Test Match
-
ఐర్లాండ్ వరల్డ్ రికార్డు.. ప్రపంచంలోనే తొలి టెస్టు జట్టుగా ఘనత
ఐర్లాండ్ క్రికెట్ జట్టు(Ireland Cricket Team) సరికొత్త చరిత్ర లిఖించింది. టెస్టు(Test Format)ల్లో ఇంత వరకు ఏ జట్టుకూ సాధ్యం కాని అరుదైన ఘనత సాధించింది. ‘హ్యాట్రిక్’ విజయాలతో 119 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. జింబాబ్వే(Zimbabwe)తో జరిగిన ఏకైక టెస్టు సందర్భంగా ఈ ఫీట్ నమోదు చేసింది.రాణించిన ఆండీ మెక్‌బ్రిన్ కాగా ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడే నిమిత్తం ఐర్లాండ్ జట్టు.. జింబాబ్వే పర్యటనకు వచ్చింది. ఈ క్రమంలో బులవాయో వేదికగా ఇరుజట్ల మధ్య టెస్టు మ్యాచ్ జరిగింది. క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఐరిష్ టీమ్ తొలుత బ్యాటింగ్ చేసింది.అయితే, జింబాబ్వే బౌలర్ల ధాటికి ఐర్లాండ్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ఈ క్రమంలో బౌలింగ్ ఆల్‌రౌండర్ ఆండీ మెక్‌బ్రిన్ 90 పరుగులు(నాటౌట్), టెయిలెండర్ మార్క్ అడెర్ 78 పరుగులతో రాణించారు. ఫలితంగా తమ తొలి ఇన్నింగ్స్‌లో ఐర్లాండ్ 260 పరుగుల మేర గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది.జింబాబ్వే బౌలర్లలో ముజర్బాని ఏకంగా ఏడు వికెట్లతో చెలరేగగా.. ఎంగరవ రెండు, ట్రెవర్ గ్వాండు ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇక జింబాబ్వే తమ మొదటి ఇన్నింగ్స్‌లో 267 పరుగులకు ఆలౌట్ అయి.. ఏడు పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది. నిక్ వెల్చ్ 90, ముజర్బాని 47 పరుగులతో రాణించారు.292 పరుగుల లక్ష్యం.. జింబాబ్వే బ్యాటర్ల వైఫ ల్యంఅనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఐర్లాండ్ 298 పరుగులకు ఆలౌట్ అయింది. తద్వారా జింబాబ్వే ముందు 292 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. అయితే, ఐరిష్ స్పిన్నర్ మాథ్యూ హంప్రెస్ ఆరు వికెట్లతో చెలరేగి జింబాబ్వే బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. మరోవైపు బ్యారీ మెకార్తీ రెండు, మార్క్ అడెర్, ఆండీ మెక్‌బ్రిన్ ఒక్కో వికెట్ తీశారు.జింబాబ్వే బ్యాటర్లలో వెస్లీ మధెవెరె (195 బంతుల్లో 84; 8 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బ్రియాన్ బెనెట్ (72 బంతుల్లో 45; 3 ఫోర్లు), జొనాథన్ క్యాంప్‌బెల్ (62 బంతుల్లో 33; 3 ఫోర్లు) రాణించినా ఫలితం లేకపోయింది. 228 పరుగులకే జింబాబ్వే కుప్పకూలగా.. ఐర్లాండ్ 63 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. వరుసగా మూడో టెస్టు విజయంతద్వారా టెస్టుల్లో వరుసగా మూడో విజయాన్ని(‘హ్యాట్రిక్’) నమోదు చేసింది. ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన ఐర్లాండ్ ప్లేయర్ ఆండీ మెక్‌బ్రిన్ (90 పరుగులు; 4 వికెట్లు)కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.కాగా ఎనిమిదేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నుంచి టెస్టు హోదా పొందిన ఐర్లాండ్ జట్టు ఆడిన తొలి ఏడు టెస్టుల్లోనూ ఓడిపోయింది. అయితే, గత ఏడాది మార్చిలో అఫ్గానిస్తాన్‌తో జరిగిన ఎనిమిదో టెస్టులో గెలిచి ఈ ఫార్మాట్లో తొలి విజయం నమోదు చేసుకుంది. అనంతరం జింబాబ్వేతో గత ఏడాది జూలైలో జరిగిన తొమ్మిదో టెస్టులో నెగ్గి వరుసగా రెండో గెలుపు రుచి చూసింది.తాజాగా జింబాబ్వేతోనే జరిగిన టెస్టులో ఐర్లాండ్ 63 పరుగుల తేడాతో నెగ్గి ఈ ఫార్మాట్లో ఈ మేర ‘హ్యాట్రిక్’ సాధించింది. ఇప్పటి వరకు కేవలం పది టెస్టులే ఆడిన ఐర్లాండ్.. వరుసగా మూడు మ్యాచ్‌లలో గెలుపొందడం ద్వారా.. అత్యంత తక్కువ టెస్టుల్లో ‘హ్యాట్రిక్’ విజయాలు అందుకున్న తొలి జట్టుగా చరిత్ర లిఖించింది. అంతకు ముందు సౌతాఫ్రికా 1906లో పద్నాలుగు మ్యాచ్‌ల తర్వాత హ్యాట్రిక్ కొట్టింది.తక్కువ మ్యాచ్‌ల వ్యవధిలోనే టెస్టుల్లో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసిన జట్లు👉ఐర్లాండ్- 10 మ్యాచ్‌లలో హ్యాట్రిక్- 2025👉సౌతాఫ్రికా- 14 మ్యాచ్‌లలో హ్యాట్రిక్- 1906👉ఇంగ్లండ్- 23 మ్యాచ్‌లలో హ్యాట్రిక్- 1886👉పాకిస్తాన్- 25 మ్యాచ్‌లలో హ్యాట్రిక్- 1959👉వెస్టిండీస్- 35 మ్యాచ్‌లలో హ్యాట్రిక్- 1950👉ఆస్ట్రేలియా- 50 మ్యాచ్‌లలో హ్యాట్రిక్- 1898👉శ్రీలంక- 87 మ్యాచ్‌లలో హ్యాట్రిక్- 1998👉బంగ్లాదేశ్- 88 మ్యాచ్‌లలో హ్యాట్రిక్- 2014👉ఇండియా- 109 మ్యాచ్‌లలో హ్యాట్రిక్- 1969👉న్యూజిలాండ్- 260 మ్యాచ్‌లలో హ్యాట్రిక్- 1998.చదవండి: తప్పు చేస్తున్నావ్ గంభీర్.. అతడిని బలి చేయడం అన్యాయం: మాజీ క్రికెటర్ ఫైర్ -
సిడ్నీలో భారత మాజీ క్రికెటర్‌కు అరుదైన గౌరవం.. మామగారి ‘స్వెటర్’తో వచ్చిన కోడలు(ఫొటోలు)
-
టెస్టుల్లో అత్యధిక స్కోరు నమోదు చేసిన అఫ్గనిస్తాన్.. కానీ
జింబాబ్వే- అఫ్గనిస్తాన్(Zimbabwe vs Afghanistan) జట్ల మధ్య బులవాయో వేదికగా తొలి టెస్టు ‘డ్రా’గా ముగిసింది. మ్యాచ్ చివరిరోజు ఓవర్‌నైట్ స్కోరు 515/3తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన అఫ్గనిస్తాన్ 197 ఓవర్లలో 699 పరుగులు చేసి ఆలౌటైంది. ఇక టెస్టు క్రికెట్లో అఫ్గనిస్తాన్ జట్టుకిదే అత్యధిక స్కోరు కావడం విశేషం. 2021లో అబుదాబిలో జింబాబ్వేతోనే జరిగిన టెస్టులో అఫ్గానిస్తాన్ 4 వికెట్లకు 545 పరుగులు చేసింది.హష్మతుల్లా, రహ్మత్ షా డబుల్ సెంచరీలుఇక జింబాబ్వేతో తొలి టెస్టు ఆఖరి రోజు అఫ్గానిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది(Hashmatullah Shahidi- 474 బంతుల్లో 246; 21 ఫోర్లు) డబుల్ సెంచరీ పూర్తి చేసుకోగా... అఫ్సర్ జజాయ్ (169 బంతుల్లో 113; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) శతకం సాధించాడు. అంతకుముందు మూడో రోజు రహ్మత్ షా (424 బంతుల్లో 234; 23 ఫోర్లు, 3 సిక్స్‌లు) డబుల్ సెంచరీ చేశాడు.‘డ్రా’కు అంగీకరించిన కెప్టెన్లుఓవరాల్గా అఫ్గనిస్తాన్ ఇన్నింగ్స్‌లో రెండు డబుల్ సెంచరీలు, ఒక సెంచరీ నమోదు కావడం విశేషం. 113 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే 34 ఓవర్లలో 4 వికెట్లకు 142 పరుగులు చేసింది. మ్యాచ్‌లో ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో రెండు జట్ల కెప్టెన్లు ‘డ్రా’కు అంగీకరించారు. రిజల్ట్ రాకపోయినా పరుగుల వరద పారిన ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు కనువిందు చేసింది.అఫ్గనిస్తాన్ తక్కువ టెస్టుల్లోనే ఇలాఇదిలా ఉంటే.. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 586 పరుగులు సాధించింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు జనవరి 2 నుంచి బులవాయోలోనే జరుగుతుంది. కాగా టెస్టు క్రికెట్లో తొలిసారి 600 పరుగుల స్కోరు దాటేందుకు అఫ్గనిస్తాన్ పది టెస్టులు ఆడాల్సి వచ్చింది. ఇప్పటి వరకు 10 జట్లు టెస్టుల్లో 600 అంతకంటే ఎక్కువ స్కోరు నమోదు చేశాయి. ఇందులో అఫ్గనిస్తాన్ తక్కువ టెస్టుల్లో ఈ మైలురాయిని దాటడం విశేషం.కాగా మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టులు ఆడేందుకు అఫ్గనిస్తాన్ జింబాబ్వే పర్యటన(Afghanistan tour of Zimbabwe, 2024-25)కు వెళ్లింది. టీ20 సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న అఫ్గన్.. వన్డే సిరీస్‌లోనూ 2-1తో నెగ్గింది. ఇక తొలి టెస్టును డ్రా చేసుకుంది.జింబాబ్వే వర్సెస్ అఫ్గనిస్తాన్ తొలి టెస్టు(డిసెంబరు 26-30)👉వేదిక: క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో👉టాస్: జింబాబ్వే... తొలుత బ్యాటింగ్👉జింబాబ్వే తొలి ఇన్నింగ్స్ స్కోరు: 586👉అఫ్గనిస్తాన్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 699👉జింబాబ్వే రెండో ఇన్నింగ్స్ స్కోరు: 142/4👉ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఆఖరి రోజు ‘డ్రా’కు అంగీకరించిన ఇరుజట్లు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: హష్మతుల్లా షాహిది(అఫ్గనిస్తాన్- 474 బంతుల్లో 246 పరుగులు).చదవండి: WTC 2025: భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే.. అదొక్కటే దారి! -
ఆస్ట్రేలియా ఆలౌట్.. భారత్ ముందు భారీ లక్ష్యం!
-
ఆసీస్ బౌలర్లను ఆటాడుకున్న నితీష్ రెడ్డి.. పిచ్‌పై పుష్ప స్టైల్ వార్నింగ్ (ఫొటోలు)
-
IND Vs AUS: ఆస్ట్రేలియా- భారత్ నాలుగో టెస్టు టెస్టు హైలెట్స్ (ఫొటోలు)
-
భారత్ పై ఆస్ట్రేలియా విజయం
-
ముద్దులు విసురుతూ విరాట్ సెలబ్రేషన్స్.. అనుష్క ఎదురుగా ఉంటే..!
-
INDvsAUS - 295 పరుగుల తేడాతో టీమిండియా ఘనవిజయం
-
IND vs AUS:పెర్త్ టెస్టులో భారత్ ఘన విజయం
-
ఆస్ట్రేలియా ఢమాల్
-
IND vs NZ 1st Test: తొలి టెస్టులో టీమిండియా ఓటమి
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియాకు ఘోర పరాభావం ఎదురైంది. ఈ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో భారత్ ఓటమి చవిచూసింది. 107 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. కివీ బ్యాటర్లు విల్ యంగ్(48), రచిన్ రవీంద్ర (39) ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో బ్లాక్ క్యాప్స్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే రెండు వికెట్లు పడగొట్టాడు.అంతకముందు 356 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆడిన టీమిండియా 462 పరుగుల భారీ స్కోర్ చేసింది. కానీ తొలి ఇన్నింగ్స్‌లో 45 పరుగులకే ఆలౌట్ కావడంతో ప్రత్యర్ధి ముందు భారత్ భారీ లక్ష్యాన్ని ఉంచలేకపోయింది.సర్ఫరాజ్ సూపర్ సెంచరీ..మొదటి ఇన్నింగ్స్‌లో భాతర బ్యాటర్లు విఫలమైనప్పటకి రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం అదరగొట్టారు. కేఎల్ రాహుల్, జడేజా మినహా మిగితా ప్లేయర్లందరూ తమ బ్యాట్‌కు పనిచెప్పారు. మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. 195 బంతులు ఎదుర్కొన్న సర్ఫరాజ్ 18 ఫోర్లు, 3 సిక్స్‌లతో 150 పరుగులు చేశాడు. సర్ఫరాజ్‌కు ఇదే తొలి అంతర్జాతీయ సెంచరీ. మరోవైపు వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా 99 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరితో పాటు విరాట్ కోహ్లి(70), రోహిత్ శర్మ(52) హాఫ్ సెంచరీలతో మెరిశారు.36 ఏళ్ల తర్వాత తొలి సారికాగా భారత్ గడ్డపై కివీస్ టెస్టు విజయం సాధించడం 36 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. న్యూజిలాండ్ చివరగా 1988లో వాంఖడే వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో గెలుపొందింది. మళ్లీ ఇప్పుడు భారత్‌లో 36 ఏళ్ల తర్వాత బ్లాక్ క్యాప్స్ విజయకేతనం ఎగరవేసింది. ఇక ఇరు జట్ల మధ్య రెండో టెస్టు పుణే వేదికగా ఆక్టోబర్ 24 నుంచి ప్రారంభం కానుంది. Who else but Bumrah?! ⚡Catch the thrilling finale to the first #INDvNZ Test, LIVE on #JioCinema, #Sports18 & #ColorsCineplex#IDFCFirstBankTestTrophy #JioCinemaSports pic.twitter.com/NDEGpW64Se— JioCinema (@JioCinema) October 20, 2024 -
భారత్ విజయంపై ఆశలు పెట్టుకోవద్దు: జడేజా
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఓటమి దిశగా సాగుతోంది. ప్రత్యర్ధి ముందు కేవలం 107 పరుగుల అతి స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే టీమిండియా ఉంచింది. ప్రత్యర్థి బౌలర్లు చెలరేగిన చోట మన బౌలర్లు ఏదైనా అద్భుతం చేస్తే తప్ప భారత్ ఓటమి నుంచి తప్పించుకోలేదు.అయితే టీమిండియా ఇప్పటివరకు ఇంతటి స్వల్ప లక్ష్యాన్ని ఒకే ఒక్కసారి కాపాడుకుంది 2004లో వాంఖడే వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్‌లో రాహుల్ ద్రవిడ్ సారథ్యంలోని భారత్ 107 పరుగుల లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకుని విజయం సాధించింది. ఆస్ట్రేలియాను 93 పరుగులకే ఆలౌట్ చేసి 13 పరుగుల తేడాతో చారిత్రత్మక విజయం నమోదు చేసింది. ఇప్పుడు రోహిత్ సారథ్యంలో భారత జట్టు కూడా అదే అద్భుతం చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత గెలుపుపై ఆశలు పెట్టకోవద్దని జడేజా తెలిపాడు."107 పరుగులను భారత్ డిఫెండ్ చేసుకుంటే నిజంగా చాలా గ్రేట్. కానీ వాస్తవం మాట్లాడుకుంటే టీమిండియా గెలవడం చాలా కష్టం. ఐదో రోజు ఉదయం తేమ ఎక్కువగా ఉంటుంది. భారత్ పేస్ బౌలింగ్‌తో ఆటను ప్రారంభిస్తారు. కాబట్టి బంతి పెద్దగా స్వింగ్ అవుతుందని అనుకోవడం లేదు. ఒకవేళ పిచ్ పేసర్లకు సహకరించి ఒకట్రెండు వికెట్లు పడినా, ఆ పరిస్థితులను అడ్వాంటేజ్ తీసుకునేందుకు భారత్ వద్ద మూడవ సీమర్ లేరు" అని జడేజా జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో టీమిండియా కేవలం ఇద్దరు పేసర్లతోనే ఆడుతోంది. ఆకాశ్‌దీప్‌ను బెంచ్‌కే పరిమితం చేశారు.చదవండి: క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైన క్యాచ్.. పట్టిందో ఎవరో తెలుసా? -
లక్ష్యం కివీస్107 పరుగులు... భారత్ 10 వికెట్లు!
మూడు రోజులుగా మలుపులతో టెస్టు క్రికెట్ మజాను చూపించిన బెంగళూరు మ్యాచ్ ఆసక్తికర ముగింపునకు చేరింది... తప్పులు సరిదిద్దుకొని రెండో ఇన్నింగ్స్‌లో చెలరేగిన భారత్‌కు తొలి ఇన్నింగ్స్ ప్రదర్శన వెంటాడింది... ఫలితంగా న్యూజిలాండ్ ముందు 107 పరుగుల అతి స్వల్ప లక్ష్యం... కాపాడుకోవాల్సిన పరుగులు తక్కువే కానీ ప్రత్యర్థి బౌలర్లు చెలరేగిన చోట మన బౌలర్లు నిలువరించలేరా, కుప్పకూల్చలేరా... బుమ్రా వేసిన తొలి నాలుగు బంతులు ఇదేనమ్మకాన్ని కలిగించాయి... అయితే చివరి రోజు బౌలింగ్‌తో పాటు వాతావరణం, పిచ్ కూడా మనకు కలిసి రావాలి! 35.1 ఓవర్లలో 177 పరుగులు...సర్ఫరాజ్, పంత్ భాగస్వామ్యం శనివారం భారత అభిమానులను అలరించింది...ఈ జోడీ మెరుపు బ్యాటింగ్‌తో భారీ లక్ష్యాన్ని నిర్దేశించే దిశగా జట్టు సాగుతున్నట్లు అనిపించింది... సర్ఫరాజ్ ఖాన్ కెరీర్లో తొలి సెంచరీతో మ్యాచ్‌ను చిరస్మరణీయం చేసుకోగా, శతకం చేజారినా...పంత్ చేసిన 99 పరుగులు ప్రత్యేకంగా నిలిచాయి. అయితే న్యూజిలాండ్ తీసుకున్న కొత్త బంతి భారత్ రాత మార్చింది. 408/3తో పటిష్టంగా కనిపించిన టీమ్ 54 పరుగులకే తర్వాతి 7 వికెట్లు కోల్పోయింది. దాంతో మ్యాచ్ మళ్లీ కివీస్ వైపు మొగ్గింది. బెంగళూరు: భారత్ గడ్డపై 36 ఏళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ నెగ్గేందుకు న్యూజిలాండ్ రంగం సిద్ధం చేసుకుంది. ప్రత్యర్థి ముందు భారత్ కేవలం 107 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 బంతులే ఎదుర్కొన్న కివీస్ పరుగులేమీ చేయలేదు. వెలుతురులేమి, ఆపై వాన కారణంగా అంపైర్లు ముందుగానే ఆటను నిలిపివేయాల్సి వచ్చింది. శనివారం 51.1 ఓవర్ల ఆట మాత్రమే సాగింది. అంతకు ముందు భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 99.3 ఓవర్లలో 462 పరుగులకు ఆలౌటైంది. సర్ఫరాజ్ ఖాన్ (195 బంతుల్లో 150; 18 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగగా...రిషభ్ పంత్ (105 బంతుల్లో 99; 9 ఫోర్లు, 5 సిక్స్‌లు) త్రుటిలో శతకం చేజార్చుకున్నాడు. రూర్కే, హెన్రీ చెరో 3 వికెట్లతో భారత్‌ను దెబ్బ తీశారు. భారీ భాగస్వామ్యం... ఓవర్‌నైట్ స్కోరు 231/3 వద్ద సర్ఫరాజ్, పంత్ నాలుగో రోజు ఉదయం జత కలిశారు. అక్కడినుంచి కివీస్ బౌలర్లపై వీరిద్దరి ఆధిపత్యం కొనసాగింది. ఒకరితో మరొకరు పోటీ పడుతూ పరుగులు సాధించగా...కివీస్ బౌలర్లంతా చేతులెత్తేశారు. లేట్ కట్, ర్యాంప్ షాట్లతో సర్ఫరాజ్ పరుగులు రాబట్టగా, స్లాగ్ స్వీప్‌లతో పంత్ విరుచుకుపడ్డాడు. ఒక దశలో 16 బంతుల వ్యవధిలో సర్ఫరాజ్ 5 ఫోర్లు బాదాడు. ఆ తర్వాత సౌతీ బౌలింగ్‌లో డీప్ కవర్ దిశగా కొట్టిన ఫోర్‌తో అతని సెంచరీ పూర్తయింది. ఆ తర్వాత పంత్ తన జోరును ప్రదర్శించారు. సౌతీ ఓవర్లో సిక్స్, ఫోర్ కొట్టిన అతను... పటేల్ ఓవర్లో 2 సిక్స్‌లు, ఫోర్‌తో చెలరేగాడు. ఆ తర్వాత 55 బంతుల్లో అతను హాఫ్ సెంచరీని అందుకున్నాడు. అయితే నిర్ణీత లంచ్ సమయానికి కాస్త ముందే ఆరంభమైన వర్షం...ఆ తర్వాతా కొనసాగడంతో ఆటకు అంతరాయం కలిగింది. ఆ తర్వాత ఆట మొదలయ్యాక వీరిని నిలువరించడంతో కివీస్ బౌలర్ల వల్ల కాలేదు. ఎట్టకేలకు కొత్త బంతి ఆ జట్టుకు కలిసొచ్చింది. అదే వైఫల్యం... 150 పరుగులు పూర్తి చేసుకున్న వెంటనే సర్ఫరాజ్‌ను అవుట్ చేసి సౌతీ భారత్ పతనానికి శ్రీకారం చుట్టాడు. సౌతీ తర్వాతి ఓవర్లో సిక్స్‌తో పంత్ 96కు చేరుకున్నాడు. అయితే దురదృష్టం అతడిని వెంటాడింది. 99 పరుగుల వద్ద రూర్కే వేసిన బంతిని డ్రైవ్ చేయబోగా...అతని బ్యాట్‌ను తగిలి బంతి స్టంప్స్‌పై పడింది. చిన్నస్వామి స్టేడియంలో నిశ్శబ్దం ఆవరించగా, పంత్ నిరాశగా వెనుదిరిగాడు. ఆ తర్వాత భారత అభిమానులు మరింత నిరాశ చెందే సమయం వచ్చింది. తొలి ఇన్నింగ్స్‌లాగే అదే వరుసలో రాహుల్ (12), జడేజా (5), అశ్విన్ (15) విఫలమయ్యారు. ఆ తర్వాత ఒకే ఓవర్లో హెన్రీ రెండు వికెట్లు తీసి భారత్ కథ ముగించాడు. పంత్ రనౌట్ అయి ఉంటే... సర్ఫరాజ్, పంత్ భాగస్వామ్యంలో ఒకే ఒక్క సారి కివీస్‌కు మంచి అవకాశం వచ్చింది. పంత్ 6 పరుగుల వద్ద ఉన్నప్పుడు సునాయాసంగా రనౌట్ చేసే అవకాశాన్ని జట్టు చేజార్చుకుంది. హెన్రీ వేసిన బంతిని పంత్ గల్లీ దిశగా ఆడగా సింగిల్ పూర్తి కాగా, రెండో పరుగు కోసం పంత్ బాగా ముందుకొచ్చేశాడు. సర్ఫరాజ్ వారించడంతో అతను వెనక్కి వెళ్ళాడు కానీ క్రీజ్‌కు చాలా దూరంగా ఉన్నాడు. అయితే బంతిని అందుకునేందుకు తన స్థానం నుంచి చాలా దూరం జరిగిన కీపర్ బ్లన్‌డెల్ తన వెనక ఉన్న పరిస్థితిని గుర్తించలేకపోయాడు. అతను సరైన చోట ఉంటే పంత్ అక్కడే వెనుదిరిగేవాడు! 107 గతంలో 107 లేదా అంతకంటే తక్కువ ల„ ్యాన్ని సొంతగడ్డపై భారత్ ఒకే ఒక సారి కాపాడుకుంది. 2004లో స్పిన్‌కు బాగా అనుకూలించిన ముంబై టెస్టులో 107 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 93 పరుగులకే కుప్పకూలింది. 7 టెస్టుల్లో పంత్ 90ల్లో అవుట్ కావడం ఇది ఏడో సారి. అతని ఖాతాలో 6 సెంచరీలు ఉన్నాయి. 7 భారత్ తరఫున ఈ టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి అత్యధికంగా ఏడుగురు డకౌట్ అయ్యారు. గతంలో ఇలాంటి ప్రదర్శన 1952లో (ఇంగ్లండ్‌పై) నమోదైంది. స్కోరు వివరాలు: భారత్ తొలి ఇన్నింగ్స్ 46; న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 402; భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (స్టంప్డ్) బ్లన్‌డెల్ (బి) పటేల్ 35; రోహిత్ (బి) పటేల్ 52; కోహ్లి (సి) బ్లన్‌డెల్ (బి) ఫిలిప్స్ 70; సర్ఫరాజ్ (సి) పటేల్ (బి) సౌతీ 150; పంత్ (బి) రూర్కే 99; రాహుల్ (సి) బ్లన్‌డెల్ (బి) రూర్కే 12; జడేజా (సి) యంగ్ (బి) రూర్కే 5; అశ్విన్ (ఎల్బీ) (బి) హెన్రీ 15; కుల్దీప్ (నాటౌట్) 6; బుమ్రా (సి) బ్లన్‌డెల్ (బి) హెన్రీ 0; సిరాజ్ (సి) సౌతీ (బి) హెన్రీ 0; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (99.3 ఓవర్లలో ఆలౌట్) 462. వికెట్ల పతనం: 1–72, 2–95, 3–231, 4–408, 5–433, 6–438, 7–441, 8–458, 9–462, 10–462. బౌలింగ్: సౌతీ 15–2–53–1, హెన్రీ 24.3–3–102–3, విలియమ్ రూర్కే 21–4–92–3, ఎజాజ్ పటేల్ 18–3–100–2, ఫిలిప్స్ 15–2–69–1, రచిన్ 6–0–30–0. న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: లాథమ్ (బ్యాటింగ్) 0; కాన్వే (బ్యాటింగ్) 0; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (0.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 0. బౌలింగ్: బుమ్రా 0.4–0–0–0. -
బెంగళూరులో వర్షం.. భారత్ - కివీస్ తొలి టెస్టు మొదటి సెషన్ ఆట కష్టమే! (ఫొటోలు)
-
పాక్ గడ్డపై ఇంగ్లండ్ వీరుల విధ్వంసం(ఫోటోలు)
-
జై శ్రీరాం.. ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను: ఆకాశ్ దీప్ (ఫొటోలు)
-
IND vs BAN: చెపాక్ టెస్టులో భారత్ ఘన విజయం
India vs Bangladesh, 1st Test Chennai Day 4 Updates:భారత్ ఘన విజయంచెపాక్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్‌పై 280 పరుగుల తేడాతో టీమిండియా భారీ విజయం సాధించింది. 515 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా జట్టు 233 పరుగులకు ఆలౌటైంది. 158/4 వ ఓవర్ నైట్ స్కోర్‌తో నాలుగో రోజును ఆటను ప్రారంభించిన బంగ్లాదేశ్ అశ్విన్ స్పిన్ ఉచ్చులో చిక్కు కుంది. అశ్విన్ 6 వికెట్లతో చెలరేగాడు. అశ్విన్‌తో పాటు జడేజా 3 వికెట్లు పడగొట్టాడు. బంగ్లా బ్యాటర్లలో కెప్టెన్ నజ్ముల్ హోస్సేన్ శాంటో(82) మినహా మిగితా ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు.విజయానికి చేరువలో భారత్.. తొలి టెస్టులో విజయానికి భారత్ కేవలం రెండు వికెట్ల దూరంలో నిలిచింది. వరుస క్రమంలో బంగ్లాదేశ్ వికెట్లు కోల్పోయింది. మెహదీ హసన్ మిరాజ్ ఏడో వికెట్‌గా వెనుదిరగా.. కెప్టెన్ షాంటో(82) ఎనిమిదో వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. రవిచంద్రన్ అశ్విన్ మరో ఐదు వికెట్ల ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.ఆరో వికెట్ డౌన్..చెపాక్ టెస్టులో బంగ్లాదేశ్ ఓటమి దిశగా అడుగులు వేస్తోంది. లిట్టన్ దాస్ రూపంలో బంగ్లా ఆరో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన దాస్.. జడేజా బౌలింగ్‌లో రోహిత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. భారత్ విజయానికి ఇంకా 4 వికెట్ల దూరంలో నిలిచింది.ఐదో వికెట్ డౌన్..194 పరుగుల వద్ద బంగ్లాదేశ్ ఐదో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన షకీల్ అల్ హసన్.. అశ్విన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అశ్విన్ నాలుగో రోజు ఆటలో తన వేసిన తొలి ఓవర్లో భారత్‌కు వికెట్‌ను అందించాడు. క్రీజులోకి లిట్టన్ దాస్ వచ్చాడు. 54 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది.నిలకడగా ఆడుతున్న బంగ్లా..నాలుగో రోజు ఆటలో బంగ్లా బ్యాటర్లు షాంటో(64), షకీల్ అల్ హసన్(25) నిలకడగా ఆడుతున్నారు. 51 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ 4 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. బంగ్లా విజయానికి ఇంకా 321 పరుగులు అవసరం.చెపాక్ వేదికగా బంగ్లాదేశ్-భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. బంగ్లాదేశ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. క్రీజులో బంగ్లా కెప్టెన్ నజ్ముల్ షాంటో(51), షకీబ్ అల్ హసన్(5) ఉన్నారు. బంగ్లాదేశ్ తమ విజయానికి 357 పరుగుల దూరంలో ఉంది. టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ తొలి టెస్టు సెప్టెంబరు 19- 23వేదిక: చెపాక్ స్టేడియం, చెన్నైటాస్: బంగ్లాదేశ్.. తొలుత బౌలింగ్టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరు: 376బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 149తుదిజట్లు:టీమిండియారోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్.బంగ్లాదేశ్షాద్మాన్ ఇస్లాం, జకీర్ హసన్, నజ్ముల్ హుస్సేన్ శాంటో(కెప్టెన్), మొమినుల్ హక్, ముష్ఫికర్ రహీం, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్(వికెట్ కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, హసన్ మహమూద్, నహీద్ రాణా. -
భారత్ vs బంగ్లాదేశ్ తొలి టెస్టు మ్యాచ్ హైలైట్స్ (ఫోటోలు)
-
అంతా అనుకున్నట్టే.. న్యూజిలాండ్- అఫ్గాన్ టెస్టు రద్దు
అందరూ ఊహించిందే జరిగింది. నోయిడా వేదికగా అఫ్గానిస్తాన్-న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన ఏకైక టెస్టు మ్యాచ్ ఐదో రోజు ఆట కూడా వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో ఈ చారిత్రత్మక టెస్టు మ్యాచ్ కనీసం టాస్ పడకుండానే తుడిచిపెట్టుకుపోయింది. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. "నోయిడాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఆఫ్ఘనిస్తాన్‌తో జరగాల్సిన ఏకైక టెస్టు మ్యాచ్ రద్దు చేయబడింది. ఐదవ రోజు ప్రారంభంలోనే అంపైర్లు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. సెప్టెంబర్ 18న ప్రారంభమయ్యే రెండు టెస్టుల సిరీస్ కోసం బ్లాక్ క్యాప్స్ శ్రీలంకకు పయనం కానున్నారు అని న్యూజిలాండ్ క్రికెట్ ఎక్స్‌లో రాసుకొచ్చింది.కాగా ఈ సిరీస్ వాస్తవానికి సెప్టెంబర్ 9న ప్రారంభమవ్వాల్సింది. కానీ కుండపోత వర్షం వల్ల మైదానం ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది. అయితే తొలి రెండు రోజులు పగలు సమయంలో పెద్దగా వర్షం కురవనప్పటకి.. మైదానాన్ని గ్రౌండ్ స్టాప్ సిద్దం చేయలేకపోయారు. గ్రేటర్ నోయిడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్లో సరైన మౌళిక సదుపాయాలు లేకపోవడమే అందుకు కారణం. గ్రౌండ్లో కురిసిన నీరు బయటకు వెళ్లేందుకు అసలు డ్రైనేజీ వ్యవస్థ, మైదానాన్ని సన్నద్ధం చేసే పరికరాలు అందుబాటులో లేవు. ఆ తర్వాత మరింత వర్షాలు కురవడంతో గ్రౌండ్ మొత్తం చిన్నపాటి చెరువులా తయారైంది. ఆఖరి మూడు రోజులు కనీసం ఆటగాళ్లు హోటల్ నుంచి స్టేడియం కూడా రాలేదు. అంటే నోయిడా మైదానంలో పరిస్థితి ఏ విధంగా ఉందో మనం ఆర్ధం చేసుకోవచ్చు. చివరికి టాస్ పడకుండానే అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేయాల్సి వచ్చింది. టెస్టు క్రికెట్లో తమ ఉనికిని చాటుకోవాలని భావించిన అఫ్గానిస్తాన్‌కు నిరాశే ఎదురైంది.చదవండి: IPL 2025: రోహిత్ ముంబై ఇండియన్స్‌తోనే కొనసాగాలి.. ఎందుకంటే? -
Afg vs NZ: మొన్న అలా.. ఇప్పుడిలా! ఖేల్ ఖతం?
అఫ్గనిస్తాన్- న్యూజిలాండ్‌ల మధ్య జరగాల్సిన ఏకైక టెస్టుకు అడ్డంకులు కొనసాగుతూనే ఉన్నాయి. వర్షం కారణంగా మూడో రోజు ఆట కూడా.. కనీసం టాస్ పడకుండానే ముగిసిపోయింది. కాగా 2017లో టెస్టు హోదా సంపాదించిన అఫ్గన్ జట్టు.. తటస్థ వేదికలపై తమ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడుతోంది. ఈ క్రమంలో న్యూజిలాండ్‌తో తొలిసారిగా టెస్టు ఆడేందుకు వేదికగా భారత్‌ను ఎంచుకుంది.సోమవారమే మొదలు కావాలి.. కానీభారత క్రికెట్ నియంత్రణ మండలిని సంప్రదించి తమ రాజధాని కాబూల్‌కు దగ్గరగా ఉన్న గ్రేటర్ నోయిడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్టేడియానికి విచ్చేసింది. ఇందులో భాగంగా.. షెడ్యూల్ ప్రకారం అఫ్గన్- కివీస్ జట్ల మధ్య సోమవారం నుంచి టెస్టు మ్యాచ్ మొదలుకావాలి.. కానీ రెండు రోజుల పాటు ఆటగాళ్లు మైదానంలో దిగే పరిస్థితి లేకపోయింది. ఆట ముందుకు సాగడమే గగనమైంది.తొలి రెండు రోజులు వాన చినుకు జాడ లేకపోయినా... మైదానం మాత్రం ఆటకు సిద్ధం కాలేదు. గత రెండు వారాల క్రితం నోయిడాలో కురిసిన భారీ వర్షాల కారణంగా అవుట్ ఫీల్డ్ మొత్తం తడిగా మారింది. నీరు బయటకు వెళ్లేందుకు గ్రేటర్ నోయిడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్లో అసలు డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం.అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ అపహాస్యమయ్యే దుస్థితి అదే విధంగా... మైదానాన్ని ఆటకు వీలుగా ఆరబెట్టే పరికరాలు అందుబాటులో లేకపోవడంతో ఒక అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ అపహాస్యమయ్యే దుస్థితి తలెత్తింది. కేవలం నోయిడా స్టేడియంలో సరైన సౌకర్యాలు లేకపోవడం వల్లే అఫ్గనిస్తాన్ జట్టుకు భంగపాటు ఎదురవుతోంది. రెండోరోజు ఆట జరిపించేందుకు మంగళవారం మైదానంలో పదుల సంఖ్యలో గ్రౌండ్ సిబ్బంది తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయింది.ల్యాండ్‌స్కేప్ గడ్డి గడుల్ని తెచ్చి మైదానమంతా పరిచేందుకు చెమటోడ్చినా అవుట్‌ఫీల్డ్ పొడిబారలేదు. ఫ్యాన్లు అమర్చి మైదానం ఎండేలా కృషి చేసినా ఫలితం శూన్యం. దీంతో కనీసం మూడో రోజైనా పరిస్థితి మెరుగపడుతుందని అఫ్గన్- న్యూజిలాండ్ జట్ల ఆటగాళ్లు, అభిమానులు ఎదురుచూశారు.ఇప్పుడిక వర్షంఅయితే, ఈరోజు వర్షం కారణంగా పరిస్థితి మరింత దారుణంగా మారింది. వాన కురుస్తున్న కారణంగా అవుట్ ఫీల్డ్ మొత్తం కవర్లతో కప్పేశారు గ్రౌండ్స్‌మెన్. దీంతో మూడో రోజు కూడా ఆటను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఇక మరో రెండు రోజుల పాటూ నోయిడాలో భారీ వర్షాలు కురిసే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో అఫ్గన్- కివీస్ టెస్టు మొదలుకాకుండానే ముగిసిపోయే దుస్థితి నెలకొంది.చదవండి: DT 2024: భారత ‘ఎ’ జట్టులోషేక్ రషీద్.. టీమిండియాతో చేరని సర్ఫరాజ్ ఖాన్! -
అయ్యో పాపం!.. అఫ్గనిస్తాన్ జట్టుకు ఏమిటీ ‘పరీక్ష’?
న్యూజిలాండ్‌తో తొలిసారిగా టెస్టు మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైన అఫ్గనిస్తాన్ జట్టుకు వరుసగా అడ్డంకులు ఎదురవుతున్నాయి. నోయిడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ మైదానంలో సరైన వసతిలేని కారణంగా రెండో రోజు ఆట కూడా రద్దైపోయింది. ఒక్క బంతి కూడా పడకుండానే మంగళవారం నాటి ఆట ముగిసిపోయింది. దీంతో ఇరుజట్ల ఆటగాళ్లు తీవ్ర అసంతృప్తితో స్టేడియం నుంచి నిష్క్రమించినట్లు సమాచారం.కారణం ఇదేకాగా స్వదేశంలో మ్యాచ్‌లు నిర్వహించే పరిస్థితిలేని కారణంగా అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు తటస్థ వేదికలను ఎంచుకుంటోంది. ఈ క్రమంలో తొలిసారిగా కివీస్‌తో టెస్టు ఆడేందుకు భారత్‌లోని గ్రేటర్ నోయిడా మైదానాన్ని ఎంచుకుంది. ఇందుకు సంబంధించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి నుంచి కూడా ఆమోదం రావడంతో అఫ్గన్ జట్టు నోయిడాకు చేరుకుంది.ఇక షెడ్యూల్ ప్రకారం సోమవారమే(సెప్టెంబరు 9) అఫ్గన్- కివీస్ ఏకైక టెస్టు ఆరంభం కావాల్సి ఉంది. అయితే, గత రెండు వారాలుగా కురిసిన భారీ వానల కారణంగా నోయిడా స్టేడియం అవుట్ ఫీల్డ్ మొత్తం తడిసిపోయింది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు గ్రౌండ్స్‌మెన్ ఎంతగా కష్టపడినా ఫలితం లేకపోయింది. ఈ స్టేడియంలో ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణం. కాబట్టి మళ్లీ ఎండకాస్తే తప్ప గ్రౌండ్ ఆరే పరిస్థితి లేదు. అయితే, రెండురోజులుగా నోయిడాలో వర్షం లేకపోయినా.. వాతావరణం మాత్రం పొడిగా లేదు. అయినప్పటికీ సూపర్ ఫ్యాన్లతో ఆరబెట్టేందుకు సిబ్బంది ప్రయత్నించారు. ఈ క్రమంలో నిన్నటితో పోలిస్తే కాస్త పరిస్థితి మెరుగైనా ఆట మొదలుపెట్టేందుకు అనుకూలంగా లేకపోయింది. రెండో రోజు కూడా టాస్ పడకుండానేఈ నేపథ్యంలో టాస్ పడకుండానే అఫ్గన్- న్యూజిలాండ్ తొలిరోజు ఆట ముగిసిపోయింది. దీంతో రెండో రోజు నుంచి అరగంట ఎక్కువసేపు మ్యాచ్ నిర్వహిస్తామని అంపైర్లు తెలిపారు. అయితే, ఈ రోజు(మంగళవారం) కూడా అదే పరిస్థితి ఎదురైంది. అవుట్‌ఫీల్డ్ చిత్తడిగా ఉండటంతో మ్యాచ్ ఆడే పరిస్థితి లేదని అంపైర్లు ఆటను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో అఫ్గనిస్తాన్ అధికారులు, ఆటగాళ్లు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. కివీస్‌కు నష్టమేమీ లేదు.. కానీనోయిడా స్టేడియం మేనేజ్మెంట్ వల్ల తమ చారిత్రాత్మక మ్యాచ్‌కు అవరోధాలు ఎదురవుతున్నాయని.. మరోసారి ఇక్కడకు రాబోమంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-2025 సైకిల్లో ఈ మ్యాచ్ భాగం కాదు కాబట్టి న్యూజిలాండ్‌కు పెద్దగా వచ్చే నష్టమేమీలేదు. అయితే, వరల్డ్ టెస్టు చాంపియన్‌తో టెస్టు ఆడి.. సత్తా చాటాలని భావించిన అఫ్గన్ ఆటగాళ్లకే తీవ్ర నిరాశ ఎదురైంది.చదవండి: Ind vs Ban T20Is: టీమిండియాకు శుభవార్త -
Afg vs NZ: ‘చెత్తగా ఉంది.. ఇంకోసారి ఇక్కడకు రాబోము’
న్యూజిలాండ్‌తో తమ చారిత్రాత్మక టెస్టు మ్యాచ్‌కు అడ్డంకులు ఎదురైన నేపథ్యంలో అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు(ఏసీబీ) అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నోయిడా స్టేడియంలో పరిస్థితి చాలా దారుణంగా ఉందని.. కనీస వసతులు కూడా లేవంటూ పెదవి విరిచారు. ఇలాంటి చోట ఇంకోసారి అడుగు కూడా పెట్టబోమంటూ ఘాటు విమర్శలు చేశారు.తటస్థ వేదికలపైకాగా తమ దేశంలో అంతర్జాతీయ మ్యాచ్‌లు నిర్వహించే పరిస్థితి లేదు కాబట్టి తాము ఆడే మ్యాచ్‌లను తటస్థ వేదికలపై ఆడుతోంది అఫ్గన్ జట్టు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లేదంటే భారత్ వేదికగా ప్రత్యర్థి జట్లకు ఆతిథ్యం ఇస్తోంది. ఇందులో భాగంగా గతంలో గ్రేటర్ నోయిడాలోని షాహిద్ విజయ్ పాతిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను హోం గ్రౌండ్‌గా చేసుకుని పలు మ్యాచ్‌లు ఆడింది అఫ్గన్ జట్టు. వర్షం కురవనేలేదు.. అయినా..ఈ క్రమంలో న్యూజిలాండ్ వంటి పటిష్ట జట్టుతో తొలిసారి టెస్టు ఆడేందుకు సిద్ధమైన మరోసారి నోయిడాకు విచ్చేసింది. అయితే, సోమవారం(సెప్టెంబరు 9) మొదలుకావాల్సిన అఫ్గన్- కివీస్ మ్యాచ్‌కు ప్రతికూల పరిస్థితులు అడ్డుపడ్డాయి. ఫలితంగా ఇరుజట్ల మధ్య మొదలుకావాల్సిన ఏకైక టెస్టు తొలి రోజు ఆట పూర్తిగా రద్దయ్యింది. నిజానికి సోమవారం ఏమాత్రం వర్షం కురవనేలేదు. కానీ కొన్నిరోజుల పాటు కురిసిన కుండపోత వర్షాల వల్ల నోయిడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ మైదానం చిత్తడిగా మారింది. మ్యాచ్ ఆడేందుకు గ్రౌండ్ ఏమాత్రం అనుకూలంగా లేదు.ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ లేదుదీంతో ఆటగాళ్లు మైదానంలో దిగే అవకాశమే లేకపోవడంతో పలుమార్లు స్టేడియాన్ని పరిశీలించిన ఫీల్డు అంపైర్లు కుమార ధర్మసేన, షర్ఫుద్దౌలా చేసేదేమి లేక తొలిరోజు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ ఏదీ ఇక్కడ లేకపోవడంతో మైదానం తడారిపోయేందుకు ఎండకాయాల్సిందే! కాబట్టి.. దీని కారణంగా మ్యాచ్‌పై ఎన్నిరోజులు ప్రభావం పడుతుందో స్పష్టంగా చెప్పడం కష్టం.చెత్తగా ఉంది.. ఇంకోసారి ఇక్కడకు రాబోముఈ నేపథ్యంలో అఫ్గన్ బోర్డు అధికారులు తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. ‘‘ఇక్కడి పరిస్థితి చెత్తగా ఉంది. ఇంకోసారి ఇక్కడకు రాకూడదని నిశ్చయించుకున్నాం. ఇక్కడ కనీస వసతులు లేవు. మా ఆటగాళ్లు కూడా నిరాశకు లోనయ్యారు. నిజానికి.. గతంలో మేము ఇక్కడకు వచ్చినపుడు కూడా పరిస్థితి ఇలాగే ఉంది.మాకు సొంతగడ్డ లాంటిదిఅందుకే ముందుగానే సంబంధిత అధికారులతో మాట్లాడాము. మాకు ఎలాంటి ఇబ్బంది కలగబోదని స్టేడియం వాళ్లు హామీ ఇచ్చారు. కానీ ఇక్కడ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. గతంలో కంటే ఏమాత్రం అభివృద్ధి చెందలేదు’’ అని అసహనం వ్యక్తం చేశారు. కాగా ఈ మ్యాచ్ షెడ్యూల్ ఖరారు కాగానే.. అఫ్గనిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది బీసీసీఐ, ఏసీబీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్ తమకు సొంతగడ్డ లాంటిదని.. ఇక్కడ తాము ఆడబోయే మ్యాచ్‌కు మంచి వేదికను ఏర్పాటు చేయాలని కోరాడు. అయితే, పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉండటంతో అతడు కూడా నిరాశకు లోనైనట్లు తెలుస్తోంది. కాగా 2017లో టెస్టు హోదా పొందిన అఫ్గనిస్తాన్ ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్‌లు ఆడి మూడింట గెలిచి.. ఆరింట ఓడిపోయింది. ఇక న్యూజిలాండ్‌తో అఫ్గన్ ఆడుతున్న తొలి టెస్టు ఇదే! చదవండి: ముషీర్ ఖాన్‌కు బీసీసీఐ బంపరాఫర్.. టీమిండియాలో చోటు? -
కివీస్‌తో టెస్టుకు అఫ్గన్ జట్టు ప్రకటన.. రషీద్ లేకుండానే!
న్యూజిలాండ్‌తో ఏకైక టెస్టుకు అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. హష్మతుల్లా షాహిద్ కెప్టెన్సీలోని ఈ టీమ్‌లో మొత్తంగా పదహారు మంది సభ్యులకు చోటిచ్చిన్నట్లు తెలిపింది. ఇందులో ముగ్గురు అన్క్యాప్డ్ ప్లేయర్లు రియాజ్ హసన్, షామ్స్ ఉర్ రహమాన్, ఖలీల్ అహ్మద్‌లను తొలిసారి జట్టుకు ఎంపికచేసినట్లు పేర్కొంది. నోయిడా వేదికగా.. రషీద్ ఖాన్ లేకుండానేఅయితే, గాయం కారణంగా స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ మాత్రం ఈ మ్యాచ్‌కు దూరం కానున్నాడు.కాగా భారత్ వేదికగా అఫ్గనిస్తాన్- న్యూజిలాండ్ మధ్య సెప్టెంబరు 8 నుంచి టెస్టు మ్యాచ్ ఆరంభం కానుంది. ఇందుకోసం ఇప్పటికే కివీస్ ఆటగాళ్లు భారత్‌కు చేరుకున్నారు. అఫ్గన్‌తో జరుగనున్న మొట్టమొదటి టెస్టులో విజయమే లక్ష్యంగా సన్నాహకాలు ముమ్మరం చేశారు.ఈ క్రమంలో అఫ్గన్ బోర్డు సైతం ఆచితూచి జట్టును ఎంపిక చేసుకుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ తొలి టైటిల్ గెలిచిన న్యూజిలాండ్‌ను ఢీకొట్టేందుకు అన్ని రకాలుగా సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, వంటి టాప్ బ్యాటర్లతో పాటు.. స్టార్ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ తదితరులు అఫ్గన్‌కు కీలకం కానున్నారు. రహ్మనుల్లా గుర్బాజ్‌కు నో ప్లేస్అదే విధంగా ఓపెనింగ్ బ్యాటర్లు అబ్దుల్ మాలిక్, బహీర్ షా, వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇక్రం అలిఖిల్, అఫ్సర్ జజాయ్లతో బ్యాటింగ్ విభాగం సిద్ధమైంది. ఇక అజ్మతుల్లాతో పాటు ఆల్‌రౌండర్ల విభాగంలో షాహిదుల్లా కమల్, షామ్స్ ఉర్ రహమాన్ చోటు దక్కించుకున్నారు. ఇక రషీద్ ఖాన్ గైర్హాజరీలో కైస్ అహ్మద్, జియా ఉర్ రెహమాన్, ఖలీల్ అహ్మద్, జాహీర్ ఖాన్ స్పిన్దళంలో చోటు దక్కించుకోగా.. ఫాస్ట్ బౌలర్లలో నిజత్ మసూద్ ఒక్కడికే ఈ జట్టులో స్థానం దక్కింది. అయితే, రహ్మనుల్లా గుర్బాజ్‌కు మాత్రం ఈ జట్టులో చోటు దక్కకపోవడం గమనార్హం. కాగా అఫ్గనిస్తాన్ ఇప్పటి వరకు మొత్తంగా తొమ్మిది టెస్టు మ్యాచ్‌లు ఆడి కేవలం మూడింట గెలిచింది.న్యూజిలాండ్‌తో గ్రేటర్ నోయిడాలో ఏకైక టెస్టుకు అఫ్గన్ జట్టుహష్మతుల్లా షాహిది (కెప్టెన్), ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, అబ్దుల్ మాలిక్, రియాజ్ హసన్, అఫ్సర్ జజాయ్, ఇక్రం అలిఖిల్, బహీర్ షా మహబూబ్, షాహిదుల్లా కమల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షామ్స్ ఉర్ రహమాన్, జియా ఉర్ రెహ్మాన్ అక్బర్, జహీర్ ఖాన్ పక్తీన్, కైస్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, నిజత్ మసూద్. -
PAKvBAN: క్లీన్‌స్వీప్ దిశగా బంగ్లాదేశ్
రావల్పిండి: పాకిస్తాన్‌ను వారి సొంతగడ్డపై బంగ్లాదేశ్ క్లీన్‌స్వీప్ చేసే ప్రదర్శనను వాన చినుకులు ఆటంకపరిచాయి. ఇంకా ఆఖరి రోజు ఆట మిగిలుండగా స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బంగ్లా ఓపెనర్లు జకీర్ హసన్ (31 బ్యాటింగ్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), షాద్మన్ ఇస్లామ్ (9 బ్యాటింగ్) చక్కని ఆరంభం ఇచ్చారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 9/2తో నాలుగో రోజు సోమవారం రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన పాకిస్తాన్ 46.4 ఓవర్లలో 172 పరుగులకే కుప్పకూలింది. ఆట మొదలైన కొద్దిసేపటి తర్వాత ఓపెనర్ అయూబ్ (20; 3 ఫోర్లు), కెప్టెన్ షాన్ మసూద్ (28; 4 ఫోర్లు), అనుభవజు్ఞడైన బాబర్ ఆజమ్ (11; 1 ఫోర్) స్వల్ప వ్యవధిలో అవుటయ్యారు. టస్కిన్ అహ్మద్ ఓవర్లో అయూబ్ ని్రష్కమించగా, యువ సీమర్ నహిద్ రాణా... మసూద్, బాబర్‌లతో పాటు సౌద్ షకీల్ (2)ల వికెట్లను పడగొట్టాడు. దీంతో 21వ ఓవర్లలో 81 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన పాక్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో రిజ్వాన్ (73 బంతుల్లో 43; 5 ఫోర్లు), సల్మాన్ ఆగా (71 బంతుల్లో 47 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఏడో వికెట్‌కు 55 పరుగులు జోడించాక రిజ్వాన్‌ను హసన్ మహ్ముద్ అవుట్ చేయడంతో మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. హసన్, నహిద్ టెయిలెండర్ల పనిపట్టడంతో పాక్ ఆలౌటయ్యేందుకు ఎంతోసేపు పట్టలేదు. రెండో టెస్టు ఆడుతున్న 24 ఏళ్ల పేసర్ హసన్ మహ్ముద్ (5/43), మూడో టెస్టు ఆడుతున్న 21 ఏళ్ల సీమర్ నహిద్ రాణా (4/44) పాక్‌ను చావుదెబ్బ కొట్టారు. 12 పరుగుల తొలిఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని బంగ్లా ముందు 185 పరుగుల లక్ష్యం ఉండగా... వర్షంతో ఆట నిలిచే సమయానికి బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 7 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 42 పరుగులు చేసింది. ఓపెనర్లు జకీర్ హసన్, ఇస్లామ్ అజేయంగా క్రీజులో ఉన్నారు. వర్షం వల్ల నాలుగో రోజు కేవలం 50 ఓవర్ల ఆటే సాధ్యమైంది. ఇదే వేదికపై జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ 10 వికెట్ల తేడాతో గెలిచింది. -
పాకిస్తాన్ కు ఘోర అవమానం.. రెచ్చిపోయిన బంగ్లాదేశ్
-
ఏకైక టెస్టు.. ఆసీస్ చేతిలో భారత్ ఓటమి
భారత మహిళల ‘ఎ’ జట్టు ఆస్ట్రేలియా పర్యటను ఓటమితో ముగించింది. గోల్డ్‌కోస్ట్ వేదికగా జరిగిన ఏకైక అనధికారిక టెస్టు మ్యాచ్‌లో 45 పరుగుల తేడాతో ఆసీస్‌తో చేతిలో భారత్ ఓటమి పాలైంది. 289 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 243 పరుగులకు ఆలౌటైంది. ఇండియా బ్యాటర్లలో ఉమన్ ఛెత్రి 47 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ప్రియా పునియా(36), శుభా సతీష్(45) పరుగులతో తమ వంతు ప్రయత్నం చేశారు. ఆసీస్ బౌలర్లలో ఫ్లింటాఫ్, నాట్ తలా మూడు వికెట్టు పడగొట్టారు. అంతకుముందు ఆ్రస్టేలియా ‘ఎ’ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 92 ఓవర్లలో 260 పరుగులు చేసి ఆలౌటైంది. మ్యాడీ డార్క్ (197 బంతుల్లో 105 నాటౌట్; 4 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. డి బ్రోగే(58) పరుగులతో రాణించింది. భారత బౌలర్లలో మిన్నుమణి 6 వికెట్లు తీయగా, సయాలీ, ప్రియా మిశ్రా చెరో 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 28 పరుగులు కలుపుకొని భారత్ ముందు 289 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆ లక్ష్యాన్ని ఛేదించడంలో భారత్ విఫలమైంది. -
NZ vs SL: అంతర్జాతీయ క్రికెట్లో 6 రోజుల టెస్టు మ్యాచ్..
అంతర్జాతీయ క్రికెట్లో టెస్టు మ్యాచ్ అంటే ఐదు రోజుల పాటు జరుగుతుందన్న సంగతి తెలిసిందే. దేశవాళీ క్రికెట్లో, అనాధకరిక టెస్టు మ్యాచ్‌లు నాలుగు రోజులు పాటు కూడా జరగుతాయి. కానీ గతంలో ఆరు రోజుల టెస్టు మ్యాచ్‌లు కూడా జరిగేవి ఉన్న విషయం మీకు తెలుసా?1980లు, 90ల్లో 6 రోజుల టెస్టు మ్యాచ్ బాగా పాపులర్. ఇంగ్లండ్‌లో అనేక మ్యాచ్‌లు ఆరు రోజుల పాటు జరిగాయి. చివరగా అంతర్జాతీయ క్రికెట్లో ఆరు రోజుల టెస్టు మ్యాచ్ 2008లో బంగ్లాదేశ్-శ్రీలంక మధ్య జరిగింది. అయితే ఇదింతా ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా? అది తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.16 ఏళ్ల తర్వాత తొలిసారి..?అంతర్జాతీయ క్రికెట్లో 16 ఏళ్ల తర్వాత తొలిసారి ఆరు రోజుల మ్యాచ్ జరగనుంది. ఈ అరుదైన ఘట్టానికి సెప్టెంబర్ 18 నుంచి శ్రీలంక-న్యూజిలాండ్ మధ్య ప్రారంభం కానున్న తొలి టెస్టు వేదిక కానుంది. వచ్చె నెలలలో న్యూజిలాండ్ రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడేందుకు శ్రీలంకకు రానుంది. ఈ సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ సెప్టెంబర్ 18 నుంచి 23 వరకు ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఆరు రోజుల పాటు జరగనుంది. దేశంలో అధ్యక్ష ఎన్నికల కారణంగా సెప్టెంబర్ 21 న మ్యాచ్ జరగడం లేదు. ఆ రోజును విశ్రాంతిగా ప్రకటించారు. తొలి రెండు రోజుల తర్వాత ఒక్క రోజు(సెప్టెంబర్ 21 )ను రెస్ట్ డేగా ఇచ్చారు. ఆ తర్వాత తిరిగి మళ్లీ 22, 23, 24 తేదీల్లో మ్యాచ్ కొనసాగుతుంది. అయితే రెండో టెస్టు మాత్రం యధావిధిగా 5 రోజుల పాటే జరగనుంది. కాగా ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను శ్రీలంక క్రికెట్ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది.అప్పుడు బంగ్లాలో.. ఇప్పుడు శ్రీలంకలోశ్రీలంక చివరగా ఆరు రోజుల టెస్టు మ్యాచ్ 2008లో ఆడింది. ఆ ఏడాది శ్రీలంక క్రికెట్ జట్టు మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడేందుకు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లింది. అయితే ఈ సిరీస్‌లో తొలి టెస్టు మ్యాచ్ ఆరు రోజుల పాటు జరిగింది. బంగ్లాదేశ్‌లో పార్లమెంట్ ఎన్నికల కారణంగా ఆరు రోజుల పాటు టెస్టును షెడ్యూల్ చేశారు. డిసెంబర్ 26 నుంచి 31 వరకు ఆ టెస్టు మ్యాచ్ కొనసాగింది. మళ్లీ ఇప్పుడు 16 ఏళ్ల తర్వాత తొలిసారి శ్రీలంక ఆరు రోజుల టెస్టు మ్యాచ్ ఆడనుంది. -
చరిత్ర సృష్టించిన భారత క్రికెటర్.. ఒకే మ్యాచ్‌లో 10 వికెట్లు
చెపాక్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత మహిళ స్పిన్నర్ స్నేహ రాణా అద్బుతమైన ప్రదర్శన కనబరిచింది.. తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు పడగొట్టి సౌతాఫ్రికాకు చుక్కలు చూపించిన రానా.. రెండో ఇన్నింగ్స్‌లో కూడా రెండు కీలక వికెట్లతో సత్తాచాటింది.ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా రానా 10 వికెట్లు పడగొట్టి సఫారీలను కట్టడి చేసింది. ఈ క్రమంలో స్నేహ రాణా అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. మహిళల టెస్టు క్రికెట్లో 10 వికెట్లు పడగొట్టిన రెండో భారత బౌలర్‌గా స్నేహ రాణా రికార్డులకెక్కింది. ఈ జాబితాలో స్నేహ రాణా కంటే ముందు భారత మహిళ క్రికెట్ దిగ్గజం జులాన్ గోస్వామి ఉంది. 2006లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో జులాన్ 10 వికెట్లు సాధించింది. అయితే ఈ ఫీట్ సాధించిన తొలి భారత మహిళా స్పిన్నర్ స్నేహనే కావడం విశేషం. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 266 పరుగులకు ఆలౌట్ కావడంతో ఫాలోన్ గండం దాటలేకపోయింది.ఈ క్రమంలోనే ఫాలో ఆన్ ఆడిన దక్షిణాఫ్రికా మహిళల జట్టు సెకెండ్ ఇన్నింగ్స్‌లో 373 పరుగులకు ఆలౌలైంది. దీంతో భారత్ ముందు కేవలం 37 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే దక్షిణాఫ్రికా ఉంచింది. అంతకముందు భారత్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 603 పరుగుల భారీ స్కోర్ చేసింది. Edged and taken!Shubha Satheesh takes a sharp low catch at first-slip 👌👌South Africa lose their 8th wicket.Follow the match ▶️ https://t.co/4EU1Kp6YTG#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/LDYR5uCeme— BCCI Women (@BCCIWomen) July 1, 2024 -
భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్.. ఫ్యాన్స్‌కు ఫ్రీ ఎంట్రీ
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత మహిళల జట్టు.. ఇప్పుడు అదే జట్టుతో ఏకైక టెస్టు మ్యాచ్ కోసం సిద్దమవుతోంది. భారత్-దక్షిణాఫ్రికా మహిళల మధ్య ఏకైక టెస్టుకు చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదిక కానుంది. ఈ చారిత్రత్మక టెస్టు మ్యాచ్ జూన్ 28 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు ముందు తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (టీఎన్‌సీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్‌ను వీక్షించేందుకు ఫ్యాన్స్‌కు ఉచితంగా ఎంట్రీ ఇవ్వాలని టీఎన్‌సీఏ నిర్ణయించింది. ఈ మెరకు టీఎన్‌సీఏ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. మహిళా క్రికెట్ ఆదరణ పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీఎన్‌సీఏ తెలిపింది. అదే విధంగా దక్షిణాఫ్రికా-భారత్ మధ్య మూడు టీ20ల సిరీస్ కూడా ఇదే వేదికలో జరగనుంది. ఈ సిరీస్ జూలై 1 నుంచి ప్రారంభం కానుంది.ఈ సిరీస్‌కు సంబంధించిన టిక్కెట్లను కూడా తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ విడుదల చేసింది. గరిష్ట ధర రూ.150గా నిర్ణయించింది. కాగా టీ20 సిరీస్‌కు కూడా C, D ,E దిగువ స్టాండ్లకు అభిమానులను ఫ్రీగా ఎంట్రీ ఇవ్వనున్నారు.దక్షిణాఫ్రికాతో ఏకైక టెస్టుకు భారత జట్టుహర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, శుభా సతీష్, జెమిమా రోడ్రిగ్స్ (ఫిట్‌నెస్‌కు లోబడి), రిచా ఘోష్ (వికెట్ కీపర్), ఉమా చెత్రీ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, స్నేహ రాణా, సైకా ఇషాక్, రాజేశ్వరి గయాక్వాడ్, పూజా వస్త్రాకర్ (ఫిట్‌నెస్‌కు లోబడి), అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, మేఘనా సింగ్, ప్రియా పునియా, షబ్నమ్ షకీల్. -
చరిత్ర సృష్టించిన ఆసీస్ వికెట్ కీపర్.. పంత్ రికార్డు బద్దలు
క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్‌ను 2-0 తేడాతో ఆసీస్ క్లీన్ స్వీప్ చేసింది. ఆసీస్ విజయంలో ఆ జట్టు వికెట్ కీపర్ ఆలెక్స్ క్యారీ కీలక పాత్ర పోషించాడు. 98 పరుగులతో ఆజేయంగా నిలిచి తమ జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. నాలుగో రోజు ఆటలో ఆసీస్ విజయానికి 202 పరుగులు అవసరమైన దశలో 80 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన క్యారీ కివీస్ బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారాడు. వీలు చిక్కినప్పుడుల్లా బౌండరీలు బాదుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. తృటిలో సెంచరీతో చేసే అవకాశాన్ని క్యారీ కోల్పోయాడు. ఇక ఈమ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన క్యారీ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. నాలుగో ఇన్నింగ్స్‌లో విజయవంతమైన ఛేజింగ్‌లో అత్యధిక స్కోర్ సాధించిన రెండో వికెట్ కీపర్‌గా క్యారీ(98*) నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ పేరిట ఉండేది. 2021లో బ్రిస్బేన్ వేదికగా ఆసీస్‌తో జరిగిన ఓ టెస్టులో పంత్ నాలుగో ఇన్నింగ్స్‌లో 89 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇక ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో ఆసీస్ క్రికెట్ దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్ అగ్రస్ధానంలో ఉన్నాడు. 1999లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగో ఇన్నింగ్స్‌లో గిల్ క్రిస్ట్ 149 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. -
ఇవాళ 4వ రోజు జరగనున్న భారత్, ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్
-
విశాఖ టెస్టులో భారీస్కోర్ దిశగా భారత్
-
కాసేపట్లో ప్రారంభంకానున్న భారత్-ఇంగ్లాండ్ రెండో టెస్టు
-
భారత్ Vs ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్
-
భారత్ కొంపముంచిన బజ్ బాల్...!
-
పోప్ సెంచరీ తాలింపు...
తొలి టెస్టు మూడో రోజు ఆట మొదలైనప్పుడు భారత్ 175 పరుగుల ఆధిక్యంలో ఉంది. టీమ్ ఆలౌట్ అయ్యే సమయానికి ఆ ఆధిక్యం 190 పరుగులకు చేరింది. ముందుగా ఈ లోటును పూడ్చుకునే ప్రయత్నంలో బరిలోకి దిగిన ఇంగ్లండ్ శనివారం ఆట ముగిసేసరికి 126 పరుగులు ముందంజలో నిలిచింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ బ్యాటర్ల పోరాటం జట్టును ఇక్కడి వరకు తీసుకొచ్చింది. ముఖ్యంగా ఒలీ పోప్ అద్భుత బ్యాటింగ్‌తో చిరస్మరణీయ ప్రదర్శన చేశాడు. ఈ ఇన్నింగ్స్‌కు ముందు భారత గడ్డపై 9 ఇన్నింగ్స్‌లలో కలిపి 154 పరుగులే చేసిన పోప్ ఈ ఇన్నింగ్స్‌లోనే దాదాపు అన్నే పరుగులు సాధించడం విశేషం. అతని స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లకు భారత స్పిన్నర్ల వద్ద జవాబు లేకపోయింది. ఆధిక్యం మరీ ఎక్కువ కాదు కాబట్టి ఈ మ్యాచ్ ఇంకా టీమిండియా చేతుల్లోనే ఉంది. అయితే మారిపోతున్న పిచ్‌పై నాలుగో ఇన్నింగ్స్ సవాల్‌ను రోహిత్ బృందం ఎంత సమర్థంగా ఎదుర్కొంటుందన్నది ఆసక్తికరం. సాక్షి, హైదరాబాద్: భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో మూడో రోజు ఇంగ్లండ్ మెరుగైన ప్రదర్శన కనబర్చింది. ఓటమి ఖాయమనిపించే స్థితి నుంచి కోలుకొని ఇంకా పోరాడుతోంది. శనివారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 77 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసింది. ఒలీ పోప్ (208 బంతుల్లో 148 బ్యాటింగ్; 17 ఫోర్లు) అజేయ సెంచరీతో చెలరేగాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ 126 పరుగులు ముందంజలో ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 421/7తో ఆట కొనసాగించిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 121 ఓవర్లలో 436 పరుగులకు ఆలౌటైంది. రవీంద్ర జడేజా (180 బంతుల్లో 87; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ అవకాశాన్ని కోల్పోయాడు. మరో 15 పరుగులు జోడించి... మూడో రోజు భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసేందుకు 11 ఓవర్లు సరిపోయాయి. ఒకేస్కోరు వద్ద జట్టు చివరి 3 వికెట్లు కోల్పోయింది. రూట్ వరుస బంతుల్లో జడేజా, బుమ్రా (0)లను అవుట్ చేయగా... తర్వాతి ఓవర్లో అక్షర్ పటేల్ (100 బంతుల్లో 44; 7 ఫోర్లు, 1 సిక్స్)ను రేహన్ బౌల్డ్ చేశాడు. రాణించిన డకెట్... తొలి ఇన్నింగ్స్‌లాగే రెండో ఇన్నింగ్స్‌లోనూ ఇంగ్లండ్ శుభారంభం చేసింది. క్రాలీ (33 బంతుల్లో 31; 4 ఫోర్లు, 1 సిక్స్), డకెట్ కలిసి చకచకా పరుగులు జోడించారు. అశ్విన్ చక్కటి బంతితో క్రాలీని అవుట్ చేసి ఈ భాగస్వామ్యాన్ని విడదీసినా... డకెట్, పోప్ జోరుగా ఆడటంతో తొలి సెషన్ ముగిసేసరికి జట్టు 6 రన్‌రేట్‌తో 15 ఓవర్లలోనే 89 పరుగులు చేసింది. అయితే లంచ్ తర్వాత భారత బౌలర్లు ఒక్కసారిగా చెలరేగిపోయారు. బుమ్రా బౌలింగ్‌లో డకెట్ ఎల్బీ అయ్యే అవకాశం ఉన్నా... భారత్ రివ్యూ తీసుకోకపోవడంతో అతను బతికిపోయాడు. రీప్లేలో బంతి స్టంప్స్‌ను తాకేదని తేలడంతో బుమ్రా తీవ్రంగా నిరాశ చెందాడు. అయితే తన తర్వాతి ఓవర్లో అద్భుత బంతితో డకెట్‌ను బౌల్డ్ చేసిన భారత పేసర్ భావోద్వేగం ప్రదర్శించాడు. జట్టు టాప్ బ్యాటర్ రూట్ (6 బంతుల్లో 2)ను కూడా తన తర్వాతి ఓవర్లోనే బుమ్రా అవుట్ చేశాడు. జడేజా బంతిని ఆడకుండా వదిలేసి బెయిర్‌స్టో (24 బంతుల్లో 10; 1 ఫోర్) బౌల్డ్ కాగా... బెన్ స్టోక్స్ (33 బంతుల్లో 6)కు వరుసగా మూడు ఓవర్లు మెయిడిన్ వేసి ఒత్తిడి పెంచిన అశ్విన్ అదే జోరులో చక్కటి బంతితో అతని ఆట కట్టించాడు. మరోవైపు పోప్ మాత్రం చక్కటి షాట్లతో పరుగులు రాబడుతూ 54 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారీ భాగస్వామ్యం... స్టోక్స్ ఐదో వికెట్‌గా వెనుదిరిగినప్పుడు ఇంగ్లండ్ స్కోరు 163/5. ఆ జట్టు మరో 27 పరుగులు వెనుకబడి ఉంది. ఈ దశలో భారత్ మిగిలిన వికెట్లను టపటపా పడగొట్టి మ్యాచ్‌ను ముగిస్తుందని అనిపించింది. అయితే మరో 30 ఓవర్ల పాటు పోప్, బెన్ ఫోక్స్ (81 బంతుల్లో 34; 2 ఫోర్లు) కలిసి భారత బౌలర్లను ఆడుకున్నారు. చక్కటి సమన్వయంతో బ్యాటింగ్ చేస్తూ పరుగులు రాబట్టారు. ఆరంభంలో కుదురుకునేందుకు కొంత సమయం తీసుకున్న తర్వాత ధాటిగా ఆడారు. భారత బౌలర్లలోనూ ఎవరూ వీరిని ఇబ్బంది పెట్టలేకపోయారు. దాంతో ముందుగా తొలి ఇన్నింగ్స్ లోటును పూడ్చుకున్న ఇంగ్లండ్... ఆ తర్వాత ఆధిపత్యాన్ని పెంచుకుంటూ పోయింది. ఈ క్రమంలో పోప్ 154 బంతుల్లో తన కెరీర్లో ఐదో టెస్ట్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆరో వికెట్‌కు పోప్‌తో 112 పరుగులు జత చేసిన ఫోక్స్‌ను అక్షర్ బౌల్డ్ చేయడంతో భారత్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. అయితే రేహన్ (31 బంతుల్లో 16 బ్యాటింగ్; 2 ఫోర్లు) కలిసి పోప్ మరో వికెట్ పడకుండా మూడో రోజును జాగ్రత్తగా ముగించాడు. చివరి సెషన్లో ఇంగ్లండ్ 35 ఓవర్లలో ఒకే వికెట్ కోల్పోయి 144 పరుగులు సాధించింది. 110 పరుగుల వద్ద పోప్ ఇచ్చిన క్యాచ్‌ను అక్షర్ వదిలేయడం కూడా జట్టుకు కలిసొచ్చింది. స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 246 ఆలౌట్; భారత్ తొలి ఇన్నింగ్స్: 436 ఆలౌట్; ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: క్రాలీ (సి) రోహిత్ (బి) అశ్విన్ 31; డకెట్ (బి) బుమ్రా 47; పోప్ (బ్యాటింగ్) 148; రూట్ (ఎల్బీ) (బి) బుమ్రా 2; బెయిర్‌స్టో (బి) జడేజా 10; స్టోక్స్ (బి) అశ్విన్ 6; ఫోక్స్ (బి) అక్షర్ 34; రేహన్ (బ్యాటింగ్) 16; ఎక్స్‌ట్రాలు 22; మొత్తం (77 ఓవర్లలో 6 వికెట్లకు) 316. వికెట్ల పతనం: 1–45, 2–113, 3–117, 4–140, 5–163, 6–275. బౌలింగ్: బుమ్రా 12–3–29–2, అశ్విన్ 21–3–93–2, అక్షర్ 15–2–69–1, జడేజా 26–1–101–1, సిరాజ్ 3–0–8–0. -
తొలి ఇన్నింగ్స్ లో 436 రన్స్ కు భారత్ ఆలౌట్
-
ఆసక్తికరంగా ప్రారంభమైన భారత్, ఇంగ్లాండ్ తొలి టెస్ట్
-
తొలి రెండు టెస్టులకు కోహ్లి దూరం
న్యూఢిల్లీ: తెలుగు క్రికెట్ అభిమానులకు ఇది కచ్చితంగా నిరాశపరిచే వార్తే! భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి హైదరాబాద్, విశాఖపట్నంలలో ఇంగ్లండ్ జట్టుతో జరిగే తొలి రెండు టెస్టు మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. వ్యక్తిగత కారణాలతోనే ఈ టాపార్డర్ బ్యాటర్ తప్పుకున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తెలిపింది. భారత పర్యటన కోసం ఇంగ్లండ్ ఆటగాళ్లు ఆదివారమే హైదరాబాద్ చేరుకున్నారు. ఈ టూర్లో బెన్ స్టోక్స్ బృందం ఐదు టెస్టుల ద్వైపాక్షిక సిరీస్‌లో పాల్గొంటుంది. ఈ నెల 25 నుంచి ఉప్పల్ స్టేడియంలో తొలి టెస్టును, ఫిబ్రవరి 2 నుంచి విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో రెండో టెస్టును ఆడుతుంది. సీనియర్ స్టార్లంతా ఉంటారని తెలుగు ప్రేక్షకులు టికెట్లు కొనుగోలు చేశారు. అయితే అనూహ్యంగా కోహ్లి ఈ రెండు మ్యాచ్‌లకు గైర్హాజరు కానున్నాడు. ‘కోహ్లి కోరిక మేరకే ఆడటం లేదు. ఈ మేరకు బోర్డుతో ముందుగానే అనుమతి తీసుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో ఈ విషయమై మాట్లాడాడు. టీమ్ మేనేజ్మెంట్తోనూ కోహ్లి చర్చించాడు. అతను లేకపోవడం జట్టుకు ఇబ్బందికరమే అయితే వ్యక్తిగత కారణాల వల్లే దూరమవుతున్నాడు’ అని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. అతని నిర్ణయాన్ని బీసీసీఐ గౌరవిస్తుందని, అతనికి మద్దతుగా నిలుస్తుందని జై షా చెప్పారు. అఫ్గానిస్తాన్‌తో ఇటీవల జరిగిన టి20 సిరీస్‌లోనూ కోహ్లి తొలి మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనలోనూ భారత్ అంతర్గత జట్ల మధ్య జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ నుంచి విశ్రాంతి తీసుకొని లండన్ వెళ్లొచ్చాడు. టెస్టులకు సంబంధించి 2021లో విరాట్ కోహ్లి ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్టు ఆడి తర్వాతి మూడు టెస్టులకు గైర్హాజరయ్యాడు. తన భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ప్రసవం కోసం అతనుస్వదేశానికి వచ్చాడు. తాజా ఇంగ్లండ్ సిరీస్ కోసం కోహ్లి స్థానాన్ని రజత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్లలో ఒకరితో భర్తీ చేసే అవకాశముంది. -
INDA Vs ENGA: శతక్కొట్టిన పాటిదార్.. పాపం సర్ఫరాజ్!
India A vs England Lions, 2-day Practice Match: ఇంగ్లండ్ లయన్స్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఓపెనర్ రజత్ పాటిదార్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. లయన్స్ బౌలర్ల వ్యూహాలను చిత్తు చేస్తూ శతక్కొట్టాడు. మొత్తంగా 141 బంతులు ఎదుర్కొన్న ఈ మధ్యప్రదేశ్ బ్యాటర్... 18 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 111 పరుగులు సాధించాడు. సర్ఫరాజ్ సెంచరీ మిస్ పాటిదార్‌కు తోడు సర్ఫరాజ్ ఖాన్ కూడా రాణించాడు. అయితే, సెంచరీకి చేరువయ్యే క్రమంలో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగి 96 పరుగుల వద్దే నిలిచిపోయాడు. కాగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ముందు భారత్-ఏ, ఇంగ్లండ్-ఏ(లయన్స్) జట్లు అనధికారిక టెస్టు ఆడనున్నాయి. 223 ఇంగ్లండ్ ఆలౌట్ ఇందులో భాగంగా అహ్మదబాద్ వేదికగా రెండు రోజుల పాటు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాయి. శుక్రవారం మొదలైన ఈ టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో... భారత బౌలర్లు మెరుగ్గా రాణించి 233 పరుగులకే ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేశారు. మానవ్ సుతార్ మూడు, ఆకాశ్ దీప్ రెండు- తుషార్ దేశ్‌పాండే, విద్వత్ కావేరప్ప, పులకిత్ నారంగ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇక భారత ఇన్నింగ్స్‌లో ఓపెనర్, కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ 32 పరుగులు చేయగా.. రజత్ సెంచరీ(111) సాధించాడు. భరత్, ధ్రువ్ ఫిఫ్టీలు మిగిలిన వాళ్లలో సర్ఫరాజ్ ఖాన్ (96), శ్రీకర్ భరత్(64), ధ్రువ్ జురెల్ (50) అర్ధ శతకాలతో దుమ్ములేపారు. దీంతో శనివారం నాటి ఆట పూర్తయ్యే సరికి 91ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి భారత్-ఏ జట్టు 462 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ నేపథ్యంలో ఈ ప్రాక్టీస్ మ్యాచ్ డ్రాగా ముగిసిపోయింది. ఇక భారత్-ఏ- ఇంగ్లండ్-ఏ జట్ల మధ్య జనవరి 17 నుంచి నాలుగు రోజుల అనధికారిక టెస్టు ఆరంభం కానుంది. సర్ఫరాజ్‌ను ఇకనైనా టీమిండియాలోకి? మరోవైపు.. టీమిండియా- ఇంగ్లండ్ మధ్య జనవరి 5 నుంచి ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఆరంభం కానుంది. ఇక ఇప్పటికే ఇందుకు సంబంధించి రెండు మ్యాచ్‌ల కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. అయితే, మిగిలిన మ్యాచ్‌లకు జట్టును ఎంపిక చేసేటపుడైనా సర్ఫరాజ్ పేరును పరిగణనలోకి తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. దేశవాళీ, భారత్- ఏ జట్ల తరఫున ఇంత మంచి ప్రదర్శనలు ఇస్తున్నా అతడిని పక్కనపెట్టడం సరికాదని సెలక్టర్లకు హితవు పలుకుతున్నారు. చదవండి: తండ్రి కార్గిల్ యుద్ధంలో.. బంగారు గొలుసు అమ్మిన తల్లి త్యాగం! టీమిండియాలో ఎంట్రీ.. -
2 నుంచి విశాఖలో భారత్, ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్
విశాఖ స్పోర్ట్స్: విశాఖపట్నంలోని వైఎస్సార్ స్టేడియంలో ఫిబ్రవరి 2 నుంచి 6వ తేదీ వరకు భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన మ్యాచ్ నిర్వాహక కమిటీ గురువారం స్టేడియంలో సమావేశమైంది. ఈ వివరాలను కమిటీ చైర్మన్, కలెక్టర్ ఎ.మల్లికార్జున మీడియాకు వెల్లడించారు. మ్యాచ్ వీక్షించేందుకు వచ్చే దేశ, విదేశీ అభిమానులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. పటిష్ట భద్రతతో పాటు తాగునీరు, మెడికల్ సదుపాయాలు, ఆహారం కోసం స్టాల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. అభిమానుల కోసం రవాణా సదుపాయాలను అందుబాటులో ఉంచుతామన్నారు. ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ కార్యదర్శి ఎస్ఆర్ గోపినాథరెడ్డి మాట్లాడుతూ.. టెస్ట్ మ్యాచ్ టికెట్లను ఈనెల 15 నుంచి పేటీఎం యాప్ ద్వారా ఆన్లైన్లో విక్రయిస్తామని చెప్పారు. ఈసారి పూర్తిగా డిజిటల్ టికెట్లను అందించనున్నట్లు తెలిపారు. 100, 200, 300, 500 రూపాయల టికెట్లను ప్రతి రోజుకు విడివిడిగా విక్రయిస్తామని.. అలాగే ఐదు రోజులకు కలిపి తీసుకునే వారి కోసం టికెట్ ధరలను రూ.400, 800, 1,000, 1,500గా నిర్ణయించామన్నారు. వైఎస్సార్, స్వర్ణభారతి స్టేడియాల్లో 26 కౌంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. -
తిలక్ వర్మ కెప్టెన్సీ అదుర్స్.. టెస్టుల్లో అరంగేట్రానికి ‘సై’!
Ranji Trophy 2023-24- Hyderabad Vs Nagaland: రంజీ ట్రోఫీ 2023-24 సీజన్‌ను హైదరాబాద్ ఘన విజయంతో ఆరంభించింది. నాగాలాండ్‌ను ఇన్నింగ్స్ 194 పరుగుల తేడాతో మట్టికరిపించి జయభేరి మోగించింది. కాగా ఈసారి రంజీ ట్రోఫీలో హైదరాబాద్ ‘ప్లేట్’ డివిజన్లో పోటీపడుతోంది . ఈ జట్టుకు కెప్టెన్‌గా టీమిండియా స్టార్ తిలక్ వర్మ వ్యవహరిస్తున్నాడు. తొలిరోజే పరుగుల వరద.. రాహుల్ డబుల్ ధమాకా ఈ క్రమంలో దీమాపూర్ వేదికగా నాగాలాండ్ జట్టుతో శుక్రవారం మొదలైన మ్యాచ్‌లో.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్.. తొలిరోజే పరుగుల వరద పారించింది. ఆతిథ్య నాగాలాండ్ బౌలర్ల భరతం పట్టిన హైదరాబాద్ బ్యాటర్ రాహుల్ సింగ్ గహ్లోత్ ద్విశతకం(214)తో అదరగొట్టాడు. తిలక్ వర్మ అజేయ సెంచరీ తిలక్ వర్మ అజేయ శతకం (112 బంతుల్లో 100 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) నమోదు చేయగా... తన్మయ్ అగర్వాల్ (80; 12 ఫోర్లు) కూడా రాణించాడు. ఈ క్రమంలో 76.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 474 పరుగుల వద్ద హైదరాబాద్ తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఈ క్రమంలో శుక్రవారం నాటి ఆట ముగిసే సమయానికి నాగాలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ కోల్పోయి 35 పరుగులు సాధించింది. ఇక 35/1 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం ఆట మొదలుపెట్టిన నాగాలాండ్ 51.3 ఓవర్లలో 153 పరుగులకు ఆలౌట్ కాగా.. హైదరాబాద్ ఫాలో ఆన్ ఆడించింది. చిత్తుగా ఓడిన నాగాలాండ్ అయితే, ప్రత్యర్థి జట్టు బౌలర్ల ధాటికి తాళలేక రెండో ఇన్నింగ్స్‌లో 127 పరుగులకే చేతులెత్తేశారు నాగాలాండ్ బ్యాటర్లు. దీంతో ఇన్నింగ్స్ మీద 194 పరుగుల తేడాతో హైదరాబాద్ భారీ విజయం సాధించింది. రెండ్రోజుల్లోనే ఈ టెస్టు మ్యాచ్ ముగిసిపోయింది. ఇక నాగాలాండ్‌తో మ్యాచ్‌లో తిలక్ వర్మ సేనలోని బౌలర్లలో టి.త్యాగరాజన్ అత్యధికంగా ఎనిమిది వికెట్లు పడగొట్టగా.. చామా మిలింద్కు ఆరు వికెట్లు దక్కాయి. మిగతా వాళ్లలో తెలుకపల్లి రవితేజ రెండు, కార్తికేయ మూడు, రోహిత్ రాయుడు ఒక వికెట్ పడగొట్టారు. కాగా తిలక్ కెప్టెన్సీలో హైదరాబాద్ వరుస విజయాలు సాధించాలని.. బ్యాటర్‌గానూ రాణించి అతడు టీమిండియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేయాలని ఈ సందర్భంగా అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఇక హైదరాబాద్ స్టార్ తిలక్ వర్మ ఇప్పటికే అంతర్జాతీయ టీ20, వన్డేలలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. చరిత్ర సృష్టించిన రాహుల్ సింగ్ గతంలో సర్వీసెస్ జట్టుకు ఆడిన రాహుల్ సింగ్ గహ్లోత్ 157 బంతుల్లో 23 ఫోర్లు, 9 సిక్స్‌లతో 214 పరుగులు చేసి అవుటయ్యాడు. అయితే, ఈసారి హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు 143 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో రవిశాస్త్రి తర్వాత రంజీ ట్రోఫీలో వేగవంతమైన డబుల్ సెంచరీ చేసిన రెండో ప్లేయర్‌గా రాహుల్ గుర్తింపు పొందాడు. చదవండి: BCCI: ఇంగ్లండ్‌తో తలపడే భారత్-‘ఏ’ జట్టు ప్రకటన.. కెప్టెన్ అతడే -
పాకిస్తాన్ అత్యంత చెత్త రికార్డు.. వరల్డ్ క్రికెట్లోనే తొలి జట్టుగా
మెల్బోర్న్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 318 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో మార్నస్ లాబుషేన్ 63 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పాక్ బౌలర్లలో అమీర్ జమాల్ మూడు వికెట్లతో అదరగొట్టగా.. షాహీన్ అఫ్రిది, మీర్ హంజా హసన్ అలీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అయితే తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ ఏకంగా ఎక్స్‌ట్రాస్ రూపంలో ఏకంగా 52 అదనపు పరుగులను సమర్పించుకుంది. తద్వారా అత్యంత చెత్త రికార్డును పాకిస్తాన్ తమ పేరిట లిఖించుకుంది. చారిత్రత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఒక టెస్ట్ ఇన్నింగ్స్‌లో అత్యధిక ఎక్స్‌ట్రాలు ఇచ్చిన జట్టుగా పాక్ రికార్డులకెక్కింది. పాకిస్తాన్ సమర్పించుకున్న ఎక్స్ట్రాస్లో 15 వైడ్లు, 20 బైలు ఉన్నాయి. చదవండి: IND vs SA: 'అతడు అన్‌ఫిట్.. కెప్టెన్‌గానే కాదు ఆటగాడిగా కూడా పనికిరాడు' -
ఆసీస్ పోరాడినా... భారత్ చేతుల్లోనే..!
ముంబై: భారత్, ఆ్రస్టేలియా మహిళల మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్‌కు స్వల్ప ఆధిక్యం లభించినా...టెస్టు ఇంకా భారత్ చేతుల్లోనే ఉంది. చివరి రోజు ఆసీస్‌ను తొందరగా ఆలౌట్ చేయగలిగితే స్వల్ప ల„ ్యాన్ని భారత్ ఛేదించేందుకు అవకాశం ఉంటుంది. తొలి ఇన్నింగ్స్‌తో పోలిస్తే రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ కాస్త మెరుగైన బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చగా...శనివారం ఆట చివర్లో భారత్‌కు మళ్లీ పట్టు చిక్కింది. ఆట ముగిసే సమయానికి ఆ్రస్టేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. తహీలా మెక్‌గ్రాత్ (177 బంతుల్లో 73; 10 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించగా...ఎలైస్ పెరీ (91 బంతుల్లో 45; 5 ఫోర్లు), బెత్ మూనీ (33), కెప్టెన్అలీసా హీలీ (32) కీలక పరుగులు జోడించారు. భారత బౌలర్లలో హర్మన్‌ప్రీత్ కౌర్, స్నేహ్ రాణా చెరో 2 వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం ఆసీస్ 46 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 376/7తో ఆట కొనసాగించిన భారత్ మరో 30 పరుగులు జోడించి తమ తొలి ఇన్నింగ్స్‌లో 406 పరుగులకు ఆలౌటైంది. దీప్తి శర్మ (78)ను గార్త్ బౌల్డ్ చేయగా...పూజ వస్త్రకర్ (47), రేణుకా సింగ్ (8)లను గార్డ్నర్ వెనక్కి పంపించింది. దాంతో భారత్‌కు 187 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. కీలక భాగస్వామ్యాలు... రెండో ఇన్నింగ్స్‌లో ఆ్రస్టేలియాకు మెరుగైన ఆరంభం లభించింది. మూనీ, లిచ్‌ఫీల్డ్ (18) తొలి వికెట్‌కు 49 పరుగులు జోడించారు. అయితే మూనీ స్వయంకృతంతో రనౌట్ కావడంతో భారత్‌కు తొలి వికెట్ దక్కింది. రాణా బౌలింగ్‌లో మూనీ ముందుకొచ్చి డిఫెన్స్ ఆడగా చురుగ్గా ఉన్న సిల్లీ పాయింట్ ఫీల్డర్ రిచా వెంటనే బంతికి వికెట్లపైకి విసిరింది. సరైన సమయంలో వెనక్కి వెళ్లలేక మూనీ వెనుదిరిగింది. లిచ్ఫీల్డ్నూ రాణానే అవుట్ చేశాక మెక్‌గ్రాత్, పెరీ కలిసి జట్టును ఆదుకున్నారు. భారత స్పిన్నర్లను వీరు సమర్థంగా ఎదుర్కొన్నారు. 15 పరుగుల వద్ద మెక్‌గ్రాత్ ఇచ్చిన క్యాచ్‌ను రాణా వదిలేయడం ఆసీస్‌కు కలిసొచ్చింది. మెక్‌గ్రాత్, పెరీ మూడో వికెట్‌కు 84 పరుగులు జత చేశారు. అయితే ఆ తర్వాత హీలీతో కలిసి మెక్‌గ్రాత్ ఇన్నింగ్స్‌ను నడిపించింది. 119 బంతుల్లో ఈ మ్యాచ్‌లో రెండో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న మెక్‌గ్రాత్...రేణుక ఓవర్లో వరుసగా 3 ఫోర్లతో ఆసీస్‌ను ఆధిక్యంలోకి తీసుకెళ్లింది. ఆసీస్ బ్యాటర్లు పాతుకుపోగా, వరుసగా 28.2 ఓవర్ల పాటు భారత్ వికెట్ తీయడంలో విఫలమైంది. ఈ దశలో కెపె్టన్ హర్మన్ తానే స్వయంగా బౌలింగ్‌కు దిగింది. తొలి ఓవర్లోనే చక్కటి బంతితో మెక్‌గ్రాత్‌ను బౌల్డ్ చేసి 66 పరుగుల పార్ట్‌నర్‌షిప్‌కు తెర దించింది. ఆ తర్వాత కొద్ది సేపటికే హీలీని వికెట్ల ముందు దొరకబుచ్చుకొని హర్మన్ మ్యాచ్‌ను మళ్లీ భారత్ చేతుల్లోకి తెచ్చింది. అంతకు ముందు బంతికే హర్మన్, హీలీ మధ్య ‘అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్’కు సంబంధించి తీవ్ర వాదోపవాదన జరిగిన తర్వాత ఈ వికెట్ దక్కడం విశేషం. ఆ తర్వాత 62 బంతుల పాటు జాగ్రత్తగా ఆడి మరో వికెట్ పడకుండా సదర్లాండ్ (12 నాటౌట్), గార్డ్నర్ (7 నాటౌట్) ఆటను ముగించారు. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 219; భారత్ తొలి ఇన్నింగ్స్ 406; ఆ్రస్టేలియా రెండో ఇన్నింగ్స్: మూనీ (రనౌట్) 33; లిచ్‌ఫీల్డ్ (బి) రాణా 18; పెరీ (సి) యస్తిక (బి) రాణా 45; తహీలా మెక్‌గ్రాత్ (బి) హర్మన్ 73; హీలీ (ఎల్బీ) (బి) హర్మన్ 32; సదర్లాండ్ (నాటౌట్) 12; గార్డ్నర్ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (90 ఓవర్లలో 5 వికెట్లకు) 233. వికెట్ల పతనం: 1–49, 2–56, 3–140, 4–206, 5–221. బౌలింగ్: రేణుకా సింగ్ 8–3–22–0, పూజ వస్త్రకర్ 8–0–36–0, స్నేహ్ రాణా 17–3–54–2, దీప్తి శర్మ 19–5–30–0, రాజేశ్వరి 27–10–42–0, జెమీమా 2–0–13–0, హర్మన్‌ప్రీత్ 9–0–23–2. -
ఆసీస్ బౌలర్లకు చుక్కలు.. బ్యాట్‌తో చెలరేగిన దీప్తి, పూజ
ఆస్ట్రేలియాతో టెస్టులో భారత మహిళా క్రికెట్ జట్టు రెండో రోజు కూడా ఆధిపత్యం కనబరిచింది. ఓపెనర్ స్మృతి మంధానకు తోడు రిచా ఘోష్, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ(70- నాటౌట్) అర్ధ శతకాలతో చెలరేగడంతో ఆసీస్‌పై పైచేయి సాధించింది. శుక్రవారం నాటి ఆట ముగిసే సరికి ఏడు వికెట్ల నష్టానికి 376 పరుగులు చేసింది. కాగా ముంబై వేదికగా ఆస్ట్రేలియా మహిళా జట్టుతో భారత వుమెన్ టీమ్ ఏకైక టెస్టులో తలపడుతోంది. వాంఖడే స్టేడియంలో గురువారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, భారత బౌలర్ పూజా వస్త్రాకర్ నాలుగు వికెట్లతో చెలరేగి ప్రత్యర్థి బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించింది. కీలక వికెట్లు పడగొట్టి ఆసీస్‌ను కోలుకోలేని దెబ్బకొట్టింది. ఇతర బౌలర్లలో స్నేహ్ రాణా మూడు, ఆల్‌రౌండర్ దీప్తి శర్మ రెండు వికెట్లు తీశారు. ఈ క్రమంలో ఆసీస్ మహిళా జట్టు 219 పరుగులకే తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఈ నేపథ్యంలో తొలి రోజే ఆసీస్‌ను ఆలౌట్ చేసిన భారత్.. ఆట ముగిసే సరికి వికెట్ నష్టానికి 98 పరుగులు చేసింది. ఈ క్రమంలో రెండో రోజు ఆటలో భాగంగా ఓపెనర్ స్మృతి మంధాన 74 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటైంది. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రిచా ఘోష్ 52 పరుగులతో రాణించగా.. జెమీమా రోడ్రిగ్స్ 73 పరుగులతో అదరగొట్టింది. అయితే, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాత్రం పూర్తిగా నిరాశపరిచింది. గార్డ్నర్ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగింది. యస్తికా భాటియా సైతం ఒక్క పరుగుకే పెవిలియన్ చేరింది. ఈ క్రమంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న దీప్తి శర్మ ఓపికగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపింది. శుక్రవారం నాటి ఆట ముగిసే సరికి 147 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 70 పరుగులతో అజేయంగా నిలిచింది. ఆమెకు తోడుగా పూజా వస్త్రాకర్ సైతం 33 పరుగులతో క్రీజులో ఉంది. వీరిద్దరు కలిసి 102 పరుగుల అజేయ భాగస్వామ్యంతో భారత్ 157 పరుగుల ఆధిక్యం సాధించింది. ఇదిలా ఉంటే.. ఆసీస్ బౌలర్లలో స్పిన్నర్ ఆష్లీ గార్డ్నర్కు అత్యధికంగా నాలుగు వికెట్లు దక్కగా.. కిమ్‌గార్త్ ఒకటి, జెస్ జొనాసెన్ ఒక వికెట్ పడగొట్టారు. కిమ్ గార్త్, గార్డ్నర్ కలిసి స్మృతి మంధానను రనౌట్ చేశారు. -
మన మహిళలు అదుర్స్
ముంబై: రెండేళ్ల విరామం తర్వాత టెస్టు మ్యాచ్ బరిలోకి దిగిన భారత మహిళల జట్టు అంచనాలకు మించి రాణించింది. ఇంగ్లండ్‌తో గురువారం ప్రారంభమైన నాలుగు రోజుల ఏకైక టెస్టులో మన బ్యాటర్లంతా ఒకరితో మరొకరు పోటీ పడి పరుగులు సాధించడంతో తొలి రోజే రికార్డు స్కోరు నమోదైంది. ఆట ముగిసే సమయానికి భారత్ 94 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. మహిళల టెస్టు క్రికెట్ చరిత్రలో ఒకే రోజు నమోదైన పరుగుల జాబితాను చూస్తే ఇది రెండో అత్యధిక స్కోరు కావడం విశేషం. శుభ సతీశ్ (76 బంతుల్లో 69; 13 ఫోర్లు), జెమీమా రోడ్రిగ్స్ (99 బంతుల్లో 68; ), యస్తిక భాటియా (88 బంతుల్లో 66; 10 ఫోర్లు, 1 సిక్స్), దీప్తి శర్మ (95 బంతుల్లో 60 బ్యాటింగ్; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించగా, కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (81 బంతుల్లో 49; 6 ఫోర్లు) త్రుటిలో ఆ అవకాశం చేజార్చుకుంది. ప్రస్తుతం దీప్తితో పాటు పూజ వస్త్రకర్ (4 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉంది. డీవై పాటిల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ తరఫున ముగ్గురు ప్లేయర్లు జెమీమా, రేణుకా సింగ్, శుభ సతీశ్ ఈ మ్యాచ్‌తో టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేశారు. వీరిలో శుభకు ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్ కూడా. ఓపెనర్లు షఫాలీ వర్మ (19), స్మృతి మంధాన (17) తక్కువ వ్యవధిలో వెనుదిరిగినా, ఆ తర్వాత భారత బ్యాటర్లు క్రీజ్‌లో పట్టుదలగా నిలబడ్డారు. కుదురుకున్న తర్వాత వేగంగా పరుగులు సాధించారు. మూడు భారీ భాగస్వా మ్యాలతో జట్టును నడిపించారు. శుభ, రోడ్రిగ్స్ మూడో వికెట్‌కు 115 పరుగులు... యస్తిక, హర్మన్ ఐదో వికెట్‌కు 116 పరుగులు జోడించగా... దీప్తి, స్నేహ్ రాణా (73 బంతుల్లో 30; 5 ఫోర్లు) ఏడో వికెట్‌కు 92 పరుగులు జత చేయడం విశేషం. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: స్మృతి (బి) బెల్ 17; షఫాలీ (బి) క్రాస్ 19; శుభ (సి) సివర్ (బి) ఎకెల్‌స్టోన్ 69; జెమీమా (బి) బెల్ 68; హర్మన్‌ప్రీత్ (రనౌట్) 49; యస్తిక (సి) బెల్ (బి) డీన్ 66; దీప్తి (బ్యాటింగ్) 60; స్నేహ్ రాణా (బి) సివర్ 30; పూజ (బ్యాటింగ్) 4; ఎక్స్‌ట్రాలు 28; మొత్తం (94 ఓవర్లలో 7 వికెట్లకు) 410. వికెట్ల పతనం: 1–25, 2–47, 3–162, 4–190, 5–306, 6–313, 7–405. బౌలింగ్: కేట్ క్రాస్ 14–0–64–1, లారెన్ బెల్ 15–1–64–2, నాట్ సివర్ 11–4–25–1, లారెన్ 15–1–84–0, చార్లీ డీన్ 17–1–62–1, సోఫీ ఎకెల్‌స్టోన్ 22–4–85–1. 2 మహిళల టెస్టు క్రికెట్లో ఒకేరోజు సాధించిన అత్యధిక పరుగుల జాబితాలో భారత జట్టు రెండో స్థానం (410)లో నిలిచింది. 1935లో న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ ఒకే రోజు 431 పరుగులు సాధించింది. సొంతగడ్డపై భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు కూడా. -
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ టెస్టులో పట్టుబిగిస్తున్న భారత్
-
600 వికెట్ల క్లబ్లో.. టెస్టు క్రికెట్ చరిత్రలో నాలుగో బౌలర్‌గా
ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ సిరీస్ నాలుగో టెస్టులో తొలి రోజు బుధవారం ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 83 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (51), లబుషేన్ (51) అర్ధ సెంచరీలు సాధించగా, హెడ్ (48), స్టీవ్ స్మిత్ (41) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ (4/52) ప్రత్యర్థిని దెబ్బ తీయగా, బ్రాడ్ 2 వికెట్లు పడగొట్టాడు. హెడ్‌ను అవుట్ చేయడం ద్వారా బ్రాడ్ టెస్టుల్లో 600 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన నాలుగో బౌలర్‌గా నిలిచాడు. అత్యధిక వికెట్ల జాబితాలో మురళీధరన్ (800), షేన్ వార్న్ (708), అండర్సన్ (688) మాత్రమే బ్రాడ్కంటే ముందున్నారు. 𝗧𝗵𝗲 moment.#EnglandCricket | #Ashes https://t.co/lz2j0t9LN5 pic.twitter.com/9RxHutgLDC — England Cricket (@englandcricket) July 19, 2023 చదవండి: భారత్‌కు ఎదురుందా! #ChrisMartin: ధోనిని ముప్పుతిప్పలు పెట్టిన కివీస్ టాప్-3 బౌలర్, కట్‌చేస్తే.. ఇప్పుడు సూపర్ మార్కెట్లో -
టీమిండియాపై గెలిచి రెండు దశాబ్దాలు దాటిపోయింది.. ఇప్పుడు అస్సలు కాదు..!
ఒకప్పటి మేటి జట్టు వెస్టిండీస్.. టెస్ట్‌ల్లో టీమిండియాపై విజయం సాధించి రెండు దశాబ్దాలు దాటిపోయిందంటే ఎవరైనా నమ్మగలరా..? నమ్మినా, నమ్మకపోయినా ఇది నిజం. విండీస్ జట్టు చివరిసారిగా 2002లో జమైకాలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియాపై గెలుపొందింది. అప్పటి నుంచి 21 సంవత్సరాలుగా విండీస్‌కు టీమిండియాపై గెలుపే లేదు. విండీస్‌తో రేపటి నుంచి (జులై 12) తొలి టెస్ట్ ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈ ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. మరి 21 సంవత్సరాల తర్వాతైనా విండీస్.. టీమిండియాపై గెలుస్తుందా అంటే..? అసంభవమనే చెప్పాలి. ప్రస్తుత భారత జట్టుకు విండీస్ కనీస పోటీ కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్్కప్ క్వాలిఫయర్స్‌లో ఆ జట్టు దయనీయ పరిస్థితిని అందరం చూశాం. అయితే ముఖాముఖి రికార్డుల్లో మాత్రం భారత్‌పై విండీస్‌దే పై చేయిగా ఉంది. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య జరిగిన 98 మ్యాచ్‌ల్లో.. విండీస్ 30 గెలిస్తే, భారత్ 22 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయాలు సాధించింది. 46 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. జట్ల వివరాలు.. భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానె, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శ్రీకర్ భరత్, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, జయ్‌దేవ్ ఉనద్కత్, నవ్‌దీప్ సైని, ముఖేశ్ కుమార్. వెస్టిండీస్: క్రెయిగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), జెర్మైన్ బ్లాక్‌వుడ్ (వైస్ కెప్టెన్), అలిక్ అథనేజ్, త్యాగ్‌నారాయణ్ చంద్రపాల్, రఖీమ్ కార్న్‌వాల్, జోష్వా ద సిల్వా, షనోన్ గాబ్రియల్, జేసన్ హోల్డర్, అల్జారి జోసెఫ్, కిర్క్ మెకంజీ, రేమన్ రీఫర్, కీమర్ రోచ్, జోమెల్ వారికన్ రిజర్వ్ ఆటగాళ్లు: టెవిన్ ఇమ్లాచ్, అకీమ్ జోర్డాన్ -
చావుదెబ్బ కొట్టిన ఆసీస్.. రికార్డులు బద్దలైన వేళ
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా మంగళవారం ముగిసిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా రెండు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ఆట ఆఖరిరోజు వరుణుడు అడ్డుపడడం.. ఆ తర్వాత ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగడం మ్యాచ్‌ను ఆ జట్టువైపు తిప్పింది. అయితే చివరి సెషన్లో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్, నాథన్ లియోన్లు వీరోచిత పోరాటం ఆసీస్‌ను గెలుపు దిశగా నడిపించింది. బజ్‌బాల్ అంటూ దూకుడు మీదున్న ఇంగ్లండ్‌ను చావుదెబ్బ కొట్టి పలు రికార్డులను ఆసీస్ తన పేరిట లిఖించుకుంది. అవేంటో పరిశీలిద్దాం. ► ఇంగ్లండ్ గడ్డపై టెస్టుల్లో 275 అంతకంటే ఎక్కువ టార్గెట్‌ను చేధించడం ఇది 15వ సారి కాగా.. ఈ ఏడాదే ఐదుసార్లు ఉండడం గమనార్హం ► ఇంగ్లండ్ పర్యటనకు వచ్చిన విదేశీ జట్లు అత్యధిక పరుగుల టార్గెట్‌ను చేధించడం ఇది ఐదోసారి. ఇంతకముందు 1948లో హెడ్డింగేలో ఆస్ట్రేలియా 404 పరుగుల టార్గెట్‌ను, 1984లో లార్డ్స్ వేదికగా వెస్టిండీస్ 342 పరుగుల టార్గెట్‌ను, 2017లో హెడ్డింగే వేదికగా వెస్టిండీస్ 322 పరుగుల టార్గెట్‌ను, 2008లో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా సౌతాఫ్రికా 281 పరుగుల టార్గెట్‌ను చేధించాయి. ► ఇక టెస్టుల్లో ఆస్ట్రేలియా కెప్టెన్లలో బ్యాటింగ్‌లో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 80 పరుగులతో పాటు బౌలింగ్‌లో నాలుగు వికెట్లు తీసిన ఆరో ఆటగాడిగా కమిన్స్ నిలిచాడు. ఇంతకముందు బాబ్ సింప్సన్ నాలుగుసార్లు, జార్జ్ గిఫెన్ రెండుసార్లు, వార్విక్ ఆర్మ్‌స్ట్రాంగ్, రిచీ బెర్నాడ్, అలెన్ బోర్డర్, పాట్ కమిన్స్ తలా ఒకసారి ఈ ఘనత సాధించారు. ► టెస్టుల్లో చేజింగ్ సందర్భాల్లో తొమ్మిదో వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన నాలుగో జంటగా పాట్ కమిన్స్-నాథన్ లియోన్ నిలిచారు. ఈ ద్వయం ఇంగ్లండ్‌తో టెస్టులో తొమ్మిదో వికెట్‌కు 55 పరుగులు జోడించారు. ఇక తొలి స్తానంలో 81 పరుగులు - వీవీఎస్ లక్ష్మణ్ & ఇషాంత్ శర్మ (IND) vs AUS, మొహాలి, 2010; 61* పరుగులు - జెఫ్ డుజోన్ & విన్స్టన్ బెంజమిన్ (WI) vs PAK, బ్రిడ్జ్‌టౌన్, 1988; 56* పరుగులు - టిబ్బి కాటర్ & గెర్రీ హాజ్లిట్ (AUS) vs ENG, సిడ్నీ, 1907; 55* పరుగులు - పాట్ కమ్మిన్స్ & నాథన్ లియోన్ (AUS) vs ENG, ఎడ్జ్‌బాస్టన్, 2023 ; 54 పరుగులు - బ్రియాన్ లారా & కర్ట్లీ ఆంబ్రోస్ (WI) vs AUS, బ్రిడ్జ్‌టౌన్, 1999 ఉన్నారు. ► ఒక టెస్టులో అత్యధిక సిక్సర్లు బాదిన ఆస్ట్రేలియా కెప్టెన్లలో పాట్ కమిన్స్ చోటు సంపాదించాడు. ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో కమిన్స్ ఐదు సిక్సర్లు కొట్టాడు. ఇంతకముందు రికీ పాంటింగ్ 2005లో న్యూజిలాండ్‌పై ఐదు సిక్సర్లు, ఇయాన్ చాపెల్ 1972లో పాకిస్తాన్‌పై నాలుగు సిక్సర్లు కొట్టాడు. ► యాషెస్ చరిత్రలో అత్యధిక పరుగుల టార్గెట్‌ను చేధించడం ఆస్ట్రేలియాకు ఇది ఐదోసారి. ఇంతకముందు 404 పరుగుల టార్గెట్‌ను 1948లో హెడ్డింగే వేదికగా, 315 పరుగుల టార్గెట్‌ను అడిలైడ్ వేదికగా 1901-02లో, 286 పరుగుల టార్గెట్‌ను మెల్బోర్న్ వేదికగా 1928-29లో, తాజాగా ఎడ్జ్‌బాస్టన్‌లో(2023లో) 281 పరుగుల టార్గెట్‌ను, 1897-98లో సిడ్నీ వేదికగా 275 పరుగుల టార్గెట్‌ను చేధించింది. ► యాషెస్ చరిత్రలో ఇది ఆరో క్లోజెస్ట్ విజయం. ఇంతకముందు ఇంగ్లండ్ మూడు సందర్భాల్లో ఒక వికెట్ తేడాతో, ఒకసారి రెండు వికెట్ల తేడాతో విజయం సాధించగా.. ఆస్ట్రేలియా రెండు సందర్బాల్లో రెండు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. చదవండి: బజ్‌బాల్ అంటూ విర్రవీగారు.. అణిచివేసిన ఆసీస్ -
బజ్‌బాల్ అంటూ విర్రవీగారు.. అణిచివేసిన ఆసీస్
ఆటలో ప్రతీరోజు మనది కాదు. ప్రయోగాలు మంచిదే అయినప్పటికి ప్రతీసారి అది మనకు కలిసి వస్తుందని చెప్పలేం. తాజాగా ఇంగ్లండ్ క్రికెట్ జట్టకు ఈ విషయం బాగా అర్థమయి ఉంటుంది. బజ్‌బాల్ అంటూ దూకుడైన ఆటతీరుతో తమకు ఎదురులేదని విర్రవీగుతున్న ఇంగ్లండ్‌ను ఆసీస్ అణిచివేసింది. అది కూడా ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో కావడంతో ఇంగ్లీష్ అభిమానులు ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. బజ్‌బాల్ క్రికెట్‌తో ఇంగ్లండ్ ఏడాది కాలంగా మంచి ఫలితాలను సాధించింది. బెన్‌స్టోక్స్ సారధ్యంలోని ఇంగ్లండ్ జట్టు కొత్తగా కనిపించింది. ఇదే బజ్‌బాల్ మంత్రంతో పాకిస్తాన్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌లను మట్టికరిపించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. కానీ జరుగుతున్నది ప్రతిష్టాత్మక యాషెస్.. అందునా ఇటీవలే ప్రపంచ టెస్టు చాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియాను ఎదుర్కోవడం అంత సులువు కాదు. ఈ విషయం తెలిసి కూడా ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తొలిరోజే సాహసం చేశాడు. పూర్తి బ్యాటింగ్ చేయకుండా తొలి ఇన్నింగ్స్‌ను 8 వికెట్ల నష్టానికి 393 పరుగుల వద్ద డిక్లేర్ చేశాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా ఇంగ్లండ్‌కు ధీటుగా బదులిచ్చింది. 386 పరుగులకు ఆలౌట్ కావడంతో ఇంగ్లండ్‌కు స్వల్ప ఆధిక్యం లభించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ బౌలర్ల దాటికి 273 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే సొంతగడ్డపై జరుగుతుండడంతో ఇంగ్లండ్‌కు కలిసొచ్చే అంశం. అయితే ఎడ్జ్‌బాస్టన్‌లో చివరి రోజు బౌలర్లకు అనుకూలిస్తుందని చెప్పారు. ఇక ఐదోరోజు ఆటలో వరుణుడు దోబుచులాడడంతో మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు కనిపించాయి. ఇంగ్లండ్ వ్యూహం బెడిసికొట్టేలా కనిపించింది. అయితే రెండో సెషన్లో కుదురుకున్న ఇంగ్లండ్ వరుసగా వికెట్లు పడగొట్టింది. అరె మళ్లీ ఇంగ్లండ్ బజ్‌బాల్ మంత్రం ఫలించిందే అనుకుంటున్న తరుణంలో పాట్ కమిన్స్, నాథన్ లియోన్లు తమ పోరాటంతో ఇంగ్లండ్‌కు విజయాన్ని దూరం చేశారు. ప్రతీసారి బజ్‌బాల్ దూకుడు పనికి రాదన్నది మరోసారి ఇంగ్లండ్‌కు అర్థమయి ఉండాలి. రెండో టెస్టు నుంచి బజ్‌బాల్ క్రికెట్‌ను పక్కనబెడతారా లేక కొనసాగిస్తారా అనేది చూడాలి. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా రెండు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. తొలి సెషన్లో వర్షంతో ఆటకు అంతరాయం కలగడం.. రెండో సెషన్లో పిచ్‌పై ఉన్న పదును ఉపయోగించుకొని ఇంగ్లండ్ బౌలర్లు వికెట్లతో చెలరేగారు. దీంతో ఆఖరి సెషన్లో ఎలాగైనా నిలబడి డ్రా చేసుకున్నా చాలు అనే దోరణిలో తొలుత ఆసీస్ ఆట కొనసాగింది. కానీ కెప్టెన్ పాట్ కమిన్స్ ధైర్యం ప్రదర్శించాడు. ఆరంభంలో కాస్త నిధానంగా ఆడిన కమిన్స్.. లయన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ‘డ్రా’కు అవకాశమివ్వకుండా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (73 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), నాథన్ లయన్ (28 బంతుల్లో 16 నాటౌట్; 2 ఫోర్లు) చక్కని పోరాటం చేశారు. దీంతో ఇంగ్లండ్ గెలిచేందుకు బాట వేసుకున్న ఆఖరి సెషన్లో వీళ్లిద్దరు పిచ్‌పై పరుగులతో పాగా వేశారు. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో ఆసీస్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు జూన్ 28 నుంచి జూలై 2 వరకు లార్డ్స్ వేదికగా జరగనుంది. Ball by ball Last 4 overs of Ashes thriller between Australia and England in first test at Edgbaston #Ashes23 pic.twitter.com/OYpoar6vhW — Spartan (@_spartan_45) June 20, 2023 చదవండి: 2005 రిపీట్ అవుతుందా? లేక ఆసీస్ షాకిస్తుందా? -
#Ashes2023: ఇంగ్లండ్‌కు ఏడు వికెట్లు.. ఆసీస్‌కు 174 పరుగులు
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య యాషెస్ సిరీస్ తొలి టెస్టు హోరాహోరీగా సాగుతున్నది. టెస్టుల్లో కొత్త సంప్రదాయానికి తెరతీసిన ‘బజ్‌బాల్’ శైలితో ఇంగ్లండ్ దూకుడు కనబరుస్తుంటే..ఆసీస్ అంతే దీటుగా సై అంటున్నది. దీంతో ఆధిక్యం చేతులు మారుతున్న మ్యాచ్‌లో విజయం ఎవరిని వరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌ను ఎలాగైనా దక్కించుకోవాలన్న పట్టుదల కనబరుస్తున్న ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడుతున్నాయి. ఇంగ్లండ్ నిర్దేశించిన 281 పరుగుల లక్ష్యఛేదనలో రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ మూడు వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. జరుగుతున్నది టెస్టు మ్యాచ్ అయినా పరిమిత ఓవర్ల ఫార్మాట్‌ను తలపిస్తూ ఇరు జట్ల బ్యాటర్లు తమదైన దూకుడు ప్రదర్శిస్తున్నారు. నిర్దేశిత లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్‌కు మెరుగైన శుభారంభమే దక్కింది. ఫామ్‌లేమితో సతమతమవుతున్న వార్నర్(36) ఫర్వాలేదనపించగా, తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో ఉస్మాన్ ఖవాజ(34 నాటౌట్) అద్భుత పోరాట పటిమ కనబరుస్తున్నాడు. ఇంగ్లండ్ బౌలింగ్‌ను కాచుకుంటూ వీరిద్దరు లక్ష్యఛేదనను ప్రారంభించారు. ఇన్నింగ్స్ సాఫీగా సాగుతున్న సమయంలో వార్నర్‌ను రాబిన్సన్ ఔట్ చేయడం ద్వారా ఆసీస్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. వార్నర్ వెనుదిరుగడంతో తొలి వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన లబుషేన్(13) మరోమారు నిరాశపరిచాడు. క్లిష్ట సమయాల్లో జట్టును గట్టెక్కించే లబుషేన్(13) బ్రాడ్ బౌలింగ్‌లో బెయిర్‌స్టోకు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్‌గా నిష్క్రమించాడు. జట్టును ఆదుకుంటాడనుకున్న స్టీవ్ స్మిత్ (6)..బ్రాడ్‌కు వికెట్ సమర్పించుకున్నాడు. చేతిలో ఏడు వికెట్లు ఉన్న ఆసీస్ విజయానికి 174 పరుగుల దూరంలో ఉంది. ఇంగ్లండ్ 273 ఆలౌట్: ఓవర్‌నైట్ స్కోరు 28/2 నాలుగో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తమదైన రీతిలో దూకుడు మంత్రాన్ని పటించింది. బ్యాటర్లు ఆది నుంచే బాదుడు మొదలుపెట్టారు. ముఖ్యంగా జో రూట్(46), హ్యారీ బ్రూక్(46), కెప్టెన్ బెన్ స్టోక్స్(43) కీలక పరుగులు జత చేశారు. ఆసీస్ బౌలింగ్‌ను సమర్థంగా నిలువరిస్తూ వైవిధ్యమైన షాట్లతో స్కోరు బోర్డుకు పరుగులు జతచేశారు. ఇన్ఫామ్ బ్యాటర్ రూట్..ర్యాంప్ షాట్లతో టి20 ఫార్మాట్ బ్యాటింగ్‌ను తలపించాడు. అయితే మరో ఎండ్‌లో కమిన్స్(4/63), లియాన్(4/80) బౌలింగ్‌తో ఇంగ్లండ్‌ను ఇబ్బందులకు గురిచేశారు. వీరిద్దరు ఇంగ్లండ్ భారీ స్కోరు ఆశలకు గండికొట్టారు. సంక్షిప్త స్కోర్లు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 393/8 డిక్లేర్డ్, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 386, ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 273 ఆలౌట్, ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 103/3 -
546 పరుగులతో బంగ్లా గెలుపు.. 21వ శతాబ్దంలో అతిపెద్ద విజయం
బంగ్లాదేశ్ తమ టెస్టు క్రికెట్ చరిత్రలో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. అప్గానిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో 546 పరుగుల తేడాతో అత్యంత భారీ విజయాన్ని మూటగట్టుకుంది. 662 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్గన్ జట్టు 115 పరుగులకే కుప్పకూలింది. ఆఫ్గన్ చివరి బ్యాటర్ జహీర్ ఖాన్ రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కిన్ అహ్మద్ నాలుగు వికెట్లు తీయగా.. షోరిఫుల్ ఇస్లామ్ మూడు, మెమదీ హసన్ మిరాజ్, ఎబాదత్ హొసెన్‌లు చెరొక వికెట్ పడగొట్టారు. ఇక టెస్టు క్రికెట్లో పరుగుల పరంగా బంగ్లాదేశ్ జట్టుకు తొలి అతిపెద్ద విజయం కాగా.. ఓవరాల్‌గా మూడో అతిపెద్ద విజయం. కాగా 21వ శతాబ్దంలో బంగ్లాదేశ్‌దే అతిపెద్ద విజయం కావడం విశేషం. ఇంతకముందు 1928లో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ 675 పరుగుల తేడాతో విజయం సాధించి తొలి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో ఆస్ట్రేలియా 562 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను(1932లో) ఓడించి రెండో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. తాజాగా బంగ్లాదేశ్ ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల తర్వాత పరుగుల పరంగా అతిపెద్ద విజయాన్ని నమోదు చేసి మూడో స్థానంలో నిలిచింది. అంతకముందు బంగ్లాదేశ్ తమ రెండో ఇన్నింగ్స్‌ను 425 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో(146 పరుగులు) మెరిసిన నజ్ముల్ హొసెన్ షాంటో రెండో ఇన్నింగ్స్‌లోనూ(124 పరుగులు) సెంచరీతో మెరవగా.. మోమినుల్ హక్ కూడా సెంచరీ(121 పరుగులు నాటౌట్) మార్క్ అందుకున్నాడు. అంతకముందు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 382 పరుగులకు ఆలౌట్ కాగా.. అఫ్గానిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే కుప్పకూలింది. అఫ్గానిస్తాన్: తొలి ఇన్నింగ్స్ : 146 ఆలౌట్ రెండో ఇన్నింగ్స్: 115 ఆలౌట్ బంగ్లాదేశ్: తొలి ఇన్నింగ్స్: 382 ఆలౌట్ రెండో ఇన్నింగ్స్: 425/4 డిక్లేర్ ఫలితం: 546 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ఘన విజయం Walton Test Match: Bangladesh vs Afghanistan | Only Test | Day 04 Bangladesh won by 546 runs. Full Match Details: https://t.co/MDvtIwN35K#BCB | #Cricket | #BANvAFG pic.twitter.com/sk24j4tteZ — Bangladesh Cricket (@BCBtigers) June 17, 2023 చదవండి: 'వరల్డ్‌కప్ ఆడతామో లేదో'.. పూటకో మాట మారిస్తే ఎలా? -
WTC Final: కొత్త జెర్సీలో మెరిసిపోతున్న టీమిండియా క్రికెటర్లు (ఫొటోలు)
-
ఆడటమే కాదు, ఏకంగా తొలి మ్యాచ్‌లోనే 5 వికెట్ల ఘనత
లార్డ్స్ వేదికగా ఐర్లాండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన ఇంగ్లండ్ యువ పేసర్ జోష్ టంగ్ ఓ ఆసక్తికర పరిణామం ద్వారా వార్తల్లో నిలిచాడు. టంగ్ ఇంగ్లండ్ జాతీయ జట్టుకు ఆడతాడని ఓ వ్యక్తి 14 ఏళ్ల కిందట 50000 పౌండ్ల (భారత కరెన్సీలో 50 లక్షలకు పైమాటే) పందెం కాసి గెలవడంతో ఈ వార్సెస్టర్‌షైర్ బౌలర్ క్రికెట్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా నిలిచాడు. టంగ్ ఇంగ్లండ్ జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇవ్వడంతో జాక్‌పాట్ కొట్టిన పందెం కాసిన వ్యక్తి, ప్రస్తుతం రెట్టింపు సంతోషానికి లోనవుతున్నాడు. టంగ్ అరంగేట్రంలోనే ఐదు వికెట్ల ఘనత సాధించడం సదరు వ్యక్తి అదనపు సంతోషానికి కారణం. టంగ్ ఇంగ్లండ్ తరఫున తొలి మ్యాచ్‌లోనే ఐదు వికెట్లు సాధించడంతో ఆ వ్యక్తి ఉబ్బితబ్బిబైపోతున్నాడు. అందులోనూ టంగ్ ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ఈ ఫీట్ సాధించడంతో ఆ వ్యక్తి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కాగా, ఐర్లాండ్‌తో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో టంగ్ ఐదేయడంతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్.. స్టువర్ట్ బ్రాడ్ (5/51) ఐదేయడంతో తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులకు ఆలౌట్ కాగా.. ఓలీ పోప్ (208 బంతుల్లో 205; 22 ఫోర్లు, 3 సిక్సర్లు) డబుల్ సెంచరీతో, బెన్ డకెట్ (178 బంతుల్లో 182; 24 ఫోర్లు, సిక్స్) భారీ శతకంతో విరుచుకుపడటంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌ను 524/4 (82.4 ఓవర్లలో) స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం ఐర్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 362 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ 11 పరుగుల లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండానే ఛేదించి 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. -
ENG VS IRE One Off Test: చేతులెత్తేస్తుందనుకుంటే చుక్కలు చూపిస్తుంది..!
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో పసికూన ఐర్లాండ్ ప్రతిఘటిస్తుంది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి వారి సహనాన్ని పరీక్షిస్తున్నారు. తొలుత హ్యారీ టెక్టార్ (51), లోర్కాన్ టక్కర్ (44) నిలకడగా ఆడి ఇంగ్లీష్ బౌలర్లకు విసుగు తెప్పిస్తే.. ఆతర్వాత ఎనిమిదో నంబర్లో బ్యాటింగ్‌కు వచ్చిన ఆండీ మెక్‌బ్రైన్ (71 నాటౌట్), తొమ్మిదో నంబర్లో బ్యాటింగ్‌కు దిగిన మార్క్ అదైర్ (88 నాటౌట్) ధాటిగా బ్యాటింగ్ చేస్తూ ఇంగ్లండ్ బౌలర్లను డిఫెన్స్‌లోకి నెట్టేస్తున్నారు. వీరిద్దరు ప్రతిఘటిస్తుండటంతో ఐర్లాండ్ 6 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసి రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. 352 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఐర్లాండ్.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు కేవలం 27 పరుగులు వెనుకపడి ఉంది. ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌ను అధిగమించి వారికి కొద్దో గొప్పో టార్గెట్ సెట్ చేసినా అది కచ్చితంగా ఇంగ్లండ్ బౌలింగ్ బలహీనతలను ఎత్తి చూపినట్లవుతుంది. అంతకుముందు ఓలీ పోప్ (208 బంతుల్లో 205; 22 ఫోర్లు, 3 సిక్సర్లు) డబుల్ సెంచరీతో, బెన్ డకెట్ (178 బంతుల్లో 182; 24 ఫోర్లు, సిక్స్) భారీ శతకంతో విరుచుకుపడటంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌ను 524/4 (82.4 ఓవర్లలో) స్కోర్ వద్ద డిక్లేర్ చేయగా.. స్టువర్ట్ బ్రాడ్ (5/51) ఐదేయడంతో ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులకు ఆలౌటైంది. చదవండి: 93 ఏళ్ల కిందటి బ్రాడ్‌మన్ రికార్డు బద్దలు కొట్టిన ఇంగ్లండ్ ఓపెనర్ -
టెస్ట్ మ్యాచా లేక వన్డేనా.. ఏమా కొట్టుడు..?
లార్డ్స్ వేదికగా ఐర్లాండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ పట్టుబిగించింది. ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌ను 524/4 (82.4 ఓవర్లలో) స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. తద్వారా 352 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఓలీ పోప్ (208 బంతుల్లో 205; 22 ఫోర్లు, 3 సిక్సర్లు) డబుల్ సెంచరీతో, బెన్ డకెట్ (178 బంతుల్లో 182; 24 ఫోర్లు, సిక్స్) భారీ శతకంతో విధ్వంసం సృష్టించగా.. జాక్ క్రాలే (56), జో రూట్ అర్ధసెంచరీలతో రాణించారు. అంతకుముందు వెటరన్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ (5/51) ఐదేయడంతో ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులకు ఆలౌటైంది. టెస్ట్ మ్యాచా లేక వన్డేనా.. ఏమా కొట్టుడు..? ఇటీవల కాలంలో టెస్ట్‌ల్లో బజ్‌బాల్ అప్రోచ్ అంటూ ఆటలో వేగం పెంచిన ఇంగ్లీష్ క్రికెటర్లు, ఐర్లాండ్‌తో ఏకైక టెస్ట్‌లోనూ అదే సిద్ధాంతాన్ని ఫాలో అయ్యారు. వీరు ఎంత వేగంగా ఆడారంటే.. ఈ మ్యాచ్‌ను చూసిన ఫాలోవర్స్‌కు ఇది టెస్ట్ మ్యాచా లేక వన్డేనా అన్న డౌట్ వచ్చింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి నిలకడగా 6కు పైగా రన్ రేట్ మెయింటైన్ చేసిన ఇంగ్లీష్ బ్యాటర్లు భారీ స్కోర్లు సాధించడంతో పాటు వేగంగా పరుగులు రాబట్టారు. వీరి వేగం చూస్తుంటే రెండు రోజుల్లోనే మ్యాచ్ ముగిసేలా కనిపిస్తుంది. రెండో రోజు మరో 25 ఓవర్ల ఆట సాధ్యపడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఐర్లాండ్‌ను సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఆలౌట్ చేయడం ఇంగ్లండ్ బౌలర్లకు పెద్ద విషయమేమీ కాకపోవచ్చు. టెస్ట్‌ల్లో ఏడో వేగవంతమైన డబుల్ సెంచరీ.. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఓలీ పోప్ టెస్ట్‌ల్లో ఏడో వేగవంతమైన డబుల్ సెంచరీని, ఇంగ్లండ్ తరఫున రెండో వేగవంతమైన ద్విశతకాన్ని బాదాడు. సిక్సర్‌తో డబుల్ హండ్రెడ్ను పూర్తి చేసిన పోప్.. 207 బంతుల్లో ఈ మార్కును అందున్నాడు. ఇంగ్లండ్ తరఫున టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్ డబుల్ హండ్రెడ్ రికార్డు జట్టు సారధి బెన్ స్టోక్స్ (163 బంతుల్లో) పేరిట ఉంది. ఓవరాల్‌గా ఈ రికార్డు న్యూజిలాండ్ ఆటగాడు నాథన్ ఆస్టల్ (153) పేరిట ఉంది. ఆస్టల్ తర్వాత స్టోక్స్, సెహ్వాగ్ (168), సెహ్వాగ్ (182), మెక్కల్లమ్ (186) ఈ రికార్డును సాధించారు. చదవండి: చరిత్ర సృష్టించిన జో రూట్ -
ఇంగ్లండ్‌కు ఆడతాడని ఎప్పుడో పందెం కాసాడు.. ఇప్పుడు జాక్‌పాట్ కొట్టేశాడు
ఐర్లాండ్‌తో ఇవాళ (జూన్ 1) మొదలైన ఏకైక టెస్ట్ ద్వారా 25 ఏళ్ల జాషువ టంగ్ అనే ఇంగ్లండ్ పేసర్ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో టంగ్ ఇంగ్లండ్ జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇవ్వడంతో, అతని ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకరు జాక్‌పాట్ కొట్టి వార్తల్లో నిలిచాడు. వివరాల్లోకి వెళితే.. టంగ్ 11 ఏళ్ల వయసులో ఉండగా, టిమ్ పైపర్ అనే అతని ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకరు, టంగ్‌పై ఓ పందెం కాసాడు. టంగ్ భవిష్యత్తులో ఇంగ్లండ్ జాతీయ జట్టుకు ఆడతాడని టిమ్ అప్పట్లో కొంత మొత్తం పందెం కాసాడు. ఇవాళ టంగ్ ఇంగ్లండ్ జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇవ్వడంతో టిమ్ పందెం గెలిచి, 50000 పౌండ్ల (భారత కరెన్సీలో 50 లక్షలకు పైమాటే) జాక్‌పాట్ కొట్టేశాడు. టంగ్.. చిన్నతనం నుంచి క్రికెట్ ఆడటాన్ని గమినిస్తూ వచ్చిన టిమ్, అతను ఏదో ఒక రోజు ఇంగ్లండ్ జాతీయ జట్టుకు ఆడతాడని జోస్యం చెప్పాడట. 14 ఏళ్ల తర్వాత టిమ్ జోస్యం నిజమై, టంగ్ ఇంగ్లండ్ 711వ ప్లేయర్‌గా టెస్ట్ క్యాప్ అందుకున్నాడు. కాగా, ఐర్లాండ్‌తో టెస్ట్‌కు తొలుత ప్రకటించిన ఇంగ్లండ్ జట్టులో టంగ్‌కు చోటుదక్కలేదు. నలుగురు పేసర్లు వివిధ కారణాల చేత అందుబాటులోకి రాకపోవడంతో.. ఆఖరి నిమిషంలో టంగ్‌కు జట్టులో చోటుదక్కింది. కౌంటీల్లో వోర్సెస్టర్షైర్ తరపున అద్భుతంగా రాణించడంతో టంగ్‌కు సెలక్టర్లు పిలుపునిచ్చారు. టంగ్.. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 82 ఇన్నింగ్స్‌లలో 162 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే, ఐర్లాండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ చేసింది. స్టువర్ట్ బ్రాడ్ (5/51), జాక్ లీచ్ (3/35), మాథ్యూ పాట్స్ (2/36) సత్తా చాటడంతో ఐర్లాండ్ 172 పరుగులకే ఆలౌటైంది. టంగ్‌కు ఒక్క వికెట్ కూడా దక్కలేదు. చదవండి: WTC Final: ఆసీస్‌కు అక్కడ అంత సీన్ లేదు.. గెలుపు టీమిండియాదే..! -
నెట్ ప్రాక్టీస్‌లో కోహ్లి.. లండన్‌కు పయనం కానున్న ఆ ఐదుగురు!
WTC Final 2023- Ind Vs Aus: లండన్: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ కోసం భారత ఆటగాళ్లు ఇంగ్లండ్‌లో కసరత్తు మొదలుపెట్టారు. స్టార్ బ్యాటర్ కోహ్లి ట్రెయినింగ్ సెషన్లో పాల్గొన్నాడు. లెఫ్టార్మ్ సీమర్ ఉనాద్కట్, ఉమేశ్ యాదవ్, సిరాజ్, వెటరన్ స్పిన్నర్ అశ్విన్‌లు కాసేపు ఎక్సర్సైజ్ చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ, యువ సంచలనం యశస్వి జైస్వాల్ తాజాగా ఇంగ్లండ్ చేరుకోగా... మంగళవారం నుంచి వీరిద్దరు ప్రాక్టీస్ మొదలుపెడతారు. కాగా జూన్ 7-11 వరకు ఇంగ్లండ్ వేదికగా డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగనుంది. టీమిండియా- ఆస్ట్రేలియా ప్రఖ్యాత ఓవల్ మైదానంలో ఈ మెగా మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఇప్పటికే ఇరు దేశాల బోర్డులు ఫైనల్‌కు సంబంధించిన జట్లను ఖరారు చేశాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు భారత ఆటగాళ్లు లండన్‌కు చేరకుని ప్రాక్టీస్ షురూ చేశారు. ఐదోసారి చాంపియన్‌గా చెన్నై.. ఆలస్యంగా ఆ ఐదుగురు ఇక ఐపీఎల్-2023 ఫైనల్ ముగించుకున్న ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (సీఎస్కే), అజింక్య రహానే(సీఎస్కే) సహా గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు మహ్మద్ షమీ, శుబ్‌మన్ గిల్, కేఎస్ భరత్ కాస్త ఆలస్యంగా యూకేకు బయల్దేరనున్నారు. కాగా క్యాష్ రిచ్ లీగ్ పదహారో ఎడిషన్ విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ అవతరించిన విషయం తెలిసిందే. వర్షం ఆటంకం కారణంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో సోమవారం జరిగిన రిజర్వ్ డే మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌పై గెలుపొందింది. డక్‌వర్త్ లూయీస్ పద్ధతిలో విజయం సాధించి ఐదోసారి ట్రోఫీని ముద్దాడింది ధోని సేన. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఆస్ట్రేలియా జట్టు ఇదే భారత జట్టుతో వచ్చే నెల 7 నుంచి 11 వరకు ఓవల్‌లో జరిగే ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్‌లో పాల్గొనే ఆస్ట్రేలియా జట్టును ప్రకటించారు.పక్కటెముకల్లో నొప్పితో ఐపీఎల్ టోర్నీ మధ్యలో నుంచి స్వదేశానికి వెళ్లిపోయిన పేస్ బౌలర్ జోష్ హాజల్‌వుడ్ (ఆర్సీబీ)కు 15 మందితో కూడిన ఆసీస్ జట్టులో చోటు లభించింది. అయితే ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్, బ్యాటర్ రెన్షాలకు స్థానం దక్కలేదు. 32 ఏళ్ల హాజల్‌వుడ్ 59 టెస్టులు ఆడి 222 వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియా టెస్ట్ జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), వార్నర్, ఉస్మాన్ ఖ్వాజా, లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్, హాజల్‌వుడ్, నాథన్ లయన్, టాడ్ మర్ఫీ, స్కాట్ బోలాండ్, కామెరాన్ గ్రీన్, మార్కస్ హారిస్, ఇంగ్లిస్. టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్య రహానే, కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనాద్కట్, ఇషాన్ కిషన్. స్టాండ్ బై ప్లేయర్లు: సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైశ్వాల్, ముకేశ్ కుమార్ చదవండి: చాంపియన్‌గా చెన్నై.. గిల్ సరికొత్త చరిత్ర! అవార్డులు, ప్రైజ్‌మనీ పూర్తి వివరాలు ఇవే.. రిటైర్మెంట్ ప్రకటనకు ఇదే సరైన సమయం.. కానీ! నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి: ధోని ఇలా జరగాలని రాసి పెట్టి ఉందంతే! ధోని చేతిలో ఓడినా బాధపడను: హార్దిక్ #TeamIndia members begin their preparations for the #WTC23 at Arundel Castle Cricket Club. pic.twitter.com/2kvGyjWNF7 — BCCI (@BCCI) May 29, 2023 -
WTC Final: ఆసీస్ జట్టు నుంచి ఆ ఇద్దరు అవుట్.. మరి టీమిండియాలో?!
WTC Final 2021-2023: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2023 నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తమ ఫైనల్ జట్టును ప్రకటించింది. తొలుత 17 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసిన బోర్డు.. తాజాగా ఐసీసీకి సమర్పించిన వివరాల్లో 15 మందికి చోటు ఇచ్చినట్లు తెలిపింది. కాగా తొలుత ప్రకటించిన జట్టులో ఉన్న మిచెల్ మార్ష్, మ్యాట్ రెన్షా మాత్రం తాజాగా టీమ్‌లో చోటు కోల్పోయారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి నిబంధనలకు అనుగుణంగా బోర్డు ఈ మేరకు 15 మంది సభ్యులతో కూడిన జట్టును సోమవారం ప్రకటించింది. ఇక ఐపీఎల్-2023లో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించిన పేసర్ జోష్ హాజిల్‌వుడ్, ఢిల్లీ క్యాపిటల్స్ సారథిగా వ్యవహరించిన డేవిడ్ వార్నర్ జట్టులో కొనసాగనున్నారు. వారిద్దరు అవుట్.. వార్నర్‌కు కోచ్ మద్దతు మార్ష్, రెన్షాలకు మాత్రం నిరాశ తప్పలేదు. వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు హెడ్‌కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ అండగా నిలవడంతో ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో ఆడేందుకు అతడికి మార్గం సుగమమైంది. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌తో పాటు, యాషెస్ సిరీస్‌లోనూ వార్నర్ కీలక పాత్ర పోషించగలడంటూ మెక్‌డొనాల్డ్ అతడికి మద్దతుగా నిలవడం గమనార్హం. కాగా జూన్ 7-11 వరకు ఇంగ్లండ్ వేదికగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. జూన్ 12 రిజర్వ్ డేగా నిర్ణయించారు. ప్రఖ్యాత ఓవల్ మైదానంలో ఈ ప్రతిష్టాత్మక టెస్టు మ్యాచ్ జరుగనుంది. ఇందుకోసం ఇప్పటికే కొంతమంది టీమిండియా ఆటగాళ్లు లండన్‌కు చేరుకున్నారు. ప్రాక్టీసు కూడా మొదలుపెట్టేశారు. డబ్ల్యూటీసీ ఫైనల్-2023 ఆస్ట్రేలియా తాజా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, కామెరాన్ గ్రీన్, మార్కస్ హారిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లియోన్, టాడ్ మర్ఫీ, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్. కాగా భారత ప్రధాన జట్టులో మాత్రం ఎటువంటి మార్పులు లేనట్లు తెలుస్తోంది. టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్య రహానే, కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనాద్కట్, ఇషాన్ కిషన్. చదవండి: WTC Final 2023: రోహిత్ శర్మతో కలిసి లండన్‌కు యశస్వి.. తిలక్ వర్మ రియాక్షన్.. వైరల్ Get your friends, form a circle and replicate this fun drill! 😉😀😀🏏#TeamIndia pic.twitter.com/X6iOuXPrhY — BCCI (@BCCI) May 26, 2023 -
రోహిత్ శర్మతో కలిసి లండన్‌కు యశస్వి.. తిలక్ వర్మ రియాక్షన్.. వైరల్
WTC Final 2021-23 Ind Vs Aus: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ముంబై యువ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ లండన్‌కు పయనమయ్యారు. వీరిద్దరు ఆదివారం సాయంత్రం యూకే బయల్దేరారు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్-2023 నేపథ్యంలో ఈ ముంబైకర్లు ఇంగ్లండ్ విమానం ఎక్కేశారు. కాగా ప్రఖ్యాత ఓవల్ వేదికగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగనున్న విషయం తెలిసిందే. ఐపీఎల్-2023 ముగిసిన తర్వాత జూన్ 7న మొదలుకానున్న ఈ మెగా ఫైట్ కోసం ఇప్పటికే విరాట్ కోహ్లి, శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్ సహా పలువురు టీమిండియా ఆటగాళ్లు ఇంగ్లండ్‌కు చేరుకున్నారు. మరోవైపు.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపికైన జట్టులో ఉన్న అజింక్య రహానే, శుబ్‌మన్ గిల్, మహ్మద్ షమీ తదితరులు ఐపీఎల్-2023 ఫైనల్ ముగిసిన తర్వాత బయల్దేరనున్నారు. ఇదిలా ఉంటే.. డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టుకు స్టాండ్‌బై ఎంపికైన రుతురాజ్ గైక్వాడ్ తప్పుకోవడంతో.. అతడి స్థానంలో రాజస్తాన్ రాయల్స్ సంచలన ఓపెనర్ యశస్వికి ఛాన్స్ వచ్చింది. ఇంతవరకు టీమిండియా తరఫున అరంగేట్రం చేయని 21 ఏళ్ల యశస్వి మెగా ఫైట్ నేపథ్యంలో సెలక్టర్ల పిలుపు అందుకున్నాడు. తిలక్ వర్మ రియాక్షన్.. వైరల్ ఈ క్రమంలో రోహిత్ శర్మతో కలిసి లండన్‌కు బయల్దేరాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను యశస్వి జైశ్వాల్ తన సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేశాడు. ‘‘వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ కోసం ఇంగ్లండ్‌కు పయనం. అది కూడా వన్ అండ్ ఓన్లీ రోహిత్ శర్మతో’’ అంటూ క్యాప్షన్ జతచేశాడు. ఇక యశస్వి పోస్టుకు స్పందించిన హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ.. ‘‘చాలా సంతోషంగా ఉంది జస్సూ’’ అంటూ ఆనందం వ్యక్తం చేశాడు. రాజస్తాన్ రాయల్స్‌లో యశస్వి సహచర ఆటగాడు, ఇంగ్లండ్ మాజీ సారథి జో రూట్ సైతం యశ్‌కు గుడ్ లక్ చెప్పాడు. రోహిత్‌తో యశస్వి కలిసి ఉన్న ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2023లో లెఫ్టాండ్ బ్యాటర్ యశస్వి 14 మ్యాచ్‌లు ఆడి 625 పరుగులు సాధించాడు. ఓ శతకం నమోదు చేశాడు. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ స్టాండ్ బైగా ఎంపికైన సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ స్థానంలో జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్ కూడా లండన్‌కు బయల్దేరినట్లు సమాచారం. కాగా ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా సహా రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ తదితరులు గాయాల కారణంగా దూరమైన విషయం తెలిసిందే. చదవండి: IPL 2023 Final: ధోని సేనకు శుభ సూచకం View this post on Instagram A post shared by Yashasvi Jaiswal (@yashasvijaiswal28) -
‘వివాదాస్పద సాఫ్ట్ సిగ్నల్’ రూల్ రద్దు! ఆ మ్యాచ్ నుంచే అమలు!
Soft- Signal Rule: క్రికెట్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసిన ‘సాఫ్ట్ సిగ్నల్’ నిబంధనను రద్దు చేయబోతున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2023 ఫైనల్ సందర్భంగా ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి తన నిర్ణయాన్ని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ వేదికగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ నుంచి ఈ రూల్ కనుమరుగు కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తప్పనిసరిగా చెప్పాల్సిందే! అవుట్(క్యాచ్) లేదా నాటౌట్ విషయంలో సందేహం తలెత్తినపుడు ఆన్ ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్‌కు నివేదించే ముందు తమ విచక్షణకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునేందుకు వెసలుబాటు కల్పించే నిబంధనే సాఫ్ట్ సిగ్నల్. క్రికెట్ నిబంధనలు రూపొందించే ‘ఎంసీసీ’ ప్రకారం అంపైర్ అవుట్ కానీ నాటౌట్ కానీ ఏదో ఒక నిర్ణయాన్ని అన్ ఫీల్డ్ అంపైర్ తనవైపు నుంచి తప్పనిసరిగా ప్రకటించాల్సిందే. మరీ సాంకేతికతపైనే ఆధారపడకుండా టెక్నాలజీ ఎంత పెరిగినా దానిని ఆపరేట్ చేసేది మనుషులే కాబట్టి పూర్తిగా సాంకేతికతపైనే ఆధారపడకుండా అంపైర్ల విచక్షణకు కూడా అవకాశం ఇవ్వాలనేది ‘సాఫ్ట్ సిగ్నల్’ అంతస్సూత్రం. ఎల్బీడబ్ల్యూల విషయంలో ‘అంపైర్స్ కాల్’ను అమలు చేస్తోంది కూడా ఇందుకే! బౌలర్ ఎండ్ నుంచి ఆన్ ఫీల్డ్ అంపైర్.. ఒక బ్యాటర్ అవుటయ్యాడా లేదంటే నాటౌటా అన్న విషయాన్ని తన కళ్లతో పరీక్షించిన తర్వాత.. ఒకవేళ సందేహం ఉంటే.. తన నిర్ణయాన్ని చెప్పడంతో పాటుగా థర్డ్ అంపైర్ సహాయాన్ని కూడా కోరతాడు. క్లియర్‌గా కనిపించినా ఒకవేళ థర్డ్ అంపైర్ రీప్లేలో ఈ అంశాలను గమనించిన తర్వాత ఆన్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకించే ఆధారాలు గనుక లభించనట్లయితే.. అతడి నిర్ణయాన్నే ఫైనల్ చేస్తాడు. రీప్లేల్లోనూ స్పష్టంగా కనిపించని ‘ఇన్‌కన్‌క్లూజివ్’ విషయాల్లో ఆన్ ఫీల్డ్ అంపైర్ డెసిషన్‌కే కట్టుబడి ఉంటారు. అయితే, ఒక్కోసారి రీప్లేలో క్లియర్‌గా కనిపించినా ఆన్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయం ప్రకారమే నడుచుకోవడం వివాదాలకు దారితీసింది. నాటి మ్యాచ్‌లో సూర్య ఇచ్చిన క్యాచ్ విషయంలో వివాదం ముఖ్యంగా 2021లో టీమిండియా- ఇంగ్లండ్ మధ్య నాలుగో టీ20 సందర్భంగా చోటుచేసుకున్న ఘటన సాఫ్ట్ సిగ్నల్‌పై తీవ్ర విమర్శలకు కారణమైంది. ఈ మ్యాచ్‌లో సామ్ కరన్ బౌలింగ్‌లో భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఇచ్చిన క్యాచ్‌ను డేవిడ్ మలన్ క్యాచ్ పట్టాడు. అయితే, ఆ సమయంలో బంతి గ్రౌండ్‌ను తాకినట్లు కనిపించింది. కానీ అప్పటికే సూర్య అవుటైనట్లు అంపైర్ సాఫ్ట్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ తర్వాత థర్డ్ అంపైర్ వీరేందర్ శర్మ సాయం కోరాడు. రీప్లేలో బంతి నేలను తాకినట్లు స్పష్టంగా కనిపించినా థర్డ్ అంపైర్ సాఫ్ట్ సిగ్నల్‌కే ఓటేశాడు. దీంతో వివాదం ముదిరింది. ఇలాంటి రూల్‌ను రద్దు చేయాల్సిందే! దీంతో కనిపించనంత దూరంలో బౌండరీ వద్ద పట్టిన సందేహాస్పద క్యాచ్‌పై కూడా ఆన్ ఫీల్డ్ అంపైర్ ‘సాఫ్ట్ సిగ్నల్’ పేరుతో తన నిర్ణయం ప్రకటించడం, సాంకేతికత అందుబాటులో ఉన్నా తప్పుడు నిర్ణయాలు వెలువడటంతో ఈ నిబంధన ఎత్తేయాలంటూ డిమాండ్లు వినిపించాయి. అదే విధంగా.. తనకు అర్థంకాని అంశంలో ఫీల్డ్ అంపైర్ అసలు స్పందించాల్సిన అవసరం ఏమిటి? రనౌట్ల విషయంలో మాదిరే నేరుగా థర్డ్ అంపైర్‌కే వదిలేయొచ్చు కదా అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీసీ-2023 ఫైనల్ నుంచి ఈ నిబంధనను రద్దు చేయాలనే యోచనలో ఐసీసీ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు సౌరవ్ గంగూలీ సారథ్యంలోని క్రికెట్ కమిటీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా జూన్ 7-11 వరకు భారత్- ఆస్ట్రేలియా మధ్య ఓవల్ మైదానంలో డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగనుంది. చదవండి: కేకేఆర్‌కు ఊహించని షాక్! ఇంపాక్ట్ ప్లేయర్ సహా వాళ్లందరికీ! వాళ్ల తప్పేం లేదు..! అతడు అద్భుతం.. జట్టుకు దొరికిన విలువైన ఆస్తి: ధోని -
WTC Final: రాహుల్ స్థానంలో యువ వికెట్ కీపర్ బ్యాటర్.. బీసీసీఐ ప్రకటన
#WTC Final 2023: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ జట్టులో యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌కు చోటు దక్కింది. కేఎల్ రాహుల్ స్థానంలో అతడిని జట్టుకు ఎంపిక చేసినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి తెలిపింది. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేసింది. కాగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 గెలిచిన టీమిండియా.. ఆసీస్‌తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తును ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జూన్ 7-11 వరకు టీమిండియా- ఆస్ట్రేలియా తుదిపోరులో పోటీ పడనున్నాయి. ఇంగ్లండ్ వేదికగా ఇరు జట్లు టైటిల్ వేటలో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే బీసీసీఐ ఆసీస్‌తో తలపడే భారత జట్టును ప్రకటించింది. రాహుల్ అవుట్ అయితే, ఐపీఎల్-2023లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ సందర్భంగా లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్, టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గాయపడ్డాడు. కుడి తొడ పైభాగంలో నొప్పి తీవ్రమైన నేపథ్యంలో సర్జరీ చేయించుకునేందుకు నిశ్చయించుకున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమైన అతడు డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి కూడా వైదొలిగినట్లు బీసీసీఐ తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. అతడి స్థానంలో ఇషాన్ కిషన్‌ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసినట్లు తెలిపింది. వాళ్లిద్దరి సంగతి ఏంటి? ఇక ఎడమ భుజానికి గాయం కావడంతో ఇబ్బంది పడుతున్న పేసర్ జయదేవ్ ఉనాద్కట్ ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొంది. అతడి గాయం తీవ్రతపై పూర్తిగా స్పష్టత వచ్చిన తర్వాతే డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో కొనసాగే అంశంపై క్లారిటీ వస్తుందని తెలిపింది. ముగ్గురికి ఛాన్స్ అదే విధంగా మరో పేసర్ ఉమేశ్ యాదవ్ కూడా కేకేఆర్ వైద్య బృందం పర్యవేక్షణలో కోలుకుంటున్నాడన్న బీసీసీఐ.. తమ మెడికల్ టీమ్ ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటోందని తెలిపింది. ఇక శ్రేయస్ అయ్యర్ వెన్ను నొప్పి కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టాండ్‌బై ప్లేయర్లుగా రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్‌లతో పాటు బౌలర్ ముకేశ్ కుమార్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. కాగా ఇంతవరకు టీమిండియా తరఫున ఒక్క టెస్టు కూడా ఆడని ఇషాన్ ఏకంగా డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రధాన జట్టులో చోటు దక్కించుకోవడం విశేషం. ఆసీస్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడేందుకు బీసీసీఐ ఎంపిక చేసిన టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్యా రహానే, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్). స్టాండ్ బై ప్లేయర్లు: రుతురాజ్ గైక్వాడ్, ముకేశ్ కుమార్, సూర్యకుమార్ యాదవ్. చదవండి: లక్నో సూపర్ జెయింట్స్‌కు మరో బిగ్ షాక్.. స్టార్ ఆటగాడు దూరం! -
WTC Final: టీమిండియా టీ20 స్టార్‌కు బంపరాఫర్!
ICC World Test Championship 2023 Final: టీమిండియా టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి బంపరాఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2023 ఫైనల్ ఆడే జట్టులో అతడికి స్టాండ్‌బైగా అవకాశం ఇచ్చినట్లు సమాచారం. కాగా టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్ 1గా కొనసాగుతున్న సూర్య.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సందర్భంగా అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. అరంగేట్రంలో విఫలం నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో మొట్టమొదటి సారి బరిలో దిగిన సూర్య పూర్తిగా విఫలమయ్యాడు. కేవలం 8 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో రెండో మ్యాచ్ నుంచి అతడిని పక్కనపెట్టేశారు. ఈ క్రమంలో డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టు ఎంపిక సమయంలో సూర్య పేరును పరిగణనలోకి తీసుకోలేదు. రాహుల్‌కు గాయం అదే సమయంలో వెటరన్ బ్యాటర్, మాజీ వైస్ కెప్టెన్.. ఐపీఎల్-2023లో అదరగొడుతున్న అజింక్య రహానేకు సెలక్టర్లు పిలుపునిచ్చారు. గాయం కారణంగా మెగా మ్యాచ్‌కు దూరమైన శ్రేయస్ అయ్యర్ స్థానంలో రహానేకు అవకాశం ఇచ్చారు. ఇదిలా ఉంటే.. కేఎల్ రాహుల్ ఐపీఎల్-2023లో ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా గాయపడిన విషయం తెలిసిందే. యూకే వీసా రెడీ చేసుకో! ఈ నేపథ్యంలో సీజన్ మొత్తానికి అతడు దూరం కానున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా డబ్ల్యూటీసీ ఫైనల్ నాటికి కోలుకుంటాడో లేదోనన్న సందేహాల నడుమ.. సూర్యను స్టాండ్‌బైగా ఎంపిక చేసి లండన్ పంపనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీసీసీఐ వర్గాలు.. ‘‘ఇంతవరకు ఈ విషయంపై అంతిమ నిర్ణయం తీసుకోలేదు. అయితే, సూర్యను యూకే వీసా సిద్ధంగా ఉంచుకోవాలని మాత్రం చెప్పారు’’ అని పేర్కొన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఐపీఎల్‌తో తిరిగి ఫామ్‌లోకి కాగా స్వదేశంలో టెస్టుల్లో విఫలమైన సూర్య.. వన్డే సిరీస్‌లోనూ వరుసగా డకౌట్ అయి విమర్శలు మూటగట్టుకున్నాడు. ఐపీఎల్-2023 ఆరంభంలోనూ స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయిన సూర్య.. ప్రస్తుతం మూడు అర్ధ శతకాలతో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. ఇక ఇంగ్లండ్ వేదికగా జూన్ 7-11 వరకు టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగనుంది. లండన్‌లోని ఓవల్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌కు జూన్ 12ను రిజర్వ్ డేగా ఫిక్స్ చేశారు. డబ్ల్యూటీసీ ఫైనల్-2023కి బీసీసీఐ ఎంపిక చేసిన జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, కెఎల్ రాహుల్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్. షమీ, మొహమ్మద్. సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనాద్కట్. చదవండి: ఓటమిని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాం.. నా వల్లే ఇలా! అతడు మాత్రం.. -
సరిపోని ఐర్లాండ్ పోరాటం.. బంగ్లాదేశ్ ఖాతాలో మరో సిరీస్
ఢాకా వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌లో బంగ్లాదేశ్ సూపర్ విక్టరీ సాధించింది. ఈ గెలుపుతో బంగ్లాదేశ్.. ప్రస్తుత పర్యటనలో ఐర్లాండ్‌ను మూడు ఫార్మాట్లలో మట్టికరిపించి, సొంతగడ్డపై తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఈ సిరీస్‌కు ముందు స్వదేశంలో జగజ్జేత ఇంగ్లండ్‌ను సైతం ఓ ఆట ఆడుకున్న (3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్) బంగ్లా టైగర్స్.. తాజాగా పసికూన ఐర్లాండ్‌పై అదే స్థాయిలో రెచ్చిపోయారు. 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకున్న ఆ జట్టు.. టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో, టెస్ట్ సిరీస్‌ను 1-0 తేడాతో గెలుచుకుంది. మ్యాచ్ విషయానికొస్తే.. నాలుగు రోజుల్లో ముగిసిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఐర్లాండ్ అద్భుతంగా పోరాడినప్పటికీ, ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. 286/8 ఓవర్ నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఐర్లాండ్.. మరో 6 పరుగులు మాత్రమే జోడించి మిగతా 2 వికెట్లు కోల్పోయింది. బంగ్లా ముందు ఫైటింగ్ టార్గెట్ ఉంచుతుందని భావించిన ఐర్లాండ్ ఆఖరి 2 వికెట్లు వెంటవెంటనే కోల్పోయి ఓటమిని అప్పుడే పరోక్షంగా అంగీకరించింది. 138 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 3 వికెట్లు కోల్పోయి ఆడుతూ పాడుతూ విజయం సాధించింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో శతక్కొట్టిన (126) ముష్ఫికర్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ (51 నాటౌట్) అర్ధసెంచరీ సాధించి, తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. మొమినుల్ హాక్ 20 పరుగులతో అజేయంగా నిలువగా.. తమీమ్ ఇక్బాల్ (31), లిటన్ దాస్ (23) జట్టు విజయంలో తలో చేయి వేశారు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఐర్లాండ్ వికెట్‌కీపర్ టకెర్ (108) సెంచరీ పోరాటం వృధా అయ్యింది. స్కోర్ వివరాలు.. ఐర్లాండ్: 214 & 292 బంగ్లాదేశ్: 369 & 138/3 -
శతక్కొట్టిన టకెర్.. ఐర్లాండ్ అసాధారణ పోరాటం
మిర్పూర్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్‌లో ఐర్లాండ్ అసాధారణ పోరాటపటిమను కనబరిచింది. 131 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. ఓవర్‌నైట్ స్కోరు 27/4తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఐర్లాండ్ ఆట ముగిసే సమయానికి 107 ఓవర్లలో 8 వికెట్లకు 286 పరుగులు సాధించింది. వికెట్ కీపర్ లొర్కాన్ టకెర్ (162 బంతుల్లో 108; 14 ఫోర్లు, 1 సిక్స్) వీరోచిత సెంచరీ చేశాడు. హ్యారీ టెక్టర్ (56; 7 ఫోర్లు, 1 సిక్స్), మెక్‌బ్రైన్ (71 బ్యాటింగ్; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో అదరగొట్టారు. టెక్టర్, టకెర్ ఆరో వికెట్‌కు 72 పరుగులు... టకెర్, మెక్‌బ్రైన్ ఏడో వికెట్‌కు 111 పరుగులు భాగస్వామ్యం జోడించారు. -
లేటు వయసులో ఇరగదీస్తున్న బంగ్లా బ్యాటర్.. వరుస సెంచరీలు
BAN VS IRE Test Match: బంగ్లాదేశ్ వెటరన్ బ్యాటర్ 35 ఏళ్ల ముష్ఫికర్ రహీం లేటు వయసులో కుర్రాళ్లకు మించి రెచ్చిపోతున్నాడు. ఢాకా వేదికగా ఐర్లాండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీతో కదం తొక్కిన రహీం (తొలి ఇన్నింగ్స్‌లో 126) వరుస ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు సాధించి ఔరా అనిపించాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఐర్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో చివరిసారిగా బ్యాటింగ్ (ఐర్లాండ్‌తో మూడో వన్డేలో రహీంకు బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోగా.. ఆ తర్వాత జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో రహీం ఆడలేదు) చేసిన రహీం.. ఫలితం తేలకుండా ముగిసిన ఆ మ్యాచ్‌లో 60 బంతుల్లోనే అజేయమైన శతకాన్ని బాది శభాష్ అనిపించకున్నాడు. తాజా సెంచరీతో టెస్ట్‌ల్లో 10వ సెంచరీ నమోదు చేసిన రహీం.. తన జట్టు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 214 పరుగులకు చాపచుట్టేయగా.. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగుల భారీ స్కోర్ చేసి 155 పరుగుల ఆధిక్యం సాధించింది. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో హ్యారీ టెక్టార్ (50) అర్ధసెంచరీతో రాణించగా.. బంగ్లా బౌలర్ తైజుల్ ఇస్లాం 5 వికెట్లతో చెలరేగాడు. బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో రహీంతో పాటు షకీబ్ అల్ హసన్ (87), మెహిది హసన్ (55) రాణించగా.. ఐరిష్ బౌలర్ ఆండీ మెక్‌బ్రైన్ 6 వికెట్లతో సత్తా చాటాడు. రెండో రోజు మూడో సెషన్లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఐర్లాండ్.. పరుగులేమీ చేయకుండానే నాలుగో బంతికే వికెట్ కోల్పోయింది. జేమ్స్ మెక్కొల్లమ్ను షకీబ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. -
5 వికెట్లతో చెలరేగిన తైజుల్.. ఐర్లాండ్ 214 ఆలౌట్
Bangladesh vs Ireland, Only Test 2023 Day 1 Score- మిర్పూర్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్‌లో ఐర్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 77.2 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌటైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఐర్లాండ్‌ను బంగ్లాదేశ్ ఎడంచేతి వాటం స్పిన్నర్ తైజుల్ ఇస్లామ్ (5/53), మీడియం పేసర్ ఇబాదత్ హుస్సేన్ (2/54), స్పిన్నర్ మెహదీ హసన్ మిరాజ్ (2/43) దెబ్బ కొట్టారు. ఐర్లాండ్ జట్టులో హ్యారీ టెక్టర్ (50; 6 ఫోర్లు, 1 సిక్స్), లొర్కాన్ టకెర్ (37; 3 ఫోర్లు), క్యాంఫెర్ (34; 6 ఫోర్లు) రాణించారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 10 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి 34 పరుగులు సాధించింది. ఐరిష్ బౌలర్లలో మార్క్ అడేర్ ఒకటి, ఆండీ మెక్‌బ్రిన్ ఒక వికెట్ తీశారు. ఇక మొదటి రోజు ముగిసేసరికి ఆతిథ్య బంగ్లాదేశ్ ఐర్లాండ్ కంటే 180 పరుగులు వెనుకబడి ఉంది. కాగా ఈ మ్యాచ్ కంటే ముందు జరిగిన వన్డే సిరీస్, టీ20 సిరీస్‌లను బంగ్లాదేశ్ 2-0తో కైవసం చేసుకుంది. చదవండి: గుజరాత్ టైటాన్స్‌కు గుడ్‌న్యూస్.. కేన్‌మామ స్థానంలో లంక ఆల్‌రౌండర్ ఐపీఎల్‌తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూరం! వన్డే వరల్డ్‌కప్ టోర్నీకి కూడా -
INDvsAUS నాలుగో టెస్ట్ : మైదానంలో భారత్-ఆసీస్ ప్రధానుల సందడి (ఫొటోలు)
-
ఢిల్లీ టెస్టులో భారత్ చారిత్రాత్మక విజయం
-
రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ 113 ఆలౌట్
-
మళ్లీ స్పిన్ మంత్రం
న్యూఢిల్లీ: మరోసారి స్పిన్ ప్రభావం ఉంటుందా...తొలి మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగిస్తే ఇది ఎన్ని రోజులు సాగుతుంది... ఆసీస్ మన స్టార్లు అశ్విన్, జడేజాలను ఎదుర్కోగలదా...అసలు ఆ జట్టు పోరాడగలదా...టీమిండియా తిరుగులేని ప్రదర్శనతో ఆధిపత్యం ప్రదర్శిస్తుందా... ఇలాంటి ఆలోచనలు, అంచనాల మధ్య రెండో టెస్టుకు రంగం సిద్ధమైంది. ఆ్రస్టేలియాకు పెను సవాల్ విసిరేందుకు మరో స్పిన్ వికెట్ స్వాగతం పలుకుతోంది. ప్రపంచ టెస్టు క్రికెట్లో టాప్–2 జట్లయిన ఆసీస్, భారత్‌ల మధ్య నేటి నుంచి ఢిల్లీ కోటలో రెండో టెస్టు జరుగుతుంది. ఈ ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భారత్ తొలి టెస్టు గెలిచి 1–0తో పైచేయి సాధించింది. మరోవైపు మేటి జట్టు ఆ్రస్టేలియా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ వంద ఓవర్లయినా ఎదుర్కోలేకపోవడం జట్టు స్థైర్యాన్ని దెబ్బతీసింది. ఇప్పుడు సిరీస్‌లో పుంజుకోవాలంటే ఈ మ్యాచ్‌లో భారత బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కోవాల్సిందే! ఉత్సాహంగా భారత్ సిరీస్‌లో శుభారంభం చేసిన భారత్ ఇప్పుడు ఆధిక్యాన్ని రెట్టింపు చేసుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్‌లో రోహిత్ ఫామ్‌లో ఉండగా, వందో టెస్టు ఆడనున్న చతేశ్వర్ పుజారా దీన్ని చిరస్మరణీయం చేసుకోవాలని పట్టుదలగా ఉన్నాడు. గత టెస్టులో పుజారా, కోహ్లి విఫలమయ్యారు. కానీ తన సొంతగడ్డయిన ఢిల్లీపై కోహ్లి చెలరేగడం ఖాయం. శ్రేయస్ అయ్యర్ ఫిట్నెస్ సాధించడంతో సూర్యకుమార్ బెంచ్‌కే పరిమితమవుతాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన రవీంద్ర జడేజాతో పాటు శ్రీకర్ భరత్, అక్షర్ పటేల్ వరకు అంటే తొమ్మిదో వరుస వరకు బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉండటం కచి్చతంగా అదనపు బలం కాగలదు. అశ్విన్‌కు ఢిల్లీ అచ్చొచ్చిన పిచ్. ఇక్కడ నాలుగు టెస్టులాడి ఏకంగా 27 వికెట్లు తీశాడు. జడేజా, అక్షర్‌ల స్పిన్ తప్పకుండా మ్యాచ్‌ను మలుపుతిప్పగలదు. కొన్ని గణాంకాలు భారత జట్టును ఊరిస్తున్నాయి. 1987 తర్వాత ఢిల్లీలో భారత్ పరాజయమే ఎరుగదు. చివరిసారిగా ఆ ఏడాది విండీస్ చేతిలో ఓడిన టీమిండియా తదనంతరం గెలవడం లేదంటే డ్రా చేసుకుంది కానీ... ఏ టెస్టులోనూ ఓడలేదు. 249 వికెట్లతో ఉన్న జడేజా ఒక్క వికెట్ తీస్తే 250 మార్క్‌ను అధిగమిస్తాడు. పుంజుకోవడం ఎలా! భారత్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి స్పిన్ బూచిపై కంగారు పడిన ఆ్రస్టేలియా ప్రత్యేక కసరత్తులు చేసింది. వార్నర్, ఉస్మాన్ ఖాజా, లబుõÙన్, స్మిత్ ఇలా మేటి బ్యాటర్స్ అంతా పూర్తి స్థాయి ఫిట్నెస్తో అందుబాటులో ఉన్నారు. కానీ ఆట దగ్గరకు వచ్చేసరికి వార్నర్ (1, 10), ఖాజా (1, 5)ల ఓపెనింగ్ అత్యంత పేలవంగా మొదలైంది. ఇది రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ జట్టును చావుదెబ్బ తీసింది. ప్రత్యర్థి స్పిన్ అస్త్రాలకు మిడిలార్డర్ ఇంకాస్త బలహీనపడింది. ఢిల్లీ కూడా అలాంటి వికెటే కావడంతో ఆ్రస్టేలియా శిబిరంలో ఆందోళన పెరుగుతుంది. అనుభవజు్ఞడైన స్మిత్, ఫామ్‌లో ఉన్న లబుõÙన్ బాధ్యతగా ఆడితే బ్యాటింగ్‌లో జట్టు నిలబడేందుకు అస్కారం వుంటుంది. కమిన్స్, మరీ్ఫ, లయన్, బోలండ్లతో కూడిన బౌలింగ్ దళం కూడా ఆతిథ్య బ్యాటర్లపై ప్రభావం చూపిస్తేనే ఈ మ్యాచ్‌లో పుంజుకుంటుంది. -
భారత్ నంబర్‌వన్... కాదు కాదు నంబర్ 2
దుబాయ్: టెస్ట్ టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ రెండో ర్యాంక్ నుంచి నంబర్‌వన్ ర్యాంక్‌కు ఎగబాకిందని ఐసీసీ బుధవారం మధ్యాహ్నం ప్రకటించింది. దాంతో ఇప్పటికే వన్డే, టి20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న భారత్ టెస్టుల్లోనూ టాప్ ర్యాంక్ అందుకోవడంతో ఏకకాలంలో మూడు ఫార్మాట్లలో (టెస్టు, వన్డే, టి20) టీమిండియా నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచిందని అభిమానులు సంబరపడ్డారు. అయితే భారత్ ఇంకా టాప్ ర్యాంక్‌కు చేరుకోలేదని... రెండో ర్యాంక్‌లోనే కొనసాగుతోందని... తమ రేటింగ్ పాయింట్ల లెక్కల్లో తప్పిదంతో ఈ గందరగోళం చోటు చేసుకుందని బుధవారం రాత్రి ఐసీసీ వివరణ ఇచ్చింది. ప్రస్తుత టెస్టు ర్యాంకింగ్స్ లో ఆ్రస్టేలియా 126 రేటింగ్‌తో టాప్ ర్యాంక్‌లో, భారత్ 115 రేటింగ్‌తో రెండో ర్యాంక్‌లో ఉన్నాయి. -
ఆసీస్‌ను చిత్తు చేసిన భారత్.. తొలి టెస్టులో ఘన విజయం (ఫొటోలు)
-
Gary Ballance: రెండు దేశాల తరఫున సెంచరీలు.. ఎన్నో ఆసక్తికర విశేషాలు
WI VS ZIM 1st Test: 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా స్వదేశంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో జింబాబ్వే క్రికెటర్ గ్యారీ బ్యాలెన్స్ (137 నాటౌట్) అజేయ సెంచరీ సాధించిన విషయం తెలిసిందే. ఈ సెంచరీతో బ్యాలెన్స్ పలు అరుదైన రికార్డులను నెలకొల్పాడు. అరంగేట్రం టెస్ట్‌లోనే శతకం బాదిన 24వ క్రికెటర్‌గా, రెండు దేశాల తరఫున సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా (కెప్లర్ వెసెల్స్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా తరఫున) రికార్డు పుటల్లోకెక్కాడు. బ్యాలెన్స్ ఈ రికార్డులు సాధించే క్రమంలో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. జింబాబ్వేలోనే పుట్టి పెరిగిన బ్యాలెన్స్ తొలుత తన సొంత దేశం తరఫున కాకుండా ఇంగ్లండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. 33 ఏళ్ల బ్యాలెన్స్ ఇంగ్లండ్ తరఫున 23 టెస్ట్‌లు, 18 వన్డేల్లో 37.5 సగటున 4 సెంచరీలు, 7 అర్ధసెంచరీల సాయంతో 1498 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ జట్టు తరఫున అవకాశాలు రాకపోవడంతో సొంత గూటికి చేరుకున్న బ్యాలెన్స్ అరంగేట్రం టెస్ట్‌లోనే సెంచరీ బాదాడు. ఇక్కడ మరో ఆసక్తికర విషయమేమిటంటే.. బ్యాలెన్స్ 8 ఏళ్ల కిందట తన చివరి టెస్ట్ సెంచరీని వెస్టిండీస్‌పైనే సాధించాడు. ఆ మ్యాచ్‌లో ప్రత్యర్ధి జట్టులో శివ్‌నరైన్ చంద్రపాల్ ఉండగా.. ప్రస్తుతం బ్యాలెన్స్ సెంచరీ బాదిన మ్యాచ్‌లో శివ్‌నరైన్ చంద్రపాల్ కొడుకు తేజ్‌నరైన్ చంద్రపాల్ ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో తేజ్‌నరైన్ అజేయమైన డబుల్ సెంచరీ బాది తన తండ్రి అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్‌ను అధిగమించాడు. ఇదిలా ఉంటే, విండీస్-జింబాబ్వే మధ్య జరుగుతున్న మ్యాచ్ డ్రా దిశగా సాగుతుంది. ఆట చివరి రోజు విండీస్ నిర్ధేశించిన లక్ష్యాన్ని ఛేదిస్తూ.. జింబాబ్వే 4 వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసింది. ఆటలో చివరి సెషన్ మాత్రమే మిగిలింది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌లో ఫలితం తేలడం కష్టం. గ్యారీ బ్యాలెన్స్ (10), తఫడ్జా సిగా (10) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 447 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 203 పరుగులు చేసింది. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 379 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో తేజ్‌నరైన్ చంద్రపాల్ అజేయమైన 207 పరుగులు చేయగా.. మరో ఓపెనర్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ 182 రన్స్ చేశాడు. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో బ్యాలెన్స్ సెంచరీ చేయగా.. బ్రాండన్ మవుటా (56) అర్ధ శతకంతో రాణించాడు. వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో రీఫర్ (58), బ్లాక్‌వుడ్ (57) హాఫ్ సెంచరీలతో రాణించగా.. జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌లో చాము చిబాబా (31) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
చరిత్ర సృష్టించిన జింబాబ్వే క్రికెటర్.. అత్యంత అరుదైన ఘనత సొంతం
జింబాబ్వే క్రికెటర్ గ్యారీ బాలెన్స్ అత్యంత అరుదైన ఘనత సాధించాడు. రెండు దేశాల (ఇంగ్లండ్, జింబాబ్వే) తరఫున టెస్ట్ క్రికెట్ ఆడిన 16వ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. బ్యాలెన్స్ తొలుత పరాయి దేశం (ఇంగ్లండ్) తరఫున ఆడి, ఆతర్వాత సొంత దేశానికి ఆడటం. చరిత్రలో ఇలా ఓ క్రికెటర్ తొలుత ఇతర దేశానికి, ఆతర్వాత సొంత దేశానికి ఆడటం ఇదే మొదటిసారి. రెండు దేశాల తరఫున టెస్ట్ క్రికెట్ ఆడిన 15 మంది క్రికెటర్లు తొలుత సొంత దేశం తరఫున.. ఆతర్వాత వివిధ కారణాల చేత ఇతర దేశాల తరఫున ఆడారు. బ్యాలెన్స్ పుట్టి, పెరిగి, విద్యనభ్యసించింది జింబాబ్వేలోనే. అయితే బ్యాలెన్స్ 2006లో తన తాతముత్తాతల దేశమైన బ్రిటన్‌కు వెళ్లి అక్కడ స్థిరపడ్డాడు. ఇంగ్లండ్ తరఫున క్రికెట్ ఆడాలని కలలు కన్న బ్యాలెన్స్.. ఆ క్రమంలో కౌంటీల్లో సత్తా చాటి 2013లో ఇంగ్లండ్ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. అప్పటి నుంచి నాలుగేళ్లపాటు (2017 వరకు) ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించిన బ్యాలెన్స్.. ఆతర్వాత ఫామ్ కోల్పోవడంతో జట్టులో స్థానం కోల్పోయాడు. ఆతర్వాత యువ ఆటగాళ్లు జట్టులో స్థానాలను సుస్థిరం చేసుకోవడంతో బ్యాలెన్స్‌కు అవకాశాలు రాలేదు. దీంతో అతను తిరిగి సొంతగూటికి (జింబాబ్వే) చేరాడు. వెస్టిండీస్‌తో నిన్న (ఫిబ్రవరి 4) మొదలైన టెస్ట్ మ్యాచ్ ద్వారా బ్యాలెన్స్ జింబాబ్వే తరఫున టెస్ట్ అరంగేట్రం చేశాడు. 33 ఏళ్ల బ్యాలెన్స్ ఇంగ్లండ్ తరఫున 23 టెస్ట్‌లు, 18 వన్డేలు ఆడాడు. టెస్ట్‌ల్లో బ్యాలెన్స్‌ను మంచి రికార్డు ఉంది. బ్యాలెన్స్ 37.5 సగటున 4 సెంచరీలు, 7 అర్ధసెంచరీల సాయంతో 1498 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు వెస్టిండీస్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. వర్షం కారణంగా పలుమార్లు అంతరాయం కలిగిన తొలి మ్యాచ్‌లో విండీస్ టీమ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 112 పరుగులు చేసింది. ఓపెనర్లు టగెనరైన్ చంద్రపాల్ (55), క్రెయిగ్ బ్రాత్‌వైట్ (55) అజేయమైన అర్ధసెంచరీలతో క్రీజ్‌లో ఉన్నారు. రెండు దేశాల తరఫున టెస్టులు ఆడిన క్రికెటర్లు.. బిల్లీ మిడ్ వింటర్ (ఆస్ట్రేలియా, ఇంగ్లండ్) విలియమ్ లాయిడ్ ముర్డాక్ (ఆస్ట్రేలియా, ఇంగ్లండ్) జె జె ఫెర్రిస్ (ఆస్ట్రేలియా, ఇంగ్లండ్) సామీ వుడ్స్ (ఆస్ట్రేలియా, ఇంగ్లండ్) ఫ్రాంక్ హియర్న్ (ఇంగ్లండ్, సౌతాఫ్రికా) అల్బర్ట్ ట్రాట్ (ఆస్ట్రేలియా, ఇంగ్లండ్) ఫ్రాంక్ మిచెల్ (ఇంగ్లండ్, సౌతాఫ్రికా) ఇఫ్తికార్ అలీ ఖాన్ పటౌడి (ఇంగ్లండ్, ఇండియా) గుల్ మహ్మద్ (ఇండియా, పాకిస్తాన్) అబ్దుల్ హఫీజ్ కర్దార్ (ఇండియా, పాకిస్తాన్) అమీర్ ఇలాహి (ఇండియా, పాకిస్తాన్) సామీ గుయిలెన్ (వెస్టిండీస్, న్యూజిలాండ్) జాన్ ట్రైకోస్ (సౌతాఫ్రికా, జింబాబ్వే) కెప్లర్ వెసల్స్ (ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా) బాయ్డ్ రాంకిన్ (ఇంగ్లండ్, ఐర్లాండ్) గ్యారీ బ్యాలెన్స్ (ఇంగ్లండ్, జింబాబ్వే) -
వాషింగ్టన్ సుందర్ పోరాటం వృథా.. ఆంధ్ర సంచలన విజయం
Ranji Trophy 2022-23 - Tamil Nadu vs Andhra- కోయంబత్తూరు: అద్భుత పోరాట పటిమ కనబరిచిన ఆంధ్ర జట్టు ఈ సీజన్ రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీలో తొలి విజయం నమోదు చేసింది. తమిళనాడుతో శుక్రవారం ముగిసిన మ్యాచ్‌లో ఆంధ్ర ఎనిమిది పరుగుల ఆధిక్యంతో గెలిచి ఆరు పాయింట్లు సంపాదించింది. ఆంధ్ర నిర్దేశించిన 203 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన తమిళనాడు రెండో ఇన్నింగ్స్‌లో 56.2 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. పేస్ బౌలర్ కేవీ శశికాంత్ (4/47), ఆఫ్ స్పిన్నర్ షోయబ్ మొహమ్మద్ ఖాన్ (6/69) ఆంధ్ర విజయంలో కీలకపాత్ర పోషించారు. భారత క్రికెటర్ వాషింగ్టన్ సుందర్ (65; 5 ఫోర్లు) చివరిదాకా క్రీజులో ఉండటంతో తమిళనాడు విజయంపై ఆశలు పెంచుకుంది. అయితే సుందర్‌ను శశికాంత్ అవుట్ చేసి ఆంధ్రకు చిరస్మరణీయ విజయం అందించాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 162/5తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర మరో 88 పరుగులు జోడించి మిగతా ఐదు వికెట్లు కోల్పోయి 250 పరుగులవద్ద ఆలౌటైంది. రికీ భుయ్ (76; 7 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలువగా... చివర్లో శశికాంత్ (19; 1 సిక్స్), లలిత్ మోహన్ (16; 3 ఫోర్లు) దూకుడుగా ఆడటంతో ఆంధ్ర ప్రత్యర్థిముందు ఊరించే లక్ష్యాన్ని పెట్టింది. చదవండి: IPL 2023 Auction: ఆ ముగ్గురూ సూపర్... ఐపీఎల్ వేలం విశేషాలు ఒకరు 4, మరొకరు 2 పరుగులు.. రోహిత్‌తో పాటు మిగతా వాళ్లు సున్నా! మరీ చెత్తగా.. IPL 2023: ధోని జట్టులోకి గుంటూరు కుర్రాడు.. ఎవరీ షేక్ రషీద్? -
ఒకరు 4, మరొకరు 2 పరుగులు.. తొమ్మిది మంది ‘సున్నా’లే! మరీ చెత్తగా
Vijay Merchant Trophy- సూరత్: భారత దేశవాళీ క్రికెట్లో ఈశాన్య రాష్ట్ర జట్ల పేలవ ప్రదర్శనపై తరచుగా వస్తున్న విమర్శలకు మరింత బలమిచ్చే మ్యాచ్ మరొకటి ముగిసింది. బీసీసీఐ అధికారిక అండర్–16 టోర్నీ (విజయ్ మర్చంట్ ట్రోఫీ)లో మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో సిక్కిం 9.3 ఓవర్లలో కేవలం ‘6’ పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్, వికెట్ కీపర్ బ్యాటర్ అన్వీష్ ఒక ఫోర్ కొట్టగా, తొమ్మిదో స్థానంలో వచ్చిన అక్షద్ 2 పరుగులు సాధించాడు. మిగతా తొమ్మిది మంది ‘సున్నా’లే! ఈ మ్యాచ్‌లో ముందుగా మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 414 పరుగులు చేసి డిక్లేర్ చేయగా... తొలి ఇన్నింగ్స్‌లో సిక్కిం 43 పరుగులు చేయగలిగింది. రెండో ఇన్నింగ్స్‌లోనైతే మరీ చెత్తగా ఆడి అనూహ్య రికార్డు నమోదు చేయడంతో మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ జట్టు ఇన్నింగ్స్, 365 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్ ఫలితంపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. టీమిండియా ప్లేయర్ల పేర్లు ముడిపెట్టి.. ‘‘మరీ ఇంత దారుణ వైఫల్యమా.. సీనియర్లను బాగా ఫాలో అవుతున్నట్లున్నారు’’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. సిక్కిం ఓపెనర్ రోహిత్ తొలి ఇన్నింగ్స్‌లో 4, రెండో ఇన్నింగ్స్‌లో సున్నాకే అవుట్ కావడంతో భారత సారథి రోహిత్ శర్మను ఫాలో అవుతున్నాడేమో అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇక సిక్కిం కెప్టెన్ దిన్రీ రెండు ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యాడు. మరోవైపు మధ్యప్రదేశ్ కెప్టెన్ మనాల్ చౌహాన్ 170 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చదవండి: IPL 2023: ధోని జట్టులోకి గుంటూరు కుర్రాడు.. ఎవరీ షేక్ రషీద్? Sikkim bowled out for 6 in the Vijay Merchant Trophy against Madhya Pradesh. — Mufaddal Vohra (@mufaddal_vohra) December 23, 2022 -
ఛటోగావ్ టెస్ట్ లో భారత్ ఘన విజయం