Virender Sehwag Comments On Hardik Pandya: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హర్దిక్ పాండ్యపై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. వచ్చే నెలలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో హర్దిక్ పాండ్యను పూర్తి స్ధాయి బ్యాట్స్‌మన్‌గా భారత్ ఉపయోగించుకోవాలని సెహ్వాగ్ సూచించాడు. వెన్నెముక శస్త్రచికిత్స చేయించుకున్నప్పటి నుంచి పాండ్యా క్రమంగా బౌలింగ్ చేయడం లేదు. ఈ నేపథ్యంలో హర్దిక్ బ్యాటింగ్‌పైన దృష్టిసారించాలని అతడు అభిప్రాయపడ్డాడు.
"హార్దిక్ మొదట బ్యాట్స్‌మన్. బౌలింగ్ అనేది బోనస్ మాత్రమే. అతడు బౌలింగ్ చేయడానికి ఫిట్‌గా లేడు.. కానీ బ్యాట్‌తో మాత్రం మ్యాచ్‌లను గెలిపించగలడు.. పాండ్య తనదైన రోజున ఓంటి చేతితో జట్టును గెలిపించగలడు. అలాంటి ఆటగాడిని నేను ఎల్లప్పుడూ నా జట్టులో ఉంచుతాను "అని సెహ్వాగ్ క్రిక్‌బజ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా చెప్పాడు.
భారత మాజీ బ్యాట్స్‌మన్ అజయ్ జడేజా కూడా సెహ్వాగ్ వాఖ్యలు తో ఏకీభవించాడు. హార్దిక్‌ను ముందుగా బ్యాట్స్‌మన్‌గానే చూడాలని అతడు సూచించాడు. బ్యాట్స్‌మన్‌గా రాణించాలంటే అతడి బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పు చేయాలని జడేజా అభిప్రాయపడ్డాడు. కాగా మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 40 పరగులు సాధించి ముంబై ఇండియన్స్ విజయంలో హర్దిక్ పాండ్య కీలక పాత్ర పోషించాడు.
చదవండి: IPL 2021: అదంతా చిన్నతనం.. క్రికెట్ కంటే గొడవలపై ఎక్కువ ఆసక్తి
Comments
Please login to add a commentAdd a comment