తనను చూసి బాలుడు చిరునవ్వు చిందించడం ఎన్నటికీ మరువలేనని పోలీస్ చీఫ్ సీమోన్ మెరిక్ అన్నారు. బాలుడు దొరకడం గొప్ప అద్భుతమని బాలుడి తండ్రి వ్యాఖ్యానించారు. -
వణికిస్తున్న‘డెల్టా’.. అక్కడ మరోసారి పూర్తి లాక్డౌన్
సిడ్నీ: భారత్‌లో మొట్టమొదటిసారిగా వెలుగులోకి వచ్చిన కోవిడ్–19 డెల్టా వేరియెంట్ ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. కరోనాను జయించామని ప్రకటించుకున్న ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్‌లలో డెల్టా వేరియెంట్ కేసులు వెలుగులోకి రావడంతో మళ్లీ ఆంక్షలు విధించారు. ఆఫ్రికా దేశాల్లో ఈ వేరియెంట్‌తో మూడో వేవ్ ఉధృత దశకు చేరుకుంది. ఆస్ట్రేలియాలోని అతి పెద్ద నగరమైన సిడ్నీలో లాక్డౌన్ విధించారు. ఆస్ట్రేలియాలో సాధారణ పరిస్థితులు నెలకొన్న కొన్ని నెలల తర్వాత మళ్లీ కరోనా కేసులు నమోదుకావడం ఆ దేశాన్ని షాక్‌కి గురి చేస్తోంది. సిడ్నీలో కేవలం రెండు వారాల్లోనే 65 కేసులు నమోదయ్యాయి. సిడ్నీ విమానాశ్రయం నుంచి క్వారంటైన్ హోటల్‌కి ప్రయాణికుల్ని తీసుకువెళ్లిన డ్రైవర్‌కి తొలుత వైరస్ సోకింది. ఆ తర్వాత అత్యంత వేగంగా కేసులు వెలుగులోకి రావడం మొదలయ్యాయి. దీంతో ఒక వారం పాటు ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దంటూ సిడ్నీలో పూర్తి లాక్డౌన్ విధించారు. ఒకే రోజు 227 కేసులు ఇజ్రాయెల్‌లో మాస్కులు అక్కర్లేదని ప్రభుత్వం ప్రకటించిన కొద్ది వారాల్లోనే డెల్టా వేరియెంట్ కేసులు విజృంభించాయి. రోజుకి 100 వరకు ఈ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. గురువారం ఒక్క రోజే 227 కేసులు నమోదు కావడంతో ఇజ్రాయెల్ ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కోవిడ్ సోకిన వారెవరూ ఆస్పత్రి అవసరం లేకుండా ఇంట్లోనే కోలుకోవడం ఊరట కలిగించే అంశమని ఇజ్రాయెల్ కోవిడ్ టాస్క్ ఫోర్స్ చీఫ్ నచ్‌మాన్ ఆష్ చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్ వరకు ఒక్క కేసు కూడా బయటకు రాని ఫిజిలో ప్రస్తుతం రోజుకు 300 వరకు కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు రష్యాలో రోజుకి 20 వేల కేసులు నమోదవుతున్నాయి. ఆఫ్రికాలోని 12 దేశాల్లో కరోనా కేసులు ప్రమాదకర స్థాయిలో విజృంభిస్తున్నాయి. ఆఫ్రికాలోని 14 దేశాల్లో డెల్టా వేరియెంట్ కేసులు కనిపిస్తే కాంగో, ఉగాండాలో అత్యధికంగా నమోదవుతున్నాయని ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (ఆఫ్రికా సీడీసీ) డైరెక్టర్ జాన్ కెంగసాంగ్ చెప్పారు. (చదవండి: పండ్ల రసాలు, కెచప్‌లతో కొవిడ్ ఫేక్ పాజిటివ్!) -
స్వదేశానికి చేరుకున్నఆసీస్ క్రికెటర్లు
సిడ్నీ: ఐపీఎల్-2021లో పాల్గొన్న ఆసీస్ క్రికెటర్లు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. భారత్‌లో కరోనా సెకెండ్ వేవ్ కారణంగా ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతో ఆసీస్ క్రికెటర్లు రెండు వారాలు పాటు మాల్దీవుల్లో ఉన్నారు. అక్కడ నుంచి ఓ ప్రత్యేక విమానంలో సోమవారం ఉదయం సిడ్నీ చేరుకున్నారు. 38 మంది ఆసీస్ ఆటగాళ్లు సహా కోచింగ్ స్టాఫ్ ఆస్ట్రేలియాలో ల్యాండ్ అయ్యారు. ప్రముఖ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్ వెల్, సిడ్నీ విమానశ్రాయానికి చేరుకున్నట్టు ఆస్ట్రేలియా మీడియా తెలిపింది. విమానశ్రాయానికి చేరుకున్న ఆటగాళ్లు నేరుగా సిడ్నీలో ఓ హాటల్లో 14 రోజులు క్వారంటైన్లో ఉంటారని ఆ దేశ ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనా బారిన పడిన ఆసీస్ మాజీ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ కోచ్ మైక్ హస్సీ పూర్తిగా కోలుకోవడంతో స్వదేశాకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. (చదవండి:సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనకు భారత మహిళల క్రికెట్ జట్టు) -
'ఇప్పటికీ భయపడుతున్నా.. కిడ్నాప్‌తో నాకు సంబంధం లేదు'
సిడ్నీ: ఆసీస్ మాజీ క్రికెటర్ స్టువర్ట్ మెక్‌గిల్ కిడ్నాప్ వ్యవహారం క్రికెట్ ఆస్ట్రేలియాలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 14న మెక్‌గిల్‌ను కిడ్నాప్ చేసిన నలుగురు రెండు గంటల పాటు కారులో తిప్పారు. సిడ్నీ నగరానికి దూరంగా గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లి అతనిపై దాడి చేసి గన్‌తో బెదిరించారు. ఈ ఘటన జరిగిన రెండు వారాల తర్వాత మెక్‌గిల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా బుధవారం మెక్‌గిల్‌ను కిడ్నాప్ చేసిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే నలుగురు కిడ్నాపర్లలో ఒక వ్యక్తి మెక్‌గిల్ గర్ల్‌ఫ్రెండ్ సోదరుడు కావడంతో కొత్త మలుపు తీసుకుంది. ఇక క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత స్టువర్ట్ మెక్‌గిల్ న్యూట్రల్ బే ఏరియాలోని అరిస్టాటిల్స్ రెస్టారెంట్లో జనరల్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆ రెస్టారెంట్ ఓనర్ మారియా సొటిరోపౌలోస్‌తో పరిచయం పెరిగి అది ప్రేమకు దారి తీసింది. అప్పటినుంచి వారిద్దరు రిలేషన్షిప్లో ఉన్నారు. ఈ విషయం మారినో సోదరుడికి తెలియడంతో మెక్‌గిల్ కిడ్నాప్‌కు ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. తాజాగా కిడ్నాప్ వ్యవహారంపై మెక్‌గిల్ గర్ల్‌ఫ్రెండ్ మారియా స్పందించింది. స్టువర్ట్ గిల్‌ను బంధించిన ప్రదేశం 'ఈ విషయం తెలిసినప్పటి నుంచి నేను భయపడుతూనే ఉన్నా. కిడ్నాప్ తర్వాత ఆ భయం మరింత పెరిగింది.. ఈ సమయంలో నేను సురక్షితంగా ఉంటానో లేదో తెలియదు. అసలు ఇప్పటికి ఏం జరిగిందో నాకు అర్థం కావడం లేదు. కిడ్నాప్ వ్యవహారంలో నా సోదరుడు పాత్ర ఉందని తెలుసుకున్నా. అయినా మేమిద్దరం తోడబుట్టినవాళ్లమే అయినా ఎవరి జీవితాలు వారివి. నా సోదరునితో నాకు మంచి రిలేషన్షిప్ లేదు.. అందుకే అతనికి దూరంగా ఉంటున్నా. మెక్‌గిల్ విషయంలో నా సోదరుడు చేసిన పనికి శిక్ష పడాల్సిందే. అంటూ చెప్పుకొచ్చింది. కాగా స్టువర్ట్ మెక్‌గిల్ ఆసీస్ తరపున 1998-2010 మధ్యకాలంలో 44 టెస్టులు ఆడి 208 వికెట్లు తీశాడు. ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ ఓ వెలుగు వెలుగుతున్న సమయంలోనే మెక్‌గిల్ అరంగేట్రం చేశాడు. అతనితో పోటీ పడి వికెట్లు తీసినా వార్న్ నీడలో మెక్‌గిల్ అంతగా పాపులర్ కాలేకపోయాడు. చదవండి: ఆసీస్ మాజీ క్రికెటర్ కిడ్నాప్.. నలుగురు అరెస్ట్ -
ఆసీస్ మాజీ క్రికెటర్ కిడ్నాప్.. నలుగురు అరెస్ట్
సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెట్లో ఒకప్పుడు సత్తా చాటిన స్టార్ స్పిన్నర్ స్టువర్ట్ మెక్‌గిల్ కిడ్నాప్ కేసులో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు.బుధవారం తెల్లవారుఝామున వాళ్లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. విషయంలోకి వెళితే.. 50 ఏళ్ల మెక్‌గిల్‌ను గత నెల 14న ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఓ వాహనంలో సిడ్నీ నుంచి దూరమైన ప్రదేశానికి తీసుకెళ్లి ఓ బిల్డింగ్‌లో బంధించి అతన్ని తీవ్రంగా కొట్టి గన్‌తో బెదిరించారు. అతని నుంచి వాళ్లు భారీ మొత్తంలో డిమాండ్ చేశారు. అనంతరం గంట తర్వాత మెక్‌గిల్‌ను విడిచి పెట్టారు. అయితే ఈ ఘటన జరిగిన వారం తర్వాత మెక్‌గిల్ కిడ్నాప్ విషయాన్ని పోలీసులకు చెప్పాడు. దీంతో విచారణ ప్రారంభించిన పోలీసులు మెక్‌గిల్‌ను కిడ్నాప్ చేసిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. కాగా స్టువర్ట్ మెక్‌గిల్ ఆసీస్ తరపున 1998-2010 మధ్యకాలంలో 44 టెస్టులు ఆడి 208 వికెట్లు తీశాడు. ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ ఓ వెలుగు వెలుగుతున్న సమయంలోనే మెక్‌గిల్ అరంగేట్రం చేశాడు. అతనితో పోటీ పడి వికెట్లు తీసినా వార్న్ నీడలో మెక్‌గిల్ అంతగా పాపులర్ కాలేకపోయాడు. చదవండి: 'నాన్న తొందరగా వచ్చేయ్.. నిన్ను మిస్సవుతున్నాం' కరోనా.. విరాళం అందించిన మరో ఆసీస్ క్రికెటర్ -
870 కిలోమీటర్లు ప్రయాణం చేసిన పాము..! తీరా చూస్తే
కాన్బెర్రా: కిచెన్‌లోకి పాము ప్రత్యక్షమైన సంఘటన ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరానికి చెందిన ఓ వ్యక్తికి ఎదురైంది. సిడ్నీకి చెందిన అలెక్స్ వైట్ ఒకరోజు సూపర్‌మార్కెట్‌కు వెళ్లి సరుకులను తీసుకొని వచ్చాడు. ఇంటికి వచ్చాక సరుకులను తీస్తుండగా ఒక్కసారిగా ఖంగు తిన్నాడు. అతడు తెచ్చిన పాలకూర ప్యాకెట్లో పాము ప్రత్యక్షమైంది. పాము బుసలు కొట్టడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. దీంతో అలెక్స్ భయపడిపోయి ప్యాకెట్‌ను దూరంగా విసిరేశాడు. అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి ఆ పామును తీసుకొని వెళ్లారు. ఒకవేళ ఆ పాము కాటువేసి ఉంటే తీవ్రమైన పరిణామాలు ఉండేవని వైర్స్ రెస్యూ సిబ్బంది తెలిపారు. కాగా, అలెక్స్ వైట్ ఈ విషయాన్ని సూపర్ మార్కెట్ యాజమన్యానికి తెలిపాడు. పాము సూపర్ మార్కెట్లోకి ఎలా ప్రవేశించిందో అనే విషయాన్ని పరిశీలించగా, ఆస్ట్రేలియాలోని తూవూంబా నగరంలో ఒక ప్యాకింగ్ ప్లాంట్ నుంచి సిడ్నీకి 870 కిలోమీటర్లు పాము ప్రయాణం చేసినట్లు అధికారులు చెప్పారు. ప్యాక్ చేసిన ఉత్పత్తులలో మొదటిసారి పామును చూశామని స్థానిక సిబ్బంది తెలిపారు. అంతేకాకుండా ప్యాకింగ్ చేసిన కూరగాయల్లో తరచూ కప్పలు రావడం అక్కడ సర్వసాధారణమే. చదవండి: వైరల్: ఏనుగు డాన్స్ చూస్తే నవ్వకుండా ఉండలేం! -
పార్లమెంట్లో రాసలీలలు.. డెస్క్‌లు, టేబుళ్ల చాటుగా
సిడ్నీ: ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచే పార్లమెంట్ కాస్త బెడ్రూమ్గా మారింది. కామవాంఛ తీర్చుకోవడానికి అడ్డాగా మారింది. పార్లమెంట్ సిబ్బంది యథేచ్ఛగా రాసలీలలు కొనసాగిస్తూ పార్లమెంట్‌కు మచ్చ తీసుకువచ్చారు. ఈ ఘటనలు ఆస్ట్రేలియా అధికార పక్షంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో కంగారు దేశంలో కలకలం రేపుతోంది. పార్లమెంట్లో ఆవరణలో సిబ్బంది రాసలీలల ఫొటోలు, వీడియోలు లీకవడంతో తీవ్ర వివాదాస్పదమవుతోంది. ఆ ఫొటోలు, వీడియోలతో ఆ దేశ మీడియా కథనాలు ప్రచురించడంతో బహిర్గతమైంది. దీంతో వెంటనే ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే ఒకరిపై వేటు వేయగా.. రక్షణ శాఖ మంత్రి క్షమాపణలు చెప్పారు. పార్లమెంట్‌లోని ప్రేయర్ రూమ్‌ను ఉద్యోగి టామ్ బెడ్రూమ్గా చేసుకున్నారు. అతడితో పాటు ఎంతో మంది సిబ్బంది ఈ విధంగా చేశారు. తోటి సిబ్బందితో పాటు బయటి నుంచి వేశ్యలను పిలిపించుకుని రాసలీలలు కొనసాగించారని ఆ దేశ ప్రధాన మీడియా బహిర్గతం చేసింది. ఓ మహిళ ఎంపీకి సంబంధించిన క్యాబీన్లో ఈ కామ కార్యాలు కొనసాగాయని తెలిపింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు విడుదలయ్యాయి. సోషల్ మీడియాలో వాటికి సంబంధించినవి ట్రెండవుతున్నాయి. ఈ రాసలీలల కేసులో కేవలం టామ్ పేరు మాత్రమే బయటకు వచ్చింది. మిగతా వారి వివరాలు గోప్యంగా ఉంచారు. త్వరలోనే వారిని గుర్తించి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే ఆ వీడియోలు 2019 నాటివి. రెండేళ్ల కిందటి వీడియోలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ రాసలీలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నించారు. ఈ విషయంలో గతంలోనే ఓ మహిళ లైంగిక దాడి జరిగిందని ఆరోపించింది. ఈ విషయమై ఆ దేశ రక్షణ శాఖ మంతత్రి క్షమాపణ కూడా చెప్పారు. ఈ రాసలీలల ఘటనపై ప్రధానమంత్రి స్కాట్ మారిసన్ స్పందించారు. ఈ వీడియోలు షాక్‌కు గురి చేశాయని చెప్పారు. సభను మళ్లీ ఆర్డర్‌లోకి పెట్టాలని, రాజకీయాలను పక్కనపెట్టి సమస్యను గుర్తించాలని సూచించారు. చదవండి: ఏం తెలివబ్బా.. మాస్క్‌తో హైటెక్ కాపీయింగ్ చదవండి: స్టీల్ ప్లాంట్ ఉద్యోగి అదృశ్యం వెనుక మిస్టరీ ఇదేనా..! -
సిడ్నీ సిక్సర్స్దే బిగ్‌బాష్ టైటిల్
సిడ్నీ: వరుసగా రెండో ఏడాది సిడ్నీ సిక్సర్స్ జట్టు బిగ్‌బాష్ టి20 టోర్నమెంట్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో సిడ్నీ సిక్సర్స్ జట్టు 27 పరుగుల ఆధిక్యంతో పెర్త్ స్కార్చర్స్ జట్టును ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన డిఫెండింగ్ చాంపియన్ సిడ్నీ సిక్సర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు సాధించింది. ఓపెనర్ జేమ్స్ విన్స్ (60 బంతుల్లో 95; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఐదు పరుగుల తేడాలో సెంచరీ అవకాశాన్ని కోల్పోయాడు. 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పెర్త్ స్కార్చర్స్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 161 పరుగులు చేసి ఓడిపోయింది. ఓపెనర్లు బాన్‌క్రాఫ్ట్ (30; 4 ఫోర్లు, సిక్స్), లివింగ్‌స్టోన్ (45; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) శుభారంభం అందించినా... ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ తడబడటంతో పెర్త్ విజయానికి దూరమైంది. సిడ్నీ బౌలర్లలో బెన్ డ్వార్షుస్ మూడు వికెట్లు తీయగా... జాక్సన్ బర్డ్, సీన్ అబాట్, క్రిస్టియన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. చదవండి: దేవుడా.. పెద్ద గండం తప్పింది సిరాజ్, కుల్దీప్ల గొడవ.. నిజమెంత! What a moment for @SixersBBL 🏆👏🏼#BBL10 pic.twitter.com/EHDTzJSxHC — Fox Cricket (@FoxCricket) February 6, 2021 -
వందల సంఖ్యలో సాలీడులు.. వారి పరిస్థితి ఏంటో
మనం ఉంటున్న ఇంట్లో ఒక్క సాలె పురుగు(స్సైడర్)ను చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంది.. మరి అలాంటిది ఒకే గదిలో కొన్ని వందల సాలీడును చూస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. సరిగ్గా అలాంటి ఘటనే ఆస్ట్రేలియాలోని సిడ్నీలో చోటుచేసుకుంది. వివరాలు.. పిటీ.ఆర్ అనే మహిళ తన కూతురు బెడ్రూమ్ను శుభ్రం చేద్దామని ఆమె గదికి వెళ్లింది. రూమ్ డోర్ తీయగానే వందల సంఖ్యలో సాలీడు గోడమీద పాకుతూ ప్రత్యక్షమయ్యాయి. వాటిని చూడగానే ఆమెకు ఆశ్చర్యం వేసి తన స్నేహితురాలిని పిలిచింది. అసలు ఇంట్లోకి ఇన్ని సాలె పురుగులు ఎలా వచ్చాయా అనుకుంటూ వాటిని వెళ్లగొట్టే ప్రయత్నం చేశారు. కాగా ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. 'ఇలాంటి సీన్ ఎప్పుడు చూడలేదు.. స్పైడర్‌మ్యాన్ సినిమా గుర్తుకు రావడం గ్యారంటీ.. ఒకరోజు ఇలాగే వందల సంఖ్యలో సాలీడులు నా మీదకు వస్తున్నట్లు కల వచ్చిందంటూ' వినూత్న రీతితో కామెంట్లు పెడుతున్నారు. చదవండి: కూతురి కోసం గుండు గీసుకున్న తల్లి So, for everyone saying it's Photoshopped, here is her actual video. pic.twitter.com/2Zcro0nra7 — 💧 Petie R 🇦🇺🌟🦄🌱🌈🌏 (@PrinPeta) January 28, 2021 -
ఆఖరి సమరానికి ‘సై’
ఆంక్షలు, అలసిన శరీరాలు, గాయాలు, గెలుపోటములు... అన్నీ అధిగమించిన అనంతరం ఆస్ట్రేలియా పర్యటన ఆఖరి అంకానికి చేరింది. సిడ్నీలో స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ఓటమిని తప్పించుకున్న భారత్ ఇప్పుడు చివరి సమరానికి సన్నద్ధమైంది. కీలక ఆటగాళ్లు దూరమైన తర్వాత కూడా ఆత్మవిశ్వాసానికి లోటు లేకుండా ఆడిన టీమిండియా మరొక్కసారి బలం కూడదీసుకొని తమ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చగలిగితే వరుసగా రెండో సారి కంగారూ పర్యటనను అద్భుతంగా ముగించగలుగుతుంది. కనీసం ‘డ్రా’ చేసినా బోర్డర్–గావస్కర్ ట్రోఫీని నిలబెట్టుకుంటుంది. మరో వైపు సొంతగడ్డపై భారత్ చేతిలో వరుసగా రెండో సిరీస్‌ను చేజార్చుకోరాదని భావిస్తున్న ఆసీస్ కచ్చితంగా గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది. ‘గాబా’ మైదానంలో 1988నుంచి ఓటమి ఎరుగని ఆస్ట్రేలియా రికార్డు కొనసాగిస్తుందా లేదా రహానే సేన ముందు తలవంచుతుందా చూడాలి! బ్రిస్బేన్: వన్డే సిరీస్‌లో పరాజయం, టి20ల్లో సిరీస్ గెలుపు తర్వాత టెస్టు సిరీస్‌లో ప్రస్తుతం 1–1తో సమంగా నిలిచిన భారత జట్టు ఆఖరి పోరులో తమ సత్తాను చాటుకునేందుకు బరిలోకి దిగనుంది. శుక్రవారం నుంచి ఇక్కడి ‘గాబా’ మైదానంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య చివరిదైన నాలుగో టెస్టు జరగనుంది. మూడో టెస్టులో ప్రదర్శన తర్వాత తాము ఎలాంటి సవాల్‌కైనా సిద్ధమని భారత్ నిరూపించగా... కచ్చితంగా మ్యాచ్ గెలవాల్సిన స్థితిలో ఆసీస్‌పైనే తీవ్ర ఒత్తిడి ఉంది. ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర సమరం ఖాయం. తుది జట్టులోకి ఎవరు? గాయాలతో జడేజా, విహారి చివరి టెస్టుకు దూరమైనట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించేసింది. అయితే ప్రధాన పేసర్ బుమ్రా విషయంలో మాత్రం ఇంకా పూర్తి స్పష్టతనివ్వలేదు. పొత్తి కడుపులో కండరాల గాయంతో బాధపడుతున్న బుమ్రా 100 శాతం ఫిట్‌గా లేడనేది వాస్తవం. బుధవారం భారత జట్టు ప్రాక్టీస్ సెషన్లో పాల్గొనగా...బుమ్రా మాత్రం బౌలింగ్ చేయలేదు. అయితే బుమ్రా కూడా లేకపోతే పేస్ బౌలింగ్ మరీ పేలవంగా మారిపోయే అవకాశం ఉండటంతో పూర్తి ఫిట్‌గా లేకపోయినా అతడిని ఆడిస్తారా అనేది చూడాలి. వెన్నునొప్పితో బాధపడుతున్న అశ్విన్ పూర్తిగా కోలుకోవాలని టీమ్ మేనేజ్మెంట్ కోరుకుంటోంది. విహారి స్థానంలో మయాంక్ తుది జట్టులోకి రావడం దాదాపు ఖాయం. అయితే అతను మిడిలార్డర్లో కాకుండా ఓపెనర్‌గానే ఆడితే (రోహిత్‌తో కలిసి) మిగతా బ్యాట్స్‌మెన్ ఒక్కో స్థానం దిగువన ఆడతారు. జడేజా స్థానంలో కుల్దీప్ యాదవ్ రావచ్చు. అయితే బ్రిస్బేన్ పిచ్‌ను దృష్టిలో ఉంచుకొని అశ్విన్ రూపంలో ఒకే స్పిన్నర్‌ను ఆడించి నాలుగో పేసర్‌ను తీసుకుంటే మాత్రం శార్దుల్ ఠాకూర్‌కు అవకాశం ఉంది. బుమ్రా చివరి నిమిషంలో తప్పుకుంటే నటరాజన్ అరంగేట్రం చేస్తాడు. బ్యాటింగ్‌లో రహానే, పుజారాలపై ప్రధాన భారం ఉంది. వీరిద్దరు నిలబడితే భారీ స్కోరుకు అవకాశం ఉంటుంది. రోహిత్, గిల్ కూడా రాణిస్తే ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించవచ్చు. గత రికార్డుల ప్రకారం ఇది భారత్‌కు అచ్చి రాని మైదానమే అయినా... ఎన్నో ఇలాంటి అసాధ్యమైన ఘనతలను ఇటీవల టీమిండియా తిరగరాస్తూ వచ్చింది. అత్యుత్తమ ప్రదర్శన ఇస్తే ఇది కూడా ఆ జాబితాలో చేరుతుంది. ఆసీస్ ఏం చేస్తుందో! మెల్బోర్న్లో ఓటమి తర్వాత సిడ్నీలో గెలుపు అవకాశాన్ని చేజార్చుకున్న ఆస్ట్రేలియా ఒక్కసారిగా ఒత్తిడిలోకి పడిపోయింది. బ్రిస్బేన్‌లో ఆడేందుకు భారత్ భయపడుతుందంటూ వ్యాఖ్యలు చేసినవారంతా సిడ్నీలో టీమిండియా ప్రదర్శన తర్వాత నోరు విప్పే సాహసం చేయలేదు. కఠిన పరిస్థితుల్లోనూ పదునైన బౌలింగ్‌ను ఎదుర్కొని రహానే బృందం ఆడిన తీరు ఆసీస్ శిబిరంలో ఆందోళన పెంచింది. ‘36’లాంటి అనూహ్యం సంభవిస్తే తప్ప భారత్‌ను ఓడించలేమని వారికి అర్థమైంది. బ్రిస్బేన్‌లో పరిస్థితి ఆస్ట్రేలియాకు అనుకూలంగా ఉందని తాను చెప్పలేనని స్పిన్నర్ లయన్ వ్యాఖ్యానించడం పరిస్థితిని చూపిస్తోంది. అమిత భారం మోస్తున్న ముగ్గురు ప్రధాన పేసర్లలో ఒకరు టెస్టుకు ముందు తప్పుకునే ప్రమాదం కూడా ఉందని వినిపిస్తోంది. అదే జరిగితే ఆసీస్ మరింత బలహీనంగా మారిపోతుంది. ఫిట్‌గా లేకపోయినా మరో సారి వార్నర్‌ను ఎలాగైనా ఆడించాలని జట్టు సిద్ధమైంది. స్మిత్ ఫామ్‌లోకి రావడమే ఆ జట్టుకు పెద్ద ఊరట. అతనితో కలిసి లబ్‌షేన్ కూడా రాణిస్తే ఆతిథ్య జట్టు గెలుపుపై ఆశలు పెట్టుకోవచ్చు. ► నాథన్ లయన్‌కు ఇది 100వ టెస్టు మ్యాచ్. అతను ఈ మైలురాయి చేరనున్న 13వ ఆస్ట్రేలియా క్రికెటర్. మరో 4 వికెట్లు తీస్తే అతను టెస్టుల్లో 400 వికెట్లు కూడా పూర్తి చేసుకుంటాడు. ► బ్రిస్బేన్‌లో 6 టెస్టులు ఆడిన భారత్ ఒక్కటి కూడా గెలవలేదు. 5 ఓడి 1 మ్యాచ్ డ్రా చేసుకుంది. మరో వైపు ఈ మైదానంలో ఆడిన 62 టెస్టుల్లో 40 గెలిచిన ఆసీస్ 8 మాత్రమే ఓడింది. 1988లో విండీస్ చేతిలో ఓడిన తర్వాత గత 31 టెస్టుల్లో ఆ జట్టుకు ఇక్కడ పరాజయం ఎదురవలేదు. -
'మీ ఆటకు ఫిదా.. అవేవి మిమ్మల్ని ఆపలేదు'
సిడ్నీ: ఆసీస్‌తో జరిగిన మూడో టెస్టులో భారత్ ఓటమి నుంచి తప్పించుకోవడంలో హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్ చూపించిన తెగువపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు లభిస్తున్న సంగతి తెలిసిందే. ఆసీస్ పేసర్ల బౌన్సర్లు వీరిని కలవరపెట్టినా ఏ మాత్రం బెదరకుండా ఇన్నింగ్స్ ఆడిన తీరు అద్భుతమనే చెప్పొచ్చు. కాగా విహారీ, అశ్విన్‌ల ఆటతీరుపై తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా ప్రశంసలు కురిపించాడు. (చదవండి: దుమ్మురేపిన జడేజా.. అగ్రస్థానంలో విలియమ్సన్) 'నిజంగా నిన్న అద్భుతమైన టెస్టు మ్యాచ్ చూశా! విహారి, అశ్విన్లిద్దరు ఒత్తిడిని అధిగమించి బ్యాటింగ్ కొనసాగించిన తీరుకు ఫిదా అయ్యా. ఆటలో భాగంగా ఆసీస్ బౌలర్ల నుంచి పదునైన బౌన్సర్లతో గాయాలవుతున్న అవేవి మిమ్మల్ని ఆపలేదు.. పైగా ఓటమిని దరిచేయకుండా అద్భుతమైన ఇన్నింగ్స్‌ను ఆడారు. మ్యాచ్‌ను డ్రా చేయాలనే మీ సంకల్ప దృడత్వాన్ని ఇక మీదట అలాగే కొనసాగించండి. మ్యాచ్ విజయం కన్నా డ్రాగా ముగించడం మరింత ఆనందాన్నిచ్చింది.'అంటూ తెలిపారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. హనుమ విహారి (161 బంతుల్లో 23 నాటౌట్; 4 ఫోర్లు), రవిచంద్రన్ అశ్విన్ (128 బంతుల్లో 39 నాటౌట్; 7 ఫోర్లు)ల మారథాన్ భాగస్వామ్యంతో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. వీరిద్దరు 42.4 ఓవర్లపాటు క్రీజ్‌లో నిలిచి ఆరో వికెట్‌కు 62 పరుగులు జోడించారు. ఆసీస్ బౌలర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ జోడీని విడదీయడంలో విఫలమయ్యారు. మ్యాచ్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన స్టీవ్ స్మిత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ నెల 15 నుంచి బ్రిస్బేన్‌లో చివరిదైన నాలుగో టెస్టు జరుగుతుంది. (చదవండి: బుమ్రా ఔట్.. డైలమాలో టీమిండియా) -
'అశ్విన్‌పై చేసిన వ్యాఖ్యలకు సిగ్గుపడుతున్నా'
సిడ్నీ: టీమిండియాతో జరిగిన మూడో టెస్ట్‌లో ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ భారత్ బౌలర్ అశ్విన్‌పై చేసిన వ్యాఖ్యలపై అన్నివైపుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో పైన్ తన ప్రవర్తన పట్ల క్షమాపణ చెప్పుకున్నాడు. భారత స్పిన్నర్ అశ్విన్‌పై తాను చేసిన వ్యాఖ్యల పట్ల సిగ్గుపడుతున్నట్లు పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం టిమ్ పైన్ మాట్లాడాడు. (చదవండి: ‘భారత్‌కు వచ్చినప్పుడు చూపిస్తా’) 'అశ్విన్‌తో అలా ప్రవర్తించి ఉండకూడదు..నా చర్యకు సిగ్గుపడుతున్నా.భవిష్యత్‌లో ఇలా జరగకుండా జాగ్రత్తగా ఉంటానన్నాడు.తన మాటలతో తప్పుడు సంకేతాలిచ్చానని పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. మైదానంలో స్టంప్‌మైక్ ఉంటుందన్న విషయం తెలిసి కూడా దురదృష్టవశాత్తూ నా మాటలతో తప్పుడు సంకేతాలిచ్చాను. అది తెలిసి చాలా బాధపడ్డాను. ఆటలో జాగ్రత్తగా ఉండాలని నిన్న జరిగిన చర్యతో తెలుసుకున్నాడు. భవిష్యత్తులో ఇలా జరగకుండా మంచి పేరు తెచ్చుకోడానికి ప్రయత్నిస్తా.' అని పైన్ పేర్కొన్నాడు. సిడ్నీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమి నుంచి గట్టెక్కిన విషయం తెలిసిందే. హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్ నిలకడైన బ్యాటింగ్‌తో మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసింది. అయితే ఈ ఇద్దరి బ్యాటింగ్‌కు విసిగిపోయిన పైన్.. స్లెడ్జింగ్‌కు పాల్పడ్డాడు. కాగా ఆటలో భాగంగా మూడోరోజు కూడా పైన్ పుజారా ఔట్ విషయంలోనూ ఫీల్డ్ అంపైర్ విల్సన్‌పై మండిపడిన విషయం తెలిసిందే. అంపైర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినందుకు పైన్‌పై ఐసీసీ నిబంధన 2.8 ప్రకారం మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించడంతో పాటు ఒక డీ మెరిట్ పాయింట్ కేటాయించారు.(చదవండి: స్టీవ్ స్మిత్.. మళ్లీ చీటింగ్ చేశాడు..!) -
టీమిండియా విజయం బహుదూరం
సిడ్నీ: ఈ సిరీస్‌లో జరిగిన రెండు టెస్టులు ఆఖరి రోజు దాకా సాగనేలేదు. ఐదో రోజు బంతి గమనం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. అయితే ఆసీస్ పేస్ బలం పదునుగా ఉంది. తొలి ఇన్నింగ్స్‌ను శాసించింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఓపెనర్లను తీసి పట్టు బిగించింది. ఇలాంటి పరిస్థితుల్లో మన బ్యాట్స్‌మెన్ పోరాటం బహుదూరపు లక్ష్యానికి ఎలా చేరువవుతుందో మరి! క్రీజులో ఉన్న చతేశ్వర్ పుజారా (29 బంతుల్లో 9 బ్యాటింగ్; 1 ఫోర్), కెప్టెన్ అజింక్యా రహానే (14 బంతుల్లో 4 బ్యాటింగ్)ల భాగస్వామ్యం చివరి రోజు తొలి సెషన్లో కీలకం కానుంది. ఈ జోడీకి సోమవారం ఉదయం సెషన్లోనే చుక్కెదురైతే మాత్రం భారత్ పరాజయాన్ని... ఆస్ట్రేలియా 2–1 ఆధిక్యాన్ని... ఎవరూ అడ్డుకోలేరు. ఇదీ ఈ టెస్టు సంగతీ! భారత్ ముందు ఆస్ట్రేలియా 407 పరుగుల కఠిన లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (98 బంతుల్లో 52; 5 ఫోర్లు, 1 సిక్స్), శుబ్‌మన్ గిల్ (64 బంతుల్లో 31; 4 ఫోర్లు) కాసేపు ఓపిగ్గా ఆడారు. ప్రత్యర్థి పేస్ బౌలింగ్‌ను చక్కగానే ఎదుర్కొన్నారు. 71 పరుగుల దాకా సాఫీగా సాగిపోయిన రెండో ఇన్నింగ్స్‌ను మొదట హాజల్‌వుడ్, కాసేపటికే కమిన్స్ కుదిపేశారు. దీంతో భారత్ వంద పరుగులలోపే ఓపెనర్లిద్దరినీ కోల్పోయి కష్టాల్లో పడింది. కుదురుగా ఆడుతున్న గిల్‌ను హాజల్‌వుడ్, అర్ధసెంచరీ సాధించిన రోహిత్ శర్మను కమిన్స్ ఔట్ చేశారు. ఇప్పుడైతే చేతిలో 8 వికెట్లున్నా... గాయపడిన రవీంద్ర జడేజా బ్యాట్ పట్టలేని పరిస్థితి. మిగతా బౌలర్లను తీసేస్తే స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్ నలుగురే చేతిలో ఉన్నారు. కానీ ఇంకా భారత్ చేయాల్సినవి 309 పరుగులు. చివరిరోజు ఎదుర్కోవాల్సిన ఓవర్లు 90. రోజంతా ఆడినా టెస్టుల్లో 309 పరుగులు చేయడం కష్టమే. క్రీజులో నిలబడితే ‘డ్రా’ అవుతుందేమో తప్ప... భారత్ విజయానికి చేరువ కాలేనంత దూరంలోనే ఉంది. ముగ్గురు ఫిఫ్టీ... తొలి ఇన్నింగ్స్‌లో చితగ్గొట్టిన లబ్‌షేన్, స్మిత్‌లు రెండో ఇన్నింగ్స్‌లోనూ భారత్‌కు మింగుడు పడని స్కోర్లే చేశారు. వీళ్లిద్దరితో పాటు కామెరాన్ గ్రీన్ కూడా అర్ధశతకం సాధించడంతో భారత లక్ష్యం కొండంత అయ్యింది. ఆదివారం ముందుగా ఓవర్‌నైట్ స్కోరు 103/2తో నాలుగో రోజు ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 87 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 312 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ లబ్‌షేన్ (118 బంతుల్లో 73; 9 ఫోర్లు), స్టీవ్ స్మిత్ (167 బంతుల్లో 81; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు సాధించారు. వీళ్లిద్దరు మూడో వికెట్‌కు 103 పరుగులు జోడించాక... లబ్‌షేన్ ఔటయ్యాడు. జట్టు స్కోరు 138 పరుగుల వద్ద నవ్‌దీప్ సైనీ బౌలింగ్‌లో సబ్‌స్టిట్యూట్ కీపర్ సాహాకు క్యాచ్ ఇచ్చి అతను నిష్క్రమించాడు. మరో 10 పరుగులు జతయ్యాక మాథ్యూ వేడ్ (4)ను సైనీనే పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన గ్రీన్, అక్కడే పాతుకుపోయిన స్మిత్ జట్టు స్కోరును 200 పరుగులు దాటించారు. కాసేపటికే స్మిత్‌ను అశ్విన్ ఎల్బీగా పంపించాడు. తర్వాత కూడా భారత్‌కు పట్టుచిక్కలేదు. గ్రీన్ (132 బంతుల్లో 84; 8 ఫోర్లు, 4 సిక్సర్లు)తో పాటు కెప్టెన్ పైన్ (52 బంతుల్లో 39 నాటౌట్; 6 ఫోర్లు) టీమిండియా బౌలింగ్‌ను తేలిగ్గా ఎదుర్కొన్నారు. వీరిద్దరి మధ్య 104 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. దీంతో ఆతిథ్య జట్టు స్కోరు 300 పరుగులు దాటింది. బుమ్రా... గ్రీన్‌ను ఔట్ చేయడంతో జట్టు స్కోరు 312 పరుగుల వద్ద కెప్టెన్ పైన్ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 94 పరుగుల ఆధిక్యంతో భారత చేదించాల్సిన లక్ష్యం కాస్త 400 పరుగులను దాటింది. ► అత్యధికసార్లు ఒకే టెస్టు మ్యాచ్‌లో సెంచరీతోపాటు అర్ధసెంచరీ కూడా చేసిన బ్యాట్స్‌మన్‌గా జాక్వస్ కలిస్ (11 సార్లు–దక్షిణాఫ్రికా) పేరిట ఉన్న రికార్డును ఈ మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్ (11 సార్లు) సమం చేశాడు. రికీ పాంటింగ్ (10 సార్లు–ఆస్ట్రేలియా) రెండో స్థానంలో నిలిచాడు. ► విదేశీ గడ్డపై టెస్టులోని నాలుగో ఇన్నింగ్స్‌లో భారత ఓపెనర్లు 50 కంటే ఎక్కువ పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయడం 17 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. చివరిసారి 2006లో వెస్టిండీస్‌తో సెయింట్ కిట్స్‌లో జరిగిన టెస్టులో సెహ్వాగ్–వసీమ్ జాఫర్ జంట తొలి వికెట్‌కు 109 పరుగులు జోడించింది. ► టెస్టు ఇన్నింగ్స్‌లో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ అత్యధికంగా నాలుగు క్యాచ్‌లు తీసుకోవడం ఇది రెండోసారి. 2001లో బంగ్లాదేశ్‌తో టెస్టులో యూనిస్ ఖాన్ (పాక్) నాలుగు క్యాచ్‌లు... తాజా సిడ్నీ టెస్టులో భారత సబ్‌స్టిట్యూట్ కీపర్ సాహా నాలుగు క్యాచ్‌లు పట్టారు. ► కష్టాలన్నీ భారత్‌నే చుట్టుముట్టాయి. కొండంత లక్ష్యం... ఓపెనర్ల నిష్క్రమణ... జడేజా బ్యాట్ పట్టలేని స్థితి. 90 ఓవర్లు ఎదుర్కొనేందుకు స్కోరు బోర్డుపై 8 వికెట్లు కనబడుతున్నా... స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్ అందులో సగమే (నలుగురే). క్లిష్టమైన ఎదురీత ఎందాక సాగుతుందో నేటి ఉదయం సెషన్ గడిస్తేగానీ తెలియదు. ఆఖరి రోజంతా ఆడే సత్తా, భారీ భాగస్వామ్యం, క్రీజులో పాతుకుపోయే బ్యాట్స్‌మెన్ ఉంటే టీమిండియా కనీసం ‘డ్రా’తోనైనా గట్టెక్కవచ్చు. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 338; భారత్ తొలి ఇన్నింగ్స్: 244; ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: వార్నర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అశ్విన్ 13; పకోవ్‌స్కీ (సి) సబ్–సాహా (బి) సిరాజ్ 10; లబ్‌షేన్ (సి) సబ్–సాహా (బి) 73; స్మిత్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అశ్విన్ 81; వేడ్ (సి) సబ్–సాహా (బి) సైనీ 4; గ్రీన్ (సి) సబ్–సాహా (బి) బుమ్రా 84; పైన్ (నాటౌట్) 39; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (87 ఓవర్లలో 6 వికెట్లకు డిక్లేర్డ్ ) 312 వికెట్ల పతనం: 1–16, 2–35, 3–138, 4–148, 5–208, 6–312. బౌలింగ్: బుమ్రా 21–4–68–1, సిరాజ్ 25–5–90–1, సైనీ 16–2–54–2, అశ్విన్ 25–1–95–2. భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) స్టార్క్ (బి) కమిన్స్ 52; శుబ్‌మన్ గిల్ (సి) పైన్ (బి) హాజల్‌వుడ్ 31; పుజారా (బ్యాటింగ్) 9; రహానే (బ్యాటింగ్) 4; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (34 ఓవర్లలో 2 వికెట్లకు) 98. వికెట్ల పతనం: 1–71, 2–92. బౌలింగ్: స్టార్క్ 6–0–27–0, హాజల్‌వుడ్ 8–3–11–1, కమిన్స్ 9–1–25–1, లయన్ 9–3–22–0, గ్రీన్ 2–0–12–0. -
బ్రౌన్ డాగ్.. బిగ్ మంకీ అంటూ సిరాజ్‌పై మరోసారి
సిడ్నీ: ఆసీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా బౌలర్ మహ్మద్ సిరాజ్‌కు ఆదివారం మరోసారి చేదు అనుభవం ఎదురైంది. శనివారం మూడో రోజు ఆటలో భాగంగా సిరాజ్, బుమ్రాలపై జాతి వివక్ష వ్యాఖ్యలతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే క్రికెట్ ఆస్ట్రేలియా బీసీసీఐని క్షమాపణ కోరింది. మరోవైపు ఐసీసీ కూడా దీనిని సీరియస్‌గా భావించి కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తుంది. ఇదంతా జరిగి ఒకరోజు గడవక ముందే మరోసారి సిరాజ్‌పై వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది.(చదవండి: బుమ్రా, సిరాజ్‌లపై వర్ణ వివక్ష వ్యాఖ్యలు) నాలుగోరోజు ఆటలో భాగంగా రెండో సెషన్లో బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న మహ్మద్ సిరాజ్‌ను కొందరు 'బ్రౌన్ డాగ్, బిగ్ మంకీ' అంటూ కామెంట్ చేశారు. దీంతో సిరాజ్ అంపైర్లను ఆశ్రయించి మరోసారి ఫిర్యాదు చేశాడు. సిరాజ్‌తో పాటు కెప్టెన్ రహానే ఫిర్యాదుతో కాసేపు చర్చించుకున్న అంపైర్లు ఆటను నిలిపివేసి పోలీసులను రంగంలోకి దింపారు. తనపై కామెంట్ చేసిన వారిని సిరాజ్ గుర్తించాడు. వెంటనే పోలీసులు వాళ్లను స్టేడియం నుంచి బయటికి వెళ్లిపోవాల్సిందిగా సూచించారు. ఇప్పటికే ఈ విషయంపై బీసీసీఐ గుర్రుగా ఉంది. టీమిండియా క్రికెటర్లు వెంటనే మేనేజ్మెంట్కు తెలియజేశారు. దీనిపై టీమిండియా మేనేజ్మెంట్ ఐసీసీకి ఫిర్యాదు చేసింది.(చదవండి: కెప్టెన్‌తో గొడవ.. టీమ్ నుంచి వెళ్లిపోయిన ఆల్‌రౌండర్) ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన ఐసీసీ, టీమిండియా ఫిర్యాదును స్వీకరించి విచారణకు సిద్ధమైంది. సిడ్నీ క్రికెట్ మైదానం నిర్వహణ బాధ్యతలు చూస్తున్న 'వెన్యూస్ న్యూసౌత్ వేల్స్' తో కలిసి సీసీ టీవీ కెమెరాల ఫుటేజిని పరిశీలిస్తోంది. కాగా క్రికెటర్లపై ఇలా జాతి వివక్ష కామెంట్లు చేసే ప్రేక్షకులను స్టేడియానికి రాకుండా జీవితకాలం నిషేధం విధించాలంటూ పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఆస్ట్రేలియాలో పర్యటించే క్రికెట్ జట్లకు ఇలాంటి అనుభవాలు కొత్త కాదు. గతంలోనూ అనేక వివాదాలు వర్ణ వివక్ష వ్యాఖ్యల ఫలితంగానే జరిగాయి. సరిగ్గా 13 ఏళ్ల క్రితం ఇదే సిడ్నీ వేదికలో హర్భజన్, సైమండ్స్‌ల మధ్య చోటుచేసుకున్న మంకీ గేట్ వివాదం ఎంత రచ్చగా మారిందో అందరికి తెలిసిందే.(చదవండి: కిందా మీదా పడ్డాడు.. చివరకు రనౌట్ చేశాడు) Bring back Kohli for the 4th Test Match This drunk australians are Abusing Siraj non-stop#INDvsAUS pic.twitter.com/C56IIZcfow — Gaurav (@GauravK_8609) January 10, 2021 -
పుజారా ఆడకపోయుంటే...
100 బంతుల్లో 16 పరుగులు... 133 బంతుల్లో 40... 174 బంతుల్లో అర్ధ సెంచరీ... తొలి వంద బంతుల్లో ఒక్క ఫోర్ కూడా లేదు... శనివారం చతేశ్వర్ పుజారా బ్యాటింగ్ సాగిన తీరు ఇది. దీనిపైనే పలువురు మాజీలు, అభిమానుల నుంచి విమర్శలు వచ్చాయి. రికీ పాంటింగ్ కూడా ‘ఇది సరైన పద్ధతి కాదు. స్కోరింగ్ వేగం మరింత ఎక్కువగా ఉండాల్సింది. ఈ తరహా ఆట ఇతర బ్యాట్స్‌మెన్‌పై తీవ్ర ఒత్తిడి పెంచుతుంది’ అంటూ వ్యాఖ్యానించాడు. అయితే ఇలా ఆడటం ఇదేమీ మొదటిసారి కాదు! నిజానికి ఇదే అతని బలం కూడా. పరుగులు చేయడంలో అతని శైలే ఇది. పుజారా విషయంలో ఇలాంటిది బ్రహ్మాండంగా పని చేస్తుంది కూడా. సుదీర్ఘ సమయం పాటు క్రీజ్‌లో పాతుకుపోయి... ప్రత్యర్థి బౌలర్లు అలసిపోయి, గతి తప్పి పేలవ బంతులు వేసే వరకు వేచి చూడటం... ఆపై పరుగులు రాబట్టడం అతనికి తెలిసిన విద్య. 2018లో జొహన్నెస్‌బర్గ్ టెస్టులో 50వ బంతికి తొలి పరుగు తీసిన రోజు కూడా పుజారా శైలిపై విమర్శలు రాలేదు. రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి సిరీస్ గెలిచినప్పుడు పుజారా ఇదే మంత్రం పఠించాడు. సిరీస్ మొత్తంలో అసాధారణంగా సుమారు 30 గంటల పాటు అతను బ్యాటింగ్ చేసిన విషయం మరచిపోవద్దు. అతనిలో ‘దూకుడు’ లోపించిందని చెప్పడంలో అర్థం లేదు. సాధారణంగా అయితే నిలదొక్కుకోవడానికి కొంత సమయం తీసుకున్నా... ఆ తర్వాత షాట్లు ఆడుతూ లెక్క సరి చేయడం అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్ చేస్తుంటారు. అడిలైడ్ టెస్టులో కోహ్లి తన తొలి 80 బంతుల్లో 29 పరుగులే చేసి ఆపై కొంత జోరు పెంచాడు. అయితే పుజారాకు అలాంటి షాట్ల ‘రిస్క్’ విలువేమిటో బాగా తెలుసు. శనివారం భారత జట్టు ఉన్న స్థితిలో అలాంటి రిస్క్‌లు కూడా అనవసరమని అతను భావించినట్లున్నాడు. అన్నింటికి మించి ఫామ్‌లో ఉన్న ముగ్గురు అత్యుత్తమ పేసర్లను అతను ఎదుర్కొంటున్నాడు. పిచ్ భిన్నంగా స్పందిస్తోంది. ఎన్ని ఎక్కువ బంతులు ఆడితే అన్ని ఎక్కువ పరుగులు చేసే అవకాశం తనకు పెరుగుతుందని అతను అనుకున్నాడు. అన్నింటికి మించి తన సహచరుల బ్యాటింగ్ బలంపై కూడా అతనికి అంచనా ఉంది. టెస్టు క్రికెట్లో సుమారు 31 వేల బంతులు ఆడిన పుజారాకు తనకు ఏది బాగా పని చేస్తుందో తెలీదా! చివరకు అతను భయపడినట్లే జరిగింది. కమిన్స్ వేసిన ఒక అద్భుత బంతికి పుజారా వెనుదిరిగాక జట్టు ఒక్కసారిగా కుప్పకూలింది. అతను కూడా పట్టుదలగా నిలబడకుండా వేగంగా ఆడితే చాలనే భావనలో వెళితే అసలు ఈ మాత్రం స్కోరైనా వచ్చేదా! జట్టు పేలవ ఇన్నింగ్స్‌లో అత్యధిక బంతులు ఎదుర్కోగలిగిన బ్యాట్స్‌మెన్ అని చూడకుండా రహానేపై ఒత్తిడి పెరిగి అవుట్ కావడానికి కారణమయ్యాడని, అతని ఆట శైలి కారణంగానే విహారి కూడా రనౌట్ అయ్యాడని విమర్శించడంలో ఏమాత్రం అర్థం లేదు. నేను బాగా ఆడుతున్న సమయంలో ఒక మంచి బంతికి అవుటయ్యాను. నాకు తెలిసిన శైలిలోనే నేను బ్యాటింగ్ చేస్తాను. అంతకంటే మెరుగ్గా నేను ఏమీ చేయలేను. కమిన్స్ వేసిన ఆ బంతి ఈ సిరీస్‌లోనే అత్యుత్తమమైంది. నేను ఆడక తప్పని పరిస్థితి. మనది కాని రోజు చిన్న తప్పులు కూడా పెద్దవిగా కనిపిస్తాయి. పుజారా, భారత బ్యాట్స్‌మన్ -
సిడ్నీ టెస్టులో భారత్ తడబాటు
ఆస్ట్రేలియా చేతిలో మూడో టెస్టులో భారత్‌కు భంగపాటు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండో రోజు ప్రత్యర్థికంటే మెరుగైన స్థితిలో నిలిచి భారీ స్కోరుకు బాటలు వేసుకున్న టీమిండియా బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో కుప్పకూలింది. ఆసీస్ పేస్ త్రయం పదునైన బౌలింగ్‌ను ఎదుర్కోలేక మన ఆటగాళ్లు చేతులెత్తేసి భారీ ఆధిక్యం సమర్పించుకున్నారు. రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి తమ ఓవరాల్ ఆధిక్యాన్ని 197 పరుగులకు పెంచుకుంది. ఆదివారం కనీసం రెండు సెషన్లలో మరిన్ని పరుగులు జోడించి సవాల్ విసిరేందుకు సన్నద్ధమైంది. నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ కఠినంగా మారిపోయే చోట మనోళ్లు ఎలా స్పందిస్తారో చూడాలి. సిడ్నీ: బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో ముందంజ వేసే లక్ష్యంతో ఉన్న ఆస్ట్రేలియా అందుకు తగ్గ వేదికను సిద్ధం చేసుకుంది. భారత్‌తో మూడో టెస్టులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. లబ్‌షేన్ (47 బ్యాటింగ్), స్మిత్ (29 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉండగా... ఓవరాల్ ఆధిక్యం 197 పరుగులకు చేరింది. 35 పరుగులకే ఓపెనర్లు వార్నర్ (13), పకోవ్‌స్కీ (10)లను భారత్ అవుట్ చేసినా... లబ్‌షేన్, స్మిత్ మూడో వికెట్‌కు అజేయంగా 68 పరుగులు జోడించి జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు. అంతకుముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులకు ఆలౌటైంది. చతేశ్వర్ పుజారా (176 బంతుల్లో 50; 5 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. ఆసీస్ బౌలర్ కమిన్స్‌కు 4 వికెట్లు దక్కాయి. విహారి విఫలం... భారీ స్కోరు సాధించే ఆశలతో మూడో రోజు ఆటలో బరిలోకి దిగిన భారత్‌కు ఏదీ కలిసి రాలేదు. ఆరంభంలోనే కమిన్స్ వేసిన బంతిని వికెట్లపైకి ఆడుకొని కెప్టెన్ రహానే (22) వెనుదిరిగాడు. ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారి (4) రనౌటయ్యాడు. ఈ దశలో బ్యాటింగ్‌కు దిగిన రిషభ్ పంత్ (67 బంతుల్లో 36; 4 ఫోర్లు) తనదైన శైలిలో దూకుడుగా ఆడి చకచకా పరుగులు రాబట్టాడు. 14 పరుగుల వద్ద అతని అవుట్ కోసం ఆసీస్ డీఆర్ఎస్ కోరగా, ఫలితం భారత్‌కు అనుకూలంగా వచ్చింది. అయితే కమిన్స్ బౌలింగ్‌లో గాయమైన తర్వాత ఏకాగ్రత చెదిరిన పంత్, మరో పది బంతులకే స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దురదృష్టవశాత్తూ ఇదే స్కోరు వద్ద భారత్ పుజారా వికెట్ కూడా కోల్పోయింది. ఆ తర్వాత మిగిలిన నాలుగు భారత వికెట్లు తీసేందుకు ఆసీస్‌కు ఎక్కువ సమయం పట్టలేదు. అయితే సహచరులు వెనుదిరుగుతున్నా... మరో ఎండ్‌లో రవీంద్ర జడేజా (37 బంతుల్లో 28 నాటౌట్; 5 ఫోర్లు) కొన్ని చక్కటి షాట్లతో ఒంటరి పోరాటం చేయడంతో ప్రత్యర్థి ఆధిక్యం వంద పరుగుల లోపు పరిమితమైంది. మూడు రనౌట్లు... భారత జట్టు పతనంలో రనౌట్లు కూడా కీలకపాత్ర పోషించాయి. తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా ముగ్గురు బ్యాట్స్‌మెన్ రనౌట్‌గా వెనుదిరిగారు. 37 బంతుల్లో 4 పరుగులే చేయగలిగిన విహారి ఒత్తిడిలో అనవసరపు పరుగు కోసం ప్రయత్నించి వెనుదిరగాల్సి వచ్చింది. లయన్ బౌలింగ్‌లో ముందుకు దూసుకొచ్చి మిడాఫ్ దిశగా షాట్ ఆడిన అతను అదే ఊపులో సింగిల్ పూర్తి చేసేందుకు ఉపక్రమించాడు. అయితే హాజల్‌వుడ్ విసిరిన డైరెక్ట్ త్రో వికెట్లను కూల్చింది. తర్వాతి వంతు అశ్విన్‌ది. గ్రీన్ బౌలింగ్‌లో జడేజా షాట్ ఆడి సింగిల్ కోసం పిలవగా... కాస్త అలసత్వంతో పరుగెత్తిన అశ్విన్ (10) అవతలి ఎండ్‌కు చేరలేక పెవిలియన్ బాట పట్టాడు. బుమ్రాతోనూ ఇలాగే జరిగింది. స్టార్క్ బౌలింగ్‌లో జడేజా షాట్ ఆడి స్ట్రయికింగ్ కాపాడుకునేందుకు లేని రెండో పరుగు కోసం ప్రయత్నించాడు. అయితే లబ్‌షేన్ విసిరిన త్రో నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లో వికెట్లను పడగొట్టడంతో బుమ్రా ఆట ముగిసింది. 2008లో మొహాలీ టెస్టు (ఇంగ్లండ్‌తో) తర్వాత ఒకే ఇన్నింగ్స్‌లో ముగ్గురు భారత ఆటగాళ్లు రనౌట్ కావడం ఇదే తొలిసారి. జడేజా, పంత్‌లకు గాయాలు భారత జట్టును గాయాల బెడద వీడట్లేదు. కొత్తగా ఈ జాబితాలో జడేజా, పంత్ చేరారు. కమిన్స్ బౌలింగ్‌లో పంత్ పుల్ షాట్ ఆడే ప్రయత్నంలో విఫలం కాగా... బంతి అతని ఎడమ మోచేతిని బలంగా తాకింది. దాంతో తీవ్ర నొప్పితో ఇబ్బంది పడిన అతను స్వల్ప చికిత్స అనంతరం ఆటను కొనసాగించాడు. అయితే భారత ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత అతడిని స్కానింగ్ కోసం తీసుకెళ్లారు. గాయం తీవ్రత తక్కువే కావడం ఊరట కలిగించగా... ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో అతనికి బదులు సాహా కీపింగ్ చేశాడు. అవసరమైతే పంత్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తాడు. ఇన్నింగ్స్ చివర్లో స్టార్క్ వేసిన షార్ట్ బంతిని ఎదుర్కొనే క్రమంలో జడేజా ఎడమ చేతి బొటన వేలుకు బలమైన దెబ్బ తగిలింది. విలవిల్లాడిన జడేజాకు కూడా చికిత్స చేసిన తర్వాత స్కానింగ్‌కు పంపారు. జడేజా గాయం మాత్రం భారత్‌కు నష్టం కలిగించే అవకాశం ఉంది. బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా... అతని వేలుకు ఫ్రాక్చర్ అయినట్లు సమాచారం. జడేజా గ్లవ్ తొడిగి బ్యాటింగ్ చేసే పరిస్థితి లేదని తెలుస్తోంది. అన్నింటికి మించి అది అతని బౌలింగ్ చేయి కావడంతో ఈ మ్యాచ్‌తో పాటు చివరి టెస్టులో కూడా జడేజా ఆడే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 29 ఓవర్లు ఆడినా జడేజా బౌలింగ్ చేయకపోవడం పరిస్థితిని సూచిస్తోంది. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 338; భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి అండ్ బి) హాజల్‌వుడ్ 26; గిల్ (సి) గ్రీన్ (బి) కమిన్స్ 50; పుజారా (సి) పైన్ (బి) కమిన్స్ 50; రహానే (బి) కమిన్స్ 22; విహారి (రనౌట్) 4; పంత్ (సి) వార్నర్ (బి) హాజల్‌వుడ్ 36; జడేజా (నాటౌట్) 28; అశ్విన్ (రనౌట్) 10; సైనీ (సి) వేడ్ (బి) స్టార్క్ 3; బుమ్రా (రనౌట్) 0; సిరాజ్ (సి) పైన్ (బి) కమిన్స్ 6; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (100.4 ఓవర్లలో ఆలౌట్) 244 వికెట్ల పతనం: 1–70, 2–85, 3–117, 4–142, 5–195, 6–195, 7–206, 8–210, 9–216, 10–244. బౌలింగ్: స్టార్క్ 19–7–61–1, హాజల్‌వుడ్ 21–10–43–2, కమిన్స్ 21.4–10–29–4, లయన్ 31–8–87–0, లబ్‌షేన్ 3–0–11–0, గ్రీన్ 5–2–11–0. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: వార్నర్ (ఎల్బీ) (బి) అశ్విన్ 13; పకోవ్‌స్కీ (సి) (సబ్) సాహా (బి) సిరాజ్ 10; లబ్‌షేన్ (బ్యాటింగ్) 47; స్మిత్ (బ్యాటింగ్) 29; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (29 ఓవర్లలో 2 వికెట్లకు) 103 వికెట్ల పతనం: 1–16, 2–35. బౌలింగ్: బుమ్రా 8–1–26–0, సిరాజ్ 8–2–20–1, సైనీ 7–1–28–0, అశ్విన్ 6–0–28–1. ► పుజారా అర్ధ సెంచరీకి తీసుకున్న బంతులు. పుజారా కెరీర్లో ఇదే నెమ్మదైన అర్ధ సెంచరీ. 2018లో దక్షిణాఫ్రికాతో జొహన్నెస్‌బర్గ్‌లో జరిగిన టెస్టులో పుజారా173 బంతులు ఆడి అర్ధ సెంచరీ సాధించాడు. ► అశ్విన్ బౌలింగ్లోవార్నర్ అవుటవ్వడం ఇది పదోసారి. వార్నర్‌ను ఎక్కువసార్లు అవుట్ చేసిన బౌలర్ల జాబితాలో అశ్విన్‌ది రెండో స్థానం. స్టువర్ట్ బ్రాడ్ (10 సార్లు) తొలి స్థానంలో... అండర్సన్ (8 సార్లు) మూడో స్థానంలో ఉన్నారు. -
'నన్ను తిడతావేంటి... ఆ నిర్ణయం థర్డ్ అంపైర్‌ది'
సిడ్నీ: ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ ఫీల్డ్ అంపైర్ విల్సన్‌పై అసహనం వ్యక్తం చేశాడు. టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్ సమయంలో చతేశ్వర్ పుజారా ఔట్ అంటూ టిమ్ పైన్ డీఆర్ఎస్ కోరాడు. అయితే నిర్ణయం తనకి వ్యతిరేకంగా రావడంతో సహనం కోల్పోయి ఫీల్డ్ అంపైర్ విల్సన్‌తో వాదనకి దిగాడు. తొలుత సర్దిచెప్పే ప్రయత్నం చేసిన విల్సన్.. టిమ్ పైన్ నోరు జారడంతో విల్సన్ కూడా సీరియస్‌గానే బదులిచ్చాడు. (చదవండి: ఒకవేళ అక్కడ సచిన్ ఉంటే పరిస్థితి ఏంటి?) ఇక అసలు విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 56వ ఓవర్ వేసిన స్పిన్నర్ నాథన్ లయన్ బౌలింగ్‌లో చతేశ్వర్ పుజారా.. బంతిని ముందుకు ఫుష్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ.. అతను ఊహించని విధంగా టర్న్, బౌన్స్ అయిన బంతి బ్యాట్ పక్క నుంచి వెళ్లి పుజారా శరీరాన్ని తాకి.. అనంతరం షార్ట్ లెగ్‌లో గాల్లోకి లేచింది. దాంతో అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న మాథ్యూ వెడ్ బంతిని క్యాచ్‌గా అందుకోగా.. ఔట్ కోసం ఆస్ట్రేలియా అప్పీల్ చేసింది. కానీ.. ఫీల్డ్ అంపైర్ విల్సన్ ఆ ఔట్ అప్పీల్‌ని తిరస్కరించాడు. దాంతో ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ డీఆర్ఎస్ కోరాడు.(చదవండి: వాటే సెన్సేషనల్ రనౌట్..!) అయితే రిప్లైలో బంతి బ్యాట్‌కి తాకినట్లు హాట్‌స్పాట్, స్నికో మీటర్లో ఎక్కడా కనిపించలేదు. దాంతో థర్డ్ అంపైర్ బ్రూస్ ఆక్సన్‌ఫర్ట్ తుది నిర్ణయానికి రాలేక నిర్ణయాధికారం ఫీల్డ్ అంపైర్‌కే వదిలేశాడు. అప్పటికే విల్సన్ నాటౌట్ ఇచ్చి ఉండటంతో.. అతను అదే నిర్ణయానికి కట్టుబడగా సహనం కోల్పోయిన పైన్ అసహనం వ్యక్తం చేస్తూ బూతులందుకున్నాడు. పైన్ మాటలు విన్న అంపైర్ విల్సన్ 'ఆ నిర్ణయం థర్డ్ అంపైర్ తీసుకున్నాడు నేను కాదు' అంటూ కోపంగా బదులిచ్చాడు. -
ఒకవేళ అక్కడ సచిన్ ఉంటే పరిస్థితి ఏంటి?
సిడ్నీ: ఆసీస్, టీమిండియా మధ్య జరుగుతున్న మూడో టెస్టులో భారత బ్యాటింగ్ సందర్భంగా కామెంటరీ బాక్స్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. మ్యాచ్ సందర్భంగా టీవీ వ్యాఖ్యాత జేమ్స్ బ్రేషా కామెంటరీ బాక్స్‌లోకి లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్, ఆసీస్ మాజీ ఆటగాడు డామియన్ ప్లెమింగ్లను ఆహ్వనించాడు. అయితే గవాస్కర్‌ను చూసి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అనుకున్న బ్రేషా వెల్కమ్ సచిన్ టెండూల్కర్ అని సంబోధించాడు. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన గవాస్కర్ సచిన్ కూడా ఇక్కడికి వచ్చాడా అన్నట్లు వెనక్కి తిరిగి చూశాడు. ప్లెమింగ్ తప్ప ఇంకెవరు కనిపించకపోవడంతో గవాస్కర్ ఆశ్యర్యం వ్యక్తం చేశాడు.(చదవండి: సిడ్నీ టెస్ట్: బుమ్రా, సిరాజ్‌లపై వర్ణ వివక్ష వ్యాఖ్యలు) అయితే బ్రేషా గవాస్కర్‌ను చూస్తూ 'మిమ్మల్నే సచిన్' అంటూ మరోసారి చెప్పాడు. ఇది గమనించిన ప్లెమింగ్ వెంటనే అందుకొని.. ' వచ్చింది సచిన్ కాదని.. గవాస్కర్ అంటూ' చెప్పడంతో బ్రేషా నాలుక కర్చుకున్నాడు. ఈ సందర్భంగా బ్రే షా సునీల్ గవాస్కర్‌కు సారీ చెప్పడంతో ఒక్కసారిగా నవ్వులు పూశాయి. దీనికి సంబంధించిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఒకవేళ కామెంటరీకి సచిన్ కూడా వచ్చి ఉంటే బ్రే షా అతన్ని గవాస్కర్ అని పిలిచేవాడేమో అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా టీమిండియా 207 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 244 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ ఆటగాడు చతేశ్వర్ పుజారా(50; 176 బంతుల్లో 5 ఫోర్లు)హాఫ్ సెంచరీ సాధించగా, రిషభ్ పంత్(36; 67 బంతుల్లో 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. రహానే(22) మూడో వికెట్‌గా పెవిలియన్ చేరగా, రవీంద్ర జడేజా(28 ) అజేయంగా నిలిచాడు. 96/2 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా మరో 148 పరుగులు సాధించి మిగతా 8 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ రెండు వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. లబుషేన్ 47, స్మిత్ 29 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 338 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. (చదవండి: అప్పుడూ ఇదే సీన్.. మరి టీమిండియా గెలిచేనా?) -
సిడ్నీ టెస్ట్: బుమ్రా, సిరాజ్‌లపై వర్ణ వివక్ష వ్యాఖ్యలు
సిడ్నీ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా బౌలర్లు మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాలకు చేదు అనుభవం ఎదురైంది. మ్యాచ్ చూడడానికి వచ్చిన అభిమానుల్లో కొంతమంది డ్రింక్స్ సపోర్టర్స్ సిరాజ్, బుమ్రాలపై వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేయడం వివాదాస్పందంగా మారింది. మూడోరోజు ఆటలో భాగంగా ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే టీమిండియా బౌలర్లపై చేసిన వర్ణ వివక్ష వ్యాఖ్యలు టీమిండియా దృష్టికి రావడంతో కెప్టెన్ అజింక్యా రహానే జట్టులోని సీనియర్ ఆటగాళ్లైన అశ్విన్, రోహిత్ శర్మలతో కలిసి ఆన్‌ఫీల్డ్ అంపైర్లతో పాటు మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేశాడు. కాగా బౌలర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తుల గురించి సీసీ ఫుటేజీ ద్వారా ఆరా తీసి తగిన చర్య తీసుకుంటామని సిడ్నీ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది.(చదవండి: వాటే సెన్సేషనల్ రనౌట్..!) కాగా సిరాజ్, బుమ్రాలపై డ్రింక్ సపోర్టర్స్ వ్యవహరించిన తీరును తప్పుబట్టిన టీమిండియా ఫిర్యాదుపై ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పింది.అంతేగాక వర్ణ వివక్షను వ్యతిరేకిస్తూ.. 2019 వరల్డ్ కప్ సాధించిన ఇంగ్లండ్ జట్టు గురించి ఒక వీడియోను రిలీజ్ చేసింది. ఇంగ్లండ్ జట్టు ప్రపంచకప్ సాధించడంలో జోఫ్రా ఆర్చర్ కీలకపాత్ర పోషించాడు. ఫైనల్ మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీయడంతో ఆర్చర్ సూపర్ ఓవర్‌ను సూపర్‌గా వేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతను నల్ల జాతీయుడు.. కానీ ఏనాడు అతన్ని ఇంగ్లండ్ జట్టు వేరుగా చేసి చూడలేదు. క్రికెట్ అంటేనే జెంటిల్మెన్ గేమ్‌కు పెట్టింది పేరు. తుది జట్టులో 11 మంది ఉంటే.. వారు విభిన్న వ్యక్తిత్వాలు కలిగి ఉంటారు. వైవిధ్యం లేకపోతే క్రికెట్ అనే పదానికి అర్థం లేదు. ఇలా వర్ణ వివక్ష వ్యాఖ్యలతో ఆటగాళ్లను మానసికక్షోభకు గురి చేయడం కరెక్ట్ కాదు. అంటూ ట్వీట్ చేసింది.(చదవండి: ఆసీస్ క్రికెటర్‌పై షేన్ వార్న్ అసభ్యకర వ్యాఖ్యలు) కాగా సిరాజ్, బుమ్రాలపై వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేయడంపై సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టీమిండియా అభిమానులు సిడ్నీఅభిమానులపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా సరిగ్గా 13 ఏళ్ల క్రితం ఇదే సిడ్నీ మైదానంలో ఆసీస్ మాజీ ఆటగాడు ఆండ్రూ సైమండ్స్ , టీమిండియా వెటెరన్ బౌలర్ హర్భజన్ సింగ్‌ల మధ్య చోటుచేసుకున్న వివాదం అంత తేలిగ్గా ఎవరు మరిచిపోలేరు. అప్పటి టెస్టు మ్యాచ్‌లో వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ మంకీగేట్ వివాదంగా క్రికెట్ చరిత్రలో పెను సంచలనం రేపింది. -
మనదే పైచేయి...
సిడ్నీ: ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో రెండో రోజు భారత్ మెరుగైన ప్రదర్శన కనబర్చింది. శుక్రవారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. శుబ్‌మన్ గిల్ (101 బంతుల్లో 50; 8 ఫోర్లు), రోహిత్ శర్మ (26) తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించి వెనుదిరగ్గా... ప్రస్తుతం పుజారా (9 బ్యాటింగ్), రహానే (5 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. భారత్ మరో 242 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 166/2తో ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 338 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (226 బంతుల్లో 131; 16 ఫోర్లు) శతకం పూర్తి చేసుకోగా, లబ్‌షేన్ (196 బంతుల్లో 91; 11 ఫోర్లు) ఆ అవకాశం చేజార్చుకున్నాడు. భారత బౌలర్లలో జడేజా 4 వికెట్లు పడగొట్టగా...బుమ్రా, సైనీ చెరో 2 వికెట్లు తీశారు. జడేజా జోరు... భారీ స్కోరు లక్ష్యంగా రెండో రోజు ఆట ఆరంభించిన ఆస్ట్రేలియాను భారత బౌలర్లు కట్టడి చేశారు. ఫలితంగా స్మిత్ మినహా మిగతా వారంతా పరుగులు చేయడానికి ఇబ్బంది పడి ఒత్తిడిలో వికెట్లు చేజార్చుకున్నారు. శుక్రవారం 11 ఓవర్ల ఆట తర్వాత వానతో స్వల్ప విరామం వచ్చింది. అయితే ఆ తర్వాత సెంచరీ దిశగా సాగుతున్న లబ్‌షేన్‌ను చక్కటి బంతితో అవుట్ చేసి జడేజా 100 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరదించాడు. కొద్దిసేపటికే జడేజా బౌలింగ్‌లోనే ముందుకొచ్చి ఆడబోయి వేడ్ (13) వెనుదిరిగాడు. ఈ దశలో వర్షం కారణంగా మళ్లీ 23 నిమిషాలు ఆట సాగలేదు. అనంతరం కొత్త బంతితో బుమ్రా చెలరేగిపోయాడు. గ్రీన్ (0)ను వికెట్లు ముందు దొరకబుచ్చుకున్న అతను... కెప్టెన్ పైన్ (1) స్టంప్స్‌ను ఎగరగొట్టాడు. కమిన్స్ (0) కూడా పెవిలియన్ చేరడంతో ఆసీస్ కష్టాలు పెరిగాయి. ఈ దశలో మిషెల్ స్టార్క్ (30 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్) కొంత దూకుడుగా ఆడి స్మిత్‌కు సహకరించాడు. అయితే స్టార్క్‌ను షార్ట్ బంతితో సైనీ అవుట్ చేసిన తర్వాత ఆసీస్ ఆలౌట్ అయ్యేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. రోహిత్ వర్సెస్ లయన్ సుదీర్ఘ విరామం తర్వాత టెస్టు మ్యాచ్‌లో బరిలోకి దిగిన రోహిత్ శర్మ జాగ్రత్తగా ఆడాడు. ముఖ్యంగా ఆఫ్‌స్పిన్నర్ లయన్‌తో అతని పోరు ఆసక్తికరంగా సాగింది. లయన్ తొలి ఆరు ఓవర్లను పూర్తిగా రోహిత్ ఒక్కడే ఎదుర్కొన్నాడు. ఈ 42 బంతుల్లో ఒకరిపై మరొకరు ఆధిపత్యం ప్రదర్శించేందుకు ప్రయత్నించగా... 4 మెయిడిన్ ఓవర్లు వేసిన లయన్ 14 పరుగులు ఇచ్చాడు. లయన్ రెండో ఓవర్లోనే ముందుకు దూసుకొచ్చి లాంగాన్ మీదుగా రోహిత్ భారీ సిక్సర్ కొట్టాడు. ఇది అంతర్జాతీయ క్రికెట్లో ఆస్ట్రేలియాపై రోహిత్‌కు 100వ సిక్సర్ కావడం విశేషం. అదే ఓవర్లో రోహిత్ మరో ఫోర్ కూడా కొట్టాడు. రోహిత్ స్కోరు 24 వద్ద అంపైర్ ఎల్బీడబ్ల్యూగా ప్రకటించడంతో లయన్‌లో ఆనందం కనిపించింది. అయితే రివ్యూలో అది నాటౌట్‌గా తేలింది. చివరకు హాజల్‌వుడ్ బౌలింగ్‌లో అతనికే సునాయాస క్యాచ్ ఇచ్చి భారత ఓపెనర్ వెనుదిరిగాడు. శుక్రవారం 30వ పుట్టిన రోజు జరుపుకున్న హాజల్‌వుడ్‌కు ఇది 300వ అంతర్జాతీయ వికెట్. గిల్ వర్సెస్ కమిన్స్ తన తొలి టెస్టులోనే చక్కటి బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న శుబ్‌మన్ గిల్ దానిని ఇక్కడా కొనసాగించాడు. ముఖ్యంగా వరల్డ్ నంబర్‌వన్ బౌలర్ కమిన్స్‌ను అతను సమర్థంగా ఎదుర్కొన్న తీరు అభినందనీయం. కమిన్స్ తొలి 7 ఓవర్లను గిల్ ఒక్కడే ఆడాడు. ముఖ్యంగా ఆఫ్ సైడ్‌లో పడిన షార్ట్ బంతిని చివరి క్షణంలో పాయింట్ దిశగా ఆడి అతను బౌండరీగా మలచిన షాట్ ఇన్నింగ్స్‌కే ఆకర్షణగా నిలిచింది. స్టార్క్, లయన్ బౌలింగ్‌లలో కూడా గిల్ చూడచక్కటి ఫోర్లు కొట్టాడు. ఈ క్రమంలో 100 బంతుల్లో అతను తన కెరీర్ తొలి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఆ వెంటనే కమిన్స్ బౌలింగ్‌లోనే గిల్ ఇన్నింగ్స్ ముగిసింది. ఇద్దరూ ఓపిగ్గా... శుభారంభం తర్వాత 15 పరుగుల వ్యవధిలో 2 వికెట్లు కోల్పోవడంతో భారత్ ఆత్మ రక్షణలో పడింది. మరో వికెట్ చేజార్చుకుంటే జట్టు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉండటంతో పుజారా, రహానే చాలా జాగ్రత్తగా ఆడారు. పరుగులు తీయడంకంటే వికెట్ కాపాడుకోవడానికే ప్రాధాన్యమిచ్చారు. ఫలితంగా 12.5 ఓవర్లలో వీరిద్దరు 11 పరుగులు మాత్రమే జోడించగలిగారు! ఆసీస్ బౌలర్లు కూడా చక్కటి లైన్ అండ్ లెంగ్త్‌ను కొనసాగిస్తూ ఎక్కడా ఎలాంటి అవకాశం ఇవ్వకపోవడం కూడా దీనికి కారణం. స్మిత్ సూపర్...! ‘స్టీవ్ స్మిత్‌కు నేను కోచింగ్ ఇవ్వడం ఏమిటి... తనకు తానే అతను కోచింగ్ ఇచ్చుకుంటాడు. అదే అన్నింటికంటే బాగా పని చేస్తుంది చూడండి’... సిడ్నీ టెస్టు ఆరంభానికి ముందు ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్ చేసిన వ్యాఖ్య ఇది. నిజానికి స్మిత్ గొప్పతనం గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. అతను సాధించిన పరుగులు, రికార్డులు దానిని చూపిస్తాయి. అయితే తొలి రెండు టెస్టుల్లో ఘోర వైఫల్యంతో ఒక్కసారిగా అతనిపై విమర్శలు మొదలయ్యాయి. ముఖ్యంగా అశ్విన్ బౌలింగ్‌లో అతను అవుటైన తీరు ఆశ్చర్యం కలిగించింది. అయితే గొప్ప ఆటగాళ్లు తమ తప్పులు సరిదిద్దుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోరని స్మిత్ తన ఇన్నింగ్స్‌తో నిరూపించాడు. మొదటి రోజున ఆత్మవిశ్వాసంతో ఆడి 31 పరుగులతో ముగించిన అతను... శుక్రవారం బుమ్రా బౌలింగ్‌లో చూడచక్కటి కవర్ డ్రైవ్ బౌండరీతో మొదలు పెట్టాడు. ఆకట్టుకునే డ్రైవ్‌లు, తనదైన ట్రేడ్‌మార్క్ ఫ్లిక్ షాట్లతో చకచకా దూసుకుపోయాడు. భారత్ కొత్త బంతి తీసుకునే సమయానికి 142 బంతులు ఎదుర్కొన్న స్మిత్ 7 బంతులను మాత్రమే అవీ ఆఫ్ స్టంప్‌కు దూరంగా వెళుతున్న వాటినే వదిలేశాడంటే అతను ఎంత సాధికారికంగా ఆడాడో చెప్పవచ్చు. సైనీ బౌలింగ్‌లో స్క్వేర్ లెగ్ దిశగా ఆడి మూడు పరుగులు తీయడంతో 201 బంతుల్లో అతని సెంచరీ పూర్తయింది. ఈ మాజీ కెప్టెన్ కెరీర్లో ఇది 27వ శతకం కాగా, భారత్‌పై ఎనిమిదోది. సెంచరీ మార్క్ చేరగానే అతను భావోద్వేగాలు దాచుకోలేకపోయాడు. గాల్లోకి బ్యాట్‌కు పంచ్‌లు విసురుతూ సింహనాదం చేయడం చూస్తే అతని దృష్టిలో ఈ ఇన్నింగ్స్ విలువేమిటో అర్థమవుతుంది. సెంచరీ తర్వాతా స్మిత్ జోరు చూస్తే అతడిని అవుట్ చేయడం ఇక ఏ భారత బౌలర్ వల్ల కాదనిపించింది. చివరకు అదే జరిగినట్లు రనౌట్‌తో మాత్రమే అతను వెనుదిరగాల్సి వచ్చింది. ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయిన తర్వాత 106 పరుగులు చేస్తే అందులో స్మిత్ చేసినవే 71 పరుగులు ఉండటం విశేషం. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: పకోవ్‌స్కీ (ఎల్బీ) (బి) సైనీ 62; వార్నర్ (సి) పుజారా (బి) సిరాజ్ 5; లబ్‌షేన్ (సి) రహానే (బి) జడేజా 91; స్మిత్ (రనౌట్) 131; వేడ్ (సి) బుమ్రా (బి) జడేజా 13; గ్రీన్ (ఎల్బీ) (బి) బుమ్రా 0; పైన్ (బి) బుమ్రా 1; కమిన్స్ (బి) జడేజా 0; స్టార్క్ (సి) గిల్ (బి) సైనీ 24; లయన్ (ఎల్బీ) (బి) జడేజా 0; హాజల్‌వుడ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (105.4 ఓవర్లలో ఆలౌట్) 338 వికెట్ల పతనం: 1–6, 2–106, 3–206, 4–232, 5–249, 6–255, 7–278, 8–310, 9–315, 10–338. బౌలింగ్: బుమ్రా 25.4–7–66–2, సిరాజ్ 25–4–67–1, అశ్విన్ 24–1–74–0, సైనీ 13–0–65–2, జడేజా 18–3–62–4. భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ (సి అండ్ బి) హాజల్‌వుడ్ 26; గిల్ (సి) గ్రీన్ (బి) కమిన్స్ 50; పుజారా (బ్యాటింగ్) 9; రహానే (బ్యాటింగ్) 5; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (45 ఓవర్లలో 2 వికెట్లకు) 96 వికెట్ల పతనం: 1–70, 2–85. బౌలింగ్: స్టార్క్ 7–4–19–0, హాజల్‌వుడ్ 10–5–23–1, కమిన్స్ 12–6–19–1, లయన్ 16–7–35–0 -
ఆసీస్ క్రికెటర్‌పై షేన్ వార్న్ అసభ్యకర వ్యాఖ్యలు
సిడ్నీ: ఆస్ట్రేలియా మాజీ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ క్రికెటర్‌గా ఎంత పేరు సంపాదించాడో.. వివాదాల్లోనూ అంతే పేరు మూటగట్టుకున్నాడు. తాజాగా సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు మొదటి సెషన్లో వార్న్ మరో మాజీ ఆటగాడు ఆండ్రూ సైమండ్స్‌తో కలిసి కామెంటరీ చేశాడు. ఈ సందర్భంగా ఆసీస్ బ్యాట్స్‌మన్ మార్నస్ లబుషేన్‌పై వార్న్ అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. లబుషేన్ క్రీజులో చూపిస్తున్న మేనరిజమ్స్పై సైమండ్స్ ఏదో చెప్పగా..వార్న్ దానికి అడ్డుపడుతూ..'జీసస్..చూడడానికి చాలా ఇబ్బందిగా ఉంది..మొదట బ్యాట్‌ను సరిగా పట్టుకోమను' అంటూ దూషించాడు. లబుషేన్‌పై వార్న్ చేసిన వ్యాఖ్యలను సైమండ్స్ సమర్థిస్తూ ఒక బూతు పదాన్ని ఉపయోగించాడు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణను లెన్నీ పిలిఫ్స్ తన ట్విటర్లో షేర్ చేశాడు. వార్న్‌కు ఎవరైనా ఒక్కటే.. తనకు నచ్చకపోతే ప్రత్యర్థి ఆటగాళ్లను ఎంతలా ద్వేషిస్తాడో.. సహచర క్రికెటర్లను కూడా అదే తీరుతో చూస్తాడంటూ కామెంట్లు పెడుతున్నారు.(చదవండి: 'తొందరపడ్డావు.. కొంచెం ఆగుంటే బాగుండేది') Ahh Kayo, thank you for this pic.twitter.com/Jy6PfTpvYK — Lenny Phillips (@lenphil29) January 8, 2021 లెజెండరీ స్పిన్నర్‌గా పిలవబడే వార్న్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో చాలా ముందుంటాడు. తాను క్రికెట్ ఆడే సమయంలో స్టీవ్ వా, పాంటింగ్ కెప్టెన్సీలో ప్రత్యర్థి ఆటగాళ్లపై బాహంటగానే స్లెడ్జింగ్‌కు దిగేవాడు. ప్రొఫెషనల్‌గా మాత్రమే గాక వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నోసార్లు వివాదాలకు కేంద్ర బిందువుగా మారాడు. ఈ మధ్యనే టీమిండియా, ఆసీస్‌ల మధ్య తొలి టెస్టు సమయంలో చతేశ్వర్ పుజారాను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. పుజారా పేరు పలకడం తనకు ఇబ్బందిగా ఉంటుందని.. అందుకే అతన్ని స్టీవ్ అని పిలుస్తానని చెప్పాడు. దీనిపై సోషల్ మీడియాలో షేన్ వార్న్‌ను నెటిజన్లు ఒక రేంజ్లో ఆడుకున్నారు. దీంతో షేన్ వార్న్ దెబ్బకు దిగివచ్చి తాను చేసిన పనికి క్షమాపణ చెప్పుకోవాల్సి వచ్చింది.(చదవండి: రిషభ్ పంత్‌పై ట్రోలింగ్.. సైనీ తొలి వికెట్) -
దెబ్బలే దెబ్బలు.. ఇంప్రెస్ అయ్యాను
ఆడటం, ఆటలో తలకు దెబ్బ తగిలించుకోవడం, ఆపై విరామం, మళ్లీ రావడం, మళ్లీ తలకు దెబ్బ... వింతగా అనిపించినా ఇదంతా విల్ పకోవ్‌స్కీకి రొటీన్ వ్యవహారం! అత్యంత ప్రతిభావంతుడు... అన్ని రకాల షాట్లూ ఆడగల నైపుణ్యం... 23 ఏళ్ల పకోవ్‌స్కీ గురించి ఆస్ట్రేలియా క్రికెట్లో వినిపించే మాట. అంచనాలకు అనుగుణంగా అతని దేశవాళీ రికార్డు కూడా అద్భుతంగా ఉంది. 23 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 54.50 సగటుతో అతను 1,744 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు కూడా ఉన్నాయి. ఇదే అతడికి ఆస్ట్రేలియా తరఫున టెస్టు క్రికెట్ ఆడే అవకాశం కల్పించింది. అయితే ఇంత దూరం ప్రయాణించడానికి ముందు అతని జీవితంలో పలు ఆసక్తికర అంశాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ‘కన్కషన్’ సమస్యకు పకోవ్‌స్కీ కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయాడు. ఈ సమస్య మాత్రం ఇప్పటికీ అతడిని వెంటాడుతూనే ఉంది. పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు సిడ్నీ టెస్టుకు ముందు అతను ప్రత్యేకంగా న్యూరాలజిస్ట్‌ను సంప్రదించాల్సి వచ్చింది. అవిభాజ్య చెకోస్లొవేకియా మూలాలు ఉన్న అతని తండ్రి జాన్ తన చిన్నప్పుడే ముందుగా సెర్బియాకు, ఆపై ఆస్ట్రేలియాకు వలస వెళ్లిపోయాడు. ఈ నేపథ్యమే అతని పకోవ్‌స్కీ పేరుకు కారణం. (చదవండి: ‘ఏంటిది పంత్.. ఎందుకిలా చేశావు’) దెబ్బలే దెబ్బలు... పకోవ్‌స్కీ స్కూల్లో ఉన్నప్పుడు ఫుట్‌బాల్ ఆడుతుంటే ప్రత్యర్థి ఆటగాడి మోకాలు అతని తలకు బలంగా తాకింది. దాంతో ఆటతో పాటు స్కూల్ నుంచి కూడా ఆరు నెలలు అవుట్. క్రికెట్లోకి వచ్చాక కూడా ఆ దెబ్బ లక్షణాలు కనిపించాయి. కొన్నాళ్లకే ఒక బౌన్సర్‌తో తలకు గాయమైంది. కోలుకున్న కొద్ది రోజులకే ఇంట్లో జారి పడి తల తలుపును బలంగా ఢీకొంది. ఇది ఇంతటితో ముగియలేదు. నెట్ ప్రాక్టీస్ చేస్తుండగా పక్క నెట్లో సాధన చేస్తున్న బ్యాట్స్‌మన్ కొట్టిన బంతి ఊహించని విధంగా ఇతని వైపు వచ్చి తలకు తగిలింది. తన 17వ పుట్టిన రోజున తొలి ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడేందుకు సన్నద్ధమవుతున్న సంతోష సమయంలో ఆటతో సంబంధం లేని ఎవరో బయటి నుంచి విసిరిన బంతి నేరుగా వచ్చి పకోవ్‌స్కీ తల వద్దకే చేరుకుంది. అంతే... సీజన్ మొత్తం పోయింది. కొద్ది రోజుల తర్వాత కన్కషన్ లక్షణాలు కనిపించాయి. అదే ఏడాది చివర్లో దేశవాళీ వన్డే మ్యాచ్‌లో బెన్ కటింగ్ బౌన్సర్ తలకు తగలడంతో రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. నెల రోజుల తర్వాత ఫ్యూచర్స్ లీగ్ మ్యాచ్‌లో కూడా సరిగ్గా ఇలాగే జరిగింది. 2018 మార్చిలో ప్రతిష్టాత్మక షెఫీల్డ్ షీల్డ్‌లో సెంచరీతో అందరి దృష్టిలో పడిన తరుణంలో సీన్ అబాట్ షార్ట్ బాల్ మళ్లీ తలకు తగిలింది... అంతే సీజన్ మొత్తం ఆడలేకపోయాడు! సరిగ్గా ఏడాది క్రితం పాకిస్తాన్‌తో టెస్టు అరంగేట్రం ఖాయమైన సమయంలో మానసిక సమస్యలు పెరిగిపోయి మూడు నెలలు క్రికెట్‌కే విరామం ఇచ్చేశాడు. ఈ ఏడాది ఆరంభంలో తన 22వ పుట్టిన రోజున ఇంగ్లండ్ యువ జట్టుతో మ్యాచ్‌లో సింగిల్ తీసే సమయంలో బ్యాట్ మైదానంలో ఇరుక్కుపోవడంతో బొక్కబోర్లా పడగా తలకు దెబ్బ తగిలి కన్‌కషన్‌కు లోనయ్యాడు. ఎట్టకేలకు అరంగేట్రం... తాజాగా షెఫీల్డ్ షీల్డ్‌లో వరుసగా రెండు డబుల్ సెంచరీలతో సత్తా చాటి భారత్‌తో సిరీస్ ఆడేందుకు సిద్ధమైన తరుణంలో ప్రాక్టీస్ మ్యాచ్‌లో కార్తీక్ త్యాగి బౌన్సర్ తలకు తగలడంతో కన్కషన్ కారణంగా రెండు టెస్టులు పోయాయి. వందలాది షార్ట్ పిచ్ బంతులను అద్భుతమైన పుల్ షాట్లతో బౌండరీలకు తరలించే నైపుణ్యం ఒకవైపు... ఇలా అనూహ్యంగా తప్పించుకునే ప్రయత్నంలో తలకు దెబ్బలు మరో వైపు ఆసీస్ మేనేజ్మెంట్ను కూడా అయోమయంలో పడేస్తున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుంటే మన బౌలర్లు అలాంటి బంతులతో అతడిని ఇబ్బంది పెట్టడం కూడా ఒక వ్యూహంలా మారిపోయింది. అయితే తొలి రోజు పకోవ్‌స్కీకి మరీ అలాంటి సమస్య ఏమీ ఎదురు కాలేదు. ఎట్టకేలకు తనపై ఉంచిన నమ్మకానికి న్యాయం చేస్తూ అతను అర్ధ సెంచరీ సాధించాడు. చక్కటి షాట్లతో ఆకట్టుకొని తనకు మంచి భవిష్యత్తు ఉందని దిగ్గజాల అభినందనలు చూరగొన్నాడు. ఇక ఈ యువ ఆటగాడి ఆటకు ఫిదా అయిన ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్.. ‘‘ఈరోజు పకోవ్‌స్కీ ఇన్నింగ్స్‌తో ఇంప్రెస్ అయ్యాను. ఎన్నో అవాంతరాలు దాటిన తర్వాత తన జీవితంలో గొప్ప మలుపు. టెస్టుల్లో అరంగేట్రంలోనే మంచి ప్రదర్శన’’ అంటూ ప్రశంసలు కురిపించాడు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా అరంగేట్ర బౌలర్ నవదీప్ సైనీకి పకోవ్‌స్కీ వికెట్ సమర్పించుకోవడం గమనార్హం. -
తొలిరోజు చేజారింది..
వర్షం...విల్ పకోవ్‌స్కీ... వికెట్ కీపర్ వైఫల్యం...సంక్షిప్తంగా సిడ్నీ టెస్టు తొలి రోజు ఆట ఇది! గత రెండు టెస్టులకు భిన్నంగా ఆస్ట్రేలియా ఈ సారి కాస్త ఆత్మవిశ్వాసంతో ఆడగా... మన బౌలింగ్ వైఫల్యం, పంత్ క్యాచ్‌లు వదిలేయడం వెరసి ప్రత్యర్థిదే పైచేయిగా మారింది. వాన కారణంగా 55 ఓవర్లకే పరిమితమైన ఆటను రెండు అర్ధ సెంచరీలు ప్లస్ ఒక శతక భాగస్వామ్యంతో ఆతిథ్య జట్టు సంతృప్తిగా ముగించింది. ఇదే జోరుతో రెండో రోజు ఆ జట్టు భారీ స్కోరుపై దృష్టి పెట్టింది. అన్నింటికి మించి సొంత మైదానంలో స్మిత్ ఫామ్‌లోకి రావడం ఇప్పుడు భారత్‌ను కాస్త ఆందోళన పెట్టే అంశం. సిడ్నీ: మూడో టెస్టులో కూడా భారత్‌కు శుభారంభం దక్కినా... రెండు క్యాచ్‌లు నేలపాలు కావడంతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ పుంజుకునేందుకు అవకాశం దక్కింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా పటిష్ట స్థితిలో నిలిచింది. గురువారం టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ 55 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. అరంగేట్ర ఓపెనర్ విల్ పకోవ్‌స్కీ (62; 4 ఫోర్లు), మార్నస్ లబ్‌షేన్ (67 బ్యాటింగ్; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్న లబ్‌షేన్, స్టీవ్ స్మిత్ (31 బ్యాటింగ్; 5 ఫోర్లు) కలిసి మూడో వికెట్‌కు అభేద్యంగా 60 పరుగులు జోడించారు. వార్నర్ విఫలం గాయంనుంచి కోలుకున్న వార్నర్‌ను ఆడించడం ద్వారా ప్రత్యర్థిపై అదనపు ఒత్తిడిని పెంచాలనుకున్న వ్యూహం ఆసీస్‌కు బెడిసికొట్టింది. టెస్టు ఆడే స్థాయి ఫిట్నెస్ లేకపోయినా బరిలోకి దిగిన డాషింగ్ బ్యాట్స్‌మన్ వార్నర్ (5)ను సిరాజ్ తన రెండో ఓవర్లోనే (ఇన్నింగ్ 4వ) పెవిలియన్ చేర్చాడు. ఆఫ్ స్టంప్‌పై నుంచి వేగంగా దూసుకొచ్చిన బంతి వార్నర్ బ్యాట్ అంచును తాకుతూ నేరుగా స్లిప్‌లో ఉన్న పుజారా చేతుల్లో పడింది. తర్వాత లబ్‌షేన్ వచ్చాడు. ఆ వెంటే వాన కూడా వచ్చింది. విరామం తర్వాత తిరిగి మొదలైన ఆట ఆస్ట్రేలియాకే అనుకూలంగా సాగింది. ఇటు లబ్‌షేన్ కుదురుగా ఆడుతుండగా... అటు పంత్ పుణ్యమా అని రెండు లైఫ్‌లు పొందిన ఓపెనర్ పకోవ్‌స్కీ అర్ధ సెంచరీతో రాణించాడు. జట్టు స్కోరు 100 పరుగులు దాటాక ఎట్టకేలకు పకోవ్‌స్కీని సైనీ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. లబ్‌షేన్ అర్ధసెంచరీ స్టీవ్ స్మిత్ వచ్చాక ఆసీస్ ఇన్నింగ్స్ సాఫీగా సాగిపోయింది. గత మ్యాచ్‌ల వైఫల్యాల దృష్ట్యా ఈ మ్యాచ్‌లో అతను పట్టుదలగా ఆడాడు. భారత బౌలర్లు సంధించిన వైవిధ్యమైన బంతులను చక్కగానే ఆకళింపు చేసుకొని సమర్థంగా ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా అశ్విన్ బౌలింగ్‌లో తడబాటును అధిగమించి క్రీజులో పాతుకుపోయాడు. లబ్‌షేన్ కూడా స్మిత్ అండతో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆఖరి సెషన్లో ఈ జోడీని విడగొట్టేందుకు భారత కెప్టెన్ రహానే చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. క్రీజులో ఆత్మవిశ్వాసంతో ఆడిన స్మిత్ చూడచక్కని బౌండరీలతో ఆకట్టుకున్నాడు. లబ్‌షేన్ కూడా ఫోర్లతో అదరగొట్టాడు. ఆట నిలిచే సమయానికి వీరిద్దరు అభేధ్యమైన మూడో వికెట్‌కు 60 పరుగులు జోడించారు. వానొచ్చే... ఆట ఆగే! మ్యాచ్ టైమ్‌కే మొదలైంది కానీ... కాసేపటికే ముసిరిన వానతో టైమ్ అంతా గడిచిపోయింది. షెడ్యూలు ప్రకారం ఉదయం 10.30 గంటలకు (స్థానిక కాలమానం) ఆట ఆరంభమైంది. ఇంకేం ఆటకు ఢోకా లేదనుకునేంత లోపే పిడుగులా వచ్చి పడింది వాన. ఎనిమిదో ఓవర్లో కురిసిన వాన తొలి సెషన్‌పై నీళ్లు చల్లింది. తెరిపినివ్వలేకపోవడంతో ఆ వానలోనే లంచ్‌బ్రేక్ ముగిసింది. ఇక రెండో సెషన్‌ను అయినా వరుణుడు కరుణిస్తాడేమో అనుకుంటే అంత తేలిగ్గా చినుకులు ఆగలేదు. ఆట మొదలవలేదు. చాలాసేపటికి తెరిపినివ్వడంతో మధ్యాహ్నం 3 గంటలకు (స్థానిక కాలమానం) పునఃప్రారంభమైంది. ఓ విధంగా చెప్పాలంటే ఉదయం 11.05 నిమిషాలకు మొదలైన 8వ ఓవర్ మధ్యాహ్నం 3.10 నిమిషాలకు ముగిసిందన్నమాట. మళ్లీ సరిగ్గా టీ బ్రేక్ సమయంలో చినుకులు కురిసినా నిమిషాల వ్యవధిలోనే ఆగడంతో ఆట కోసం మళ్లీ నిరీక్షించాల్సిన పని లేకపోయింది. పంత్ పదేపదే... వృద్ధిమాన్ సాహా టెస్టుల్లో మంచి వికెట్ కీపర్. సంప్రదాయ ఫార్మాట్లో వికెట్ల వెనుక అతని చురుకుదనం అందరికీ తెలుసు. అయితే బ్యాటింగ్‌లో సాహాకంటే మెరుగంటూ పంత్‌కు తుది జట్టులో చోటు లభిస్తోంది. బలమైన ప్రత్యర్థి, కీలకమైన మ్యాచ్‌లో అప్రమత్తంగా ఉండాల్సిన రిషభ్ పంత్ మూడు ఓవర్ల వ్యవధిలోనే రెండు క్యాచ్‌ల్ని చేజార్చడం తొలి రోజు భారత్‌కు సమస్యగా మారింది. 22వ ఓవర్లో అశ్విన్ బౌలింగ్ చేస్తుండగా... పకోవ్‌స్కీ 26 పరుగుల వద్దే ఉన్నాడు. మెలికలు తిరిగిన ఆఖరి బంతి అతని బ్యాట్ అంచును తాకి గాల్లోకి లేచింది. సునాయాసమైన ఈ క్యాచ్‌ను పంత్ నేలపాలు చేశాడు. దీంతో అశ్విన్ తీవ్ర నిరాశను వ్యక్తం చేశాడు. మళ్లీ 25వ ఓవర్ సిరాజ్ వేయగా.. పకోవ్‌స్కీ గ్లౌజ్‌ను తాకుతూ వెళ్లిన బంతిని క్యాచ్ అందుకునేందుకు రెండు సార్లు డైవ్‌చేసి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అప్పటికీ అతని స్కోరు 32 పరుగులే!.. ఇలా లైఫ్ పొందిన పకోవ్‌స్కీ ఎట్టకేలకు అర్ధసెంచరీ పూర్తి చేసుకుని అరంగేట్రంలో మెరుగైన ప్రదర్శన కనబరిచి అందరి చేతా అభినందనలు అందుకుంటున్నాడు. నవదీప్ సైనీ బౌలింగ్‌లో అతడు ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ► భారత్ తరఫున టెస్టుల్లో ఆడిన 299వ ఆటగాడిగా నవదీప్ సైనీ నిలిచాడు. పేసర్ బుమ్రా చేతుల మీదుగా అతను ‘టెస్టు క్యాప్’ను అందుకున్నాడు. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: పకోవ్‌స్కీ (ఎల్బీడబ్ల్యూ) (బి) సైనీ 62; వార్నర్ (సి) పుజారా (బి) సిరాజ్ 5; లబ్‌షేన్ బ్యాటింగ్ 67; స్మిత్ బ్యాటింగ్ 31; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (55 ఓవర్లలో 2 వికెట్లకు) 166. వికెట్ల పతనం: 1–6, 2–106. బౌలింగ్: బుమ్రా 14–3–30–0, సిరాజ్ 14–3–46–1, అశ్విన్17–1–56–0, నవ్‌దీప్ సైనీ 7–0–32–1, జడేజా 3–2–2–0. -
ఈ మ్యాచ్‌లో నా ఫోకస్ మొత్తం అశ్విన్‌పైనే..
సిడ్నీ : ఆసీస్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ టీమిండియా బౌలర్ రవిచంద్రన్ అశ్విన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్‌లో తన ఫోకస్ మొత్తం అశ్విన్‌పైనే ఉంటుందని స్మిత్ తెలిపాడు. మూడో టెస్టులో భాగంగా తొలిరోజు ఆట ముగిసిన అనంతరం వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా స్మిత్ మీడియాతో మాట్లాడాడు. మొదటి రెండు టెస్టుల్లో నా నుంచి ఆశించిన ప్రదర్శన రాలేదు. కానీ మూడో టెస్టు మ్యాచ్‌కు వచ్చేసరికి నా బ్యాటింగ్‌లో కొంత మార్పు కనిపించింది. మొదటిరోజు ఆటలో చివరి సెషన్ వరకు నిలిచి లబుషేన్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పడం సంతృప్తినిచ్చింది. అయితే ఈ సిరీస్‌లో అశ్విన్‌పై ఒత్తిడి పెంచడంలో విఫలమయ్యాను.. కానీ ఈ మ్యాచ్‌లో మాత్రం అశ్విన్‌ను ఒత్తిడిలో పడేసే దానిపైనే ప్రత్యేక దృష్టి సారించాను. ఆరంభంలో బంతులను ఎదుర్కోవడంలో కాస్త తడబడ్డా పిచ్ పరిస్థితిపై ఒక అంచనాకు వచ్చాక బౌండరీలతో పరుగుల రాబట్టడంలో సక్సెస్ అయ్యాను. ఇదే టెంపోనూ రెండో రోజు ఆటలోనూ కొనసాగించాలని అనుకుంటున్నా. ఇప్పటికైతే రెండు సెషన్లు కలుపుకొని మేమే పైచేయి సాధించామని పేర్కొన్నాడు. (చదవండి: ఆయన కల నెరవేరింది.. కానీ ఈరోజు బతికిలేరు) కాగా వన్డే సిరీస్‌లో దుమ్మురేపే ప్రదర్శనతో ఆకట్టుకున్న స్మిత్ మొదటి రెండు టెస్టుల్లో మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. రెండు టెస్టులు కలిపి 10 పరుగులు చేసిన స్మిత్ రెండుసార్లు అశ్విన్ బౌలింగ్‌లోనే ఔట్ కావడం విశేషం.ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 55 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. లబుషేన్ 67 పరుగులతో, స్టీవ్ స్మిత్ 31 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా మొదటి సెషన్లో ఆసీస్ 7 పరుగులు చేసిన తర్వాత వర్షం అంతరాయం కలిగించడంతో ఒక సెషన్ మొత్తం తూడిచిపెట్టుకుపోయింది. (చదవండి: 'టీమిండియాను వదిలి రావడం బాధగా ఉంది') -
‘సమం’ నుంచి మరో సమరానికి...
అడిలైడ్ టెస్టు ఫలితం తర్వాత భారత జట్టు 0–4కు సిద్ధపడాల్సిందేనంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన పలువురు మాజీ క్రికెటర్లు రెండో మ్యాచ్ తర్వాత మళ్లీ మాట్లాడే సాహసం చేయలేకపోయారు. ప్రతికూల పరిస్థితుల్లో టీమిండియా సాధించిన విజయం అలాంటిది మరి. ఇప్పుడు ఇరు జట్లు సమాన స్థితిలో నిలిచిన దశలో కొత్త సమరానికి రంగం సిద్ధం కాగా... ప్రత్యర్థితో పోలిస్తే భారత జట్టులోనే ఆత్మవిశ్వాసం ఎక్కువగా కనిపిస్తోంది. మెల్బోర్న్ స్ఫూర్తిని కొనసాగిస్తూ మూడో టెస్టులోనూ గెలవగలిగితే బోర్డర్–గావస్కర్ ట్రోఫీని భారత్ సగర్వంగా నిలబెట్టుకోగలుగుతుంది. సొంతగడ్డపై భారత్ చేతిలో వరుసగా రెండో సిరీస్ కోల్పోరాదని భావిస్తున్న ఆస్ట్రేలియా తీవ్ర ఒత్తిడిలో బరిలోకి దిగుతున్న నేపథ్యంలో... సిడ్నీలో సీన్ ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరం. సిడ్నీ: టెస్టు సిరీస్‌లో పైచేయి సాధించే క్రమంలో భారత్, ఆస్ట్రేలియా మూడో టెస్టు పోరుకు సన్నద్ధమయ్యాయి. నేటి నుంచి జరిగే ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్‌లో ముందంజ వేస్తుంది. భారత్ ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే చివరి టెస్టులో ఓడినా బోర్డర్–గావస్కర్ ట్రోఫీని నిలబెట్టుకోగలదు. పలువురు కీలక ఆటగాళ్లు దూరమైనా... బలాబలాల్లో ఆతిథ్య జట్టుతో పోలిస్తే రహానే బృందానిదే కాస్త పైచేయిగా ఉంది. ఓపెనర్‌గా రోహిత్... గత రెండు మ్యాచ్‌లలాగే ఈసారి కూడా భారత్ తమ తుది జట్టును ఒకరోజు ముందే ప్రకటించింది. గాయం వివాదం... ఫిట్నెస్ పరీక్ష... కఠిన క్వారంటైన్‌ను దాటి వచ్చిన రోహిత్ శర్మకు ఊహించినట్లుగానే స్థానం లభించింది. రోహిత్ కోసం మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌పై వేటు పడింది. ఈ సిరీస్‌లో నాలుగు ఇన్నింగ్స్‌లలో కలిపి మయాంక్ 31 పరుగులే చేశాడు. ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారి స్థానంపై కూడా ప్రమాద ఘంటిక మోగినా... రోహిత్ ఓపెనింగ్ చేయాలని మేనేజ్మెంట్ భావించడంతో మయాంక్‌ను పక్కన పెట్టాల్సి వచ్చింది. గత ఏడాది ఓపెనర్‌గా మారిన అనంతరం రోహిత్ ఐదు టెస్టుల్లో మూడు సెంచరీలతో చెలరేగినా... అవన్నీ స్వదేశంలో ఆడినవే. విదేశాల్లో ఇంతవరకు ఓపెనింగ్ చేయని రోహిత్ ఎలా ఆడతాడన్నది చూడాలి. ప్రధాన బ్యాట్స్‌మన్ పుజారా నుంచి కూడా ఇంకా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ రాలేదు. రహానే బ్యాటింగ్‌లో కీలకం కానుండగా, విహారికి తన కెరీర్ కాపాడుకునేందుకు ఇంతకంటే మంచి అవకాశం లభించదు. బౌలింగ్‌లో 2014 తర్వాత ఇంత తక్కువ అనుభవం ఉన్న పేసర్లతో భారత్ బరిలోకి దిగుతోంది. బుమ్రా 16 టెస్టులు, సిరాజ్ ఒకే ఒక టెస్టు ఆడగా, నవదీప్ సైనీకి తొలి మ్యాచ్ ఆడే అవకాశం దక్కింది. ఈ నేపథ్యంలో బుమ్రాపై మరింత బాధ్యత పెరిగింది. అయితే స్పిన్నర్ అశ్విన్ అద్భుత ఫామ్‌లో ఉండటం సానుకూలాంశం. జడేజా కూడా తన స్పిన్ పదును చూపిస్తే ఆసీస్ బ్యాట్స్‌మెన్‌కు తిప్పలు తప్పవు. పకోవ్‌స్కీ అరంగేట్రం... గాయంతో తొలి రెండు టెస్టు మ్యాచ్‌లకు దూరమైన డేవిడ్ వార్నర్ రాకతో ఆసీస్ బలం పెరిగింది. అతను 100 శాతం ఫిట్‌గా లేకపోయినా ఆడించే ప్రయత్నం చేయడం ఆ జట్టు బ్యాటింగ్ బలహీతనను చూపిస్తోంది. వార్నర్‌కు తోడుగా కొత్త కుర్రాడు విల్ పకోవ్‌స్కీ ఓపెనర్‌గా రావడం దాదాపుగా ఖాయం. ఈ కొత్త జోడి అందించే ఓపెనింగ్పైనే ఆసీస్ ఇన్నింగ్స్ పురోగతి ఆధారపడి ఉంది. అన్నింటికి మంచి ఆస్ట్రేలియాను ఆందోళనపరుస్తున్న అంశం టాప్ బ్యాట్స్‌మన్ స్మిత్ ఫామ్. రెండు మ్యాచ్‌లలోనూ అతను ఘోరంగా విఫలమయ్యాడు. ఇప్పుడు సొంత మైదానం సిడ్నీలోనైనా స్మిత్ చెలరేగి జట్టును నడిపించాలని మేనేజ్మెంట్ కోరుకుంటోంది. పింక్ టెస్టు మ్యాచ్... అడిలైడ్ టెస్టు ‘పింక్ బాల్’ టెస్టు కాగా... ఇప్పుడు సిడ్నీలో జరగబోయేది పింక్ టెస్టు. ప్రతీ ఏడాదిలాగే ఈసారి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ నివారణకు సంబంధించి ప్రచారంలో భాగంగా మైదానంలో పలు చోట్ల గులాబీ రంగును ప్రదర్శిస్తున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్‌తో మృతి చెందిన ఆస్ట్రేలియా దిగ్గజ పేస్ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్ భార్య జేన్ స్మారకార్థం సిడ్నీ టెస్టును పింక్ టెస్టుగా పరిగణిస్తారు. ఆసీస్ ఆటగాళ్లు తొలి రోజు గులాబీ క్యాప్‌లు ధరించి మైదానంలోకి దిగుతారు. మ్యాచ్ ద్వారా సేకరించే నిధుల్లో కొంత మొత్తాన్ని గ్లెన్ మెక్‌గ్రాత్‌కు చెందిన జేన్ మెక్‌గ్రాత్ ఫౌండేషన్‌కు అందజేస్తారు. పురుషుల టెస్టు మ్యాచ్‌కు తొలి మహిళా అంపైర్ పురుషుల టెస్టు మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవహరించనున్న తొలి మహిళా అంపైర్‌గా క్లెయిర్ పొలొసాక్ (ఆస్ట్రేలియా) గుర్తింపు పొందనుంది. సిడ్నీ టెస్టులో ఆమె ఫీల్డ్ అంపైర్‌గా కాకుండా... ఫోర్త్ అంపైర్‌గా వ్యవహరించనుంది. న్యూసౌత్ వేల్స్‌కు చెందిన 32 ఏళ్ల క్లెయిర్ 2019లో నమీబియా–ఒమన్ పురుషుల జట్ల మధ్య జరిగిన ఐసీసీ డివిజన్–2 వన్డే లీగ్ మ్యాచ్‌లో ఆన్ ఫీల్డ్ అంపైర్‌గా పనిచేసింది. పిచ్, వాతావరణం గత కొద్ది రోజులుగా నగరంలో వరుసగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ మ్యాచ్‌కు కూడా కొంత అంతరాయం కలగవచ్చు. గతంలో స్పిన్నర్లకు బాగా అనుకూలించిన సిడ్నీ పిచ్ ఇప్పుడు మారింది. కొంత బౌన్స్ ఉంది. పచ్చికను కూడా ఉంచారు కాబట్టి ఆరంభంలో పేసర్లకు అనుకూలిస్తుంది. నిలదొక్కుకుంటే తర్వాత పరుగులు సాధించవచ్చు. జట్ల వివరాలు భారత్ (తుది జట్టు): రహానే (కెప్టెన్), రోహిత్, గిల్, పుజారా, విహారి, పంత్, జడేజా, అశ్విన్, సిరాజ్, బుమ్రా, సైనీ. ఆస్ట్రేలియా (అంచనా): పైన్ (కెప్టెన్), వార్నర్, పకోవ్‌స్కీ, స్మిత్, లబ్‌షేన్, వేడ్, గ్రీన్, కమిన్స్, స్టార్క్, హాజల్‌వుడ్, లయన్. ► భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్నీలో మొత్తం 12 టెస్టులు జరిగాయి. భారత్‌కు ఒక్క టెస్టులోనే విజయం (1978లో) దక్కింది. టీమిండియా మిగతా ఐదు టెస్టుల్లో ఓడిపోయి, ఆరు టెస్టులను ‘డ్రా’ చేసుకుంది. ► మరో 97 పరుగులు చేస్తే పుజారా టెస్టుల్లో 6 వేల పరుగులు పూర్తి చేసుకుంటాడు. ► 400 వికెట్ల మైలురాయిని అందుకునేందుకు లయన్‌కు కావాల్సిన వికెట్లు -
నటరాజన్‌కు నిరాశ.. అతడి అరంగేట్రం
సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగనున్న మూడో టెస్టుకు టీమిండియా తుదిజట్టును ప్రకటించింది. స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్ ద్వారా తిరిగి జట్టుతో చేరగా.. బౌలర్ నవదీప్ సైనీ టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నాడు. రోహిత్ రాకతో మయాంక్ అగర్వాల్‌పై వేటు పడగా.. నవదీప్ ఎంట్రీతో నటరాజన్‌కు మొండిచేయి ఎదురైంది. కాగా ఆసీస్- టీమిండియా మధ్య గురువారం మూడో టెస్టు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానే సారథ్యంలోని టీమిండియా ఆసీస్‌ను ఢీకొట్టేందుకు అన్నివిధాలుగా సన్నద్ధమవుతోంది. ఇక తొలి టెస్టు తర్వాత రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి స్వదేశానికి తిరిగి రాగా.. మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, కేఎల్ రాహుల్ గాయాల బారిన పడి జట్టుకు దూరమైన విషయం తెలిసిందే.(చదవండి: సిడ్నీలో రేపటి నుంచి మూడో టెస్టు) తుదిజట్టు: అజింక్య రహానే(కెప్టెన్), రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, హనుమ విహారి, రిషభ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, నవదీప్ సైనీ (చదవండి: నాలుగో టెస్టు: ముంబైలో అయినా ఓకే: ఆసీస్ కెప్టెన్) -
హమ్మయ్య! అందరికీ నెగెటివ్
మెల్బోర్న్: హమ్మయ్య! భారత క్రికెటర్లకే కాదు... క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)కే ఇది పెద్ద ఊరట. ఆటగాళ్లంతా కోవిడ్–19 పరీక్షల నుంచి నెగెటివ్‌గా బయటపడ్డారు. దీంతో ఈనెల 7 నుంచి సిడ్నీలో జరిగే మూడో టెస్టుకు వచ్చిన ముప్పేమీ లేదిపుడు. ‘ఆటగాళ్లతో పాటు జట్టు సహాయ సిబ్బందిలో ఎవరికీ కరోనా సోకలేదు. ఆదివారం వీరందరికీ ‘ఆర్టీ–పీసీఆర్’ కోవిడ్ పరీక్షలు నిర్వహించగా... సోమవారం ఫలితాలన్నీ నెగెటివ్‌గానే వచ్చాయి’ అని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒక ప్రకటనలో తెలిపింది. రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, రిషభ్ పంత్, నవ్‌దీప్ సైనీ, పృథ్వీ షాలు కరోనా నిబంధనల్ని ఉల్లంఘించారని, బయో బబుల్ దాటి బయటకొచ్చి రెస్టారెంట్ రుచులు చూశారని గగ్గోలు పెట్టిన ఆసీస్ ప్రభుత్వ వర్గాలు ఇక తమ నోటికి తాళం వేసుకుంటాయేమో! ఎందుకంటే ఇప్పటికే ఈ ఉదంతంపై బీసీసీఐతో కలిసి సీఏ ఉమ్మడి దర్యాప్తు చేపడుతుందంటూ చేసిన ప్రకటనలకు ఇక కాలం చెల్లినట్లే! రెస్టారెంట్లో భోంచేసిన ఆ ఐదుగురు ఆటగాళ్లను ఐసోలేషన్‌లో ఉంచినప్పటికీ సోమవారం జట్టుతో పాటే సిడ్నీకి చేరుకున్నారు. తాజాగా రిపోర్టులు కూడా నెగెటివ్‌గా రావడంతో ఇప్పుడు అంతా కలిసే ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంటారు. 25 శాతం మంది వీక్షకులకే ప్రవేశం సిడ్నీలో నమోదవుతున్న కరోనా కేసుల దృష్ట్యా మూడో టెస్టుకు వచ్చే వీక్షకుల సంఖ్యను 25 శాతానికి కుదించారు. ఈ మైదానం మొత్తం సామర్థ్యం 38 వేల సీట్లు. దీంతో పదివేల లోపే ప్రేక్షకుల్ని అనుమతిస్తారు. ఈ నేపథ్యంలో టెస్టు కోసం ఇది వరకే జారీ చేసిన టికెట్లను ప్రభుత్వ ఆదేశాల మేరకు రద్దు చేసి అంతా కొత్తగా అంటే సీటుకు, సీటుకు మధ్య భౌతిక దూరం వుండేలా తిరిగి జారీ చేస్తారు. దీనిపై సీఏ తాత్కాలిక సీఈఓ నిక్ హాక్లీ మాట్లాడుతూ ‘న్యూసౌత్‌వేల్స్ రాష్ట్రంలోని ప్రజారోగ్యం దృష్ట్యా మేం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం. మూడో టెస్టు సజావుగా, సురక్షితంగా జరిగేందుకు అన్నీ చర్యలు తీసుకుంటాం. ప్రేక్షకుల సంఖ్యను కుదిస్తాం’ అని అన్నారు. ఎలా‘గబ్బా’! భారత ఆటగాళ్ల రెస్టారెంట్ వ్యవహారం సద్దుమణిగినప్పటికీ బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో ఈనెల 15 నుంచి జరగాల్సిన నాలుగో టెస్టుపైనే సందిగ్ధత పూర్తిగా తొలగలేదు. కాస్త అయోమయం ఉన్నప్పటికీ బీసీసీఐ సోమవారం చేసిన ప్రకటన సీఏకు ఊరటనిచ్చింది. ‘షెడ్యూల్ ప్రకారమే నాలుగో టెస్టు జరుగుతుంది’ అని బీసీసీఐకి చెందిన ఓ అధికారి స్పష్టం చేశారు. అయితే నిబంధనలు పాటిస్తేనే బ్రిస్బేన్‌కు రావాలని లేదంటే అక్కర్లేదని ఘాటుగా వ్యాఖ్యానించిన క్వీన్స్లాండ్ రాష్ట్ర ప్రతిపక్ష నాయకురాలు రాస్ బేట్స్ వ్యాఖ్యలపై బీసీసీఐ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. -
ఆస్ట్రేలియాలో తెలంగాణ విద్యార్థిని బ్రెయిన్‌డెడ్
సిడ్నీ : ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన రక్షిత అనే బీటెక్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్ అయింది. నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం దిండిచింతపల్లికి చెందిన 20ఏళ్ల రక్షిత.. సిడ్నీలోని ఐఐబీఐటీ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతోంది. డిసెంబర్ 31న రక్షిత బైక్‌పై వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రక్షితకు బ్రెయిన్ డెడ్ అయినట్లు అక్కడి వైద్యులు నిర్థారించారు. ఉన్నత చదువులు చదివేందుకు వెళ్లిన తమ కూతురు రోడ్డు ప్రమాదానికి గురైందని తెలిసి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ కూతురి అవయవాలను దానం చేస్తున్నట్లు యువతి తల్లిదండ్రులు మల్లెపల్లి వెంకట్ రెడ్డి, అనితలు ప్రకటించారు. మాజీ సైనిక ఉద్యోగి అయిన వెంకట్ రెడ్డి ప్రస్తుతం హైదరాబాద్‌లోని డీఆర్డీఓలో పని చేస్తున్నారు. -
అంపైర్ చీటింగ్.. అసలు అది ఔట్ కాదు
సిడ్నీ : ఆస్ట్రేలియా -ఎతో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాడు శుబ్‌మన్ గిల్ అవుటైన విధానం సోషల్ మీడియాలో కాంట్రవర్సీగా మారింది. అసలు అంపైర్ దేనిని పరిగణలోకి తీసుకొని గిల్ విషయంలో ఔట్ ఇచ్చాడో అర్థం కావడం లేదని నెటిజన్లు తలగోక్కున్నారు. అసలు విషయంలోకి వెళితే.. ఆసీస్ ఎతో మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో 65 పరుగులతో మంచి టచ్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్‌ను ఆసీస్ బౌలర్ మిచెల్ స్వేప్సన్ ఔట్ చేశాడు. అయితే స్వేప్సన్ వేసిన బంతి గిల్ ప్యాడ్లను తాగి స్లిప్‌లోకి వెళ్లింది.. స్లిప్‌లో ఉన్న సీన్ అబాట్ దాన్ని క్యాచ్‌గా అందుకున్నాడు. అప్పటికే స్వేప్సన్ అంపైర్‌కు అప్పీల్ చేయగా.. అంపైర్ ఔట్ అని ప్రకటించాడు. కాగా స్కోరుబోర్డులో గిల్ క్యాచ్ అవుట్ అయినట్లుగా చూపించారు. (చదవండి : 'క్రికెటర్ కాకపోయుంటే రైతు అయ్యేవాడు') అంపైర్ ఎల్బీ లేక క్యాచ్‌లో ఏది పరిగణలోకి తీసుకొని అవుట్‌గా ఇచ్చాడనే దానిపై స్పష్టత రాలేదు. దీంతో షాక్ తిన్న గిల్ అసలు ఔటా.. కాదా అన్న సందేహంతో కాసేపు అక్కడే నిలుచుండిపోయాడు. ప్రాక్టీస్ మ్యాచ్ కావడంతో డీఆర్ఎస్ అవకాశం లేకపోవడంతో గిల్ నిరాశగా వెళ్లిపోయాడు. వాస్తవానికి రీప్లేలో స్వేప్సన్ వేసిన బంతి గిల్ ప్యాడ్లను తాకి ఆఫ్‌స్టంట్ పై నుంచి వెళ్తున్నట్లు కనిపించింది.. దీంతో అతను ఎల్బీగా అవుట్ కాదు. ఇక బంతి బ్యాట్‌ను తాకకుండా కేవలం గిల్ ప్యాడ్లను మాత్రమే తాకి స్లిప్‌లో ఉన్న అబాట్ చేతుల్లో పడింది. అలా చూసినా గిల్ ఔట్ కాదని స్పష్టంగా తెలుస్తుంది. కాగా దీనికి సంబంధించిన వీడియో ట్విటర్లో షేర్ చేశారు. ఇది చీటింగ్ అసలు గిల్ ఔట్ కానే కాదు.. అది అంపైర్ తప్పుడు నిర్ణయం.. గిల్ నాటౌట్.. రాంగ్ అంపైరింగ్ అంటూ కామెంట్లు పెట్టారు. ఇదే విషయమై టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు. 'శుబ్‌మన్ ఎలా అవుటయ్యాడో అంపైర్ చెప్పాలి.. కచ్చితంగా ఎల్బీ మాత్రం కాదు.. క్యాచ్ అవుటా అంటే ఆ చాన్సే లేదు..' అంటూ చురకలంటించాడు. (చదవండి : రషీద్‌ను దంచేసిన ఆసీస్ బ్యాట్స్‌మన్) Gill given out caught, and what a catch it was too! What's your call? #AUSAvIND pic.twitter.com/fDFwB7IUBU — cricket.com.au (@cricketcomau) December 12, 2020 ఇక ఆసీస్-ఎ, టీమిండియాల మధ్య జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. 472 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్-ఎ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాట్స్మెన్లలో జాక్ వైల్డర్ మత్ సెంచరీతో మెరవగా.. కెప్టెన్ అలెక్స్ కేరీ 58 పరుగులతో రాణించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసిన టీమిండియా బౌలర్లు రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం దానిని రిపీట్ చేయలేకపోయారు.అంతకముందు టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్, హనుమ విహారిలు సెంచరీలతో కథం తొక్కిన సంగతి తెలిసిందే.(చదవండి : పేడ మొహాలు, చెత్త గేమ్‌ప్లే అంటూ..) -
ముందు మీ టాప్ ఆర్డర్ చూసుకో : వసీం జాఫర్
సిడ్నీ : ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్కు టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ తనదైన శైలిలో చురకలంటించాడు. సిడ్నీ వేదికగా ఆసీస్-ఎతో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో టాప్ ఆర్డర్ విఫలంతో 194 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్రాడ్ హాగ్ టీమిండియా టాప్ ఆర్డర్‌పై స్పందించాడు.' టీమిండియా టాప్ ఆర్డర్ ఆఫ్‌స్టంప్ ఎక్కడుందో తెలుసుకొని ఆడాలి. మంచి లెంగ్త్‌లో పడిన బంతిని ఆడకుండా వదిలేయడం నేర్చుకోవాలి.. అలాగే ఆఫ్ స్టంప్‌కు దూరంగా వెళ్తున్న బంతిని షాట్ ఆడేందుకు ప్రయత్నించకూడదు.. కానీ ఇలాంటి నియమాలేవి పాటించని టీమిండియా టాప్ ఆర్డర్ ఆటగాళ్లు నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకున్నారంటూ' ట్రోల్ చేశాడు. హాగ్ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న వసీం జాఫర్ తనదైన శైలిలో చురకలంటించాడు. (చదవండి : మిస్టరీ స్పిన్నర్ పెళ్లి.. వైరలవుతున్న వీడియో) 'హాగ్.. మా మీద పడి ఏడ్వడం కంటే ముందు మీ జట్టు టాప్ ఆర్డర్ చూసుకొని మాట్లాడితే బాగుంటుంది. మరో నాలుగురోజులు గడిస్తే భారత్‌తో టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. తొలి టెస్టులో ఓపెనర్లుగా ఎవరు రానున్నారనే దానిపై మీ జట్టుకు ఇంకా స్పష్టత రాలేదు. ముందు ఆ విషయం గురించి ఆలోచించండి ' అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఇప్పటికే గాయం కారణంగా ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ దూరం కాగా.. ప్రాక్టీస్ మ్యాచ్‌లో త్యాగి బౌన్సర్ దెబ్బకు యువ ఓపెనర్ విన్ పుకోవిస్కి తలకు బలమైన గాయం కావడంతో మొదటి టెస్టుకు దూరమయ్యాడు కాగా విన్ పుకోవిస్కి స్థానంలో మార్కస్ హారిస్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. అంతేగాక ఆసీస్ కీలక బౌలర్ సీన్ అబాట్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో కండరాలు పట్టేయడంతో మళ్లీ బౌలింగ్‌కు రాలేదు. దీంతో అబాట్ మొదటి టెస్టు ఆడతాడా లేదా అనే విషయంపై స్పష్టత రాలేదు. కాగా ఇరుజట్ల మధ్య డిసెంబర్ 17న అడిలైడ్ వేదికగా తొలి డే నైట్ టెస్టు జరగనుంది.(చదవండి : క్యాచ్ వదిలేశాడని బౌలర్ బూతు పురాణం) ఇక ఆసీస్-ఎతో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది. మూడో రోజు ఆటలో భాగంగా క్రితం రోజున చేసిన 386 పరుగుల వద్దే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన భారత్ ఆసీస్ ఎ ముందు 472 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ఎ తడబడుతుంది. ఇప్పటివరకు చూసుకుంటే టీ విరామం సమయానికి 3 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. ఆసీస్ గెలవాలంటే ఇంకా 384 పరుగులు చేయాల్సి ఉంది. చివరి సెషన్ మాత్రమే మిగిలి ఉండడంతో మ్యాచ డ్రా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.. ఒకవేళ బౌలర్లు చెలరేగితే టీమిండియా విజయం సాధించే అవకాశం కూడా ఉంది. అంతకముందు రెండో ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్, హనుమ విహారిలు సెంచరీలతో కథం తొక్కిన సంగతి తెలిసిందే. -
ఆసీస్‌కు మరో దెబ్బ.. కీలక బౌలర్ ఔట్!
సిడ్నీ : బోర్డర్ గవాస్కర్ ట్రోపీ ఆరంభానికి ముందే ఆసీస్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ఇప్పటికే స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ దూరం కాగా.. త్యాగి బౌన్సర్ దెబ్బకు యువ ఓపెనర్ విన్ పుకోవిస్కి మొదటి టెస్టుకు దూరమయ్యాడు. తాజాగా ఆసీస్ ఫాస్ట్ బౌలర్ సీన్ అబాట్ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎడమ కాలి చీలమండ గాయంతో అబాట్ బాధపడుతున్నట్లు సమాచారం. సిడ్నీ వేదికగా ఇండియాతో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లో రెండో రోజు ఆటలో భాగంగా మొదటి సెషన్లో బౌలింగ్‌కు వచ్చిన అబాట్ 7 ఓవర్లు వేశాడు. రెండో సెషన్ ప్రారంభమైన కాసేపటికే అబాట్‌కు కండరాలు పట్టేయడంతో బౌలింగ్ చేయలేదు. అయితే నొప్పి తీవ్రత ఎక్కువ కావడంతో ఫిజియో సూచన మేరకు పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఇప్పుడైతే అబాట్ బౌలింగ్‌కు వచ్చే అవకాశాలు లేవని.. ఒకవేళ ఆసీస్ బ్యాటింగ్ సమయంలో అవసరం అనుకుంటేనే వస్తాడని క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. (చదవండి : క్యాచ్ వదిలేశాడని బౌలర్ బూతు పురాణం) ఒకవేళ అబాట్ గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే మాత్రం ఆసీస్‌కు పెద్ద దెబ్బే అని చెప్పవచ్చు. టెస్టు సిరీస్‌లో సీన్ అబాట్ ఆస్ట్రేలియాకు కీలక బౌలర్.. బౌన్సర్లు వేయడంలో దిట్ట అయిన అబాట్ ప్రత్యర్థి బ్యాట్స్మన్లను కట్టడి చేస్తాడు. భారత్‌తో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లోనూ అబాట్ మొదటి ఇన్నింగ్స్‌లో 12 ఓవర్లు వేసి మూడు వికెట్లు పడగొట్టాడు.ఇప్పటికే గాయంతో డేవిడ్ వార్నర్, త్యాగి బౌన్సర్‌తో విన్ పుకోవిస్కి మొదటి టెస్టుకు దూరమయ్యారు.. తాజగా అబాట్ కూడా గాయంతో బాధపడుతుండడం ఆసీస్‌కు ఇబ్బందిగా మారనుంది. అయితే శుక్రవారం ప్రాక్టీస్ మ్యాచ్‌లో భాగంగా టీమిండియా బ్యాటింగ్ సమయంలో బుమ్రా ఆడిన స్ట్రెయిట్ డ్రైవ్ బౌలర్ కామెరాన్ గ్రీన్ ముఖంపై బలంగా తగిలిన సంగతి తెలిసిందే. అయితే గ్రీన్ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆస్ట్రేలియా పేర్కొంది. గ్రీన్ గాయం నుంచి కోలుకున్నాడని.. అతను ఆసీస్ ఎతో మ్యాచ్‌లో కొనసాగనున్నాడని తెలిపింది. కాగా ప్రాక్టీస్ మ్యాచ్‌లో భాగంగా రెండో రోజు టీమిండియా లంచ్ విరామం తర్వాత 70 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది.(చదవండి : నెటిజన్ కామెంట్‌కు గబ్బర్ ధీటైన కౌంటర్) ఓపెనర్ పృథ్వీ షా మరోసారి విఫలం కాగా.. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 61, శుబ్‌మన్ గిల్ 61 పరుగులతో ఆకట్టుకోగా.. కెప్టెన్ రహానే 38 పరుగులు చేశాడు. ప్రస్తుతం విహారి 63, రిషబ్ పంత్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 108 పరుగులకు ఆలౌట్ కావడంతో భారత్‌కు ఆధిక్యం లభించింది. బుమ్రా హాఫ్ సెంచరీతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 194 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టీమిండియా మొదటి ఇన్నింగ్స్ కలుపుకొని 334 పరుగుల ఆధిక్యంలో ఉంది. -
టీ20 ప్రపంచకప్‌లో అతను కీలకం కానున్నాడు
సిడ్నీ : తమిళనాడు నుంచి టీమిండియాకు ఎంపికైన యార్కర్ బౌలర్ టి.నటరాజన్ అరంగేట్రం సిరీస్‌నే మధురానుభూతిగా మలుచుకున్నాడు. ఆసీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో మూడు మ్యాచ్‌లాడిన నటరాజన్ 6.91 ఎకానమీ రేటుతో 6 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఆసీస్‌తో జరిగిన మూడో వన్డే ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన నటరాజన్‌పై తొలి మ్యాచ్ నుంచే ప్రశంసల జల్లు కురుస్తూనే ఉన్నాయి. తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి నటరాజన్ ప్రదర్శన అద్బుతమని మెచ్చకున్నాడు. మంగళవారం మ్యాచ్ ముగిసిన అనంతరం అవార్డు ప్రధాన కార్యక్రమంలో కోహ్లి మాట్లాడాడు. (చదవండి : నెట్ బౌలర్‌గా వచ్చా.. ఇంకేం కావాలి: నటరాజన్) 'నటరాజన్ ప్రదర్శనపై ఎంత మాట్లాడినా తక్కువే అవుతుంది. షమీ, బుమ్రా లాంటి కీలక బౌలర్ల గైర్హాజరీలో నటరాజన్ 6 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. అరంగేట్రం సిరీస్‌లోనే ఇంతలా ఆకట్టుకున్న నటరాజన్‌కు మంచి భవిష్యత్తు ఉంది. జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించి ఈ స్థాయికి చేరుకున్న అతను రానున్న మ్యాచ్‌ల్లో ఇదే ప్రదర్శన చేస్తాడని ఆశిస్తున్నా. ఒకవేళ నటరాజన్ నుంచి స్థిరమైన ప్రదర్శన ఉంటే రానున్న టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు కీలక బౌలర్ కానున్నాడ'ని తెలిపాడు.(చదవండి : కోహ్లి ఆలస్యం చేశావు.. వెంటనే రివ్యూ కోరుంటే) ఆసీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు రోహిత్ శర్మ, బుమ్రా, షమీ లాంటి కీలక ఆటగాళ్లు లేకున్నా.. ఒత్తిడిని దరి చేరకుండా యువ ఆటగాళ్లు ఆకట్టుకున్నారు. వన్డే సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లు ఓడినా.. చివరి వన్డే గెలవడంతో ఆత్మ విశ్వాసం పెరిగింది. అదే నమ్మకంతో టీ20 సిరీస్‌ను ఆరంభించాం. మొదటి టీ20లో తక్కువ స్కోరు నమోదు చేసినా బౌలర్ల అద్భుత ప్రతిభతో మ్యాచ్‌ను గెలిచాం. ఆ తర్వాత రెండో మ్యాచ్‌లోనూ అదే ప్రతిభను కనబరిచి సిరీస్‌ను దక్కించుకున్నాం. చివరి టీ20లో ఓడినా.. జట్టులోని ఆటగాళ్లంతా సమిష్టి ప్రదర్శన కనబరిచాం. ఫీల్డింగ్ లోపాలతో పాటు బౌలింగ్‌లోనూ కాస్త మెరుగైన ప్రదర్శన వచ్చి ఉంటే ఫలితం వేరేలా ఉండేది 'అని కోహ్లి పేర్కొన్నాడు. -
ఆకట్టుకున్న కోహ్లి.. పోరాడి ఓడిన టీమిండియా
సిడ్నీ : ఆసీస్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా చివరివరకు పోరాడి ఓడిపోయింది.187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 20 ఓవర్లలో 174 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ విరాట్ కోహ్లి 85 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగతా బ్యాట్స్‌మన్ ఎవరు చెప్పుకోదగిన విధంగా ఆడలేకపోయారు. ఆసీస్ విధించిన 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆదిలోనే ఓపెనర్ కేఎల్ రాహుల్ వికెట్ కోల్పోయింది. స్కోరు బోర్డుపై పరుగులేమి రాకుండానే మాక్సవెల్ బౌలింగ్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన కోహ్లి ఓపెనర్ ధవన్‌తో కలిసి రన్‌రేట్ పడిపోకుండా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో 28 పరుగులు చేసిన ధవన్ స్వేప్సన్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన శామ్సన్, శ్రేయాస్ అయ్యర్లు ఇలా వచ్చి అలా వెళ్లడంతో 100 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో లాస్ట్ మ్యాచ్ హీరో పాండ్యా కోహ్లికి జత కలిశాడు. ఒకపక్క కోహ్లి సిక్సర్లు, ఫోర్లతో విజృంభించడం.. పాండ్యా కూడా బ్యాట్‌కు పనిచెప్పడంతో స్కోరు అంతకంతకు తగ్గిపోయింది. ఈ నేపథ్యంలోనే 20 పరుగులు చేసిన పాండ్యా జంపా బౌలింగ్‌లో అవుట్‌గా వెనుదిరగడం.. ఆ తర్వాత కాసేపటికే కోహ్లి కూడా అండ్రూ టై బౌలింగ్‌లో అవుట్ కావడంతో భారత్ ఓటమి దాదాపుగా ఖరారైపోయింది. అనంతరం శార్దూల్ ఠాకూర్ రెండు సిక్సర్లు బాదినా అవి లక్ష్యాన్ని తగ్గించడానికి మాత్రమే పనిచేసింది. అలా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్వేపన్ 3, మ్యాక్స్‌వెల్, అండ్రూ టై, జంపా, అబాట్ తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకొని ఆసీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్ ఆరోన్ ఫించ్ రెండో ఓవర్ వేసిన వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. అయితే ఈ ఆనందం టీమిండియాకు ఎంతోసేపు నిలవలేదు.ఫించ్ వెనుదిరిగిన అనంతరం క్రీజులోకి వచ్చిన స్మిత్‌తో కలిసి మరో ఓపెనర్ వేడ్ చెలరేగిపోయాడు. అయితే మరోసారి బౌలింగ్‌కు వచ్చిన సుందర్ 24 పరుగులు చేసిన స్మిత్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో ఆసీస్ 79 పరుగులు వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. తర్వాత వచ్చిన మ్యాక్స్‌వెల్ దాటిగా ఆడడంతో స్కోరుబోర్డు పరుగులెత్తింది. ఈ దశలో వేడ్ టోర్నీలో వరుసగా రెండో హాఫ్ సెంచరీ సాధించాడు. హాఫ్ సెంచరీ తర్వాత మరింత రెచ్చిపోయిన వేడ్.. ఫోర్లు, సిక్సర్లు బాదేశాడు. మ్యాక్స్‌వెల్ కూడా బ్యాట్‌కు పనిజెప్పడంతో ఆసీస్‌కు పరుగులు వేగంగా వచ్చాయి. ఈ నేపథ్యంలో మ్యాక్స్‌వెల్ కూడా 30 బంతుల్లో టోర్నీలో తొలి ఫిప్టీ సాధించాడు. అయితే స్కోరును పెంచే ప్రయత్నంలో వేడ్, మ్యాక్స్‌వెల్ అవుటవడం.. చివరి రెండు ఓవర్లు భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌల్ చేయడంతో ఆసీస్ 20 ఓవర్లలో 186 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముగించింది. టీమిండియా బౌలర్లలో సుందర్ 2, నటరాజన్, ఠాకూర్లు చెరో వికెట్ తీశారు. -
కోహ్లి ఆలస్యం చేశావు.. వెంటనే రివ్యూ కోరుంటే
సిడ్నీ : ఆసీస్‌తో జరుగుతున్న మూడో టీ20లో ఆసీస్ బ్యాటింగ్ సమయంలో ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఇన్నింగ్స్ 11వ ఓవర్లో టి. నటరాజన్ బౌలింగ్‌కు వచ్చాడు. అప్పటికే మాథ్యూ వేడ్ హాఫ్ సెంచరీతో ధాటిగా ఆడుతున్నాడు. ఓవర్లో నటరాజన్ వేసిన నాలుగో బంతి వేడ్ ప్యాడ్లను తాకింది. కానీ నటరాజన్.. కీపర్ రాహుల్ ఎల్బీపై అంపైర్‌కు అప్పీల్ చేసినా ఎటుంటి స్పందన రాలేదు... టీమిండియా కూడా రివ్యూ కోరలేదు. (చదవండి : అయ్యో! చహల్ ఎంత పని జరిగింది) అయితే థర్డ్ అంపైర్ చూపించిన రిప్లైలో మాత్రం వేడ్ ఔట్ అయినట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత మైదానంలోని బిగ్స్క్రీన్పై వేడ్ ఔట్ అయినట్లు కనిపించడంతో షాక్ తిన్న కోహ్లి రివ్యూ కోరాడు. కానీ అంపైర్ కోహ్లి రివ్యూను తిరస్కరించారు. సమయం మించిన తర్వాత రివ్యూ కోరావని.. అందుకే తిరస్కరించామని అంపైర్లు చెప్పడంతో కోహ్లి ఏం చేయలేకపోయాడు. ఒకవేళ కోహ్లి రివ్యూ కోరుంటే 50 పరుగుల వద్ద వేడ్ ఔటయ్యేవాడు. అలా బతికిపోయిన వేడ్ ఆ తర్వాత మరో 30 పరుగులు రాబట్టాడు.కోహ్లి ఆలస్యం చేశావు.. వెంటనే రివ్యూ కోరుంటే ఫలితం వేరేలా ఉండేది అని అభిమానులు పేర్కొంటున్నారు. (చదవండి : స్టాండ్స్‌లోకి పంపుదామనుకుంటే స్టన్ అయ్యాడు..) -
అయ్యో! చహల్ ఎంత పని జరిగింది
సిడ్నీ : ఆసీస్‌తో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా స్నిన్నర్ యజ్వేంద్ర చహల్ అరుదైన రికార్డును సాధించే అవకాశాన్ని కోల్పోయాడు. చహల్ ఈ మ్యాచ్‌లో ఒక్క వికెట్ తీసినా టీ20ల్లో టీమిండియా తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచి ఉండేవాడు. ఇక అసలు విషయంలోకి వెళితే.. ఆసీస్ ఇన్నింగ్స్ సమయంలో 13వ ఓవర్లో చహల్ బౌలింగ్‌కు వచ్చాడు. ఓవర్ చివరి బంతిని గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఫ్లిక్ చేయగా.. బంతి వెళ్లి కీపర్ రాహుల్ చేతుల్లో పడింది. మ్యాక్సవెల్ కూడా బంతి బ్యాట్‌కు తగలడంతో క్రీజును వీడాడు. కానీ అంపైర్ దానిని నోబాల్‌గా ప్రకటించడంతో మ్యాక్స్‌వెల్ బతికిపోయాడు. అలా చహల్‌కు వికెట్‌కు తీసే అవకాశం కోల్పోయాడు.(చదవండి : వారెవ్వా శామ్సన్.. వాట్ ఏ ఫీల్డింగ్) దీంతో చహల్ టీమిండియా తరపున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డు సాధించాలంటే మరికొద్ది కాలం వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పట్లో టీమిండియా టీ20 మ్యాచ్‌లు ఆడే అవకాశం లేదు. టీ20 సిరీస్ ముగిసిన వెంటనే ఆసీస్‌తో టెస్టు సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత ఐపీఎల్ సీజన్ ఉండడంతో చహల్ మరికొంత కాలం ఆగాలి. ఈలోగా టీ20 ప్రపంచకప్ నిర్వహణ సాధ్యమైతే చహల్ ఈ రికార్డును చేరే అవకాశం ఉంటుంది.ఇప్పటికైతే టీమిండియా తరపున టీ20ల్లో చహల్ 59 వికెట్లతో బుమ్రాతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. చహల్ 45 మ్యాచ్‌ల్లోనే 59 వికెట్లు సాధించగా.. బుమ్రా మాత్రం 49 మ్యాచ్‌ల్లో 59 వికెట్లు తీశాడు. -
చెలరేగిన వేడ్, మ్యాక్స్‌వెల్..
సిడ్నీ : ఆసీస్ ఓపెనర్ మాథ్యూ వేడ్ విధ్వంసకర ఇన్నింగ్స్‌కు తోడు ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్ చెలరేగడంతో మూడో టీ20లో ఆసీస్ భారీ స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. టీమిండియాకు 187 పరుగులు టార్గెట్‌ను నిర్ధేశించింది. ముందుగా టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకొని ఆసీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్ ఆరోన్ ఫించ్ రెండో ఓవర్ వేసిన వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. అయితే ఈ ఆనందం టీమిండియాకు ఎంతోసేపు నిలవలేదు. ఫించ్ వెనుదిరిగిన అనంతరం క్రీజులోకి వచ్చిన స్మిత్‌తో కలిసి మరో ఓపెనర్ వేడ్ చెలరేగిపోయాడు. అయితే మరోసారి బౌలింగ్‌కు వచ్చిన సుందర్ 24 పరుగులు చేసిన స్మిత్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో ఆసీస్ 79 పరుగులు వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. తర్వాత వచ్చిన మ్యాక్స్‌వెల్ దాటిగా ఆడడంతో స్కోరుబోర్డు పరుగులెత్తింది. ఈ దశలో వేడ్ టోర్నీలో వరుసగా రెండో హాఫ్ సెంచరీ సాధించాడు. హాఫ్ సెంచరీ తర్వాత మరింత రెచ్చిపోయిన వేడ్.. ఫోర్లు, సిక్సర్లు బాదేశాడు. మ్యాక్స్‌వెల్ కూడా బ్యాట్‌కు పనిజెప్పడంతో ఆసీస్‌కు పరుగులు వేగంగా వచ్చాయి. ఈ నేపథ్యంలో మ్యాక్స్‌వెల్ కూడా 30 బంతుల్లో టోర్నీలో తొలి ఫిప్టీ సాధించాడు. అయితే స్కోరును పెంచే ప్రయత్నంలో వేడ్, మ్యాక్స్‌వెల్ అవుటవడం.. చివరి రెండు ఓవర్లు భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌల్ చేయడంతో ఆసీస్ 20 ఓవర్లలో 186 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముగించింది. టీమిండియా బౌలర్లలో సుందర్ 2, నటరాజన్, ఠాకూర్లు చెరో వికెట్ తీశారు. -
వారెవ్వా శామ్సన్.. వాట్ ఏ ఫీల్డింగ్
సిడ్నీ : ఆసీస్‌తో జరుగుతున్న మూడో టీ20లో సంజూ శామ్సన్ అద్భుతమైన ఫీల్డింగ్‌తో అదరగొట్టాడు. శార్దూల్ ఠాకూర్ వేసిన 13వ ఓవర్లో మాథ్యూ వేడ్ భారీ షాట్ ఆడాడు. దాన్ని అందరూ సిక్స్‌గానే భావించారు. కానీ బౌండరీ లైన్ వద్ద అప్పటికే కాచుకు కూర్చున్న శామ్సన్ దాదాపు అందుకున్నంత ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే బౌండరీ లైన్‌ను దాటేయడంతో బంతిని నెట్టేశాడు. దీంతో సిక్స్ రావాల్సిన చోట కేవలం రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. ఒకవేళ శామ్సన్ ఈ క్యాచ్ పట్టి ఉంటే మాత్రం అద్బుత క్యాచ్‌గా మిగిలిపోయేది. ఇప్పటివరకు ఆసీస్ 16 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. ఓపెనర్ మాథ్యూ వేడ్ 73 పరుగులు, మ్యాక్స్‌వెల్ 37 పరుగులతో క్రీజులో ఉన్నారు. -
టీమిండియా క్లీన్‌స్వీప్ చేయనుందా ?
సిడ్నీ : ఆసీస్‌తో జరగుతున్న మూడో టీ20లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఏంచుకుంది. కాగా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆస్ట్రేలియాతో టి20 సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత్ క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. గత మ్యాచ్ వేదికలోనే ఇరు జట్లు మూడో టీ20లో తలపడనున్నాయి. వన్డే సిరీస్ తరహాలోనే చివరి మ్యాచ్ గెలిచి ఆసీస్ లెక్క సరి చేస్తుందా... లేక భారత్ తమ జోరు కొనసాగించి రెండోసారి ఆసీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. భారత్ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. ఇక ఆసీస్ విషయానికి వస్తే గత మ్యాచ్‌కు దూరంగా ఉన్న రెగ్యులర్ కెప్టెన్ ఫించ్ మళ్లీ తుది జట్టులోకి వచ్చేశాడు. తుది జట్లు : భారత్ : కోహ్లి (కెప్టెన్), శిఖర్ ధావన్, రాహుల్, సామ్సన్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, శార్దుల్, సుందర్, దీపక్ చహర్, నటరాజన్, చహల్ ఆస్ట్రేలియా : ఆరోన్ ఫించ్ (కెప్టెన్), మాథ్యూ వేడ్, మ్యాక్స్‌వెల్, డీ ఆర్సీ షార్ట్, హెన్రిక్స్, సీన్ అబాట్, స్యామ్స్, స్వెప్సన్, జంపా, ఆండ్రూ టై -
'ఏబీ ఎలా స్పందిస్తాడో చూడాలి'
సిడ్నీ : ఆసీస్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఏబీ డివిలియర్స్‌ను గుర్తుకుతెస్తూ ఆడిన షాట్ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. టీమిండియా ఇన్సింగ్స్ సందర్భంగా కోహ్లి 24 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఆండ్రూ టై బౌలింగ్‌లో వికెట్ నుంచి పక్కకు జరిగి అచ్చం ఏబీ తరహాలో ఫైన్ లెగ్ మీదుగా సిక్స్ కొట్టాడు. కోహ్లి షాట్ చూసి టీమిండియా సహచరులతో పాటు ఆసీస్ ఆటగాళ్లు ఆశ్చర్యానికి గురయ్యారు. కోహ్లి తన శైలికి భిన్నంగా ఆడిన షాట్లో అతని నైపుణ్యత మరింత పెరిగిందనడానికి ఇదే ఉదాహరణ.(చదవండి : వీరు విధ్వంసానికి తొమ్మిదేళ్లు) అయితే కోహ్లి తాను ఆడిన షాట్‌పై మ్యాచ్ అనంతరం స్పందించాడు. నేను ఆ షాట్ కొట్టిన సమయంలో హార్దిక్ నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్నాడు. బహుశా ఆ షాట్ ఆడుతానని పాండ్యా కూడా ఊహించి ఉండడు. ఈ షాట్ విషయంపై ఏబీకి మెసేజ్ చేస్తాను. అచ్చం అతనిలా ఆడానా లేదా అనేది చెప్తాడేమో చూడాలి. అంతేగాక ఏబీ ఏ విధంగా రిప్లై ఇస్తాడో చూడాలనుందని ' నవ్వుతూ పేర్కొన్నాడు. (చదవండి : 'తన కెరీర్‌ను తానే నాశనం చేసుకున్నాడు') Virat Kohli or AB de Villiers? 🤯 Ridiculous shot from the Indian skipper! #AUSvIND pic.twitter.com/6g8xY8ihIj — cricket.com.au (@cricketcomau) December 6, 2020 కాగా రెండో టీ 20లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. మొదట కోహ్లి 24 బంతుల్లో 40తో నాణ్యమైన ఇన్నింగ్స్ ఆడగా... చివర్లో హార్దిక్ 22 బంతుల్లో 44 పరుగులతో విధ్వంసం సృష్టించడంతో టీ20 సిరీస్ భారత్ వశమైంది. నామమాత్రంగా మారిన మూడో టీ20ని ఎలాగైనా గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తోంది. -
'తన కెరీర్‌ను తానే నాశనం చేసుకున్నాడు'
సిడ్నీ : రిషబ్ పంత్ కెరీర్ ప్రమాదంలో పడిందని.. ఇప్పటికైనా ఆటతీరు మార్చుకోవాలని టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఇప్పటికైనా తనకున్న బద్దకాన్ని వదిలేసి ఆట మీద దృష్టి పెడితే మంచిదని పేర్కొన్నాడు. పంత్ ఆటతీరు ఇలాగే కంటిన్యూ అయితే భవిష్యత్తులో టెస్టు జట్టులో కూడా చోటు దక్కడం కష్టమేనని తెలిపాడు. (చదవండి : మీరే కాదు.. నేనూ మిస్సవుతున్నా : కోహ్లి) 'ఆసీస్ టూర్‌కు పంత్‌ను కేవలం టెస్టు జట్టుకు మాత్రమే పరిగణలోకి తీసుకున్నా రాహుల్ ఫామ్ దృష్యా.. మరోవైపు వృద్ధిమాన్ సాహాకు టెస్టుల్లో ఉన్న రికార్డు చూసుకుంటే పంత్ టెస్టులు ఆడడం కష్టమే. ఆసీస్- ఏతో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లోనూ ఇండియా- ఏ తరపున పంత్ స్థానంలో సాహాకు స్థానం లభించిదంటేనే విషయం అర్ధమయి ఉండాలి. రానున్న రోజుల్లో పంత్ టెస్టుల్లో కూడా తన స్థానాన్ని కోల్పోనున్నాడు. ఇప్పటికైనా బద్దకాన్ని వదిలేసి ఆటతీరును మార్చుకోవాలి. ఆటలో తను చేసిన తప్పిదాలే.. ఇప్పుడు పంత్ కెరీర్‌ను ప్రశ్నార్థకం చేశాయి. స్వయంగా తన కెరీర్‌ను తానే నాశనం చేసుకుంటున్నాడు. మళ్లీ తుది జట్టులోకి రావాలంటే కఠోర సాధన చేయాల్సిన అవసరం ఉంది.. లేదంటే అతని కెరీర్ ముగిసినట్లే 'అని వెల్లడించాడు. ఆకాశ్ చోప్రా పంత్‌పై చేసిన వ్యాఖ్యలు నిజమనే అభిప్రాయం వ్యక్తమయ్యేలా చేస్తున్నాయి. వాస్తవానికి పంత్ మంచి టెక్నిక్ ఉన్న ఆటగాడు.. టీమిండియాకు ఎంపికైన మొదట్లో దూకుడైన ఆటతీరును చూసి మంచి భవిష్యత్తు ఉన్న ఆటగాడిగా పేరు సంపాదిస్తారని అంతా భావించారు. కానీ రాను రాను పంత్ ఆటతీరులో నిర్లక్ష్య ధోరణి స్పష్టంగా కనిపించేది. ఎదో మొక్కుబడికి ఆడుతున్నామా అన్నట్లుగా అతని షాట్లు ఉండేవి. ఆట కీలకదశలో ఉన్న సమయంలో ఎన్నోసార్లు నిర్లక్ష్యంగా వికెట్ సమర్పించుకునేవాడు. ఇదే సమయంలో కేఎల్ రాహుల్ నిలకడైన ప్రదర్శన చేస్తూ టీమిండియాలో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నాడు. కేవలం పంత్ నిర్లక్ష్యమే ఇప్పుడు ఆసీస్‌తో జరిగిన పరిమిత ఓవర్లతో పాటు ప్రస్తుతం జరుగుతున్న టీ20 సిరీస్‌కు దూరం చేసింది. ఐపీఎల్‌లోనూ పంత్ నుంచి ఒక్క మంచి ఇన్నింగ్స్ రాలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లు గెలవడంలో సహకరించిన పంత్ భారీ ఇన్నింగ్స్‌లు మాత్రం ఆడలేకపోయాడు. (చదవండి : ధావన్.. నేను ధోనిని కాదు: వేడ్) -
వీర పాండ్యా... విజయ భారత్
120 బంతుల్లో 195 పరుగులు... పెద్ద మైదానాలు ఉండే ఆసీస్ గడ్డపై అసాధారణ లక్ష్యమే. కానీ భారత బ్యాట్స్‌మెన్ అద్భుత ఆటతీరుతో కష్టతరమైన లక్ష్యాన్ని అందుకొని అదరహో అనిపించారు. ముందుగా ఓపెనర్లు రాహుల్ పరుగుపెట్టిస్తే... ధావన్ జోరందుకున్నాడు. కెప్టెన్ కోహ్లి రన్‌రేట్‌ను కాపు కాశాడు. ఇక వీళ్లంతా ఔటైతే భారత్ కథ ముగియలేదు... ఛేజింగ్ అక్కడితోనే ఆగిపోలేదు. నేనున్నానంటూ హార్దిక్ పాండ్యా (22 బంతుల్లో 42 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కొండంత లక్ష్యాన్ని తన విధ్వంసంతో కరిగించగా... ‘బర్త్‌డే బాయ్’ శ్రేయస్ అయ్యర్ తనవంతు పాత్రను పోషించాడు. దాంతో టీమిండియా మరో 2 బంతులుండగానే విజయ తీరాలకు చేరింది. మరో మ్యాచ్ మిగిలుండగానే టి20 సిరీస్‌ను సొంతం చేసుకుంది. సిడ్నీ: అసలే ఈ పర్యటనలో అచ్చిరాని వేదిక సిడ్నీ. ఆపై కొండంత లక్ష్యం. భారీ ఛేదనలో జడేజాలాంటి నాణ్యమైన బ్యాటింగ్ ఆల్‌రౌండర్ లేడు. అయినా సరే భారత్ యేటికి ఎదురీదింది. భారీస్కోరును తడబడకుండా ఛేదించింది. ఇక్కడ బాధ్యతాయుత బ్యాటింగ్ ముందు బెంబేలెత్తించే బౌలింగ్ చిన్నబోయింది. రెండో టి20లో భారత్ 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై నెగ్గి 2–0తో సిరీస్‌ను పట్టింది. చిత్రంగా వన్డే సిరీస్ చేజారిన వేదికపైనే టీమిండియా టి20 సిరీస్ చేజిక్కించుకుంది. సిరీస్‌లోని చివరిదైన మూడో టి20 మ్యాచ్ మంగళవారం సిడ్నీలోనే జరుగుతుంది. కోహ్లి టాస్ నెగ్గినా ఆసీస్‌నే ఆడించగా... ముందుగా ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 5 వికెట్లకు 194 పరుగులు చేసింది. ఓపెనర్ మాథ్యూ వేడ్ (32 బంతుల్లో 58; 10 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగాడు. స్మిత్ (38 బంతుల్లో 46; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. తర్వాత భారత్ 19.4 ఓవర్లలో 4 వికెట్లే కోల్పోయి 195 పరుగులు చేసి గెలిచింది. రాహుల్ (22 బంతుల్లో 30; 2 ఫోర్లు, సిక్స్), ధావన్ (36 బంతుల్లో 52; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), కోహ్లి (24 బంతుల్లో 40; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) స్కోరు బోర్డును ఉరకలెత్తించారు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ హార్దిక్ గెలిచేదాకా దంచేశాడు. వేడ్ ధనాధన్... రెగ్యులర్ కెప్టెన్ ఫించ్ గైర్హాజరీలో నాయకత్వం వహించిన వేడ్ భారత బౌలర్లను వేటాడాడు. బౌండరీలతో ఇన్నింగ్స్‌కు రాకెట్ వేగాన్ని జత చేశాడు. దీంతో 5.1 ఓవర్లలోనే ఆసీస్ స్కోరు 50కి చేరింది. శార్దుల్ వేసిన ఆ ఓవర్లో మూడు బౌండరీలు కొట్టడంతో మరుసటి ఓవర్లోనే వేడ్ 25 బంతుల్లో (10 ఫోర్లు, 1 సిక్స్) ఫిఫ్టీ కూడా పూర్తయింది. భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారిన వేడ్ నాటకీయంగా ఔటయ్యాడు. సుందర్ 8వ ఓవర్ చివరి బంతిని గాల్లోకి ఆడాడు. కవర్ కోహ్లి సునాయాస క్యాచ్ జారవిడిచాడు. క్రీజులో వేడ్, స్మిత్ పరుగందుకోవడంతో వెంటనే రాహుల్‌కు త్రో చేయగా స్మిత్ వెనక్కి తగ్గాడు. వేడ్ వెనుదిరిగేలోపే కీపర్ రాహుల్ వికెట్లను గిరాటేశాడు. ఆ తర్వాత స్మిత్ కుదురుగా ఆడగా... మ్యాక్స్‌వెల్ (13 బంతుల్లో 22; 2 సిక్స్‌లు) ఉన్న కాసేపే ముచ్చెమటలు పట్టించాడు. ఆఖర్లో హెన్రిక్స్ (18 బంతుల్లో 26; 1 సిక్స్) ధాటిగా ఆడటంతో ఆతిథ్య జట్టు భారీస్కోరు చేసింది. ఆచితూచి... భారత్ మూడో ఓవర్ నుంచి దంచుడు మొదలు పెట్టింది. ఓపెనర్లు రాహుల్, ధావన్ తొలి రెండు ఓవర్లు ఆచితూచి ఆడారు. తర్వాత బ్యాట్‌కు పనిచెప్పారు. సిక్స్‌లు, ఫోర్లతో 4.5 ఓవర్లలో టీమిండియా స్కోరు 50కి చేరింది. కాసేపటికే రాహుల్ అవుటైనా... వెంటనే కోహ్లి వేగం అందుకోకపోయినా... ధావన్ లక్ష్యఛేదనకు అవసరమైన పరుగుల్ని చకచకా చేస్తూ తన అర్ధసెంచరీని 34 బంతుల్లో పూర్తిచేశాడు. దూకుడుగా ఆడే క్రమంలో అతను అవుట్‌కాగా... అప్పుడు కోహ్లి వేగం అందుకున్నాడు. తొలి 11 బంతుల్లో 10 పరుగులే చేసిన కెప్టెన్ తర్వాతి 13 బంతుల్లో 30 పరుగులు చేయడంతో ఛేదనకు ఏమాత్రం ఢోకా లేకుండాపోయింది. పాండ్యా ప్రతాపం... సామ్సన్ ఔటైన 14వ ఓవర్లో హార్దిక్ పాండ్యా క్రీజులోకి వచ్చాడు. గెలిచేందుకు 36 బంతుల్లో 75 పరుగులు కావాలి. ఆండ్రూ టై వేసిన 15వ ఓవర్లో కోహ్లి 2 ఫోర్లు, సిక్స్‌తో 18 పరుగులు పిండుకున్నాడు. కాసేపటికే అతనూ పెవిలియన్ చేరాడు. ఆఖరి 4 ఓవర్లలో 46 పరుగులు చేయాల్సి ఉండగా... శ్రేయస్ అయ్యర్ (12 నాటౌట్, ఫోర్, సిక్స్)తో కలిసి పాండ్యా అదరగొట్టాడు. 19, 20వ ఓవర్లను పూర్తిగా పాండ్యానే ఆడాడు. 19వ ఓవర్లో వరుసగా 2 ఫోర్లు కొట్టగా... విజయానికి చివరి ఓవర్లో భారత్ 14 పరుగులు చేయాలి. ఈ ఓవర్ తొలి బంతిపై రెండు పరుగులు తీసిన పాండ్యా... రెండో బంతిని లాంగాన్‌లో సిక్స్‌గా తరలిం చాడు. మూడో బంతిపై పరుగు రాకున్నా... నాలుగో బంతి ని పాండ్యా డీప్ మిడ్‌వికెట్ మీదుగా సిక్స్ కొట్టడంతోనే మ్యాచ్ ముగిసింది. భారత్ సిరీస్‌తో మురిసింది. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: వేడ్ (రనౌట్) 58; షార్ట్ (సి) అయ్యర్ (బి) నటరాజన్ 9; స్మిత్ (సి) పాండ్యా (బి) చహల్ 46; మ్యాక్స్‌వెల్ (సి) సుందర్ (బి) శార్దుల్ 22; హెన్రిక్స్ (సి) రాహుల్ (బి) నటరాజన్ 26; స్టొయినిస్ (నాటౌట్) 16; సామ్స్ (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 194. వికెట్ల పతనం: 1–47, 2–75, 3–120, 4–168, 5–171. బౌలింగ్: చహర్ 4–0–48–0, సుందర్ 4–0–35–0, శార్దుల్ 4–0–39–1, నటరాజన్ 4–0–20–2, చహల్ 4–0–51–1. భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) స్వెప్సన్ (బి) టై 30; ధావన్ (సి) స్వెప్సన్ (బి) జంపా 52; కోహ్లి (సి) వేడ్ (బి) సామ్స్ 40; సామ్సన్ (సి) స్మిత్ (బి) స్వెప్సన్ 15, హార్దిక్ పాండ్యా (నాటౌట్) 42; అయ్యర్ (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (19.4 ఓవర్లలో 4 వికెట్లకు) 195. వికెట్ల పతనం: 1–56, 2–95, 3–120, 4–149. బౌలింగ్: సామ్స్ 3.4–0–41–1, అబాట్ 2–0–17–0, ఆండ్రూ టై 4–0–47–1, మ్యాక్స్‌వెల్ 1–0–19–0, స్వెప్సన్ 4–0–25–1, హెన్రిక్స్ 1–0–9–0, జంపా 4–0–36–1. ► అంతర్జాతీయ టి20ల్లో 190 పరుగులకుపైగా లక్ష్యాన్ని ఛేదించడం భారత్‌కిది ఏడోసారి. గతంలో ఏ జట్టూ ఇలా చేయలేదు. ఇంగ్లండ్ (5 సార్లు) రెండో స్థానంలో ఉంది. ► ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియాను ఓడించి టెస్టు, వన్డే, టి20 సిరీస్‌లు గెల్చుకున్న రెండో విదేశీ కెప్టెన్ కోహ్లి. గతంలో డు ప్లెసిస్ (దక్షిణాఫ్రికా) ఈ ఘనత సాధించాడు. ► అంతర్జాతీయ టి20ల్లో భారత్‌కిది వరుసగా తొమ్మిదో విజయం. ఈ ఫార్మాట్లో అత్యధిక వరుస విజయాల రికార్డు అఫ్గానిస్తాన్ జట్టు (12 మ్యాచ్‌ల్లో; 2018–2019 సీజన్) పేరిట ఉంది. -
వేడ్ హాఫ్ సెంచరీ.. రాణించిన స్మిత్
సిడ్నీ : మాథ్యూ వేడ్ హాఫ్ సెంచరీకి తోడూ స్మిత్ కూడా రాణించడంతో రెండో టీ 20లో ఆసీస్ టీమిండియాకు 195 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఏంచకున్న భారత్ ఆసీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఫించ్ స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన కెప్టెన్ మాథ్యూ వేడ్, మరో ఓపెనర్ డీఆర్సీ షాట్లు జట్టుకు శుభారంబాన్ని అందించారు. మొదటి 4 ఓవర్లలోనే 40 పరుగులు చేసిన ఆసీస్ .. 47 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన డీఆర్సీ షాట్ నటరాజన్ బౌలింగ్‌లో శ్రేయాస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్‌గా వెనుదిరిగాడు. మరోవైపు ఆరంభం నుంచి దాటిగా ఆడిన వేడ్ 5వ ఓవర్లో ఠాకూర్ బౌలింగ్‌లో ఇచ్చిన క్యాచ్‌ను హార్ధిక్ జారవిడిచాడు. దీంతో 25 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేశాడు. వేడ్‌కు జతకలిసిన స్టీవ్ స్మిత్ కూడా దాటిగా ఆడడంతో స్కోరుబోర్డు పరుగులెత్తింది. ఈ దశలో 58 పరుగులు చేసిన వేడ్ సుందర్ బౌలింగ్‌లో రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన మ్యాక్స్‌వెల్ 2 సిక్సర్లతో 22 పరుగులు చేసి ఠాకూర్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. దీంతో 120 పరగుల వద్ద ఆసీస్ మూడో వికెట్ కోల్పోయింది. హెన్రిక్స్‌తో కలిసి స్మిత్ స్కోరును పరిగెత్తించాడు. ఆసీస్ స్కోరు 168 పరుగులు వద్ద 46 పరుగుల చేసిన స్మిత్ చహల్ బౌలింగ్‌లో హార్దిక్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. కాసేపటికే 26 పరుగులు చేసిన హెన్రిక్స్ ను నటరాజన్ పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత మార్కస్ స్టోయినిస్ మరో వికెట్ పడకుండా డేనియల్ సామ్స్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లో 5 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. భారత బౌలర్లలో నటరాజన్ 2, చహల్, ఠాకూర్లు చెరో వికెట్ తీశారు. -
పృథ్వీ షా, గిల్ డకౌట్లు.. రహానే శతకం
డ్రమ్మోయ్నీ ఓవల్(సిడ్నీ): ఆస్ట్రేలియా ‘ఎ’తో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత ‘ఎ’ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. టాస్ గెలిచిన భారత ‘ఎ’ జట్టు ముందుగా బ్యాటింగ్ తీసుకుంది. దీంతో రహానే నేతృత్వంలోని భారత బ్యాటింగ్‌ను పృథ్వీ షా, శుబ్‌మన్ గిల్లు ఆరంభించారు. వీరిద్దరూ డకౌట్లుగా వెనుదిరగడంతో భారత ’ఎ’ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఆ తరుణంలో చతేశ్వర పుజారా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. పుజారా 140 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్ల సాయంతో 54 పరుగులు సాధించాడు. (చదవండి:ఫించ్ ఔట్.. కెప్టెన్‌గా వేడ్) అనంతరం అజింక్యా రహానే శతకం నమోదు చేశాడు. 228 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో అజేయంగా 108 పరుగులు చేశాడు. హనుమ విహారి(15), సాహా(0), అశ్విన్(5)లు నిరాశ పరచగా, టెయిలెండర్లు కుల్దీప్ యాదవ్(15), ఉమేశ్ యాదవ్(24) ఫర్వాలేదనిపించారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి రహానే, మహ్మద్ సిరాజ్(0 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్ ‘ఎ’ జట్టులో జేమ్స్ పాటిన్సన్ మూడు వికెట్లు సాధించగా, మైకేల్ నేసర్, ట్రావిస్ హెడ్లు తలో రెండు వికెట్లు తీశారు. జాక్సన్ బర్డ్‌కు వికెట్ దక్కింది. ఒకవైపు ఆసీస్-టీమిండియా జట్ల మధ్య టీ20 సిరీస్ జరగుతుండగానే, మరొకవైపు ఆసీస్-భారత్ ‘ఎ’ జట్ల మధ్య ప్రాక్టీస్ మ్యాచ్ జరుగుతుండటం విశేషం. -
ఆసీస్‌కు ముగ్గురు కీలక ఆటగాళ్లు దూరం
సిడ్నీ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఏంచుకుంది. కాగా మూడు వన్డేల సిరీస్‌ను 2- 1 తేడాతో ఆతిథ్య జట్టుకు కోల్పోయిన టీమిండియా ఈ మ్యాచ్‌లో గెలిచి టీ 20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే వశం చేసుకోవాలని భావిస్తోంది. కాగా ఆసీస్ మాత్రం ఈ మ్యాచ్ గెలిచి సిరీస్‌ను సమం చేయాలని భావిస్తోంది. ఆసీస్‌తో జరిగిన చివరి వన్డేలో గెలుపు ద్వారా ఫామ్‌లోకి వచ్చిన టీమిండియా తొలి టి 20లో ప్రతాపం చూపింది. కోహ్లి సేన ఆఖరిదాకా లాక్కెళ్లకుండా రెండో మ్యాచ్‌లోనే పొట్టి సిరీస్ నెగ్గాలనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో రెండో టి20లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. భారత్ విజయాల జోరులో ఉంటే... ఆస్ట్రేలియాను గాయాలు కలవరపెడుతున్నాయి. ఇప్పటికే డేవిడ్ వార్నర్ టీ20 సిరీస్‌కు దూరం కాగా, అరోన్ ఫించ్ సైతం రెండో టీ20కి దూరమయ్యాడు. గాయం కారణంగా ఫించ్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. దాంతో ఆసీస్ కెప్టెన్‌గా మాథ్యూ వేడ్ వ్యవహరిస్తున్నాడు. దాంతో పాటు హజల్‌వుడ్, స్టార్క్‌లు కూడా రెండో టీ20కి అందుబాటులో లేరు. ముగ్గురు కీలక ఆటగాళ్లు దూరం కావడం ఆసీస్‌ను కలవర పరుస్తోంది. వీరి ముగ్గురు స్థానాల్లో సామ్స్, స్టోయినిస్, అండ్రూ టైలు తుది జట్టులోకి వచ్చారు. ఇక టీమిండియా విషయానికొస్తే గాయపడ్డ జడేజా స్థానంలో చహల్ తుది జట్టులోకి రాగా, మనీష్ పాండే స్థానంలో శ్రేయాస్ అయ్యర్‌ను తీసుకున్నారు. కాగా ఆసీస్ రెగ్యులర్ కెప్టెన్ ఫించ్ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉండడంతో అతని స్థానంలో మాథ్యూ వేడ్ నాయకత్వం వహించనుండగా.. స్టార్క్ స్థానంలో డేనియల్ సామ్స్ తుది జట్టులోకి వచ్చాడు. తుది జట్లు : భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్, రాహుల్, సామ్సన్, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, సుందర్, దీపక్ చహర్, నటరాజన్, శార్దూల్ ఠాకూర్, చహల్ ఆస్ట్రేలియా: డార్సీ షార్ట్, వేడ్(కెప్టెన్), స్మిత్, మ్యాక్స్‌వెల్, హెన్రిక్స్, అబాట్, స్వెప్సన్, జంపా, స్టోయినిస్, అండ్రూ టై,డేనియల్ సామ్స్ -
టీమిండియాతో మ్యాచ్ : ఆసీస్‌కు మరో ఎదురుదెబ్బ
సిడ్నీ : భారత్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌కు ఆసీస్ నుంచి మరో కీలక ఆటగాడు దూరమయ్యాడు. స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ వ్యక్తిగత కారణాల రిత్యా టీ20 సిరీస్ నుంచి తప్పుకున్నాడని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. ఇదే విషయంపై ఆసీస్ ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ స్పందించాడు. 'కుటుంబ కారణాల రిత్యా స్టార్క్ టీమిండియాతో జరుగుతున్న టీ20 సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ప్రపంచంలో అన్నింటి కన్నా కుటుంబం ముఖ్యం.. దాని తరువాతే ఏదైనా. మిచెల్‌కు కావలసినంత సమయాన్ని ఇస్తాం. తాను అనుకున్నప్పుడే జట్టులోకి రావచ్చు. అయితే మళ్లీ జట్టులోకి ఎప్పుడు వస్తాడనే దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. తన కోసం ఎదురు చూస్తుంటాం.' అని లాంగర్ పేర్కొన్నాడు. (చదవండి : ప్రియురాలి కోరిక.. సొంత దేశానికి రిటైర్మెంట్) కాగా ఆసీస్ జట్టును గాయాల బెడద పీడిస్తోంది. వన్డే సిరీస్ తర్వాత స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌తో పాటు ఆస్టన్ అగర్ దూరం కాగా.. తాజాగా స్టార్క్ కూడా దూరమయ్యాడు. కాగా నేడు జరిగే మ్యాచ్‌లో ఆసీస్ జట్టు స్టార్క్ స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తుందనేది వేచి చూడాలి. కాగా ఇప్పటికే తొలి టీ20లో విజయం సాధించి మంచి ఊపు మీదున్న టీమిండియా మరో విజయం సాధించి సిరీస్ గెలవాలని చూస్తుంటే.. ఆసీస్ మాత్రం మ్యాచ్ గెలిచి సిరీస్‌ను సమం చేయాలని చూస్తుంది. (చదవండి : 'గిల్.. ఇదేమైనా క్లబ్ క్రికెట్ అనుకున్నావా') -
సచిన్, సెహ్వాగ్ లాంటి ఆటగాళ్లు లేరు..
సిడ్నీ : ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న వన్డే సిరీస్‌లో భారత్ వరుస పరాజయాల పట్ల అభిమానులతో పాటు మాజీలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దూసుడైన ఆటతీరుకు చిరునామాగా ఉన్న ఆసీస్ గడ్డపై సరైన ప్రణాళిక లేకుండా టీమిండియా బరిలో నిలిచిందనే విమర్శ వినిపిస్తోంది. ప్రత్యర్థి ఆటగాళ్లను కట్టడిచేయకపోగా.. అనుభవజ్ఞులైన పేసర్లు సైతం ధారాళంగా పరుగులు సమర్పించడం ఆందోళన కలిగిస్తోంది. మూడు వన్డే సిరీస్‌లో భాగంగా ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ భారత బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేదు. ప్రధాన బౌలర్లు షమీ, బుమ్రాతో పాటు ఐపీఎల్ ద్వారా జట్టులో చోటుదక్కించుకున్న నవదీప్ సైనీ సైతం చేతులెత్తేశాడు. ఓవైపు బలమైన బ్యాటింగ్ ఆర్డర్ కలిగి ఉన్నప్పటికీ.. బౌలింగ్‌లో పసలేకపోవడం టీమిండియా ఓటమికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. పసలేని భారత్ బౌలింగ్‌ను చితకబాదిన ఆసీస్ ఆటగాళ్లు.. తొలి వన్డేలో 375, రెండో వన్డేలో 390 పరుగులు సాధించారు. ఇప్పటికే రెండు మ్యాచ్‌ల్లో ఓటమిచెంది సిరీస్‌ను కోల్పోయిన భారత్.. చివరిదైన మూడే వన్డేకు సిద్ధమయ్యింది. (రవి శాస్త్రిని టీంనుంచి బయటకు పంపాలి) ఈ నేపథ్యంలో గత మ్యాచ్‌ల్లో భారత ఆటగాళ్ల ప్రదర్శపై టీమిండియా మాజీ ఆటగాడు సుబ్రహ్మణ్యం బద్రీనాథ్ స్పందించాడు. భారత్ టాప్ ఆర్డర్లో వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ, సచిన్ టెండుల్కర్ వంటి ఆటగాళ్ల లేరని అభిప్రాయపడ్డారు. మంగళవారం ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో బద్రీనాథ్ మాట్లాడుతూ.. ‘ఆసీస్ సీరిస్‌లో భారత బౌలర్ల వైఫల్యం ప్రధానంగా కనిపిస్తోంది. ప్రధాన బౌలర్లు షమీ, బుమ్రా ధారాళంగా పరుగులు ఇచ్చారు. వికెట్ల వేటలో వెనుకబడ్డారు. అయితే అన్ని పిచ్‌లు బౌలర్లుకు అనుకూలంగా ఉంటాయని చెప్పలేం. భారత టాప్ఆర్డర్లో సెహ్వాగ్, సచిన్, గంగూలీ వంటి ఆటగాళ్ల లేనిలోటు స్పష్టంగా కనిపిస్తోంది. వీరు బ్యాటింగ్‌తో పాటు వీలైన సందర్భాల్లో బౌలింగ్ కూడా చేయగలరు. బౌలర్లు అలసిపోయినప్పుడు, పిచ్‌కు పేస్‌కు అనుకూలించనప్పుడు వీరు బౌలింగ్ చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. (ఆసీస్ గడ్డపై ఇదే తొలిసారి..) వీరు ముగ్గురు కలిసి 10 ఓవర్ల వరకు బౌలింగ్ చేయగలరు. కానీ ఇప్పుడు పరిస్థితి అలాలేదు. భారమంతా బౌలర్ల మీదే పడుతోంది. వారు విఫలమైన సందర్భాల్లో ఆదుకోవడానికి టీంలో ఒక్కరు కూడా పార్ట్‌టైం బౌలర్లు లేరు. ధావన్, అగర్వాల్, శ్రేయస్ అయ్యార్, కేఎల్ రాహుల్, వీరిలో ఎవరూ కూడా బౌలింగ్ చేయలేరు. గతంలో రోహిత్ స్పిన్నర్‌గా జట్టుగా అందుబాటులో ఉండేవాడు. ఇప్పుడు దూరంగా ఉంటున్నారు. ఆల్‌రౌండర్ హర్థిక్ పాండ్యా సైతం బౌలింగ్ చేసే పరిస్థితిలో లేడు. ఈ పరిణామం టీమిండియాకు ఇబ్బందికరంగా మారింది.’ అని అభిప్రాయపడ్డాడు. కాగా చివరి వన్డే బుధవారం జరుగనున్న విషయం తెలిసిందే. -
అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి: వీడియో వైరల్
సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఓటమి పాలై సిరీస్‌ను చేజార్చుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆసీస్ 389 పరుగులతో భారత్‌పై అత్యధిక పరుగులు నమోదు చేసిన రికార్డును లిఖించింది. కాగా, టీమిండియా మాత్రం 338 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో ఓడిపోయి సిరీస్‌ను చేజార్చుకోవడంతో భారత అభిమానులు కాస్త ఎక్కువగానే నిరాశకు లోనయ్యారు. కానీ ఒక భారత అభిమాని మాత్రం మంచి జోష్‌లో ఉన్నాడు. ఇందుకు కారణం తన గర్ల్‌ఫ్రెండ్ ప్రేమను అంగీకరించడమే. ఆస్ట్రేలియన్ గర్ల్‌ఫ్రెండ్ తన ప్రేమను ఒప్పుకోవడంతో ఆ అభిమాని మాత్రం ఆనందంలో మునిగి తేలుతున్నాడు. ఇందుకు సిడ్నీ గ్రౌండ్ వేదికైంది. భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో వన్డేలో భాగంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో.. ఓ భారత అభిమాని, తన ఆస్ట్రేలియన్ గర్ల్ ఫ్రెండ్‌కు ప్రపోజ్ చేశాడు.మోకాళ్లపై కూర్చొని లవ్ ప్రపోజల్ చేశాడు. (కెప్టెన్‌గా కోహ్లి చేసిన ఆ తప్పిదాలతోనే..!) రింగ్ బాక్స్‌లో నుంచి రింగ్ ను తీసి ఆమెకు ప్రపోజ్ చేశాడు. దానికి ఉబ్బితబ్బైపోయిన ఆమె.. అతని ప్రేమను అంతే హుందాగా అంగీకరించింది. అటు తర్వాత ఇద్దరూ హగ్ చేసుకుని, ముద్దుపెట్టుకని తమ ప్రేమను చాటుకున్నారు. ఈ ప్రపోజల్ నడుస్తున్నంత సేపు కెమెరాలు వారిపైనే ఉన్నాయి. గ్రౌండ్లో ఫీల్డింగ్ చేస్తున్న మ్యాక్స్‌వెల్ కూడా వీరి ప్రేమను చప్పట్లతో అభినందించాడు. టీమిండియా ఇన్నింగ్స్‌లో భాగంగా 20 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. ఆ సమయంలో క్రీజ్‌లో కోహ్లి, అయ్యర్లు ఉన్నారు. అప్పుడే ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’ సన్నివేశం చోటుచేసుకుంది. దీనిని క్రికెట్ ఆస్ట్రేలియా తన ట్వీటర్ అకౌంట్లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. (జోష్‌లో ఉన్న ఆసీస్‌కు షాక్) -
కెప్టెన్‌గా కోహ్లి చేసిన ఆ తప్పిదాలతోనే..!
సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా ఇంకా మ్యాచ్ ఉండగానే కోల్పోయింది. దాంతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై మళ్లీ విమర్శలు వస్తున్నాయి. ఒక కెప్టెన్‌గా కోహ్లి సరైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయంలో చేసిన తప్పిదాలే చేశాడు. తొలి వన్డేలో చేసిన కొన్ని పొరపాట్లను కోహ్లి మళ్లీ రిపీట్ చేశాడు. తొలి వన్డేలో 66 పరుగుల తేడాతో పరాజయం చెందిన టీమిండియా..రెండో వన్డేలో 51 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ 389 పరుగులు చేయగా, టీమిండియా 338 పరుగులు మాత్రమే చేసింది. అసలు ఎంతో ఉత్సాహంగా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీమిండియా భారీ స్కోర్లు సమర్పించుకుని సిరీస్‌ను కోల్పోవడంతో కోహ్లి తప్పిదాలు వార్తల్లో నిలిచాయి. (పోరాడి ఓడిన టీమిండియా..) సైనీకి మళ్లీ చాన్స్ తొలి వన్డేలో భారీ పరుగులు సమర్పించుకున్న పేసర్ నవదీప్ సైనీని రెండో వన్డేలో ఆడించడానికే కోహ్లి మొగ్గుచూపాడు. తొలి వన్డేలోనే సైనీ అనవసరం అనే వాదన వినిపించిన తరుణంలో రెండో వన్డేలో కూడా అతన్నే కొనసాగించాడు కోహ్లి. ఈ మ్యాచ్‌లో కనీసం నటరాజన్, శార్దూల్ ఠాకూర్లలో ఒకరి మూడో స్పెషలిస్టు పేసర్‌గా తీసుకుంటారని అనుకున్నా అది జరగలేదు. సైనీతో ఉన్న ఎక్కువ అనుబంధంతో అతన్నే కొనసాగించాడు కోహ్లి. కానీ ఈ పేసర్ 7 ఓవర్లలో వికెట్ మాత్రమే సాధించి 70 పరుగులిచ్చాడు. సైనీని మళ్లీ ఆసీస్ బ్యాట్స్‌మెన్ ఆడేసుకోవడంతో పూర్తిగా కోటాను వేయలేకపోయాడు సైనీ. నవదీప్ సైనీని ఆదిలోనే బాదేయడంతో అతన్ని 34 ఓవర్ వేసిన తర్వాత కోహ్లి ఆపేశాడు. ఆపై అతనికి చివరి ఓవర్ వేసే అవకాశన్ని మాత్రమే ఇచ్చాడు కోహ్లి. అంటే ఒక స్పెషలిస్టు పేసర్ చేత పూర్తిగా బౌలింగ్ వేయించే పరిస్థితి ఇక్కడ లేకుండా పోయింది. హర్దిక్‌ను లేట్ చేశాడు.. హార్దిక్ పాండ్యాకు వెన్నుగాయం తర్వాత బౌలింగ్ చేయడం ఇదే తొలిసారి. ఎప్పుట్నుంచో బౌలింగ్‌కు దూరంగా ఉంటున్న హార్దిక్.. ఆసీస్‌తో రెండో వన్డేలో బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు. కేవలం నాలుగు ఓవర్లు మాత్రమే వేసిన హార్దిక్ 24 పరుగులిచ్చి వికెట్ తీశాడు. కానీ హార్దిక్‌కు బౌలింగ్ ఇచ్చే విషయంలో చాలా ఆలస్యం చేశాడు కోహ్లి. హార్దిక్ చేతికి 36 ఓవర్లో బౌలింగ్ ఇచ్చాడు.ఆరు పరుగుల ఎకానమీతో ఆకట్టుకున్న హార్దిక్.. స్టీవ్ స్మిత్ వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఒకవేళ హార్దిక్ చేత ముందే బౌలింగ్ వేయించుంటే పరిస్థితి మరోలా ఉండేది. తొలి వన్డేలో హార్దిక్ చేత బౌలింగ్ చేయించలేకపోయమని బాధపడిన కోహ్లి.. ఈ మ్యాచ్‌లో అతని చేత నాలుగు ఓవర్లే వేయించడమే ప్రశ్నార్థకంగా మారింది. తరచు బౌలింగ్ మార్పులు ఈ మ్యాచ్‌లో బుమ్రా, షమీ, సైనీ, రవీంద్ర జడేజా, చహల్, హార్దిక్ పాండ్యాలతో పాటు మయాంక్ అగర్వాల్ కూడా బౌలింగ్ చేశాడు. ప్రధానంగా కోహ్లి బౌలింగ్‌ను తరచు మార్చుతూ కనిపించాడు. మ్యాచ్ మధ్య భాగంలో బౌలర్ల చేత కంటిన్యూ స్పెల్ చేయించకుండా మార్చి మార్చి బౌలింగ్ వేయించి ఆసీస్‌ను ఇబ్బంది పెట్టాలనుకున్నాడు కోహ్లి. కానీ బెడిసి కొట్టింది. బౌలర్ల చేత కంటిన్యూ స్పెల్ చేయిస్తే వారికి పిచ్‌పై పట్టుదొరికి వికెట్లు సాధించడానికి ఆస్కారం దొరుకుతుంది. ఇక్కడ ఆసీస్ బ్యాట్స్‌మెన్ క్రీజ్‌లో సెటిల్ కావడానికి బౌలింగ్ ఛేంజ్ చేస్తూ పోవడం కారణంగా చెప్పవచ్చు.