సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగనున్న మూడో టెస్టుకు టీమిండియా తుదిజట్టును ప్రకటించింది. స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్ ద్వారా తిరిగి జట్టుతో చేరగా.. బౌలర్ నవదీప్ సైనీ టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నాడు. రోహిత్ రాకతో మయాంక్ అగర్వాల్‌పై వేటు పడగా.. నవదీప్ ఎంట్రీతో నటరాజన్‌కు మొండిచేయి ఎదురైంది. కాగా ఆసీస్- టీమిండియా మధ్య గురువారం మూడో టెస్టు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానే సారథ్యంలోని టీమిండియా ఆసీస్‌ను ఢీకొట్టేందుకు అన్నివిధాలుగా సన్నద్ధమవుతోంది. ఇక తొలి టెస్టు తర్వాత రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి స్వదేశానికి తిరిగి రాగా.. మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, కేఎల్ రాహుల్ గాయాల బారిన పడి జట్టుకు దూరమైన విషయం తెలిసిందే.(చదవండి: సిడ్నీలో రేపటి నుంచి మూడో టెస్టు)
తుదిజట్టు:
అజింక్య రహానే(కెప్టెన్), రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, హనుమ విహారి, రిషభ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, నవదీప్ సైనీ (చదవండి: నాలుగో టెస్టు: ముంబైలో అయినా ఓకే: ఆసీస్ కెప్టెన్)
సిడ్నీ టెస్టు: టీమిండియా తుదిజట్టు ఇదే!
Published Wed, Jan 6 2021 2:07 PM | Last Updated on Wed, Jan 6 2021 8:21 PM
Advertisement
Advertisement