Mohammad Shami
-
షమీకి విశ్రాంతి.. టీమిండియా రీ ఎంట్రీ అప్పుడే!
టీమిండియా పేసర్ మహ్మద్ షమీ మరికొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకోనున్నాడు. ఈ క్రమంలో విజయ్ హజారే ట్రోఫీ 2024-25 సీజన్లో తొలి మ్యాచ్‌కు ఈ బెంగాల్ బౌలర్ దూరం కానున్నాడు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత చీలమండ గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న షమీ.. దాదాపు ఏడాది తర్వాత రీఎంట్రీ ఇచ్చాడు.మోకాలు ఉబ్బిపోయింది!ఇటీవల జరిగిన దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బెంగాల్ తరఫున షమీ బరిలోకి దిగాడు. ఈ టోర్నీలో మొత్తం తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన ఈ రైటార్మ్ పేసర్ పదకొండు వికెట్ల తీశాడు. అయితే, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సందర్భంగా షమీ మరోసారి గాయపడినట్లు సమాచారం. అతడి మోకాలు ఉబ్బిపోయినట్లు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు.అందుకే షమీని హడావుడిగా తిరిగి జట్టులోకి చేర్చుకునే పరిస్థితి లేదని.. ఆస్ట్రేలియా పర్యటనకు అతడు మొత్తంగా దూరమయ్యాడనే సంకేతాలు ఇచ్చాడు. అందుకు తగ్గట్లుగానే దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ తాజా ఎడిషన్‌కు ప్రకటించిన బెంగాల్ జట్టులో షమీ పేరు కనిపించింది.విశ్రాంతినిచ్చాంఇక డిసెంబరు 21 నుంచి మొదలుకానున్న ఈ టోర్నీలో బెంగాల్ తొలుత ఢిల్లీ జట్టుతో తలపడనుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానంలో జరుగనున్న ఈ మ్యాచ్‌కు షమీ దూరంగా ఉండనున్నాడు. ‘‘విజయ్ హజారే ట్రోఫీలో మా తొలి మ్యాచ్‌కు షమీ అందుబాటులో ఉండడు. ఈ టీమిండియా వెటరన్ బౌలర్‌కు విశ్రాంతినిచ్చాం’’ అని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ పేర్కొంది.చాంపియన్స్ ట్రోఫీకి సన్నద్ధంఈ పరిణామాల నేపథ్యంలో షమీ ఆస్ట్రేలియా పర్యటనకు పూర్తిగా దూరమైనట్లు తెలుస్తోంది. టెస్టు క్రికెట్ ఆడేందుకు అతడు ఫిట్ లేని కారణంగా.. టీమిండియా మేనేజ్మెంట్ మరికొన్నాళ్లపాటు అతడిని పక్కన పెట్టనుందట.ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 జరుగనున్న విషయం తెలిసిందే. అయితే, అంతకంటే ముందు టీమిండియా ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడుతుంది. అప్పుడే షమీ.. భారత జట్టులో పునరాగమనం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లిన టీమిండియా మూడు టెస్టులు ముగిసే సరికి 1-1తో సమంగా ఉంది. తదుపరి మెల్బోర్న్, సిడ్నీల్లో భారత్- ఆసీస్ మధ్య మిగిలిన రెండు టెస్టులు జరుగనున్నాయి.చదవండి: భారత్‌తో టెస్టులకు ఆసీస్ జట్టు ప్రకటన.. అతడిపై వేటు.. ‘జూనియర్’ పాంటింగ్‌కు చోటు -
షమీ డబుల్ సెంచరీ
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ పొట్టి ఫార్మాట్లో 200 వికెట్ల అరుదైన మైలురాయిని అధిగమించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో భాగంగా బరోడాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో షమీ ఈ ఘనతను సాధించాడు. ఈ మ్యాచ్‌లో షమీ 4 ఓవర్లలో 43 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. టీ20ల్లో షమీ వికెట్ల సంఖ్య ప్రస్తుతం 201గా ఉంది. షమీ 165 టీ20 మ్యాచ్‌ల్లో వికెట్ల డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రికార్డు యుజ్వేంద్ర చహల్ పేరిట ఉంది. చహల్ పొట్టి ఫార్మాట్లో 364 వికెట్లు తీశాడు. చహల్ తర్వాత కింద పేర్కొన్న బౌలర్ల 200 అంతకంటే ఎక్కువ టీ20 వికెట్లు తీశారు.పియూశ్ చావ్లా- 319భువనేశ్వర్ కుమార్-310రవిచంద్రన్ అశ్విన్-310అమిత్ మిశ్రా-285హర్షల్ పటేల్-244హర్భజన్ సింగ్-235జయదేవ్ ఉనద్కత్-234అక్షర్ పటేల్-233రవీంద్ర జడేజా-225సందీప్ శర్మ-214అర్షదీప్ సింగ్-203ఉమేశ్ యాదవ్-202మహ్మద్ షమీ-201కుల్దీప్ యాదవ్-200ఓవరాల్‌గా టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన ఘనత డ్వేన్ బ్రావోకు దక్కుతుంది. ఈ విండీస్ ఆల్‌రౌండర్ పొట్టి ఫార్మాట్లో 631 వికెట్లు తీశాడు. బ్రావో తర్వాత రషీద్ ఖాన్ (615), సునీల్ నరైన్ (569) అత్యధిక టీ20 వికెట్లు తీసిన వారిలో ఉన్నారు.బరోడా, బెంగాల్ మ్యాచ్ విషయానికొస్తే.. నిన్న (డిసెంబర్ 11) జరిగిన క్వార్టర్ ఫైనల్-1లో బెంగాల్‌పై బరోడా 41 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బరోడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన బెంగాల్ 18 ఓవర్లలో 131 పరుగులకే ఆలౌటైంది. బరోడా బౌలర్లు హార్దిక్ పాండ్యా (4-0-27-3), లుక్మన్ మేరీవాలా (3-0-17-3), అతీత్ సేథ్ (4-0-41-3) తలో చేయి వేసి బెంగాల్ పతనాన్ని శాశించారు. బెంగాల్‌కు గెలిపించేందుకు షాబాజ్ అహ్మద్ (55) విఫలయత్నం చేశాడు.కాగా, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో నిన్నటితో సెమీస్ బెర్త్‌లు ఖరారయ్యాయి. బరోడా, ముంబై, ఢిల్లీ, మధ్యప్రదేశ్ సెమీస్‌కు చేరాయి. డిసెంబర్ 13న జరిగే తొలి సెమీఫైనల్లో బరోడా, ముంబై.. అదే రోజు జరిగే రెండో సెమీఫైనల్లో ఢిల్లీ, మధ్యప్రదేశ్ తలపడనున్నాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో గెలిచి జట్లు డిసెంబర్ 15న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. -
టీమిండియాలోకి షమీ..? ఇప్పట్లో తొందరేమీ లేదు..!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం మొహమ్మద్ షమీని టీమిండియాలో చేర్చుకుంటారని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ మేరకు.. ఇప్పట్లో షమీని హడావుడి జట్టులో చేర్చుకునే పరిస్థితులు లేవు.షమీ విషయంలో వేచి చేసే ధోరణిని అవళంభించాలని బీసీసీఐ భావిస్తుందట. బోర్డు ప్రస్తుత జట్టులోని బౌలర్లతో సంతృప్తిగా ఉందని సమాచారం. షమీ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో మరిన్ని మ్యాచ్‌లు ఆడాలని బీసీసీఐ కోరుకుంటుంది.కాగా, షమీ ఏడాది గ్యాప్ (గాయం) తర్వాత కాంపిటేటివ్ క్రికెట్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా జరిగిన ఓ రంజీ మ్యాచ్‌లో షమీ 7 వికెట్లు తీసి రీఎంట్రీని ఘనంగా చాటుకున్నాడు. రంజీ మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన నేపథ్యంలో షమీని బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపిక చేస్తారని (అప్పటికే జట్టును ప్రకటించారు) అంతా అనుకున్నారు.తొలి టెస్ట్‌కు ముందు బుమ్రా, బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ చెప్పిన మాటలు ఇందుకు బలం చేకూర్చాయి. షమీ చాలా దగ్గర నుంచి గమినిస్తున్నాము.. అతనికి సంబంధించిన వారితో నిత్యం టచ్‌లో ఉన్నామని బుమ్రా, మోర్కెల్ అన్నారు.ఇదిలా ఉంటే, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ 295 పరుగుల భారీ తేడాతో ఆసీస్‌ను మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా బుమ్రా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన భారత బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్‌లో చెలరేగిపోయారు. యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి సూపర్ సెంచరీలతో మెరిశారు. భారత బౌలర్ల ధాటికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 104, సెకెండ్ ఇన్నింగ్స్‌లో 238 పరుగులకు కుప్పకూలింది. -
మంజ్రేకర్‌పై మండిపడ్డ మహ్మద్ షమీ.. పోస్ట్ వైరల్
భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తీరుపై టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ మండిపడ్డాడు. ఇతరుల కోసం జ్ఞానం వృథా చేసుకుని.. తమ గురించి ఆలోచించుకోవడం మర్చిపోవద్దంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. జోస్యం చెప్పడమే లక్ష్యంగా పెట్టుకుంటే బాబా అవతారం ఎత్తితే బాగుంటుందంటూ చురకలు అంటించాడు.నవంబరు 24, 25 తేదీల్లోఐపీఎల్-2025 మెగా వేలం నవంబరు 24, 25 తేదీల్లో జరుగనున్న విషయం తెలిసిందే. సౌదీ అరేబియాలోని జెద్దా నగరం వేదికగా జరిగే వేలంపాటకు ముందే పది ఫ్రాంఛైజీలు తమ రిటెన్షన్ జాబితాను ఇప్పటికే విడుదల చేశాయి. ఆ ఐదుగురు మాత్రమేఈ క్రమంలో గుజరాత్ టైటాన్స్ రషీద్ ఖాన్(రూ. 18 కోట్లు ), శుబ్‌మన్ గిల్(రూ. 16.50 కోట్లు), సాయి సుదర్శన్(రూ. 8.50 కోట్లు), రాహుల్ తెవాటియా(రూ. 4 కోట్లు), షారుఖ్ ఖాన్(రూ. 4 కోట్లు)లను మాత్రమే అట్టిపెట్టుకుని.. షమీని విడిచిపెట్టింది.ఏడాది తర్వాత రీ ఎంట్రీకాగా వన్డే వరల్డ్‌కప్-2023లో సత్తా చాటిన షమీ.. ఆ తర్వాత చీలమండ గాయంతో ఆటకు దూరమయ్యాడు. శస్త్ర చికిత్స తర్వాత పూర్తిగా కోలుకోలేకపోయిన షమీ దాదాపు ఏడాది తర్వాత ఇటీవలే బెంగాల్ తరఫున రంజీ ట్రోఫీ బరిలో దిగాడు. బాల్తోనే గాకుండా బ్యాట్‌తోనూ సత్తా చాటాడు.షమీ ధర పడిపోవచ్చుఈ పరిణామాల నేపథ్యంలో మెగా వేలానికి ముందు షమీని ఉద్దేశించి కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యలు చేశాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘షమీపై ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపుతాయనడంలో సందేమం లేదు. కానీ.. అతడిని గాయాల బెడద వేధిస్తోందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి.అతడు కోలుకోవడానికి ఎంత సమయం పట్టిందో మనం చూశాం. కాబట్టి ఇలాంటి ఆటగాడిని కొనుగోలు చేయాలంటే.. ఫ్రాంఛైజీలు కాస్త ఆలోచిస్తాయి. ఒకవేళ ఎవరైనా షమీపై భారీగా పెట్టుబడి పెట్టిన తర్వాత.. మధ్యలోనే అతడు జట్టుకు దూరమైతే..వారికి సరైన ఆప్షన్లు కూడా అందుబాటులో ఉండవు. అందుకే.. షమీ ధర పడిపోవచ్చు’’ అని సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు.బాబాజీని సంప్రదించండిఇందుకు ఘాటుగా స్పందించిన షమీ ఇన్‌స్టా స్టోరీలో మంజ్రేకర్ వ్యాఖ్యలను షేర్ చేస్తూ.. ‘‘బాబాకీ జై! మీ భవిష్యత్తు కోసం కూడా కాస్త జ్ఞానాన్ని దాచిపెట్టుకోండి. ఒకవేళ ఎవరైనా తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనుకుంటే బాబాజీని సంప్రదించండి’’ అంటూ సెటైర్లు వేశాడు.రూ. 6.25 కోట్లకు కొనుగోలుకాగా ఐపీఎల్-2022లో గుజరాత్ టైటాన్స్ షమీని రూ. 6.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ ఎడిషన్‌లో షమీ 16 వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ సైతం ఐపీఎల్ మెగా వేలం నేపథ్యంలో.. రిషభ్ పంత్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. డబ్బు విషయంలో సయోధ్య కుదరకపోవడంతోనే పంత్ ఢిల్లీ క్యాపిటల్స్‌ను విడిచిపెట్టాడని సన్నీ అంచనా వేశాడు. అయితే, పంత్ ఎక్స్ వేదికగా గావస్కర్ వ్యాఖ్యలను ఖండించాడు. తాజాగా షమీ సైతం అదే పంథాను అనుసరించాడు.చదవండి: IPL 2025 Mega Auction: అతడికి రూ. 25- 28 కోట్లు.. ఆ ఫ్రాంఛైజీ సొంతం చేసుకోవడం ఖాయం!పేసర్లకు కెప్టెన్సీ ఇవ్వాలి.. విరాట్, రోహిత్ వేరు.. నేను వేరు.. తుదిజట్టు ఖరారైంది: బుమ్రా -
తమ్ముడితో కలిసి అదరగొట్టిన షమీ.. ఆస్ట్రేలియా పయనం అప్పుడే!.. బుమ్రా స్థానంలో?
టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ పునరాగమనంలో అదరగొడుతున్నాడు. బెంగాల్ తరఫున రంజీ ట్రోఫీ 2024-25 బరిలో దిగిన ఈ ఫాస్ట్‌బౌలర్ మధ్యప్రదేశ్‌తో మ్యాచ్‌తో కాంపిటేటివ్ క్రికెట్లో రీఎంట్రీ ఇచ్చాడు. వచ్చీరాగానే బంతితో పాటు బ్యాట్‌తోనూ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.ఇండోర్ వేదికగా బెంగాల్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య మధ్యప్రదేశ్‌తో తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన బెంగాల్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 228 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో తమ మొదటి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన మధ్యప్రదేశ్ 167 పరుగులకే కుప్పకూలింది.తమ్ముడితో కలిసి అదరగొట్టిన షమీఇందులో షమీతో పాటు అతడి తమ్ముడు మహ్మద్ కైఫ్ పాత్ర కీలకం. షమీ 54 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీయగా.. కైఫ్ రెండు వికెట్లు కూల్చాడు. ఇతరుల్లో సూరజ్ సింధు జైస్వాల్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో 61 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన బెంగాల్.. 276 పరుగులకు ఆలౌట్ అయింది.ఇందులో షమీ చేసిన పరుగులు 37. కేవలం 36 బంతుల్లోనే అతడు ఈ మేర రన్స్ స్కోరు చేయడం విశేషం. ఈ నేపథ్యంలో మహ్మద్ షమీ చిన్ననాటి కోచ్ మహ్మద్ బద్రుద్దీన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. షమీ త్వరలోనే ఆస్ట్రేలియా పర్యటనకు బయల్దేరతాడని తెలిపాడు.రెండో టెస్టు తర్వాత షమీ భారత జట్టుతో కలుస్తాడుఈ మేరకు.. ‘‘అడిలైడ్‌లో రెండో టెస్టు తర్వాత షమీ భారత జట్టుతో కలుస్తాడు. అతడు రీఎంట్రీలో సత్తా చాటుతున్నాడు. ఇప్పటికే ఫిట్నెస్ నిరూపించుకున్నాడు. వికెట్లు తీస్తున్నాడు. ఆసీస్ పర్యటన రెండో అర్ధ భాగంలో జట్టు అతడి సేవలు కీలకంగా మారనున్నాయి’’ అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో బద్రుద్దీన్ పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి సైతం షమీ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తే జట్టుకు ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా కంగారూ గడ్డపై అడుగుపెట్టింది. బుమ్రా స్థానంలో?ఇరుజట్ల మధ్య నవంబరు 22న పెర్త్ వేదికగా ఈ సిరీస్ మొదలుకానుంది. అయితే, ఆసీస్‌తో టెస్టులకు బీసీసీఐ జట్టును ఎంపిక చేసిన నాటికి షమీ పూర్తి ఫిట్నెస్ సాధించలేదు. అందుకే అతడి పేరును సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు. అయితే, ఇప్పుడు కాంపిటేటివ్ క్రికెట్లో షమీ సత్తా చాటుతున్నాడు కాబట్టి త్వరలోనే ఆస్ట్రేలియా విమానం ఎక్కే అవకాశం ఉంది. మరోవైపు.. టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐదు టెస్టులకు అందుబాటులో ఉండకపోవచ్చని భారత జట్టు బౌలింగ్ మాజీ కోచ్ పారస్ మాంబ్రే పేర్కొనడం విశేషం. దీంతో బుమ్రా స్థానంలో షమీ మిగిలిన టెస్టులు ఆడతాడా అనే విశ్లేషణలు మొదలయ్యాయి.ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు బీసీసీఐ ప్రకటించిన జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్ , ఆకాశ్ దీప్, ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.చదవండి: Champions Trophy: పాకిస్తాన్‌కు భారీ షాకిచ్చిన ఐసీసీ! -
టీమిండియాకు గుడ్‌న్యూస్
టీమిండియా సీనియర్ క్రికెటర్ మహ్మద్ షమీ పునరాగమనానికి ముహూర్తం ఖరారైంది. దాదాపు ఏడాది తర్వాత ఈ పేస్ బౌలర్ కాంపిటేటివ్ క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయాన్ని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(CAB) ధ్రువీకరించింది. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు షమీ.చీలమండ గాయానికి శస్త్ర చికిత్సఈ ఐసీసీ టోర్నీలో ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినా 24 వికెట్లు కూల్చి.. టీమిండియా ఫైనల్ చేరడంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, అప్పటికే గాయం వేధిస్తున్నా పంటి బిగువన నొప్పిని భరించిన ఈ బెంగాల్ పేసర్... ఈ ఈవెంట్ తర్వాత చీలమండ గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు.ఆ మ్యాచ్‌తో రీ ఎంట్రీఈ క్రమంలో జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందిన షమీ.. రీ ఎంట్రీ ఎప్పటికపుడు వాయిదా పడింది. అయితే, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ వర్గాలు జాతీయ మీడియాకు అందించిన తాజా సమాచారం ప్రకారం.. షమీ మ్యాచ్ ఫిట్నెస్ సాధించాడు. రంజీ ట్రోఫీ 2024-25 తాజా ఎడిషన్‌లో భాగంగా మధ్యప్రదేశ్‌తో బెంగాల్ ఆడబోయే మ్యాచ్‌తో షమీ కాంపిటేటివ్ క్రికెట్లో రీఎంట్రీ ఇవ్వనున్నాడు.రంజీ ఎలైట్ గ్రూప్-‘సి’లో భాగంగా బెంగాల్- మధ్యప్రదేశ్ మధ్య ఇండోర్ వేదికగా బుధవారం(నవంబరు 13) ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఇక షమీ రాక గురించి బెంగాల్ అసోసియేషన్ వర్గాలు మాట్లాడుతూ.. షమీ వల్ల తమ పేస్ బౌలింగ్ అటాక్ మరింత పటిష్టమవుతుందని హర్షం వ్యక్తం చేశాయి. అతడి రాకతో జట్టులో కొత్త ఉత్సాహం నిండిందని... గొప్పగా రాణించే అవకాశం దక్కిందని పేర్కొన్నాయి.ఆసీస్ టూర్‌కు?కాగా రంజీ తాజా సీజన్లో బెంగాల్ జట్టు ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడింది. మొత్తంగా ఎనిమిది పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఇక ఉత్తరప్రదేశ్‌కు చెందిన షమీ.. దేశవాళీ క్రికెట్లో బెంగాల్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడన్న సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే.. షమీ రంజీల్లో పూర్తిస్థాయిలో ఆడగలిగితే.. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడే టీమిండియాలో అతడిని చేర్చే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం ఆసీస్ టూర్ వెళ్లిన భారత జట్టులో ప్రధాన పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌తో పాటు ఆకాశ్ దీప్, ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రాణా కూడా ఉన్నారు. ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి భారత జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్ , ఆకాశ్ దీప్, ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.చదవండి: BGT: పంత్ కాదు!.. అతడే కొత్త రాజు అంటున్న ఆస్ట్రేలియా మీడియా! -
ఆ సిరీస్ కు దూరమయ్యానని బీసీసీఐ చెప్పిందా?
-
షమీ రీ ఎంట్రీ ఖరారు!.. కానీ...
టీమిండియా సీనియర్ క్రికెటర్ మహ్మద్ షమీ దేశవాళీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఈ ఏడాది బెంగాల్ తరఫున అతడు రంజీ బరిలో దిగే అవకాశం ఉంది. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ ప్రకటించిన ప్రాబబుల్స్ జట్టులో షమీకి కూడా చోటు దక్కింది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ పేస్ బౌలర్ రీ ఎంట్రీ చూడబోతున్నామంటూ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.చీలమండ గాయం.. సర్జరీవన్డే వరల్డ్‌కప్-2023లో టీమిండియా ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించిన షమీ.. ఈ ఐసీసీ టోర్నీ ముగిసిన తర్వాత జట్టుకు దూరమయ్యాడు. చీలమండ నొప్పి తీవ్రతరం కావడంతో శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ఈ నేపథ్యంలో నవంబరు 19 తర్వాత అతడు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.కోలుకున్నాడు కానీ..బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్న షమీ.. ఫిట్నెస్ సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అదే విధంగా.. ఇటీవలే బౌలింగ్ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేశాడు. ఈ నేపథ్యంలో.. సెప్టెంబరు 5 నుంచి మొదలుకానున్న దులిప్ ట్రోఫీలో షమీ ఆడతాడని భావించినా.. బీసీసీఐ మాత్రం అతడికి విశ్రాంతినిచ్చినట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయిలో కోలుకున్న తర్వాత అతడిని రంగంలోకి దించాలని భావిస్తున్నట్లు సమాచారం.బెంగాల్ తరఫున రంజీలోఈ క్రమంలో స్వదేశంలో సెప్టెంబరులో బంగ్లాదేశ్, అక్టోబర్‌లో న్యూజిలాండ్‌తో టీమిండియా ఆడే టెస్టు సిరీస్‌లకు కూడా షమీ దూరంగా ఉండనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఆ తర్వాత జరుగనున్న రంజీ ట్రోఫీలో మాత్రం షమీ ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు బెంగాల్ అసోసియేషన్ ప్రకటన ద్వారా తాజాగా వెల్లడైంది. ఆసీస్‌తో సిరీస్ ద్వారా టీమిండియాలో పునరాగమనం!బెంగాల్ తరఫున రంజీ 2024- 25 సీజన్లో ఆడేందుకు అవకాశం ఉన్న 31 మంది ఆటగాళ్ల జాబితాలో షమీ పేరు కూడా ఉండటంతో.. అతడు ఆస్ట్రేలియాతో సిరీస్ దాకా టీమిండియాకు దూరంగానే ఉండనున్నట్లు తెలుస్తోంది. కాగా బోర్డర్ గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు భారత జట్టు నవంబరులో ఆసీస్‌కు వెళ్లనున్న విషయం తెలిసిందే. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్‌కు చేరాలంటే టీమిండియాకు ఈ సిరీస్ అత్యంత కీలకం కానుంది. అందుకే అప్పటి వరకు షమీకి కావాల్సినంత రెస్టు ఇచ్చి.. రంజీ బరిలో దింపడం ద్వారా మ్యాచ్ ప్రాక్టీస్ కల్పించి.. ఆపై ఈ సిరీస్‌లో ఆడించాలనే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: నిరాశపరిచిన శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ -
రోహిత్ చెప్పినట్టు మేము వినాల్సిందే.. లేదంటే: షమీ
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలో సహచర ఆటగాళ్లతో ఎంత సరదాగా ఉంటాడో.. పరిస్థితిని బట్టి అంతే సీరియస్ అవుతాడు కూడా!.. ఒక్కోసారి సహనం కోల్పోయి భావోద్వేగాలను నియంత్రించుకోలేక ట్రోల్స్‌కు గురైన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే, ఆటలో భాగంగానే రోహిత్ ఇలా చేస్తాడని.. కెప్టెన్‌గా అతడు రచించిన వ్యూహాలు అమలు చేయడంలో తాము విఫలమైతే మాత్రం ఆగ్రహానికి గురికాకతప్పదంటున్నాడు టీమిండియా సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ.ఇటీవల జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో రోహిత్ శర్మకు మెన్స్ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023-24 పురస్కారం లభించింది. ఈ వేడుకలో రోహిత్‌తో పాటు పేసర్ షమీ, మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తదితర టీమిండియా క్రికెటర్లు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెప్టెన్‌గా మైదానంలో రోహిత్ శర్మ ఎలా ఉంటాడన్న ప్రశ్న ఎదురుకాగా షమీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.అప్పుడు అతడి రియాక్షన్ చూశామంటే‘‘జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడికి రోహిత్ స్వేచ్ఛనిస్తాడు. తనలోని ఉత్తమ గుణం అది. అయితే, ఎప్పుడైతే మేము అతడి అంచనాలు అందుకోలేకపోతామో.. అప్పుడు అతడు భావోద్వేగాలను ప్రదర్శించడం మొదలుపెడతాడు. నువ్విలా చేయాలి లేదంటే చేసి ఉండాల్సిందని ఆటగాళ్లకు చెబుతాడు.అయినప్పటికీ మన ఆట తీరులో మార్పు లేదంటే.. ఇక అతడి రియాక్షన్స్ స్క్రీన్ మీద చూడాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే.. తను కోపంగా ఉన్నాడని మాకు అర్థమైపోతుంది. ఇక ఆపై తను ఒక్క మాట చెప్పకుండానే మాకు ఏం చేయాలో తెలిసిపోతుంది’’ అని షమీ చెప్పుకొచ్చాడు.అవును.. నా పని నేను చేస్తా!ఇక ఇందుకు బదులిస్తూ.. ‘‘మైదానంలో ఎవరి పనులు వారు సరిగ్గా చేయాలని వాళ్లకు చెప్తాను. మరి నేను కూడా నా పని చేయాలి కదా. అందుకే నేను ఫీల్డ్‌లో ఒక్కోసారి అలా ప్రవర్తిస్తా’’ అంటూ రోహిత్ శర్మ కెప్టెన్‌గా తన పనిని తాను చేస్తానంటూ చమత్కరించాడు. ఇక టీ20 ప్రపంచకప్-2024 ట్రోఫీ గెలిచిన అనంతరం సెలవులు తీసుకున్న రోహిత్ శర్మ శ్రీలంక పర్యటన సందర్భంగా మళ్లీ జట్టుతో కలిశాడు. అయితే, అతడి సార థ్యంలోని భారత జట్టు 27 ఏ ళ్ల తర్వాత తొలిసారి న్డే సిరీస్‌ను లంకకు కోల్పోయింది. మరోవైపు.. వన్డే వరల్డ్‌కప్ తర్వాత చీలమండ గాయానికి సర్జరీ చేయించుకున్న షమీ ఇంకా పునరాగమనం చేయలేదు. Shreyas Iyer and Mohammed Shami talking about their captain Rohit Sharma.🥹The Captain, the leader, the legend @ImRo45 🐐 pic.twitter.com/DmXJ7YaegC— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) August 21, 2024 -
సియెట్ అవార్డుల ప్రధానోత్సవం.. సందడి చేసిన క్రికెట్ స్టార్స్ (ఫొటోలు)
-
రీ ఎంట్రీపై షమీ వ్యాఖ్యలు.. ముందుగా ఆ జట్టుకు ఆడతా!
భారత క్రికెట్ జట్టులో పునరాగమనం గురించి స్టార్ పేసర్ మహ్మద్ షమీ కీలక అప్డేట్ అందించాడు. టీమిండియాలోకి తిరిగి రావడం తన చేతుల్లో లేదని.. ముందుగా దేశవాళీ క్రికెట్ ఆడతానని పేర్కొన్నాడు. బెంగాల్ జట్టు తరఫున త్వరలోనే బరిలోకి దిగనున్నానని స్పష్టం చేశాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో అత్యధిక వికెట్లు వీరుడిగా నిలిచిన ఉత్తరప్రదేశ్ బౌలర్ షమీ.. గాయం కారణంగా ఆ తర్వాత జట్టుకు దూరమయ్యాడు.చీలమండ గాయం తీవ్రత ఎక్కువ కావడంతో సర్జరీ చేయించుకున్న షమీ.. దీర్ఘకాలం పాటు విశ్రాంతి తీసుకున్నాడు. అనంతరం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందిన ఈ రైటార్మ్ పేసర్.. ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాడు. ఇటీవలే నెట్స్‌లో ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు.ఈ నేపథ్యంలో.. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ నాటికి షమీ అందుబాటులోకి వస్తాడని భారత క్రికెట్ నియంత్రణ మండలి భావిస్తోంది. సెప్టెంబరులో మొదలయ్యే ఈ సిరీస్‌లో షమీ తప్పక ఆడతాడని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఇటీవలి ప్రెస్మీట్లో తెలిపాడు. కాగా గాయం లేదా ఇతరత్రా కారణాల దృష్ట్యా టీమిండియాకు దూరమైన క్రికెటర్లు.. తిరిగి జట్టులోకి రావాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనంటూ బీసీసీఐ నిబంధన ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, పేస్ బౌలింగ్ విభాగం నాయకుడు జస్ప్రీత్ బుమ్రా వంటి ప్రధాన ఆటగాళ్లు మినహా మిగతావారందరికీ ఈ రూల్ వర్తిస్తుందని పేర్కొంది. ఫిట్నెస్, ఫామ్ నిరూపించుకునేందుకు ఇది దోహదం చేస్తుందని తెలిపింది. ఈ నేపథ్యంలో షమీ సైతం డొమెస్టిక్ క్రికెట్ ఆడేందుకు సిద్ధమైనట్లు అతడి వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.కోల్‌కతాలోని ఓ కార్యక్రమంలో షమీ మాట్లాడుతూ.. ‘‘నేను ఎప్పుడు తిరిగి టీమిండియాలో ఆడతానో తెలియదు. నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాను. అయితే, టీమిండియా కంటే ముందు మీరు న్ను బెంగాల్ జెర్సీలో చూస్తారు. త్వరలోనే బెంగాల్ తరఫున 2- 3 మ్యాచ్‌లు ఆడతాను. ఇందుకోసం పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యాను’’ అని పేర్కొన్నాడు.గాయం ఇంతలా వేధిస్తుందని ఊహించలేదని.. టీ20 ప్రపంచకప్ ఈవెంట్ ముగిసిన తర్వాత చికిత్స చేయించుకోవాలని భావించగా.. అందుకు అవకాశం లేకుండా పోయిందని షమీ తెలిపాడు. గాయం కారణంగా ఐపీఎల్, వరల్డ్‌కప్ టోర్నీలకు దూరమయ్యానని విచారం వ్యక్తం చేశాడు. కాగా అక్టోబరు నుంచి రంజీ ట్రోఫీ మొదలుకానుంది. అయితే, షమీ బెంగాల్ తరఫున ఆడాలంటే బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు దూరమవ్వాల్సి ఉంది. న్యూజిలాండ్‌తో సిరీస్నాటికి అతడు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. -
టీమిండియాకు శుభవార్త.. స్టార్ పేసర్ వచ్చేస్తున్నాడు!
దాదాపు ఆరు నెలల పాటు ఆటకు దూరంగా ఉన్న భారత క్రికెటర్ మహ్మద్ షమీ.. ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాడు. చీలమండ గాయం నుంచి పూర్తిగా కోలుకున్న ఈ పేస్ బౌలర్ పునరాగమనం చేసేందుకు సిద్ధమవుతున్నాడు.ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో పునరావాసం పొందుతున్న షమీ.. ట్రెయినింగ్ సెషన్లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఎన్సీఏ స్పోర్ట్స్ సైన్స్ అండ్ మెడిసిన్ హెడ్ డాక్టర్ నితిన్ పటేల్, కండిషనింగ్ కోచ్ రజినీకాంత్ ఆధ్వర్యంలో పురోగోతి సాధిస్తున్నాడు.అతడు బౌలింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడువీలైనంత త్వరగా టీమిండియా రీఎంట్రీ ఇచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నాడు. ఈ విషయం గురించి షమీ చిన్ననాటి కోచ్ బద్రుద్దీన్ సిద్ధిఖీ మాట్లాడుతూ.. ‘‘అతడు బౌలింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.పూర్తిస్థాయిలో బౌలింగ్ చేయలేకపోతున్నాడు కానీ.. ఎలాంటి ఇబ్బంది లేకుండా బాల్ రిలీజ్ చేయగలుగుతున్నాడు. ఏదేమైనా తను ఈ మాత్రం కోలుకోవడం శుభసూచకం’’ అని న్యూస్18తో పేర్కొన్నాడు.కాగా రైటార్మ్ పేసర్ మహ్మద్ షమీ స్వదేశంలో బంగ్లాదేశ్‌తో సిరీస్ నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని బీసీసీఐ కార్యదర్శి జై షా ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.వికెట్ల వీరుడిగావన్డే వరల్డ్‌కప్-2023లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన షమీ.. చీలమండ గాయంతో గతేడాది నవంబరు నుంచి జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలో పలు ద్వైపాక్షిక సిరీస్‌లతో పాటు ఐపీఎల్-2024, టీ20 ప్రపంచకప్-2024 కూడా ఆడలేకపోయాడు. ఇక గాయానికి సర్జరీ చేయించుకుని కొన్నాళ్లు విశ్రాంతి తీసుకున్న తర్వాత.. ఇలా ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాడు ఈ ఉత్తరప్రదేశ్ బౌలర్. టీమిండియా షెడ్యూల్ ఇదే ఈ ఏడాది భారత పురుషుల క్రికెట్ జట్టు స్వదేశంలో 5 టెస్టులు, 3 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. సెప్టెంబరులో భారత్‌లో బంగ్లాదేశ్ జట్టు పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భారత్‌తో బంగ్లాదేశ్ 2 టెస్టులు, 3 టీ20 మ్యాచ్‌లు ఆడుతుంది.అక్టోబర్ 12న హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మూడో టి20 మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనుంది. విదేశీ టూర్ల వివరాలున్యూజిలాండ్తో సిరీస్ ముగిశాక భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించి ఐదు టెస్టులు ఆడుతుంది. ఆస్ట్రేలియా నుంచి తిరిగి వచ్చాక భారత జట్టు స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు టీ20 మ్యాచ్‌లు, మూడు వన్డేలు ఆడుతుంది.ఇక ఈ ఏడాది నవంబర్‌లో దక్షిణాఫ్రికాలో టీమిండియా పర్యటించనుంది. ఈ పర్యటనలో భారత జట్టు దక్షిణాఫ్రికాతో నాలుగు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను ఆడుతుంది. నవంబర్ 8న డర్బన్‌లో జరిగే తొలి మ్యాచ్‌తో మొదలవుతుంది. ఆ తర్వాత పోర్ట్ ఎలిజబెత్‌లో 10న రెండో టి20, 13న సెంచూరియన్‌లో మూడో టి20, 15న జొహన్నెస్‌బర్గ్‌లో జరిగే చివరిదైన నాలుగో టీ20తో పర్యటన ముగుస్తుంది. కాగా టీమిండియా ప్రస్తుతం ప్రపంచకప్-2024తో బిజీగా ఉంది. సెమీస్ లక్ష్యంగా ముందుకు సాగుతోంది.బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు: సెప్టెంబరు 19–23 (చెన్నై) రెండో టెస్టు: సెప్టెంబరు 27–అక్టోబర్ 1 (కాన్పూర్) తొలి టి20: అక్టోబర్ 6 (ధర్మశాల) రెండో టి20: అక్టోబర్ 9 (న్యూఢిల్లీ) మూడో టి20: అక్టోబర్ 12 (హైదరాబాద్) న్యూజిలాండ్‌తో తొలి టెస్టు: అక్టోబర్ 16–20 (బెంగళూరు) రెండో టెస్టు: అక్టోబర్ 24–28 (పుణే) మూడో టెస్టు: నవంబర్ 1–5 (ముంబై) ఇంగ్లండ్‌తో తొలి టి20: జనవరి 22 (చెన్నై) రెండో టి20: జనవరి 25 (కోల్‌కతా) మూడో టి20: జనవరి 28 (రాజ్‌కోట్) నాలుగో టి20: జనవరి 31 (పుణే) ఐదో టి20: ఫిబ్రవరి 2 (ముంబై) తొలి వన్డే: ఫిబ్రవరి 6 (నాగ్‌పూర్) రెండో వన్డే: ఫిబ్రవరి 9 (కటక్) మూడో వన్డే: ఫిబ్రవరి 12 (అహ్మదాబాద్).చదవండి: షమీతో ఆమె పెళ్లి?.. స్పందించిన సానియా మీర్జా తండ్రి View this post on Instagram A post shared by 𝕸𝖔𝖍𝖆𝖒𝖒𝖆𝖉 𝖘𝖍𝖆𝖒𝖎 (@mdshami.11) -
షమీతో ఆమె పెళ్లి?.. స్పందించిన సానియా మీర్జా తండ్రి
భారత క్రీడా రంగంలో సానియా మీర్జా, మహ్మద్ షమీ తమకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. చిన్ననాటి నుంచే టెన్నిస్‌పై మక్కువ పెంచుకున్న సానియా అంతర్జాతీయ స్థాయిలో అనేక టైటిల్స్ సాధించి దేశ ఖ్యాతిని ఇనుమడింపజేశారు.మరోవైపు.. టీమిండియా ప్రధాన పేస్ బౌలర్లలో ఒకడిగా ఎదిగిన మహ్మద్ షమీ భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ భారీ అభిమానగణాన్ని సొంతం చేసుకున్నాడు.ఇద్దరికీ చేదు అనుభవమేఅయితే, సానియా- షమీ వృత్తిగతంగా ఉన్నత శిఖరాలను అధిరోహించినా.. వ్యక్తిగత జీవితంలో మాత్రం ఆటుపోట్లు ఎదుర్కొంటున్నారు. హసీన్ జహాన్ అనే మోడల్‌ను పెళ్లాడిన షమీకి ఒక కూతురు ఉంది.కొన్నాళ్లపాటు సజావుగా సాగిన షమీ కాపురం.. హసీన్ సంచలన ఆరోపణల నేపథ్యంలో విచ్ఛిన్నమైంది. మరోవైపు.. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్‌ను ప్రేమించి పెళ్లాడిన సానియా మీర్జాకు కూడా చేదు అనుభవమే మిగిలింది.సానియా కెరీరీర్లో బిజీగా ఉన్న సమయంలో షోయబ్ వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడని పాక్ మీడియా కథనాలు వెలువరించింది. ఈ నేపథ్యంలో వీరిద్దరు విడిపోతున్నారనే వార్తలు గుప్పుమనగా.. నటి సనా జావెద్‌ను పెళ్లాడి.. సానియాతో తన బంధం ముగిసిపోయిందని చెప్పకనే చెప్పాడు షోయబ్.ఇవన్నీ అబద్దాలుకాగా సానియా కుటుంబం సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ప్రస్తుతం సానియా మీర్జా తన కుమారుడు ఇజహాన్‌కు పూర్తి సమయం కేటాయించి అతడి ఆలనాపాలనా చూసుకుంటూనే వృత్తిపరంగానూ బిజీ అయ్యారు.ఇదిలా ఉంటే.. సానియా మీర్జా- మహ్మద్ షమీ గురించి కొన్నాళ్ల క్రితం వదంతులు పుట్టుకొచ్చిన విషయం తెలిసిందే. వీరిద్దరు వివాహం చేసుకోబోతున్నారంటూ కొన్ని జాతీయ మీడియా చానెళ్లలో ప్రచారం జరిగింది.ఈ విషయంపై సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా తాజాగా స్పందించారు. ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. ‘‘ఇవన్నీ అబద్దాలు. ఆమె కనీసం అతడిని నేరుగా ఒక్కసారి కూడా కలవనే లేదు’’ అంటూ అసత్యాలు ప్రచారం చేస్తున్న వారిపై మండిపడ్డారు.కాగా సానియా మీర్జా హజ్ యాత్రకు వెళ్తున్నట్లు ఇటీవల తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు. మరోవైపు.. వన్డే ప్రపంచకప్-2023లో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచిన మహ్మద్ షమీ చీలమండ గాయానికి సర్జరీ చేయించుకుని.. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు.చదవండి: రూ. 2 కోట్ల కారు.. బాబర్ ఆజంపై సంచలన ఆరోపణలు -
నీ డెడికేషన్ కి హ్యాట్స్ ఆఫ్ సా(షా)మి
-
షమీపై మరోసారి సంచలన ఆరోపణలు.. ఫ్యాన్స్ ఫైర్
టీమిండియా స్టార్ పేసర్‌గా నీరాజనాలు అందుకుంటున్న మహ్మద్ షమీ కెరీర్లో ఉన్నతస్థితిలో ఉన్నాడు. గాయం వేధిస్తున్నా లెక్కచేయక వన్డే వరల్డ్‌కప్-2023లో అదరగొట్టి.. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన ఘనత అతడి సొంతం. అయితే, చీలమండ గాయం తీవ్రత ఎక్కువ కావడంతో కొంతకాలంగా ఆటకు దూరమైన అతడు.. సర్జరీ చేయించుకున్నాడు. ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో ఐపీఎల్-2024 మొత్తానికి అందుబాటులో లేకుండా పోయాడు ఈ గుజరాత్ టైటాన్స్ బౌలర్. ఇదిలా ఉంటే.. కెరీర్‌పరంగా బాగానే ఉన్న షమీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎప్పుడూ ఏదో ఒక కుదుపు వస్తూనే ఉంది. 2014లో హసీన్ జహానే అనే మహిళను పెళ్లాడాడు షమీ. ఈ జంటకు 2015లో కూతురు ఐరా జన్మించింది. కానీ.. కొంతకాలం తర్వాత ఈ దంపతుల మధ్య విభేదాలు తలెత్తగా.. భర్తపై సంచలన ఆరోపణలు చేసింది హసీన్. వివాహేతర సంబంధాలు, మ్యాచ్ ఫిక్సింగ్, గృహ హింస అంటూ తీవ్ర ఆరోపణలతో అతడిని సుప్రీంకోర్టు గడప తొక్కించింది. అరెస్టు చేయించాలని చూసింది. అయితే, విచారణ అనంతరం షమీకి ఊరట దక్కింది. ఈ పరిణామాల నేపథ్యంలో 2018 నుంచి షమీ- హసీన్ విడిగా ఉంటున్నారు. అయితే, తాజాగా మరోసారి షమీని ఉద్దేశించి హసీన్ జహాన్ ఆరోపణలు గుప్పించింది. ‘‘స్టార్ అయిన నా భర్త, అతడి కుటుంబం కారణంగా నేను చేదు అనుభవాలు ఎదుర్కొన్నాను. న్యాయస్థానం మెట్లు ఎక్కాల్సి వచ్చింది. కానీ ఆమ్రోహా పోలీసులు నన్ను, నా మూడేళ్ల కూతురిని టార్చర్ పెట్టారు. ప్రభుత్వం కూడా నా పట్ల అవమానకరంగా ప్రవర్తించింది. నాకు అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటోంది’’ అని హసీన్ జహాన్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీరును విమర్శించింది. అంతేకాదు.. మహ్మద్ షమీ యూపీ ప్రభుత్వం, పోలీసులతో కలిసి తనను హత్య చేయించేందుకు కుట్ర చేస్తాడంటూ సంచలన ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో షమీ అభిమానులు హసీన్ జహాన్ తీరుపై మండిపడుతున్నారు. నిరాధార ఆరోపణలు చేస్తూ కాలం గడపటం మానుకుని.. కుమార్తెకు మంచి భవిష్యత్తున్నిచ్చే ఆలోచనలు చేయాలని హితవు పలుకుతున్నారు. అయితే, మరికొంత మంది నెటిజన్లు మాత్రం అనుభవించే వారికి మాత్రమే ఆ బాధ ఏమిటో తెలుస్తుందని హసీన్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. చదవండి: ధోని ఆటగాడిగానూ రిటైర్ అయితే బాగుండేది: టీమిండియా మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్ -
షమీకి శస్త్రచికిత్స
న్యూఢిల్లీ: భారత సీనియర్ సీమర్ మొహమ్మద్ షమీ ఎడమ కాలి మడమకు లండన్‌లో శస్త్రచికిత్స జరిగింది. దీంతో వచ్చేనెలలో ప్రారంభమయ్యే ఐపీఎల్ సీజన్‌కు పూర్తిగా అతను దూరమయ్యాడు. జూన్‌లో జరిగే టి20 ప్రపంచకప్ కల్లా అతను కోలుకుంటాడని జట్టు వర్గాలు భావిస్తున్నాయి. 33 ఏళ్ల పేసర్ చివరిసారిగా గత ఏడాది భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో బరిలోకి దిగాడు. ‘ఆపరేషన్ సక్సెస్ అయింది. కోలుకునేందుకు కాస్త సమయం పడుతుంది. త్వరగా కోలుకొని నడవాలనుంది’ అని షమీ ‘ఎక్స్’లో ట్వీట్ చేశాడు. షమీ వేగంగా కోలుకోవాలని ఎప్పట్లాగే కెరీర్‌ను కొనసాగించాలని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్లో ఆకాంక్షించారు. -
విభేదాలు ఉంటేనేం.. తనను చాలా మిస్సవుతున్నా: షమీ
తన కూతురు ఐరాను చాలా మిస్సవుతున్నానంటూ టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఉద్వేగానికి లోనయ్యాడు. హసీన్ జహాన్ అనుమతించినపుడు మాత్రమే బిడ్డను చూసుకునే అవకాశం వస్తుందని పేర్కొన్నాడు. ఐరా తల్లితో తనకు విభేదాలు ఉన్నా.. సొంత రక్తాన్ని మాత్రం వదులుకోలేనని ఎమోషనల్ అయ్యాడు. కాగా మోడల్ హసీన్ జహాన్‌ను 2014లో వివాహం చేసుకున్నాడు షమీ. ఈ దంపతులకు 2015లో కుమార్తె ఐరా జన్మించింది. అయితే, కొన్నేళ్ల క్రితం భర్త షమీపై సంచలన ఆరోపణలు చేస్తూ హసీన్ జహాన్ కోర్టును ఆశ్రయించింది. షమీ స్త్రీలోలుడని.. అతడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. అదే విధంగా గృహహింస చట్టం కింద పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య విభేదాలు తారస్థాయికి చేరగా విడిగా ఉంటున్నారు. కుమార్తె ఐరాను హసీన్ తనతో పాటు తీసుకువెళ్లడంతో.. షమీ కూతురికి కూడా దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా న్యూస్18తో సంభాషణ సందర్భంగా.. కూతురి ప్రస్తావన రాగా షమీ స్పందించాడు. ‘‘ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లల్ని మిస్సవుతారు కదా! కొన్నిసార్లు పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు. నేను నా కూతుర్ని మిస్సవుతున్నా. ఎంతైనా తను నా రక్తం. వాళ్ల అమ్మతో విభేదాలున్నంత మాత్రాన నా కూతురిని నేను దూరం చేసుకోలేను. అయితే, నేను ఐరాతో మాట్లాడాలా? వద్దా అనేది వాళ్ల అమ్మ నిర్ణయానుసారమే ఉంటుంది. తను అనుమతిస్తేనే నేను ఐరాతో మాట్లాడగలను. అయితే, ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా తనను నేరుగా కలవలేకపోయాను. తను ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటా’’ అని షమీ ఉద్వేగానికి లోనయ్యాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత.. గాయం కారణంగా మహ్మద్ షమీ.. టీమిండియాకు దూరమయ్యాడు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌తో రీఎంట్రీ ఇస్తాడని భావించగా ఫిట్నెస్ సాధించకపోవడంతో ఇప్పట్లో రీఎంట్రీ ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. చదవండి: Ranji Trophy: రీ ఎంట్రీలో టీమిండియా ఓపెనర్ ధనాధన్ శతకం.. ఫోర్ల వర్షం -
హార్దిక్ వెళ్లినా నష్టం లేదు.. గిల్ కూడా వెళ్లిపోతాడు: షమీ షాకింగ్ కామెంట్స్
IPL 2024- Mohammed Shami's Blunt Verdict: రెండేళ్ల క్రితం క్యాష్ రిచ్ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ అరంగేట్రంలోనే విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. ఐపీఎల్-2022 సీజన్లో ట్రోఫీ గెలిచి సత్తా చాటింది. టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన కెరీర్లో తొలిసారిగా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి జట్టుకు ఈ విజయాన్ని అందించాడు. అదే విధంగా... 2023 ఎడిషన్‌లోనూ ఫైనల్‌కు చేర్చి సారథిగా తానేంటో మరోసారి నిరూపించుకున్నాడు. అయితే, ఐపీఎల్-2024 వేలానికి ముందే ముంబై ఇండియన్స్‌తో బేరం కుదుర్చుకుని.. అభిమానులకు ఊహించని షాకిచ్చాడు హార్దిక్ పాండ్యా. టైటాన్స్‌ను వీడి సొంతగూటికి వెళ్లిపోయాడు. కొత్త సారథిగా గిల్ ఆరంభం నుంచి తమతోనే ఉన్నా.. కష్టకాలంలో తనను వదిలించుకున్న ఆ ఫ్రాంఛైజీతోనే మళ్లీ దోస్తీకట్టాడు. హార్దిక్ నిర్ణయాన్ని గౌరవించిన గుజరాత్ టైటాన్స్ ముంబై చెల్లించిన మొత్తం తీసుకుని అతడిని వదిలేసింది. తమ కొత్త కెప్టెన్‌గా టీమిండియా స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ పేరును ప్రకటించింది. హార్దిక్ వెళ్తే నష్టమేమీ లేదు ఈ పరిణామాలపై టీమిండియా సీనియర్ పేసర్, గుజరాత్ టైటాన్స్ కీలక బౌలర్ మహ్మద్ షమీ తాజాగా స్పందించాడు. ఈ మేరకు.. ‘‘ఎవరు జట్టును వీడి వెళ్లినా పెద్దగా ఫరక్ పడదు(నష్టమేమీ ఉండదన్న ఉద్దేశంలో). జట్టు సమతూకంగా ఉందా లేదా అన్నది మాత్రమే మనం చూడాల్సింది. హార్దిక్ ఒకప్పుడు సారథిగా ఉన్నాడు. మమ్మల్ని విజయవంతంగా ముందుకు నడిపించాడు. రెండు ఎడిషన్లలోనూ ఫైనల్‌కు తీసుకువెళ్లాడు. ఓసారి గెలిపించాడు కూడా! ఏదో ఒకరోజు గిల్ కూడా వెళ్లిపోతాడు అయినా.. గుజరాత్ టైటాన్స్... హార్దిక్ పాండ్యాతో జీవితకాలానికి సరిపడా ఒప్పందమేమీ కుదుర్చుకోలేదు కదా! జట్టుతో ఉండాలా, వీడి వెళ్లాలా అన్నది అతడి నిర్ణయం. ఇప్పుడు శుబ్‌మన్ కెప్టెన్ అయ్యాడు. సారథిగా తనకూ అనుభవం వస్తుంది. ఏదో ఒకరోజు గిల్ కూడా జట్టును వీడి వెళ్లే అవకాశం ఉంది. ఆటలో ఇవన్నీ సహజం. ఆటగాళ్లు వస్తూ.. పోతూనే ఉంటారు’’ అని న్యూస్24తో షమీ వ్యాఖ్యానించాడు. అలా చేస్తే గిల్ సక్సెస్ అవుతాడు అదే విధంగా.. కెప్టెన్‌గా ఉన్నపుడు జట్టుతో పాటు వ్యక్తిగత ప్రదర్శన పట్ల మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందని షమీ పేర్కొన్నాడు. రానున్న సీజన్లో శుబ్‌మన్ గిల్ సారథిగా, బ్యాటర్‌గా తన బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తాడనే నమ్మకం ఉందని తెలిపాడు. ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టగలిగితే కెప్టెన్ పని సులువే అవుతుందని షమీ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. కాగా గుజరాత్ టైటాన్స్ తరఫున ఐపీఎల్-2023లో 17 మ్యాచ్‌లు ఆడిన షమీ.. 28 వికెట్లు తీశాడు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచి పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. మరోవైపు.. శుబ్‌మన్ గిల్ 17 మ్యాచ్‌లలో కలిపి 890 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. చదవండి: చరిత్రకు ఆరు పరుగుల దూరంలో కోహ్లి.. కొడితే! -
టీమిండియా యువ పేసర్‌కు గాయం.. ఆటకు దూరం
టీమిండియా ఆటగాళ్లను గాయాలు వేధిస్తున్నాయి. ఇప్పటికే ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, టీ20 నంబర్ వన్ బ్యాటర్ సూర్యకుమార్, ఓపెనింగ్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ ఆటకు దూరంగా ఉన్నారు. వీళ్లంతా అఫ్గనిస్తాన్‌తో స్వదేశంలో జరుగుతున్న టీ20 సిరీస్‌కు దూరమయ్యారు. మరోవైపు... వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత.. చీలమండ నొప్పితో జట్టుకు దూరమైన సీనియర్ పేసర్ మహ్మద్ షమీ కూడా ఇంకా అందుబాటులోకి రాలేదు. దీంతో ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై జరుగనున్న తొలి రెండు టెస్టులకు ఎంపిక చేసిన జట్టులో అతడికి స్థానం దక్కలేదు. ఈ క్రమంలో తాజాగా టీమిండియా మరో బౌలర్ గాయపడ్డాడు. యువ పేసర్ ప్రసిద్ కృష్ణ తొడ కండరాల నొప్పితో ఆటకు దూరం కావడం గమనార్హం. కాగా సౌతాఫ్రికా పర్యటన సందర్భంగా టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఈ కర్ణాటక బౌలర్.. రెండు మ్యాచ్‌లు ఆడి ధారాళంగా పరుగులు ఇచ్చుకుని కేవలం రెండు వికెట్లు మాత్రమే తీశాడు. సఫారీ గడ్డపై నిరాశాజనక ప్రదర్శన నేపథ్యంలో తిరిగి దేశవాళీ క్రికెట్‌పై దృష్టి సారించిన ప్రసిద్ కృష్ణ.. రంజీ ట్రోఫీ-2024లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగా కర్ణాటక- గుజరాత్ మధ్య శుక్రవారం మొదలైన టెస్టులో అతడు బరిలోకి దిగాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో 14.5 ఓవర్లు బౌల్ చేసిన ప్రసిద్ రెండు వికెట్లు తీశాడు. అయితే, పదిహేనో ఓవర్ ఆఖరి బంతి వేసేపుడు తొడ కండరాల నొప్పితో విలవిల్లాడిన ఈ రైటార్మ్ పేసర్ మైదానాన్ని వీడాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతడు కోలుకోవడానికి సుమారు నాలుగు నుంచి ఆరు వారాల సమయం పట్టనుంది. దీంతో ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్‌కు అతడు అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఇక ఇంగ్లండ్‌తో సిరీస్‌లో భాగంగా ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌లకు బీసీసీఐ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. పేస్ దళంలో జస్ప్రీత్ బుమ్రాతో పాటు మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్ చోటు దక్కించుకున్నారు. ఇక ప్రసిద్ కృష్ణ మాత్రం గాయం కారణంగా మిగిలిన మూడు మ్యాచ్‌లలో ఆడకపోవచ్చు. చదవండి: Ind vs Eng: తండ్రి కార్గిల్ యుద్ధంలో.. తల్లి త్యాగం! టీమిండియాలో ఎంట్రీ.. -
#Maldives Row: ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన.. టీమిండియా పేసర్ స్పందన
#Maldives Row- #ExploreIndianIslands: దేశ పర్యాటక రంగ వృద్ధిలో పాలుపంచుకోవాల్సిన బాధ్యత భారతీయులందరిపై ఉందని టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ అన్నాడు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు వీలుగా చేపడుతున్న చర్యలకు మద్దతుగా ఉండాలని పిలుపునిచ్చాడు. కాగా ప్రధాని మోదీ ఇటీవల.. కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్‌ను సందర్శించారు. అక్కడి ప్రకృతి అందాలను ఆవిష్కరిస్తూ సముద్ర తీరంలో తన సాహసక్రీడలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్ చేశారు. మీలోని సాహసికుడికి సరైన గమ్యస్థానం లక్షద్వీప్ అంటూ పర్యాటకులను ఉద్దేశించి పోస్ట్ పెట్టారు. మల్దీవుల మంత్రుల నోటి దురుసుతనం ఈ నేపథ్యంలో మాల్దీవుల మంత్రి అబ్దుల్లా మాజిద్ మాల్దీవులను మరపించి లక్షద్వీప్‌ను పర్యాటక కేంద్రంగా ప్రోత్సహించడానికే మోదీ ఇలాంటి చర్యకు పూనుకున్నారంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో దుమారం రేగింది. తర్వాత మరియం షియునా, మాల్షా ఆయనకు మద్దతుగా భారత్‌ను తక్కువ చేసే విధంగా మాట్లాడటంతో వివాదం మరింత ముదిరింది. మాకేం సంబంధం లేదు దీంతో ఆ దేశ అధ్యక్షుడు మంత్రులను సస్పెండ్ చేసి వారి వ్యాఖ్యలతో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని ప్రకటించారు. అయినప్పటికీ అప్పటికే బాయ్‌కాట్ మాల్దీవ్స్ పేరిట భారత నెటిజన్లు దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో జాతికి సంఘీభావంగా పలు పర్యాటక సంస్థలు మాల్దీవుల ప్రయాణ బుకింగ్స్ నిలిపివేశాయి. ప్రధాని మోదీ ఏం చేస్తున్నారో అర్థం చేసుకోవాలి ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు ప్రధాని మోదీకి మద్దతుగా భారత పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామంటూ అభిమానులకు పిలుపునిస్తున్నారు. ఈ విషయంపై మహ్మద్ షమీ తాజాగా స్పందించాడు. ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ‘‘మన దేశ పర్యాటకాన్ని మనమే ప్రమోట్ చేసుకోవాలి. ఏరకంగా అయితేనేమి దేశం అభివృద్ధి చెందడమే ముఖ్యం. దేశం వృద్ధి సాధిస్తే ప్రతి ఒక్క పౌరుడికి మంచే జరుగుతుంది. ప్రధాని మన దేశాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని శాయశక్తులా కృషి చేస్తున్నారు. మనమందరం ఆయనకు తప్పక మద్దతుగా ఉండాలి’’ అని షమీ పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌తో సిరీస్ నాటికి కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో టాప్ వికెట్ టేకర్(24)గా నిలిచిన మహ్మద్ షమీ గాయం కారణంగా సౌతాఫ్రికా పర్యటనకు దూరమయ్యాడు. ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్‌తో అతడు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. భారత మాజీ క్రికెటర్లు సచిన్ టెండుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, ఇర్ఫాన్ పఠాన్, ఆకాశ్ చోప్రా, సురేశ్ రైనా తదితరులు .. ‘‘భారత పర్యాటకాన్ని ప్రోత్సహించాలి’’ అంటూ ప్రధాని మోదీకి మద్దతుగా పోస్టులు పెట్టిన విషయం తెలిసిందే. చదవండి: Ind Vs Afg: అఫ్గన్‌తో టీమిండియా సిరీస్: షెడ్యూల్, జట్లు, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు -
‘అలా అయితేనే షమీ టీ20 ప్రపంచకప్ ఆడతాడు.. లేదంటే!’
అనూహ్య రీతిలో వన్డే వరల్డ్‌కప్-2023 ఆడే అవకాశం దక్కించుకున్న టీమిండియా వెటరన్ స్పీడ్‌స్టర్ మహ్మద్ షమీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినా అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచి సత్తా చాటాడు. పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా మూడో ఆప్షన్‌గా తుది జట్టులో చోటు సంపాదించిన ఈ రైటార్మ్ పేసర్.. 7 మ్యాచ్‌లలో కలిపి 24 వికెట్లు తీశాడు. ఈ క్రమంలో వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గానూ షమీ రికార్డు సృష్టించాడు. సొంతగడ్డపై ఐసీసీ టోర్నీలో ఇలా సత్తా చాటిన షమీ ప్రస్తుతం చీలమండ నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే అతడిని సౌతాఫ్రికా పర్యటనలో పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఎంపిక చేయనట్లు తెలుస్తోంది. అదే విధంగా టెస్టు జట్టులోనూ షమీ అందుబాటులో ఉంటాడో లేదోనన్న విషయంలో సందిగ్దత ఉంది. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి స్వయంగా ప్రకటించింది. షమీ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నాడని.. పూర్తి ఫిట్నెస్ సాధిస్తేనే మళ్లీ మైదానంలో దిగే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో షమీ అంతర్జాతీయ టీ20 భవితవ్యం గురించి ఆసక్తికర కథనాలు వెలువడుతున్నాయి. ‘‘వచ్చే ఏడాది జరుగనున్న టీ20 ప్రపంచకప్‌లో షమీ ఆడతాడా లేదా అన్నది.. అతడి ఐపీఎల్ ప్రదర్శనపైనే ఆధారపడి ఉంటుంది. గుజరాత్ టైటాన్స్ తరఫున అతడు గత రెండు సీజన్లలో అద్భుతంగా ఆడుతున్నాడు. మరి రానున్న ఎడిషన్‌లో షమీ ఎలా ఆడతాడో చూడాలి’’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నట్లు జాతీయ మీడియా వెల్లడించింది. ‘‘మ్యాచ్ సమయంలో అతడికి గాయం కాలేదు. అయితే, మడిమ నొప్పి రాను రాను తీవ్రమైంది. ముంబైలో షమీ పలువురు డాక్టర్లను సంప్రదించాడు. తదుపరి జాతీయ క్రికెట్ అకాడమీలో అతడు పునరావాసం పొందనున్నాడు’’ సదరు వర్గాలు తెలిపినట్లు సమాచారం. ఇక బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం గాయమైతే అంత తీవ్రంగా లేదు. తన తమ్ముడు మహ్మద్ కైఫ్ విజయ్ హజారే ట్రోఫీ టోర్నీలో ఆడుతున్న మ్యాచ్‌ను చూడటానికి కూడా షమీ వచ్చాడు. అపుడు కాలు కాస్త ఉబ్బినట్లు కనిపించింది’’ అని పేర్కొన్నట్లు జాతీయ మీడియా తెలిపింది. కాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన షమీ దేశవాళీ క్రికెట్లో బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహిస్తాడన్న విషయం తెలిసిందే. చదవండి: ‘సెలక్టర్లు అతడిని మర్చిపోవద్దు.. సౌతాఫ్రికా టూర్‌కు పంపాల్సింది’ -
సిరాజ్, ప్రసిద్ద్ కాదు.. అతడే జూనియర్ మహ్మద్ షమీ: అశ్విన్
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా యువ పేసర్ ముఖేష్ కుమార్ తన బౌలింగ్ స్కిల్‌తో అందరని అకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ముఖేష్ వికెట్లు పడగొట్టకపోయినప్పటికీ.. తన బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ముఖ్యంగా ఆఖరి ఓవర్ వేసిన ముఖేష్ కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి ఆసీస్ జోరుకు కళ్లెం వేశాడు. చివర్ ఓవర్లో అతడు బౌన్సర్లు, యార్కర్లు వేసి ఆసీస్ బ్యాటర్లను సైలెంట్‌గా వుంచాడు. ఓవరాల్‌గా తన 4 ఓవర్ల కోటాలో ముఖేష్ 29 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక తిరునవంతపురం వేదికగా జరగనున్న రెండో టీ20లో కూడా సత్తాచాటాలని ముఖేష్ కుమార్ భావిస్తున్నాడు. ఈ క్రమంలో ముఖేష్ కుమార్‌పై టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ముఖేష్‌కు మహ షమీ లాంటి బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయని అశ్విన్ కొనియాడాడు. "నేను మొదట్లో మహ్మద్ సిరాజ్ జూనియర్ షమీ అవుతాడని అనుకున్నాను. కానీ ఇప్పుడు యువ పేసర్ ముఖేష్ కుమార్‌ను చూస్తే జూనియర్ షమీ అవుతాడని అన్పిస్తుంది. షమీ అని అందరూ ముద్దుగా 'లాలా' అని పిలుస్తారు. నేను మాత్రం షమీని లాలెట్టన్ అని పిలుస్తాను. ఎందుకంటే నాకెంతో ఇష్టమైన నటుడి మోహన్ లాల్ ముద్దుపేరు లాలెట్టన్. ముఖేష్.. షమీ బౌలింగ్ యాక్షన్‌ను పోలి ఉన్నాడు. అతడితో పాటు సమానమైన ఎత్తును కూడా కలిగి ఉన్నాడు. అతడితో అద్భుతంగా యార్కర్లు బౌలింగ్ చేయగలడు. బంతిపై మంచి కంట్రోల్, అద్భుతమైన బ్యాక్-స్పిన్ కలిగి ఉన్నాడు. వెస్టిండీస్‌లో జరిగిన సిరీస్‌లో అతడు బాగా బౌలింగ్ చేశాడు. బార్బడోస్‌లో జరిగిన ప్రాక్టీస్ గేమ్‌లో అత్యుత్తమంగా రాణించాడని" తన యూట్యూబ్ ఛానల్లో అశ్విన్ పేర్కొన్నాడు. చదవండి: మంచి మనసు.. ఓ వ్యక్తి ప్రాణం కాపాడిన మహ్మద్ షమీ! వీడియో వైరల్ -
వాళ్లకు వాళ్లు తోపులనుకుంటారు.. పాక్ మాజీలపై నిప్పులు చెరిగిన షమీ
టీమిండియా పేస్ బాద్షా మొహమ్మద్ షమీ పాకిస్తాన్ మాజీ క్రికెటర్లపై నిప్పులు చెరిగాడు. వన్డే వరల్డ్‌కప్ 2023 సందర్భంగా భారత పేసర్లకు ఐసీసీ ప్రత్యేక బంతులు సమకూర్చిందంటూ వారు చేసిన నిరాధారమైన ఆరోపణలపై మండిపడ్డాడు. పాక్ మాజీలు ఇలాంటి విచక్షణారహిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హెచ్చరించాడు. మీకు మీరే తోపులనుకుంటే సరిపోదని చురకలంటించాడు. ఇకనైనా మారండ్రా బాబూ అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. కాగా, 2023 వరల్డ్‌కప్‌లో భారత పేసర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో టీమిండియా పేస్ త్రయం ఏకంగా 58 వికెట్లు పడగొట్టి, ప్రత్యర్ధి బ్యాటర్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టించింది. మొహమ్మద్ షమీ 7 మ్యాచ్‌ల్లో 24 వికెట్లు పడగొట్టి వరల్డ్‌కప్ లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలువగా.. జస్ప్రీత్ బుమ్రా 11 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు, మొహమ్మద్ సిరాజ్ 11 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు నేలకూల్చారు. Mohammad Shami thrashed Hasan Raza’s theory of different balls provided by ICC to Indians.pic.twitter.com/c6StMTRTCb — Cricketopia (@CricketopiaCom) November 21, 2023 భారత పేసర్లు గతంలో ఎన్నడూ లేనట్లుగా చెలరేగడంతో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లలో అక్కసు కట్టలు తెంచుకుంది. భారత పేసర్లకు ఐసీసీ ప్రత్యేకమైన బంతులు సమకూర్చిందంటూ పాక్ మాజీ ఆటగాడు హసన్ రజా వివాదాస్పద ఆరోపణలు చేశాడు. ప్రత్యేక బంతుల కారణంగానే భారత పేసర్లు చెలరేగిపోయారంటూ మరికొంతమంది పాక్ మాజీలు ఆరోపించారు. ఈ ఆరోపణలపై షమీ తాజాగా స్పందించాడు. ప్యూమా కంపెనీకి సంబంధించిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో పాక్ మాజీలపై నిప్పులు చెరిగాడు. పాక్ మాజీల నిరాధారమైన ఆరోపణలు బాధించాయని అన్నాడు. ఈ సందర్భంగా షమీ మాట్లాడుతూ.. నాకైతే ఇతరుల సక్సెస్ చూసి ఎప్పుడూ ఈర్ష్య కలుగదు. ఇతరుల సక్సెస్‌ను ఎంజాయ్ చేయగలిగినప్పుడే మంచి ప్లేయర్ అనిపించుకుంటారు. మనకు ఏది చేయాలన్నా దేవుడే చేయాలి. నేను ఇదే నమ్ముతానని అన్నాడు. కుట్ర సిద్ధాంతాల పుట్టుకకు పాకిస్తానీల అర్హతే మూలకారణమని తెలిపాడు. పాక్ మాజీలు కొందరు తమకు తామే అత్యుత్తమమని భావిస్తున్నారని, ఇతరులెవ్వరూ వారు సాధించించి సాధించలేరని ఫీలవుతారని చురకలంటించాడు. -
నిన్నటి రోజు మనది కాకుండా పోయింది: షమీ భావోద్వేగం.. పోస్ట్ వైరల్
ICC WC 2023- Mohammad Shami Post Goes Viral: వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్లో ఓటమిపై టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ స్పందించాడు. టోర్నీ ఆసాంతం తాము అద్బుతంగా ఆడామని.. కానీ నిన్నటి రోజు మాత్రం తమది కాకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. పడిలేచిన కెరటంలా తిరిగి పుంజుకుని అభిమానులను గర్వపడేలా చేస్తామని ధీమా వ్యక్తం చేశాడు. కాగా అహ్మదాబాద్ వేదికగా ఆదివారం(నవంబరు 19) జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైన విషయం తెలిసిందే. నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన తుదిపోరులో ఆస్ట్రేలియా భారత జట్టును 6 వికెట్ల తేడాతో ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది. అజేయ జట్టు.. ఆఖరి మెట్టుపై బోల్తా ఈ ఎడిషన్‌లో లీగ్ దశ నుంచి ఓటమన్నదే ఎరుగని రోహిత్ సేనకు తొలి ఓటమిని రుచి చూపించి.. ఏకంగా ఆరోసారి జగజ్జేతగా నిలిచింది. దీంతో.. మనోళ్లు కప్ గెలుస్తారని ఆశగా ఎదురుచూసిన కోట్లాది మంది అభిమానుల హృదయాలు ముక్కలయ్యాయి. సొంతగడ్డపై భారత్‌ను మరోసారి చాంపియన్‌గా చూడాలనుకున్న స్వప్నాలు చెదిరిపోయాయి. ఈ నేపథ్యంలో మహ్మద్ షమీ ‘ఎక్స్’ వేదికగా తన భావాలు పంచుకున్నాడు. ‘‘దురదృష్టవశాత్తూ నిన్నటి రోజు మనది కాకుండా పోయింది. జట్టుకు, నాకు టోర్నీ ఆసాంతం మద్దతుగా నిలిచిన భారతీయులందరికి పేరుపేరునా కృతజ్ఞతలు. మోదీజీకి థాంక్స్ ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ జీకి ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన డ్రెస్సింగ్ రూంకి వచ్చి మాలో స్ఫూర్తిని నింపారు. మేము తిరిగి పుంజుకుంటాం’’ అని షమీ ఉద్వేగపూరిత నోట్ షేర్ చేశాడు. ప్రధాని మోదీ తనను ఆత్మీయంగా హత్తుకుని ఓదార్చుతున్న ఫొటోను జత చేశాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా భారత పేస్ త్రయంలో కీలకమైన మహ్మద్ షమీకి ప్రపంచకప్-2023 ఆరంభ మ్యాచ్‌లలో ఆడే అవకాశం రాలేదు. హార్దిక్ పాండ్యా రూపంలో పేస్ ఆల్‌రౌండర్ అందుబాటులో ఉండటంతో షమీని పక్కనపెట్టారు. ఆరంభంలో చోటే లేదు.. హయ్యస్ట్ వికెట్ టేకర్‌గా జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లకు తుదిజట్టులో చోటిచ్చే క్రమంలో అతడికి తుదిజట్టులో చోటు లేకుండా పోయింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో పాండ్యా గాయపడగా షమీ జట్టులోకి వచ్చాడు. లీగ్ దశలో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌తో ఎంట్రీ ఇచ్చిన ఈ రైటార్మ్ పేసర్ ఐదు వికెట్ల హాల్‌తో మెరిశాడు. ఆ తర్వాత ఇంగ్లండ్‌పై 4, శ్రీలంకపై 5, సౌతాఫ్రికాపై 2 వికెట్లు పడగొట్టాడు. ఇక న్యూజిలాండ్‌తో సెమీస్‌లో ఏకంగా రికార్డు స్థాయిలో ఏడు వికెట్లు కూల్చాడు. ఆస్ట్రేలియాతో ఫైనల్లో ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా మొత్తంగా 24 వికెట్లు తీసిన షమీ.. ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలిచి అవార్డు అందుకున్నాడు. చదవండి: CWC 2023: అత్యుత్తమ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా రోహిత్.. ఆసీస్ హీరోకు నో ఛాన్స్ Unfortunately yesterday was not our day. I would like to thank all Indians for supporting our team and me throughout the tournament. Thankful to PM @narendramodi for specially coming to the dressing room and raising our spirits. We will bounce back! pic.twitter.com/Aev27mzni5 — 𝕸𝖔𝖍𝖆𝖒𝖒𝖆𝖉 𝖘𝖍𝖆𝖒𝖎 (@MdShami11) November 20, 2023 View this post on Instagram A post shared by ICC (@icc) -
CWC 2023: విరాట్ కోహ్లికి మూడు, షమీకి రెండు.. అవార్డుల జాబితా
CWC 2023 Winner Australia: క్రికెట్ మెగా సమరానికి తెరపడింది. భారత్ వేదికగా అక్టోబరు 5న మొదలైన వన్డే వరల్డ్‌కప్ పండుగ ఆదివారంతో ముగిసిపోయింది. అజేయ రికార్డుతో ఫైనల్ చేరిన టీమిండియా ట్రోఫీ గెలుస్తుందని కోటి ఆశలతో ఎదురుచూసిన అభిమానులకు నిరాశే మిగిలింది. అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్లో రోహిత్ సేనను ఓడించి ఆస్ట్రేలియా ఆరోసారి విశ్వవిజేతగా అవతరించింది. అనూహ్య విజయాలతో తుదిపోరుకు అర్హత సాధించిన ప్యాట్ కమిన్స్ బృందం విజయంతో ఈ ఐసీసీ టోర్నీని ముగించి సగర్వంగా స్వదేశానికి వెళ్లనుంది. ఇదిలా ఉంటే.. అసలు మ్యాచ్‌లో ఓటమిపాలైన టీమిండియా ఈ ఐసీసీ టోర్నీలో అత్యధిక పరుగుల వీరుడు, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ వంటి అవార్డులు గెలుచుకుంది. ప్రపంచకప్-2023 టోర్నమెంట్లో వివిధ అవార్డులు అందుకున్న ప్లేయర్ల లిస్టు 1.ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ - విరాట్ కోహ్లీ- ఇండియా (765 పరుగులు, 1 వికెట్, 5 క్యాచ్‌లు) 2. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఫైనల్- ట్రవిస్ హెడ్- ఆస్ట్రేలియా(137 పరుగులు, 1 క్యాచ్) 3.అత్యధిక పరుగులు- విరాట్ కోహ్లి(11 ఇన్నింగ్స్‌లో 765 పరుగులు) 4.అత్యధిక స్కోరు- గ్లెన్ మాక్స్వెల్(ముంబైలో అఫ్గనిస్తాన్ మీద 201 పరుగులు- నాటౌట్) 5. అత్యధిక సెంచరీలు- క్వింటన్ డికాక్- సౌతాఫ్రికా(4 శతకాలు) 6. అత్యధిక అర్ధ శతకాలు- విరాట్ కోహ్లి(6 ఫిఫ్టీలు) 7. అత్యధిక వికెట్లు- మహ్మద్ షమీ- ఇండియా(7 ఇన్నింగ్స్‌లో 24 వికెట్లు) 8. అత్యుత్తమ గణాంకాలు- మహ్మద్ షమీ(ముంబైలో న్యూజిలాండ్ మీద 7/57) 9. అత్యధిక సిక్సర్లు- రోహిత్ శర్మ- ఇండియా(31 సిక్స్‌లు) 10. అత్యధిక క్యాచ్‌లు- డారిల్ మిచెల్- న్యూజిలాండ్(11 క్యాచ్‌లు) 11. అత్యధిక అవుట్లు చేసిన వికెట్ కీపర్- క్వింటన్ డికాక్(20) 13. అత్యధిక స్ట్రైక్‌రేటు- గ్లెన్ మాక్స్వెల్(150.37) పూర్తి వివరాలు- ఇతర విశేషాలు ►ఈ ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా భారత స్టార్ విరాట్ కోహ్లి నిలిచాడు. కోహ్లి 11 మ్యాచ్‌లు ఆడి 3 సెంచరీలు, 6 అర్ధ సెంచరీలతో కలిపి మొత్తం 765 పరుగులు సాధించాడు. ►ఈ ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా భారత పేసర్ మొహమ్మద్ షమీ నిలిచాడు. షమీ 7 మ్యాచ్‌లు ఆడి మొత్తం 24 వికెట్లు పడగొట్టాడు. షమీ మొత్తం 48.5 ఓవర్లు వేసి 257 పరుగులు ఇచ్చాడు. ►మొత్తం ప్రపంచకప్ టోర్నీలలో అత్యధిక టీమ్ స్కోరు ఈ ప్రపంచకప్‌లోనే నమోదైంది. శ్రీలంకతో న్యూఢిల్లీలో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 5 వికెట్లకు 428 పరుగులు సాధించింది. ►ధర్మశాలలో ఆ్రస్టేలియా (388 ఆలౌట్; 49.2 ఓవర్లలో), న్యూజిలాండ్ (50 ఓవర్లలో 383/9) జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో మొత్తం 771 పరుగులు వచ్చాయి. ప్రపంచకప్ టోర్నీల చరిత్రలో ఇదే అత్యధికం. ►ఈ ప్రపంచకప్‌లో అత్యధిక వ్యక్తిగత నమోదు చేసిన బ్యాటర్‌గా ఆస్ట్రేలియా క్రికెటర్ మ్యాక్స్‌వెల్ నిలిచాడు. అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ (128 బంతుల్లో 201 నాటౌట్; 21 ఫోర్లు, 10 సిక్స్‌లు) అజేయ డబుల్ సెంచరీ సాధించాడు. ►ఈ ప్రపంచకప్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌గా భారత పేసర్ మొహమ్మద్ షమీ నిలిచాడు. న్యూజిలాండ్‌తో ముంబైలో జరిగిన సెమీఫైనల్లో షమీ 57 పరుగులిచ్చి 7 వికెట్లు తీశాడు. ►ఈ ప్రపంచకప్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 400 అంతకంటే ఎక్కువ స్కోర్లు మూడుసార్లు నమోదయ్యాయి. శ్రీలంకపై దక్షిణాఫ్రికా (428/5), నెదర్లాండ్స్‌పై భారత్ (410/4), పాకిస్తాన్‌పై న్యూజిలాండ్ (401/6) సాధించాయి. ►వన్డే వరల్డ్‌కప్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ అవార్డు గెల్చుకున్న మూడో భారతీయ క్రికెటర్‌గా విరాట్ కోహ్లి గుర్తింపు పొందాడు. గతంలో సచిన్ టెండూల్కర్ (2003లో), యువరాజ్ సింగ్ (2011లో) ఈ ఘనత సాధించారు. చదవండి: అదే మా కొంపముంచింది.. చాలా బాధగా ఉంది! వారిద్దరికి క్రెడిట్: రోహిత్ శర్మ View this post on Instagram A post shared by ICC (@icc)