ప్రపంచకప్ ఎలెవన్‌కు కెప్టెన్ మెకల్లమ్ | mccullum acts captain for worldcup XI | Sakshi

ప్రపంచకప్ ఎలెవన్‌కు కెప్టెన్ మెకల్లమ్

Published Tue, Mar 31 2015 1:03 AM | Last Updated on Sat, Sep 2 2017 11:36 PM

ప్రపంచకప్ ఎలెవన్‌కు కెప్టెన్ మెకల్లమ్

ప్రపంచకప్ ఎలెవన్‌కు కెప్టెన్ మెకల్లమ్

దుబాయ్: ఐసీసీ ప్రపంచకప్ ఎలెవన్ జట్టులో భారత్, పాకిస్తాన్ ఆటగాళ్లకు చోటు దక్కలేదు. ఈ జట్టుకు విశ్వవిజేతగా నిలిచిన ఆసీస్ సారథి క్లార్క్ కాకుండా న్యూజిలాండ్ ఓపెనర్ బ్రెండన్ మెకల్లమ్‌నే కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ‘దూకుడైన ఆటతీరే కాకుండా వినూత్న, స్ఫూర్తిదాయక నాయకత్వంతో ఈ మెగా టోర్నీలో మెకల్లమ్ ఆకట్టుకున్నాడు. అందుకే ఈ జట్టుకు అతడినే కెప్టెన్‌గా ఎంపిక చేశాం’ అని ఐసీసీ తెలిపింది. టోర్నీలో నిలకడైన ప్రదర్శనతో రాణించిన ఆటగాళ్లను పలువురు క్రీడా నిపుణులు కలిసి ఓ జట్టుగా ఎంపిక చేశారు.
 
ప్రపంచకప్ ఎలెవన్ జట్టు: మెకల్లమ్ (కెప్టెన్), గప్టిల్, స్మిత్, అండర్సన్, వెటోరి, బౌల్ట్, సంగక్కర (వికెట్ కీపర్), డివిలియర్స్, మ్యాక్స్‌వెల్, స్టార్క్,  మోర్కెల్, బ్రెండన్ టేలర్ (12వ ఆటగాడు).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement