Liam Livingstone
-
టిమ్ సీఫర్ట్ ప్రపంచ రికార్డు.. పాక్‌పై చితక్కొట్టి అరుదైన ఘనత
న్యూజిలాండ్ ఓపెనర్ టిమ్ సీఫర్ట్ (Tim Seifert) సరికొత్త చరిత్ర సృష్టించాడు. పాకిస్తాన్‌తో ఐదో టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగి ప్రపంచ రికార్డు సాధించాడు. లక్ష్య ఛేదనలో అత్యధిక స్ట్రైక్ రేటుతో.. తొంభై పరుగుల మార్కు చేరుకున్న తొలి క్రికెటర్‌గా నిలిచాడు.ఇంగ్లండ్ పవర్ హిట్టర్ లియామ్ లివింగ్‌స్టోన్ (Liam Livingstone) పేరిట ఉన్న రికార్డును సీఫర్ట్ బద్దలు కొట్టి సీఫర్ట్ ఈ అరుదైన ఘనత సాధించాడు. కాగా ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు పాకిస్తాన్ న్యూజిలాండ్‌లో పర్యటిస్తోంది. ఈ క్రమంలో తొలి, రెండు టీ20లలో కివీస్ గెలవగా.. మూడో మ్యాచ్‌లో పాకిస్తాన్ గెలిచింది. ఆ తర్వాత మళ్లీ పైచేయి సాధించిన న్యూజిలాండ్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది.ఈ క్రమంలో ఇరుజట్ల (New Zealand Vs Pakistan) మధ్య బుధవారం నామమాత్రపు ఐదో టీ20 జరిగింది. వెల్లింగ్టన్ వేదికగా టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. కెప్టెన్ సల్మాన్ ఆఘా (39 బంతుల్లో 51; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ సాధించగా... షాదాబ్ ఖాన్ (28; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. హరీస్ (11), నవాజ్ (0), యూసుఫ్ (7), ఉస్మాన్ ఖాన్ (7), అబ్దుల్ సమద్ (4) విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో నీషమ్ 5 వికెట్లతో విజృంభించగా... జాకబ్ డఫీ 2 వికెట్లు తీశాడు.బాదుడే బాదుడు... స్వల్ప లక్ష్యఛేదనకు దిగిన న్యూజిలాండ్ తొలి ఓవర్ నుంచే పాక్ బౌలర్లపై ప్రతాపం చూపింది. తొలి ఓవర్లో ఓపెనర్ టిమ్ సీఫర్ట్ 4, 6, 6 కొడితే... రెండో ఓవర్లో అలెన్ 4, 4, 6 బాదాడు. మూడో ఓవర్లో సీఫర్ట్ 4, 6... నాలుగో ఓవర్లో ఇద్దరు కలిసి 3 ఫోర్లు కొట్టడంతో స్కోరు బోర్డు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. జహాందాద్ ఖాన్ వేసిన ఆరో ఓవర్లో సీఫెర్ట్ 6, 4, 6, 2, 6, 1 కొట్టడంతో 23 బంతుల్లోనే అతడి హాఫ్‌సెంచరీ పూర్తయింది. పాక్ యువ బౌలర్ ముఖీమ్ రెండు ఓవర్లలో 6 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీసినప్పటికీ... సీఫెర్ట్ జోరును మాత్రం అడ్డుకోలేకపోయాడు. షాదాబ్ వేసిన పదో ఓవర్లో 6, 6, 6, 6 కొట్టిన సీఫర్ట్ మ్యాచ్‌ను ముగించాడు. ఫలితంగా న్యూజిలాండ్ 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసి గెలిచింది. తొలి బంతి నుంచే సీఫర్ట్ వీరవిహారం చేయగా... ఫిన్ అలెన్ (12 బంతుల్లో 27; 5 ఫోర్లు, 1 సిక్స్) ఉన్నంతసేపు ధాటిగా ఆడటం కలిసివచ్చింది. పాక్ బౌలర్లలో ముఖీమ్ 2 వికెట్లు తీశాడు. నీషమ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, సీఫర్ట్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి.టిమ్ సీఫర్ట్ ప్రపంచ రికార్డుఇక ఈ మ్యాచ్‌లో టిమ్ సీఫర్ట్ మొత్తంగా 38 బంతుల్లో 97 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లతో పాటు ఏకంగా పది సిక్సర్లు ఉండగా.. స్ట్రైక్‌రేటు 255.26గా నమోదైంది.ఈ నేపథ్యంలో.. అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగి.. అత్యధిక స్ట్రైక్‌రేటుతో తొంభైకి పైగా పరుగులు సాధించిన తొలి ఆటగాడిగా సీఫర్ట్ చరిత్రకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ స్టార్ లియామ్ లివింగ్‌స్టోన్ పేరిట ఉండేది. లివింగ్‌స్టోన్ 2021లో పాకిస్తాన్‌పై నాటింగ్‌హామ్ వేదికగా 239.53 స్ట్రైక్‌రేటుతో 103 పరుగులు సాధించాడు. ఇక అంతర్జాతీయ టీ20లలో 250కి పైగా స్ట్రైక్‌రేటుతో అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగానూ సీఫర్ట్ చరిత్రపుటల్లో తన పేరును లిఖించుకోవడం మరో విశేషం.చదవండి: ‘అతడిని ఎనిమిదో స్థానంలో ఆడిస్తారా? ప్రపంచంలో ఎక్కడా ఇలా జరగదు’ -
ఈసారి ఆర్సీబీ పదో స్థానంలో నిలుస్తుంది: ఆస్ట్రేలియా దిగ్గజం
ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ ఆడం గిల్‌క్రిస్ట్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. ఆర్సీబీ అంటే తనకేమీ ద్వేషం లేదని.. సూపర్‌స్టార్ విరాట్ కోహ్లి (Virat Kohli)కి తానెప్పుడూ వ్యతిరేకం కాదని పేర్కొన్నాడు. అయితే, ఆర్సీబీలో ఓ దేశానికి చెందిన ఆటగాళ్లు ఎక్కువగా ఉన్నారని.. అందుకే ఈసారి ఆ జట్టు పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలుస్తుందంటూ వ్యంగ్యాత్మక వ్యాఖ్యలు చేశాడు.నాయకుడిగా రజత్ పాటిదార్ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) పద్దెనిమిదవ ఎడిషన్ శనివారం (మార్చి 22)ఆరంభం కానున్న విషయం తెలిసిందే. కోల్‌కతా నైట్ రైడర్స్- ఆర్సీబీ మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్-2025కి తెరలేవనుంది. డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతాతో పాటు ఆర్సీబీకి కూడా ఈసారి కొత్త కెప్టెన్ వచ్చాడు. కేకేఆర్‌కు అజింక్య రహానే సారథ్యం వహించనుండగా... బెంగళూరు జట్టుకు రజత్ పాటిదార్ నాయకుడిగా వ్యవహరించనున్నాడు.ఈసారి చివరి స్థానంలో ఉండేది ఆర్సీబీఈ నేపథ్యంలో ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతున్న ఆసీస్ దిగ్గజం గిల్‌క్రిస్ట్‌కు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఈసారి ఐపీఎల్లో పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో ఉండే జట్టు ఏది? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ఆ జట్టులో అనేక మంది ఇంగ్లండ్ ఆటగాళ్లు ఉన్నారు.కాబట్టి.. వాస్తవాల ఆధారంగానే నేను ఈ మాట చెబుతున్నా. ఈసారి చివరి స్థానంలో ఉండేది ఆర్సీబీ. వాళ్లకే ఈసారి ఆఖర్లో ఉండే అర్హతలు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి’’ అని పేర్కొన్నాడు. అయితే, అదే సమయంలో ఆర్సీబీ, కోహ్లి అభిమానులకు గిల్‌క్రిస్ట్ క్షమాపణలు కూడా చెప్పడం విశేషం.మనస్ఫూర్తిగా క్షమాపణలు‘‘విరాట్ లేదంటే.. ఆర్సీబీ ఫ్యాన్స్‌కు నేను వ్యతిరేకం కాదు. ఇలా మాట్లాడినందుకు వారికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నా. కానీ మీ రిక్రూట్మెంట్ ఏజెంట్లకు మీరైనా చెప్పండి. ఆటగాళ్ల ఎంపిక విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం అత్యంత ముఖ్యం’’ అని గిల్‌క్రిస్ట్ చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్ ప్లేయర్ల ప్రదర్శన అంతగొప్పగా ఉండదని.. ఈసారి వారి వల్ల ఆర్సీబీకి పెద్దగా ఒరిగేదేమీ ఉండదని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు.కాగా మెగా వేలం-2025 సందర్భంగా ఆర్సీబీ.. ఇంగ్లండ్ స్టార్లు లియామ్ లివింగ్‌స్టోన్, జేకబ్ బెతెల్, ఫిల్ సాల్ట్ తదితరులను కొనుగోలు చేసింది. సాల్ట్ ఈసారి కోహ్లితో కలిసి ఆర్సీబీ ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం ఉంది.కాగా ఐపీఎల్ చరిత్రలో బెంగళూరు జట్టుకు రెండుసార్లు ట్రోఫీని దూరం చేసిన జట్టు హైదరాబాద్. 2009లో ఆడం గిల్‌క్రిస్ట్ కెప్టెన్సీలో నాటి దక్కన్ చార్జర్స్.. 2016లో డేవిడ్ వార్నర్ సారథ్యంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఫైనల్లో ఓడించి టైటిల్ సొంతం చేసుకున్నాయి. ఇక ఆర్సీబీ ఇంత వరకు ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవలేదన్న విషయం తెలిసిందే. గతేడాది ప్లే ఆఫ్స్ చేరిన ఈ జట్టు.. ఈసారి టైటిల్ రేసులో నిలవాలని పట్టుదలగా ఉంది.ఐపీఎల్-2025లో ఆర్సీబీ జట్టురజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, యశ్ దయాల్, జోష్ హేజిల్‌వుడ్, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, లియామ్ లివింగ్‌స్టోన్, రసిఖ్ దార్, సుయాష్ శర్మ, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, నువాన్ తుషార, మనోజ్ భాండగే, జేకబ్ బెతెల్, దేవ్‌దత్ పడిక్కల్, స్వస్తిక్చికార, లుంగి ఎంగిడి, అభినందన్ సింగ్, మోహిత్ రాఠీ.చదవండి: 44 బంతుల్లో శతక్కొట్టిన పాక్ ఓపెనర్.. 9 వికెట్ల తేడాతో చిత్తైన న్యూజిలాండ్ -
తొలి వన్డేకు ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన.. వెటరన్ ప్లేయర్ రీఎంట్రీ
టీమిండియాతో తొలి వన్డేకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) తమ తుది జట్టును బుధవారం ప్రకటించింది. జోస్ బట్లర్(Jos Buttler) కెప్టెన్సీలోని ఈ టీమ్‌లో మాజీ సారథి జో రూట్(Joe Root)కు స్థానం కల్పించింది. దీంతో.. వన్డే ప్రపంచకప్-2023 తర్వాత అతడు తొలిసారిగా వన్డే ఫార్మాట్ బరిలో దిగనున్నాడు.కాగా ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్(India vs England)లు ఆడేందుకు ఇంగ్లండ్ భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే టీ20 సిరీస్ ముగియగా.. బట్లర్ బృందం సూర్యకుమార్ సేన చేతిలో 4-1తో చిత్తుగా ఓడి.. సిరీస్‌ను కోల్పోయింది. కేవలం రాజ్‌కోట్ టీ20లో మాత్రమే గెలిచి వైట్‌వాష్ నుంచి తప్పించుకుంది.ఓపెనర్లుగా వారేఈ క్రమంలో ఇరుజట్ల మధ్య నాగ్‌పూర్ వేదికగా గురువారం(ఫిబ్రవరి) వన్డే సిరీస్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ తాజాగా తమ తుదిజట్టును వెల్లడించింది. తొలి వన్డేలో ఓపెనర్లుగా బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ తమ స్థానాలను పదిలం చేసుకోగా.. జో రూట్ వన్‌డౌన్‌లో ఆడనున్నాడు. దాదాపు పదిహేను నెలల విరామం తర్వాత రూట్ తిరిగి రాగా.. కెప్టెన్ బట్లర్ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు రానున్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో లియామ్ లివింగ్‌స్టోన్- జాకొబ్ బెతెల్ జోడీ కొనసాగనుంది.ముగ్గురు సీమర్లతోమరోవైపు.. తొలి వన్డేలో ఇంగ్లండ్ ముగ్గురు సీమర్లతో బరిలోకి దిగనుంది. జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్సేలతో పాటు సకీమ్ మహమూద్ కూడా ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ తమ వెటరన్ స్పిన్నర్ ఆదిల్ రషీద్‌ను ఆడించనుంది.మ్యాచ్ ఆరంభ సమయం ఇదేఇక భారత్- ఇంగ్లండ్ మధ్య కటక్ వేదికగా రెండో వన్డే ఆదివారం(ఫిబ్రవరి 9) జరుగనుండగా.. అహ్మదాబాద్‌లో ఆఖరి వన్డే(ఫిబ్రవరి 12) నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. భారత కాలమానం ప్రకారం భారత్- ఇంగ్లండ్ మధ్య మధ్యాహ్నం ఒంటిగంట ముప్పై నిమిషాలకు వన్డే మ్యాచ్‌లు ఆరంభం కానున్నాయి. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇరుజట్లకు ఈ సిరీస్ ద్వారా కావాల్సినంత ప్రాక్టీస్ లభించనుంది. వరుస చేదు అనుభవాల తర్వాతఇదిలా ఉంటే.. బట్లర్ సారథ్యంలోని ఇంగ్లండ్ జట్టు గత రెండు వన్డే సిరీస్‌లను కోల్పోయింది. ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్ల చేతిలో ఓటమిపాలైంది. ఇక వన్డే వరల్డ్‌కప్-2023లోనూ ఇంగ్లండ్ దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి పరిమితమై అప్రదిష్టను మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో తాజా సిరీస్‌లో రోహిత్ సేనకు ఏమేర పోటీ ఇవ్వనుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ ఇంగ్లండ్ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన బ్రెండన్ మెకల్లమ్‌కు తొలుత టీ20 సిరీస్‌లో చేదు అనుభవం ఎదురైంది. అయినప్పటికీ వన్డే సిరీస్‌లోనూ అదే దూకుడును కొనసాగించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు మేనేజ్మెంట్ చెప్పడం విశేషం. టీమిండియాతో తొలి వన్డేకు ఇంగ్లండ్ తుదిజట్టుబెన్ డకెట్, ఫిల్ సాల్ట్(వికెట్ కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్), లియామ్ లివింగ్ స్టోన్, జాకొబ్ బెతెల్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సకీబ్ మహమూద్. చదవండి: ఐసీసీ టోర్నీ తర్వాత రోహిత్ గుడ్‌బై? కోహ్లికి మాత్రం బీసీసీఐ గ్రీన్‌సిగ్నల్! -
భారత్-ఇంగ్లండ్ టీ20 సిరీస్ తర్వాత ఆర్సీబీ వెన్నులో వణుకు..!
భారత్-ఇంగ్లండ్ టీ20 సిరీస్ తర్వాత ఆర్సీబీ (RCB) వెన్నులో వణుకు మొదలైంది. ఈ సిరీస్‌లో ఆర్సీబీకి చెందిన ఇంగ్లండ్ ఆటగాళ్లు (England Players) దారుణంగా విఫలం కావడమే ఇందుకు కారణం. ఇంగ్లండ్‌కు చెందిన ఫిల్ సాల్ట్ (Phil Salt), లియామ్ లివింగ్‌స్టోన్ (Liam Livingstone), జేకబ్ బేతెల్‌ను (Jacob Bethell) ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆర్సీబీ భారీ ధర వెచ్చించి సొంతం చేసుకుంది. ఈ ముగ్గురు తాజాగా ముగిసిన సిరీస్‌లో అంచనాలకు తగ్గట్టుగా రాణించలేక చతికిలపడ్డారు.రూ. 11.50 కోట్లు కుమ్మరించి కొనుక్కున్న ఫిల్ సాల్ట్ చివరి టీ20 మినహా సిరీస్ మొత్తంలో విఫలమయ్యాడు. రూ. 8.75 కోట్ల ధర పలికిన లియామ్ లివింగ్‌స్టోన్ ఒక్క మూడో టీ20లో మాత్రమే కాస్త పర్వాలేదనిపించాడు. రూ. 2.6 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన జేకబ్ బేతెల్ సిరీస్ మొత్తంలో ఒక్క మ్యాచ్‌లో కూడా రాణించలేక తస్సుమనిపించాడు.భారీ అంచనాలతో కొనుగోలు చేసిన తమ ఆటగాళ్లు ఘోరంగా విఫలం కావడంతో ఆర్సీబీ యాజమాన్యానికి గుబులు పుట్టుకుంది. ఇంగ్లండ్ ఆటగాళ్లకు అధిక ప్రాధాన్యత ఇచ్చి (మెగా వేలంలో) తప్పు చేశామా అని ఆత్మపరిశీలన చేసుకుంటుంది. మరోవైపు ఇంగ్లండ్ విధ్వంసకర వీరుల త్రయం తమ ఫేట్‌ను మారుస్తుందని ఆర్సీబీ అభిమానులు సైతం భారీ అంచనాలు పెట్టుకున్నారు.ఇంగ్లండ్ ఆటగాళ్ల చెత్త ప్రదర్శనల తర్వాత వారి అంచనాలు కూడా తల్లకిందులయ్యాయి. 'ఈ సాలా కప్ నమ్మదే' అంటూ ప్రతి యేడు డప్పు కొట్టుకునే ఆర్సీబీ అభిమానులకు 2025 సీజన్ ప్రారంభానికి ముందే తమ భవిష్యత్తు అర్దమైపోయింది. ఐపీఎల్ ప్రారంభానికి మరో నెలన్నర రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ మధ్యలో ఆర్సీబీకి చెందిన ఇంగ్లండ్ బ్యాటింగ్ త్రయం టీ20లు ఆడేది లేదు. మరి ఐపీఎల్ బరిలోకి నేరుగా దిగి వీరేమి చేస్తారో వేచి చూడాలి.కాగా, భారత్‌తో ముగిసిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఇంగ్లండ్ 1-4 తేడాతో కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ మొత్తంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో దారుణంగా విఫలమయ్యారు. ఈ సిరీస్‌లోని మూడో టీ20లో మాత్రమే ఇంగ్లండ్ విజయం సాధించగలిగింది. ఆ మ్యాచ్‌లోనూ భారత ఆటగాళ్ల స్వయంకృతాపరాధాల వల్లే ఇంగ్లండ్ గెలవగలిగింది.ఈ సిరీస్‌లో భారత ప్రదర్శన విషయానికొస్తే.. భారత ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అద్భుతంగా రాణించారు. బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ వీరలెవెల్లో విజృంభించగా.. బౌలింగ్‌లో వరుణ్ చక్రవరి అంచనాలకు మించి రాణించాడు. ఈ సిరీస్‌లో లీడింగ్ రన్ స్కోరర్.. లీడింగ్ వికెట్ టేకర్లు వీరిద్దరే. చివరి టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగి విధ్వంసకర శతకం బాదిన అభిషేక్.. ఈ సిరీస్‌లో 5 మ్యాచ్‌ల్లో సెంచరీ, హాఫ్ సెంచరీ సాయంతో 219.69 స్ట్రయిక్‌రేట్‌తో 276 పరుగులు చేశాడు. వరుణ్ ఈ సిరీస్‌లో 5 మ్యాచ్‌లు ఆడి 14 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ ఐదు వికెట్ల ప్రదర్శన కూడా ఉంది. -
పాండ్యా, దూబే మెరుపులు.. 3–1తో సిరీస్ టీమిండియా వశం (ఫొటోలు)
-
ఆర్సీబీ బ్యాటర్ ఊచకోత
అబుదాబీ టీ10 లీగ్‌లో ఆర్సీబీ ఆటగాడు లియామ్ లివింగ్‌స్టోన్ రెచ్చిపోయాడు. ఈ టోర్నీలో బంగ్లా టైగర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న లివింగ్‌స్టోన్.. ఢిల్లీ బుల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 15 బంతుల్లో అజేయమైన హాఫ్ సెంచరీ చేశాడు. ఇందులో 3 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. లివింగ్‌స్టోన్ ఊచకోత కారణంగా బంగ్లా టైగర్స్.. ఢిల్లీ బుల్స్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.మ్యాచ్ వివరాల్లోకి వెళితే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ బుల్స్ నిర్ణీత 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. నిఖిల్ చౌదరీ 16 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేసి ఢిల్లీ గౌరవప్రదమైన స్కోర్ చేయడానికి దోహదపడ్డాడు. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో ఆడమ్ లిత్ (1), టామ్ బాంటన్ (8), టిమ్ డేవిడ్ (1), ఫేబియన్ అలెన్ (6) విఫలం కాగా.. జేమ్స్ విన్స్ (27), రోవ్‌మన్ పావెల్ (17), షాదాబ్ ఖాన్ (10 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. బంగ్లా టైగర్స్ బౌలర్లలో డేవిడ్ పేన్, జాషువ లిటిల్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. రషీద్ ఖాన్, ఇమ్రాన్ ఖాన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లా టైగర్స్.. లివింగ్‌స్టోన్ విధ్వంసం సృష్టించడంతో 9.4 ఓవర్లలోనే (3 వికెట్లు కోల్పోయి) విజయతీరాలకు చేరింది. లివింగ్‌స్టోన్‌తో పాటు దసున్ షనక (14 బంతుల్లో 33; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), హజ్రతుల్లా జజాయ్ (20 బంతుల్లో 24; ఫోర్, సిక్స్) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో షాహిద్ ఇక్బాల్, షాదాబ్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. అబుదాబీ టీ10 లీగ్ ప్రస్తుత ఎడిషన్‌లో బంగ్లా టైగర్స్‌కు ఇది తొలి విజయం. ప్రస్తుతం ఈ జట్టు పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. కాగా, నిన్న (నవంబర్ 25) ముగిసిన ఐపీఎల్ వేలంలో లివింగ్‌స్టోన్‌ను ఆర్సీబీ 8.75 కోట్లకు సొంతం చేసుకుంది. -
సామ్ కుర్రాన్ విధ్వంసం.. విండీస్‌పై ఇంగ్లండ్ ఘన విజయం
సెయింట్ లూసియా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో 3 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 3-0 తేడాతో ఇంగ్లండ్ సొంతం చేసుకుంది. 2019 తర్వాత కరేబియన్ గడ్డపై టీ20 సిరీస్‌ను ఇంగ్లండ్ సొంతం చేసుకోవడం ఇదే తొలిసారి.ఇక వర్షం కారణంగా 50 నిమిషాల ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తొలుత విండీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ క్రమంలో మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది.విండీస్ బ్యాటర్లలో కెప్టెన్ రావ్మన్ పావెల్(54) టాప్ స్కోరర్‌గా నిలవగా..షెఫర్డ్(30) రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో సాకిబ్ మహమూద్, జెమ్మీ ఓవర్టన్ తలా మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 146 పరుగుల లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి చేధించింది.ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కుర్రాన్(26 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 41) అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. లివింగ్ స్టోన్(39), విల్ జాక్స్(32) పరుగులతో సత్తాచాటారు. విండీస్ స్పిన్నర్ 4 వికెట్లతో చెలరేగినప్పటకి తన జట్టుకు విజయాన్ని మాత్రం అందించలేకపోయాడు. ఇక నాలుగో టీ20 ఇరు జట్ల మధ్య నవంబర్ 16న సెయింట్ లూసియా వేదికగా జరగనుంది.చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. 18 ఏళ్ల కెరీర్‌కు గుడ్ బై! -
లివింగ్‌స్టోన్ విధ్వంసకర సెంచరీ.. విండీస్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్
ఆంటిగ్వా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో ఇంగ్లండ్ సమం చేసింది. 329 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్ 47.3 ఓవర్లలో కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది.లక్ష్య చేధనలో ఇంగ్లండ్ స్టాండింగ్ కెప్టెన్ లైమ్ లివింగ్ స్టోన్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. లివింగ్ స్టోన్ 85 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్స్‌లతో 124 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో లివింగ్ స్టోన్‌తో పాటు సాల్ట్(59), బెతల్(55), సామ్ కుర్రాన్(52) హాఫ్ సెంచరీలతో మెరిశారు. విండీస్ బౌలర్లలో మాథ్యూ ఫోర్డ్ 3 వికెట్లు పడగొట్టగా, జోషఫ్, ఛేజ్ తలా వికెట్ సాధించారు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 328 పరుగుల భారీ స్కోర్ సాధించింది. విండీస్ కెప్టెన్ హోప్(117) విధ్వంసకర సెంచరీతో మెరిశాడు. అతడితో పాటు కార్టీ(71), రుథర్ఫర్డ్(54) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో టర్నర్, రషీద్ తలా రెండు వికెట్లు పడగొట్టగా, అర్చర్, లివింగ్ స్టోన్ చెరో వికెట్ సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే నవంబర్ 6న బార్బోడస్ వేదికగా జరగనుంది. -
ఇంగ్లండ్ కెప్టెన్‌గా లియామ్ లివింగ్‌స్టోన్
వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా ఆ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. బట్లర్ గైర్హాజరీలో ఇంగ్లండ్ వన్డే జట్టు కెప్టెన్‌గా లియామ్ లివింగ్‌స్టోన్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ సిరీస్ కోసం బట్లర్ ప్రత్యామ్నాయ ఆటగాడిని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఎంపిక చేయలేదు.కాగా, ఈ ఏడాది జూన్‌లో జరిగిన టీ20 వరల్డ్‌కప్ సందర్భంగా బట్లర్ గాయపడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అతను వన్డే, టీ20 జట్లకు దూరంగా ఉన్నాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడని విండీస్‌తో సిరీస్‌కు బట్లర్‌ను తొలుత ఎంపిక చేశారు. అయితే బట్లర్ పూర్తిగా ఫిట్నెస్ సాధించకపోవడంతో ఈసీబీ అతన్ని జట్టు నుంచి తప్పించింది. బట్లర్ విండీస్‌తో తదుపరి జరుగబోయే టీ20 సిరీస్ సమయానికంతా పూర్తిగా కోలుకుంటాడని ఈసీబీ ఆశాభావం వ్యక్తం చేసింది.వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ అక్టోబర్ 31, నవంబర్ 2, నవంబర్ 8 తేదీల్లో జరుగనుంది. అనంతరం నవంబర్ 9, 10, 14, 16, 17 తేదీల్లో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనుంది. ఈ రెండు పరిమిత ఓవర్ల సిరీస్‌లు విండీస్ వేదికగా జరుగనున్నాయి. ఇంగ్లండ్ టెస్ట్ జట్టు ప్రస్తుతం పాక్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో పాల్గొంటున్న విషయం తెలిసిందే.విండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌ల కోసం ఇంగ్లండ్ జట్టు..లియామ్ లివింగ్‌స్టోన్ (వన్డే జట్టు కెప్టెన్), విల్ జాక్స్, డాన్ మౌస్లీ, జేకబ్ బేతెల్, జేమీ ఓవర్టన్, సామ్ కర్రన్, ఫిలిప్ సాల్ట్, జాఫర్ చోహాన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్, రీస్ టాప్లే, జాన్ టర్నర్చదవండి: టీమిండియాకు గుడ్ న్యూస్ -
స్టార్క్‌కు పీడకల.. ఆసీస్ తొలి బౌలర్‌గా చెత్త రికార్డు
ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఈ వరల్డ్‌క్లాస్ పేసర్ బౌలింగ్‌లో ఇంగ్లండ్ హార్డ్ హిట్టర్ లియామ్ లివింగ్‌స్టోన్ చితక్కొట్టాడు. ఒకే ఓవర్లో 6,0,6,6,6, 4 పరుగులు పిండుకుని పీడకలను మిగిల్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇంగ్లండ్ టీ20 తరహా బ్యాటింగ్పరిమిత ఓవర్ల సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన ఆస్ట్రేలియా శుక్రవారం.. ఆతిథ్య జట్టుతో నాలుగో వన్డేలో తలపడింది. లండన్‌లోని లార్డ్స్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌ను వర్షం కారణంగా 39 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచి తొలుత ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది.27 బంతుల్లోనేఈ క్రమంలో బ్యాటింగ్ దిగిన ఇంగ్లండ్ 39 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి ఏకంగా 312 పరుగులు చేసింది. ఓపెనర్ బెన్ డకెట్ 63, కెప్టెన్ హ్యారీ బ్రూక్ 87 పరుగులు చేయగా.. లియామ్ లివింగ్‌స్టోన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 27 బంతుల్లోనే మూడు బౌండరీలు, ఏడు సిక్సర్లు బాది 62 పరుగులతో ఆఖరి వరకు నాటౌట్‌గా నిలిచాడు.స్టార్క్‌కు పీడకలఇక లివింగ్‌స్టోన్ ఖాతాలోని ఏడు సిక్స్‌లలో నాలుగు స్టార్క్ బౌలింగ్‌లో బాదినవే. అది కూడా ఆఖరి ఓవర్లో కావడం విశేషం. 39వ ఓవర్లో స్టార్క్ వేసిన తొలి బంతినే సిక్సర్‌గా మలిచిన లివింగ్‌స్టోన్.. రెండో బంతికి పరుగులు రాబట్టలేకపోయాడు. అయితే, మూడో బంతి నుంచి స్పీడు పెంచాడు. హ్యాట్రిక్ సిక్స్‌లు బాది ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను ముగించాడు.186 పరుగుల తేడాతో విజయంఇదిలా ఉంటే.. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 24.4 ఓవర్లలో 126 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ బౌలర్లు మాథ్యూ పాట్స్ నాలుగు, బ్రైడన్ కార్సే మూడు, జోఫ్రా ఆర్చర్ రెండు, ఆదిల్ రషీద్ ఒక వికెట్ పడగొట్టి కాంగరూ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించారు. ఇక ఈ విజయంతో ఇంగ్లండ్ ఐదు వన్డేల సిరీస్‌ను 2-2తో సమం చేసింది. తదుపరి బ్రిస్టల్ వేదికగా ఇరుజట్ల మధ్య నిర్ణయాత్మక ఆఖరి వన్డే జరుగనుంది.స్టార్క్ చెత్త రికార్డులివింగ్స్టోన్ విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా స్టార్క్ ఖాతాలో చెత్త రికార్డు నమోదైంది. ఆస్ట్రేలియా ప్లేయర్లలో వన్డే మ్యాచ్‌లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు(28) సమర్పించుకున్న బౌలర్‌గా స్టార్క్ నిలిచాడు. అంతకు ముందు ఈ రికార్డు జేవియర్ డోహర్టి పేరిట ఉండేది. బెంగళూరులో 2013లో టీమిండియాతో మ్యాచ్‌లో అతడు 26 పరుగులు ఇచ్చుకున్నాడు.చదవండి: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్6️⃣▪️6️⃣6️⃣6️⃣4️⃣Incredible final over hitting from Liam Livingstone 💪💥🏴 #ENGvAUS 🇦🇺 | @liaml4893 pic.twitter.com/qfEDxOM88N— England Cricket (@englandcricket) September 27, 2024 -
Eng Vs Aus ODI: లివింగ్‌స్టోన్ విధ్వంసం.. 27 బంతుల్లోనే
ఆస్ట్రేలియాతో నాలుగో వన్డేలో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ప్రత్యర్థిని ఏకంగా 186 పరుగుల తేడాతో మట్టికరిపించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో సమం చేసింది. కాగా మూడు టీ20లు, ఐదు వన్డేలు ఆడేందుకు ఆస్ట్రేలియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది.ఈ క్రమంలో పొట్టి సిరీస్‌లో ఇరు జట్లు చెరో విజయం సాధించగా.. మూడో మ్యాచ్ వర్షం వల్ల రద్దైంది. దీంతో 1-1తో టీ20 సిరీస్ డ్రాగా ముగిసిపోయింది. ఇక వన్డేల విషయానికొస్తే.. తొలి రెండు మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా విజయం సాధించగా.. మూడో వన్డే నుంచి ఇంగ్లండ్ గెలుపుబాట పట్టింది.39 ఓవర్లకు మ్యాచ్ కుదింపుచెస్టెర్ లీ స్ట్రీట్ వేదికగా డీఎల్ఎస్ పద్ధతిలో ఆసీస్‌ను 46 పరుగుల తేడాతో ఓడించింది. అదే విధంగా.. లార్డ్స్ వేదికగా శుక్రవారం రాత్రి ముగిసిన మ్యాచ్‌లోనూ జయభేరి మోగించింది. లండన్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ బౌలింగ్ ఎంచుకుంది.బౌండరీల వర్షం కురిపించిన బ్రూక్అయితే, వర్షం కారణంగా 39 ఓవర్లకే కుదించిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. టాపార్డర్‌లో ఓపెనర్ బెన్ డకెట్ 62 బంతుల్లో 63 పరుగులు చేయగా.. హ్యారీ బ్రూక్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో దుమ్ములేపాడు. Leading from the front 💪Batted, Harry Brook! 👏 🏴 #ENGvAUS 🇦🇺 | @IGcom pic.twitter.com/RGV0rEZeWT— England Cricket (@englandcricket) September 27, 2024నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఫోర్ల వర్షం కురిపించాడు. మొత్తంగా 58 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 87 పరుగుల సాధించాడు. ఆడం జంపా బౌలింగ్‌లో గ్లెన్ మాక్స్‌వెల్‌కు క్యాచ్ ఇవ్వడంతో బ్రూక్ ధనాధన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఆసీస్ బౌలింగ్‌ను ఊచకోత కోసిన లివింగ్స్టోన్ఇక వికెట్ కీపర్ జేమీ స్మిత్ 28 బంతుల్లో 39 రన్స్ చేయగా.. లియామ్ లివింగ్ స్టోన్ ఆసీస్ బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. కేవలం 27 బంతుల్లోనే 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో చెలరేగి ఏకంగా 62 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ నిర్ణీత 39 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు నష్టపోయి 312 పరుగులు స్కోరు చేసింది.6️⃣▪️6️⃣6️⃣6️⃣4️⃣Incredible final over hitting from Liam Livingstone 💪💥🏴 #ENGvAUS 🇦🇺 | @liaml4893 pic.twitter.com/qfEDxOM88N— England Cricket (@englandcricket) September 27, 2024ఆసీస్ 126 పరుగులకే ఆలౌట్ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా కనీస పోరాటపటిమ ప్రదర్శించలేకపోయింది. 24.4 ఓవర్లలో కేవలం 126 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ ట్రవిస్ హెడ్ 34 పరుగులతో కంగారు జట్టు ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మరో ఓపెనర్, కెప్టెన్ మిచెల్ మార్ష్ 28 రన్స్ చేశాడు. స్టీవ్ స్మిత్(5), జోష్ ఇంగ్లిస్(8), మార్నస్ లబుషేన్(4), గ్లెన్ మాక్స్వెల్(2), స్టార్క్(3 నాటౌట్) సింగిల్ డిజిట్లకే పరిమితం కాగా.. ఆడం జంపా, హాజిల్‌వుడ్ డకౌట్ అయ్యారు.మాథ్యూ పాట్స్‌కు నాలుగు వికెట్లుమిగతా వాళ్లలో అలెక్స్ క్యారీ 13, సీన్ అబాట్ 10 పరుగులు రాబట్టారు. ఇంగ్లండ్ బౌలర్లలో మాథ్యూ పాట్స్ అత్యధికంగా నాలుగు వికెట్లు తీయగా.. బ్రైడన్ కార్సే మూడు, జోఫ్రా ఆర్చర్ రెండు, ఆదిల్ రషీద్ ఒక వికెట్ దక్కించుకున్నారు. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అలరించిన హ్యారీ బ్రూక్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య నిర్ణయాత్మక ఐదో వన్డే ఆదివారం జరుగనుంది. ఇందుకు బ్రిస్టల్‌లోని కౌంటీ గ్రౌండ్ వేదిక.చదవండి: జడేజా ప్రపంచ రికార్డు.. 147 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి -
వరల్డ్ నంబర్ వన్‌గా ఇంగ్లండ్ విధ్వంసకర వీరుడు
ఇంగ్లండ్ విధ్వంసకర వీరుడు లియామ్ లివింగ్‌స్టోన్ ప్రపంచ నంబర్ వన్‌గా అవతరించాడు. ఐసీసీ తాజా టీ20 ర్యాంకింగ్స్ ఆల్‌రౌండర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియాతో ఇటీవల జరిగిన టీ20 సిరీస్‌లో సత్తా చాటి.. ఏకంగా ఏడు స్థానాలు ఎగబాకి.. నంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. అంతేకాదు.. తన కెరీర్లోనే అత్యుత్తమంగా 253 రేటింగ్ పాయింట్లతో లివింగ్‌స్టోన్ నంబర్ వన్ ఆల్‌రౌండర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా స్టార్ మార్కస్ స్టొయినిస్(211 రేటింగ్ పాయింట్లు)ను అగ్రస్థానం నుంచి వెనక్కి నెట్టి.. అతడికి అందనంత ఎత్తులో నిలిచాడు. కాగా ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో లివింగ్‌స్టోన్ అదరగొట్టాడు.ఆసీస్‌తో సిరీస్‌లో అదరగొట్టిసౌతాంప్టన్లో జరిగిన తొలి మ్యాచ్‌లో బ్యాటర్‌గా 37 పరుగులు చేయడంతో పాటు.. 22 పరుగులు మాత్రమే ఇచ్చి.. మూడు వికెట్లు తీసిన ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్.. రెండో టీ20లో విశ్వరూపం ప్రదర్శించాడు. కార్డిఫ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో 47 బంతుల్లోనే 87 పరుగులు చేసిన లివింగ్‌స్టోన్.. కేవలం 16 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. నంబర్ వన్ బ్యాటర్ అతడేతద్వారా ఇంగ్లండ్‌ను గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక ఈ సిరీస్‌లో ఆసీస్- ఇంగ్లండ్ చెరో మ్యాచ్ గెలవగా.. మూడో టీ20 వర్షం కారణంగా రద్దైంది. కాగా 2017లో ఇంగ్లండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన 31 ఏళ్ల లివింగ్‌స్టోన్.. ఇప్పటి వరకు ఒక టెస్టు, 25 వన్డేలు, 50 టీ20లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 16, 558, 815 పరుగులు చేయడంతో పాటు.. వన్డేల్లో 17, టీ20లలో 29 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. ఐసీసీ టీ20 బ్యాటర్ల జాబితాలో ఆస్ట్రేలియా స్టార్ ట్రవిస్ హెడ్ తన టాప్ ర్యాంకును మరింత పదిలం చేసుకోగా.. లివింగ్‌స్టోన్ 17 స్థానాలు మెరుగుపరచుకుని 33వ ర్యాంకు సంపాదించాడు. బౌలర్ల టాప్-5 యథాతథంఇక బౌలర్ల విషయానికొస్తే.. ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ నంబర్ వన్‌గా కొనసాగుతుండగా.. వెస్టిండీస్ పేసర్ అకీల్ హొసేన్, అఫ్గనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్, వెస్టిండీస్ బౌలర్ గుడకేశ్ మోటీ, శ్రీలంక వనిందు హసరంగ టాప్-5లో తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. అయితే, ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడం జంపా సౌతాఫ్రికా స్పీడ్‌స్టర్ అన్రిచ్ నోర్జేను వెనక్కినెట్టి ఆరోస్థానానికి చేరుకున్నాడు. కాగా టీ20 ఆల్‌రౌండర్ల జాబితాలో టీమిండియా నుంచి హార్దిక్ పాండ్యా ఒక్కడే టాప్-10(ఏడో స్థానం)లో ఉన్నాడు.ఐసీసీ తాజా టీ20 ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్- టాప్ 51. లియామ్ లివింగ్‌స్టోన్(ఇంగ్లండ్)- 252 రేటింగ్ పాయింట్లు2. మార్కస్ స్టొయినిస్(ఆస్ట్రేలియా)- 211 రేటింగ్ పాయింట్లు3. సికందర్ రజా(జింబాబ్వే)- 208 రేటింగ్ పాయింట్లు4. షకీబ్ అల్ హసన్(బంగ్లాదేశ్)- 206 రేటింగ్ పాయింట్లు5. వనిందు హసరంగ(శ్రీలంక)- 206 రేటింగ్ పాయింట్లు.చదవండి: నాకంటే నీకే బాగా తెలుసు కదా: కోహ్లికి షాకిచ్చిన గంభీర్! -
లివింగ్ స్టోన్ ఊచకోత.. ఆసీస్‌పై ఇంగ్లండ్‌పై ఘన విజయం
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్ తిరిగి పుంజుకుంది. కార్డిఫ్ వేదికగా జరిగిన రెండో టీ20లో 3 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోర్ చేసింది.ఆసీస్ బ్యాటర్లలో యువ ఆటగాడు ఫ్రెజర్ మెక్‌గర్క్(50) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. జోష్ ఇంగ్లిష్(42), హెడ్(31), మాథ్యూ షార్ట్(28) పరుగులతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్, లివింగ్ స్టోన్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. సామ్ కుర్రాన్, రషీద్ చెరో వికెట్ సాధించారు.లివింగ్ స్టోన్ ఊచకోత..అనంతరం 194 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి చేధించింది. లక్ష్య చేధనలో ఇంగ్లడ్ ఆల్‌రౌండర్ లైమ్ లివింగ్‌స్టోన్ విధ్వంసం సృష్టించాడు. ఆసీస్ బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 47 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 87 పరుగులు చేశాడు.అతడితో పాటు జాకబ్ బితల్(24 బంతుల్లో 44), కెప్టెన్ సాల్ట్(23 బంతుల్లో 39) అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆసీస్ బౌలర్లలో పార్ట్‌టైమ్ స్పిన్నర్ మాథ్యూ షార్ట్ 5 వికెట్లు పడగొట్టి ఔరా అన్పించాడు. అతడితో పాటు అబాట్ రెండు వికెట్లు సాధించాడు. మిగితా బౌలర్లందరూ విఫలమయ్యారు. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన లైమ్ లివింగ్ స్టోన్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక సిరీస్ ఫలితాన్ని తేల్చే మూడో టీ20 మాంచెస్టర్ వేదికగా సెప్టెంబర్ 15న జరగనుంది.చదవండి: టీమిండియా ఆల్‌టైమ్ వన్డే ఎలెవన్: గంభీర్, దాదాకు దక్కని చోటు -
IPL 2024: గుజరాత్, పంజాబ్ మ్యాచ్.. విధ్వంసకర ఆటగాళ్లు దూరం
అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు ఇవాళ (ఏప్రిల్ 4) తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు ఇరు జట్ల నుంచి ఇద్దరు విధ్వంసకర ఆటగాళ్లు మిస్ అయ్యారు. గాయాల కారణంగా గుజరాత్ హిట్టర్ డేవిడ్ మిల్లర్, పంజాబ్ చిచ్చరపిడుగు లియామ్ లివింగ్‌స్టోన్ ఈ మ్యాచ్ ఆడటం లేదు. మిల్లర్ స్థానంలో కేన్ విలియమ్సన్ ఎంట్రీ ఇవ్వగా.. లివింగ్‌స్టోన్ స్థానంలో సికందర్ రజా తుది జట్లలోకి ఎంట్రీ ఇచ్చారు. తుది జట్లు.. గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా(వికెట్‌కీపర్), శుభ్‌మన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, కేన్ విలియమ్సన్, విజయ్ శంకర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేష్ యాదవ్, దర్శన్ నల్కండే పంజాబ్ కింగ్స్: శిఖర్ ధవన్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, జితేష్ శర్మ (వికెట్‌కీపర్), ప్రభ్‌సిమ్రన్ సింగ్, సామ్ కర్రన్, శశాంక్ సింగ్, సికందర్ రజా, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, అర్ష్‌దీప్ సింగ్ పంజాబ్ కింగ్స్ సబ్స్: తనయ్ త్యాగరాజన్, నాథన్ ఎల్లిస్, అసుతోష్ శర్మ, రాహుల్ చాహర్, విద్వత్ కవేరప్ప గుజరాత్ టైటాన్స్ సబ్స్: బీఆర్ శరత్, మోహిత్ శర్మ, సందీప్ వారియర్, అభినవ్ మనోహర్, మానవ్ సుతార్ -
IPL 2024: హిట్టర్ పవర్ఫుల్ షాట్.. ఎంత పనైపాయే!
లియామ్ లివింగ్‌స్టోన్.. హిట్టింగ్‌కు పెట్టింది పేరు. భారీ సిక్సర్లు బాదడంలో దిట్ట. ఇంగ్లండ్ తరఫున ఈ ఆల్‌రౌండర్ ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో 67 సిక్స్‌లు కొట్టాడు. ఐపీఎల్లో ప్రస్తుతం పంజాబ్ కింగ్స్‌కు ఆడుతున్న లివింగ్‌స్టోన్ తాజాగా మరో భారీ షాట్‌తో విరుచుకుపడ్డాడు. అతడి దెబ్బకు స్పైడర్‌క్యామ్ పగిలిపోయింది. కాగా ఐపీఎల్-2024లో పంజాబ్ కింగ్స్ శనివారం లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడింది. లక్నోలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి లక్నో 199 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్‌కు ఓపెనర్లు కెప్టెన్ శిఖర్ ధావన్(70), జానీ బెయిర్ స్టో(42) శుభారంభం అందించినా ఫలితం లేకుండా పోయింది. వీరిద్దరితో పాటు లివింగ్ స్టోన్(17 బంతుల్లో 28 నాటౌట్) తప్ప మిగతా వాళ్లు ఎవరూ రాణించకపోవడంతో 21 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇదిలా ఉంటే.. లక్నోతో మ్యాచ్‌లో లివింగ్‌స్టోన్ రెండు బౌండరీలు, రెండు సిక్స్‌లు బాదాడు. ఆఖరి ఓవర్లో నవీన్ ఉల్ హక్ బౌలింగ్‌లో తొలి, మూడో బంతికి భారీ షాట్లతో అలరించాడు. అయితే, అతడి ఓవర్లోనే లివింగ్‌స్టోన్ డీప్ వికెట్ మీదుగా బాదిన బంతి స్టాండ్స్‌లో ల్యాండ్ అవుతుందనుకుంటే.. స్పైడర్క్యామ్ను పగులగొట్టింది. ఈ క్రమంలో దానిని అంపైర్ డెడ్ బాల్‌గా ప్రకటించాడు. Oh no, we lost the foota... ⚫#LSGvPBKS #IPLonJioCinema #TATAIPL #JioCinemaSport pic.twitter.com/hVa99qvIVO — JioCinema (@JioCinema) March 30, 2024 ఇక స్పైడర్‌క్యామ్ పగిలిన కారనంగా ఫుటేజ్ కొన్ని క్షణాల పాటు నిలిచిపోయింది. ఇదిలా ఉంటే.. ఊహించని పరిణామంతో కంగుతిన్న బౌండరీ గర్ల్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ హైలైట్‌గా నిలిచింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా లక్ష్య ఛేదనలో ఆఖర్లో లివింగ్‌స్టోన్ మెరుపులు మెరిపించినా పంజాబ్‌ను మాత్రం గెలిపించలేకపోయాడు. కాగా లివింగ్‌స్టోన్ ఐపీఎల్ కెరీర్లో ఇప్పటి వరకు 65 సిక్సర్లు ఉండటం విశేషం. చదవండి: మాటల్లేవ్.. ఇన్నాళ్లూ ఎక్కడ దాక్కున్నావు! స్మిత్‌కు వార్నింగ్ ఇచ్చేశా! First Home Game 👌 First Season Win 👌@LucknowIPL's strong comeback with the ball helps them secure a win by 21 runs 🙌 Scorecard ▶️ https://t.co/HvctlP1bZb #TATAIPL | #LSGvPBKS pic.twitter.com/YKofyh3Kt5 — IndianPremierLeague (@IPL) March 30, 2024 -
CWC 2023: ఇంగ్లండ్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఏదో జరుగుతుంది..!
ప్రస్తుత ప్రపంచకప్‌లో వరుస పరాజయాలు (6 మ్యాచ్‌ల్లో 5 అపజయాలు) ఎదుర్కొంటూ ఘోర నిష్క్రమణ దిశగా పయనిస్తున్న ఇంగ్లండ్ జట్టుపై ఆ దేశ మాజీ కెప్టెన్, ప్రస్తుత కామెంటేటర్ ఇయాన్ మోర్గాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారీ అంచనాలతో బరిలోకి దిగి, ఇంత పేలవ ప్రదర్శన కనబర్చిన జట్టును నేనెప్పుడూ చూడలేదని ప్రస్తుత ఇంగ్లండ్ జట్టుపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. జట్టులో ఏదో అస్థిరత స్పష్టంగా కనిపిస్తుంది.. డ్రెస్సింగ్ రూమ్‌లో ఏదో జరుగుతుందని అనుమానాలు వ్యక్తం చేశాడు. గెలుపు కోసం జట్టు అవలంబిస్తున్న పద్ధతి, మ్యాచ్‌లను వారు కోల్పోయిన తీరు చూస్తుంటే ఏదో అనుమానం కలుగుతుందని బాంబు పేల్చాడు. 2019లో ఇంగ్లండ్‌కు ప్రపంచకప్ అందించి, ఆ దేశ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చిన మోర్గాన్, సొంత జట్టుపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది. మోర్గాన్ చేసిన వ్యాఖ్యల్లో నిజానిజాలు ఎంత ఉన్నాయో తెలీదు కానీ, అతను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రస్తుత ఇంగ్లండ్ జట్టు సభ్యుడు లివింగ్‌స్టోన్ స్పందించాడు. జట్టు సభ్యులందరికీ మోర్గాన్‌పై అమితమైన గౌరవం ఉంది. అతను ఈ తరహా వ్యాఖ్యలు చేసి తన స్థాయిని దిగజార్చుకున్నాడు. గుండెల పై చెయ్యి వేసుకుని చెప్పగలను అతను అన్న విధంగా జట్టులో ఎలాంటి మనస్పర్థలు లేవు. మోర్గాన్ ఊహించిన విధంగా డ్రెస్సింగ్ రూమ్‌లో ఏమీ జరగడం లేదు. జట్టులో అందరం కలిసికట్టుగా ఉన్నాం. ప్రతి మ్యాచ్‌లో వంద శాతం విజయాల కోసం ప్రయత్నిస్తున్నాం. అయితే మాకేదీ కలిసి రావడం లేదంటూ మోర్గాన్ వ్యాఖ్యలకు కౌంటరిచ్చాడు. ఇదిలా ఉంటే, టీమిండియాతో నిన్న జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్వల్ప లక్ష్యాన్ని (230) కూడా చేధించలేక 100 పరుగుల తేడాతో పరాజయంపాలైన విషయం తెలిసిందే. ఇప్పటివరకు జరిగిన 6 మ్యాచ్‌ల్లో కేవలం బంగ్లాదేశ్‌పై మాత్రమే గెలుపొందిన ఆ జట్టు.. న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, సౌతాఫ్రికా, శ్రీలంక, భారత్ చేతుల్లో ఘోర పరాజయాలు ఎదుర్కొని పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది. బట్లర్ సేన తదుపరి జరిగే 3 మ్యాచ్‌ల్లో (ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, పాకిస్తాన్) రెండు మ్యాచ్‌ల్లో ఒడినా టోర్నీ నుంచి నిష్క్రమించడంతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా అర్హత కోల్పోతుంది. కాగా, ప్రపంచకప్‌లో లీగ్ దశ తర్వాత టాప్-7లో నిలిచే జట్లు 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధిస్తాయన్న విషయం తెలిసిందే. -
అంతర్జాతీయ స్టేడియాల్లో ఆడుతున్నారా లేక పంట పొలాల్లో ఆడుతున్నారా..?
భారత్-ఇంగ్లండ్‌ల మధ్య లక్నో వేదికగా ఇవాళ (అక్టోబర్ 29) జరుగుతున్న మ్యాచ్‌పై సోషల్‌మీడియాలో ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. నెటిజన్లు మ్యాచ్ జరుగుతున్న వైనాన్ని పక్కన పెట్టి బీసీసీఐపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మ్యాచ్‌కు వేదిక అయిన అటల్ బిహారీ స్టేడియం నిర్వహణ తీరు పంట పొలాల కంటే అధ్వానంగా ఉందంటూ దుయ్యబడుతున్నారు. భారత ఇన్నింగ్స్ సందర్భంగా రోహిత్ శర్మ క్యాచ్ పడుతూ లివింగ్‌స్టోన్ గాయపడిన తీరును ట్రెండ్ చేస్తూ బీసీసీఐని ఎండగడుతున్నారు. ఏం జరిగిందంటే.. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కఠినమైన పిచ్‌పై అత్యంత కీలకమైన ఇన్నింగ్స్ ఆడి ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో లివింగ్‌స్టోన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రోహిత్ క్యాచ్ అందుకునే క్రమంలో లివింగ్‌స్టోన్ కిందపడి గాయపడ్డాడు. లివింగ్‌స్టోన్ ఆ రీతిలో గాయపడటానికి మైదానంలోని పచ్చిక కారణం కావడమే బీసీసీఐపై నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. లివింగ్‌స్టోన్ కిందపడ్డ సమయంలో మైదానంలోని ఆ ప్రాంత పరిస్థితి పంట పొలాలను తలపించడంతో మన క్రికెటర్లు అంతర్జాతీయ స్టేడియాల్లో ఆడుతున్నారా లేక పంట పొలాల్లో ఆడుతున్నారా..? అంటూ వ్యంగ్యమైన కామెంట్స్ చేస్తున్నారు. గతంలో ధర్మశాల వేదికగా జరిగిన బంగ్లాదేశ్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ సందర్భంగా కూడా ఇలాంటి పరిస్థితులే కనిపించాయని గుర్తు చేస్తున్నారు. ఆ మ్యాచ్ సందర్భంగా ఆఫ్ఘన్ ఆటగాడు ముజీబ్ బౌండరీ ఆపే ప్రయత్నంలో మైదానంలోని పచ్చిక కారణంగా తీవ్రంగా గాయపడ్డాడు. అప్పట్లో ఆ గ్రౌండ్ నిర్వహణపై పలువురు అంతర్జాతీయ మాజీ క్రికెటర్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ధర్మశాల స్టేడియం అంతర్జాతీయ మ్యాచ్‌ల నిర్వహణకు పనికిరాదని బహిరంగ ప్రకటనలు చేశారు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. రోహిత్ శర్మ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ (101 బంతుల్లో 87; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆడి జట్టు గౌరవప్రదమైన స్కోర్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. రోహిత్‌తో పాటు కేఎల్ రాహుల్ (58 బంతుల్లో 39; 3 ఫోర్లు), సూర్యకుమార్ యాదవ్ (47 బంతుల్లో 49; 4 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ స్వల్ప లక్ష్య ఛేదనలో తడబడుతూ ఓటమి దిశగా పయనిస్తుంది. ఆ జట్టు 14 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 45 పరుగులు మాత్రమే చేయగలిగింది. బెయిర్‌స్టో (14), మలాన్ (16), రూట్ (0), స్టోక్స్ (0) ఔట్ కాగా.. బట్లర్ (5), మొయిన్ అలీ (4) క్రీజ్‌లో ఉన్నారు. బుమ్రా, షమీ తలో 2 వికెట్లు పడగొట్టారు. -
లివింగ్ స్టోన్ అద్భుత ఇన్నింగ్స్.. న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ ఘన విజయం
సౌతాంప్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో 79 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 34 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. 9 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను లైమ్ లివింగ్ స్టోన్(95 నాటౌట్), సామ్ కుర్రాన్(42) పరుగులతో అదుకున్నారు. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ మూడు వికెట్లతో పడగొట్టగా.. సౌథీ రెండు, హెన్రీ, శాంట్నర్ తలా వికెట్ సాధించారు. అనంతరం 227 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 147 పరుగులకే కుప్పకూలింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో డార్లీ మిచెల్(57) మినహా మిగితా పెద్దగా ఎవరూ రాణించలేదు. ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విల్లీ, టోప్లీ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. మొయిన్ అలీ రెండు, అటిక్కిన్ సన్ ఒక్క వికెట్ పడగొట్టారు. ఇరు జట్ల మధ్య మూడో వన్డే సెప్టెంబర్ 13న లండన్ వేదికగా జరగనుంది. చదవండి: వాన వచ్చింది... ఆట ఆగింది -
ENG VS NZ 2nd ODI: లివింగ్‌స్టోన్ విధ్వంసం.. తృటిలో సెంచరీ మిస్
4 మ్యాచ్‌లో వన్డే సిరీస్‌లో భాగంగా సౌతాంప్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (సెప్టెంబర్ 10) జరుగుతున్న రెండో మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ ప్రత్యర్ధి ముందు ఓ మోస్తరు లక్ష్యాన్ని ఉంచింది. వర్షం కారణంగా 34 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. లియామ్ లివింగ్‌స్టోన్ (78 బంతుల్లో 95 నాటౌట్; 9 ఫోర్లు, సిక్స్) సూపర్ ఇన్నింగ్స్‌తో ఆదుకోవడంతో గౌరవప్రదమైన స్కోర్ సాధించగలిగింది. లివింగ్‌స్టోన్‌కు బట్లర్ (30), మొయిన్ అలీ (33), సామ్ కర్రన్ (42) తోడ్పాటునందించడంతో ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. ఈ సిరీస్‌లో లివింగ్‌స్టోన్ వరుసగా రెండో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కష్టాల్లో ఉన్నప్పుడు (12.1 ఓవర్లలో 55/5) ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన లివింగ్‌స్టోన్ ఎంతో బాధ్యతాయుతంగా ఆడి కెరీర్లో తొలి సెంచరీకి చేరువగా వచ్చాడు. ఇన్నింగ్స్ ఆఖరి రెండు బంతులు ఎదుర్కొనే అవకాశం లివింగ్‌స్టోన్‌కు వచ్చినప్పటికీ అతను 4 పరుగులు మాత్రమే రాబట్టగలిగాడు. దీంతో శతకానికి 5 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. 4.2 ఓవర్లలోనే ఇంగ్లండ్ టాప్-3 బ్యాటర్లను పెవిలియన్‌కు పంపి ఇంగ్లండ్ పతనాన్ని శాశించిన బౌల్ట్ మొత్తంగా ఈ మ్యాచ్‌లో 7 ఓవర్లు వేసి 3 వికెట్లు పడగొట్టగా.. సౌథీ 2, హెన్రీ, సాంట్నర్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 227 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ 3 ఓవర్లలో వికెట్ నష్టానికి 19 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ రెండో బంతికే డేవిడ్ విల్లే.. ఫిన్ అలెన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అయినప్పటికీ ఏమాత్రం తగ్గని విల్ యంగ్.. విల్లే వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో తొలి 3 బంతులను బౌండరీలుగా మలచి సత్తా చాటాడు. యంగ్ (17), కాన్వే (1) క్రీజ్‌లో ఉన్నారు. -
చెలరేగిన లివింగ్‌స్టోన్.. బట్లర్ ఊచకోత
టీ20 బ్లాస్ట్‌లో భాగంగా డెర్బీషైర్‌తో నిన్న (జూన్ 23) జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల జట్టు కెప్టెన్, లాంకాషైర్ ఆటగాడు జోస్ బట్లర్ శివాలెత్తిపోయాడు. ఈ మ్యాచ్‌లో 39 బంతులు ఎదుర్కొన్న బట్లర్.. 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేశాడు. బట్లర్‌కు మరో ఎండ్‌లో లియామ్ లవింగ్‌స్టోన్ (30 బంతుల్లో 47 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) సహకరించడంతో లాంకాషైర్ 15 ఓవర్లలో (వర్షం కారణంగా కుదించారు) 4 వికెట్ల నష్టానికి 177 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆఖర్లో వెల్స్ (4 బంతుల్లో 13; 2 సిక్సర్లు) భారీ షాట్లు ఆడాడు. డెర్బీషైర్ బౌలర్లలో జాక్ ఛాపెల్ 2, జమాన్ ఖాన్, మెక్ కీయెర్నన్ తలో వికెట్ పడగొట్టారు. చెలరేగిన లివింగ్‌స్టోన్.. బట్లర్ ఊచకోత టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన లాంకాషైర్.. ఆది నుంచే దూకుడుగా ఆడింది. సాల్ట్ (11 బంతుల్లో 16; 2 ఫోర్లు) వికెట్ పడిపోయాక బట్లర్ గేర్ మార్చి ధాటిగా ఆడటం ప్రారంభించాడు. ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాది డెర్బీషర్ బౌలర్లను ఊచకోత కోశాడు. బట్లర్ ఔటయ్యాక లివింగ్‌స్టోన్ కూడా చెలరేగిపోయాడు. ఆదిలో లవింగ్‌స్టోన్ కాస్త నిదానంగా ఆడినప్పటికీ.. ఆఖర్లో రెచ్చిపోయాడు. 3 భారీ సిక్సర్లు బాదాడు. భారీ లక్ష్య ఛేదనలో తడబడిన డెర్బీషైర్.. 178 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన డెర్బీషైర్.. ఆది నుంచే తడబడుతూ వచ్చింది. లాంకాషైర్ బౌలర్లు టామ్ బెయిలీ (2/16), డారిల్ మిచెల్ (2/13), లూక్ వెల్స్ (2/32), టామ్ హార్ట్లీ ధాటికి ఆ జట్టు 15 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 150 పరుగులు మాత్రమే చేసి 27 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. డెర్బీషైర్ ఇన్నింగ్స్‌లో హ్యారీ కేన్ (45), బ్రూక్ గెస్ట్ (31 నాటౌట్) ఓ మోస్తరుగా రాణించారు. -
స్థిరత్వం లేని బ్యాటింగ్.. పైగా వెకిలి నవ్వొకటి!
ఐపీఎల్ 16వ సీజన్లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతున్న లియామ్ లివింగ్ స్టోన్ స్థిరత్వం లేకుండా ఆడుతున్నాడు. ఒక మ్యాచ్‌లో భారీ స్కోరు చేస్తే మరుసటి మ్యాచ్‌లో తక్కువ స్కోరుకే వెనుదిరగడం అలవాటుగా చేసుకున్నాడు. తాజాగా శుక్రవారం రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో లివింగ్‌స్టోన్ 9 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈ సీజన్లో 8 మ్యాచ్‌లాడిన లివింగ్‌స్టోన్ 270 పరుగులు చేశాడు. రెండు అర్థశతకాలు ఉన్నాయి. ఇక రాజస్తాన్‌తో మ్యాచ్‌లో లివింగ్‌స్టోన్ ఆడిన దానికంటే ఔటైన తీరు ఆశ్చర్యపరిచింది. నవదీప్ సైనీ వేసిన ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో మూడో బంతి ఫుల్‌లెంగ్త్ డెలివరీ వేశాడు. అయితే లివింగ్‌స్టోన్ కనీసం బంతి ఎలా వస్తుందో కూడా చూడకుండా గుడ్డిగా బ్యాట్‌ను ఉపాడు. ఇంకేముంది సైనీ వేసిన బంతి నేరుగా వికెట్లను గిరాటేసింది. అయితే క్లీన్‌బౌల్డ్ అయ్యానన్న బాధ లివింగ్‌స్టోన్ మొహంలో కనిపించలేదు కదా వెకిలినవ్వుతో పెవిలియన్ చేరడం అందరిని ఆశ్చర్యపరిచింది. Navdeep Saini doesn't miss 🎯#PBKSvRR #IPLonJioCinema #TATAIPL #IPL2023 pic.twitter.com/QosEBqIkrB — JioCinema (@JioCinema) May 19, 2023 Liam Livingstone cleaned up by Navdeep Saini! 😱#PBKSvsRR #IPL2023 #Cricket pic.twitter.com/jkNg3u1zGg — OneCricket (@OneCricketApp) May 19, 2023 చదవండి: కోహ్లి '18' వెంటపడడం లేదు.. అతని వెనకే '18' వస్తోంది -
'యాంకర్ రోల్ నచ్చదు.. బంతిని బాదడమే ఇష్టం'
ఐపీఎల్ 16వ సీజన్లో పంజాబ్ కింగ్స్ పయనం పడుతూ లేస్తూ అన్నట్లుగా సాగుతుంది. ఈ సీజన్లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లాడిన పంజాబ్ ఐదు విజయాలు, ఆరు ఓటములతో పది పాయింట్లతో ఎనిమిదో స్థానంలో కొనసాగుతుంది. ఇక పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతున్న లియామ్ లివింగ్‌స్టోన్ సీజన్లో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఆరు మ్యాచ్‌లాడిన లివింగ్‌స్టోన్ 172 పరుగులు మాత్రమే చేశాడు. గత సీజన్లో 14 మ్యాచ్‌ల్లో 437 పరుగులతో రాణించాడు. గతేడాది ఫామ్‌ను ఈసారి కంటిన్యూ చేయడంలో విఫలమయ్యాడు. తాజాగా ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లివింగ్‌స్టోన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బ్యాటింగ్ చేసేటప్పుడు మద్దతు అందించే పాత్ర కన్నా బాదడమే ఎక్కువగా ఇష్టమని పేర్కొన్నాడు. లివింగ్‌స్టోన్ మాట్లాడుతూ.. ''ఒక బ్యాటర్ ఎలా ఆడాలనేది జట్టును బట్టి ఉంటుంది. మద్దతు అందించే పాత్రను పోషించడం నాకిష్టం ఉండదు. ప్రతి జట్టులో భిన్నమైన ఆటగాళ్లు.. వాళ్లకు భిన్నమైన పాత్రలు ఉంటాయి. నావరకైతే క్రికెట్‌ను ఆస్వాదిస్తా. భారీ షాట్లను కొట్టడాన్ని ఇష్టపడతా. పంజాబ్ తరపున విజయాల్లో నావంతు పాత్రను సమర్థంగా పోషించడంపైనే దృష్టి సారించా ''అని లివింగ్‌స్టోన్ తెలిపాడు. చదవండి: ఆ రికార్డును ఎవరూ పట్టించుకోలేదు.. కోహ్లి తర్వాత యశస్వి ఒక్కడే..! -
'అమ్మ జడ్డూ.. ఒకేసారి రెండు వికెట్లు తీసిన మొనగాడు!'
ఐపీఎల్ 16వ సీజన్లో పంజాబ్ కింగ్స్, సీఎస్కే మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. పంజాబ్ ఇన్నింగ్స్ సమయంలో గత మ్యాచ్ హీరో అథర్వ తైదేను జడేజా తెలివిగా బుట్టులో వేసుకున్నాడు. షార్ట్‌లెంగ్త్ బంతులు ఆడడం అథర్వ బలహీనత అని తెలుసుకున్న జడేజా అదే బంతి వేశాడు. దీంతో అథర్వ షాట్ ఆడే ప్రయత్నంలో కాట్ అండ్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ఇంతవరకు బాగానే ఉంది. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న లివింగ్‌స్టోన్ క్రీజు బయటికి వచ్చాడు. ఇది గమనించిన జడ్డూ అప్పటికే క్యాచ్‌గా తీసుకున్న బంతిని డ్రాప్ చేసినట్లుగా చేసి ఆ తర్వాత బంతిని తీసుకొని వికెట్లను ఎగురగొట్టాడు. అయితే ఇదంతా ఫన్నీవేలోనే కావడం విశేషం. జడ్డూ చర్యతో లివింగ్‌స్టోన్ సహా సీఎస్కే ఆటగాళ్లు నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు.. '' అమ్మ జడ్డూ స్రైకింగ్, నాన్‌స్ట్రైకింగ్ ఎండ్ వికెట్లు ఒకేసారి తీద్దామనుకున్నావా.. జడ్డూ తెలివి మాములుగా లేదు.. ఒకటేసారి రెండు వికెట్లు తీయాలనుకున్నాడు..'' అంటూ కామెంట్ చేశారు. 2 wickets in 1 ball? Just Ravindra Jadeja things 😅#CSKvPBKS #IPL2023 #TATAIPL #IPLonJioCinema | @imjadeja @ChennaiIPL pic.twitter.com/sW0IJcUuOy— JioCinema (@JioCinema) April 30, 2023 Only Jadeja can dismiss both striker and Non striker 😎💛#CSKvPBKS #WhistlePodu #CSK — WhistlePodu Army ® - CSK Fan Club (@CSKFansOfficial) April 30, 2023 చదవండి: అక్కడ ధోని.. కాన్వేను ఎవరు పట్టించుకుంటారు? -
అంత మంచి క్యాచ్ పట్టి అలా చేశావు ఏంటి? వీడియో వైరల్
మొహాలీ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 56 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ ఓటమి చవిచూసింది. తొలుత చేసిన లక్నో 257 పరుగుల రికార్డు స్కోర్ సాధించింది. లక్నో బ్యాటర్లలో మార్కస్ స్టోయినిష్(72), కైల్ మైర్స్(54), పూరన్(45) విధ్వంసం సృష్టించారు. అనంతరం 258 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 19.5 ఓవర్లలో 201 పరుగులకే ఆలౌటైంది. అయితే ఈ మ్యాచ్‌లో లివింగ్‌స్టోన్ చేసిన తప్పిదం పంజాబ్ కింగ్స్ కొంపముంచింది. ఏం జరిగిందంటే? లక్నో ఇన్నింగ్స్ 13 ఓవర్ వేసిన రాహుల్ చాహర్ బౌలింగ్‌లో రెండో బంతికి స్టోయినిష్ భారీ షాట్ ఆడాడు. ఈ క్రమంలో లాంగ్ ఆఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న లివింగ్‌స్టోన్ చేతిలోకి బంతి వెళ్లింది. అయితే లివింగ్‌స్టోన్ క్యాచ్ అందుకున్నప్పటికీ.. బౌండరీ రోప్‌ను మాత్రం టచ్ చేశాడు. దీంతో అంపైర్ సిక్స్‌గా ప్రకటించాడు. ఇక 40 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న స్టోయినిష్ అనంతరం చెలరేగిపోయాడు. 40 బంతుల్లోనే 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 72 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. ఒక వేళ స్టోయినిష్ క్యాచ్‌ను లివింగ్ స్టోన్ సరిగ్గా అందుకుని ఉండింటే లక్నో అంత భారీ స్కోర్ సాధించకపోయేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. చదవండి: IPL 2023: లక్నో సూపర్ జెయింట్స్‌కు బిగ్ షాక్.. స్టార్ ఆల్‌రౌండర్‌కు తీవ్ర గాయం pic.twitter.com/zHZcgOt7x7 — IPLT20 Fan (@FanIplt20) April 28, 2023 -
Badoni-Livingstone: రెచ్చగొట్టాడు.. మూల్యం చెల్లించుకున్నాడు, ఆతర్వాత..!
ఐపీఎల్-2023లో భాగంగా పంజాబ్ కింగ్స్-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య నిన్న (ఏప్రిల్ 28) జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం అందరి దృష్టిని ఆకర్శించింది. లక్నో బ్యాటింగ్ సమయంలో ఆయూష్ బదోని, పంజాబ్ బౌలర్ లియామ్ లవింగ్‌స్టోన్ మధ్య చిన్నపాటి డ్రామా నడిచింది. ఇద్దరూ ఎత్తుకుపై ఎత్తులు వేశారు. అయితే అంతిమంగా లివింగ్‌స్టోనే విజయం సాధించాడు. Badoni vs Livingstone #PBKSvLSG pic.twitter.com/nwFtXgaXgy — Aakash Chopra (@Aakash_Vani_1) April 28, 2023 ఇంతకీ ఏం జరిగిందంటే.. లక్నో ఇన్నింగ్స్ 14వ ఓవర్ రెండో బంతి పడేందుకు అంతా సిద్ధంగా ఉంది. అయితే బ్యాటర్ బదోని రివర్స్ స్వీప్ ఆడతాడన్న విషయాన్ని ముందే పసిగట్టిన బౌలర్ లివింగ్‌స్టోన్ ఆఖరి క్షణంలో బంతి వేయకుండా ఆగిపోయాడు. దీంతో చిర్రెత్తిపోయిన బదోని.. ఆ తర్వాతి బంతికి లివింగ్‌స్టోన్‌కు టిట్ ఫర్ టాట్ చేసి చూపించాడు. అచ్చం లివింగ్‌స్టోన్ చేసిన లాగానే, ఆఖరి క్షణంలో బంతిని ఎదుర్కోకుండా పక్కకు తప్పుకున్నాడు. ICYMI - Six and a Wicket! Liam Livingstone with the last laugh as Ayush Badoni gets caught in the deep after scoring 43 runs. Live - https://t.co/6If1I4omN0 #TATAIPL #PBKSvLSG #IPL2023 pic.twitter.com/gxUTK8vGDC — IndianPremierLeague (@IPL) April 28, 2023 ఈ డ్రామా ఇంతటితో అయిపోలేదు. ఎట్టకేలకు 14వ ఓవర్ రెండో బంతి పడింది. అప్పటికే లివింగ్‌స్టోన్‌పై కసితో రగిలిపోతున్న బదోని, బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ దిశగా భారీ సిక్సర్ బాదాడు. సిక్సర్ కొట్టాక లివింగ్‌స్టోన్ ఊరికే ఉంటాడా.. మరోసారి అదే తరహా బంతి వేసి బదోనిని బోల్తా కొట్టాంచాడు. లివింగ్‌స్టోన్ పన్నిన ఉచ్చులో చిక్కుకున్న బదోని.. అదే బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్‌లో ఉన్న రాహుల్ చాహర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో లివింగ్‌స్టోన్.. బదోనిపై పైచేయి సాధించినట్లైంది. డ్రామా మొదలెట్టిన లివింగ్‌స్టోనే చివరికి విజయం సాధించాడు. ఇక, మ్యాచ్ విషయానికొస్తే.. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్‌లో పంజాబ్‌పై లక్నో 56 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 257 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో తడబడిన పంజాబ్, తమ శక్తి మేరకు ప్రయత్నించి 201 పరుగులకు (19.5) ఆలౌటైంది. లక్నో ఇన్నింగ్స్‌లో కైల్ మేయర్స్ (54), ఆయూష్ బదోని (43), స్టోయినిస్ (72), పూరన్ (45) సుడిగాలి ఇన్నింగ్స్‌లు ఆడగా.. పంజాబ్ తరఫున అథర్వ టైడే (66), సికందర్ రజా (36), లివింగ్‌స్టోన్ (23), కర్రన్ (21), జితేశ్ శర్మ (24) ఓ మోస్తరుగా రాణించారు. లక్నో బౌలర్లు యశ్ ఠాకూర్ 4, నవీన్ ఉల్ హాక్ 3, బిష్ణోయ్ 2, స్టోయినిస్ ఓ వికెట్ సాధించారు. -
విధ్వంసకర వీరుడొచ్చాడు.. వెలగబెట్టిందేమీ లేదు! పాపం పంజాబ్..
ఐపీఎల్-2023లో పంజాబ్ కింగ్స్ స్టార్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ తొలి మ్యాచ్ ఆడాడు. అయితే ఆడిన తొలి మ్యాచ్‌లోనే లివింగ్‌స్టోన్ నిరాశపరిచాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా గురువారం రాయల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో లివింగ్‌స్టోన్ కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు. ఆర్సీబీ పేసర్ మహ్మద్ సిరాజ్ వేసిన ఓ అద్భుత బంతికి వికెట్ల ముందు లివింగ్‌స్టోన్ దొరికిపోయాడు. అదే విధంగా బౌలింగ్ విషయానికి వస్తే.. కేవలం ఒక్క ఓవర్ మాత్రమే వేసిన లివింగ్‌స్టోన్ వికెట్ ఏమీ తీయకుండా 9 పరుగులిచ్చాడు. ఈ ఇంగ్లీష్ ఆల్‌రౌండర్ జట్టుతో చేరి దాదాపు 10 రోజులు అవుతున్న అతడు పూర్తి ఫిట్నెస్ సాధించకపోవడంతో పంజాబ్ మేనెజ్మెంట్ పక్కన పెట్టింది. ఎట్టకేలకు ఫిట్నెస్ సాధించడంతో అద్భుత ఫామ్‌లో ఉన్న సికిందర్ రజాను పక్కన పెట్టి మరి లివింగ్‌స్టోన్‌కు పంజాబ్ మేనెజ్మెంట్ అవకాశం ఇచ్చింది. పంజాబ్ మేనెజ్మెంట్ నమ్మకాన్ని లివింగ్‌స్టోన్ నిలబెట్టుకో లేకపోయాడు. ఇక పంజాబ్ చివరి మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచిన సికిందర్ రజా స్ధానంలో లివింగ్‌స్టోన్‌ను తీసుకురావడాన్ని పలువురు మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు. రజా లాంటి అద్భుత ఆల్‌రౌండర్ జట్టులో ఉండి ఉంటే.. ఆర్సీబీపై పంజాబ్ కచ్చితంగా విజయం సాధించి ఉండేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో 24 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ ఓటమి పాలైంది. కాగా ఈ మ్యాచ్‌కు కూడా పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ గాయం కారణంగా దూరమయ్యాడు. చదవండి: IPL 2023: తిన్నగా ఆడటమే రాదు.. ఇంకా ప్రయోగాలు ఒకటి! చెత్త బ్యాటింగ్ ఎట్టకేలకు ఢిల్లీకి దక్కిన విజయం.. ఆరో మ్యాచ్‌లో అతికష్టమ్మీద -
పంజాబ్ కింగ్స్‌కు గుడ్ న్యూస్.. విధ్వంసకర ఆటగాడు వచ్చేస్తున్నాడు..!
ఐపీఎల్-2023లో భాగంగా మొహాలీ వేదికగా ఇవాళ (ఏప్రిల్ 20) మధ్యాహ్నం 3:30 గంటలకు పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌ను ఇరు జట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నాయి. ముఖ్యంగా వరుస పరాజయాల బాట పట్టిన ఆర్సీబీకి ఈ మ్యాచ్ గెలుపు బూస్టప్ ఇస్తుంది. ఈ జట్టు ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో కేవలం రెండే విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో నిలిచింది. మరోవైపు పంజాబ్ పరిస్థితి సైతం ఏమంత ఆశాజనకంగా లేదు. ఆ జట్టు గత మ్యాచ్‌లో గెలిచిందనే కాని, ఓవరాల్‌గా ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో తుది జట్లలో ఎవరెవరు ఉండే అవకాశముందో అన్న విషయాన్ని ఓసారి పరిశీలిస్తే.. భుజం గాయం కారణంగా లక్నోతో జరిగిన గత మ్యాచ్‌కు దూరంగా ఉన్న పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధవన్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అలాగే లేట్‌గా జట్టుతో చేరి, అనంతరం నెట్స్‌లో గాయపడిన ఇంగ్లండ్ ఆటగాడు లియామ్ లివింగ్‌స్టోన్.. ఆర్సీబీతో మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది. లివింగ్ స్టోన్ తుది జట్టులోకి వస్తే గత మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సికందర్ రజా, ఆసీస్ ఆల్‌రౌండర్ మాథ్యూ షార్ట్‌లలో ఎవరో ఒకరు బెంచ్‌కు పరిమితం కావాల్సి ఉంటుంది. ఆర్సీబీ స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ విషయానికొస్తే.. గాయం కారణంగా ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని ఈ ఆసీస్ పేసర్ ఇంకా కోలుకునే దశలోనే ఉన్నట్లు సమాచారం. ఈ మ్యాచ్ కోసం ఆర్సీబీ ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదు. గత మ్యాచ్‌లో సీఎస్కే చేతిలో ఓడిన జట్టునే యధాతథంగా కొనసాగించే అవకాశం ఉంది. పంజాబ్ జట్టులో మాత్రం రెండు మార్పులకు ఆస్కారం ఉంది. గత మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన అథర్వ స్థానంలో ధవన్.. షార్ట్, సికిందర్ రజాలలో ఎవరో ఒకరి స్థానంలో లివింగ్‌స్టోన్ తుది జట్టులోకి రావచ్చు. తుది జట్లు (అంచనా).. పంజాబ్ కింగ్స్: శిఖర్ ధవన్ (కెప్టెన్), ప్రభ్‌సిమ్రన్, మాథ్యూ షార్ట్/లివింగ్‌స్టోన్, హర్‌ప్రీత్ సింగ్, సికందర్ రజా, సామ్ కర్రన్, జితేశ్ శర్మ, షారుఖ్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రబాడ, అర్షదీప్ సింగ్ ఆర్సీబీ: డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, మహిపాల్ లోమ్రార్, మ్యాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేశ్ కార్తీక్, హర్షల్ పటేల్, హసరంగ, పార్నెల్, విజయ్‌కుమార్ వైశాఖ్, సిరాజ్ -
PBKS Vs GT: పవర్ హిట్టర్ వచ్చేశాడు! అందరి కళ్లు అతడిపైనే!
IPL 2023- Punjab Kings vs Gujarat Titans: ఐపీఎల్-2023లో భాగంగా డిపెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో పోరుకు పంజాబ్ కింగ్స్ సిద్ధమైంది. సొంత మైదానంలో టైటాన్స్‌తో ఢొకొట్టేందుకు ధావన్ సేన పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. పవర్ హిట్టర్, ఇంగ్లంగ్ స్టార్ లియామ్ లివింగ్‌స్టోన్ రాకతో పంజాబ్‌లో జోష్ వచ్చింది. తమ స్టార్ ప్లేయర్ వచ్చేశాడని.. అందరి కళ్లు అతడిపైనే ఉన్నాయంటూ కింగ్స్ జట్టు లివింగ్‌స్టోన్ ఫొటోలు షేర్ చేస్తూ ఆనందాన్ని పంచుకుంది. కాగా గాయం కారణంగా సుదీర్ఘ కాలం పాటు ఆటకు దూరమైన లివింగ్‌స్టోన్ ఈ మ్యాచ్‌తో బరిలోకి దిగే అవకాశం ఉంది. మరోవైపు.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లోనే అందుబాటులోకి వచ్చినప్పటికీ బెంచ్‌కే పరిమితమైన సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబడ కూడా గుజరాత్‌తో మ్యాచ్‌లో ఆడే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో పంజాబ్ తుది జట్టు ఎలా ఉండబోతుందన్న అంశాన్ని పరిశీలిద్దాం. గుజరాత్‌తో పంజాబ్ ఢీ ఓపెనర్లుగా ప్రబ్‌సిమ్రన్ సింగ్, కెప్టెన్ శిఖర్ ధావన్ జోడీ కొనసాగనుండగా.. లివింగ్‌స్టోన్‌ను వన్‌డౌన్‌లో ఆడించే అవకాశాలు ఉన్నాయి. ఇక భనుక రాజపక్స స్థానంలో గత మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో వచ్చిన మాథ్యూ షార్ట్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. అదే విధంగా ఆశించిన మేర రాణించలేకపోతున్న సికందర్ రజాకు ఇదే ఆఖరి ఛాన్స్ అయ్యే అవకాశం ఉంది. మిడిలార్డర్లో షారుక్ ఖాన్, వికెట్ కీపర్ జితేశ్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్ ఆడనున్నారు. వీరితో పాటు సామ్ కర్రన్ ఉండనే ఉంటాడు. గతంలో చెరోసారి ఇక.. బౌలింగ్ విభాగంలో పేసర్లు కగిసో రబడ, నాథన్ ఎల్లిస్లలో ఒకరు.. అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు స్పిన్నర్ రాహుల్ చహర్ తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. కాగా గత మ్యాచ్‌లో శిఖర్ ధావన్ మినహా మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలం కావడంతో సన్‌రైజర్స్ చేతిలో పంజాబ్‌కు ఓటమి తప్పలేదు. మరోవైపు.. గుజరాత్‌కు సైతం గత మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ రూపంలో ఈ సీజన్లో తొలి ఓటమి ఎదురైంది. దీంతో విజయం సాధించాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. కాగా గురువారం మ్యాచ్ జరుగనున్న మొహాలీ స్టేడియంలో గతంలో ఇరు జట్లు తలపడిన రెండు సందర్భాల్లో చెరో విజయం నమోదు చేశాయి. గుజరాత్‌తో పంజాబ్ కింగ్స్ మ్యాచ్ తుది జట్ల(అంచనా): పంజాబ్ కింగ్స్ ప్రబ్‌సిమ్రన్ సింగ్, శిఖర్ ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, సికిందర్ రజా, జతేశ్ శర్మ, షారుఖ్ ఖాన్, సామ్ కర్రన్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చహర్, నాథన్ ఎల్లిస్/కగిసో రబడ, అర్ష్‌దీప్ సింగ్. గుజరాత్ టైటాన్స్ వృద్ధిమాన్ సాహా, శుబ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, జాషువా లిటిల్. చదవండి: IPL 2023: నీ తప్పిదం వల్ల భారీ మూల్యం! అమ్మో ఈ ‘మహానుభావుడు’ ఉంటేనా.. సచిన్ నన్ను బ్యాట్‌తో కొట్టాడు.. పిచ్చివాడిని చేస్తావా అంటూ ఫైర్ అయ్యాడు: సెహ్వాగ్ All the focus is on 𝐨𝐧𝐞 𝐦𝐚𝐧! 📸@liaml4893 is ready to Roar 🦁#JazbaHaiPunjabi #SaddaPunjab #PunjabKings #TATAIPL pic.twitter.com/wo7boR6Qvk — Punjab Kings (@PunjabKingsIPL) April 12, 2023 -
IPL 2023: ఇంజక్షన్లు తీసుకున్నా.. అద్భుత ప్రభావం.. త్వరలోనే కలుస్తా
IPL 2023- PBKS- Liam Livingstone: పంజాబ్ కింగ్స్‌కు శుభవార్త. పవర్ హిట్టర్, ఇంగ్లండ్ స్టార్ లియామ్ లివింగ్‌స్టోన్ త్వరలోనే జట్టుతో చేరనున్నాడు. ఈ విషయాన్ని లివింగ్‌స్టోన్ స్వయంగా వెల్లడించాడు. ఈ మేరకు.. ‘‘ గత రెండు నెలలుగా కఠిన పరిస్థితులు.. త్వరలోనే తిరిగి మైదానంలో అడుగుపెడతా.. త్వరలోనే మీతో చేరతా పంజాబ్ కింగ్స్’’ అని సోమవారం ట్వీట్ చేశాడు. కాగా 11.50 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పంజాబ్ కింగ్స్ లివింగ్‌స్టోన్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే గాయం కారణంగా గతేడాది డిసెంబరు నుంచి ఆటకు దూరమైన అతడు ఇన్నాళ్లు చికిత్స తీసుకున్నాడు. లియామ్ లివింగ్‌స్టోన్ (PC: IPL) ఇంజక్షన్లు తీసుకున్నా ఈ క్రమంలో కోలుకున్న లివింగ్‌స్టోన్ లంకాషైర్ క్రికెట్ టీవీ ఇంటర్వ్యూలో ఆదివారం మాట్లాడుతూ.. ‘‘గత వారం ఇంజక్షన్లు తీసుకున్నా. అవి అద్భుతమైన ప్రభావం చూపాయి. రానున్న 48 గంటల్లో ఇండియాకు పయనమవుతా’’ అని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో ట్విటర్ వేదికగా మరోసారి అప్డేట్ ఇచ్చాడు. దీంతో పంజాబ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. పవర్ హిట్టర్ వస్తే తమ బ్యాటింగ్ ఆర్డర్ బలం పెరుగుతుందని పేర్కొంటున్నారు. కాగా ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల సత్తా లివింగ్‌స్టోన్ సొంతమని ఇప్పటికే పలుమార్లు రుజువైన విషయం తెలిసిందే. పవర్ హిట్టర్ వచ్చేస్తున్నాడు.. ఇక 29 ఏళ్ల లివింగ్‌స్టోన్ 2017లో సౌతాఫ్రికాతో టీ20మ్యాచ్‌తో ఇంగ్లండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. 2021లో వన్డే, 2022లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు మొత్తంగా ఒక టెస్టులో 16 పరుగులు, 12 వన్డేల్లో 250 పరుగులు, 20 టీ20లలో 423 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే.. తొలి రెండు మ్యాచ్‌లలో విజయం సాధించిన పంజాబ్ కింగ్స్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో పరాజయం పాలైంది. ప్రస్తుతం ధావన్ సేన పాయింట్ల పట్టికలో ఆరోస్థానంలో ఉంది. పంజాబ్ తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 13న గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. అన్నీ కుదిరితే ఈ మ్యాచ్‌లో లివింగ్‌స్టోన్ ఆడే అవకాశం ఉంది. చదవండి: 4 ఓవర్లలో 69 పరుగులు; తలెత్తుకో చాంపియన్.. కేకేఆర్ ట్వీట్ వైరల్! ఎవరీ యశ్ దయాల్? IPL 2023: హర్షా బోగ్లేకు ధావన్ అదిరిపోయే కౌంటర్! నవ్వుతూనే చురకలు! It’s been a long couple months but it’s time to get back to work… see you soon @PunjabKingsIPL 🙏❤️ — Liam Livingstone (@liaml4893) April 9, 2023 -
పంజాబ్‌కు గుడ్‌న్యూస్.. అతడు వచ్చేశాడు! హైదరాబాద్‌కు చేరుకున్నధావన్ సేన
IPL 2023- Punjab Kings- Liam Livingstone- Kagiso Rabada: వరుస విజయాలతో జోరు మీదున్న పంజాబ్ కింగ్స్‌కు శుభవార్త. సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబడ భారత్‌కు వచ్చేశాడు. జట్టుతో కలిసి హైదరాబాద్‌కు చేరుకున్నాడు. అదే విధంగా ధావన్ సేనకు సంబంధించిన మరో కీలక అప్డేట్ బయటకు వచ్చింది. భారీ మొత్తం వెచ్చించి కింగ్స్ కొనుగోలు చేసిన ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ రాకకోసం మాత్రం మరికొన్ని రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకా కోలుకోలేదు మోకాలి గాయం కారణంగా రిహాబిలిటేషన్ సెంటర్లో ఉన్న లివింగ్‌స్టోన్ ఇంకా పూర్తి కోలుకోలేదని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. ఓల్డ్ ట్రఫోర్డ్‌లో చికిత్స పొందుతున్న లివింగ్‌స్టోన్ ఏప్రిల్ 15 తర్వాతే భారత్‌కు వెళ్లే అవకాశం ఉందని క్రిక్‌బజ్‌తో పేర్కొన్నారు. కాగా గాయం కారణంగా గతేడాది డిసెంబరు నుంచి లియామ్ లివింగ్‌స్టోన్ ఆటకు దూరమయ్యాడు. ఈ క్రమంలో రిహాబిలిటేషన్ సెంటర్లో ఉన్న అతడు.. ఏప్రిల్ మొదటి వారంలోనే పంజాబ్ కింగ్స్‌తో చేరతాడనే వార్తలు వచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం అతడి రాక మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. సౌతాఫ్రికా స్టార్ బౌలర్ కగిసో రబడ మాత్రం తదుపరి మ్యాచ్‌లో అందుబాటులోకి రానున్నాడు. కాగా ఏప్రిల్ 9న పంజాబ్ కింగ్స్ హైదరాబాద్ వేదికగా.. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో తలపడనుంది. హైదరాబాద్‌కు చేరుకున్న ధావన్ సేన ఈ నేపథ్యంలో ధావన్ సేన.. హైదరాబాద్‌కు చేరుకుంది. సంప్రదాయ పద్ధతిలో గబ్బర్ బృందానికి స్వాగతం లభించింది. కాగా పంజాబ్ కింగ్స్ ఐపీఎల్-2023 సీజన్‌ను ఘనంగా ఆరంభించింది. తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై 7 పరుగుల తేడాతో గెలుపొందిన పంజాబ్.. రెండో మ్యాచ్‌లో రాజస్తాన్‌పై 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. స్వల్ప తేడాలతో గెలుపొంది పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. కాగా 11.50 కోట్ల రూపాయల భారీ మొత్తం చెల్లించి పంజాబ్ లివింగ్‌స్టోన్‌ను దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక రబడ కోసం 9.25 కోట్లు ఖర్చు చేసింది. చదవండి: ఎందుకు వస్తున్నాడో తెలియదు.. చెత్త బ్యాటింగ్! ప్రతీసారి ఇంతే కోహ్లి వచ్చాడు.. కోపంగా బ్యాట్ విసిరేశాడు.. పక్కనే కూర్చున్న నాతో.. Sadda Captain has spoken. 🫡 📍Hello, Hyderabad. 👋🏻#JazbaHaiPunjabi #SaddaPunjab #TATAIPL | @SDhawan25 pic.twitter.com/4GpSvq1Q9J — Punjab Kings (@PunjabKingsIPL) April 7, 2023 All eyes on KG! 👀#JazbaHaiPunjabi #SaddaPunjab #PunjabKings #TATAIPL I @KagisoRabada25 pic.twitter.com/wwhpjjLRTv — Punjab Kings (@PunjabKingsIPL) April 7, 2023 Sadde 🦁s enjoyed a warm Hyderabadi welcome! 😊 🙏#JazbaHaiPunjabi #SaddaPunjab #PunjabKings #TATAIPL pic.twitter.com/wuvpq4Fyb7 — Punjab Kings (@PunjabKingsIPL) April 7, 2023 -
పంజాబ్ కింగ్స్‌కు ఏకకాలంలో గుడ్‌న్యూస్.. బ్యాడ్‌న్యూస్
మరో వారం రోజుల్లో(మార్చి 31న) ఐపీఎల్ 16వ సీజన్‌కు తెరలేవనుంది. ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్‌కు ఏకకాలంలో గుడ్‌న్యూస్.. బ్యాడ్‌న్యూస్ వచ్చాయి. గుడ్‌న్యూస్ ఏంటంటే విధ్వంసకర ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్‌కు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ఐపీఎల్లో ఆడేందుకు ఎన్వోసీ క్లియరెన్స్ ఇచ్చింది. అదే సమయంలో మరో ఇంగ్లండ్ ఆటగాడు జానీ బెయిర్ స్టోకు మాత్రం ఇంకా ఎన్వోసీ క్లియరెన్స్ ఇవ్వలేదు. దీంతో బెయిర్ స్టో ఐపీఎల్ 16వ సీజన్ ఆడేది అనుమానమే. ఇంగ్లండ్‌కే చెందిన మరో స్టార్ క్రికెటర్ సామ్ కరన్ మాత్రం పంజాబ్ కింగ్స్‌కు అందుబాటులో ఉండనున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా రికార్డులకెక్కిన సామ్ కరన్‌ను పంజాబ్ కింగ్స్ రూ.18.25 కోట్లకు కొనుగోలు చేసింది. కాగా అక్టోబర్‌లో మ్యాచ్ సందర్భంగా కాలు విరగడంతో బెయిర్ స్టో ఆటకు దూరమయ్యాడు. ఆ తర్వాత సర్జరీ చేయించుకొని కోలుకున్నాడు. ప్రస్తుతం ఈసీబీ పర్యవేక్షణలో ఉన్న బెయిర్ స్టో ఇంకా ఫిట్నెస్ సాధించలేదు. ఈ క్రమంలోనే ఐపీఎల్‌కు ఎన్వోసీ ఇవ్వడానికి ఈసీబీ నిరాకరించింది. దీంతో అతను ఐపీఎల్‌కు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది చివర్లో జరగనున్న యాషెస్ సిరీస్ వరకు బెయిర్ స్టో అందుబాటులోకి వస్తాడని ఈసీబీ ఆశాభావం వ్యక్తం చేసింది. ఇక డిసెంబర్ 2022లో జరిగిన మినీ వేలంలో పంజాబ్ కింగ్స్ బెయిర్ స్టోను రూ. 6.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక గతేడాది పాకిస్తాన్‌తో రావల్పిండి టెస్టు అనంతరం మోకాలి గాయంతో ఆటకు దూరమైన లియామ్ లివింగ్‌స్టోన్ ఐపీఎల్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. పంజాబ్ కింగ్స్ ఇతన్ని రూ. 11.50 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. గాయం నుంచి కోలుకున్న తర్వాత లంకాషైర్ తరపున కౌంటీ క్రికెట్ ఆడాడు. ఈసీబీ ఎన్వోసీ క్లియరెన్స్ ఇచ్చినప్పటికి లివింగ్‌స్టోన్ ఎప్పుడు వస్తాడనే దానిపై క్లారిటీ లేదు. మరోవైపు సామ్ కరన్ మాత్రం ఐపీఎల్ 2023 సీజన్‌కు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అతనితో పాటు జోఫ్రా ఆర్చర్(ముంబై ఇండియన్స్), బెన్ స్టోక్స్(సీఎస్కే), మార్క్‌వుడ్(లక్నో సూపర్ జెయింట్స్) తదితరులు ఐపీఎల్ 16వ సీజన్లో పాల్గొననున్నారు. IPL 2023లో ఇంగ్లండ్ ఆటగాళ్లు సామ్ కరన్ (పంజాబ్ కింగ్స్), బెన్ స్టోక్స్ (చెన్నై సూపర్ కింగ్స్), హ్యారీ బ్రూక్ (సన్‌రైజర్స్ హైదరాబాద్), ఫిల్ సాల్ట్ (ఢిల్లీ క్యాపిటల్స్), రీస్ టాప్లీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు), ఆదిల్ రషీద్ (సన్‌రైజర్స్ హైదరాబాద్), జో రూట్ (రాజస్థాన్ రాయల్స్) , లియామ్ లివింగ్‌స్టోన్ (పంజాబ్ కింగ్స్), జానీ బెయిర్‌స్టో (పంజాబ్ కింగ్స్), మొయిన్ అలీ (చెన్నై సూపర్ కింగ్స్), జోఫ్రా ఆర్చర్ (ముంబై ఇండియన్స్), జోస్ బట్లర్ (రాజస్థాన్ రాయల్స్), డేవిడ్ విల్లీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) మరియు మార్క్ వుడ్ (లక్నో సూపర్ జెయింట్స్) View this post on Instagram A post shared by S A M C U R R A N (@samcurran58) #SherSquad, we need your undying love and support this year more than ever. We are in this together! ♥️#SaddaPunjab #PunjabKings #TATAIPL pic.twitter.com/CnS9DNlcqJ — Punjab Kings (@PunjabKingsIPL) March 21, 2023 చదవండి: క్యాన్సర్ మహమ్మారి నుంచి బయటపడిన టెన్నిస్ దిగ్గజం మ్యాచ్ ఓడిపోయినా రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. -
ముంబై జట్టుకు స్టార్ ఆటగాడు దూరం.. విధ్వంసకర ఆల్‌రౌండర్ ఎంట్రీ!
ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ గాయం కారణంగా సౌతాఫ్రికా టీ20 లీగ్ తొలి సీజన్‌కు దూరమైన సంగతి తెలిసిందే. గతేడాది జరిగిన వేలంలో లివింగ్‌స్టోన్‌ను ఏంఐ కేప్‌టౌన్ కొనుగోలు చేసింది. అయితే గతేడాది ఆఖరిలో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో లివింగ్‌స్టోన్ చేతివేలికి గాయమైంది. దీంతో అతడు టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో లివింగ్‌స్టోన్ స్థానాన్ని ఆస్ట్రేలియా విధ్వంసకర ఆల్‌రౌండర్ టిమ్ డేవిడ్‌తో ఏంఐ కేప్‌టౌన్ భర్తీ చేసింది. ఈ మెరకు సోషల్ మీడియా వేదికగా ఏంఐ కేప్‌టౌన్ ఓ వీడియోను షేర్ చేసింది. "టిమ్ డేవిడ్ ఇప్పుడు ఏంఐ కేప్‌టౌన్ ఫ్యామిలీలో చేరాడు అంటూ" క్యాప్షన్ ఇచ్చింది. కాగా డేవిడ్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. బిగ్‌బాష్ లీగ్-(2022-23)లో హోబార్ట్ హారికేన్స్ తరపున డేవిడ్ అదరగొట్టాడు. ఇక ఇది ఇలా ఉండగా.. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు డేవిడ్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గతేడాది జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో రూ. 8.25 కోట్లకు ముంబై కొనుగోలు చేసింది. అయితే గతేడాది సీజన్లో 8 మ్యాచ్‌లు ఆడిన డేవిడ్ 186 పరుగులు సాధించాడు. చదవండి: Murali Vijay: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మురళీ విజయ్.. ఇప్పటికీ ఆ రికార్డు తన పేరిటే Tim in blue-and-gold in Cape Town - here we go! 😉💙#MICapeTown #OneFamily @timdavid8 pic.twitter.com/pizLgh2hiu — MI Cape Town (@MICapeTown) January 30, 2023 -
పాకిస్తాన్ పర్యటనలో ఉన్న ఇంగ్లండ్‌కు భారీ షాక్..
పాకిస్తాన్ పర్యటలో ఉన్న ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ టెస్టు సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. రావల్పిండి వేదికగా జరుగుతున్న పాకిస్తాన్‌తో తొలి టెస్టులో లివింగ్‌స్టోన్ టెస్టు అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో రెండో రోజు ఆట సందర్భంగా ఫీల్డింగ్ చేస్తుండగా లివింగ్‌స్టోన్ మోకాలికి గాయమైంది. ఈ క్రమంలోనే లివింగ్‌స్టోన్ దూరం కానున్నాడు. ఇక ఇదే విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ కూడా దృవీకరించింది. "లివింగ్ స్టోన్ మోకాలి గాయం కారణంగా మిగిలిన టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. అతడు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాము" అని ఇంగ్లండ్ క్రికెట్ ట్విటర్లో పేర్కొంది. కాగా అరంగేట్ర టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 9 పరుగులు చేసిన లివింగ్‌స్టోన్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఏడు పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇక పాకిస్తాన్-ఇంగ్లండ్ తొలి టెస్టు రసవత్తరంగా జరుగుతోంది. ఈ చారిత్రాత్మక టెస్టు మ్యాచ్ అఖరి రోజు ఆటకు చేరుకుంది. ఇంగ్లండ్ విజయానికి 7 వికెట్ల దూరంలో నిలవగా.. పాకిస్తాన్ గెలుపొందాలంటే మరో 174 పరుగులు సాధించాలి. ఐదో రోజు లంచ్ విరామం సమయానికి పాకిస్తాన్ మూడు వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. Get well soon, liaml4893. The all-rounder has been ruled out of the rest of our Test series in Pakistan. 🇵🇰 #PAKvENG 🏴 — England Cricket (@englandcricket) December 5, 2022 చదవండి: KL Rahul: అతడిని ఎందుకు తప్పించారో తెలీదు! పంత్ దరిద్రం నీకు పట్టుకున్నట్టుంది! బాగా ఆడినా.. ఇదేం పోయే కాలమో! -
17 ఏళ్ల తర్వాత పాక్‌తో తొలి టెస్టు.. ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన!
రావల్పిండి వేదికగా గురువారం పాకిస్తాన్‌తో తొలి టెస్టులో తలపడేందుకు ఇంగ్లండ్ సిద్దమైంది. 17 ఏళ్ల తర్వాత తొలి సారి పాక్ గడ్డపై ఇంగ్లండ్ టెస్టు మ్యాచ్ ఆడనుంది. అయితే తొలి టెస్టులో పాల్గోనే తమ తుది జట్టును ఇంగ్లండ్ ప్రకటించింది. ఇక విధ్వంసకర ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ ఇంగ్లండ్ తరపున టెస్టు అరంగేట్రం చేసేందుకు సిద్దమయ్యాడు. పాకిస్తాన్‌తో తొలి టెస్టుకు లివింగ్‌స్టోన్‌కు ఇంగ్లండ్ తుది జట్టులో చోటు దక్కింది. అతడు ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు రానున్నాడు. మరోవైపు గత కొన్నేళ్లగా ఇంగ్లండ్ టెస్టు జట్టుకు దూరంగా ఉన్న బెన్ డకెట్ కూడా తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. అతడు జాక్ క్రాలీతో కలిసి ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు. ఇక పాక్ పర్యటనలో భాగంగా ఇంగ్లండ్ మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఇంగ్లండ్ తుది జట్టు: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, జాక్ లీచ్, ఆలీ రాబిన్సన్, జేమ్స్ ఆండర్సన్. -
క్యాచెస్ విన్ మ్యాచెస్ అంటే ఇదేనేమో.. బట్లర్, లివింగ్‌స్టోన్ కళ్లు చెదిరే క్యాచ్‌లు
క్యాచెస్ విన్ మ్యాచెస్ అనే నానాడు క్రికెట్ సర్కిల్స్‌లో చాలాకాలంగా వినపడుతూ ఉంది. అయితే ఈ నానాడు వంద శాతం కరెక్టేనని ఇవాళ (అక్టోబర్ 22) జరిగిన ఇంగ్లండ్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ రుజువు చేసింది. టీ20 వరల్డ్‌కప్ గ్రూప్-1 సూపర్-12 మ్యాచ్‌ల్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ప్లేయర్లు జోస్ బట్లర్, లియామ్ లివింగ్‌స్టోన్ పక్షుల్లా గాల్లోకి ఎగురుతూ కళ్లు చెదిరే క్యాచ్‌లు అందుకుని మ్యాచ్‌ను గెలిపించారు. క్యాచెస్ ఆఫ్ ద టోర్నమెంట్ బరిలో నిలిచే అర్హత కలిగిన ఈ క్యాచ్‌లు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. ముందుగా లివింగ్‌స్టోన్ పట్టిన క్యాచ్ విషయానికొస్తే.. బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో ఆఫ్ఘన్ ఓపెనర్ హజ్రతుల్లా జజాయ్ కొట్టిన భారీ షాట్‌ను బ్యాక్వర్డ్ పాయింట్ వద్ద లివింగ్‌స్టోన్ అద్భుతమైన డైవింగ్ క్యాచ్ అందుకున్నాడు. చాలా సేపు గాల్లో ఉన్న బంతిని లివింగ్‌స్టోన్ ముందుకు పరిగెడుతూ సూపర్మ్యాన్లా గాల్లోకి ఎగురుతూ రెండు చేతులతో ఒడిసిపట్టుకున్నాడు. View this post on Instagram A post shared by ICC (@icc) ఇక జోస్ బట్లర్ పట్టిన క్యాచ్ విషయానికొస్తే.. ఈ క్యాచ్ మ్యాచ్ మొత్తానికే హైలైట్ అని చెప్పాలి. మార్క్ వుడ్ బౌలింగ్‌లో ఆఫ్ఘన్ కెప్టెన్ మహ్మద్ నబీ లెగ్ గ్లాన్స్ షాట్ ఆడాలని ప్రయత్నించగా.. బంతి ఎడ్జ్ తీసుకుని వికెట్‌కీపర్ బట్లర్‌ను క్రాస్ చేయబోయింది. ఇంతలో బట్లర్ పక్షిలా తన లెఫ్ట్ సైడ్‌కు డైవ్ చేస్తూ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్ తప్పక క్యాచ్ ఆఫ్ టోర్నమెంట్ అవుతుందని నెటిజన్లు అంటున్నారు. లివింగ్‌స్టోన్, బట్లర్ పట్టిన క్యాచ్‌లకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. View this post on Instagram A post shared by ICC (@icc) ఇవే కాక.. న్యూజిలాండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇవాళే జరిగిన మ్యాచ్‌లో కివీస్ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్ సైతం ఒళ్లు జలదరించే క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచే ఈ రోజు మొత్తానికి హైలైట్ అనుకుంటే మరో రెండు క్యాచ్‌లు దీనికి పోటీగా వచ్చాయి. ఇదిలా ఉంటే, గ్రూప్-1లో ఇవాళ జరిగిన మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్.. ఆసీస్‌పై, ఇంగ్లండ్.. ఆఫ్ఘనిస్తాన్పై విజయం సాధించిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by ICC (@icc) -
T20 WC: ఇంగ్లండ్ బ్యాటర్ల వీరవిహారం.. పాక్‌పై సునాయాస విజయం
టీ20 వరల్డ్‌కప్ వార్మప్ మ్యాచ్‌లు సైతం రంజుగా సాగుతున్నాయి. భారత్-ఆస్ట్రేలియా మధ్య ఇవాళ (అక్టోబర్ 17) ఉదయం జరిగిన మ్యాచ్ ఆధ్యంతం ఉత్కంఠభరితంగా సాగగా (భారత్ విజేత).. ఇంగ్లండ్-పాకిస్తాన్ మధ్య జరిగిన రెండో మ్యాచ్ అభిమానులకు కావాల్సిన మజాను అందించింది. పాక్ నిర్ధేశించిన 161 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లీష్ బ్యాటర్లు ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయినా ఏమాత్రం తగ్గకుండా ప్రేక్షకులకు పవర్ హిట్టింగ్ మజాను అందించారు. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్ (1), అలెక్స్ హేల్స్ (9) తక్కువ స్కోర్లకే ఔటైనా, ఆతర్వాత వచ్చిన బెన్ స్టోక్స్ (18 బంతుల్లో 36; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), లియామ్ లివింగ్‌స్టోన్ (16 బంతుల్లో 28; ఫోర్, 2 సిక్సర్లు), హ్యారీ బ్రూక్ (24 బంతుల్లో 45 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), సామ్ కర్రన్ (14 బంతుల్లో 33 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) తమదైన స్టయిల్లో ఆకాశమే హద్దుగా రెచ్చిపోయారు. బౌండరీలు, సిక్సర్లతో పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఫలితంగా ఇంగ్లండ్ 14.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుని (163/4) 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వర్షం అంతరాయం కలిగించడంతో 19 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన పాక్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు షాన్ మసూద్ (22 బంతుల్లో 39; 7 ఫోర్లు), హైదర్ అలీ (16 బంతుల్లో 18; 3 ఫోర్లు) పాక్‌కు ఓ మోస్తరు ఆరంభాన్ని అందించగా.. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లెవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. తాత్కాలిక కెప్టెన్ షాదాబ్ ఖాన్ (12), ఇఫ్తికార్ అహ్మద్ (22), ఖుష్దిల్ (0), ఆసిఫ్ అలీ (14), నవాజ్ (10) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఆఖర్లో మహ్మద్ వసీమ్ జూనియర్ (16 బంతుల్లో 26; 3 ఫోర్లు, సిక్స్) వేగంగా పరుగులు సాధించడంతో పాక్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లలో విల్లే 2 వికెట్లు పడగొట్టగా.. బెన్ స్టోక్స్, సామ్ కర్రన్, క్రిస్ జోర్డాన్, లివింగ్‌స్టోన్ తలో వికెట్ సాధించారు. -
జాసన్ రాయ్‌కు షాకిచ్చిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు!
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు 2022-23 సీజన్‌కుగానూ సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాను మంగళవారం ప్రకటించింది. ఇంగ్లండ్ పవర్ హిట్టర్ లియామ్ లివింగ్‌స్టోన్, బెన్ ఫోక్స్ తొలి సారి సెంట్రల్ కాంట్రాక్ట్(ఫుల్‌టైమ్)ను పొందారు. అదే విధంగా ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ జాసన్ రాయ్ తొలిసారి తన సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయాడు. అయితే, అతడికి ఇంక్రిమెంట్ కాంట్రాక్ట్ లిస్టులో చోటు దక్కింది. కాగా రాయ్ గత కొంతకాలంగా ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బందిలను ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో అతడిని డిమోట్ చేయడం గమనార్హం. ఇక ఈ సీజన్‌కు గానూ మొత్తం 30 మంది ఆటగాళ్లకు సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో చోటు దక్కింది. అందులో 18 మందికి ఫుల్ టైమ్కాంట్రాక్ట్ , ఆరుగురికి ఇంక్రిమెంట్ కాంట్రాక్ట్, మరో ఆరుగురుకి పేస్ బౌలింగ్ డెవలప్మెంట్ కాంట్రాక్ట్ లభించింది. కాగా జాసన్ రాయ్‌తో పాటు డోమ్ బెస్, రోరీ బర్న్స్, క్రిస్ జోర్డాన్, టామ్ కర్రాన్ కూడా తమ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయారు. ఇంగ్లండ్ సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్స్: మొయిన్ అలీ (వార్విక్షైర్), జేమ్స్ ఆండర్సన్ (లంకాషైర్), జోఫ్రా ఆర్చర్ (ససెక్స్), జోనాథన్ బెయిర్‌స్టో (యార్క్‌షైర్) స్టువర్ట్ బ్రాడ్ (నాటింగ్‌హామ్‌షైర్) జోస్ బట్లర్ (లంకాషైర్) జాక్ క్రాలే (కెంట్) సామ్ కర్రాన్ (సర్రే) బెన్ ఫోక్స్ (సర్రే) జాక్ లీచ్ (సోమర్సెట్) లియామ్ లివింగ్‌స్టోన్ (లంకాషైర్) ఒల్లీ పోప్ (సర్రే) ఆదిల్ రషీద్ (యార్క్‌షైర్) ఆలీ రాబిన్సన్ (ససెక్స్) జో రూట్ (యార్క్‌షైర్) బెన్ స్టోక్స్ (డర్హామ్) క్రిస్ వోక్స్ (వార్విక్షైర్) మార్క్ వుడ్ (డర్హామ్). ఇంక్రిమెంట్ కాంట్రాక్టులు హ్యారీ బ్రూక్ (యార్క్‌షైర్), డేవిడ్ మలన్ (యార్క్‌షైర్) ,మాథ్యూ పాట్స్ (డర్హామ్), జాసన్ రాయ్ (సర్రే), రీస్ టోప్లీ (సర్రే) ,డేవిడ్ విల్లీ (నార్థాంప్టన్షైర్ 1 నవంబర్ 22 నుండి). ఇంగ్లండ్ పేస్ బౌలింగ్ కాంట్రాక్టులు: బ్రైడన్ కార్సే (డర్హామ్) మాథ్యూ ఫిషర్ (యార్క్‌షైర్) సాకిబ్ మహమూద్ (లంకాషైర్) క్రెయిగ్ ఓవర్టన్ (సోమర్సెట్) జామీ ఓవర్టన్ (సర్రే) ఒల్లీ స్టోన్ (1 నవంబర్ 22 నుండి నాటింగ్‌హామ్‌షైర్) చదవండి: T20 World Cup 2022: ఒకే ఇన్నింగ్స్‌లో 11 మంది బౌలింగ్.. ఆశ్చర్యపరిచిన జింబాబ్వే కెప్టెన్ -
చెలరేగిన మొయిన్ అలీ.. రెచ్చిపోయిన లివింగ్‌స్టోన్
హండ్రెడ్ లీగ్ 2022లో బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ జట్టు హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది. సోమవారం ట్రెంట్ రాకెట్స్‌తో జరిగిన పోరులో ఆ జట్టు 7 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ట్రెంట్ రాకెట్స్ నిర్ణీత 100 బంతుల్లో 6 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేయగా.. బర్మింగ్‌హామ్ జట్టు మరో 14 బంతులు మిగిలుండగానే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ మొయిన్ అలీ ఆల్‌రౌండ్ షోతో (1/3; 28 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 52 పరుగులు), లివింగ్‌స్టోన్ (32 బంతుల్లో 51 నాటౌట్; ఫోర్, 4 సిక్సర్లు) మెరుపు అర్ధశతకంతో చెలరేగడంతో బర్మింగ్‌హామ్ సునాయాసంగా లక్ష్యాన్ని చేరుకుంది. బర్మింగ్‌హామ్ కోల్పోయిన 3 వికెట్లు లూక్ వుడ్ ఖాతాలో చేరాయి. అంతకుముందు డేనియల్ సామ్స్ (25 బంతుల్లో 55 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), గ్రెగరీ (22 బంతుల్లో 35 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రెచ్చిపోవడంతో ట్రెంట్ రాకెట్స్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆ జట్టులోని భారీ హిట్టర్లు అలెక్స్ హేల్స్ (1), డేవిడ్ మలాన్ (9), మన్రో (11) దారుణంగా నిరాశపరిచారు. బర్మింగ్‌హామ్ బౌలర్ హోవెల్ 3 వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో బర్మింగ్‌హామ్ 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకగా.. ప్రస్తుత ఎడిషన్‌లో తొలి ఓటమి చవిచూసిన ట్రెంట్ రాకెట్స్ నాలుగో స్థానానికి పడిపోయింది. 4 మ్యాచ్‌ల్లో 4 విజయాలు సాధించిన లండన్ స్పిరిట్ ఈ జాబితాలో టాప్ ప్లేస్‌లో ఉండగా.. ఓవల్ ఇన్విన్సిబుల్ (4 మ్యాచ్‌ల్లో 3 విజయాలు) ఆతర్వాతి స్థానంలో నిలిచింది. నార్త్రన్ సూపర్ చార్జర్స్ (4 మ్యాచ్‌ల్లో ఒక్క విజయం), సథరన్ బ్రేవ్ (4 మ్యాచ్‌ల్లో ఒక్క విజయం), మాంచెస్టర్ ఒరిజినల్స్ (3 మ్యాచ్‌ల్లో 3 పరాజయాలు), వెల్ష్ ఫైర్ (3 మ్యాచ్‌ల్లో 3 పరాజయాలు) వరుసగా 5 నుంచి 8 స్థానాల్లో ఉన్నాయి. చదవండి: ఇంగ్లండ్ యువ బ్యాటర్ విధ్వంసం.. ఫాస్టెస్ సెంచరీ రికార్డు బద్దలు -
చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ బ్యాటర్.. హండ్రెడ్ లీగ్‌లో శతక్కొట్టిన తొలి ఆటగాడిగా రికార్డు
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిర్వహించే ద హండ్రెడ్ లీగ్ కాంపిటీషన్లో తొలి శతకం నమోదైంది. 2022 ఎడిషన్‌లో భాగంగా బర్మింగ్‌హామ్ ఫీనిక్స్కు చెందిన 20 ఏళ్ల యువ బ్యాటర్ విల్ స్మీడ్ లీగ్‌లో తొట్ట తొలి సెంచరీ సాధించి రికార్డుల్లోకెక్కాడు. అంతకుముందు సహచర ఆటగాడు, పంజాబ్ కింగ్స్ (ఐపీఎల్) ప్లేయర్ లియామ్ లివింగ్‌స్టోన్ చేసిన 92 పరుగులే హండ్రెడ్ లీగ్ అత్యధిక వ్యక్తిగత స్కోర్‌గా ఉండింది. నిన్న (ఆగస్ట్ 10) సథరన్ బ్రేవ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్మీడ్ ఈ ఘనత సాధించాడు. First 💯 in #TheHundred = @CazooUK Match Hero 🏅 👏 @will_smeed 👏 pic.twitter.com/bTqyqrSSsT — The Hundred (@thehundred) August 10, 2022 స్మీడ్.. 50 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో విధ్వంసకర శతకం నమోదు చేశాడు. ఫలితంగా అతను ప్రాతినిధ్యం వహిస్తున్న బర్మింగ్‌హామ్ జట్టు 53 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఫీనిక్స్ జట్టు నిర్ణీత 100 బంతుల్లో 4 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేయగా.. ఛేదనలో హెన్రీ బ్రూక్స్ (5/25), కేన్ రిచర్డ్సన్ (3/19) ధాటికి ప్రత్యర్ధి సథరన్ బ్రేవ్ 123 పరుగులకే చాపచుట్టేసింది. ఫీనిక్స్ ఇన్నింగ్స్‌లో స్మీడ్ అజేయమైన సెంచరీ బాదగా, లివింగ్‌స్టోన్ (20 బంతుల్లో 21; ఫోర్, సిక్స్) పర్వాలేదనిపించాడు. సథరన్ బ్రేవ్ బౌలర్లలో స్టొయినిస్, క్రిస్ జోర్డాన్, జేమ్స్ ఫుల్లర్, లిన్టాట్ తలో వికెట్ పడగొట్టారు.సథరన్ ఇన్నింగ్స్‌లో అలెక్స్ డేవిస్ (24 బంతుల్లో 33; 2 ఫోర్లు, సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కాగా, ప్రస్తుత ఎడిషన్‌లో బర్మింగ్‌హామ్ ఫీనిక్స్కు ఇది తొలి విజయం. మొత్తం 8 జట్లు పాల్గొంటున్న ఈ లీగ్‌లో ప్రస్తుతానికి లండన్ స్పిరిట్ 2 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. చదవండి: దంచికొట్టిన డేవిడ్ మలాన్.. దూసుకుపోతున్న ట్రెంట్ రాకెట్స్ -
టీ20ల్లో మొయిన్ అలీ అరుదైన రికార్డు.. ఇంగ్లండ్ తొలి ఆటగాడిగా!
బుధవారం బ్రిస్టల్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో ఇంగ్లండ్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 16 బంతుల్లోనే 2 ఫోర్లు, 6 సిక్సర్లతో అలీ హాఫ్ సెంచరీ సాధించాడు. తద్వారా అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ సాధించిన ఇంగ్లండ్ ఆటగాడిగా అలీ రికార్డులకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు పాకిస్తాన్‌పై 17 బంతుల్లో అర్థసెంచరీ సాధించిన లియామ్ లివింగ్‌స్టోన్ పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌లో లివింగ్‌స్టోన్ రికార్డును అలీ బద్దలు కొట్టాడు. ఇక ఈ ఘనత సాధించిన జాబితాలో మూడో స్ధానంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఉన్నాడు. అతడు న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాపై 21 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సౌతాఫ్రికాపై ఇంగ్లండ్ 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జానీ బెయిర్ ప్టో(90) పరుగులతో చేలరేగగా.. మొయిన్ అలీ(52) పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇక 235 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 193 పరుగులకే పరిమితమైంది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో ట్రిస్టన్ స్టాబ్స్( 28 బంతుల్లో 72 పరుగులు), రీజా హెండ్రిక్స్(57) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇంగ్లండ్ బౌలర్లలో రిచర్డ్ గ్లెసన్ 3, రీస్ టోప్లీ, ఆదిల్ రషీద్ రెండు వికెట్లు తీయగా.. మొయిన్ అలీ ఒక వికెట్ పడగొట్టాడు. చదవండి: Shikhar Dhawan: ప్రపంచకప్ జట్టులో ధావన్ ఉండాలి! అవసరం లేదు! -
అక్కడుంది లివింగ్‌స్టోన్.. 'కన్స్ట్రక్షన్ సైట్లోకి బంతి'
Liam Livingstone Hit 88 Meters Big Six.. మ్యాచ్ స్వరూపాన్ని క్షణాల్లో మార్చేయ గల సత్తా ఉన్న ఆటగాడు లయామ్ లివింగ్‌స్టోన్. ఈ ఇంగ్లండ్ క్రికెటర్ భారీ సిక్సర్లకు పెట్టింది పేరు. బంతిని కసితీరా బాదే లివింగ్‌స్టోన్ సిక్స్ కొట్టాడంటే స్టేడియం అవతల పడాల్సిందే. ఇప్పటికే ఇలాంటి సిక్సర్లు చాలానే చూశాం. తాజాగా టీమిండియాతో మూడో వన్డేలో లివింగ్‌స్టోన్ భారీ సిక్సర్లు బాదాడు. ఇన్నింగ్స్ 34వ ఓవర్లో హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో లివింగ్‌స్టోన్ కొట్టిన ఒక సిక్సర్ గ్రౌండ్కున్న ఫెన్నింగ్ ప్లేట్‌కు తగలడంతో పెద్ద బొక్క పడింది. ఆ తర్వాత ఇన్నింగ్స్ 36 ఓవర్లో మరోసారి హార్దిక్ బౌలింగ్‌కు వచ్చాడు. ఆ ఓవర్ తొలి బంతినే లివింగ్‌స్టోన్ డీప్ స్వ్కేర్‌లెగ్ మీదుగా భారీ సిక్సర్ సంధించాడు. 88 మీటర్ల ఎత్తులో వెళ్లిన ఆ బంతి నేరుగా స్టేడియం బయట ఉన్న కన్స్ట్రక్షన్ సైట్లో పడింది. అక్కడ పనిచేస్తున్న కార్మికులు బంతిని గ్రౌండ్లోకి విసిరేయడం విశేషం. ఇది గమనించిన హార్దిక్ లివింగ్స్టోన్వైపు చూస్తూ.. ''ఎంత పెద్ద సిక్స్'' అన్నట్లుగా నవ్వుతూ వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: Hasan Ali: అంతుపట్టని డ్యాన్స్‌తో అదరగొట్టిన పాక్ బౌలర్ -
బౌలర్లు అయిపోయారు.. పనిచేసేవాళ్లను కూడా వదిలిపెట్టవా!
భారీ సిక్సర్లకు పెట్టింది పేరు.. ఇంగ్లండ్ విధ్వంసకర ఆటగాడు లియామ్ లివింగ్‌స్టోన్. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరపున ప్రాతినిధ్యం వహించిన లివింగ్‌స్టోన్ సీజన్ మొత్తం భారీ సిక్సర్లతో అలరించాడు. తాజాగా అదే టెంపోను టి20 బ్లాస్ట్‌లోనూ కొనసాగిస్తున్నాడు. ఇంగ్లండ్ వేదికగ జరుగుతున్న విటాలిటీ టి20 బ్లాస్ట్‌లో లంకాషైర్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న లివింగ్‌స్టోన్ బౌలర్లను ఊచకోత కోస్తున్నాడు. ఏ మాత్రం జాలీ, దయ లేకుండా నిర్దాక్షిణ్యంగా భారీ సిక్సర్లు బాదుతు చుక్కలు చూపిస్తున్నాడు. ఇప్పటికే టోర్నీలో అత్యంత భారీ సిక్స్ లివింగ్‌స్టోన్ పేరిటే ఉంది. తాజాగా బుధవారం రాత్రి లంకాషైర్, డెర్బీషైర్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో లివింగ్‌స్టోన్ 46 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 75 పరుగులు చేశాడు. అయితే లివింగ్‌స్టోన్ కొట్టిన ఒక భారీ సిక్స్ స్టేడియం అవతల ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్న దగ్గరపడింది. అయితే బంతి ఎక్కడ పడింతో తెలియకపోడంతో ఆటకు కాసేపు అంతరాయం ఏర్పడింది. వర్క్‌లో ఉన్న బిల్డర్లు కూడా పని ఆపేసి బంతికోసం వెతికారు. చివరకు ఒక గుంత పక్కడ కనిపించడంతో బంతిని అందుకొని గ్రౌండ్లోకి విసిరేశారు. అప్పటికే కాచుకు కూర్చొన్న అంపైర్ పరిగెత్తుకెళ్లి బాల్‌ను తీసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. లివింగ్‌స్టోన్ విధ్వంసం దాటికి లంకాషైర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన డెర్బీషైర్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు మాత్రమే చేసి 17 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. డెర్బీషైర్ ఇన్నింగ్స్‌లో లూస్ డూ ప్లూయ్ 59, లుయిస్ రీస్ 55 పరుగులు చేశారు. చదవండి: Mayank Agarwal:'కెప్టెన్సీ భారం మంచి బ్యాటర్‌ను చంపేసింది' T20 Blast 2022: భారీ సిక్సర్.. బర్గర్ వ్యాన్‌లోకి దూసుకెళ్లిన బంతి Liam Livingstone is starting to tee off! 💥 Watch him bat LIVE ➡️ https://t.co/fvUbVrnZuz#Blast22 pic.twitter.com/tl6iEYZzZN — Vitality Blast (@VitalityBlast) June 1, 2022 Shoutout to the builders who helped retrieve the match ball 🤣#Blast22 https://t.co/1cKEDkFWVQ pic.twitter.com/wWGKexREW0 — Vitality Blast (@VitalityBlast) June 1, 2022 -
దటీజ్ లివింగ్‌స్టోన్.. బంతి స్టేడియం బయటకు వెళ్లాల్సిందే.. వీడియో వైరల్
ఐపీఎల్-2022లో భారీ సిక్సర్ బాదిన లియామ్ లివింగ్‌స్టోన్ ఇప్పుడు ఇంగ్లీష్ టీ20 బ్లాస్ట్‌లో అదరగొడుతున్నాడు. టీ20 బ్లాస్ట్‌లో లాంక్షైర్ తరపున లివింగ్‌స్టోన్ ఆడుతున్నాడు. ఇక టోర్నీలో భాగంగా శుక్రవారం యార్క్‌షైర్‌తో జరగిన మ్యాచ్‌లో లివింగ్‌స్టోన్ భారీ సిక్సర్ కొట్టాడు. లాంక్షైర్ ఇన్నింగ్స్ 12 ఓవర్ వేసిన మాథ్యూ రెవిస్ బౌలింగ్‌లో అఖరి బంతికి లివింగ్‌స్టోన్ కొట్టిన సిక్స్ స్టేడియం బయట పడింది. ఇందుకు సంబంధించిన వీడియోను టీ20 బ్లాస్ట్ మేనేజేమెంట్ ట్విటర్లో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో 16 బంతులు ఎదుర్కొన్న లివింగ్‌స్టోన్ 23 పరుగులు చేసి ఔటయ్యాడు. కాగా ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడిన లివింగ్‌స్టోన్ 117 మీటర్ల భారీ సిక్స్ బాదాడు. చదవండి: RCB Tweet On RR: రాజస్తాన్‌కు ఆర్సీబీ విషెస్.. గుండెల్ని మెలిపెట్టే ట్వీట్! హృదయాలు గెలిచారు! That. Is. Huge. 🔥 @liaml4893 🔥#Blast22 #RosesT20 pic.twitter.com/FAAaWKg85P — Vitality Blast (@VitalityBlast) May 27, 2022 -
చరిత్ర సృష్టించిన ఐపీఎల్ 2022.. అత్యధిక సిక్సర్ల రికార్డు నమోదు
క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో ఐపీఎల్ 2022 సీజన్ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. సింగిల్ సీజన్లో అత్యధిక సిక్సర్ల రికార్డును (1000) 15వ ఐపీఎల్ ఎడిషన్ సొంతం చేసుకుంది. ఆదివారం సన్‌రైజర్స్-పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్ నమోదైంది. పంజాబ్ హిట్టర్ లివింగ్‌స్టోన్ సిక్సర్‌తో (1000వ సిక్సర్) ఐపీఎల్ 2022 సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఈ స్థాయిలో సిక్సర్లు నమోదవడం ఇదే తొలిసారి. 1000 sixes hit in this season of tata ipl.97 metre six by Liam Livingstone.First time in the history of ipl.Most sixes in any ipl season 1)1001* in ipl 2022(still playoffs left) 2)872 in ipl 2018 pic.twitter.com/HJAgD2rSR6 — Shreyans Subham (@ShreyansSubham2) May 22, 2022 అంతకుముందు 2018 సీజన్లో నమోదైన 872 సిక్సర్లు ఈ సీజన్ ముందు వరకు అత్యధికం కాగా, ప్రస్తుత సీజన్లో ఆ రికార్డు బద్దలైంది. ఈ సీజన్లో ప్లే ఆఫ్స్, ఫైనల్ కలిపి మరో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండటంతో మరో వంద సిక్సర్లు నమోదయ్యే అవకాశముంది. ఈ సీజన్ తొలి సిక్సర్‌ను సీఎస్కే బ్యాటర్ రాబిన్ ఉతప్ప బాదగా.. థౌజండ్ వాలా సిక్సర్‌ను లివింగ్‌స్టోన్ పేల్చాడు. ఈ సీజన్ లాంగెస్ట్ సిక్సర్ రికార్డు కూడా లివింగ్‌స్టోన్ పేరిటే నమోదై ఉండటం విశేషం. సీజన్ల వారీగా సిక్సర్ల వివరాలు: 2022 : 1001 (అత్యధికం) 2018 : 872 2009 : 506 (అత్యల్పం) 2022 సీజన్లో లాంగెస్ట్ సిక్సర్లు: లివింగ్‌స్టోన్ : 117 మీటర్లు టిమ్ డేవిడ్: 114 మీటర్లు డెవాల్డ్ బ్రెవిస్ : 112 మీటర్లు చదవండి: పంత్‌ను ఏకి పారేసిన రవిశాస్త్రి.. బ్రెయిన్ దొబ్బిందా అంటూ ఘాటు వ్యాఖ్యలు -
లివింగ్‌స్టోన్ విధ్వంసం.. చివరి పోరులో పంజాబ్ చేతిలో చిత్తైన సన్‌రైజర్స్
ముంబై: ఎనిమిది జట్లు పాల్గొన్న గత ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఎనిమిదో స్థానం... పది జట్లు పాల్గొన్న ఈసారి ఐపీఎల్‌లోనూ అదే స్థానం...అంతే తేడా, మిగతా అంతా సేమ్ టు సేమ్! మరోసారి అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తూ హైదరాబాద్ ఐపీఎల్ సీజన్‌ను పేలవంగా ముగించింది. టోర్నీపరంగా ప్రాధాన్యత కోల్పో యిన చివరి లీగ్ మ్యాచ్‌లో ఆదివారం పంజాబ్ కింగ్స్ 5 వికెట్లతో హైదరాబాద్‌ను ఓడించింది. ముందుగా సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (32 బంతుల్లో 43; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలవగా... రొమారియో షెఫర్డ్ (15 బంతుల్లో 26 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), వాషింగ్టన్ సుందర్ (19 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్), మార్క్రమ్ (21), రాహుల్ త్రిపాఠి (20) తలా ఓ చేయి వేశారు. పంజాబ్ బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హర్‌ప్రీత్ బ్రార్, ఎలిస్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం పంజాబ్ 15.1 ఓవర్లలో 160 పరుగులు చేసింది. లివింగ్‌స్టోన్ (22 బంతుల్లో 49 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరిపించగా, శిఖర్ ధావన్ (32 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. ఫజల్ హఖ్ ఫారూఖీకి 2 వికెట్లు దక్కాయి. -
బౌలర్‌ను చూసి బ్యాటింగ్ ఎండ్ మార్చుకున్న వార్నర్.. తొలి బంతికే ఔట్..
ఐపీఎల్-2022లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ గోల్డన్ డక్‌గా వెనుదిరిగాడు. లివింగ్‌స్టోన్ వేసిన తొలి ఓవర్ తొలి బంతికే వార్నర్.. రాహుల్ చాహర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. అయితే ఆసక్తికర విషయం ఏమిటింటే.. తొలి బంతిని ఎదర్కొనేందుకు సర్ఫరాజ్ ఖాన్ సిద్దమయ్యాడు. అయితే మయాంక్ అగర్వాల్ బంతిని లివింగ్‌స్టోన్ చేతికి ఇవ్వడంతో అఖరి నిమిషంలో వార్నర్ ఎండ్‌ను మార్చుకుని మొదటి బంతిని ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాడు. కాగా దురదృష్టవశాత్తూ వార్నర్ తొలి బంతికే ఔటయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: IPL 2022: కోల్‌కతా నైట్ రైడర్స్‌కు భారీ షాక్.. సీనియర్ ఆటగాడు దూరం..! #Warner changed ends seeing Livingstone but got out for golden duck 🤣 pic.twitter.com/e9uz3jeNiN — Vaishnavi Sawant (@VaishnaviS45) May 16, 2022 -
'లివింగ్‌స్టోన్ కంటే దినేష్ కార్తీక్ బెస్ట్ ఫినిషర్'
ఐపీఎల్-2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుకు దినేష్ కార్తీక్ బెస్ట్ ఫినిషర్‌గా మారగా.. పంజాబ్ కింగ్స్‌కు లియామ్ లివింగ్‌స్టోన్ అత్యత్తుమ ఫినిషర్గాఘున్నాడు. అయితే లివింగ్‌స్టోన్ కంటే దినేష్ కార్తీక్ బెస్ట్ ఫినిషర్ అని భారత మాజీ బౌలర్ ఆర్పీ సింగ్ అన్నాడు. కార్తీక్ ఆర్సీబీ జట్టును చాలా మ్యాచ్‌ల్లో గెలిపించినందున లివింగ్‌స్టోన్‌పై పైచేయి సాధించాడని ఆర్పీ సింగ్ తెలిపాడు. "అండర్-19 వరల్డ్‌కప్‌లో కార్తీక్ నా బ్యాచ్‌మేట్. అతడు అప్పుడు కూడా రనౌట్ అయ్యేవాడు. ఇప్పుడు కూడా అందులో ఎటువంటి మార్పులేదు. కార్తీక్ ఎక్కువగా ఆలోచించినప్పుడల్లా తప్పులు ఎక్కువ చేస్తాడు. కార్తీక్‌ది అటవంటి క్యారెక్టర్. కాబట్టి అతడికి ఆలోచించడానికి తక్కువ సమయం ఇవ్వండి. అతడు 10 లేదా 20 బంతులు మిగిలిఉన్నప్పడు అత్యుత్తమంగా బ్యాటింగ్ చేస్తాడు. అతడు చాలా ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేస్తాడు. అతడు అఖరిలో ప్రతీ బంతిని బౌండరీ బాదాలని చూస్తాడు. అతడి బాడీ లాంగ్వేజ్‌ని బట్టి మీకు తెలుస్తుంది. అఖరి ఓవర్లలో కార్తీక్ అత్యత్తుమ ఆటగాడు అని. ఇక అతడిని లియామ్ లివింగ్‌స్టోన్‌తో పోల్చినట్లయితే, కార్తీక్ అద్భుతమైన బ్యాటింగ్‌తో తన జట్టుకు చాలా విజయాలు అందించాడు. కాబట్టి లివింగ్‌స్టోన్ కంటే కార్తీక్ బెస్ట్ఫినిషర్ అని నేను భావిస్తున్నాను" అని ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్పీ సింగ్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2022: ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుడ్ న్యూస్.. యువ ఆటగాడు వచ్చేశాడు..! -
IPL 2022: పంజాబ్ బల్లే బల్లే...
ముంబై: ‘ప్లే ఆఫ్స్’ చేరే అవకాశాలు దాదాపు అసాధ్యంగా కనిపిస్తున్న దశలో పంజాబ్ కింగ్స్ కీలక విజయంతో మళ్లీ రేసులోకి వచ్చింది. ఏకపక్ష పోరులో బెంగళూరును చిత్తు చేసి ఆశలు నిలబెట్టుకుంది. మరోవైపు ముందంజ వేసేందుకు చేరువైన స్థితిలో ఈ భారీ పరాజయం ఆర్సీబీకి నష్టం కలిగించనుంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 54 పరుగుల తేడాతో బెంగళూరును ఓడించింది. ముందుగా పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. లివింగ్‌స్టోన్ (42 బంతుల్లో 70; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), బెయిర్‌స్టో (29 బంతుల్లో 66; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించగా, హర్షల్ పటేల్ (4/34) రాణించాడు. అనంతరం బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్ (22 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలవగా... రబడ (3/21) రాణించాడు. మెరుపు బ్యాటింగ్... 71 బంతుల్లో 136 పరుగులు... పంజాబ్ ఇన్నింగ్స్‌లో బెయిర్‌స్టో, లివింగ్‌స్టోన్ పాత్ర ఇది! మిగతా బ్యాటర్లంతా విఫలమైనా... ఈ ఇద్దరి దూకుడైన బ్యాటింగ్ కారణంగానే కింగ్స్ భారీ స్కోరు నమోదు చేయగలిగింది. ఆరంభంలో బెయిర్‌స్టో చెలరేగగా, ఆ తర్వాత లివింగ్‌స్టోన్ బాధ్యత తీసుకున్నాడు. హాజల్‌వుడ్ ఓవర్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టిన బెయిర్‌స్టో, సిరాజ్ ఓవర్లో 3 భారీ సిక్స్‌లు, ఒక ఫోర్‌తో దూసుకుపోయాడు. 21 బంతుల్లోనే అతని అర్ధసెంచరీ పూర్తి కాగా, 8.5 ఓవర్లలోనే స్కోరు 100 పరుగులకు చేరింది. శిఖర్ ధావన్ (21), రాజపక్స (1), మయాంక్ (19), జితేశ్ (9) విఫలమైనా లివింగ్‌స్టోన్ జోరు కొనసాగించాడు. షహబాజ్ ఓవర్లో వరుస బంతుల్లో 4, 6 కొట్టిన అతను హాజల్‌వుడ్ వేసిన 19వ ఓవర్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో పండగ చేసుకున్నాడు. 35 బంతుల్లో అతను హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. హాజల్‌వుడ్ ఈ మ్యాచ్‌తో ఐపీఎల్ చరిత్రలో బెంగళూరు తరఫున అత్యంత చెత్త బౌలింగ్ గణాంకాలు (0/64) నమోదు చేశాడు. సమష్టి వైఫల్యం... ఛేదనలో బెంగళూరు పూర్తిగా తడబడింది. ఆరంభంలో కొన్ని చక్కటి షాట్లు ఆడిన కోహ్లి (14 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్), డుప్లెసిస్ (10) ఒక పరుగు తేడాతో వెనుదిరగడంతో జట్టు పతనం మొదలైంది. లోమ్రోర్ (6) విఫలం కాగా, పటిదార్ (21 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కొద్దిసేపు పట్టుదల కనబర్చాడు. ఆ తర్వాత మ్యాక్స్‌వెల్ ఉన్నంత వరకు ఆర్సీబీ గెలుపుపై కాస్త ఆశలు పెట్టుకుంది. అయితే అతనితో పాటు దినేశ్ కార్తీక్ (11) కూడా తక్కువ వ్యవధిలో అవుట్ కావడంతో జట్టు వేగంగా ఓటమి దిశగా పయనించింది. ఐపీఎల్లో నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్ X కోల్‌కతా నైట్‌రైడర్స్ వేదిక: పుణే, రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం. -
IPL 2022: ఆ రికార్డు బద్దలు కొట్టాలి! 130 మీటర్లు.. నా లక్ష్యం అదే!
IPL 2022 DC Vs SRH: 35 బంతుల్లో 3 ఫోర్లు, ఆరు సిక్సర్లు- స్కోరు 67 నాటౌట్. ఓపెనర్ డేవిడ్ వార్నర్‌తో కలిసి 122 పరుగుల భాగస్వామ్యం. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ రోవ్‌మన్ పావెల్ నమోదు చేసిన గణాంకాలు ఇవి. ఐపీఎల్-2022తో క్యాష్ రిచ్ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వెస్టిండీస్ క్రికెటర్ పావెల్.. ఆరంభంలో కాస్త తడబడ్డా.. ఆ తర్వాత ఢిల్లీ విజయాల్లో భాగమవుతూ జట్టులో కీలక సభ్యుడిగా ఎదుగుతున్నాడు. ఇక గురువారం సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో విలువైన ఇన్నింగ్స్ ఆడాడు పావెల్. ముఖ్యంగా ఆఖరి ఓవర్లో రైజర్స్ స్పీడ్‌స్టర్ ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో ఈ హిట్టర్ ఒక సిక్సర్‌తో పాటు మూడు ఫోర్లు బాది సత్తా చాటాడు. ముఖ్యంగా గంటకు 157 కిలోమీటర్ల వేగంతో దూసుకువచ్చిన బంతిని సమర్థవంతగా ఎదుర్కొని బౌండరీ బాదిన తీరు అభిమానులను ఆకట్టుకుంది. ఇక 102 మీటర్ల సిక్సర్ చూసి ఢిల్లీ ఫ్యాన్స్ మురిసిపోయారు. ఇక తన మెరుపు ఇన్నింగ్స్ గురించి విజయానంతరం స్పందించిన పావెల్ సిక్సర్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 130 మీటర్ల భారీ సిక్సర్ కొడతానని ఊహించానని, అయితే ఇప్పుడు కాకపోయినా తదుపరి మ్యాచ్‌లోనైనా ఈ ఫీట్ నమోదు చేస్తానని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్ చరిత్రలో.. బిగ్గెస్ట్ సిక్స్ ఆల్బీ మోర్కెల్(125 మీటర్లు- 2008లో) పేరిట ఉంది. ఇక ఇటీవల పంజాబ్ కింగ్స్ ఆటగాడు లియామ్ లివింగ్‌స్టోన్ గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 117 మీటర్ల సిక్సర్ బాదాడు. వీరిద్దరిని అధిగమించి 130 మీటర్ల భారీ సిక్సర్ కొట్టాలని భావిస్తున్నట్లు పావెల్ పేర్కొనడం విశేషం. ఈ మేరకు అతడు మాట్లాడుతూ.. ‘‘నిన్న నేను 130 మీటర్ల సిక్సర్ కొడతాననే అనుకున్నా. మన్‌దీప్‌తో ఈ విషయం చెప్పాను. చూద్దాం ఏ జరుగుతుందో!’’ అని వ్యాఖ్యానించాడు. కాగా డేవిడ్ వార్నర్(92- నాటౌట్), పావెల్(67- నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్‌తో భారీ స్కోరు చేసిన ఢిల్లీ 21 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌పై విజయం సాధించింది. చదవండి👉🏾 David Warner: ‘ప్రతీకారం తీర్చుకున్న వార్నర్’.. ఆ ఒక్క మాట చాలు.. దెబ్బ అదుర్స్ కదూ! Century stand 👌 Clinical finish 💪 Pre-game rituals 🤔 Assistant Coach @ShaneRWatson33 joins batting stars @davidwarner31 & @Ravipowell26 to sum @DelhiCapitals' win over #SRH. 👍 👍 - By @RajalArora Full interview 📹 🔽 #TATAIPL | #DCvSRH https://t.co/jw1jHsvSlc pic.twitter.com/PyeJe5ciBX — IndianPremierLeague (@IPL) May 6, 2022 5⃣th win for @RishabhPant17 & Co. in the #TATAIPL 2022! 👏 👏 The @DelhiCapitals beat #SRH by 21 runs & return to winning ways. 👌 👌 #DCvSRH Scorecard ▶️ https://t.co/0T96z8GzHj pic.twitter.com/uqHvqJPu2v — IndianPremierLeague (@IPL) May 5, 2022 -
లివింగ్‌స్టోన్ విధ్వంసం.. ఐపీఎల్ 2022లోనే భారీ సిక్సర్.. వైరల్
IPL 2022 PBKS Vs GT: ఐపీఎల్-2022లో భాగంగా మంగళవారం(మే 3) గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఆటగాడు లియామ్ లివింగ్‌స్టోన్ ఈ సీజన్లోనే భారీ సిక్సర్ నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ పేసర్ మహ్మద్ షమీకి లివింగ్‌స్టోన్ చుక్కలు చూపించాడు. పంజాబ్ ఇన్నింగ్స్ 16 ఓవర్ వేసిన షమీ బౌలింగ్‌లో 3 సిక్స్‌లు, 2 ఫోర్లు బాది లివింగ్‌స్టోన్ ఏకంగా 28 పరుగులు రాబట్టాడు. ఈ ఓవర్లోనే తొలి బంతికి లివింగ్‌స్టోన్ 117 మీటర్ల భారీ సిక్స్ బాదాడు. తద్వారా ఈ ఏడాది ఐపీఎల్లో లాంగెస్ట్ సిక్స్ కొట్టిన ఆటగాడిగా లివింగ్‌స్టోన్ నిలిచాడు. కాగా ఈ మ్యాచ్‌లో 10 బంతుల్లోనే లివింగ్‌స్టోన్ 30 పరుగులు సాధించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతకు ముందు ముంబై ఇండియన్స్ యువ ఆటగాడు డెవాల్డ్ బ్రేవిస్ 112 మీటర్ల భారీ సిక్స్ బాదాడు. ఇక ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై పంజాబ్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చదవండి: ECS T20 League: 'నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం'.. అంటే ఇదేనేమో! 117 M six by Liam Livingstone @liaml4893 #PBKSvGT#liamlivingstone#liam#pbks pic.twitter.com/me6yLBhAdp — Rockstar Ravi Jadeja 🔥🔥 (@AadiSin28600239) May 3, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
పాక్ బౌలర్‌పై ప్రశంసలు కురిపించిన పంజాబ్ కింగ్స్ స్టార్ బ్యాటర్
Liam Livingstone Lauds Hasan Ali: ఇంగ్లండ్ కౌంటీల్లో చెలరేగిపోతున్న పాకిస్థాన్ బౌలర్ హసన్ అలీపై పంజాబ్ కింగ్స్ స్టార్ బ్యాటర్ లియామ్ లివింగ్‌స్టోన్ ప్రశంసల వర్షం కురిపించాడు. కౌంటీ ఛాంపియన్షిప్ 2022లో లాంకాషైర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న హసన్ అలీ గ్లోస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్లతో సత్తా చాటి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించడంతో లివింగ్‌స్టోన్ పాక్ పేసర్‌ని కొనియాడాడు. లివింగ్‌స్టోన్‌కు లాంకాషైర్ హోం టీమ్ కావడంతో హసన్ అలీ ప్రదర్శనను ఆకాశానికెత్తుతూ, తన జట్టు విజయం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. వాట్ ఎ సైనింగ్.. వాట్ ఎ విన్ అంటూ రెడ్ రోసెస్తో హసన్ అలీకి, లాంకాషైర్ జట్టుకు విషెస్ తెలిపాడు. What a signing… what a win 🌹🌹🌹 https://t.co/bqei0nZohb — Liam Livingstone (@liaml4893) April 24, 2022 కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్ వన్‌లో భాగంగా గ్లోస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో లాంకాషైర్ ఇన్నింగ్స్ 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు పడగొట్టిన హసన్.. లాంకాషైర్ విజయంలో కీలకంగా వ్యవహరించాడు. ఈ మ్యాచ్‌లో గ్లోస్టర్‌షైర్ తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులకు, రెండో ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు ఆలౌట్ కాగా.. లాంకాషైర్ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 556 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. లంకాషైర్ జట్టులో జోష్ బొహానన్ (231) డబుల్ సెంచరీతో చెలరేగగా, కెప్టెన్ డేన్ విలాస్ (109) సెంచరీతో సత్తా చాటాడు. చదవండి: అంపైర్‌తో వాగ్వాదం.. ఆ కోపాన్ని బౌలర్‌పై చూపించాడు -
అంపైర్‌తో వాగ్వాదం.. ఆ కోపాన్ని బౌలర్‌పై చూపించాడు
ఇంగ్లండ్ విధ్వంసకర ఆటగాడు లియామ్ లివింగ్‌స్టోన్ ఐపీఎల్ 2022లో సూపర్ ఫామ్‌ను కనబరుస్తున్నాడు. పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న లివింగ్‌స్టోన్ మెరుపు బ్యాటింగ్‌కు పెట్టింది పేరు. భారీ సిక్సర్లు అవలీలగా బాదే లివింగ్‌స్టోన్ తాజాగా ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లోనూ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 33 బంతుల్లోనే 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 60 పరుగులు చేసి ఔటయ్యాడు. పంజాబ్ కింగ్స్ 150 పరుగులు మార్క్ సాధించిందంటే అదంతా లివింగ్‌స్టోన్ ఇన్నింగ్స్ కారణం అని చెప్పొచ్చు. అయితే ఇన్నింగ్స్ 12వ ఓవర్లో ఉమ్రాన్ మాలిక్ వేసిన బంతిపై అభ్యంతరం తెలిపిన లివింగ్‌స్టోన్ ఫీల్డ్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. ఉమ్రాన్ మాలిక్ వేసిన ఆ ఓవర్ మూడో బంతిని లివింగ్‌స్టోన్ భారీ సిక్స్‌గా మలిచాడు. అయితే తన తర్వాతి బంతిని బౌన్సర్ వేసి లివింగ్‌స్టోన్‌కు పంచ్ ఇచ్చాడు. అయితే ఫీల్డ్ అంపైర్ దానిని బౌన్సర్ అని హెచ్చరించలేదు. ఇది చూసిన లివింగ్‌స్టోన్.. అంపైర్ వద్దకు వెళ్లి.. బౌన్సర్ కదా వార్నింగ్ ఇవ్వరా అంటూ అంపైర్లను అడిగాడు. కానీ ఫీల్డ్ అంపైర్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో కోపంతో క్రీజులోకి వెళ్లిన లివింగ్‌స్టోన్ తన ఆగ్రహాన్ని ఉమ్రాన్‌పై చూపించాడు. దాదాపు అదే తరహాలో వేసిన ఫుల్‌టాస్ బంతిని బౌండరీ తరలించాడు. అయితే నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న షారుక్ ఖాన్ కిందకు వంగడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ తర్వాతి లివింగ్‌స్టోన్ షారుక్ ఖాన్ వద్దకు రాగా..''వామ్మో బతికిపోయా అన్నట్లుగా'' షారుక్ లుక్ ఇవ్వడం వైరల్‌గా మారింది. చదవండి: SRH vs PBKS: పంజాబ్ కింగ్స్ కెప్టెన్ ఆడకపోవడంపై ధావన్ క్లారిటీ Something between Livingstone - Umpire pic.twitter.com/dMDNL9piPz — Big Cric Fan (@cric_big_fan) April 17, 2022 -
'కొంచెం జాగ్రత్తగా ఉంటే వేరుగా ఉండేది.. తప్పు చేశావ్'
ఐపీఎల్ 2022 గుజరాత్ టైటాన్స్‌కు తొలి సీజన్. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ఈ జట్టు తన ప్రదర్శనతో బాగానే ఆకట్టుకుంటుంది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ మంచి విజయాలు సాధించిన గుజరాత్ టైటాన్స్ పంజాబ్ కింగ్స్‌తో తలపడుతుంది. కాగా మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. లియామ్ లివింగ్‌స్టోన్ 27 బంతుల్లోనే 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 64 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. అయితే లివింగ్‌స్టోన్ 14 పరుగుల వద్దే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఇన్నింగ్స్ 9వ ఓవర్ రషీద్ ఖాన్ వేయగా.. ఓవర్ నాలుగో బంతిని డీప్ మిడ్‌వికెట్ మీదుగా భారీ షాట్ ఆడాడు. బౌండరీకి కొద్ది దూరంలో ఉన్న హార్దిక్ పరిగెత్తుకొచ్చి అద్బుతంగా క్యాచ్ అందుకున్నాడు. అప్పటికే బౌండరీ లైన్‌కు చేరువగా రావడంతో బంతిని గాల్లోకి విసిరాడు. అయితే మళ్లీ అందుకునే లోపే బౌండరీలైన్‌ను తాకాడు. అయితే హార్దిక్ మాత్రం లివింగ్‌స్టోన్ ఔటయ్యాడని సంబరాలు చేసుకున్నాడు. కానీ ఔట్ విషయమై అంపైర్ థర్డ్‌అంపైర్‌కు రిఫర్ చేశాడు. రిప్లేలో హార్దిక్ రెండోసారి క్యాచ్ అందుకునే సమయంలో బౌండరీ లైన్ తాకినట్లు కనిపించింది. దీంతో అంపైర్ సిక్స్ ప్రకటించాడు. అలా 15 పరుగుల వద్ద బతికిపోయిన లివింగ్‌స్టోన్ ఆ తర్వాత విధ్వంసం సృష్టించాడు. ఆ తర్వాత అతను ఆడిన 18 బంతుల్లో 49 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యాను అభిమానులు ట్రోల్ చేశారు. ''ఎంత పని జరిగే.. కాస్త జాగ్రత్తగా ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది.. తప్పు చేశావ్ హార్దిక్ పాండ్యా'' అంటూ కామెంట్ చేశారు. చదవండి: Mayank Agarwal: 'బాబుపై కెప్టెన్సీ ప్రభావం గట్టిగా ఉంది.. తొలగిస్తే ఆడతాడేమో!' #IPL2022 #GTvsPBKS pic.twitter.com/Zhw9f4CXo0 — Big Cric Fan (@cric_big_fan) April 8, 2022 -
ఐపీఎల్ 2022: 8 మ్యాచ్‌ల హైలైట్స్
-
వావ్ వాటే క్యాచ్.. సింగిల్ హ్యాండ్‌తో.. వీడియో వైరల్
ఐపీఎల్-2022లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఆటగాడు లియామ్ లివింగ్‌స్టోన్ అద్భుతమైన క్యాచ్‌తో మెరిశాడు. సీఎస్కే ఇన్నింగ్స్ 15 ఓవర్ వేసిన లివింగ్ స్టోన్ బౌలింగ్‌లో.. డ్వేన్ బ్రావో ఢిపెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి బౌలర్ దిశగా వెళ్లడంతో లివింగ్‌స్టోన్ డైవ్ చేస్తూ ఒంటి చేత్తో అద్భుతమైన రిటర్న్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో ఒక్క సారిగా బ్రావో షాక్‌కు గురైయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో లివింగ్‌స్టోన్ ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచాడు. తొలుత బ్యాటింగ్‌లో 60 పరుగులు చేసిన లివింగ్ స్టోన్.. బౌలింగ్‌లో రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. చెన్నైసూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 54 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. Liam Livingstone is living a dream! What a catch!#csk #CSKvsPBKS #LiamLivingstone pic.twitter.com/ClRCbTlgpJ — Ashish Pareek (@pareektweets) April 3, 2022 -
IPL 2022: 100 మీటర్లు దాటితే 8 పరుగులు.. మూడు డాట్ బాల్స్ ఆడితే ఔట్..!
Chahal Trolls Aakash Chopra: ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్ లియామ్ లివింగ్‌స్టోన్ ఆకాశమే హద్దుగా చెలరేగి 32 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 60 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో లివింగ్‌స్టోన్ కొట్టిన 5 సిక్సర్లలో ఒకటి 108 మీటర్ల దూరం ప్రయాణించి ప్రస్తుత సీజన్లో భారీ సిక్సర్‌గా రికార్డైంది. Three dot balls should be 1 wicket bhaiya 👀👀— Yuzvendra Chahal (@yuzi_chahal) April 3, 2022 ఈ సిక్సర్ నేపథ్యంలో ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా ట్వీట్ చేస్తూ.. 100 మీటర్లు దాటిన సిక్సర్‌కు 8 పరుగులు ఇవ్వాలంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇందుకు రాజస్థాన్ రాయల్స్ బౌలర్ యుజ్వేంద్ర చహల్ తనదైన స్టైల్లో కౌంటరిచ్చాడు. 100 మీటర్లు దాటిన సిక్సర్‌కు 8 పరుగులిస్తే.. వరుసగా మూడు డాట్ బాల్స్ వేస్తే వికెట్ ఇవ్వాలంటూ రిప్లై ఇచ్చాడు. చహల్- ఆకాశ్ చోప్రా మధ్య జరిగిన ఈ సరదా సంభాషణపై మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనా "హాహాహా" అంటూ స్పందించాడు. 𝗛. 𝗨. 𝗠. 𝗢. 𝗡. 𝗚. 𝗢. 𝗨. 𝗦! 🔥 🔥1⃣0⃣8⃣ metres: That massive @liaml4893 SIX had a lot of air time, surely! 💪 💪 #TATAIPL | #CSKvPBKS | @PunjabKingsIPL Watch 🎥 🔽— IndianPremierLeague (@IPL) April 3, 2022 ఇదిలా ఉంటే, సీఎస్కేతో మ్యాచ్‌లో లివింగ్‌స్టోన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో(60, 2/25) చెలరేగడంతో పంజాబ్ కింగ్స్ 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ లివింగ్‌స్టోన్ మెరుపుల సాయంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. అనంతరం లివింగ్‌స్టోన్ బంతితోనూ రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. రాహుల్ చాహర్ (3/25), వైభవ్ అరోరా (2/21), రబాడ (1/28), అర్షదీప్ సింగ్ (1/13), ఓడియన్ స్మిత్ (1/14) బంతితో తమ పాత్రను న్యాయం చేశారు. సీఎస్కే ఇన్నింగ్స్‌లో శివమ్ దూబే (30 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఒక్కడే అర్ధ శతకంతో రాణించాడు. చదవండి: ఆహా ఏమా షాట్.. ! ఐపీఎల్ 2022లో భారీ సిక్సర్ బాదిన లివింగ్‌స్టోన్ -
ఆహా ఏమా షాట్.. ! ఐపీఎల్ 2022లో భారీ సిక్సర్ బాదిన లివింగ్‌స్టోన్
Liam Livingstone Hits Biggest Six Of IPL 2022: ఆదివారం (ఏప్రిల్ 3) చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ హిట్టర్ లియామ్ లివింగ్‌స్టోన్ (32 బంతుల్లో 60; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో లివింగ్‌స్టోన్ బాదిన ఐదు సిక్సర్లలో ఓ సిక్సర్ సీజన్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. చెన్నై బౌలర్ ముఖేశ్ చౌదరీ వేసిన 5వ ఓవర్ తొలి బంతికి లివింగ్ స్టోన్ బాదిన 108 మీటర్ల భారీ సిక్సర్.. ప్రస్తుత సీజన్లో అతి భారీ సిక్సర్‌గా రికార్డైంది. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ 104 మీటర్ల సిక్స్ కొట్టగా.. ఆ రికార్డును లివింగ్‌స్టోన్ బ్రేక్ చేశాడు. కాగా, ముఖేశ్ చౌదరీ వేసిన 5వ ఓవర్లో లివింగ్‌స్టోన్ రెండు సిక్సర్లు, మూడు బౌండరీలు బాది ఏకంగా 26 పరుగులు పిండుకున్నాడు. ఇదిలా ఉంటే, సీఎస్కేతో మ్యాచ్‌లో లివింగ్‌స్టోన్ (32 బంతుల్లో 60; 5 ఫోర్లు, 5 సిక్సర్లు; 2 వికెట్లు) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెలరేగడంతో పంజాబ్ కింగ్స్ 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ లివింగ్‌స్టోన్ మెరుపుల సాయంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. అనంతరం లివింగ్‌స్టోన్ బంతితోనూ రాణించి తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. రాహుల్ చాహర్ (3/25), వైభవ్ అరోరా (2/21), రబాడ (1/28), అర్షదీప్ సింగ్ (1/13), ఓడియన్ స్మిత్ (1/14) బంతితో తమ పాత్రను న్యాయం చేశారు. సీఎస్కే ఇన్నింగ్స్‌లో శివమ్ దూబే (30 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఒక్కడే అర్ధ శతకంతో రాణించాడు. చదవండి: చెన్నైపై ఆల్‌రౌండ్ పంజా -
IPL 2022: సిక్సర్లు ఎలా కొట్టాలంటే... చెబుతా.. నేను ఉన్నది అందుకేగా!
కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి... ఎన్ని ఫోర్లు బాది ఎంత వేగంగా వికెట్ల మధ్య పరుగెత్తినా టి20 క్రికెట్లో సిక్సర్ల మజాయే వేరు. ఇక క్రికెట్ వినోదం ఐపీఎల్లో అయితే నేరుగా గ్యాలరీల్లోకి పడే సిక్సర్లను మీటర్ల లెక్కన కొలిచి వాటి విలువను నిర్వాహకులు అమాంతం పెంచేస్తుంటారు. మరి అలాంటప్పుడు సిక్స్ కొట్టడం కూడా ఒక ప్రత్యేక కళగా గుర్తించి అందులో శిక్షణ ఇస్తే ఎలా ఉంటుంది. దీనికి ఈ సారి ఐపీఎల్లో సమాధానం లభించనుంది. తొలి సారి ఒక జట్టు కేవలం సిక్సర్ల కోసమే కోచ్‌ను పెట్టుకోవడం విశేషం. –సాక్షి క్రీడా విభాగం హెడ్ కోచ్, బ్యాటింగ్ కోచ్, బౌలింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్, మెంటార్, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్... ఇలా ఐపీఎల్ జట్ల ప్రధాన సహాయక సిబ్బంది జాబితా చూస్తే చాలా పెద్దదే. ఇప్పుడు ఇందులోకి మరో పాత్ర కూడా వచ్చి చేరింది. అదే పవర్ హిట్టింగ్ కోచ్. ఈ తరహా శిక్షణలో పేరుపొందిన ఇంగ్లండ్ మాజీ ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ జూలియన్ రాస్వుడ్ను పంజాబ్ కింగ్స్ 2022 లీగ్ సీజన్ కోసం ఎంచుకుంది. తమ టీమ్‌లో ఉన్న మయాంక్, బెయిర్‌స్టో, లివింగ్‌స్టోన్, ఒడెన్ స్మిత్, షారుఖ్ ఖాన్ వంటి హిట్టర్ల ఆటకు మరింత మెరుగులు దిద్ది ఫలితం రాబట్టాలని జట్టు ఆశిస్తోంది. ఏమిటీ భిన్నం... గతంలో బిగ్‌బాష్ లీగ్, కరీబియన్ ప్రీమియర్ లీగ్, ఇంగ్లండ్ కౌంటీల్లో పని చేసిన జూలియన్ రాస్వుడ్ ఐపీఎల్‌లోకి అడుగు పెట్టడం ఇదే తొలిసారి. కార్లోస్ బ్రాత్‌వైట్, బెన్ స్టోక్స్, స్యామ్ బిల్లింగ్స్ తమ సిక్సర్లు బాదే నైపుణ్యం పెంచుకోవడంలో అతను కీలక పాత్ర పోషించాడు. బౌలర్ గొప్పతనం, మంచి బంతా కాదా అనేది ఏమాత్రం పట్టించుకోరాదని, బలమంతా ఉపయోగించి బంతిని బాదడమే ఏకైక మంత్రమని అతను ఉపదేశిస్తాడు. ‘క్రీజ్‌లో బ్యాటర్ నిలబడిన తీరును బట్టి అతను ఎంత శక్తిని వాడగలడో తెలుస్తుంది. సంప్రదాయ శైలి షాట్లు ఆడే శరీరం, చేతుల సమన్వయం అనేది ఇక్కడ కుదరదు. నా దృష్టిలో ఈ రెండు వేర్వేరు. బేస్ బాల్ తరహాలో ఎడమ కాలు వెనక్కి వెళుతూ తుంటి భాగంపై భారం వేస్తే షాట్ కొట్టడం సులువవుతుంది. వెస్టిండీస్ ఆటగాళ్లు సహజంగానే ఇలాంటివి ఆడతారు. ఆ నైపుణ్యం లేనివారిని అందుకు అనుగుణంగా తీర్చిదిద్దడమే నా పని’ అని జూలియన్ వివరించాడు. 2008లో ఐపీఎల్ ప్రారంభమైన సమయంలోనే టెక్సాస్ రేంజర్ బేస్‌బాల్ లీగ్ చూసిన అతను అదే శైలిని టి20 క్రికెట్లోకి తీసుకొచ్చాడు. తనదైన శిక్షణ పద్ధతితో... పవర్ హిట్టింగ్ శిక్షణకు జూలియన్ భిన్నమైన పద్ధతిని అనుసరిస్తాడు. బరువైన బ్యాట్లు, బరువైన బంతులతో పాటు ఆటగాళ్లు చేతులు, మోచేతికి బరువైన వస్తువులు అమర్చి షాట్లు ఆడేలా ప్రోత్సహిస్తాడు. నడుము చుట్టూ తాళ్లు చుట్టు దానిని ఒక పోల్‌కు కట్టేసి ఇతర శరీర భాగాలను వాడకుండా కేవలం మోచేతి బలంతోనే షాట్లు సాధన చేయించడంలో జూలియన్ తన ప్రత్యేకత ప్రదర్శిస్తాడు. ‘బేస్‌బాల్‌తో పోలిస్తే క్రికెట్లో టెక్నిక్ కాస్త భిన్నమే అయినా బంతిని బలంగా బాదడమే మనకు కావాల్సింది. ఫలితం గురించి ఆలోచించకుండా పూర్తి శక్తిని ఉపయోగిస్తే టి20ల్లో అద్భుతాలు జరుగుతాయి’ అని జూలియన్ విశ్లేషించాడు. అతని మార్గనిర్దేశనంలో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు ఎలాంటి ప్రయోజనం పొందుతారో చూడాలి. 🎥 Our powerhouse Julian Woods has big plans for our big hitters 💥#SaddaPunjab #PunjabKings #TATAIPL2022 pic.twitter.com/8XVdltLu2O — Punjab Kings (@PunjabKingsIPL) March 14, 2022 It is Liam's world & we are just 𝗟𝗶𝘃𝗶𝗻𝗴 in it 😉 #SherSquad, excited to see him display his all-round skills? 🔥#SaddaPunjab #PunjabKings #TATAIPL2022 @liaml4893 pic.twitter.com/mp9KSPeiex — Punjab Kings (@PunjabKingsIPL) March 21, 2022 -
హిట్టర్లలతో సిద్దమైన పంజాబ్.. పూర్తి జట్టు ఇదే
ఐపీఎల్-2022 మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ కీలక ఆటగాళ్లను సొంతం చేసుకుంది. ఇంగ్లండ్ ఆల్ రౌండర్ లయమ్ లివింగ్ స్టోన్‌ను రూ. 11.50 కోట్లకు కొనుగోలు చేసింది. అదే విధంగా రబడాను 9.25 కోట్లకు, షారుఖ్ ఖాన్‌ను 9 కోట్లకు, ధావన్‌ను 8. 25 కోట్లకు సొంతం చేసుకుంది. ఇక జట్టులో 25 మంది ఆటగాళ్లు ఉండగా, అందులో భారత క్రికెటర్లు 18 మంది, విదేశీ ఆటగాళ్లు 7గురు ఉన్నారు. వీరిని వేలంలో కొనుగోలు చేయడానికి పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ రూ. 86 కోట్ల 55 లక్షలు ఖర్చు చేసింది. పంజాబ్ కింగ్స్ జట్టు మయాంక్ అగర్వాల్ : రూ. 12 కోట్లు లివింగ్‌స్టోన్: రూ. 11 కోట్ల 50 లక్షలు రబడ: రూ. 9 కోట్ల 25 లక్షలు షారుఖ్ ఖాన్: రూ. 9 కోట్లు ధావన్: రూ. 8 కోట్ల 25 లక్షలు బెయిర్‌స్టో: రూ. 6 కోట్ల 75 లక్షలు ఒడియన్ స్మిత్: రూ. 6 కోట్లు రాహుల్ చహర్: రూ. 5 కోట్ల 25 లక్షలు అర్శ్‌దీప్ సింగ్: రూ. 4 కోట్లు హర్‌ప్రీత్ బ్రార్: రూ. 3 కోట్ల 80 లక్షలు రాజ్ బావా: రూ. 2 కోట్లు వైభవ్ అరోరా: రూ. 2 కోట్లు నాథన్ ఎలిస్: రూ. 75 లక్షలు ప్రభ్‌సిమ్రన్: రూ. 60 లక్షలు రిషి ధావన్: రూ. 55 లక్షలు భానుక రాజపక్స: రూ. 50 లక్షలు సందీప్ శర్మ: రూ. 50 లక్షలు బెన్ని హోవెల్ : రూ. 40 లక్షలు ఇషాన్ పొరెల్ : రూ. 25 లక్షలు ప్రేరక్ మన్కడ్: రూ. 20 లక్షలు జితేశ్ శర్మ: రూ. 20 లక్షలు బల్తేజ్ సింగ్: రూ. 20 లక్షలు రితిక్ ఛటర్జీ: రూ. 20 లక్షలు అథర్వ తైడ్: రూ. 20 లక్షలు అన్శ్ పటేల్: రూ. 20 లక్షలు -
IPL 2022 Auction: అక్షరాలా రూ. 551 కోట్ల 70 లక్షలు
ఐపీఎల్‌కు ఆర్థిక మాంద్యం ఉండదని మరోసారి రుజువైంది. రెండు రోజుల పాటు సాగిన లీగ్ వేలంలో క్రికెటర్లను సొంతం చేసుకునేందుకు 10 ఫ్రాంచైజీలు హోరాహోరీగా పోటీ పడ్డాయి. గరిష్టంగా 217 స్థానాలకు ఆటగాళ్లను ఎంచుకునే అవకాశం ఉండగా అన్ని జట్లు కలిపి 204 మందితో సరిపెట్టాయి. ఇందులో భారత్ నుంచి 137 మంది ఉండగా... విదేశీ క్రికెటర్లు 67 మంది ఉన్నారు. 2022 సీజన్ వేలం కోసం అన్ని టీమ్‌లు కలిపి రూ. 551 కోట్ల 70 లక్షలు ఖర్చు చేయడం విశేషం. ఎప్పటిలాగే కొందరు ఆటగాళ్లకు అంచనాలకు మించిన అనూహ్య ధర పలకగా... మరికొందరు స్టార్లు ఆశ్చర్యకరంగా తక్కువ విలువతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపించకపోవడంతో మరికొందరు పెద్ద క్రికెటర్లు కూడా నిరాశగా చూస్తుండిపోవడం కూడా సహజ పరిణామంలా కనిపించింది. రెండో రోజు ఆదివారం సాగిన వేలంలో ఇంగ్లండ్ క్రికెటర్ లియామ్ లివింగ్‌స్టోన్‌ను అత్యధికంగా రూ. 11 కోట్ల 50 లక్షలకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఓవరాల్‌గా నలుగురు హైదరాబాద్ క్రికెటర్లు నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ, సీవీ మిలింద్, భగత్ వర్మ, రాహుల్ బుద్ధిలకు... ముగ్గురు ఆంధ్ర క్రికెటర్లు అంబటి రాయుడు, కేఎస్ భరత్, అశ్విన్ హెబర్‌లను వివిధ ఫ్రాంచైజీలు వేలంలో ఎంచుకున్నాయి. వేలానికే ముందే సిరాజ్‌ను బెంగళూరు ఎంచుకోగా... ఆశ్చర్యకరంగా టెస్టు క్రికెటర్ హనుమ విహారి పేరు కూడా వేలంలో వినిపించలేదు. వేలంతో క్రికెటర్ల విలువపై ఒక అంచనా ఏర్పడగా ఏప్రిల్–మేలో జరిగే టోర్నీలో ఆటగాళ్ల అసలు సత్తా ఏమిటో బయటపడుతుంది. బెంగళూరు: దక్షిణాఫ్రికా బ్యాటర్ ఎయిడెన్ మార్క్రమ్తో వేలం మొదలైంది. రూ. 1 కోటి బేస్‌ప్రైస్ కాగా, ముంబైతో పోటీ పడి చివరకు సన్‌రైజర్స్ దక్కించుకుంది. భారత ఆటగాడు అజింక్య రహానే కోసం ఎవరూ పోటీ పడకపోగా, కనీస ధర రూ.1 కోటితోనే కోల్‌కతా సొంతం చేసుకుంది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో ఉన్న మలాన్‌ను ఎవరూ పట్టించుకోలేదు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు లబుషేన్, ఫించ్, భారత టెస్టు బ్యాటర్ పుజారా కోసం ఎవరూ ఆసక్తి చూపించకపోగా...గత సీజన్ వరకు కోల్‌కతాకు కెప్టెన్‌గా ఉన్న ఇయాన్ మోర్గాన్ కోసం కూడా ఏ జట్టూ ముందుకు రాలేదు. ► ధాటిగా ఆడగల విండీస్ బ్యాటర్ ఒడెన్ స్మిత్ కోసం పోటీ బాగా సాగింది. రూ. 5.75 కోట్ల వరకు వచ్చి సన్‌రైజర్స్ తప్పుకోగా, రూ. 6 కోట్లకు పంజాబ్ సొంతం చేసుకుంది. ఇటీవల సొంతగడ్డపై భారత్‌ను ఇబ్బంది పెట్టిన దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ జాన్సెన్ కోసం అతని తొలి ఐపీఎల్ జట్టు ముంబై రూ. 4 కోట్ల వరకు బాగా ఆసక్తి చూపిం చింది. అయితే మరో 20 లక్షలు జోడించి హైదరాబాద్ అతడిని తీసుకుంది. గత సీజన్లో రూ. 9.25 కోట్లకు అమ్ముడుపోయిన కృష్ణప్ప గౌతమ్‌కు ఈ సారి రూ. 90 లక్షలు దక్కడం గమనార్హం. ► అండర్–19 ప్రపంచకప్ గెలిచిన జట్టు కెప్టెన్ యష్ ధుల్‌ను అతని సొంత నగరం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రూ. 50 లక్షలకు ఎంచుకుంది. ప్రపంచకప్ ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన అంగద్ రాజ్ బావాను పంజాబ్ సొంతం చేసుకుంది. ► ఇంగ్లండ్ పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ కోసం భారీ పోటీ సాగింది. గాయంతో అతను 2022లో ఆడే అవకాశం లేకపోయినా వచ్చే సీజన్లను దృష్టిలో పెట్టుకొని టీమ్‌లు పోటీ పడ్డాయి. రాజస్తాన్, హైదరాబాద్‌లతో పోటీ పడి చివరకు ముంబై రూ. 8 కోట్లకు దక్కించుకుంది. ► జమ్ము కశ్మీర్‌కు చెందిన 21 ఏళ్ల రసిఖ్ సలామ్‌ను రూ. 20 లక్షల బేస్‌ప్రైస్‌కు కోల్‌కతా ఎంచుకుంది. 2019లో ముంబై ఇండియన్స్ తరఫున అతను ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. అయితే ఆ తర్వాత వయసు తప్పుగా చూపించాడంటూ బీసీసీఐ అతనిపై రెండేళ్ల నిషేధం విధించింది. ముంబై ఇండియన్స్ రెండేళ్ల పాటు అతని బాధ్యత తీసుకొని రసిఖ్‌ను ముంబైకి రప్పించింది. అన్ని సౌకర్యాలూ కల్పించి ప్రాక్టీస్‌కు అవకాశం ఇస్తూ స్థానిక మ్యాచ్‌లు కూడా ఆడించింది. అయితే వేలంలో అతని పేరు వచ్చినప్పుడు మాత్రం ముంబై అసలు స్పందించనే లేదు! లివింగ్‌స్టోన్‌కు రూ. 11 కోట్ల 50 లక్షలు విధ్వంసక బ్యాటింగ్‌తో పాటు అటు ఆఫ్‌స్పిన్, ఇటు లెగ్‌స్పిన్ బౌలింగ్ వేయగల నైపుణ్యం లివింగ్‌స్టోన్ సొంతం. 165 టి20 మ్యాచ్‌లలో 144.29 స్ట్రయిక్‌రేట్ కాగా 2 సెంచరీలు, 23 అర్ధ సెంచరీలు అతని ఖాతాలో ఉన్నాయి. బౌలింగ్‌లోనూ మెరుగైన 7.86 ఎకానమీని అతను నమోదు చేశాడు. గత ఐపీఎల్లో రూ. 75 లక్షలకు రాజస్తాన్ తరఫున ఆడిన అతను 5 మ్యాచ్‌లలో 42 పరుగులే చేశాడు. అయితే ఏడాది కాలంగా అతని ఆటతీరు అద్భుతంగా మారిపోయింది. 2021లో టి20ల్లో 86 సిక్స్‌లు బాదిన అతను పాకిస్తాన్‌పై 43 బంతుల్లోనే 103 పరుగులు చేశాడు. ఓపెనింగ్ నుంచి ఏడో స్థానం వరకు ఎక్కడైనా ఆడగలడు. లివింగ్‌స్టోన్ ఆట గురించి బాగా తెలిసిన పంజాబ్ కింగ్స్ అనలిస్ట్ డాన్ వెస్టన్ కూడా అతడిని సొంతం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. రూ. 1 కోటి కనీస ధరతో మొదలైన లివింగ్‌స్టోన్ బిడ్డింగ్ ఆ తర్వాత దూసుకుపోయింది. వేలంలో ఒకరిని మించి మరొకరు మొత్తం ఐదు జట్లు అతని కోసం పోటీ పడ్డాయి. చివరకు పంజాబ్ రూ. 11 కోట్ల 50 లక్షలకు లివింగ్‌స్టోన్‌ను గెలుచుకుంది. ఐపీఎల్ చరిత్రలో స్టోక్స్ (రూ. 14 కోట్ల 50 లక్షలు), స్టోక్స్ (రూ. 12 కోట్ల 50 లక్షలు), టైమల్ మిల్స్ (రూ. 12 కోట్లు) తర్వాత అత్యధిక మొత్తం పలికిన ఇంగ్లండ్ ఆటగాళ్ల జాబితాలో అతను నాలుగో స్థానంలో నిలిచాడు. సింగపూర్ ఆటగాడు టిమ్ డేవిడ్ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. 85 మ్యాచ్‌ల టి20 కెరీర్లో 159.39 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు చేసిన డేవిడ్ గత ఏడాది బెంగళూరు టీమ్‌తో ఉన్నాడు. రూ.40 లక్షలతో ఢిల్లీ బిడ్ మొదలు పెట్టగా మరో నాలుగు జట్లు బరిలో నిలిచాయి. చివరకు అతడిని ముంబై ఎంచుకుంది. ముంబై ఇండియన్స్ చరిత్రలో ఒక విదేశీ ఆటగాడికి ఇచ్చిన అత్యధిక మొత్తం ఇదే కావడం విశేషం. అతను ఐదు లేదా ఆరో స్థానంలో ఆడతాడని ఓనర్ అంబానీ ప్రకటించాడు. టిమ్ డేవిడ్ తండ్రి రోడరిగ్ డేవిడ్‌ది ఆస్ట్రేలియా కాగా, ఉద్యోగరీత్యా అతను సింగపూర్‌కు వలస వచ్చాడు. రోడరిక్ కూడా సింగపూర్ జాతీయ జట్టు తరఫున ఆడాడు. సారీ రైనా..! 205 మ్యాచ్‌లు... 5,528 పరుగులు... ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగుల జాబితాలో నాలుగో స్థానం... అద్భుత ప్రదర్శనలతో చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో కీలక పాత్ర... ‘చిన్న తలా’ సురేశ్ రైనా సూపర్ కెరీర్ ముగిసినట్లే. వేలంలో రైనాను తీసుకోవడానికి చెన్నై సహా ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపించలేదు. ఇన్నేళ్లలో చెన్నైపై నిషేధం ఉన్న రెండేళ్లు మినహా (అప్పుడు గుజరాత్‌కు) మరే ఫ్రాంచైజీకి అతను ఆడలేదు. అతను రెగ్యులర్‌గా మ్యాచ్‌లు ఆడకపోవడం కూడా ప్రధాన కారణం. కనీసం బేస్‌ప్రైస్ వద్ద కూడా ఎవరూ పట్టించుకోలేదు. ఈ సీజన్ వేలంలో అమ్ముడుపోని కీలక ఆటగాళ్లలో స్టీవ్ స్మిత్, షకీబ్ అల్ హసన్, ఇయాన్ మోర్గాన్, ఇషాంత్ శర్మ, షమ్సీ, కేదార్ జాదవ్, గ్రాండ్‌హోమ్, గప్టిల్, కార్లోస్ బ్రాత్‌వైట్, పుజారా, హనుమ విహారి తదితరులు ఉన్నారు. -
భారీ ఇన్నింగ్స్‌లకు పెట్టింది పేరు.. అందుకే అంత ధర
ఐపీఎల్ మెగావేలం 2022లో తొలిరోజే స్టార్ ఆటగాళ్లంతా దాదాపు వేలంలోకి రావడంతో రెండోరోజు పెద్దగా చెప్పుకునే ఆటగాళ్లు కనిపించలేదు. అయితే రెండోరోజు వేలంలో ఇప్పటివరకు చూసుకుంటే అత్యధిక ధర పలికిన ఆటగాడు ఇంగ్లండ్ విధ్వంసకర ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్. ఈ ఇంగ్లండ్ ఆటగాడు మెగావేలంలో రూ.11.5 కోట్లకు పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. కాగా భారీ ఇన్నింగ్స్‌లకు పెట్టింది పేరైన లివింగ్‌స్టోన్ కోసం ప్రారంభం నుంచే పోటీ నెలకొంది. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్, ఎస్ఆర్హెచ్ మధ్య ఆసక్తికర పోరు నడిచింది. రూ. కోటి కనీస ధరతో బరిలోకి దిగిన లివింగ్‌స్టోన్‌ను ఇంత ధర పలుకుతాడని ఎవరు ఊహించలేదు. గతేడాది రాజస్తాన్ రాయల్స్‌కు ఆడిన లివింగ్‌స్టోన్ ఐపీఎల్ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడైన మూడో ఇంగ్లండ్ ఆటగాడిగా నిలిచాడు. ఇంతకముందు ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ రూ. 14 కోట్లకు రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్, రూ.12.5 కోట్లకు రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. ఆ తర్వాత టైమల్ మిల్స్‌ను ఆర్సీబీ రూ.12 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ ఫైనల్ చేరడంలో లివింగ్‌స్టోన్ కీలకపాత్ర పోషించాడు. జూలైలో ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన టి20 మ్యాచ్‌లో లివింగ్‌స్టోన్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. 42 బంతుల్లోనే 9 సిక్సర్లు, ఆరు ఫోర్లతో సెంచరీతో మెరిశాడు. అతని విధ్వంసకర ఆటతో ఇంగ్లండ్ టి20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇక బిగ్‌బాష్ లీగ్‌లోనూ పెర్త్ స్కార్చర్స్ తరపున లివింగ్‌స్టోన్ పలుమార్లు సంచలన ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈసారి వేలంలో భారీ ధరకు అమ్ముడైన లివింగ్‌స్టోన్ మెరుపులు మెరిపిస్తాడో లేదో చూడాలి. -
టి10 లీగ్‌లో లివింగ్‌స్టోన్ సంచలన ఇన్నింగ్స్
Liam Livingstone Smash 8 Sixes In T10 League Tourney.. యూఏఈ వేదికగా జరుగుతున్న టి10 లీగ్‌లో భాగంగా శనివారం నార్తన్ వారియర్స్, టీమ్ అబుదాబి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ లియామ్ లివింగ్‌స్టోన్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. 23 బంతుల్లోనే 2 ఫోర్లు, 8 సిక్సర్ల సహాయంతో లివింగ్‌స్టోన్ 68 పరుగులు సాధించాడు. ఇక మ్యాచ్‌లో టీమ్ అబుదాబి 21 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ అబుదాబి నిర్ణీత 10 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. లివింగ్‌స్టోన్ 68, ఫిలిప్ సాల్ట్ 29 పరుగులు మినహా మిగతావారు విఫలమ్యారు. అనంతరం బ్యాటింగ్ చేసిన నార్తన్ వారియర్స్ 10 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేయగలిగింది. నార్తన్ వారియర్స్ బ్యాటింగ్‌లో రోవ్‌మన్ పావెల్ 42 టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెన్నర్ లూయిస్ 35 పరుగులు చేశాడు. టీమ్ అబుదాబి బౌలింగ్‌లో నవీన్ ఉల్ హక్, డాని బ్రిగ్స్, మర్చంట్ డీ లాంజ్ తలా రెండు వికెట్లు తీశారు. చదవండి: chris gayle: క్రిస్ గేల్ విధ్వంసం.. కేవలం 23 బంతుల్లోనే.. -
T20 World Cup: అసలు పోటీకి ముందు.. ఇంగ్లండ్‌కు భారీ షాక్!
Liam Livingstone Injury: టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో తమ ప్రయాణానికి ముందు ఇంగ్లండ్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియాతో జరిగిన సోమవారం నాటి వార్మప్ మ్యాచ్ సందర్భంగా... ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ తీవ్రంగా గాయపడ్డాడు. భారత జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 16వ ఓవర్లో జోర్డాన్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ షాట్ ఆడాడు. బంతిని ఒడిసిపట్టడంలో విఫలమైన లివింగ్‌స్టోన్ చేతి వేలికి గాయమైంది. దీంతో అతడు మైదానాన్ని వీడాడు. లివింగ్‌స్టోన్ స్థానంలో... సామ్ బిల్లింగ్స్ గ్రౌండ్లోకి వచ్చాడు. ఈ నేపథ్యంలో 24 గంటలు గడిస్తే గానీ.. లివింగ్‌స్టోన్ గాయం గురించి ఏమీ చెప్పలేమని ఇంగ్లండ్ జట్టు అధికార ప్రతినిధి వెల్లడించారు. దీంతో.. అక్టోబరు 23న డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉంటాడో లేదోనన్న అంశంపై స్పష్టత లేకుండా పోయింది. కాగా వార్మప్ మ్యాచ్‌లో లివింగ్‌స్టోన్ 2 ఓవర్లలో 10 పరుగులు మాత్రమే ఇచ్చి వికెట్ తీసి సత్తా చాటాడు. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్లు కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ విజృంభించడంతో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇదిలా ఉండగా.. బుధవారం న్యూజిలాండ్‌తో ఇంగ్లండ్ ఆఖరి వార్మప్ మ్యాచ్ ఆడనుంది. చదవండి: T20 World Cup: సంభాషణలు ఇలాగే ఉంటాయి మరి.. కోహ్లి, ధోని ఫొటో వైరల్! ఇంగ్లండ్- సూపర్ 12, గ్రూప్-1 ఇయాన్ మోర్గాన్, మొయిన్ అలీ, జొనాథన్ బెయిర్‌స్టో, సామ్ బిల్లింగ్స్, జోస్ బట్లర్, టామ్ కరన్, క్రిస్‌జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, జేసన్‌రాయ్, డేవిడ్ విల్లే, క్రిస్ వోక్స్, మార్క్‌వుడ్. రిజర్వు ప్లేయర్లు: లియామ్ డాసన్, జేమ్స్ విన్స్, రీస్ టోప్లే. Victory for @BCCI in our #T20WorldCup warm-up 🏏 Up next, @BLACKCAPS 🇳🇿#EnglandCricket pic.twitter.com/MeVAz4AJeC — England Cricket (@englandcricket) October 18, 2021 -
ఐర్లాండ్ ఆటగాడి సిక్సర్ల వర్షం.. సదరన్ బ్రేవ్దే 'హండ్రెడ్ మెన్స్'
లార్డ్స్: ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) తొలిసారి నిర్వహించిన హండ్రెడ్ మెన్స్ కాంపిటీషన్ 2021 టైటిల్‌ను సదరన్ బ్రేవ్ సొంతం చేసుకుంది. బర్మింగ్హమ్ ఫోనిక్స్‌తో జరిగిన ఫైనల్లో 32 పరుగుల తేడాతో విజయం సాధించిన సదరన్ బ్రేవ్ తొలి చాంపియన్‌గా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన సదరన్ బ్రేవ్.. ఐర్లాండ్ ఆటగాడు.. ఓపెనర్ పాల్ స్టిర్లింగ్( 36 బంతుల్లో 61;6 సిక్సర్లు, 2 ఫోర్లు) సిక్సర్ల వర్షానికి తోడూ.. చివర్లో రాస్ విట్లీ(19 బంతుల్లో 44 పరుగులు) విధ్వంసం సృష్టించడంతో 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. చదవండి: మహిళల ‘హండ్రెడ్’ విజేత ఓవల్ ఇన్విన్సిబుల్స్ అనంతరం బ్యాటింగ్ చేసిన బర్మింగ్హమ్ ఫోనిక్స్ నిర్ణీత 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 135 పరుగులు మాత్రమే చేయగలిగింది. సెమీస్ హీరో లియామ్ లివింగ్స్టన్(19 బంతుల్లో 44; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మరోసారి మెరుపులు మెరిపించినప్పటికి జట్టును గెలిపించలేకపోయాడు. చివర్లో బెంజమిన్ 23, బెన్నీ హౌవెల్ 20 నాటౌట్‌గా నిలిచారు. ఇక సదరన్ బ్రేవ్ బౌలింగ్‌లో జార్జ్ గార్టన్, క్రెగ్ ఓవర్టన్, టైమెల్ మిల్స్, జేక్ లిన్టోట్ తలా ఒక వికెట్ తీశారు. అద్భుత ఇన్నింగ్స్‌తో సదరన్ బ్రేవ్ టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన స్టిర్లింగ్‌కు ''మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'' వరించగా.. టోర్నీ ఆద్యంతం నిలకడగా రాణించిన లియాయ్ లివింగ్స్టన్ ''ప్లేయర్ ఆఫ్ ది సిరీస్''గా నిలిచాడు. చదవండి: Manan Sharma: భారత క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఢిల్లీ ఆల్‌రౌండర్ -
స్టన్నింగ్ క్యాచ్ పట్టావ్.. క్రికెటర్ అయితే బాగుండు
లండన్: ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న హండ్రెడ్ టోర్నీ చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటికే లియామ్ లివింగ్‌స్టోన్ సిక్సర్ల హోరుతో బర్మింగ్హమ్ ఫోనిక్స్ ఫైనల్‌కు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ మ్యాచ్‌లో లివింగ్‌స్టోన్ 10 సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోశాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. లివింగ్స్టన్ కొట్టిన ఒక భారీ సిక్స్‌ను మ్యాచ్‌ను చూడడానికి వచ్చిన ప్రేక్షకుడు అద్బుత క్యాచ్‌గా అందుకున్నాడు. బంతి స్టాండ్స్‌లోకి రావడంతో ఆ వ్యక్తి లేచి దానిని అందుకునే ప్రయత్నంలో సీటు నుంచి పక్కకు పడిపోయాడు. అయినా పట్టువిడవకుండా డైవ్ చేస్తూ సూపర్‌గా అందుకున్నాడు. ఇంకేముంది ప్రపంచాన్ని జయించానన్నట్లుగా అతను ఇచ్చిన హావభావాలు సూపర్‌గా ఉన్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ ఛార్జర్స్ జట్టుకు ఓపెనర్లు క్రిస్ లిన్(25 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), టామ్ కోహ్లర్(44 బంతుల్లో 71; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) శుభారంభాన్ని అందించారు. వీరు మినహా జట్టు సభ్యులంతా విఫలం కావడంతో సూపర్ ఛార్జర్స్ జట్టు నిర్ణీత 100 బంతుల్లో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. అనంతరం 144 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఫీనిక్స్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ విల్ స్మీడ్ ఖాతా తెరవకుండానే అవుటయ్యాడు. అయితే అప్పుడే క్రీజులోకి వచ్చిన కెప్టెన్ లివింగ్‌స్టోన్ వచ్చీ రాగానే బౌలర్లపై విరుచుకుపడుతూ సిక్సర్ల వర్షం కురిపించాడు. అతనికి న్యూజిలాండ్ యువ ఓపెనర్ ఫిన్ అలెన్(26 బంతుల్లో 42; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) తోడయ్యాడు. వీరిద్దరూ కలిసి 51 బంతుల్లో 106 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ఫీనిక్స్ జట్టు కేవలం 74 బంతుల్లోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. Great night of entertainment again in #TheHundred Only thing better than all of Liam Livingstone’s sixes have been the crowd catches at Headingley. Catch of the night here 👇🏻 pic.twitter.com/6oTte47nxp — Tom Hyland (@TomHyland4) August 17, 2021 -
లివింగ్‌స్టోన్ ఊచకోత.. 10 సిక్సర్లు, 3 ఫోర్లతో 92 నాటౌట్
లండన్: ద హండ్రెడ్ లీగ్‌లో భాగంగా నార్తర్న్ సూపర్ ఛార్జర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ కెప్టెన్, ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు లియామ్ లివింగ్‌స్టోన్ పెను విధ్వంసం సృష్టించాడు. 40 బంతుల్లో 10 భారీ సిక్సర్లు, 3 ఫోర్ల సాయంతో 92 పరుగులు సాధించి తన జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ఈ క్రమంలో అతను ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. అంతకుముందు బంతితోనూ(20 బంతుల్లో 3/25) దుమ్ముదులిపిన ఈ ఇంగ్లీష్ ఆల్‌రౌండర్.. ఒంటిచేత్తో తన జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ ఛార్జర్స్ జట్టుకు ఓపెనర్లు క్రిస్ లిన్(25 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), టామ్ కోహ్లర్(44 బంతుల్లో 71; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) శుభారంభాన్ని అందించారు. వీరు మినహా జట్టు సభ్యులంతా విఫలం కావడంతో సూపర్ ఛార్జర్స్ జట్టు నిర్ణీత 100 బంతుల్లో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. అనంతరం 144 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఫీనిక్స్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ విల్ స్మీడ్ ఖాతా తెరవకుండానే అవుటయ్యాడు. అయితే అప్పుడే క్రీజులోకి వచ్చిన కెప్టెన్ లివింగ్‌స్టోన్ వచ్చీ రాగానే బౌలర్లపై విరుచుకుపడుతూ సిక్సర్ల వర్షం కురిపించాడు. అతనికి న్యూజిలాండ్ యువ ఓపెనర్ ఫిన్ అలెన్(26 బంతుల్లో 42; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) తోడయ్యాడు. వీరిద్దరూ కలిసి 51 బంతుల్లో 106 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ఫీనిక్స్ జట్టు కేవలం 74 బంతుల్లోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుని గ్రాండ్‌గా ఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక, మరో సెమీఫైనల్ మ్యాచ్ ఆగష్టు 19న(గురువారం) సదరన్ బ్రేవ్స్, ట్రెంట్ రాకెట్స్ మధ్య జరగనుంది. చదవండి: టెస్ట్ ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చిన సిరాజ్, కేఎల్ రాహుల్ -
క్రికెట్ చరిత్రలో అతి భారీ సిక్స్.. కొడితే కనుచూపు మేరలో కనపడలేదు
Liam Livingstone Six: ఇంగ్లండ్, పాకిస్తాన్ మధ్య జరిగిన రెండో టీ20లో క్రికెట్ చరిత్రలోనే అతి భారీ సిక్స్ నమోదైంది. లీడ్స్‌లోని హెడింగ్లే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విధ్వంసకర యోధుడు లియామ్ లివింగ్‌స్టోన్ 122 మీటర్ల కంటే పొడవైన అతి భారీ సిక్సర్‌ను నమోదు చేశాడు. ఈ సిక్సర్ ఏకంగా మైదానాన్ని దాటి పక్కనే ఉన్న రగ్బీ పిచ్‌పై పడింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 16 వ ఓవర్లో పాక్ బౌలర్ హరీస్ రవూఫ్ వేసిన బంతిని లాంగాన్ మీదుగా గట్టిగా బాదడంతో అది కనుచూపు మేరలో కనబడలేదు. ఈ సిక్స్‌ను ప్రపంచంలోనే అత్యంత పొడవైన అతి భారీ సిక్సర్ అని వ్యాఖ్యాతలతోపాటు నెటిజన్లు అంటున్నారు. అయితే, ఈ సిక్స్ యొక్క అధికారిక పొడవును కొలవడం మాత్రం సాధ్యపడలేదు. కాగా, ఇలాంటి సిక్స్‌ను తాము ఇంతవరకు చూడలేదని స్కై స్పోర్ట్స్ కామెంట్రేటర్లుగా ఉన్న ఇయాన్ వార్డ్, కుమార సంగక్కర మ్యాచ్ అనంతరం వెల్లడించారు. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ) తమ అధికారిక ట్విట్టర్లో ఈ సిక్సర్ వీడియోని షేర్ చేసి 'ఇదేనా అతి భారీ సిక్స్?' అంటూ ప్రశ్నించింది. కాగా, ఈ మ్యాచ్‌లో బట్లర్ (59), మొయిన్ అలీ (36), లియామ్ లివింగ్‌స్టోన్ (38) చెలరేగడంతో ఆతిధ్య జట్టు 19.5 ఓవర్లలో 200 పరుగులకు ఆలౌటైంది. అనంతరం 201 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. షకీబ్ మహ్మద్, ఆదిల్ రషీద్, మొయిన్ అలీ తమ బౌలింగ్‌తో పాకిస్తాన్ కట్టడి చేశారు. ఈ విజయంతో 3 టీ20ల సిరీస్‌ను ఇంగ్లండ్ 1-1తో సమం చేసుకుంది. ఇదిలా ఉంటే, ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టీ20లోనూ లివింగ్‌స్టోన్ 42 బంతుల్లోనే శతకొట్టడం విశేషం. Biggest six ever?! 😱 @LeedsRhinos, can we have our ball back? 😉 Scorecard/clips: https://t.co/QjGshV4LMM 🏴 #ENGvPAK 🇵🇰 pic.twitter.com/bGnjL8DxCx — England Cricket (@englandcricket) July 18, 2021 -
పాక్ రివెంజ్.. హీరో మాత్రం అతనే!
భారీ ఛేజ్‌లో భాగంగా జట్టు తడబాటు.. నిలదొక్కుకునే క్రమంలో 42 బంతుల్లో తొమ్మిది సిక్స్‌లతో విధ్వంసం సృష్టించాడు లియామ్ లివింగ్‌స్టోన్. అయినప్పటికీ ఇంగ్లండ్‌కు ఓటమి తప్పలేదు. పాకిస్థాన్‌తో జరిగిన టీ20 సిరీస్ తొలి మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఓడింది. దీంతో 3-0 వన్డే సిరీస్ అవమానకరైమన ఓటమికి కొంతలో కొంత పాక్ ప్రతీకారం తీర్చుకున్నట్లు అయ్యింది. శుక్రవారం నాటింగ్హమ్ ట్రెంట్ బ్రిడ్జ్‌లో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో పాక్, ఆతిథ్య జట్టు ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. కెప్టెన్ బాబర్ అజామ్ 49 బంతుల్లో 85 పరుగులు, రిజ్వాన్ 41 బంతుల్లో 63 పరుగులతో రాణించడంతో ఆరు వికెట్ల నష్టానికి 232 పరుగుల భారీ లక్క్క్ష్యాన్ని ఇంగ్లండ్ ముందు ఉంచింది. బ్యాట్జులిపించిన లిమాయ్ అనంతరం బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. ఏడు ఓవర్లకే నాలుగు వికెట్లు పోగొట్టుకుని మ్యాచ్‌పై ఆశలు వదిలేసుకుంది. అయితే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ లియామ్ లివింగ్‌స్టోన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఒక్కసారిగా ఆశలు చిగురించాయి. 42 బంతుల్లో శతకం బాదడంతో పాటు.. సిక్స్ ద్వారా టీ20ల్లో ఫాసెస్ట్ సెంచరీ సాధించిన ఇంగ్లీష్ బ్యాట్స్‌మన్ ఘనతకు తన ఖాతాలో వేసుకున్నాడు లియామ్. కానీ, ఆ తర్వాతి బంతికే(17వ ఓవర్లో) భారీ షాట్ప్రయత్నించి అవుట్ అయ్యాడు. తర్వాతి బ్యాట్స్‌మ్యాన్ చేతులెత్తేయడంతో మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే 201 పరుగులకు ఆలౌట్ అయ్యింది ఇంగ్లండ్. వీరోచితంగా పోరాడిన లియామ్‌ను ఇంగ్లండ్ మాజీ దిగ్గజాలతో పాటు పలువురు మెచ్చుకుంటున్నారు. The moment Liam Livingstone struck England's fastest T20I century 💪#ENGvPAKpic.twitter.com/nEkYA8iQsf — The Cricketer (@TheCricketerMag) July 16, 2021 -
ఆల్‌రౌండ్ ప్రదర్శన.. ఇంగ్లండ్‌దే టి20 సిరీస్
కార్డిఫ్: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న ఇంగ్లండ్ జట్టు శ్రీలంకతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2–0తో సొంతం చేసుకుంది. వర్షం అంతరాయం కలిగించిన రెండో టి20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్లకు 111 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్ (39; 3 ఫోర్లు, సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ (2/18), ఆదిల్ రషీద్ (2/24) రాణించారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సమయంలో వర్షం రావడంతో ఆ జట్టు లక్ష్యాన్ని 18 ఓవర్లలో 103 పరుగులుగా నిర్ణయించారు. ఇంగ్లండ్ 16.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసి గెలి చింది. సామ్ బిల్లింగ్స్ (24; 2 ఫోర్లు), ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ లివింగ్‌స్టోన్ (26 బంతుల్లో 29 నాటౌట్; సిక్స్), సామ్ కరన్ (8 బంతుల్లో 16 నాటౌట్; ఫోర్, సిక్స్) రాణించి ఇంగ్లండ్ విజయాన్ని ఖాయం చేశారు. చివరిదైన మూడో టి20 మ్యాచ్ నేడు జరుగుతుంది. చదవండి: పాపం ఇలా అవుటవుతానని ఊహించి ఉండడు -
IPL 2021: లివింగ్‌స్టోన్ స్థానంలో కొత్త ప్లేయర్
న్యూఢిల్లీ: ఐపీఎల్ నుంచి వైదొలిగిన లియామ్ లివింగ్‌స్టోన్ స్థానంలో రాజస్తాన్ రాయల్స్ కొత్త ప్లేయర్‌తో ఒప్పందం చేసుకుంది. దక్షిణాఫ్రికాకు చెందిన 20 ఏళ్ల పేస్ బౌలర్ జెరాల్డ్ కొట్జీ రాజస్తాన్ జట్టుతో చేరనున్నాడు. జెరాల్డ్ 2020లో జరిగిన అండర్–19 వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. కాగా కఠినమైన ‘బయో బబుల్’ వాతావరణంలో ఇమడలేక ఇంగ్లండ్ క్రికెటర్ లియామ్ లివింగ్‌స్టోన్ ఐపీఎల్ -2021 టోర్నమెంట్ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. -
రాజస్తాన్‌కు మరో షాక్: ఐపీఎల్ నుంచి అతడు అవుట్!
న్యూఢిల్లీ: ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాజస్తాన్ రాయల్స్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మరో ఆటగాడు జట్టును వీడాడు. కఠినమైన ‘బయో బబుల్’ వాతావరణంలో ఇమడలేక ఇంగ్లండ్ క్రికెటర్, ఆర్ఆర్ జట్టు సభ్యుడు లియామ్ లివింగ్‌స్టోన్ ఐపీఎల్ -2021 టోర్నమెంట్ నుంచి వైదొలిగాడు. స్వదేశం ఇంగ్లండ్‌కు వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని ఆర్ఆర్ ట్విటర్ వేదికగా మంగళవారం వెల్లడించింది. ఈ మేరకు.. ‘‘లియామ్ లివింగ్‌స్టోన్ గత రాత్రి స్వదేశానికి వెళ్లిపోయాడు. ఏడాది కాలంగా బయోబబుల్‌లో ఉండలేక ఈ నిర్ణయం తీసుకున్నాడు. తన పరిస్థితిని మేం అర్థం చేసుకోగలం. అందుకే అతడి నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం. తనకు ఎలాంటి మద్దతు అవసరమైనా ఎల్లప్పుడూ మేం సిద్ధంగా ఉంటాం’’ అని పేర్కొంది. కాగా ఈ ఏడాది మినీ వేలంలో రాజస్తాన్ జట్టు లివింగ్‌స్టోన్‌ను అతని కనీస ధర రూ. 75 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ సీజన్లో రాజస్తాన్ మూడు మ్యాచ్‌లు ఆడినా తుది జట్టులో లివింగ్‌స్టోన్‌కు చోటు దక్కలేదు. ఇక ఇప్పటికే చేతి వేలి గాయం కారణంగా రాజస్తాన్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ ఇంగ్లండ్‌కు తిరిగి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అంతేగాక, మరో ఆటగాడు జోఫ్రా ఆర్చర్ సైతం ఇంతవరకు జట్టుతో చేరనేలేదు. ఈ సీజన్ మొదలుకావడానికి ముందే అతడి చేతికి సర్జరీ జరిగింది. దీంతో అతడు ఇప్పటివరకు టోర్నీకి దూరంగానే ఉన్నాడు. చదవండి: ‘వారిద్దరూ ఔటైతే ఇక మిగతా జట్టంతా ఐసీయూనే’ Liam Livingstone has flown back home late last night, due to bubble fatigue accumulated over the past year. We understand and respect his decision, and will continue supporting him in any way we can.#RoyalsFamily pic.twitter.com/stYywf3tBW — Rajasthan Royals (@rajasthanroyals) April 20, 2021 -
వన్డేలో ఒక్కడే 350 పరుగులు
ఇంగ్లండ్ క్లబ్ క్రికెట్లో రికార్డు లండన్: వన్డే క్రికెట్లో డబుల్ సెంచరీలు సాధారణమై పోయిన రోజుల్లో ఇక ట్రిపుల్ సెంచరీలు కూడా అసాధ్యం కాదని నిరూపించాడు ఇంగ్లండ్‌లోని యువ క్రికెటర్. 138 బంతుల్లో 34 ఫోర్లు, 27 సిక్సర్లతో 350 పరుగులు... ఇంగ్లండ్ బోర్డు నిర్వహించే జాతీయ క్లబ్ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో లాంకషైర్‌కు చెందిన 20 ఏళ్ల క్రికెటర్ లియామ్ లివింగ్‌స్టోన్ ఈ ఘనత సాధించాడు. క్లాడీ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో నాన్‌ట్‌విచ్ జట్టు తరఫున ఆడుతూ లివింగ్‌స్టోన్ పరుగుల వరద పారించాడు. ‘గతంలో భారత్‌లోని హైదరాబాద్‌లో జరిగిన క్లబ్ మ్యాచ్‌లో నిఖిలేశ్ అనే కుర్రాడు 334 పరుగులు చేశాడు. ఇన్నాళ్లూ వన్డేల్లో ఇదే రికార్డు. దీనిని లివింగ్‌స్టోన్ అధిగమించాడు’ అని ఇంగ్లండ్ బోర్డు తెలిపింది. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం కెనడాలోని ఒటాగోలో 2014లో ఈగెన్ అనే క్రికెటర్ 358 పరుగులు సాధించాడట. అత్యధిక పరుగుల రికార్డు సంగతి ఎలా ఉన్నా లివింగ్‌స్టోన్ 350 పరుగుల సాయంతో నాన్‌ట్‌విచ్ జట్టు 45 ఓవర్లలో 7 వికెట్లకు 579 పరుగులు చేసింది. ప్రత్యర్థి క్లాడీ జట్టు 79 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఏకంగా 500 పరుగుల విజయం సాధించి నాన్‌ట్‌విచ్ క్లబ్ కొత్త రికార్డు సృష్టించింది. -
34 ఫోర్లు, 27 సిక్సర్లతో 350
-
138 బంతుల్లో 34 ఫోర్లు, 27 సిక్సర్లతో 350
ఆ ఇన్నింగ్స్‌ను చూసుంటే గనుక గేల్ గాలిలా తేలిపోయేవాడు.. డివిలియర్స్ డంగైపోయేవాడు! వన్డే క్రికెట్ చరిత్రలో 350 వ్యక్తిగత పరుగులు సాధించి రికార్డు సృష్టించిన ఇంగ్లీష్ బ్యాట్స్‌మన్ లియామ్ లివింగ్స్టన్ ఆటను చూస్తే వారేకాదు మనమూ అచ్చెరువొందాల్సిందే! కేవలం 138 బంతుల్లో 34 ఫోర్లు, 27 సిక్సర్లతో 350 పరుగులు చేసిన లియామ్.. ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ) నిర్వహించిన నేషనల్ క్లబ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా నార్త్ వెస్ట్ సైడ్ కాల్డీ జట్టుతో ఆదివారం జరిగిన వన్డే మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. దీంతో క్లబ్ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అంతకుముందు ఈ రికార్డు మన దేశానికే చెందిన నిఖిలేశ్ సురేంద్రన్ (334 పరుగులు) పేరిట ఉండేది. లియామ్ వీరబాదుడుతో నాన్‌ట్‌విచ్ జట్టు 45 ఓవర్లలో 579 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన క్లాడీ జట్టును 79 పరుగులకే ఆలౌట్ చేసి.. 500 పరుగుల రికార్డు విజయాన్ని సొంతం చేసుకుంది.