Navdeep Saini
-
దులీప్ ట్రోఫీ.. సైనీ ఆల్‌రౌండ్ ప్రదర్శన
బెంగళూరు: భారత్ ‘ఎ’ జట్టుతో జరుగుతున్న దులీప్ ట్రోఫీ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ ‘బి’ జట్టు 116 ఓవర్లలో 321 పరుగులకు ఆలౌటైంది. ముషీర్ ఖాన్ (373 బంతుల్లో 181; 16 ఫోర్లు, 5 సిక్సర్లు) తన ఓవర్‌నైట్ స్కోరుకు మరిన్ని పరుగులు జోడించగా...పేసర్ నవ్‌దీప్ సైనీ (144 బంతుల్లో 56;8 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధ శతకంతో సత్తా చాటాడు. చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ పోరులో 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన దశలో ఈ ఇద్దరూ ఎనిమిదో వికెట్‌కు 205 పరుగులు జోడించి భారత్ ‘బి’ని గట్టెక్కించారు. డబుల్ సెంచరీ చేసేలా కనిపించిన ముషీర్ ఖాన్‌ను కుల్దీప్ యాదవ్ ఔట్ చేశాడు. ఆ తర్వాత భారత్ ‘బి’ ఇన్నింగ్స్ ఎక్కువసేపు సాగలేదు. భారత్ ‘ఎ’ జట్టు బౌలర్లలో ఆకాశ్ దీప్ 4, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ‘ఎ’ జట్టు శుక్రవారం ఆట ముగిసే సమయానికి 35 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (25), మయాంక్ అగర్వాల్ (36; 8 ఫోర్లు) ఔట్ కాగా.. రియాన్ పరాగ్ (27 బ్యాటింగ్), కేఎల్ రాహుల్ (23) క్రీజులో ఉన్నారు. ఈ రెండు వికెట్లూ నవదీప్ సైనీకే దక్కాయి. చేతిలో 8 వికెట్లు ఉన్న భారత్ ‘ఎ’ జట్టు... ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 187 పరుగులు వెనుకబడి ఉంది. -
‘జఫ్పా’తో మాయచేసిన సైనీ.. గిల్ బౌల్డ్!.. స్కోరెంతంటే?
టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ దులిప్ ట్రోఫీ-2024లో శుభారంభం అందుకోలేకపోయాడు. ఇండియా-‘ఏ’ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఈ ఓపెనింగ్ బ్యాటర్.. ఇండియా- ‘బి’తో మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో తేలిపోయాడు. కేవలం 25 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.నిరాశపరిచిన గిల్క్రీజులో నిలదొక్కుకుని భారీ స్కోరు సాధిస్తాడనుకున్న అభిమానులను పూర్తిగా నిరాశపరిచాడు. ఇండియా-‘బి’ పేసర్ నవదీప్ సైనీ సంధించిన ‘జఫ్ఫా(పర్ఫెక్ట్ బాల్)’ ధాటికి బౌల్డ్ అయ్యాడు. దులిప్ ట్రోఫీ తొలి రౌండ్లో భాగంగా ఇండియా-ఏ, ఇండియా-బి జట్ల మధ్య గురువారం తొలి మ్యాచ్ ఆరంభమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో టాస్ గెలిచిన శుబ్‌మన్ గిల్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు.ముషీర్ ఖాన్ శతకం కారణంగా ఇండియా-బి మెరుగైన స్కోరుఈ క్రమంలో ఇండియా-బి తరఫున అరంగేట్ర బ్యాటర్ ముషీర్ ఖాన్ అద్భుత శతకం(181)తో ఆకట్టుకోగా.. పేసర్ నవదీప్ సైనీ సైతం సంచలన ఇన్నింగ్స్(56) ఆడాడు. వీరిద్దరు రాణించిన కారణంగా 321 పరుగుల వద్ద రెండోరోజు ఇండియా-బి తొలి ఇన్నింగ్స్ ముగిసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇండియా-ఏ జట్టుకు ఓపెనర్ మయాంక్ అగర్వాల్ శుభారంభం అందించాడు.సైనీ జఫ్ఫా.. గిల్ బౌల్డ్ఈ కర్ణాటక బ్యాటర్ 45 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 36 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. నఅయితే, మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ 43 బంతులు ఎదుర్కొని మూడు ఫోర్ల సాయంతో 25 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇండియా-ఏ తొలి ఇన్నింగ్స్ 14వ ఓవర్లో నవదీస్ సైనీ అవుట్‌సైడ్ ఆఫ్ దిశగా వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమయ్యాడు. ఫలితంగా బంతి స్టంప్‌ను ఎగురగొట్టడంతో గిల్ తొలి వికెట్‌గా వెనుదిరిగాడు.వీడియో వైరల్అనంతరం నవదీప్ సైనీ బౌలింగ్‌లో వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు క్యాచ్ ఇవ్వడంతో మయాంక్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. దీంతో రెండో రోజు ఆటలో ఇండియా-ఏ రెండో వికెట్ కోల్పోయింది. ఆట పూర్తయ్యే సరికి రియాన్ పరాగ్ 27, కేఎల్ రాహుల్ 23 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా గిల్ అవుటైన దృశ్యాలకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే.. ఇటీవలే టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్ వైస్ కెప్టెన్‌గా ఎంపికైన గిల్.. తదుపరి బంగ్లాదేశ్‌తో స్వదేశంలో టెస్టు సిరీస్ ఆడే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు. దులిప్ ట్రోఫీ ప్రదర్శన ఆధారంగా భారత జట్టు ఎంపిక నేపథ్యంలో గిల్ తనను తాను మరోసారి నిరూపించుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. చదవండి: బ్యాట్ ఝులిపించిన శ్రేయస్ అయ్యర్.. ఎట్టకేలకు..Terrific delivery 🔥Excellent catch 👌Navdeep Saini bowled a peach to dismiss Shubman Gill and Rishabh Pant pulled off a superb diving catch to remove Mayank Agarwal.#DuleepTrophy | @IDFCFIRSTBankFollow the match ▶️ https://t.co/eQyu38Erb1 pic.twitter.com/z1cCHONjCI— BCCI Domestic (@BCCIdomestic) September 6, 2024 -
Duleep Trophy: ఆ ముగ్గురు దూరం.. బీసీసీఐ ప్రకటన
టీమిండియా స్టార్ క్రికెటర్లు రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ దులిప్ ట్రోఫీ- 2024 టోర్నీకి దూరమయ్యారు.ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. హైదరాబాదీ పేసర్ సిరాజ్, కశ్మీరీ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని.. టోర్నీ మొదలయ్యే నాటికి వీరిద్దరు అందుబాటులో ఉండే పరిస్థితి లేదని తెలిపింది.సిరాజ్, ఉమ్రాన్ స్థానాల్లో వీరేఫిట్నెస్ కారణాల దృష్ట్యా సిరాజ్, ఉమ్రాన్ దులిప్ ట్రోఫీ తాజా ఎడిషన్ మొత్తానికి దూరం కానున్నట్లు పేర్కొంది. మరోవైపు.. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను టీమ్-బి నుంచి విడుదల చేస్తున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. అయితే, ఇందుకు గల కారణం మాత్రం తెలపలేదు. ఇక టీమ్-బిలో భాగమైన సిరాజ్ దూరం కావడంతో.. అతడి స్థానంలో హర్యానా రైటార్మ్ పేసర్ నవదీప్ సైనీని ఎంపిక చేసినట్లు బీసీసీఐ పేర్కొంది.అదే విధంగా.. టీమ్-సిలో ఉమ్రాన్ మాలిక్ స్థానాన్ని పాండిచ్చేరి ఫాస్ట్ బౌలర్ గౌరవ్ యాదవ్‌తో భర్తీ చేసినట్లు తెలిపింది. అయితే, జడ్డూ రీప్లేస్‌మెంట్‌ను మాత్రం బీసీసీఐ ప్రకటించలేదు. ఇక టీమ్-బిలో ఉన్న ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి సైతం పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధిస్తేనే ఈ టోర్నీలో పాల్గొంటాడని తెలిపింది.కాగా నాలుగు రోజుల ఫార్మాట్లో జరిగే దులిప్ ట్రోఫీ 2024-25 ఎడిషన్ సెప్టెంబరు 5 నుంచి మొదలుకానుంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్, బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఈ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.దులిప్ ట్రోఫీ- 2024 రివైజ్డ్ టీమ్స్ఇండియా-ఏశుబ్మన్ గిల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, తనూష్ కొటియన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్, విద్వత్ కావేరప్ప, కుమార్ కుషాగ్రా, శస్వత్ రావత్.ఇండియా-బిఅభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ముషీర్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి*, వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైనీ, యశ్ దయాళ్, ముకేష్ కుమార్, రాహుల్ చహర్, ఆర్. సాయి కిషోర్, మోహిత్ అవస్థి, ఎన్ జగదీశన్ (వికెట్ కీపర్).ఇండియా-సిరుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, బి ఇంద్రజిత్, హృతిక్ షోకీన్, మానవ్ సుతార్, గౌరవ్ యాదవ్, వైషక్ విజయ్‌కుమార్, అన్షుల్ ఖంబోజ్, హిమాన్షు చౌహాన్, మయాంక్ మార్కండే, ఆర్యన్ జుయాల్ (వికెట్ కీపర్), సందీప్ వారియర్.ఇండియా-డిశ్రేయస్ అయ్యర్(కెప్టెన్), అథర్వ తైడే, యశ్ దూబే, దేవదత్ పడిక్కల్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రికీ భుయ్, శరణ్ జైన్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ఆదిత్య థాకరే, హర్షిత్ రాణా, తుషార్ దేశ్‌పాండే, ఆకాశ్ సేన్‌గుప్తా, కేఎస్ భరత్(వికెట్ కీపర్), సౌరభ్ కుమార్.చదవండి: టీ20 వరల్డ్‌కప్ కోసం భారత జట్టు ప్రకటన -
గంభీర్ కీలక నిర్ణయం.. 3 ఏళ్ల తర్వాత ఆ ప్లేయర్ రీ ఎంట్రీ! ఎవరంటే?
శ్రీలంక పర్యటనకు భారత జట్టును గురువారం బీసీసీఐ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. జూన్ 18 (గురువారం) సాయంత్రం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ వర్చువల్‌గా సమావేశం కానుంది. ఈ మీటింగ్‌లో భారత కొత్త హెడ్ కోచ్ గౌతం గంభీర్ సైతం పాల్గోనున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా ఆతిథ్య జట్టుతో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లలో తలపడనుంది.ఈ రెండు సిరీస్‌లకు వేర్వేరు జట్లను అగార్కర్ అండ్ కో ఎంపికచేయనున్నారు. అయితే లంకతో వన్డేలకు టీమిండియా స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా దూరం కానున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి . తొలుత భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా లంకతో వన్డే సిరీస్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. కానీ హిట్‌మ్యాన్ తన నిర్ణయాన్ని మార్చుకుని శ్రీలంక పర్యటనకు అందుబాటులో ఉంటానని సెలక్టర్లకు తెలియజేసినట్లు వినికిడి. అదేవిధంగా శ్రీలంకతో టీ20ల్లో భారత కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా వ్యహరించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.నవ్‌దీప్ సైనీ రీ ఎంట్రీశ్రీలంక టూర్‌కు భారత జట్టు ఎంపిక ముందు కొత్త హెడ్‌కోచ్ గౌతం గంభీర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గత మూడేళ్లగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న ఫాస్ట్ బౌలర్ నవ్‌దీప్ సైనీకి తిరిగి పిలుపునివ్వాలని సెలక్టర్లకు గంభీర్ సూచించినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. లంకతో వన్డే జట్టులో సైనీ భాగం చేయాలని గంభీర్ భావిస్తున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్స్‌ను పెంచుకునే విధంగా గంభీర్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా నవ్‌దీప్ సైనీ చివరగా 2021లో ఆర్. ప్రేమదాస స్టేడియంలో శ్రీలంకతో జరిగిన వన్డేలో భారత తరపున ఆడాడు. ఆ తర్వాత అతడికి జాతీయ జట్టులో చోటు దక్కలేదు. అతడు ప్రస్తుతం ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అదే విధంగా ఇటీవల దేశీవాళీ క్రికెట్‌తో పాటు ఇంగ్లండ్ కౌంటీల్లో కూడా అద్భుతంగా రాణించాడు. ఈ క్రమంలోనే అతడికి పిలుపునివ్వాలని గంభీర్ నిర్ణయించుకున్నట్లు వినికిడి. -
Navdeep Saini : శ్రీవారిని దర్శించుకున్న టీమిండియా క్రికెటర్ (ఫొటోలు)
-
Navdeep Saini-Swati Asthana Marriage: స్వాతిని పెళ్లాడిన నవదీప్ సైనీ.. హీరోయిన్లకు తక్కువేమీ కాదు!(ఫొటోలు)
-
యూట్యూబర్‌ను పెళ్లాడిన టీమిండియా పేసర్.. సిరాజ్ విషెస్
Navdeep Saini Gets arried to Girlfriend: టీమిండియా పేసర్ నవదీప్ సైనీ వివాహ బంధంలో అడుగుపెట్టాడు. చిరకాల ప్రేయసి స్వాతి ఆస్తానాను పెళ్లాడాడు. ఈ శుభవార్తను ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు నవదీప్. ఈ మేరకు.. ‘‘నీతో ఉంటే ప్రతిరోజూ నేను ప్రేమలో పడుతూ ఉంటా.. ఈరోజు నుంచి మేమిద్దరం కలకాలం కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం. జీవితంలో కొత్త అధ్యాయం ఆరంభించిన మాకు మీ ప్రేమ, ఆశీర్వాదాలు కావాలి’’ అని నవదీప్ సైనీ గురువారం తన పెళ్లి ఫొటోలను షేర్ చేశాడు. ఈ క్రమంలో మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, రాహుల్ తెవాటియా, సాయికిషోర్, చేతన్ సకారియా, మన్దీప్ సింగ్, మొహ్సిన్ ఖాన్ తదితర భారత క్రికెటర్లు నవదీప్- స్వాతి దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కర్నాల్ కుర్రాడు హర్యానాకు చెందిన నవదీప్ సైనీ 2019లో టీమిండియా తరఫున అంతర్జాతీయ టీ20, వన్డేల్లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత రెండేళ్లకు టెస్టుల్లోనూ అరంగేట్రం చేశాడు. ప్రఖ్యాత సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో పటిష్ట ఆస్ట్రేలియా జట్టుతో తన టెస్టు ప్రస్థానం మొదలుపెట్టాడు. ఇక ఇంటర్నేషనల్ కెరీర్లో ఇప్పటి వరకు మొత్తంగా 8 వన్డేలు, 11 టీ20లు, 2 టెస్టులు ఆడిన ఈ 31 ఏళ్ల రైటార్మ్ పేసర్.. ఆయా ఫార్మాట్లలో 6, 13, 4 వికెట్లు పడగొట్టాడు. కాగా నవదీప్ సైనీ టీమిండియా తరఫున చివరిసారిగా.. శ్రీలంకతో టీ20 సిరీస్ సందర్భంగా మైదానంలో దిగాడు. ఇక ఐపీఎల్లో అతడు గతేడాది రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్య వహించాడు. ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(టీ20) సందర్భంగా ఢిల్లీకి ఆడాడు. ఎవరీ స్వాతి ఆస్తానా?! నవదీప్‌ను పెళ్లాడిన స్వాతి ఆస్తానా ఫ్యాషన్, ట్రావెల్, లైఫ్‌స్టైల్ వ్లాగర్. ఆమెకు సొంతంగా యూట్యూబ్ చానెల్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 84 వేల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇక తమ వివాహ వేడుకలో స్వాతి- నవదీప్ పేస్టల్ కలర్ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. View this post on Instagram A post shared by Navdeep Saini (@navdeep_saini10_official) చదవండి: ఐపీఎల్-2024కు ముందు చెన్నై సూపర్ కింగ్స్‌కు బిగ్ షాక్.. -
అస్సలు ఊహించలేదు.. అప్పుడెప్పుడో!ఈసారి తుది జట్టులో చోటు ఖాయం!
India West Indies tour 2023: టీమిండియాకు తిరిగి ఎంపికవుతావని అస్సలు ఊహించలేదని ఢిల్లీ పేసర్ నవదీప్ సైనీ అన్నాడు. రెండోసారి వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుండటం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశాడు. గతంలో తనకు తుది జట్టులో చోటు దక్కలేదని, ఈసారి మాత్రం పూర్తి నమ్మకంతో ఉన్నానని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌తో అరంగేట్రం కాగా హర్యానాలోని కర్ణాల్లో జన్మించిన నవదీప్ సైనీ.. 2019లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత రెండేళ్లకు జనవరిలో ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2021 సందర్భంగా టెస్టుల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. ఇక శ్రీలంకతో 2021లో ఆడిన టీ20 మ్యాచ్ టీమిండియా తరఫున నవదీప్‌నకు ఆఖరి మ్యాచ్. కౌంటీల్లో ఆడేందుకు ఈ క్రమంలో దాదాపు మూడేళ్ల విరామం తర్వాత మరోసారి టీమిండియా సెలక్టర్ల నుంచి నవదీప్ సైనీ పిలుపు అందుకున్నాడు. ఇంగ్లండ్‌లో కౌంటీల్లో ఆడేందుకు సిద్ధమైన అతడు అనూహ్య రీతిలో జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. విండీస్‌తో టెస్టు సిరీస్ ఆడే జట్టులో చోటు దక్కించుకున్నాడు. కాగా వార్సెస్టర్‌షైర్ కౌంటీ క్లబ్‌కు ఆడాల్సిన సైనీ.. వెస్టిండీస్‌తో సిరీస్ నేపథ్యంలో ఇంగ్లండ్‌లో కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ఇదిలా ఉంటే.. సుదీర్ఘ విరామం తర్వాత పునరాగమనం చేయనుండటంపై స్పందిస్తూ నవదీప్ సైనీ ఉద్వేగానికి లోనయ్యాడు. అస్సలు ఊహించలేదు ‘‘నేను కౌంటీ క్రికెట్ ఆడేందకు లండన్‌కు వచ్చాను. ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వస్తున్న సమయంలోనే నేను వెస్టిండీస్‌లో పర్యటించే జట్టుకు ఎంపికయ్యానన్న వార్త తెలిసింది. నిజాయితీగా చెప్పాలంటే... నేను ఇది అస్సలు ఊహించలేదు. ఐపీఎల్ ఆడుతున్న సమయంలో డ్యూక్ బాల్స్‌తో ప్రాక్టీస్ చేశా. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ నేపథ్యంలో నన్ను కనీసం స్టాండ్‌బై ఎంపిక చేస్తారనే ఆశతోనే అలా చేశా. కానీ అది జరుగలేదు. ఇప్పుడు మాత్రం ఊహించని విధంగా మళ్లీ జట్టుతో చేరబోతున్నా’’ అని లండన్‌లో ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సైనీ పేర్కొన్నాడు. వెస్టిండీస్ పిచ్‌లపై తనకు అవగాహన ఉందన్న ఈ ఫాస్ట్ బౌలర్.. వెస్టిండీస్ పర్యటనకు ముందు ఒక్క మ్యాచ్ ఆడినా కావాల్సినంత ప్రాక్టీస్ దొరుకుతుందన్నాడు. కాగా 30 ఏళ్ల నవదీప్ సైనీ.. టీమిండియా తరఫున ఇప్పటి వరకు 2 టెస్టులు, 8 వన్డేలు, 11 టీ20లు ఆడి వరుసగా.. 2, 6, 13 వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్-2023లో అతడు రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్య వహించిన విషయం తెలిసిందే. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్, నవదీప్ సైనీ. చదవండి: లెజండరీ ఓపెనర్ దిల్షాన్.. డీకే మాదిరే! ఉపుల్ తరంగతో భార్య ‘బంధం’.. అతడినే పెళ్లాడి! కోహ్లి లేకుంటే జట్టులోకి వచ్చేవాడినే కాదు.. ధోని నా కళ్లు తెరిపించాడు: యువీ -
నక్క తోక తొక్కిన భారత ఆటగాడు! మూడేళ్ల తర్వాత రీ ఎంట్రీ.. అస్సలు ఊహించలేదు!
వెస్టిండీస్ పర్యటనకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. తొలుత టెస్టు, వన్డే సిరీస్‌లకు మాత్రమే జట్లను భారత సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. అయితే సెలక్టర్లు ఎంపిక చేసిన జట్టులో కొన్ని అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. ఐపీఎల్లో అద్భుతమైన అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన యశస్వీ జైశ్వాల్, రుత్‌రాజ్ గైక్వాడ్‌కు తొలిసారిగా టెస్టు జట్టులో చోటు దక్కగా.. వెటరన్ ఆటగాడు ఛతేశ్వర్ పుజారాపై వేటు పడింది. మరోవైపు మూడేళ్ల నుంచి జట్టుకు దూరంగా ఉన్న పేసర్ నవదీప్ సైనీకి సెలక్టర్లు పిలుపునిచ్చారు. 2021లో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో టెస్టు క్రికెట్లోకి సైనీ అరంగేట్రం చేశాడు. అయితే తన డెబ్యూ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన సైనీ.. ఇప్పటివరకు టెస్టుల్లో మరి కన్పించలేదు. సైనీ 4 ఇన్నింగ్స్‌లో 4.11 ఏకానమీతో 4 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా ఇప్పటివరకు 8 వన్డే, 11 టీ20ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇక ఈ ఏడాది ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన సైనీ కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడి 3 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడేందుకు వోర్సెస్టర్షైర్ క్రికెట్ క్లబ్‌తో ఒప్పందం కుదుర్చుకున్న వెంటనే సైనీకి సెలక్టర్లు నుంచి పిలుపు రావడం గమానర్హం. జూలై 12 నుంచి భారత పర్యటన ప్రారంభం కానుంది. విండీస్‌తో టెస్టులకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కెఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, ఆర్ జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ. భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, మొహమ్మద్. సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్. చదవండి: IND vs WI: అతడేం నేరం చేశాడు.. ప్రతీసారి ఇంతే! నిజంగా సిగ్గుచేటు! -
స్థిరత్వం లేని బ్యాటింగ్.. పైగా వెకిలి నవ్వొకటి!
ఐపీఎల్ 16వ సీజన్లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతున్న లియామ్ లివింగ్ స్టోన్ స్థిరత్వం లేకుండా ఆడుతున్నాడు. ఒక మ్యాచ్‌లో భారీ స్కోరు చేస్తే మరుసటి మ్యాచ్‌లో తక్కువ స్కోరుకే వెనుదిరగడం అలవాటుగా చేసుకున్నాడు. తాజాగా శుక్రవారం రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో లివింగ్‌స్టోన్ 9 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈ సీజన్లో 8 మ్యాచ్‌లాడిన లివింగ్‌స్టోన్ 270 పరుగులు చేశాడు. రెండు అర్థశతకాలు ఉన్నాయి. ఇక రాజస్తాన్‌తో మ్యాచ్‌లో లివింగ్‌స్టోన్ ఆడిన దానికంటే ఔటైన తీరు ఆశ్చర్యపరిచింది. నవదీప్ సైనీ వేసిన ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో మూడో బంతి ఫుల్‌లెంగ్త్ డెలివరీ వేశాడు. అయితే లివింగ్‌స్టోన్ కనీసం బంతి ఎలా వస్తుందో కూడా చూడకుండా గుడ్డిగా బ్యాట్‌ను ఉపాడు. ఇంకేముంది సైనీ వేసిన బంతి నేరుగా వికెట్లను గిరాటేసింది. అయితే క్లీన్‌బౌల్డ్ అయ్యానన్న బాధ లివింగ్‌స్టోన్ మొహంలో కనిపించలేదు కదా వెకిలినవ్వుతో పెవిలియన్ చేరడం అందరిని ఆశ్చర్యపరిచింది. Navdeep Saini doesn't miss 🎯#PBKSvRR #IPLonJioCinema #TATAIPL #IPL2023 pic.twitter.com/QosEBqIkrB — JioCinema (@JioCinema) May 19, 2023 Liam Livingstone cleaned up by Navdeep Saini! 😱#PBKSvsRR #IPL2023 #Cricket pic.twitter.com/jkNg3u1zGg — OneCricket (@OneCricketApp) May 19, 2023 చదవండి: కోహ్లి '18' వెంటపడడం లేదు.. అతని వెనకే '18' వస్తోంది -
Ind Vs Ban: రోహిత్‌తో పాటు అతడు కూడా అవుట్.. బీసీసీఐ ప్రకటన
Bangladesh vs India, 2nd Test: బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు కూడా టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యాడు. అతడితో పాటు పేసర్ నవదీప్ సైనీ కూడా ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదు. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి మంగళవారం ధ్రువీకరించింది. రోహిత్ శర్మ గాయం నుంచి ఇంకా కోలుకోలేదని, ప్రస్తుతం అతడు బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో రెండో టెస్టుకు కూడా కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని పేర్కొంది. ఇక నవదీప్ సైనీ పొట్ట కండరాల నొప్పితో బాధపడుతున్నట్లు పేర్కొన్న బీసీసీఐ.. అతడు జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లనున్నట్లు తెలిపింది. నవదీప్ సైనీ రాహుల్ సారథ్యంలో.. కాగా బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ సందర్భంగా రోహిత్ శర్మ గాయపడ్డ విషయం తెలిసిందే. ఎడమచేతి బొటనవేలికి గాయమైనప్పటికీ బ్యాటింగ్ చేసిన హిట్‌మ్యాన్.. నొప్పి తీవ్రతరం కావడంతో స్వదేశానికి తిరిగివచ్చాడు. ఈ క్రమంలో మొదటి టెస్టుకు దూరమైన రోహిత్.. రెండో మ్యాచ్ నాటికి అందుబాటులోకి వస్తాడనుకున్నా అలా జరుగలేదు. ఇక కేఎల్ రాహుల్ సారథ్యంలో తొలి టెస్టులో బంగ్లాను చిత్తు చేసిన టీమిండియా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో చోటు దక్కించుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇదిలా ఉంటే ఫాస్ట్‌బౌలర్ నవదీప్ సైనీకి టెస్టు జట్టులో చోటు దక్కినా మొదటి మ్యాచ్‌లో ఆడే అవకాశం రాలేదు. బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు భారత జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కెఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, అభిమన్యు ఈశ్వరన్, సౌరభ్ కుమార్, జయదేవ్ ఉనద్కత్. చదవండి: Kylian Mbappe: నిండా పాతికేళ్లు లేవు.. ప్రపంచమే సలాం కొట్టింది; ఎవరీ ఎంబాపె Babar Azam: ఇంగ్లండ్ చేతిలో ఘోర ఓటమి.. బాబర్ ఆజం చెత్త రికార్డు! మొదటి పాక్ కెప్టెన్‌గా.. -
శతక్కొట్టిన టీమిండియా ఓపెనర్లు.. రెచ్చిపోయిన యశస్వి జైస్వాల్
IND A VS BAN A 1st Unofficial Test: బంగ్లాదేశ్-ఏతో జరుగుతున్న తొలి అనధికారిక నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్‌లో భారత-ఏ జట్టు పట్టు బిగించింది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన టీమిండియా.. తొలి రోజు (నవంబర్ 29) ప్రత్యర్ధిని 45 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూల్చింది. సౌరభ్ కుమార్ (4/23), నవదీప్ సైని (3/21) బంగ్లా పతనాన్ని శాశించారు. అనంతరం నిన్ననే తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 36 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 120 పరుగులు చేసింది. తొలి రోజే అర్ధసెంచరీలు పూర్తి చేసుకుని జోరు మీదుండిన భారత ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (61 బ్యాటింగ్), అభిమన్యు ఈశ్వరన్ (53 బ్యాటింగ్) రెండో రోజు మరింత రెచ్చిపోయారు. ఇద్దరు భారీ సెంచరీలు సాధించి జట్టును పటిష్ట స్థితిలో ఉంచారు. జైస్వాల్ (145; 20 ఫోర్లు, సిక్స్), ఈశ్వరన్ (142; 11 ఫోర్లు, సిక్స్) తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 283 పరుగులు జోడించారు. ఫలితంగా రెండో రోజు టీ విరామం సమయానికి భారత్.. 3 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. యశ్ ధుల్ (20) ఔట్ కాగా.. తిలక్ వర్మ (6), సర్ఫరాజ్ ఖాన్ (0) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 213 పరుగుల ఆధిక్యంలో కొనసాగతుంది. కాగా, భారత-ఏ జట్టు బంగ్లాదేశ్ పర్యటనలో రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడుతుంది. వీటి అనంతరం టీమిండియా 3 వన్డేలు, 2 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ కోసం ఆ దేశంలో పర్యటిస్తుంది. -
భారత బౌలర్ల విజృంభణ.. కుప్పకూలిన బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ ‘ఎ’ జట్టుతో తొలి టెస్టులో మొదటి రోజు భారత్ ‘ఎ’కు ఎనిమిది పరుగుల ఆధిక్యం దక్కింది. కాక్స్ బజార్లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 45 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లు సౌరభ్ కుమార్ (4/23), నవదీప్ సైని (3/21) రాణించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ఆట ముగిసే సమయానికి 36 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 120 పరుగులుచేసింది. యశస్వి (61 బ్యాటింగ్), ఈశ్వరన్ (53 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. -
అదరగొట్టిన సౌరభ్, నవదీప్.. 112 పరుగులకే కుప్పకూలిన బంగ్లాదేశ్
Bangladesh A vs India A, 1st unofficial Test: బంగ్లాదేశ్- ఏతో అనధికారిక టెస్టులో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శనతో మెరిశారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ సౌరభ్ 4 వికెట్లతో చెలరేగగా.. పేసర్ నవదీప్ సైనీ 3 వికెట్లు కూల్చాడు. వీరిద్దరికి తోడు ముకేశ్ కుమార్ రాణించడంతో బంగ్లా జట్టు 112 పరుగులకే కుప్పకూలింది. కాగా టీమిండియా కంటే ముందు భారత- ఏ జట్టు బంగ్లాదేశ్‌కు పయనమైన విషయం తెలిసిందే. ఈ టూర్లో భాగంగా బంగ్లాదేశ్- ఏ జట్టుతో రెండు అనధికారిక టెస్టు(నాలుగు రోజుల మ్యాచ్)లు ఆడనుంది. ఇందులో భాగంగా ఇరు జట్ల మధ్య మంగళవారం మొదటి టెస్టు ఆరంభమైంది. టాస్ గెలిచి కాక్స్ బజార్ వేదికగా ఆరంభమైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ అభిమన్య ఈశ్వరన్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. సారథి నమ్మకాన్ని నిలబెడుతూ భారత బౌలర్లు విజృంభించారు. నవదీప్ సైనీ, ముకేశ్ కుమార్ చెలరేగడంతో బంగ్లా బ్యాటింగ్ ఆర్డర్ కకావిలకమైంది. ఓపెనర్లు మహ్మదుల్ హసన్ జాయ్ 1, జాకిర్ హసన్ 0 పరుగులకే అవుట్ కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన షాంటో 19 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత మొమినుల్ 4 పరుగులకే అవుట్ కాగా.. కెప్టెన్ మహ్మద్ మిథున్ డకౌట్‌గా వెనుదిరిగాడు. మొసద్దెక్ ఒంటరి పోరాటం ఈ క్రమంలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన మొసద్దెక్ హొసేన్ 63 పరుగులు చేసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే సౌరభ్ కుమార్ అతడిని పెవిలియన్‌కు పంపడంతో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ముగింపునకు చేరుకుంది. ఈ క్రమంలో 45 ఓవర్లలో కేవలం 112 పరుగులు మాత్రమే చేసి బంగ్లా- ఏ జట్టు ఆలౌట్ అయింది. సౌరభ్‌కు 4, నవదీప్‌నకు మూడు, ముకేశ్ కుమార్‌కు రెండు, అతిత్ షేత్‌కు ఒక వికెట్ దక్కాయి. చదవండి: 6 Sixes In An Over: ఒకే ఓవర్లో 6 సిక్స్‌లు కొట్టింది వీళ్లే! ఇక రుతు 7 సిక్సర్లు బాదితే.. అతడు ఏకంగా 8! SL Vs AFG: ఒకేరోజు పెళ్లి చేసుకున్న ముగ్గురు లంక యువ క్రికెటర్లు! ఓవైపు సిరీస్ ఆడుతూనే.. -
అరంగేట్రంలోనే అదుర్స్! ద్రవిడ్ తర్వాత ఆ ఘనత సైనీదే.. కానీ పాపం..
County Championship 2022: టీమిండియా పేసర్ నవదీప్ సైనీ కౌంటీ చాంపియన్‌షిప్ ఎంట్రీలోనే అదరగొట్టాడు. కెంట్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు అరంగేట్రంలోనే ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా కెంట్.. వార్విక్షైర్తో తలపడుతోంది. ఈ మ్యాచ్ ద్వారా కౌంటీల్లో అడుగు పెట్టిన సైనీ.. వార్విక్షైర్ మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఐదు వికెట్లు తీసి సత్తా చాటాడు. క్రిస్ బెంజమిన్, డాన్ మూస్లే, మిచెల్ బర్గ్స్ , హెన్రీ బ్రూక్స్, క్రెయిగ్ మిల్స్‌లను అవుట్ చేశాడు. Five wickets on debut: @navdeepsaini96 🏎 pic.twitter.com/6wzYjE8N1d — Kent Cricket (@KentCricket) July 20, 2022 ద్రవిడ్ తర్వాత ఆ ఘనత సైనీదే! టెస్టు స్పెషలిస్టు ఛతేశ్వర్ పుజారా సహా పలువురు టీమిండియా క్రికెటర్లు కౌంటీ చాంపియన్‌షిప్-2022లో ఆడుతున్న విషయం తెలిసిందే. పుజారా ససెక్స్‌కు, ఉమేశ్ యాదవ్ మిడిల్సెక్స్ తరఫున, వాషింగ్టన్ సుందర్ లంకాషైర్ తరఫున ఆడుతున్నారు. కాగా వాషింగ్టన్ సుందర్ సైతం తొలి మ్యాచ్‌లోనే ఐదు వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. ఇక సైనీ కెంట్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. కాగా గతంలో టీమిండియా వాల్, ప్రస్తుత హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ ఈ జట్టుకు ఆడాడు. ఆ తర్వాత కెంట్కు ఆడుతున్న ఘనత నవదీప్ సైనీకే దక్కింది. ఇదిలా ఉంటే.. రాయల్ వన్డే చాంపియన్‌షిప్‌లో భాగంగా కృనాల్ పాండ్యా వార్విక్‌షైర్‌కు ఆడనున్నాడు. పాపం.. బౌలర్లు రాణించినా.. మ్యాచ్ విషయానికొస్తే.. జూలై 19న కెంట్‌తో ఆరంభమైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన వార్విక్షైర్ తొలి ఇన్నింగ్స్‌ను 225 పరుగుల వద్ద ముగించింది. కెంట్ బౌలర్లలో సైనీ ఐదు వికెట్లు తీయగా.. మ్యాట్ హెన్రీ రెండు, మిల్న్స్ మూడు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. అయితే, బ్యాటర్లు విఫలం కావడంతో 165 పరుగులకే కెంట్ కుప్పకూలింది. వర్షం కారణంగా మూడో రోజు ఆట ఆలస్యమైంది. చదవండి: Ind Vs WI ODI Series: వీళ్లతో అంత వీజీ కాదు! ఏమరపాటుగా ఉంటే మూల్యం చెల్లించకతప్పదు! -
‘కెంట్’ తరఫున కౌంటీల్లో నవదీప్ సైనీ
ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో మరో భారత పేస్ బౌలర్‌కు అవకాశం దక్కింది. 29 ఏళ్ల ఢిల్లీ పేసర్ నవదీప్ సైనీ ‘కెంట్’ జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. ఈ సీజన్లో 3 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 5 వన్డేలలో అతను ‘కెంట్’కు ప్రాతినిధ్యం వహిస్తాడు. రాహుల్ ద్రవిడ్ తర్వాత ఈ టీమ్‌కు ఆడనున్న రెండో భారత క్రికెటర్ సైనీ. తాజా సీజన్లో కౌంటీలు ఆడుతున్న భారత ఆటగాళ్ల సంఖ్య ఐదుకు చేరింది. ఇప్పటికే పుజారా, సుందర్, కృనాల్, ఉమేశ్ యాదవ్ ఒప్పందాలు చేసుకున్నారు. భారత్‌కు 2 టెస్టులు, 8 వన్డేలు, 11 టి20ల్లో ప్రాతినిధ్యం వహించిన సైనీ మూడు ఫార్మాట్లలో కలిపి 23 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టాడు. అతను జాతీయ జట్టు తరఫున ఆడి దాదాపు ఏడాదవుతోంది. చరిత్రాత్మక ‘బ్రిస్బేన్ టెస్టు’ విజయం తర్వాత సైనీకి మళ్లీ టెస్టు మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. -
శభాష్ సైనీ.. తలకు దెబ్బ తగిలిన క్యాచ్ వదలలేదు.. వీడియో వైరల్
ఐపీఎల్-2022లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు నవదీప్ సైనీ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ 13 ఓవర్ వేసిన ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో.. కిషన్ డిప్ స్వేర్ లెగ్ దిశగా పుల్ షాట్ ఆడాడు. ఈ కమ్రంలో స్వేర్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సైనీ పరిగెత్తుకుంటూ వచ్చి అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. అయితే క్యాచ్ పట్టే సమయంలో అతడి తలకు గాయమైంది. అయినప్పటికీ సైనీ క్యాచ్ విడిచి పెట్టలేదు. కాగా నొప్పితో ఫీల్డ్‌లో కొద్ది సేపు బాధ పడ్డాడు. అయితే ఫిజియో వచ్చి పరిశీలించగా గాయం అంత తీవ్రమైనది కాదని తెలింది. దీంతో ఫీల్డ్‌లో సైనీ కొనసాగాడు. కాగా ముంబై ఇన్నింగ్స్ అఖరి ఓవర్ వేసిన సైనీ కేవలం ఐదు పరుగులు మాత్రమే ఇచ్చి వికెట్ పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో3 ఓవర్లు వేసిన సైనీ.. 36 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు సాధించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముంబై ఇండియన్స్ పై రాజస్తాన్ రాయల్స్ 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇక 194 భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 7 వికెట్లు కోల్పోయి 170 పరుగులకే పరిమితమైంది. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ(61), ఇషాన్ కిషన్(54) పరగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. చదవండి: Tilak Varma: మ్యాచ్ ఓడినా మనసులు గెలుచుకున్న తెలుగు కుర్రాడు Navdeep Saini Injured. pic.twitter.com/i56oSR49WW — Jalaluddin Sarkar (Thackeray) 🇮🇳 (@JalaluddinSark8) April 2, 2022 -
IND VS SL: తగ్గేదేలేదంటున్న ఆ ముగ్గరు టీమిండియా క్రికెటర్లు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ "పుష్ప" కేవలం సినిమా ప్రపంచాన్నే కాకుండా యావత్ జగత్తును ఉర్రూతలూగిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ మూవీ విడుదలై నెలలు గడుస్తున్నా దీనికున్న క్రేజ్ ఏమాత్రం తగ్గడంలేదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అంతా పుష్ప మత్తులోనే ఉన్నారు. టీమిండియా క్రికెటర్లనైతే పుష్ప ఫోబియా వదలనంటుంది. ముఖ్యంగా ఇందులోనే 'తగ్గేదేలే' డైలాగ్‌ను భారత క్రికెటర్లు ఇంకా జపిస్తూనే ఉన్నారు. View this post on Instagram A post shared by Yuzvendra Chahal (@yuzi_chahal23) తాజాగా టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ సహచర క్రికెటర్లైన నవ్‌దీప్ సైనీ, హర్‌ప్రీత్ బ్రార్‌తో కలిసి బస్సుల్లో ప్రయాణిస్తూ తగ్గేదేలా హిందీ డైలాగ్‌కు రీల్స్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. తగ్గేదేలే డైలాగ్‌కు క్రికెటర్ల హావభావాలు అభిమానలును తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈ వీడియోను చహల్ ఇన్‌స్టా పోస్ట్ చేయగా లైక్‌లు , కామెంట్ల వర్షం కురుస్తుంది. శ్రీలంకతో సిరీస్‌లోనూ ఏ మత్రం తగ్గొద్దంటూ అభిమానులు కామెంట్ల ద్వారా క్రికెటర్లను ఎంకరేజ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, లంకతో టీ20 సిరీస్ ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. లక్నో వేదికగా తొలి టీ20, ఫిబ్రవరి 26, 27 తేదీల్లో ధర్మశాల వేదికగా రెండు, మూడు టీ20లు జరగనున్నాయి. అనంతరం మార్చి 4-8 వరకు మొహాలీలో తొలి టెస్టు, మార్చి 12-16 వరకు బెంగళూరు వేదికగా రెండో టెస్టు(డే అండ్ నైట్) జరగనుంది. చదవండి: Ind Vs SL: జట్టులోకి తిరిగి రావడం సంతోషంగా ఉంది: టీమిండియా ఆల్‌రౌండర్ -
IND vs SA ODI Series: వన్డే సిరీస్‌కు జయంత్ యాదవ్, నవదీప్ సైనీ ఎంపిక
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ నేపథ్యంలో జయంత్ యాదవ్ భారత జట్టుకు ఎంపికయ్యాడు. యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ స్థానంలో జట్టులో చోటు దక్కించుకున్నాడు. కాగా జనవరి 19 నుంచి ప్రొటిస్‌తో టీమిండియా వన్డే సిరీస్ మొదలు కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా జట్టుకు దూరం కాగా.. అతడి స్థానంలో కేఎల్ రాహుల్‌కు బీసీసీఐ సారథ్య బాధ్యతలు అప్పగించింది. అదే విధంగా సుదీర్ఘ విరామం తర్వాత శిఖర్ ధావన్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. యువ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ కూడా తొలిసారి వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. అయితే, వాషింగ్టన్ సుందర్ కోవిడ్ కారణంగా ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. దీంతో ఆలిండియా సీనియర్ సెలక్షన్ కమిటీ అతడి స్థానంలో జయంత్ యాదవ్‌ను ఎంపిక చేసింది. అదే విధంగా నవదీప్ సైనీని కూడా జట్టులో చేర్చింది. దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు సందర్భంగా గాయపడ్డ మహ్మద్ సిరాజ్‌కు బ్యాకప్‌గా సైనీకి అవకాశం ఇచ్చింది. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు భారత జట్టు: కేఎల్ రాహుల్(కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా(వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, యజువేంద్ర చాహల్, ఆర్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్, ప్రసిద్ క్రిష్ణ, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, జయంత్ యాదవ్, నవదీప్ సైనీ. చదవండి: SA vs IND: అత్యంత చెత్త రికార్డు నమోదు చేసిన దక్షిణాఫ్రికా ఓపెనర్.. -
Navdeep Saini: కసితో వేశాడు.. స్టంప్ ఎగిరి గాల్లో పల్టీలు
Navdeep Saini Sends Off Stump Wicket Cartwheeling.. ఇండియా-ఏ, దక్షిణాఫ్రికా-ఏ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో స్పీడస్టర్ నవదీప్ సైనీ అద్భుత బంతితో మెరిశాడు. అతని బౌలింగ్ దాటికి స్టంప్ ఎగిరి గాల్లో పల్టీలు కొట్టి మూడు నుంచి నాలుగు అడుగు దూరంలో పడింది. దక్షిణా ఇన్నింగ్స్ 92 వ ఓవర్లో ఇది చోటు చేసుకుంది. అప్పుడే క్రీజులోకి వచ్చిన కొత్త బ్యాటర్ హెండ్రిక్స్ క్రీజులో కుదురుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. తన 21వ ఓవర్ వేయడానికి వచ్చిన నవదీప్ సైనీ ఓవర్ తొలి బంతినే 100 కిమీవేగంతో విసిరాడు. పొరపాటున దాన్ని అంచనా వేయని హెండ్రిక్స్ వదిలేయడంతో బంతి ఆఫ్‌స్టంప్‌ను గిరాటేసింది. ఇంకేముంది స్టంప్ ఎగిరి గాల్లో పల్టీలు కొడుతూ కింద పడింది. అయితే పక్కనే ఉన్న మిడిల్ స్టంప్, లెగ్ స్టంప్‌లు మాత్రం ఇంచుకూడా కదలకపోవడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: IND Tour Of SA Delayed: ఒమిక్రాన్ ఎఫెక్ట్.. టీమిండియా పర్యటన వాయిదా! ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సర్ఫరాజ్ ఖాన్ (94 బంతుల్లో 71 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), హనుమ విహారి (164 బంతుల్లో 54; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. దీంతో 198/5 ఓవర్‌నైట్ స్కోరుతో గురువారం ఆట ప్రారంభించిన భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 74.5 ఓవర్లలో 276 పరుగుల వద్ద ఆలౌటైంది. సర్ఫరాజ్, విహారి ఆరో వికెట్‌కు 60 పరుగులు జోడించారు. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా ‘ఎ’కు 21 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆడిన దక్షిణాఫ్రికా మూడో రోజు ఆట నిలిచే సమయానికి 5 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. చదవండి: IND VS NZ: అతడు టీమిండియా ఓపెనర్‌గా రావాలి... Truly one of the most beautiful sights in cricket as Navdeep Saini uproots Beuran Hendricks' off stump. Marco Jansen however has been the 1st SA A batsmen to score 50 and is desperately hoping for the number 11 to just stay with him. SA A: 249/9#SAAvINDA pic.twitter.com/xPj1OlFJUq — Shaun (@Shaun_Analytics) December 1, 2021 -
తొలి రోజు భారత్‌పై చెలరేగి ఆడిన దక్షిణాఫ్రికా...
India A bowlers toil on opening day against South Africa A: భారత్ ‘ఎ’తో ఆరంభమైన తొలి అనధికారిక టెస్టులో దక్షిణాఫ్రికా ‘ఎ’ మొదటి రోజు చెలరేగింది. ఓపెనర్ పీటర్ మలాన్ (258 బంతుల్లో 157 నాటౌట్; 18 ఫోర్లు), టోని డి జోర్జి (186 బంతుల్లో 117; 18 ఫోర్లు) శతకాలు సాధించడంతో మంగళవారం ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 90 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 343 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ఉమ్రాన్, అర్జాన్, సైనీ ఒక్కో వికెట్ తీశారు. చదవండి: ఆటలో దూకుడు పెంచాను చతేశ్వర్ పుజారా వ్యాఖ్య -
ఆఖరి టీ20కి ముందు ధవన్ సేనకు మరో షాక్..!
కొలంబో: నిన్న శ్రీలంకతో జరిగిన రెండో టీ20 సందర్భంగా టీమిండియా స్టార్ పేసర్ నవదీప్ సైనీ గాయపడ్డాడు. ప్రస్తుతం అతను బీసీసీఐ వైద్య బృందం అబ్జర్వేషన్లో ఉన్నాడు. నిన్నటి మ్యాచ్‌లో ఎక్స్ట్రా కవర్లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో సైనీ గాయపడ్డాడు. కరుణరత్నే కొట్టిన బంతిని గాల్లోకి ఎగిరి పట్టుకునే ప్రయత్నంలో బలంగా కిందపడ్డాడు. దీంతో అతడి భుజానికి గాయమైంది. వెంటనే అప్రమత్తమైన వైద్య బృందం అతడిని మైదానం నుంచి తీసుకెళ్లి చికిత్స అందించింది. గాయం తీవ్రంగా ఉండడంతో నేటి నిర్ణయాత్మక మ్యాచ్ నుంచి అతను తప్పుకున్నట్లు తెలుస్తోంది. అసలే ఆటగాళ్లు అందుబాటులో లేక సతమతమవుతున్న సమయంలో సైనీ గాయం టీమిండియాను మరింత ఇబ్బంది పెడుతోంది. కనీసం పదకొండు మంది ఆటగాళ్లు కూడా అందుబాటులో లేని పరిస్థితి ప్రస్తుతం భారత జట్టులో నెలకొంది. కాగా, ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాకు కరోనా సోకడంతో అతనితో పాటు ఎనిమిది మంది భారత క్రికెటర్లు ఐసోలేషన్‌ను తరలించబడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్నటి మ్యాచ్‌కు స్టాండ్ బై ప్లేయర్లతో బరిలోకి దిగిన టీమిండియా ఘోరంగా ఓటమిపాలైంది. సిరీస్ డిసైడర్ అయిన నేటి మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి పరువు కాపాడుకోవాలని భావిస్తున్న భారత్‌కు సైనీ గాయం తలనొప్పిగా మారింది. ఈ మ్యాచ్‌లో సైనీ స్థానంలో తమిళనాడు లెఫ్టార్మ్ స్పిన్నర్ సాయి కిషోర్‌కు ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. సాయి కిషోర్‌తో పాటు అర్షదీప్ సింగ్ మాత్రమే ప్రస్తుతం టీమిండియా బెంచ్‌పై ఉన్నారు. -
దుమ్మురేపాడు.. నెటిజన్లచే చివాట్లు తిన్నాడు
న్యూఢిల్లీ: టీమిండియా యువ పేసర్ నవ్‌దీప్ సైనీ ట్విటర్ వేదికగా ట్రోలింగ్‌కు గురయ్యాడు. తాజాగా అతను చేసిన ట్వీట్ నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. సైనీ.. తన హార్లీ డేవిడ్సన్ బైక్‌పై షర్ట్ లేకుండా కూర్చొని ఓ మట్టి రోడ్డులో దుమ్మురేపుతున్న వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. భయాన్ని చూడాలంటే నాతో పాటు బైక్ మీద కూర్చోండి అంటూ క్యాప్షన్ జోడించాడు. ఈ పోస్టుకు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభించింది. ఆ స్టంట్ చూసిన కొందరు సైనీని మెచ్చుకోగా మరికొందరు తీవ్రంగా దుయ్యబట్టారు. Accompany me on my bike to feel the fear @harleydavidson pic.twitter.com/iosa8wS2ya — Navdeep Saini (@navdeepsaini96) May 30, 2021 క్రికెటర్ అయి ఉండి ఇంత బాధ్యాతారాహిత్యంగా వ్యవహరిస్తావా? అని కొందరు ఆగ్రహం వ్యక్తం చేయగా.. కుర్రాళ్లు నిన్న ఆదర్శంగా తీసుకొని ప్రమాదాలు గురైతే బాధ్యులెవరని మరికొందరు మండిపడ్డారు. టీమిండియాకు ఎంపికై రెండేళ్లు కూడా కాలేదు.. కాస్త ఓవరాక్షన్ తగ్గించుకుంటే మంచిదని మరికొందరు చివాట్లు పెట్టారు. మరికొందరు స్పందిస్తూ.. ఎవరైనా సాధారణ యువకులు ఇలా చేస్తే ఊరుకుంటారా?' అని ఘాటుగా విమర్శలు గుప్పించారు. కాగా, కొందరు నెటిజన్లు మాత్రం స్టంట్ అదిరిపోయిందంటూ సైనీని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అతని సిక్స్ ప్యాక్ బాడీ అదిరిపోయిందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే, గతేడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన సైనీ.. ఆ తర్వాత జట్టులో చోటు కోల్పోయాడు. ఐపీఎల్లో ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్న అతను.. అక్కడ కూడా తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. తాజా ఇంగ్లండ్ పర్యటనలో కూడా సైనీకి మొండి చెయ్యే ఎదురైంది. చదవండి: టీమిండియా ఆ 42 రోజులు ఏం చేస్తుంది..? -
అజింక్య భాయ్ అడిగాడు.. నేను వెంటనే సరేనన్నా!
న్యూఢిల్లీ: సిడ్నీ టెస్టుతో అరంగేట్రం చేసిన పేస్ బౌలర్ నవదీప్ సైనీ... తన రెండో మ్యాచ్ బ్రిస్బేన్‌కు వచ్చేసరికి గాయపడిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 7.5 ఓవర్లు బౌలింగ్ చేసిన అనంతరం గజ్జల్లో గాయంతో బౌలింగ్ నుంచి తప్పుకున్నాడు. అయితే ప్రధాన పేసర్ ఒకరు లేకపోతే సమస్య రావచ్చని భావించిన కెప్టెన్ రహానే... రెండో ఇన్నింగ్స్‌లో సైనీ బౌలింగ్ చేస్తే బాగుంటుందని భావించాడు. కెప్టెన్ కోరడంతో వెంటనే సిద్ధమయ్యానని సైనీ చెప్పాడు. ‘నేను బాగానే బౌలింగ్ చేస్తున్న దశలో ఒక్కసారిగా గాయపడ్డాను. ఇంత కాలం తర్వాత అవకాశం వస్తే ఇలా జరిగిందేమిటని అనుకున్నాను. రెండో ఇన్నింగ్స్ సమయంలో గాయంతో బౌలింగ్ చేయగలవా అని అజింక్య భాయ్ అడిగాడు. నేను వెంటనే సరేనని చెప్పేశాను. మళ్లీ బౌలింగ్ చేస్తే గాయం తీవ్రత పెరిగే అవకాశం ఉందని తెలిసినా... అప్పటి పరిస్థితులను బట్టి చూస్తే కెప్టెన్ అడిగితే కాదనగలమా. ఇందులో ఇక ఆలోచించడానికేమీ లేదనిపించింది. పైగా జట్టు కోసం ఆడే ఇలాంటి అవకాశం మళ్లీ రాదు. అందుకే నొప్పి బాధిస్తున్నా జట్టు కోసం నేను చేయగలిగింది చేద్దామని నిర్ణయించుకున్నా’ అని సైనీ వెల్లడించాడు. -
నటరాజన్‌కు నిరాశ.. అతడి అరంగేట్రం
సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగనున్న మూడో టెస్టుకు టీమిండియా తుదిజట్టును ప్రకటించింది. స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్ ద్వారా తిరిగి జట్టుతో చేరగా.. బౌలర్ నవదీప్ సైనీ టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నాడు. రోహిత్ రాకతో మయాంక్ అగర్వాల్‌పై వేటు పడగా.. నవదీప్ ఎంట్రీతో నటరాజన్‌కు మొండిచేయి ఎదురైంది. కాగా ఆసీస్- టీమిండియా మధ్య గురువారం మూడో టెస్టు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానే సారథ్యంలోని టీమిండియా ఆసీస్‌ను ఢీకొట్టేందుకు అన్నివిధాలుగా సన్నద్ధమవుతోంది. ఇక తొలి టెస్టు తర్వాత రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి స్వదేశానికి తిరిగి రాగా.. మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, కేఎల్ రాహుల్ గాయాల బారిన పడి జట్టుకు దూరమైన విషయం తెలిసిందే.(చదవండి: సిడ్నీలో రేపటి నుంచి మూడో టెస్టు) తుదిజట్టు: అజింక్య రహానే(కెప్టెన్), రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, హనుమ విహారి, రిషభ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, నవదీప్ సైనీ (చదవండి: నాలుగో టెస్టు: ముంబైలో అయినా ఓకే: ఆసీస్ కెప్టెన్)