Lancashire
-
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్..
లాంక్షైర్ క్రికెట్ క్లబ్ స్టార్ ఆల్ రౌండర్ స్టీవెన్ క్రాఫ్ట్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. స్టీవెన్ క్రాఫ్ట్ ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. గతేడాది ఫస్ట్‌క్లాస్ క్రికెట్, లిస్ట్-ఎ క్రికెట్‌కు విడ్కోలు పలికిన క్రాప్ట్.. టీ20ల్లో మాత్రం కొనసాగాడు.ఈ ఏడాది దేశీవాళీ టీ20 సీజన్‌కు ముందు లాంక్షైర్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. కానీ ఇప్పుడు పూర్తిగా అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకోవాలని స్టీవెన్ నిర్ణయించుకున్నాడు. ఇకపై లాంక్షైర్ క్రికెట్ క్లబ్ కోచింగ్ స్టాఫ్‌లో అతడు పనిచేయనున్నట్లు తెలుస్తోంది. లాంక్షైర్ క్రికెట్ క్లబ్ తరుపున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా తన కెరీర్‌ను క్రాప్ట్ ముగించాడు.నా చిన్నతనం నుంచి లంకాషైర్‌కు ఆడాలన్నది నా కల. అటువంటిది ఏకంగా 600 మ్యాచ్‌లు లంకాషైర్ తరపున ఆడాడు. రెండు దశాబ్దాల పాటు లంకాషైర్ క్రికెట్ క్లబ్‌కు ప్రాతినిథ్యం వహించాను. ఇక నేను రిటైర్ అవ్వాల్సిన సమయం అసన్నమైంది. యువ ఆటగాళ్లకు అవకాశమిచ్చేందుకు పూర్తిగా ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయంచుకున్నాను అని ఓ ప్రకటనలో క్రాఫ్ట్ పేర్కొన్నాడు. ఈ క్రికెట్ క్లబ్ తరపున అతడు 5,486 పరుగులు చేశాడు. -
వెంకటేశ్ అయ్యర్ అద్బుత బౌలింగ్: ఉత్కంఠ పోరులో విజయం
భారత క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ వన్డే కప్ టోర్నీలో ఆల్‌రౌండ్ ప్రతిభతో ఆకట్టుకున్నాడు. వొర్సెస్టెర్‌షైర్ జట్టుతో ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో లంకాషైర్ను గెలుపు తీరాలకు చేర్చాడు. వెంకీ కారణంగా మూడు పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందిన లంకాషైర్ విజయంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.25 పరుగులుఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ వన్డే కప్ టోర్నీలో భాగంగా బుధవారం లంకాషైర్- వొర్సెస్టెర్షైర్తో తలపడింది. మాంచెస్టర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వొర్సెస్టెర్‌షైర్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన లంకాషైర్ నిర్ణీత 50 ఓవర్లలో 237 పరుగులు చేసి ఆలౌట్ అయింది. కెప్టెన్ జోష్ బొహానన్ 87 పరుగులతో ఆకట్టుకోగా.. మిడిలార్డర్లో బాల్డర్సన్ అర్ద శతకంతో మెరిశాడు. వీరితో పాటు వెంకటేశ్ అయ్యర్ 25 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.ఇక లక్ష్య ఛేదనకు దిగిన వొర్సెస్టెర్‌షైర్ ఆదిలోనే టాపార్డర్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే, నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన కెప్టెన్ జేక్ లిబి 83 పరుగులతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దగా.. మిడిలార్డర్ బ్యాటర్ టామ్ టేలర్ 41 పరుగులతో అతడికి సహకారం అందించాడు. ఆఖరల్లో టామ్ హిన్లే 24 పరుగులతో జట్టును లక్ష్యానికి చేరువగా తీసుకువచ్చాడు.మూడు పరుగులా? రెండు వికెట్లా?ఈ క్రమంలో 49వ ఓవర్లో బంతిని అందుకున్న లంకాషైర్ పేస్ బౌలర్ వెంకటేశ్ అయ్యర్ అద్భుతం చేశాడు. వొర్సెస్టెర్‌షైర్ గెలుపునకు మూడు పరుగుల దూరంలో ఉండగా.. చేతిలో రెండు వికెట్లు మాత్రమే ఉన్న సమయంలో.. రెండు వికెట్లూ తనే పడగొట్టాడు. ఓవర్ ఐదో బంతికి హిన్లేను అవుట్ చేసిన వెంకటేశ్.. ఆరో బంతికి హ్యారీ డేర్లీని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో 234 పరుగుల వద్దే వొర్సెస్టెర్‌షైర్ ఇన్నింగ్స్ ముగిసిపోయింది. ఫలితంగా మూడు పరుగుల స్వల్ప తేడాతో లంకాషైర్ విజయం సాధించింది.టీమిండియాలో చోటు కరువుఇక వెంకటేశ్ అయ్యర్ లాస్ట్ ఓవర్ థ్రిల్లర్‌కు సంబంధించిన వీడియోను లంకాషైర్ సోషల్‌మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్‌లో వెంకటేశ్ అయ్యర్ ఆరు ఓవర్లు వేసి 38 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. కాగా ఈ సీజన్లో లంకాషైర్‌కు దక్కిన రెండో గెలుపు ఇది. మొత్తంగా ఎనిమిది మ్యాచ్‌లు ఆడి కేవలం రెండే గెలిచి టోర్నీ నుంచి ఎలిమినేట్ అయిపోయింది. ఇక మధ్యప్రదేశ్‌కు చెందిన వెంకటేశ్ అయ్యర్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్. ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. రైటార్మ్ మీడియం పేసర్ కూడా అన్న సంగతి తెలిసిందే.టీమిండియా తరఫున తొమ్మిది టీ20లు, రెండు వన్డేలు ఆడిన ఈ ఆల్‌రౌండర్.. ఆయా ఫార్మాట్లలో 133, 24 పరుగులు చేశాడు. టీ20లలో ఐదు వికెట్లు తీశాడు. అయితే, 2022 తర్వాత భారత జట్టులో అతడికి స్థానం కరువైంది. ఈ నేపథ్యంలో కౌంటీలో ఆడేందుకు నిర్ణయించుకున్న వెంకటేశ్.. ఐదువారాల పాటు లంకాషైర్‌కు ప్రాతినిథ్యం వహించేందుకు ఒప్పందం కుదరుర్చుకున్నాడు. ఆ జట్టు తరఫున ఐదు ఇన్నింగ్స్ ఆడి కేవలం 68 పరుగులు చేశాడు. మూడు వికెట్లు తీయగలిగాడు.3️⃣ runs required to win.2️⃣ wickets needed…Over to you, @venkateshiyer! 😍🌹 #RedRoseTogether https://t.co/CfuDnk44Oo pic.twitter.com/gNTFO2M6ml— Lancashire Cricket (@lancscricket) August 14, 2024 -
వెంకటేశ్ అయ్యర్ కీలక నిర్ణయం
టీమిండియా ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. లంకాషైర్ జట్టుతో అతడు ఒప్పందం కుదుర్చుకున్నాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన వెంకటేశ్ అయ్యర్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్. ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. రైటార్మ్ మీడియం పేసర్ కూడా!ఐపీఎల్-2024 ఫైనల్లో సత్తా చాటిఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో 2021లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున అరంగేట్రం చేసిన వెంకీ.. గత నాలుగు సీజన్లుగా అదే జట్టుతో కొనసాగుతున్నాడు. కీలక సమయాల్లో రాణిస్తూ జట్టులోని ప్రధాన ఆటగాళ్లలో ఒకడిగా ఎదిగిన ఈ ఇండోర్ క్రికెటర్.. ఐపీఎల్-2024 ఫైనల్లో సత్తా చాటాడు.సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 26 బంతుల్లోనే 52 పరుగులతో అజేయంగా నిలిచాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(6- నాటౌట్)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. పదేళ్ల తర్వాత కేకేఆర్‌ను చాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్నాడు వెంకటేశ్ అయ్యర్.హార్దిక్ పాండ్యా వారసుడంటూ ప్రశంసలు.. కానీఐపీఎల్లో సత్తా చాటుతున్న సమయంలో(2021)నే టీమిండియా తరఫున అంతర్జాతీయ టీ20లలో అడుగుపెట్టాడు వెంకీ. ఆ మరుసటి ఏడాది వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా వారసుడిగా నీరాజనాలు అందుకున్నాడు వెంకటేశ్ అయ్యర్.టీమిండియా తరఫున ఇంత వరకు తొమ్మిది టీ20లు, రెండు వన్డేలు ఆడిన ఈ ఆల్‌రౌండర్.. ఆయా ఫార్మాట్లలో 133, 24 పరుగులు చేశాడు. టీ20లలో ఐదు వికెట్లు తీశాడు. అయితే, హార్దిక్ పాండ్యా జట్టులోకి తిరిగి రావడంతో వెంకీకి అవకాశాలు కరువయ్యాయి. ఈ క్రమంలో 2022లో చివరిసారిగా అతడు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు.రీఎంట్రీపై దృష్టిఐపీఎల్-2024లో సత్తా చాటిన వెంకటేశ్ అయ్యర్.. రీఎంట్రీపై కన్నేశాడు. ఈ క్రమంలో దేశవాళీ క్రికెట్‌తో పాటు ఇంగ్లండ్ కౌంటీల్లో(ఫస్ట్‌క్లాస్)నూ ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఐదువారాల పాటు లంకాషైర్‌తో కాంట్రాక్ట్ చేసుకున్నాడు. అనంతరం భారత్‌కు తిరిగి వచ్చి దులిప్ ట్రోఫీలో భాగం కానున్నాడు.కౌంటీల్లో ఆడటం గురించి వెంకటేశ్ అయ్యర్ మాట్లాడుతూ.. ‘‘లంకాషైర్ గొప్ప చరిత్ర ఉన్న జట్టు. ఫారూఖ్ ఇంజనీర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్, వాషింగ్టన్ సుందర్ లంకాషైర్‌కు ఆడారు. ఇప్పుడు నేను కూడా ఆ జాబితాలో చేరబోతున్నా’’ అని హర్షం వ్యక్తం చేశాడు.చదవండి: IND vs SL: గంభీర్ కొత్త ప్రయోగం.. స్పిన్నర్‌గా మారిన హార్దిక్ పాండ్యా -
Bengaluru: స్టంప్ బ్రేక్ చేసిన జోఫ్రా ఆర్చర్.. వీడియో వైరల్
ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ప్రస్తుతం కర్ణాటక జట్టుకు ఆడుతున్నాడు. సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా బరిలోకి దిగి అద్భుతమైన బౌలింగ్ నైపుణ్యాలతో ఆకట్టుకుంటున్నాడు! అదేంటీ.. ఆర్చర్.. కర్ణాటక టీమ్‌లో ఎలా? అని ఆశ్చర్యపోతున్నారా?! ఇంగ్లండ్ దేశవాళీ టోర్నీ కౌంటీ చాంపియన్‌షిప్‌నకు సన్నద్ధమయ్యే క్రమంలో ససెక్స్, లంకాషైర్ జట్లు ఇండియాకు వచ్చాయి. బెంగళూరులో పదిరోజుల పాటు జరుగనున్న శిక్షణా శిబిరంలో పాల్గొననున్నాయి. ఈ క్రమంలో ససెక్స్ ఆటగాడు, ఇంగ్లండ్ ఫాస్ట్‌బౌలర్ జోఫ్రా ఆర్చర్ కూడా బెంగళూరుకు విచ్చేశాడు. ససెక్స్- కర్ణాటక(అండర్ 19, అండర్ 23 ప్లేయర్లు కలగలిసిన టీమ్) జట్ల మధ్య తొలి రోజు ఆటకు దూరంగా ఉన్న అతడు.. శుక్రవారం బరిలోకి దిగాడు. సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా కర్ణాటక జట్టులోకి వచ్చి మార్నింగ్ సెషన్లో రెండు వికెట్లు పడగొట్టాడు. అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌల్ చేసిన ఆర్చర్ దెబ్బకు స్టంప్ బ్రేక్ అయిపోయింది. ఇక మరో సందర్భంలో బ్యాటర్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని పెవిలియన్‌కు పంపాడు. ఈ రెండు సందర్భాల్లోనూ కర్ణాటక తరఫున.. తమ బ్యాటర్లను జోఫ్రా ఆర్చర్ అవుట్ చేసిన వీడియోలను ససెక్స్ క్రికెట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా గాయం కారణంగా ఐపీఎల్-2023 టోర్నీ మధ్యలోనే స్వదేశానికి వెళ్లిపోయిన జోఫ్రా ఆర్చర్(ముంబై ఇండియన్స్).. ఇంతవరకు మళ్లీ కాంపిటేటివ్ క్రికెట్ ఆడలేదు. కుడి మోచేతి గాయంతో బాధపడుతున్న అతడు.. టీ20 ప్రపంచకప్-2024 నాటికి ఇంగ్లండ్ జట్టుతో చేరే అవకాశం ఉంది. Jofra’s taken another wicket and broken the stump! 🚨 pic.twitter.com/9L7X2u4PEt — Sussex Cricket (@SussexCCC) March 15, 2024 Wicket - Alsop out lbw, b Archer The KSCA XI’s newest addition looks like a decent player tbf. 😅 pic.twitter.com/KXOTr6AgRI — Sussex Cricket (@SussexCCC) March 15, 2024 -
టీ20ల్లో బట్లర్ జమానా.. ఉతికి ఆరేస్తున్న ఇంగ్లండ్ కెప్టెన్, అత్యంత అరుదైన జాబితాలో చోటు
టీ20ల్లో ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ జమానా నడుస్తుంది. ఇటీవలకాలంలో పొట్టి ఫార్మాట్లో బట్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఈ రాజస్థాన్ రాయల్స్ చిచ్చరపిడుగు తాజాగా ఓ అరుదైన క్లబ్లో చేరి రికార్డు సృష్టించాడు. టీ20ల్లో 10000 పరుగుల మైలురాయిని అధిగమించాడు. టీ20 బ్లాస్ట్ 2023లో భాగంగా బట్లర్ ఈ అరుదైన ఫీట్‌ను సాధించాడు. డెర్బీషైర్‌తో నిన్న (జూన్ 23) జరిగిన మ్యాచ్‌లో లాంకాషైర్ తరఫున బరిలోకి దిగిన బట్లర్.. 39 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 3 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బట్లర్ 10000 పరుగుల ల్యాండ్ మార్క్‌ను రీచ్ అయ్యాడు. టీ20 కెరీర్లో మొత్తం 372 మ్యాచ్‌లు ఆడిన బట్లర్.. 34.16 సగటున, 144.70 స్ట్రయిక్ రేట్‌తో 6 శతకాలు, 21 హాఫ్ సెంచరీల సాయంతో 10080 పరుగులు చేశాడు. The crowning moment 🙌 pic.twitter.com/bTAyzxz0dS — Vitality Blast (@VitalityBlast) June 23, 2023 టీ20ల్లో 10000 పరుగులు పూర్తి చేసుకున్న తొమ్మిదో ఆటగాడు.. టీ20 ఫార్మాట్లో 10000 పరుగులు సాధించిన తొమ్మిదో ఆటగాడిగా బట్లర్ రికార్డుల్లోకెక్కాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్ (14562) అగ్రస్థానంలో ఉండగా.. షోయబ్ మాలిక్ (12528), కీరన్ పోలార్డ్ (12175), విరాట్ కోహ్లి (11965), డేవిడ్ వార్నర్ (11695), ఆరోన్ ఫించ్ (11392), అలెక్స్ హేల్స్ (11214), రోహిత్ శర్మ (11035) వరుసగా 2 నుంచి 8 స్థానాల్లో నిలిచారు. Jos Buttler becomes the 9th batter to complete 10,000 runs in T20. 😍#Cricket #JosButtler #England pic.twitter.com/XQ7uIwWTMH — Sportskeeda (@Sportskeeda) June 24, 2023 ఇంగ్లండ్ తరఫున రెండో ఆటగాడు.. టీ20ల్లో ఇంగ్లండ్ తరఫున 10000 పరుగులు పూర్తి చేసుకున్న రెండో ఆటగాడిగా బట్లర్ రికార్డుల్లోకెక్కాడు. బట్లర్‌కు ముందు అలెక్స్ హేల్స్ (11214) ఈ ఘనత సాధించాడు. బట్లర్ తర్వాత జేమ్స్ విన్స్ (9343) టీ20ల్లో 10000 పరుగులకు చేరువలో ఉన్నాడు. Can we have 12 for that one, @VitalityBlast? 💥@liaml4893 clears a maximum over the new development! 👷♂️ Watch LIVE on #LancsTV! 💻➡️ https://t.co/mClaOSvXZ6 ⚡ #LightningStrikes pic.twitter.com/HZ1NdKIiOW — Lancashire Lightning (@lancscricket) June 23, 2023 రోహిత్ శర్మ కంటే వేగంగా.. జోస్ బట్లర్ టీ20ల్లో రోహిత్ శర్మ కంటే వేగంగా 10000 పరుగుల మార్క్‌ను రీచ్ అయ్యాడు. రోహిత్‌కు ఈ ఘనత సాధించేందుకు 362 ఇన్నింగ్స్‌లు అవసరమైతే.. బట్లర్ కేవలం 350 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని అధిగమించాడు. ఓవరాల్‌గా విరాట్ కోహ్లి ఈ ఘనతను వేగంగా అధిగమించాడు. విరాట్ కేవలం 285 ఇన్నింగ్స్‌ల్లో 10000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. బట్లర్ వీరవిహారంతో లాంకాషైర్ ఘన విజయం.. డెర్బీషైర్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో బట్లర్ వీరవిహారం చేయడంతో లాంకాషైర్ 27 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బట్లర్‌కు జతగా లవింగ్‌స్టోన్ (30 బంతుల్లో 47 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు), వెల్స్ (4 బంతుల్లో 13; 2 సిక్సర్లు) రాణించడంతో లాంకాషైర్ 15 ఓవర్లలో (వర్షం కారణంగా కుదించారు) 4 వికెట్ల నష్టానికి 177 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో తడబడిన డెర్బీషైర్ 15 ఓవర్లలో 150 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. -
చెలరేగిన లివింగ్‌స్టోన్.. బట్లర్ ఊచకోత
టీ20 బ్లాస్ట్‌లో భాగంగా డెర్బీషైర్‌తో నిన్న (జూన్ 23) జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల జట్టు కెప్టెన్, లాంకాషైర్ ఆటగాడు జోస్ బట్లర్ శివాలెత్తిపోయాడు. ఈ మ్యాచ్‌లో 39 బంతులు ఎదుర్కొన్న బట్లర్.. 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేశాడు. బట్లర్‌కు మరో ఎండ్‌లో లియామ్ లవింగ్‌స్టోన్ (30 బంతుల్లో 47 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) సహకరించడంతో లాంకాషైర్ 15 ఓవర్లలో (వర్షం కారణంగా కుదించారు) 4 వికెట్ల నష్టానికి 177 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆఖర్లో వెల్స్ (4 బంతుల్లో 13; 2 సిక్సర్లు) భారీ షాట్లు ఆడాడు. డెర్బీషైర్ బౌలర్లలో జాక్ ఛాపెల్ 2, జమాన్ ఖాన్, మెక్ కీయెర్నన్ తలో వికెట్ పడగొట్టారు. చెలరేగిన లివింగ్‌స్టోన్.. బట్లర్ ఊచకోత టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన లాంకాషైర్.. ఆది నుంచే దూకుడుగా ఆడింది. సాల్ట్ (11 బంతుల్లో 16; 2 ఫోర్లు) వికెట్ పడిపోయాక బట్లర్ గేర్ మార్చి ధాటిగా ఆడటం ప్రారంభించాడు. ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాది డెర్బీషర్ బౌలర్లను ఊచకోత కోశాడు. బట్లర్ ఔటయ్యాక లివింగ్‌స్టోన్ కూడా చెలరేగిపోయాడు. ఆదిలో లవింగ్‌స్టోన్ కాస్త నిదానంగా ఆడినప్పటికీ.. ఆఖర్లో రెచ్చిపోయాడు. 3 భారీ సిక్సర్లు బాదాడు. భారీ లక్ష్య ఛేదనలో తడబడిన డెర్బీషైర్.. 178 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన డెర్బీషైర్.. ఆది నుంచే తడబడుతూ వచ్చింది. లాంకాషైర్ బౌలర్లు టామ్ బెయిలీ (2/16), డారిల్ మిచెల్ (2/13), లూక్ వెల్స్ (2/32), టామ్ హార్ట్లీ ధాటికి ఆ జట్టు 15 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 150 పరుగులు మాత్రమే చేసి 27 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. డెర్బీషైర్ ఇన్నింగ్స్‌లో హ్యారీ కేన్ (45), బ్రూక్ గెస్ట్ (31 నాటౌట్) ఓ మోస్తరుగా రాణించారు. -
బౌలింగ్ మరిచి ప్యాంటు లాగి.. అంపైర్ పరువు తీశాడు
క్రికెట్లో ఫన్నీ ఘటనలు చోటుచేసుకోవడం సహజం. తోటి ఆటగాళ్లను, కోచ్‌ను ఫ్రాంక్ చేస్తే పర్లేదు. కానీ మైదానంలో గంభీరంగా నిలబడే అంపైర్‌ను కూడా ఫ్రాంక్ చేయడం ఆసక్తికరంగా మారింది. బౌలింగ్ చేయాల్సింది మరిచి అంపైర్ ప్యాంట్‌ను లాగడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన లంకాషైర్ క్రికెట్ లీగ్‌లో చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. రిస్టన్ క్రికెట్ క్లబ్లో లంకాషైర్ లీగ్, ఈస్ట్ లంకాషైర్ క్రికెట్ క్లబ్ మధ్య శనివారం మ్యాచ్ జరిగింది. బౌలింగ్ వేయడానికి సిద్ధమైన బౌలర్ రన్అప్కు వెళ్లాడు. బంతిని చేతిలో ఉంచుకొని రన్అప్ తీసుకోకుండా నేరుగా అంపైర్ వద్దకు వెళ్లి అతన్ని ప్యాంట్ లాగాడు. ఇదంతా గమినించిన తోటి ఆటగాళ్లు అక్కడేం జరుగుతుందో ఒక్కక్షణం అర్థం కాలేదు. ఆ తర్వాత బౌలర్ నవ్వుతూ అంపైర్‌కు క్షమాపణ చెబుతూ.. ''ఇట్స్ ప్రాంక్'' అని పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన వీడియోపై ఒకసారి లుక్కేయండి. కాగా ఈ వీడియోపై అభిమానులు ఫన్నీగా స్పందించారు. ''ఆ బౌలర్ ప్రాంక్ చేయడం ఏమో గాని అంపైర్ ప్యాంటు లాగి పరువు మొత్తం తీశాడు''.. ''ఇంకా నయం ప్యాంటు ఒక్కటే లాగాడు.. దాంతో పాటు చెడ్డీ కూడా వచ్చి ఉంటే''.. ''ఎంత ఘోరం జరిగిపోయింది'' అంటూ కామెంట్స్ చేశారు. @ThatsSoVillage the funniest/most village thing to happen at @Rishtoncc Lancashire this weekend. 😂😂😂 pic.twitter.com/oF2qWeZbXk — Tino Hallerenko (@tinohalleron) August 27, 2022 చదవండి: నల్ల బ్యాండ్లతో బరిలోకి దిగనున్న పాకిస్తాన్.. కారణం ఏంటంటే? Asia Cup IND Vs PAK: ప్రపంచ రికార్డుకు 10 పరుగుల దూరంలో హిట్‌మ్యాన్ -
మ్యాచ్ గెలిచిన ఆనందం.. టీమిండియా క్రికెటర్ డ్యాన్స్
టీమిండియా స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ప్రస్తుతం లంకాషైర్ తరపున ప్రాతినిధ్యం వహిస్తూ కౌంటీల్లో బిజీగా ఉన్నాడు. గాయంతో దూరమైన సుందర్ కౌంటీల్లో ఆడుతూ సూపర్ ప్రదర్శనతో రెచ్చిపోతున్నాడు. తాజాగా మ్యాచ్ గెలిచిన ఆనందంలో సుందర్ డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాయల్ లండన్ వన్డే-కప్‌లో భాగంగా లంకాషైర్, యార్క్‌షైర్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో లంకాషైర్ ఏడు వికెట్లతో విజయం సాధించింది. మ్యాచ్ గెలిచిన సంతోషాన్ని లంకాషైర్ జట్టు సభ్యులు డ్రెస్సింగ్‌రూమ్‌లో పెద్ద ఎత్తున్న సెలట్రేట్ చేసుకున్నారు. మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో ఒకరిని ఒకరు అభినందించుకుంటూ డ్యాన్స్ చేశారు. సుందర్ కూడా చిన్న పిల్లాడిలా మారిపోయి గెంతులేయడం కనిపించింది. మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన యార్క్‌షైర్ 48.3 ఓవర్లలో 224 పరుగులకు ఆలౌట్ అయింది. విల్ ప్రెయిన్ 41 పరుగులు చేయగా.. టాటెర్సల్ 34 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన లంకాషైర్ 41 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. లూక్ వెల్స్ 88 పరుగులతో ఆకట్టుకోగా.. జోష్ బొహానన్ 51 పరుగులు చేశాడు. చివర్లో వాషింగ్టన్ సుందర్ 30 నాటౌట్, స్టీవెన్ క్రాఫ్ట్ 31 నాటౌట్ జట్టును విజయతీరాలకు చేర్చారు. A roses 𝒔𝒑𝒆𝒄𝒊𝒂𝒍 🌹 🌹 #RedRoseTogether pic.twitter.com/cKIGlfCj8g — Lancashire Cricket (@lancscricket) August 4, 2022 చదవండి: Wayne Parnel: ఐదు వికెట్లతో చెలరేగిన బౌలర్.. అల్లాడిపోయిన ఐర్లాండ్ Senior RP Singh: భారత్‌ను కాదని ఇంగ్లండ్‌కు ఆడనున్న మాజీ క్రికెటర్ కుమారుడు -
సుందర్ 'నమ్మశక్యం కాని బౌలింగ్'.. నోరెళ్లబెట్టిన ప్రత్యర్థి బ్యాటర్
టీమిండియా ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ప్రస్తుతం కౌంటీ చాంపియన్‌షిప్ డివిజన్ 1లో బిజీగా ఉన్నాడు. లంకాషైర్ తరపున డెబ్యూ సీజన్ ఆడుతున్న సుందర్ సూపర్ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఇటీవలే ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన సుందర్ తాజాగా కెంట్‌తో మ్యాచ్‌లో తన ఆఫ్ స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించాడు. సుందర్ వేసిన బంతి గింగిరాలు తిరుగుతూ ఆఫ్‌స్టంప్ మీదుగా వెళ్లింది. అయితే బంతిని డిఫెన్స్ చేద్దామని ప్రయత్నించిన కెంట్ బ్యాటర్ జోర్డాన్ కాక్స్ విఫలమయ్యాడు. బంతి ప్యాడ్ల సందులో నుంచి వెళ్లి వికెట్లను గిరాటేసింది. బంతి ఎలా వెళ్లిందో అర్థంగాక జోర్డాన్ కాక్స్ నోరెళ్లబెట్టాడు. దీంతో కేవలం ఒక్క పరుగుకు కాక్స్ పెవిలియన్ చేరాడు. దీనికి సంబంధించిన వీడియోనూ కౌంటీ చాంపియన్‌షిప్ షేర్ చేస్తూ.. ''సుందర్ నుంచి నమ్మశక్యం కాని డెలివరీ.. సూపర్'' అంటూ క్యాప్షన్ జత చేసింది. తెలివైన బంతితో బోల్తా కొట్టించిన సుందర్‌ను తోటి ఆటగాళ్లు అభినందించారు. కాగా సుందర్‌కు కాక్స్‌ది రెండో వికెట్.. అంతకముందు కెంట్ కెప్టెన్ జాక్ లీనింగ్ రూపంలో తొలి వికెట్ తీసుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. లంకాషైర్ 182 పరుగుల తేడాతో కెంట్‌పై విజయం అందుకుంది. లంకాషైర్ తొలి ఇన్నింగ్స్‌లో 145 పరుగులకే ఆలౌట్ కాగా.. కెంట్ తొలి ఇన్నింగ్స్‌లో 270 పరుగులకు ఆలౌట్ అయి 125 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించింది. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం లంకాషైర్ అద్బుత ఆటతీరు కనబరిచింది. 9 వికెట్ల నష్టానికి 436 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లెర్ చేసింది. 311 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కెంట్ అనూహ్యంగా 127 పరుగులకే కుప్పకూలింది. టామ్ బెయిలీ 5 వికెట్లతో చెలరేగగా.. వాషింగ్టన్ సుందర్ 3, విల్ విలియమ్స్ రెండు వికెట్లు తీశాడు. That is an incredible delivery from @Sundarwashi5 😲#LVCountyChamp pic.twitter.com/rLyMvMmI9l — LV= Insurance County Championship (@CountyChamp) July 28, 2022 చదవండి: Sanju Samson In T20I Squad: విండీస్‌తో తొలి టి20.. టీమిండియాకు గుడ్‌న్యూస్ ఆరేళ్ల తర్వాత జట్టులోకి.. కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్; ఇంగ్లండ్‌పై ప్రతీకారం -
కౌంటీల్లో వాషింగ్టన్ సుందర్ అదిరిపోయే అరంగేట్రం
టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కౌంటీ క్రికెట్లో అదిరిపోయే అరంగేట్రం ఇచ్చాడు. లంకాషైర్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న సుందర్ ఆడుతున్న తొలి మ్యాచ్‌లోనే ఐదు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. నార్తంప్టన్‌షైర్‌తో మ్యాచ్‌లో సుందర్ ఈ ఫీట్ నమోదు చేశాడు. తద్వారా కౌంటీ క్రికెట్లో సుందర్ ఒక అరుదైన ఫీట్ నమోదు చేశాడు. కౌంటీల్లో డెబ్యూ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన ఏడో బౌలర్‌గా సుందర్ రికార్డులకెక్కాడు. ఆటలో తొలిరోజే నాలుగు వికెట్లు తీసిన సుందర్.. రెండోరోజు ఆటలో ఒక వికెట్ తీసి ఓవరాల్‌గా 22 ఓవర్లలో 76 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. సుందర్‌కు తోడుగా లూక్ వుడ్ 3, విల్ విలియమ్స్ రెండు వికెట్లు తీయడంతో నార్తంప్టన్‌షైర్ తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత ఇన్నింగ్స్ ఆరంభించిన లంకాషైర్ లంచ్ విరామం సమయానికి రెండు వికెట్ల నష్టానికి 54 పరుగులు చేసింది. కాగా ఐపీఎల్-2022లో ఎస్ఆర్హెచ్ తరపున ఆడిన సుందర్ లీగ్ మధ్యలో గాయపడ్డాడు. అయితే టీ20 స్పెషలిస్టుగా పేరుందిన సుందర్‌కు గాయం నుంచి కోలుకున్న తర్వాత భారత జట్టులో చోటు దక్కలేదు. దక్షిణాఫ్రికా, ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లకు సెలక్టర్లు పక్కన పెట్టారు. ఈ క్రమంలో ఇంగ్లండ్ కౌంటీల్లో రాణించి తిరిగి భారత జట్టులోకి రావాలని సుందర్ భావిస్తున్నాడు. ఇక సుందర్ టీమిండియా తరపున 4 టెస్టులు, 4 వన్డేలు, 31 టి20లు ఆడాడు. WASHI HAS FIVE!! 🖐️🌟@Sundarwashi5 becomes just the seventh @lancscricket player to take a five-for on debut! 👏 McManus caught sweeping on the boundary for 61. 226-9 (75.2) 🌹 #RedRoseTogether pic.twitter.com/sQojvSTPLs — Lancashire Cricket (@lancscricket) July 20, 2022 చదవండి: తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టిన వాషింగ్టన్ సుందర్.. 4 వికెట్లతో..! -
తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టిన వాషింగ్టన్ సుందర్.. 4 వికెట్లతో..!
ఇంగ్లండ్ కౌంటీ ఛాంపియన్షిప్-2022లో లంకషైర్ తరపున ఆడుతోన్న భారత ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. నార్తాంప్టన్‌షైర్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో తొలి రోజు నాలగు వికెట్లు సుందర్ పడగొట్టి తన జట్టును పటిష్టస్థితిలో నిలిపాడు. నార్తాంప్టన్‌షైర్ ఓపెనర్ విల్ యంగ్‌ను ఔట్ చేయడంతో సుందర్ తొలి కౌంటీ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా ఐపీఎల్-2022లో ఎస్ఆర్హెచ్ తరపున ఆడిన సుందర్ లీగ్ మధ్యలో గాయపడ్డాడు. అయితే టీ20 స్పెషలిస్టుగా పేరుందిన సుందర్‌కు గాయం నుంచి కోలుకున్న తర్వాత భారత జట్టులో చోటు దక్కలేదు. దక్షిణాఫ్రికా, ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లకు సెలక్టర్లు పక్కన పెట్టారు. ఈ క్రమంలో ఇంగ్లండ్ కౌంటీల్లో రాణించి తిరిగి భారత జట్టులోకి రావాలని సుందర్ భావిస్తున్నాడు. మరోవైపు భారత వెటరన్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా ఇంగ్లండ్ కౌంటీల్లో అదరగొట్టి తిరిగి జట్టులోకి వచ్చిన సంగతి తెలిసిందే. That is ridiculous, @luke_wells07! 🤯 A third for @Sundarwashi5 👏 🌹 #RedRoseTogether https://t.co/b8kJigt3ZI pic.twitter.com/vGVxeh86pe — Lancashire Cricket (@lancscricket) July 19, 2022 చదవండి: Ind W Vs Pak W: ఇండియా వర్సెస్ పాకిస్తాన్.. మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ? పూర్తి వివరాలు! -
T20 Blast 2022 Final: ఆఖరి బంతికి హైడ్రామా.. క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా..!
T20 Blast 2022 Final: బర్మింగ్‌హామ్ వేదికగా శనివారం జరిగిన టీ20 బ్లాస్ట్ 2022 ఫైనల్ మ్యాచ్‌లో హైడ్రామా చోటు చేసుకుంది. లాంకాషైర్, హాంప్‌షైర్ జట్ల మధ్య శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో హాంప్‌షైర్ ఆఖరి బంతికి విజయం సాధించి ఛాంపియన్‌గా అవతరించింది. ఆఖరి బంతికి 5 పరుగులు చేయాల్సిన క్రమంలో లాంకాషైర్ ఆటగాడు రిచర్డ్ గ్లీసన్‌ను నాథన్ ఎల్లీస్ అద్భుతమైన యార్కర్‌తో క్లీన్ బౌల్డ్ చేయడంతో హాంప్‌షైర్ విజయం ఖరారైంది. దీంతో హాంప్‌షైర్ ఆటగాళ్లు గెలుపు సంబురాల్లో మునిగిపోయారు. అయితే అప్పుడే హాంప్‌షైర్ ఆటగాళ్లకు గుండె పగిలే వార్త చెప్పాడు ఫీల్డ్ అంపైర్. A no ball. A no ball. The utter, utter drama of #Blast22. What a match.#FinalsDay pic.twitter.com/cRYkesYjYr — Vitality Blast (@VitalityBlast) July 16, 2022 ఎల్లీస్ వేసిన ఆఖరి బంతిని అతను నో బాల్‌గా ప్రకటించాడు. దీంతో గ్రౌండ్లో ఒక్కసారిగా నిశబ్ద వాతావరణం నెలకొంది. ఆఖరి బంతి నో బాల్ (ఫ్రీ హిట్‌తో పాటు అదనపు పరుగు) కావడంతో సమీకరణలు మారిపోయాయి. లాంకాషైర్ చివరి బంతికి 3 పరుగులు చేస్తే చేజారిందనుకున్న విజయం తిరిగి వరిస్తుంది. ఈ పరిస్థితుల్లో బంతిని అందుకున్న ఎల్లీస్ చాకచక్యంగా స్లో బాల్ వేయడంతో బైస్ రూపంలో కేవలం ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. Your #Blast22 champions are...@hantscricket 🏆 #FinalsDay pic.twitter.com/0TvdSvLbem — Vitality Blast (@VitalityBlast) July 16, 2022 దీంతో హాంప్‌షైర్ ఆటగాళ్లు మరోసారి సంబురాలు షురూ చేశారు. ఈసారి వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆ జట్టు అభిమానులు బాణసంచా పేలుస్తూ గ్రౌండ్లో హంగామా సృష్టించారు. ఆఖరి బంతికి నెలకొన్న హైడ్రామాకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. పొట్టి క్రికెట్ చరిత్రలో ఇలాంటి మ్యాచ్ ఎన్నడూ చూడలేదని, టీ20ల్లో ఇలా జరగడం బహుశా ఇదే మొదటిసారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. స్కోర్ వివరాలు.. హాంప్‌షైర్: 152/8 (20) లాంకాషైర్: 151/8 (20) ఫలితం: ఒక్క పరుగు తేడాతో హాంప్‌షైర్ విజయం చదవండి: చెలరేగిన షాహిన్ అఫ్రిది.. కుప్పకూలిన శ్రీలంక -
వాషింగ్టన్ సుందర్‌కు బంపరాఫర్.. దిగ్గజాల తర్వాత తాను సైతం!
Washington Sundar: టీమిండియా యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ అరుదైన అవకాశం దక్కించుకున్నాడు. ఇంగ్లండ్ దేశవాళీ క్రికెట్ కౌంటీ మ్యాచ్‌లు ఆడే ఛాన్స్ కొట్టేశాడు. ఈ మేరకు భారత ఆటగాడు వాషింగ్టన్ సుందర్‌తో ఒప్పందం చేసుకున్నట్లు లంకషైర్ జట్టు బుధవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. స్వాగత్ హై సుందర్.. ఈ సందర్భంగా స్వాగత్ హై అంటూ సుందర్‌కు ఆహ్వానం పలుకుతూ ఓ వీడియోను షేర్ చేసింది. ‘‘ఇండియన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌తో లంకషైర్ తరఫున ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాం. జూలై, ఆగష్టులో జరిగే కౌంటీ చాంపియన్‌షిప్ రాయల్ లండన్‌కప్‌లో అతడు భాగం కానున్నాడు’’ అని పేర్కొంది. థాంక్స్ అంటూ భావోద్వేగం ఈ విషయంపై స్పందించిన వాషింగ్టన్ సుందర్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. తనకు ఈ అవకాశం ఇచ్చిన లంకషైర్ మేనేజ్మెంట్, భారత క్రికెట్ నియంత్రణ మండలికి ధన్యవాదాలు తెలిపాడు. ‘‘లంకషైర్ జట్టుతో కలిసి ఆడటం కోసం ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నా. ఇంగ్లండ్ గడ్డ మీద ఆడటం నాకొక గొప్ప అనుభవాన్ని ఇస్తుంది. ఎమిరేట్స్ ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో ఆడాలని ఎంతో ఉత్సాహంగా ఉన్నాను’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. కాగా ఐపీఎల్-2022 సందర్భంగా గాయపడిన సుందర్ ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. అతడు పూర్తిగా కోలుకోగానే లంకషైర్ జట్టుతో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ యువ తమిళ ఆటగాడు భారత్ తరఫున 39 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 36 వికెట్లు పడగొట్టాడు. బౌలింగ్‌లో అతడు నమోదు చేసిన అత్యుత్తమ గణాంకాలు 6/87.టెస్ట్ ఎకానమీ 3.41. అదే విధంగా అతడు సాధించిన అత్యధిక స్కోరు 96 నాటౌట్. మొత్తం సాధించిన పరుగులు 369. ఇక లంకషైర్ విషయానికొస్తే ఆ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. అప్పట్లో వాళ్లు.. ఇప్పుడు ఈ యువ ప్లేయర్లు గతంలో లంకషైర్ జట్టుకు ఫరూక్ ఇంజనీర్, వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ, దినేశ్ మోంగియా, మురళీ కార్తీక్ లాంటి భారత దిగ్గజ ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహించారు. వారి తర్వాత శ్రేయస్ అయ్యర్‌కు ఈ అవకాశం రాగా.. ప్రస్తుతం వాషింగ్టన్ సుందర్ కూడా ఆ జాబితాలో చేరిపోయాడు. 🇮🇳 Swagat Hai, @Sundarwashi5! 👏 🌹 #RedRoseTogether pic.twitter.com/iOnsoQrL8H — Lancashire Lightning (@lancscricket) June 22, 2022 -
'క్యాచెస్ విన్ మ్యాచెస్' అని ఊరికే అనరు
'క్యాచెస్ విన్ మ్యాచెస్' అని అంటారు. తాజాగా అది మరోసారి నిరూపితమైంది. విటాలిటీ బ్లాస్ట్ టి20 టోర్నీలో భాగంగా లంకాషైర్, యార్క్‌షైర్ మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో క్యాచ్ టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. విషయంలోకి వెళితే.. యార్క్‌షైర్ విజయానికి ఆఖరి ఓవర్లో ఆఖరి బంతికి ఆరు పరుగులు కావాలి. క్రీజులో డొమినిక్ డ్రేక్స్ ఉన్నాడు. అవతలి ఎండ్‌లో డానీ లాంబ్ బౌలింగ్ చేస్తున్నాడు. సిక్స్ కొడితే మ్యాచ్ విన్ అవుతుంది.. లేదంటే యార్క్‌షైర్‌కు ఓటమి తప్పదు. ఈ దశలో డానీ లాంబ్ పూర్తిగా ఆఫ్ స్టంప్ అవతల బంతిని విసిరాడు. అయితే డొమినిక్ డ్రేక్స్ డీమ్ మిడ్‌వికెట్ మీదుగా భారీ షాట్ ఆడాడు. అతని టైమింగ్ షాట్ చూసి అంతా సిక్స్ అని భావించారు. ఇక్కడే ఊహించని ట్విస్ట్ ఎదురైంది. బౌండరీ లైన్ వద్ద టామ్ హార్ట్లే సూపర్ క్యాచ్ అందుకున్నాడు. అయితే లైన్ తొక్కాడేమోనన్న చిన్న అనుమానం ఉండడంతో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్‌ను ఆశ్రయించాడు. రిప్లేలో టామ్ హార్టీ చిన్న మిస్టేక్ కూడా చేయకుండా క్యాచ్‌ను ఒడిసిపడినట్లు తేలడంతో ఔట్ ఇచ్చాడు. దీంతో యార్క్‌షైర్ విజయానికి ఆరు పరుగుల దూరంలో ఆగిపోయింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన లంకాషైర్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. టిమ్ డేవిడ్(32 బంతుల్లో 66), క్రాప్ట్ 41, జెన్నింగ్స్ 42 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన యార్క్‌షైర్ ఇన్నింగ్స్‌లో టామ్ కోహ్లెర్ 77, డేవిడ్ విల్లీ 52 పరుగులతో మెరిసినప్పటికి లాభం లేకుండా పోయింది. చదవండి: European T10 League: హతవిధి.. నవ్వాలో ఏడ్వాలో అర్థం కాని స్థితిలో! UNBELIEVABLE DRAMA!!! Tom Hartley catches on the boundary to win it for @lancscricket!!#Blast22 #RosesT20 pic.twitter.com/StKY6rcv5T — Vitality Blast (@VitalityBlast) June 8, 2022 -
బౌలర్లు అయిపోయారు.. పనిచేసేవాళ్లను కూడా వదిలిపెట్టవా!
భారీ సిక్సర్లకు పెట్టింది పేరు.. ఇంగ్లండ్ విధ్వంసకర ఆటగాడు లియామ్ లివింగ్‌స్టోన్. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరపున ప్రాతినిధ్యం వహించిన లివింగ్‌స్టోన్ సీజన్ మొత్తం భారీ సిక్సర్లతో అలరించాడు. తాజాగా అదే టెంపోను టి20 బ్లాస్ట్‌లోనూ కొనసాగిస్తున్నాడు. ఇంగ్లండ్ వేదికగ జరుగుతున్న విటాలిటీ టి20 బ్లాస్ట్‌లో లంకాషైర్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న లివింగ్‌స్టోన్ బౌలర్లను ఊచకోత కోస్తున్నాడు. ఏ మాత్రం జాలీ, దయ లేకుండా నిర్దాక్షిణ్యంగా భారీ సిక్సర్లు బాదుతు చుక్కలు చూపిస్తున్నాడు. ఇప్పటికే టోర్నీలో అత్యంత భారీ సిక్స్ లివింగ్‌స్టోన్ పేరిటే ఉంది. తాజాగా బుధవారం రాత్రి లంకాషైర్, డెర్బీషైర్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో లివింగ్‌స్టోన్ 46 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 75 పరుగులు చేశాడు. అయితే లివింగ్‌స్టోన్ కొట్టిన ఒక భారీ సిక్స్ స్టేడియం అవతల ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్న దగ్గరపడింది. అయితే బంతి ఎక్కడ పడింతో తెలియకపోడంతో ఆటకు కాసేపు అంతరాయం ఏర్పడింది. వర్క్‌లో ఉన్న బిల్డర్లు కూడా పని ఆపేసి బంతికోసం వెతికారు. చివరకు ఒక గుంత పక్కడ కనిపించడంతో బంతిని అందుకొని గ్రౌండ్లోకి విసిరేశారు. అప్పటికే కాచుకు కూర్చొన్న అంపైర్ పరిగెత్తుకెళ్లి బాల్‌ను తీసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. లివింగ్‌స్టోన్ విధ్వంసం దాటికి లంకాషైర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన డెర్బీషైర్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు మాత్రమే చేసి 17 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. డెర్బీషైర్ ఇన్నింగ్స్‌లో లూస్ డూ ప్లూయ్ 59, లుయిస్ రీస్ 55 పరుగులు చేశారు. చదవండి: Mayank Agarwal:'కెప్టెన్సీ భారం మంచి బ్యాటర్‌ను చంపేసింది' T20 Blast 2022: భారీ సిక్సర్.. బర్గర్ వ్యాన్‌లోకి దూసుకెళ్లిన బంతి Liam Livingstone is starting to tee off! 💥 Watch him bat LIVE ➡️ https://t.co/fvUbVrnZuz#Blast22 pic.twitter.com/tl6iEYZzZN — Vitality Blast (@VitalityBlast) June 1, 2022 Shoutout to the builders who helped retrieve the match ball 🤣#Blast22 https://t.co/1cKEDkFWVQ pic.twitter.com/wWGKexREW0 — Vitality Blast (@VitalityBlast) June 1, 2022 -
అదృష్టం బాగుంది.. కొంచెమైతే పరువు పోయేదే!
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టి20 బ్లాస్ట్ టోర్నమెంట్లో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. లంకాషైర్, యార్క్‌షైర్ మధ్య మ్యాచ్‌లో ఫీల్డర్ క్యాచ్ అందుకునే క్రమంలో ప్యాంట్ జారిపోవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యార్క్‌షైర్ ఇన్నింగ్స్ చివరి ఓవర్లో విజయానికి 13 పరుగులు కావాల్సి ఉంది. అయితే మరో రెండు బంతుల్లో ఆరు పరుగులు అవసరమైన దశలో లంకాషైర్ బౌలర్ హై ఫుల్‌టాస్ వేశాడు. క్రీజులో ఉన్న షాదాబ్ సిక్స్ కొట్టబోయే ప్రయత్నం చేశాడు. బంతి బ్యాట్ ఎడ్జ్‌ను తాకి గాల్లోకి లేచింది. మిడాఫ్ నుంచి పరిగెత్తుకొచ్చిన డేన్ విలా క్యాచ్ అందుకునే ప్రయత్నం చేసినప్పటికి మిస్ అయింది. దీంతో బంతిని తీసుకోవడానికి పైకి లేచిన డేన్ ప్యాంట్ ఒక్కసారిగా కిందకు జారింది. షాక్ తిన్న డేన్ విలా.. ''ఎవరైనా చూశారేమో..నాకు సిగ్గేస్తుందన్న'' తరహాలో అక్కడే కూలబడ్డాడు. ఆ తర్వాత పైకి లేచి ప్యాంటును సర్దుకొని బంతిని విసిరేశాడు. ఈ వీడియోనూ విటాలిటీ బ్లాస్ట్ తన ట్విటర్లో షేర్ చేసింది. ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్.. ''అరె కొంచమైతే పరువు మొత్తం పోయేదే.. క్యాచ్ పట్టడం సంగతి దేవుడెరుగు.. ముందు పరువు పోయేది'' అంటూ కామెంట్స్ చేశారు. ఇక లంకాషైర్, యార్క్‌షైర్ మధ్య మ్యాచ్ టైగా ముగిసింది. యార్క్‌షైర్‌కు చివరి ఓవర్లో విజయానికి 13 పరుగులు అవసరం కాగా.. 12 పరుగులు మాత్రమే చేయడంతో మ్యాచ్ డ్రా అయింది. తొలుత బ్యాటింగ్ చేసిన లంకాషైర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఫిలిప్ సాల్ట్ 41 బంతుల్లో 59 పరుగులు చేశాడు. ఇక టి20 బ్లాస్ట్ టోర్నమెంట్లో యార్క్‌షైర్ రెండో స్థానంలో ఉండగా.. లంకాషైర్ ఏడో స్థానంలో ఉంది. చదవండి: Paul Stirling: ఒక్క ఓవర్లో 34 పరుగులు.. అయినా మొహంలో చిరాకే! If the #RosesT20 didn't have enough drama... Dane Vilas had an unfortunate moment 😂#Blast22 pic.twitter.com/WBq2gSpMRx — Vitality Blast (@VitalityBlast) May 28, 2022 -
ఇలాంటి బౌలింగ్ అరుదు.. దిగ్గజ ఆటగాడు గుర్తురావడం పక్కా!
లంకాషైర్ లెగ్ స్పిన్నర్ మాట్ పార్కిన్సన్ కౌంటీ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో అద్బుత బంతితో మెరిశాడు. కౌంటీలో భాగంగా లంకాషైర్, వార్విక్షైర్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో వార్విక్షైర్ రెండో ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థి బ్యాటర్ లెగ్‌స్టంప్ అవతల బంతిని వేశాడు. దానిని డిఫెన్స్ ఆడే ప్రయత్నంలో బ్యాటర్ క్రీజు నుంచి ముందుకు వచ్చాడు. అయితే బంతి అనూహ్యంగా టర్న్ తీసుకొని ఆఫ్ స్టంప్ వికెట్‌ను పడగొట్టింది. పార్కిన్సన్ ఇలాంటి బంతి వేయడం ఇది తొలిసారి కాదు. ఇంతకముందు 2021లో నార్త్ హంప్‌షైర్ కెప్టెన్ ఆడమ్ రోసింగ్టన్ను అచ్చం ఇలాంటి బంతితోనే బోల్తా కొట్టించాడు. ఇంకో విషయం ఏంటంటే.. వార్నర్ బాల్ ఆఫ్ ది సెంచరీని గుర్తు చేస్తూ పార్కిన్సన్ సెలబ్రేషన్స్ చేయడం వైరల్‌గా మారింది. పార్కిన్సన్ ఇంగ్లండ్ తరపున అంతర్జాతీయ క్రికెట్లో ఐదు వన్డేలు, నాలుగు టి20 మ్యాచ్‌లు ఆడాడు. ఇక షేన్ వార్న్ ఇంగ్లండ్ బ్యాటర్ మైక్ గాటింగ్‌ను ఔట్ చేసిన తీరు క్రికెట్ చరిత్రలో బాల్ ఆఫ్ ది సెంచరీగా మిగిలిపోయింది. ఇక ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ ఈ ఏడాది మార్చిలో థాయ్‌లాండ్‌లోని తన విల్లాలో గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. చదవండి: Sri Lanka Economic Crisis: దేశం దుర్భర స్థితికి ప్రభుత్వమే కారణం.. అసహ్యమేస్తోంది : లంక మాజీ క్రికెటర్లు Lionel Messi: అర్జెంటీనా స్టార్ మెస్సీ కొత్త చరిత్ర.. 61 వ స్థానంలో కోహ్లి How good is this delivery from @mattyparky96? 🤯 Unplayable.#LVCountyChamp pic.twitter.com/qPvxKwDuHs — LV= Insurance County Championship (@CountyChamp) May 10, 2022 Ball of the century? 😳 @mattyparky96 #LVCountyChamp live: https://t.co/SyebMiubg3 pic.twitter.com/Wf93spCqz3 — LV= Insurance County Championship (@CountyChamp) April 16, 2021 -
పాక్ బౌలర్‌పై ప్రశంసలు కురిపించిన పంజాబ్ కింగ్స్ స్టార్ బ్యాటర్
Liam Livingstone Lauds Hasan Ali: ఇంగ్లండ్ కౌంటీల్లో చెలరేగిపోతున్న పాకిస్థాన్ బౌలర్ హసన్ అలీపై పంజాబ్ కింగ్స్ స్టార్ బ్యాటర్ లియామ్ లివింగ్‌స్టోన్ ప్రశంసల వర్షం కురిపించాడు. కౌంటీ ఛాంపియన్షిప్ 2022లో లాంకాషైర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న హసన్ అలీ గ్లోస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్లతో సత్తా చాటి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించడంతో లివింగ్‌స్టోన్ పాక్ పేసర్‌ని కొనియాడాడు. లివింగ్‌స్టోన్‌కు లాంకాషైర్ హోం టీమ్ కావడంతో హసన్ అలీ ప్రదర్శనను ఆకాశానికెత్తుతూ, తన జట్టు విజయం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. వాట్ ఎ సైనింగ్.. వాట్ ఎ విన్ అంటూ రెడ్ రోసెస్తో హసన్ అలీకి, లాంకాషైర్ జట్టుకు విషెస్ తెలిపాడు. What a signing… what a win 🌹🌹🌹 https://t.co/bqei0nZohb — Liam Livingstone (@liaml4893) April 24, 2022 కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్ వన్‌లో భాగంగా గ్లోస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో లాంకాషైర్ ఇన్నింగ్స్ 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు పడగొట్టిన హసన్.. లాంకాషైర్ విజయంలో కీలకంగా వ్యవహరించాడు. ఈ మ్యాచ్‌లో గ్లోస్టర్‌షైర్ తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులకు, రెండో ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు ఆలౌట్ కాగా.. లాంకాషైర్ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 556 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. లంకాషైర్ జట్టులో జోష్ బొహానన్ (231) డబుల్ సెంచరీతో చెలరేగగా, కెప్టెన్ డేన్ విలాస్ (109) సెంచరీతో సత్తా చాటాడు. చదవండి: అంపైర్‌తో వాగ్వాదం.. ఆ కోపాన్ని బౌలర్‌పై చూపించాడు -
150 కిమీ వేగంతో యార్కర్.. స్టంప్ రెండు ముక్కలు
పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ బౌలింగ్ వేగానికి మిడిల్ స్టంప్ రెండు ముక్కలయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెలితే.. హసన్ అలీ ప్రస్తుతం కౌంటీ క్రికెట్లో బిజీగా గడుపుతున్నాడు. మూడోరోజు ఆటలో భాగంగా గ్లూస్టర్షైర్ బ్యాటర్ జేమ్స్ బ్రేసీని క్లీన్‌బౌల్డ్ చేశాడు. దాదాపు 150 కిమీ వేగంతో విసిరిన పదునైన యార్కర్ బ్యాట్స్‌మన్ కాళ్ల సందుల నుంచి వెళ్లి మిడిల్ స్టంప్‌ను ఎగురగొట్టింది. అయితే బంతి సూపర్ ఫాస్ట్‌గా రావడంతో స్టంప్ రెండు ముక్కలయింది. ఈ వీడియోనూ లంకాషైర్ ట్విటర్లో షేర్ చేస్తూ.. కొత్త స్టంప్ ప్లీజ్.. చెప్పడానికి ఏం లేదు.. ఓ మై వర్డ్.. మేము ఇంకో స్టంప్ తెప్పించాల్సిందే అంటూ క్యాప్షన్ జత చేసింది. ఇక లంకాషైర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న హసన్ అలీ గ్లూస్టర్షైర్తో మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లతో మెరిశాడు. అతని ధాటికి గూస్టర్షైర్ 252 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో లంకాషైర్‌కు 304 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అంతకముందు లంకాషైర్ తొలి ఇన్నింగ్స్‌ను 556 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. జోష్ బొహానన్ డబుల్ సెంచరీతో(231 పరుగులు) మెరవగా, కెప్టెన్ డేన్ విలాస్ 109 పరుగులు సాధించాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో మూడో రోజు ఆట ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. చదవండి: Wriddiman Saha Case: సాహా వ్యవహారం.. స్పోర్ట్స్ జర్నలిస్ట్‌పై రెండేళ్ల నిషేధం! County Championship: పుజారా మరో సెంచరీ.. పరుగుల వరద పారిస్తున్న నయా వాల్ NEW STUMPS, PLEASE! 👀@RealHa55an 😲 🌹 #RedRoseTogether pic.twitter.com/KhjUz3TG6q — Lancashire Cricket (@lancscricket) April 23, 2022 “Oh my word!” 😳 We’ll have to get another one of those, @RealHa55an! 🤣 🌹 #RedRoseTogether pic.twitter.com/XQO4reizR1 — Lancashire Cricket (@lancscricket) April 23, 2022 -
ఒక్క టెస్ట్ మ్యాచ్ రద్దవడం వల్ల ఇంత భారీ నష్టమా..?
మాంచెస్టర్: ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య శుక్రవారం నుంచి ప్రారంభం కావాల్సిన ఆఖరి టెస్ట్ కరోనా కారణంగా రద్దైన విషయం తెలిసిందే. భారత శిబిరంలో కోచ్ రవిశాస్త్రి సహా నలుగురు కోచింగ్ సిబ్బంది కరోనా బారిన పడటంతో ఇరు దేశాల క్రికెట్ బోర్డుల పరస్పర అంగీకారంతో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ ఒక్క మ్యాచ్ రద్దు కావడం వల్ల లాంకషైర్ క్రికెట్‌కు, ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ)కు భారీ నష్టం వాటిల్లిందని సమాచారం. ఈ నష్టం భారత కరెన్సీలో వందల కోట్లకు పైగా ఉండవచ్చని ఈసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రసార హక్కులు ఇతరత్రా మార్గాల ద్వారా 30 మిలియన్ పౌండ్లు (దాదాపు రూ. 304 కోట్లు) వరకు నష్టం వాటిల్లిందంటూ ఈసీబీకి అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే అర్ధంతరంగా రద్దైన ఈ మ్యాచ్‌ను వచ్చే ఏడాది భారత పర్యటనలో పరిమిత ఓవర్ల సిరీస్‌తో పాటు నిర్వహించాలని ఇరు బోర్డులు పరస్పర అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. ఈ విషయమై బీసీసీఐ సూచనప్రాయంగా అంగీకారం తెలిపినట్లు జై షా వెల్లడించారు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23లో భాగం జరుగుతున్న సిరీస్ కాబట్టి ఇరు జట్లకు అన్యాయం జరగకుండా ఉండేందుకే ఇరు దేశాల క్రికెట్ బోర్డులు ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా, మ్యాచ్ రద్దు ప్రకటన అనంతరం తొలుత టీమిండియా మ్యాచ్‌ను వదులుకోవడానికి సిద్ధమైందంటూ (forfeit the match) ప్రకటన విడుదల చేసిన ఈసీబీ.. నిమిషాల వ్యవధిలోనే ఆ పదాన్ని తొలగించి.. టీమిండియా కరోనా కేసుల భయం కారణంగా జట్టును బరిలోకి దించలేకపోతుందంటూ మార్చేసింది. మరోవైపు సిరీస్ ఫలితంపై ఐసీసీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయకపోగా ఈసీబీ మాత్రం ఓ విషయాన్ని స్పష్టం చేసింది. ఒకవేళ మ్యాచ్ రీ షెడ్యూల్ అయినా.. ఆ మ్యాచ్‌తో ప్రస్తుత సిరీస్‌కు సంబంధం ఉండదని, అది స్టాండ్ అలోన్ మ్యాచ్ అవుతుందని(సెపరేట్ మ్యాచ్) ఈసీబీ క్లారిటీ ఇచ్చింది. దీంతో ఈ సిరీస్‌ను టీమిండియా(2-1) అనధికారికంగా కైవసం చేసుకున్నట్టేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చదవండి: రీ షెడ్యూల్ అయినా సిరీస్‌తో సంబంధం ఉండదు: ఈసీబీ చీఫ్ -
అయ్యర్... మరిన్ని రోజులు
మాంచెస్టర్: మైదానంలో భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయస్ ఆయ్యర్ ఆటను చూసేందుకు అతడి అభిమానులు మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. అతడి ఎడమ భుజానికి చేసిన శస్త్ర చికిత్స నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో ఈ నెల 22 నుంచి ఆగస్టు 8 వరకు జరిగే ఇంగ్లండ్ దేశవాళి వన్డే టోర్నీ రాయల్ లండన్ కప్‌కు అయ్యర్ దూరమయ్యాడు. నిజానికి అతను ఈ టోర్నీలో లాంకషైర్ జట్టుకు ఆడాల్సి ఉంది. అయితే మ్యాచ్ ఫిట్నెస్ ఇంకా సాధించకపోవడంతో అయ్యర్ టోర్నీలో పాల్గొనడం లేదంటూ ఆ జట్టు తన ప్రకటనలో ప్రకటించింది. అతడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. -
పరిగెత్తుతూ కిందపడ్డాడు; రనౌట్‌కు అవకాశమున్నా..
మాంచెస్టర్: ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ టీ20 బ్లాస్ట్ క్రికెట్లో క్రీడాస్పూర్తిని ప్రదర్శించాడు. టోర్నీలో భాగంగా శుక్రవారం యార్క్‌షైర్, లంకాషైర్ మధ్య మ్యాచ్ జరిగింది. లంకాషైర్ ఇన్నింగ్స్ మధ్యలో లూక్ వెల్స్ మిడాఫ్ మీదుగా షాట్ ఆడి నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న స్టీవెన్ క్రాప్ట్‌కు కాల్ ఇచ్చాడు. అయితే క్రాప్ట్ పరుగు కోసం యత్నించి పట్టుతప్పి క్రీజు మధ్యలోనే కిందపడ్డాడు. కాలు పిక్క పట్టేయడంతో క్రాప్ట్ నొప్పితో విలవిల్లాడాడు. అయితే అప్పటికే బంతిని అందుకున్న ఫీల్డర్ కీపర్ హ్యారీ డ్యూక్‌కు అందించాడు. ఇక్కడ బ్యాట్స్‌మన్ రనౌట్‌కు అవకాశమున్నా కెప్టెన్ రూట్ డ్యూక్‌ను వద్దంటూ వారించాడు. కాగా గాయపడిన క్రాప్ట్ను పక్కకు తీసుకెళ్లి ఫిజియోతో చికిత్స చేయించి క్రీడాస్పూర్తిని ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రూట్ చేసిన పనికి నెటిజన్లు వినూత్న రీతిలో స్పందించారు. కెప్టెన్ అనే పదానికి రూట్ సరైన నిర్వచనం... ఇది అసలైన క్రీడాస్ఫూర్తి.. అంటూ కామెంట్లు పెట్టారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. లంకాషైర్ 4 వికెట్ల తేడాతో యార్క్‌షైర్‌పై విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన యార్క్‌షైర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. కెప్టెన్ జో రూట్ 32, బాలన్స్ 31, విల్ ప్రెయిన్ 22* పరుగులు చేశారు. లంకాషైర్ బౌలింగ్‌లో లూక్ వుడ్ 4 వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం 129 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంకాషైర్ మరో ఆరు బంతులు మిగిలి ఉండగా.. 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. లంకాషైర్ ఇన్నింగ్స్‌లో స్టీవెన్ క్రాప్ట్ 26 నాటౌట్, లూక్ వెల్స్ 30 పరుగులు చేసి జట్టును గెలిపించారు. What would you have done? Croft goes down injured mid run and @YorkshireCCC decide not to run him out#Blast21 pic.twitter.com/v1JHVGLn1T — Vitality Blast (@VitalityBlast) July 17, 2021 -
74 పరుగులకే ఆలౌట్.. అండర్సన్ అరుదైన ఘనత
మాంచెస్టర్: ఇంగ్లండ్ సీనియర్ స్టార్ బౌలర్ జేమ్స్ అండర్సన్ 38 ఏళ్ల వయసులోను అదరగొడుతున్నాడు. తాజాగా కౌంటీ క్రికెట్లో భాగంగా లంకాషైర్ తరపున ఆడుతున్న అండర్సన్ ఒక అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో వెయ్యి వికెట్లు తీసిన బౌలర్‌గా అండర్సన్ చరిత్ర సృష్టించాడు. అంతేగాక కెంట్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 7 వికెట్లు తీసి సత్తా చాటాడు. అండర్సన్ దెబ్బకు కెంట్ 74 పరుగులకే ఆలౌట్ అయింది. (10-5-19-7)తో అత్యుత్తమ గణాంకాలతో మెరిసిన అండర్సన్ జాక్ క్రాలే, జోర్డాన్ కాక్స్, ఓలీ రాబిన్సన్, హీనో కుహ్న్, జాక్ లీనింగ్, మాట్ మిల్నెస్, హ్యారీ పొడ్రమ్ల వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇందులో ముగ్గురు బ్యాట్స్మెన్లు డకౌట్లుగా వెనుదిరగడం విశేషం. అనంతరం లంకాషైర్ ఇన్నింగ్స్ కూడా తడబాటుతోనే ప్రారంభమైంది. ప్రస్తుతం 40 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. స్టీవెన్ క్రాఫ్ట్ 8, రాబ్ జోన్స్ 7 పరుగులతో ఆడుతున్నారు. కాగా జూన్‌లో ఇంగ్లండ్ తరపున అత్యధిక టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా అండర్సన్ నిలిచాడు. ఇప్పటివరకు 162 టెస్టు మ్యాచ్‌లు ఆడిన అతను 617 వికెట్లు తీశాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ 161 టెస్టులతో రెండో స్థానంలో ఉన్నాడు. అతని తర్వాత స్టువర్ట్ బ్రాడ్ 147 టెస్టులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా టెస్టుల్లో 600 వికెట్లకు పైగా తీసిన ఫాస్ట్ బౌలర్లలో అండర్సన్ అగ్రస్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక కౌంటీ క్రికెట్లో బిజీగా ఉన్న అండర్సన్ ఆ తర్వాత భారత్‌తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌లో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. భారత్‌లో జరిగిన టెస్టు సిరీస్ ఓటమికి అండర్సన్ ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురుచూస్తున్నాడు. కాగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ఆగస్టు 4 నుంచి ప్రారంభం కానుంది. 1️⃣0️⃣0️⃣0️⃣ first-class wickets @jimmy9 👏 Anderson has taken a 5-fer in 7 overs 🐐 Watch Anderson bowl here 👉 https://t.co/uJK9OLMTgs pic.twitter.com/j2535JaiAP — LV= Insurance County Championship (@CountyChamp) July 5, 2021 -
చివరి మూడు బంతుల్లో హ్యట్రిక్; అద్భుత విజయం
లీడ్స్: టీ20 బ్లాస్ట్ 2021లో భాగంగా శుక్రవారం లంకాషైర్, యార్క్‌షైర్ మధ్య మ్యాచ్ జరిగింది. భారీస్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో యార్క్‌షైర్ ఆఖరిఓవర్లో విజయాన్ని దక్కించుకుంది. యార్క్‌షైర్ బౌలర్ లోకి ఫెర్గూసన్ ఆఖరి ఓవర్లో హ్యాట్రిక్‌తో మెరిసి జట్టును గెలిపించాడు. లంకాషైర్‌కు చివరిఓవర్లో 20 పరుగులు అవసరం కాగా ఇన్నింగ్స్ చివరి ఓవర్‌ను ఫెర్గూసన్ వేశాడు. అయితే ఫెర్గూసన్ వేసిన రెండో బంతి నోబాల్ కావడం, ఆ తర్వాత బంతిని రాబ్ జోన్స్ ఫోర్‌గా మలిచాడు. ఇన్నింగ్స్ మూడో బంతికి సింగిల్ తీయడంతో మూడు బంతుల్లో 10 పరుగులు చేస్తే లంకాషైర్ విజయం సాధిస్తుంది. ఈ దశలోనే ఫెర్గూసన్ అద్భుతం చేశాడు. ఇన్నింగ్స్ నాలుగో బంతికి వెల్స్ ను వెనక్కి పంపిన ఫెర్గూసన్ ఐదో బంతికి లూక్ వుడ్‌ను అద్బుత యార్కర్‌తో క్లీన్ బౌల్డ్ చేశాడు. అప్పటికే లంకాషైర్ పరాజయం ఖరారైనా.. ఇంకా ఒక బంతి మిగిలి ఉండడంతో ఫెర్గూసన్ బంతిని విసిరాడు. టామ్ హార్ట్లీ భారీ షాట్‌కు యత్నించి లాంగాన్‌లో లిత్ చేతికి చిక్కాడు. అంతే ఎవరు ఊహించని విధంగా ఫెర్గూసన్ హ్యాట్రిక్ నమోదు చేయడంతో పాటు విజయాన్ని అందించాడు. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యార్క్‌షైర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. యార్క్‌షైర్ బ్యాటింగ్‌లో హారీ బ్రూక్(50 బంతుల్లో 91నాటౌట్ ; 10 ఫోర్లు, 3 సిక్సర్లతో) విధ్వంసం చేయగా.. ఓపెనర్ కెప్టెన్ లిత్ 52 పరుగులతో ఆకట్టుకున్నాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన లంకాషైర్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడినా ఆఖర్లో ఫెర్గూసన్ హ్యాట్రిక్‌తో మెరవడంతో 10 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. రాబ్ జోన్స్ 64 నాటౌట్, కీటన్ జెన్నింగ్స్ 37 పరుగులతో రాణించారు. LOCKIE FERGUSON HATTRICK 🔥 Look at those scenes 😍#Blast21 pic.twitter.com/QaFAp25KAZ — Vitality Blast (@VitalityBlast) July 2, 2021 -
లాంకషైర్ కౌంటీ జట్టు తరఫున శ్రేయస్ అయ్యర్
మాంచెస్టర్: ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో భారత బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్ అడుగు పెడుతున్నాడు. ఇంగ్లండ్ దేశవాళీ వన్డే టోర్నీ ‘రాయల్ లండన్ కప్’లో అతను లాంకషైర్ జట్టు తరఫున బరిలోకి దిగుతాడు. జూలై 15న అయ్యర్ జట్టుతో చేరతాడు. ఈ వన్డే టోర్నీలో భాగంగా నెల రోజుల పాటు జరిగే గ్రూప్ దశ మ్యాచ్‌లకు అతను అందుబాటులో ఉండే అవకాశం ఉంది. సాధారణంగా కౌంటీల్లో ఎంతో గుర్తింపు ఉన్న నాలుగు రోజుల ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల కోసం కాకుండా అయ్యర్ ప్రత్యేకంగా వన్డేల కోసం మాత్రమే లాంకషైర్‌తో జత కట్టాడు. గతంలో భారత్ నుంచి ఫరూఖ్ ఇంజినీర్, లక్ష్మణ్, గంగూలీ ఈ కౌంటీ టీమ్‌కు ప్రాతినిధ్యం వహించారు.