Haridk Pandya
-
పాండ్యా చాలా వీక్‌గా ఉన్నాడు.. ఇలా అయితే కష్టమే: సల్మాన్
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై పాక్ మాజీ క్రికెటర్ సల్మాన్ బట్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. హార్దిక్ పాండ్యా ప్రస్తుతం శరీరకంగా చాలా బలహీనంగా ఉన్నాడని, అతడు తన శరీర దృఢత్వం పెంచుకోవాలని బట్ అభిప్రాయపడ్డాడు. కాగా కొంతకాలంగా ఫామ్ లేక తంటాలు పడుతున్న హార్దిక్ ఇటీవలే ముగిసిన టి20 ప్రపంచకప్లోను దారుణంగా విఫలమయ్యాడు. దీంతో స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. “హార్దిక్ పాండ్యా శరీరం చాలా బలహీనంగా ఉంది. ఇలా అయితే అతడు ఒక్క ఫార్మాట్లో కూడా రాణించలేడు. అతడు తన బరువును, కండలను పెంచుకోవాలి. పాండ్యా తిరిగి 4 ఓవర్లు వేయగలిగేలా కష్టపడాలని రవిశాస్త్రి ఇటీవల చెప్పాడు. ప్రస్తుతం 4 ఓవర్లు కూడా వేయలేని పరిస్థితుల్లో అతడు ఉన్నాడు" అని బట్ తన యూట్యూబ్ ఛానెల్లో పేర్కొన్నాడు. ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ రీటైన్ చేసుకోలేదు. దీంతో అతడు రానున్న మెగా వేలంలో పాల్గొననున్నాడు. చదవండి: అహ్మదాబాద్ హెడ్ కోచ్‌గా గ్యారీ కిర్‌స్టెన్.. బౌలింగ్ కోచ్‌గా ఆశిష్ నెహ్రా! -
టీ20 ప్రపంచకప్‌లో అతడు బ్యాటింగ్ మాత్రమే చేయాలి: సెహ్వాగ్
Virender Sehwag Comments On Hardik Pandya: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హర్దిక్ పాండ్యపై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. వచ్చే నెలలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో హర్దిక్ పాండ్యను పూర్తి స్ధాయి బ్యాట్స్‌మన్‌గా భారత్ ఉపయోగించుకోవాలని సెహ్వాగ్ సూచించాడు. వెన్నెముక శస్త్రచికిత్స చేయించుకున్నప్పటి నుంచి పాండ్యా క్రమంగా బౌలింగ్ చేయడం లేదు. ఈ నేపథ్యంలో హర్దిక్ బ్యాటింగ్‌పైన దృష్టిసారించాలని అతడు అభిప్రాయపడ్డాడు. "హార్దిక్ మొదట బ్యాట్స్‌మన్. బౌలింగ్ అనేది బోనస్ మాత్రమే. అతడు బౌలింగ్ చేయడానికి ఫిట్‌గా లేడు.. కానీ బ్యాట్‌తో మాత్రం మ్యాచ్‌లను గెలిపించగలడు.. పాండ్య తనదైన రోజున ఓంటి చేతితో జట్టును గెలిపించగలడు. అలాంటి ఆటగాడిని నేను ఎల్లప్పుడూ నా జట్టులో ఉంచుతాను "అని సెహ్వాగ్ క్రిక్‌బజ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా చెప్పాడు. భారత మాజీ బ్యాట్స్‌మన్ అజయ్ జడేజా కూడా సెహ్వాగ్ వాఖ్యలు తో ఏకీభవించాడు. హార్దిక్‌ను ముందుగా బ్యాట్స్‌మన్‌గానే చూడాలని అతడు సూచించాడు. బ్యాట్స్‌మన్‌గా రాణించాలంటే అతడి బ్యాటింగ్ ఆర్డర్లో మార్పు చేయాలని జడేజా అభిప్రాయపడ్డాడు. కాగా మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 40 పరగులు సాధించి ముంబై ఇండియన్స్ విజయంలో హర్దిక్ పాండ్య కీలక పాత్ర పోషించాడు. చదవండి: IPL 2021: అదంతా చిన్నతనం.. క్రికెట్ కంటే గొడవలపై ఎక్కువ ఆసక్తి -
బూమ్రా... బూమ్రా...
అద్భుత ఫామ్‌లో ఉన్న బుమ్రాను ఎదుర్కొనడం ఇప్పుడు ఎంతటి బ్యాట్స్‌మన్‌కైనా క్లిష్టమే. అటు పరుగులు నిరోధిస్తూ, ఇటు వికెట్లు తీస్తూ పూర్తి ఓవర్ల కోటా వేస్తున్న బుమ్రా బౌలింగ్ పదునేంటో ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో చూపించాడు. మరీ ముఖ్యంగా చివరి ఓవర్లలో అతడిని కాచుకోవడం ప్రత్యర్థులకు మింగుడుపడనిదే. -
హార్దిక్ పాండ్యా స్థానంలో షమీ
లార్డ్స్ మైదానంలో గురువారం వెస్టిండీస్‌తో తలపడే ఐసీసీ వరల్డ్ ఎలెవన్ జట్టు నుంచి భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తప్పుకున్నాడు. అనారోగ్యం కారణంగా దూరమైన అతని స్థానంలో పేసర్ మొహమ్మద్ షమీకి చోటు లభించింది. మరో భారత ఆటగాడు దినేశ్ కార్తీక్‌తో కలిసి షమీ బరిలోకి దిగుతాడు. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్‌ను కూడా ఎంపిక చేశారు. కరీబియన్ దీవుల్లో హరికేన్ కారణంగా దెబ్బ తిన్న స్టేడియాల పునరుద్ధరణకు నిధుల సేకరణ నిమిత్తం ఐసీసీ ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తోంది. -
ఐసీసీ ప్రపంచ ఎలెవన్‌లో పాండ్యా, కార్తీక్
దుబాయ్: ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తీక్‌లు ఐసీసీ ప్రపంచ ఎలెవన్ జట్టు తరఫున బరిలోకి దిగనున్నారు. ఈ జట్టు ఈ నెల 31న లార్డ్స్‌లో వెస్టిండీస్‌తో జరిగే టి20 మ్యాచ్‌లో తలపడుతుంది. గతేడాది హరికేన్ బీభత్సంతో కరీబియన్ స్టేడియాలకు తీవ్రస్థాయిలో నష్టం వాటిల్లింది. ధ్వంసమైన స్టేడియాలను నవీకరించడానికి నిధుల సేకరణ కోసం ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తున్నారు. ప్రతి దేశం నుంచి ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో పాల్గొంటున్నారు. ఈ టి20కి ఐసీసీ ఇదివరకే అంతర్జాతీయ హోదా ఇచ్చింది. పాక్ తరఫున అఫ్రిది, షోయబ్ మాలిక్, బంగ్లాదేశ్ నుంచి షకీబుల్ హసన్, తమీమ్ ఇక్బాల్, లంక నుంచి తిసార పెరీరా, అఫ్గానిస్తాన్ నుంచి రషీద్ ఖాన్ ఎంపికయ్యారు. -
నేనే విశ్రాంతి అడిగా: హార్దిక్ పాండ్యా
విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్న కారణంగా తన శరీరం కాస్త ఇబ్బంది పెడుతోందని, అందుకే తానే విశ్రాంతి అడిగానని భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా స్పష్టం చేశాడు. వంద శాతం ఫిట్‌గా ఉండి తాను పూర్తి స్థాయిలో ఆడగలనని భావించినప్పుడే బరిలోకి దిగాలనేదే తన ఉద్దేశమని, విరామ సమయంలో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టినట్లు 24 ఏళ్ల పాండ్యా వెల్లడించాడు. శ్రీలంకతో తొలి రెండు టెస్టులకు జట్టులోకి ఎంపిక చేసి కూడా సెలక్టర్లు ఆ తర్వాత విశ్రాంతి పేరుతో పాండ్యాను పక్కన పెట్టడం విమర్శలకు దారి తీసింది. -
ప్రపంచకప్ సైన్యం కోసం!
♦ ప్రయోగాల బాటలో భారత్ ♦ ధోనిపైనే అందరి దృష్టి ♦ శ్రీలంకతో నేటి నుంచి ఐదు వన్డేల సిరీస్ ♦ మధ్యాహ్నం గం. 2.30 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌ను సునాయాసంగా 3–0తో క్లీన్‌స్వీప్ చేసిన భారత జట్టు ఇప్పుడు వన్డే సిరీస్‌పై దృష్టి పెట్టింది. అయితే భారత్ మాత్రం దీన్ని కేవలం ద్వైపాక్షిక సిరీస్‌గా మాత్రమే చూడటం లేదు. ఎందుకంటే ఇప్పటికే చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ తమ ప్రపంచకప్ సన్నాహకాలు ప్రారంభమైనట్టే అని ప్రకటించారు. ఓ ఏడాదిపాటు రొటేషన్ ప్రకారం తమ యువ ఆటగాళ్ల ప్రదర్శనను అంచనా వేయాలని భావిస్తోంది. ఇప్పటి నుంచే తమ వనరులను సరిచూసుకునేందుకు ఇది ఓ అవకాశంగా తీసుకోనుంది. ఇక సీనియర్ బ్యాట్స్‌మన్ ఎంఎస్ ధోనిపై అందరి దృష్టీ నెలకొనడంతో పరిమిత ఓవర్ల మ్యాచ్‌లో తన సత్తా ఏమిటో నిరూపించుకోవాల్సి ఉంది. మరోవైపు ప్రపంచకప్‌కు నేరుగా బెర్త్ దక్కించుకోవాలంటే శ్రీలంక మరో రెండు విజయాలు సాధించాల్సి ఉంది. అసలే ఆత్మవిశ్వాసం అడుగంటిన వేళ ఈ వన్డే సిరీస్‌లో ఆతిథ్య జట్టు ఏమేరకు రాణించగలదో వేచిచూడాలి. దంబుల్లా: టెస్టు సిరీస్‌లో దుమ్మురేపిన టీమిండియా వన్డేల్లోనూ మెరుపులు మెరిపించేందుకు ఆతృతగా ఎదురుచూస్తోంది. శ్రీలంకతో ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు స్థానిక రణగిరి దంబుల్లా అంతర్జాతీయ మైదానంలో తొలి మ్యాచ్ జరగనుంది. మూడు టెస్టుల సిరీస్‌లో శ్రీలంకను చితక్కొట్టిన కోహ్లి బృందం ఎనలేని ఆత్మవిశ్వాసంతో ఉంది. అలాగే 2019 వన్డే ప్రపంచకప్ కోసం జట్టును ఇప్పటి నుంచే తయారు చేయాలనే ఆలోచనతో ఉన్న టీమ్ మేనేజిమెంట్ ఆ దిశగా ఈ సిరీస్‌ను ఉపయోగించుకోవాలనుకుంటోంది. బలహీనంగా కనిపిస్తున్న లంకపై యువ ఆటగాళ్లను పరీక్షించనుంది. ఇప్పటికే యువరాజ్ సింగ్‌పై వేటు వేయగా... మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిపై తాను ప్రపంచ కప్ జట్టులో ఉండాల్సిన ఆటగాడినే అని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇక ఈ సిరీస్‌కు ముందు జింబాబ్వేపై అవమానకర రీతిలో 2–3 తేడాతో ఓడిన లంక పటిష్ట భారత్‌ను నిలువరించి పోయిన పరువును దక్కించుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్‌లో ఎనిమిదో స్థానం (88 పాయింట్లు)లో ఉన్న లంక సెప్టెంబర్ 30 కటాఫ్ తేదీలోపు నేరుగా ప్రపంచకప్ బెర్త్ దక్కించుకోవాలంటే ఈ సిరీస్‌లో కనీసం రెండు మ్యాచ్‌లు గెలవాలి. నాలుగో స్థానంలో రాహుల్... వన్డేల కోసం భారత జట్టు మారినా ఫామ్‌కు మాత్రం ఢోకా లేదు. అన్ని విభాగాల్లో జట్టు పటిష్టంగానే కనిపిస్తోంది. గాయం నుంచి కోలుకున్న అనంతరం టెస్టు సిరీస్‌లో బరిలోకి దిగిన ఓపెనర్ లోకేశ్ రాహుల్ భీకర ఫామ్‌ను చాటుకున్నాడు. అయితే వన్డేల్లో అతడిని నాలుగో స్థానంలో బరిలోకి దించనున్నారు. గతేడాది అరంగేట్రంలోనే శతకం బాదిన అతను గాయాల కారణంగా కేవలం ఆరు వన్డేలు మాత్రమే ఆడగలిగాడు. అన్నింట్లోనూ ఓపెనర్‌గానే బరిలోకి దిగాడు. అయితే ఈసారి ఓపెనింగ్ స్లాట్ రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లతో భర్తీ చేస్తారు. ప్రపంచకప్ అంచనాల్లో రాహుల్ కచ్చితంగా ఉంటాడు కాబట్టి అతడిని బెంచ్‌కే పరిమితం చేయలేరు. అందుకే అతడి స్థానాన్ని మిడిలార్డర్‌కు మార్చనున్నారు. అయితే 2015 వరల్డ్ కప్ నుంచి ఇదే స్థానంలో అజింక్య రహానే మెరుగ్గానే ఆడుతున్నాడు. కానీ రహానే ఇప్పుడు మూడో ఓపెనర్‌గానే ఉండే అవకాశం ఉంది. ఐదో స్థానంలో ధోని రావడం ఖాయమే. ఇక మనీష్ పాండే, హార్దిక్ పాండ్యా ఆ తర్వాత స్థానాల్లో దిగనున్నారు. బుమ్రా, భువనేశ్వర్ పేస్ బౌలింగ్ విభాగంలో కీలకం కానున్నారు. స్పిన్‌లో కుల్దీప్తో పాటు అక్షర్ పటేల్, యజువేంద్ర చహల్‌లలో ఒకరికి చాన్స్ దక్కవచ్చు. ఒత్తిడిలో శ్రీలంక... టెస్టుల్లో వైట్‌వాష్ అనంతరం వన్డే సిరీస్ ఆడబోతున్న లంక తీవ్ర ఒత్తిడిలో ఉంది. తమ అభిమానులను తిరిగి ఆకట్టుకోవాలంటే ఈ జట్టు తమ స్థాయికి మించి ప్రదర్శన చేయాల్సిందే. కొత్త కెప్టెన్ ఉపుల్ తరంగ నేతృత్వంలో నూతనోత్తేజంతో బరిలోకి దిగాలని భావిస్తోంది. ఇరు జట్ల మధ్య జరిగిన చివరి వన్డే (చాంపియన్స్ ట్రోఫీ)లో తామే గెలవడం లంకేయులకు కొద్దిగా ఊరటనిచ్చే విషయం.తరంగ, మాథ్యూస్, చండి మాల్ బ్యాటింగ్ ఆర్డర్‌కు వెన్నెముకలా నిల వనున్నారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ పుష్పకుమార అరంగేట్రం ఖాయమే. బౌలింగ్‌లో సీనియర్ పేసర్ లసిత్ మలింగ, ఫెర్నాండోలపై ఎక్కువగా ఆధార పడనుంది. జట్లు: (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్, రోహిత్, రాహుల్, ధోని, పాండే/జాదవ్, పాండ్యా, కుల్దీప్, భువనేశ్వర్, చహల్, బుమ్రా. శ్రీలంక: తరంగ (కెప్టెన్), గుణతిలక, మెండిస్, డిక్వెలా, మాథ్యూస్, కపుగెడెర, హసరంగా, పెరీరా, ఫెర్నాండో, మలింగ, సందకన్. పిచ్, వాతావరణం ఈ ఏడాది జరిగిన రెండు మ్యాచ్‌ల్లో ఇక్కడ 300కు పైగా పరుగులు నమోదయ్యాయి. ఈ మ్యాచ్‌లోనూ అలాంటి పరిస్థితే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మధ్యాహ్నం చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. 4 శ్రీలంకతో ఈ మైదానంలో ఆడిన 11 వన్డేల్లో భారత్ నాలుగు మాత్రమే గెలిచింది. 2 ప్రపంచకప్‌లో నేరుగా అర్హత దక్కించుకునేందుకు శ్రీలంక గెలవాల్సిన మ్యాచ్‌లు.