Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతున్న లియామ్ లివింగ్ స్టోన్ స్థిరత్వం లేకుండా ఆడుతున్నాడు. ఒక మ్యాచ్‌లో భారీ స్కోరు చేస్తే మరుసటి మ్యాచ్‌లో తక్కువ స్కోరుకే వెనుదిరగడం అలవాటుగా చేసుకున్నాడు. తాజాగా శుక్రవారం రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో లివింగ్‌స్టోన్ 9 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌లాడిన లివింగ్‌స్టోన్ 270 పరుగులు చేశాడు. రెండు అర్థశతకాలు ఉన్నాయి.
ఇక రాజస్తాన్‌తో మ్యాచ్‌లో లివింగ్‌స్టోన్ ఆడిన దానికంటే ఔటైన తీరు ఆశ్చర్యపరిచింది. నవదీప్ సైనీ వేసిన ఇన్నింగ్స్ ఏడో ఓవర్‌లో మూడో బంతి ఫుల్‌లెంగ్త్ డెలివరీ వేశాడు. అయితే లివింగ్‌స్టోన్ కనీసం బంతి ఎలా వస్తుందో కూడా చూడకుండా గుడ్డిగా బ్యాట్‌ను ఉపాడు. ఇంకేముంది సైనీ వేసిన బంతి నేరుగా వికెట్లను గిరాటేసింది. అయితే క్లీన్‌బౌల్డ్ అయ్యానన్న బాధ లివింగ్‌స్టోన్ మొహంలో కనిపించలేదు కదా వెకిలినవ్వుతో పెవిలియన్ చేరడం అందరిని ఆశ్చర్యపరిచింది.
Navdeep Saini doesn't miss 🎯#PBKSvRR #IPLonJioCinema #TATAIPL #IPL2023 pic.twitter.com/QosEBqIkrB
— JioCinema (@JioCinema) May 19, 2023
Liam Livingstone cleaned up by Navdeep Saini! 😱#PBKSvsRR #IPL2023 #Cricket pic.twitter.com/jkNg3u1zGg
— OneCricket (@OneCricketApp) May 19, 2023
చదవండి: కోహ్లి '18' వెంటపడడం లేదు.. అతని వెనకే '18' వస్తోంది
Comments
Please login to add a commentAdd a comment