బెన్‌స్టోక్స్‌తో బ్రాడ్(PC: Stuart Broad Twitter)
India Vs England 5th Test: ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్‌కు టీమిండియాతో రీషెడ్యూల్డ్ టెస్టులో చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఒకే ఓవర్లో 35 పరుగులు ఇచ్చిన బ్రాడ్.. చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు.
టెస్టుల్లో ఇలా ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బ్రాడ్ చెత్త రికార్డు సాధించిన బౌలర్‌గా రికార్డుకెక్కాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్ సందర్భంగా బ్రాడ్ ఈ చెత్త రికార్డు నమోదు చేశాడు. ఇదిలా ఉంటే.. ఇదే మ్యాచ్‌లో మూడో రోజు ఆటలో భాగంగా బ్రాడ్‌కు మరో చేదు అనుభవం ఎదురైంది.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన స్టువర్ట్ బ్రాడ్‌ను టీమిండియా బౌలర్లు మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ తమ షార్ట్ డెలివరీలతో తెగ ఇబ్బంది పెట్టారు. దీంతో బ్రాడ్ అంపైర్‌కు పదేపదే ఫిర్యాదు చేశాడు. ఇందుకు స్పందించిన అంపైర్.. ‘‘నన్ను అంపైరింగ్ చేసుకోనివ్వు. నువ్వు బ్యాటింగ్ చేయ్! ఓకే! లేదంటే నువ్వు మళ్లీ ఇబ్బందుల్లో పడతావు.
ఒక్క ఓవర్‌కే ఇలానా! బ్రాడీ..! బ్రాడీ! నువ్వు బ్యాటింగ్ చెయ్! అలాగే కాస్త ఆ నోరు మూసెయ్’’ అని పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో 5 బంతులు ఎదుర్కొన్న బ్రాడ్.. ఒకే ఒక పరుగు తీసి సిరాజ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే మూడో రోజు వరకు టీమిండియా ఆధిక్యం కనబరచగా.. నాలుగో రోజు పట్టు సాధించిన ఆతిథ్య ఇంగ్లండ్ ఐదో రోజు విజయం దిశగా దూసుకుపోతోంది.
చదవండి: Jasprit Bumrah: బుమ్రాకు కెప్టెన్సీ.. సాహసోపేతమైన నిర్ణయం! బహుశా అందుకేనేమో!
Richard Kettleborough#FromYorkshire pic.twitter.com/SIIczXE4UQ
— Sɪʀ Fʀᴇᴅ Bᴏʏᴄᴏᴛᴛ (@SirFredBoycott) July 4, 2022
An incredible day that leaves us with a chance of making history 🙏
— England Cricket (@englandcricket) July 5, 2022
🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/QvDmaK20tp
Comments
Please login to add a commentAdd a comment