టెస్టు మ్యాచ్ అంటే ఐదు రోజుల్లో ఏమైనా జరుగొచ్చు. ఒక్క సెషన్ చాలు మ్యాచ్ మలుపు తిరగడానికి. ఈ మధ్య కాలంలో అసలుసిసలు టెస్టు మ్యాచ్ మజా లేక క్రికెట్ అభిమానులు నిరుత్సాహపడుతున్నారు. ఇలాంటి తరుణంలో కౌంటీ క్రికెట్‌లో అసలు టెస్టు పసందు అభిమానులకు లభించింది. కౌంటీ చాంపియన్ షిప్‌లో గత 15ఏళ్లుగా ఇలాంటి ఉత్కంఠకరమైన మ్యాచ్‌ను చూడలేదని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.
సోమర్ సెట్, ల్యాంక్‌షైర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చూసి ఇది కదా అసలు టెస్టు మజా అనుకొని అభిమాని ఉండడు. ఇరుజట్ల మధ్య విజయం దోబూచులాడగా.. చివరికి మ్యాచ్ టైగా ముగిసింది. ల్యాంక్‌షైర్ జట్టు స్పిన్నర్ కేశవ్ మహారాజ్(7/37) అదరగొట్టినా.. జట్టుకు విజయాన్నందించలేదు. 78 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సోమర్ సెట్ పరిస్థితి చావు తప్పి కన్ను లొట్ట పోయినట్టయింది. మహారాజ్ దాటికి ఎనిమిది మంది బ్యాట్‌మెన్ సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యారు. దీంతో సోమర్‌సెట్ జట్టు ఓటమి గండం నుంచి బయటపడి టైతో మ్యాచ్‌ను ముగించింది.
ల్యాంక్‌షైర్ : తొలి ఇన్నింగ్స్ 99 & రెండో ఇన్నింగ్స్ 170
సోమర్ సెట్: తొలి ఇన్నింగ్స్ 192 & రెండో ఇన్నింగ్స్ 77
78 పరుగుల స్వల్ప లక్ష్యఛేదనలో సోమర్ సెట్ బ్యాటింగ్ పరిస్థితి చూస్తే..
5-1 (3.1 ఓవర్)
5-2 (3.2)
12-3 ( 4.5)
20-4 (6.1)
23-5 (7.6)
37-6 (12.6)
56-7 (20.5)
64-8 (22.2)
77-9 (24.6)
77 ఆలౌట్ (26.4)
Comments
Please login to add a commentAdd a comment