ఐసీసీ వరల్డ్ ఎలెవన్ తుది జట్టు ఇదే!
దుబాయ్ : వెస్టిండీస్‌తో తలపడే వరల్డ్ ఎలెవన్ తుది జట్టును ఐసీసీ ప్రకటించింది. ఇప్పటికే క్రికెట్ ఆడే దేశాల నుంచి తొమ్మిది మంది ఆటగాళ్ల పేర్ల ప్రకటించిన ఐసీసీ తాజాగా న్యూజిలాండ్ క్రికెటర్లు లూక్ రోంచి, మిచెల్ మెక్లినగన్‌లను ఎంపిక చేసింది. ఇంగ్లండ్ క్రికెటర్ ఇయాన్ మోర్గాన్ సారథిగా వ్యవహరించనున్న వరల్డ్ ఎలెవన్ జట్టు ఈ నెల 31న లార్డ్స్‌లో వెస్టిండీస్‌తో జరిగే టి20 మ్యాచ్‌లో తలపడుతుంది.
గతేడాది హరికేన్ బీభత్సంతో కరేబియన్ స్టేడియాలకు తీవ్రస్థాయిలో నష్టం వాటిల్లింది. ధ్వంసమైన స్టేడియాలను నవీకరించడానికి నిధుల సేకరణ కోసం ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తున్నారు. ప్రతి దేశం నుంచి ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో పాల్గొంటున్నారు. భారత్ నుంచి ఆల్‌రౌండర్ హర్ధిక్ పాండ్యా, వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్‌లు ఈ చారిటీ మ్యాచ్ ఆడనున్నారు. ఈ టి20కి ఐసీసీ ఇదివరకే అంతర్జాతీయ హోదా ఇచ్చింది. పాక్ తరఫున అఫ్రిది, షోయబ్ మాలిక్, బంగ్లాదేశ్ నుంచి షకీబుల్ హసన్, తమీమ్ ఇక్బాల్, లంక నుంచి తిసార పెరీరా, అఫ్గానిస్తాన్ నుంచి రషీద్ ఖాన్ ఎంపికయ్యారు. కార్లోస్ బ్రాత్‌వైట్ కెప్టెన్‌గా సామ్యూల్ బద్రీ, క్రిస్‌గేల్‌లతో కూడిన 13 మంది ఆటగాళ్ల జాబితాను వెస్టీండీస్ ప్రకటించిన విషయం తెలిసిందే.
వరల్డ్ ఎలెవన్ తుది జట్టు:
ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), షాహిద్ అఫ్రిది, షోయబ్ మాలిక్, దినేశ్ కార్తీక్(వికెట్ కీపర్), షకీబుల్ హసన్, తమీమ్ ఇక్బాల్, తిసార పెరీరా, రషీద్ ఖాన్, హర్దీక్ పాండ్యా, లూక్ రోంచి, మెక్లినగన్
వెస్టిండీస్: కార్లోస్ బ్రాత్‌వైట్, రయాద్ ఎమ్రిత్, ఆండ్రూ ఫ్లెచర్, క్రిస్‌గేల్, ఎవిన్ లూయిస్, అశ్లే నర్స్, కీమోపాల్, రోవ్మాన్ పొవెల్, దినేష్ రామ్డిన్ (వికెట్ కీపర్), ఆండ్రూ రస్సెల్, సామ్యుల్ బద్రీ, మార్లాన్ సామ్యుల్స్, కెస్రిక్ విలియమ్స్