టీ20 బ్లాస్ట్‌లో భాగంగా డెర్బీషైర్‌తో నిన్న (జూన్ 23) జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల జట్టు కెప్టెన్, లాంకాషైర్ ఆటగాడు జోస్ బట్లర్ శివాలెత్తిపోయాడు. ఈ మ్యాచ్‌లో 39 బంతులు ఎదుర్కొన్న బట్లర్.. 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేశాడు. బట్లర్‌కు మరో ఎండ్‌లో లియామ్ లవింగ్‌స్టోన్ (30 బంతుల్లో 47 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) సహకరించడంతో లాంకాషైర్ 15 ఓవర్లలో (వర్షం కారణంగా కుదించారు) 4 వికెట్ల నష్టానికి 177 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆఖర్లో వెల్స్ (4 బంతుల్లో 13; 2 సిక్సర్లు) భారీ షాట్‌లు ఆడాడు. డెర్బీషైర్ బౌలర్లలో జాక్ ఛాపెల్ 2, జమాన్ ఖాన్, మెక్ కీయెర్‌నన్ తలో వికెట్ పడగొట్టారు.
చెలరేగిన లివింగ్‌స్టోన్.. బట్లర్ ఊచకోత
టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన లాంకాషైర్.. ఆది నుంచే దూకుడుగా ఆడింది. సాల్ట్ (11 బంతుల్లో 16; 2 ఫోర్లు) వికెట్ పడిపోయాక బట్లర్ గేర్ మార్చి ధాటిగా ఆడటం ప్రారంభించాడు. ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాది డెర్బీషర్ బౌలర్లను ఊచకోత కోశాడు. బట్లర్ ఔటయ్యాక లివింగ్‌స్టోన్ కూడా చెలరేగిపోయాడు. ఆదిలో లవింగ్‌స్టోన్ కాస్త నిదానంగా ఆడినప్పటికీ.. ఆఖర్లో రెచ్చిపోయాడు. 3 భారీ సిక్సర్లు బాదాడు.
భారీ లక్ష్య ఛేదనలో తడబడిన డెర్బీషైర్..
178 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన డెర్బీషైర్.. ఆది నుంచే తడబడుతూ వచ్చింది. లాంకాషైర్ బౌలర్లు టామ్ బెయిలీ (2/16), డారిల్ మిచెల్ (2/13), లూక్ వెల్స్ (2/32), టామ్ హార్ట్‌లీ ధాటికి ఆ జట్టు 15 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 150 పరుగులు మాత్రమే చేసి 27 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. డెర్బీషైర్ ఇన్నింగ్స్‌లో హ్యారీ కేన్ (45), బ్రూక్ గెస్ట్ (31 నాటౌట్) ఓ మోస్తరుగా రాణించారు.
Comments
Please login to add a commentAdd a comment