
మొహమ్మద్ షమీ
లార్డ్స్ మైదానంలో గురువారం వెస్టిండీస్‌తో తలపడే ఐసీసీ వరల్డ్ ఎలెవన్ జట్టు నుంచి భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తప్పుకున్నాడు. అనారోగ్యం కారణంగా దూరమైన అతని స్థానంలో పేసర్ మొహమ్మద్ షమీకి చోటు లభించింది. మరో భారత ఆటగాడు దినేశ్ కార్తీక్‌తో కలిసి షమీ బరిలోకి దిగుతాడు. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్‌ను కూడా ఎంపిక చేశారు. కరీబియన్ దీవుల్లో హరికేన్ కారణంగా దెబ్బ తిన్న స్టేడియాల పునరుద్ధరణకు నిధుల సేకరణ నిమిత్తం ఐసీసీ ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment