కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అనుసరించిన వ్యూహాలను భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తప్పుబట్టాడు. హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్ మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా అంటూ మేనేజ్‌మెంట్‌కు చురకలు అంటించాడు.
ఐపీఎల్-2024లో భాగంగా వాంఖడే వేదికగా కేకేఆర్‌తో తలపడిన ముంబై ఓడిపోయిన విషయం తెలిసిందే. సొంత మైదానంలో 24 పరుగుల తేడాతో ఓటమి ఈ సీజన్‌లో ఎనిమిదో పరాజయాన్ని నమోదు చేసింది.
ఛేదనలో తడ‘బ్యా’టు
టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ముంబై.. కేకేఆర్‌ను 19.5 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌట్ చేసి ఫర్వాలేదనిపించింది. కానీ లక్ష్య ఛేదనలో మాత్రం తడ‘బ్యాటు’కు గురైంది. 18.5 ఓవర్లలో 145 పరుగులకే కుప్పకూలింది.
టాపార్డర్ మొత్తం చేతులెత్తేయగా.. మిడిలార్డర్‌లో సూర్యకుమార్ యాదవ్(35 బంతుల్లో 56) ఒక్కడే రాణించాడు. మిగిలిన వాళ్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.
ఇలాంటి తరుణంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా(1) ఏడు, టిమ్ డేవిడ్(24) ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. తర్వాత టెయిలెండర్లు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో ముంబై కథ ముగిసింది.
మరీ అంత చెత్తగా ఆడతారా?
ఈ నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ క్రిక్‌బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్‌ను ఎందుకు దాచిపెట్టిందో తెలియదు. అలా చేయడం వల్ల మీకు ఏం ప్రయోజనం చేకూరింది?
ఇంకా బంతులు మిగిలే ఉన్నాయి. జట్టు మొత్తం ఆలౌట్ అయింది. నిజానికి హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్‌లను ఇంకాస్త ముందుగా బ్యాటింగ్‌కు పంపాల్సింది.
కానీ ఛేజ్ చేస్తున్న సమయంలో వరుసగా వికెట్లు పడుతున్నా హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్‌లను ఏడు, ఎనిమిదో స్థానాల్లో ఎందుకు ఆడించారో అర్థం కాలేదు.
లోయర్ ఆర్డర్‌లో వీళ్లు ఇంకాస్త ముందుగా వస్తే మరీ అంత చెత్తగా ఆడతారని అనుకున్నారా?’’ అని ముంబై మేనేజ్‌మెంట్‌ను ప్రశ్నించాడు. గుజరాత్ టైటాన్స్‌తో ఉన్నపుడు పాండ్యా నాలుగో స్థానంలో నిలకడగా రాణించిన విషయాన్ని సెహ్వాగ్ ఈ సందర్భంగా ప్రస్తావించాడు.
చదవండి: T20 WC: హార్దిక్ బదులు అతడిని సెలక్ట్ చేయాల్సింది: పాక్ దిగ్గజం
Comments
Please login to add a commentAdd a comment