PBKS vs LSG: Liam Livingstone takes stunning catch which eventually goes for six - Sakshi
Sakshi News home page

IPL 2023: అంత మంచి క్యాచ్‌ పట్టి అలా చేశావు ఏంటి? వీడియో వైరల్‌

Published Sat, Apr 29 2023 12:41 PM | Last Updated on Sat, Apr 29 2023 12:53 PM

Liam Livingstone takes stunning catch which eventually goes for six  - Sakshi

PC: IPL.com

మొహాలీ వేదికగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 56 పరుగుల తేడాతో పంజాబ్‌ కింగ్స్‌ ఓటమి చవిచూసింది. తొలుత చేసిన లక్నో 257 పరుగుల రికార్డు స్కోర్‌ సాధించింది. లక్నో బ్యాటర్లలో మార్కస్‌ స్టోయినిష్‌(72), కైల్‌ మైర్స్‌(54), పూరన్‌(45) విధ్వంసం సృష్టిం‍చారు. అనంతరం 258 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ కింగ్స్‌ 19.5 ఓవర్లలో 201 పరుగులకే ఆలౌటైంది. అయితే ఈ మ్యాచ్‌లో లివింగ్‌స్టోన్‌ చేసిన తప్పిదం పంజాబ్‌ కింగ్స్‌ కొంపముంచింది. 

ఏం జరిగిందంటే?
లక్నో ఇన్నింగ్స్‌ 13 ఓవర్‌ వేసిన రాహుల్‌ చాహర్‌ బౌలింగ్‌లో రెండో బంతికి స్టోయినిష్‌ భారీ షాట్‌ ఆడాడు. ఈ క్రమంలో లాంగ్‌ ఆఫ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న లివింగ్‌స్టోన్‌ చేతిలోకి బంతి వెళ్లింది. అయితే లివింగ్‌స్టోన్‌ క్యాచ్‌ అందుకున్నప్పటికీ.. బౌండరీ రోప్‌ను మాత్రం టచ్‌ చేశాడు. దీంతో అంపైర్‌ సిక్స్‌గా ప్రకటించాడు. 

ఇక 40 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న స్టోయినిష్‌ అనంతరం చెలరేగిపోయాడు. 40 బంతుల్లోనే 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 72 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. ఒక వేళ స్టోయినిష్‌ క్యాచ్‌ను లివింగ్‌ స్టోన్‌ సరిగ్గా అందుకుని ఉండింటే లక్నో అంత భారీ స్కోర్‌ సాధించకపోయేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
చదవండిIPL 2023: లక్నో సూపర్‌ జెయింట్స్‌కు బిగ్‌ షాక్‌.. స్టార్‌ ఆల్‌రౌండర్‌కు తీవ్ర గాయం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement