ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. గత రెండు సీజన్లలో గుజరాత్ టైటాన్స్‌ను ఓసారి ఛాంపియన్, మరోసారి రన్నరప్‌గా నిలిపిన హార్దిక్.. ఈసారి మాత్రం తన కెప్టెన్సీ మార్క్ చూపించలేకపోతున్నాడు. ఈ ఏడాది సీజన్‌లో అతడి సారథ్యంలో ముంబై ఇండియన్స్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది.
ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్దిక్ పాండ్యా తప్పుకోవాలని పెద్దఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. మళ్లీ రోహిత్ శర్మకు జట్టు పగ్గాలను అప్పగించాలని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ జాబితాలో టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ కూడా చేరాడు.
ఈ మెగా ఈవెంట్‌లో తమ తదుపరి మ్యాచ్‌కు ముందు హార్దిక్ పాండ్యా ముంబై కెప్టెన్సీ నుంచి వైదొలగతాడని తివారీ జోస్యం చెప్పాడు. అంతేకాకుండా రోహిత్ శర్మనే తిరిగి మళ్లీ ముంబై సారథ్య బాధ్యతలు చేపడతాడని అతడు అభిప్రాయపడ్డాడు. కాగా ముంబై ఇండియన్స్ తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 7న వాంఖడే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఈ విరామంలోనే ముంబై కెప్టెన్సీలో మార్పు జరుగుతుందని తివారీ చెప్పుకొచ్చాడు.
"హార్దిక్ పాండ్యా ప్రస్తుతం తీవ్రమైన ఒత్తడిలో ఉన్నాడు. గత మూడు మ్యాచ్‌ల్లో బౌలర్లను హార్దిక్ సరిగ్గా ఉపయోగించలేకపోయాడు. ఆరంభంలో బౌలర్లు విఫలమవుతున్నప్పటికి మళ్లీ వారినే ఎటాక్‌లో తీసుకువచ్చి హార్దిక్ భారీ మూల్యం చెల్లించుకున్నాడు. ముంబై ఇండియన్స్‌లో అద్బుతమైన బౌలర్లు ఉన్నారు.
సరిగ్గా రోటాట్ చేయడంలో పాండ్యా విఫలమయ్యాడు. స్వింగ్ అవుతున్న పిచ్‌లపై బుమ్రాను కాదని తొలుత తను బౌలింగ్ చేయడం కూడా హార్దిక్ తప్పిదమే అని చెప్పుకోవాలి. హార్దిక్ కూడా బంతిని స్వింగ్ చేయగలడు. కానీ ముంబై తరపున ఇప్పటివరకు మూడు మ్యాచ్‌ల్లో హార్దిక్ బౌలర్‌గా తన మార్క్‌ను చూపించలేకపోయాడు.
ముంబై తమ తదుపరి మ్యాచ్‌లో ఢిల్లీతో తలపడనుంది. ఈ విరామంలో ముంబై ఫ్రాంచైజీ నుంచి ఓ బిగ్ న్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది. హార్దిక్ పాండ్యా తిరిగి ముంబై కెప్టెన్సీని రోహిత్ శర్మకు అప్పగించేస్తాడని నేను భావిస్తున్నాను.
ఎందుకంటే గతంలో కూడా చాలా ఫ్రాంచైజీలు ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నాయి. ఇప్పుడు ముంబై కెప్టెన్సీ విషయంలో కూడా అదే జరిగే అవకాశముందని" క్రిక్‌బజ్ షోలో తివారీ పేర్కొన్నాడు.
ఇదే షోలో పాల్గోన్న టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.. మనోజ్ తివారీ కామెంట్స్‌పై స్పందించాడు. "హార్దిక్ కెప్టెన్సీపై మనోజ్ కాస్త తొందపడి ఇటువంటి వ్యాఖ్యలు చేశాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రోహిత్ కెప్టెన్సీలో కూడా జట్టు వరుసగా ఐదు మ్యాచ్‌లలో ఓడిపోయింది. ఆ ఏడాది సీజన్‌లో వారు ఛాంపియన్‌లుగా నిలిచారు. కాబట్టి మనం కాస్త ఓపిక పట్టాలి. మనం మరో రెండు మ్యాచ్‌ల కోసం వేచి ఉండాలి. ఆ తర్వాతే మన అభిప్రాయాలను వెల్లడిస్తే బాగుంటుందని సెహ్వాగ్ రిప్లే ఇచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment