టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆర్‌సీబీ తరపున ప్రాతినిధ్యం వహించిన సిరాజ్ అతి చెత్త ప్రదర్శన నమోదు చేశాడు. 15 మ్యాచ్‌లాడి..10.07 ఎకానమీతో కేవలం తొమ్మిది వికెట్లు మాత్రమే తీశాడు. కాగా వచ్చే నెలలో ఇంగ్లండ్‌తో జరగబోయే టెస్టులో బాగా ఆడతాననే విశ్వాసంతో సిరాజ్ ఉన్నాడు.
‘ఈ ఏడాది ఐపీఎల్‌లో నేను బాగా ఆడలేదు. ఇంగ్లండ్‌తో జరిగే చివరి టెస్టు కోసం డ్యూక్స్ బంతులతో సాధన చేస్తున్నా. మంచి ప్రదర్శన ఇవ్వగలననే నమ్మకముంది. సిరీస్‌లో 2–1తో ఆధిక్యంలో ఉన్నాం కాబట్టి మాలో ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువగా ఉంది’ అని సిరాజ్ వ్యాఖ్యానించాడు. ఇక ఆర్‌సీబీ ఈ సీజన్‌లో మరోసారి ప్లేఆఫ్స్‌కే పరిమితమైంది. లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో దుమ్మురేపిన ఆర్‌సీబీ అదే టెంపోనూ రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2లో మాత్రం చూపట్టలేక చతికిలపడింది.
Comments
Please login to add a commentAdd a comment